సుప్రసిద్ధ ప్రకృతి వైద్యులు ,రచయిత -శ్రీ పుచ్చా వెంకట రామయ్య
1898లో జన్మించి 1984లో 86వ ఏట మరణించిన శ్రీ పుచ్చా వెంకట రామయ్య
గారి పుట్టుక బాల్యం విద్యాభ్యాసం తెలియలేదు .హైస్కూల్ విద్య పూర్తి చేశాక రామయ్య గారి దృష్టి ప్రకృతి వైద్యం వైపు మళ్ళింది .వీరిది గుంటూరు జిల్లా దంతలూరు గ్రామం కావచ్చు .అక్కడే హైస్కూల్ విద్య పూర్తికాగానే ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రారంభించారు .
ప్రకృతి గ్రంథ మాల స్థాపించి ,1921లో సూర్య కిరణ చికిత్స ,ప్రతిష్టాన నియమాలు ,మల బద్ధకం ,ఆరోగ్య ధర్మం అనే నాలుగు పుస్తకాలు రాసి ప్రచురించారు .విజయవాడలో’’ ప్రకృతి కార్యాలయం ట్రస్ట్ ‘’స్థాపించి ,అధ్యక్షులుగా ఉంటూ మరికొన్ని’’మసూచికము’’మొదలైన గ్రంథాలు రచించి ప్రచురించారు .ప్రకృతి అనే మాస పత్రిక ను 1834 నుంచి 1984వరకు యాభై ఏళ్ళుఅవిచ్చిన్నంగా నడిపి రికార్డ్ సృష్టించారు .
ప్రకృతి కార్యాలయం ట్రస్ట్ ద్వారా ‘’ఇండియన్ నాచురోపత్ ‘’ఇంగ్లీష్ పత్రికను 1934 నుంచి 1948వరకు సంపాదకులు గా ఉంటూ 14 ఏళ్ళు నడిపారు . జీవిత౦ అంతా ప్రకృతి వైద్యానికే ధారపోశారు .ప్రకృతి వైద్యం అంటే జీవిత విధానం అంటారు ఆయన .ప్రకృతి వైద్యం లోఅనితర సాధ్య కృషి చేసి వందలాది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చిన ఆదర్శ మూర్తి శ్రీ పుచ్చా వెంకట రామయ్య గారు
ఆధారం – తెనాలికి చెందిన శ్రీ అయినాల మల్లేశ్వర రావు గారి వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -2-8-25-ఉయ్యూరు
