శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -13(చివరిభాగం )
దశమ స్కంధం
121-‘’అవిముక్తం న మోక్షవ్యం సర్వధైవ ముముక్శుభిః-కింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసితాం సదా ‘’
కాశీలో నివశించే వారికీ విఘ్నాలు చాలానే వస్తాయి .అయినా ముముక్షువులు అవిముక్తాన్ని అంటే కాశీని విడిచిపెట్టకూడదు .అగస్యుడు భార్య లోపాముద్రతో .
122-‘’ భ్రమరీభి ర్విచిత్రాభి రసంఖ్యా భిస్సమావృతా – భ్రమరైర్గాయమానశ్చ హ్రీంకార మనుమన్వహం ‘’
శ్రీశైల భ్రమరాంబిక గుడిలో అసంఖ్యాక ఆడతుమ్మేదల గుంపు ఆమెను పరివేష్టించి ఉంటుంది .వాటి ఝ౦ కారాలు హ్రీం బీజాక్షరాలుగా నిరంతరం వినిపిస్తాయి .అరుణుడితో బృహస్పతి .
ఏకాదశ స్కంధం
123-‘’ఆత్మైవ న సహాయార్ధం పితామాతా ఛ తిష్టతి -న పుత్రదారా న జ్ఞాతి ర్ధర్మస్తిశ్తటి కేవలం ‘’
జీవికి చివరిదాకా నిలిచే తోడు ధర్మం ఒక్కటే . తలిదండ్రులు భార్యాబిడ్డలు జ్ఞాతిమిత్రులు ఎవ్వరూమిగలరు .నారాయణ మహర్షి నారద మహర్షి తో .
124-‘’పరిత్యజేదర్ధ కామౌ యౌ స్యాతాం ధర్మ వర్జితే -ధర్మ మస్య సుఖోదర్కం లోక విద్విష్టమేవచ ‘’
ధర్మ విరుద్ధమైన అర్ధ కామాలు విసర్జించాలి .అలాగే లోక విరుద్ధ ధర్మాన్నీ వదిలేయాలి .అది సుఖ ప్రదం కాదుకనుక . నార తో నారా .
125-‘’సర్వథా యే వేద వాసౌధర్మమార్గ ప్రమాణకః -తేనా విరుద్ధం యత్కించి త్తత్తత్ప్రమాణ౦ – న చాన్యథా’’
ఎప్పుడూ వేదం ఒక్కటే ప్రమాణం .పురాణాలు తంత్రగ్రందాలు చెప్పినవికూడా ఒక్కోసారి ప్రమాణాలే .వీటిలో వైరుధ్యం ఉంటే వేదం చెప్పిందే ప్రమాణం . నార తో నారా.
ద్వాదశ స్కంధం
126-‘’పిండ బ్రహ్మాండ యోరైక్యా ద్భావయేత్ స్వతనౌ తధా -దేవీ రూపం విజే దేహే తన్మయత్వాయ సాధకః ‘’గాయత్రీదేవిరూపాన్ని శరీరంలో ప్రతిష్టించుకొని సాధన చేయాలి .అదే గాయత్రీ హృదయం అంటే . నార తో నారా.
127-‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవా౦శ్చహ్రీమ్మయం -ద్వే బీజే మమ మంత్రే స్తోముఖ్యత్వేన సురోత్తమ’’
సర్వ తపస్సులు దేన్నీ కోరి బ్రహ్మ చర్యం పాటిస్తున్నారో అదే ఓం అనే ప్రణవాక్షరం .ఇంద్రుడితో దెవి .
128-‘’నమో దెవి మహావిద్యే వేదమాతః పరాత్పరే -వ్యాహృత్యాది మహాంత్ర రూపే ప్రణవ రూపిణి ‘’-వ్యాసుడు .
129- ‘’న విష్నూపాసనా నిత్యా న శివోపాసనా తథా-నిత్యాసోపాసనా శక్తేర్యాం వినా తు సతత్యదా ‘-
హరి హరాదుల ఉపాసన నిత్యాలుకావు .శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన . వ్యాసమహర్షి
130-‘’సచ్చిదానంద రూపానాం తాం గాయత్రీ ప్రతిపాదితాం -నమామి హ్రీమ్మయీం దేవీం ధియోయోనః ప్రచోదయాత్ ‘’
దేవీ భాగవత శ్రవణం ,పఠనం వేద శ్రవణ పఠనం తో సమానం .గాయత్రీ ప్రతిపాదిత హ్రీమయి మనకుసద్బుద్ధి ప్రసాదించుగాక .సూతమహర్షి శౌనకాది మునులతో .
శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు కు ఆధారం -ఆచార్య బేతవోలు రామబ్రహ్మ౦ గారి శ్రీ దేవీ భాగవతం .
సమాప్తం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-25-ఉయ్యూరు .

