శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –28

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –28

63—‘’స్మిత జ్యోత్స్నా జాలం ,తవ వదన చంద్రాస్య పిబతాం –చకోరాణా మాసి దతి రసతయా ,చంచు జడిమాఅతస్తే ,శీతాంశో రమృతలహరీ రామ్ల రుచయః –పిబన్తి స్వచ్చందం ,నిశి ,నిశి ,భ్రుశం కాంచి కధీయా ‘’

తాత్పర్యం –చండికా !నీ ముఖ చంద్రుడి చిరు నవ్వు అనే వెన్నెలను త్రాగే చకోర పక్షులకు ,త్రాగి ,త్రాగి ,అతి మాధుర్యం వల్ల  అరుచి కలిగింది .అందుకే అవి పులుపు మీద ఇష్టం తో చంద్రుని అమృత కిరణాల పొంగునే బియ్యం కడుగు గా భావించి ,ఇష్టం వచ్చి నంత వెన్నెల రాత్రులలో తృప్తి గా తాగుతున్నాయి  .

శ్రీ దేవి ముఖచంద్ర మంద హాస కాంతులు చంద్ర కిరణ మాధుర్యం కంటే గొప్పవి అని భావం .

64—‘’అవిశ్రాంతం ,పత్యుర్గున గణ కదా మరేద ణ జపా –జపా పుష్పచ్చాయా ,తవ జనని ,జిహ్వా జయతి సా

 యదగ్రాసీనాయాఃస్పటిక ద్రుషదచ్చచ్చ విమయీ –సరస్వత్యా మూర్థిహ్ పరిణ మతి ,మాణిక్య వపుషా ‘’

తాత్పర్యం –కదంబ వన వాసినీ !నీ జిహ్వాగ్రం మీద ఆసీన అయిన సరస్వతీ దేవి యొక్క శుద్ధ స్పటిక మణి కాంతి చేత ప్రసిద్ధ మైన స్వరూపం ,పద్మ రాగ మణి ఎరుపు రంగుగా మారుతోంది .ఎందు కంటే ఆమె కు ఆశ్రయ మైన నీ నాలుక నిరంతరం  ,నీ భర్త అయిన శివుని గుణ గణ కద ను ,జపం లాగా విని ,విని ,జపా పుష్పం యొక్క కాంతి వంటి కాంతి కలదై  ,యెర్రని రంగు కలదై ప్రకాశిస్తోంది .

 విశేషం –శ్రీ దేవి జిహ్వ తాను ఎరుపు రంగు తో ఉండటం మాత్రమె కాదు ,తటస్తు లైన వారిని కూడా ఎరుపు రంగు కల వారిని గా చేస్తోందని భావం .శ్రీ దేవి నాలుక మీద నిత్య నివాసి అయిన సరస్వతి దేవి ‘’మాణిక్య వపుష ‘’గా పరిణ మిస్తోందని అర్ధం .

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-10-12-

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు జీవితంలో రామలీలా అమృతం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మల్లికార్జునుడు ఆదికవి ఎందుకు కాడో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27

 

 61—‘’అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి –త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం

        వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం –సంరుద్ధ్యా యత్తాసాం  ,బహిరపి ,సముక్తా మణిధరః ‘’

    తాత్పర్యం –హిమ గిరి తనయా !!పర్వత వంశ పతాకమా !పార్వతీ దేవీ !నీ ,నాసాదండం మాకు ,మా సంబంధీకులకు ,కోరిన కోర్కెలను తీర్చు గాక .ఆ నాసా దండం లోపల ముక్తా మణులున్నాయి .లోపల ఉన్న ఆ మణుల చేత ,ఎడమ నాసిక నుండి ,వెలుపలికి వచ్చే ,గాలి వల్ల బయట కూడా ముక్తా మణులను ధరించి నట్లుంది .

      విశేషం –వెదురు లో ముత్యాలు ఉంటాయని లోక ప్రసిద్ధి .ముక్కులో ముత్యాలు లేక పోతే ,శ్వాస తో ఎలా బయటకు వస్తాయి ?అంటే ,ఎడమ నాసిక ముత్యాన్ని ధరించింది అన్న మాట .నాసిక నువంశ దండం గా చెప్పటం లో కోమలత్వం ,రుజుత్వం ,రామణీయకత గల నాళాలున్నాయని అర్ధం .

