సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్రగారు (వినాయకచవితి సందర్భంగా) విసిరిన అక్షర పల్లెరుకాయలు ఉమ్మెత్తకాయలూ నూ
‘’మన దేశం లో శైవం, వైష్ణవం ప్రబలటమే కాదు మాదేవుడు గొప్పంటే మా దేవుడు గొప్ప ,మా మతం గొప్పదంటే మామతం గొప్ప ఆని వీరంగం వేసే దాకా వెళ్ళింది .వీర శైవులు గణాధిపతిని నరసింహావతారం ఎత్తిన విష్ణువు సంహరిం చాడని తమ పుస్తకాలలో రాసుకొంటే ,నరసింహుని శివుడు వీరభద్రావతరమెత్తి పీచమడచాడని ,శరభావతార మెత్తి కాల రాచాడని శైవులు కౌంటర్ ఇచ్చారు .మా దేవుడికి నంది వాహనం అంటూ దశ్శరభ శరభ అంటూ వీరంగం వేశారు ,మాదేవుడికి ఆకాశం లో తేలిగ్గా ఎగిరే గరుడుడు వాహనమని జబ్బలుచరచుకొన్నారు మూడు నామాలవాళ్ళు .మా దేవుడు హాలాహలం తాగి బ్రేవున త్రేంచాడని,పాములను పగ్గాలుగా పేని హారాలుగా మణికట్టుకు చుట్టుకున్నాడు ఆని విబూది రేకల వారంటే , మా దేవుడు ఆ నా గేంద్రుని తలత్రోక్కి ,గరళం కక్కించి ,పీటీ దెబ్బకొట్టి హాయిగా పక్కగా పరచుకొన్నాడు ఆని రెండో వారు జవాబిచ్చారు .మా దేవుడు భార్యను రొమ్ము మీద పెట్టుకోన్నాడని వారంటే ,అదే౦ గొప్ప? మా దేవుడు భార్యను తలమీదే పెట్టుకొన్నాడు ,ఇంకా తగాదాకొస్తే ,సగందేహమే రాసిచ్చీశాడు మావోడు ‘’ఆని మీసాలు దువ్వారు ఎదుటి వారు.ఇలాంటి వాదాల వలన కొంత కీడు జరిగినా మంచి కూడా జరిగింది.బసవపురాణం హరవిలాసం లాంటివి ఆముక్తమాల్యద ,విష్ణు మాయావిలాసం వంటి నాటకాలు వచ్చి వాజ్మయ పరిపుష్టి జరిగింది .ప్రపంచాన్ని బ్రహ్మ రుద్ర మహేశ్వరుల ను అధిగమించి నఒక అనిర్వచనీయ ప్రభావ శక్తిగల ఒక మహా శక్తి మాయ నడిపిస్తోందని పిల్లిపోరు ,పిల్లిపోరు పిట్ట తీర్చిందని చెప్పే శాక్తేయులు వారికి ఆసరాగా శ్రీ దేవీ భాగవతం వచ్చాయి ‘’ఆని విష్ణు మాయా విలాసం నాటకం సమీక్షలో అయ్యవారు తిరుమల రామ చంద్రగారు ఇద్దర్నీ అక్షర కొరడాలతో వాయించారు .దాన్నినేను వినాయక చవితి సాయంత్రం మనకు పక్కున్న ఇళ్లపై పల్లేరు కాయలు ,ఉమ్మెత్తకాయలు వేసే అలవాటుందని దీనికి లంకే ,కనెక్షన్ ఇచ్చి శీర్షిక పెట్టాను ‘సరదాగా నవ్వుకోవటానికి .
వినాయక చవితి శుభాకాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-25-ఉయ్యూరు

