సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా  చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని  ఉత్తి చేతులతోదర్శించటానికి భయపడి  నిస్పృహతో ప్రాయోప వేశం చేస్తున్న వానరులకు మార్గ దర్శనం చేసి  జటాయువు  సాయపడ్డాడు .ఈ వివరాలను వాల్మీకి మహర్షి కిష్కింద కాండలో వర్ణించాడు .

సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తీ అయి అతనికి భయపడి బాబాయిని నానా మాటలు అంటాడు అంగదుడు .వానర సైన్యాన్ని పెడమార్గం పట్టించి ,సుగ్రీవునికి ఎదురు నిలిచేలా చేలని మనసులో ఆలోచనా చేశాడు .ఈవిషయం సూక్ష్మగ్రాహి అయిన హనుమ గ్రహించాడు . అంగ దుడికి నయానా భయానా చెప్పి తప్పు మార్గం లో నడవద్దని హెచ్చరించాడు .వానరులెవరూ అతన్ని అనుసరించరని గట్టిగానే చెప్పాడు .ఇవన్నీ  యువరాజు మనసు మార్చలేక పోయాయి .పిన తండ్రి కి స్థైర్యం పారిశుధ్యం ,సౌమ్యత ,సౌజన్యం ,సామర్ధ్యం వంటి సద్గుణాలు లేవన్నాడు అంగదుడు .తల్లిలాంటి వదిన తార తో కాపురం చేసిన వాడికి ధర్మం ఏమి తెలుసన్నాడు  .రామ కార్యం లో ఆలస్యం చేసిన సోమరికి  కార్య శూరత్వం తెలీదన్నాడు .ధర్మానికంటే లకష్మణుడి కోపానికి భయపడి సీతాన్వేషణకు వానరుల్ని పంపాడని  ,తనకు పట్టం కట్టడని చెప్పి  కిష్కింద కు  రానని భీష్మించాడు .తనకోసం తల్లి తార విలపిస్తూ ఉంటుందని గుర్తు చేసుకొని దర్భలు పరచి ఆమరణ నిరాహార దీక్ష కు పూను కొన్నాడు .హనుమ అంతకు ముందే వానరుల్ని యువరాజుకు సాయం చెయ్యద్దని చెప్పినా కొద్దిమంది  అంగదుడి తో పాటు నిరాహార దీక్షకు కూర్చున్నారు.ఊరికే కూర్చోక జరిగిన విషయాలు అంటే శ్రీరామ వన వాసం ,సీతాపహరణం ,జటాయువధ విషయాలను ఏడుస్తూ పాటల్లాగా పాడుకొంటున్నారు .బిగ్గ్గరగా కేకలు పెడుతున్నారు .ఆర్త నాదాలు చేస్తున్నారు .

ఈ ఆర్తనాదాలు అక్కడే పర్వత గుహలో ఉన్న సంపాతికి వినిపించాయి .అందులే తన తమ్ముడు జటాయువు పేరుకూడా వినపడటం తో మరీ కంగారు పడ్డాడు .అసలే ముసలితనం రెక్కలు తెగి పోయాయి.ఆహర సంపాదన లేక చిక్కాడు .ఇంతమందిని చూడగానే మంచి  ఆహారం చాలా రోజులకు సరిపడ్డ ఆహారం దొరికిన్దికదా అని సంబర పడ్డాడు .సంపాతి పక్షి అక్కడ ఉండి తీక్ష్ణ దృష్టితో తమల్ని గమనించటం అంగదుడు చూశాడు .కిష్కింధకు వెళ్ళలేడు ,రామ కార్యం సాధించానూ లేడు ఇప్పుడు ఈ పక్షికి బలికావలసి వస్తుందేమోనని భయపడి హనుమకు చెప్పాడు .తమ్ముడు జటాయువు రావణుడి చేతిలో చంపబద్దాడని విని వివరం తెలుసు కొందామనుకోన్నాడు కాని కదల లేడు మెదల లేడు .కిందికి దిగలేకపోయాడు .జటాయు వృత్తాంతం తెలుసుకోవాలని ఉన్న తనను దింపమని వేడుకొంటాడు .రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వేరవటం దేనికి అని అంగదుడు సంపాతిని వానర సాయం తో కిందికి దింపుతారు .

వానరుల వల్ల  తానూ బతికుండగానే తన తమ్ముడు చని పోయిన వార్త విని తల్లడిల్లాడు .ముసలితనం వలన తానేమీ పోరాడలేనని వాక్కు సాయం మాత్రం చేస్తానని వారికి చెప్పాడు .రావణుడుడు ఉండే చోటు చెబితే చాలు అన్నాడు అంగదుడు .తన కధను చెప్పుకొస్తాడు సంపాతి .పూర్వం తమ్ముడు జటాయువుతోకలిసి స్వర్గానికి వెళ్తాడు తిరిగి వస్తుంటే సూర్య కిరాణ తాపం బాగా హెచ్చుగా ఉంటె తమ్ముడు తట్టుకోలేక అల్లల్లాడుతుంటే తాన రెక్కల కింద అతడిని ఉంచుకొని కాపాడాడు దానితో ఆ సూర్య ప్రతాపానికి సంపాతి రెక్కలు కాలిపోయాయి . సంపాతి  వింధ్య పర్వతం పైన పడిపోతే ,జటాయువు జనస్థానం లో పడిపోయాడు .అప్పటినుంచి ఒకరి సంగతి మరొకరికి తెలియదు .కాని సంపాతికి దూర దర్శన శక్తి మాత్రం ఉంది .ఆ విషయాన్ని వివరిస్తాడు .ఆకాశం లో అనేక మార్గాలున్నాయని ,పిచ్చుకలు ,పావురాళ్ళు మొదటి వలయం లోనే సంచరిస్తాయని తర్వాత కాకులు  ఆ తర్వాత ,క్రౌంచ పక్షులు  ఆ తర్వాత ,డేగలు ,తర్వాతా గద్దలు  తర్వాతా హంసలు ,అన్నిటికంటే పైన వైన తేయులు విహరిస్తాయని ,పక్షులు వైన తేయ సంతతికి చెందినవని ,ఎవరి ఆహరం ఎక్కడ ఉంటె అక్కడికి వాటి ద్రుష్టి ప్రసరిస్తుందని గృధ్ర జాతికి శత యోజనం వరకు చూసే ద్రుష్టిశక్తి  ఉందని చెప్పాడు .తేరిపార చూసి లంకలో రావణాసురిడి అశోక వనం లో రాక్ష స స్త్రీల మధ్య సీతా దేవి ఉందని ,శత యోజన విస్తీర్ణ సముద్రం దాటితేనే సీతాదేవి కని పిస్తుందని అనునయంగా చెప్పాడు. అమ్మయ్యా దారి దొరికింది ప్రాణాపాయం తప్పింది అని అందరూ సంతోషపడి క్రుతజ్ఞతలు చెప్పారు .

తన తమ్ముడు జటాయువుకు ధర్మోదకాలివ్వాలనే కోరిక తనకు కలిగిందని సంపాతి అనగానే కృతజ్ఞత గా వానరులు నెమ్మదిగా మోసుకొని వెళ్లి సముద్ర తీరం వద్ద దించారు .తమ్ముడికి ధర్మోదకాలు వదిలిన అన్నను మళ్ళీ మోసుకొని వెళ్లి గుహలో చేరుస్తారు .జాంబవంతుడు సీతాపహరణ వృత్తాంతాన్ని తెలిసి నంత వరకు చెప్పమని సంపాతిని కోరాడు .అప్పుడు సంపాతి తన కొడుకు సుపార్శ్వుడు రావణుడు సీతను ఎత్తుకు పోతుండగా చూశాడని ,అతనితో పోరాటం కూడా చేశాడని ,తనకు రోజూ ఆహారాన్ని కొడుకే సంపాదించి తెచ్చిస్తాడని ఒక రోజు  ఆహారం  దొరక్క సముద్రం దగ్గరకు వెడితే సీతను ఎత్తుకు పోతున్న రావణుడిని చూశాడని ,వాల్లిద్దరినిఆహారం గా  గ్రహించటానికి సిద్ధపడితే రావణుడు దీనం గా బ్రతిమిలాడితే వదిలి పెట్టాడని ,ఆ విషయం తనకు చెప్పగానే కొడుకును కోపగించానని చెప్పాడు .సంపాతి చెప్పిన విషయాలు వానరులలో నిస్తేజాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని కల్గించాయి .సంపాతి చరిత్రను తెలుసుకోవాలని అడిగితే పూస గుచ్చినట్లు వివరించాడు .

వింధ్య పర్వత ప్రాంతం లో ‘’నిశాకరుడు ‘’అనే  దివ్య ద్రుష్టి ఉన్న మహర్షి ఉన్నాడని ,ఆయన మహిమతో తనకు రెక్కలూ చూపు రావచ్చుననే ఆశతో ఆయన్ను దర్శించానని తన చూపు పోవటానికి కారణం మహర్షి అడిగితే సవివరం గా చెప్పానని సంపాతి వివరించాడు. మహర్షి దివ్య దృష్టితో చూసి జరుగ బోయే  రామ కదను వివరించి ,సీతాన్వేషణ లో ఉన్న వానరులకు వాక్సహాయం చేస్తే మళ్ళీ రెక్కలోస్తాయని చెప్పాడని అన్నాడు .మహర్షి తాను సీతా రామ లక్ష్మణుల వన వాసం ,సీతాపహరణం రావణ ప్రలోభం ,సీత సంయమనం ,దివ్య పాయస భక్షణం ,రామ లక్ష్మణులకు నివేదించిన తర్వాతే తాను ఆరగిస్తానని చెప్పాడు సంపాతికి .తనకున్న తపో బలం తో సంపాతికి అప్పటికప్పుడే రెక్కలు వచ్చేట్లు చేయగలడు కాని రామ కార్యం లో సంపాతికి కూడా సంబంధం కలిగించాలని అలా చేయటం లేదని మహర్షి సంపాతికి వివరించాడు .తనకు కూడా రామ లక్ష్మణులను చూసి తరించాలని ఉన్నా అంతదాకా ప్రాణాలను కాపాడుకోలేనని మహర్షి అంటాడు .కాని తన ప్రభావం వల్ల సంపాతి శరీరం అంతవరకు నిలబడి ఉంటుందని అభయమిస్తాడు .

మహర్షి మాట నమ్మి సంపాతి ఎనిమిది వేల సంవత్సరాలు శరీరాన్ని కాపాడుకొంటూ ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాని వానరులకు తెలియ జేశాడు .ఇలా సంపాతి తన కధను వివరించి చెప్పుతున్డగానే అతని ఎర్రని  రెక్కలు  మళ్ళీ మొలుస్తాయి .యెగిరి చూసి సంతోష పడతాడు .ఇది శుభ లక్షణమని సీతాన్వేషణ ఫలి స్తుంది అని చెప్పటానికి కిది నిదర్శనమని భరోసా ఇస్తాడు .కోల్పోయిన పౌరుషం వానరులకు తిరిగి వస్తుంది .కృత నిశ్చయం తో సీతాన్వేషణకు దక్షిణ దిక్కుకు బయల్దేరి వెడతారు .ఇక్కడ ఒక తమాషా సంగతి గమనించాలి .సంపాతి మాట్లాడినంత సేపు హనుమ మౌనం గా ఉండిపోతాడు .ఇది విచిత్రం గా కని పిస్తుంది .మరో విశేషం  సంతాపాన్ని సంతోషం గా తాను మార్చుకోవటమేకాకుండా వానరులకూ కలిగించాడు ఆ అను భూతి .అంతకు ముందు స్వయం ప్రభ గుహలోకి ప్రవేశించిన వానరులను స్వయం ప్రభ ఎందుకు వచ్చారని అడిగితే రామ వృత్తాంతాన్ని చెప్పారు వానరులు .అక్కడ ఆమె కూడా ఏమీ ప్రశ్నించకుండా విన్నది .మౌనం లో ఎన్నో అర్ధాలను వెతుక్కో వచ్చని మహర్షి అభిప్రాయమేమో ?

రామ కార్యం లో వానరులతో పాటు పక్షిజాతికి చెందిన అన్న దమ్ములు జటాయువు ,సంపాతి సహకరించటం విశేషం .

ఆధారం –డాక్టర్ ఇలపావులూరి పాండురంగా రావు గారి –అనుదిన రామాయణం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

.

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )

 

ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్  కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన  దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా శృంగారాన్ని అర్ధం చేసుకొని ,అందులోని అందాన్ని పొందాలని సూచన గా భావిస్తారు .అది మాత్రమె కాదు ముసలితనం లో మానవులు ఆ భావనకు దూరం కావాలని క్రమంగా విసర్జించాలని సూచనా ఉంది .ఖజురాహో దేవాలయాలలో ముఖ్యమైనది శివాలయం .ఈ శృంగార భంగిమల శిల్పాలు అంతరాలయానికి వెలుపల ఉన్న  భాగాల పైనే ఉంటాయి .మానవ పునరుత్పత్తికి ఇవి సంకేతాలు .

‘’డివైన్ ఎక్టసి  –ది స్టోరి ఆఫ్ ఖజురాహో ‘’అనే పుస్తకం రాసిన శోభితా పుంజా దీన్ని ‘’దైవ పార వశ్యం ‘’(డివైన్ ఎక్స్ట సి )అన్నది ఖజురహో శిల్పాలను చూసి .అది దైవ వివాహానికి ప్రతి రూపాలన్నది .అంటే శివ పార్వతుల వివాహ  దర్పణం అని చెప్పింది .శివ రాత్రి నాడు ఈ దేవాలయానికి వేలాది భక్తులోచ్చి దర్శనం చేసుకొని పులకిస్తారు .ఇక్కడున్న అన్నిదేవాలయాలో ఇదొక్కటే శివ పూజకు ఉపయోగిస్తున్న దేవాలయం .మహా శివ రాత్రి నాడు శివ పార్వతీ కల్యాణం ఇక్కడ నిర్వహిస్తారు .హరహర మహా దేవా ఉచ్చారణతో ఆ ప్రాంతమంతా మారు మోగుతుంది .క్రైస్తవ చర్చిలలో కూడా ఆరాధన మానవ జీవితం లాగే ఉండాలని ఉంది .ఖజురహో శివాలయం లో కల్యాణం తరువాత దేవుడికి దేవేరికి గర్భాదాన కార్యక్రమానే పూజారి నిర్వహించటం విశేషం .ఇది తెల్లారే వరకు జరిగే ఉత్సవం .

శోభితా పుంజాచెప్పిన దాన్ని బట్టి ఆది దేవులు జగత్తుకు మాతా పితలు అయిన  శివ పార్వతులు జీవిత పరమార్దానికి ప్రతీకలు .విరుద్ధ ప్రకృతుల కలయికలు .మన భాషలో పురుష స్త్రీ సంగమానికి చిహ్నాలు .అవేక్కడో బయట ఉన్నవికావు మానవ అంతరంగం లోఉన్న భావనలే మగా ఆడా .ఖజురహో శిల్పాలు దొంగ చాటుగా చూసేవేమీ కాదు .అవి రాయిలో ఉన్న జీవన ధర్మాలు .శృంగారాన్ని అణచుకో వద్దని చెప్పే సందేశాలు .సెక్స్ సరదాకి ,వినోదానికి కాదని వివరించే విధానాలు .సెక్స్ ప్రధాన మైనదే అని దాన్ని తొసిరాజా అనె పధ్ధతి పనికి రాదనీ వివరించేవి .దాన్ని పవిత్ర భావం తో ఆరాధనగా చేయాలి అనే సందేశం ఇచ్చేవి .

అమెరికా విశ్లేషకుడు రాబర్ట్ ఏ .జాన్సన్ రాసిన ‘’అండర్ స్టాండింగ్ ది సైకాలజీ ఆఫ్  రొమాంటిక్ లవ్ ‘’పుస్తకం లో ‘’the great paradoxes in romantic love is that it never produces human relationship as long as it stays romantic .It produces drama during adventures ,wondrous ,intense love scenes  jealousies and betrayals  but pe0ple never seem to settle into relationship with each other a flesh and blood human beings until they are out of the romantic love stage ,until they love each other instead of being in love ‘’అని చాలా అర్ధ వంతమైన విషయాలు రాశాడు . రొమాంటిక్ ప్రేమను విసర్జించమని దీని భావం మాత్రం కాదు .అది మనం చేయలేం .మన వల్లకాదు కూడా .శివ పార్వతుల పురాణకధలు కూడా దీనినే సూచిస్తాయని మరువ రాదు .శివ పార్వతులు కోరికకు వ్యతిరేకులు కారు .దాని ప్రాధాన్యాన్ని కాదనీ అనలేదు .కాముడనే పేరున్న మన్మధుడు తపస్సు చేసుకొంటున్న శివుని చలింప చేయటానికి బాణం వేస్తె శివుడు మూడో కంటితో భస్మం చేశాడు .కాని శివపార్వతుల కల్యాణం తర్వాత పార్వతి కోరిక మేరకు మన్మధు డిని  సృస్తికార్యం ఆగి పోరాదని భావించి బతికించాడు .ఇక్కడే భారతీయులు పవిత్ర తకు ఇంద్రియ భోగానికి మధ్య సమతుల్య్తః సాధించారు .అదే ఆదర్శం గా ఖజురహో లో చెప్పారు .

రజనీష్ కూడా సెక్స్  జ్ఞాన వృద్ధి కి మార్గం  అన్నాడు .ఇండియాలోని తాంత్రిక విధానాలను పాశ్చాత్యులు తప్పుగా అర్ధం చేసుకొన్నారు . తాంత్రికుల ఆవాసం శ్మశానమే .అది చావును ఎప్పుడూ గుర్తు చేస్తుందని వారి విశ్వాసం .తాంత్రికం లో భయాన్ని జయించే చర్యలే ఉంటాయి .చావు ఉన్నతికి ఒక మార్గమని నమ్ముతారు.తాను భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉంటానని తాంత్రికుని విశ్వాసం .మురికి ,కాలుష్యం లపై భయాన్ని తొలగించటం .వీరి ప్రవర్తన ,పద్ధతులు హిందువులకు అంగీకారం కాదు .పాశ్చాత్య దేశాలలో మారుమూల గ్రామాల్లో ఇంకా సెక్స్ అంటే భయపడుతూనే ఉన్నారు .కొందరు దాన్ని అధిగమించి ముందుకు రాలేక పోవటమూ ఉంది .కాని సెక్స్ అనేది భయపడాల్సింది కాదు .అది ఆత్మ సాక్షికి శుద్ధ స్వరూపం .మెరుపు లోని కాంతి వంటిది .సృష్టికి కారణమైన ఇద్దరి మధ్యా ఉన్న తామర తూడు దారం లాఉన్న సంబంధం .

‘’ఇంటిమేట్ రిలేషన్స్ ‘’పుస్తకం లో సుదీర్ కాకర్ సెక్స్ అనేది అందులో పాల్గొన్న ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఆన్నాడు .కొందమంది స్త్రీలకూ అది అయిష్టం గా బాధాకరం గా అనిపించ వచ్చు కొందరు స్త్రీలు భర్త కొడతాడేమో నని అయిస్ట మైనా అందులో పాల్గొన్నా సంతృప్తి పొందారు.  ఇది మరీ మురికి వాడలలోని దంపతుల పరిస్తితి .మర్మాంగాల పేర్లు చెప్పటానికే సిగ్గూ బిడియం పడతారు .పూర్వం ఇండియా లో బహి రంగా ముద్దు నిషిద్ధం .ఇప్పుడు కాస్త స్వేచ్చ వచ్చింది .ఇంద్రియ సుఖం లో మనవాళ్ళు పవిత్రతను ఆశించారు .ఒకప్పుడు కండోం లను వ్యతిరేకించిన వారు ఇప్పుడు దారి లోకి వచ్చారు .గాంధి గారు ఇంద్రియ నిగ్రహం పై ఎన్నో ప్రయోగాలు చేశాడు కొన్ని విమర్శలోచ్చినా ఆయన అంతస్సాక్షిని శంకించ  లేము. .రామాయణం లో సీత ఒక బలహీన ఆబల అని కొందరి భావన .కాని పార్వతి అలా కాదు శక్తి శ్వరూపిణి.

శివుడు శక్తి లేనిదే ఏ పనీ చేయలేడు ఆశక్తియే పార్వతీ దేవి .వారిద్దరూ ఒకే నాణానికిబొమ్మా బొరుసు వంటి వారు .ఇ .ఒకరు లేక పోతే ఇంకొరు లేరు .కనుక పార్వతి మహిళలకే ప్రతీక మాత్రమె కాదు ,ఆమె పురుషునికీ ప్రతేకయే వారిద్దరిది అర్ధనారీశ్వర సంబంధం అని మర్చి పోరాడు .పాశ్చాత్య దేశాలలో దేవుడంటే పురుషుడిగానే చూపిస్తారు .చర్చిలలో ఫాదర్స్ ఉంటారుకాని మదర్స్ ఉండరు .కాని ఎందరో క్రిస్టియన్ పౌరాణిక మహిళలు ఉన్నా ,మహిళా క్రిస్టియన్ మతాధికారులు ఇటీవలి కాలం వరకు లేరు .ప్లాటో నుండి అరిస్టాటిల్ వరకుఫిలాసఫర్ లలో  ఆడవాళ్ళు కు స్థానమే లేదు .బెర్ట్రాండ్ రసెల్ రాసిన ‘’హిస్టరీ ఆఫ్ వేస్త్రెన్ ఫిలాసఫీ ‘’పుస్తకం లో ఒక్క మహిళ పేరు కూడా లేక పోవటం బాధ కలిగిస్తుంది .’’ది పాషన్  ఆఫ్ దివేస్త్రెన్ మైండ్ ‘’లో రిచార్డ్ టర్నాస్’masculinity of thought as fundamental to the women struggle to establish our human autonomy from nature .The  evolution of the western mind has been driven by a heroic impulse to forget an autonomous rational human self by separating itself from the primordial unity with nature ‘’అని రాశాడు .ఇటీవలి కాలం లో మగాడు ‘’మ్రుగాడు ‘’గా మారి ప్రవర్తిస్తున్న తీరు ఏక పక్షం గా మగాడు తీసుకొనే నిర్ణయాలను ఎత్తి చూపాడు .ఇవన్నీ ఆలోచిస్తే మనం ఖజురహో- శివ పార్వతుల లోక కల్యాణానికి  ఒక ప్రతీకాత్మక  ప్రత్యెక నిదర్శనమని తెలుస్తోంది .మహిళకు మగవాడికి భావాత్మక సమతుల్యాన్ని పరస్పర గౌరవాన్ని ఖజురహో దేవాలయాలు సందేశం గా తెలియ జేస్తున్నాయి .

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూ

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గురుకుల్ ట్రస్ట్ బతికించండి -స్నిగ్ధా వ్యాస్ –

అదొక సరస్వతీనిలయం. నిజాం రాజుల మీద, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయాలన్న ఉన్నత ఆశయంతో ఊపిరిపోసుకున్న ట్రస్ట్ ‘గురుకుల్’. ఎంతోమంది దాతల ఔన్నత్యంతో బన్సీలాల్‌వ్యాస్ ఆ ట్రస్టును విద్యాలయంగా నెలకొల్పారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన వారసులు అష్టకష్టాలతో బతుకుతున్నారు. వారి కుటుంబీకులలో ఒకరైన స్నిగ్ధావ్యాస్.. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌లో కేవలం అయిదువేల జీతంతో పనిచేస్తున్నారిప్పుడు. వేలకోట్ల రూపాయల విలువ చేసే ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమైపోవడం, కొన్నింటిని గత ప్రభుత్వాలు అమ్ముకోవడం.. వీటన్నిటిమీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టడంతో.. మరోసారి ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్నిగ్దావ్యాస్ మాట్లాడారు..

పూర్వం మాది కోల్‌కతా. నాన్న పేరు హరిప్రసాద్ పండిట్. నేను అక్కడే పుట్టి పెరిగాను. మా అన్నయ్య బట్టలషాపు నడిపేందుకు హైదరాబాదుకు వలస వచ్చాడు. అప్పట్లో మాదేమీ ఉన్నోళ్ల కుటుంబం కాదు. ఉన్నంత వరకు బాగానే ఉండేవాళ్లం. మా అన్నయ్య హైదరాబాదులో ఉన్నందున నేను కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది. మేము బ్రాహ్మణులం. సంప్రదాయ పద్ధతులను పాటించేవాళ్లం. అలాంటి గౌరవ కుటుంబీకులకే నన్నిచ్చి పెళ్లిచేయాలని మా కుటుంబీకులు భావించేవారు. చుట్టాల ద్వారా సంబంధం వెతుకుతున్నప్పుడు బన్సీలాల్ కుటుంబం గురించి తెలిసింది. బన్సీలాల్, జానకీదేవిలకు ఒక కొడుకు, మరో కూతురు. కొడుకైన దేవేంద్రనాథ్‌కు ఇద్దరు కొడుకులు సురేంద్రనాథ్, రవీంధ్రనాథ్. వాళ్లలో రెండో అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్లి అయ్యాక వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం గొప్పతనం గురించి తెలిసింది. దేశానికి ఎంతో సేవ చేయాలన్న ఉత్తమ ఆశయంతో బన్సీలాల్ అప్పట్లో గురుకుల్ నెలకొల్పారు. అందుకు స్పందించిన కొందరు దాతలు భూముల్ని దానం చేశారు. నాకు తెలిసినంత వరకు మా పెద్దలు చెప్పిన సమాచారం మేరకు – నిజాం రాజులు, ఆంగ్లేయుల మీద పోరాడేందుకు యువతను సన్నద్ధం చేయడం గురుకుల్ లక్ష్యమట. అప్పట్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, ప్రాణత్యాగాలకు సైతం వెనకాడకుండా.. బన్సీలాల్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. చదువుతోపాటు వ్యక్తిత్వ నిర్మాణంలోను గురుకుల్ కృషి ఆదర్శనీయం.
జీతాలకే దిక్కులేదు..
గురుకుల్ ట్రస్టు కింద ఎన్ని వందల ఎకరాల భూమి ఉందో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఘట్‌కేసర్‌లో ఉన్న గురుకుల్‌ట్రస్ట్‌ను మాత్రం ఆర్థికసంక్షోభాలతోనే నడుపుతున్నాము. నా భర్త కొన్ని ఇబ్బందుల వల్ల చనిపోయాడు. నేనిప్పుడు ఒక్కదాన్నే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలేతై వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ఒకరు మద్రాసులో మరొకరు రాజస్థాన్‌లో ఉంటున్నారిప్పుడు. అందమైన భవనాలు నిత్యయఙ్ఞంతో ప్రత్యేక హాస్టల్ వసతి గల ఈ విద్యాలయాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదొక అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం లాభం! మా పరిస్థితి మారలేదు. వందల ఎకరాల ఆస్తులను గురుకుల్ అభివృద్ది కోసమే కేటాయించాలన్నది నా అభిప్రాయం. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్నప్పటికీ మాతృసంస్థ అయిన గురుకుల్‌కు పైసా చెల్లించడం లేదు. జిల్లాలోనే ఏకైక ఎయిడెడ్ కళాశాలగా ఉన్న గురుకుల్ కళాశాలలో పోస్టులను భర్తీ చేయలేదు. ట్రస్టులో మా మామగారి తల్లి జానకీదేవి, బి.కిషన్‌లాల్‌లు సభ్యులుగా ఉండేవారు. అప్పుడు గురుకుల్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. ఆ తర్వాత ఎండోమెంటు పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మాలాంటి వాళ్లం ఏమీ చేయలేక బాధపడుతూ కూర్చున్నాం.
గురుకుల్ అభివృద్ధిని ఎండోమెంట్ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గురుకుల్‌ను ట్రస్టులోనే కొనసాగించాలి. సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నప్పటికీ చాక్‌పీసుల కోసం, కనీస అవసరాల కోసం దాతలను అభ్యర్ధించాల్సి వస్తోంది. గురుకుల్‌లో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వమే విద్యను అందించే ఏర్పాట్లు చేస్తే మంచిది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తే ఇటు హైదరాబాద్‌కు దగ్గర్లోని ఘట్‌కేసర్, కీసర, బీబీనగర్, ఉప్పల్ మండలాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాకు వేతనాల వరకు అయితే – గత ఆరేళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ ట్రస్టు ద్వారా అందుతున్నాయి..” అని ముగించారు స్నిగ్ధావ్యాస్.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా’ర్గ ”దర్శకుడు”-కె.వి రెడ్డి

సాధారణంగా కళాఖండాలుగా పేరొందిన చిత్రాలు ఆర్ధిక విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఆర్థికంగా విజయం సాధించిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందడం కూడా అరుదే. అయితే కళని, కాసుని కలగలపి ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు రూపొందించిన దర్శకుల్లో కదిరి వెంకటరెడ్డి(కె.వి.రెడ్డి)స్థానం చాలా ప్రత్యేకం. ‘భక్త పోతన’.’యోగి వేమన’ వంటి చిత్రాలను తీసిన ఆయనే ఆ తరువాత ‘పాతాళభైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి అద్భుతజానపదాలను, ‘మాయాబజార్’ వంటి ఆణిముత్యాన్ని ప్రేక్షకులకు అందించారు. వినోదభరిత చిత్రాలతో పాటు ‘పెద్దమనుషులు’ వంటి ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలూ తీశారు. ‘దొంగరాముడు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’ వంటి అద్భుత సాంఘిక చిత్రాలు రూపొందించారు. 35 ఏళ్ల సుదీర్ఘమైన తన చలనచిత్రజీవితంలో ఆయన తెలుగులో 14, తమిళంలో 3, హిందీలో ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ప్రతి సినిమా దర్శకత్వశాఖలో కొత్తగా ప్రవేశించేవారికి ఒక పాఠ్యాంశమే. ఆయన పద్ధతుల్ని చాలా మంది అనుసరించారు కానీ ఆయన మాత్రం ఎవరినీ అనుసరించలేదు, అనుకరించలేదు.

కె.వి.రెడ్డి పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే చిత్రం ‘మాయాబజార్’. జనబాహుళ్యంలో ఉన్న కథను ఆ చిత్రంలో ‘స్ట్రెయిట్ నేరేషన్’లో ఆయన చెప్పారు. అయితే అందులో ‘హైడ్ అండ్ సీక్’ పద్ధతిలో పాండవుల ప్రస్థావన మొదటి నుంచీ వస్తున్నా, వారు తెరపై ఎక్కడా కనిపించని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శక దిగ్గజం కేవీ. ఈ విధానం ఏకపాత్రాభినయాల్లోనూ, స్త్రీ పాత్రలేని నాటకాల్లోనూ సుపరిచితమే అయినా, తెరపై దానిని అద్భుతంగా పర డించిన తీరు నేటికీ ఆకట్టుకుంటుంది. నేటి మేటి దర్శకులుగా కీర్తిగడించిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జార్జ్ లూకాస్ వంటివారు జపాన్ దర్శకుడు అకిరా కురసోవా తెరకెక్కించిన ‘వైప్ షాట్స్’ను వేనోళ్ళ కీర్తించారు. లూకాస్ తన ‘స్టార్ వార్స్’ చిత్రాల్లో వైప్ షాట్స్ రూపొందడానికి అకిరా ప్రభావమే కారణమని చెబుతారు. దాదాపు కురసోవా కాలంలోనే ‘పాతాళభైరవి’ (1951)లోనూ, ఈ ‘మాయాబజార్’లోనూ కేవీ అనుసరించిన ‘వైప్ షాట్స్’ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు అని ఈ సినిమాలను చూస్తే అర్థమవుతుంది. అంత గొప్ప దర్శకుడు కేవీ. అలాగే ఈ చిత్రంతోనే ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణునిగా ఆవిష్కరించిన ఘనత కూడా ఆయనదే.
ఇవాళ్టి రోజుల్లో షాట్ పూర్తి కాగానే ఆర్టిస్టులు ఫ్లోర్ బయటకి వెళ్లి బాతాఖానీ ప్రారంభిస్తుంటారు. లేదా కార్‌వాన్‌లో వెళ్లి కూర్చుంటారు. కానీ దర్శకుడు కె.వి.రెడ్డి పద్దతి అదికాదు. ఆర్టిస్ట్ సెట్ బయటకు వెళ్లడానికి ఆయన ఒప్పుకొనేవారు కాదు. పని ఉన్నా లేకపోయినా షూటింగ్ చూస్తూ అలా కూర్చోవలసిందే. అలాగే సెట్లో గట్టిగా మాట్లాడటానికి వీల్లేదు. తనకు ఇబ్బందిగా అనిపిస్తే ‘ఏమా ఫిష్ మార్కెట్’ అనేవారు. అది కేవీ ఊతపదం. ఆయన షూటింగ్స్‌కు విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. పాత్రికేయులకు కూడా ప్రవేశం ఉండేదికాదు. మరీ తప్పనిసరి అయితే ముగ్గురో, నలుగురో విజిటర్స్‌కి సెట్‌లోకి అనుమతి లభించేది. వాళ్లయినా పది నిముషాల సేపు షూటింగ్ చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోవాలి.
ఆయన చాలా డిసిప్లిన్ కలిగిన దర్శకుడు. పరిశ్రమలో ఆయన తరువాత అంత క్రమశిక్షణని పాటించే వ్యక్తిగా ఎన్టీఆర్ పేరు తెచ్చుకొన్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆరున్నరకే మేకప్‌తో సహా ఆర్టిస్టులు సెట్‌లో ఉండేవారు. లేకపోతే కేవీ ఏమన్నా అంటారేమోనని పెద్దపెద్ద ఆర్టిస్టులు సైతం హడలిపోయేవారు. అదే పద్ధతిని దర్శకునిగా ఎన్టీఆర్ కూడా ఫాలో అయ్యేవారు. తను దర్శకుడు కావడానికి ప్రేరణ కె.వి.రెడ్డి అని ఎన్నో సందర్భాల్లో ఎన్టీఆర్ వెల్లడించారు.( మరో విషయమేమిటంటే కేవీ రెడ్డి శిష్యులు చిత్రపరిశ్రమలో ఎందరో ఉనా ్న అవసరమైన సమయంలో ఆయన్ని ఆర్థికంగా ఆదుకొని గురుదక్షిణ చెల్లించిన ఏకైక శిష్యుడు ఎన్టీఆర్. ‘శ్రీకృష్ణ సత్య’ చిత్రాన్ని కేవీ దర్శకత్వంలో నిర్మించారు ఎన్టీఆర్. ‘ఉమాచండీగౌరీశంకరుల కథ’, ‘సత్యహరిశ్చంద్ర’ అపజయంతో ‘ప్లాప్ చిత్రాలతో తన కెరీర్ పూర్తవుతుందేమోననే ఆందోళన చెందిన కేవీకి ఊరట కలిగిస్తూ ఎన్టీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం ఆయనకి ఎంతో మానసిక బలాన్ని ఇచ్చింది. ‘శ్రీకృష్ణ సత్య’ హిట్‌తో ఆయన సంతృప్తిగా తన వృత్తికి గుడ్‌బై చెప్పారు. ఆ సినిమా విడుదలైన కొద్ది కాలానికే కేవీ కన్నుమూశారు.)
ఒక సినిమా పూర్తయిన తరువాతే మరో సినిమా గురించి కేవీ ఆలోచించేవారు. తను ఎన్నుకొన్న కథని ఎటువంటి డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పడం కేవీ స్క్రీన్‌ప్లేలో ప్రత్యేకత. నేల క్లాసు ప్రేక్షకుడికి పూర్తి వినోదం ఎలా అందించాలా అనే ఆయన ఆలోచించేవారు.
కె.వి.రెడ్డి క్రమశిక్షణ, కార్యదక్షత ఈ కాలం వారికి చాదస్తంగా అనిపించవచ్చు. అవసరానికంటే ఎక్కువగా షాట్స్ తీసేసి సినిమాలో ఏ షాట్ ఉంచాలో ఏది తీసెయ్యాలో తెలీక ఎడిటింగ్ రూమ్‌లో తికమక పడే దర్శకులు కె.వి. రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే సినిమాని ఎన్ని అడుగుల్లో తీయాలో ముందే పక్కాగా అనుకొని దానికి తగ్గట్లుగానే సినిమాలు తీసిన దర్శకుడాయన. స్క్రిప్ట్ రీడింగ్ సమయంలోనే ఏ షాట్ నిడివి ఎంత ఉండాలో అనుకొని అంత నిడివిలో తీసిన ఏకైక దర్శకుడు కె.వి.రెడ్డి.
ఆయన సీన్ మొత్తం వివరించి నటించమని చెప్పేవారు. రెండు మూడు రకాలుగా ఆర్టిస్టులు చేసి చూపించేవారు. అవీ నచ్చకపోతే మరోలా చెయ్యమని చెప్పేవారు తప్పితే ఇలా చేయాలని నటించి చూపించే అలవాటు ఆయనకుండేది కాదు. ఇలాగే చేయండని నటించి చూపించకుండా నటీనటులకే స్వేచ్ఛ ఇచ్చి వారి నుంచి తను అనుకొన్న ఎఫెక్ట్ రాబట్టుకొనేవారు కేవీ.
దర్శకునిగా మారడానికి ముందు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవంతో తను ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా దానికి సంబంధించిన బడ్జెట్, ప్లానింగ్ అంతా కేవీ తయారు చేసేవారు. పాత్రకు తగిన ఆర్టిస్టులను నిర్ణయించడం, వారితో పారితోషిక వివరాలు మాట్లాడటం ఆయనే చేసేవారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే షూటింగ్ సమయంలో తనని, నిర్మాతని ఇబ్బంది పెట్టని నటీన టులను, సాంకేతికనిపుణులను ఆయన జాగ్రత్తగా ఎన్నుకొనేవారు. ‘నాకు సహకరించిన జీనియస్ కంటే సహకరించే సామాన్యమైన వారు చాలు బ్రదర్’ అనేవారట ఆయన.
అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకత. భారీ తారాగణంతో రూపుదిద్దుకొన్న ‘మాయాబజార్’ చిత్రం అనుకొన్న బడ్జెట్‌లో పూర్తికాదేమో అనే భయంతో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మధ్యలో షూటింగ్ ఆపేస్తే, తను చెప్పిన బడ్జెట్‌కు ఒక్క రూపాయి ఎక్కువైనా దాన్ని తనే భరిస్తానని వారికి అభయం ఇచ్చి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు కె.వి.రెడ్డి. తెలుగుజాతి గర్వించే చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకునిగా ప్రేక్షకుల హృదయాల్లో కె.వి.రెడ్డి స్థానం ఎప్పటికీ పదిలం. అయితే ప్రభుత్వమే ఆనాడు ఆయన్ని గుర్తించలేదు. ఏ అవార్డుతోనూ సత్కరించలేదు. (నేడు కె.వి.రెడ్డి జయంతి)

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -11

బ్రాహ్మణాల కదా కమామీషు -11

శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు  అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల యజ్ఞయాగాదుల గురించి వివరణ ఉంది .ఇందులో రాజసూయ యాగం గురించి సంపూర్ణం గా ఉంది .

రాజ సూయ యాగం

రాజ్యాధికారానికి వచ్చిన రాజు రాజసూయ యాగం చేయాలి. దీని వల్లరాజు ప్రతిష్ట పెరగటమేకాక పవిత్రత కూడా పెరుగుతుంది .ఇందులో 6 సోమయాగాలు ,2పశు యాగాలు ,129ఇష్టులు ఉంటాయి ఏడు దర్వీ హోమాలతో పద్నాలుగు నెలల్లో పూర్తవుతుంది .ఫాల్గుణ శుక్ల పాడ్యమి నాడు రాజసూయాన్ని ప్రారంభిస్తారు .అభిషేక సంస్కారం చేసి ఆరు యాగాలు చేసి ,అభిషేచనీయ మనే సోమ యాగం తో మధ్యాహ్న సవనం  ,ప్రధాన ఆహుతి చేసిన తర్వాత బ్రహ్మ గారు రాజు చేయి పట్టుకొని సభ్యులకు ,ప్రజలకు ఇతడు రాజు అని పరిచయం చేస్తాడు .తరువాత అభిషేకం జరుగుతుంది .సముద్రం నది ,సరస్సు ,సెలయేరు మొదలైన పదహారు పుణ్య తీర్ధాలలో ని పవిత్ర జలాన్ని సేకరించి ఇరుగు నెయ్యి ,పాలు తేనే మొదలైన పంచాగవ్యాలను కలిపి రాజును అభి షెకిస్తారు .దీనికి మేడి పాత్రను ఉపయోగిస్తారు .

విల్లు బాణం పట్టుకొని రాజు పులి తోలు పరచిన మేడిసింహాసనం పై ఆహవనీయాగ్ని దగ్గర కూర్చుంటాడు .ఆరు పార్ధ హోమాలు చేస్తారు .మహేంద్ర స్తోత్రాన్ని ఉద్గాత పఠిస్తాడు .అధ్వర్యుడు బ్రహ్మా ,హోత ,ఉద్గాత రాజు చుట్టూ నిలుచుని  పవిత్ర జలాలతో అభిషేకిస్తారు .తర్వాత రాజు నూతన వస్త్రాలు ధరిస్తాడు ..మళ్ళీ ఆరు పార్ధ హోమాలు చేస్తారు అందులో ‘’రత్నినాం హవీ షింఛి ‘’అనే పన్నెండు ఇష్టులు చేస్తారు .ఈ కార్యక్రమం వలననే రాజ ఉద్యోగులకు రత్నిన్ అంటే రత్నాలు అనే పేరొచ్చింది . వీరే పురోహిత ,సూత ,సంగ్రహీత్రు ,అక్షావాప ,క్షత్రి ,గోణికర్తన ,పాలాగల ,తక్షన్ ,రధకార మొదలైన వారు .

రాజు మూడు గుర్రాలు ఇద్దరు అంగ రక్షకులు గల రధాన్ని ఎక్కి ఒక వీరుడితో ద్వంద్వ యుద్ధం చేసి జయిస్తాడు .పరిహాసానికి తన బంధువులకు చెందిన గో సమూహం మీదకు దండెత్తి ,జయించి ,కొంత దనం రాజ్య భాగం వారికి ప్రతి ఫలం గాఇస్తాడు .తర్వాత అధ్వర్యుని తో పాచిక లాడుతాడు .ఇందులో పందెం ఆవు .దాన్నీ జయిస్తాడు .సోమయాగం తర్వాత శునస్షేఫుని వృత్తాంతాన్ని రాజు పఠిస్తాడు..మర్నాటి నుంచి పది రోజులు ‘’సంసృపాం హవీం షి ‘’అనే పది ఇష్టులు చేస్తారు .పదకొండవ రోజు ‘’దశ పేయం ‘’చేస్తారు ఈ సోమయాగం లో పది చమనలు అంటే పాత్రలు ఉపయోగిస్తారు .పది మంది ఋత్విక్కులు పాల్గొంటారు అందుకే దశపేయం అయింది .  ‘’కేశవా నీయ ‘’అనే సోమయాగం ఒక ఏడాది తర్వాత చేస్తారు .తర్వాత వ్యుస్టిద్విరాత్ర ,క్షత్రస్య ధృతి అనే సోమయాగ నిర్వాహణ జరుగుతుంది .దీనితో రాజ సూయం సమాప్తమౌతుంది .ఈ యాగం లో ప్రధాన దేవత వరుణుడు ..’’వరునసవో వా యేష యద్ రాజ సూయం ‘’అని ఈ  బ్రాహ్మణం  చెప్పింది .రాజ సూయ ,అశ్వ మేధ ,పురుష మేధ ,సర్వమేద యాగాలు క్షత్రియ యాగాలు .రాజ సూయం లో రాజును ప్రజా పతికి ప్రత్యక్ష ప్రతి నిదిగా పేర్కొన్నారు .ఈ బ్రాహ్మణం లో పద్నాలుగు కాన్దలున్నాయి .

