హోసూరు మాండలిక హొయలతో వేద ఉపనిషత్,పురాణ ,వైజ్ఞానిక ,జీవిత సత్యాలను అలతిఅలతి పదాలతో డాక్టర్ అగరం వసంత్ కట్టిన ‘’మాటల మూట ‘’-2
అన్ని జీవాల పుట్టుకకు కర్త కర్మ కాలమే .మనం ఉన్నా లేకున్నా కాలం ఉంటుంది .అదే కాల రహస్యం .మనకు కారణం చెప్పాల్సిన అవసరం కాలానికిలేదు .కాయ కష్టం చేసే వారి జోలికి కరోనా రాలేదు .రామ లక్ష్మణులపై మేఘనాధుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ,దాన్ని తట్టుకోటం తమ వల్లకాదని విల్లు అ౦బులు వదిలేసి దండం పెడితే అది తన దారిన తాను పోయింది .అంటే నిలబడి యుద్ధం చేయలేని వాళ్ళ జోలికి వెళ్ళలేదు .భారతం లో అశ్వత్ధామ నారాయణాస్త్రం వేస్తె స్త్ కృష్ణుడి మాటవిని పాండవ సైన్యం అంతా కత్తులు కటార్లు పారేసి రధాలు దిగి చేతులు కట్టుకొని నిలబడితే అది ‘’పీచే మూడ్’’ అయింది .వైరస్ కూడా ఆస్త్రాలమాదిరే .దానితోపోరాడి బలికాకుండా’’ కామ్’’ గా ఇండ్లలో ఉంటే దానిదారి అదే పోతది . దాని చేతిలో చిక్కటం ఏల చావటం ఏల ?అన్నాడు జ్ఞాన బుద్ధితో అన్న.దీపం చీకట్లనుకాల్చినట్లు ,జనమంతా ఒకటై దీపాలు వెలిగిస్తే వంటరి దిగులుపోయి ఐక్యవెలుగు కాపాడుతుంది .మతం కన్నా మనిషి మనిషికన్నా మానవత గొప్పవి .అప్పుడే ‘’దేవుడే జీవుడై ,జీవుడే దేవుడైతనకు తానుగా వచ్చి చేరతాడు .దేవుడు ఉండేది జీవుడిలో .దాన్నికాపాడాల్సింది జీవుడే ..మనుషులంతా ఒగటే అనే ‘’ఎన్నం ‘’అంటే మనసు అందరికి రావాలి.కర్షక కార్మిక కష్టాలకు కొలమానం కనిపెట్టాలి .అప్పుడే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది .
సంకుచిత బుద్ధి (సన్నబుద్ధి )ప్రాణం తీస్తే , దొడ్దబుద్ధి దొడ్డ కళాచారం(సంస్కృతీ )సన్న బుద్ధి ని చంపి వెలుగు చూడాలి .కాలం విలువ ఎలా తెలుసుకోవచ్చు అన్న ప్రశ్న కు ‘’చచ్చే వాడి ప్రాణం పోకుండా రవంత ఆపగలిగితే కాలం విలువ తెలుస్తుందని బజ్జన్న ఉవాచ ..మనిషి పోయినబుడే వాడి గురించి చాలాకాలం చెప్పుకొనే వాడిదే బతుకు అన్న తాత మాటకు అవ్వ ‘’బతకాలంటే గతకాల (తినాలి)ఆనగా కిసుక్కున నవ్వాడు కాకన్న అవ్వాతాతల సరసానికి .తెల్లరాజు(తెల్లోడు ) ఎన్ని మాయోపాయాలు చేసినా భారత దేశం బెదరలేదు కారణం కుల వృత్తులు .ఈ రహస్యం తెలిసి కుల వృత్తుల్ని కూలగొట్టి .దొరలపని చేసేట్లు చేసి వారి కుల మతాచారాలను అడ్డం పెట్టుకొని నాటకాలాడి వ్యవస్థలను కూలగొట్టి ,తనమాట చెల్లించుకొని రెండు వందల ఏళ్ళు రాజ్యమేలాడు .
ప్రకృతి సహజ బతుకు పండగలాంటి బతుకు .ప్రపంచానికే ‘’కళాచారం ‘అంటే సంస్కృతీ ’పాఠాలు చెప్పిన గొప్ప దేశం మనది .మనం బతుకుతూ పక్కవాళ్ళ ను కూడా బతకనిస్తే అదే జీవిత పరమార్ధం అప్పుడే మనిషి బతుకు ధన్యం అన్నాడు బుద్ధ భగవానుడు. మిగిలిన విషయాల ‘’తంటకీ ‘’(జోలికి )పోలేదు ఆమహానుభావుడు .మనిషికి కుసింత’’ తా౦త౦’’ ( శాంతం )ఉండాల .గుంతలోనుంచి వచ్చిన మడిసి మళ్ళా ఆ గుంత లోకే పోతాడు అనేది జీవిత సత్యం .దేవుడైనా జీవుడైనా ప్రకృతమ్మ బిడ్డలే .అమ్మ వొడిలో పుట్టి పెరిగి వొరిగి పోవాల్సిందే .మానవుడే ప్రకృతిని పుట్టించాడు అనే వారంతా ప్రకృతిని ఎదిర్చి ఎందుకు కలకాలం బతకలేదు ?ఆని మిలియన్ డాలర్ల ప్రశ్న సంధించాడు తెలివరి .ఏమీ లేనిదే శూన్యం .అందరం శూన్యం లోకి చేరుకోవాల్సిందే ఒకరి వెనుక ఒకరు .ఎక్కడ పుట్టి ఎక్కడ పెరుగుతామో ఆ తావు (చోటు )లోనే పోతాం ఆని తావు రహస్యం చెప్పాడు అన్న.
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-25-ఉయ్యూరు

