రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.28 వ భాగం.3.12.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.28 వ భాగం.3.12.25.

Posted in రచనలు | Leave a comment

ప్రకాశం పంతుల గారి‘’దార్శనిక ప్రకాశం ‘’-

గా౦ధీయుగం లో ఆంధ్రనాయక త్రయం దేశ భక్త కొండా వెంకటప్పయ్య పంతులు ,దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ,ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గార్లు .మొదటి ఇద్దరు సత్వ గుణ సంపన్నులు .ప్రకాశం గారు మహా రాజసమూర్తి .ఆయన వేషం నడక ,భాష ,ఠీవీ,దర్పం దీన్ని స్పురింప జేస్తాయి .ఆయనను ‘’సోల్జర్- స్టేట్స్ మన్ ‘’అంటారు .పట్టుదలకు,సాహసానికి ,యాగానికి ,ఆత్మ గౌరవానికి ఆయన తర్వాతనే ఎవరైనా .విద్యార్ధి దశనుంచి ఆయనలో ఈ గుణాలు ప్రస్ఫుటంగా వెల్లడవుతూనే ఉన్నాయి .ఆయన అబాల్య నాయకుడు .అర్ధ శతాబ్ద౦ ఆంధ్ర రాజకీయ రంగం లో అరివీర భయంకరుడై అలరారిన మహాపురుషుడు ‘’ఆంధ్రకేసరి ‘’ఆంధ్రకే సరి కడు యాబద్భారతాని’’కే’’సరి’’.

 దక్షిణ భారత రాజకీయ క్షేత్రం లో ,చారిత్రిక ఘట్టాలలో వీర విహారం చేసి ప్రజాహృదయాన్ని చూరగొన్న ప్రజానాయకుడు .ప్రజానాయకుడు అన్న పేరు ఒక్క ప్రకాశం గారికి మాత్రమె చెల్లు బాటయింది . స్వాతంత్ర్య సమరం లో బ్రిటీష వారికి సింహ స్వప్నమై ఉండటమే కాక ,ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో రెవెన్యు మంత్రిగా ,ముఖ్య మంత్రిగా పట్టుదల ,ఆయన చూపిన అపార ప్రతిభ ,ప్రజానురక్తి ప్రశంసా పాత్రం .

 గాంధీ మహాత్ముడు ‘’జాతిపిత’’ అయితే, ఆంధ్రకేసరి’’ ఆంధ్రపిత’’ .ఆంధ్రత్వం మూర్తీభవించిన ఆంధ్రుల ప్రేమైక మూర్తి ప్రకాశం .ఆయన ఒక వ్యక్తికాడు.ఆంధ్రుల ఏకతా మూర్తి.ఆయన గొప్ప యోదుడే కాదు మేధా సంపన్నుడు కూడా .మద్రాస్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తూ ,ప్రకాశం గారు న్యాయ శాస్త్ర పాండిత్యానికీ ,ధర్మ సూక్ష్మ పరిశీలనకు ,వాదనా కౌశల్యానికి పేరు పొందారు .న్యాయం కోసం జడ్జీలనే  ఎదుర్కొన్న ఘట్టాలు ఎన్నో ఉన్నాయి .ఒక కేసులో ఈయన వాదిస్తుంటే జడ్జి నిద్రపోతున్నాడు .ఈయన వాదన ఆపేశారు .జడ్జి కునుకు నుంచి లేచి ‘’ప్రకాశం గారూ మనం ఎక్కడ ఉన్నాం ?’’ఆని అడిగితె ‘’I don’t know where we are my loord ‘’అన్న ధీశాలి అప్పటి నుంచి పంతులు గారు వాదిస్తుంటే ఆ జడ్జి మళ్లీ నిద్ర ఎప్పుడూ పోలేదట .ఆ నాడు మద్రాస్ లో అయ్యర్లు, అయ్య౦గార్లు మేధావులైన న్యాయవాదులుగా ప్రసిద్ధికెక్కారు .కానీవారేవారికి దక్కని ‘’బార్ అసోసియేషన్ అధ్యక్షా పదవి ప్రకాశం గారికే దక్కింది .అంతేకాదు ‘’లా జర్నల్’కు ’సంపాదకుడు . జడ్జీల తీర్పులను నిర్భయంగా విమర్శించిన ఘటికుడు .రెండు చేతులా డబ్బు సంపాదించి మద్రాస్ నగరం లో అనేక చోట్ల భవనాలను కొన్న సంపన్నుడు ప్రకాశం .

 రాజకీయాలలో ప్రకాశం గారు మొదటినుంచి జాతీయవాది .అతివాదనాయకుడైన లోకమాన్య బాల గంగాధర తిలక్ కు అనుయాయి .1919మార్చి 10ణ గాంధీ మద్రాస్ వచ్చినప్పుడు సత్యాగ్రహ స్వీకారం చేసిన ముగ్గురు ప్రముఖులు కస్తూరి రంగయ్య౦గార్  ,ప్రకాశం, రాజగోపాలాచారి గార్లు .ప్రకాశంగారు 1921లో న్యాయవాద వృత్తీ విసర్జించారు .మలబారు మోప్లా తిరుగుబాటులో పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా విమర్శించి ,ఆప్రాంతానికి స్వయంగా వెళ్లి వారికి అండగా నిలచిన ధీరుడు ఆంధ్రకేసరి .అందుకే అక్కడ ఆయనంటే నేటికీ నమస్కరించే వారున్నారని బ్రహ్మయ్య ఉవాచ .అదే సంవత్సరం అహ్మదాబాద్  కాంగ్రెస్ లో  ఆయన అఖిలభారత  కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా ఎన్నుకొ బడ్డారు .న్యాయ పతి  సుబ్బారావు  గారి  అనంతరం ఆంధ్రులలో ప్రకాశం గారు రెండవ కార్యదర్శి ఆంధ్రరత్న ,కళా, అల్లూరి,పెండేకంటి తర్వాత కార్యదర్శి అయ్యారు  .అందరు సుబ్బారావు గారి ఇంటిపేరు న్యాపతి ఆని రాస్తున్నారు న్యాయపతి కరెక్ట్ .న్యాపతి రాఘవరావు రేడియో అన్నయ్య .బిఎన్ రెడ్డిగారి మల్లీ శ్వరి సినిమాలో అల్లసాని పెద్దనఆఎదాది ఫిబ్రవరిలో గాంధీగారి కేసు బొంబాయి కోర్టులో విచారిస్తుంటే ప్రకాశం గారు అక్కడికి వెళ్లారు .దేశ ప్రజలకు గాంధే ఇవ్వాలనుకొన్న సందేశాన్ని ప్రకాశంగారికిచ్చారు .ఆయన భారత దేశమంతా తిరిగి ప్రచారం చేసి మహాత్ముని మన్నన పొందారు .

ఆధారం -రైతుపెద్ద శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ”నా జీవన నౌక ”

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-25-ఉయ్యూరు ..

ప్రకాశం పంతుల గారి ‘’దార్శనిక ప్రకాశం ‘’-2

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి .5 వ భాగం.2.12.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి .5 వ భాగం.2.12.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి .5 వ భాగం.2.12.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.17 వ భాగం.2.12.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.17 వ భాగం.2.12.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.16 వ భాగం.1.12.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.16 వ భాగం.1.12.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.52 వ భాగం.1.12.25.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.52 వ భాగం.1.12.25.
https://youtu.be/OI4uXHcHmFc

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.29 వ భాగం.1.12.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.29 వ భాగం.1.12.25.

Posted in రచనలు | Leave a comment

ఎం. వి. ఎల్. పురస్కారం -2(చివరిభాగం )

ఎం. వి. ఎల్. పురస్కారం -2(చివరిభాగం )

ఆయనను మొదటి సారి వినటం చూడటం

 రేడియో నాటికలలలో ఎమ్వి ఎల్ ను వినేవాళ్ళం .అ స్వరం రసరమం గా ఉండేది చక్కని ఉచ్చారణ ప్రస్పుట భావ ప్రకటన ఆయన ప్రత్యేకం .మా టిఎల్ కాంతారావు కూడా ఆయన్ను మెచ్చుకోనేవాడు .బందరులో టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ కు వెళ్లినప్పుడు ఒక సాయంత్రం టౌన్ హాల్ బయట నారాయణ రెడ్ది గారి ఉపన్యాసం ఉందని తెలిసి వెళ్ళా.దాదాపు అరగట పైన ఆయన మాట్లాడినా ‘’చప్ప చప్పగా ‘’ఉన్నట్లు అనిపించింది .తర్వాత ఎమ్వి ఎల్ గారు మాట్లాడారు గంట సేపు ప్రేక్షక జన’’ స్పెల్ బౌండ్ ‘’గా విన్నారు ఆస్వరంలో భాస్వరం దట్టింన్చినట్లుంది అలవోకగా ,మహా మాధుర్యంగా ,నూజివేడు రసాల సారంగా ఉందనిపించింది .అప్పుడు తెలిసింది వాట్ ఈజ్ ఎమ్వి ఎల్ ఆని .ఈ విషయం చాలా సార్లు చెప్పాను రాశాను కూడా .ఈయనముందు సినారె బాగా తేలిపోయాడు ..ఆని నా అభిప్రాయం ఏ విషయం పై మాట్లాడారు అన్నది మాత్రం గుర్తు లేదు

 మొదటి సారి ఆయనతో  మాట్లాడటం  .