అగ్ని స్మార్తాగ్ని అని శ్రౌతాగ్ని అని రెండు రకాలు .వివాహం అయిన గృహస్తు స్మార్తాగ్ని ని సేవించాలి .స్మార్తాగ్ని తో చేసే యజ్ఞాలన్నిటికీ పాక యజ్ఞాలంటారు .వీటిని చేసిన వారు పాక యాజులు .ఇందులో ఔపోసన హోమం ,విశ్వ దేవం ,పార్వణ యజ్ఞాలు, ఇస్టకాలు మొదలైన ఏడు యజ్ఞాలుంటాయి..గార్హ పత్యం ఆహవనీయం ,దాక్షిణ్యం ,సభ్యం అని శ్రౌతాగ్ని నాలుగు రకాలు .దీని విదానం లో  గాంధార ,కేకయ ,సాల్వ  కురు పాంచాల కోసల దేశాది ప్రస్తావన వస్తుంది

ఒక సంవత్సరం పాటు చేసే ‘’సౌత్రామణి యజ్ఞం ‘’గురించి ఇందులో ఉన్నది .ఈ బ్రాహ్మణం లో అప్పుడే పుట్టిన బౌద్ధ ,సాంఖ్య మతాల ప్రస్తావన కని పిస్తుంది .జనమేజయుడు కురు రాజు గా పేర్కొన బడ్డాడు .  పాండవ  ప్రస్తావన ఉండదు .ఇందులో అర్జున శబ్దం కేవలం ఇంద్రుడికే పరిమితం .జనకుడు మిదిలాదిపతిగా, సీత కు జనకుడిగా చెప్ప బడ్డాడు .ఊర్వశీ పురూరవోపాఖ్యానం శకుంతల దుష్యన్తోపాఖ్యానమూ ఉన్నాయి .భరతుని ప్రస్తావన ఉంది .ప్రళయానికి సంబంధించిన మను –మత్స్యాల వృత్తాంతం రమణీయం గా వర్ణించ బడింది .శుక్ల యజుర్వేదం లో మాధ్యందిన ,కాన్వశాఖా భేదం వలన మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండు ఉన్నాయి ఈ బ్రాహ్మణాన్ని యాజ్న్య వల్క్య మహర్షి ముసలితనం లో రాసి ఉంటాడని భావిస్తున్నారు .పాంచాల దేశానికి చెందినగొప్ప యాజ్ఞికుడు ఆరుణి శిష్యుడే యాజ్న్య వల్క్యుడు .జనక రాజు ఆస్థాన సభాపతి యాజ్ఞావల్క్యుడే .దీనికే వాజసనేయ బ్రాహ్మణం అని కూడా పేరుంది .,

ఈ బ్రాహ్మణం క్రీ పూ 800-500మధ్య కాలం నాటిదని చెపుతున్నారు .మాధ్యందిన శతపదానికి హరిస్వామి ‘’శ్రుత్యర్ధ వివ్రుతి ‘’అనే ప్రసిద్ధ భాష్యం రాశాడు ..అవంతీ రాజు విక్రమాదిత్యుని ఆస్థానం లో ధర్మాధ్యక్షుడు ,దానాధ్యక్షుడు గా హరిస్వామి ఉండేవాడు .తండ్రి నాగ స్వామి. హరిస్వామికి ‘’సర్వ విద్యా నిధాన కవీన్ద్రాచార్య సరస్వతి ‘’బిరుదు ఉంది .ఇతని భాష్యం సమగ్రం గా దొరక లేదు .దొరికిన దానిలో అతని గాంభీర్య విధానం కని  పిస్తుంది .దీనికి సాయణుడు సమగ్రమైన భాష్యం రాశాడు .అరి వీర భయంకరుడు ,వైదిక ధర్మ సంరక్షకుడు అయిన హరిహర రాయలు యజ్న విధిని పూర్తిగా తెలియ జేసే ఒక గ్రంధానికి ఒక దానికి  వ్యాఖ్యానం  రాయమని కోరితే సాయణుడు శత పద బ్రాహ్మనానికి వ్యాఖ్యానం రాశాడు .కనుక సంహితల తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని పొందింది శత పద బ్రాహ్మణం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1

 

మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా ,ఇప్పటికీ లక్షలాది దేశీయులు వేలాది విదేశీయులనుఖజురాహో ఆకర్షిస్తోంది .అసలా శిల్పులు ,రాజులు ఏమి ఆశించి వీటిని నిర్మించారనేది అప్పటి నుచి ఇప్పటిదాకా ప్రశ్నార్ధకం గానే ఉండి పోయింది .ఖజురహో ను దర్శించిన ఇంగ్లాండ్ దేశీయుడు ,బి బి సి ప్రతినిధి గ్రంధకర్త మార్క్ టుల్లి ఈ విశేషాలను తన పుస్తకం ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘’లో చర్చించాడు.అందులోని ముఖ్య విషయాలనే నేను మీకు అందిస్తున్నాను .

మనిషిని అనై తిక నుండి కాపాడేది వివాహ బంధమొక్కటే అని అన్నిదేశాల వారి నమ్మకం . వివాహం కాని వారంతా పాపులు అని క్రైస్తవమతాధిపతులు కొందరు భావించారు .ఆదినికత పెచ్చు  పెరిగిన ఈ కాలం లో  విశ్రుమ్ఖలత  పెరిగి,వివాహం లేకుండానే అన్నీ జరిగి పోతున్నాయి .మరి ఈ రెండిటికీ సమతుల్యం సాధించాలేమా?సాధించాలంటే మార్గం ఏమిటి ?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి . దీన్ని గూర్చి జంగియన్ అయిన రశ్నా’’స్వేచ్చ హద్దులు దాటుతోంది ఇది నిజమే .ఇప్పటి పరిస్తితి  మల బద్ధకం నుండి  అతిసారానికి (కాన్ ష్టి పేషన్ నుండి డయేరియా ) పాకినట్లుంది అన్నది .దీనికి కారణం తలిదండ్రులు భౌతికతకే అధిక ప్రాధాన్యత నివ్వటమే అన్నది .ఆధునిక స్త్రీల వస్త్రధారణ కూడా రెచ్చ గొట్టేట్లు ఉండటం బాధాకరమనీ చెప్పింది .

మహిళను సెక్స్ సింబల్స్ గా వస్తు విక్రయానికి బ్రాండ్ ఎమ్బాసిడర్లుగా మార్చి చూపింటచటమూ పతనానికి కారణమే ,కారు నుండి బారు సబ్బు వరకు స్త్రీ లనే ఆడ్స్ కు వాడి వారిని అవమానిస్తున్నారు . వారిది తెలుసుకోకుండా అందులో ధన సంపాదనే చూసుకొని మోస పోతున్నారు .ఇతర పాశ్చాత్య దేశాల కంటే డ్రెస్ కోడ్ విషయం లో ఇండియా కు ప్రత్యేకత ఉండేది. ఇప్పుడా సరిహద్దు చెరిపేశారు .చానళ్ళ ప్రకటనలో సెక్సీ గా  హక్సీ గా మాట్లాడటం ఎక్కువై .ఇది వరకు ఎప్పుడో కాని విని పించని సెక్స్ పదం ఇవాళ ఒక మంత్రమే అయింది .ఇది దారుణం .ప్రతిదానికీ ‘’సెక్సీ సెక్సీ ‘’అంటూ రోదచేసి దాని పవిత్రతను బజారు పాలు చేస్తున్న్నారు .ఒకప్పుడు బ్రిటన్ లో మహిళా వోటు హక్కు కోసం ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పోరాట ఫలితం గా పొందారు. తరువాత సమాన హక్కుల ఉద్యమం చేసి సాధించారు .ఇప్పుడు సంస్కృతిలో సెక్స్ విపరీత ధోరణుల చొరబాటు (హైపర్ సేక్సువలై జేషన్ )పై ఆందోళన చేస్తున్నారు .ఇది అయిస్టతకు ఒక చిహ్నమే .

ఇప్పుడు మహిళలు కొత్త మహిళా విధానం _(న్యూ వేవ్ ఆఫ్ ఫెమినిజం )పై ద్రుష్టి పెట్టారు .దీనివలన స్త్రే పురుషుల మధ్య శక్తి సంబంధాలపై బలమైన ముద్ర పడుతుంది .సమాన హక్కులు సమాన హోదాలు జీతాలు మహిళలు సాదించుకొన్నారు .బ్రిటన్ లో కొన్ని మార్పులొచ్చాయి .పెళ్ళిలో రేప్ చట్ట వ్యతిరేకమైంది .పని చేసే చోట సెక్సువల్ హెరాస్ మెంట్ జరిగితే కోర్టులో కేసు వేయ వచ్చు .ప్రసూతి సెలవు పొందారుమహిళలు .కేధలిక్ ల కబంధ హస్తాల నుండి విడిపించుకొన్న ఐరలాండ్ దేశం లో ఇప్పుడు సుఖ శాంతులేక్కువగా ఉన్నాయిసెక్స్ ను అర్ధం చేసుకోవటం లో అనేక పద్ధతులు కలిసి కట్టుగా పని చేస్తున్నాయి .అతి సెక్స్ పై వెనుకడుగు వేస్తున్నారు .ఇది శుభ సూచకమే .

ఇండియాలో ‘’కామ సూత్ర’ వాత్సాయనుడి చేత ’రచింప బడింది .మానవ ప్రవర్తనను భారతీయులు శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించారు .ధర్మ ,అర్ధ ,కామ మొక్షాలను ఎలా పొందాలో వివరం గా చర్చించారు .కామ సూత్ర రచనలో మూడవదైన కామాన్ని అలక్ష్యం చేయకుండా ఉపెక్షిచకుండా దానినీ శాస్త్రీయం గానే ఆలోచించారు .కామ సూత్ర అంటే సెక్స్ గైడ్ అనుకోవటం పొరబాటు .నైతికతను వాత్సాయనుడు వదిలి పెట్టలేదని గుర్తించాలి .ప్రతి అధ్యాయం చివరా ఇతరుల భార్యలను ఎలా ముగ్గు లోకి దించ వచ్చో చెప్పాడు ఈ టెక్నిక్కులు వ్యభిచారానికో ,అసంగత శృంగారానికో కాదని ,భర్తలు భార్యల చేత మోస గింప బడకుండా ఉండటానికే నని భర్త భార్య కోరికలను తీర్చి సంతృప్తి చెందించ టానికే నని వివరించాడు .కామ సూత్ర మగాళ్ళకు మాత్రమె సంబంధించిందికాదు .ఆడ వాళ్లకు కూడా సెక్స్ కోరికలు ఉంటాయని మగాడు గ్రహించాటానికే .ఆ కోరికలనుఎలా సంతృప్తి పరచాలో తెలియ జెప్పటానికే వాత్సాయనుడు కామ సూత్ర రాశాడు .కన్యలు మంచి భర్తను ఎలా పొందాలి ,ఆడామగా మర్మాంగాల చర్చ ఎలా ఆరోగ్య వంతం గా చేయాలి ,అనే వాటికి మార్గ దర్శకాలు రాశాడు .కామ సూత్రా లో వర్ణింప బడిన స్త్రీలు పప్పు దద్దమ్మలు కాదు. శృంగారం లో అన్గారాన్ని రంగ రించిన స్త్రీమూర్తులు .అధిక చేత ఉన్న వారు .సెక్స్ లో వారికోరికలు ఇష్టాలు ,భంగిమలపై పొందే ఆనందం దీని వల్ల మగాడు చేజారిపోకుండా చూసుకోవటం వివరించాడు .స్త్రీల చురుకుదనాన్ని బాగా వర్ణించాడు ఇవన్నీ చూసి ,చదివి మగాడు జాగ్రత్త పడాల్సినవే .

వాత్సాయనుడు కొత్త మార్గం చూపించాడు కామ సూత్రాలలో .’’సెక్స్ లో ప్రేమ’’ ‘’అనే ది ముఖ్యం గా బల పరచాడు .కన్య భర్తను నమ్మి ప్రేమ తో అతని హృదయాన్ని జయించాలని బోధించాడు .కనుక కామ సూత్రలో వాత్సాయనుడు  కామం తో కూడిన ప్రేమకు శృంగార భావాలను కలగి ఉన్నా అణచుకోవటానికి మధ్య సమతుల్యతను సాధించాడు .విచ్చల విడి శృంగారానికి , క్రమ పధ్ధతితో నైతిక  శృంగారానికి మధ్య బాలన్స్ రూపొందించాడు .ప్రక్రుతి ప్రేరణకు ,సంస్కృతీ నాగరకతకూ మధ్యే మార్గాన్ని కను గోన్నాడు .కామ సూత్రాలలో అంతర్ ద్రుష్టి ఉందని గ్రహించాలి .ఆనందాన్ని  అలవరచుకోవాలని ,శృంగారం లో సంస్కృతి ని  రూపొందించు కోవాలని కామ సూత్ర కర్త ధ్యేయం.కామ సూత్రకు అనువాదకులు పెద్ద అన్యాయమే చేశారు .సెక్స్ ప్రేరక సామాగ్రికే ప్రాధాన్యం ఇచ్చి నట్లు అనువాదాలు చేసి గొప్ప ద్రోహం చేశారు

 

Inline image 1

 

.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -10

బ్రాహ్మణాల కదా కమా మీషు -10

తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు

కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన  బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట .కృష్ణ యజుస్సంహితలో బ్రాహ్మణ భాగాలు కలిసి పోయే ఉంటాయి .. బ్రాహ్మణానికి సంహితకు పెద్దగా తేడా కని పించదు.వైశంపాయనుడి శిష్యుడు పైంగి యాస్కుడు .అతని శిష్యుడే తిత్తిరి మహర్షి .ఉఖ మహర్షి తిత్తిరి శిష్యుడు .ఆత్రేయుడు తిత్తిరి ప్రశిష్యుడు .తైత్తిరీయ శాఖా ప్రవర్తకులలో తిత్తిరి మహర్షి మణి లాంటివాడు .అతనే ఈ బ్రాహ్మణ కర్త కనుక ఆయన పేరనే చెలా మణి అయింది . ఈ బ్రాహ్మణం లో మొదటికాన్డను  పార క్షుద్ర అని రెండవ దాన్ని అగ్ని హోత్రం అనీ అంటారు మూడవ దానిలో విభాగాలకు వాటి ప్రత్యెక పేర్లున్నాయి .

ఒకప్పుడు విదేహ రాజు జనకుడు సావిత్రాగ్ని జ్ఞానాని సంపాదిన్చాలనుకొని దేవతలను కలిశాడు .వాళ్ళు లోకం లో ఎవరు తమను సావిత్రాగ్ని స్వరూపం గా ఉపాసన చేస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుండి ,అప మృత్యువు నుండి ముక్తులౌతారని ,పూర్నాయుస్సుపొంది ఎప్పటికీ అన్నాదులకు లోటు లేకుండా సర్వాన్న సామ్రుద్ధి కలవారై స్వర్గాన్ని పొందుతారు అని చెప్పారు .అశ్వత్థ మహర్షి శిష్యుడు అహీన మహర్షి సావిత్రాగ్ని స్వరూపాన్ని ధ్యానం చేసి సాక్షాత్కరింప జేసుకొన్నాడు .అందుకనే ఆయన దేహ అవసాన దశలో’’ బంగారు హంస’’ అయి స్వర్గం చేరి ఆదిత్యునితో తాదాత్మ్యం చెందాడు .

ఈ బ్రాహ్మణం లో నీతికధలు తో బాటు లౌకిక జ్ఞాన విషయాలూ చాలానే ఉన్నాయి .చంద్రుడు ఏ రోజు ఏ నక్షత్రం తో కలిసి ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుందని లోక వ్యవహారం .కృత్తికా నక్షత్రం తో చంద్రుడు కలిసి ఉన్న రోజు కృత్తికా నక్షత్రం అని అర్ధం .రోజుకొక నక్షత్రం ఉంటుంది కనుక దీన్ని బట్టి తెలుసుకోవాలి .కృత్తిక ఒకప్పుడు మొదటి నక్షత్రం గా ఉండేది .ఆ నక్షత్రం లో ఆధానం చేస్తే బ్రహ్మ వర్చస్సు కలుగుతుందని శాస్త్రం .రోహిణి లో చేస్తే సిరి సంపదలు కలుగుతాయి .దేవతలు ఒకప్పుడు ధన గర్వం లో విర్ర వీగుతూ అశ్రద్ధగా అగ్న్యాధానం చేసి సిరి సంపదలు పోగొట్టుకొని దరిద్రులైనారు .తప్పు తెలుసుకొని పునర్వసు నక్షత్రం లో శ్రద్ధ గా చేసి మళ్ళీ ధనికులైనారు .పునః అంటే మళ్ళీ వసు అంటే సంపద పొందారు కనుక ఆ నక్షత్రానికి పునర్వసు అనే పేరొచ్చింది .అలాగే విషువత్ కు ఇందులో అర్ధం చెప్పబడింది .సంవత్సరాన్ని రెండు భాగాలు చేయాలి .మొదటి భాగం లో చివరి నాలుగు రోజులు ,రెండో భాగం లోని మొదటి నాలుగు రోజులు తీసుకొని  మధ్యలో ఉన్న రోజును విషువత్ అంటారని ఈ తొమ్మిద రోజుల్లో యాగం చేస్తే అష్ట దిక్పాలకులు పాలించే ఎనిమిది స్వర్గాలు,అంత కంటే పై నుండే స్వర్గం పొందగలరు .

అన్నం రెండు సార్లు ఎందుకు తినాలి?

ఒకప్పుడు దేవతలు ,పితరులు ,మనుష్యులు ,పశువులు ,అసురులు (వీరందరికీ ప్రజలనే పేరు )ఉపవాసం తో ఉండే సత్రాన్ని గురించి తపస్సు చేశారు .వారిలో దేవతలు నేతితో నిండిన చమన పాత్రను చూసి హోమం చేసి పది హీను రోజులకోసారి భోజనం చేసే రస పదార్ధాన్ని పొందారు .అందుకే అమావాస్య ,పొర్ణమి రోజుల్లో దేవతల ప్రీతికోసం దర్శ ,పూర్నమాస యాగాలు చేస్తారు .పితృదేవతలు నెలకోసారి భోజనాన్ని సంపాదించుకొన్నారు .అందుకే ప్రతి అమా వాస్య నాడు ‘’పిండ పితృ యజ్ఞం ‘’చేసి పితృ దేవతలను సంతృప్తి పరుస్తారు .మానవులు ఒకేరోజు రెండు భోజనాలను సంపాదించారు .పశువులు మూడు సార్లు తిని మిగిలిన సమయం లో నెమరేస్తాయి .రాక్షసులు సంవత్సరానికి ఒక సారే తిండి సంపాదించారు .అందుకే ఏడాదికి ఒక సారే తిండి తిని మిగిలిన రోజుల్లో దేవతల తో యుద్ధాలు చేసే వారు .

నక్షత్రాలే ప్రజా పతి శరీరం .హస్తా నక్షత్రం ప్రజా పతి హస్తం .చిత్తా నక్షత్రం శిరస్సు .స్వాతి హృదయం .విశాఖ తొడలు ,అనురాధ పాదాలు .ఇలా నక్షత్ర స్వరూపిగా ప్రజాపతిని ధ్యానిస్తారు .

గోవులే అగ్ని హోత్రాలు

పర్వతాలు మొదలైన అచేతనాలను సృష్టించి తర్వాత ప్రజాపతి అగ్ని వాయువు ,ఆదిత్యుడు అనే చేతనలను హోమం ద్వారా సృష్టించాడు .ఈ ముగ్గురూ తాము కూడా ప్రజా పతి లాగానే సృష్టి చేయాలను కొని అగ్ని ప్రాణం కోసం వాయువు శరీరం కోసం ,ఆదిత్యుడు కండ్ల కోసం హోమం చేశారు .దీనితో ఒక గోవు పుట్టింది .దాని పాలు పంచుకోవటం లో ముగ్గురికీ పేచీ వచ్చింది .పరిష్కారం కోసం ప్రజా పతి దగ్గరకు చేరారు .ప్రాణాలు లేని శరీరం, కండ్లు వ్యర్ధం కనుక ప్రాణాలకోసం హోమం చేసిన అగ్నిదే ఆవు అని తీర్పు చెప్పాడు .అప్పటి నుంచి ఆవుకు ‘’అగ్ని హోత్రం ‘అనే పేరొచ్చింది .ఆవును అగ్ని హోత్రం గా ఉపాసించే వారికి అప మృత్యు భయం ఉండదని ఈ బ్రాహ్మణం చెప్పింది .

మానవ సృష్టి

ప్రజాపతి సృష్టి చేయాలను కొని ముందు ప్రాణ వాయువు తో బలాదికులైన అసురుల్ని సృష్టింఛి ‘’పిత ‘’అని పించుకొన్నాడు .తర్వాత పితృదేవతలను సృష్టించి ,ఇంకా ఏమేమి సృష్టించాలా అని మనసులో ఆలోచించాడు .అప్పుడు మనుష్యులేర్పడ్డారు .మననం చేయటం వాళ్ళ ఎర్పడ్డారుకనుక మానవులని పించుకొన్నారు .మనుష్యులు లౌకిక వైదిక వ్యవ హారాలు చేసే సరికి అంతా కాంతి తో నిండి పోయింది .ఆ కాంతి ననుసరించి దేవతలను సృష్టించాడు .ఈ ఆలుగు రకాల సృష్టి’’ జలం’’ లాంటిది .నదీ జలం తటాక జలం వగైరా ఎలా భోగానికి ఉపయోగిస్తాయో సృష్టి కూడా భోగానికి ఉపయోగ పడుతుందని అంతరార్ధం .

బొల్లి ఎల్లా పోతుంది?

తెల్ల బొల్లి మచ్చలున్న శరీరాన్ని ‘’కిలాపం ‘’అంటారు .తల నెరిసి పోవడాన్ని ‘’పలితం’’అంటారు.;;నీలి ‘’అనే ఓషది ఈ రెండు వ్యాదుల్నీ పోగొట్టు తుంది .ఈ ఓషధిని అభిమంత్రిస్తూ చెప్పాల్సిన మంత్రాలు ఇందులో ఉన్నాయి .బొల్లి ఎన్ని రకాలో ,వాటిని పోగొట్టె శక్తి నీలికి ఎలా వచ్చిందో వివరాలున్నాయి .

పగలు రాత్రులకు పేర్లు

సావిత్ర చయనం లో కొన్ని వైదిక పరిభాషలున్నాయి .ప్రతీనెలలో మొదటి పదిహేను రోజులు శుక్ల పక్షం .తరువాతిది కృష్ణ పక్షం .శుక్లపాడ్యమి తో మొదలైన తిధుల పగటి వేళలను వరుసగా సంజ్ఞానం ,విజ్ఞానం ,ప్రజ్ఞానం ,జానాథ్ ,అభిజానాథ్ ,సంకల్పమానం ,ప్రకల్ప మానం ,ఉపకల్పమానం ,ఉప క్లప్తం,క్లప్తం,శ్రేయః ,వసీయ ,ఆయత్,సంభూతం ,భూతం అనే పేర్లతో పిలుస్తారు .శుక్ల పక్ష రాత్రులకు వరుసగా దర్శ ,దృష్టా ,దర్శత ,విశ్వ రూపా ,సుదర్శనా ,ఆప్యాయ మానా ,ప్యాయ మానా ,ప్యాయా ,సూనృతా ,ఇరా ,అపూర్యమానా ,పూరయన్తీ ,పూర్నా ,పౌర్న మాసీ అనే పేర్లున్నాయి .అలాగే కృష్ణ పక్ష పగళ్ళకు రాత్రులకు  పేర్లు చెప్పా బడ్డాయి

తైత్తిరీయం మూడు కాండలలో అనేక పేర్లున్న యజ్న యాగాదుల నిర్వహణ విధానం వివరణ ఉంది మధ్యమధ్యలో సందర్భాన్ని బట్టి లోకానికి పనికి వచ్చే కబుర్లెన్నో చెప్పింది.వీటినన్నిటిని అర్ధం చేసుకొని సంస్కారం తో జీవితాన్ని మలచుకొని సమాజ భ్యుదయానికి పాటు పడమనే ఏ బ్రాహ్మనమైనా బోధించే విషయం .

తరువాత శత పద బ్రాహ్మణ విశేషాలు తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

కథ చెబుతా… కథ చెబుతా

కథ చెబుతా… కథ చెబుతా…

Published at: 30-06-2014 01:45 AM

అమ్మా…కథ చెప్పవూ అంటే చెప్పే అమ్మలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కానీ… ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మ ఆ పని చేసి చూపుతోంది. ఆమె పేరు ఉమా చల్లా. తన పాప చారుమతికి కథలు చెపుదామని తెలుగు కథల పుస్తకాల కోసం ఆమె ఎన్నో చోట్ల వెతికారట. కానీ అవి దొరకలేదు. అప్పుడు పిల్లల కోసం తానే తెలుగులో మంచి కథల పుస్తకాలు తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా తన కథల పుస్తకాల ద్వారా రామాయణం నుంచి సౖౖెన్స్ దాకా ప్రతీ విషయాన్ని ఎంతో సరళమైన తెలుగులో పిల్లలకు కథలుగా చెప్తున్నారామె. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే…

నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణ పరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను.

‘మాది హైదరాబాద్. ఇంటర్ వరకే నేను కాలేజికి వెళ్లి చదువుకున్నాను. ఎందుకో తెలియదు కానీ కాలేజీ నాలుగు గోడల మధ్య చెప్తున్న చదువు నాకు నచ్చలేదు. అందుకే ఇంటిపట్టునే ఉండి బిఎ డిగ్రీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ చేశాను. ఎం.ఎ ఆంత్రపాలజీ, ఎం.ఎస్.సి బయోలజీ అమెరికాలో చదివాను. ఫ్రెంచి భాషలో డిప్లొమా తీసుకున్నాను.
మావారు కిరణంతో 2004లో (మా అత్తవారు ఆయనకు అచ్చమైన తెలుగు పేరు పెట్టాలని కిరణం అని పెట్టారు) నా పెళ్లయింది. 2011లో మా పాప చారుమతి నా జీవితంలో ప్రవేశించింది. పాప ప్రవేశం నా జీవితంలో ముఖ్యమైన మలుపని చెప్పాలి.
మా పాపే స్ఫూర్తి…
ఏడాది వయసులో ఉండగానే మా పాప చారుమతికి ఉషశ్రీ రామాయణ, మహాభారత, భాగవతకథలు చెప్పాను. వాటిల్లోని కొన్ని ఘట్టాలైతే తనకు బాగా గుర్తు. పాప ఇష్టాయిష్టాల కనుగుణంగా తనను పెంచాలని నా ఉద్దేశం. మా ఇల్లు కూడా పాపకు నచ్చినట్టు పెడతాను. ఒకచోట బుక్స్. మరో చోట కంప్యూటర్. ఇంకోచోట ఆడుకునే బొమ్మలు, పక్కనే జారుడు బల్ల, మరోవైపు ఆటబొమ్మలు, బిల్డింగ్ బ్లాకులు వీటితో పాటు మేక-పిల్లి, వామనగుంటలు లాంటి బోర్డ్ గేమ్స్ సెట్…అన్నీ హాల్‌లో పరిచి ఉంచుతాను. ఎప్పుడు ఏది ఆడాలనిపిస్తే అది ఆడుతుంది.
మా పాప చారులతకు కథలంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు కథల పుస్తకాల కోసం ఎంతగానో వెతికాను. ఇంగ్లీషులో పెద్ద పెద్ద బొమ్మలతో మంచి కథల పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి గానీ తెలుగులో మటుకు ఈ లోటు బాగా కొట్టొచ్చినట్టు నాకు కనిపించింది. తెలుగులో మంచి కథల పుస్తకాలు దొరక్కపోవడంతో వాటిని తెచ్చే పని నేనే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది.
పిల్లల కథలకు బొమ్మలు ప్రాణం…
పిల్లలకు కథలు రాయడం ఒక ఎత్తయితే ఆ కథలకు బొమ్మలు గీయడం మరో ఎత్తు. అవి పిల్లలను ఆకర్షించేలా రంగు రంగుల్లో పెద్దవిగా ఉండాలి. ఎక్కువ బొమ్మలుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లల భాషా విషయానికి వస్తే లయ, ప్రాస ఉన్న వాక్యాలు వాళ్లు బాగా ఆస్వాదిస్తారు. మా పాపకు కథలు చెప్పేటప్పుడు ఎలా చెప్తే పిల్లలకు తొందరగా అర్థమవుతుంది, భాష ఎలా ఉండాలి అన్న అంశాలపై నేను బాగా పరిశోధన చేశాను. పిల్లలకు నచ్చేలాగ బొమ్మలు వేయడం నాకు పెద్ద సవాలుగా నిలిచింది. మా అన్నయ్య బొమ్మలు వేయగలరు. కథలకు బొమ్మలు ఆయన చేత వేయించాను కూడా. ఎందుకో అవి పిల్లలకు నేను చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా కమ్యూనికేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇలా కాదని బొమ్మలు కూడా నేనే వేయాలనుకున్నాను. రోజంతా నేను మా పాపతో గడుపుతానుకాబట్టి పిల్లల ఆలోచనా తీరు ఎలా ఉంటుందో ఒక తల్లిగా నాకు బాగా అర్థమయినట్టు మా అన్నయ్యకు సాధ్యం కాదనిపించింది. అందుకే బొమ్మలు వేసే పనిని కూడా నేనే తలకెత్తుకున్నాను. బొమ్మ సింపుల్‌గా ఉండాలి. అన్ని విషయాలూ చెప్పగలగాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి అనేది నా అభిప్రాయం. మొత్తానికి చిన్నారులకు నచ్చేలాగ కథలకు బొమ్మలు గీయడానికి నేను చాలానే శ్రమపడ్డాను.
నా మొదటి కథ ‘కాకమ్మ దాహం’. ఇంకా’ సీతాకోకచిలుక’, ‘తాబేలు-కుందేలు’, ‘నక్క-ద్రాక్షపళ్లు’ లాంటివి మొత్తం 10 పుస్తకాలు రాశాను. కథలు రాయడం, బొమ్మలేయడం దగ్గరి నుంచి పుస్తకాల డిజైనింగ్, ప్రచురణ అన్ని పనులూ నేనే చేశాను. ఈ పుస్తకాలు వేసేముందు నేను ఇపుడున్న ప్రచురణరంగ పోకడలను సైతం బాగా స్టడీ చేశాను. ఎందుకంటే పిల్లల పుస్తకాల డిజైనింగ్ వేరుగా ఉంటుంది. అవి పిల్లలను బాగా ఆకటుకునేలా ఉండాలి. ఇక్కడ డబ్బులెక్కలు చూడకూడదని నా అభిప్రాయం. ఈ కథల పుస్తకాల ప్రచురణ కోసం నేను మా వారు ఇన్స్‌రెన్స్ పాలసీలను వాడేశాం.
ఆదివారం కథాకాలక్షేపం…
రామాయణానికి సంబంధించి పిల్లల కథల పుస్తకాలు తేవాలనుకుంటున్నాను. రామాయణంలో బాలకాండ మీద కథలు పూర్తి చేశాను. ఇంకొన్ని రోజుల్లో ఈ కథల పుస్తకం బయటకు వస్తుంది. నా పుస్తకాల ద్వారా సైన్స్ గురించి అంటే గ్రహాల దగ్గరి నుంచి నక్షత్రాలు, విశ్వం అన్నింటినీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను. విలువలు బోధించే కథలు నా పుస్తకాల్లో చెప్పాను. అలాగే మన సంస్కృతి, పండుగల గురించి వివరించాను. తెలుగు అంకెలు, తెలుగు నెలల గురించి పిల్లలకు అర్థమయ్యేలా నా పుస్తకాల్లో చెప్పాను.
సప్తపర్ణి అనురాధగారికి ఈ పుస్తకాలు చూపించినప్పుడు ఆవిడ చాలా బావున్నాయి, మా సెంటర్‌లో పెట్టండి అన్నారు. ఆ తర్వాత నా పుస్తకాలకి మంచి స్పందన వచ్చింది. తల్లిద్రండులు కూడా ఆసక్తిగా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మాతృభాషలో ఏది చెప్పినా దాని స్పందన చాలా బాగుంటుంది. అంతేకాదు మన భాషపై మనం పట్టు సంపాదించినపుడే మిగతా భాషల్ని కూడా తొందరగా నేర్చుకోగలుగుతాం. ఈమధ్యనే సేక్రడ్ స్పేస్‌లో ప్రతి ఆదివారం కథాకాలక్షేపం అని ఒకటి మొదలెట్టాను. నా పుస్తకాల్లో బొమ్మలు చూపిస్తూ కథలు పిల్లలకు చెపుతా. నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణపరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు కథలు చెప్పే తీరులో కూడా జాగ్రత్తలు తీసుకుంటాను. ఉదాహరణకు రామాయణం గురించి చెప్పేటప్పుడు మ్యాప్ తీసుకుని రామాయణంలోని ఫలానా ప్రాంతం ఎక్కడ ఉంది మ్యాప్‌లో చూపిస్తూ చెప్పడం, సన్నివేశాలను వివరించడం చే స్తాను. మన పాత ఆటలు పులిమేక, వామనగుంటలు, చదరంగం, వైకుంఠపాళి వంటివి కూడా వారికి నేర్పుతాను. బోర్డు గేమ్స్ వల్ల పిల్లలకు మేథమేటిక్స్ బాగా వస్తుంది.
సేక్రెడ్ స్పేస్‌లో ఒక్కొక్కవారం ఒక్కొక్కదానిగురించి పిల్లలకు చెబుతాను. ఆడుదామా అష్టాచమ్మా అని పాత ఆటల గురించి పిల్లలకు ఒక వారం నే ర్పిస్తాను. మరోవారం పద్యం పాడుకుందాం, ఇంకోవారం తెలుగుపాట నేర్చుకుందాం, తర్వాతి వారం దండకం నేర్చుకుందాం వంటివి పిల్లలకు చెపుతుంటాను. నిజానికి ఇవన్నీ ఇళ్లల్లో జరగాల్సిన పనులు. కానీ జరగడంలేదు. మా పాపతో నేను రోజూ ఇలానే గడుపుతాను. పిల్లల ఏకాగ్రత స్థాయిని బట్టి ఏ విషయాన్నైనా వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. వారికి ప్రేమగా చెప్పాలి. పిల్లల వికాసానికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారానే ఎన్నో విషయాలను వారికి సులువుగా చెప్పొచ్చు.
నాకు తెలుగు మీద ఇష్టం కలిగింది మా అమ్మమ్మ వల్లే. ఆమె ఇంట్లో పనిచేసుకుంటూ పాడే పాటలు, పద్యాలు, వంట అయిన తర్వాత తను చెప్పిన కథలు ఇవన్నీ నా మీద చాలా ప్రభావం చూపాయి. పిల్లలతో కూర్చున్నప్పుడు వారికి సందర్భానుసారం చెప్పగలగే సృజనాత్మకత మనకు కావాలి. అలాంటి వాతావరణం మనం సృష్టించాలి. అప్పుడు పిల్లలు కూడా సహజంగా వికసిస్తారు.’
ం నవ్య డెస్క్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంస్కృతిక శాఖ తీరు మారాలి – దేవరకొండ సుబ్రమణ్యం

మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మాలాంటి ఢిల్లీ వాసులకు ఆంధ్రప్రభుత్వం మాత్రమే జవాబుదారీ అంటూ నాటక నవలల పోటీ కొత్త మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది. న్యాయనిర్ణేతల తీర్పు అన్యాయంగా అనిపిస్తోంది. గతంలో చాలాచోట్ల పలుమార్లు జరిగిన రచనల పోటీల్లో అత్యుత్తమ బహుమతి ప్రమాణాలకు స్థాయికి తగినవి రాకపోతే ఎలాంటి తటపటాయింపు లేకుండా బహుమతికి అనర్హంగా ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం విభజన సంధికాలంలో నాటకం -నవలల పోటీల్లో బహుమతులు పంచిన తీరు చాలా విడ్డూరంగా అసంబద్దంగా ఉంది. నాటకంలో పద్యం, చారిత్రికం సాంఘికం ప్రక్రియలతో పాటుగా నవలకు ప్రాధమ్యం కల్పిస్తూ ఒక్కోదానికి లక్ష నగదుతో పాటు ప్రచురణ, ప్రదర్శనలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఆయా రచనలకు ఆహ్వానం ప్రకటిస్తే మహత్తర స్పందన వచ్చిందని చాటుకుంటూ పోటీల గడువు తేదీని పొడిగించారు.

అద్భుత రచనలు వెలువడుతున్నాయని మాలాంటివాళ్ళం మురిసిపోతూ ఎదురుచూసాం. అన్నీ అయిన తరువాత పోటీల్లో మొత్తంగా 3 నాటక ప్రక్రియలకు సంబంధించి 150 నాటకాలు 57 నవలలు వచ్చాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో నందితో సహా ఇతర పోటీల్లో ఎంట్రీలుగా ప్రతిఏటా ఇంచుమించుగా అదే సంఖ్యలో రావటం పరిపాటిగా ఉంది. తెలుగు నాటకరంగంలో ఎక్కువగా ప్రదర్శనలు ప్రేక్షకుల ఆదరణ పొందే సాంఘిక నాటకాలల్లో ఉత్తమంగా లక్ష రూపాయల బహుమతికి దాపుల్లో ఏదీలేదని న్యాయనిర్ణేతలు నిర్ధారించారు. రావికొండలరావు, దుగ్గిరాల సోమేశ్వరరావు, కందిమళ్ల సాంబశివరావు, శంకరమంచి పార్థసారధి జడ్జిలుగా వ్యవహరించారని తెలిసింది. తక్కువ సంఖ్యలో వచ్చిన నవలల్లో ప్రథమ బహుమతి పొందగల అర్హత లేనేలేదని అంపశయ్య నవీన్, నవ్య జగన్నాధశర్మ, వాడ్రేవు చినవీరభ ద్రుడు, మృణాళిని, మధురాంతకం నరేంద్ర నిర్ధారించారు. సాంస్కృతిక శాఖ 12 నవలలకు 10 నాటకాలకు ఒక్కోదానికి 25,000 చొప్పున బహుమతుల పందేరం ప్రకటించారు. వాటిల్లో కొందరి రచనలు వేరే వాళ్లు నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకుని ఉండడం గమనార్హం. గతంలో ప్రభుత్వపరంగా వరుసపెట్టు సత్కారాలు పురస్కారాలు పొందిన వారికే మళ్లా కన్సొలేషన్‌గా పేర్కొనతగ్గ బహుమతుల్లో సింహభాగం దక్కింది. తాము ఆశించిన ప్రమాణాలు, వాసి లేదని నిర్దారిస్తూనే మళ్లా మళ్లా బహుమతులు ఇచ్చి ప్రోత్సా హం అనటంలో హేతుబద్దత ఎంత ? ప్రభుత్వ నిధులతో మళ్లా మళ్లా బహుమతులు ప్రశంసలు కురిపించటంలో సాంస్కృతిక శాఖ సంస్కారం ఇంకో సారి విమర్శలు పెంచుకుంటోంది. తెలుగుతనానికి సంబంధించిన ఈ పొటీలు, బహుమతుల నిర్ణయాన్ని పూర్తిగా సీమాంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారమని అప్పగింతలు పెట్టిన అధికారుల విజ్ఞతను ఆయా నాటకాలవాసి నాణ్యత తెలుసుకునేలా ఎప్పుడు చేస్తారని అడిగితే కప్పదాటు జవాబులు చెబుతున్న సాంస్కృతిక శాఖ శైలిని పలువురు కళారంగ మిత్రులం తీవ్రంగా నిరసిస్తున్నాం.

– దేవరకొండ సుబ్రమణ్యం
గురుగాం, ఢిల్లీ 08800968130

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కీర్తిని మానవుడు త్యజించలేడు – ఎస్.డి.గిరిజా ప్రసాద్

సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో 3 జూలై 1914న జన్మించారు. వారి జీవితమే మహత్తరమైనది. చిన్నతనంలోనే హిమాలయాలలో కొంత కాలమున్నారు. అచటనే ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. వారితో మాట్లాడుతుంటే కాలగమనమే మనకు తెలిసేది కాదు.
1963లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రతి ఆదివారం ‘తెగిన జ్ఞాపకాలు’ అని తమ జీవిత చరిత్రను రాసారు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్, తిరుపతి- దుర్గా ప్రసాద్ వారు ‘తుమ్మపూడి’ అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించారు.

సంజీవదేవ్ ‘రసరేఖ’ పుస్తకాన్ని రచించారు. తమ ఇంటికి ‘రసరేఖ’ అని పేరు పెట్టారు. వీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు ఎంతోమంది మేధావులతో, ప్రముఖులతో పరిచయాలు పొందారు. ఎన్నో పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసారు. వీరు చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవారు. చదివేవారు. వారి చేతిరాత అచ్చం అచ్చువలె వుండేది. ప్రతిదినం పలువురు అభిమానుల దగ్గర నుండి కట్టలుగా వుత్తరాలు వచ్చేవి. చిన్నా పెద్దా అని చూడకుండా అందరికి ఆప్యాయంగా జవాబులు రాసేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు వచ్చేవారు. నేను తిరుమల నుండి వెళ్లేవాడిని.

‘విద్యార్థి’ అనే మాసపత్రిక 1963 అక్టోబర్ సంచికలో సంజీవదేవ్ ‘కీర్తి-తృష్ణ’ అనే వ్యాసాన్ని రాసారు. అందులో- ‘కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడ ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే వుంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు’ అని రాసారు.
నేనంటే మొదటినుంచి వాత్సల్యం చూపేవారు. ‘జీవితం ఒక గొప్ప సంగ్రామం. ఈ సంగ్రామంలో తలెత్తే వ్యతిరేక పరిస్థితులలో ప్రశాంతంగా, ధైర్యంగా పోరాడితే విజయం దానంతటదే లభించుతుంది. వ్యతిరేకతలు అనుకూలతలుగా మారుతాయి. చిన్న చిన్న ఇబ్బందులకు జంకక ధీరుని వలె జీవించాలి’ అని 9.4.1966న ఒక జాబు రాసారు.

‘వస్తున్న అసంఖ్యాక అభినందనలకు జవాబులు వ్రాయుటయే సరిపోతుంది ఇప్పటివరకు. వరికోతలు కోస్తున్నారు. పైన మబ్బులు పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా రైతులు ఈ వ్యతిరేక వాతావర ణంలో చాలా నష్టపోతున్నారు’ అని 16.11.82న రాశారు.

‘మానవ జాతి అంతా ప్రపంచంలో ఒకటే. అయినప్పటికీ ఎవరి ప్రత్యేక జీవితాలు వారివే. జీవితంలో వికసించటానికి రెండు విషయాలు ప్రధానమైనవి- ఒకటి మనోవికాసానికి సంబంధిం చిన ప్రతిభ, రెండవది భౌతికమైన కృషి. వీటినే Intelligence and industry అంటారు. ఈ రెండు శక్తులు కూడ నీలో శక్తివంతమై వున్నవి. అందుకే నీవు తగిన ఔన్నత్యాన్ని జీవితంలో పొందగలుగు తున్నావు’ అని 3.3.1999లో రాసారు. నేను 31.8.1999న ఉద్యోగము నుండి రిటైరవుతానని రాసిన జాబుకు జవాబు ఆ రకంగా రాసారు. కాని నేను రిటైరవక ముందుగానే 25.8.99న ఆయన మరణించారు. నాకు అలా ఆయన చాలా వుత్తరాలు రాసారు.
ఆయన వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న ఘనంగా జరగనుండటం ఆనందదాయకం.

– ఎస్.డి.గిరిజా ప్రసాద్
(సంజీవదేవ్ వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న జరుగనున్నాయి)

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

కవి శిఖరం కేదార్‌నాథ్ (వివిధ) -ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

కేదార్ ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలి స్తాయి.. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు.

‘రాలిపోతున్నాయి వేపచెట్టు ఆకులు.. పెరిగిపోతోంది మనసులో నైరాశ్యం..’ అని జీవితంలో ఖాళీతనాన్ని చిత్రించిన కవి, సాహిత్య విమర్శకుడు, అధ్యాపకుడు కేదార్‌నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఎంతో సంతోషం కలిగింది. 1988లో డా.సి.నారాయణరెడ్డికి ఈ అవార్డు వచ్చిన తర్వాత మళ్లీ ఈ పురస్కారం లభించిన లబ్దప్రతిష్టులైన గొప్ప కవుల్లో కేదార్‌నాథ్ ఒకరు.

హిందీలో గొప్ప కవులెందరో ఉన్నారు. హరివంశరాయ్ బచ్చన్, దినకర్, నిరాలా, అజ్ఞేయ, సుమిత్రానందన్ పంత్, సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, మహదేవి వర్మ, నిర్మల్ వర్మ.. వీరు కవిత్వంలో ఉన్నత ప్రమాణాలు సాధించినవారు. మానవీయ విలువల్ని ప్రతిబింబించిన వారు. వారి శ్రేణికి కేదార్‌నాథ్ సింగ్ వస్తారనడంలో సందేహం లేదు. నిజానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సాహిత్యాన్ని సృజించిన ఉత్తమ భారతీయ రచయితలకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వాలనే ఆలోచన కవుల నుంచే పుట్టింది. 1961 మే నెలలో కలకత్తాలో శాంతి ప్రసాద్ జైన్ నివాసంలో సమావేశమైన బచ్చన్, దినకర్ మొదలైన కవుల సమక్షంలోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చి అది ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డుగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నిజంగానే ఉత్తమ రచయితలకు, కవులకు ఈ అవార్డు ఇస్తూ సార్థకత సాధించింది.

కేదార్‌నాథ్ కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే హిందీ సాహిత్యాన్ని, దాని సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి 20వ శతాబ్దంలోనే హిందీలో కవిత్వం ప్రారంభమైంది. అంతకుముందు మధ్యయుగాల హిందీలో రకరకాల స్థానిక భాషల్లో సాహిత్య రచన సాగేది. రాజస్థానీ, మైథిలీ, అవధి, బ్రజ్‌భాషల్లో ఉత్తమ సాహిత్యం వెలువడింది. 14వ శతాబ్దం నుంచి ఉత్తర భారతంలో భక్తి సాహిత్యం ఒక్క ఊపు ఊపింది. 17వ శతాబ్దంలో రాజాస్థానాల్లో ప్రణయం సాహిత్యంలో ఆధిపత్యం వహించింది. రాధాకృష్ణుల ప్రణయం సాహిత్యాన్ని ఆవరించింది. భక్తి, ఆదర్శ ప్రేమ (రీతి) రచనలే చాలా కాలం హిందీ సాహిత్యంపై ప్రభావం చూపాయి. 20వ శతాబ్దంలో హిందీ సాహిత్య తీరు తెన్నులే మారాయి.

సాంప్రదాయ, బ్రజ్ భాషా హిందీ స్థానంలో మాట్లాడే హిందీలో (ఖరీబోలీ) రచనలు ప్రారంభమయ్యాయి. సాహిత్యం కొత్త ప్రతీకల్ని, వస్తువుల్ని, భావా వేశాల్ని ఎంచుకోవడం మొదలైం ది. సామాజిక సంస్కరణలు, జాతీయ వాదానికి హిందీ ఆలం బన అయింది. మహాదేవీ ప్రసాద్ ద్వివేదీ, మైథిలీ శరణ్ గుప్తా లాంటి వారు మార్పుకు దోహద కారులయ్యారు. ఆ తర్వాతి కాలం లో వ్యక్తుల భావావేశాలను, బాధల్ని చిత్రించే ఛాయావాదం హిందీ సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. రాజకీయ స్వాతంత్య్రం ఒకవైపు, వ్యక్తి స్వేచ్ఛ మరోవైపు రచయితలను వివిధ మార్గాల్లో వెళ్లడానికి ప్రోద్బల పరిచాయి. ఆ తర్వాత ప్రగతిశీల ఉద్యమాలు హిందీ సాహిత్యంలో ఉత్తమ రచయితలను సృష్టించాయి. ఛాయావాదం ఆశించే వ్యక్తిగత స్వేచ్ఛ, స్వప్నాల స్థానంలో ప్రగతివాదం సామాజిక వాస్తవికత చోటుచేసుకుంది. అదే ప్రయోగవాదం, నయీ కవిత (కొత్త కవిత)ల కాలానికి దారి తీసింది. ఆ రోజుల్లో కవి, సాహితీ విమర్శకుడు అజ్ఞేయ ఆధ్వర్యంలో వెలువడిన తార్ సప్తక్ పత్రిక అనేకమంది యువకవుల గళాలను ధ్వనించింది. వారి ఆవేశం, ఆలోచన నాటి సమాజానికి ప్రతిబింబాలయ్యాయి. ఆ కవుల్లో కేదార్‌నాథ్ సింగ్ ఒకరు.

