శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -1
ప్రథమ స్కంధం
1-‘’మాసానాం నియమో వాత్రదినానాం నియమోపి వా -సదా సేవ్యం సదా సేవ్యం దేవీ భాగవతం నరైః’’
దేవీ భాగవతాన్ని ఎనేలలో యే రోజు ఏ సమయం లో ఎవరు వినాలి వంటి నియమాలు లేవు .మానవులైతే చాలు అన్ని వేళలా అందరూ వినచ్చు .
2-‘’ నమోనమః శివాయాస్తుశంకరాయ కపర్దినే -గిరిజార్దా౦గ దేహాయ నమస్తే చంద్ర మౌళయే ‘’
3-‘’జయదేవి మహాదేవి భాక్తానుగ్రహ కారిణీ -జయ సర్వ సురారాధ్యే జయానంత గునాలయే ‘’
4-‘’కుపుత్రాన్వయో నష్టోజన్మ నష్టం కుభార్యాయః -కుభోజనేన దివసఃకుమిత్రేణ సుఖం కుతః ‘’
చెడ్డ కొడుకు వలన వంశం ,చెడుభార్యవలన జీవితం ,చేడుభోజనం వలన రోజు ,కుమిత్రుదివలన సుఖం నశిస్తాయి .
5-‘’సంతి లోకస్య బహవః గురవో గుణ జన్మతః -సర్వేషామపి తేషాం చ పురాణజ్ఞః పరో గురుః’’
లోకం లో చాలామందికి చాలా రకాల గురువులుంటారు .కానీ అందులో ఉత్తమోత్తమ మైన వాడు పౌరాణికుడే .
6-‘’ఏన కేనాప్యుపాయేన కాలాతివాహనం -వ్యసనైరిహ మూర్ఖాణా౦బుదానాం శాస్త్ర చిన్తనైః’’
ఎవరైనా ఎలాగో అలాగా కాలం గడప వచ్చు వ్యసనాలతో మూర్ఖులు కాలం గడిపితే శాస్త్ర చింతనతో పండితులు కాలం గడుపుతారు .
7-‘’దైవం పురుష కారశ్చ దేవేశ సదృశా వుభౌ -ఉపాయాశ్చవిదాతవ్యో దైవాత్ఫలాటి సర్వదా ‘’
దైవ బలం ,పురుష బలం సమానమే .ఇప్పటి కర్తవ్యమ్ ఉపాయమే .ఒక్కొక్కప్పుడు అది పని చేయదు అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే మానవ ప్రయత్నమే ఫలిస్తుంది .
8-‘’జాతస్యహి ధ్రువో మృత్యుఃధ్రువం జన్మ మృతస్యచ -మర్యాదా చేదృశీలోకే భవేశ్చకధ మన్యదా ‘’
పుట్టిన వాడు చావక తప్పదు .చచ్చిన వాడు మళ్లీ పుట్టకా తప్పదు .ఇదిలోక మర్యాద .దీనికి విరుద్ధంగా అమరుడుగా ఉండటానికి వీల్లేదు
9-మూర్ఖేణసహా సంయోగో విషాదపి సుడుర్జరః -విజ్ఞేన సహా సంయోగః సుధారస సమః స్మృతః ‘’
మూర్ఖుడితో స్నేహం విషం కంటే భయం .విజ్నుడితో కలయిక అమృతం టో సమానం .
10-‘’ సాత్వికం వేద శాస్త్రాది సాహిత్యం చైవ రాజసం -తామసం యుద్ధ వార్తా చ పరదోష ప్రకాశనం ‘’
వేద శాస్త్రాలు వినటంసాత్విక శ్రవణం .సాహిత్యం వినటం రాజసం .యుద్ధవార్తలు ,ఇతరుల దోషాలు వినటం తామస శ్రవణం .
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మంగారి శ్రీదీవీ భాగవతం
సశేషం
మే -గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-25-ఉయ్యూరు .
