14-9-25 ఆదివారం మేడూరు హైస్కూల్ 1990-91పదవ తరగతి విద్యార్ధుల ఆత్మీయ సమావేశం -1
ఈ సమావేశానికి అప్పటి హెడ్ మాస్టర్ అయిన నన్ను మా ఇంటి దగ్గరుండే ఆత్మీయుడు కీశే వెంట్రప్రగడ పిచ్చన్న గారి అబ్బాయి, శిష్యుడు చంటి అతని భార్య అయిన మేడూరు విద్యార్ధిని శ్రీమతి సరస్వతి మా ఇంటికి వచ్చి ఆహ్వానించారు .ఆతర్వాత శ్రీరామిరెడ్డి అతని సహ విద్యార్ధి కారులో వచ్చి ఆహ్వానించారు .ఆతర్వాత విజయ గోపాల్ ఫోన్ లో పలకరించి పిలిచాడు .14వ తేది ఉదయం మస్తాన్ అనే మరో విద్యార్ధినన్నూ , మా అన్నయ్య గారబ్బాయి రామనాధబాబు ను కారులో తీసుకెడు’’తూ మధ్యలో మంటాడలో అప్పటి జూనియర్ తెలుగు పండిత శ్రీ కేశవరావు ను కూడా ఎక్కించుకొని మేడూరు తీసుకు వెళ్లాడు .మస్తాన్ చాలా మర్యాదస్తుడు .ఆ విధేయత ముచ్చటేసింది ‘’.నా దారి తీరు ‘’లో అందరి గురించీ రాశాను కాని ఈ కేశవరావు గురించి రాయలేదు అందుకే దారిలో ఆయన పేరు అడిగి తెలుసుకొన్నాను .
మేడూరురస్కూల్ కు చేరే సరికి అక్కడున్న విద్యార్ధులు హార్దికస్వాగటం పలికి ,కాళ్ళమీద పడి నమస్కారాలు చేసి భక్తీ ప్రపత్తులు ప్రకటించారు .మహదానందం కలిగింది .వీరంతా ఆనాడు సుమారు 16ఏళ్లవారు ఇప్పుడు’’ హాఫ్ సెంచరి వయస్సుదాటి పేరెంట్స్ అయిన తలిదండ్రులు’’ .ఆడా మగా అందరిలో అదే ఉత్సాహం ,ఆనందం,వినయం తాండవించింది .అప్పటి తెలుగుమాస్టారు కీ శే .శ్రీ చింతలపాటి శర్మగారి అబ్బాయి ఆయేడు పదవతరగతి స్కూల్ ఫస్ట్ వచ్చిన ప్రసాద్ అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉన్నవాడు ఈ ఉత్సవానికి హాజరవ్వటం మిగిలిన విద్యార్ధులకు ప్రేరణ కలిగించటం ఊహించరానిది .వీళ్ళంతా ఆరునెలలుగా టచ్ లో ఉంటూ స్కూల్ కు కావాల్సిన మినిమం సౌకర్యాలు కలిగిస్తూ ఈఅపూర్వ సమ్మేళనం నిర్వహించారు .మాతృ సంస్థపై వారికున్న ప్రేమ గౌరవం అపూర్వం చిరస్మరణీయం .అప్పటి లెక్కలమాస్టారురు శ్రీ ప్రసాద్ ,అంతకుముందు పనిచేసిన శ్రీ కుటుంబరావు నాతో పనిచేసిన ,శ్రీ సుబ్రహ్మణ్యేరరరావు ,రికార్డ్ అసిస్టెంట్ శ్రీ శివ శంకర్ ,అటెండర్ శ్రీ లక్ష్మణ రావ్ ,ప్రస్తుత ఇన్చార్జి హెడ్ మాస్టర్ ,స్కూల్ డొనర్ కీ శే శ్రీ యలమంచిలి రామమోహనరావు గారి కుమారులు శ్రీ సుబ్రహ్మ ణ్యెశ్వర రావు ,వీరి ఇద్దరు కుమార్తెలు హాజరయ్యారు .అందరికి కాఫీ టిఫిన్లు ఏర్పాటుచేశారు .మొత్తం అందరు వచ్చేస్సరికి 11అయింది .
అప్పుడు శ్రీ రామమోహన రావు గారి విగ్రహానికి పూలమాల ను కుమారుడు మా అందరి సమక్షం లో వేయగా ,అందరంముచ్చటగా ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు విద్యార్ధులు పూల వర్షం కురిపిస్తుండగా పాదాలపై గురుభక్తితో పూలు వేస్తుండగా చేరాం . సరస్వతి ,,ప్రసాద్ ల ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమైంది
పూర్వ విద్యార్ధినీ విద్యార్ధులు ఎవరికీ వారు తమ పరిచయం చేసుకొని జీవితంలో సాధించిన వాటిని చెప్పుకొన్నారు అందరూ గొప్ప అభి వృద్ధి సాధించిన సంతృప్తి కనిపించింది . తర్వాత ముందు నాకు ఆతర్వాత నాతోపాటు వచ్చిన ఉపాధ్యాయులకు ,ఇన్చార్జి హెచ్ ఎం కు ,శ్రీ సుబ్రహ్మణ్యెశ్వర రావు గారికి ప్రత్యెక ఆసనం పై కూర్చోబెట్టి శాలువాకప్పి ,బ్రహ్మాండమైన రోజా పూలదండ వేసి, జ్ఞాపిక బహూకరించారు .పూలవాన కురిపిస్తూనే ఉన్నారు .వేదికపై చింతలపాటి శర్మ గారి ఫోటో పెట్టి హారం వేశారు .కార్యక్రమం అయ్యాక ప్రసాద్ మా ఉపాధ్యాయ దంపతులకు లందరికి నూతన వస్త్రాలు బహూకరించాడు.అతనికి తోటి విద్యార్ధులు సన్మానం చేశారు .వేదికపై ఉన్న ఉపాధ్యాయులందరూ మాట్లాడి వారి అనుభావాలు చెప్పారు .చివరగా నేను మాట్లాడబోతు,స్కూలు అభివృద్ధికి నాకు తోచిన డబ్బు ప్రసాద్ చేతిలో ఉంచి ,తర్వాత మాట్లాడాను .నేను మాట్లాడిన దానిలో మేడూరు లో నేను చేసిన అభి వృద్ధికి నాకు ‘’కృష్ణా జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ ‘’పురస్కారం లభించింది అనీ ,ఆ గౌరవం ఈ స్క్కూల్ కే దక్కుతుందని హర్షధ్వానాలమధ్య చెప్పాను . చెప్పాల్సినవి చెప్పినవి నేను రాసుకొన్న నా జీవిత చరిత్ర ‘’నా దారి తీరు ‘’లో ఉన్నదాన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను ..ప్రసాద్ ను సినీ నటుడు ఉత్తేజ్ లాగా ,రామిరెడ్డిని సినీ విలన్ రామి రెడ్ది గా ఉన్నారని చమత్కరించి అందరికి చెప్పాను .వీరందరి ఆదరణ అపూర్వం .అందరికి శుభాశీస్సులు .