 62—‘’ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి ,దంత క్చదరుచెహ్ –ప్రవక్ష్యే ,సాదృశ్యం ,జనయతు ఫలం విద్రుమ లతా

       న బింబం ,తద్బిమ్బ ప్రతి ఫలాన ,రాగా దరుణిమాం –తులా మధ్యా ,రోదుంకధమివ ,నలజ్జేత కలయా ‘’

           తాత్పర్యం –వర దండ మండిత కరా !చక్కని పలువరుస గల తల్లీ !స్వభావ సిద్ధం గా కెంపు రంగుతో ఉన్న నీ పెదవుల కాంతి ని,దేనితోను పోల్చటానికి వీలు లేదు .పోల్చదగినది వేరేది లేదు కూడా .ఎందు కంటే ,నీ క్రింది పెదవి కి సహజ కాంతి ఉంది .అలాంటి కాంతి –పగడపు తీగేకు పండు పండితే ,ఎలా ఉంటుందో అలా ఉంటుంది .కాని ,దానికి పగడం  పుట్టటం లేదు .అది పండ్లను ఇవ్వటమూ లేదు .దొండ పండు తో పోలుద్దాం అంటే దానికి కాంతి సహజం కాదు .దొండ పండుకు బింబం అని పేరు .అంటే ప్రతి బిమ్బించేది .దానికి ఆ పేరు రావటానికి కారణం నీ ఆధర బింబం యొక్క అనుగ్రహం వల్లనే కనుక నీ క్రింది పెదవి తో పోల్చదగిన వస్తువేదీ ప్రపంచం లో లేదు .నీ క్రింది పెదవి నిరుప మాన మైన శోభ కలది .

              సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24-10-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో బామ్మ

             అమెరికా లో బామ్మ 
     ఏడు సార్లు బ్రతిమాలి ఎనిమిదో సారి మా బామ్మ ను అమెరికా కు రావటానికి ఒప్పించ టానికి వసుదేవుడి పరిస్తితి అయింది .అష్టమ గర్భం దేవకికి ని లి ఛి నట్లు చివరి ప్రయత్నం ఫలించి బామ్మ వచ్చింది .అదీ ఆవిడ పెట్టిన ష రతులన్నిటి కి ఓ.కే.చేసిన్తర్వాతే కదిలింది .”నాకెందుకురా ! హాయిగా కృష్ణా ,రామా అనుకుంటూ పల్లెటూ ల్లో పడి  ఉన్నాను .నీ దయ వల్ల  అక్కడా అన్నీ అమర్చి పెట్టావు .ఇంత ఉడ కేసుకొని తిని హాయిగా ఇరుగమ్మా , ,పోరుగమ్మ లతో లోకాభి రామాయణం తోనూ,ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడుకొంటూ గడుపుతున్నాను.రోజూ ఫోన్లో మీరిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారాయే .అదేదో కైపు అదేరా నా కు తెలుసా చచ్చా స్కైఫ్ కూడా  పెట్టిన్చావాయే .పక్కింటి వారమ్మాయి దాన్ని పెట్టి మిమ్మల్ని చూపించేది ..మిమ్మల్ని రోజూ చూస్తూనే ఉన్నానుగా .  ఇంత కంటే ఈ జీవికి ఈ వయసు లో కావాల్సిందేముంది ?”అని ఎప్పటి కప్పుడు దాట  వేసేది .ఆవిడ అట్లా అంటే మాత్రం నేను ఊరు కుంటానా ?పాస్ పోర్టు వీసా ఏర్పాటు చేసే ఉంచా.వాటికీ అంత తేలిగ్గా ఒప్పుకో లేదు .అయినా నేను ఒట్టేషాను .  .దాని తో భయ పడి  బయలు దేరింది .అదీ గాక మా ఇంటి ప్రక్కన నా స్నేహితుడు రవి మా వూరి వాడే .అతను ఇండియా వెళ్తున్నాని చెబితే బామ్మను అతని తో తీసుకొచ్చే ఏర్పాటు చేశాను ..ప్రయాణానికి ఏ ఇబ్బందీ లేకుండా రవి అన్నీ తానే అయి ,చూసుకొన్నాడు .ఎక్కువ ఫ్లైట్లు మారకుండా ఏర్పాటు చేశాము . స్వంత గడ్డ  ను వదిలి బామ్మ అమెరికా గడ్డ పై కాలు పెడుతున్నందుకు నాకు మా ఆవిడ అండా లు కూ  చాలా సంతోషం గా ఉంది . 
             బామ్మ సంగతి కొంత చెప్పాలి ఆవిడ ఆనాడే తొమ్మిదో క్లాసు చదివింది .ఇంగ్లీష్ అర్ధమవుతుంది .కొంత కూడా బలుక్కొని చదవనూ గలదు .లోక జ్ఞానం ఉంది పుష్కలం గా .వంటింటి వైద్యం లో దిట్ట .మా పొలాల అజమాయిషీ ,   అన్నీ చూసేది .మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి బామ్మ .చక్కని సంభాషణా చాతుర్యం ఆమెది .అందరు ఆమె మాట అంటే మహా ఇష్ట పడ   తారు .సాయం చేసే స్వభావం .నేనంటే మరీ ప్రాణం .మా ఆవిడను కూడా ఎంతో ఆప్యాయం గా చూసుకొంటుంది  .ఆవిడకూ బామ్మ అంటే క్రేజే .వారిద్దరూ కలిస్తే ,నన్ను మరిచే పోతారు .ఈ సంగతులన్నీ చెప్పే సరికి మా బామ్మ ఫ్లైట్ రానే వచ్చింది .ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాం .యే ఇబ్బందీ లేకుండా లగేజి అంతా వచ్చింది .బామ్మ ను వెంట పెట్టు కొని రవి కనిపించాడు .నా కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయి .ఆండాళ్ళు కూ  అదే స్తితి .బామ్మ దగ్గరకు పరి గేట్టుకొంటు వెళ్ళాం .’’ఒరి  డింగరీ !అంత ఆనందంఎందుకురా? /అని నన్ను దగ్గరకు తీసుకుంది .మా ఆవిడను పొదివి పట్టుకోంది  .’’బామ్మా !ప్రయాణం బాగా జరిగిందా ?/అని అడిగాను ‘’బానే జరిగిందిరా కన్నా !అదేమిటిరా ?ఎక్కడో 35000అడుగుల ఎత్తులో దాదాపు గంటకు తొమ్మిది వందల కిలో మీటర్ల వేగం లో విమానం వెడుతున్నా మనకు ‘’దున్న పోతు మీద కూర్చున్నట్లుంది’’కాని ,కదిలి నట్లే లేదేమిట్రా  ?ఆశ్చర్యం గా ఉంది . .ఒరే! ఆ వాయు వనితలు అంతంత మర్యాదలు చేస్తుంటే ,యే తల్లి కన్న పిల్లలో అంత సంస్కారం ఉన్న వాళ్ళు గా ఉన్నారని తెగ ఇదై  పోయాను .బుగ్గలు గిల్లి వాళ్ళను అభినందిన్చాన్రా .పాపం వాళ్ళు డ్యూటీ గా పని చెయ్య లేదురా .ఎంతో బాధ్యత గా పని చేస్తున్నార్రా. “’అంది .నెమ్మదిగా కారు లో సామాను చేర్చి ఇంటికి బయల్దేరాం .

