శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -10
శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -10
అష్టమ స్కంధం
91-‘’నైవస్తామయమర్కస్య నొదయః సర్వదాసతః – ఉదయాస్తమవాఖ్యం హిదర్శన౦ రవేః ‘’
నిజానికి దూర్యుడికి ఉదయం అస్తమయం లేవు .దర్శన ఆదర్శాలను బట్టి వీటిని మనమే కల్పించుకోన్నాం ఆయన నిత్యుడు .నారాయణ మహర్షి నారదునితో
92-‘’మేడి స్తంభేయదా యుక్తాఃపశవః కర్షణార్ధకాః -మండలాని చరంతీమే సవనత్రిత యేనచ ‘’
మేదిస్తంభానికి పొడవైన తాడుతో కట్టేయబడిన పశువులు గుంద్రగా తిరిగినట్లుగా ,గ్రహాలన్నీద్రువుడి చుట్టూ తిరుగుతాయి .నారా నారతో .
93-‘’ఆకల్పాంతం ఛ క్రమంతి ఖే శ్యానాద్యాఃఖగా యివ -కర్మ సారధయో వాయు వశగాః సర్వయేవతే ‘’
కాలచక్ర నియోజితాలైన గ్రహాలూ అంతర్బహిర్విభాగం తో ధ్రువుడు కేంద్రంగా ,వాయు ప్రేరితాలై కదుల్తాయి ఇవన్నీ జీవకోటికి కర్మ సారధులు .ఆకాశం లో డేగల్లాగా ఆకల్పాంతం కడుల్తూనే ఉంటాయి . నారాయణ మహర్షి నారడ మహర్షి తో.
94-‘’యస్యార్యాత్ శిరసః కుండలీ భూత వపుషో మునే-పుచ్చాగ్రే కల్పితో యోయం ధ్రువ ఉత్తానపాదజః ‘’
ఈ జ్యోతిశ్చక్రాన్నిశి౦శుమార స్వరూపంగా అనుసందిస్తారు .తలక్రిందులుగా కుండలీ భూత శరీరులై పుచ్చాగ్రం లో ధ్రువుడిని సంభావన చేస్తారు . నారా నారతో
95-‘’అస్య మూల ప్రదేశే హిత్రి౦శత్సాహస్రేకే౦ తరాః-యోజనైఃపరి సంఖ్యాతేతామసీ భగవత్కళా ‘’
పాతాళం లో 30యోజనాలక్రింద మూలప్రదేశం లో ఒకానొక భాగవత్కళఉంటుంది పేరు ‘’అనంత ‘’.సర్వదేవ ప్రపూజిత . నారా నారతో.
నవమస్కంధం
96-‘’ప్రకృష్ట వాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టి వాచకః -సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితాః ‘’
ప్రకృతి పదం లో ప్ర ఉపసర్గ .ప్రకృష్ట వాచకం .కృతి అనే సృష్టి వాచకం .ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనుక దేవిని ప్రకృతి అంటారు. నారా నారతో.
97-‘’గుణేసత్వే ప్రకృష్టేఛ ప్రశాబ్దో వర్తతే శ్రుతః -మధ్యమే రజసి కృశ్చతి శబ్ద స్తమసి స్మృతః ‘’
త్రిగుణాత్మక స్థితికి మూల కారణం ,సృష్టికి ముఖ్యకారణం కనుక ఆదిపరాశక్తి ని ప్రకృతి అంటారు .సృష్టికి మొదట ఉండే దెవి కనుక ప్రకృతి . నారా నారతో.
98-‘’యధాగ్నౌ దాహికా చంద్రే పద్మే శోభా ,ప్రభా రవౌ -శశ్వద్యుక్తా న భిన్నాసా తధా ప్రకృతి రాత్మని ‘’
అగ్నికి వేడి ,చంద్రుడికి వెన్నెల ,పద్మానికి శోభ ,సూర్యుడికి ప్రకాశం ఎలా అవిభాజ్యా,అవిభక్త అభిన్నాలో అలాగే పరమాత్మ-ప్రకృతి అవిభక్తాలు . నారా నారతో.
99-‘’ఐశ్వర్య వచనః శశ్చక్తిః పరాక్రమ ఏవచ -తత్స్వరూపా తయోర్దాత్రీ సా శక్తిఃపరికేర్తితా ‘’
శక్తి పదం లోశ అనేది ఐశ్వర్యానికి ఈశ్వర తత్వానికి , క్తి అనేది పరాక్రమానికి విస్తరణకు స౦కేతం .ఈ రెండుఇచ్చేది ,ఆ రెండిటి స్వరూపమూ కనుక ప్రకృతి – శక్తి అయింది . . నారా నారతో.
100-‘’ స చాత్మా స పరబ్రహ్మ కృష్ణ ఇత్యభి దీయతే -కృషి స్త ద్భక్తి వచనో నశ్చతద్దాప్య వాచకః ‘’
పరబ్రహ్మమే కృష్ణుడు .కృష్ అనేది భక్తి వాచకం . భక్తీ దాస్య ప్రదాత .కనుక కృష్ణుడు .కృష్ సర్వవాచకం . న కారం బీజ వాచకం . సృష్టించేది తానె ,,సృష్టికి బీజమూ తానె .కనుక కృష్ణుడు . నారా నారతో.
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-25-ఉయ్యూరు .

