త్రేతాయుగం లో ఋష్యశృంగుడు -ద్వాపరం లో అక్రూరుడు
ఏమిటి ఈ లింకు ?
ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండములో వివరించబడింది. దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు. దశరథమహారాజు అశ్వమేథ యాగము, పుత్రకామేష్టి యాగము చేస్తాడని సనత్కుమారుడు ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.
ఋష్యశృంగుడి జననము – విద్యాబుద్ధులు
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
అంగరాజ్యములో క్షామము
ఇలా ఉండగా, అంగ రాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
వేశ్యల ఉపాయము
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా విభాండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో వేశ్యలని పంపమని చెబుతారు.
మహారాజు అందుకు అంగీకరించి, వేశ్యలని ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభాండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. వేశ్యలు విభండక మహర్షి వచ్చే సమయం అయిందని భావించి వెళ్ళి పోతూ వెళ్ళి పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొంటారు.
వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి కూడా వారిని చూడాలి అనే కోరిక పుడుతుంది, వారిని వెతుకుతూ వెళ్ళగా వారు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మంటారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.
ఋష్యశృంగుడు – శాంత ల వివాహము
ఋష్యశృంగుడిని ఆహ్యానించుటకు అంగ దేశము వెళుతున్న ధశరథుడు- పర్షియన్ రామాయణం నుండి ఒక దృశ్యం
కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు. రోమపాదుడు తన కూతురైన శాంతను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడుశృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో రుష్య శృంగ ఆశ్రమం ఉన్నది ఉంది.. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చిందని కూడా చెబుతారు.
అక్రూరుడు
అక్రూరుడు (సంస్కృతం:, అక్షరాలా ‘క్రూరుడు కాదు’) హిందూ మతంలో యాదవ యువరాజు, కృష్ణుడికి మామగా ప్రసిద్ధి చెందాడు. కాశీ రాజు కుమార్తె అయిన శ్వఫల్క మరియు గాండినిల కుమారుడు, కంసుడు తన మేనల్లుళ్ళు కృష్ణుడు మరియు బలరాముడిని మధురలోని ధనుర్యాగ (ఆయుధాల ఉత్సవం) కు తీసుకెళ్లమని ఆదేశించాడు, అక్కడ వారు వధించబడతారు. ఈ ప్రయాణంలో అతను కృష్ణుడి విశ్వరూప (దివ్యదర్శనం) కి సాక్ష్యమిస్తాడు. దాని మునుపటి యజమాని సత్రాజిత్తు మరణం తరువాత అక్రూరుడు స్యమంతక రత్నానికి యజమాని అవుతాడు. ప్రభాస వద్ద జరిగిన అంతర్గత యదువుల వధ సమయంలో అతను చంపబడతాడు.
కృష్ణుడు మరియు బలరాముడి రథసారథి
అక్రూరుడి బంధువు కంసుడు, తన రాజధాని మధురలో నివసించి, యాదుల రాజుగా పరిపాలించాడు. తన మేనల్లుడు కృష్ణుడు చంపబడతాడని ప్రవచించబడిన విష్ణు పురాణంలో, కృష్ణుడిని మరియు బలరాముడిని తన రథంపై మధురకు పిలిపించమని అక్రూరుడిని ఆదేశించాడు. చాంద్రమాన మాసం పద్నాలుగో రోజున జరిగే ధనుర్యాగ ఉత్సవానికి వారిని ఆహ్వానించే నెపంతో ఆహ్వానం జారీ చేయవలసి ఉంది, అక్కడ వారిని హత్య చేయాలని అతను కుట్ర పన్నాడు. తన మేనల్లుళ్ల మరణం తరువాత, గోపాలకుల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, తనతో కలిసి పరిపాలించాలని