 

        దారిలో ‘’బామ్మా ఎలా ఉంది  అమెరికా ?’’అన్నాను …”బాగుంది .అంతా పధ్ధతి ప్రకారం వుందని పిస్తోంది .ఆ రోడ్లేమిటి రా అంత బాగున్నాయి?/రెండు వైపులా పచ్చని చెట్లు ,పూల మొక్కలు మనసు లాగేస్తున్నాయి .ఒళ్ళు అలవ కుండా ప్రయాణం అంటే ఇదే నేమో” ?అన్నది .మొత్తం మీద బామ్మ కు కూడా అమెరికా పై ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఉన్నందుకు సంతోషించాం .రవి తీసుకొన్న శ్రద్ధకు బామ్మ చాలా సార్లు మెచ్చుకోంది  ‘’ఒరే అవధాన్లూ !నువ్వైతై, అతనంత శ్రద్ధ చూపించే వాడివి కాదురా నిజం .అతని అమ్మ కడుపు చల్లగా మంచి కుర్రాడు దొరికాడు మన ఊరి వాడే అవటం మనకు తెలిసిన వాడవటం ఇంటి ప్రక్కే కాపురం అవటం నీ అదృష్టం ‘’అని రవి ని ప్రశంసించింది .అతను ఇబ్బంది పడి  పోతున్నాడు .’’బామ్మ గారూ !మీ మనవడు ఒకటి నేనోకటీ నా .?అతనెంతో నేనూ అంతే “’అన్నాడు వినయం గా .కారు ఝామ్మని వెళ్తూ ఇంటికి చేరింది .రవికి థాంక్స్ చెప్పి బామ్మ ను ఇంట్లోకి తెసుకు వెళ్ళాం .

