117వ నూతన మూలక౦ ‘’టేన్నేస్సిన్ ‘’ ఆవిష్కరించిన శాస్త్రవేత్త డా.శ్రీ ఆకునూరి వెంకట రామయ్య
గారు నిన్న 16-10-25-గురువారం ఉదయం అమెరికాలో టేన్నేస్సి రాష్ట్రం నాష్ విల్ లో స్వగృహం లో మరణించారు .వారి ఆత్మకు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను –
డా .రామయ్య గారి గురించి వివరాలు –
జననం విద్యాభ్యాసం
15-8-1938 న శ్రీ ఆకునూరి వెంకటరావు శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.వీరిది ఉయ్యూరు దగ్గర ఆకునూరు .తాతగారు వెంకట రామయ్య గారు ఆకునూరు నుంచి గోదావరిజిల్లా కొవ్వూరు లోని ఆకునూరి వారికి దత్తత వెళ్లారు .గ్రామకరణాలు .తండ్రి బెజవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు డా.రామయ్యగారు సివి ఆర్ హైస్కూల్ లో చదివి 1950 లో ఎస్ ఎస్ ఎల్సి పాసై ,ఎస్ ఆర్ ఆర కాలేజిలో ఇంటర్ పాసై ,విశాఖ ఆంధ్రా యూని వర్సిటిలో 1957లో బీస్ సి ఆనర్స్ ,1958లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం ఎస్సి ఫస్ట్ క్లాస్ సెకండ్ రాంక్ లో పాసయ్యారు .
అమెరికాలో ఉద్యోగం
అప్పటి న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డా .స్వామి జ్ఞానానంద సలహా రికమండేషన్ తో అమెరికా వెళ్లి ఇండియానా యూని వర్సిటిలో న్యూక్లియర్ స్ట్రక్చర్ అంటే అణునిర్మాణం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందారు.1964వాండర్ బిల్ట్ యూని వర్సిటిలో హామిల్టన్ తోకలిసి పరిశోధనలు చేశారు .రాజమండ్రికి చెందిన శ్రీమతి కృష్ణమయి ని వివాహమాడి ఒకమ్మాయి అబ్బాయిఅలకు జన్మ నిచ్చారు .రిసెర్చ్ అసోసియేట్ గా ,ప్రొఫెసర్ గా విజిటింగ్ ప్రొఫెసర్ గా 198౦నుంచి నేటి వరకు వాండర్ బిల్ట్ యూనివర్సిటి ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు .
రచనలు
రామయ్యగారి రచనలు ప్రపంచ వ్యాప్తంగా 4వేల లైబ్రరీలలో స్థానం పొందాయి .జర్నల్ పబ్లికేషన్స్ వందల సంఖ్యలో ఉన్నాయి పరిశోధకులకు కల్ప వృక్షం గా ‘’కర్రిక్యులం విటే’’(సి..వి .)రాశారు .
పొందిన గౌరవాలు
రామయ్యగారు ఉంటున్న టేన్నేస్సి రాష్ట్ర ఆరుగురు ప్రముఖులలో రామయ్య గారు ఒకరు .అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఫెలో .సిగ్మ ఎక్స్ రె ప్రెసిడెంట్ .రుమేనియా బుఖారెస్ట్ యూని వర్సిటీలనుంచి ‘’అనోరియా ‘’పొందారు .వాండర్ బిల్ట్ యూని వర్సిటి ఉత్తమ భౌతిక శాస్త్ర బోధనా పురస్కారం అందించింది .ఈస్టర్న్ కెంటకి యూని వర్సిటి ,గురుఘాసీ యూని వర్సిటీలు గౌరవ డి ఎస్ సి అందించాయి .గె అండ్ రెబెక్కా సంస్థ ఫిజిక్స్ లోఎక్సేలేంట్ టీచింగ్ కు ఫాల్మన్ అవార్డ్ ప్రదానం చేసింది .
రామయ్య గారి ప్రత్యేకత
భారతదేశం లో ఏ ఒక్క సైంటిస్ట్ కూడా పీరియాడికల్ టేబుల్ లో ఒక్క మూలకం ఎలిమెంట్ ను కూడా కనుక్కోలేదు. అలాంటిది మన ఆంధ్రుడైన ఈ సైంటిస్ట్ 117వ మూలకం టేన్నేస్సిన్ (Ts)కనిపెట్టి జగద్విఖ్యాతిపొందారు .ఆయన గురించి ఆంధ్రులకు ,మన దేశానికీ పెద్దగా తెలియదు ఎవరు గుర్తించి నట్లు కనబడదు .వారిపై నేను కరదీపిక లాంటి పుస్తకం రాయటంనా అదృష్టం .అంతకుముందు మా ఉయ్యూరు శాస్త్రవేత్త రష్యాలో స్థిరపడ్డ కేమటాలజి పిత డా కోలాచల సీతారామయ్య గారి గురించి , 117వమూలకం ‘టేన్నిస్సిన్ ‘’ఆవిష్కరించిన డా.ఆకునూరి వెంకట రామయ్య గారి గురించి ,ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత గుంటూరు లో జన్మించి అమెరికాలో స్థిరపడిన డా.పుచ్చ వెంకటేశ్వర్లు గారి గురించి పుస్తకాలు రాసి సరసభారతి ద్వారా ప్రచురించటం నా సుకృతం .పుచ్చా వారి పుస్తకాన్ని డా రామయ్య గారికి అ౦కితమిచ్చాం .
రామయ్య గారి పుస్తకం మూడు చోట్ల ఒకే వ్యక్తితో ఆవిష్కరణ
డా.రామయ్య గారి పుస్తకం అమెరికా లో టేన్నేస్సి రాష్ట్రం నాష్ విల్ లో రామయ్య గారి స్వగృహం లో సరసభారతి అభిమాని స్పాన్సర్ శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి ద౦పతుల ఆధ్వర్యంలో 16-10-1918 ,న,మొదటిసారి ,అలబామా రాష్ట్రం మైనేని వారి హ౦ట్స్ విల్ దగ్గరలోని మాడిసన్ లోన్17-10-1918న రెండవసారి , మూడవ సారి ఉయ్యూరులో సరసభారతి శ్రీ వికారి సంవత్సర ఉగాది వేడుకలలో 30-3-1919 న రామయ్య గారి బంధు మిత్రుల సమక్షం లో శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి రికార్డ్ సృష్టించారు .
రామయ్య గారిపై పుస్తకం రాయటం ప్రారంభించిన దగ్గరనుండి రామయ్య కృష్ణమయి దంపతులతో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఆతర్వాత నుంచి తరచుగా మా మధ్య ఫోన్ సంభాషణ జరుగుతూనే ఉంది.కృష్ణమయి గారు సరసభారతి బ్లాగ్ ఫాలోయర్ .సరసభారతి ఫేస్ బుక్ లైవ్ ప్రోగ్రాం వ్యూయర్ కూడా.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-25-ఉయ్యూరు
రామయ్య గారి పరిశోధనా విశేషాలు
శ్రీ ఆకునూరి రామయ్య ,20 మంది బృందం కలిసి 2010 లో పీరియాడిక్ టేబుల్ లో 11 7 వ మూలకం కనిపెట్టారు .ఇటీవలే దానికి ‘’టేన్నేస్సిన్ ‘’అని నామకరణం చేశారు .దీని సింబల్ ‘’Ts’’.ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ రామయ్యగారు వాండర్ బిల్ట్ యూనివర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఈ ఆవిష్కరణకు ఆయనను, ఆయన తోపాటు పనిచేసిన జోసెఫ్ హామిల్టన్ నూ టెన్నెస్సీ కాంగ్రెస్ మన్ జిమ్ కూపర్ ఈ మధ్యనే ఘనంగా సత్కరించారు .వారు పని చేస్తున్న యూనివర్సిటి టెన్నెస్సీ రాష్ట్రం లో ఉన్నందున అ మూలకానికి ఆ రాష్ట్ర గౌరవార్ధం ‘’టేన్నేస్సిన్ ‘’అని పేరు పెట్టి తమకూ, తమ రాష్ట్రానికి ఘనకీర్తి నార్జి౦చి పెట్టారు .
ఆంద్ర విశ్వ విద్యాలయం లో చదివి బాచిలర్, మాస్టర్ డిగ్రీలు పొంది శ్రీ ఆకునూరి రామయ్య,అమెరికా వెళ్లి ఇండియానా యూని వర్సిటి లో 1960 లో పి. హెచ్ .డి. సాధించారు .అతిభార మూలకాల ఉనికిపై అత్యంత ఆసక్తి కల ఆయన నిరంతర పరిశోధనల ఫలితమే తాను ఈ ఘన విజయాన్ని సాధించగలిగానని చెప్పారు .ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరి ,రష్యాలోని ఫియర్రోవ్ లాబరేటరి ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ,కాలి ఫోర్నియాలోని లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లాబరేటరి ,నాక్స్ విల్ లోని యూని వర్సిటి ఆఫ్ టెన్నెస్సీ కి చెందిన రామయ్య ,హామిల్టన్ ,20 మంది రిసేర్చర్స్ కలిసి సాధించిన అతి నూతన మూలకం ఆవిష్కరణ ఇది .ఈ పరిశోధన ఎక్కువ భాగం రష్యాలో సాగిందని కారణం అక్కడ సైక్లోట్రాన్,రీకాయిల్ మాస్ సర్క్యులేటర్ లు ఉండటమేనని రామయ్య చెప్పారు .ఒకటిన్నర సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనాఫలితం ఇది అన్నారు .
ఈ ఏడాది జులై లో ‘’టేన్నేస్సిన్ ‘’ గా నామకరణం పొందిన ఈ కొత్త మూలకం జీవితకాలం 100 మిల్లి సెకన్లు .రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఉన్న ఈ కొత్తమూలకాన్ని ‘’హై ఎక్సైటేడ్ స్టేట్ ‘’లోఅంటే అత్యధిక ఉత్తేజిత స్థితి లో తయారు చేశామని రామయ్య ఉవాచ .ఈ ఆవిష్కరణ 2000 సంవత్సరం లో సూపర్ హెవీ ఎలిమెంట్ ఉండవచ్చు ,దాన్ని కనుగొనవచ్చు అనే ముందస్తు ఊహ అంటే ప్రేడిక్షన్ తో ప్రారంభమైంది .కాని రామయ్యగారి బృందం ఇటీవలి సంవత్సరాలలోనే దీనిపై పరిశోధించి సాధించారు .’’వర్క్ ఎథిక్’’అయిన తన భర్తకు ఇది అసాధ్యమేమీకాదని రామయ్యగారి భార్య అన్నారు .తమ 51 ఏళ్ళ వైవాహిక జీవితం లో రామయ్యగారిని ఎప్పుడూ సీరియస్ సైంటిస్ట్ గానే చూశానని భార్య శ్రీమతి కృష్ణ తెలియ జేశారు .రామయ్యగారు తెల్లవారుజామున 2 గంటలకే లేచి లాబరేటరికి వెడతారని ,పరిశోధనలకోసం ప్రపంచమంతా పర్యటిస్తారని ముఖ్యంగా జర్మనికి చాలా సార్లు వెళ్ళారని ,19 82 లో స్ప్రింగ్ సెమిస్టర్ అంతా అక్కడే గడిపారని గుర్తు చేసుకున్నారామే .తమ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కనుక తానిప్పుడు భర్తతో రిసెర్చ్ ట్రిప్ లకు వెడుతున్నానన్నారు.ఈ ట్రిప్ లలో అనేక దేశాలు చూసే వీలు కలుగుతోందని తనకు చాలా ఉత్తేజంగా ఉంటున్నాయని రామయ్యగారు పని అంటే తీవ్రమైన భావావేశం, అభిరుచి ఉన్నవారని అంటారు .
తమ ప్రాంతం లో సమావేశాలు జరిగినపుడు వచ్చేవారికి ఆతిధ్యం ఇవ్వటం తమ దంపతులకు ఎంతో ఇష్టంగా ఉంటుందని ,అలాగే ఇతర దేశాలలోనూ తమకు ఆత్మీయ ఆతిధ్యం లభిస్తుందని చెప్పారు పాక్షిక రిటైర్మెంట్ లో ఉన్న 76 ఏళ్ళ ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ ను , వా౦డర్ బిల్ట్ సహచరుడు హామిల్టన్ నూ కలిపి ఈ యునివర్సిటి నూతన మూలకా ఆవిష్కకరణకు గాను ఆగస్ట్ లో జిమ్ కూపర్ ,డి .టేన్న్ లచేత ఘనంగా సత్కరి౦పజేసింది .దీనితోపాటు ఇండియన్ అమెరికన్ సంఘమూ గుర్తించి సన్మా నించింది .ఇటీవలే ‘’ఇండియా దినోత్సవం ‘’నాడు నాష్ విల్ ఇండియన్ అసోసియేషన్ కూడా సత్కారం చేసింది . . ఆసందర్భంగా ఐ. .ఎ .యెన్ .ప్రెసిడెంట్ హెటేల్ మెహతా’’మాసమక్షం లో ఇంతగొప్ప సైంటిస్ట్ ఉన్నందుకు మేము అదృష్టవంతులం .ఇక్కడి భారతీయ సంతతి కి గర్వకారణం డా రామయ్య గారు .అతి సాధారణ౦ గా ,నిరాడంబర౦తో మూర్తీభవించిన వినయ సౌజన్య సద్గుణ మూర్తి మత్వం తో అందరి హృదయాలను ఆకర్షిస్తారు ,గెలుస్తారు ,స్పర్శిస్తారు ‘’అని శ్లాఘించారు . ఇండియన్ కమ్యూనిటి సీనియర్ సపోర్ట్ సర్వీసెస్ సంస్థ కూడా రామయ్యగారి కృషికి అభినందన సత్కారం చేసింది .ఐ .సి .ఎస్ .ఎస్ .ఎస్ .సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రమోద్ వాసుదేవ్ ‘’వృత్తిలో నిబద్ధత రామయ్యగారి సుగుణం .వృత్తికి ఎంతటి న్యాయం చేస్తారో మిగిలిన విషయాలలోనూ అలాగే ఉంటారు .పదేళ్ళ క్రితం తండ్రిగారు మరణిస్తే, కుటుంబ బాధ్యత తీసుకొని తమ్ముళ్ళ అభి వృద్ధికి కృషి చేశారు .తమ మనోభావాలకు తగిన అతి సాధారణ జీవితం గడుపుతూ ,వృత్తికీ, కుటుంబానికి అంకిత భావం తో సేవలందిస్తున్న సత్పురుషులు డా రామయ్య ‘’అని మెచ్చుకున్నారు . తాము ఆవిష్కరించిన కొత్తమూలకం టేన్నేస్సిన్ అత్యంత అస్థిర మూలకం అయినందున ,పీరియాడిక్ టేబుల్ లో స్థిర అటామిక్ నంబర్ ఉన్న హీలియం ,ఆక్సిజన్ లాంటి మూలకాన్ని ఆవిష్కరించే ప్రయత్నం లో ఉన్న నిర౦తర ప్రయోగ, పరిశోధన శీలి రామయ్యగారు .’’ఎంతకాలం లో కనుక్కోగలుగుతారు ‘’అని ప్రశ్నిస్తే , ‘’మరి కొన్నేళ్ళ లోనే ‘’అని ఆశావహం గా బదులిచ్చారు .’’ఇలాంటి ఆవిష్కరణలకు నిర్దేశ కాలపరిమితి అంటూ ఉండదు .నేనూ నా బృందం 120 వ మూలకం తయారు చేసే ప్రయత్నం లో ఉన్నాం’.దీనికీ టైం టేబుల్ లేదు .ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ‘’అన్నారు చిరునవ్వుతో.తాను ఇప్పుడు కొందరు గ్రాడ్యుయేట్ విద్యార్ధులతో కలిసి పని చేస్తున్నానని కానీ 2018 స్ప్రింగ్ సెమిస్టర్ తర్వాత పూర్తిగా రిటైరౌతానని తన మనో నిశ్చయాన్ని నిస్సంకోచంగా తెలిపారు .మన దేశం రామయ్యగారు విదేశాలలో అద్భుతాలు సాదిస్తున్నదుకు గర్వపడదాం .వారు త్వరలో కొత్తగా ఆవిష్కరించ బోయే మూలకం కోసం ఎదురు చూస్తూ స్వాగ తీద్దాం .
‘’ డా. రామయ్య గారి పైరాసిన పుస్తకం ఇంగ్లీష్ అనువాదం-శుభవార్త
–సాహితీ బంధువులకు శుభకామనలు – ప్రముఖ అణుశాస్త్ర వేత్త ,117 వ మూలకం టెన్నిస్సిన్ ను ఆవిష్కరించిన ఆంద్ర శాస్త్రజ్ఞులు డా ఆకునూరి వెంకటరామయ్య గారి జీవితం పై నేను రాసిన పుస్తకం సరసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారు స్పాన్సర్ చేసి సరసభారతి ద్వారా ప్రచురించటం ,ఆపుస్తకం అమెరికాలో రెండుసార్లు ,ఉయ్యూరులో రామయ్యగారి బంధు మిత్రుల సమక్షం లో సరసభారతి ఉగాది వేడుకలలో మూడవ సారి , మన శాసనమండలి సభ్యులు శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన సంగతి మీకు తెలిసిన విషయమే .
డా రామయ్య గారి పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించామని ,దాన్ని రామయ్య గారు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా 5గంటలు నిశితంగా పరిశీలించి సవరించి ఆమోదించగా హై క్వాలిటీ లో ప్రింటింగ్ కు హైదరాబాద్ లో ఇచ్చినట్లు ,పది రోజులలో పుస్తకాలు రెడీ అవుతాయని మైనేనిగారు సెప్టెంబర్ 25 న నాకు మెయిల్ రాశారననే శుభ వార్త మీకు తెలియ జేయటానికి సంతోషంగా ఉంది-దుర్గాప్రసాద్ -2-10-20
అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని 15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని డా రామయ్యగారి స్వగృహం లో మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు . శాస్త్రవేత్తశ్రీ వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్ శ్రీమైనేని గోపాలకృష్ణ శ్రీమతి భ్రమరాంబ గారు పాల్గొన్నారు -దుర్గా ప్రసాద్
అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ
సరస భారతి సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు –
నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా ద్రోణవల్లి రామమోహన రావు గార్ల నేతృత్వం లో ప్రచురింపబడిన
”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో టెన్నెస్సీ రాష్ట్రం ” నాష్ విల్ ”లో డా రామయ్యగారి స్వగృహం లో 15-10-18 సోమవారం సాయంత్రం
ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాలేంద్ర ప్రసాద్ గారిచే శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీ కాకాని బాబూరావు శ్రీమతి యలమంచిలి భ్రమరాంబ మొదలైన ఆత్మీయ అతిధులు ,బంధుమిత్రుల సమక్షం లో ఆవిష్కరింపబడుతుంది .
16-10-18 మంగళవారం ఉదయం అలబామా రాష్ట్రం లోని శ్రీ మైనేని గారుండే ” హంట్స్ విల్” దగ్గరున్న” మాడిసన్ కౌంటి” ”లో కూడా ”మీట్ అండ్ గ్రీట్ ”సమావేశం లో డా రామయ్య గారి పుస్తకాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తారు . .
ఇలా సరసభారతి పుస్తకం అమెరికాలో ఒక రోజు తేడాతో రెండు చోట్ల ఒకే గౌరవ వ్యక్తిచేత ఆవిష్కరింపబడటం విశేషం . సరసభారతి దక్కిన అరుదైన గౌరవం .
ఈ రెండు కార్యక్రమాలు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సంపూర్ణ సౌజన్య ,సహాయ, సహకారాలతో జరగటం విశేషం . శ్రీమైనేని గారి సహృదయత కు నిదర్శనం సరసభారతికి శ్రీమైనేని గారు అందిస్తున్న సంపూర్ణ సహకారానికి కృతజ్ఞతలతో నమోవాకములు .
డా రామయ్య గారి కీ ,సతీమణి శ్రీమతి కృష్ణమయి కుటుంబ సభ్యుల సహకారానికీ నమస్సులు .
డా రామయ్య గారి పుస్తకం ఈ డిసెంబర్ చివరి వారం లో ఉయ్యూరులో డా రామయ్య గారి కుటుంబ సభ్యుల సమక్షం లో కూడా ఆవిష్కరింపబడుతుంది అని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది
శ్రీ విళంబి ఉగాదికి ఒక వారం ముందు ఉయ్యూరు లోను ,ఉగాది నాడు అమెరికాలోని షార్లెట్ లోను నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ‘షార్లెట్ సాహితీ మైత్రీ బంధం”పుస్తకం రెండు చోట్లా ఆవిష్కరింపబడిందన్న సంగతి గుర్తు ఉండే ఉంటుంది -దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-18 -ఉయ్యూరు

