నాటక చక్రవర్తి -శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి
కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో శ్రీ మల్లాది అచ్యుత రామ శాస్త్రి1872లో జన్మించి 1943లో 71వ ఏట విజయవాడ లో మరణించారు .నాటక రచయితగా బెజవాడలో స్థిరపడ్డారు .విజయవాడ హిందూ ధియేటర్ లో ,మైలవరం కంపెని కోసం ద్రౌపదీ వస్త్రాపహరణం ,సక్కు బాయి మొదలైన నాటకాలు రాశారు .అవి చాలా చోట్ల ప్రదర్శింప బడి గొప్ప పేరు తెచ్చి పెట్టాయి .రత్నమాల అనే గద్య పద్యాత్మక నాటకం రాశారు .భక్త చోకా మిళ ,అహల్య ,సంగీత సత్యామోద చంద్రోదయం,భక్త కుచేల ,రామ దూత (లంకా దహనం )నాటకాలు రాసి ప్రదర్శించారు .వీరి పద్యరచన హృద్యంగా కర్ణపేయంగా ఉంటుంది .1922లో శాస్త్రి గారికి ఘన సత్కారం జరిగింది .నాటక చక్రవర్తి బిరుదు పొందారు .
వీరి ఫోటోదొరకలేదు.
ఆధారం -శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -19-8-25-ఉయ్యూరు