           కింద భాగం లో గదిలో బామ్మ కు పక్క ఏర్పాటు .దేవుడి గది అన్నీ ఉన్నాయి .అమాంతం గా ‘’ఒరే ! కాళ్ళు కడుక్కోవాలి నీళ్ళు  ఎక్కడ  /అంది’’.’’బామ్మా ఇక్కడ కాళ్ళు కడుక్కోరు .పక్కనే బాత్ రూం ఉంది పంపు తిప్పిది ,వేడి నీళ్ళు ,చల్లనినీ ళ్ళువస్తాయి   కావాలంటే కాసిని నీళ్ళు నెత్తినా ,కాళ్ళ మీద చల్లుకో ‘’అన్నా .అప్పుడే బామ్మ మూతి బిగిసింది .’’ఇదేనా సంబడం “’అంది .స్నానం చేసి భోజనం తిన్నది .ఆ రోజు విశ్రాంతిగా పడుకోంది  .

          బామ్మ ఉండేది రెండు నెలలే .అందుకని ఏమేమి చూపించాలో అన్నీ ముందే రాసుకొని ఏర్పాట్లు రెడీ చేసుకొన్నాం .ముందుగా దేవాలయ దర్శనం చేయిద్దామని పొద్దున్నే కార్య క్రమాలు అయిన తర్వాతా బయల్దేరాం .దారిలో ఒక లారీ లాంటిది కన పడింది దాని మీద అక్ష రాలు చదివి బామ్మ ‘’మీ కోసం మేము కంటాము ‘’అని రాసున్దేమిట్రా  దాని మీద? ‘’అంది .ఇదేమిటి చెప్మా అని చూశా .’’.. we deliver for you ‘’అన్న మాటలు కనీ పించాయి .బామ్మా అది సామాన్లను చేర వేసేది’’ .మీ సామాన్లు చేర వేస్తాం’’ అని అర్ధం .అన్నాను .’’హమ్మయ్య ‘ఏదో అనుకొన్నాను ‘’అంది .దేవాలయం లో అంతా యే.సి.ఉండటం చూసి ‘’ఒరే  దే వుడి కి చలి వేయదా  ?’’అంది నవ్వుతూ ”అది లేక పోతే దేవుడే ఉండలేదు భక్తులూ ఉండరు ‘’అని చెప్పాను .ముసి ముసి నవ్వులు నవ్వింది బామ్మ .’’పూజార్లు అందరు మన వాళ్ళేరా  ! మంత్రాలు అవీ బాగా చెబుతున్నారు .నిర్వహణ బాగా ఉందిరా ‘’అని మెచ్చింది .అక్కడే దేవస్తానం కాంటీన్ ఉంటె వెళ్లి టిఫిన్ తిని కాఫీ తాగాం .’’ఒర్ అవతారం !’’తీర్ధం స్వార్ధం అంటే ఇదే నను కొంటారా కష్టపడి గుడికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తి ని ఆత్మా రామున్ని  సంతృప్తి పరుచుకున్తున్నార్రా ‘’అంది .

          ఇంట్లో గదులన్నీ పరిశీలించి చూసింది .అన్నీ గాజు తలుపులు .వాటికి వెల్తురు కోసం ఏర్పాట్లు ”.ఒరే ! వాటినేమంటారు ?”అని అడిగింది .’’బ్లైన్డులు ‘’అంటారు ‘’అని చెప్పా .”అందరిళ్ళ  లోను ఇలానే ఉంటాయా ”?మళ్ళీ ప్రశ్న .”ఆ ‘’అని నా సమాధానం ‘’అయితే భగవాన్లూ !అమెరికా అంతా బ్లైన్డులు అ న్న మాట ‘’ అన్నది బామ్మా !విపరీతార్ధాలు తీయకు ..వెలుతురూ తగ్గించి పెంచేవి అవి అంతే కాని నువ్వు అను కొన్నట్లు గుడ్డి తనం కాదు .అమెరికా అంతా గుడ్డి వాళ్ళు కాదు ‘’అని సర్దా ను ‘’సర్లేవో !నాకు తెలీదా జోకేశా అంతే ‘’అంది .

        రోడ్డు మీద కనీ పించిన ప్రతిదీ చదివి తనకు తోచిన అర్ధం తో చమత్కరించేది బామ్మ .’’ఒర్ పంతులూ !ఎక్కడ చూసినా బిలవేడ్ అని కనీ పిస్తోంది .ప్రేమంటే అంతా కారు చౌకైన్దేరా “అందో సారి ”.అది రోడ్లకు పేరు” అని చెప్పా..ఫుడ్ ,గాస్ ల  బోర్డులు చూసి ‘’వెంకటాయ్!కడుపు నిండా తినటం ఎందుకు ?అరక్క గాస్ అని పరి గేట్టటం ఎందుకురా ?’’అనేది ‘’బామ్మా ! నువ్వనుకొన్న గాస్ కాదు ఇక్కడ గాస్ అంటే పెట్రోల్  అని అర్ధం .ఫుడ్ అంటే అక్కడ హోటల్ లాంటిది ఉండి కావాలంటే తిన వచ్చు అని .మన లాగా రోడ్డు ప్రక్కల ఇక్కడ హోటళ్ళు హైవే లో ఉండవు .దూరం గా ఉంటాయి ‘’అన్నాను .

