శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -3
ప్రథమ స్కంధం
21-‘’కదా చిన్న సుఖీ శీతే ధనవానపి లోలుపః -నిర్ధనస్తు కధం తాత సుఖం ప్రాప్నోతి మానవః ‘’
బ్రహ్మా విష్ణు మహేశ్వరులు సుఖ పడుతున్నారనుకోన్నావా ?ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సు చేసుకొంటూనే ఉంటారు మనశ్శాంతికోసం .ఇంతతిధనవంతులే సుఖ నిద్రకు నోచుకోకపోతే డబ్బు లేని మామూలు మనుషుల సంగతి చెప్పాలా ?శుకుడు తండ్రి వ్యాసుడితో
22-‘’ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వాప్యధా శుభం -ఉద్యమస్తద్వాశే నిత్యం కారయత్యేవ సర్వధా ‘’
విధి వంచితుడికి ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా ?మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి .
23-‘’పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్తాశ్రమే వసేత్ -తపసా షడ్రిపూన్ జిత్వా భార్యా౦ పుత్రే నివేశ్యచ ‘’
శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్యం తో తురీయశ్రమం లో ప్రవేశించాలి విరక్తుదికే సన్యాసం తీసుకొనే అర్హతున్నది .ఇంకేవ్వరికీలేదు మరో దారీ లేడు ఇదీ వేదవాక్యం .జనకుడు శుకమహర్శితో
24-‘’ఇంద్రియాణి బలిష్టాని న నియుక్తాని మానద -అపక్వస్య ప్రకుర్వంతి వికారా౦ స్తా ననేకశః
ఇంద్రియాలు బలీనమైనవి .అవి అంతనత మాత్రాన మన ఆజ్ఞలకు లొంగవు .పరిపక్వ స్తితికి చేరుకొని అపరినుతలను మరీ ఆట పట్టిస్తాయి .రకరకాల వికారాలు సృష్టిస్తాయి .జనకుడు శుకుడితో
25-‘’ఊర్ధ్వం సుప్తః పతత్యేవ న శయానః పతత్యదా -పరివ్రాజ్య పరి భ్రష్టోన మార్గం లభతే పునః ‘’
పైకి ఎక్కి పడుకున్నవాడు కింద పడక తప్పదు .నెల మీద పడుకున్నవాడికి బెంగ లేదు.సన్యసించి భ్రష్టుడైటీ వాడికి దిక్కూ దివాణం ఉండదు .
26-‘’అంతర్గతం తమశ్చేత్తు౦ శాస్త్రోద్బోధీ హి నమ క్షమః -యధా నశ్యతి తమః కృతయా దీప వార్తయా ‘’
అంతర్గతమైన చీకటి పోగొట్టటానికి శాస్త్ర బోధకుడు సరిపోడు . దీపం వెలిగించాకుండా దీపం దీపం అంటూ జపం చేస్తే చీకట్లు పోవు .శాస్త్ర విజ్ఞానం ఆచరణ లోకి రావాలి .మోహ విభ్రాంతి పొతే ఆచరణ లోకి వచ్చినట్లు లెక్క .శుకుడు జనకుడితో .
27-‘’విముక్తస్తూ భవేద్రాజన్ సమ లోష్టాశ్మకాంచనః-ఏకాత్మ బుద్ధి స్సర్వత్ర హితకృత్సర్వ జంతుషు ‘’
పూలదండ నాగుబాము పట్ల సమదృష్టి ఉన్న వాడు ఎక్కడున్నాడు ?మట్టినీ బంగారాన్నీ ఒకేలా భావిస్తూ సర్వత్రా ఏక బుద్ధి కలిగి ,సర్వ ప్రాణి కోటికీ హితం చేస్తున్నవాడే కదా ముక్తుడు .శుకుడు జనకుడితో .
28-‘’విద్యాధారో యధా మూర్ఖో జన్మాన్ధస్తు దివాకరః -లక్ష్మీధరో దరిద్రశ్చ నామ తేషాం నిరర్ధకం ‘’
మూర్కుడిని విద్యాధరుడు అనటం ,పుట్టు గుడ్డిని దివాకరుడు అనటం ,దరిద్రుడిని లక్ష్మీ ధరుడు అనటం పేరుకే కాని కర్మాచరణకు కాదు .మిమ్మల్ని విదేహులు అనటం కూడా అలాంటిదే మహారాజా జనకా .
29-‘’ దేహోయం మమ బంధోయం , న మమేతిచ ముక్తతా -తధా ధనం గృహం రాజ్యం న మమేతి నిశ్చయః ‘’
శుకమహర్షీ !ఈ దేహం నాది కాదు .ఏ బంధం నాది కాదు ఆని గ్రహించటమే ముక్తత్వం అంటే.అలాగే ఈ రాజ్యం ఈధనం ,ఈ గృహం నాది కావు
30-‘’వినా తపంహి చ్ఛాయయా జ్ఞాయతే చ కథం సుఖం ?- అవిద్యయా ఏనా తద్వత్ కధం విద్యాం చ వేత్తి వై ‘’
లోకం లో అవిద్యవల్ల అనేకత్వం కనిపిస్తుంది .జాగ్రత్తగా విద్య అవిద్యలను తెలుసుకోవాలి .ఎండ లేకపోతె నీడ సుఖం తెలియనట్లు అవిద్య లేకపోతె విద్య విలువ తెలియదు .జనకుడు శుక మహర్షి తో.
ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-25-ఉయ్యూరు .