ప్రేమ్‌చంద్, బచ్చన్, పంత్ లాంటి అనేకమంది ఉత్తమ కవులను సృష్టించిన గడ్డ ఉత్తర ప్రదేశ్‌లోనే కేదార్ నాథ్ సింగ్ జన్మించారు. గోరఖ్‌పూర్ సమీపంలోని బలియా జిల్లాలో చకియా అనే గ్రామంలో ఆయన 1934లో జన్మించారు. ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే బనారస్ వెళ్లాల్సిందే. కేదార్‌నాథ్ కూడా బనారస్‌లోనే ఉన్నత పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచే ఆయన హిందీలో ఎంఏ, పిహెచ్‌డి చేశారు. దాదాపు దశాబ్దం పాటు బనారస్‌లో ఉదయ్ ప్రతాప్ కళాశాల, గోరఖ్‌పూర్ యూనివర్సిటీల్లో ఆయన విద్యార్థులకు హిందీ బోధించారు. 1976లో ఆయన ఢిల్లీలోని జెఎన్‌యూలో హిందీ బోధించేందుకు వచ్చారు. అక్కడే రిటైర్ అయ్యేంత వరకూ కొనసాగారు.

కేదార్‌నాథ్ సింగ్ కవిగా మారడానికి కారణం ఆయన ప్రగతివాద కవుల ప్రభావంలో పడడమే. 1952లో 18 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. సమాజ్ అనే పత్రికలో ఆయన తొలి కవిత పడింది. ప్రగతివాదం అనేదాన్ని సాధారణ అర్థంలో తీసుకోవాలి. ప్రగతివాద కవుల్లో ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని అభిమానించే అజ్ఞేయ నుంచి మార్క్సిస్టులైన ముక్తిబోధ్ వంటి వారు కూడా ఉండేవారు. ‘మా కవులు ప్రయాణీకులు కూడా కారు.. రహదారులను వెతుకుతున్నవారు..’ అని అజ్ఞేయ తన పత్రికలో రాశారు. ఈ దృష్ట్యా నయీ కవితా.. అంటే కేవలం కొత్త భావాలు మాత్రమే కాదు, కొత్త ప్రతీకలు, కవిత్వానికి కొత్త రూపాలు వెతికేవారు అని కూడా అర్థం. కేదార్‌నాథ్, రఘువీర్ సహాయ్ లాంటి వారి కవితలు ఇందుకు నిదర్శనం. ఈ కొత్త కవులందరూ తొలుత తీస్రా సప్తక్‌లో దర్శనమిచ్చేవారు. 1960లోనే కేదార్‌నాథ్ కవితా సంకలనం అభీ, బిల్కుల్ అభీ వెలువడింది.

కేదార్‌నాథ్ తొలి కవితలు చూస్తే మనకు శ్రీశ్రీయే గుర్తుకువస్తారు. నవీన్ జోష్ జిందగీ జాగాయే చల్.. జగాయే చల్, జగాయే చల్.. (కొత్త ఆవేశం జీవితాన్ని మేల్కొల్పేందుకు పదండి..), గులామీయోంకే చిన్హ్ మిటాయే చల్.. మిటాయే చల్.. మిటాయే చల్ (బానిసత్వ అవశేషాలను తుడిచిపెట్టేందుకు వెళదాం పదండి.. పదండి..) అని లయాత్మకంగా రాశారు. 1960లో వెలువడిన ఆయన తొలి సంకలనంలో అన్నీ ఇలాంటి కవితలే కనిపిస్తాయి. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు కాని 1980లో ఆయన మరో కవితా సంకలనం జమీన్ పక్‌రహీ హై వెలువడలేదు. ఆయన మూడో కవితా సంకలనం అకాల్ మే సరస్ (1989)కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1995లో ఉత్తర్ కబీర్ అవుర్ అన్య కవితా, 1996లో బాగ్, 2004లో టాల్‌స్టాయ్ అవుర్ సైకిల్ అనే కవితా సంకలనాలు వెలువడ్డాయి. పులి పేరిట రాసిన సుదీర్ఘ కవితా సంకలనంలో ఆయన మనిషి జీవితంలో సంక్లిష్టతను పులి అనే ప్రతీక ద్వారా అద్భుతంగా చిత్రించారు. పలు సాహిత్య విమర్శా గ్రంథాలు కూడా ఆయన రాశారు. కల్పనా అవుర్ ఛాయావాద్ అనే వ్యాససంకలనంలో ఆయన ఛాయావాదం గురించి రాశారు. మేరీ సమాజ్, మేరీ శబ్ద్ అనే వ్యాస సంకలనంలో సాహిత్యోద్యమాల గురించి రాశారు. ఖబరిస్తాన్ మే పంచాయత్ అనే వ్యాస సంకలనంలో మానవ భావోద్వేగాలు, జీవితంలో సంక్లిష్టత, సాంస్కృతిక చైతన్యం గురించి రాశారు. ఆయన ప్రతి రచనలోనూ ప్రజాస్వామిక ఆకాంక్షలు, స్వేచ్ఛావాదం ప్రతిఫలిస్తాయి. కుమార్ ఆసన్, మైథిలీ శరణ్ గుప్తా, దినకర్, జాషువాల పేరిట ఆయనకు పలు అవార్డులు లభించాయి. స్పానిష్, డచ్, జర్మన్, రష్యన్, హంగరీ భాషల్లో ఆయన కవితలు అనువాదాలయ్యాయి.

ఆయన కవితలు ఒకో దశలో ఒకో సామాజిక వాతావరణాన్ని ప్రతిఫలి స్తాయి. తొలి కవితల్లో భావావేశం, ప్రగతివాదం, గ్రామీణ వాతావరణం, గంగానది గలగలలు, సామాన్యుడి జీవితం కనపడతాయి. తర్వాతి కవితల్లో ఆలోచన, తాత్వికత, తాజా కవితల్లో ఆవేదన, యుద్ధాలు, హింసాకాండ, నిరాశా నిస్పృహలు, ప్రపంచీకరణ సృష్టిస్తున్న వైపరీత్యం ప్రతిఫలిస్తాయి. ఏది రాసినా ఆయన అద్భుతమైన ప్రతీకలతో, గాఢమైన భావాలతో మనను కట్టిపడేస్తారు. ప్రకృతి ఆయన కవిత్వంలో ప్రధానమైన అంశం. అంతేకాదు, శ్రీశ్రీలాగా ఆయనకు కూడా కాదేదీ కవితకనర్హం. పార, కూరగాయలు తరిగే కత్తి, విరిగిపడిపోయిన ట్రక్కు.. ఇవన్నీ ఆయనకు కవితా వస్తువులే. జానపద సంగీతంలోని లయ ఆయనకు ఎంతో ఇష్టం. వాటిని ఆయన కవిత్వంలో ప్రవేశపెడతారు. సంగీతం, ఒంటరితనం, కవిత్వం.. ఈ మూడే నాకు అత్యంత ఇష్టమైనవి.. అని కేదార్‌నాథ్ అంటారు. పడవ నడిపేవారు, పసుల గాచేవారు, ఆడుకునే పిల్లలు, బండ్లు నడిపే ఎద్దులు, సూర్యుడు, వెన్నెల నక్షత్రాలు, పక్షులూ, నేలా ఇవన్నీ ఆయన ఇష్టమైన కవితా వస్తువులు. మనిషి వైపు శబ్దాల్ని విసిరేయాలనుకుంటాను.. అని కేదార్ నాథ్ అంటారు ఒక కవితలో. ఆయన విసిరివేసిన శబ్దాలే నేడు ఆయనకు జ్ఞానపీఠ అవార్డును ఇచ్చాయి.

-ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఉపాధ్యక్షులు, కేంద్రీయ హిందీ సంస్థాన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జటాయు రావణ యుద్ధం

జటాయు రావణ యుద్ధం

తన మిత్రుడైన ఒక రాజు కోడల్ని ఎవడో రాక్షసుడు బలవంతం గా ఎత్తుకు పోతుంటే ,ఆమె ఆర్తనాదాలు విని ,ఆమె ప్రమాదం లో ఉందని గ్రహించి ఆమెను ఎలాగో అలాగా వాడి బారి నుండి  రక్షించి ,పాడాలని కృత నిశ్చయం తో ,ఆ కర్కోటక రాక్షసుడి తో తన శక్తి నంతా ధారపోసి పోరాడింది ఒక పక్షి .ఆ పక్షిరాజే జటాయువు .ఆ రాక్షసుడే  దశ కంఠ రావణుడు . ఆవిడే సీతా మాత .ఇది శ్రీ మద్రామాయణం లో  అరణ్య కాండ లో   మహర్షి వాల్మీకి ఆ పోరాటాన్ని అత్యద్భుతం గా చిత్రించాడు .విలువలు మానవులకే కాదు పక్షులకూ ఉంటాయని రుజువు చేశాడు .అదే ఇప్పుడు మనం తెల్సుకో బోతున్నాం .

జనస్థానం లో సీత కోసం అన్వేషిస్తున్నారు రామ  లక్ష్మణులు .పర్వతాలు గుహలు ,అడవులు యక్ష కిన్నర గాంధర్వ గృహాలు వెతుకుతూ ,మధ్యలో ఒకరి నొకరు ఒఓదార్చు కుంటూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అన్నను తమ్ముడు అనునయిస్తూ తిరుగుతున్నారు .కొంత దూరం వెళ్ళే సరికి పర్వతాకారం గా నెత్తురోడుతూ పడిఉన్న పక్షిరాజు జటాయువును చూశారు .ఆ పక్షి సీతను మింగి అలా పడి పోయి ఉంటుంది అని అనుమాన పడ్డాదు రాముడు బాణం ఎక్కు పెట్టి ఆ పెద్ద పక్షిమీద బాణం సం ధించటా నికి సిద్ధ పడ్డాడు .

రాముడిని చూడగానే జటాయువుకు ప్రాణం లేచి వచ్చింది .శ్రీ రాముడికి సీత జాడ వివరించి ప్రాణాలు వదలాలని బతుకుతున్నాడు ప్రాణాలు ఉగ్గ బట్టి .ముక్తసరిగా  రావణుడు సీతా దేవి తో బాటు ,తన ప్రాణాలనూ అపహరించాడని చెప్పాడు .అన్నదమ్ములిద్దరూ దగ్గర లేని సమయం చూసి రావణుడు వచ్చి బలాత్కారం గా సీతను ఎత్తుకు పోయాడని ,అమ్మను కాపాడటానికి తాను ఆ దుస్ట రాక్షసుడితో పోరాడాను అన్నాడు .వాడి రధాన్ని ముక్కలు ముక్కలు చేశానని ,ఆ ముక్కలే ఇక్కడ పడి ఉన్నాయని చూపించాడు .తన రెక్కలు ముక్కలు చేసి సీతను ఎత్తుకొని పారిపోయాడని చెప్పాడు .రావణుడి చేతిలో చని పోయిన తనను ఇంక చంపక్కర్లేదని అన్నాడు .రాముడు తన తొందర పాటుకు పశ్చాత్తాప పడి   ,జటాయువును కౌగలించుకొని బిగ్గర గా ఏడుస్తాడు .లక్ష్మణుడు కూడా చాలా దుఖిస్తాడు .రాజ్యం పోయింది భార్య శత్రువు చేత చిక్కింది చివరికి తన భార్యను కాపాడే ప్రయత్నం లో శత్రువు తో పోరాడిన పక్షిని కూడా తాను రక్షించలేక పోతున్నానని  రాముడు విచారించాడు .తన లాంటి దురదృష్ట వంతుడు ఈ ప్రపంచం లో బతక కూడదని ,తన దౌర్భాగ్యం అగ్నిని కూడా దహింప జేస్తుందని ఆవేదన పడ్డాడు .తన శోకాగ్ని ని చల్లార్చేందుకు మహా సముద్రం కూడా చాలదని వాపోయాడు .తన దురదృష్టం తనకు తమ్ముడికి భార్యకే కాక ఈ పక్షికి కూడా  అంటింది అని ఆవేదన చెందాడు .

జటాయువు ‘’విగతాయువు ‘’అయి పోయాడని చింతించిన రామ లక్ష్మణులు మరిన్ని వివరాలు చెప్పమని జటాయువును అర్ధించారు .సీతను మాయతో రావణుడు దక్షిణ దిక్కుకు తీసుకొని వెళ్ళాడని ,రావణుడు సీతను తీసుకు వెళ్ళిన ముహూర్తం ‘’వింద ముహూర్తం ‘’అని , ఆ ముహూర్తం లో పోయిన వస్తువు తిరిగి యజమానికి దక్కుతుందని ,ఎరను కరచుకొన్న చేపలాగా రావణుడు ఆత్మ నాశనం చెందుతాడని ,త్వరలోనే రావణ ప్రాణాలను రాముడు అపహరించి సీతమ్మను తెచ్చుకొంటాడని దిగులు అక్కరలేదని ,రావణుడు విశ్రస వసువు కుమారుడైన కుబేరుని సోదరుడని చెప్పాడు .ఇంకా చెప్పమని అడుగుతూ నే ఉన్నాడు ఇంతలో జటాయువు ప్రాణ వాయువులు అనంత వాయువులలో కలిసి పోయాయి .

ఒక సారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్దాం .సీతను  ఎత్తుకెళ్లే తన విషయం భర్తకు ఎలా తెలుస్తుందీ అని సీత బాధపడుతూ ,రావణుడితో శక్తి మేరకు వాదులాడుతూ రామా రామా లక్ష్మణా లక్ష్మణా అని విలపిస్తూ వెడుతోంది .రామ సామర్ధ్యం మీద విపరీతమైన విశ్వాసం సీతమ్మకు ఉంది. అయినా ఈ ఆపదనుండి బయట పడాలి .అన్ని వైపులకూ చూస్తోంది .ఎవరైనా కనిపిస్తారేమోనని .ఇంతలో  నేల మీద జడలా ముడి పడ్డ ఆయువు కల ,అరవై వేల సంవత్సరాల ముసలి జటాయువు కని  పించాడు .కళ్ళు పెద్దవి చేసుకొని చూసి జాటాయువే అని అతను తనమామ గారు దశరధుని మిత్రుడని గుర్తు చేసుకొని ‘’జటాయూ జటాయూ ‘’అని బిగ్గరగా అరిచింది .దిక్కు లేని తనను రావణుడు బల వంతం గా ఎత్తుకొని తీసుకొని పోతున్నాడని ఆ దుస్ట రావణుడితో జటాయువు పోరాడే సామర్ధ్యం లేని వాడని కాని  ఈవార్త  తన భర్త శ్రీ రాముడికి తెలియ జేయమని బతిమాలింది .ఆ మాటలు జటాయువు చెవిన పడి తల పైకెత్తి చూసి జానకిని దర్శించాడు .

వెంటనే లేచి ఒక్క సారి ఆకాశానికి యెగిరి రావణుడి ని వెంటపడి మంచి మాటలతో మందలించాడు .నీతిని మన్నించాల్సిన రాజే ధర్మ మార్గం తప్పితే మిగిలిన వారి గతేమిటి అని ప్రశ్నించాడు పర దారాపహరణం ప్రాణాంతకం అని  మందలించాడు .రావణుడు త సోదరుడి లాంటి వాడని ,కనుక సోదర భావం తో మేలు కోరి చెబుతున్నానని ,రాముడు తనకేమీ ద్రోహం చేయక పోయినా ఆయన భార్యా పహరణం కొరివి తో తల గూక్కోవటమేనని ,జనస్థానం లో శూర్పణఖ వలన ఏర్పడిన రాక్షస సంహారం లో రాముడి తప్పేమీ లేదని దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రాముడితో పోరాడాలికాని ఈ అకృత్యం పనికి రాదనీ హితవు చెప్పాడు .రామాగ్ని దశ కంఠుడిని  భస్మం  చేస్తుందని ,విషసర్పాన్ని మూటకట్టు కొని వెడుతున్నాడని తర్కానికి వేదాంతం దొరకదని రావణ బలపరాక్రమాలకు సీతమ్మ దక్కదని ,క్షణం లో పద్నాలుగు వేల మంది రాక్షసులని చంపిన రాముడి ముందు ఎవరూ ఆగలేరని ,పిరికి గా సీతా పహరణం చేయటం వినాశమని చెట్టు నుంచి పండుకోసి నట్లు రావణుని తల పండును క్షణం లో తుంచే స్తానని జటాయువు చెప్పాడు .సామ దాన భేదాల తో పక్షి రాజు లంకాధిపతి కి బుద్ధి చెప్పాలని శత ప్రయత్నం చేశాడు .లాభం కని  పించలేదు .చివరికి జటాయువుకు దండోపాయమే శరణ్యమైంది .

అంత రిక్షం లో రావణ జటాయువులకు తీవ్ర యుద్ధం జరిగింది .రావణుడు బాణాలతో యుద్ధం చేస్తే పక్షిరాజు వాడి గోళ్ళతో చేశాడు .రావణుడు వేసిన పది బాణాలను జటాయువు గోళ్ళతోనే చీల్చి వేశాడు  రధం లో చింతలో ఉన్న సీతను చూడగానే జటాయువులో పౌరుషాగ్ని ప్రజ్వ రిల్లింది .రావణుడు శర వర్షం కురిపించి జటాయువును గూటిలో ఉన్న చిన్న పిట్ట లా చేశాడు ..కాని దీనికి భయపడని జటాయువు రెక్కలతో రావణుని కవచాన్ని రధాన్ని ,రధాన్ని నడిపే పిశాచాలను ముక్కలు ముక్కలు చేశాడు .రావణుని చత్ర చామరాలు చిన్నా భిన్నమైనాయి .సారధి తల బద్దలై పోయింది .చివరికి రావణుడు గతి లేక సీతను ఒడి లో పెట్టుకొని ,కిందికి దిగాడు .పంచ భూతాలు జటాయువు ను ప్రశంసించాయి .జటాయువు కొంచెం అలసి నట్లు కని  పించగా ,రావణుడు పారిపోయే ప్రయత్నం చేశాడు.అతని చేతిలో ఒక కత్తి మాత్రమె ఉంది .రెండవ చేతిలో సీత ఉంది .ఆ దృశ్యాన్ని చూసి సహించలేక జటాయువు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రయత్నించాడు .మరో సారి మంచిమాటలు చెప్పి దుస్ట మార్గాన్ని మార్చుకోమన్నాడు .వాడు వినేట్లు లేదని గ్రాహించాడు .

రావణుడి వీపు మీద కూర్చుని రెక్కలతో జటాయువు రక్కి రక్కి ఉక్కిరి బిక్కిరి చేస్తాడు .ముక్కులతో అతని బాహువుల్ని చేదిస్తాడు .తెగినవి తెగినట్లు మళ్ళీ మొల కేత్తుతున్నాయి .సీతా దేవిని నేల మీద దించి రావణుడు జటాయువు తో మల్ల యుద్ధం చేశాడు .ఘోర యుద్ధమే ఇద్దరిమధ్యా కొన్ని క్షణాలు జరిగాయి .పక్షి  బాధ భరించలేని రావణుడు జటాయువు ను తన ఖడ్గం తో ఖండించాడు .జటాయువు శక్తికోల్పోయి నేల మీద పడి పోయాడు .రావణుడు సీతను పట్టుకొని ఆకాశ మార్గం లో యెగిరి లంకకు చేరాడు ..

జటాయు మరణానికి రామ లక్ష్మణులు శోకించారు .అనేక సంవత్సరాలు దండకారణ్యంలో గడిపిన జటాయువు చిరాయువుగా ఉండాల్సిన వాడు తన కోసం తనువు చాలించాడని రాముడు లక్ష్మణుడికి చెప్పి శోక సాగరం లో మునిగి పోయాడు .పశు పక్ష్యాదులలో కూడా సాధువులు పుణ్యాత్ములు ,ధర్మాత్ములు ఉంటారని ,సీత కని  పించక పోవటం అనే బాధ కంటే తనకోసం జటాయువు ప్రాణాలు అర్పించటం మరీ బాధ గా ఉందని చెప్పాడు .తన తండ్రి దశరధ మహా రాజుకు దహన సంస్కారాలు చేయ లేక పోయిన రాముడు తండ్రిలాంటి వాడు తండ్రికి ప్రాణ మిత్రుడు అయిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి ఋణం తీర్చుకొంటానన్నాడు .లక్ష్మణుడు చేత చితి పేర్పించి శాస్త్రీయం గా జటాయువు కు అంతిమ  సంస్కారాలు నిర్వహించాడు .యజ్న యాగాదులు చేసి యుద్ధం లో వెనుదీయ కుండా పోరాడి భూదానం  చేసిన పుణ్యాత్ములు వెళ్ళే అక్షయ పుణ్య లోకాలకు తన మాట మీద జటాయువు తరలి వెళ్లాలని శ్రీ రాముడు శాసించాడు .దానికి అనువైన మంత్రాన్ని జపించాడు .

కనుక పశు పక్ష్యాదులు కూడా ధర్మాన్ని తప్పక ఆచరించి తమ విద్యుక్త ధర్మాన్ని నెర వేరుస్తాయని జటాయువు కద ద్వారా మహర్షి వాల్మీకి ఎరుక పరచాడు .మనిషి కూడా తన వంతు ధర్మాన్ని నేర వేర్చాలని శ్రీ రాముని పాత్రద్వారా జటాయువు కు రాముడు పితృ సంస్కారాలు చేసి ఋణం తీర్చుకోన్నాడని తెలియ జేస్తాడు

ఆధారం -స్వర్గీయ ఇలపావులూరి పాండు రంగా రావు గారు రాసిన ”అనుదిన రామాయణం ”.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కళిం గాన్ద్రం లో వంశ ధారా ఒడ్డున ”శాలి హుండం ”(వరి కొండ )వద్ద బౌద్ధ స్తూపం

2salihundam 001 3salihundam 001 4salihundam 001 5salihundam 001 6salikundam 001 7salihundam 001 salihundam 1 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోహం పై పరమ హంస భావన

soham 001కళిం గాన్ద్రం లో వంశ ధారా ఒడ్డున ”శాలి హుండం ”(వరి కొండ )వద్ద బౌద్ధ స్తూపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమ్యమైన అక్షర భారతి

రమ్యమైన అక్షర భారతి

శ్రీ చలపాక ప్రకాష్ సంపాదకత్వం లో మే –జులై రమ్య భారతి సంచిక ఉత్తరాంధ్ర మాండలిక రచయిత శ్రీ గంటేడ గౌరు నాయుడు ముఖ చిత్రం తో ,లోపల ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిన్నమాటలు చిన్న వాక్యాలతో చక్కగా వివరం గా ఆయన మాటల్లోనే వివరించి స్పూర్తి కలిగించారు .ఆయన అనుభవాలు ఆయనకు ప్రేరణ నిచ్చిన అప్పల  నాయుడు ,వేసిన తోలి అడుగులు ,  ఎదిగిన విధానం ఆకర్షిస్తుంది . ప్రసిద్ధ నటుడు ,రచయిత ’’జెన్నీ ‘’(పోలాప్రగడ జనార్దన రావు )కద’’తోడూ –నీడ’’ఆరవ జాతీయ స్థాయి చిన్నకదల పోటీల్లో ‘’ప్రత్యెక సోమేపల్లి సాహితీ పురస్కారం ‘’పొందింది .ఆ కదను  ఫన్నీ గా జెన్నీ రాస్తాడనుకొంటే కన్నీళ్లు, మానసిక ఆనందం ,’’ప్రేమించే గుణం ఉంటె ఆస్తి లేక పోయినా ఆరోగ్యం లేక పోయినా హాయిగా బతక వచ్చు’’అనే సత్యాన్ని ఆవిష్కరించి జెన్నీ కదా కధనానికి జోహార్ అన బుద్దేస్తుంది .’’యాభై ఏళ్ళ వాన ‘లో తడిసి ముద్ద అయిన కొప్పర్తి గురించి సజ్జా వెంకటేశ్వర్లు రాసిన విధానం బాగుంది .కవి ఆకాశాన్ని నల్లని గొడుగు గ విప్పెదేవరు ,వికీర్ణం చేసి చినుకుల్లా రాల్చేదేవరు ,అని ప్రశ్నించి ,వాన ఎప్పుడు కురిసినా నిండా ప్రేమ కురిసి నట్లే ఉందన్నారు .చీకటిని జయించటం మానవ నాగరకతా లక్షణం అని మూఢ నమ్మకాలను దూరం చేయమన్నారు .’’బుష్ ను  వ్యతి రే కించ గలను కాని సద్దాం ను సమర్ధిం చ లేనన్నారు ‘తన భార్య గుణ సౌందర్యం ,కుటుంబ జీవనం అనురాగాంకి గుర్తుగా  కొప్పర్తి కవిత ఆమె శ్రమ సౌందర్యానికి అద్దం పట్టింది .తటి వర్తి నాగేశ్వరి  ‘’దాడి ‘’కదా ,పుస్తక సూక్ష్మ సమీక్ష నానీల వంటి కవితలు ,కొత్త ఆవిష్కరణ పుస్తక వివరం ,పాఠకుల చర్చా రమ్య భారతికి అదనపు ఆకర్షణలు .ప్రకాష్ అవిశ్రాంత అక్షరార్చనకు రమ్య భారతి సజీవ సాక్షాత్కారం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –  29-6-14-ఉయ్యూరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద

అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని  ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు ఈ అగ్నులు అవసరమే .ముందు అగ్నిని ప్రతిష్టించి మిగిలిన కార్య క్రమాలు మొదలు పెట్టాలి .

ఒకప్పుడు మానవుల్లాగా దేవతలు కూడా భూలోకం లోనే ఉండి  కర్మానుస్టానాలు చేసుకొంటూ స్వర్గం పొందటానికి సాధన చేస్తూండే వారు .ఈ అనుష్టానం వల్ల  దేవతలు పునర్జన్మ నుండి విమ్ముక్తులై పునరా వ్రుత్తి లేని స్వర్గాన్ని పొందారు .దీనితో మనుష్యుల కంటే వేరు గా ఉన్నారు .స్వర్గానికి పోతున్న దేవతలు అగ్నితో ‘’నువ్వు భూలోకం లో ఉండి మానవులకు ,మాకు అధ్యక్షుడు గా ఉండు .మానవులు శ్రౌత స్మార్త కర్మల ద్వారా సమర్పించిన వి నీ ద్వారా మేం స్వీకరిస్తాం .మా అనుగ్రహం చేత మానవులకు ఐహికాముష్మిక పురుషార్ధాలు పొందుతారు .మనుష్యులకు మాకు సంబంధం కలుపుతూ నువ్వు భూమి మీదే ఉండిపో .మానవులు యజ్న యాగాదులలో ఇచ్చే ద్రవ్యాలను నువ్వు స్వీకరించు .మా తరఫున వారి కోర్కెలు తీర్చు .’’అని చెప్పారు .దానికి అగ్ని ‘’నాకు తీవ్ర దాహం ఉన్న సంగతి మీకు తెలుసు .నన్ను సమీపించటానికే భస్మమై పోతామనే భయం తో  ఎవరూ సాహసం చేయలేరు కదా అందువల్ల మీరనుకోన్నట్లు ‘’పురోడాశం ‘’మొదలైనవి నాకు మానవులు ఇవ్వరు ‘’అన్నాడు .

దేవతలకు సంకట పరిస్తితి వచ్చి బాగా ఆలోచించారు .అగ్ని లో ఇతరులు సహింప రాని తీవ్ర దాహక శక్తి ,మంగళకరమైన మానవాభ్య్దయానికి ఉపయోగించే శోభనకర దాహక శక్తి అని రెండు రకాలు ఉన్నాయి .రెండో దానివలననే మనం వంటలు వగైరా చేసుకో గాలుగుతున్నాం .ఈ శోభన శక్తిని మాత్రం అగ్ని లో ఉంచి ,దేవతలు తీవ్ర శక్తిని వేరు చేసి దాన్ని నీటిలో ఉంచారు .దీనికే ‘’పవమానాగ్ని ‘’అని పేరు .కొంత వాయువులో ఉంచారు .ఇదే పావకాగ్ని .మిగిలిన శక్తి నంతటిని సూర్యుని లో ఉంచారు ఈ అగ్నికే శుచి అని పేరు .కనుక అగ్ని దేవుడిని పూజించాలంటే ఆహవనీయ , గార్హపత్య ,అన్వాహార్య రూపాలలో ఉండే శోభంకర అగ్నులనే కాకుండా పావక ,పవమాన ,శుచి పేర్లతో ఉన్న అగ్ని స్వరూపలనూ పూజించాల్సిందే .అందుచేత ఈ మూడు శరీరాలకు మూడు ఇష్టులు చేయాలి .పావకేష్టి పూర్ణ మాసేష్టికి వికృతి .శుచి ,పవమానేస్టూలకు దర్శేష్టి ప్రకృతి .ఇవన్నీ చేస్తేనే అగ్న్యాధానం పూర్తీ అయి నట్లు లెక్క .

కౌశీతకీ బ్రాహ్మణం విశిష్టత సోమయాగ నిరూపణం మీదే ఆధారపడి ఉంది. సోమయాగం పది రోజులు చేస్తారు వాగ్దీక్ష తో ఇది ప్రారంభ మవుతుంది .ఈ దీక్షతో ప్రాణ దీక్ష  లభిస్తుంది .ఈ రెండిటి వల్లా యజమానికి కోరిక నేర వేరుతుంది .కనుక మాటకున్న విలువ ,దాన్ని ప్రేరేపించే మనసుకున్న సంయమనం ,మనసుతో ప్రభావితమయ్యే ప్రాణ శక్తి ప్రయోజనం ఇందులో సూచించారు .ఇందులో సూచిన అభిజిత్ ,విశ్వజిత్ యాగాలు విశిష్టమైనవి .అభిజిత్ అంటే అగ్ని .విశ్వజిత్ అంటే ఇంద్రుడు .దేవతలు అభిజ్త్ యాగం తో ముల్లోకాలను జయించారు .మిగిలిన లోకాలన్ విశ్వ జిత్ చేసి జయించారు .ప్రజా  రక్షకుడైన డైన రాజుకు విశ్వ జిద్యాగం చాలా అవసరం అని తెలుస్తోంది .శత్రు శేషం లేకుండా చేస్తుంది.దీనితో సామాన్య ప్రజల సంక్షేమానికి హాని తల పెట్టె దుస్త శక్తులను మట్టు పెట్ట వచ్చు లోక క్షేమం కలుగు తుంది .

మనసుకు పరిధులు లేవు అని ,మనస్సు ప్రజాపతి అని ,ఆ ప్రజాపతి యజ్న మయుడని ,మనః పూర్వకం గా యజ్ఞం కోసమే యజ్ఞం చేయాలని తెలియ జేయ బడింది .ప్రజా  రక్షకు డైన రాజు మనస్సుజీవితం నిస్వార్ధం గా ఉండాలి అనే సూచన ఉంది .విజ్నుడి రాక తో యజ్ఞం ఆనందిస్తుందని చెప్ప బడింది .ఏదైనా ప్రమాద వశాత్తు తప్పులు చేస్తే సరి దిద్దుకోవాలని సూచించింది ..అందరూ చేరలేని ఎత్తులకు ఎగిరే గరుత్మంతుడే వాయువు అని ,వాయువు అంటే ప్రాణమని చివర సుపర్ణ పర్వం లో వివరింప బడింది .వాల ఖిల్యులు అంటే భౌతిక శరీరం నుండి విడి పోని  ప్రాణాలు అని ,వైశాల్యం లో వాలం అంటే కేశం అంటే వెంట్రుక వంటి ప్రాణాలు ,శరీరాన్ని వదల లేవుకనుక వాటికి వాలఖిల్యులు అనే పేరొచ్చింది .రెండిటితో సంబంధం లేని దాన్ని ఖిల అంటారు . సూక్ష్మ సంబంధం ఉన్దికనుక వాలఖిల్యులన్నారని భావం .చివరలో కర్మ బద్ధుడైన జీవుని ప్రస్థానాన్ని కూడా సవివరం గా కౌశీతకి బ్రాహ్మణం వివరించింది .

అగ్ని  బ్రహ్మణ   శక్తి .సోమం క్షాత్ర శక్తి .అన్ని కోర్కెలను తీర్చే వాక్కు మనస్సు లే హోమ ద్రవ్యాలు .బలి సమర్పించటం అంటే పురోడాశం సమర్పించటమే  పశుబలి .పశువును కాక పశువుకు ప్రతీక అయిన పురోడాశం ను సమర్పించాలి .యజ్ఞం చేసే యజమానికి ఇహ పరాల్లోను అంతరిక్షం లోను మేలు జరుగుతుంది .సంతానంకావాలని యజ్ఞం చేసేవారు ‘’శుద్ధ ప్రణవం ‘’ను ,పరువు ప్రతిస్టలకై చేసే వాళ్ళు ‘’మకార లేకుండా ఉన్న ప్రణవాన్ని ‘’ఉచ్చరించాలి ఈ యజ్ఞం సు సంపన్నం అయితే స్వర్గ రూపం ,తగ్గితే అన్నాది రూపం ,హెచ్చితే సంతాన రూపం అవుతుందని వివరించింది కౌశీతికం .సోమమే సవనీయం చేయాల్సిన పశువు .యజ్నమే ప్రజాపతి స్వరూపం అని ముందే తెలుసుకొన్నాం .ప్రాజాపత్య యజ్ఞం సర్వా భీస్టాలను తీరుస్తుంది .సూక్షం గా విచారిస్తే యజ్న కర్త శరీరమే పురోడాశం .ఆయన ఉచ్చ్వాస నిస్శ్వాసాలే సోమ పాన పాత్రలు .యజ్ఞకర్త ఇహలోకం లో సంపూర్ణ జీవితం గడిపి స్వర్గం లో అమరుడౌతాడు .

షోడశి లో ఈ విశ్వం షోడశ కళాత్మక రూపం గా చెప్ప బడింది షోడశి ఇంద్రుడే .ఇంద్రుడు హరి యే.యజ్ఞం పురుష స్వరూపమే .పురుషుని శిరస్సు ‘’హవిర్వాహకం ‘’.ముఖమే ఆహవ నీయం .ఉదరం సదస్సు .ఆహారమే దేవతలకు చేసే స్తోత్రాలు .బాహువులు మార్జాలీయాగ్ని ద్రీయాలు .లోపలి దివ్య శక్తులు సదస్సులోని దేవతా పీఠాలు .మనస్సు బ్రహ్మ. .ప్రాణమే ఉద్గాత .అపానం ప్రస్తోత .వ్యానం ప్రతి హర్త.వాక్కు హోత .నేత్రమే అధ్వర్యుడు .సంతతే సదస్యులు .ఆత్మ యజమాని .అవయవాలు హోత్రాశంసులు .ఇవన్నీ గమనిస్తే మానవ జీవితం  యజ్న మయం అనే అంతరార్ధం తెలుస్తుంది .

పూరీ జగన్నాధ రధ యాత్ర శుభా కాంక్షలు –

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నామిని రాసిన మూలింటా మేకదా -బి యెన్ రెడ్డి లేఖ -భానుమతిలా పొజిచ్చిన వెండి తేర బంగారం రాజశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భయం తో రాసిన -భాస్కర భట్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిం .టిం.ప్ర.జ.-3

డిం .టిం.ప్ర.జ.-3

డింగిరి –గురూ !ఆయనెవరో ద్వారక పీఠాదిపతి షిర్డీ సాయిబాబా పై విరుచుకు పడ్డాడు ?

టింగిరి –నిజమే .ఆయనే స్వరూపానంద స్వామి .సాయిబాబా దేవుడుకాదు ,అవతారమూకాడు గుళ్ళూ, గోపురాలు కట్ట వద్దు ,పూజించ వద్దు అన్నాడు .

డిం –కారణం ఏమిటి స్వామీ?

టిం –ఏమీలేదు నాయనా !ప్రజలు పట్టించుకోకపోతే తాను ఉన్నానని తెలియ జెప్పటానికే ఈ ఆక్రోశం .మీడియా లో కనిపిస్తే మళ్ళీ ‘’డిగ్గీ రాజా’’ లాంటివారు వచ్చి పాదాలను ఆశ్రయిస్తారనే ఆరాటం .గ్లామర్ తగ్గినప్పుడల్లా ఆయనకు ఇదొక వినోదం .గిల్లి జోకొట్టటం .

డిం –ఆయన మాటల్లో నిజం లేదాగురూ!

టిం –అది నమ్మకం మీద ఆధార పడిదఉంటుంది .అసలు సాయిబాబా ఒక కారణ జన్ముడు అని నమ్మే వారి సంఖ్య బహుళం గా ఉంటె సముద్రం లో కాకి రెట్టలా ఈ వ్యాఖ్యానాలు వ్యర్ధం .ఆకాశం మీద ఉమ్మేస్తే వచ్చి మీద పడేది మన మొహం మీదే కదా శిష్యా !.ప్రతి వాడిలోను దైవాంశ ఉందని మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సిద్ధ యోగి పుంగవులు ఘోషిస్తుంటే దానినేమాత్రం అర్ధం చేసుకో కుండా ఈ ప్రేలాపన అహంకారాన్ని ,అజ్ఞానాన్ని తెలియ జేస్తుంది .ఇదొక ప్రచార ఆర్భాటమే .

డిం –‘’నగరం’’ లో అ గాస్ భీభత్సం ఏమిటి గురూ?

టిం –అనుకోకుండా వచ్చేవి ఉపద్రవాలు .ఇది మానవ తప్పిదం .గాస్ ను యెంత జాగ్రత్త గా ఉపయోగించుకోవాలో తెలియ జేసే ఉదంతం ఇది .హెచ్చరికలు చేసినా పై అధికారులు చలించక పోవటం బాధ్యతా రాహిత్యమే .ఆఘ మేఘాల మీద ముఖ్య మంత్రి బాబు వచ్చి పరామర్శించి ఓదార్చి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసి ,కేంద్రాన్ని ఒప్పించి పాతిక లక్షల నష్ట పరిహారం ఇప్పించే ఏర్పాటు చేశాడు ఇలాంటి సందర్భాలలో చంద్ర బాబు యెంత వేగం గా స్పందిస్తాడో తెలియ జేస్తుంది .అందుకే అంతనమ్మకం ఆయన పైన .

డిం –సరిపోతుందా ?

టిం –ప్రాణాలను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాని బాధిత కుటుంబానికి .పరిహారం ఉద్యోగం చదువు కూడా ఏర్పాటు చేయటం కొంతలో కొంత నయం .

డిం –ఇవాళ జగన్ వచ్చి చూసి వెళ్ళాడు ?

టిం –మానవత్వమున్న ఏ వ్యక్తీ అయినా ఇలా స్పందించాల్సిందే .కాని వచ్చి చూసి వెళ్ళాడు .కోటి ఇమ్మని నీతి చెప్పాడు .కాని తన పాపం సోమ్ములోంచి కొంత ఇచ్చి ఒదార్చితే బాగుండేది .పని లేనప్పుడు ఓదారుస్తా ఓదారుస్తా అని వెళ్లి జనాన్ని కావ లించుకొని ముద్దేట్టుకొని హడావిడి చేసిన వాడు ఇలా ఉత్త చేతులతో వెడితే బాగా లేదని పించదా ఎవరి కైనా ?

డిం –బ్లాక్ మనీ మార్చుకోటానికే కిరణ్ బి జెపి చెప్పులు తోడుక్కుం టుక్కుం టున్నాడని డొక్కా అంటున్నాడు ?

టిం –నిజమే .ఎవరికి ఏ జత నచ్చితే ఆ చెప్పులేసుకొంటారు .ఇది సహజం .ఎన్నికల ముందు డొక్కా ఎన్ని ఊపులూపాడు దేనిలో చేరాలో తెలీక ?ఎక్కడా ఇమడలేక అక్కడే చతికిల పడ్డాడుకాని .కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మనీ లేదని డొక్కా అభిప్రాయమా ?త్వరలోనే స్విస్ లో దాచిన నల్ల కుబేరుల డబ్బు చిట్టా విప్పుతోంది కేంద్రం .అప్పటిదాకా ఆగి ఆ ఆ మాట అని ఉంటె బాగుండేది

డిం –పి వి జయంతి ని ఘనం గా నిర్వహించాడు కేసి ఆర్ ?

టిం –చాలా మంచిపనే చేశాడు .అలాగే హైదరాబాద్ లో ఒక ఘనమైన స్మ్రుతి చిహ్నం ,ధిల్లీ లో ఒక ఘాట్ ఏర్పాటు చేయిస్తే ఇంకా ఘనం గా ఉంటుంది .కొత్త జిల్లాకు ఆయన పేరు పెడతాననటం ఒక చిన్న అడుగే కాని ఆయన గౌరవానికి తగినదికాదు .భారత రత్న ఇప్పించాలి కేసి ఆర్ .అప్పుడే ఆయనకు జరిగిన అవమానానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్లు అవుతుంది. దీనికి ఆంద్ర ప్రభుత్వమూ మద్దతు పలకాలి .ఇచ్చినా ఇవ్వక పోయినా ఆయనకు వోరి గేదేమీ లేదు .మనకే ఆ గర్వం శోభ నిస్తుంది అంతే .

డిం –అబ్బో గురూగారికి పెద్దాయన మీద ఇంత ఇది ఉందా ?

టిం –బడుద్దాయిలం కనుక మనం ఇంతకాలం ఊరు కున్నాం .ఇంకో రాష్ట్రం వాళ్ళయితే ఆయనకు అవమానం చేసిన వారి భరతం పట్టి ఆయనకు గౌరవం చేకూర్చే వారు .

డిం –కంచే దూకే వాళ్లకు త్వరలో తానూ సి ఏం అవుతానని జగన్ ఊర దించాడట ?

టిం –ఎంతకాలం కాపు కాస్తాడు ?ఒట్టిపోయిన గొడ్డును పిండితే ఏమొస్తుంది తన్నులు తప్ప ?అందుకే తమ్ముళ్ళు తెలుగు అన్న దగ్గరే సేఫ్టి అని గోడదూకటానికి రెడీ అయితే ఇలా ఓదారుస్తు మభ్య పెడుత్రున్నాదేమో ?

డిం –గురూ !చాలా ఆవేశం లో ఉన్నావ్. వస్తా

టిం –సరే శిష్యా

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14 –ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

G.D.P.-2(చివరి భాగం )

.G.D.P.-2(చివరి భాగం )

 

పెద్దల మాట పేద చెవిన పెడితే జరిగే అనర్ధమేమితో తెలుసా?2050నాటికి ఇండియాలో కార్లు అమెరికాలో కంటే ఎక్కువై పోతాయి .రద్దీ పెరిగి పోతుంది .అమెరికాలో చదరపు కిలో మీటర్ కు 32మంది ఉంటె ఇండియా లో 840అవుతారు .కారు పార్కింగ్ సంగతి దేవుడిదకెరుక కారు నడపటానికే స్థలం చాలదు .కార్లసంఖ్యతో శక్తి వనరుల వాడకం పెరిగి అడుగంటి పోయే ప్రమాదం ఉంది .ఇండియా చైనాలు చమురు విపరీతం గా వాడటం వల్లనే అంతర్జాతీయం గా చంరు ధరలకు రెక్క లోచ్చాయి .అమెరికా లాంటి అభి వృద్ధి చెందిన దేశాలు కూడా తమ విధానాలను మార్చుకోవాలి .ధనిక దేశాలు ఇండియా ఆయిల్ పై చేసే ఖర్చును చూస్తూ ఊరుకోలేవు . భరించి రక్షించే అభివృద్ధి అంటే ఇప్పటి అవసరాలకు తగినట్లుగా ,భవిష్యత్తుకు తరాల వారి కోరికలను కూడా తీర్చేది  .ఇప్పటి జి డి పి అభివృద్ధి ప్రక్రుతి మీద ఒత్తిడి ఎక్కువ కలిపిస్తుంది .మన కోరికలను అవసరాలను మరొక్క సారి నిర్వచించుకొని ముందుకు సాగక పోతే ఆగామి  తరాలకు చేటు తెచ్చే వాళ్ళం అవుతాము .

అలాగే వస్తువుల మీద మోజు కూడా ఇబ్బందే కలిగిస్తుంది .అన్నీ కొనాలనే కోరిక ,మనకే ఉండాలనే భావం తో కన్సూమరిజం అభివృద్ధి ఇంజెన్ కు శక్తి సమకూరుస్తున్దనుకోవటం పిచ్చి ఆలోచన .అలాగే స్వంత ఇల్లు ఆలోచన పెరిగిన కొద్దీ బ్యాంకులు ముందుకొచ్చి రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి .బ్రిటిష్ మేనేజ్ మెంట్ నిష్ణాతుడు చార్లెస్ హండి రాసిన ‘’ది హంగరీ స్పిరిట్ ‘’పుస్తకం లో ఇలా ప్రతిదీ కొని పారేస్తుంటే వందేళ్ళలో పదహారు రెట్లు వస్తువుల్ని కొని ఏం చేసుకోవాలో తెలీక ,పర్యావరణానికి భంగం కలిగించి దోషులమవుతామని చెప్పాడు .వినియోగం ఎక్కువై కొనుబడి పెరుగుతూంటే దౌర్జన్యాలు దొమ్మీలు ఎక్కువైనట్లు బ్రిటన్ చరిత్ర చెబుతోంది .ఇలా అయినకాడికి కొనటం ఆత్మ గౌరవం అని భావించటం వెర్రి ఆలోచనే .ఆశ ఎంతటి పనైనా చేయిస్తుంది .దురాశ దుఖానికి దారి .కోరిక వస్తువులను అనుభవించి పొందే ఆనందాన్ని సంతృప్తి చెందించదు .అగ్నికి ఆజ్యం పోస్తే చేల రేగినట్లు చేల రేగుతుంది అని గీతా చార్య  తో బాటు మనువు కూడా ఉవాచ .సంపద ,కీర్తి ,ఇంద్రియ సుఖం లలో చివరిది పశ్చాత్తాపం తో పరిహరమౌతున్దికాని మొదటి రెండిటిని ఎప్పటికీ సంతృప్తి పరచలేము అని పదిహేడవ హతాబ్ది ఫిలాసఫర్ స్పినోజా చెప్పాడు .