 ఒకసారి నూజి వీడు నుంచి బెజవాడ కు ఎక్స్ప్రెస్ బస్ లో వస్తున్నాను .నాప్రక్కన  ఎం వి ఎల్ .’’కలా నిజమా’’ అని పించింది .ముత్యాలముగ్గు సినిమా వచ్చినట్లు లేదు అప్పటికి .మా ఇద్దరికీ మాటలు కలిశాయి .నాకుకూడా కొంత సాహిత్యాభిలాష ఉన్నట్లు గ్రహించాడు .శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు మాకు బంధువులు ఆని తెలుసుకొని ‘’శాస్త్రి గారు గొప్ప కథకులు ఆ కథలు చదివారా “”?ఆని అడిగారు .నేను’’షేక్స్ పియర్ మొహం పెట్టి నోరు వెళ్ళబెట్టి ‘’లేదు ‘’ఆన్నాను .అయ్యో చాలా’’ మిస్ అయ్యారు’’అన్నాడు .’’శాస్త్రిగారి అవధానాలు  ఆర్ష  గ్రంథరచన గురించేతెలుసు .ఈ సంగతి అసలు నకుతెలీదు’’అన్నాను .అప్పుడాయన ‘’’బెజవాడ కాలేజిలో తెలుగు లెక్చరర్ జంధ్యాల మహతీ శంకర్ శాస్త్రిగారి కథలు సేకరించి నాలుగైదు భాగాలుగా ప్రచురించారు .మార్కెట్ లో ఉన్నాయి. తప్పక చదవండి ఆయనకు గొప్ప పేరు తెచ్చిన ‘’డిప్రెషన్ చెంబు ‘’కథ పాలగుమ్మి పద్మరాజుగారి ‘’గాలివాన ‘’కు సాటి అయినది .ఎందుకో మనవాళ్ళు  ఉపెక్షించారు కానీ శాస్త్రిగారి కధలు విశ్వ సాహిత్యస్థాయి కలవి ‘’.ఆయనకు దగ్గరగా రాగల కథకులు లేరు మాస్టారూ ‘’అన్నారాయన .అప్పుడు  తెలిసింది నాకు శాస్త్రిగారి కథా సాహిత్యం గురించి .ఆయన తమ్ముడు చిరివాడవాసి వేలూరి కృష్ణమూర్తి గారి అబ్బాయి వివేకానంద గారికి మా చిన్నక్కయ్య దుర్గ ను ఇచ్చి పెళ్ళి చేశాం .ఆఊరి వారే వేలూరి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి రామ కృష్ణకు మా అన్నయ్యగారామ్మాయి వేదవల్లి  నిచ్చాం . చిరివాడ వెళ్ళినప్పుడల్లా శాస్త్రిగారి దర్శనం లభించేది .ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్లి ప్రక్కనా కూర్చుని మాట్లాడిన అదృష్ట వంతుడిని..  శాస్త్రిగారి కథాపుస్తకాలునేను కొని చదివాను అద్భుతః అనిపించాయి తర్వాత వాటిని విశ్లేషిస్తూ  సరసభారతి బ్లాగ్ లో రాశాను .పరమానందం కలిగింది ఈ విధంగా ఎమ్వి ఎల్ కు చాలా రుణ పడి  ఉన్నాను .ఫేస్ బుక్ లో లైవ్ చేయటంమొదలెట్టాక శాస్త్రి గారి కథలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసి ప్రాయశ్చిత్తం జర్పుకున్నాను ఇన్నాళ్ళు ఆయన కథాసాహిత్యం తో పరిచయం లేనందుకు .

  ఆయన కుమార్తెకు సరసభారతి పురస్కార౦

బొడ్డ పాటి చంద్ర శేఖర్ మా సరసభారతి మిత్రుడు .ఆయన ఏమ్విఎల్ గురించి అక్కడి ట్రస్ట్ గురించి ‘’ఎలమావి తోట ‘’నవల గురించి చెప్పారు .ఈ ఉగాదికి  ఏమ్విఎల్ భార్యగారికి సరస భారతి పురస్కారం ఇవ్వాలనిపించి అడిగితె ఆమె కూడా చనిపోయారని కుమార్తె అనూరాధ ఉన్నారని చెప్పగా ఆమెను పిలిచి ఉగాది పురస్కారం అందజేశాం .అప్పటి నుంచి ఆమె నన్ను ‘’పెదనాన్న గారూ “’ఆని మెసేజ్ లో, ఫోన్లలో అంటూ మాట్లాడింది .నాకొక అమ్మాయి నూజివీడు లో దొరికి నందుకు సంతోషంగాఉంది .అలాగే మద్రాస్ లో సోషల్ వర్కర్  శ్రీమతి లేళ్ళ శ్రీదేవి పరిచయమై నన్ను’’ బాబాయి గారు ‘’అంటుంది .భర్త సంగీతంలో నిష్ణాతుడు రిసెర్చ్ చేసిన వాడు .ఈమధ్యనే బెజవాడ ఆభార్యా భర్తలు వచ్చి ఉయ్యూరు మా ఇంటికి వస్తే సత్కారం చేశాం .అనూరాధను తండ్రిగారు రాసిన కానుక పుస్తకం ఉందా ఆని అడిగితె ఆదీ, ముత్యాలముగ్గు వెండితెరనవల ,ఆయన కవితల పుస్తకం పంపింది .మొదటి రెండూ లైవ్ చేశాను .ఆమె చూసింది కూడా .’’ అంతకు ముందే ఎంవిఎల్ గారి సమగ్రపరిశోధన ‘’‘’ముళ్ళపూడి రమణ రచనలు ‘’కూడా నెట్ లో నుంచి డౌన్ లోడ్ చేసి లైవ్ చేశా.అలాగే గుంటూరులో ఉన్న ప్రొఫెసర్ సుశీలమ్మగారి  పరిశోధనా పుస్తకమూ చేశా .వీటన్నిటిలో ఏమ్విఎల్ చేసిన పరిశోధన ఉత్తమోత్తమ మైనది అనిపించింది .ఆయన ‘’కానుక’’ .తెలుగు సాహిత్యం లో మణిపూస .శ్రీరమణ ‘’మిధునం ‘’అంత గొప్పది .కానీఎవరూ కానుక విలువ  గుర్తించలేదని పించింది .కానుక తెలుగు సరస్వతి క౦ఠాభరణమైన’’ కానుక ‘’.దానికి అదే సాటి . ఆయన కృషిని  గుర్తించలేదని నేనూ అనూరాధ బొడ్డపాటి ఫోన్ లో మాట్లాడుకొంటూ అనుకొన్నాం .అప్పుడు నాకు తనికెళ్ళ భరణి చెప్పిన  రసగంగాధర కర్త జగన్నాధ పండిత రాయలు అన్న  ఒక మాట జ్ఞాపకం వస్తోంది ‘’బంగారం మట్టితో కలిసిఉన్నా ,బయటికి తీసి నిప్పులో కాల్చి  తీగలుగామార్చినా బాధ పడలేదట .తనను అల్పమైన ‘’గురివింద గి౦జల’’తో తూకం వేసితూచినందుకు బాధ పడిందట .గొప్ప కొటేషన్. శ్లోకం కూడాఉంది .2008లో బాపు రమణ లనుమద్రాస్ లో వారింటికి వెళ్లి రెండు గంటలు ఉండి మాట్లాడిన విషయాలు మరువలేనిది మా జన్మ చరితార్ధం అనిపించింది .అంతకు ముందు చిట్టెన్ రాజుగారు హైదరాబాద్ లో బాపురమణల స్నేహ షష్టి పూర్తి మహోత్సవం  చేస్తే ప్రత్యక్షంగా చూసిన అదృష్టవంతుడిని .అలాగే నూజి వీడులో ఏమ్విఎల్ ట్రస్ట్ వారు ‘’బాలు- ఎమ్విఎల్ ‘’స్నేహోత్సవం జరపటం అద్భుతః .అభినందనీయం .అందులో నన్ను పాల్గోనేట్లు చేయటం నాకు దక్కిన మహా గౌరవం .

 నాకు తెలిసిన ఏమ్విఎల్ సాహితీ వ్యక్తిత్వం

పురాణం వారి ‘’మధురవాణి ఇంటర్వ్యూలు’’లోఆరుద్ర ‘’ఏమ్విఎల్ ఒకఅద్భుతమైన చిన్నవాడు . చాలా కుశాగ్రబుద్ధి .అతనూ,పురాణం కలిసి ‘’మిని పోయిట్రీ కొత్తగా  ప్రారంభించారు’’అన్నాడు ..అతని కవితలు రసగులళికలే . మచ్చుకు కొన్ని ‘’.1-బాధలు సూదులు అనుకొంటే -జీవితం పిన్ మిషన్ ‘’2-సంతృప్తి ని అచ్చుకిస్తే -లోకమే-ప్రింటింగ్ మెషిన్ ‘’3 ఈ తరం తరంగం లా విరుచుకు పడుతుంది -కురంగంలా పరుగులు పెడుతుంది -మొందడి రాళ్ళమీద విరిగి పడినా -వేటగాళ్ళ గురి తగిలి పడినా ‘’.ఆయన కవితా శీర్షికలు అద్భుతం .కవితకే వన్నె తెచ్చేవి .

  ఆయన ‘’కోడె కారు ‘’కవులను వెన్ను తట్టి ప్రోత్సహించాడు .’’తాగుడు మూతలు ‘’శీర్షిక నిర్వహించి మెప్పించాడు .అయన స్వరం సప్తస్వర మాధుర్యం -ప్రహ్లాద భరితం అనుభవైక వేద్యం -ఆయన్ను ‘’సాంస్కృతిక రాయబారి’’ అన్నారు అందరూ .

