శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -8
71-‘’ఆహార శుధ్యా నృపతేచిత్తా శుద్ధిస్తుజాయతే-శుద్ధే చిత్తే ప్రకాశః స్యాద్ధర్మస్య నృపసత్తమా ‘’
కలియుగం లో స్త్రీలు కామ మోహ లోభాలతో స్వేచ్చగా సంచరిస్తున్నారు .మిధ్యావాదంతో క్లేశాలు కొని తెచ్చుకొంటున్నారు ధర్మాలను వల్లిస్తూ భర్తలనే మోసగిస్తున్నారు వ్యాసుడు జనమేజయునితో.
72-‘’కదాచిత్ ద్రవ్యశుద్ధిః స్యాత్ ,క్రియాశుద్ధిఃకదాచన -దుర్లభా మనసః శుద్ధిఃసర్వేషాం సర్వదా నృప ‘’
ద్రవ్యశుద్ధి క్రియా శుద్ధి ఎలాగో అలాగా సాధించుకోవచ్చు .మనస్శుద్ధిమాత్రం చాలామందికి చాలా సార్లు దుర్లభం .వ్యాసుడు జనమేజయుడితో .
73-‘’యది సాధ్యై వయోగేనక్షాలయత్యా ౦తరం మలం – విశేషేణ తు సత్సంగో జ్ఞాననిష్టస్య భూపతే ‘’
దైవ యోగం వలన సజ్జన సాంగత్యం లభిస్తుంది .అది జ్ఞాని మనస్సును విశేషంగా ప్రక్షాలన చేస్తుంది .జనమేజయునితో వ్యాసర్షి .
74-‘’తథా న నశ్యతి తమః కృతయా దీపవార్తయా -తత్కర్మ యన్నబద్దాయ సా విద్యా యా విముక్తయే ‘’
.దీపం దీపం అంటూ పది సార్లు అరిస్తే చీకటి తొలగిపోదు .బంధనానికి కారణం కానిది ఏదో అధి కర్మ.ముక్తికి కారణమైనది విద్య అంటే జ్ఞానం .జనమేజయునితో వ్యాస.
75-‘’ శివస్యాహం ప్రియః ప్రాణః శంకరస్తు తదామమ -ఉభయోరంతరం నాస్తి మిధస్సంసక్త చెతసొః ‘’
శివుడికి నేను ప్రాణప్రియుడిని .నాకు శివుడు ప్రాణ ప్రియుడు .రూపాలు వేరైనా మా హృదయాలు ఒక్కటే .ఇది తెలుసుకోకుండా శివుడిని నిందిస్తే నరకానికి పోతారు .విష్ణువు లక్ష్మీదేవితో .
76-‘’స్వరమానంతు యోవేదా స దేవో మానుషో పి సన్ -సప్తభేదం న యో వేదా సహ పశు సురరాడపే ‘’
స్వర ప్రమాణాలు తెలిసిన వాడు మానవుడైనా దేవత కిందలేక్కే .సప్తస్వరాలు తెలియని వాడు ఇంద్రుడైనా మానవుదికిందేలెక్క .దమయంతి తల్లితో .
77-‘’సంసారేస్మిన్ మహాభాగమాయాగుణ కృతే నృతే-తను భ్రుత్తుసుఖీ నాస్తి నభూతో న భవిష్యతి’’
ఈ అసత్య సంసారం లో సుఖపడుతున్నాను అన్నప్రాని నాకు ఒక్కరూ కనిపించలేదు .ఇక ముందు కనిపించే అవకాశమూ లేదువ్యాసుడితో నారదుడు .
సప్తమ స్కంధం
78-‘’దుస్సహో యం పుష్పధన్వా విశేషేణ యౌవనే -కులే కళంక స్సుమహా వయా మానవే కృతః ‘’
ఎంతటివాడికైనా యవ్వనం లోమన్మధుడు అతి దుస్సహుడు .శర్యాతి కూతురితో
79-‘’ప్రారబ్ధ కర్మణాభోగాదన్యథాన క్షయో భవేత్ -తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ‘’
అదృష్టం బాగుంటే యే మహానుభావుడో మహర్షి యో ,యే సాదు పు౦గవుడో తటస్థపడి ఏదైనా ఉపకారం చేయవచ్చు .త్రిశంకుడు తనలో తాను.
80-‘’పాపస్యాంతేపునః కార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే -దుర్గాతిస్తు భావేత్పాపాత్ అవాపది న చాపది ‘’
అనుకోకండా పాపం చేసినా ,ఆతర్వాత శుద్ధికోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మం.ఏ ఆపదా లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణం అవుతుంది స్వపచుడు విశ్వామిత్రుని భార్యతో ఆమె దరిద్రాన్ని పిల్లల ఆకలినీ చూసి కుక్కమాంసం తెచ్చి పెట్టినప్పుడు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-25-ఉయ్యూరు . .