క్రైస్తవం కూడా కోరిక ను తిరస్కరించింది .మధ్యయుగ మతాధికారులు దీన్ని అమలు చేయటానికి ఏంతో ఒత్తిడికి గురైనారు .జుడాదయిజం లో కూడా దురాశకు తావు లేదు .సంపద ,అధీనం లోని వస్తువులు అన్నీ భగవంతుని కృపగా భావించి ఒక సంస్థ ద్వారా వినియోగం లోకి తేవాలని జుడాయిజం కోరింది . కంజూ మరిజం మనస్తత్వం పెరిగితే భోపాల్ గాస్ దుర్ఘటనలెన్నో చోటు చేసుకొంటాయి . ఆవిష వాయువులోని కాంపోజిషన్ ఏమిటో యూనియన్ కార్బైడ్ చెప్పక పోవటం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం  పోగొట్టుకోన్నాం .మనిషికి ,ప్రకృతికి మధ్య అనుబంధం ఎక్కువైతేనే భోపాల్ సంఘటనలు లాంటివి తగ్గించ గలం .దీర్ఘకాల జీవితం, ఆరోగ్యం అనేవి సాధించగలం ఐర్లాండ్ లో ఆర్ధికాభి వృద్ధి వేగం గా జరిగింది .జి డి పి కొలత సరైనదికాదని ఆ దేశపు ఆర్ధిక వేత్త ఫాదర్ సియాన్ హేర్లీ అన్నాడు .ఇంట్లో పిల్లాడిని పెంచే ఖర్చు జి డిపి లో భాగం కాదు .కాని ఒక తల్లి పనికి వెళ్లి తేనే జి డిపి పెరుగుతుంది .పిల్ల పెంపకానికి రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఎక్కడైనా కేర్ లో పెడితే .కనుక ఇప్పుడు ఆమెకోచ్చే జీతం ఈ ఖర్చు జి డి పిలో భాగమవుతుందని ఫాదర్ చెప్పాడు .

నేషనల్ అకౌంటింగ్ ను వ్యాప్తి లోకి తెచ్చిన సైమన్ కుజ్నెట్స్ ‘’సంక్షేమానికి జిడిపి కొలమానం పనికి రాదన్నాడు .1934లో కుజ్నెట్స్ అమెరికా కాంగ్రెస్ ను జాతీయ ఆదాయం తో అమెరికా సంక్షేమాన్ని ముడి పెట్ట వద్దు అని హెచ్చరించాడు .అమెరికా కాంగ్రెస్ కాని,ఏ రాష్ట్ర ప్రభుత్వం కాని ఆయన మాటలను పట్టించుకో లేదు .1962లో నేషనల్ అక్కౌంటింగ్ ను పునరాలోచించమని హితవు చెప్పాడు .అభి వృద్ధిలో క్వాలిటి కి  క్వాంటిటికీ  మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించాలన్నాడు . దీర్ఘ కాల, స్వల్ప కాల ప్రయోజనాలను గమనించాలన్నాడు .అధిక వృద్ధి దేని కోసం? ఎందుకోసం? అని ప్రశ్నించుకొని విధానాలు ఎర్పరచుకోవాలన్నది ఆయన ఉద్దేశ్యం .

రాజీవ్ కుమార్ చెప్పినట్లు వృద్ధి అవసరమే కాని అదొక్కటే చాలదు .ఇలా వృద్ధి చేసుకొంటూనే పోవాలా ?ఎంతకాలం ?అనీ ఆలోచించాలి .సైన్సు ,టెక్నాలజీ అభివ్రుద్ధినివ్వటం నిజమే .టెక్నాలజీ లో ప్రతి ముందడుగు వెనక ఎత్తు పల్లాలున్నాయని గ్రహించాలి .న్యూక్లియర్ ఎనర్జీ ఎన్నోఅద్భుతాలను సాధించి ఇచ్చింది కాని న్యూక్లియర్ వేస్ట్ఒక పెద్ద సమస్య అయి దెయ్యం లా భయ పెడుతోంది .న్యూక్లియర్ ఆయుధాలు రాక్షణకే అయితే మంచిదే అవి టెర్రరిస్టుల, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలోకి వస్తే యెంత ప్రమాదమో కూడా ఆలోచించాలి .టెక్నాలజీ ని సృస్తిస్తున్నాం కాని దాన్ని సమ తూకం లో ఉపయోగించలేక పోతున్నాం .ఇవాళ కారు మనమీద సవారీ చేస్తోంది .అదొక వ్యసనమైంది .అలాగే కమ్మ్యూనికేషన్ టెక్నాలజీ లో దూసుకు పోతూ ఏంతో ప్రగతి సాధిస్తున్నాం .సెల్ సోల్లుకే ఎక్కువ పయోగాపడటం దారుణం .కన్స్యూమరిజం ను విద్యా వైద్య , సాంఘికా కావసరాల సేవలో నియంత్రించి ఉపయోగించాలి .కిందికి కారటం ప్రారంభిస్తే  అంతా ఖాళీయే .

గాంధి మహాత్ముడు చెప్పినట్లు మనం భారతీయులం మాత్రమె కాము ప్రపంచ పౌరులం అని మర్చి పోరాదు. ప్రపంచ అవగాహన తో అడుగులు వెయ్యాలి .మన్మోహన్ సింగ్ కన్జూమరిజం అక్కర్లేదు గాంధి గారి నిష్ట ఉంటె చాలన్నాడు .సాధారణ జీవితం గడిపితే సమస్యలే ఉండవన్నాడు .దీనికి మహాత్ముడే ఆదర్శం అన్నాడు .భారతీయులు పాశ్చాత్యం వైపు ద్రుష్టి పెట్టి ఇండియాలోని మనుష్యులను మర్చిపోతున్నారు .ఆర్దికాన్ని నమ్మవద్దని దానివలన నైతికత దెబ్బ తింటుందని గాంధీ ఉవాచ .ఇండియా గాంధీ మాటలను వల్లే వేస్తుంది కాని ఆచరించక పోవటమే అన్ని అనర్దాలకు  మూలం .త్యాగం అంటే సంపద ,భార్యా పిల్లలు వద్దు అని కాదువాటితో అనుబంధం తగ్గించుకోమని అని గాంధి అన్నాడు .కాని దీన్ని పట్టించుకొన్న వారు తక్కువే .పాశ్చాత్య రాజకీయ వేత్తలు జీవిత ధర్మం లోనే స్వేచ్చ ఉందంటారు .భౌతిక సంపద మాత్రమే బాధల్ని పోగొట్టదు .వేస్త్రెన్ సైన్స్ ,ఎకనామిక్స్ బాధ లను పట్టించుకోవు .బిజినెస్ మోడల్స్ ఖరీదు గురింఛి ,లాభాలు ,షేర్ ల గురించే  ఆలోచిస్తాయి .కనుక జి డి,పి. బలుపు అవ్వాలే కాని వాపుగా మార రాదనీ గ్రహించాలి .

ఆధారం –మార్క్ టుల్లి రాసిన ‘’ఇండియాస్ అన్ ఎండింగ్ జర్నీ ‘

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

వజ్రాల దీవి

Vajrala deevi
యక్షులు, బ్రహ్మరాక్షసులు
భూత ప్రేత పిశాచాలకు ఆలవాలమైన
ఆ ద్వీపంలో ఎక్కడ చూసినా
వజ్రాలు రాశులు పోసి వుంటాయి
కానీ అక్కడికి వెళ్ళినవాళ్ళు
ప్రాణాలతో తిరిగి రాలేదు
పుత్రధర్మాన్ని నెరవేర్చడానికి
జయశీలుడు అనే ఒక సాహసవీరుడు
ఆ ద్వీపంలో అడుగుపెట్టాడు!
అతడు క్షేమంగా తిరిగి వచ్చాడా?
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
జయశీలుడి సాహసయాత్ర
వజ్రాల దీవి
అడపా చిరంజీవి జానపద నవల!

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమామీషు -8

తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం .

పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ?

సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు ‘’అంటారు .ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం .వసిష్ట మహర్షి ఇక్ష్వాకు వంశ పురోహితుడని మనకు తెలిసిన విషయమే .వసిస్టూని సంతతి లోని వారందర్నీ వసిస్టూడు అనే పేరు తోనే పిలుస్తారు .అంతేకాక సామాన్య పురోహితుడినికూడా ఆ గౌరవ వాచకం  తో ‘’వసిస్టూడు ‘’అనే పేరు తో పిలవటం లోకం లో సహజమై వసిస్టూడు అందరి వాడయ్యాడు .

ఒకప్పుడు రుషులందరికీ ఇంద్రుడిని ప్రత్యక్షం గా చూడాలని పించింది .కొందరు కొన్ని  రకాల ప్రయత్నాలు చేశారు .కాని ఎవరి వల్లా కాలేదు .వసిష్ట మహర్షి ఆలోచించి ‘’నివహం ‘’అనే పేరుగల సామ మంత్రం తో ఇంద్రుడిని స్తుతించాడు .వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమై అనేక యజ్న యాగాది క్రతువులను వాటి అనుస్టాన పద్ధతులను సవివరం గా తెలియ జేశాడు .అందుకనే మిగిలిన రుషులకంటే వశిస్టూడి కే ప్రాధాన్యత కలిగింది .సకల వైదిక కర్మలూ సమగ్రం గా తెలిసిన వాడవటం వల్ల చక్రవర్తలు  ఇతర ఋషులను వదిలి పెట్టి వశిస్టూడినే పురోహితుడిగా చేసుకొన్నారు .

నిజమైన పుత్రుడు ఎవరు?

ప్రజాపతి భూమిని ,అందులోని ప్రాణుల్ని ,స్వర్గం మొదలైన లోకాలను ,సూర్య చంద్రాది మండలాలను సృష్టించాడు .కాని సృష్టిలోని ప్రాణులు ప్రజా పతి గారి పెద్దరికాన్ని మన్నించ లేదు .అప్పుడు ప్రజా పతి సృష్టి సారాన్ని అంతటిని ఒక మాలగా చేసి మెడలో ధరించాడు .దీనితో సకల సృష్టీ ప్రజాపతి పాద క్రాంతమై దాసోహమన్నది .ఇప్పుడు ప్రజాపతికి తన సృష్టి కి ఒక నాయకుడు ఉంటె బాగుండును అని పించి తన మెడలోని మాలను ఇంద్రుని మెడలో వేశాడు .ప్రజాపతికి ఇంద్రుడుకాక చాలా మంది పుత్రులున్నారు కాని తండ్రి ఇంద్రుని మెడలో మాల వేశాడు కనుక వంశ రక్షకుడిగా సమర్ధుడిగా  ఇంద్రుడినే ఎంపిక చేసి నట్లు లెక్క .తండ్రి విశ్వాసానికి పాత్రుడై ఆయన ఆస్తిలో అధిక భాగాన్ని పొందిన వాడే నిజమైన పుత్రుడు అని తాండ్య బ్రహ్మనం చెప్పింది .

తర్వాత ఇంద్రుడు ‘’అభిజిత్ ‘’విశ్వ జిత్ ‘’అనే యాగాలు చేసి ,జైత్ర యాత్ర చేసి సమస్తలోకాది పతి అయ్యాడు .కనుక  తండ్రి అధికారం ఇచ్చి నందు వల్లనే కాక స్వంత ప్రతిభా సామర్ధ్యాలు కూడా ఇంద్రునిలో ఉన్నాయని ఈ బ్రాహ్మణం తెలియ జేస్తోంది .ఇందులోని ఉపాఖ్యానాలు ఎక్కువ గా సామల గురించే ఉన్నాయి .దేవాసురులు పశు సంపద కోసం యుద్ధం చేశారు .దేవతలు ‘’ఆతే  అగ్న’’అనే ‘’సంజయ సామ ‘’ను గానం చేసి సాధించారు .దేవతల మీద అలిగి పక్షి రూపం తో వెళ్లి పోయిన యజ్న పురుషుడిని ,దేవతలు ‘’సౌవర్ణ సామ ‘’తో తిరిగి పొందారు .ఇంద్రుడు ‘’పదస్తోభ సామ ‘’గానం చేసి వ్రుత్రాసురిడిని సంహరింఛి నందుకు కలిగిన పాపాన్ని పోగొట్టుకొన్నాడు

విఖనసుని పుత్రులను వైఖానసులు అంటారు వీరు ఇంద్రునికి ప్రీతి పాత్రులు .వైఖానసులు దేవతలకు ఉపకారం చేస్తున్నారని క్కోపం తో ఒక రాక్షసుడు వారిని రహస్యం గా ఎత్తుకొని వెళ్లి ‘’ముని మరణం ‘’అనే చోట దాచేశారు .తన ఆప్తులు కానీ పించక పోయే సరికి ఇంద్రుడు కలవరం చెంది నలుమూలలా వెతికించాడు .చివరికి వైఖానసుల కళేబరాలు కానీ పించాయి .ఇంద్రుడు అక్కడికి వెళ్లి ‘’వైఖానస సామ ‘’ను గానం చేసి వారిని పునరుజ్జీవులను చేశాడు .అందకని సామాలలో వైఖానస సామ కు అధిక ప్రాధాన్యం ఉంది అది తీర్చలేని కోరిక అన్తోఉన్దదని విశ్వాసం .దానం పట్టటం దోషమే కాని కొందరికి తప్పని పని అది ఆ దోష నివారణకు ‘’ధ్వస్రమొహ్ పురుశాస్తన్యొహ్ ‘’అనే మంత్రాన్ని చదువుతారు .ఇప్పుడు గో పద బ్రాహ్మ ఉపాఖ్యానాలను గూర్చి తెలుసు కొందాం .

గోపద బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

అధర్వ వేదానికి చెందిన గోపద బ్రాహ్మణం లో చాలా గంభీర అంతరార్దాలున్న ఉపాఖ్యానాలు  ఉన్నాయి .ఇందులో ముఖ్యమైన ‘’ఉద్దాలక –శౌనక సంవాదం ‘’గురించి తెలుసుకొందాం .

అరుణుడు అనే మహర్షి పుత్రుడే ఉద్దాలకుడు .ఉద్దాలకుడు శాస్త్రార్ధం చేసి తనను జయించిన వారి కి తన మెడలో ఉన్న విలువైన హారం ఇస్తానంటూ దేశాలన్నీ తిరిగాడు .ఎవరికి అంతసాహాసం కని  పించలేదు .చివరికి ఉత్తర దేశ పండితులు శౌనకుడు అనే పేరున్న ‘’సద్రేవాయనుడు ‘’ను నాయకుడిగా చేసుకొని ఉద్దాలకునితో శాస్త్రార్దానికి తల పడ్డారు ,ఉద్దాలకుడు ప్రశ్నిస్తుంటే శౌనకుడు జవాబులిచ్చాడు .ఈ కధలో విజ్ఞాన్నాన్ని పొందటమే కాక దాన్ని శాస్రార్ధ చర్చలతో పెంపొందించుకోవాలనే సందేశం ఉంది .

ప్రేది –ఉద్దాలకుడు

ఉద్దాలకుని గురువు ఇప్పటి పాట్నా అయిన కౌశాంబి నగర నివాసి ‘’ప్రేది’’.  శిష్యుడికి బ్రహ్మ చర్యాన్ని గూర్చి బోధించి ‘’నీ తండ్రి సంవత్సర యజ్ఞాన్ని ఎన్ని రోజుల్లో పూర్తీ చేస్తాడు ?’’అని అడిగితె ఉద్దాలకుడు ‘’పది రోజుల్లో ‘’అని సమాధానం చెప్పాడు .ఇలా చెప్పటానికి ఉద్దాలకుడికి ఒక లెక్క ఉంది .ముఖ్యమైన విరాట్ ఛందస్సుకు పదే అక్షరాలుంటాయి .ఆచార్యుడు మళ్ళీ అడిగితే ‘’తొమ్మిది ‘’అన్నాడు శిష్యుడు .ప్రాణాలు(నవ రంధ్రాలు )  తొమ్మిది కనుక సరైన సమాధానమే చెప్పాడు .మళ్ళీ అడిగితే  గాయత్రి అష్టాక్షరి కనుక ఎనిమిది అన్నాడు .మళ్ళీ అడిగితె ముఖ్య ఛందస్సులు ఏడు కనుక ఏడు అన్నాడు .ఇలా సంఖ్య తగ్గుతూ చివరికి మనిషికి రెండు పాదాలు కనుక రెండు అన్నాడు .ఇక్కడ పాదం అంటే మనం అనుకొనే కాలు కాదు కర్మ ,జ్ఞాన మార్గాలు .చివరి ప్రశ్నకు ఒకటి అన్నాడు ఉద్దాలకుడు .అంటే ఒక సంవత్సరం అని అర్ధం .మానవుని కి పరమార్ధాన్ని బోధించే విషయాలెన్నో ఇందులో ఉన్నాయి .

దక్ష యజ్న ధ్వంసం

ఒక సారి ప్రజాపతి దక్షుడు రుద్రునికి భాగం లేకుండా యజ్ఞం ప్రారంభించాడు .కూతురు సతీదేవిని అవమానించాడు కోపించిన రుద్రుడు వీర భద్రుని సృష్టించి దక్షాధ్వర విధ్వంసం చేశాడు .యజ్ఞం లో మిగిలిన ‘’ప్రాశిత్రాన్ని ‘’చూడగానే భగుడి కళ్ళు పోయాయి .సవిత్రు దేవత దాన్ని తాకగానే చేతులు తెగిపోయాయి .బంగారు చేతులు అమర్చాడు . .అందుకే హిరణ్య పాణి అనే పేరొచ్చింది. సవిత్రునికి .సూర్యుడు సాహసించి తిన బోతే పళ్ళు ఊది పోయి ‘’పూషుడు ‘’అని పిలువా బడ్డాడు .అందుకే సూర్యునికి పళ్ళు లేవుకనుక మెత్తని పిండి పదార్దాలే నై వేద్యం పెట్టాలని శృతి చెప్పింది .ఇద్ముడికి శిరస్సు ,బర్హికి కీళ్ళు పడిపోయాయి .చివరికి బృహస్పతి మంత్రోచ్చారణ తో సూర్యుని కళ్ళ తో చూస్తూ అశ్వినీ దేవతల బాహువులతో స్వీకరించి లోపాన్ని సరి దిద్దాడు .ఇందులో ఉన్న అంతరార్ధం –ప్రజా పతి శరీర అవయవాలకు అది పతి అయిన జీవాత్మ .రుద్రుడు సర్వజ్నుడైన పరమాత్మ .యజ్ఞం అంటే పరమాణు సంయోగం తో ఏర్పడిన శరీరం .ప్రజా పతి రుద్రుడని యజ్ఞం నుంచి దూరం చేయటం వలన భగ ,సవిత్రు ,పూషా ,ఇధ్మ,బర్హిస్ తత్వాలు తమ తమ పనులు చేయ లేక పోయాయి అని గ్రహించాలి .జ్ఞాని ఏ పనిలోనూ పరమాత్మ ను మరువ రాదు అని నీతి .

సశేషం

ఈ రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి –‘’మహా కవి కాళి దాసు దివస్’’ సందర్భం గా శుభా కాంక్షలు

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-6-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి

పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి

ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది. షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది.

ఇది భారతదేశం. హిందూ దేశం. మరీ ప్రాచీన కాలంలో జంబూ ద్వీపం. పాశ్చాత్యులకు ఇండియా. ఇది బహు మతాల, బహుతాత్విక ధోరణుల, బహుళ సంస్కృతుల నేల. ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానందకు దేశం గురించి ఈ అవగాహన ఉన్నట్లు కనపడదు.
ఈ దేశంలో భక్తులున్నారు. యోగులున్నారు. జ్ఞానులున్నారు. ఫకీర్లున్నారు. సూఫీలున్నారు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారికి గుళ్ళూ, గోపురాలూ, దర్గాలూ, ఆశ్రమాలూ, మెమోరియల్సూ ఉంటాయి. ప్రజలు తమకు ఎవరి మీద గురి కలిగితే వారిని ఆరాధిస్తారు. నామస్మరణలు చేస్తారు. కోహమ్ అనో, సోహమ్ అనో వారి బోధనలను అనుసరించి సాధనలు చేస్తారు. ప్రార్థనలు చేస్తారు. ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది.

షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది. ముస్లింలు ఏడుకొండల వాడిని వేడుకోబోయినా, హిందువులు దర్గాలకు పోయి ప్రార్థనలు చేసినా పీఠాధిపతులూ, ముల్లాలూ ఆమోదించకపోవచ్చు. కానీ వివిధ మతాలలోని ఈ ఉదార భావాన్ని వ్యతిరేకించే హక్కు వారికి లేదు.
షిర్డీ నాథుని హిందువులు పూజించినంత ఎక్కువగా ముస్లింలు ఎందుకు పూజించడం లేదని స్వరూపానందులు అలగడం చూస్తుంటే, అది ఆయన అమాయకత్వమనుకోవాలో, అజ్ఞానమనుకోవాలో, లేక అసూయ ద్వేషమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉండటమూ, వారికి విగ్రహారాధన ఒక సాధన మార్గంగా ఉండటమూ బాబాను హిందువులు ఎక్కువ సంఖ్యలో కొలవడానికి కలిసొచ్చిన అంశాలు. ముఖ్యంగా ఈ దేశంలో ముస్లింలకు ఉన్నంత మత కట్టడులు బ్రాహ్మణులకు లేవు. బ్రాహ్మణులకున్న మతకట్టడులు శూద్ర హిందువులకు అస్సలు లేవు. హిందూ మతం శాఖోపశాఖలకు చెందిన తన తాత్విక మార్గాల వైవిధ్యాల్నీ, ఉదార భావాల్నీ వదిలేసి ఇస్లాంలోని ముల్లాల కరుడుగట్టిన తనాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ, అనుసరించాలనీ స్వరూపానందులు ఎందుకు కోరుకుంటున్నారు? రెండు మతాల మధ్య పోలరైజేషన్ సృష్టిస్తే తప్ప స్వరూపానందులు వంటి పీఠాధిపతులకు అస్తిత్వం ఉండదా?
ఈ దేశంలో భక్తులూ, యోగులూ, జ్ఞానులూ, సిద్ధులూ, పరమ హంసలూ చరిత్రకెక్కిన వారే వందల్లో ఉన్నారు.

సనాతన ధర్మమంటే ఏమిటో స్వరూపానందులకు తెలుసా? ఆయన చెప్పిన 24 అవతారాల లిస్టుకు బయట ఎంతమంది జ్ఞానులూ మహాగురువులూ పూజలందుకుంటున్నారో ఆయనకు తెలియదా? భగవాన్ రమణ మహర్షీ, శంకరాచార్యుల వంటి వారి గుళ్ళూ, ఆశ్రమాలూ కట్టి పూజిస్తే లేని తప్పు షిర్డీ సాయినాథునికి గుళ్ళు కట్టి పూజిస్తే వచ్చిందా?
గురువు కావడానికి మాంసాహారం అడ్డు వస్తుందని చెప్పే స్వరూపానందులది కుల చాదస్తం కాక మతోద్ధరణ అవుతుందా? బుద్ధుడు మాంసాహారి కాదని ఆయన చెప్పగలడా?

అంత్యజుడు అని పిలవబడే వ్యక్తి ఇచ్చిన పంది మాంసం భిక్షను ఆయన స్వీకరించలేదా?
కల్కి మాంసాహారి కాబోడని ఆయన జోస్యం చెప్పగలడా?
నిన్నటికి నిన్న నిసర్గదత్తమ మహరాజ్ గురువు మాంసాహారిగా లేడా?

ఒక బెస్తవాని కొట్టంలో ఉట్టిలోని వట్టి చేప ముక్కను నోట్లో వేసుకుని అతని ఆతిథ్యం స్వీకరించలేదా జిల్లేళ్ళ మూడి అమ్మ!
క్షత్రియునిగా పుట్టిన రాముడు మాంసాహారి కాదా? క్షత్రియుడిగా పుట్టి శూద్రుడిగా పెరిగిన కృష్ణుడు శాకాహారేనా? శాకాహారం సాధకునికి ఆహార నియమమే తప్ప, ఆ నియమం గురువును నిర్ణయించే సూత్రం కాదని స్వరూపానందులు వంటి పండితునికి తెలియదు అనుకోవాలా?

రామ మందిర నిర్మాణానికీ, షిర్డీ సాయిగుళ్ళు కట్టడానికీ ఏమైనా సంబంధం ఉందా? స్వరూపానందులు మాట్లాడుతున్నది మతమా? ఆధ్యాత్మికమా? రాజకీయమా? నిశ్చయంగా మత రాజకీయమే!! స్వరూపానందుల మాటల ప్రభావం ఆరెస్సెస్, భజరంగదళ్ వంటి మతసంస్థల మీద పడితే; పరిస్థితులు ఎంత దారుణంగా విషమిస్తాయో రామ జన్మభూమి కంటే ఎక్కువగా ఊహకందని ప్రమాదం!
ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ దేశం మొత్తానికి కాదు. శూద్ర హిందువులకూ కాదు. చివరికి బ్రాహ్మణ సామాజిక వర్గానికీ కాదు. ఆ సామాజిక వర్గంలోని ఒక చిన్న శాఖకే అని గుర్తు పెట్టుకుని తన పరిమితులు తాను తెలుసుకోవడం మంచిది. వయసుకు తగిన హుందాతనంతో జీవించడం మంచిది. మతాన్ని మతంగా, మతాన్ని దాటిన ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికంగా మన్నించడం మరీ మంచిది.

నేను రాముడిని పూజిస్తా
హర హర మహదేవ నామస్మరణ చేస్తా
గంగానది పవిత్రస్నానం చేస్తా
షిరిడీ సాయినాథునీ సేవిస్తా!
ఇంకా చెప్పాలంటే-
భగవంతుడు ఎక్కడ కన్పిస్తే అక్కడ
సాగిలబడి మొక్కుతా!
వద్దనడానికి మీరెవరు స్వరూపానందులూ??

-బండి నారాయణస్వామి

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు

సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు

వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు రాశారు. అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించారు.

తెలుగు వెలుగు పి.వి. నరసింహారావుకు వరంగల్లు నగరంతో అవినాభావ ఆత్మీయ సంబంధముండేది. సంస్కృతి, సంప్రదాయం, దేశీయ ప్రాచీన వారసత్వం గురించిన సదభిప్రాయం కల్గిన వ్యక్తి పి.వి. ఆ రోజుల్లో వరంగల్ నగరంలో ఏటేటా కూచిపూడి, భాగవతుల ప్రదర్శనలు సాగుతుండేవి. భామాకలాపం, గొల్లకలాపం, ఉషాపరిణయం, దాదిని వేషం, ప్రహ్లాద, భాగవతులు, పగటి వేషాలు, శారద వేషం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడప్పుడూ నిర్వహించేవారు. వీటితో పాటు దీపావళి పండుగ రోజుల్లో హారతులు, భోగం మేళాలు, గానసభలు కూడా జరిగేవి. పెండ్లిండు,్ల పేరంటాల సందర్భాలలోనూ పాట కచేరీలు, సానిమేళ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఇలాంటి కార్యక్రమాలంటే పి.వి.కి అమిత సరదా, అభిరుచి ఉండేవి. పి.వి.కి కరీంనగర్ స్వంత జిల్లా కాగా వరంగల్ జిల్లా పెంపుడు జిల్లా. పల్లెటూర్లలో ముఖ్యంగా వంగరలో జరిగే చిందు భాగవతుల కార్యక్రమాన్ని కూడా బాల్య ప్రాయంలో పి.వి. తెల్లవార్లు కూర్చొని తనివి తీరా చూసి ఆనందించేవారట. ఒకసారి సురభివారి లంకాదహనం చూసి అందులోని ఆంజనేయ పాత్రను అనుకరిస్తూ దూడతలుగు తోకగా పట్టుకొని ఇంటి చుట్టూ గంతులు వేసిన సందర్భాలున్నాయి. పి.వి.లో మొదటి నుంచి అంటే బాల్యం నుంచి భావావేశం, రసాస్వాదన చెందే స్వభావ ప్రేరణ ఉండేది. కళాత్మకంగా తాదాత్మ్యానుభవం పొందే చిత్త స్ఫూర్తి ఉండేది. పి.వి.కి వరంగల్లులో హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుడు వినోదం కూడా ఎక్కువగానే ఉండేది. హనుమకొండలోను, లష్కర్‌బజారులో ఈ వినోదం సాగిపోతుండేది. ఎవరో కొందరు సహచరులను వెంటేసుకోవడం, రోడ్ల వెంబడి తిరగడం సాయంకాలం కాలక్షేపం. ‘అప్ఫూ హోటల్’ పరిసరాల్లో మిత్రుల రాకకై గస్తీ తిరగడం, అర్ధణా ప్లేటు ఆలూ బజ్జీ, మూడు పైసల ‘టీ’, పైసా పాన్ బీడా సేవానంతరం ఇరుగు పొరుగువారి ముంగిళ్ళు గాలించే వ్యాహ్యాళీ మరో రకం తిరుగుడు కార్యక్రమం.

శుక్రవారం స్కూల్ సెలవు సందర్భంగా మరీ తాపీగా బయలుదేరి సిద్ధేశ్వరుని గుడి, పద్మాక్షి గుట్ట, భద్రీ తాలబ్ గట్టు, భీమారం రోడ్డు, కాజీపేట స్టేషన్, ఓరుగల్లు కోట రాతి ప్రాకారం మొదలగు స్థానిక చరిత్ర పరిశోధన తిరుగుబడులు మరో తరహావి. గుట్టలు ఎక్కడం, గుండాల్లో ఈదడం, గుహల్లో దూరడం, బావుల్లో దూకి ఈత కొట్టడం లాంటి అఘాయిత్యపు తిరుగుళ్ళు ఉండేవి. మధ్య మధ్య భద్రకాళి చెరువు శికంలో సెనగచెట్ల వేట, ఊరిబయట బేనామి భూ ఖండాల్లో సీమ చింతకాయల దాడి, అప్పుడప్పుడు రేగుబండ్లు, సీతాఫలాలు, మామిడి పిందెల దొమ్మిలాంటి ఘాతుక తిరుగుళ్ళు కూడా జరుగుతుండేవి. ఈ తిరుగుడు అభ్యాసం కేవలం బాల్య చాపల్యం కావచ్చు. కానీ అది మానవ ప్రకృతి వైచిత్య్రంతోగల సాన్నిహిత్య ప్రకృతికి ప్రతీక. అనుతత్వ సూత్రం కూడా అతనికి ఆ రోజుల్లో అనుభవ పూర్వకం. అంటే కేవలం తిరగడంలో కూడా ‘జీవిత తత్వం’ ఉందన్నమాట. అందుకే ‘సైర్‌కర్ దున్యాకీ గాఫల్ జిందగాని ఫిర్‌కహా-జిందగీగరో కుచ్ రహేతో నౌజవానీ ఫిర్‌కహా’ అన్నాడో తిరుగు సరదా ఉర్దూ భాషా కవి.

వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు వ్రాయడం జరిగిందని, అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించడం జరిగింది. గాంధీ, నెహ్రూ, సావర్కర్, తిలక్ గ్రంథాలను పి.వి. చదివారు. వీరేశలింగం, చిలకమర్తి, పానుగంటి, గురజాడ అప్పారావు, వేంకట పార్వతీశ్వర కవులు, విశ్వనాథ, బంకించంద్ర, రవీంద్రనాథ్ ఠాగోర్, శరత్‌బాబు, ప్రేమ్‌చంద్, ద్విజేంద్రలాల్‌రాయ్ మొదలైన జాతీయ మహా రచయితల సాహిత్యాన్ని వరంగల్లులో విద్యార్ధి దశలోనే పారాయణం చేశారు. గోరా, గోదాన్, చరిత్రహీన్, ఆనంద్‌మఠ్, నూర్జాహాన్ మొదలగు అనేక గ్రంథాలను అభిమానించేవారు. అంగ్లంలో ‘లే మిజరబుల్స్’ ‘జీన్‌వల్జ్యీ’ ‘టెస్’ ‘ఉదరింగ్ హైట్స్’, ‘కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో’ నవలలను చదవడమేగాక, వాటిలోని విశిష్టతలను సాహితీ మిత్రులతో తరచూ చర్చిస్తూ ఉండేవారు.

మరో వైపు పి.వి.కి శాస్త్రీయ సంగీతంలో కూడా అంతో ఇంతో అభిరుచి, అభినివేశం ఉండేది. పద్యాలు, పాటలు, శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులను, జావళీలను వాటిలోని రాగ, తాళ విన్యాసాలను అభిమానించేవారు. కర్ణాటక సంగీత విద్యాంసుడు బిడారం కృష్టప్ప రికార్డ్, హిందూస్థానీ సంగీత విద్యాంసుడు నారాయణ్‌రావు వ్యాస్ పాటలు, మీరాబాయి భజనలే గాక గజల్లు వింటుండేవారు. ముఖ్యంగా ఓంకార్‌నాథ్ ఠాకూర్, అబ్దుల్ కరీంఖాన్ ఖయాల్, టుమ్రీ గ్రామ ఫోన్ రికార్డులు, శాస్త్రీయ సంగీత రికార్డులు తనివితీరా విని ఆనందించేవారు. అంతేగాక అయా పాటలను అనుకరిస్తూ చాటుమాటుగా అంతో ఇంతో కసరత్తు కూడా చేసేవారు.

శాస్త్రీయ సంగీత శ్రుత పాండిత్యం అబ్బడం కష్టమన్నది త్వరలోనే తెలుసుకున్నారు. అయినా అనేక రాగాలను గుర్తు పట్టడం, తాళ విన్యాసాన్ని, గతి భేదాలను గుర్తించడం అలవర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్, పన్నాలాల్ ఘోష్ వేణువు, హీరాబాయి బడోడేకర్, రోషనారా బేగం, కేసరీబాయి, రవూఫ్‌ల గాత్రం, ఆహ్మద్ జాన్ తింక్వా తబలా అంటే మోజు పడేవారు. అయితే తాను మాత్రం సినిమా పాటలు, భజనలు, స్టేజీ కీర్తనలు మున్నగు బాణీల్లో చక్కగా పాడేవారు.
ఆ రోజుల్లో కూడా వరంగల్ పట్టణానికి రాజకీయ ప్రాధాన్యం విశేషంగానే ఉండేది. పౌర హక్కులనే వాటికి గుర్తింపు లేని పరిస్థితులు గనుక దేవుడి పేర వరంగల్ యువకులు, విద్యార్థులు, ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకొని తద్వారా హిందూ సమీకరణ శక్తికి పూనుకునేవారు. ఆ రోజుల్లో హనుమకొండ స్కూల్ విద్యార్ధి యువకులు ‘భజన మండలి’ అనే పేరుతో ఒక సంస్థను నెలకొల్పుకొని అందులో చాటుమాటుగా రాజకీయ చర్చలు సాగిస్తుండేవారు. భజన మండలి స్థాపకుల్లో ఒకడిగా పి.వి. జాతీయవాద పక్షాన్ని బలపరిచేవారు. గణేశ్ ఉత్సవాలు, ఆర్యసమాజ కార్యక్రమాలు, గ్రంథాలయ సభలు మొదలగు ఉద్యమాలలో ఆసక్తిగా పాల్గొనేవారు. పి.వి. ఏది రాసిన అందులో తన నిర్దిష్ట శైలిని పొదగడానికి ప్రయత్నం చేసేవారు. పి.వి. వరంగల్లు హైస్కూల్‌లో విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆయన జ్ఞాపకశక్తికి అంతా ఆశ్చర్యపడేవారు. ఒకసారి ‘కృష్ణకుమారి’ అనే నాటకం వేసారు. అందులో పి.వి.ది కృష్ణకుమారి వేషం. ఆయన తన పాత్ర పోర్షనేగాక నాటకంలోని అన్ని వేషాల సంభాషణలను పుల్‌స్టాప్, కామాలతో సహా బట్టీ పట్టారు. ఇక రిహార్సల్స్‌లో ప్రాంప్టర్ ఆయనే. ఏ వేషం వేసేవాడు రాకున్నా అతనికి బదులు ఆ వేషం నిర్వహించి రిహార్సల్ కుంటుపడకుండా నడిపించేవారు. అతినిలోని జ్ఞాపకశక్తి అలాంటిది. పనిలో శ్రద్ధ పరిశ్రమ అనేది కూడా ప్రత్యేకతే. కృష్ణకుమారి నాటకంలో పి.వి. అభినయాన్ని ప్రశంసించకుండా ఉండనివారు లేరు. పరీక్షల్లో అతని ఆన్సర్ పేపర్లు టీచర్లు ఇతర విద్యార్థులకు చదవి వినిపించి విశ్లేషించేవారు.

పి.వి. తెలుగులోనే గాక ఇంగ్లీష్ భాషలో కూడా చెప్పుకోదగిన గద్య పద్య రచనలు చేసేవారు. ఈ విషయంలో ఆయన మొదటి గురువు గార్లపాటి రాఘవరెడ్డి. తరుచూ ఆయన ఆశ్రమానికి వెళ్ళి కాలక్షేపం చేయడం ఆనవాయితీగా ఉండేది. రాఘవరెడ్డికి ఆంగ్లభాషా సాహిత్యాలతో పరిచయం లేదు. పి.వి. ఆయనకు వర్డ్స్‌వర్త్, షెల్లీ, కీట్స్, బైరన్, షేక్‌స్పియర్ నాటకాలు, థాకరే, చార్లెస్ డికెన్స్, ధామస్ హార్డీ నవలలు మొదలగువాటి విశిష్టతపై శృత పాండిత్యం కలిగించారు. ఆదే విధంగా రాఘవరెడ్డి మనుచరిత్ర, నైషధం వంటి మహా ప్రబంధాలు, కాళీదాసు, భవభూతి కావ్యాల శైలీ విన్యాసంపై పి.వి.లో అసక్తిని ఇనుమడింప చేశారు. ప్రాచీనత, ఆధునికత అనేవి రెండూ పెనవేసుకొని ఉభయుల్లోనూ సమంగా పెంపొందిన భావసరళి వారి స్నేహంలోని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఆ రోజుల్లో అప్పుడప్పుడు నాటక ప్రదర్శనలు కూడా జరుగుతుండేవి. డివి సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, స్థానం నరసింహారావు సారంగధర, జహ్వారీబాయి రోషనార, తెనాలి కంపెనీ కృష్ణ లీలలు, మైలవరం కంపెనీవారి సావిత్రి లాంటి ప్రదర్శనలు పి.వి. తప్పక చేసేవారు. ఆ రోజుల్లో సోహరాబ్ మోడీ వరంగల్‌లో కొన్ని నెలల పాటు తన హిందీ నాటకాలు ఘనంగా ప్రదర్శించేవారు. తర్వాత కొంత కాలానికి మినర్వా మూవీ టౌన్ స్థాపించి ‘యహుదీకీ లడ్కే’తో పాటు హిందీ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆయన నిర్మించిన ‘జైలర్’, ‘సికిందర్’, ‘పుకార్’ చిత్రాలు ఆ రోజుల్లో విడుదలైౖ ఘన విజయం సాధించాయి. పి.వి. అప్పుడప్పుడు హాస్టల్ ఎగవేసి సినిమాలు, నాటకాలు మధ్య మధ్య సర్కస్‌లను చూడడం ఆనవాయితీగా మారింది. శాంతారాం ‘ఆద్మీ’ చూడడానికి ఎవరికీ తెలియకుండా హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సినిమా చూసి రావడం లాంటి సాహసచర్యలతో కూడింది ఆయన విద్యార్ధికాలం నాటి అనుభవాలు.

-వి.ఎల్. నరసింహారావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దటీజ్ బామ్మ

దటీజ్ బామ్మ

తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ పేరు శంకరమ్మ.

కుర్చీలో కూర్చున్న బామ్మ చుట్టూ కొడుకు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లు. తెగ అల్లరి చేస్తున్నారు. కంప్యూటర్ తీసుకొచ్చి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆమె ఫోటోను చూపిస్తున్నారు వాళ్లందరూ. విశేషం ఏంటంటే- ఆ రోజు బామ్మ తొంభైయవ పుట్టిన రోజు. తొంభైమంది రక్తసంబంధీకులు కలిశారు మరి!
“ఈ వేడుక మీకెలా అనిపించింది?” అని శంకరమ్మను అడిగితే “పానం లేచొచ్చినట్టయింది బిడ్డా! నా వాళ్లందరినీ ఒక దగ్గర సూడ్డం వారితో గడపడం సానా బాగుంది. ఏమైనా చెప్పు కలసి ఉంటేనే మంచిగుంటది. కానీ ఈ కాలంలో అలాంటి కుటుంబాలు ఎక్కడున్నాయి సెప్పు తల్లి… ఎవరికి వారు యమునాతీరెనన్నట్టున్నారాయె” అంది.

90 ఏళ్ల శంకరమ్మకు తన మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు అందర్నీ బాగా గుర్తుపడుతుంది. రక్త సంబంధాలను తెంచుకుంటే అనుబంధాల తీయదనం గురించి పిల్లలకు ఎలా తెలుస్తుంది అని బామ్మ వాపోతుంటుందట. కుటుంబీకులు ఎవరు ఇంటికొచ్చినా ఆమె దీవెనలు తప్పనిసరిగా తీసుకుంటారు. “పెద్దావిడ ఆశీర్వాదం వల్ల మేము పొందే ఆనందం వేరు. మా కుటుంబానికి పెద్ద అండ ఉందన్న ధైర్యం కలుగుతుంది” అంటోంది పెద్ద కూతురు పద్మావతి. ఫోటో ఆల్బమ్‌లో ఉన్న తన భర్త ఫోటోను మనుమరాలు సాయికి చూపుతూ “మీ తాత” అని శంకరమ్మ బోసినవ్వులు చిందించింది. ఆ వయసులో కూడా చూపు మందగించలేదు. శుక్లాల శస్త్రచికిత్స కూడా చేయించుకోలేదట. శంకరమ్మను “మీ ఆయన పేరేంటి” అని అడిగితే చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది కానీ జవాబు మాత్రం చెప్పలేదు. “ఆ ముసలాయన పేరును మా అమ్మ ఎప్పుడూ నోటితో చెప్పదు. అది సంప్రదాయం కాదంటుంది” అన్నారు శంకరమ్మ ఏకైక కొడుకు ఓంప్రకాష్ యాదవ్.

ఇల్లే లోకం
బామ్మకు మొత్తం ఏడుగురు పిల్లలు. వారిలో ఆరుగురు కూతుళ్లు, ఒక కొడుకు. శంకరమ్మ భర్త పేరు ఆకుల నర్సయ్య. ఒకప్పుడు ఆప్కోలో పనిచేసేవారు. ఇప్పుడు లేరు. ఆయన స్వాతంత్య్రసమరయోధుడు కూడా. శంకరమ్మ స్వస్థలం మెదక్ జిల్లా పెద్దశంకర్‌పేట్. పెళ్లయ్యాక హైదరాబాదు తాళ్లగడ్డలోని అత్తారింటికి వచ్చేసింది. శంకరమ్మ తల్లి ఎల్లమ్మ, తండ్రి పోతన్న. వీరిది వ్యవసాయకుటుంబం. బామ్మ ఎప్పుడు పుట్టింది ఎవరికీ తెలియదు. కానీ తమ వయసును బట్టి ఆమెకు 90 ఏళ్లు ఉండొచ్చని ఇంట్లో వాళ్లు లెక్కగట్టారు. నాలుగేళ్ల వయసులోనే శంకరమ్మకు పెళ్లయిపోయింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసింది. “పెళ్లయిన కాడి నుంచి నా ఇల్లు, నా పిల్లలే నా లోకం. ఇంటిని అద్దంలా పెట్టుకోవడం, పిల్లల్ని మంచిగా చూసుకోవడం. ఇదే పని” అంటుందీ బామ్మ.

“వేరుపడక ముందుఅన్ని పనులను అందరం కలిసి చేసుకునేవాళ్లం. కలిసి భోంచేసేవాళ్లం. కలిసి సతోషాలను పంచుకునేవాళ్లం. అయితే కాలంతోపాటు మేము కూడా ఎవరి జీవితాలు వాళ్లవి అన్నట్లు వెళ్లదీస్తున్నాం. కాని సమయం దొరికినప్పుడు మాత్రం అందరం ఒక రోజున కలిసి.. ఆనందోత్సాహాలతో దావత్ చేసుకుంటున్నాం. పండగలు, పుట్టినరోజుల వంటి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలం.
ఉగాది పండగ వస్తే ఆ రోజు మా ఇల్లు చూడాలి. సందడే సందడి. ఇంట్లో అయితే మనుమలు, మునిమనుమల అల్లరి ఇంతా అంతా కాదు. మా అమ్మకైతే ఆరోజు అందరినీ చూశాక కడుపునిండిపోతుంది. కళ్లు మెరిసిపోతుంటాయి. ఇప్పటికీ మేమందరం ఒకే చోట ఉండాలన్నది ఆమె కోరిక..” అంటూ చెప్పుకొచ్చింది కూతురు పద్మావతి.
శంకరమ్మ మునిమనమలు కొందరు ఇక్కడ చదువుతుంటే మరికొందరు విదేశాల్లో చదువుతున్నారు. ఎవరైనా పొరపాటున తన దీవెనలు తీసుకోవడం మరిచిపోయారో వారిని పిలిపించి మరీ దీవించి పంపుతుందట ఈ బామ్మ. ఇళ్లలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా ఆమెకు చెప్పే తీసుకుంటారు.
“ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ తన పని తనే చేసుకుంటుంది. చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది. రోజులో ఎక్కువ టైమును దైవజపానికే కేటాయిస్తుంది బామ్మ” అని మనుమరాలు సాయి చెబుతుంటే కళ్లింత చేసుకుని చూస్తోంది శంకరమ్మ.

