శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రతం –

  ‘’ శ్రీ సువర్చలాధిష్టిత వామ దేహం – నిరస్త కందర్ప సురూప దర్శన౦-

 భానుప్రభ౦  రాఘవ కార్య దక్ష్యం –అస్మత్కులేశం  శ్రీ హనూమంత మీడే’’.

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లోశ్రీ విశ్వావసు నామ సంవత్సర  మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు శ్రీ  హనుమద్వ్రతం కార్యక్రమం 2-12-25 మంగళ వారం  నుండి 3-12-25  బుధవారం   వరకు రెండు రోజుల కార్యక్రమ౦ గా జరుగుతుంది .భక్తులు పాల్గొని,అర్చించి , స్వామి వారల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము

కార్యక్రమం

2-12-25 మంగళ వారం  మార్గశిర శుద్ధ ద్వాదశి –ఉదయం 5గం .లనుంచి -అష్ట కలశ స్నపనం ,స్వామి వారలకు  మన్యు సూక్తం తో అభి షేకం  -నూతన వస్త్ర ధారణం –గంధ సిందూరం ,అరటి పళ్ళు ,చేమంతిపూల తో సహస్రనామ ,అష్టోత్తర పూజ –నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం -తీర్ధ ప్రసాద వినియోగం .

3-12-25  బుధవారం   మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్వ్రతం

        ఉదయం 9గం .లకు -పంపానదీ కలశ ఆవాహన , అష్టోత్తర పూజ ,’’13ముడులు గల తోరాల’’కు  పూజ –

తమలపాకులతో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు  సహస్రనామ, అష్టోత్తర పూజ – భక్తులు  మంత్రం తో తోర ధారణం – శ్రీ హనుమద్వ్రత కథలు  -నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం –తీర్ధ ప్రసాద వినియోగం ..

 గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మ కర్త

మరియు భక్త బృందం .

20-11-25–ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.