ఆంధ్రప్రదేశ్  సాహిత్య అకాడమి’’ప్రచురణగా ‘’తెలుగు పలుకుబడులు ‘’ప్రచురించాడు ఎమెస్కో ‘’పుస్తక ప్రపంచం ‘’మాసపత్రికకు 1969-70 లో సంపాదకుడు .1976లో ఉడుగర (కానుక )రాశాడు .’’మలుపు -మెరుపు ,నేడు సాత్యం ,నవలల రచయిత కూడా .’’తెలుగు వ్యుత్పత్తి పద కోశం’’ రాసిన పండితుడు .1974లో యులిసిస్ ‘’కవితాసంపుటి వెలువరించాడు .జగమెరిగిన సత్యం ‘’ముత్యాలముగ్గు నిర్మాత ‘’.గోరంతదీపం ,స్నేహం ,మావూరి పాండవులు ,తూర్పు వెళ్ళే రైలు ,ఓ ఇంటి బాగోతం సినిమాలకు సంభాషణా రచయిత ..ఆణిముత్యాలు ,వాణిముత్యాలు,యువ జ్యోతి శీర్షికలను వివిధ పత్రిఅకలలో నిర్వహించిన సామర్ధ్యం ఆయనది .రేడియో లో అనేకప్రసంగాలు చేశాడు నాటికల్లో నటించాడు

నూజి వీడు నుంచి బరంపురం -బళ్ళారి దాకా  అనేక సభల్లో అనర్గళంగా  అసామాన్యంగా ప్రసంగించిన మహా వక్త .స్నేహపాత్రుడు ,ఆత్మీయుడు

19-9-1944లో జన్మించి 1986లో 42ఏళ్లకే మరణించాడు మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు అనే ఎమ్వి ఎల్ ..

ఆయన చనిపోయిన 60ఏళ్లకు MVL సాహితీ సమాఖ్య నూజివీడులో 61వ జయ౦తిఉత్సవ ప్రత్యెక సంచిక 20025 జనవరిలో ప్రచురించారు .దాదాపు పాతికేళ్ళుగా ట్రస్ట్ వారు కార్యక్రమాలు ఆయన జన్మదినం నాడు నిర్వహిస్తూ ఆయన సాహితీ సేవను స్మరిస్తూ సాహిత్య సంగీత నృత్యరంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరిస్తూ చిరస్మరణీయం చేస్తున్నారు .

ప్రతిభా సంపత్తి పూర్తిగా వెల్లడి కాకముందే -అకస్మాత్తుగా అస్తమించిన రవి కవి పవి ‘’.ఎమ్వి ఎల్.

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణం.51 వ భాగం.30.11.25.

వాల్మీకి మహర్షి శ్రీ మద్రామాయణం.51 వ భాగం.30.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.28 వ భాగం.30.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.28 వ భాగం.30.11.25

Posted in రచనలు | Leave a comment

ఎం. వి. ఎల్. పురస్కారం -1

ఎం. వి. ఎల్. పురస్కారం -1

నిన్న 29-11-25-శనివారం సాయంత్రం నూజివీడు లో శారదా ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ‘’బాలు -ఎం వి ఎల్ స్నేహోత్సవం ‘’ముత్యాలముగ్గు ‘’సినిమా 50ఏళ్ల పండగ ఘనంగా నిర్వహించారు .ఎ౦విఎల్ శిష్యుడైన డా.ఎస్ .టి .పి. శ్రీ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ‘ఏమ్విఎల్  సాహితీ సమాఖ్య .నూజివీడు సత్యనృత్యకళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వే౦పాటి మోహన్ ,నూజివీడు ఐఐఐటిసంగీత అధ్యాపకులు శ్రీ బి విద్యాసాగర్ లు సంగీతోత్సవ ఆహ్వానితులుగా ,సాహిత్యోత్సవ అతిధులుగా సాహితీ వేత్త ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,హైదరాబాద్ ప్రముఖ పాత్రికేయులు డా.ఆరవిల్లి జగన్నాథస్వామి లకు పురస్కారాలను విచిత్రంగా ‘’ఫ్రూట్ బొకే ‘’శాలువా ,దంపతులకు నూతనవస్త్రాలు ,పుష్పహారం 5వేల రూపాయల నగదు  ,ఎమ్వి ఎల్ రచనలు ,శ్రీ ఎర్రోజు మాధవాచార్యులు రాసిననూజివీడు సంస్థాన చిరిత్ర పుస్తకాలు  అందించారు .ఈ సందర్భంగా స్థానిక దినపత్రిక ‘’జన సమరం ‘’ప్రచురించిన ప్రత్యెక సంచిక ‘’సాహిత్యమే శ్వాసగా అందరిబంధువు -శ్రీ ఎమ్వి ఎల్ ‘’ను నాచేత ఆవిష్కరింప జేయటం నాకు లభించిన అదృష్టం .సభకు ముందు చేసిన ఇద్దరు విద్యార్ధినుల ఆహ్వాన నృత్యం ఆకర్షణీయంగా కనిపించలేదు .పాట కూడా మాధుర్యం అనిపించలేదు . కార్యక్రమం అంతా వెంకటేశ్వర్లు గారు చాలా బాధ్యతతో ఓపిక లేకపోయినా గురుభక్తి తో నిర్వహించారు .ఆయన మాటలే కాక ,అతిధుల ప్రసంగాలు కూడా వేదికపై ఉన్నవారికి అర్ధంకాలేదని పించింది .ప్రక్కన బిగ్ స్క్రీన్ పెట్టి విజువల్స్ అద్భుతంగా చూపించారు . నన్ను ‘’పెదనాన్న గారూ’’ ఆని పిలిచే ఏమ్విఎల్ గారి అమ్మాయి,విశ్వావసుఉగాదికి సరసభారతి నుంచి ఉగాది  పురస్కారం అందుకున్న  శ్రీమతి అనూరాధ ‘’ అమెరికా నుంచి స్క్రీన్ పై సందేశాన్నిచ్చింది .నేను మాట్లాడినప్పుడుకూడా ‘’అమ్మా అనూరాధా ‘’నువ్వు ఇక్కడ లేకపోయినా మీసమాఖ్యవారంతా  చాలా గొప్పగా నిర్వహించారు వారితో పాటు నీకు కూడా ధన్యవాదాలు ‘’ఆని చెప్పాను .స్క్రీన్ పై ముత్యాలముగ్గు ఒకఅరగంట సేపు చూపారు .రాంగ్ టైం లో చూపించారేమో అనిపించింది .

  ఉయ్యూరు నుంచి నేను ,మా సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,శ్రీకాకుళం లో ఫిజికల్ సైన్స్ టీచర్ సాహిత్యోపజీవి నవ్వుల నజరానా,అవధానాల ప్రాశ్నికుడు ,పద్యకవి అప్రస్తుత ప్రసంగంలో దిట్ట ,సరసభారతి ఆత్మీయులు మా ఆస్థానకవి శ్రీ దండి భోట్ల దత్తాత్రేయశర్మగారు  ఉదయం  స్కూల్ లో పనిచేసి ,మధ్యాహ్నంసెలవు పెట్టి ఉయ్యూరు వచ్చి ,బందరులో జరిగిన ‘’నా జీవన సాఫల్య పురస్కారం ‘’కు హాజరు కాలేకపోవటం తో మాఇంట్లోమా దంపతులకు  శాలువకప్పి ,పండ్లను ,చలికాలం కనుక ‘’దుప్పటి ‘’అందించి సత్కరించారు .దండి భోట్లవారు రావటం నాకు నిండుగా దండిగా ఉండి ..అందరం కారులో బయల్దేరి  తేలప్రోలు, జంక్షన్ మీదుగా నూజి వీడు పావుతక్కువ అయిదుకు చేరాం .అప్పుడే స్కూల్ వదలటం వలన పిల్లలంతా వెళ్లిపోగా ముందుభాగం లో షామియా కింద సభా వేదిక ఏర్పరచారు .ఒకపావు గంట తర్వాత మేము ముగ్గురం బయటికి వెళ్లి పుల్కాలు తిని కాఫీ త్రాగి వచ్చాం .మేము వచ్చాక సభవారు కూడా  టీఅందించారు .అప్పటికే రాం సూరి,, అత్తిలి వెంకటరమణగారు ,హరికథా విద్వాన్ శ్రీ  కోట సచ్చిదానంద శాస్త్రి గారి అబ్బాయి ,సరసభారతి ఆత్మీయ కవులు స్థానికులుఅయిన శిఖాఆకాష్ ,వికే డి ప్రసాదరావు ,ఈమని శేషయ్యలు కూడా వచ్చారు .సభలో స్త్రీలు కూడా గణనీయంగా ఉన్నారు .జ్యోతి వారే వెలిగించారు . ముందు నూజివీడుతో నాపరిచయం రాసి తర్వాత ఫైనల్ టచ్ గా శ్రీ ఎం వి ఎల్ గారి తో నాపరిచయం ఆయన పాండిత్యం రచనా విశేషాలు తెలియజేస్తాను .