బామ్మమాట ఆరోగ్యబాట
. ఎంత కోపం తెప్పించే విషయానికైనా కించిత్తు విసుక్కోదు. ఆలోచిస్తుంది. సహనంతో వ్యవహరిస్తుంది.
. తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానపానాదులు కానించేసి.. దేవుడికి దీపం పెడతారామె. క్రమం తప్పకుండా ఉపవాసాలు చేసేవారు.
. ఇంటిని, పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవడంలో బామ్మ రాజీ పడదు. శుభ్రతలేకపోతే సహించదు.
. ఏడాదికి ఒక పుణ్యక్షేత్ర యాత్ర ఉండాల్సిందే! చక్కటి ప్రణాళికతో గుళ్లుగోపురాలు తిరిగొచ్చి, ఆ విశేషాలను కుటుంబసభ్యులతో పంచుకునేవారు.
. ఇంటినిండా మనుషులుండాలి. పండగలు, వేడుకలలో లీనమైపోతుంది. అందరి యోగక్షేమాలు కనుక్కుంటుంది.
. ఆశ్చర్యం ఏంటంటే తొంభైఏళ్ల ఈ బామ్మకు బీపీ కాని, షుగర్ కాని లేవు. బాధించే జబ్బులేవీ రాలేదు. చూపు మందగించలేదు. కళ్లకు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదు. దటీజ్ బామ్మ!

ం నాగసుందరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బుడ్డి (ద్ధి )మంతుడు సినిమా

“నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను” అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. ‘సాక్షి’ నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు ‘ముత్యాల ముగ్గు’ తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర ‘ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ’ అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. ‘ముత్యాల ముగ్గు’ నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా ‘బుద్ధిమంతుడు’ కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.
గుడికీ, బడికీ మధ్య పోటీ
బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘బుద్ధిమంతుడు’ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు – మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది అనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. ‘భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా’ అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి ‘బుద్ధిమంతుని’గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య “వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?” అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. “అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా” అంటాడు గోపి ఆవేదనగా.
నిజం రాణిస్తుంది
తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాన్నట్లు మాట్లాడితే “నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది” అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య “సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. ‘అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను’ అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు మాధవయ్య. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. “అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేదో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు” అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.
మానవసేవే మాధవసేవ
ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. ‘మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?’ అని ప్రశ్నించిన కృష్ణుడు “నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట
పెరిగాననీ నువ్వెరుగవా?” అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. “సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను” అంటాడు. తమ్ముడితో “మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం” అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.
‘ఆమ్యామ్యా’ ఇందులోనిదే
ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే ‘ఆమ్యామ్యా’ అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. “ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది” అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి ‘బుద్ధిమంతుడు’ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.

 

 

తాక సన్నివేశాలు అద్భుతం – తనికెళ్ల భరణి

Published at: 28-06-2014 00:17 AM

రమణగారు రచన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఆస్తికునిగా అన్ననూ, నాస్తికునిగా తమ్ముణ్ణీ మలచి, ఆ రెండు పాత్రల మధ్య సంఘర్షణను గొప్పగా చిత్రించారు రమణ. క్లైమాక్స్ సన్నివేశాలైతే అద్భుతం. అన్న ప్రాణాలు నిలబెట్టడానికీ, జనంలో అన్న మాటను నిలబెట్టడానికీ తమ్ముడు గుడి గోపురం మీద కలశాన్ని పైకి లేపడం, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య జరిగే సంభాషణ అపూర్వం. అలాగే అన్నయ్య పాత్రకు కృష్ణుడు కనిపించే సన్నివేశాలు, భక్తునికీ, భగవంతునికీ మధ్య జరిగే సంభాషణలు గొప్పగా ఉంటాయి. భక్తుని నమ్మకానికీ, అతని అమాయకత్వానికీ మాధవయ్య పాత్ర నిదర్శనంగా నిలుస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విషయం ఈ సినిమా ద్వారా రమణగారు బాగా చెప్పారు. ఇవాళ లంచానికి మారుపేరుగా మారిన ‘ఆమ్యామ్యా’ అనే పదం ఈ సినిమాలోనిదే. రమణగారి సంభాషణలు ఎంత సహజంగా, ఎంత పదునుగా, ఎంత హాస్య స్ఫోరకంగా ఉంటాయో నిరూపించే సినిమా ‘బుద్ధిమంతుడు’. ఆయన రచన చేసిన ఓ సినిమాలో నేను నటించాను. అది ‘మిస్టర్ పెళ్లాం’. అయితే చాలా మందికి తెలీని సంగతి, దానికంటే ముందు వారి సినిమా ‘పెళ్లి పుస్తకం’లోనూ ఓ సన్నివేశం చేశాను. నేను ‘సీతారామయ్యగారి మనవరాలు’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది.. చేయాలంటూ కబురొచ్చింది. పెళ్లికి సంబంధించిన సన్నివేశం అది. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, నా మీద ఆ షాట్. నాది పురోహితుని పాత్ర. మూడు నిమిషాల సీన్. నా పాత్ర సంభాషణలు, పెళ్లి మంత్రాలు నావే. దాదాపు 400 అడుగుల సీను. గంటలో పూర్తి చేశాం. అది చేసినందుకు మేనేజర్ నాకు రూ. 10 వేలు పారితోషికంగా ఇచ్చారు. నా పాత్రకు అది పెద్ద మొత్తమే. నేను వద్దని చెప్పినా, మేనేజర్ వినలేదు. అక్కణ్ణించి వస్తుంటే రమణగారు ఎదురై మరో రూ. 10 వేలుకు చెక్కు రాశారు. నేను ఆశ్చర్యపోయి, పది వేలు తీసుకున్న సంగతి చెప్పాను. నా స్క్రిప్టుని నేను రాసుకున్నా కాబట్టి, దానికి ఇస్తున్నాననీ, తీసుకొమ్మనీ ఆయన చెక్కు చేతిలో పెట్టారు. చిత్రమేమంటే నేను చేసిన ఆ సన్నివేశం సినిమాలో లేదు. అదీ కొసమెరుపు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మౌన మునికి ఘన నివాళి

ఆయన తెలుగు వాడు! తెలంగాణ బిడ్డ! ఆర్థిక నిపుణుడు! ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు! కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వాడు! అపర చాణుక్యుడు! ఆయన… పాములపర్తి వెంకట నరసింహరావు. అటువంటి మహనీయుని జయంతి (జూన్ 28)ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం…

పీవీ నరసింహరావు… అపర మేధావి. బహు భాషా కోవిదుడు. సాహితీవేత్త. ముఖ్యమంత్రిగా.. ప్రధాన మంత్రిగా పనిచేసి ప్రపంచ దేశాల్లోనే శభాష్ అని పించుకున్న ఘనత ఆయనది.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను కూడా లెక్క చేయని ముక్కుసూటి మనస్తత్వం ఆయనది.. అటువంటి మహోన్నత వ్యక్తికి నేడు చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వ గుర్తింపు లభించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సముచిత స్థానం లభించింది. ఎంతో మందికి రాజకీయ భవితవ్యం కల్పించిన పీవీని మొన్నటి వరకు ఇటు ప్రభుత్వాలు.. అటు పార్టీ మరచి పోయింది. గతంలో ప్రధానులుగా చేసిన వ్యక్తుల విగ్రహాలు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ పీవీ విగ్రహాలు కనిపించటం కూడా అరుదే.
వంగర నుంచి ఢిల్లీ దాకా..
పీవీ పుట్టింది వరంగల్ జిల్లా వంగరలో. చదివింది వరంగల్‌లో. నాగపూర్‌లో బీఎస్సీ ఎల్ఎల్‌బి చేసిన అనంతరం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. ముందు రాష్ట్ర రాజకీయాల్లో, ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించటం మొదలుపెట్టారు. సాధరణంగా రాజకీయనేతలు సంపన్న వర్గాలను దూరం చేసుకోవటానికి ఇష్టపడరు. కానీ పీవీ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు తీసుకువచ్చారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పీవీ ఈ చట్టంతో తనకున్న వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు అశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యశాఖలో కీలక మార్పులు తీసుకువచ్చారు. తెలుగు అకాడమీని ప్రారంభించిన ఘనత కూడా పీవీదే. 1977లో హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీకి అంతరంగిక సలహాదారునిగా వ్యవహరించారు. వీరిద్దరి మంత్రివర్గంలో విదేశాంగమంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, హోంమంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం 1995లో దేశప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు కొనసాగించిన ఘనత పీవీకి దక్కింది. మరణానంతరం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పీవీని సముచిత రీతిలో గుర్తుంచుకోలేదు. ఇప్పుడు ఆయన జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

సాహిత్యం, సంగీతమంటే ఎంతో ఇష్టం
సీనియర్ పాత్రికేయులు వీఎల్ నర్సింహారావు

వరంగల్‌లో హై స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుతూ వినోదంగా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ రోజుల్లో హన్మకొండలో ‘అప్పూ’ హోటల్ పరిసరాల్లో మిత్రులతో తిరగడం, అర్ధణాకు ప్లేట్ బజ్జీ, మూడు పైసలకు టీ తాగిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతున్నాయి. శుక్రవారం పాఠశాలకు సెలవులిస్తే సిద్ధేశ్వరునిగుడి, పద్మాక్షిగుట్ట, భద్రీ తలాబ్‌గట్టు, ఓరుగల్లు కోట లాంటి ప్రదేశాలను ఎన్నిసార్లు చుట్టివచ్చామో లెక్కలేదు.. గురజాడ, విశ్వనాథ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్, ప్రేమ్‌చంద్ లాంటి అనేక మంది ప్రముఖుల రచనలను చదవి వాటి గురించి చర్చించటం కూడా మధురమైన అనుభూతే!

అవన్నీ మధుర జ్ఞాపకాలే..
బాల్యమిత్రుడు చొల్లెటీ భద్రయ్య

కోతికొమ్మచ్చి..చిర్రగోనే.. చెరువు కట్టమీద ఆటలు.. బావుల్లో ఈతలు.. ఇలా ఒకటేమిటీ బాల్యంలో పీవీతో గడిపిన మధుర క్షణాలు మరచిపోలేనివి. నేను, పీవీ, నల్ల ఆగారెడ్డి, రఘునాయకుల వెంకన్న, గంట్యాల వెంకట్రాజం, చెప్యాల రాజిరెడ్డిలు ఇలా మేమందరం ఒక బ్యాచ్‌గా ఉండే వాళ్ళం.. నాకిప్పుడు 94 ఏళ్లు. బాల్య మిత్రులు అందరు చనిపోయారు..తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో గెంతులేయాలని ఉంది.. కానీ వయస్సు సహకరించటం లేదు..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన కాలపు రాజనీతిజ్ఞుడు – డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.

‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!

నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!

ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.

 

ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. నరసింహారావూ ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.

‘ఆయన మహా దేశభక్తుడైన రాజనీతిజ్ఞు’డని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావును పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కొనియాడారు. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పి.వి.ని పండిట్ నెహ్రూ తరువాత గొప్ప ప్రధానిగా అభివర్ణించారు. సరిగా అదే మాట అన్నారు బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ!

నేడు, భారతదేశానికి తొమ్మిదవ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి. దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో వుండగా, ప్రధాని పదవి ఆయనను వరించింది. అంతకుపూర్వం ప్రధాని చంద్రశేఖర్ హయాంలో దేశం ఆర్థికంగా దివాళా పరిస్థితిలో వుంది. మన బంగారాన్ని విదేశాలలో కుదువ పెట్టి ఆ సొమ్ముతో విదేశాలకు చెల్లించవలసిన రుణాలకు వడ్డీలు చెల్లించవలిసిన దుస్థితి ఏర్పడింది.
అలాంటి పరిస్థితిలో – తాను రాజకీయ రంగం నుంచి విరమించి, అఖిల భారత లలితా కళా కేంద్రం నిర్వహణలో శేష జీవితాన్ని గడపాలని భావిస్తున్న పి.వి. దివాళా స్థితిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ఆ దుస్థితి నుంచి తప్పించవలసిన బాధ్యత తలకెత్తుకోవలసి వచ్చింది!

ఇది సులభసాధ్యమైన బాధ్యత కాదు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడదు. సహజంగా సాత్వికుడు పి.వి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుదీసే వ్యక్తి. అయినప్పటికీ ప్రధాని నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రులందరూ అనుసరిస్తున్న మిశ్రమ ఆర్థిక విధానాన్ని -సోషలిజం మిళితమైన పెట్టుబడిదారీ విధానాన్ని -రద్దు చేసి, ఎంతోకాలంగా అమలవుతున్న లైసెన్స్ రాజ్‌కు స్వస్తి చెప్పి, భారతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపురేఖలు దిద్దారు. ఇందుకు, అంతకు పూర్వం రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను తన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా నియోగించారు. అది మన్మోహన్ జీవితంలో అనూహ్యమైన మలుపు. నెహ్రూ, ఇందిరాగాంధీల తరువాత పది సంవత్సరాలు దేశ ప్రధాని బాధ్యతను నిర్వహించిన ఘనత మన్మోహన్‌కు దక్కడానికి ఆనాడు పి.వి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వమే కారణమనడం నిర్వివాదం. పి.వి. సరళీకృత ఆర్థిక విధానాలకు రూపకల్పన ఆయనే చేసినా, వాటిని అమలుచేసింది మన్మోహన్ సింగ్. ఆ తరువాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా, పి.వి. సరళీకృత ఆర్థిక విధానాన్నే అనుసరిస్తున్నది. ఇందువల్లనే పి.వి. ప్రధాన మంత్రిత్వానికి భారత చరిత్రలో విశిష్టమైన స్థానం లభించింది.
ఇంత సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను అమలు పరిచే ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ వుండాలి. అయితే, పి.వి. మంత్రివర్గం మైనారిటీ ప్రభుత్వంగానే ప్రారంభమైనది. అయినా ‘అపర చాణక్యుడు’ పి.వి. తన రాజకీయ చాతుర్యంతో తన ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు (1991-96) విజయవంతంగా నడిపారు. కల్లోల రాజకీయ కడలిలో తన మైనారిటీ నౌకను విజయవంతంగా తీరానికి చేర్చిన ఆయన రాజకీయ నైపుణ్యాన్ని పరిశీలిస్తే అంతకుపూర్వం బ్రిటన్‌లో హెరాల్డ్ విల్సన్ కేవలం అయిదు ఓట్ల మెజారిటీతో తన ప్రభుత్వాన్ని నాలుగేళ్లూ విజయవంతంగా నడిపిన ఉదంతం జ్ఞాపకం వస్తుంది.

ఆచార్య చాణక్యుడు అటు ఆర్థిక శాస్త్రంలోను, ఇటు రాజకీయశాస్త్రంలోను నిష్ణాతుడైనట్టే, పి.వి. కూడా ఆ రెండు రంగాలలో తన ప్రావీణ్యంతో, రాజీవ్‌గాంధీ హత్యానంతరం తనకు భారత జాతి అప్పగించిన సంక్లిష్ట బాధ్యతను సంతృప్తికరంగా నిర్వర్తించి, ‘అభినవ చాణక్యుడు’గా పేరు పొందారు. పి.వి.ని ప్రపంచం ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా ప్రస్తుతించింది.
ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించాలి. పి.వి. ప్రధానిగా వుండగానే -అమెరికాకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ, అణ్వస్త్ర పరీక్షకు భారతదేశం సర్వసన్నధమైనది. అణ్వస్త్ర పరీక్షను జరపరాదని అమెరికా భారతదేశాన్ని హెచ్చరించింది. అయినా, పి.వి. లెక్క చేయలేదు! పరీక్ష జరపడానికి ఉద్యుక్తుడైనారు. అంతకు పూర్వం ఇందిరాగాంధీ హయాంలో 1974 మేలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణ్వస్త్రపాటవ పరీక్ష జరిపారు. 22 ఏళ్ళ తరువాత భారత అణు పాటవం ఎలా వున్నదో ప్రపంచానికి తెలియడానికి అణ్వస్త్ర పరీక్షను ఉద్దేశించారు. అయితే, ఇంతలో జనరల్ ఎన్నికలు రావడంతో అణ్వస్త్ర పరీక్షకు అంతరాయం కలిగింది. ఆ తరువాత వచ్చిన వాజపేయి ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది! పి.వి., వాజపేయిలు పరస్పరం తమ ‘గురువు’ అని చెప్పుకునేవారు!
పి.వి.నరసింహారావు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఆయన స్వస్థలం వంగర. ఆయన లాయర్. మహా మేధావి. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో పి.వి.మంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి వస్తూనే ‘ఏడీ? మన బృహస్పతి వచ్చాడా?’ అని పి.వి.ని గురించి ఆరా తీసేవారు! ఒకానొక దశలో ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఏఐసీసీ తీర్మానాలను, ఎన్నికల ప్రణాళికలను పి.వి.యే రూపొందించేవారు.

చాలామందిని అంత అర్హత లేకపోయినా ‘బహుముఖ ప్రజ్ఞానిధి’ అని అంటూ వుంటారు. అయితే పి.వి.కి ఆ పదంలోని ప్రత్యక్షరం వర్తిస్తుంది. ఆయన కవి, రచయిత, జర్నలిస్టు, సంగీత ప్రియుడు, నటుడు, కంప్యూటర్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతుడు.

అన్నింటినీ మించి ఆయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవారు. మరాఠీ భాష నుంచి తెలుగులోకి ఒక గ్రంథాన్ని అనువదించారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు’ నవలను ఆయన హిందీలోకి ‘సహస్రఫణ్’ అన్న పేరుతో అనువదించారు. భారతీయ సంస్కృతి, తత్వచింతన పట్ల ఆయనకు ఎనలేని ఆసక్తి. ఆయన ఆధ్యాత్మికవేత్త. మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ పలుకులలో ‘పి.వి. సంస్కృత పండితులను మించిన సంస్కృత భాషా నిష్ణాతుడు’. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత జటిల సమస్య వచ్చినా, ఆయన స్థితప్రజ్ఞుడు. అందువల్లనే ఆయనకు స్వామి రామానంద తీర్థ అధ్యయన సమితి ‘స్థితప్రజ్ఞ’ బిరుదునిచ్చింది. ఇంతటి మహామహుని చరమదశలో, ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఎంతగానే సేవలు చేసిన జాతీయసంస్థ సరిగా గుర్తించలేదు! ఇప్పటికైనా ఆయనకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలి. ఎందువల్లనో, ఆనాడు ఢిల్లీ పెద్దలకు ఆయన పేరుచెబితే ఉలికిపాటు! తనపై వచ్చిన అసత్యారోపణలన్నీ వీగిపోయిన తరువాత -తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆయన ఈ రచయితకు లేఖ రాస్తే, ఢిల్లీ పెద్దలు ఎంతగా ఉలిక్కిపడ్డారు! ఏమైనా ఆయన జయంతిని ఆ మహనీయునికి జన్మనిచ్చిన తెలంగాణ, అక్కడి ప్రభుత్వం ‘ప్రభుత్వ వేడుక’గా ప్రతి సంవత్సరం జరపాలని నిర్ణయించడం ముదావహం. ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ సలహా యిచ్చిన కె.వి. రమణాచారి ఎంతైనా అభినందనీయులు.

– డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
(నేడు పి.వి.నరసింహారావు జయంతి)

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

G.D.P.-1

G.D.P.-1

 

జి డి పి. అంటే పొద్దున మా మైనేని గోపాల కృష్ణ గారు రాసినట్లు’’ గబ్బిట దుర్గా ప్రసాద్’’ కాదు ‘’గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ ‘ తెలుగులో ‘’స్థూల కుటుంబ ఉత్పత్తి ‘’.ఇప్పుడు దేనికైనా ఇదే ప్రాతి పదిక గా ఉంది .ఇది బాగా ఉంటె అంతా స్వర్గం అనే భావన వ్యాపించింది .అది నిజమేనా ?అనే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి .ఈ విషయాలనే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .దీనికీ  మార్క్ టుల్లి రాసిన పుస్తకమే ఆధారం .

ఈ జి డి.పి. పేదరికాన్ని పార ద్రోల గలుగుతుందా అని భారత ఆర్ధిక వేత్త సుర్జీత్ భల్లా తాను  రాసిన పుస్తకం ‘’పావర్టి—ఇనీక్వాలిటి అండ్ గ్రోత్ ఇన్ ది ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్ ‘’లో ప్రశ్నించాడు .పేదరికం తో తలపడ టానికి అభి వృద్ధి సరిపడా జరిగింది అనీ అన్నాడు .ఆస్ట్రేలియా శాస్త్ర వేత్త సంపద గురించి పట్టించుకోనక్కరలేదు సంతృప్తి ముఖ్యం అని తేల్చాడు .ఇక్కడే భూటాన్ రాజ్య ప్రస్తావన చేస్తూ దాని రాజు ఆ దేశం లో  భూటాన్ ఆరోగ్యం దాని స్థూల జాతీయ సంతోషం తో సరిపోలుస్తారని తెలియ జేసిన విషయం వివరించాడు .’’సంతోషంఎక్కడ  ఉంటె ఆరోగ్యం అక్కడ ఉంటుంది అని ‘’లైఫ్ బాయ్ సబ్బు యాడ్ లాగా .అనేక శోధనలలో బీదరికం లో స్వేచ్చ వికసిస్తున్దనుకోవటమూ భ్రమే అని తేలింది .ధిల్లీ లో మురికి వాడలు పెరిగాయే కాని తగ్గ లేదు .పేదల విద్య ఇంకా మిధ్య గానే ఉంది .రచయిత ధిల్లీ దగ్గరలో ఉన్న గుర్గావ్ గ్రామం లోని పేద రైతు జీవితాన్ని తరచి చూసి అతని చిన్నతలం లో ‘’పశువుల పేడ  తో బాటు బయటికి వచ్చిన గింజలను ఏరుకొని నీళ్ళతో కడుక్కుని తినే వారని తెలిసింది .ఇప్పుడు పనికి ఆహారం పధకం వచ్చి కొంత నయం గా ఉంది .ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తున్నా అందులో దళారీలు బ్యూరోక్రాట్ ల వలన రావాల్సిన డబ్బు పూర్తిగా పేద వారికి అందటం లేనే లేదు .దొంగ పేర్ల తో దొంగ లిస్టులు తయారు చేసి డబ్బు నొక్కేస్తున్నారు .పాత తరం వారి జీవితాలలో స్వాతంత్ర్యం లేక పోయినా ఇప్పటి బీదలకు కొంత స్వేచ్చ లభిస్తోంది .అమెరికా లో రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ అయినప్పుడు   ధన వంతుల పై పన్నులను తగ్గించి అధిక సంపదను సృష్టించి పేదలకు అందించమని కోరితే అది ఉల్టా పల్టా అయి ధనికులు మరీ ధన వంతులు బీద వారు మరీ పేదవారు అయి పోయారు .

భారత దేశం లో అమెరికా రాయ బారి జాన్ కెన్నెత్ గాల్  బ్రైత్,భారతీయులకు చాలా సన్నిహితుడు .ఆయన రాసిన ‘’ది ఎఫ్ఫ్లు ఎంట్ సొసైటీ ‘’లో’’ ప్రైవేట్  సంపద పబ్లిక్ మురికి కూపానికి దారి  తీసింది ‘’అన్నాడు   (private affluence led to public squalor).అయన మాట ను పెడ చెవిని పెట్టారు .2006-7ప్రపంచ పట్టణాల నగరాల  పరిస్తితి పై అమెరికా అధ్యయన రిపోర్ట్ లో వంద మిలియన్ ల జనం ప్రపంచ వ్యాప్తం గా ఇంకా మురికి వాడలలోనే జీవిస్తున్నారు .చివరి పది హేను ఏళ్ళలో ఆసియాలో అభి వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నా ,మురికి వాడల సంఖ్య పెరిగిందే కాని తగ్గ క పోవటం విశేషమే కాదు విచారకరం కూడా .ఇండియాలో గాల్  బ్రైత్ అమెరికా రాయ బారి గా ఉన్న కాలం లో ధిల్లీ లో మురికి వాడను కనీ పెట్టటం కష్టం గా ఉండేది .ఇప్పుడు వాటిని తప్పించుకు పోలేని స్తితి .మురికి కాలనీ వాసులు ఏదో నేరం లో ఇరుక్కొని జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు .ఇప్పుడు స్థానికులు వారిని వేరే చోట పునరావాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .దిల్లీలో జన సాంద్రతని జన సముద్రాన్ని తట్టుకోలేక దిల్లీకి పాతిక కిలో మీటర్ల దూరం లోఉన్న గుర్గావ్ కు  భారతీయ ,విదేశీ సమస్థలు వలస పోయాయి .అది చిన్న పట్ట్టణమే  అయినా’’ ఆకాశ హర్మ్యాలు ‘’నిర్మించి శాటి లైట్ టౌన్ గా అభి వృద్ధి చెందించారు .

అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘’మైక్రో సాఫ్ట్ ‘’గుర్గావ్ లో ఆఫీసులు ఏర్పాటు చేసు కొన్నది .దాని చైర్మన్ అయిన రవి వెంకట రామన్ మూడు విషయాలపై అధ్యయనం చేసి తన అభిప్రాయాలను విడుదల చేశాడు .ఇండియా పార దర్శకం గా వ్యవహరించి లంచ గొండితనాన్ని తగ్గించింది అన్నాడు కంప్యూటర్లు. బ్యూరో క్రాట్ ‘’బాబుల ‘’బండారం బయట పెట్టాయి .ఆన్ లైన్ లావా దేవీలు ఎలా జరుగుతునన్నాయో తెలిపే ఉదంతం ఒకటి చెప్పాడు .ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఐ టి వలన వేరి హాపీఅనీ  వాళ్లకు వారానికి వచ్చే  మామూళ్ళు,  లంచాలు ఠంచన్ గా  ‘’ఈ మెయిల్’’ లో నమోదై చేతికి అందుతున్నాయని ఆనందం గా చెప్పాడు .కంప్యూటర్ గొప్ప తనం ఇదా అని ముక్కున వేలేసుకో కండి మరి .

రామన్ చెప్పినదానిలో మైక్రో సాఫ్ట్ మిగిలిన వాటికంటే ఎక్కువ సమానత్వాన్ని సాధించింది .అక్కడ బాస్ కు మామూలు ఉద్యోగికి ఒకే భోజనం .ఐ టి విప్లవం పారిశ్రామిక విప్లవం కంటే గొప్ప విప్లవమైంది .ఇండియా ఇప్పుడున్న పధం లోనే ప్రయాణించి ఆర్ధికాభి వృద్ధిని వేగ వంతం చేసి మైనారిటీజనాల సంక్షేమం కోసం పాటు పడాలి .ఇందులో మూడు మార్గాలున్నాయి .మొదటిది ‘’ఇండియా ఫస్ట్ ‘’అనేది .అంటే అన్నిట్లో ఇండియా అగ్రగామి గా ఉండాలన్నది .దీనివలన అందరూ కలిసి ఇండియాని మొదటి స్థానం లో నిలబెట్టాలి .దేశం మొత్తం అభి వృద్ధిలో భాగస్వామ్యం పొందాలి దాని ఫలితాలు అనుభవించాలి .రెండోది ‘’ఇండియా అక్కడే ఆగిపోవటం ‘’(India getting stuck).ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మంద గించటం ,భారతీయ ఎగుమతులకు అవకాశాలు తగ్గి పోవటం  దేశం లో కూడా అభి వృద్ధి అసమానం గా ఉండటం .మూడవది ఐ టి ప్రయోజనాలను కమ్మ్యూనిటి టెక్నాలజీ ,లెర్నింగ్ సెంటర్స్ ను ఏర్పరచి అట్టడుగు వర్గాలకు చేర్చటం .విద్యార్ధుల స్థాయి పెంచటం, వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంచటం ,వారికి  కొత్త టెక్నాలజీ తో పరిచయం కల్గించటం ,వాళ్లకు స్థానికం గానే శిక్షణ ను కల్పించటం .ఎక్కడఆర్ధిక  వ్యవస్తలో లోపాలున్నాయో గమనించి వాటిని సరిదిద్దటం .గ్రామీణ ఆర్ధిక స్తితిని శక్తి వంతం చేయటం .పట్టణాభి వృద్ధి తో  గ్రామీణా భివృద్ధి పోటీపడి సాధించటం .చిన్న ,,మధ్య తరగతి వ్యాపార సంస్థలను గ్లోబల్ గా పోటీ పడే ట్లు చేయటం .వీతన్నిటి కోసం మైక్రో సాఫ్ట్ పని చేస్తోందని రవి చెప్పాడు .మైక్రో సాఫ్ట్ పూర్తిగా ఒక ప్రైవేట్ సెక్టార్ కాదు .గవర్న మెంట్ తో సంబంధం లేకుండాను లేదు .దాని అన్ని ప్రాజెక్టులు ప్రైవేట్ –పబ్లిక్ భాగ స్వామ్యం తో పని చేస్తాయి .ఇందులో వ్యక్తికీ తగిన స్థానం ఉంటుంది బిజినెస్ ,ప్రభుత్వమూ అతి సన్నిహితమవుతాయి .అభి వృద్ధి నిరోధకులు ,కాపిటలిజానికి వ్యతి రేకులు మైక్రో సాఫ్ట్ విధానాలను స్వంత ప్రయోజనాలకోసం చేస్తున్నవే నని విరుచుకు పడుతున్నారు .ఇండియాలో సమతుల్య ఆర్ధిక వ్యవస్థకు మైక్రో సాఫ్ట్ మీద ఆధార పడితేనే మంచిదని పిస్తోంది .బిజినెస్ ఉత్సాహం ఉన్న వారు సంపద సృష్టికి పెద్ద పాత్ర పోషించాలి .బిల్ అండ్ మెలిండాఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్అసమానత ను  అమెరికా లోను ప్రపంచ మంతటా తగ్గించటానికే అంకితమయ్యాడు .ఆయనది లాభ నష్టాల మీద నడిచే సంస్థకాదని,షేర్ హోల్డర్ విలువను పెంచుకోవటానికి కాని కాదని గ్రహిం చాలీ . ‘’ఇండియా ఫస్ట్’’ప్లాన్ లో అభి వృద్ధి యెలాఉన్దని రవిని అడిగితే ఇండియా పాశ్చాత్య దేశాలను అనుకరిస్తే విషాదమే మిగుల్తుంది అన్నాడు .ఉదాహరణకు రోడ్డు రవాణా సంస్థను తీసుకొంటే పెరుగుతున్న జనాభా కోసం పెరిగిన రావాణా వ్యవస్థ వలన శక్తి వనరుల వాడకం ఎక్కువై పర్యావరణ సమస్యలు పెరిగి పోయాయని చెప్పాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

 

 

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా  పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి  ఆర్దికంపై    కంట్రోల్ లను  సడలించే దాకా తాము ఏమాత్రం ఆదుకోలేమని చెప్పింది .అప్పటిదాకా అమలు లో ఉన్న సోషలిస్టు భావాలను పద్ధతుల్ని వదులుకోటానికి ఆయన మంత్రులు  ఇష్టపడలేదు .అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్ మోహన్ సింగ్ సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిస్తే తప్ప గండం గడవదు అని అర్ధం చేసుకొని ప్రధానికి చెప్పాడు ,పేద దేశమైన ఇండియా ప్రభుత్వానికి  మార్కెట్ కు మధ్యే మార్గాన్ని అనుసరించి బయట పడాలని సూచించాడు .బంగారాన్ని అమ్మేసి ఆర్ధిక స్తితి మెరుగు పరచి సంస్కరణలు అమలు చేసి ఆర్ధికం గా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దారు ప్రధాని రావు మన మోహన్ .సింగ్ ప్రధాని అయి ఈ విధానాన్నే కోన సాగించాడు .గ్రామీణ ప్రజలకు పని కల్పించటం ,విద్యా విధానాలలో మార్పులు తేవటం ద్వారా కొంత మెరుగు పరచాడు సింగ్

సోషలిజం ఓడి పోవటం ,మార్కెట్ బల బడటం వలన మళ్ళీ ఆర్ధిక అసమానత్వం ఏర్పడింది .ప్రపంచీకరణ విజయమై ప్రపంచమంతా మార్కెట్ మయం అయింది.సోషలిజం పతనం తో బాటు ప్రపంచీకరణ ప్రాధాన్యత పెరిగింది .1991 తర్వాతా ఇతర దేశాలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి .కోకా కోలా సామ్రాజ్యం విస్తరించింది .జనతా ప్రభుత్వ హయాం లో దీన్ని నెట్టేశారు .’’కోక్ ను కిక్ చేయటం భారత దేశ స్వాతంత్రయానికి చిహ్నం ‘’అయిందప్పుడు .ఇప్పుడు మళ్ళీ వచ్చి తిష్ట వేసి ఇండియాను లొంగ దీసుకోంది.ఇండియా గ్లోబలై జేషన్ వలన  లాభ  పడింది  ఇన్ ఫర్  మేషన్ టెక్నాలజీ ,బిజినెస్ అవుట్ సోర్సింగ్ లకు అంతర్జాతీయ మార్కెట్ లభించింది .భారత్ కూడా ఉత్పత్తి లో ముందడుగు వేసి ‘’ఇంటర్నేషనల్ ప్లేయర్ ‘’ పాత్ర పోషిస్తోంది .ఇంతకీ ప్రపంచీకరణ  పేదలకు ఏమి లాభం కలిగిస్తుంది అనే ఆలోచనా సాగింది .

సోవియట్ యూనియన్ పతనం తర్వాతా రష్యాలో ‘’బిగ్ బాంగ్ గ్లోబలైజేషన్ ‘’పెరిగి పోయింది .రోరింగ్ నైన్ టీస్ పుస్తకంలో  జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’ఆర్ధిక ప్రపంచీకరణ రాజకీయ ప్రపంచీకరణ ను తోసి రాజైంది ‘’అన్నాడు .’’ఆన్ గ్లోబలైజేషన్ ‘’పుస్తకం లో ఫైనాన్సేర్ ,దాత అయిన జార్జ్ సారోస్ ‘’మార్కెట్ ఫండ మెంటలిస్టూలకు అంటి గ్లోబలైజేషన్ కార్య కర్తలకు మధ్య ఒక తమాషా ఒడంబడిక కుదిరింది .ఇది శుభ పరిణామం .అంతర్జాతీయ సంస్థలు బలోపేతం గా ఉండాలి .సంస్కరణలకు అంగీకరించే వారితో జతకలవాలి .అంతర్జాతీయ పద్ధతులు బలపడాలికాని బలహీన పడరాదు ‘’అన్నాడు .ఇవాళ గ్రామాలలో కూడా మనిషి తో చేసే వ్యవసాయం కంటే యంత్రం తో చేసేదే ఎక్కువైంది .అమెరికా వ్యవ సాయ దారులు కూడా ప్రభుత్వం తమకు సబ్సిడీలిచ్చి ఉత్పత్తికి సహకరించాలని కోరుతున్నారు .పంజాబ్ లాంటి రాష్ట్రాలలో భూమి ఉప్పు బారి పోయి పంటలకు అనుకూలమవ్వటం లేదు .వీరు తాయ్ ల్యాండ్ మొదలైన దేశాలలో బియ్యం మొదలైనవి హాయిగా పండించుకొనే ఆలోచనలో ఉన్నారు  .

ఇండియా కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్ లకు ఆహ్వానం పలుకుతోంది .అంబాని వాల్ మార్ట్ టేస్కో లాంటి సంస్స్తలను ఆహ్వానించి మార్కెట్ రంగం లో దూసుకు పోయే ఆలోచన తో ఉన్నాడు .భారతీయ చిల్లర దుకాణాలు దీని వల్ల  కనుమరుగౌతాయి .ఉపాధి పోతుంది .చిల్లర వర్తకులు స్వయం సమృద్ధి గా యాజమాన్యం వహించి కస్టమర్ల్ ను దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు .వీరి పొట్ట కొట్టటం భావ్యం కాదు .వీరంతా భారత జాతీయతకు వెన్నెముకలే .గ్లోబలై జేషన్ వలన జాతీయత దెబ్బ తింటుంది అని కొందరి వాదన .పాశ్చాత్య సంస్థలు ఇక్కడ బల పడితే భౌతిక నాగరకత పెరిగి ఆధ్యాత్మికత దెబ్బ తింటుందనే భయమూ ఉంది .

ఆస్ట్రేలియా కు చెందిన ఆర్ధిక వేత్త ,రాజకీయ శాస్త్రజ్ఞుడు క్లైవ్ హామిల్టన్ తన ‘’గ్రోత్ ఫిటీష్ ‘’పుస్తకం లో ప్రపంచీకరణ అంటే ఆపకుండా వృద్ధిని వ్యాపించ చేయటం ,వినియోగ దారుల పెట్టుబడిని అభివృద్ధి పరచటం ‘’అని అన్నాడు .గ్లోబలైజేషన్ అనేది సాంస్కృతిక పరం గా ఒక ప్రత్యెక సిద్ధాంతం ,మాత్రమేకాక ఒక స్వేచ్చా శక్తి కూడా ‘అన్నాడు రాస్ ..మీడియా లో ప్రకటనల జోరు వ్యాపారాలను బాగా పెపెంచింది .ఇండియాలోని ఒకప్పుడు మద్రాస్ కే పరిమిత మైన శరవణ భవన్ హోటల్ ఇవాళ చాలా దేశాల్లో స్తానం సాధించింది .ఢిల్లీ లోని కన్నాట్ సర్కస్ లో ఉన్న ఆ హోటల్ ముందు జనం క్యూలు కట్టి నిలబడతారు .పక్కనే ఉన్న మాక్దోనాల్ద్ స్టాల్ వెల వెల బోతూ  కని  పిస్తుంది .పాశ్చాత్య దేశాలలో గ్లోబల్ సంస్కృతీ తప్పని సరి అంతకంటే వారేమీ చేయలేరు .నియంత్రించనూ లేరు .

ఇండియా లో కమ్మ్యూనిస్ట్ లు మాత్రమె ప్రపంచీకరణ ను అడ్డుకొంటున్నారు .దీని వలన నష్టమే కాని లాభం లేదు .వారి వాదం కాలం చెల్లిన వాదమే అయి పోయింది .వీరు అధికారాలలో ఉన్న దేశాలలో ప్రపంచీకరణకు పెద్ద పీట వేస్తున్నారు .ఊరికే బయటి షో వారి ప్రదర్శనలూ స్లోగాన్లూ .మన్ మోహన్ సింగ్  మాట్లాడుతూ కాపిటలిజం ఇండియా కున్న అవసరాలను తీర్చేదిగా ,క్రమ విధానం లో ఒక దాని తర్వాతా ఒకటిగా పని చేయాలన్నాడు .మోరల్ ఎకనామిక్స్ విషయం లో నిస్పృహ చెందరాదన్నాడు .ఇవాళ సోషలిస్ట్ ఏకనా మిస్ట్ లే ఒంటరి వారై పోయారని చెప్పాడు సింగ్ .మోరల్ ఎకనామిజం వస్తే మార్కెట్ ఎకనామిజం వెనకడుగేస్తుందని నమ్మకం గా చెప్పాడు .

ఇండియా ఎకానమిస్ట్ రాజీవ్ కుమార్ మోరల్ ఎకనామిక్స్ పై అధారిటి .నక్సల్ భావాలు బాగా జీర్నిచుకు పోయిన వాడు .ఆయన ఆక్స్ ఫర్డ్ విద్యార్ధి గా ఉన్నప్పుడు ‘’డి సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ ‘’పుస్తకం చదివి ఏంతో మారిపోయానని చెప్పాడు .పదార్ధానికి అవతల ఏదో ఒక గొప్ప విషయం ఉంది .అదొక స్పిరిట్ ఆత్మా శక్తి అన్నాడు. మొక్కలు మాట్లాడుతాయని ,తెలుసుకోన్నానన్నాడు .ఆయన  మోరల్ ఎకనామిజం  గురించిచెబుతూ మార్కెట్ ను గాడిద తో పోల్చాడు .గాడిద వెనక ,అదే మన లీడర్ అనుకోని నడుస్తుంటే లాగి తంతుంది .మనం దాని మీద కూర్చుని స్వారి చేస్తూ దానికి దారి చూపిస్తే అది మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తుంది .కనుక మనం పెట్టుకొనే రూల్స్ ,విధి విధానాలు పకడ్బందీ గా ఉంటె ఆహార వస్తు సరఫరా సవ్యం గా జరిగి ,సేవ అత్యున్నత నైపుణ్యం తో నిర్వహించ వచ్చు .మనకేమి కావాలో స్పష్టం గా మనకు తెలిస్తే ఆ దిశలో కృషి చేస్తే కావలసింది సిద్ధిస్తుంది .’’అని చెప్పాడు .జపాన్ కొరియాలు మార్కెట్ ద్వారా ప్రజలకు మంచివిద్య నిప్పిస్తున్నాయి .ఇండియా కూడా దీన్ని వాళ్ళ లాగే సాధించాలి .మార్కెట్ సేవను ముఖ్యం గా విద్యా రంగానికి ఉపయోగిస్తే సమస్య పరిష్కారమవుతుంది .మార్కెట్ తక్కువ ధరకు పేదవారికి  అందు బాటు ధరలకు నాణ్యమైన వస్తువులను అందించాలి .ఎగుమతి కోసం ఖరీదైన వస్తువుల్ని తయారు చేసి అమ్ముకో వచ్చు .స్థానికం గా మాత్రం చీప్ అండ్ బెస్ట్ వి అందుబాటులోకి తేవాలి .

రోరింగ్ నైన్టీస్ లో జోసెఫ్ స్తిగ్లిజ్ ‘’మా అమెరికా విధానం లో ఇతర దేశాలలో అసమానత్వం ,కొన్ని సందర్భాలలో స్థానిక విలువలను సంస్కృతిని త్రునీకరించటం  జరుగు తోంది ఇది మంచిది కాదు .  గ్లోబల్ సోషల్ జస్టిస్ అంటేప్రాపంచిక సాంఘిక న్యాయం మీద ద్రుష్టి పెట్టాలి .ప్రభుత్వం ,మార్కెట్ కలిసి సమ తూకం లో పాత్ర నిర్వ హించాలి .దానికోసమే అందరి దృస్టీ కేంద్రీకరించాలి ‘’అన్నాడు .దీన్ని బట్టి మనకు తేలేది ఏమిటి?పూర్తిగా గుడ్డిగా ప్రపంచీకరణ ను త్రుణీక రించరాదు. ప్రపంచీకరణ లోచాలా దూరం ముందుకు వెళ్లాం ఇక వెనక్కి మరలే ప్రశక్తి లేదు .ఇప్పుడు సమస్య దాన్ని ఎలా మన అవసరాలకు పని చేయించుకోవాలి అన్నదే .నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్ కూడా గ్లోబలైజేషన్ ను ,ట్రేడ్ ఎకనామిక్స్ ను ఇక ఆపలేము అన్నాడు .మరి గ్లోబలైజేషన్ ను ఎలా పని చేయించాలి?దీనికి ఒకటే పరిష్కార మార్గం ఉంది .విధాన నిర్ణయాలు గ్లోబల్ స్థాయలో తీసుకొని జాతీయ స్థాయిలోఅమలు జరపాలి .  సమతుల్యతను సాధించాలి .దీనివల్ల అంతర్జాతీయ సంస్థలను బలీయం చేయాలి .మార్కెట్ మనల్ని ముక్కుపట్టుకొని ముందుకు లాక్కెళ్ళ కుండా జాగ్రత్త పడాలి .ప్రభుత్వము ,మార్కెట్ల పాత్రకూడా సమతుల్యం గా బాలన్స్ గా ఉండాలి .అలాంటి మధ్యేమార్గ సమతుల్యత సాధించాలంటే ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ,చర్చలు అర్ధవంతం గా అభివృద్ధికి మార్గ దర్శకం గా జరుగుతూ ఉండాలి .మార్కేట్ ఫండ మెంటలిస్టూలను, గ్లోబలైజేషన్ వ్యరిరేకులను ఒక కంట కని  పెడుతూ వారి  స్లోగన్ల కు అరుపులు కేకలకు అదరక బెదరక సమతుల్యతః తో   మధ్యే మార్గాన్ని అనుసరిస్తే లక్ష్యాన్ని సాధించగలం .

ఆధారం –ఇండియా అన్ ఎండింగ్ జర్నీ –రచయిత మార్క్ టుల్లి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -7

శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం .

సంజీవినీ విద్య

అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు .ఈయన ప్రాపంచిక సుఖాలకు దూరమై ప్రశాంతం గా ఒక ఆశ్రమం లో ముని వ్రుత్తి తో జీవితాన్ని గడుపుతున్నాడు .తపస్సు, విద్యార్ధులకు అధ్యాపనం మాత్రమె ఆయన నిత్య కృత్యాలు .ఈ మహర్షి ధార్మిక జీవితాన్ని గమనించిన ఇంద్రుడు సంప్రీతుడై మహర్షి దగ్గరకు వచ్చి ,అతిధి పూజలందుకొని మహర్షి సచ్చీలత ,ధర్మ తత్పరత తనకు ఏంతో ఆనందాన్ని కల్గిన్చాయని వరం ఇవ్వాలని పిస్తోందని ఏదైనా వరం కోరుకోమని అన్నాడు .తనకు కాంతా కనకాలపై వ్యామోహం లేదు .కాని బతిమాలి ఇంద్రుడు వరం ఇస్తానంటే వద్దన రాదనుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందే ‘’మధు విద్య ‘’ను ఉపదేశించమని కోరాడు . ఇంద్రుడు  సంకటం లో పడ్డాడు .అయినా మాట నిలబెట్టుకోవాలని విద్యను ఇంద్రుడు మహర్షికి ఉపదేశించాడు .ఆ మధువిద్య  ను ఇంకెవరికైనా ఇస్తే మహర్షి శిరస్సును వజ్రాయుధం తో ఖండిన్చేస్తానని ఇంద్రుడు మహర్షిని హెచ్చరించి వెళ్లి పోయాడు .

