శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -4
ద్వితీయ స్కంధం
31-‘’పశుధర్మో న మే ప్రీతి౦ జనయిత్యతి దారుణాః-ప్రతీక్షస్వ ముని శ్రేష్ఠ యావద్భావతి యామినీ ‘’
లోకం చూస్తోంది అవతలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు .పశుధర్మందారుణపాప.౦నాకు ఇష్టం లేడు చీకటిపడే వరకు ఆగుదాం .పశువులకు పగలు, మనుషులకు రాత్రి ఆని కదా ఏర్పాటు .యోజన గంధి పరాశరునితో .
32-‘’స్థితా దక్షిణ మూరుం మే సమాశ్లిష్య ఛ భామినీ -అపత్యానాం స్నుషాణా౦ ఛ స్థానం విద్ధి సుచిస్మితే ‘’
అమ్మానేను పరస్త్రీ విముఖుడిని .నువ్వొచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు .అది కొడుకుకాని కూతురుకానీ కూర్చో దగిన స్థానం .సుందరంగి గంగాదేవితో ప్రతీపుడు.
33-’’ ప్రయత్నశ్చోద్యమే కార్యొ యదా సిద్ధిం న యాతి తత్ – తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబ్యయేత్ బుధః ‘’
కార్యం సిద్ధించే వరకు ప్రయత్నించాల్సిందే .సిద్ధి౦చకపోతే దైవం అనుకూలించలేదని మనసును సమాధాన పరచుకోవాలి .34-‘’రక్షణీయః యశః కామం దిగ్ధనం యశసా వినా -సర్వస్వం రఘుణాపూర్వం దత్తం విప్రాయ కీర్తయే ‘’
ధనం కాదు ముఖ్యం .కీర్తి ప్రధానం .పూర్వం హరిశ్చంద్రుడు కర్ణుడూ మనకు ఏమి నేర్పారు ?మంచి వాడు అనిపించుకోకపోతే ఎంతడబ్బు ఉండి ఏం లాభం ?
35-‘’అహింసా పరమో ధర్మః విప్రాణాం నాత్ర సంశయః -దయా కర్తవ్య సర్వత్రా బ్రాహ్మణేన విజానతా-యజ్ఞా దన్యత్ర విప్రేంద్ర న హింసా యాజ్నికీ మతా ‘’
అహింస ఒక్కటే పరమ ధర్మం .విప్రులు విద్యా వివేక సంపన్నులు .సకల జీవరాసులపట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో తప్ప మరెక్కడా హింస పనికి రాదు.
తృతీయ స్కంధం
36-‘’ అవిజ్ఞాయ పరం తత్త్వం కుతః శాన్తిఃపరంతప -వికీర్ణం బహుదా చిత్తం నకుత్ర స్థిరతాంవ్రజేత్ ‘’
ఎన్ని సాధనాలు చేసినా మనసుకు శాంతి లభించదు సందేహాలతో వికీర్నమైన మనసుకు స్థిరత్వం ఎక్కడ దొరుకుతుంది ?వ్యాసుడు జనమేజయునితో .
37-‘’ ఏకమేవాద్వితీయం యద్బ్రహ్మవేదా వదంతి వై-సా కిం త్వం వాప్యాసౌ వా కిం సందేహం వినివర్తయః ‘’
ఎకమేవాద్వితీయం బ్రహ్మ ఆని కదావేదాలు చెప్పేది .అది నువ్వా నీవిభుడైన పరాత్పరుడా ?బ్రహ్మ దేవదేవితో
38-‘’సదైకత్వం న భేదోస్తి సర్వదైవమమాస్య ఛ -యో సౌసా హమహంయో సౌభేదో స్తి మతివిభ్రమాత్ ‘’
నాకూ పురుషుడికి భేదం లేదు. ఎప్పుడూ ఏకత్వమే .అతడే నేను నేనే ఆయన. భేదం మతి విభ్రమం .
39-‘’యదా దీప స్తధోపాదేర్యోగా త్సంజాయతే ద్విధా -ఛాయయే వాడర్శ మధ్యేప్రతిబింబం వా తధావయో ‘’
ఒకటే దీపం ఉపాధి వలన రెండు అయినట్లు ,నీడ అద్దం లో ప్రతి బింబం అయినట్లు మేము ద్వైవీ భావం పొందుతాం. బ్రహ్మతో దెవి .
40-‘’యోహరి స్స శివ సాక్షా ద్యః శివస్స స్వయం హరిః – ఏతయో ర్భేదమాతిష్ట న్నరకాయ భవేన్నరః ‘’
శివుడే విష్ణువు విష్ణువే శివుడు .అలాగే బ్రహ్మ .భేదం ఉన్న వాడు నరకానికి పోతాడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-25-ఉయ్యూరు