కోరుకుంటున్నానని కంసుడు అక్రూరుడికి తెలియజేశాడు. విష్ణు భక్తుడిగా, అక్రూరుడు కృష్ణుడిని కలిసే అవకాశం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. గోకులానికి వచ్చిన తర్వాత, అతను కృష్ణుడిని మరియు అతని సోదరుడిని పశువుల మధ్య చూశాడు, కంసుడితో తనకున్న అనుబంధాన్ని వారు తృణీకరిస్తారా అని ఆశ్చర్యపోయాడు. అయితే, సోదరులు తమ మామను ఆతిథ్యంతో చూసుకున్నారు, మరియు అతను కంసుడి నిరంకుశత్వంలో వాసుదేవుడు, దేవకి మరియు ఉగ్రసేనుడి పట్ల జరిగిన దుర్వినియోగం గురించి మరియు అతను పంపబడటానికి గల కారణాన్ని వారికి చెప్పడం ప్రారంభించాడు. మరుసటి రోజు అక్రూరుడితో పాటు మధురకు వెళ్లడానికి సోదరులు అంగీకరించారు. కృష్ణుడు వ్రజ నుండి బయలుదేరినందుకు పాలపిట్టలు విలపించాయి, అక్రూరుడిని తమ నుండి తీసుకెళ్లినందుకు క్రూరంగా వ్యవహరించాయి. వారి ప్రయాణంలో, అక్రూరుడు యమునా నది నీటిలో స్నానం చేశాడు, అక్కడ బలరాముడు శేషుడిగా, కృష్ణుడు విష్ణువుగా కనిపించి, వారిని స్తుతించాడు. మధురకు చేరుకున్న అతను, ఆ సమయం నుండి వారు రాజ మార్గంలో నడవవలసి ఉంటుందని వారికి తెలియజేసి, తన రథంలో ఒంటరిగా ముందుకు సాగాడు.
స్యమంతక స్వాధీనత
శతధన్వుడు స్యమంతక అనే పురాణ రత్నాన్ని తనకు భద్రంగా ఇచ్చిన తర్వాత అక్రూరుడు పొందాడని హరివంశం పేర్కొంది. శతధన్వుడు ఆ రత్నం యొక్క మునుపటి యజమాని అయిన సత్రాజిత్తును చంపి, గతంలో దానిని పొందాలనే కోరికను వ్యక్తం చేసినందున, దానిని అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు ఆ రత్నాన్ని తాను విడిచిపెట్టనని శతధన్వుడికి వాగ్దానం చేశాడు. కృష్ణుడు తనపై దాడి చేస్తే తన రక్షణ గురించి శతధన్వుడు అక్రూరుడికి హామీ ఇచ్చాడు. శతధన్వుడు కృష్ణుడి చేతిలో హతమైనప్పటికీ, అక్రూరుడు అక్రూర యజ్ఞం అనే గొప్ప యాగం ప్రారంభించాడు, అక్కడ అతను ఆ రత్నం నుండి అరవై వేల సంవత్సరాలు కొనసాగేంత ఆభరణాలు మరియు సంపదను అర్పించాడు. ఈ సంఘటనల గాలిని కృష్ణుడు గ్రహించి, ద్వారకలో అక్రూరుడు స్యమంతకను తనకు తిరిగి ఇవ్వాలని కోరుకున్నాడు. అక్రూరుడు స్యమంతకను, అలాగే తన సోదరి సుశీలను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. సంతోషించిన కృష్ణుడు అక్రూరుడు ఆ రత్నాన్ని ఉంచుకోవడానికి అనుమతించాడు.
ధృతరాష్ట్రుడిని కలవడం
భాగవత పురాణంలో, కృష్ణుడు కురుల రాజు ధృతరాష్ట్రుడిని కలవడానికి, రాజు తన కుమారుడు దుర్యోధనుడిచే ప్రభావితమయ్యాడో లేదో తెలుసుకోవడానికి అక్రూరుడిని హస్తినాపురానికి పంపాడు. హస్తినాపురానికి చేరుకున్న అక్రూరుడు తన బంధువు కుంతిని కలిశాడు, ఆమె కృష్ణుడు ఇంకా ఆమెను గుర్తుంచుకున్నాడా అని కన్నీళ్లతో విచారించింది మరియు ఆమె దేవతలో మోక్షాన్ని కోరుకుందని అతనికి చెప్పింది. అక్రూరుడు కురు రాజును కలిసి, కౌరవుల పట్ల అతని పక్షపాతం గురించి, యుధిష్ఠిరుడిని సరైన రాజుగా ప్రతిష్టించడం కంటే సింహాసనాన్ని ఆక్రమించడంలో అతని ప్రవర్తన గురించి మాట్లాడాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని దేవుడిగా భావించినప్పటికీ, తన కుమారుల పట్ల పక్షపాతంతో ఉన్నానని అంగీకరించాడు. రాజు ఆలోచనలను సేకరించిన తరువాత, అక్రూరుడు కృష్ణుడికి తన సందర్శన గురించి తెలియజేయడానికి హస్తినాపురానికి బయలుదేరాడు.
ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే లేక విన్నవీ చదివినవీ .ఎందుకు రుష్యశృంగుడిని క్రూరునితో లింకు చేశానో ఇప్పుడు చెబుతా .ఈ రహస్యం భాగవతం దశమ స్కంధం లో ఉంది
శ్యమంతక మణి ని సాధించి తెచ్చి శ్రీ కృష్ణుడు ద్వారక చేరాడు .సత్రాజిత్తు కు మణి అప్పగించాడు .అన్నగారితో తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు కృష్ణుడు .ఈలోపే అక్రూరుడు ,కృతవర్మా ,ఇద్దరు శతధన్వుడి మరణ వార్త విని ,సత్రాజిత్తు తమల్ని చంపుతాడనే భయంతో ఎన్నో యోజనాల దూరం పారిపోయారు .అక్రూర మహాత్ముడు ద్వారకలో లేక పోవటం వలన ద్వారకలో వానలు కురవక విపరీతమైన క్షామం ఏర్పడి అనేక అనర్ధాలు కలిగాయి .ద్వారక ప్రజలు కరువు కాటకాలతో నానా అవస్థలు పడుతున్నారు .అప్పుడు ద్వారక వృద్ధులందరూ కలిసి తమలో తాము సంప్రదించుకొని శ్రీ కృష్ణుని దగ్గరకు వెళ్లి ‘’పరమాత్మా !ఒకప్పుడు కాశీ రాజు పాలించే కాశీ రాజ్యం లో వానలుకురవక క్షామం ఏర్పడింది.అప్పుడు కాశీ రాజు అక్రూరుని తండ్రి ‘’శ్వఫల్కుడు ‘’ను తీసుకొని వెళ్లి తనకూతురు ‘’ గాందిని’’ని ఇచ్చి పెళ్ళి చేసి తన దగ్గరే ఉంచుకొన్నాడు .శ్వఫల్కుని మహిమ వలన కాశీలో బాగా వర్షాలు .పంటలు పుష్కలంగా పండి క్షామం మటుమాయమైంది అతని కొడుకు అక్రూరుడు కూడా అంతటి మహిమ కలవాడే .ఆమహా తపస్వి మళ్లీ ద్వారకలో అడుగు పెడితేనే వానలు కురిసి సస్యశ్యామల౦ అవుతుంది .అతడిని వెంటనే రప్పించు .ప్రజల కష్టాలు తొలగించు ‘’ఆని ప్రాధేయ పడ్డారు .కృష్ణుడు తగిన పెద్దలను పంపించి అక్రూర మహాశయుని పిలిపించి గౌరవించాడు .వెంటనే విపరీత వర్షాలు కురిసి పాడి పంటలతో ద్వారక కళకళ లాడింది .కృష్ణుడు చేయలేక పోయిన పనిని అక్రూరుడు చేశాడు .
పెద్దలందరినీ పిలిపించి అక్రూరుడు జాగ్రత్త చేసిన ‘’శ్యమంతక మణి ‘’ని అందరికి చూపించి మళ్లీ అక్రూరునికే ఇచ్చేశాడు .ఈ కథ విన్నా చదివినా సకల సౌభాగ్యాలు కలుగుతాయని పరీక్షిన్మహారాజుకు శుక యోగీంద్రుడు చెప్పాడు .ఈ కధ ఎందుకో మనకు ప్రచారం లో లేదు.
మధుర జిల్లాలోని బృందావనంలో ఉన్న స్నాన ఘాట్‌లలో అక్రూర ఘాట్ ఒకటి. కృష్ణుడు మరియు బలరాముడు తమ విష్ణు మరియు శేష రూపాలను అక్రూరుడికి వెల్లడించారని నమ్ముతున్న ప్రదేశం ఇది. ఆది వరాహ పురాణం అక్రూర ఘాట్‌ను అన్ని పవిత్ర స్థలాలకు రాజుగా వివరిస్తుంది.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’భాగవత నవనీతం -దశమ స్కంధం ‘’ఆధారం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-7-25-ఉయ్యూరు