కొంతకాలానికి ఇంద్రుడి చేత యజ్న భాగం లేకుండా బహిష్కరింప బడిన శ్వినీ దేవతలకీ  విషయం  తెలిసింది .పోయిన తమ ప్రాభవాన్ని మధు విద్య ద్వారా మళ్ళీ సాధించుకోవచ్చనే ఆశా కలిగి దధ్యజాచార్త్యుని చేరి మధు విద్యను ఉపదేశించమని కోరారు .ఇంద్రుని శాసనాన్ని మహర్షి వారికి తెలియ జేశాడు ..అప్పుడు అశ్వినులు ముందుగా మహర్షి తలను నరికి గుర్రపు తలను అతికిస్తామని ,విద్య ఉపదేశం చేసిన తర్వాత ఇంద్రుడు గుర్రం తలను ఖండిస్తాడని  తర్వాత తాము మహర్షికి మామాలు తలను అంటించి సంజీవనీ విద్య తో బ్రతికిస్తామని తెలిపారు .సరిగ్గా అలానే జరిగింది .మహర్షి మధు విద్యను  ఆశ్వనిలకు ఇస్తే ,ఇంద్రుడు వచ్చి మహర్షి శిరస్సు ఖండించినందుకు దుఃఖ పడ్డాడు మహర్షి ఇంద్రుడిని ఓదారుస్తాడు .కనుక విద్యలను అత్యంత గోప్యం గా కాపాడుకోవాలని ఈ ఉపాఖ్యానం తెలియ జేస్తోంది .అలాగే పాత్రల నెరిగి విద్యాదానం చేయాలనే సూచనా ఉంది .

ఊర్వశీ పురూరవులు

ఇళుడుఅనే మహా రాజు పార్వతీ దేవి శాపానికి గురై ఆరు నెలలు స్త్రీగా ఉండాల్సి వచ్చి ఇళాదేవి అయాడు  .ఈమె మీద బుధుడి ద్రుష్టి పడి వారిద్దరి సంగమం తో పురూరవుడు జన్మించాడు .పురూరవుడు తలిదండ్రులను మించిన ప్రజ్ఞా శాలి .ఒక రోజు దేవ సభలో చక్ర వర్తి ఊర్వశిని చూసి మోహించాడు .ఆమెకూ అతనిపై ఆకర్షణ కలిగింది .మిత్రావరుణ శాపం వలన ఊర్వశి మానవ కాంత గా ఉండాల్సిన సమయమూ వచ్చింది .ఊర్వశి తాను ఎప్పుడూ నేతినే ఆహారం గా స్వీకరిస్తానని ,తనవద్ద ఎప్పుడూ ఒక మేకల జంట ఉండాలని ,పడకకు అవతల ఎప్పుడూ పురూరవుడు నగ్నం గా కని  పించరాదని మూడు షరతులను పెట్టి,పురూరవ చక్ర వర్తి పట్టపు రాణిగా అతనితోకలిసి భూలోకానికి ఊర్వశి వచ్చింది .వారిద్దరి దాంపత్యం చాలా ఏళ్ళు ఆదర్శ వంతం గా గడచి పోయింది .గంధర్వుల మాయో పాయం వలన చివరి రెండు షరతులు భగ్నం అయ్యాయి. వెంటనే ఊర్వశి తానూ చెప్పిన మాటకు కట్టు బడి స్వర్గ లోకం చేరింది .విరహ వేదనతో జ్వలిస్తున్న పురూరవుడు నిర్మధనం  ద్వారా అగ్ని సృష్టించి గార్హపత్యం ,ఆహవ నీయం  ,దక్షిణాగ్ని స్థలాలలో త్రేతాగ్నులను అర్చించి స్వర్గానికి చేరి ఊర్వశి పొందు సౌఖ్యం పొందాడు .ఈ కధలో పురూరవుని నిష్కళంక ప్రేమ తెలుస్తుంది విధిని ఎవరూ తప్పించలేరని అర్ధమౌతుంది .వ్రుత్రాసురో పాఖ్యానం కూడా ఈ  బ్రాహ్మణం లోనిదే .

జైమిని బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

మేడిచెట్టు పుట్టుక

సామ వేదానికి చెందినా జైమిని బ్రాహ్మణం లో అసంఖ్యాక ఉపాఖ్యానాలున్నాయి .అందులో మేడి చెట్టు పుట్టుక కద తెలుసు కొందాం .మేడికి ‘’ఉదుంబర ‘’అని పేరు .ఇది చాలా సారవంతమైన వ్రుక్షం .ప్రజాపతి అన్నం సారాన్ని అంతటినీ ఒక చోట చేర్చి ప్రజలకు పంచటం ప్రారంభించాడు .అప్పుడు కొన్ని చుక్కలు నేల మీద పడి మేడి చెట్టు పుట్టిందట .అందుకే మేడి పండు మంచి పుష్టి నిచ్చేఆహారం అని  ఆయుర్వేదం చెబుతోంది .

ప్రజా పతి ప్రజా సృష్టి చేయటం ,అగ్ని ని ముఖం నుండి సృష్టించటం ,.ప్రజా పతి ముఖం నుండి అగ్ని భయంకర జ్వాలలతో బయటకు వచ్చి ప్రజాపతి శిరస్సుకు హాని కలగటం ,దేవతలు ఈ అగ్నిని బృహస్పతి ద్వారా గ్రహించటం కూడా వివరింప బడింది .

తాండ్య బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు గురించి తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు  ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం కాపాడు కొంటున్నాయి .ఇలాంటి పరిస్తితులలో భారత దేశం ఎటు వైపు వెళ్ళాలి ?ఏ విధానం అవలంబించాలి అని మేధావులు ,మతాధిపతులు సాంఘిక శాస్త్ర కోవిదులు సామాన్యులు ఆలోచించి తలలు బద్దలు కొట్టుకొంటున్నారు .ఈ సమస్య పూర్వా పరాలను ఒక సారి ఆలోచిద్దాం .

ఇవాళ ఆర్ధికం అన్నిటిని శాసిస్తోంది .మార్కెట్ కాపిటలిజం ,ప్రైవేట్ వ్యాపార సంస్థలు ప్రభుత్వం యొక్క  శాసనాదికారాలకు దూరమై ఇస్టా రాజ్యం గా వ్యవహరిస్తున్నాయి .వాటిపై నియంత్రణను ప్రభుత్వం దాదాపు కోల్పోయి నట్లే .ఇప్పుడు విజయం అనేది జి డి పి .పెరుగుదల తో ముడి పెడుతున్నారు .సోషలిస్ట్ ఆర్ధిక వేత్తలు దేశ ప్రభుత్వాదికార సంస్థలకే  అత్యధిక అధికారాలిచ్చారు .ప్రైవేట్ రంగాన్ని నమ్మనే లేదు .మార్కేట్ కేపిటలిజాన్ని తిరస్కరించారు .ఇప్పుడుత్రాసు సిబ్బెలు ఒక చివరి నుండి ఇంకో చివరికి ఊగిపోయాయి .ఆర్ధిక వేత్తలు మధ్యే మార్గాన్ని కనుక్కో లేక పోయారు .అదే ఇప్పుడు మనల్ని ఆదుకొనే దారి అని పిస్తోంది .సోషలిస్ట్ భావాలున్న మొదటి ప్రధాని నెహ్రు ప్రభుత్వ రంగ సంస్థలపైనే ఆధారపడ్డాడు .దిగుమతులపై ఆధారపడకుండా ఉత్పత్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు చేశాడు .నెమ్మదిగా సోపానాలు నిర్మిస్తూ ఆర్ధిక పరి పుష్టి సాధించే ప్రయత్నాలు అమలు చేశాడు .రష్యా దీన్ని సమర్ధించింది .దీనివల్ల బ్యూరాక్రసి పెరిగింది .వీరే ఆర్దికాన్ని నియంత్రించేవారు .రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్ లకు బాసులయ్యారు .ఇద్దరు కలిసి స్వంత ప్రయోజనాలకోసం ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారు .ఇందిరా గాంధి పాలన లో ఆర్ధికం మీద పట్టు సాధించింది  .బ్యాంకులు జాతీయం చేయ బడ్డాయి .ఆమె ఆహారాన్ని జాతీయీకరణ చేసింది .దీనితో పరిస్తితి పెనం లో నుంచి పొయ్యిలో పడినట్లయింది .తప్పు తెలుసుకొని ‘’బాక్ టు పెవిలియన్’’ చేసి మళ్ళీ పాత విధానానికే పట్టం కట్టింది .ఆర్ధిక కట్టు బాట్లను సడలించింది .’’ఆర్ధిక శిఖరారోహణం ‘’పేరు తో ఆమె నిర్ణయాలు గా పబ్లిక్ యాజమాన్యం అప్పటికే బల పడింది .ఉత్పత్తిలో దాదాపు నలభై అయిదు శాతం ప్రభుత్వ రంగ సంస్థలే సాధించాయి .

సోషలిస్ట్ ల ‘’లైసెన్స్ పర్మిట్ రాజ్ ‘’రాజ్యం అధీనం లో లైసెన్సులు పర్మిట్ల సామ్రాజ్యమై పోయింది . ‘’  ఎంబాసిడర్ కారు ‘’ముతకగా ఉన్నా ఇండియా రోడ్ల మీద ‘’కింగ్ ‘’అయి విజయమైంది .దాని మన్నిక అందరికి నచ్చింది .హిందూ స్తాన్ మోటార్స్ సాధించిన సృష్టీ విజయం ఇది .దానికోసం జనం క్యూలు కట్టారు .సప్ప్లై కంటే డిమాండ్ ఎక్కువైంది .ఇతరదేశీయులు అంబా సిడ ర్ భారతే దేశ వెనక బడ్డ తనానికి చిహ్నం అని భావించి ఈసడించినా  ఇది యదార్ధం ..ఇ ప్రపంచీకరణ తో అనేక మోడల్ కార్లు ఇండియా లో తయారవుతున్నాయి .సూక్ష్మ ఆర్ధిక సంక్షోభం తర్వాత  ఆటో మొబైల్ పరిశ్రమ పది హేడు శాతం అభి వృద్ధి సాధించింది .ఇప్పుడు ఇండియా ‘’గ్లోబల్ ప్లేయర్ ‘’.అయింది .2016కు ఇండియా కార్లు తయారీ సంస్థలలో ప్రపంచం లోనే ఏడవ పెద్ద దేశం అవుతుంది . 34బిలియన్ డాలర్ల నుండి 145 బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ సాధించే దిశగా ఇండియా ప్లాన్ వేసింది .కాని లైసెన్స్ పర్మిట్ రాజ్ లోని లోపాల వలన అది సాధ్యం అవుతుందని పించటం లేదు .

నెహ్రు హయాం లో భారీ పరిశ్రమలకే అగ్ర తాంబూలం .అవి అనుబంధ సంస్థలకు దారి ఏర్పరచాయి .నెహ్రు తర్వాత ‘’హరిత విప్లవం ‘’సాధించింది ఇండియా .రైతులకు అనేక ఇన్సెంటివ్ లనిచ్చి ప్రభుత్వం ఆదుకోన్నది .అధిక రాబడి విత్తనాలను కనీ పెట్టి రైతులకు సబ్సిడీ గా అందించింది క్రిమి సంహారక మందుల్ని ,రసాయనిక ఎరువులను  తక్కువ ధరకు అంద జేసి రైతుకు ప్రోత్సాహాలనిచ్చింది .సాగు నీటిని సమృద్ధిగా అందించింది .దీని ప్రభావం 1970తో పూర్తయింది .ఇందిరా విధానాలను బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ గమనించి ‘’కొంచెం అతివాద ధోరణి ‘’అంది .కాని ‘’తాచరమ్మే’’1981లో జపాన్ ,జెర్మని ఫ్రాన్స్ లు సాధించిన ఆర్ధిక విజయాలను మెచ్చుకోంది.కాని ఈ మూడు దేశాల ఆర్ధిక వ్యవస్థలను పూర్తీ నియంత్రణలో ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించలేక పోయింది .టోనీ బ్లెయిర్ ప్రధాని గా బ్రిటన్ కు ఉన్న కాలం లో తమ సోషలిస్ట్ భావాలను ‘’న్యూ లేబర్ ‘’గా పేరు పెట్టుకొన్నాడు .’’తాచరిసం ‘’ను అత్యున్నత స్తాయికి తీసుకు వెళ్లి నట్లు గొప్పలు చెప్పుకొన్నాడు .

2003లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ‘’ఇరవై వ శతాబ్ది మధ్యలో కేంద్ర ప్లానింగ్ ,సాంఘిక నియంత్రణ అనే దగ్గర మార్గం వల్లనే జాతీయతః బల పడుతుంది .సంక్షేమం ,సౌభాగ్యం సాంఘిక ప్రాణప్రద వ్యవస్థ ప్రజల స్వేచ్చా స్వాతంత్రాల మీదే ఆధారపడి ఉంటాయి .స్వేచ్చ గౌరవాన్నిస్తుంది .మానవ సృజన శక్తికి దోహదం చేస్తుంది .సృజన దేశం ,జాతి యొక్క శక్తిని ,సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది .స్వేచ్చ అనేది మానవునికి భగవంతుడిచ్చిన ప్రణాళిక ,మాత్రమే కాదు ఈ భూమి మీద అభి వృద్ధికి ఆశ కూడా ‘’ అన్నాడు .నోబెల్ ప్రైజ్ విన్నర్ ,ఆర్ధిక వేత్త జోసెఫ్ ష్టిగ్లిచ్ ప్రభుత్వవిధాన నిర్ణయాలపై  పై మార్కెట్ ఎకనామిక్స్ ప్రభావాన్నిఅధ్యయనం చేసి ‘’దిరోరింగ్  నైన్టీస్ ‘’అనే పుస్తకం రాశాడు .అందులో అమెరికా సాధించిన ఆర్ధిక వృద్ధి విశ్లేషించాడు .పూర్తిగా ప్రభుత్వ నిర్బంధం ఉండకుండా నూ, పూర్తిగా లేకుండా ఉండ కుం డాను  ఉండే మధ్యే మార్గమే కారణం అన్నాడు .దీనినే ‘’విజన్ ‘’అన్నాడు .ఇది బిల్ క్లింటన్ అన్న ‘’ది ఎకానమీ స్టుపిడ్ ‘’కాదు .అన్నిటికీ మధ్యే మార్గం .

1980లో ఇండియా తన మార్గాన్ని మార్చుకొంది.సోషలిస్ట్ సంకెళ్ళను చేదించింది .అమ్మో కొంప మునిగి పోతుందని గుండెలు బాదుకొన్నారు సోషలిస్ట్ లు కమ్మీలూ .బీదలకు వ్యతిరేకం అన్నారు .రాజకీయ నాయకులు తమ అధికారాలను కోల్పోవటానికి ఇష్టపడలేదు .ప్రభుత్వ అధీనం లో ఉన్న ఆర్ధికం తో వారంతా పండగ చేసుకొని బాగు పడ్డ వాళ్ళేకదా .అందుకే వద్దని వాదించారు .

సశేషం

ఆధారం –శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు చదవమని పంపిన పుస్తకం – India;s un ending journey –by Mark Tully

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

 

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

డిం .టిం .ప్ర.జ .-2

డిం .టిం .ప్ర.జ .-2

డింగరి –‘’గుర్రూజీ !లాల్చీ పైజామా ఆయనేక్కడా కని పించటం లేదే?

టింగరి –ఏరో !వ్రోత్తి వ్రోత్తి గుర్రూ అంటున్నవేమిటి ?రెండో ఎపిసోడ్ కే నరం వాచిందా ?

డిం –మీకు కోపం, గుర్రూ ఎవ్వువ కనుక అల్లా అన్నా .సారీ .నా ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా ?

టిం –కిరణ్ కుమార్ రెడ్డి గురించేగా ?ఆ చెప్పులాయన కు వేసవిలో అవే గతి అయ్యాయి .కాని సైజు ఇబ్బందిగా ఉందట .ఏ పార్టీకి వెళ్ళినా సైజు చాలదు పోమ్మంటున్నారట .చివరికి మోడీ సైజు నచ్చి అచ్చి రావచ్చని కాషాయ గుడారం  చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు మీడియా కధనం .

డిం –సరే కానీ –సుప్రీం కోర్టులో విభజన పై కేసు వేశారు కదా ఏమైంది స్వామీ ?

టిం –వేయటం మాత్రం ఆర్భాటంగా అందరూ అధికారం లో ఉండగా వేశారు .అక్కడ వాదించాలంటే రోజుకు లక్షల్లో పని .ఇప్పుడెవరు ఆ డబ్బు పెట్టె స్తోమత గల వారున్నారు? అయిపోయిన పెళ్ళికి బాజాలెవరు వాయిస్తారు ?చేతి చమురు భాగోతం .

డిం –ఉండవల్లి అక్కడ లాయర్ గా నమోదు చేసుకోన్నాడుగా ?

టిం –నిజమే .ఆయనకూ చేతిలో ఏదైనా పెడితేకాని నోరు విప్పడేమో ?లగడపాటి కాడి పారేశాడు .శైలజా నాద్ పే రుకు తగ్గట్లుశివుడి విభూతి పూసుకొని కాన్గీల్లో కలిసిపోయాడు .చేతిలో బూడిదే తప్ప కాసులు రాలవుకదా. అందులోనూ ఆంధ్రాలో ఒక్క సీటూ’’ చేతికి ,చెప్పుకీ’’ రానే లేదాయే .’’చేతికి చెప్పు ‘’తోడుక్కున్నట్లయిన్దాయే .అయినా కేసు అంటే వాయిదాల పర్వం అవన్నీ గడిచి కొలిక్కి వచ్చే దెన్నడో ?

డిం –జగనన్న ఏమీ సాయం చేయలేడా?

టిం –ఎందుకు చేయలేడుద? సంపాదించిన దాంట్లో ఒక వంద కోట్లు వదిలేసి కోర్టులలో వాదనల కోసం ఖర్చు పెడితే కేసు త్వరలో నిర్ణయం ప్రకటించటానికి దారి దొరకచ్చు.పాపం ఆయన కేసులకే ఖర్చు చేస్తాడా ఎన్నికలకే పెడతాడా సభ్యులు జారి పోకుండా  మళ్లేయ్యటానికి ఖర్చు చేస్తాడా,  ఈ కేసు సంగతే చూస్తాడా ?అయ్యే పనికాదని పిస్తోంది .

డిం –ముఖ్య మంత్రిగా బాబు ప్రమాణం చేయటానికి అన్ని రోజులేందుకుఆగటం  గురూ?

టిం –వయసు మీద పడిన కొద్దీ చాదస్తాలు పెరుగుతాయి .ఒకాయన పెట్టిన ముహూర్తం ఇంకో ఆయనకు నచ్చలేదు .చివరికి చీపురుపల్లి సిద్ధాంతి ముహూర్తమే ఖాయం చేసి చెక్కులు, కౌంటర్ చేక్కులూ చేసి ఖాయం చేసుకొన్నాడు .దీనితో రాష్ట్రం లో పాలన ఆరు రోజులు వెనక్కి వెళ్ళింది .

డిం –ఈ మధ్య ఆయనెవరో బాబా దగ్గరికి వెళ్దామని బయక్దేరాడట బాబు ?

టిం –నిజమే నని చానెళ్ళు పత్రికలూ కోళ్లు కూసి నట్లు కూశాయి . విషయం లీకై,,షాకై విరమించుకొన్నాడు  .

డిం – ముఖ్య మంత్రి తో బాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు మళ్ళీ ముహూర్తాలు చూసుకొని గద్దె నేక్కారు?

టిం –అదే అతి చాదస్తం అంటే .ప్రమాణ స్వీకారం చేసిన నాడే మంత్రి అయిపోతే  మళ్ళీ సీటులో కూర్చోవటానికి మంచీ చెడూ కొబ్బరికాయలు పూజలు పురోహితులు ఎందుకు ?ప్రజాస్వామ్యాన్ని ఆవ హేళన చేయ రాదు .ఈ చాదస్తాలు తగ్గించుకొని అసలైన ప్రజా సేవలో నిమగ్నమవ్వాలి కాని మంచి పేరిట కాలయాపన చేసి ప్రజా పరిపాలనకు దూరం కావటం మంచి పద్ధతికాదు .

డిం –యెర్ర చందనం స్మగ్గ్లింగ్  జోరైంది గురూ

టిం –పిల్లి గుడ్డి దైతే ఎలుక ఏదో చేసిందని సామెత .ప్రభుత్వం గట్టి నిఘా పెడితే ఎవరూ తప్పించుకోలేరు శిష్యా .అది చేసే దమ్ము ఉన్న ప్రభుత్వాలు తక్కువే అందులో ఇప్పుడు ‘’ట్రాన్సిటరి ‘’పీరియడ్ .పూర్తీ పగ్గాలు కొత్త ప్రభుత్వం  చేబట్టాక ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాం .లేక పోతే’ దొందూ దొందే’’ అనుకొందాం .

డిం –తమకు ఒక ప్రత్యెక చానల్ లేక పోవటం వలననే దారుణం గా ఓడి పోయామని ఆంధ్రా, తెలంగాణా కాన్గీలు నెత్తి  నోరూ బాదుకొంటున్నారు ?

టిం –ఏడిసి నట్లుంది .ఆడ లేక మద్దెల వోడుఅన్నట్లుంది రా .10 చానల్ ,99చానల్  పెట్టి కమ్యూనిస్టులు ఏం పొడి చేశార్రా?తొంభై తొమ్మిది కాదుకదా ,కనీసం పది సీట్లు కూడా సాధించలేదు .కేవలం నాలుగింటితో సరిపుచ్చుకొన్నారు .రోజూ వారి తరఫున’’ వాయించ’’టానికి ఆ చానల్స్ లో’’ తెలక పల్లి రవి ‘’గారు తెగ కష్టపడ్డాడు .ఆర్ ఎస్ ఎస్ ను, బి జే పి ని  మోడీ ని తెగ దుమ్మెత్తి పోశాడు .ఏమైనా—కదిలించగలిగారా? చానల్ పెట్టిన మాత్రాన ఓట్లు కురవ బాబూ !కస్టపడి పని చెయ్యాలి.ప్రజా హృదయం గ్రహించాలి. కాలం తో కలిసి ప్రయాణించాలి .ఉస్ట్ర పక్షి విధానం ,చౌకబారు విమర్శలు ,అధిష్టానానికి అంటకాగడాలు అధినేత్రికి స్తోత్రపాఠాలు  ,తెలుగు తెలియన జేజమ్మలను ఇంచార్జి లుగా నియమించటాలు ,వారి అడుగులకు మడుగు లొత్తటాలు,ప్రజల్లోకి వెళ్ళ లేక పోవటాలు,ఇవన్నీ వారి కొంప ముంచితే చానళ్ళు లేవని ఏడిస్తే ఏం ప్రయోజనం శిష్యా ‘మనదగ్గర ‘’చాలెంజి’’ లేదని తెలుసుకోవాలిగానీ .

డిం – ఇక వెళ్ళొస్తా గుర్రూ

టిం –సర్రే శిష్యా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6

ఉపాఖ్యానాల్లో కధలు -2

’కాల కంజుల యాగం

తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు మారు వేషం లో వెళ్లి వారిలో ఒకడుగా ఉండి ‘’చిత్ర’’అనే పేరుగల ఇటుకను ఉంచాడు .యాగం పూర్తయింది స్వర్గానికి ఆ ఇటుకల మీదుగా కాల కంజ రాక్షసులు నడిచి వెడుతున్నారు .ఇంద్రుడు తాను పేర్చిన’’ చిత్రేస్టక ‘’ను తీసేశాడు .చితి కూలి పోవటం తో రాక్షసులు నేల మీద పడిపోయి సాలీడు మొదలైన క్రిమి కీటకాలై పోయారు .అందుకే సాలీళ్ళు పూర్తిగా నేల మీద ఉండక ,ఆకాశం లో ఎగరలేక మధ్యలో గూళ్ళు నిర్మించుకొని ఉంటాయి .ఈ ఉపాఖ్యానం లో ధర్మ రక్షణ ,ఆత్మ రక్షణ రెండూ కానీ పిస్తాయి .శత్రువును మాయోపాయం తో జయించ వచ్చుననే సందేశం ఉంది .కనుక చిత్రా నక్షత్రం లో ‘’ఇష్టకాచాయనం ‘’చేసే వాడి శత్రువులు నశిస్తారనే అంతరార్ధం ఇందులో ఉంది .

బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు

సురాసురులకు ఒకప్పుడు ఘోర సంగ్రామమే జరిగింది .సురులు తాము అసురుల చేతిలో ఓడిపోతామేమో నన్న భయం తో సమస్త వస్తు సామగ్రిని,ధనాన్ని  ‘’అగ్ని షోములు  ‘’(అగ్ని సోముడు )ల  వద్ద  దాచి యుద్ధానికి తరలి వెళ్ళారు .ఈ ధనాన్ని చూసి కళ్ళు కుట్టి  ఆ ఇద్దరూ ఆ దనం తో జీవితాంతం హాయిగా బతక వచ్చునని, దేవతలు జయించలేరని నమ్మకం తో దేవతలు తమ  దగ్గర దాచిన దాన్ని అంతా తీసుకొని ఉదాయిన్చేశారు . .దేవతలే యుద్ధం లో రాక్షసులని జయించారు .అగ్నిని వెతికి పట్టుకొని కొంత ప్రతిఫలం ముట్ట చెప్పి సామ దాన  ఉపాయాలతో తమ సంపదను రాబట్టుకొన్నారు .అలాగే సోముడిని కూడా పట్టుకొని కొట్టి ,దండోపాయం తో ధనాన్ని స్వాధీనం చేసుకొన్నారు .తర్వాతాఆ ధనమే ఇంద్రుడు వాయువు మొదలైన గ్రహాలుగా మారటం వలన యాగం లో యజమానుడు ఈ గ్రహాలను తప్పని సరిగా ఉంచి యాగం చేయాలని తైత్తిరీయం చెబుతోంది .

సృష్టికి ఆది

సృష్టిని గూర్చి ఉన్న ఉపాఖ్యానం లో ఈ జగత్తు లో మొదట అరణ్యాలు ,పర్వతాలు ఉండేవికావు .అంతా జలమయమే .ప్రజాపతికి సృష్టి చేయాలని సంకల్పం రాగానే ఆ జలం పై ఆయనకు ‘’పద్మ లత’’కనిపించింది .వెంటనే వరాహ రూపం దాల్చి ఆ లతకు దగ్గర నీటిలో మునిగి మట్టిని పైకి తెచ్చి భూమిని ,మిగిలిన సృస్తినీ పూర్తీ చేశాడు .

అనుభ విన్చిందే మనది

ప్రజాపతి ప్రజా సృష్టి చేయాలనే కోరిక తో తపస్సు చేశాడు .ఆయనకు బంగారం కనీ పించింది .అది తన కోర్కె తీరుస్తుందని భావించి అగ్నిలో హోమం చేశాడు .జరగలేదు .మళ్ళీ చేశాడు లాభం లేదు .తర్వాత ఆ బంగారాన్ని తన కడుపులో ఉన వైశ్వానరాగ్నికకి ఆహుతిగా మింగేశాడు .వెంటనే ఆయనకు ప్రజోత్పాదన శక్తి వచ్చేసింది .అందుకే లోకం లో  ‘’దాచి పెట్టిన దానికంటే ఉపయొగిన్చిన్దెఉత్తమమైన్ది ‘’ అనే సామెత దీనివల్లనే వచ్చింది .సువర్ణ భస్మం సంతాన ప్రాప్తి కల్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది .

అంతం లేని వేదాలు

వేదాలు అనంతాలు అని చెప్పే ఉపాఖ్యానం కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .భరద్వాజ మహర్షి తన జీవిత కాలమంతా తపస్సులోనే గడిపి ,ఇంకా చాలా నేర్వాల్సింది ఉందని గ్రహించాడు .ఇంద్రుడిని ప్రార్ధించి మరొక జీవితకాలాన్ని వరం గా పొంది మళ్ళీ నేర్వటం మొదలు పెట్టినా ఇంకా నేర్వాల్సిన వేదాలు మిగిలే ఉన్నాయి .మరోజీవితకాలమూ చాల లేదు .300సంవత్సరాలు వేదాధ్యయనం చేసి అలసిపోయి వృద్ధుడై పోయి పడిఉన్న మహర్షి దగ్గరకు ఇంద్రుడు వచ్చి మూడు పెద్ద పర్వతాలను చూపించి అవే వేదాలని చెప్పి ఆ మూడింటిలో నుంచి మూడు గుప్పెళ్ళ ధూళి తీసి ఇచ్చి అంతటి తో సంతృప్తి పడమన్నాడు .అందులోని ఒక్కొక్క రేణువు ఒక్కొక్క వేదం శాఖ అని ఎరుక కలిగించాడు అందుకే ‘’అనంతావై వేదాః ‘’అన్నారు .

మోదుగ చెట్టు పుట్టుక

భూమి పైన మూడవ లోకం లో ఉండే సోమాన్ని గాయత్రీ దేవి బలాత్కారం గా తీసుకొని వెళ్ళింది .అప్పుడు సోమాన్ని రక్షించే వారికి ఆమెకు యుద్ధం జరిగింది .ఆ యుద్ధం లో సోమలతః కు చెందిన యొక ఆకు ఒకటి నేల మీద పడింది .దాని నుండి పలాశ లేక మోదుగ చెట్టు పుట్టింది .అలాగే దర్భ ,మర్రి ,మెది జమ్మి ,వికంకత మొదలైన వృక్షాల పుట్టుక కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .

దీని తర్వాతా శత పద బ్రాహ్మనం లో ఉన్న ఉపాఖ్యానలలోని కధలను తెలుసుకొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!

  • – హెబ్బార్ నాగేశ్వరరావు

ఇప్పుడు స్వజాతీయత గురించి ఎవ్వరూ పట్టించుకొనడం లేదు. అన్నింటికీ అంతర్జాతీయ ‘ఉపమానాలు’ మాత్రమే నడిచిపోతున్నాయి. అంతకంటే పై స్థాయి ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ, ‘సూపర్’ ‘డూపర్’ ‘మెగా’ ‘దగా’ వంటి పదాలను వాడేసి, అంతర్జాతీయ స్థాయికంటే ‘విస్తృతమైన’ ‘ఉన్నతమైన’ది ఇంకా ఏదో ఉందన్న భ్రమను కల్పించడానికి ఊదర గొట్టేస్తున్నారు… బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి పదజాలం సృష్టిస్తున్న సహజమైన అనుభూతిని ‘అంతర్జాతీయ’ కృత్రిమ అనుబంధం ఆలింగనం చేసుకుంటున్న క్షణాలు ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి!! ‘సశక్త భార త్’ను ‘సమృద్ధ భారత్’ను ‘స్వావలంబక స్వర్ణ భారత్’ను నిర్మించడానికి నడుములు బిగించిన వారు సైతం ప్రత్యేక ఆర్థిక మండలాలు- సెజ్‌ల-ను రద్దు చేశామని చెప్పడం లేదు… విదేశీయ సంస్థల ప్రత్యక్ష నిధుల – ఎఫ్‌డిఐ – అవసరం లేకుండా స్వదేశీయ నిధులలోనే ‘సశక్త భారత్’ను నిర్మించడం గురించి ప్రచారం చేయడం లేదు. రైల్వేలలో ‘విదేశీయ నిధుల’ను ‘విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని’ అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ప్రభుత్వ సంస్థల వాటాలను భారీగా అమ్మేస్తారట… స్వదేశీయ సంస్థలకు మాత్రమే అమ్ముతామన్న ‘స్వావలంబక’ సిద్ధాంతం మాత్రం ఈ అమ్మకాలను నిర్వహించదలచిన ప్రభుత్వ నిర్వాహకులకు గుర్తు రావడం లేదు!! ‘‘వాల్‌మార్ట్ వంటి అమెరికా సంస్థను మన దేశంలో చిల్లర దుకాణాలను తెరవనివ్వం…’’ అని ఎన్నికలకు పూర్వం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుషమా స్వరాజ్ కఠోర ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు విదేశ వ్యవహారాల అమాత్య పదవిని నిర్వహిస్తున్న ఈ నాయకురాలికి ఆ సంగతి గుర్తుందా?? ‘వాల్‌మార్ట్’ను వెళ్లగొట్టినట్టు ఆధికారిక ప్రకటన ఏదీ వెలువడినట్టు లేదు…
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేసినట్టు క్రీస్తుశకం 2004 నాటి ఎన్నికల పరాజయానికి పూర్వమే ‘్ఢమఢమఢమ’ అని ‘డప్పు’ మారుమోగిపోయింది! 2004 శాసనసభ ఎన్నికల నాటికే మన భాగ్యనగరం ‘మోడల్ సిటీ’! కనీసం అప్పటి ముఖ్యమంత్రి, వారి వందిమాగధ బృందమైనా గుర్తించిన మహా విషయమిది… పారిశుద్ధ్యపు గొట్టాలు పగిలిపోయినచోట, మురికినీటి గుబాళింపు ముక్కుల పుటాలను మత్తెక్కించినచోట, ‘మధుర’ గీతాలను వినిపించిన ‘మశక’ మహాశయలు ఈ సంగతిని గుర్తించి ఉండకపోవచ్చు! ఆ ‘మశక’ సమూహాల దాడికి విలవిలలాడి రుధిరగీతాలను ఆలపించిన మధ్యతరగతి జనం సైతం ఆ ‘ఆదర్శ నగరాన్ని’ లేదా ‘నమూనా నగరాన్ని’ గుర్తించి ఉండకపోవచ్చు!! అంతర్జాతీయ స్థాయిలో ‘దోమలు’, ఇతర లోకాలకు చెందిన ‘వైతరణి’ స్థాయిలో మురికికాలువలు విస్తరించడం కూడా అంతర్జాతీయ స్థాయి హైదరాబాదు నమూనా నరకానికి నిదర్శనం…. పదేళ్లు గడిచిపోయాయి! ఒక రాష్ట్రం స్థానంలో రెండు రాష్ట్రాలు వెలసి ఉన్నాయి. అందువల్ల అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం అనివార్యమైంది! ‘హైదరాబాదు’నకు దీటుగా కొత్త రాజధానిని నిర్మించగలమని అవశేషాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం బాగుంది! ఎందుకంటే హైదరాబాద్‌ను ‘నమూనా నగరం’గా తీర్చిన ‘ఘనత’ పదేళ్లకు పూర్వమే ఆయన గరిమలో భాగం. కాని అంతటితో ఆయనకు తృప్తికలగడం లేదు!! ‘‘సింగపూర్ స్థాయి’’లో నూతన రాజధానిని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు! ఆదర్శప్రాయమైన నగరాలు తెలుగు నేలపై ఎక్కడ కూడా ఆయనకు కనిపించలేదు. ‘‘తెలుగువారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం’’ అని అంటే ఇదేనేమోమరి! భారత జాతీయ భౌగోళిక సీమల పరిధిలో సైతం చంద్రబాబునాయుడికి నూతన రాజధానికి స్ఫూర్తినివ్వగల సుందర నగరం కాని పట్టణం కాని కనిపించక పోవడం వర్తమాన చరిత్ర! అందువల్ల ఆయన ‘సంకుచిత’ జాతీయతా దృష్టిని విదిల్చుకొని అంతర్జాతీయ అనే్వషణను సాగించాడు! సింగపూర్ సాక్షాత్కరించింది… అందంగా కనిపించింది! ‘సింగపూర్’ను చూడని సామాన్య జనాలకు భాగ్యనగరాన్ని చూసిన మధ్య తరగతి వారు వివరిస్తున్నారట! ‘‘అయితే దోమలు, మురికికాలువలు ఉండవా?’’ అన్నది విన్న వారి సందేహం… ఈ ‘మామూలు’ నాసిరకం దోమలుండవు. అంతర్జాతీయ స్థాయి ‘జిఎం’ – జన్యుసంకరమైన – మహా ‘మశకాలు’ దిగుమతి అయిపోతాయి…’’ అన్నది సందేహ నివృత్తి! ప్రతి దానికి ముందు ‘‘అంతర్జాతీయ’’ పదాన్ని తగిలించందే మనకు గుర్తింపు ఉండబోదన్న ఊహ రాజకీయ మేధావులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతర్జాతీయ రసాయనాలు, అంతర్జాతీయ వ్యాధులు…!
అక్కడ ఆయనకు సింగపూర్ నగర రాజ్య – సిటిస్టేట్ – శోభ స్ఫురిస్తే ఇక్కడ ఈయనకు న్యూయార్క్ బృహత్ నగర పటిమ ప్రస్ఫుటించింది! హైదరాబాద్ మహానగర పోలీసు వ్యవస్థను ‘న్యూయార్క్’ తరహా పోలీసు వ్యవస్థ తరహాలో తీర్చిదిద్దనున్నదట తెలంగాణ ప్రభుత్వం! వెంటనే మన రచయితలు రంగంలోకి దిగిపోయి ‘ఇంటర్ నెట్’ నుంచి సరకు దించేసి – డైవ్ లోడింగ్ – న్యూయార్క్ సిటీ పోలీసు డిపార్ట్‌మెంట్ – ఘనతను చరిత్రను పటిమను వ్యూహరచనా నైపుణ్యాన్ని, కుక్కల బృందాన్ని గురించి కథనాలను దృశ్యమాధ్యమ అక్షరమాధ్యమ వీక్షకులకు పాఠకులకు వివరించి తన్మయత్వానికి గురి చేస్తున్నారు. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేయడం తమ లక్ష్యమని మన రాజకీయ వేత్తలు చెప్పుకొస్తున్నారు! మన దేశం నుండి ఇతరులు స్ఫూర్తిని పొందినప్పుడు మనకు ‘సగర్వమైన తల ఎత్తుకునే స్థితి’ సంభవించవచ్చు! కానీ అరవై ఆరేళ్ల స్వతంత్రం తరువాత కూడా ‘న్యూయార్క్’ ను చూస్తే కాని హైదరాబాదు పోలీసులకు పని చేయడం రాదన్న ‘కీర్తి’ మనదేశాన్ని తల ఎత్తుకునేలా చేస్తుం దా?? నాలుగు వందల ఏళ్ల చరిత్ర అమెరికా దేశానిది… భారతదేశానికి నాలుగు యుగాల చరిత్ర ఉంది, వెయ్యి మహాయుగాల చరిత్ర ఉంది! సింగపూర్ ఎలా ఉందో? న్యూయార్క్ ఎలా ఉందో? అక్కడ పోలీసులు సగటు ఎత్తు ఎంతో కనిపెట్టగల ‘మేధావులు’ మన దేశంలో ప్రపంచానికి ‘నమూ నా’లుగా పనికొచ్చే మహా విషయాలను మాత్రం కనిపెట్టరు. ఎవరైనా కనిపెడితే సహించలేరు, కనిపెట్టిన వారిని మూఢ విశ్వాసాలకు, ప్రగతి నిరోధక విధానాలకు ప్రతినిధులుగా చిత్రీకరిస్తారు! ఎప్పటికీ మనం ఇతర దేశాలను చూసి అనుసరించే ‘జాతి’గానే మిగిలిపోవాలన్నది ఈ మేధావుల లక్ష్యం! ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు దేశమంతటా ‘న్యూయార్క్’ పోలీసుల బొమ్మలను చూసి జనం మురిసిపోతున్నారట! పాపం హైదరాబాద్ పోలీసులు…!
పోలీసు వ్యవస్థను మార్చడమంటే పనితీరు, సామర్థ్యం, పటిష్టమైన వ్యూహాలు, నేరనిరోధక పద్ధతులు, నేర పరిశోధక విధానాలు మెరుగుపడడమని సామాన్యజనాలకు సైతం తెలుసు! కానీ ఇవేవీ కాదట! మన పోలీసులు ‘బట్టలు’ మార్చుకుంటే చాలు… సర్వం మారిపోతుందట! ఇంతవరకు హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు ధరిస్తున్న ‘గణవేషం’ పనికిరాదట! ఐక్యరాజ్య సమితి దళాల తరహాలోని గణవేషం – యూనిఫారమ్ – మన పోలీసులు ధరించాలట! చీకటి నీలం – డార్క్ బ్లూ – రంగు ట్రౌజర్లు, ఆకాశపు నీలం – స్కైబ్లూ – రంగు షర్టులు హైదరాబాద్ పోలీసులు తక్షణం ధరించడం ఆరంభం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారట! పోలీసులలో కర్తవ్యనిష్టను, నైతిక నిష్టను, బౌద్ధిక శారీరక పటిమను పెంచడం ద్వారా వారి స్వభావంలో గుణాత్మక ప్రగతిని కలిగించడానికి ప్రయత్నాలు జరుగవలసిన సమయంలో బట్టల రంగును మాత్రం మార్చి వేస్తే ఏమి సాధించగలరు?? ఇప్పుడున్న ‘యూనిఫారమ్’ ఈ కర్తవ్యనిష్ఠకు, నైతిక నిష్ఠకు, పనితీరునకు పటిమకు అవరోధంగా మారిందా?? న్యూయార్క్‌పట్ల, సింగపూర్‌పట్ల, జిబ్రాల్టర్ శిలపట్ల టింబక్టూ నగరంపట్ల గౌరవం ఘటించే విధంగా జనాన్ని తీర్చిదిద్దడంవల్ల ఈ కర్తవ్య నిష్ఠకాని, నైతిక పటిమ కాని పెరగవు…
బ్రాండ్ హైదరాబాద్‌కాని గ్రాండ్ హైదరాబాద్ కాని పోలీసుల బట్టలను వాటి రంగును మార్చినంత మాత్రాన ఏర్పడదు! ఆవును, అడవినీ రక్షించడంవల్ల మాత్రమే భవ్యమైన భాగ్యనగరం మాత్రమే కాదు దివ్యమైన భారతదేశం కూడా అవతరించగలదు! నూతన రాజధానిని నిర్మించడానికి పూనుకుంటుంటున్న నీ పెద్దలు నైతం గుర్తించవలసిన అంశమిది! ఆవులున్న చోట అడవులున్నచోట ఆరోగ్యం వెల్లివిరుస్తుంది, అమరిన ప్రగతి పరిమళిస్తుంది. రెండువందల ‘జాతు’ల దేశవాళీ ఆవులలో ఇప్పుడు భారతదేశంలో మొత్తం మీద ఇరవై తొమ్మిది ‘జాతు’ల అవులు మాత్రమే మిగిలి ఉన్నాయట!
అందువల్ల ‘బిటి’ పత్తి, ఎండోసల్ఫాన్, చైనీస్ సిజ్లర్, కెంచుకీ చికెన్ – అమెరికాలోని ‘కెంటుకీ’ రాష్ట్రంలోని కోడిమాంసమట – వంటి ‘నత్తల’ గురించి తెలిసినవారికి ఆవులు, అడవుల వంటి ‘వౌక్తిక మణుల’ సంగతి కూడా తెలుసుకోవడం ఇప్పుడైనా అనివార్యం! భారతీయ ప్రాచీన రాజధాని నగరాలు ‘నిలువున’ పెరగలేదు, అడ్డంగా విస్తరించాయి. ముంబయి ‘కంపాకోలా’ ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన ఇరవై ఆరు అంతస్థులను కూల్చివేయమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. నిలువునా అంతస్థుల భవనాలు నిర్మించడం కొత్త రాజధాని శోభనీయదు! హంపీ విజయనగరం ఏడు ప్రాకారాలుగా విస్తరించి ఉండేదట! కాకతీయుల రాజధాని ఓరుగల్లు కూడా ఏడు ప్రాకారాలుగానే విస్తరించి ఉండేది! ఈ ప్రాకారాలలో కొన్నింటిలో పొలాలు, కొన్నింటిలో ఆవులు అడవులు (వనాలు) కూడా ఉండేవి!! శాతవహన రాజదాని ధాన్యకటకం – అమరావతి – కూడా ఇలా అడ్డంగానే విస్తరించి ఉండేది! ‘నిలువున’ అంతస్థుల భవనాలు పెరగడంవల్ల కాలుష్యం కేంద్రీకృతమైపోతుంది. అడ్డంగా విస్తరించడంవల్ల అమరిక, స్వచ్ఛమైన పరిసరాలు నెలకొంటాయి! న్యూయార్క్, సింగపూర్ వంటిని నిలువున పెరిగిన నగరాలు! అమరావతి, హంపీ, ఓరుగల్లు – ఏకశిలానగరం – వంటి మన ప్రాచీన నగరాల నమూనాలను అనే్వషించండి!!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