  నూజి వీడు తో నా పరిచయం

 నూజివీడులో రామమందిరం ప్రసిద్ధి .అది సూరి వారి మందిరంగా పేరు పొందింది దాని నిర్వాహకులు శ్రీ సూరి సీతారామంజనేయులుగారు మా ఉయ్యూరి వారి అల్లుడు గారు .ఆయన భార్య ఉయ్యూరులో డాక్యుమెంట్ రైటర్ మానాన్న గారి ఆబాల్య మిత్రుడు ‘’ఏరా అంటే ఏరా ‘’అనుకొనే శ్రీ కొలచల వెంకటరామయ్యగారి కుమార్తె .వీరబ్బాయి రాం సూరి  నాకు చిన్నప్పటి నుంచి పరిచయం మంచి కవి విశ్లేషకుడు విశాఖలో తెలుగు లెక్చరర్ చేసి రిటైరై ఇక్కడే ఉంటున్నాడు .ఇతని పెద్దబాబాయి శ్రీరామ చంద్ర మూర్తి బెజవాడ ఎస్ ఆర్ ఆర్  కాలేజిలో ఆఫీస్ సూపరి౦టే౦ డింట్ .నేను 1956-60వరకు  ఇంటర్ ,డిగ్రీ చదివినప్పుడు అక్కడే ఉన్నారు .ఆయన భార్య సుందరి కూడా బంధువే మాకు చిన్నబాబాయి రఘురామ చంద్రమూర్తి ఉయ్యూరులో మామేనమామ గుండు గంగయ్య గారి పెద్దల్లుడు -అంటే రాజ్యాలక్ష్మి భర్త .

  మా తోడల్లుడు శ్రీ చతుర్వేదుల శ్రీరామ మూర్తి గారు నూజివీడు స్టేట్ బాంక్ లో పని చేశారు .అప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళం .వాళ్ళు  చిన్న గాంధి బొమ్మ దగ్గరనుండి విస్సన్నపేట వెళ్ళే దారిలో కుడివైపు వైశ్యుల ఇంట్లో ఉండేవారు .ఆయన తల్లిగారు రామమందిరం లో మూడు రోజులు లక్షవత్తుల నోము నోచుకొంటే మేమందరం ఉయ్యూరు నుంచి వచ్చి ఉన్నాం .నేను ఒకసారి ఉయ్యూరునుంచి విస్సన్న పేట హైస్కూల్ కు ట్రాన్స్ ఫర్ అయితే అక్కడ పూజారి మల్లయ్య గారింట్లో ఒక రూం అద్దెకు తీసుకొని వంట చేసుకొంటూ గడిపాను .ఒకసారి మా శ్రీమతి కూడా వాళ్ళ అక్కయ్యతో పాటు రెండు రోజులు వచ్చి ఉన్నది .ఏదో హిందీ సినిమా చూశాం .విస్సన్న పేట హెడ్ మాస్టర్ శ్రీ గాడేపల్లి  దక్షిణామూర్తి గారు నూజి వీడు వాస్తవ్యులు . బస్టాండ్ కు వెళ్ళే దారిలో కుడిప్రక్క వారి ఇల్లు .ఆయన ఉయ్యూరు హెడ్ మాస్టార్ గాకూడా పని చేసినప్పుడు మా బజార్లోనే ఉండేవారు .ఆయన సోదరుడు మైలవరపు వారికి పెంపుడు వెళ్ళిన కృష్ణ శాస్త్రి గారు మా బావ గారు వేలూరి వివేకానంద్ గారి పెదబావ గారుఅంటే  అక్కగారి భర్త  .శాస్త్రి గారి  భార్య హిందీ టీచర్ వెంకాయమ్మ గారు ఉయ్యూరులో కొలచల చలపతి అక్కయ్య . విస్సన్నపేట తెలుగు టీచర్ పత్రి  రామమోహన రావు ,మరో ఆచార్యులుగారు నాకు మంచిమిత్రులు .నూజివీడు నేటివ్, నేను పనిచేసినప్పుడు కొద్దికాలం విస్సన్నపేటలో పని చేసిన లెక్కలమాస్టారురు ఆంజనేయ చౌదరిగారు గొప్ప సాయి భక్తులు .ఆయన భార్య డ్రిల్ మాస్టారు .అలాగే తుమ్మల నారాయణరావు సైన్స్ మాస్టారు .భార్య మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం.ఈయన అన్నగారు చంయ్యగారు నాకు ఉయ్యూరులో ఆప్తులు .

  నేను బాడ్ మింటన్ వాలీ బాల్ ప్లేయర్ ను .నేను ఆడుతుంటే’’ సచిన్’’ కున్నంత ఫాలోయింగ్ ఉండేది నూజివీడులో ఈరెండింటికి హైస్కూల్ టీం చాలా ప్రసిద్ధి కెక్కింది జిల్లాలో .శ్యాం అనే ఎన్ డి ఎస్ కోర్ట్ లో నిల బడితే అందరికి  గజగజా .బాక్ లైన్ నుంచి బాల్ కొడితే అవతలివైపు బుల్లెట్ దిగినట్లుదిగాల్సిందే .ఆజానుబాహువుఎప్పుడూ కారాకిల్ళీ. కళ్ళు ఎర్రగా జ్యోతులుగా ఉండేవి. అయితే స్నేహశీలి .నేను పామర్రులో పనిచేసినప్పుడు  ఫైనల్ గా నూజి వీడు టీచర్స్ తో బాడ్ మింటన్ ఆడాల్సి వస్తే మా టీం కంగారు పడి నూజి వీడు వెళ్ళద్దు ఆని మాలీడర్ డ్రిల్ మాష్టారు అంటే నేను పోట్లాడి ,ఆడాల్సిందే గొప్పవాడి చేతిలో ఓడిపోయినా గొప్పే ఆని తీసుకు వెళ్లి ఆడాం ఓడాం .ఇక్కడే  విష్ణుదాస్ గారు సోషల్, ఇంగ్లీష్ టీచర్ .ఈయనా మంచి ప్లేయర్ .ఎప్పుడూ ఇన్ షర్ట్ లో ఉండేవారు .ఇంగ్లేష్ లో’’ జెం’’ .టీచర్స్ ఓరి ఎంటేషన్ క్లాసులు  ఆయనే జిల్లా అంతా నిర్వహించారు .డి.యి.వో .ఆఫీస్ లో కూడా మంచి పలుకుబడి ఉన్నవారు .నాకు ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం రావాలని పట్టు బట్టిన వారు .వారి  మేనమామ ముదునూరు వెంకటేశ్వర రావు గారు బాలల కార్యక్రమాలు నిర్వహించారు .ఆదర్శ ఉపాధ్యాయులు ‘’మహాత్ముల బాట ‘’లో ఆని తన జీవిత చరిత్ర రాసుకొన్నారు .అడ్డాడ హైస్కూల్ లో కొంతకాలం పనిచేశారు .నేను అక్కడ హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు ఆయన్ను, మాబావమరిది ఆనంద్ ను పిలిచి ఒక స్వాతంత్ర్య దినోత్సవం నాడు సన్మానం చేశాను .తర్వాత సరసభారతి ఏర్పడ్డప్పుడు ఉయ్యూరు తీసుకు వచ్చి సన్మాని౦చాము .ఆయన పుస్తకం పై నేను సరసభారతి బ్లాగ్ లో విస్తృతంగా రాశాను .చనిపోయే ముందు వరకు ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు .ఇంగ్లిష్ డిక్షనరి రాశారు కూడా .నిరంతర సాహిత్యోపజీవి .తర్వాత ఇంగ్లిష్ లెక్చరర్ గా జూనియర్ కాలేజి పిన్సిపాల్ గా పని చేసి రిటైరయ్యారు .అందరికి ఆయన ఆదర్శప్రాయులు. మా బావ మరిదికి మంచి స్నేహితుడు .

 మా బావ మరిది విషయం వచ్చింది కనుక మా అత్తారిల్లు ఏలూరు- నూజి వీడు వయా ముసునూరు రోడ్ లో ఉన్న వేల్పు చర్ల  .మాఅత్తగారు నాకు కజిన్ సిస్టర్ అంటే మాఅమ్మ చెల్లెలి(పిన్ని )కూతురు . మా బావమరిది స్టేట్ బాంక్ లో పని చేసి రిటైరయ్యాడు .వాళ్ళ అబ్బాయి వంశీకి పైన చెప్పిన గాడేపల్లి దక్షిణా మూర్తిగారికొడుకు కూతుర్ని ఇచ్చి నాలుగేళ్ల క్రితం నూజివీడులోనే వారింటికి ఎదురుగా ఉన్న రెండస్తుల వివాహ వేదిక లో పెళ్ళి అయితే మేమంతా వచ్చాం .మా బామ్మర్ది ,మాతోడల్లుడు గారి అబ్బాయి మధు నూజివీడులో చదివినప్పుడు ఏమ్విఎల్ గారి శిష్యులు .వీరి క్లాస్ మేట్ నేపధ్యగాయకుడు పిబి శ్రీనివాస్ గారి మనవడు సినిమాలలో బాల వేషం వేసి చలాకీనటించిన కుర్రాడు .పేరు జ్ఞాపకం లేదు .

 శ్రీ కిరణ్ కుమార్ ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సభలు జరిపించి ఒకసారి నూజివీడు హైస్కూల్ లో జిల్లాలోని కవులను రచయితలను ఆహ్వానించి సత్కారం జరిపారు .అప్పుడే నాతోపాటు శ్రీ అత్తిలి వెంకటరమణ గారూ ఉన్నారు. అదే మా మొదటి పరిచయం .కొంతకాలం ఫోన్ లో మాట్లాడుకోనేవారం .నిన్న ఆయన జ్ఞాపకం చేశారు ‘’మీరు చెరుకుపల్లి జమదగ్ని శర్మ ‘’గారి గురించిరాసిన  వ్యాసం చదివాను చాలా బాగుంది ‘’అన్నారు. .ఇవాలసాయ౦త్ర౦ అత్తిలి రమణ గారు  ఫోన్ చేసి మాట్లాడారు .పాతవిశాయాలన్నీ గుర్తుకు తెచ్చారు .జమదగ్ని శర్మగారు  విశ్వ నాథ వారికి ప్రియ శిష్యులు .తండ్రి ముసలితనం లో సంధ్యావందనం చేయలేకపోతే  శర్మగారు తన సంధ్యావందనం తో పాటు తండ్రి గారి సంధ్యా వందనం కూడా చేసేవారు .మా  తోడల్లుడిగారి తల్లిగారు నూజి వీడులో లక్ష వత్తుల వ్రతం చేసుకొన్నప్పుడు ఒక రోజు జమదగ్ని శర్మగారింటికి వెళ్లి మాట్లాడాం.ఆయన చాలాపుస్తకాలు  రాశారు .సాహితీ విమర్శకులు విశ్లేషకులు .మంచి అతిధిమర్యాద ఉన్నవారు  .

