కృష్ణుడు మిధిలకు వెళ్ళాడా ?
అవును అంటుంది భాగవతం .ఆవిషయాలు శుకమహర్షి పరీక్షిత్తు కు చెప్పాడు ‘’విదేహ దేశం భువన ప్రసిద్ధమైంది .భూ దేవికి ముఖం చూసుకోనేఅద్దం లాంటిది .అక్కడ శ్రుతదేవుడు అనే బ్రాహ్మణుడు శ్రీ హరిపై అచంచలభక్తీ , విశ్వాసం ఉన్నవాడు .రాగాది విషయాలు దగ్గరకు రానివ్వడు .క్రోధం లేదు .నిరంతర శాంత చిత్తుడు .వేద విద్యా కోవిదుడు .కోరకుండా దొరికిందికొంచెమైనా బంగారు కొండ అనుకొనేవాడు .గృహస్థ ధర్మాన్ని ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తాడు ‘.
అప్పటి మిధిల రాజు ‘’బహుళాశ్వుడు.ఈ యన కూడా కల్మష రహితుడు .శ్రీ కృష్ణ పరమాత్మ వీరిద్దరిని అనుగ్రహించాలనుకొని రధం ఎక్కి బయల్దేరాడు .ఆయనతో బాటు నారద ,వామదేవ, అత్రి ,కృష్ణ ద్వైపాయన ,అసిత ,రోమక ,అరుణ, బృహస్పతి ,కణ్వ ,మైత్రేయ ,చ్యవన మహర్షి ,నేనూ మిధిలకు బయల్దేరాం .దారిలో అనేక దేశాల రాజులు కృష్ణ పరమాత్మకు మాకూ అనేక కానుకలిచ్చి పూజించి ఆశీస్సులు పొందారు .
భగవానుడు అల్లంత దూరంగా ఉండగానే బహుళాశ్వుడు ,ఆనంద సాగర మనస్సుతో ,అనేక కానుకలతో ఎదురు వచ్చి భగవానుని సందర్శించి సాష్టాంగ దండ ప్రణామం చేసి కానుకలు సమర్పించాడు .పూజించి నగరం లోకి తీసుకు వెళ్లాడు .జనకుడు అనే ఆ బహుళాశ్వుడు ‘’స్వామీ !మీ పాద దర్శన భాగ్యం మాకు కలిగించాలని తమరే రావటం మాకు మహదానందంగా ఉంది .నిన్ను ధ్యానించటం మరగినవాడు జన్మలో మరచిపోడు.నువ్వు ఈ మహర్షి పు౦గవులతో పాటు ఇక్కడే ఉండి,మాగృహం పావనం చెయ్యి.వారి కోరిక మన్నించి పరమాత్మ మా అందరితో అక్కడే ఉండిపోయాడు .
శ్రుత దేవుడు కూడా తన పరివారంతో తొ సహా పరమాత్మను తన ఇంటికి తీసుకు వెళ్లాడు ,సకలోప చారాలు చేసి సంతృప్తి చెందాడు .’’స్వామీ !తమ ఆదేశం ఏమిటో సెలవిస్తే అలాగే నడుచుకొంటాను ‘’అన్నాడు .పరమాత్మ ‘’మహాభాగా ! వీరంతా తమ పాద ధూళితో లోకాలను పవిత్రం చేసే మహర్షులు .తమకు ఎక్కడ ఆనందం కనిపిస్తే అక్కడే విహరిస్తారు .ఇప్పుడు నీ పుణ్యం పండి,నీ ఇంటికి విచ్చేశారు .త్రికరణాలతో వీరిని పూజిస్తే చాలు పాపాలన్నీ పటాప౦చలౌతాయి .వీర౦తా తప ధ్యానవేదాధ్యయనాలలో అఖండులు .వారి ముఖాలలో ఆతేజస్సు ప్రతి ఫలిస్తుంది చూడు .నాకు ఎప్పుడూ ఇలాంటి ఉత్తమముల మీదనే అనురాగం ఎక్కువ .అంతటి ప్రేమ నేను నా దేహం మీద కూడా చూపలేను .వీరందరూ పరమ యోగ్యులు వారిని సేవించి తరించు మహానుభావా “’అన్నాడు .తానే సర్వ లోక గురువైనా ,లోకోత్తముడైనా ఆ మహర్షులను ఎంతగా మెచ్చుకోన్నాడో శ్రీ కృష్ణ పరమాత్మ.ఇదే గొప్ప ఆదర్శం .దాన్ని అనుసరించి లోకానికి మార్గ దర్శనం చేశాడు శ్రీ కృష్ణ పరమాత్మ .తు చ తప్పకుండా శ్రుత దేవుడు వారందరినీ పరమ భక్తితో పూజించి జీవితం ధన్యం చేసుకొన్నాడు .తర్వాత శ్రీ కృష్ణుడు మిధిలేశ్వరుడు బహుళాశ్వ జనకుని , ,శ్రుత దేవుని వీడ్కొని కుశస్థలికి ప్రయాణ మయ్యాడు .
ఆధారం- ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారి -దేవీ భాగవతం -దశమ స్కంధం.
బహుళాశ్వ చరితం అనే కావ్యాన్నిదామరల వెంగళ భూపాలుడు రచించాడు .మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-25-ఉయ్యూరు

