మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -1
మా పాపాయి స్వయం సిద్ధ వేదవల్లి -1
ఈనెల 8వ తేదీ ఉదయం మా అబ్బాయి రమణ వచ్చి ‘’వేదవల్లి అక్కయ్య ఈ తెల్లవారు జామున సడెన్ హార్ట్ ఎటాక్ తోహాస్పిటల్ లో చనిపోయి౦ది అని రవి ఫోన్ చేసి చెప్పాడు ‘’ఆని చెప్పాడు .నేను మా అమ్మాయి , వాళ్ళమ్మ ఒక్కసారి అవాక్కయ్యాం .తర్వాత కాసేపటికి వేదవల్లి పెద్దకొడుకు రవి ఫోన్ చేసి భోరున ఏడుస్తూ ‘’అమ్మ వెళ్లి పోయింది తాతయ్యా ‘’ఆని దుఖం ఆపుకోలేకపోయాడు .కాసేపు వోదార్చాం . తర్వాత చిన్నకొడుకు హరి అమెరికా నుంచి ఫోన్ చేసి ‘’తాతయ్యా !అమ్మ చాలా తీవ్ర పోరాటం చేసింది .చివరికి తప్పలేదు .బాధపదకండి’’అన్నాడు ‘వాడి గుండెనిబ్బరం మహా ఆశ్చర్యం కలిగించింది .ఒకే తల్లి పిల్లలు ఎలా వేర్వేరు విధంగా స్పందించారో ? వాడు అమెరికా నుంచి రావాలి కనుక ఎంత త్వరగా బయల్దేరినా సోమవారం సాయంత్రం లోపు రాలేడు.కనుక10వ తేది మంగళవారం ఉదయమే కార్యక్రమం ఆని రవి చెప్పాడు .మేము ఎప్పుడు బయల్దేరాలని మీమాంస పడ్డాం .రవిదుఖాన్ని తగ్గించటానికి వెంటనే బయల్దేరాలని నిర్ణయించాం. మా శ్రీమతి ‘’నేను దాన్ని పెంచి పెద్దదాన్ని చేశాను .ఈ స్థితిలో వేదవల్లిని చూడలేను .మీరు వెళ్ళండి ‘’అన్నది .కనుక ఉదయం పదింటికే భోజనం చేసి నేను మా అమ్మాయి విజ్జి ,రమణ ,మా న్నయ్యగారి అబ్బాయి వేదవల్లి తమ్ముడు రాంబాబు కారులో బయల్దేరాం .ఈ లోగా ఫోన్లమీద విశేషాలు తెలుస్తున్నాయి .హాస్పిటల్ లోనే మార్చురీ లో ఉంచి ,మంగళవారం నల్లకుంట లో వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ కింద సెల్లార్ లో ఉంచి అక్కడినుంచే స్మశాన వాటిక కు తీసుకు వెళ్ళే ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది .వేదవల్లికి తెల్లవారు ఝామున హార్ట్ ఎటాక్ వచ్చినట్లు ,నాడి అందక చనిపోయినట్లు చెప్పారనిఆతర్వాత ఆఖరి ప్రయత్నంగా హార్ట్ పై మాసేజ్ చేయటం వలన హార్ట్ ఫంక్షన్ చేయటం మొదలుపెట్టి క్రమంగా వైటల్ ఆర్గాన్స్ అన్ని డీ ఫన్క్ట్ అయి ఉదయం 7-30 కు గుండె ఆగిపోయిందని తెలిసింది .విశ్వావసు జ్యేష్ట శుద్ధ త్రయోదశి స్వాతి నక్షత్రం ఆదివారం ఉదయం 73వయేట మా పాపాయి వేదవల్లి దాదాపు పదేళ్లు ఆనారోగ్య సమస్యలతో ,కొడుకు రవి కాలు యాక్సిడెంట్ తో, భర్త రామకృష్ణ హార్ట్ ప్రాబ్లెంస్ తో రెండేళ్లక్రితం ఆకస్మికమరణం ,రెండవకొడుకు హరి పెద్ద కొడుకు ఆరోగ్య సమస్య తోఅన్నీ తట్టుకొని పిల్లలకు గుండె ధైర్యం కలిగించి’’ అన్నదమ్ముల౦ జీవితాంతం కలిసి ఉంటాము’’ అనే అనే వాగ్దానం తీసుకొని మూడురోజులక్రితం రవితో ‘’నాన్నా !అంతా అయిపోయిదిరా .జాగ్రత్త .తమ్ముడు హరి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు వాడి పెద్దపిల్లాడి ఆరోగ్య సమస్యతో .ఇద్దరు అన్యోన్యంగా ఉండండి నాన్నా ‘’ఆని చెప్పిందట .’’