కులపిచ్చి అ౦తానికి మందుగా వేసిన బీజం మొలకెత్తిన ఆనందం లో మోగిన డప్పు –దండోరా
సమాజంలో మార్పుకు అంగీకరిస్తూ ప్రోత్సహిస్తూ ,సర్పంచ్ గా పెద్దరికాన్ని నిలబెట్టుకొంటూ ఆమార్పు బీజం మొలకేత్తినప్పుడు కలిగిన ఆనందంలో’’ నవ దీప్ ‘’లుంగీ ఊడిపోతున్నా చేసిన డప్పు నాట్యం తో ముగిసిన సినిమా దండోరా .సినిమా రీళ్ళు జారి ప్రవహిస్తున్నా ,నిమ్మకు నీరెత్తినట్లు ,సిగరెట్ కాల్చటం అలవాటు లేని వాడు కాల్చినట్లు సిగరెట్ కాలుస్తూ ,కోర్టు సీనులో మాత్రం చివర్లో ‘’మేమే చంపాం మేమే చంపాం’’అంటూ తనకూతురు ప్రేమించిన వాడిని తమకులపిచ్చే చంపేసిందని ఒప్పుకొంటూ బయటికొచ్చిన శివాజీ లోని మార్పు ,కొడుకు ప్రేమకు దూరమై ,జైలు లో ఉండగా కొడుకువచ్చి ‘’నువ్వు బతకటం దండగ చచ్చిపో .చచ్చిపో ‘’అని మొహం మీదనే అన్నప్పుడు గుండె తంత్రులు మెలి తిరిగి పోవాలి న్యాయంగా ,అది అనిపించలేదు .కానీ కొడుకు మీద గుండె నిండా ప్రేమ ఉండికూడా చెప్పుకోలేని, చూపించలేని ఆ పిరికి తండ్రి ‘’ బాబూ ,నాయనా జాగ్రత్త ‘’అన్నప్పుదుఎక్కడో గుండె ఆర్ద్రతతో తడిసిపోతుంది కాని అదీ బాగా పండించలేకపోయాడు దర్శకుడు .
చంద్రగిరి సుబ్బు తో’’ అతడు ఆమె’’ సీరియల్ లో నూ ,తర్వాత ‘’మాటా మంతీ’’ సీరియలో ?లో సత్తిపండు గా నటించిన నటుడు మెడలొఎర్ర తువాలేసుకొని , (పేరు గుర్తులేదు )శవం ను చూడటానికి వచ్చిన వారికి తనడబ్బు కాకపోయినా ‘’ వాడికి చాయ్ ఇవ్వు వీదికిచాయ్ ఇవ్వు’’ అంటూ హల్ చల్ చేసి, మళ్ళీ అడ్రస్ కనిపించలేదు .బలగం గౌడ్ గారి భారీ పర్సనాలిటికి తగిన భారీ సీన్లుకాని ,డైలాగులుకాని,లేకుండా కులపిచ్చలో కూరుకు పోయినందుకు మార్పు కోరేవారినుంచి సూటీపోటీ మాటలుఅనిపి౦నచుకొవటమె సరిపోయింది .’’ఆడుతూ పాడుతూ’’ సినిమా డైరెక్టర్ ‘’దేవి ప్రసాద్ ‘’శవ సందర్శులలో ఒకడుగా ఇటూ అటూ తిరుగుతూ ఉండటం ,ప్రాధాన్యత లేకపోవటం ఇబ్బంది అనిపిస్తుంది .
ఈ సినిమాలో నటించిన స్త్రీ పాత్ర దారిణులు అందరూ సానబెట్టిన విచ్చుకత్తుల్లా నటన తో ధగధగా మెరిసిపోయారు .అందరూ అభినందనీయులే .శివాజీ కూతురు దళిత యువకుడి తో చేసిన రోమాన్స్ ,డైలాగులు ,పాటల సన్ని వేశాలు వందే భారత్ ట్రెయిన్ స్పీడ్ గా నడిస్తే ,మిగతా సినిమా అంతా పూర్వమెప్పుడో బొగ్గు ఇంజన్ తో నడిచిన గూడ్స్ బండీ లా ‘’లా…..గుడు ‘’గా నడుస్తుంది .
కుల వివక్ష రద్దు అయ్యాక జరగాల్సిన మార్పు నేపధ్యంగా సాగిన దండోరా సినిమా అనుకొన్నంత విజయాన్ని సాధించలేక పోయిందని అనిపించింది .ఈ సినిమాను యు ట్యూబ్ లో మొన్న చూసిన అనుభవంతో రాసిన మాటలివి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-26-ఉయ్యూరు .
