శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -2
ప్రథమ స్కంధం
11-‘’సార్వ శాస్త్రేతిహాసజ్ఞవ్యాసరూప నమోస్తుతే -కథా చంద్రోదయే నాం తస్తమస్తోభం నిరాకురు ‘’
వ్యాసరూపా !సర్వశాస్త్ర పారంగతా !కదా చంద్రోదయం తో మా అంతరంగాల్లో ఉన్న చీకటి తొలగించు .
12-‘’యస్య స్మ్రుత్యాచ నామొక్త్యా తపోయజ్న క్రియాదిషు -న్యూనం సంపూర్నతాం యాతి తస్మాద్విష్ణుం చ కీర్తయేత్ ‘’
సర్వ దోష నివారకం గా విష్ణు సహస్ర నామం పఠించాలి .విష్ణుమూర్తి ని స్మరిస్తే ,తపస్సులో యజ్ఞాలలో జరిగే లోపాలు తొలగిపోతాయి .
13-‘’సంతి లోకస్య బహవః గురవొ గుణ జన్మతః -సర్వేషామపి తేషాం చ పురాణజ్ఞః పరో గురుః ‘’
లోకం లో చాలామందికి చాలా గురువులుంటారు .వారిలో ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే .
14-‘’శివోపి శవ తాం యాతి కుండలిన్యా వివర్జితః-శక్తిహేనస్తుయః కశ్చిత్ అసమర్ధః స్మృతో బుధైః’’
త్రిమూర్తులలో సృజన పాలన సంహరణ శక్తులున్నాయి శేష కూర్మాలకు భూమిని భరించే శక్తి ,ఆజ్ఞలో దహన శక్తి ,వాయువులో ప్రేరణ శక్తి ,ఉంది ఈ శక్తులు లేకపోతె వీరంతా అసమర్దులౌతారు
15-‘’సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్తా మనీషిఃభిః.-సగుణా రాగిభిస్సేవ్యా నిర్గుణా తు విరాగిభిః’’
శక్తి సగుణ ,నిర్గుణ ఆని రెండురకాలు .నిర్గుణ శక్తిని విరాగులు సగుణ శక్తిని కోరికలున్న వారు ఉపాశిస్తారు .మొదటిది నిష్కామ ఉపాసన .రెండవది సకామోపాసన .
16-‘’శ్రాంతే భీతే త్యక్త శాస్త్రే బాలకే తదా -ప్రహరాంతి న వీరాస్తే ధర్మ ఏష సనాతనః ‘’
అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ,ఆయుధం వదిలేసిన వాడితో,పడిపోయిన వాడితో బాలుడితో వీరుడు యుద్ధం చేయడు. ఇదీ సనాతన ధర్మం .
17-‘’అమర్షో నైవ కర్తవ్యమ్ కర్తవ్యస్తాప శేషు కదాచన -తపశ్చర౦తి మునయః జ్ఞాత్వా మాం శక్తిసంయుతం’’
తపస్వులపట్ల ఈర్ష్య పనికి రాదు .నన్ను శక్తి వంతుడిగా ఎరిగిన వారు ణా అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు .వీరు ఎవరికీ అపకారం చేయరు .రుద్రుడు ఇంద్రుడితో .
18-‘’పతివ్రతాపి దక్షాపి రూప వత్యసి కామినీ-సదా బంధన రూపా చస్వేచ్ఛా సుఖ విఘాతినీ ‘’
రూపయౌవన సంపంనతో ఉన్న స్త్రీని తెచ్చి పాదాలకు సంకెళ్ళు వేసుకోనా ?ఆమె వంశం నిలబెడుతుంది సుఖం ఇస్తుంది .కానీ స్వేచ్చా స్వాతంత్ర్యాలకు మాత్రం స్త్రీ అడ్డు .శుకమహర్షి తన తండ్రి వ్యాస మహర్షి తో .
19-‘’పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః-దుర్లభస్తు స్వయం కర్తా ప్రాప్తే కర్మణి సర్వదా ‘’
ఎదుటి వారికి నీతులు చెప్పటం లో అంతా ఘనా పాఠీలే .తనదాకా వస్తే మాత్రం చెప్పింది చేసే వాడు కలికానికి కూడా దొరడు .
20-‘’గృహ్ణాతి పురుషం యస్మాత్ గృహం తేన ప్రకీర్తితం .-క్వ సుఖం బంధనా గారే తేన భీతో స్మ్యహం పితః ‘’
గృహమంటే పురుషున్ని కట్టి బంధించేది .అదొక చెరసాల .అందులో సుఖం ఎక్కడ తండ్రీ .అంతా భయమే .శుకుడు వ్యాసుడితో
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-25-ఉయ్యూరు —

