స్త్రీ తొడ గర్భం దాలుస్తుందా ?
దాలుస్తుందని దేవీ భాగవతం చెప్పింది .లోభం ఎంత పనైనా చేయిస్తుంది అనేదానికి ఉదాహరణగా వ్యాసుడు జనమేజయుడికి చెప్పిన వృత్తాంతం లో ఉన్నది .హైహయ వంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయమహర్షికి శిష్యుడు ..భార్గవులుఆయన పురోహితులు .వారి సాయంతో నిరంతరం భూరి దక్షినలిస్తూ ఎన్నో యజ్ఞ యాగాలు చేశాడు .కార్తవీర్యుడు చనిపోయాక ఆతని వంశం వారైన హైహయులు తీవ్ర దారిద్ర్యంతో బాధపడ్డారు .ఒక సారి వారికి చాలా ధనం కావాల్సి వచ్చింది .క్షత్రియులైనా అహం చంపుకొని సవినయంగా కులపురోహితులైన భార్గవులను .యాచించారు .వారి సోమ్ముతిన్న విశ్వాసంకూడా లేకుండా లేదు లేదు ఆని మూకుమ్మడి సమాధానం చెప్పారు . కొందరు భయపడి భూమిలో తమ డబ్బు దాచుకొన్నారు మరికొందరు బందుమిత్రులదగ్గర దాచారు .
డబ్బు అవసరం ఎక్కువై హైహయులు భార్గవులను మళ్లీ యాచించటానికి రాగా వారంతాఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవటం గమనించి పెరట్లో తవ్వి చూశారు .లెక్కలేనంత ధనరాశి కనిపించింది .ఇతర బ్రాహ్మణుల ఇళ్ళు కూడా తవ్వారు మరింత ధనం కనిపించింది హైహయులు సంబర పడ్డారు విషయం తెలిసిన బాపనయ్యలు వచ్చి లబోదిబో మని కాళ్ళ మీద పడ్డారు .కోపం పట్టలేక హైహయులు వారందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేశారు .భార్గవుల జాడ దొరకలేదు.
గిరిడుర్గాలన్నీ వెతుకుతూ దొరికిన వారిని దొరికినట్లు చంపారు హయహయులు .భార్యలను గర్భణీ స్త్రీలనూ వదల్లేదు .భ్రుగుపత్నులు దారుణంగా విలపించారు .చుట్టుప్రక్కల ఆశ్రమాలనుంచి మహర్షులు మునులు వచ్చి వారించినా శాంతించలేదు .పాపం చేస్తే ఫలితం ఇక్కడే వెంటనే అనుభవిస్తారని హెచ్చరించాక కొంత శాంతించి ..’’మా డబ్బు అంతా యజ్ఞాలు యాగాలకోసం ఖర్చు చేయించి మమ్మల్ని దివాలా తీయించి మాకు అవసరం వచ్చి డబ్బు అడిగితె ఎక్కువ వడ్డీ ఇస్తామన్నా వినకుండా భూమిలో దాచి లేదు పొమ్మన్నారు .విప్రులు ధనం కూడ బెట్టకూడదు .రాక్షసంగా కూడబెడితే వంచకుడు అవుతాడు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు ‘’అన్నారు వచ్చిన వారు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు .
భ్రుగు పత్నులలకోస హైహయులు అన్వేషణ సాగించారు .హిమాలయం చేరిన భ్రుగుపత్నులు మట్టితో గౌరీ దెవి ప్రతిమ చేసి ఉపాసించారు భక్తితో .అమ్మవారు కలలో ప్రత్యక్షమై ‘’మీలో ఒకరి తొడనుంచి నా అంశతో కొడుకు పుట్టి మీ దుఖాలు పోగొడతాడు ‘’ఆని అభయ మిచ్చింది .అలాగే ఒక భ్రుగుపత్ని తొడ లో గర్భం ఏర్పడింది .మిగతావారంతా జాగ్రత్తగా కాపాడుతున్నారు ఆ గర్భాన్ని .అనుకోకుండా ఒకరోజు హైహయులు అక్కడికి రాగా వారంతా భయం తొ పారిపోగా ఆమె దీనంగా ప్రార్ధిస్తూ రోదించింది కాపాడమని .తల్లి దుఖం చూడ లేక గర్భస్త శిశువు తొడను చీల్చుకొని విపరీత కాంతులతో బయటికి రాగా హైహయులకళ్ళు ఆకాంతికి పోయి గుడ్డివాళ్ళు అయ్యారు .ఆమె పాతివ్రత్య మహాత్మ్యం గ్రహించి కాళ్ళ మీద పడ్డారు .భ్రుగుపత్నికి ఆశ్చర్యం, జాలి కలిగాయి .’’నాకేమీ తెలియదు నాయనలారా .నా ఊరు గర్భం లో వీడు వందేళ్ళు పెరిగి గర్భస్థ శిశువుగానే వేద వేదాంగాలు నేర్చాడు .మిమ్మల్నిచంపి మీరు చేసిన పితృవధకు ప్రతీకారం తీర్చుకోవటానికి పుట్టిన కారణ జన్ముడు .వాడినేయాచించండి ‘’అన్నది .వాళ్ళు బాలుని పాదాలపై పడి భక్తీ శ్రద్ధలతో స్తుతించి కాపాడమని వేడుకొన్నారు .బాలభార్గవుడు దయ తలిచి వారికి దృష్టి ప్రదానం చేశాడు .వాళ్ళు వెళ్లిపోగా భ్రుగు పత్ని బాల భార్గవుని తీసుకొని ఆశ్రమం చేరింది .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి ‘’శ్రీ దేవీ భాగవతం ‘
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-25-ఉయ్యూరు .