            ఒక రోజు కొంచెం ఆలస్యం గా లేవటం వల్ల ఇంట్లో కాఫీ తాగే తీరిక లేక గ్లాస్ లో పోసుకొని కారెక్కి డ్రైవింగ్ లో తాగుదామని బయల్దేరా ‘’ఎరా సన్నాసీ !అంత హళ్ళూ ,ఫెళ్ళూ  ఎందుకు ?నిదానం గా ఇంట్లో తాగి వెళ్ళక ?జుర్రు కుంటూ కారు నడపాలా?మరీ తీరిక లేక పోతోన్దేమిట మ్మా వీడికి అని మా ఆవిడకూ అక్షింతలేసింది .’’ఇక్కదంతే నే బామ్మా !అంతా ముక్కూ నోటా   కుక్కు కోవటమే .తప్పదు .ఒక్కో సారి నీ మనమ రాలు నా ప్రక్కన కార్లో కూర్చుని టిఫిన్ తిని పిస్తూఉంటుంది . .’’అన్నాను .’’చాల్లే సంబడం మహా గొప్ప పోతున్నావు .అలా ముక్కూ నోటా కుక్కు కుంటే అరగద్దా ? /ఆరోగ్యం పాడై తే ఇబ్బంది కాదా ?అని తల అంటింది . .’’ఇక నుంచి చేయన్లేవే బామ్మా ‘’అని సర్ది మా ఆండాళ్ళు ముసి ముసి గా నవ్వుతుంటే బయల్దేరి వెళ్లాను .

          మాది స్వంత ఇల్లు కనుక వారానికో ,పది రోజుల కొ లాన్ లో ని గడ్డి కత్తి  రించుకోవాలి .కత్తిరించే అతను వచ్చి ఒక సారి లాన  మూవ్ చేస్తున్నాడు .బామ్మ కంట పడింది .ఒకతను కత్తిరిస్తే ఇంకో అతను అంచులు సరి చేస్తున్నాడు మెషిన్ మీద బామ్మ నా దగ్గరకు వచ్చి ‘’ఒరేఆంజనేయులూ !జుట్టు కత్తి  రించే వాడోకడూ ,పాపట  తీసే వాడొకడు లా గా ఉందిరా మీ గడ్డి క్రాఫు ను చూస్తె ’’అంది .ఇక్కడంతా ఇంతే అని సర్ది చెప్పాను .

          ఒక రోజు బామ్మ ‘’ఒర్ పక్షీ !ఇన్నిన్ని నీళ్ళు పెట్టి ఈ గడ్డిని పోషిస్తున్నారు ..దానికి మళ్ళీ వారానికో సారి క్షవరం .ఆ నీళ్ళనే యే పంటలకో ఉపయోగిస్తే అమెరికా లో ఆహార సమస్య తీరేది కదా ?గడ్డి కి పెట్టె ఖర్చు పంటలకు పెడిత ఎంతో బాగుండేది ‘’అని ఉచిత సలహా పారేసింది ‘’బామ్మా !ఇది చలి దేశం .అన్ని పంటలూ అన్ని చోట్లా పండవు .చలి తగల కుండా మొక్కలకు చెక్క పొట్టు చుట్టూ కప్పి బతికిన్చుకోవాలి ‘’అన్నాను .’’నీ తెలివి తెల్లారి నట్లే ఉంది  ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో అభి వృద్ధి సాధించిన అమెరికా ఈ చలికీ ,వేడికి అన్నిటికీ తట్టుకొనే వంగడాలను సృష్టించ లేక పోయిందా ?వాళ్లకు అయిడియా రాలేదేమో ?/’’అంది ‘’బామ్మా నీ ఉపాయం నేను అందరికి తెలియ జేస్తాన్లె .ఏదో పరిష్కారం వస్తుందేమో చూద్దాం ‘’అన్నాను . .బామ్మకు అంత నీరు గడ్డి పెంచటానికి మాత్రమె వాడటం బాధ గా ఉంది  .

