యాభై ఒక్క ముద్దు ముచ్చట్లే బులుసు శ్రీమతి డైరీ
శ్రీ బులుసు కామేశ్వరరావు గారు పట్టు వదలని విక్రమార్కుడిలా 35ఏళ్ల నుంచి మచిలీ బందరు నుండి ‘’ప్రమిద ‘’పత్రిక వీలైనప్పుడల్లా తెస్తున్నారు .ప్రమిద బందరు చీకటినే కాదు మొత్తం ఆంధ్రదేశ చీకట్లనే సాహిత్య వెలుగులద్వారా తొలగిస్తోంది .ఇందులో ఆయన శ్రీమతి శ్రీ వాణి నిర్వహిస్తున్న వ్యంగ్యవ్యాస విన్యాసం ‘’శ్రీమతి డైరీ ‘’బాగా క్లిక్ అయి ఆమెకూ అభిమానులేర్పడ్డారు .ప్రమిద ప్రత్యెక సంచికలూ విశేష ప్రాచుర్యం పొందాయి వీటన్నిటి వెనక కామేశ్వర రావు గారి మెతకతనం మేధావితనం మంచితనం నిండా ఉన్నాయి .ఇవాళ కామూ గారు శ్రీమతి డైరీ ప్రత్యెక సంచిక ఇచ్చి అభిప్రాయం రాయమన్నారు .దీనితో పాటు పురాణం వారి పురాణం విప్పే ప్రత్యెక సంచికా ఇచ్చారు .అది తరువాత విప్పమన్నారు .
షిర్డీ యాత్రలో ఉపాసినీ బాబా ఆశ్రమ దర్శనం ముఖ్యవిషయం షిర్డీ వెళ్లినవారు చూస్తారో లేదో చూడాలనుకొనే వారికి మార్గదర్శనం .అన్నిటా రౌడీలు వెలిశారు లెక్చరర్ గారూ రౌడీ అయితే అదో కిక్కబ్బా అనిపించారు .దొంగ చూపుల పెళ్ళి చూపులు ముసిముసిగా ఉన్నాయి బాగా .పెద్దలకి మాత్రమె అన్న సినిమాలు పిల్లలు చూడకుండా చూదండ్రాబాబూఅని నెత్తీ నోరు కొట్టుకున్నారు .’’గ్యాస్ పై గాసుబాగానే కొట్టారు .చదువులలోని సారం గ్రహించక పొతే ఆ చదువు శుద్ధ వేస్టూ వాడొక పెద్ద ఘోస్టు .
బేర్ మని పించిన షేర్ మార్కటీర్ల అంటే ‘’షేర్షా’’ ల కహానీ బాగుంది .లక్కీ డ్రా,బంపరాఫర్ల పరాకాష్టకేక్కిన పిచ్చి వదల్చుకోకుంటే నెత్తిన చేతులే .అయ్యప్పలు సంవత్సరమంతా అంతే దీక్షతో ఉంటే కొంపలు శబరీ శిఖరాలౌతాయని భావించారు .బడ్జెట్ ప్రతి ఏడాదీ రాష్ట్ర కేంద్రాల అంకెల గారడి .నాల్గు రోజుల చానెల్ పేపర్లం చిట్ చాట్ లే తప్ప బడ్జెట్ పద్మనాభాలు ఎవరూ లోకం లో కనిపించరు .రిలయెన్స్ లోనో డీ మార్ట్ లోనో సేల్ పెడితే పండగే పండగ .తిరుపతి బాలాజీ వరాహస్వామి భూమిని నొక్కేసిన కబ్జాదార్ .బహుపరాక్ అన్నారు .మనదేశంలో తక్కువైనా అమెరిఆలో శునకం స్టేటస్ సింబల్ .ఉపనయనానికి ‘’జ౦దెప్పెళ్లి ‘’ఆని భలే కాయినేజ్ చేశారు . నీరద్ చౌదరి స్వీయ చరిత్ర ఆడరణీయమన్నారు .బుర్ర గొరిగించుకొనే ‘’గుండు శ్రీలు ‘’ఒకప్పుడు ఎక్కువ. ఇప్పుడు టైం లేక పుట్టపర్తి బాబా లా జుట్టు పెంచే మొగాళ్ళు, రివర్స్ గ కత్తిరించుకొనే లేడీస్ బయల్దేరరని షేవింగ్ బాగా చేశారు .
స౦సార జీవితంలో విలన్లు ‘’మదరిల్లాస్ ‘’అయ్యారు .సెప్టెంబర్ లో మహా మహులు పుట్టి ,దాన్ని గ్రేట్ చేసి గ్రీట్ చేశారు .పూర్వం సమ్మర్ సెలవలు అంటే మహదానందం .ఇప్పుడు సమ్మర్ కాంప్ లు ,ఇన్సెంటివ్ కోచింగులు తో బుర్ర వేడేక్కిస్తూ కళ్ళజోళ్ళు చేతికోచ్చేట్లు చేస్తున్నారని సెటైర్ పేల్చారు .హింస రచన ధ్వంస రచన ఆని గడ్డిపెట్టారు .కేంద్రం ఇచ్చే పురస్కారాలగురించి రాసిన ‘’పద్మపురాణం ‘’యదార్ధం ,జరుగుతున్న దానికి నిదర్శనం .పద్మా అంటే వద్దుస్మా అనిపిస్తున్నాయి .పుష్కర బాత్ వాంగీ బాత్ లా ఉప్మాబాత్ గా రుచికరంగా ఉంది .చునావ్ కబర్ ఇప్పుడు బీహార్ SIR ను గుర్తుకు తెస్తోంది .తెరదేవుళ్ళు రాచకీయ కొత్త దేవుళ్ళ అవతారం ఎత్తుతున్నారు జాగ్రత్త ఆని హెచ్చరించారు .నూతనప్రసాద్ ఎత్తిన ;;కొత్తా దేవుదండీ ‘’గుర్తుకు తెచ్చారు .వందోవంద చేసిన సచిన్ కు కూడోలు అందించారు .సీరియళ్ళు చీరియళ్ళు గా మారడం బాధాకరం .స్థిత ప్రజ్ఞుడుకూడా చింతా క్రా౦తు డై కొంపలో పడి ఉంటున్నాడు .నాగరక ప్రపంచం ప్రస్తుతం పీటర్స్ ప్రిన్సిపుల్ ఇంఫ్ల్యుయెంస్ లో ఉన్నదట.ఆధార్ బేజార్ అయినా అలసత్వం వహిస్తే ప్రభుత్వ తాయిలాలు దక్కవని చెప్పారు .అర్ధరాత్రి ఆడది నిర్భయంగా ఇంకా తిరగ లేకపోతో౦దని నిర్భయ భారత్ చెబుతోంది సిగ్గు చేటు .లేటు వీరులు రాజస్థాన్ అసెంబ్లీలో నిర్లజ్జగా హాయిగా పెనాల్టి కట్టి నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అంటూ ఫోజులిచ్చారట .యువకులు క్షణికమైన వ్యామోహాలకు బలికాకుండా కార్యోన్ముఖులు కావాలని ముద్దు ముద్దుగా చివరగా చెప్పారు .
ఈరచనలో సామాజిక విశ్లేషణ ,బాధ్యతా ,బాధ్యతా రాహిత్యం పై కొరడా ,వ్యక్తిత్వానికి వీరపూజ ,ఆడంబరాలకు మంగళ మహాశ్రీలు ,నూతనత్వానికి ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి వ్యంగ్యం మాటలలో పైకి భావం లో అంతర్వాహినిగా ప్రవహించింది .బందరు రచయితలు రావూరు మొదలైన వారి ధోరణి వారసత్వం .కామేశ్వరరావు గారి మేనమామ పురాణం సుబ్రహ్మణ్యంగారి ‘’ఇల్లాలి ముచ్చట్లు ‘’కాముగారి సతీమణికి ప్రేరణ .ప్రమిదను మరింత వెలిగించింది ఈమెయే .ఆమె నుంచి మరిన్ని రచనలు కోరుతున్నాను .హాస్యం తక్కువైన ఈకాలం లో ఇది ఎడారిలో ఒయాసిస్సు .
గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-25-ఉయ్యూరు .
వీక్షకులు
- 1,119,906 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