అలానే అమ్మా .నీకు దిగులు వద్దు .హాయిగా గుండె నిబ్బరంతో ఉండమ్మా ‘’ఆని కన్నీరు కార్చాడట ,ఇలా ఇహ బంధాలన్నీ తెంచుకొని మా పాపాయి వేదవల్లి వెళ్ళిపోయింది .9వతేదీ సాయంత్రం హరి వచ్చాడు హైదరాబాద్ .మేము ఆదివారం సాయంత్రం మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చెర్లపల్లి వెళ్లి ,రాత్రి బయల్దేరి మా పెద్దకోడలు సమత తో సహా రవి ఇంటికి వచ్చి పలకరించాము .మా అమ్మాయి విజ్జి రవిని భార్య గాయత్రిని చాలా దగ్గర కూర్చుని ఓదార్చింది .వాళ్లకు మేము ఉన్నాము అనే ఉపశమనం కలిగించగలిగాం . రాంబాబు ను రవి ఇంట్లో వదిలి మళ్లీ రాత్రి బయల్దేరి మేము చర్లపల్లిచేరి భోజనం చేసి పడుకున్నాం . .
సోమవారం 9వ తేది ఉదయం టిఫిన్ చేసి ఓల్డ్ బోయిన్ పల్లి లో ఉన్న 93ఏళ్ల మా బావగారు శ్రీ వేలూరి వివేకానంద గారిని ఓల్డ్ వారి స్వగృహం లో కలిశాం .ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు .వేదవల్లి మరణ వార్తచెప్పాం .తట్టుకోగాలిగారు .పాతవన్నీ గుర్తు చేసుకొన్నాం .అక్కడ ఉండగానే వాళ్ళ చిన్నబ్బాయిఅమెరికాలో ఉన్న మా చిన్న మేనల్లుడు శాస్త్రి , హైదరాబాద్ లో ఉన్న వాళ్ళమ్మాయి మా మేనకోడలు పద్మ కూడా మాట్లాడారు . .మాపెద్దమేనల్లుడు అశోక్ కూడా వచ్చాడు .బావగారింట్లో కాఫీతాగి దగ్గర్లోనే ఉన్న అశోక్ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని వాళ్ళు పెట్టిన పునుగులు టిఫిన్ తిని ,బయల్దేరి ,35 ఏళ్ళక్రితం గుంటూరు పాలిటెక్నిక్ లో మా అమ్మాయి క్లాస్ మేట్ తులసి ని వాళ్ళ ఆఫీస్ లో కలిసి మళ్లీ చెర్లపల్లి చేరాం .మా అమ్మాయి హరి ఫ్లైట్ వివరాలన్నీ తెలుసుకొంటూనే ఉంది వాడు సాయంత్రం మూడున్నరకు దిగి ఐదున్నరకు రవి ఇంటికి చేరాడు .మేము సాయంత్రం ఆరు కు బయల్దేరి రవి ఇంటికి మా అబ్బాయి శాస్త్రితో సహా చేరి రవి హరి లను పలకరించి వోదార్చాం .అప్పటికే వాళ్ళ చిన్నమేనత్త మూడు రోజులనుంచి అక్కడే ఉంటూ వాళ్ళను జాగ్రత్తగా చూసుకొంటున్నారు .గాయత్రి బందువు హిరణ్యాక్ష శర్మ వైదిక కార్యక్రమాలకు ,హాస్పిటల్ వ్యవహారాలకు గొప్ప సాయం చేస్తున్నాడు .తలలో నాలుకగా వ్యవహరిస్తున్నాడు .రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా గరివిడిలో ఇలాగే సాయపడ్డాడు .దాదాపు పాతిక ఏళ్లుగా గరివిడిలో మా వేదవల్లి రామ కృష్ణ ల ఇంటిని అన్ని విధాలుగా చూసుకొంటున్న శ్రీమతి సావిత్రి ,కొడుకు వర్మల సేవ మాటలతో చెప్పలేము .సావిత్రి వారం క్రిందటే వచ్చింది .అ౦భ౦ లో కుంభం లాగా రవి వాళ్ళ అపార్ట్ మెంట్ ను ఓనర్ అమ్మేయగా వీళ్ళు అపార్ట్మెంట్ ఖాళీ చేయాలి నెలాఖరులోపు .దానికి సాయం చేయటానికి వచ్చింది సావిత్రమ్మ .ఒకరకంగా వాళ్ళ ఇంట్లో సభ్యులుగా నే ఉంటారు తల్లీ కొడుకు వర్మా కూడా .అంతటిభక్తి తాత్పర్యాలు వాళ్లకు .రామకృష్ణ మరణం సమయం లోనూ వారి సేవలు నిరుపమానం .
