జంతుస్వభావాలు  మానవ జాతి మహోన్నతికు మార్గదర్శకాలని పిల్లల కొస౦ రాసిన ‘’నాగ ‘’లక్ష్మి పుస్తకం

జంతుస్వభావాలు  మానవ జాతి మహోన్నతికు మార్గదర్శకాలని పిల్లల కొస౦ రాసిన ‘’నాగ ‘’లక్ష్మి పుస్తకం

 ఈనెల 18బుధవారం మంగళగిరి లైబ్రరీలో జరిగిన శ్రీ పరాభవ ఉగాది పురస్కార సభలో శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ని శ్రీమతి శివ లక్ష్మి తో అడిగించి తీసుకొన్న పుస్త కమే ‘’’’జంతు తత్వ రహస్యాలు ‘’

ఇందులో 18  జంతువుల జీవ రహస్యాలున్నాయి . జంతువులూ చాలాభాగం   మనకు తెలిసినవే .కాని వాటి స్వభావాలు మనకు చాలామందికి తెలియవు .వాటి స్వభావం మానవులకు ఎలాంటి మహోపకారం చేస్తున్నదో బాలలకు నీతిబోదగా  ఆజ౦తు వులు తమను తాము ఆవిష్కరించుకొన్న కధనం .అందమైన .ముఖచిత్రాలు .లోపలి విషయాలు పిల్లలే కాదు పెద్దలందరూ చదివి తెలుసుకోవాల్సినవే .మనమూ అనుసరించాల్సినవే.

 పరిమళ కస్తూరి ధూపం సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది .ఐకమత్యమే మహాబలం అని బీవర్లు చాటుతాయి .వాల్రస్ ఫర్ ఉపయోగాలెన్నో . ఇంతగా గొప్పగా బతికే మనిషి చర్మం శుద్ధ వేస్ట్ .  కొద్ది తేమనైనా పీల్చి దవడ సంచుల్లో దాచుకొని కంగారు నీటిని ఎంతపొదుపుగా వాడాలో  నేర్పుతుంది .ధ్రువ ప్రాంత వాతావరణం  లో సీలు ను వేటాడి తింటూ కక్కుర్తి పడకుండా హాయిగా బజ్జుంటుంది . పెంగ్విన్లు పిల్లలను చక్కగా లోపం లేకుండా పోషిస్తూ వృద్ధులైన తలిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే వారికి చెంప చెళ్ళుమని నీతి బోధిస్తాయి .గాలినుంచీ నీరుపీల్చి దాహార్తి పోగొట్టుకొనే ముళ్ళబల్లి కూడా మనకు ఆదర్శమే .ఎలుకల్లాంటి లెమింగ్స్ అధిక సంతానం పొంది ,అధికసంతానం అనర్ధ దాయకమని తెల్సుకొన్న పెద్ద లేమిన్స్ సముద్రం లో దూకి ఆత్మ హత్య చేసుకొంటాయి .కుటుంబ నియంత్రణకు మనకు మార్గదర్శకం .ఇలాంటి విశేషాలెన్నో ఉన్న  ఈ పుస్తకం అంతా చదివి ప్రోత్సహించాలి  .

ఆసక్తి ఉన్నవారు –  -98494 54660 తో సంప్రదించవచ్చు

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-26-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.