  చివరగా మాకుకృష్ణాజిల్లా టీచర్స్ గిల్డ్ ఉండేది .అందలో నేను యాక్టివ్ గా ఉండేవాడిని . శ్రీ ఎం వి  ఆర్ శాస్త్రిగారు కార్యదర్శి .నూజివీడు హైస్కూల్ లో సోషల్ మాస్టారు తర్వాత హెడ్ మాస్టర్ కూడా అయారు .మహా ఉత్సాహి .ఉద్రేకి .జిల్లాన౦తా ఒంటి చేతితో నడిపేవారు తరచుగా కార్యవర్గ సమావేశాలు ఇక్కడే జరిపేవారు అలా నూజి వీడు వచ్చి హాజరయ్యేవాడిని .నాకు అత్యంత ఆప్తుడు శాస్త్రి గారు .మరో ఎం వి శాస్త్రి లెక్కలమేస్టారు తర్వాత హెడ్ మాస్టర్ .ఆయన అడివి ఆంజనేయస్వామి దేవాలయాన్ని ఆకర్షవంతంగా తీర్చి దిద్దినవారు .అక్కడే జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా కట్టించటానికి బాగా కృషి చేసినవారు. ఎప్పుడూ ఆవార్తలు పేపర్లలో వచ్చేవి .వారిద్దరూ ఇప్పుడు లేరు .

 రేపటి వ్యాసం ఏమ్విఎల్ స్పెషల్ .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-25-ఉయ్యూరు.

Posted in రచనలు | Leave a comment

. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.50 వ భాగం.29.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.27 వ భాగం.29.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.27 వ భాగం.29.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.49 వ భాగం.28.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.49 వ భాగం.28.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.26 వ భాగం.28.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.26 వ భాగం.28.11.25.

Posted in రచనలు | Leave a comment

సేవా దీక్షితురాలు కీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి జ్ఞాపకాలు

సేవా దీక్షితురాలు కీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి  జ్ఞాపకాలు

పన్నెండేళ్ళ క్రితం పరమపదించిన కీ.శే .శ్రీమతి గుత్తికొండ రామ రత్నం  గారిని 2006లో మాత్రమె నాకు పరిచయమైన కృష్ణా జిల్లార్రచయితల సంఘం కార్యక్రమాలలో ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదనిపిస్తోంది .కదాచిత్ గా చూశానేమో గుర్తులేదు .విపుల చతుర సంపాదకురాలు ,నా ఫాన్ శ్రీమతి కె.బి లక్ష్మి గారితో పరిచయమయ్యాక ,ఆమె గుత్తి కొండ సుబ్బారావు గారి కుటుంబంతో బాగా పరిచయమున్న వారని ,బందరు వెళ్ళినప్పుడల్లా వారింట్లో నే ఉండేదాన్నని ఆమె చెప్పేవారు .కాని ఎప్పుడూ రామరత్నం గారి ఆరోగ్యం గురించి చెప్పిన జ్ఞాపకం లేదు .ఆమె మంచి తనం అతిధి అభ్యాగతులకు పేదలకు ఆమె అందిస్తున్న సేవలు మాత్రం చాలా ఆసక్తిగా చెప్పేవారు .నాకు మాత్రం అనిపించేది ఇంతగా తోడూ నీడగా ఉన్న ఆమె సభలకు ఎందుకు రావట్లేదుఅని .అయితే నేను ఎవర్నీ అడిగినట్లు లేదు.

 ఒక సారెప్పుడో సుబ్బారావు గారికి ఫోన్ చేస్తే ,తాను జగ్గయ్య పేట దగ్గర ముక్త్యా లలో ఉన్నానని ,తన భార్య గారి కోరికపై అక్కడ ఒక శివలింగం ప్రతిష్టించి చిన్న గుడి కట్టిస్తున్నాననీ ,దంపతులం ఇద్దరం అక్కడేఉన్నామని చెప్పారు .తనకు ఇలాంటి కార్యక్రమాలపై అంతగా ఆసక్తి లేకపోయినా ఆమె కోరినందువల్ల ఈ ప్రతిష్ట, గుడి నిర్మాణం చేస్తున్నానీ ,ఆమె కోరిక తీర్చటమే తన ముఖ్య కర్తవ్యమ్ ఆని చెప్పారు. ఆ ఫోటోలు కూడానాకు  పంపినట్లు గుర్తు .ఈ సందర్భాల డేట్లు సంవత్సరాలు జ్ఞాపకం లేవు .

  ఆ తర్వాత రామరత్నం గారు ఇంకో వారానికి చనిపోతారనగా బెజవాడ మ్యూజియం దగ్గర హాస్పిటల్ లో చేర్చినట్లు నాకు పూర్ణచంద్ గారు ఫోన్ చేసి చెప్పిన జ్ఞాపకం .ఆ రోజే ఉదయం కాఫీ టిఫిన్లయ్యాక బస్ లో బయల్దేరి వెళ్లి హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ అప్పటికే సుబ్బారావు గారు ,పూర్ణచంద్ గారు పువ్వాడ తిక్కన సోమయాజులు గార్లు ,కెవి శర్మ గారు  గుమ్మా సాంబశివ రావు గారు వగైరాలున్నారు .అందరి ముఖాలో ఆందోళన కనిపించింది .సుబ్బారావు గారు బాధ ను మనసులో భరిస్తూ కంఠంలో గరళం  దిగమింగుకొంటున్న నీల క౦ఠుని లాకనిపించారు .ఐ.సి .యు .లో ఉన్న రామరత్నం గారిని ఒక సారి అందరం వెళ్లి చూసిన గుర్తు . తర్వాత అక్కడే బయట వరండాలో మాట్లాడుకొంటూ ,కుర్చీలు లేకపోవటంతో ,ఆరగారగా కాఫీ లు తాగుతూ అందరం గడిపేవాళ్ళం .అప్పుడే నాకు తెలిసింది వాళ్ళ మాటల్లో ఆమె సుదీర్ఘ కాలం గా ఏదో జబ్బుతో తీవ్ర బాధ అనుభవిస్తున్నారానీ ,జీవించే చాన్స్ చాలా తక్కువని .అమెరికాలో ఉన్నముగ్గురు  కుమార్తెలలో,ఇద్దరు ఇక్కడికి వచ్చారని ,ఇంకొక ఆమె కోసం ఎదురు చూస్తున్నారనీ తెలిసింది .ఇలా నాలుగురోజులు రోజూ నేను ఉయ్యూరునుంచి వెళ్లి చూసిన గుర్తు .ఉదయం కుదరకపోతే సాయంత్రం వెళ్లి రాత్రి ఏడు గంటలదాకా ఉండి వచ్చేవాడిని  .చివరి రోజు వెళ్లాను .అక్కడ పైన చెప్పిన మిత్రబృందం అంతా ఉంది.ఆమె ఆరోగ్యవార్తలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్పేవారు .చివరి సారిగా విన్న వార్త.ఆమె చక్కగా అందరితో బాగానే మాట్లాడుతున్నారనీ ,తనకు హాస్పిటల్ లో సేవ లందించిన నర్సులకు, మిగిలినవారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇవ్వమని భర్త సుబ్బారావు గారికి చెప్పి ఇప్పించారనీ,ఆమె గారి ముఖం లో సంతోషం సంతృప్తి బాగా కనిపించాయని తనకేమీ కాదని అందర్నీ ధైర్యంగా ఉండమని కర్తవ్య బోధ చేశారనీ ,ఇవన్నీ చూస్తున్న డాక్టర్లు ఆశ్చర్య పోతున్నారని  ఆమె గుండె నిబ్బరానికి కుటుంబసభ్యులు డాక్టర్లు, ఆశ్చర్యపోయారని తెలిసింది .

  అదే హాస్పిటల్ లో పెనమకూరు హైస్కూల్ తెలుగు పండితులు చింతలపాటి కామేశ్వరశర్మ గారి భార్యగారు కూడా చేరి చికిత్స పొందుతున్నట్లు శర్మగారు కనిపించి చెప్పారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో మాఇంట్లో అద్దెకు ఉన్నాడు పెనమకూరులో నాశిష్యుడుకూడా .భార్య ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ లో ఆఫీస్ లో ఉద్యోగం .శర్మగారు ఎందుకో ఈ ఆస్పత్రి చికిత్సపై సంతృప్తి వ్యక్తం చేయలేదు మాటలలో .

