యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -22
శాకల్యుడు ‘’ఆ పురుషుని విశేషాలు నాకు తెలుసు .నీకు తెలిసిన వివరాలు చెప్పు ‘’అని అడిగాడు .’’శరీరం అనే విశేషణం కలవాడు పురుషుడు .ఇంకేదైనా విశేషణం ఉన్నవాడని నువ్వు భావిస్తే అడుగు ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .’’ఆపురుషునికి దేవత ఎవరు ?’’అమృతం ‘’అంటే తిన్న అన్నం యొక్క రసం .తల్లిలోని రక్తానికి తండ్రిలోని శుక్రానికి ఇదే కారణం .శుక్ల శోణితమైన ఆ రసమే అమృతమే పురుషునికి దేవత .కామమే స్థానం హృదయమే ఆలోచన ,మనసే జ్యోతి అయిన ఆపురుషుని ,దేహే౦ద్రియాది సముదాయాలకు పరాయణుడుగా ఎరిగినవాడే పండితుడు .’’అనగా ఇంకా విశేషాలు చెప్పమని అడిగితె ‘’కామమయుడు .’’అనగా ‘’కామమయుడికి దేవత ఎవరు ?’’స్త్రీ వలననే కామం ప్రకాశమానమౌతు౦దికనుక స్త్రీయే దేవత .రూపమే స్థానం ,నేత్రమే ఆలోకనం ,మనస్సు జ్యోతి అవుతోందో అలాంటి పురుషుని దేహే౦ద్రియాది సముదాయానికి పరాయణుడుగా తెలుసుకొన్నవాడే పండితుడు .అంటే ఆకారాలే నివాసం నేత్రాలచే చూడటం మనస్సు అనే జ్యోతిచే సంకల్ప వికల్పాది పనులు చేస్తున్న పురుషుని దేహే౦ద్రియాదులకు ఆశ్రయం గా ఎరిగినవాడే పండితుడు ‘’అన్నాడు .ఇంకా విశేషాలు చెప్పమని అడిగితె ‘’ఆదిత్యునిలో ఉండేవాడు .’’ దేవత ఎవరు ?’’సత్యం .ఆకాశమే స్థానం .నేత్రమే అలోకనం మనస్సు జ్యోతి అయిన పురుషుని దేహే౦ద్రియాది సముదాయానికి పరాయణుడిగా తెలుసుకొన్నవాడే పండితుడు ‘’అన్నాడు .మరిన్నివిశేషాలు చెప్పమంటే ‘’ఆ పురుషుడు ప్రాతి శుత్కుడు ,శ్రౌత్రుడు అనే విశేషణాలున్నవాడు .అంటే ప్రతిదీ వినేవాడు చెవిలో పుట్టేవాడు అని అర్ధం ‘’దేవత ?’’దిక్కులే .అంధకారమే స్థానం ,హృదయమే లోకం ,మనస్సే జ్యోతి అయిన ఆపురుషుని దేహే౦ద్రియ సముదాయం కు పరాయణుడుగా తెలుసుకొన్నవాడే పండితుడు ‘’’’అదినాకూ తెలుసు .ఇంకా విశేషాలు చెప్పు ‘’అన్నాడు మేనమామ.’’ఆ పురుషుడు ఛాయామయుడు ‘’’అని మేనల్లుడు చెప్పగా ‘’దేవత ‘’?అంటే ‘’మృత్యువు ‘’అన్నాడు .అంటే అజ్ఞానికి మృత్యువే దేవత .ఇవి తెలిసినవాడే వేత్త’’.
మళ్ళీ మళ్ళీ ప్రశ్నోత్తరాలు జరిగాయి వాటి లోని వివరాలు మాత్రమె తెలియజేస్తాను .’’అద్దం లో ప్రతి బి౦బ౦గా ఉండేవాడు .దేవత ప్రాణం .నీరే స్థానం .దేవత వరుణుడు.రేతస్సు స్థానం .పుత్రమయుడే ఆపురుషుడు .ప్రజాపతి దేవత .అంటే తండ్రి ‘’అని అన్నిటికి తగిన సమాదాలు చెప్పి చివరికి యాజ్ఞవల్క్యుడు ‘’శాకల్యా !ఈ బ్రాహ్మణులు నాతో నిన్ను తగలబెట్టించారు ‘’అనగా కోపం తారాస్థాయికి వచ్చి ‘’నువ్వు బ్రహ్మవేత్తవా ?’’అనగా ‘’దేవతలతో ప్రతిష్టితాలతో ఉన్న అన్ని దిక్కులు నాకు తెలుసు ‘’అనగా ఒక్కో దిక్కుకు దేవత గురించి ప్రశ్నించగా ‘’తూర్పుకు ఆదిత్య స్వరూపుడిని ,.ఆయన నేత్రాలలో ఉంటాడు .నేత్రం రూపం లో ఉంటుంది రూపం హృదయం లో ఉంటుంది .దక్షిణ దిక్కుకు యమదేవతా స్వరూపుడను. అతడు యజ్ఞం లో ప్రతిష్టితుడు .యజ్ఞం దక్షిణలో ప్రతిష్టితం .దక్షిణ శ్రద్ధలో ప్రతిష్టితం .శ్రద్ధ హృదయం లో ఉంటుంది .పశ్చిమ దిశకు వరుణ దేవతా స్వరూపుడను .వరుణుడు ఉదకాలలో ఉంటాడు .ఉదకాలు రేతస్సులో ప్రతిష్టితాలు .రేతస్సు హృదయం లో ప్రతిష్టితం .ఉత్తర దిక్కుకు సోమదేవతాస్వరూపుడను. అది దీక్షలో ప్రతిష్టితం. దీక్ష సత్యం లో, సత్యంలో, సత్యం హృదయం లో ప్రతిష్టితం .ధ్రువ దిక్కుకు అగ్ని దేవతా స్వరూపుడను .అగ్ని వాక్కులో వాక్కు హృదయం లో ప్రతిష్టితం ‘’అన్నాడు ‘’హృదయం దేనిలో “? అని అడిగితె ‘’అహల్లికుడా !(అంటే పగటి వేళ ప్రేతత్వం తో లీనమైనవాడా )!హృదయం శరీరం లోకాక ,వేరే చోట ఉంటుందా ?హృదయం శరీరం లోనే ప్రతిష్టితం ‘’అన్నాడు .వాదన కొనసాగింది వివరాలు తర్వాత .
సశేషం
sమీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-3-19-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,401 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
- శ్రీ ఆర్. ఎస్.సుదర్శనం గారినూరు సమీక్షలు.1 వ భాగం.20.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త0.2 వ చివరి భాగం.20.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.6 వ భాగం.20.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.69 వ భాగం.20.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,543)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