  • -బి.వి.ప్రసాద్

‘గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని ఆనాడే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అంత నమ్మకం ఉన్నా నేడు గంగానదికి వచ్చేవారంతా అందులో గంగమ్మను చూసి ఉలిక్కి పడుతున్నారు. విదేశీయులు అయితే చెప్పనక్కర్లేదు సిగ్గు, జాలి పడుతుండగా భారతీయులు సైతం గంగానదిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పాపాలు పోవడం దేవుడెరుగు, ఆ అపరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు, రోగాలు ప్రబలుతాయోనని భయపడుతున్నారు. హిమాలయాల్లోని గంగోత్రి నుండి బంగ్లాదేశ్ లోని సుందర్‌బన్ డెల్టా వరకూ 2,500 కిలోమీటర్లు దూరంపైగా ప్రవహించే గంగానది ప్రతి రోజు అనేక రకాలుగా కోట్లాది మందికి ఉపయోగపడుతోంది. భారతదేశ ప్రక్షాళన- గంగానది ప్రక్షాళనతో వారణాసి నుండి మొదలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడంతో ప్రపంచం అంతా తాజాగా మరో మారు గంగానది ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటోంది. ‘భరత్‌ను ప్రక్షాళన చేద్దాం దానికి వారణాసి నుండి నాంది పలుకుదాం’ ఈ వ్యక్తి వ్యర్థపదార్థాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రజలు అంతా ఆలోచిస్తారు, కాని అదే భారత్‌ను మారుస్తుంది అని పరమ పావన గంగానదికి హారతి ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడం భారతదేశ మాతకు సేవ చేసిన దానితో సమానం , చిన్న చిన్న ప్రయత్నాలే లక్ష్యాలను సాధిస్తాయి అని కూడా నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ ప్రయత్నం ఈనాటిది కాదు. కాలుష్యం కోరల్లో చిక్కున్న గంగానదిని 2020 నాటికి ప్రక్షాళన చేస్తామని ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ కూడా చెప్పారు. యుపిఎ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని, మరో తొమ్మిదేళ్ల నాటికి శుద్ధి చేయని నీరు గానీ, పారిశ్రామిక కాలుష్యాలు కానీ గంగానదిలో చేరే అవకాశాలు ఉండవని గంగశుద్ధి కార్యక్రమం ద్వారా 2020 నాటికి ప్రక్షాళన చేయని నగర పాలక సంస్థ నీరు గంగానదిలో చేరే అవకాశం ఉండదని కూడా మన్మోహన్‌సింగ్ 2010లో చెప్పారు. ఆ మాటలు చెప్పి అపుడే నాలుగేళ్లు గడిచిపోయింది. తర్వాత ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది. వస్తూ వస్తూనే గంగానది శుద్ధిపై గంభీరమైన హామీలను ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ప్రపంచ నాగరికతలు అన్నీ నదీ తీరాల్లో పురుడుపోసుకున్నవే. జీవజాలం, మనిషి ఉనికి- విస్తృతి- అభివృద్ధి అన్నీ నీటిమీద ఆధారపడినవే. ఎడారిలో గొంతు తడారిపోతున్నా జీవికి కావల్సింది నీటి చుక్కే తప్ప సంపదలు కావు. నీటిని నీలి బంగారమని ఊరికే అనలేదు, వాస్తవ బంగారం కంటే ఇది చాలా అమూల్యమైనది కనుకనే అలా అంటారు. ప్రాణావసరమైన ఈ నీరు నేడు విషతుల్యమై ప్రాణాంతకంగా మారింది. భారతదేశం నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో, నదులు మన దేశ ఆర్ధిక సాంస్కృతిక స్రవంతిలో భాగమైపోయాయి. నదులు అన్నీ మానవుని మనుగడకు మూలాధారాలే. నాగరికతకు పుట్టినిళ్లు నదులు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రధాన నగరాల నాగరికతకు కారణం అవి నదుల తీరాన వెలసినవి కావడమే, సింథునాగరికత సింథు నది తీరాన వెలసింది. మానవ అవసరాలకు, రవాణాకు, విద్యుత్ ఉత్పత్తికి, చేపల పెంపకానికి, ఇలా అనేక విధాలా ఉపయోగంలో ఉన్నవే. సాధారణంగా నదులన్నీ భూభాగంపై ప్రవహిస్తుంటాయి. భారతదేశంలో ప్రవహించే నదులు ప్రధానంగా హిమాలయాల్లో పుట్టినవి, దక్కను నదులు. వర్షపు నీటివల్ల లేదా ఎత్తయిన పర్వతాల్లో మంచు కరిగి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణిస్తాం. సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాల్లో అంతవౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికాలోని ఎడారుల్లోనూ, సౌదీ అరేబియా ఎడారుల్లో ఇలా భూమిలో ఇంకిపోయే నదులు ఎన్నో ఉన్నాయి. ఇవి వర్షం పడేటపుడు మాత్రమే పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండిపోతాయి. మన వైపు ఉండే దొంగ ఏర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేలలోకి ఇంకిపోగా మిగిలిన నీరే జీవనదుల్లో ప్రవహించేది , ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపురాయి ఉంటే ఎక్కువ నీరు ఇంకే అవకాశం ఉంటుంది. కాని నల్లసున్నపు రాయి అంటే గ్రానైట్ ఉంటే అంతగా నీరు ఇంకదు. హిమాలయాల్లో పుట్టిన నదులు ఎండాకాలంలో సైతం నీటితో ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి సింధూనది, గంగానది, బ్రహ్మపుత్ర నది. సింధునది హిమాలయాల్లో కైలాస పర్వతసానువుల్లో పుట్టి ప్రవహిస్తోంది. మార్గాంతరంలో జీలం, చీనాబ్, రావి, బీయాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులను తనలో కలుపుకుని పాకిస్థాన్‌లోని అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదికి ఉన్న ఉపనదుల వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. ఇక బ్రహ్మపుత్రనది చూసుకుంటే ఇది హిమాలయాల్లోని మానస సరోవరంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది అత్యంత పొడవైన నది, భారత్‌లో ఇది 885 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక గంగానదికి వస్తే భారతదేశంలో ఇది అత్యంత ప్రధానమైనది, పవిత్రమైనది కూడా . ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయాల్లోని గంగోత్రి అనే హిమనీనదంలో భాగీరధి నది ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకానంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగానది అంటారు. కొంత దూరం ప్రవహించాక హరిద్వారం వద్ద మైదానమార్గంలోకి వస్తుంది. జన్మస్థలంలో దీని ఎత్తు 7756 మీటర్లు. భారతదేశ ఆర్ధికవ్యవస్థ చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాధాన్యత చాలాముఖ్యమైనది. గంగమ్మతల్లి, పావన గంగ, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. గంగానది మొత్తం పొడవు 2510 కిలోమీటర్లు, గంగా నది దాని ఉపనది యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తాయి. సారవంతమైన ఈ గంగా యమునా మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. ఈ గంగానది తీరాన ఎన్నో పుణ్య క్షేత్రాలు వెలిశాయి. ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉన్న ఉపనదుల్లో ముఖ్యమైనవి యమున, కోసి, చంబల్, బెత్వా, సోన్, దామోదర్ ముఖ్యమైనవి. అలహాబాద్ తర్వాత ఎన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హుగ్లీ నది ప్రారంభం అవుతుంది. విశాలమైన గంగా హుగ్లీ డెల్టా అక్కడితో మొదలవుతుంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తర్వాత పద్మ నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో కలిసిన తర్వాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తర్వాత మేఘనా నది కూడా దీంతో కలుస్తుంది. ఇంత పవిత్రమైన గంగానది నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా 445 నదుల నుండి సేకరించిన నీటినమూనాలను సాకల్యంగా విశే్లషించిన కేంద్ర కాలుష్య నియంత్రణా సంస్థ ఇటీవల ప్రకటించిన అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. వాటి ప్రకారం సగానికి పైగా నదుల్లో నీరు మనిషి నేరుగా తాగడానికి పనికిరావు. చాలా చోట్ల నదుల జలాలు స్నానానికి సైతం పనికిరానంత మురికిగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని నివాస గృహాల నుండి దాదాపు 40వేల మిలియన్ లీటర్లు మురికి నీరు నదుల్లోకి చేరుతోంది. 2050 నాటికి అది లక్ష మిలియన్ లీటర్లు స్థాయికి చేరుకుంటుందని మరో అంచనా. అపుడిక నదుల్ని రక్షించడం ఎవరి తరం కాదు, ఆ గరళకంఠుడు భువికి దిగాల్సిందే. దేశంలో జనాభాతో పాటు వనరుల వినియోగం పెరిగిపోతోంది. నీటి లాంటి సహజ సంపదలపై వత్తిడి కూడా ఎక్కువవుతోంది. పెరుగుతున్న జనాభా జల అవసరాలను జీవనోపాధిని నదులే తీర్చాల్సి వస్తోంది. నివాస ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న మురికి నీరు నదుల్లో వచ్చి చేరుతోంది. మరో పక్క దేశంలో 70 శాతం నీరు కలుషితమైనదేనని అనేక సంస్థలు చెబుతున్నాయి. దేశంలో 86 శాతం మేర ప్రజలకు వచ్చే వ్యాధులకు కలుషిత నీరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యుల జీవన ప్రమాణాలను పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యమని రాజ్యాంగంలోని 47వ అధికరణ ఉద్దేశిస్తోంది. రక్షిత నీటిని అందించకపోవడం ద్వారా ప్రభుత్వం తన విధిని కూడా విస్మరిస్తోంది. పెరుగుతున్న పేదరికం కూడా నదీతీర వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మరో పక్క తీర ప్రాంతాల్లో ఉన్నవారు అన్ని అవసరాలకూ అసంకల్పితంగానే కాలుష్యానికి కారకులవుతున్నారు. పట్టణీకరణ దుష్ప్రభావం కూడా నదులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశంలో పట్టణాల్లో జనాభా 30 శాతం దాటింది. ఢిల్లీతోపాటు ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్‌కతా, లక్నో వంటి పట్టణాలు నదీతీరానే్న వెలిశాయి. అక్కడి ప్రజల వాడకం అంతా నదులను కలుషితం చేస్తున్నాయి. మురికివాడలు లేని నగరాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నా లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోతున్నాయి. నదీజలాల కాలుష్యానికి కారకులవుతున్న జనం చివరికి ఆ కలుషిత జలాలే తాగి వ్యాధిగ్రస్తులవుతున్నారు. దేశప్రగతికి వెన్నుదన్నుగా ఉంటున్న పారిశ్రామిక రంగం కూడా వ్యర్ధాలను నదుల్లోకి విసర్జిస్తోంది. ఎరువులు, చమురుశుద్ధి, కాగితం, చర్మశుద్ధి, లోహాలు, రసాయనాలు, ఔషధాలు రంగుల తయారీ పరిశ్రమలు నదీతీరాలను ధ్వంసం చేస్తున్నాయి. వ్యవసాయానికి అధికంగా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుల మందులు, సేంద్రీయ పదార్ధాలు, పంట అనంతర వ్యర్ధాలు సైతం పెద్ద మొత్తంలో నదుల్లోకి చేరి జలాలను విషతుల్యం చేస్తున్నాయి. సాగులో ఉపయోగించే రసాయన పదార్ధాల దుష్ప్రభావాలను తొలగించేందుకు వ్యర్ధాలు నదుల్లో చేరి నీటిని విషతుల్యం చేస్తున్నాయి. ఇన్ని కారణాలతో కాలుష్యకారకంగా మారిన గంగానది ప్రక్షాళనకు గత మూడు దశాబ్దాల్లో 20వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం లేకపోయింది. ఇంత శాపగ్రస్తం కావడానికి కారణం ఎవరు? పవిత్ర గంగానది కలుషితానికి ప్రథమ ముద్దాయి మనిషే. ఈ మహాపరాధం స్వయంకృతమే. పారిశ్రామిక వ్యర్ధాలు, ఆవాసాల మురుగునీరు, అక్రమ కట్టడాలు, మతవిశ్వాసాల పేరిట ఆచరించే నిర్హేతుక చర్యలు అన్నీ కలగలిపి పవిత్ర నది కాస్తా అపవిత్రంగా మారిపోవడానికి కారణమైంది. గంగా యమున పేర్లు చెబితే చాలు మనసు పులకరించిపోతుంది. చల్లన గంగమ్మ ఒడిలో తడిసి స్వాంతన చెందినట్టు నమ్మి కొలిచే దేవతలు పాపాలను ప్రక్షాళన చేసి ఆశీర్వదిస్తే చాలు పునీతులైనట్టు గంగానదిలో మునిగే ప్రతి ఒక్కరికీ కలిగే భావన అది. గంగానది పరిసరాలు, ప్రకృతి రమణీయత, సుందరమైన ఆకుపచ్చని వనాలు, దట్టమైన వృక్షాలతో కూడిన పర్వతసానువులు మైమరపింప చేసేవి, జీవితకాలం అనుభవంలో ఉండిపోయేవి. కాని ఇపుడు ఆ దృశ్యాలే కనిపించడం లేదు. కనువిందు చేసే దృశ్యాలు కానీ, మైమరపింప చేసే అందాలు కాని లేకపోవడంతో సుమధుర భావనలే రావడం లేదు. పవిత్రకాసారం కాస్తా మురికి కూపంగా చూడాల్సి వస్తోంది. జలాల వద్దకు వెళ్తే చాలు చల్లని గాలికి బదులు కంపుకొట్టే దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. 30 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, ఎన్ని చర్యలు చేపట్టినా గంగానది స్థితి యథాతథంగానే ఉంది. ఇపుడు గంగానది ప్రక్షాళనకు కంకణబద్ధమైనట్టు కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ భారీ స్థాయిలో నిధులను కుమ్మరించినా ప్రక్షాళన కాలేదు సరికదా కాలుష్యస్థాయి మితిమీరిపోయింది. గంగానదిని శుద్ధి చేయడానికి గత మూడు దశాబ్దాల్లో గంగా యాక్షన్ ప్లాన్ -1 పేరిట గంగా యాక్షన్ ప్లాన్-2 పేరిట 20వేల కోట్లకు పైగా వెచ్చించారు. అయినా నీరు మారలేదు. మనుషుల తీరు అసలే మారలేదు. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ మరుగునీరు ఈ కాలుష్యంలో ప్రధానభాగంగానే చెప్పవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం హరిద్వార్ వద్ద గంగలో కొలిఫాం బ్యాక్టీరియా స్థాయి 5500 కు చేరింది. ఇది అనుమతించదగిన స్థాయి కంటే 500 రెట్లు ఎక్కువ. గంగ మొదలయ్యే గౌముఖి మొదలుకుని హరిద్వార్, రిషికేశ్ వరకూ చేరే మానవ వ్యర్ధాలు ఇందుకు కారణం. మరోపక్క మానవ నిర్మిత కట్టడాలు కూడా ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక నీటి వినియోగం, డ్యాంల నిర్మాణం కారణంగా గంగ ఎండిపోతోంది. ఇసుక మేట ఫలితంగా ప్రవాహశీలత తగ్గిపోతోంది. ఇక మరోవైపు మతాచారాలు కూడా తమ వంతు కారణమవుతున్నాయి. గంగానది నీరు మనుషుల పాపాలను ప్రక్షాళన చేసి స్వర్గప్రాప్తికి సాయపడుతుందనే హిందూ విశ్వాసం కూడా ప్రస్తుత కాలుష్య స్థాయిని పెంచుతోంది. పలు సందర్భాల్లో నిర్వహించే కర్మకాండలు, విగ్రహనిమజ్జనాలు, మృతదేహాల జలార్పణం వంటివి కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా విషపూరిత రసాయనాలు, లోహాలు, క్రిమిసంహారిణులు, రేడియోధార్మిక పదార్ధాలతో నిండిన కలుషిత నదీ జలాలు సమస్త జీవావరణ వ్యవస్థకూ తీరని హాని చేస్తున్నాయి. వ్యర్ధాలు చేరి నీటి నాణ్యతను దెబ్బతీయకుండా నిరోధించేందుకు కావల్సిన సాంకేతిక, వైజ్ఞానిక పరిజ్ఞానాలు రైతులకు అందుబాటులో లేకపోవడం అందుకు ప్రధానకారణం. భారీ ఎత్తున నిర్వహించే కుంభమేళా వంటి క్రతువులు కూడా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రమాదం బారి నుండి మానవాళితో పాటు జలచరాలు, జంతుజాతిని కాపాడే ఉద్ధేశ్యంతో భారత కాలుష్య నియంత్రణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచబ్యాంకు, భారత ప్రమాణాల సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి లాంటివి అనేక మార్గదర్శక ప్రణాళికలు రచించి, నియమ నిబంధనలు ఏర్పరచినా ఆచరణలో అవన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వ స్థాయిలో చొరవ కొరవడి ప్రజల్లో అవగాహన లోపించి నెత్తిమీద కత్తిలా కాలుష్యం వేలాడే దుస్థితి ఏర్పడింది. దామోదర్ నది, సాఫీ, గంగా నదుల్లో సీసం ఆర్సెనిక్ అవశేషాలు ప్రమాదకరస్థాయిని మించి ఉన్నట్టు తేలింది. ఈ కలుషిత నీరు తాగే ప్రజలకు టైఫాయిడ్, కలరా, అతిసార, అమీబియాసిస్ వంటి రుగ్మతలకు గురవుతున్నారు.మలేరియా,నిద్రలేమి పుణ్యం కూడా ఈ కలుషిత జలాలదే. భారతీయ సంస్కృతికి జీవధారగా, వ్యవసాయరంగానికి ఆలంబనగా, ఆర్ధికవ్యవస్థలకు వెన్నుదన్నుగా చెప్పుకునే ఈ జీవనదులు మాత్రం ప్రాణాలనే హరిస్తున్నాయి. వారణాసి అయినా, హరిద్వార్ అయినా అదే పరిస్థితి కాన్పూరులో కూడా పారిశ్రామిక వ్యర్ధాలు గంగానదిని కలుషితం చేస్తున్నాయి. కోల్‌కటా చుట్టూ హుగ్లీ నదిపై ఉన్న 150 బడా పారిశ్రామిక వాడలు ఈ జలాలను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. గంగాజలాల్లో 90 శాతం సాగునీటి అవసరాలకు వాడుతున్నారు. దీంతో గంగానది ప్రవాహ వేగం కూడా తగ్గిపోయింది. కార్యాచరణ ప్రణాళికలు అంటూ వేల కోట్ల రూపాయిలు గంగపాలు అవుతోంది. 2012 జాతీయ జలవిధాన ముసాయిదాలో నదులకు బేసిన్లకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినా తగిన చట్టపరమైన సంస్థాగతమైన యంత్రాంగాలు లేకపోతే ప్రయోజనం శూన్యం. కాలుష్యం కారణంగా జాతి జీవనాడులే కుంగిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం సత్వరం గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. మానవతప్పిదాలు కొనసాగిస్తూ మరో పక్క ప్రభుత్వం ఏమీ చేయలేదనే వాదనలకు దిగడం సబబు కాదు, గంగాప్రక్షాళనకు, గత వైభవ పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి.గంగా నది శుద్ధి కార్యక్రమం 1985 జూన్‌లోనే మొదలైంది. తొలి దశ 2000 సంవత్సరం వరకూ జరిగింది. తొలి అంచనాలు 256.26 కోట్లు కాగా తర్వాత సవరించిన వ్యయం 462.04 కోట్లు. దీనివల్ల యుపిలో 6, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 15 పట్టణాలకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇక రెండో దశలో బీహార్, జార్ఖాండ్, బెంగాల్, యుపి, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు మేలు జరిగేలా 705 కోట్ల రూపాయలతో గంగానది శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీని, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ను ప్రారంభించింది. 1986లో భారత ప్రభుత్వం గంగా యమున ప్లాన్ చేపట్టి భారీ స్థాయిలో ఖర్చు చేసినా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. 2010లో నవంబర్ 1న గోముఖ్ -ఉత్తర కాశీల మధ్య 135 కిలోమీటర్లు ప్రాంతాన్ని పర్యావరణ రక్షిత స్థలంగా ప్రకటించారు. నదిపై ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టులను విరమించుకున్నారు. 2010 జూన్ 28న ప్రపంచ బ్యాంకుతో వందకోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. 1986 నాటి గంగానది ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా 2009లో చేపట్టిన ప్రాజెక్టులో ఈ లోను ఒక భాగం. 2019 నాటికి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరపుకునే వేళ దేశాన్ని ప్రక్షాళన చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు కావాలంటే వాస్తవ జీవితంలో పాతికేళ్లుగా లేడీ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న రజనీ పండిట్ గురించి చదవాలి. ఆ వివరాలే ఇవి…

“నేను ముంబయిలో పుట్టి పెరిగాను. మా నాన్న పోలీసు శాఖలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. నాన్న మహాత్మాగాంధీ హత్యోదంతం కేసు విషయంలో పనిచేశారు కూడా. నా చిన్నప్పుడు ఎంతోమంది తమ కుటుంబ సమస్యల విషయంలో నాన్న వద్దకు వచ్చేవారు. అయితే వాటి ని ఆయన చేపట్టే వాళ్లు కాదు. అది చూసిన నేను ‘వాళ్లకెందుకు నువ్వు సాయం చేయవు నాన్నా?’ అని ప్రశ్నించాను. దానికాయన ‘నువ్వెందుకు ఈ సమస్యల గురించి పట్టించుకుంటున్నావు’ అన్నారు. ఆ తరువాత కాలేజిలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి… పొగతాగడం, మద్యపానం చేయడం వంటి దురలవాట్లు ఉన్న అబ్బాయిలతో కలిసి రోజూ బయటికి వెళ్తుండేది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పాలనుకున్నాను. కాలేజి క్లర్క్ వద్దకు వెళ్లి నేనా అమ్మాయి స్నేహితురాలినని, తనకి బహుమతి ఇచ్చేందుకు ఆమె ఇంటి చిరునామా కావాలని అడిగాను. అలా చిరునామా తీసుకుని ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాను. తరువాత ఒక ట్యాక్సీ మాట్లాడి ఆ అమ్మాయి వాళ్ల నాన్నని ఎక్కించుకుని ఆమె ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి కూతురు ఏం చేస్తుందో చూపించాను. అప్పుడాయన నన్ను ‘నువ్వు డిటెక్టివ్ పనిచేస్తున్నావా’ అని అడిగారు. అప్పుడు నా బుర్రలో దాని గురించిన ఆలోచన మొదలైంది.ఆ ట్యాక్సీకి నా పాకెట్ మనీనే ఇచ్చాను.
‘సాయం’తో డిటెక్టివ్
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మూడునెలలు టెంపరరీగా ఉద్యోగం చేశాను. అలాచేసే రోజుల్లో మా ఆఫీసులో ఒకావిడ ఏడుస్తూ కనిపించింది. విషయం ఏంటని అడిగితే “నాకు ముగ్గురు కొడుకులు. వాళ్లలో ఒకడికి పెళ్లి చేశాను. ఇంట్లో నగలు కనిపించడంలేదు. కొత్త కోడలు తీసిందేమోనని అనుమానం” అని చెప్పింది. కాని ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోయింది. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి మీద నింద వేయడం సరికాదనుకుందామె. నేనామెకు సాయం చేస్తానని చెప్పినప్పట్నించీ వాళ్ల ఇంటిని గమనించడం మొదలుపెట్టాను. ఒకరోజు ఆమె కొడుకు చేతిలో ఏదో పట్టుకుని బయటకు వెళ్లడం గమనించి అతడ్ని అనుసరించాను. అతడు నగలు అమ్ముతుంటే పట్టుకున్నాను. నగలకి సంబంధించిన ఫోటోలు ఆమెకి చూపించి కొడుకుని అడగమని చెప్పాను. అడగ్గానే నంగి నంగి మాటలేవో చెప్పాడు. కాని ఆ తరువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. సమస్య పరిష్కారం అయ్యింది. అప్పుడే నేను పూర్తిస్థాయి డిటెక్టివ్ కావాలని నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించి మరాఠీ దినపత్రికలో ప్రకటన ఇవ్వాలనుకున్నాను. కాని వాళ్లు ప్రకటన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. కాని కొన్నాళ్ల తర్వాత ఆ పత్రికా సంపాదకుడి స్నేహితుడికి నా సాయం అవసరం పడింది. ఆ సంఘటన తరువాత నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ పత్రికలోనే ప్రచురించారు. అదే నా మొదటి ఇంటర్వ్యూ. అప్పట్నించీ నాకు ఎటువంటి ప్రచారం అక్కర్లేకుండానే మంచిప్రచారం లభించింది.
మా దగ్గరకొచ్చే 80 శాతం కేసుల్లో అక్రమసంబంధాలకి సంబంధించినవే. వాటిలో 75 శాతం వివాహేతర సంబంధాలకు సంబంధించినవి. ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే 80 శాతం కేసుల్లో వాళ్ల అనుమానాలే నిజం అవుతాయి. నా క్లయింట్లే నాకు మంచి స్నేహితులు. ధనిక వర్గాల నుంచి సాధారణ కుటుంబాల వరకు అన్ని వర్గాల వాళ్లు నా దగ్గరకు వస్తారు. ఈ జాబ్‌లో కావాల్సిందల్లా ధైర్యం, బుర్ర చురుకుగా పనిచేయడం, ఎదుటి వాళ్ల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడం.
రోజుకి పద్నాలుగంటలు పనిచేస్తాను. సంవత్సరానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు సంపాదిస్తాను. బాల్యంలోనే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కేసుని పరిష్కరిస్తే కలిగే ఆత్మతృప్తి ముందు మిగతావన్నీ నాకు దిగదుడుపే. పేరు కోసమో, గొప్ప కోసమో, డబ్బు కోసమో ఈ వృత్తిని చేపట్టలేదు. నా చుట్టూ ఉన్న నలుగురికీ నాకు చేతనైనంత సాయం చేయగలిగితే నాకంతే చాలు. ఈ పని చేస్తున్నాను కాబట్టి ప్రాణభయం లేదా అని మీరడగొచ్చు. ‘డర్ మేరీ డిక్షనరీ మే నహీ హై’. దేనికి భయపడాలి. మహా అంటే చావుకే కదా. చావనేది దగ్గరికొస్తే మనమేం చేయగలిగిందేమీ లేదు. అలాంటప్పుడు ఏదో అయిపోతుందని భయపడడం ఎందుకు?

కన్న కొడుకునే కిడ్నాప్ చేసి…

భర్త స్నేహితుడితో తనకున్న అక్రమసంబంధం గురించి ఏడేళ్ల కొడుక్కి తెలిసిపోయిందని ఒక తల్లి కొడుకునే కిడ్నాప్ చేయించింది. ఆమె భర్త విదేశాల్లో ఉంటాడు. రెండు నెలలు సెలవులు తీసుకుని ఇండియాకు వస్తున్నాడు. భర్త, కొడుకు కలిస్తే విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆమె కొడుకుని కిడ్నాప్ చేయించింది. భర్తకేమో పుట్టినరోజు పార్టీకి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగిరాలేదని. పోలీసు కేసు పెట్టానని చెప్పింది. కొడుకు వివరాలు కనుక్కోమంటూ ఆ జంట నా దగ్గరకు వచ్చారు. నిఘా మొదలుపెట్టిన నాకు ఒకరోజున ఆమె స్నేహితురాలు ఇంటినుంచి బయటకు ఆహారం తీసుకెళ్లడం గమనించాను. ఫాలో అయితే మొదట ఆమె తన సొంత ఇంటికి వెళ్లింది. అక్కడ్నిండి తన స్నేహితురాలి కొడుకును దాచిన లోనావాలాలోని ఇంటికి వెళ్లింది. అదే విషయం ఆమె భర్తకి చెప్పి మీ భార్యకి విషయం చెప్పకుండా తీసుకురండి. అలాగే ఆమె వద్ద మొబైల్ లేకుండా జాగ్రత్తపడండి అని చెప్పాను. లోనావాలా వెళ్లి ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టాం. చివరకు ఆమె నేరాన్ని ఒప్పుకుంది. కొడుకుని తీసుకుని శాశ్వతంగా విదేశానికి వెళ్లిపోయాడు ఆ భర్త.

సినీ నటులు, నటీమణులు అనుమానాలు…

నా క్లయింట్లలో సినీ నటులు, నటీమణులు కూడా ఉన్నారు. జీవిత భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారన్న అనుమానంతో వస్తుంటారు వాళ్లు. నటీమణులు బుర్ఖా ధరించి నన్ను ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లలో కలిసి వాళ్ల సమస్యల గురించి చెప్తారు. ఇలాంటి అన్ని కేసుల్లో వాళ్లనుకున్నదే నిజమవుతుంటుంది. భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారనే విషయం నిజమేనని తెలిసినప్పటికీ వాళ్లు మాత్రం భర్తల నుంచి విడిపోయేందుకు ఇష్టపడరు. జీవితభాగస్వామి లేదా కుటుంబసభ్యులు డబ్బు దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానం వచ్చినప్పుడు… వాళ్లు సంతకాలు చేసిన చెక్కుల్ని ఎలా వాడుతున్నారో తెలుసుకునేందుకు వస్తారు. జీవితభాగస్వామి తమని మోసం చేస్తున్నారని చాలామంది టీవీ నటులు వస్తుంటారు. నాకు తెలిసి ఎంతో మంది మోడల్స్ గృహహింసను సాధారణ విషయంగా పరిగణిస్తారే తప్ప దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అలా మాట్లాడితే వాళ్ల రెప్యుటేషన్ పోతుందని నోరు విప్పరు వాళ్లు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి హత్య కేసు

మాజీ ముఖ్య మంత్రి సోదరుడు హత్య చే యబడ్డాడు. అందులో వాళ్ల అమ్మ పాత్ర ఉందనేది మంత్రి గారి సందేహం. ఆమె వద్ద ఇద్దరు మసాజ్ చేసే ఆడవాళ్లు ఉండేవారు. ఆ ఇద్దరి ద్వారా వాళ్లింట్లో పనిమనిషిగా చేరాను. అప్పట్లో ఇన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేవు. నా దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉండేది. నేనోసారి ఆమె సంభాషణను టేపులో రికార్డు చేస్తుంటే ఆమెకి అనుమానం కలిగింది. వెంటనే రికార్డింగ్ ఆపేశాను. ఆ తరువాత ఒకరోజు ఆమె గదిలో ఒక మగ మనిషి హత్య గురించి మాట్లాడడం వినిపించింది. ఏ విషయంలోనో గాని ఆమెకి, అతడికి మధ్య గొడవ జరిగింది. అతను ఇక మీదట ఇక్కడికి రానని ఆమెతో చెప్పాడు. అన్నట్టుగానే రెండు నెలల పాటు ఆ ఇంటి దరిదాపులకి రాలేదు కూడా. రెండు నెలల తరువాత వచ్చిన అతడితో ‘మనని పోలీసులు గమనిస్తున్నారు. ఇక మీదట నువ్విక్కడికి రావొద్దు’ అని ఆమె చెప్పింది. ఎలాగైనా వాళ్లని పట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్న నేను నా చేతిలో ఉన్న కత్తిని కాలు మీదకి జార్చుకున్నాను. రక్తం రావడం మొదలైంది. రక్తం కారుతున్న కాలితో ఆమె దగ్గరకు వె ళ్లాను. మేడ కిందకి వెళ్లి బ్యాండేజి వేసుకోమని చెప్పిందామె. కిందకి వెళ్లి వెంటనే నా క్లయింట్‌కు ఫోన్ చేసి చెప్పాను. ఆయన పోలీసులను వెంటపెట్టుకుని వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా వాళ్లని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేశారు.

Posted in సినిమా | Tagged | Leave a comment

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు  (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు  )(డిం .టిం .ప్ర .జ)

డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే?

టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో .

డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు అధికారం కట్ట బెట్టారు ?

టిం –అధికారం తో బాటు అదృస్టమూ కలిసి రావాలి నాయనా .చంద్ర బాబు పేరులో చంద్రుడనే చల్లదనం ఉన్నా చంద్రుడికి బాబు సూర్యుడు అంటే సూర్య కాంతి వల్లనే చంద్ర ప్రకాశం కనుక సూర్యుడు పేట్రేగి పోతున్నాడు .’’బాబు బాబు’’ ప్రభావం అన్నమాట .

డిం –వరుణ యాగాలు చేస్తే వర్షాలు పడతాయికదా గురూజీ

టిం –వాతావరణ కాలుష్యం పెంచుకొని ,అరణ్యాలను నరుక్కుంటూ ,ఫ్రిజ్ ,టి వి.మొదలైన ఆధునియా సామగ్రిని పెంచుకొంటూ పోతున్న ఫలితానికి ఎన్ని వరుణ యాగాలు జపాలు చేస్తే మాత్రం సమతుల్యతః సాధించ గలం ?వివేకం కోల్పోయిన దాని ఫలితమే ఇది .వాతావరణం లో వేడి పెరిగి ,కొంప కొల్లేరు అవుతోంది .

డిం –తెలంగాణా లో కాంగ్రెస్ దళం గులాబీ కండువాలు కప్పుకొందే ?

టిం –తెలంగాణా ఇచ్చిన’’ సోనీ ‘’కి తగిన ప్రతి ఫలం ఇది .కాంగ్రెస్ గూడు ఖాళీ .నెత్తిన చేతులే భస్మాసుర హస్తమే .పొన్నాలలు జానాలు, బెత్తేడ్లు ఎవరూ ఆపలేరు .

డిం –మరి సెంటర్ లో?

టిం –యదా రాజ తదా ప్రజా .అక్కడ ‘’కూడా ‘’చెయ్యి ‘’జారి పోయి మిగిలేది ‘’హాండ్ ఫుల్ ‘’మందే  .మోడీ పాలన కాలం పెరిగిన కొద్దీ వచ్చే ప్రమాదం ఇదే కాంగీ కి .

డిం –జగన్ అసెంబ్లీలో రెచ్చి పోతున్నాడే ?

టిం –గురివింద తన కింది నలుపును మర్చి పై మెరుపు ,ఎరుపు కు మురిసి పోతుంది .నిజం తెలిసే సరికి మునిగిపోయే ప్రమాదం ఉంది .

డిం  –‘’దాడి’’ దాడి గురించి ?

టిం –జగన్ లొసుగులు తెలిసి ఇప్పుడిప్పుడే బయట పెట్టి దాడి చేస్తున్నాడు దాడి .కొందరికి జ్ఞాన దంతాలు లేట్ గా వస్తాయి శిష్యా .బ్రాహ్మణి గుట్టు రట్టు చేశాడు కదా .ఇక నెమ్మదిగా ఒక్కో చిట్టా విప్పి చిత్తూ చిత్తూ  చేస్తాడు .దానితో ఖజానా ఖాళీ .సభ్యులు మోళీ చేసినట్లు జంప్ జిలానీ .

డిం –వలసలను ప్రోత్సహించద్దని పొన్నాల ఉవాచ ?

టిం –నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష .కొంప ఖాళీ అవుతూంటే ఉక్రోషం ఉడుకు మోటు తనం .ఎవరికైనా తానదాకా వస్తే కాని తెలీదు డింగరీ .

డిం –తెలంగాణా లో తెలుగు దేశం స్థితి ?

టిం –ఎవరూ దేనికీ అతీతులుకారు .ప్రలోభాలు ఎంతవారినైనా లొంగ దీస్తాయి .కాలమే చెప్పాలి దేశం భవిష్యత్తు గురించి .తెలుగు దేశమూ గులాబీలను ఆకర్షించే ప్రయత్నం చేయచ్చు .

డిం –పి వి .ఉత్సవాలు జరిపిస్తాడట గులాబీ నేత .

టిం –అధికారం లోకి వచ్చాక ‘’రావు’’ చెప్పిన మంచిమాట ఇది ఒక్కటే .కాన్గీలు మర్చి పోయిన మన జాతి రత్నాన్ని ,ఆంధ్రుల గర్వాన్ని నెత్తి కేత్తుకొన్నందుకు కే సి ఆర్ అభినందనీయుడు .పివి కి అవమానం జరుగుతున్నా కౌరవ సభలో పెద్దల్లా ఇన్ని వందల మంది ఖద్దరు బాబులు ఒక్కమాట కూడా అధినేత్రికి ఎదురు చెప్పలేక నోరు మూసుకున్న ఫలితాన్ని ఇప్పుడు అనుభ విస్తున్నారు .ఒక రకం గా పి వి భూతం వారిని నిలువ నీడ లేకుండా చేసినట్లు గా ఉంది .కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టాడు జ్ఞాని మాజీ ప్రధాని నరసింహా రావ్ జీ .ఇక ఆపి మళ్ళీ కలుద్దాం డింగరీ

టిం -సరే గురు టింగరి-వస్తా వెళ్ళొస్తా .

      కేవలం లాఫింగ్ కే  నని మరువద్దని మనవి 

మీ -గబ్బిట  దుర్గా ప్రసాద్ – 25-6-14-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫాదర్స్ డే-నాన్న !!!

  శ్రీ రవీంద్రనాధ్ గారు ఎంతో శ్రమించి రచించిన – ప్రవచించిన ఫాదర్స్ డే అంశానికి అభినందనలు —– పితృ దినోత్సవం

 నా భావమైన మరో కోణాన్ని వీక్షించి వ్యాఖ్యానించండి —

                                             నాన్న !!!
  పైపైకి ఎగరేసి – వున్నతముగా వుండమని – పడకుండా పట్టుకున్న నాన్న!
  నా అనే అనుబంధానికి – అసలు రూపం నీవే నాన్న ! 
  వేలు పట్టి నడిపించి – వెన్ను తట్టి ప్రోత్సహించి – లోకమంతా  చూపించి 
  జ్ఞానమెంతో కలిగించి – అన్నీ నీవై నడిపించిన నాన్నా! 
  నీకు వందనం – పాదాభివందనం !
  మీ ఆలన మాకు రక్ష – మీ పాలన మాకు భిక్ష !
  బాధ్యతలను మోస్తూనే – బంధాలను బలపరుస్తు  !
  భాధలను భరిస్తూనే – భుజాలపై మమ్ము మోస్తూ !
  మీ యొదనే – మాకు శయనించే పాన్పు చేస్తూ !  
  మీ అరచేతినే మా పాదాలకు రక్ష చేస్తు ! 
 మా నవ్వులో  మీ అలసట మరచారు  !
 మా మాటల్లో మీ వేదన తుడిచారు ! నాన్నా ! ఓ నాన్న!!
 విద్యలో మాస్థాయికై  – మీ ఆస్థులు తెగనమ్మారు  !
 మాకు వుద్యోగం వచ్చేందుకు – మీ స్వేదం చిందించారు ! 
 మాకు జన్న నిచ్చి-  బ్రతుక నేర్పిన నాన్నా !
 మిమ్ము మరచిన క్షణమున్నదా ? – నాన్నా !
 మిమ్ము వత్సరాని కొక్క రోజు తలవాలా ???
 మాతృ దేవో భవా ! పితృ దేవో భవా ! అన్న భూమి మనది !
 నా పిల్లలు – నీ పిల్లలు కలసి మన పిల్లలపై చేస్తున్న పోరాటంలో!
 ఆరాటం – సంవత్సరానికొక్కమారు కలసి గడిపే ఫాదర్స్ డే కోసం !
 ఆ ఫారినర్స్ జరుపుకునే  “ఫాదర్స డే”  మనకు కావాలా ?
 నా పెళ్ళాం – నా పిల్లలు  అనుకుంటూ – కన్నవారిని శరణాలయాలకు పంపితే  ?
 తాత గతే మీకు _ అని మా బిడ్డలు మాకు చెప్పరా !!
 పుత్రుడైనా – పుత్రికైనా  – నా – అన్నదే నాన్న భావం!
 కలసి వుంటే కలదు సుఖమని మరువకు – కన్నవారిని కష్టాలలో విడువకు !
 ఇది ! ఈ కర్మ భూమి పంచిన ధర్మం !!
 ఇది ! మరో త్రికాల వేదం – ఈ బందా నాదం !!
                    —- బందా వేంకట రామా రావు, 9393483147.

 

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -5

ఉపాఖ్యానాలలో కధలు

వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన కర్మ ప్రాధాన్యతను తెలియ జేయటానికి లేక దోషాన్ని వివరించటానికి అనేక ఉపాఖ్యానాలను వేదం చెప్పింది .ఈ ఉపాఖ్యానాలు బ్రాహ్మనాలలో ఎక్కువగా కనిపిస్తాయి .వాటి వివరాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

ఐతరేయ బ్రాహ్మణం

ఋగ్వేదానికి చెందినా ఐతరేయ బ్రాహ్మణం లో చాలా ఉపాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది ‘’శునస్షేఫోపాఖ్యానం ‘’.ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుడు పుత్ర సంతానం లేక చాలా కాలం పరి తపించి తనకు పుత్రుడే కనక పుడితే వరుణ దేవుడికే సమర్పించి క్రతువు చేస్తానని మొక్కుకొన్నాడు .వరుణానుగ్రహం తో ‘’రోహితుడు ‘’అనే పుత్రుడు కలిగాడు .పుత్రజననం జరగ్గానే వరుణుడు ప్రత్యక్షమై వాగ్దానం ప్రకారం  ఆ కొడుకును తనకు ఇచ్చేయమని అడిగాడు .బారసాల ముచ్చట తీరాక ఇస్తానని రాజు వాయిదా వేశాడు .పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే దంతాలోచ్చినతర్వాత అన్నాడు .ఇలా చాలా సార్లు వరుణుడు రావటం రాజు వాయిదా వేయటం జరిగింది .

రోహితుడికి యుక్త వయస్సు వచ్చి గురుకులం లో చేరి శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చి ఇంటికి తిరిగి వచ్చాడు .తండ్రి కొడుకుకు తాను వరుణుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేశాడు .తాను బలి పశువు కావటానికి ఒప్పుకోక ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్లి పోయాడు .మొక్కు తీర్చ లేదనే కోపం తో వరుణుడు హరిశ్చంద్రునికి జలోదర వ్యాధి వచ్చేట్లు చేశాడు .వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి తగ్గక మంచం పట్టాడు .కొడుకు రోహితుడికి విషయం తెలిసి తండ్రి దగ్గరకు వచ్చాడు .ఇంద్రుడు అడ్డ గించి వనవాసమే మంచిదని చెప్పి అరణ్యాలకు పంపించేశాడు .

ఇలా మూడు సార్లు జరిగింది .తండ్రి రోగాన్ని పోగొట్టటానికి వేరెవరైనా పురుషుడిని ఉంచి యాగం జరిపించాలని రోహితుడు తలచాడు .తిరిగి తిరిగి అజీ గర్తుడు అనే ఆయన దగ్గరకు వచ్చాడు రోహితుడు .అతనికిఉన్న ముగ్గురు కొడుకులలో ఒకరిని తనకిమ్మని వేడుకొన్నాడు .పెద్దకొడుకును ఇవ్వటానికి తండ్రి, చిన్న కొడుకునివ్వటానికి తల్లి ఒప్పుకోలేదు .ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకొన్న రెండవ కొడుకు శున స్షేఫుడు తను ఎవరికీ చెందడు కనుక  రోహితుని వెంట వెళ్ళాడు .అజీ గర్తునికి ప్రతి ఫలం ముట్ట జెప్పి రోహితుడు శునశ్శేఫుడి ని తీసుకొని వెళ్ళాడు .యాగానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి .నరుడైన పునస్షేఫుడిని యూప స్తంభానికి కట్టెయ్యటానికి ఎవరూ ముందుకు రాలేదు .చివరికి తండ్రి అజీ గర్తుడే కొడుకును యూపానికి కట్టేసి వంద ఆవులను తోలుకు పోయాడు .ఇంకో వంద గోవులను ఇస్తే కొడుకును చంపటానికి కూడా తండ్రి సిద్ధ పడ్డాడు .శునశ్శేఫుడు ఆర్తి తో వరుణుడిని ప్రార్ధిస్తే ప్రత్యక్షమై యూప స్తంభంనుంచి తప్పించి హరిశ్చంద్రుని వ్యాధిని పోగొట్టాడు .శునశ్శేఫుడు తండ్రి వెంట ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు .విశ్వామిత్ర మహర్షి దగ్గరకు చేరాడు .ఆ మహర్షి శునశ్శేఫుడిని కుమారుడి గా స్వీక రించాడు .ఈ ఉపాఖ్యానం లో వివిధ వ్యక్తుల మనస్తత్వాల ఆవిష్కరణ జరిగింది .దేవతా స్తుతి రూపాలైన అనేక రుక్కులు ఈ ఉపాఖ్యానం లో ప్రాధాన్యత పొందాయి .

నేనెవరిని ?

సంస్కృతం లో ‘’కః ‘’శబ్దానికి ఎవడు అని బ్రహ్మ అని రెండు అర్ధాలున్నాయి .ఐతరేయ బ్రాహ్మణం లో ఉన్న ఒక ఉపాఖ్యానం లో దీనికి సంబంధించిన కద ఉంది .ఇంద్రుడు వృత్రాసురుడిని చంపి ,లోకాలన్నీ జయించి ,ప్రజా పతి  వద్దకు వచ్చి’’ నేను అన్ని ప్రాణుల కంటే గొప్ప వాడిని ‘’అని గర్వం గా చెప్పాడు .అప్పుడు ప్రజాపతి ‘’నా గొప్పతనాన్ని నువ్వు లాగేసుకొంటే మరి నేను ఎవర్ని ?’’అని ప్రశ్నించాడు .దానికి ఇంద్రుడు ‘’ప్రజా పతీ !స్వాత్మ ను నువ్వు కః ‘’అని అన్నావు కనుక ఇక నుంచి నువ్వు ఆ శబ్దం తోనే పిలువ బడుతావు ‘’అన్నాడు .అప్పటి నుంచి కః అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్ధం కూడా వచ్చి చేరింది .ప్రజా పతి గొప్ప తనాన్ని కూడా హరించటం చేత ఇంద్రుడు మహేన్ద్రుడయ్యాడు .దేవతలు ఇంద్రుని కోసం ‘’మాధ్యందిన సవనం ‘’’’నిష్కేవల్య శస్త్రం  ‘’లను ప్రత్యేకం గా కేటాయించారు .కనుక ఉపాఖ్యానం లో మాధ్యందిన సవనానికి నిషేవల్య శాస్త్రానికి మహాత్మ్యాన్ని కలిగించే శక్తి ఉన్నట్లు సూచిస్తోంది .

కౌశీతకీ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు

ఇందులో ప్రజా పతి తపస్సు అనే ఉపాఖ్యానం ఉంది. సృష్టి చేయాలని ప్రజాపతి తపస్సు చేశాడు .ఆ తపస్సులో నుంచి అగ్ని వాయువు ,ఆదిత్యుడు చంద్రుడు ,ఉషస్సు జన్మించారు .మొదటి నలుగురు తపస్సు చేశారు ఉషస్సు ద్వారా వెయ్యి కళ్ళు ,వేయి పాదాలు గల మహా పురుషుడు ఉద్భ వించాడు .ఈ ఉపాఖ్యానం  సృష్టి ప్రారంభం లో ఉన్న తత్వాలను గురించి తెలియ జేస్తుంది .