  ఆ మర్నాడు ఉదయం అనుకొంటా పూర్ణచంద్ ఫోన్ చేసి రామ రత్నం గారు చనిపోయారనీ ,పార్ధివ దేహాన్ని బందరు తీసుకు వెళ్లారనిసుబ్బారావు గారి  మూడవ అమ్మాయి కూడా అంతకు ము౦దే హాస్పిటల్ కు వచ్చి చివరి చూపు చూశారని చెప్పారు .నేను ఏదో పనిలో ఉండటం వలన బందరు రామరత్నంగారి  .అంత్యక్రియలకు వెళ్ళలేక పోయాను .ఆతర్వాత ఆమె  సంతాపసభకు వెళ్ళిన జ్ఞాపకం .ఆతర్వాత  రెండు మూడు సార్లు ఆమె బందరు బస్స్టాండ్ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ లోఉదయం  జరిగిన ఆమె స్మారక కార్యక్రమాలకు వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడే సుబ్బారావు గారి కుమార్తెలను వారి కుటుంబాలను  చూశాను .ఆమె పై తెచ్చిన స్మృతి సంచిక నాకు సుబ్బారావు గారు పంపారు .చదివి  సరసభారతి బ్లాగ్  లో రాశానో లేదో గుర్తులేదు . కానీ సుమారు రెబ్దేళ్ళ  క్రిందట పూర్ణ చంద్ రాసిన జ్ఞాపకాలు ,సుబ్బారావుగారితోఅనుబంధం భార్య రామరత్నం గారి వివిధ సేవాకార్యక్రమాలపై ,అతి దీర్ఘ వ్యాధిలో ఉన్న చిక్కి శల్యమైనా ,సుబ్బారావు  గారికి ఆమె సహకరించిన విధానంపై కూడా రాశాను .స్వగృహఫుడ్స్ స్థాపన ,స్పందన సాహితీ సమాఖ్య సేవాకార్యక్రమాలు ,ఆమె పొందిన సేవా కార్యక్రమ౦  , పురస్కారం వగైరాలన్నీ తెలిపాను .

  బందరులో కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలోనూ నేను పాల్గొనే వాడిని .కానీ ఎప్పుడూ సుబ్బారావు గారింటికి వెళ్ళిన గుర్తులేదు .బాపు రమణ లు మరణించాక వారి పేరిట ఒక స్మారక పురస్కారం సరసభారతి తరఫున ఇస్తే బాగుంటుంది అనిపించింది .మా మైనేని గోపాల కృష్ణ గారికి వారిద్దరూ బాగా పరిచయం .ఆయనకు తెలియజేస్తే వెంటనే స్పందించారు .రాష్ట్రం మొత్తం మీద ఇలా ఆలోచించి చేసింది మాసరసభారతి ఒక్కటే .అప్పుడే సరసభారతి ,శ్రీ చలపాక ప్రకాష్ గారి రమ్య భారతి కలిసి బెజవాడ లో పాలగుమ్మి పద్మరాజు గారి శత  జయంతి నిర్వహించాం టాగూరు లైబ్రరీలో అనుకొంటా .దానికి పద్మ రాజుగారి అమ్మాయిలూ కూడా వచ్చారు .తెలుగు కథకు ఎత్తైన గిరి లాంటి శ్రీ వేదగిరి రాం బాబుదంపతులకు   బాపు రమణ స్మారక సాహితీ పురస్కారం అందించాం .అయిదు వేలరూపాయలు నూతన వస్త్రాలు వగైరాలతో .సభ నిర్వహణ అంతా ప్రకాష్ గారే చూశారు .అప్పటినుంచి వేదగిరి తో టచ్ లో ఉన్నాను .

 బాపు రమణ చిత్రలేఖన పురస్కారం ఎవరికిస్తే బాగుంటుంది ఆని సుబ్బారావు గారిని అడిగితె శ్రీ శీలా వీర్రాజు గారి కివ్వటం సముచితం అన్నారు .ఆపేరు వినటమేకాని రాజుగారి గురించి పెద్దగా తెలియదు .సుబ్బారావు గారు కొంత వివరం ఇవ్వగా  రాజుగారు తమ పుస్తకాలు పంపారు .ఈ కార్యక్రమం బందర్లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో కలిపి నిర్వహించాం .అప్పుడు ఉయ్యూరునుంచి నేనూ మా శ్రీమతి ,కార్యదర్శి శివలక్ష్మి కారులో వెళ్ళాం .సుబ్బారావు గారు తమ ఇంట్లోనే వీర్రాజు దంపతులు ఉన్నారని చెప్పి అక్కడికే వస్తే అందరంకలిసి హిందూ హైస్కూల్ ఎదురుగా ఉన్న మహతీ సభావేదిక వద్దకు వెళ్ళచ్చు అన్నారు .అప్పటికి రామ రత్నం గారు గతి౦చారని  అనుకొంటున్నాను .మాకు టిఫిన్ కాఫీలు ఏర్పాటు చేశారు .సుబ్బారావు గారి ఇల్లు చూడలేడనే దుగ్ధ ఇలా ఈరింది .ఆతర్వాత అ౦దరం సభా స్థలికి చేరాం .సుబ్బారావుగారు అన్నీ తానె అయి కార్యక్రమం నిర్వహించారు .జిల్లాజడ్జి గారి చేత వీర్రాజు, సుభద్రా దేవి దంపతులకు  మైనేని వారు ఏర్పాటు చేసిన బాపురమణ లస్మారక పురస్కారం 10 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు జ్ఞాపిక లతో అందించాము.పూర్ణచంద్ గారు ,సిలార్ మహమ్మద్ గారు ,ధన్వంతరి ఆచార్యులుగారు వంటి పెద్దలెందరో హాజరయ్యారు .వీర్రాజు దంపతులు ‘’ఇంతటి గొప్ప సన్మానం మా జన్మలో చూడలేదు .ఇలాంటి ఆత్మీయత ఎక్కడా మాకు దక్కలేదు .లక్ష రూపాయలు ఇచ్చి మాకు హైదరాబాద్ లో సన్మానాలు జరిగినా ,ఈప్రేమ ఆత్మీయత గౌరవం మర్యాద మాకు ఎక్కడా లభించలేదు ‘’ఆని సంబర పడ్డారు .మా జన్మ ధన్యమనిపించింది .రాష్ట్రంలో బాపురమణ లస్మారక మొదటి పురస్కారం అందజేసిన అదృష్టం మాకు మా మైనేని వారి వలన దక్కింది అప్పటినుంచి వీర్రాజు గారు దంపతులతో తరచూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం ఆయనా రెండుమూడేళ్ళక్రితం కాలం చేశారు . సుభద్రా దెవి గారితో మాట్లాడుతూనే ఉన్నాను .వారిద్దరి పుస్తకాలపై సరసభారతి బ్లాగ్ లో సమీక్షలు చేశాను కూడా.రామరత్నం గారు లేని లోపం సుబ్బారావు గారింట్లో కనిపించినా, ఆలోటు మాకు కనపడకుండా చేశారు గుత్తికొండ సుబ్బారావు గారు .

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.48 వ భాగం.27.11.25.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.48 వ భాగం.27.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.25 వ భాగం.27.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.25 వ భాగం.27.11.25

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.3 వ భాగం.26.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.3 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.15 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.47 వ భాగం.26.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.47 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

మహా కవి కాళిదాసు కుమార సంభవం.24 వ భాగం.26.11.25.

మహా కవి కాళిదాసు కుమార సంభవం.24 వ భాగం.26.11.25.

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.2 వ భాగం.25.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.2 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.14 వ భాగం.25.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.14 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.46 వ భాగం.25.11.25

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.23 వ భాగం.25.11.25.

Posted in రచనలు | Leave a comment

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి.1 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25. Part -2

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.13 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.45 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.22 వ భాగం.24.11.25.

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

జీవన సాఫల్య పురస్కారం -2(చివరిభాగం )

ఈ ఆగస్ట్ లో హైదరాబాద్ నుంచి శ్రీ తనికెళ్ళ భరణి ఫొన్ చేసి ‘’మీరు రాసిన వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి ‘’పుస్తకం ఎవరిదగ్గరో ఉంటే తీసుకొని చదివాను .అద్భుతం .మీకు నాపాదాభి వందనం ‘’ఆని మూడు సార్లు అన్నారు .ఇంతకంటే గొప్ప అవార్డ్ నాకు ఇంకేవరుఇస్తారు ఆని పించింది .సరసభారతి పుస్తకాలన్నీ కావాలి అంటే అన్నీ పిడిఎఫ్ లో ఉన్నాయి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అన్నా .మర్నాడు ఉదయం మళ్లీ ఫోన్ చేసి అన్నీ డౌన్ లోడ్  చేసుకొన్నాననీ  కాని ఒరిజినల్స్ కావాలన్నారు .డబ్బు ఎంత అయితే అంతా పంపుతానన్నారు .’’మాపుస్తకాలన్నీ ఉచితమే .మా అబ్బాయి శర్మ హైదరాబాద్ లో ఉంటాడు అతనే మీ ఇంటికి తెచ్చి అందిస్తాడు ‘’అన్నా .’’ఆశ్చర్యంగా ఉందే’’ అన్నారు .తాను  మల్లినాథ సూరి పుట్టిన  తెలంగాణలోని సిద్ధిపేట దగ్గరున్న కొలచలగ్రామం లో సూరి ఇంట్లో ఒక కార్యక్రమంచేయాలను కొంటున్నాననీ ,దానికి ‘’మీరుకూడా తప్పక రావాలి ‘’అనగా ‘’అది నా అదృష్టం మహద్భాగ్యం ‘’అన్నా.నేను అన్నట్లే మా అబ్బాయి శర్మ,మా మనవడు హర్ష వారింటికి వెళ్లి సరసభారతి పుస్తకాలు అందజేసి వీడియో తీసి యుట్యూబ్ లో పోస్ట్ చేశాడు .

  నేనుదాదాపు రెండున్నర ఏళ్లనుంచి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సరసభారతి ఫేస్ బుక్ లో వివిధ గ్రంథాలను ప్రత్యక్ష  ప్రసారం చేస్తున్నాననీ ,అవన్నీ యుట్యూబ్ లో పోస్ట్ అవుతున్నాయని ఇప్పటికి నాలుగు వేల ఎపిసోడ్ లు నాలుగు వేల గంటలు చేశానని చెప్పాను .

 సుబ్బారావు గారు మాటల మనిషికాదు చేతల మనిషి .అర్ధాంగి స్మృతినిఇంత అర్ధ  వంతం గా  నిర్వహించటం మనీషులకే సాధ్యం ఆని ,అలాంటి మనీషి గుత్తికొండ అనీ ,దీనికి సహకరిస్తున్న అమెరికాలో సెటిల్ అయిన వారి ముగ్గురు కుమార్తెల సహకారం, అంతకు మించి  వారి అల్లుళ్ళ సహృదయత మాటలలో చెప్పలేనిదని అన్నాను .వారందరికి మా అందరి శుభాశీస్సులని చెప్పాను .ఈ ఓల్డేజ్ హోమ్ లో  ఇరవై మంది మహిళలున్నారు .వారందరూ ఉచిత సేవ పొందుతున్నారు  ఈ ట్రస్ట్ సహకారంతో .ఎవరైనా ఒకరోజు భజనం స్పాన్సర్ చేయాలంటే 2500 రూపాయలు పంపిస్తే వారి పేర మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తారని నెలకు ఇలాంటి స్పాన్సర్లు సుమారు పది మంది ఉంటారని,గదులలో ఆహార పదార్ధాలు స్టోర్ చేసి ఉంటాయని ,వంటమనిషి కూడాఉంటారనీ ,ఆశ్రమం లోని ఓపికున్న వారు వంటకు, వడ్డనకు సాయం చేస్తారని ,ఉదయంతిఫిన్ కాఫీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనం ఉంటాయి .దాతలు ఇచ్చిన స్థలం లో ఈ భవన నిర్మాణం సుబ్బారావు గారు చేశారనీ చెప్పాను .అనాధలు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ట్రస్ట్  ఖర్చు తో నిర్వహిస్తారు.,నేను కొందరు ఇన్ మేట్స్ తో మాట్లాడితే వారంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఏలోటూ లేనట్లు చెప్పారని తెలియజేశాను .చిలకలపూడి రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ సేవాభవనం ఉందని చెప్పాను .దీన్ని ఎ లోట్టు రాకుండా సమర్ధతతో నిర్వహిస్తున్న శ్రీమారి సుశీల గారిని అభినందించాలి .ఆమె అందరికి తలలో నాలుకలా ఉంటారు .ముఖ్యంగా సుబ్బారావు గారి కుటుంబానికి చాలా సన్నిహితురాలు .రెండేళ్లక్రితం సరసభారతి ఉగాది పురస్కారం ఆమెకు అందజేశాం .ఈసభకు సరసభారతితో పరిచయమున్న శ్రీమతి గురజాడ రాజరాజేశ్వరి ,శ్రీమతి మేరీకృపాబాయి శ్రీమతి అన్నపూర్ణమొదలైన  వారు వచ్చారు .ఇదంతా నిన్నటి సభా విశేషాలు .

శ్రీ గుత్తికొండతో 50 ఏళ్ల క్రిందటి తొలి పరిచయ విశేషాలు

.బహుశా ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు .1970 దశకం లో అనుకొంటా బందరు సెంట్రల్ లైబ్రేరియన్ కృష్ణా జిల్లా గ్రంథాలయ సెక్రెటరి శ్రీ చ౦ద్ర శేఖర రావు గారు ఉండేవారు .అప్పుడు శ్రీ దొండపాటి దేవదాసుగారు అటెండర్ .తర్వాత ఆయనా లైబ్రేరియన్ అయ్యారు అక్కడే .అప్పటికే మంచి కథారచయితగా పేరు పొందారు .మేము ఉయ్యూరులో సాహితీ మండలి నిర్వహించినపుడు ,సరసభారతి కార్యక్రమాలకుఆహ్వానిస్తే వచ్చి చక్కని ప్రసంగం చేసేవారుదేవదాసుగారు .అపుడు ఆ లైబ్రరీలో శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి ఉపన్యాసం కు ఉయ్యూరు నుంచి నేనూ,ఉయ్యూరులో నాతో పాటు సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్న  ,ప్రముఖవిమర్శకుడు ,శ్రీశ్రీని అవపోసన పట్టిన  మిత్రుడు టి ఎల్ కాంతారావు ,లెక్కలమాస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మాస్టార్ శ్రీ కొడాలి రామారావు  కాంతారావు ప్రేరణ తో ఆ మీటింగ్ కు వెళ్ళాం .సభలో ఉపన్యాసం విన్నాం .మాకు లైబ్రరి సెక్రెటరి గారింట్లోనే భోజనం పడక కూడా .ఆయన శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారికి దగ్గర బంధువు ఆని గుర్తు .

  మర్నాడు ఉదయం కాంతారావు  మమ్మల్నిముందుగా శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారింటికి తీసుకు వెళ్లారు .అక్కడే వారితండ్రిగారు కవిపాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారిని మొదటిసారీ,ఆఖరి సారి చూశాం .ఆతర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ ‘’జిసనార ‘’ గారిని వారింట్లో చూశాం .ఆతర్వాత శ్రీ విహారి గారి నీదర్శించా౦  ,వీరి జంట శ్రీ శాలివాహన ఊర్లో లేరట .పిమ్మట శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారినీ కలిశాము .ఆయన అప్పుడు  ఇన్ షర్ట్ర్ట్ ,బెల్ట్ తో, సన్నగా రివటగా ఉన్నట్లు గుర్తు . కాంతారావు ఆయన్ను పరిచయం చేస్తూ ‘’మాంచి చురుకైన వ్యక్తి .ఒకరకంగా మాలీడర్ ‘’ఆని చెప్పాడు .తర్వాతప్రసిద్ధ కథా రచయిత ‘’సి. రా .‘’ఆని పిలువబడే శ్రీ సింగరాజు రామ చంద్రమూర్తి గారినీ చూసి మాట్లాడిన గుర్తు .వీరంతా బందరు ఎల్ .ఐ. సి. లో ఉద్యోగస్తులే .అలా సుబ్బారావు గారితో ఆనాటి బంధం ఈనాడూ సుమారు 20 ఏళ్లనుంచి మళ్లీ కొనసాగటం  నా అదృష్టం .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

జీవన సాఫల్య పురస్కారం -1

జీవన సాఫల్య పురస్కారం -1

నిన్న 23-11-25 ఆదివారం బందరు దగ్గర చిలకలపూడిలో కృష్ణాజిల్లా రచయితల  సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో వారి ధర్మ పత్ని కీ.శే.శ్రీమతి గుత్తికొండ రామరత్నం గారి 12వ వర్ధంతి సందర్భంగా జీవన సాఫల్య పురస్కారాలను గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ -అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం లో లోని రామరత్నం ఆడిటోరియం లోఒక గంట ఆలస్యంగా ప్రారంభమైనా  కమనీయంగా జరిగింది .సభాధ్యక్షులు సాహితీ సింధు,శతాధిక గ్రంధకర్త ,మహా సాహితీవేత్త  డా.జి వి పూర్ణచంద్ నేతృత్వంలో అవనిగడ్డ శాసనసభ్యులు తెలుగు భాషా సంస్కృతీ పరిరక్షకులు మాన్యులు డా.మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిధిగా ,అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమం అధ్యక్షురాలు ,సాంఘిక సేవా తత్పరురాలూ శ్రీమతి కరెడ్ల సుశీల స్వాగత ప్రసంగం తో ప్రారంభమైంది .ఉయ్యూరునుంచి కారులో నేనూ ,సరసభారతి సాంకేతిక నిపుణులు శ్రీ గంగాధరరావు ,మా మూడవకోడలు రాణి ,నాల్గవ కోడలు మహేశ్వరి వెళ్ళాం .సాయంత్రం 4-30కె సభాస్థలి చేరాం .కారణం మా ఉయ్యూరు సరసభారతి సభలకు సుబ్బారావు గారు ఎప్పుడూ అందరికంటే ముందే వస్తారు .మేమూ దాన్నే అనుసరించాం .

జీవన సాఫల్య పురస్కారాలు అందుకొన్నప్రముఖులు 1-ఆచార్య ఎం.సి దాస్ -విద్యా ,సామాజిక వేత్త (బెజవాడ )2-శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -నిరంతర రచనా నిమగ్నులు ,సరసభారతి అధ్యక్షులు (ఉయ్యూరు )3-శ్రీమతి మందరపు హైమవతి -స్త్రీవాద రచయిత్రి (బెజవాడ )3-డా.  గుమ్మా సాంబశివరావు -ప్రసంగ ప్రజ్ఞానిధి,విమర్శక శిఖామణి (బెజవాడ )4-శ్రీమతి తేళ్ళ అరుణ-సామాజిక వేత్త ,గౌరవాధ్యక్షులు ,నవ్యాంధ్ర రచయితల సంఘం 5-శ్రీదామెర్ల నరసింహారావు -విద్యా వేత్తసాహితీ ప్రియ౦భావకులు*(మైలవరం ) 6-భవిష్య -భావతరంగిణి సంపాదకులు-(బందరు)  .వీరందరికీ శ్రీ బుద్ధప్రసాద్ గారి చేత శాలువా జ్ఞాపిక  తెల్ల చామతుల పుష్పహారం తో పాటు 5 వేల రూపాయల నగదు కానుకగా అందించి అపూర్వంగా సత్కరించి గౌరవించారు .

