శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -12
111-‘’ వేద ధ్వనిం సాచ కారజాతమాత్రేణ కన్యకా తస్మాత్తం వేదవతీ౦ ప్రవదంతి మనీషిణః ‘’
అ బిడ్ద పుడుతూనే వేదధ్వని చేసింది .సద్యో యవ్వన వతియై పురిటి మంచం నుంచి లేచింది .పుట్టగానే వేదాలు వల్లి౦చి౦ది కనుక వేదవతి ఆని నామకరణం చేశారు .నారదునితో శివుడు .
112 -‘’నిందంతి పితరోదేవా బాన్ధవాః స్త్రీజితం వరం -స్త్రీజితం మనసా మాతాపితా భ్రాతా ఛ నిందతి ‘’
స్త్రీకి దాసుడైన వాడు పరమ నిన్ద్యుడు .మిత్ర పితృ దేవగణాలు అంతా వాడిని నిందిస్తారు .తల్లితండ్రి అన్నదమ్ములు అందరూ అసహ్యిన్చుకొంటారు .దూషిస్తారు .దెవి నారదునితో.
113-‘’శాంతాయ గుణినే చైవ యూనే ఛ విదుషేపి ఛ -సాధనే ఛ సుతాందత్వా దశయజ్న ఫలం లభేత్ ‘’
బాగా వాకబు చేసి ,గుణ వంతుడు సజ్జనుడు ,పండితుడు అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి .అలైచ్చిన కన్యాదాత పడి మహాయజ్ఞాల ఫలితం పొందుతాడు .కృష్ణుడు తులసితో .
114-‘’జనం జనితే న జనతా జనం పాతిజనేనయః -జనం జనేన హరతే తం దేవం భాజ సాంప్రతం ‘’
త్రిమూర్తులకు పైన ఉన్న వాడు తన ఇచ్చప్రకారం తనకు అభిన్నంగా ప్రకృతిని కల్పించి ,సకల విశ్వాలను చరాచరాలను సృష్టించి కాలవశంగా క్రీడిస్తాడు .పరమేశ్వరుడు సర్వదాత సర్వధారి సర్వాత్మ.జనం తో జనాన్ని సృష్టి౦పజేసిజనంతో జనాన్ని రక్షి౦పజేసి,జనం తో జనాన్నిసంహరింప జేస్తాడు .శంఖ చూడుడు భార్య తులసితో .
115-‘’క్రీడాభా౦డమిదం విశ్వం ప్రకృతేఃపరమాత్మనః -యస్మై యత్ర స దదాతి తస్యైశ్వర్యం భావేత్తదా’’
ఈ విశ్వమంతా, ప్రకృతి స్వరూపుడైన పరమాత్మకు క్రీడా భాండం .ఎవరికీ ఎక్కడ యేది ఇవ్వాలనుకొంటే అది ఇస్తాడు .వాడు సకల ఐశ్వర్యవంతుడౌతాడు .శంఖ చూడుడు శివుడితో .
116-‘’దేవ సేవా వినాం సాధ్వి న భవేత్కర్మకృతనం – శుద్ధకర్మ శుద్ధ బీజం నరకశ్చ కుకర్మణా’’
సావిత్రీ ! దేవతలను ఉపాశించకపోతే కర్మ నాశనం కాదు .సత్కర్మలు స్వర్గ సుఖాలకు జీవశుద్ధికీ .దుష్కర్మలు నరక యాతనకు దేహశుద్ధికి హేతువులు .యమధర్మ రాజు .
117-‘’పితుః శత గుణామాతా గౌరవే చేతి నిశ్చితం -మాతుఃశత గుణఃపూజ్యోజ్ఞాన దాతా గురుప్రభోః’’
గౌరవ అర్హతలో తండ్రికంటే తల్లి వంద రెట్లు ఎక్కువ .జ్ఞానదాట గురువు తల్లికంటే వందరెట్లు ఎక్కువ గౌరవ నేయుడు .యముడు సావిత్రితో .
118-‘’ఐశ్వర్యం విపదాం బీజం జ్ఞాన ప్రచ్చన్న కారణం -ముకిమార్గ కుఠారస్య భక్తేశ్చ వ్యవధాయకం ‘’
ఐశ్వర్యం ఆపదలకు మూలం .జ్ఞానాన్ని కప్పేసి ముక్తిమార్గాన్ని ఛేదిస్తుంది .భక్తిని ఆటంకపరుస్తుంది .కనుక ఐశ్వర్యం వద్దు .జ్ఞానం ముద్దు ‘ఇంద్రుడు దుర్వాసమునితో .
119-‘’మహా విపత్తౌ సంసారోయః సమరిన మధు సూదనః -విపత్తౌతస్య సమ్పత్తర్భవేదిత్యాహ శంకరః ‘’
నారాయణుడు విధాతకు విధాత .రక్షకులకు రక్షకుడు .సంహర్తకు సంహర్త.ఆయన్ని స్మరిస్తే ఆపదలు తొలగిపోతాయి .మహా విపట్టులోనైనా మధు సూదనుడిని స్మరిస్తే ఎంతటి విపత్తిలోనైనా సంపత్తి కలుగుతుంది . ఆని శంకరుడే చెప్పాడు .బృహస్పతి ఇంద్రునితో .
120-‘’పరమానంద రూపం ఛ కృష్ణ మార్గ మనశ్వరం -న దర్శయే ద్యస్సతతం కీదృశో బాన్ధవో నృణాం ‘’
పరమానందరూపం అనశ్వరం అయిన శ్రీకృష్ణ భక్తిమార్గాన్ని చూపించలేని వాడు తండ్రీ గురువు బంధువు కానే కాడు.మనసా దేవితో జరత్కారువు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-25-ఉయ్యూరు . —

