ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు
శ్రీ కపిల చిన వెంకటరావు గారు పశ్చిమగోదావరిజిల్లా ‘’మంచిలి ‘’గ్రామం లో 1906లో శ్రీకపిల కృష్ణారావు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .మద్రాస్ లా కాలేజిలో చదివి బి. ఎల్. పట్టా పొందారు.విజయవాడలో న్యాయవాదిగా 50 ఏళ్ళు వృత్తిలో ఉండి మంచి పేరు తెచ్చుకొన్నారు .కొంతకాలం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు .
బెజవాడ రెడ్ క్రాస్ సంఘానికి మూడు దశాబ్దాలు గౌరవకార్యదర్శి రావుగారు .ఆయన రాసినవ్యాసాలు కథలు నాటికలు ఆనాటి ప్రముఖ పత్రికలలో వచ్చేవి .’’ఇనప్పెట్టె ‘’,’’కొత్తపూస ‘’,’’దేవి ఇచ్చిన వరం’’ ,’’దొంగ ఎవరు ‘’,’’అల్ప సంతోషి ఆచార్లు ‘’కథలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి .వెంకటరావు గారి నాటికలు రేడియో లోనూ ,రంగస్థలం పైనా ప్రదర్శింప బడ్డాయి .’’1984లో 76ఏళ్ల వయసులో శ్రీ కపిల చిన వెంకటరావు మరణించారు ‘’ఆని శ్రీ కపిల లక్ష్మీ నరసింహారావు గారు రాశారు .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-25-ఉయ్యూరు .

