Daily Archives: December 6, 2025

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.9 వ చివరి భాగం.6.12.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.9 వ చివరి భాగం.6.12.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.21 వ భాగం.6.12.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.21 వ భాగం.6.12.25.

Posted in రచనలు | Leave a comment

 కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి

 కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి  1895లో దువ్వూరి రామిరెడ్డి జన్మించాడు. 1915లో తెలుగు సాహితీ నందనోద్యానంలో “కవికోకిల’గ ా ఆవిర్భవించాడు. పారశాలలో చదువుకున్నది తక్కువ. జీవిత పాఠశాలలో చదువుకున్నది కొండంత. స్వయంకృషితో అపార పాండిత్యం సంపాదించాడు ఇంగ్లీషు, (ఫెంచి, లాటిన్ , జర్మన్ , బెంగాలీ, పర్షియన్ , ఉరూ, తమిళం, సంస్కృతం సొంతంగా నేర్చుకున్నాడు. చిత్రలేఖనం, శిల్పం, ఫొటోగ్రఫీ, రేడియో ఇంజనీరింగు, అటు కళలూ ఇటు విజ్ఞాన శాస్తం. రామిరెడ్డికి ఆసక్తి కలిగించని విషయమే లేదు. అన్నిటిలో ఎంతో కొంత పరిశ్రమ చేశాడు. రామిరెడ్డి నిరాడంబరుడు. ప్రచారం అంటే ఇష్టం లేదు పేరుకోనం పాకులాడలేదు. రామిరెడ్డి పద్యం ఎంత నరళంగా రాస్తాడో, వచనమూ అంతే సరళంగా రాస్తాడు. కవిత్వంలో వర్ణనలూ చెస్తాడు, శాస్త్ర విషయాలూ బోధిస్తాడు. పాతదంతా పనికి రానిది, కొత్త మాత్రమే స్వీకరించ వలసింది అని కాని, పాతలోనే అంతా ఉంది కొత్త అంతా నిస్సారవే అని కాని అనడు రామిరెడ్డి. ఆయనకు పాతలోని మంచీ కావాలి కొత్తలోని చెడూ పోవాలి. “పాత కొత్తల మేలుకలయిక క్రొామ్మెరుంగులు చిమ్మగా’ అన్న వాక్యానికి ఉదాహరణ దువ్వూరి రామిరెడ్డి భావ కవిత్వ యుగంలో అభ్యుదయ గీతాలు ఆలపించిన కవి రామిరెడ్డి. దాస్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి పిలుపు నిచ్చిన కవి రామిరెడ్డి మాతృ దాన్య కవి కోకిల 109 విముక్తికి భరత పుత్రుల మేలు కొలిపిన వైతాళికుడు రామిరెడ్డి. కృషీ వలుని కవితా సింహాసనం మీద కూర్చుండ బెట్టిన కవి రామిరెడ్డి. రామిరెడ్డి రచనల్లో హృదయ ధర్మమైన భావావేశమూ, బుద్ది ధర్మమయిన ఆలోచనా సమ్మిళిత మయ్యాయి. రామిరెడ్డి కవిత్వం ఛందో బద్ధం. కోకిల గానం వచనంలో ఎలా ఉంటుంది ? కవిత్వం వచన రూపంలో ఉన్నా అందులో లయబడ్గత ఉంటుందనే రామిరెడ్డి తలచాడు. కళ కోసమే కళ వాదాన్ని రామిరెడ్డి తిరస్కరించాడు. కవి లోకాన్ని ప్రభావితం చేస్తాడు అందువల్ల ఇతరులకంటే కవికే బాధ్యత ఎక్కువ. “ఉత్తమ కవి సృష్టియందా కాలపు మానవ సంఘమునందలి సముచిత బావములు మూర్తీభవించి యుండును. అతని రచనలందు భవిష్యద్యాణ్ రహస్య మర్మరవములతో సంభాషించుచుండును ‘ అని నమ్మాడు. నీతి బాహ్యమైన కవిత్వం సుందరం కాదన్నాడు. సత్యం, శివం, సుందరంగా కవిత్వం ఉండాలని ఆశించాడు. తన ఆశయానికి తగినట్లే సత్యసుభగమైన కవిత్వాన్నే సృష్టించాడు కవిగా, విమర్శకుడుగా కవిత్వ తత్వాన్ని ఆవిష్కరించాడు రామిరెడ్డి చిత్తరంజక రాగ నిశ్రేణి వైచి దివ్యగానంబు భూమికి దింపరావె తంత్రులెడలిన వల్లకీ దండ మటుల కూజిత విహీనమై తోచు గున్నమావి ఆ గున్నమావిని కూజితవంతం చేయడానికి భువికి దిగి వచ్చిన “కవి కోకిల 1947లో మూగబోయినా దాని పాటలు మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పాకాల వేంకట రాజమన్నారు అన్నట్లు “ఆంధ్రభాష ప్రపంచంలో ఉన్నంత వరకు రామిరెడ్డి గారికి మృతి లేదు”. ఆధారం -డా.దుర్గెంపూడి చంద్ర శేఖరరెడ్డి గారి -కవికోకిల దువ్వూరి రామిరెడ్డి పుస్తకం మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25. యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర.1 వ భాగం.6.12.25. Part -2

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.55 వ భాగం.6.12.25

Shared with Public వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.55 వ భాగం.6.12.25

Posted in రచనలు | Leave a comment

‘’నా సమయం వస్తుంది ‘’ఆని సవాల్ చేసిన ఐస్లాండ్ దేశ తొలి మహిళా ప్రధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ LGBT ప్రభుత్వ అధిపతి,సంస్కర్త – జోహన్నా సిగుర్దార్డోట్టిర్

‘’నా సమయం వస్తుంది ‘’ఆని సవాల్ చేసిన ఐస్లాండ్ దేశ తొలి మహిళా ప్రధాని, ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ LGBT ప్రభుత్వ అధిపతి,సంస్కర్త – జోహన్నా సిగుర్దార్డోట్టిర్ జోహన్నా సిగుర్దార్డోట్టిర్; జననం 4 అక్టోబర్ 1942) ఒక ఐస్లాండిక్ రాజకీయ నాయకురాలు, ఆమె 2009 నుండి 2013 వరకు ఐస్లాండ్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 1978 నుండి 2013 వరకు ఎంపీగా ఎన్నికైన ఆమె, ఐస్లాండ్ సామాజిక వ్యవహారాలు మరియు సామాజిక భద్రతా మంత్రిగా నియమితులయ్యారు, 1987 నుండి 1994 వరకు మరియు 2007 నుండి 2009 వరకు … Continue reading

Posted in రచనలు | Leave a comment

కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ

కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ ‘’మహాత్మాగాంధీ పిలుపు విని ,స్వరాజ్య  సంరంభం లో పాల్గొని దేశ సేవకు తనను తాను అర్పించుకొన్న త్యాగమూర్తి కవి శేఖర శ్రీ గురజాడ రాఘవ శర్మ గారు .చదువు సంధ్యలు పూర్తి చేసి, గౌరవప్రదమైన ఉద్యోగం లో చేరి కుటుంబ భారం వహిస్తాడని గంపెడు ఆశతో ఉన్న … Continue reading

Posted in రచనలు | Leave a comment