  బుద్దప్రసాద్ గారు,పూర్ణ చంద్ గారు సన్మానితులందరి గురించి విపులంగా వివరించారు . సన్మానితులూ ఉచితరీతిని కృతజ్ఞతలు చెప్పారు .ఆడిటోరియం నిండిపోయి అదనపు కుర్చీలు వేయాల్సి వచ్చింది .నేనూ బందరు సభలకు వెళ్లి ఆరేళ్ళు దాటి ఉంటుంది .అందరికి ఈసభ గొప్ప జోష్ నిచ్చింది .ఇదంతా సుబ్బారావుగారి పై ఉన్న ఆప్యాయత గౌరవం కారణం .సభాన౦తరం అందరికి గొప్ప విందు నిచ్చారు .   

  సభకు ముందు నేను బుద్ధప్రసాద్ గారి ప్రక్కన కూర్చుని మాట్లాడుకున్నాం.శ్రీకాకుళం. లో కృష్ణ దేవరాయల సభలు జరపటం లేదేమని అడిగా .ఎలెక్షన్ కోడ్ అడ్డం వచ్చి అప్పుడు జరపలేదు ఈసారి చేద్దాం అన్నారు .నేను సభలకు హాజరైనప్పుడు ఎవరు ఏమి మాట్లాడిందీ చక్కగా నోట్ చేస్తానని ఆ డైరీలన్నీ ముద్రించాలనీ  లేకపోతె విలువైన సమాచారం మిస్ అవుతుందని  చెప్పారు .ఇదేమాట వేదికపైనా అందరికి తెలియజేశారు .సరే అన్నాను .

 వేదికపై నేను కృతజ్ఞత తెలియజేస్తూ మాట్లాడుతూ ‘’12ఏళ్ల కాలాన్ని పుష్కరం అంటారు .ఇవాళ ఇక్కడ కొంత హృదయభారంతో జరిగినా’’ సాహితీ పుష్కరం’’ గా ఉంది.సాహితీ వాహినులు అయిన ఆరుగురికి జీవనసాఫల్య పురస్కారం అందించటం  కనువిందుగా ఉంది .కృష్ణా జిల్లా రచయితల సంఘం జరిపిన జాతీయ సభలో నాకు ఈ  సంఘం తో మొదటి సారి పరిచయం ఏర్పడింది .అప్పుడు సెకండరి విద్యా విషయమై ఒక వ్యాసం రాయాల్సి వచ్చినప్పుడు సుబ్బారావు గారు నేషనల్ అవార్డీ గొప్పకధకులు మా అందరికి పితృసమానులు శ్రీ సోమంచి రామం  గారిని అడగటం ,ఆయన  నాపేరు  చెప్పటం , ఆవిషయం రామం గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పటం  జరిగింది .ఆ వ్యాసం రాసి పంపాను అప్పుడే సుబ్బారావు గారు కూడా మొదటిసారిగా నాతో ఫోన్ లో మాట్లాడటం .సభలోనే మొదటిసారి పూర్ణ చంద్ గారితో పరిచయం ..అప్పుడే ఇటీవలే పరమపదించిన శ్రీ కాలనాథ భట్ల వీరభద్ర  శాస్త్రి గారితో పరిచయం .అయన మా కజిన్ సిస్టర్ శారదక్కయ్య ఆడపడుచు భారతి భర్త విశాఖ లో ఉండే మాధ్స్ లెక్చరర్ శ్రీ పొన్నపల్లి రామకృష్ణయ్య వారి బంధువు . అప్పటి నుంచి   ఈసంఘం అన్నికార్యక్రమాలలో నేను పాల్గొంటూనే ఉన్నా.వారు ప్రచురించిన అన్ని పుస్తకాలలో నాతో ఆర్టికల్స్ రాయిస్తూనే ఉన్నారు .పూర్ణ చంద్ గారు ఫోన్ చేసి ‘’మాస్టారూ! ఈ టాపిక్స్ ఉన్నాయి .వ్యాసం రాయాలి మీ ఇష్టం వచ్చింది తీసుకొని రాయండి ‘’అనేవారు .’’అలాకాదు .మీరూ ఏది రాయమంటే అది రాస్తా ‘’అనే వాడిని .అలానే రాసేవాడిని .ఉయ్యూరులో మా సరసభారతి కార్యక్రమాలనన్నిటికి ఈ’’ త్రయం’’ తప్పక వస్తారు .రావటంలో ఆనందం ఉంటుదిమాకు .వేదిక ముందు కూర్చున్నప్పుడు బుద్ధప్రసాద్ గారు సుబ్బారావు గారితో ‘’దుర్గా ప్రసాద్ గారు ఎందరెందరికో పురస్కారాలిస్తారు ఆయనకు మనం ఎప్పుడూ ఇవ్వలేదు ‘’అంటే సుబ్బారావు గారు ‘’అందుకే ఇప్పుడు ఇస్తున్నాం ‘’అన్నారు .మిగిలిన విషయాలు ఈసారి .

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.44 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం.21 వ భాగం.23.11.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

ఆంధ్ర ప్రభ ఆంధ్ర జనత  పత్రికల సంపాదకుడు , ,కాలేజి రోజుల్లోనే ఖాదీ వస్త్ర ధారణ చేసిన బాల కధక రచయిత ,’’పాదచారి ‘’ఇంగ్లిష్ పత్రిక స్థాపించిన -శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు

పండితారాధ్యుల నాగేశ్వరరావు (26 మార్చి 1912 – 13 నవంబర్ 1976)  తెలుగు భాషా భారతీయ జర్నలిస్ట్.

నాగేశ్వరరావు ఆంధ్రలోని గుంటూరు జిల్లాలోని ఇంటూరులో బ్రాహ్మణ దంపతులైన మల్లయ్య మరియు భైరవంబ దంపతులకు జన్మించారు. చేనేత కార్మికుల పట్ల గౌరవంతో, ఆయన కళాశాల రోజుల నుండే ఖాదీ ధరించేవారు.

భారతదేశంలో బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాల్లో ఆయన తన వృత్తిని ప్రారంభించారు మరియు స్వాతంత్ర్యం తర్వాత తన సంపాదకీయాలతో కొనసాగారు. ఆయన ఆంధ్ర జనత మరియు ఆంధ్ర ప్రభలతో ప్రాముఖ్యత పొందారు

స్వాతంత్య్రం తర్వాత వార్తాపత్రిక మాత్రమే కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉన్నప్పుడు, పండితారాధ్యుల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ హయాంలో “కత్తి కంటే కలం గొప్పది” అని నిరూపించి ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఆయన దేవుళ్ల గురించి అనేక చిన్న కథలు రాశారు మరియు ప్రసిద్ధమైన వాటిలో “వాలి & సుగ్రీవుడు మరియు దాచిన రాముడి మధ్య పోరాటం” ఉన్నాయి.

“రైలు తప్పిన ప్రయాణికులు” అనే ఆయన రాసిన శక్తివంతమైన సంపాదకీయాలు 1956 ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు (అప్పటి భారత ప్రధానమంత్రి) మరియు సుభాష్ చంద్రబోస్ ఆయనను సందర్శించారు. ఆయన జలగం వెంగళరావు గారు, తిమ్మారెడ్డి గారు, ఎన్.జి. రంగా గారు, నీలం సంజీవ రెడ్డి గారు మరియు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వంటి వారి సన్నిహితులు. ఆయన ఎప్పుడూ ‘పేరు మరియు కీర్తి’ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోలేదు కానీ చట్టబద్ధంగా మరియు సహేతుకంగా ఉండటం ద్వారా తన రచనల నిజాయితీని ఎల్లప్పుడూ నమ్మేవారు. ఇది కలం మరియు పర్సు కోసం పోరాటాన్ని సృష్టించింది. కానీ శక్తివంతమైన కలం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండలేదు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి “పాదచారి” అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించారు.

నాగేశ్వరరావు పరవత వర్ధనిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన పెద్ద కొడుకును ఆగస్టు 1976లో కోల్పోయారు. 13 నవంబర్ 1976న గుండెపోటుతో మరణించారు.

కెరీర్

నాగేశ్వరరావు గారు ఈ క్రింది వాటికి సంపాదకులుగా ఉన్నారు: కాలక్రమానుసారం

గోభూమి (బ్రిటీష్ పాలనలో)

వాహిని పొలిటికల్ వీక్లీ (N G రంగా స్థాపించారు).

క్రాంతి పత్రిక.

ఆంధ్రపత్రిక వార్తాపత్రిక – (1943-1959) మద్రాసు

ఆంధ్రభూమి వార్తాపత్రిక – (1960) వ్యవస్థాపకుడు

సంజయ పత్రిక

ఆంధ్ర జనతా వార్తాపత్రిక (APCC – 1965)

ప్రజాప్రభ వారపత్రిక

పాదచారుల ఆంగ్ల వార్తాపత్రిక

ఆంధ్రప్రభ వార్తాపత్రిక (1966 – 1976 – ఆయన మరణించే వరకు)[1]

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-25-ఉయ్యూ

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.28 వ చివరి భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.12 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.43 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

మహాకవి కాళిదాసు కుమార సంభవం. 20 వ భాగం.22.11.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.27 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.21.11.25.

.

Posted in రచనలు | Leave a comment

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.11 వ భాగం.21.11.25.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రా మాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలవినో దినీ వ్యాఖ్య.A

Posted in రచనలు | Leave a comment

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

మహాకవి కాళిదాసు కుమార సంభవం.19 వ భాగం.21.11.25

Posted in రచనలు | Leave a comment