10 వ తేదీ మంగళవారం మూడవ రోజు అంత్యక్రియలకు చెర్లపల్లిలో స్నానాదులు చేసి బయల్దేరి నల్లకుంట వచ్చాం .అప్పటికే పాపాయి పార్ధివ దేహం వచ్చి ఉంది .పురోహితులు వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి అయి శవ వాహనం బయల్దేరటానికి ఉదయం 10-30అయింది .రామకృష్ణ ఇద్దరు తమ్ములు భార్యలు వచ్చారు మా తమ్ముడు మోహన్ ,భార్య సునీత ,కొడుకు రాజు,మా మేనకోడలు పద్మ ,మా అబ్బాయి శర్మ ,రవి మామగారు, గాయత్రి మేనత్త, భర్త ,కొడుకుకోడలు ,వేలూరి తారకం గారబ్బాయి కోడలు వచ్చారు .శాస్త్రోక్తంగా అన్నీ జరిగాయి అన్నదమ్ములు రవిహరి బహు శ్రద్ధగా నిర్వహించారు .దగ్గరలో ఉన్న అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు .అక్కడే ఒకే సారి 15శవాలకు అంత్యక్రియలు జరిపే ఏర్పాటు ఉంది .మధ్యాహ్నం 12కు కపాల మోక్షం అవగానే మేమందరం స్నానాలు చేయటం రవి హరిలకు వపనం జరగటం అయింది .బయల్దేరి ఇంటికి రాగానే వాళ్ళిద్దరూ దీప దర్శనం చేసి పిండం తీసుకు పై అంతస్తు గోడపై పెట్టి కిందికి దిగగానే భోజనాలు వడ్డించారు .భోజనం చేసి ,రాంబాబు తో సహా మేము బయల్దేరి రాత్రి ఏడుగంటలకు ఉయ్యూరు చేరాం .రవి అపార్ట్ మెంట్ లో ఇద్దరు ముఖ్యులు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి గొప్ప సాయం చేశారు .శవవాహకులు గా వ్యవహరించారు రాంబాబు తో సహా .రామకృష్ణ సోదరులిద్దరూ కిమిన్నాస్తి గా ఉన్నారు .ఆశ్చర్యమేసింది .మొన్న గురువారం ఐదవరోజు 12వ తేది రవి,హరి వచ్చి బెజవాడ ఫెర్రి దగ్గర కృష్ణా గోదావరి సంగమం లో అస్తినిమజ్జనం చేసి వెళ్లారు . ఈనెల 17,18,19 మంగళ బుధ గురువారాలలో పదవ రోజు, పదకొండవ రోజు ,పన్నెండవ రోజు .రాంబాబు ఇవాళ సాయంత్రం బయల్దేరి వెడుతున్నాడు .నేను, మా శ్రీమతి ,మా అమ్మాయి 18వ తేది బుధవారం ఉదయం భోజనం చేసి బాచుపల్లి మా అబ్బాయి శర్మ ఇంటికి వెడతాం .మర్నాడుఉదయం రవి వాళ్ళ ఇంటికి వెడతాం .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-25-ఉయ్యూరు
.
.

