శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు

శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు

17-12-25 శ్రీ  విశ్వావసు నామ సంవత్సర మార్గశిర బహుళ  త్రయోదశి  (తెల్లవారితే బుధ వారం )నుంచి పుష్యబహుశి  ద్వాదశి 14-1-2026  బుధవారం  భోగి  వరకు ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం 5గం .లకు సుప్రభాత సేవ ,గోదాదేవి’’ తిరుప్పావై’’ ,కులశేఖర ఆళ్వారుల’’ముకుందమాల ‘’పఠనం ,శ్రీ సుందర కాండ పారాయణం ,ఉదయం 5-30గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు ,అష్టోత్తర సహస్రనామార్చన ,శ్రీ గోదా, రంగనాథ స్వామి వారలకు అష్టోత్తర పూజ,.ఉదయం 6-30గం లకు  నైవేద్యం ,హారతి ,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద వినియోగం జరుగును .భక్తులందరూ పాల్గొని తరించ ప్రార్ధన.

                    ప్రత్యేక కార్యక్రమాలు

30-12-25-మంగళ వారం -పుష్య శుద్ధ ఏకాదశి -వైకుంఠ ఏకాదశి (ముక్కోటి )సందర్భంగా-ఉదయం 4గం .లకు స్వామివార్లకు విశేష అలంకరణ,అష్టోత్తర శతనామార్చన -5గం .లకు ‘’ఉత్తర ద్వార దర్శనం ‘’.

1-1-2026 -గురువారం  –నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ‘’లడ్డూ లతో ‘’ప్రత్యేక పూజ ,అనంతరం భక్తులకు లడ్డు ప్రసాద వినియోగం .

7-1-26-బుధ వారం  -పుష్యబహుళ పంచమి -సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా -సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామి వారి అష్టోత్తర పూజ ,అనంతరం సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి బృందం చే శ్రీ త్యాగరాజపంచరత్న కీర్తనల గానం  

10-1-26- శనివారం   –ఉదయం 5-30గం లకు స్వామివార్లకు –‘’అరిసెలతో’’ ప్రత్యేకపూజ ,ప్రసాద వినియోగం .

13-1-26-మంగళవారం -ఉదయం -5–30గం .లకు శ్రీ ఆంజనేయస్వామి ‘’మూల విరాట్’’ కు ‘’వెన్నతో అభిషేకం’’. 

14-1-26-బుధవారం  –భోగి పండుగ –ఉదయం 5-30గం లకు –స్వామివార్లకు ‘’శాకంబరీ పూజ ‘’(వివిధ కాయగూరలతో పూజ )

ఉదయం -9-30 గం లకు –శ్రీసువర్చలా౦జనేయ ,శ్రీగోదా రంగనాథ  స్వామి వారలకు ‘’ శాంతి కళ్యాణ మహోత్సవం’’ .

15–1-26-గురువారం   –మకర సంక్రాంతి

16-1-26-శుక్రవారం  –కనుమ పండుగ

గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త

మరియు భక్త బృందం

10-12-25 –ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.