కన్నడిగుడైన తెలుగుకవి ,అశ్వత్ధ భారత కర్త ,మయూరధ్వజ నాటకకర్త -శ్రీ అశ్వత్ధ రావు కరణం
అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కలుగోడు గ్రామం లో -శ్రీ అశ్వత్ధ రావు కరణం 1901లో జన్మించారు .71 ఏళ్ళు మాత్రమె జీవించి 1972లో మరణించారు .తల్లి వెంకోబ రావు తల్లి లక్ష్మాంబ .వీరి మాతృభాష కన్నడం.
కన్నడిగుడైనా తెలుగులో అద్భుత రచనలు చేశారు శ్రీ అశ్వత్ధ రావు కరణం.తెలుగులో మయూరధ్వజనాటకం ,అనుభవామృతం ,గీతా దండకం ,ఆశ్వత్దేజ త్రిశతి ,ఆశ్వత్ధభారతం ,అక్కమహా దేవి ,కంద పద్య రామాయణం గదాయుద్ధం ,మొదలైన రచనలు చేశారు .
కన్నడం లో ‘’భాగవత గీతిగళు ‘’,’’శృంగార వరూధిని ‘’రచించారు .ఇది పెద్దనామత్యుని మనుచరిత్ర ప్రబంధానికి కన్నడ అనువాదం .కన్నడం లో’’ రన్న కవి ‘’రాసిస’’సాహస భీమ విజయం ‘’ను తెలుగులో ‘’గదాయుద్ధం ‘’గా అనువాదం చేశారు .తెలుగులో ఎక్కువగా ప్రచారం లేని త్రిపది ఛందస్సులు ,సర్వజ్ఞాని వచనాలు అనువదించారు .
వావిళ్ళ వారు వీరి ‘’రామాయణ దండకం ‘’ప్రచురించారు .ఆంధ్ర ఆంగ్లేయ విద్యా విశారదులు శ్రీ ఏం వి లక్ష్మీపతి బి ఎ..గారు తనను రాయదుర్గం ఆహ్వానించి స్వగృహంలో కవిమిత్రుల సమక్షం లో ‘’దండక రామాయణం ‘’కవిగారిచే చదివించి ఆనంద పరవశులై ప్రచురణ నిమిత్తం నూటపదహారు రూపాయలు అందించారని కవిగారు ముందుమాట లో రాసుకొన్నారు .నవరాత్రులలో మిత్రులు శ్రీ కోదండ రామాచార్యులు తమ స్వగృహం లో శ్రీరామ సప్తాహం జరుపుతూ ఆహ్వానించి రామాయనదండకం చదివించి ముద్రణకు ఇరవై రూపాయలు ఇచ్చారని చెప్పుకొన్నారు .ఆంధ్రాంగ్ల భాషా కోవిదులు శ్రీ ఎన్ శేషాద్రి గారు తమ తాతగారు శ్రీమాన్ శేషాచార్యుల గారిపేరిట శతమానం శాయించారు .మేనల్లుడు నరసింగరావు వంద అందించారు .చాలామంది దాతలు ముద్రణకు ఆర్ధిక సాయం అందించారని ,దానిని దండకరామాయణం, అనుభావామృతం ముద్రణకు వినియోగిస్తానని వావిళ్ళ వారు ప్రచురించిన ‘’శ్రీ దండక రామాయణం ‘’ లో వారందరిపెర్లు విరాల వివరాలు కవి గారు విజ్ఞాపనలో25-6-1949 తెలియజేశారు .
శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు కవిగారిని ఆశీర్వదించి దండకం పరిచయం చేశారు .కట్టమంచి, చెళ్ళపిళ్ళ ,శ్రీపాద ,చిలుకూరి నారాయణరావు ,శ్రీమాన్ కాశీ కృష్ణాచార్య ,కవిసామ్రాట్ విశ్వనాథ,ఆంధ్రవాల్మీకి శ్రీ జనమంచి శేషాద్రి శర్మ ,వేటూరి ,గడియారం ,శ్రీ దుర్భారజశేఖరశతావధాని ,కావ్యతీర్ధ శ్రీ రావాడ వెంకట రామ శాస్త్రులు ,కవిభూషణ శ్రీ కప్పగల్లు సంజీవమూర్తి ,అభినవ భట్ట నారాయణ శ్రీ పాతాలభేది సుబ్రహ్మణ్య కవి మొదలైన ప్రముఖులు ఆశీర్వదించి అభినందించారు .
ఆధారం -డా.శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం మరియు కవిగారి రామాయణ దండకం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-5-25-ఉయ్యూరు .