     అమెరికా లో ఎక్కడ చూసినా కొలంబస్ పేరు కనపడటం బామ్మ కు బాగా నచ్చింది .’’ఒరే అవతారం !ఎప్పుడో అమెరికా ను కొలంబస్ కనీ పెట్టాడని చదువు కొన్నాం .ఇన్ని వందల ఏళ్ళు అయినా ఆయన్ను మర్చి పోలేదు అమెరికా వాళ్ళు .కృతజ్ఞత గా ఆయన పేరు ఎక్కడ వీలైతే అక్కడ పెట్టారు .సంతోషం గా ఉంది  .మనది భారత దేశం .భరతుడి పేర పిలువ బడే దేశం .కాని ఆ పేరు ఎక్కడా పెద్ద గా మనకు కనీ పించదు  .అదీ వాళ్లకు మనకు ఉన్న తేడా .’’అని బాధ పడింది .

            ఒక సారి మా రవి చంటి పిల్లాడు గుక్క పట్టి అర్ధ రాత్రి ఏడుస్తున్నాడు .మాకేమీ తెలీదు బామ్మ కు మెలకువ వచ్చింది .రవి వాళ్ళింటికి వెళ్లి తలుపు కొట్టింది .వాళ్ళు తలుపు తీశారట .వాళ్ళకేమీ పాలుపోక  ఎమెర్జెన్సీ కి తీ సుకొని వెళ్లాలని అను కొంటు న్నారట.. .బామ్మ వాళ్ళతో ‘’నాయనా కంగారేమీ లేదు .నాకు పది నిమిషాలు సమయం ఇవ్వండి .నా ప్రయత్నం నేను చేస్తా .పది నిమిషాల్లో నిమ్మదించక పోతే మీ ప్రయత్నాలు మీరు చేసు కొండి ‘’అని చెప్పి క్షణాల మీద ఇంటికి వచ్చి తను వెంట తెచుకొన్న మందేదో తీసుకొని వెళ్లి వాడి నోట్లో వేసిందట .అంతే అయిదు నిమిషాల్లో పిల్లాడు తేరుకొని కేరింతలు కొట్టాడట .బామ్మకు రవి దంపతులు కన్నీళ్లు నిండిన కన్నుల తో కృతజ్ఞతలు చెప్పారట .అదీ బామ్మ హస్త వాసి అని మెచ్చారట .ఈ విషయం మర్నాడు పొద్దున్న మేము నిద్ర  లేచిన తర్వాతా రవి ,గాయత్రి వచ్చి చెప్పారు .వాళ్ళ కళ్ళల్లో ఆనందం తాండ వించింది .పిల్లాడిని ఎత్తుకొని బామ్మ ‘’భడవా ఖానా !ఎంత  కంగారు పెట్టిన్చావురా రాత్రి ?ఇంక నీకేమీ భయం లేదు .హాయిగా ఆడుకొంటా వు ‘’అని చేతిలో ఎంతో డబ్బు పెట్టి ముద్దు పెట్టుకొని వాళ్లకు ఇచ్చింది .బామ్మ అంటే దేవత అనుకొన్నారు వాళ్ళు .మేము కూడా .ఇలా బామ్మ ఉన్నంత కాలం అందరికి తల్లో  నాలుక లాగా మెలగుతూ అందరి చేత మా మంచి బామ్మ అని పించుకొంటు గడిపే సింది .రోజూ దసరా లలో ఉదయం పూజా లలితా సహస్ర నామాలతో చేసేది .ప్రసాదం చేసి నైవేద్యం పెట్టేది .సాయంత్రం చుట్టుపక్కల తెలుగు వాళ్ళను పిలిచి లలిత చదివించేది .ఎవరికే చిన్న జబ్బు చేసినా మా బామ్మ దగ్గరకే ముందు వచ్చే వారు .తోచిన వైద్యమేదో చేసి నయం చేసేది .రెండు నెలలు అవగానే బామ్మ ను వదల లేక పోయారందరూ .అందరు ఇళ్లకు పిలిచి బామ్మ ఆశీర్వాదాలు తీసుకొన్నారు గిఫ్టు లు ఇచ్చారు .అందర్నీ ఆశీర్వ దించింది .అందరికి మంచి ,చెడు చెప్పింది ..మన సంస్కృతీ సంప్రదాయాల విలువలను తెలియ జేసింది .పిల్లలకు పద్యాలు స్తోత్రాలు నేర్పింది .అందరు ‘’బామ్మ గారు  మళ్ళీ మీరు రావాలి ‘’అన్నారు ‘’వస్తానర్రా .మా ఆండాళ్ళు నీల్లోసుకొంటే పురిటికి రావాలిగా తప్పదుకదా .’’అంది ఇంతలో మా ఆవిడ నా చాటున నిల బడి ముసి ముసి నవ్వులు నవ్వు తోంది .నా చెవి లో ఏదో చెప్పింది .బామ్మ ఇట్టే గ్రహించింది ‘’అమ్మా ఆన్దాల్లూ !సంతోషం .నీ కడుపు చల్లగా పండంటి బిడ్డను కనాలి .నేను ముందే వస్తాను .మా అవతారం గాడితో జాగ్రత్త వాడికి మెదడు మొకాల్లో ఉంటుంది .నువ్వే అన్నీ చూసుకోవాలి .పిచ్చి సన్యాసి .వాడికి అభిమానం ఎక్కువ .అంతా లోపలే దాచుకొంటాడు .ఒస్తానే అమ్మాయి ,ఒస్తానురా భాగవాన్లూ ! ‘’అని మా ఇద్దరినీ దగ్గరకు తీసుకొని నిండుగా కౌగిలించుకొని ,ఆశీర్వదించింది బామ్మ .బామ్మమళ్ళీ ఇండియా కు వెళ్ళేటప్పుడు తోడు చూసి పంపించాము .సరదా గా గడిపింది .వీలైన ప్రదేశాలన్నీ చూపించాము ఉన్న రెండు నెలల్లో .అన్నీ చక్కగా తెలుసు కొని ఆనందించింది .