అగ్నికి ఆజ్యం కధ –రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కంటికి కనిపించకుండా పరారయ్యే అగ్ని ఋతువులలో ప్రవేశించి దాక్కున్నాడు .దేవతలు అసురులను జయించి అగ్ని కోసం వెతుకు తున్నారు .యమ ,వరుణులు అగ్నిని పట్టుకొన్నారు .అగ్ని  కోరికను మన్నించి అతనికి వరం గా ‘’ప్రయాజాను యాజలు ‘’,ఆజ్యం ‘’(నెయ్యి )ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చారు .అందుకే లోకం లో ‘’అగ్నికి ఆజ్యం ‘’సామెత పుట్టింది .అగ్ని ప్రయాజాను యాజ లతో బాటు నెయ్యినీ కోరుకోన్నాడని దీన్ని బట్టి తెలుస్తోంది .ఈ ఉపాఖ్యానం లో వృత్రాసుర వధ ,సూర్యోత్పత్తికూడా ఉన్నాయి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-14-ఉయ్యూరు

.

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహైతీ బంధువులకు శుభ వార్త

సాహైతీ  బంధువులకు శుభ కామనలు అంతర్జాలం లో  వెయ్యేళ్ళ ఆంగ్ల కవిత్వం లో సుప్రసిద్ధులైన ,ప్రభావ శీలురైన123మంది కవుల పై ”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘శీర్షిక తో నేను రాసిన ’55 ఎపిసోడ్ లను పుస్తక రూపం లో సరసభారతి  13వ ప్రచురణ గా తీసుకు రావటానికి సరస భారతికి అత్యంత ఆప్తులు ,అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ముందుకు వచ్చి ముద్రణ ఖర్చు కు పూర్తీ బాధ్యతను వహించారని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది . ఈ పుస్తకాన్ని  మైనేని వారి అభ్యర్ధన మేరకు వారి బావ గారు ప్రముఖ ఆంధ్రాంగ్ల సాహితీ వేత్త,విశాఖ వాసి  డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి (రావి శాస్త్రి గారి తమ్ముడు ) గారికి , శర్మ గారి90వ జన్మదినోత్సవం రోజున అంకిత మిచ్చి ఆవిష్కరణ  చేస్తున్నాం .ఈ పుస్తకానికి ముందు మాట , సమీక్ష .రాయటానికి తమ విలువైన సమయాన్ని శర్మ గారిపై ఉన్న అభిమానం తో వెచ్చించటానికి ప్రముఖ వరంగల్ వైద్యులు ,ప్రసిద్ధ రచయిత డాక్టర్ శ్రీ లంకా శివ రామ ప్రసాద్ గారు అంగీకరించారని తెలియజేయటానికి ఇంకా సంతోషం గా ఉంది .పుస్తకమ్ తయారవుతోంది .వివరాలు తరువాత తెలియ జేస్తాను  . మీ -దుర్గా ప్రసాద్

 

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

ఎంఎల్ సి శ్రీ కొల్లూరి

యువకుడి గా ఉండి విద్యార్ధుల కోసం ఒక మాస పత్రిక పెట్టాలనే ఆలోచన రావటమే అరుదు .వచ్చిన ఆలోచనను ‘’తెలుగు విద్యార్ధి ‘’గా రూపొందించి అవిచ్చిన్నం గా అరవై ఒక్క ఏళ్ళుగా నడపటం అనితర సాధ్యం .అందులో విద్యార్ధులకు ఉపాధ్యాయ అధ్యాపకులకు బాల బాలికలకు అవసరమైన అన్ని విషయాలు ఉండేట్లు చేయటం, ప్రభుత్వం జారీ చేసే అన్ని జి వొ లనుప్రచురించటమే కాదు,  ప్రశ్నలు జవాబులు శీర్షిక పెట్టి చదువరుల ప్రశ్నలకు ఆర్ధిక రంగ నిపుణులైన స్వర్గీయ మామిడి పూడి వెంకట రంగయ్య గారు ,ప్రముఖ న్యాయ మూర్తి స్వర్గీయ ఆవుల సాంబశివ రావు గారి లాంటి వారితో సమాదానాలిప్పించటం తో కొత్త వరవడి సృష్టించారు .’’పద బంధం ‘’ను ఏర్పరచి స్వర్గీయ వేమూరి జగపతి రావు గారితో దాదాపు ముప్ఫై ఏళ్ళు నిర్వహింప చేయటం ఒక సవాలు .విద్యారంగం లో వచ్చే ప్రతి మార్పుకూ ప్రాముఖ్యమిచ్చి వ్యాసాలూ రాయించి అవగాహన కల్పించారు .సైన్సులో సాంకేతిక విషయాలలో శ్రీ సి వి సర్వేశ్వర రావు వంటి ఉద్దండులచేత ప్రత్యెక వ్యాసాలూ రాయించటం మరో ఆకర్షణ .శ్రీ సోమంచి రామం శ్రీ గీతా సుబ్బారావు వంటి వారితో పిల్లలకధలు గేయాలూరాయించి  కార్టూన్లు వేయించి వారికీ అభిరుచి కలిగించటం ముఖ్యవిషయమే .సాహిత్య వ్యాసాలూ ప్రముఖుల పై ప్రత్యెక వ్యాసాలూ పత్రికకు అదనపు ఆకర్షణ .సంపాదకీయం లో  సమకాలీనతకు అద్దం పట్టారు .స్వర్గీయ చలసాని సుబ్బారావు గారు  ఎన్నో సంవత్సరాలు తెలుగు విద్యార్ధితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నవారు .అలాగే శ్రీ మాది రాజు రామ లింగేశ్వర రావు గారి ఆర్టికల్స్ విలువైనవి గా ఉండేవి .యై ఎస్ హయాం లో తెలుగు విద్యార్ధికి స్వర్ణోత్సవం ,కిరణ్ కుమార్ పాలనలో రజతోత్సవం అత్యుత్సాహం గా జరిపించటం ఆయనకే సాధ్యమైంది .ఎన్నో విలువైన గ్రంధాలయాలను తక్కువ ధరకే ముద్రించి అందు బాటులోకి తెచ్చారు .దాతలను,శాశ్వత చందా దారులను ప్రోత్సహించి  ప్రోత్సహించి గ్రంధాలయాలకు విద్యా సంస్థలకు తెలుగు విద్యార్ధి అందేట్లు చేయటం ఆయనకే సాధ్యమైంది .చందాలు కట్టినా కట్టక పోయినా ,ప్రతి హైస్కూల్ కు పత్రికను ప్రతి నెలా పంపేవారు .ఆయనే తెలుగు విద్యార్ధి సంపాదకులు శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు . ఎనభై ఒక్క ఏళ్ళు నిండు జీవితాన్ని గడిపి ఈనెల పందొమ్మిదవ తేదీ మరణించి విద్యా సాంస్కృతిక రంగాలకు తీరని లోటు కల్పించారు .

బందరు జాతీయ కళా శాలలో బి ఇ డి చేసి జై హింద్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడు గా  చేరి శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులైనప్పుడు ,మహా వైభవం గా కోన సాగుతున్న కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ నుండి శ్రీ కొల్లూరి ని శాసన మండలికి1968 లో  అభ్యర్ధిగా ప్రకటిస్తే, పిన్నమనేని ఆ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని కొల్లూరి గెలుపుకు అవిశ్రాంత కృషి చేసి గెలిపించారు .జిల్లా అంతటా కొల్లూరి పిన్నమ నేని పర్యటించి ఉపాద్యాయ అధ్యాపకులనందరిని కలిసి ,వారివోటు ను అభ్యర్ధించి గెల్పు సాధించారు .గిల్డు కూడా ఎక్కడా వోటు జారిపోకుండా జాగ్రత్త పడి  గెలుపుకు విశేషం గా తన వంతు కృషి చేసింది .ఆ నాటి ప్రత్యర్ధి శ్రీ పి శ్రీరామ మూర్తి గారు .ఏంతో అనుభవం ,అండ దండలున్న వారు .ముఖ్యం గా కమ్యూనిస్టు సానుభూతిపరుల మద్దతున్న వారు .వారిపై కొల్లూరి పోటీ అంటే అదొక పెను సవాలు .ఆ సవాలును అధిగమించి కొల్లూరి అందరి ఆదరాన్ని అభిమానాన్ని పొంది నిద్రాహారాలు లేకుండా తిరిగి గెలిచారు .అంతే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేకుండా పోయింది .రెండవ సారి కూడా గిల్డు కొల్లూరినే అభ్యర్ధిగా ప్రకటించి పిన్నమనేని సహకారం తో గెలిపించుకోన్నది .అలాగే మూడవ సారి ఎన్నికకూ కొల్లూరి  అభ్యర్ధి అని టీచర్స్ గిల్డ్ ప్రకటించి ఎన్నో అడ్డంకుల్ని అదిగ మించి ,ఆ నాటి విద్యా మంత్రి శ్రీ మండలి కృష్ణా రావు గారు శ్రీ రారామ మూర్తి గారికి ఫుల్ సపోర్ట్ చేసి ప్రతి స్కూలూ తిరిగి ప్రచారం చేశారు. అయినా పిన్నమనేని అండ దండల తో ఉపాధ్యాయ అధ్యాపకుల అభిమానం తో కొల్లూరి మూడో సారి గెలిచి రికార్డ్ సృష్టించారు . టీచర్స్ కు ఇళ్ళ స్తలాలు ఇప్పించటం లో గిల్డు ,కొల్లూరి చేసిన కృషి మర్చిపోలేనిది .

పిన్నమనేని కొల్లూరి లను క్రిష్ణార్జులనే వారు .విద్యా రంగం పై వారిద్దరికీ ఉన్న మక్కువ ప్రతి విషయం లోను కని  పించింది .గిల్డ్ తరఫున లెక్క లేనన్ని సెమినార్లు నిర్వహించారు .ఎందరో ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించారు .టెక్స్ట్ పుస్తకాలు మారినప్పుడూ ,ప్రశ్నా పత్రాలను మార్చినప్పుడు నిర్వహించిన ఓరిఎంటేషన్  క్లాసులు ణ భూతో ణ భవిష్యతి .గిల్డు కొల్లూరి ,సూచించిన సూచనలు అన్నీ ప్రభుత్వం ఆమోదించి అమలు చేసింది .కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ వీరిద్దరి నాయకత్వం లో రాష్ట్రానికే దిశా నిర్దేశం చేసింది .ఇక్కడ జరిగిన మార్పులనే ఇతర జిల్లాల వారూ  ఆచరించారు. ప్రభుత్వమూ గిల్డ్ సూచనలకు అధిక ప్రాధాన్యమిచ్చింది . వేతనాలస్థిరీకరణ, కొత్త వేతనాల స్కేల్స్ విషయం లో,పి ఆర్ సి .సంఘం తో చర్చించి న్యాయ బద్ధ మైన స్కేల్స్ సాధించటం లో వీరి చొరవ మరువ లేనిది . గిల్డ్ సూచనలకు విలువ ఉండేది .గిల్డ్ వార్షికోత్సవాలకు వీరిద్దరూ సర్వశ్రీ పి వి నరసింహా రావు ,భవనం వెంకట్రాం చనుమోలు వెంకట్రావు కోమటి భాస్కరరావు ,వంటి వారిని ఆహ్వానించి  సమస్యలను తెలియ జేసి వారి నుండి స్పష్టమైన హామీలను రాబట్టిన సందర్భాలెన్నో .రాయల సీమ ఏం ఎల్ సి .శ్రీ భుజంగ రావు ,లెఫ్ట్ పార్టీ నుంచి ఎన్నికైన సింగరాజు రామకృష్ణయ్య ,అలాగే తూర్పు గోదావరి నుంచి ఎన్నికైన ఏం ఎల్ సి ,గుంటూరు నుండి ఎన్నికైన శ్రీ మన్నవ గిరిధర రావు ,గ్రాద్యుఎత్ల్ నుండి ఎన్నికైన శ్రీ జూపూడి యజ్న నారాయణ మొదలైన వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడి మండలిలో సమస్యలపై సంయుక్తం గా స్పందించటం లో కొల్లూరి పాత్ర అభినందనీయం .కొల్లూరి ,పిన్నమనేని కలిసి ఆలోచించి గిల్డ్ సహకారం తో బెజవాడలో శ్రీ కాకాని టీచర్స్ గిల్డ్ హోమ ను ,బందరులో కొల్లూరి ,గిల్డ్ కలిసి పిన్నమ నేని ఉపాధ్యాయ సేవకు గుర్తింపుగా ‘’పిన్నమ నేని టీచర్స్ గిల్డ్ హోమ్ ‘’నిర్మించి వారిద్దరికీ గౌరవాన్నికల్గించి ఉపాధ్యాయులకు ఉపయోగ పడేట్లు చేశారు .ఇది గిల్డ్ సాధించిన అద్భుత విజయం దీనికి వీరిద్దరి సేవలూ చిరస్మరణీయాలే .ఉపాధ్యాయ  అధ్యాపకులు చందాలు వేసుకోవటమే కాకుండా ఫాన్లు లైట్లు కుర్చీలు వగైరా సామగ్రిని అందించి గిల్డ్ హోమ్ లకు సౌకర్యాలు కలిగించి తమ బాధ్యత, కర్తవ్యాలను నేర వేర్చారు .పిన్నమనేని కొల్లూరి ల జంట సాధించిన విజయాలు అనితర సాధ్యం .అందుకే’పదవిలో ఉన్నా లేకున్నా ’ చైర్మన్ పిన్నమనేని’’ అని ఆయన్ను’’ ఏం ఎల్ సి కొల్లూరి ‘’అని  ఈయన్ను ఆప్యాయం గా పిలుచుకొని సంబర పడే వారు. కృష్ణా జిల్లాకు అదొక స్వర్ణ యుగం ..కృష్ణా జిల్లాలో విద్యా వైద్య ఆరోగ్య ,ఉపాధ్యాయ అధ్యాపక సంక్షేమానికి వీరిద్దరి కృషి చిరస్మరణీయం .ఆంద్ర విశ్వ విద్యాలయం  సిండి కేట్  సభ్యులుగా శ్రీ కొల్లూరి  ఎంపికై విద్యా రంగానికి సేవలందించారు .అమెరికాలో విద్యా బోధనను అధ్యయనం చేయటానికి పర్యటన చేసి సమావేశం పెట్టి అక్కడి విద్యారంగం తీరు తెన్నులను వివరించారు .జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుడు అధ్యాపకుడు కొల్లూరికి పరిచయమే .ఖద్దరు పంచ లాల్చీ పైన ఉత్తరీయం భారీ పర్సనాలిటి ,నవ్వు ముఖం యెర్రని దేహ చ్చాయ చుక్కల్లో చంద్రుడుగా కొల్లూరి కని  పిస్తారు ఆ డ్రెస్ కోడ్ మార్చనే లేదు .సెకండరీ గ్రేడ్ టీచర్ల ప్రమోషన్ ఆగి పోతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు సీనియర్ బియి డి టీచర్ల చేత సెలవు పెట్టించి ,ఆ ఖాళీలలో ప్రోమోశాన్లు ఇచ్చి ఆడుకున్న పెద్దమనసు ఇద్దరిదీ .ఏంటి రామారావు వచ్చి శాసన మండలి రద్దు చేయగానే కొల్లూరి మళ్ళీ జైహింద్ హైస్కూల్ లో తెలుగు పండితుడిగా చేరి టీచింగ్ నోట్స్ రాస్తూ పాఠాలు చెబుతూ పేర్లు దిద్ది తన బాధ్యతను సక్రమంగా నేర వేర్చి ఆదర్శం గా నిలిచారు ఇది చరిత్రలో లిఖింప దగిన అంశం .

కొల్లూరి తో నా పరిచయం నేను సైన్స్ టీచర్ గా 1963లో చేరినప్పటి నుంచీ ఉన్నా ,1968ఏం ఎల్ సి ఎన్నిక నుంచీ బాగా సన్నిహితులమయ్యాం .రెండు మూడు ఎన్నికలకు ఆయన తో కలిసి కారులో జిల్లా అంతా పర్య టించి ప్రచారం చేశాం .బందరు హిందూ హైస్కూల్ లెక్కల మేష్టారు ప్రముఖ కదా రచయిత స్వర్గీయ ఆర్ ఎస్ కే మూర్తి గారి తో నన్ను ,కాటూరు లోని హరి గౌతమేశ్వర రావు గారిని కారులో పంపి ప్రచారం చేయించారు కొల్లూరి .మూడో సారి ఉయ్యూరు మండలం లో అత్యధిక వోట్లు పడేట్లు నేనూ కాంతారావు ,ఆంజనేయ శాస్త్రి పిచ్చిబాబు జ్ఞాన సుందరం రామ కృష్ణా రావు హిందీ రామా రావు గారు కలిసి కృషి చేసి గెలిపించాం .ఒక సారి  కారు వేసుకొని మా  ఇంటికి వచ్చికూర్చుని టిఫిన్ చేసి మాతో కలిసి ప్రచారమూ చేశారు .1970లో తెలుగు విద్యార్ధి లో నేను ‘’భావ కవితకు మేస్త్రి కృష్ణ శాస్త్రి ‘’అనే మొదటివ్యాసం రాశాను .అ తర్వాత చాలా రాశాను .గత పదేళ్లుగా కోటేశ్వరరావు గారు నాకు తరచూ ఫోన్ చేసి సైన్స్కు సంబంధించిన  ఇంగ్లీష్ ఆర్టికల్స్ పంపి అనువాదం చేయమని కోరేవారు .అలానే చేసి పంపేవాడిని .పత్రికలో వచ్చేవి .’’ప్రసాదు గారూ !తెలుగు విద్యార్ధిని మీరందరి ప్రోత్సాహం తోనే నడప గలుగుతున్నాను .మీరు తప్పకుండా రాస్తూ ఉండండి ‘’అని చెప్పే వారు .

కొల్లూరి ఒక రకంగా నాకు ‘’గాడ్ ఫాదర్ ‘’.ఉయ్యూరు లో ఉద్యోగించటమంటే దిన దిన గండమే ఏ అర్ధ రాత్రి ఎవరొచ్చి లేపి ఇంకో చోటికి తోసేస్తారో ననే భయం .నాకు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే ఏవ గింపు .స్థానిక నాయకులెవారి దగ్గరికి వెళ్ళే వాడిని కాను .నా బలం గిల్డు ,కొల్లూరి .ప్రతిసారీ నన్ను బదిలీ చేయటం చేసిన నాలుగైదు నెలల్లో తిరిగి రావటం జరిగేది .నన్ను మళ్ళీ ఉయ్యూరు తెచ్చె  బాధ్యత కొల్లూరి తీసుకొనే వారు .కృపా రావు గారనే కాటూరు సెకండరి గ్రేడ్ మాస్టారి అబ్బాయికి బియి డి సీట్ రాకపోతే నాకు ఆయన చెబితే మేమంతా వెళ్లి కొల్లూరి ని కలిసిసీటు ఇప్పించాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని వెంట బెట్టుకొని కరేస్పాం డెంట్  ఇంటికి తీసికెళ్ళి సీటు ఇప్పించారు కొల్లూరి .మేము ఆయన్ను అలా నమ్మాం. ఆయన మాకు అలా అభిమానం తో పనులు చేసేవారు .బందరు వెడితే టిఫిన్ భోజనం వాళ్ళింట్లోనే చేసేవాళ్ళం నేనూ కాంతారావు ,శాస్త్రి .ఆయనకు రెండు సార్లు హార్ట్ ప్రాబ్లెం వచ్చి ఆస్పత్రిలో ఉంటె రెక్కలు కట్టుకొని వాలి రాత్రి పదింటి దాకా ఉండి అప్పుడు ఇళ్ళకు చేరుకొనే వాళ్ళం .అప్పుడు ఫోన్ సౌకర్యం మాకు లేదు .ఎప్పుడైనా ఆయన్ను కలవాల్సి వస్తే తెలిసిన వాళ్ళింటికి వెళ్లి ఫోన్ చేసి ఫలానా అప్పుడు వస్తున్నాం అని చెప్పే వాళ్ళం .స్పాట్ వాల్యుయేషన్ సమయం లో సాయంత్రాలలో ఒకటి రెండు సార్లు ఫోర్ట్ రోడ్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి పలకరించేవారం .పదవిలో ఉండి అవినీతికి లంచాలకు అతీతం గా వ్యవహరించిన ఏకైక వ్యక్తీ కొల్లూరి .శీల  ప్రాధాన్యత ఉన్న విశిష్ట వ్యక్తీ .ఏ వ్యసనమూ లేని అపూర్వ వ్యక్తీ .అందుకే మాకు ఆయనంటే అమితమైన ఇష్టం .మా కాంతారావు కు బి యిడి క్లాస్ మేట్ .అందుకని కాంతారావు కొల్లూరిని ‘’మా గురువు ‘’అనేవాడు .అంత చనువుండేది వారిద్దరికీ .తెలుగు విద్యార్ధి పని కూడా చేసి పెట్టేవాడు .

మచ్చలేని నాయకులుగా కృష్ణా జిల్లాలో ఆదర్శ జంటగా పిన్నమనేని ,కొల్లూరి నిలిచారు. రెండేళ్ళ క్రితం చైర్మన్ పిన్నమనేని మరణిస్తే ఇప్పుడు ఏం ఎల్ సి కొల్లూరి చని పోయి విద్యా రంగానికి లోటు కలిపించారు .శ్రీ కొల్లూరి కోటేశ్వర రావు గారి ఆత్మకు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని ప్రకటిస్తున్నాను .కొల్లూరి కుమారులు పత్రిక బాధ్యతను సక్రమంగా నిర్వహించి తెలుగు విద్యార్ధిని వెలుగు విద్యార్ధిగా తీర్చిదిద్దాలనిఆశిస్తున్నాను’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-14-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం

నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు నోరు మూసుకు కూర్చుంటాడు పాపం వాడే పలకరించి మొదలు పెట్టాడు ‘’ప్రజలు ఇంత దారుణం చేస్తారని ఊహించ లేదు బావో ‘’అన్నాడు ఎత్తుకొంటూనే .’’ఏమైందిరా ఏదో కొంపలు మునిగి పోయినట్లు ఆ వెధవ యేడుపేమిటి?’’అన్నాను చిరాగ్గా .’’అదేమిటి? /వందేళ్ళ కాంగ్రెస్ ను ఒక’’ టీ అమ్మే’’ వాడు కూకటి వ్రేళ్ళతో పెకలించి పారేస్తే నీకీమీ చీమ కుట్టినట్లుకూడా  లేదా బావా?’’అన్నాడు .’’ఎవరు తీసుకొన్న గోతిలో వారే పడుతారు అనే సామెత తెలుసా?’’అన్నా .తెలుసు దానికి దీనికీ లంకేంటి ?అన్నాడు .’’అవున్రా రెండేళ్ళ నుంచీ పేపర్లూ చానెళ్ళు నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయికదా కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోతుందని ,వాళ్ళు చేసిన అక్రమాలూ అవినీతి లంచ గొండితనం కుంభకోణాల బరువు పాపాల పుట్టా అక్రమాల చిట్టాతో నిలువు లోతు గోతిలో పడిపోతారనీ ఎవ్వరూ కాపాడలేరనీ ?’’అన్నాను మండి .’’పాపం బుద్ధి మంతుడిలా తలా తోకా ఆడిస్తూ మౌన పరబ్రహ్మ లా రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని నిర్వికార నిరాకార బ్రహ్మలా’’ సోనీ జపం చేస్తూ’’ ఉండే ఆర్ధిక శాస్త్ర వేత్త నాయకత్వానికి ఇంతపరభావమా నేను భరించలేను బావా “?అని ఏడ్చి నంత పని చేశాడు .’’ఒరే బ్రాహ్మీ !పిల్లి కళ్ళు  మూసుకొని పాలు తాగుతుంటే జనం చూడ టం లేదనుకొంటే ఎలా నాయనా “”?అన్నాను .’’ఈ సామేతేమిటో విడమర్చు’’ అన్నాడు .’’అన్ని అక్రమాలు జరుగుతున్నా ద్రుత రాస్త్రుడి లాగా గుడ్డిగా కిమిన్నాస్తి గా ఉండిపోతే ప్రజలు ఎంతకాలం సహిస్తారు?’’అన్నాను .’’అర్ధం కాలా ‘’’’అన్నాడు నోరెళ్ళ బెట్టి  దూర దర్శాన్ యాడ్ లో రైతు భార్యలాగా .’’’’దేశానికి నాయకత్వం వహించే నాయకులే కరువైనారు .సోనియా కరుణా కటాక్షాలు ఇక పని చేయవని అందరికి తెలిసి పోయింది .కనుక ప్రత్యామ్నాయం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు .అవకాశం వచ్చింది .గుద్ది పారేశారు. చెత్తను ఊడ్చేసి అవతలకు తోసేశారు .ప్రజల ఓపికా సహనం కొంతకాలమే .దాటితే కోట్లు ఖర్చు చేసినా ఓట్లు రాలవు .ఇదీ భారత ప్రజాస్వామ్యం లో ఓటరు మహాశయుడు సరైన సమయం లో కొట్టిన చెంప దెబ్బ .’’అన్నాను .’’చెత్తా –ఊడుపు ‘’అన్నావు మరి ఆ చీపురు ఆయనా ఊడ్చుకు పోయాడుగా ?అన్నాడు అవున్రా కేర్జీవాల్ పై ఏదో క్రేజీ ఉందనుకొని భ్రమ పది దిగాడు .దిల్లీలో కాంగ్రెస్ ను అంతకాగి నిప్పులు తొక్కినా కోతిలా రోజుకో మాట మాట్లాడి నమ్మకం పోగొట్టుకొన్నాడు తనకు ఆలిండియా శీను లేదని తెలుసుకో లేక పోయాడా చీపురు కట్టాయన అందుకే దాన్నీ ఆయననూ ఊడ్చిపారేశారు ‘’అన్నాను

‘’సరేకానీ !రాహుల్ ఉన్నాడు ,ప్రియాంకా ఉంది వీళ్ళు కూడా ఏమీ ఊప లేక పోయారేమిటి?’’అన్నాడు ‘’.అవతల వాడు సరైన వ్యూహం తో ,వాగ్దాటితో దేశ ప్రయోజనమే లక్ష్యం గా ,సార్వభౌమాదికారమే ధ్యేయం గా ,పార్టీని ప్రజల్ని ఒప్పించి ప్రేరణ కలిగించి యువతలో ఆశలు కల్గించి ఈ అవినీతి భ్రస్టు కుళ్ళు పట్టిన వ్యవస్థను పునాదులతో సహా కూల్చి పారేస్తేకాని భవిష్యత్తు లేదనే నమ్మకం కలిగించాడు .దాన్ని నమ్మారు అతని సమర్ధతను నమ్మారు అతని వాగ్ధాటికి ముగ్ధులయ్యారు అంతే ఇంక వాళ్ళకేమీ కానీ పించలా .కొండలు దూది పిందేలైపోయాయి. గడ్డిపరకల్లా ఖాదీ షరాబులు ,శాల్తీలు యెగిరి పోయారు .తిరుగు లేని మేజార్టీనిస్తే కాని ఇక లాభం లేదని బి జే పి కే పార్టి మేజార్టీనిచ్చి చరిత్ర సృష్టించారు .ఇది ప్రజా విజయం .నాయక గణ అధికార గర్వ ఖర్వం ‘’అన్నాను .’’బావా !మోడీ పూనిన వాడిలాగా ఆ ప్రవాహ ఝారి ఏమిటి ?నాకే ఆశ్చర్యమేస్తోంది నిన్ను చూస్తుంటే “”అన్నాడు .’’చరిత్ర పునరావ్రుత్తమౌతతుంది అంటారు తెలుసా .ఇందిర ఎమర్జెన్సి పెట్టినప్పుడు ఎందరు పెద్దలు చెప్పినా పేడ చెవిని పెడితే జయ ప్రకాష్ నారాయణ నేతృత్వం లో జనతా పార్టీ ఏర్పడి ఇందిరా గర్వాన్ని నాశనం చేసి ఆసేతు హిమాచలం ఓట్లతో జనతాకు జనతా జనార్దానుడైన జయ ప్రకాష్ కు అధినాయకుడైన మొరార్జీ భాయ్ కి పట్టం కట్టారు .ఇప్పుడూ అదే జరిగింది .మోడీ నే దేశ సంరక్షకుడు అనే నమ్మకమే గెలిపించింది .పార్టీకూడా అతాని అడుగు జాడల్లో నడిచింది.ఆద్వానీ అలిగినా జస్వంత్ బీరాలు పోయినా నితీష్ ‘’ఇష్ ఇష్ ‘’అన్నా లాలూ చేతుల దగ్గరికి కాళ్ళ బేరానికి వెళ్ళినా ఎవరి పప్పులూ ఉడక లేదు . ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ భేదమే కనీ పించలేదు .హిందూత్వం ఆక్రమిస్తుందని గుండెలు బాడుకొన్న కమ్యూనిస్టులకు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ ను రాహుల్ పుట్టిన రోజు కానుకగా ననభై నాలుగు సీట్లకే పరిమితం చేశారు .’’అన్నా.  ‘’బావా ! నీ ఉద్రేకం చూస్తుంటే భయమేస్తోంది .’’అన్నాడు బ్రాహ్మి .

‘’మనరాస్త్రం లో తెలంగాణా ఇచ్చినా కొంప  కోల్లేరయ్యిన్దెం?’’అని వాడి ప్రశ్న .’’పార్టీని కలిపెస్తాడని గులాబీ రంగు ఆయన తో ,పార్టీకి అండగా ఉంటాడని లక్ష కోట్ల అవినీతి ఆయన్ను జైల్లోంచి తప్పించి బెయిలిప్పించి కేసులు మాఫీ ప్రయత్నం చేస్తే జనం గుడ్డిగా నమ్ముతారా ?విభజన ప్రక్రియ సవ్యం గా జరిపించార? తెలుగు రాని’’ చేవటాయల ‘’పెత్తనం తో క్రూరం గా హీనం గా హేయం గా చీల్చి పబ్బం గడుపుకొన్నారు .గులాబీ ఆయన దిల్లీలో గులాబి పూలిచ్చి ఇక్కడికొచ్చి ముళ్ళు గుచ్చాడుకంటిలో .అసలాయన్ను ఆయన భార్యే నమ్మదంటారు మరి కాంగీ అధినాయక గణం యెట్లా నమ్మిందో ?/జగనూ శీను అర్ధం చేసుకొని దూరం గా జరిగి స్వంత బాణీ వాణీ మొగిన్చేసరికి బిత్తర పోయారు .రెండు పక్కలా వాచి పోయింది. ఆంధ్రాలో అడ్రస్ గల్లంతు తెలంగాణలో చావు తప్పి కన్ను లొట్టా .బీరాలు పలికే రఘు వీరా ,జలయజ్ఞం లో ‘’తెల్ల  పంచ కట్టాయన ‘’కు తోడ్పడి కోట్లు నోక్కేశాడని చెప్పుకొనే పొన్నాల నాయకత్వం పై ప్రజలకు విశ్వాసమే లేదు .పార్టీ గుర్తు తో పోటీచేసి భస్మాసుర హస్తం పెట్టుకొన్నారు .ఆంధ్రాను పునర్నిర్మించే ధైర్యం ఓపికా సాహసం వ్యూహం ఉన్న వాడు చంద్ర బాబే అని నమ్మి ఎక్కించారు అనుమానం  లేకుండా. దీనికి మోడీ ‘’పవనమూ’’తోడైనాయి అని నా జవాబు .. ‘’బావోయ్ !నువ్వు చాలా ఆవేశం గా ఉన్నావ్ అక్కనడిగి .కాస్త మజ్జిగ తెచ్చిస్తా కూల్ బావా కూల్ ‘’అని లోపలి కెళ్ళి వాడూ పుచ్చుకొని నాకూ తెచ్చిచ్చాడు .

‘’ కొత్త ప్రభుత్వాలు ఎలా పని చేస్తున్నాయి బావా ?’’ ‘’ప్రారంభం అదిరింది .మోడీ చాలా హుందాగా ఉన్నాడు సమర్దుల్నే పెట్టుకొన్నాడు .కాని ‘’ముండే ‘’మరణం పార్టీ కి ఇబ్బందే .కెసిఆర్ లో ఉద్రేకం తగ్గలేదు ‘’పందెం కోడి’’ గా వ్యవహరిస్తున్నాడు .ప్రతిదానికీ ‘’లొల్లి ‘’చేయటం ముఖ్య మంత్రికి తగదని పిస్తోంది .బాబు లక్షలాది జనం మధ్యలో ప్రమాణం చేయటం నాకు అంత నచ్చ లేదు .అత్యుత్సాహం అని పించింది .కోడెల సమర్దుడే కాని స్పీకర్ హోదాకు తగిన హుందాతనం ఉన్నవాడని నేననుకోను .నోటి తొందర మనిషి .కాని బుద్ధప్రసాద్  ఆశ్చర్యం గా డిప్యూటీ స్పీకర్ అవటం అందరికీ ఆనందం కలిగించే విషయమే .అజాత శత్రువు గా పేరున్నవాడు .కాని ఆయనకు సాంస్కృతిక రంగం పై అధికారం ఇచ్చి ఉంటె ఇంకా బాగుండేది .ఆయన తెలుగు దేశం లో చేరిన రాత్రి నేను ఫోన్ చేసి అభినందించి త్వరలో మంత్రి కావాలని కోరుకొంటున్నానని చెప్పాను. మళ్ళీ డిప్యూటీ అయిన రోజు ఫోన్ చేసి అభినందించి నేను అనుకొన్నది జరిగింది అన్నాను నవ్వుతూ నిజమే నన్నారు .’’

‘’డబ్బా ఆపి భవిషత్ గురించి చెప్పు బా ‘’అన్నాడు .’’ఏముందిరా .మోడీ అయినా బాబైనా గులాబీ ఆయన అయినా ప్రతి అడుగు జాగ్రత్త గా వేయాలి .అఫెన్స్ లో ఉండాలేకాని డిఫెన్స్ లో పడరాదు ‘’అనగానే ‘’అంటే’’అన్నాడు .’’బడ్జెట్ ముందే రైలు చార్జీలు భారీగా పెంచటం మంచిదికాదు .దీని వల్ల మోడీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది .అది సత్ సాంప్రదాయం కాదు .కొంత సమయం తీసుకొని ఉండటమో కొద్దిగా పెంచట మో  చేసి ఉండాల్సింది .’’అనగానే ‘’నల్ల ధనం మాట ఏమిటి బా ?’’అన్నాడు .’’అది ‘’అంత వీజీ ‘’కాదు .వాగ్దానాలకు ఆచరణకూ ఎప్పుడూ అంతరం ఉంటుందని గుర్తించాలి .’’అన్నాను .’’రుణ మాఫీ’’? మళ్ళీ ప్రశ్న ‘’తప్పక చేయాల్సిన అంశమే దీనికి బ్యాంకులు కేంద్రమూ పూర్తిగా సహకరించాలి .అప్పుడే సాధ్యం .’’అన్నాను .’’జగన్ భవిష్యత్తు ‘’?అడిగాడు .’’మంత్రి వర్గ ఉప సంఘం వేశారు కేసులు మళ్ళీ తెరుస్తారు .పాపం హైదరాబాద్ రావాలన్నా బెజవాడ రావాలన్నా కోర్టు పర్మిషన్ తప్పదేమో .అదీగాక ‘’అదిగో వచ్చేస్తున్నాడు ‘’అని చర్లపల్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారని చానెళ్ళలో పత్రికలలో కార్టూన్లు కూడా చూశాం కదా ‘’అన్నాను .’’చెప్పులాయన సంగతి ?’’అని అనుబంధ ప్రశ్న .’’పాపం మునిగాడు ముంచారు కూడా పార్టీ వాళ్ళు .ప్పుడు ఏ పార్టీ చెప్పులూ లేకుండా తిరుగుతున్నాడు  ‘’సుప్రీం కోర్టులో  విభజన పై కేసు ?’’ఇంకో లకోటా .’’కేసు అయితే వేశారు కాని డబ్బులు పెట్టి ఎవరు కేసును ముందుకు నడిపిస్తారో తెలియటం లేదు .జరగాల్సిన విభజన అయ్యే పోయి రెండు రాష్ట్రాలు ఏర్పడి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు .దీన్ని మళ్ళీ చుట్ట చుట్టేయటం సాధ్యమా ‘అని పిస్తుంది చూద్దాం కాలమే తేల్చాలి దీన్ని ‘’అన్నాను.

‘’ ఇటలీయమ్మ’’ సంగతి ?మరో ప్రశ్న .బి జెపి ,టిడిపి జాగ్రత్తగా పని చేస్తే కాంగీని,సోనియాను అటు దేశం లోను ఇటు రాష్ట్రం లోను మార్చే పోతారు .కాంగ్రెస్ కు తులసి తీర్దానికి స్టేజి దాటి పోయింది .  తమిళనాడు ,బెంగాల్ లాగా ఆంధ్రా లోను అడ్రస్ ఉండదు .కాని అంత జాగ్రత్తగా ఉంటారా అని అనుమానం .ఆద్వానిజీ కి రాష్ట్రపతి యోగం ఉంది .దానికింకా టైం ఉంది .అది దక్కితే సమస్యలుండవు .ఇక్కడ కాన్గీకి జగనే గతి .వదిలి పోయిన వారు పోగా మిగిలిన వారిని సోనియా ఇవాళ కాక పొతే రేపు లాగేసు కొంటుంది .అప్పుడే దానికిక్కడ గతి .కమ్మీలు ఇక ప్రజా జీవితం లో చెల్లు బడి కారు .’’.చిరు విషయం ‘’అన్నాడు .’’తనను బల వంతం గా కాన్గీలో కలిపేసుకొన్నందుకు ‘’టిట్ ఫర్ టాట్’’గా దగ్గరుండి ప్రచారం చేసి మరీ ఓడించానని స్వగతం చెప్పుకొంటున్నాడని విన్నాను. అదీ నిజమేనేమో నని పించింది ‘’.  అనగానే బ్రాహ్మి బుర్ర వేడెక్కి లోపలి కెళ్ళి చెంబేడు ఐసు నీళ్ళు తాగి నాకు కనపడకుండా అదే పోత పోయి జంప్ జిలానీ అయ్యాడు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-6-14-ఉయ్యూరు

 

Posted in రాజకీయం | Tagged | Leave a comment

మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ 

తెలుగు విద్యార్ధి సంపాదకులు ,మాజీ ఏం ఎల్ సి స్వర్గీయ కొల్లూరి కోటేశ్వర రావు గారికి సరసభారతి 23-6-14-సాయంత్రం ఏర్పాటు చేసిన సంతాప సభ DSCN0012 DSCN0013 DSCN0014 DSCN0015 DSCN0016 DSCN0017 DSCN0018 DSCN0019 DSCN0020 DSCN0021 DSCN0022 DSCN0023

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు సుభాష్ చంద్రారెడ్డి. హైదరాబాద్, దాని పరిసరాల్లో రోజు రోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంచడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను కట్టే పనికి పూనుకున్నారు. ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్, నిఫ్ట్ వంటి చోట్ల వీటిని నిర్మించి అక్కడి నీటి కొరతను గణనీయంగా తగ్గించారు. సిటీలో పలుచోట్ల తవ్వేసిన బోర్‌వెల్స్ నిరుపయోగంగా ఉండడం చూసి వాటిని ఎలాగైనా వినియోగంలోకి తెచ్చి భూగర్భజలాల మట్టాన్ని పెంచాలనే తపనతో ఈ పనికి పూనుకున్నారాయన. ప్రధానంగా హైదరాబాదు, దాని పరిసరాలలో ‘ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్’ పద్ధతి ద్వారా భూగర్భజలాలను పెంచడంలో ఆయన కృషి ఆదర్శనీయం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా.

‘మాది హైదరాబాదే. నేను బి.ఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సు చేశాను. ప్రభుత్వోద్యోగిని. మట్టి అన్నా, నీరు అన్నా నాకున్న ఆసక్తే వాటి పరిరక్షణపై పనిచేయాలనే ఆలోచనను నాలో రేపింది. నీటిని, మట్టిని సరిగా సంరక్షించుకున్నప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని,అప్పుడే మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలడని నేను నమ్ముతాను. కానీ దురదృష్టమేమిటంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండిట్లోనూ ఈ రెండు సహజవనరులూ అత్యధికంగా దుర్వినియోగానికి, దోపిడీకి గురవుతున్నాయి.
కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా. అందుకే పూర్వంలా భూమిలో నీళ్లు పుష్కలంగా ఉన్నట్టు జలవనరులను సమృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ దోహదంచేస్తుందని భావించాను. సిటీలో నిరుపయోగంగా పడి ఉన్న ఎన్నో బోర్‌వెల్స్‌ని సైతం దీని ద్వారా ఉపయోగించుకోగలిగితే భూగర్భ నీటి మట్టాన్నిపెంచగలగడమే కాదు నీటి లోటును సులభంగా అధిగమించవచ్చు అన్నది నా గాఢాభిప్రాయం.
ఇందుకోసం ‘స్మరణ్ ‘అనే స్వచ్ఛందసంస్థను ఏర్పాటుచేశాను. మేం చేపట్టిన పని ఎంతో బృహత్తరమైంది. ప్రభుత్వ సహాయసహకారాలు లేకుండా ఈ పని చేయడం అంత సులువేం కాదు. ముఖ్యంగా హైదరాబాదులో ఈ పనికి జిహెచ్ఎంసి, వాటర్‌వర్క్స్ వంటి విభాగాల తోడ్పాటు కావాలి. అప్పుడు సిటీలో భూగర్భ జలవనరులను వృద్ధిచేయడంలో వండర్స్ సృష్టించవచ్చు. ప్రస్తుతం మా స్వచ్ఛందసంస్థ ద్వారా నగరంలోని వివిధ అపార్ట్‌మెంట్లలో, పెద్ద పెద్ద కార్పొరేట్, విద్యాసంస్థల్లో, హాస్పిటల్స్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను చేపట్టాము. ఇప్పటి దాకా సిటీలో దాదాపు 40 చోట్ల ఈ పని చేశాం.ఈ స్ట్రక్చర్లు వేసిన చోట మాత్రమే కాకుండా దాని పరిసరాల్లో కూడా భూగర్భజలాల స్థాయి పెరిగింది.

హైదరాబాదులో అయితే ప్రస్తుతం 1000 అడుగుల నుంచి 1500-2000 అడుగుల దాకా బోర్ తవ్వితే గానీ నీళ్లు పడని పరిస్థితి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలామందికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి అవగాహన లేదు. నిజానికి ఇళ్లు, ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్‌సంస్థలు ఏవైనా సరే కట్టేటప్పుడే ఇన్‌వర్స్ బోర్‌వెల్ (ఐnఠ్ఛిటట్ఛ ఆౌట్ఛఠ్ఛీజూజూ) రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మించుకోగలిగితే నీటి కొరత సమస్య ఎదురవదు. పర్యావరణం దెబ్బతినదు. ఖర్చు తక్కువ అవుతుంది. ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాదులో 90 శాతం వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లో కలిసిపోతోంది లేదా రోడ్డు మీదకొచ్చేసి నిలిచిపోయి వృథా అయిపోతున్నాయి.
మేం విజయవంతంగా చేసిన ప్రాజెక్టుల్లో మాదాపూర్‌లోని నిఫ్ట్్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఒకటి. అక్కడ ఇన్వర్స్ బోర్‌వెల్ మెథడ్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిలో నాలుగు బోర్లు ఏర్పరిచాం. అక్కడ ఒకప్పుడు రోజుకు 15 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు నీటి ట్యాంకర్ల అవసరమే లేని క్యాంపస్‌గా అది నిలిచింది. మరొకటి నేచర్ క్యూర్ హాస్పిటల్. అక్కడ నిత్యం జరిగే రకరకాల చికిత్సలకు బోలెడు నీరు అవసరం. వాళ్లు కూడా ఈ పద్ధతిని చేపట్టక ముందు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు నీటి ట్యాంకర్లతో పనిలేకుండా తమ చికిత్సలను వాళ్లు నిరాటంకంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే సెయింట్ థెరిస్సా స్కూల్‌లో ఇన్వర్స్ బోర్‌వెల్ పద్ధతిలో రెండు బోర్‌వెల్స్ , 13 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించాం. ఈ పద్ధతి ద్వారా సిటీలో ఎండిపోయిన బోర్లన్నింటినీ ఎంతో ఉపయోగకరంగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా గచ్చిబౌలి, నిజాంపేట, మణికొండ, మియాపూర్‌లలో కూడా మేం కొన్ని వర్క్సు చేశాం. ఈ పద్ధతి ద్వారా నూరు శాతం భూగర్భ జలాల పెరుగుదల సాధించవచ్చు. హైదరాబాద్‌లో ఉన్నది ప్రధానంగా రాతినేల. ఇలాంటి చోట సాధారణ రీఛార్జ్ పిట్స్ వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువగా ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఈ పద్ధతిలో పిట్ ఒక్కటే కాకుండా బోర్‌వెల్ కూడా ఉంటుంది. ఇక్కడది రాతి నేల కావడంతో ఈ పద్ధతి సరైంది. అంతేకాదు పిట్స్ ద్వారా అయితే పరిమిత ప్రయోజనం ఉంటుంది. కానీ ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ విధానంలో బోర్‌వెల్ కూడా కలగలిసి ఉండడంతో ప్రయోజనాలు కూడా ఎక్కువే.

ఈ విధానం ద్వారా రూఫ్‌టాప్ ఏరియాలోని వర్షపు నీరుని రెయిన్ వాటర్ అవుట్‌లెట్స్ ద్వారా హార్వెస్టింగ్ పిట్‌లోకి వదలాలి. వర్షపు నీటిలో ఎలాంటి దుమ్ము ధూళి రాకుండా ఫిల్టర్ చేసే సిల్ట్ ట్రాప్స్ కూడా ఉంటాయి. అలా శుభ్రమైన వర్షపు నీరు బోర్ ద్వారా భూగర్భ జలాలలో ఇంకుతాయి. ఈ విధానం మొత్తం ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో చేస్తారు. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉన్నచోటే కాకుండా చుట్టుపక్కల భూగర్భజల నీటిమట్టం కూడా దీనివల్ల పెరుగుతుంది. వర్షపు నీరు వృధా అవడమంటే మానవజీవనానికే ప్రమాదం. నీటిమట్టం నిలకడమీదే మన ఉనికి కూడా నిలబడి ఉంటుంది…’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment