శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -7

  శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -7

61-‘’యదాయదాహి దేవానాం కార్యం స్యాదతి దుర్ఘటం -స్మర్తవ్యాహం తదా నాశయిష్యామి చాపదం ‘’

దేవతలకోసం యేపనినా చేస్తాను  .ఎప్పుడు అవసరం ఆని పిస్తే నన్ను స్మరిస్తే ,వెంటనే వచ్చి ఆపదలు తొలగిస్తాను . దెవి దేవతలతో.

62-‘’బలవంతో మహాభాగా బహుజ్ఞాధనసంయుతాః-కాలే దుఖం తధా దైన్యమాప్నువంతినరాధిప ‘’

అసురులు బలవంతులు ,ధనవంతులు జ్ఞాన వంతులు .కానీ ఇవాళ కాలమహిమ వలన దైన్యం అనుభవిస్తున్నారు .

63-‘’కేవలం దైవ మాశ్రిత్య న స్తాతవ్యం కదాచన -ఉపాయః సార్వథా కార్యఃవిచార్య స్వధియా పునః ‘’

దైవాన్ని నమ్మి ఊరుకో రాదు .స్వబుద్ధితో ఉపాయమూ ఆలోచించాలి .

64-‘’జ్ఞాత్వా సమాగతాస్మ్రత్ర ద్రష్టుకామామహాసురం -రత్నం కనక మాయాతిస్వశోభాధిక వృద్ధయే ‘’

నా అంతట నేనే వచ్చాను .రావద్దూ.రత్నం తన శోభ పెంచుకోవటానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుది కదా .అంబిక శు౦భుని మంత్రి సుగ్రీవుడితో .

65-‘’యయాసౌ ప్రేరితః శంభుర్దూతత్వే దానవాన్ ప్రతి-శివ దూతి విఖ్యాతా జాతా త్రిభువనేఖిలే ‘’

మిమ్మల్ని అందర్ని చంపేస్తాను ఆని మీకు హితబోధ చేసి రమ్మని నన్ను దూతగా పంపింది శ్రీదేవి .అప్పటినుంచి అబికాదేవికి శివ దూతి అనే పేరు స్థిరపడింది .

66-‘’భవంతిమానవా భూమౌ బహవః స్వార్ధ తత్పరాః-పరార్ధ సాధనే దక్షాఃకేచిత్ క్వాపి భావాద్రుశాః ‘’

భూలోకంస్వార్ధ పరాయణులు ఎక్కువ.పరోపకారం మహోపదేశం చేసే నీ వంటి ఉత్తములు కోటికి ఒక్కరుంటారు.సురధుడు సుమేధునితో .

 షష్ఠ స్కంధం

67-‘’ అర్ధకామౌ ప్రశస్తౌద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ – ధర్మం ధర్మేతివాగ్వాదః దంభోయం మహతామపి ‘’

ధర్మం ధర్మ౦ అంటూ మహానుభావులు గొంతు చి౦చు కోవటం దంభమే .ఆచరణలో వాళ్ళు అర్ధకామాలకు లొంగి పోతారు .మాటల మనుషులేకాని ఆచరణ మనుషులుకారువాళ్ళు .ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాక మునులు అనుకోన్నమాట .

68-‘’రుద్ధిక్షయస్తూ పాపేన పు ణ్యేవాతి నిరర్ధకం -తస్మాత్పాపం పరిత్యజ్య  సన్మతిం కురుపార్దివః ‘’

పాపాల వల్ల అభి వృద్ధి నశిస్తుంది పుణ్యాల వల్ల అభి వృద్ధి చెందుతాయి .పాప చి౦తనవదిలి మంచి ఆలోచన చేస్తే అందరికీ క్షేమం .ఋషుల ఉపదేశం నహుషుడికి .

69-‘’పరోపదేశే కుశలాఃప్రభావంతి నరాఃకిల -కర్తాచైవో పదేష్టా ఛ దుర్లభః పురుషోభవేత్’’

ఎవరికైనా నీతులు చెప్పటం తేలికే .ఆచరించి చూపే ఉపదేశికులే అరుదు .నహుషుడు ఋషులతో .

70-‘’యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమాప్నుయాత్ -అవశ్యమేవ  భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ‘’

 ఇంద్రుడే కాదు యే ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవిస్తాడు మంచి కాని చెడుకానికర్మఫలం అనుభవించాల్సిందే .వ్యాసుడు జనమేజయునితో .

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-25-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.