                      విజయ దశమి శుభా కాంక్షల తో 

                             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-10-12-ఉయ్యూరు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

 

59—‘’స్పురద్గండా భోగ ప్రతి ఫలిత ,తాటంక యుగళం –చతుశ్చక్రం మన్యే ,తవ ముఖ మిదం మన్మధ రధం

 యమారుహ్య ద్రుహ్యత్సవని ,రధా మర్కెందు చరణం –మహా వీరో మారః ,ప్రమద పతి సజ్జిత వతో ‘’

తాత్పర్యం –ఆర్యా దేవీ !అద్దాల లాగా నిగనిగప్రకాశించే ,నీ చెక్కిళ్ళ పై ,ప్రతి ఫలిస్తున్న ,నీ కమ్మల జంటలు కల నీ ముఖం ఎలా ఉందొ తెలుసా ?/మొక్క వోని ప్రతాపం గల మన్మధుడు ఎక్కిన నాల్గు చక్రాల రధం లా ఉంది.ఆ చక్రాల రదం ఎక్కి ,,అతి లోక వీరుడైన మన్మధుడు సూర్య ,చంద్రులు అనే రెండే రెండు చక్రాలు గల భూమి అనే రధం ఎక్కి ,యుద్ధానికి వచ్చే ,త్రిపురాన్తకుడైన శివుని నే ఎదిరించ టానికి సిద్ధం గా ఉన్నాడు .ఇదంతా నీ కంటి చలువే .లేక పోతే మన్మధునికి అంత ప్రతాపం ఎక్కడిది ?

విశేషం –శ్రీ దేవి ముఖ లక్షణం అనే రధాన్ని ఎక్కి నందు వల్లనే ,మన్మధుడు మహా వీరుడై ,శివుని పై కాలు దువ్వుతున్నాడు అని భావం .రెండు చక్రాల రధం కంటే నాలుగు చక్రాల రధం బాగా నడుస్తుంది .బలం కూడా ఎక్కువ గా ఉంటుంది .అందుకే మన్మధుడు మహా శివుని ఎదిరించ గలిగాడు అనే భావం .మహాదేవుని కామ మోహిత చిత్త వృత్తీ ,ఆ మొహం ద్వారా లభించిన రసికతా ,భగవతి వదనార వింద శృంగార రసార్ద్ర భావం పుష్కలం గా ఉన్నాయి .ఆమే  లావణ్య కాంతి విశిష్టమైనదీ ,లోకోత్తర మైనదీ కూడా .

 60—‘’సరస్వత్యా సూక్తీ రంరుత లహరీ ,కౌశాలహరేహ్ –పిబంత్యా శ్శర్వానీ ,శ్రావణ చులుకాభ్యామవిరాలం

చమత్కార శ్లాఘా ,చలిత శిరసః కుండల గనో—ఝనత్కారై స్తారైహ్ ,ప్రతి వచన సమా చష్ట ఇవతే ‘’

