తమిళ సినిమాలకు తెలుగు డబ్బింగ్ వ్యాఖ్యాత ,స్వాతత్రోద్యమ దళిత నేత ,హరిజనోద్ధరణకు కృషి చేసిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసన సభ్యులు, రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులుగా,ఉపరాష్ట్రపతి ఎన్నికలో శ్రీ బిది జెట్టి గారితో పోటీ చేసిన తొలి హరిజన నాయకుడు -సర్దార్ నాగప్ప
6-10-1911 న కర్నూలు లో శ్రీ అంకమ్మ బుచ్చయ్య దంపతులకు నాగప్ప జన్మించారు .స్కూల్ ఫైనల్ చదువుకు ఆటంకం కలిగింది .బ్రిటీష జుంటా నుంచి భారతమాతకు విమోచనం కల్పించాలన్న ధ్యేయంతో చదువు పై శ్రద్ధ పెట్టలేదు.1936 లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ౦ లో అర్హతగల శాసన సభ్యులుగా ఎన్నికైన 36 గురిలో నాగప్ప ఒక్కరు అవటం విశేషం.1937 ఎన్నికలలో కర్నూలు రిజర్వడ్ స్థానం నుంచి పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు .మళ్లీ 1946లోనూ ఎన్నికయ్యారు .ఇంటిపేరుసర్దార్ .
15వ యేట అమరావతమ్మను వివాహమాడారు నాగప్ప .దంపతులిద్దరూ స్వాతంత్రోద్యమం లో పాల్గొన్న అదృష్టవంతులు .ఇద్దరూ ఖైదీలుగా ఉండటం మన స్వాతంత్ర్య చరిత్రలో అపూర్వ ఘటన .కర్నూలు సబ్ జైలులో ఆమె రెండు నెలలు అండర్ ట్రయల్ ఖైదీ గా ఉన్నారు .1941జనవరి 25నుండి పదినెలలు వెల్లూరు జైలులో కఠిన శిక్ష అనుభవించారు .క్విట్ ఇండియా ఉద్యమం లోనూ ఉత్సాహంగా పాల్గొన్న ధీర వనిత ఆమె .1942నవంబర్ 5నుంచి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు .ఇలా జీవితాంతం భర్తతో వైవాహిక అనుబంధం, కార వాసాను బంధం అనుభవించి వీరనారి అనిపించారు .తండ్రి కర్నూలుకు చెందిన ఎనమల అంకన్న .అమరావతమ్మ 4-10-1971 అమరులయ్యారు .
నాగప్ప మొదట్లో కర్నూలు రాధాకృష్ణా టాకీస్ లో తమిళ సినిమాలకు తెలుగు వ్యాఖ్యానం చెప్పేవారు .తర్వాత సత్యాగ్రం లో పాల్గొని డి.ఐ.ఆర్ నేరం కింద అరెస్ట్ అయి 28-11–1940 నుండి ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు .250రూపాయల ఫైన్ కూడా చెల్లించారు .బళ్ళారి వేలూరు తిరుచి జైళ్ళలో శిక్ష అనుభవించారు .12-8-1942 న నెల్లూరు మునిసిపల్ హైస్కూల్ లో సమ్మె నిర్వహించారు .జిల్లా బోర్డ్ సభ్యులుగా బోర్డు సమావేశం లో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా తీర్మానం ప్రవేశ పెట్టారు .1942అక్టోబర్ 21నుంచి 1944 డిసెంబర్ 9 వరకు వేలూరు కన్ననూరు ,తంజావూర్ జైళ్ళలో శిక్ష అనుభవించారు .1947-50 కాలం లో నాగప్ప ఢిల్లీలో రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులుగా ఉన్నారు .ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ ఎక్సిక్యూటివ్ సభ్యులు ,కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టే ఎక్సిక్యూటివ్ కార్యదర్శి .ఆంధ్రప్రదేశ్ ఆది ఆంధ్ర సంఘ ప్రధాన కార్యదర్శి .అఖిలభారత అణగారిన కులాల లీగ్ కార్యదర్శి .అఖిలభారత అల్పసంఖ్యాకవర్గాల ,బలహీనవర్గాల సమాఖ్య సంస్థాపక ఉపాధ్యక్షులు నాగప్ప ..ఆంధ్రప్రదేశ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ సంయుక్త కార్యదర్శి .అల్ప సంఖ్యాక వర్గాల ,కార్మిక వర్గాలపార్టీ స్థాపించి ఉపాధ్యక్షులయ్యారు .ఇలా అఖిలభారతస్థాయిలో తిరిగు లేని బడుగు వర్గాల నాయకుడిగా బహుముఖ సేవలందించారు సర్దార్ నాగప్ప .భారత రాజ్యాంగం లో రిజర్వేషన్లు అది ఏళ్ళు మాత్రమె అనేక్లాజును తొలగించటానికి తీవ్ర కృషి చేసి సఫలీకృతులయ్యారు .
పదవులకోసం ఏనాడూ వెంపర్లాడని నిజాయితీ నాగప్ప గారిది .ముక్కుసూటితనం చెప్పాలనుకొన్నది చెప్పేయటం ఆయన సుగుణం .ప్రొవిజనల్ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైన కర్నూలు జిల్లా మొట్టమొదటి నాయకులు సర్దార్ నాగప్ప.పార్లమెంట్ లో ఆయన వాగ్ధోరణికి నెహ్రు పటేల్ వంటి మహానాయకులు ఆశ్చర్యపడేవారు .రాష్ట్రం లో అంజయ్య ,రామారావు గార్లు కేంద్రం లో ఇందిరాగాంధి అధికారం లో ఉన్నప్పుడు నాగప్పగారిని పదవి తీసుకోమని కోరినా సున్నితంగా తిరస్కరించారు .చెన్నారెడ్డి అధ్యక్షులుగా ఉన్న’’నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ ‘’కి ఉపాధ్యక్షులు నాగప్ప .మల్లికార్జున సెక్రెటరి . 1968లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలో బి .డి .జెట్టి గారితో నాగప్ప పోటీ చేసిన తొలి హరిజన అభ్యర్ధిగా రికార్డ్ సృష్టించారు .చిక్ మగలూరు పార్లమెంట్ స్థానానికి ఇందిరా గాంధీ పోటీ చేసినప్పుడు ఎన్నో సభలలో ఆమెకు మద్దతుగా నాగప్ప ప్రసంగించారు .
ఆత్మకూరులో హరిజనహాస్టల్ విద్యార్ధుల దేవాలయ ప్రవేశానికి స్థానికులు అడ్డుకోన్నప్పుడు,నాగాప్పతాడూ బకేట్ తీ సుకొని బావినీరుతోడుకొని స్నానం చేసి ప్రతిఘటించిన ఘనుడు నాగప్ప .1947లో సైకిల్ పై 7తాలూకాలు పర్యటించి హరిజనులను సంఘటితపరచి ,స్పందన చైతన్యం కల్గించిన స్పూర్తి నాగాప్పగారిది .సర్దార్ నాగప్ప గారు 82ఏళ్ల వయసులో 29-4-1993 న పరమపదించారు ‘
ఆధారం సర్దార్ నాగప్ప గారి కుమారుడు బుచ్చిబాబు గారు అందించిన విషయాలతో శ్రీ జి. శుభాకరరావు లీలావతమ్మ గారి వ్యాసం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-25-ఉయ్యూరు .
.