తాత్పర్యం –శార్వానీ !అమృత ప్రవాహం లో ఉన్న మాధుర్యాన్ని ,,మార్దావాన్ని ,మించి పోయే తేనె పలుకులతో ,మధుర పద గుమ్ఫనతో ,నిన్ను సరస్వతీ దేవి స్తుతిస్తుంటే ,చెవులు అనే దోసిళ్ళ తో చక్కగా తాగుతున్నావు .ఆ స్తోత్రం లోని చమత్కారాన్ని శ్లాఘించ టానికి ,నీ శిరస్సు కది లిస్తుంటే ,నీ కర్ణ భూషణాలు అతి చక్కని ఝణత్కారం చేస్తూ ,ఆ స్తోత్రానికి తెల్పే ఆమోదం లాగా అని పిస్తోంది .      విశేషం –‘’తార ‘’అంటే ఓంకారం .పూర్వం అనుజ్న ఇవ్వ టానికి ఓం అనే వారు .బాగా ఉంది అనటానికి కూడా ఓం అనే అలవాటు ఉంది .సరస్వతీ దేవి చేసే ప్రార్ధనకు ,పార్వతీ దేవి మెచ్చి కోలుగా తల ఊపి నప్పుడల్లా ,కుండలాలు ‘’ఓం ‘’అనే నాదం తో అనుజ్న ను ప్రకటిస్తున్నాయట .శ్రీ శారదా దేవి యొక్క వాక్ అనే అమృతాన్ని చెవులు తాగుతున్నాయి .జిహ్వా పాణం కాదు కనుక చెవులే సమాధానం చెప్పాలి .అవి మాట్లాడ లేవు కదా .అందుకే కర్ణాభరణ ఝణత్కార రూపం లో ప్రణవ నాద మైన ఓంకార ధ్వని తో ప్రశంసిస్తోంది 

సశేషం —  

Posted in రచనలు | Tagged | 1 Comment

ప్రజల మనిషి – పిన్నమనేని కోటేశ్వరరావు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి)తా సౌందర్య లహరి -25

  శ్రీ శంకరుల లలి(కవి)తా సౌందర్య లహరి -25

 

57—‘’దృశా ద్రాఘీ యస్యా ,దార దళిత ,నీలోత్పల రుచా –ద్రవీ యామ్సం ,దీనం ,స్నపయ కృపయా ,మామపి ,శివే

అనేనాయం ,ధన్యో భవతి ,నచతే ,హాని రియతా –వనేవా ,హర్మ్యేవా ,సమకర  ,నిపాతో మహికరః ‘’

     తాత్పర్యం –మహేశ్వరీ !చాలా దీర్ఘ మై ,వికసించిన నల్ల కలువల వంటి చల్లని కాంతి తో ఉన్న నీ కడ గంటి చూపు అనే కృపారసం తో ,కడుదీనుడను ,నీకు చాలా దూరం గా ఉన్న వాడను ,సామాన్యుడను అయిన నన్ను తడిసి పోయేట్లు చేసి ,నన్ను ధన్యుడిని చెయ్యి .దీని వల్ల నీకేమీ నష్టమూ లేదు .ఎందు కంటే ,చల్లని వెన్నెల నిచ్చే చంద్రుడు ఉచ్చ ,నీచాలు అని చూడ కుండా ,అందరి మీదా ,తన చంద్ర కల ను ప్రసరించి ,వెలుగు వెల్లువ లతో ముంచెత్తడం లేదా !

         విశేషం –స్వచ్చ మైన అంతఃకరణ ఉన్న వారికి అందరి మీదా సమాన మైన ఆదరణ ఉంటుందని భావం .అది స్వభావ సిద్ధమే .అసలు సృష్టి అంతా శ్రీ దేవికి ఆత్మీయం గా ఉంటె ,తన వాళ్ళనీ ,బయటి వాళ్ళనీ తేడా ఉండదు కదా !చంద్రుడు ఆమె నేత్రాల్లో ఒక భాగం .ఆ చంద్రునికే నర్వ సమభావం ఉంటె శ్రీ దేవికి ఉన్నట్లే .కారణం చంద్రుడు ఆమె నేత్రమే కనుక .ఆమె దృష్టి దీర్ఘ మైనది .అందుకే దూరం గా ఉన్న భక్తుడిని ఆదు కొనటం లో కష్టం లేదని భావం .లీలా మాత్రం గా దృష్టి ప్రసరిస్తే చాలు ఆయాస పడ నక్కర లేదని అర్ధం .చంద్రుడు ఔశదీషుడు .అందుకే వనాల మీద ఎక్కువ కాంతి ప్రసరించి ,మిగిలిన వాని పై తక్కువ ప్రసరించే పక్ష పాతం కల వాడు కాదు .అలాగే అమ్మ కూడా దూరంగా ఉన్న వారనేభేదం లేకుండా సమానం గా కృప చూపిస్తుంది .తాను దీనుడిని ,అయినా తన మీద పక్ష పాతం చూపించినా న్యాయమే .

       శ్రీ దేవి అనాయాసం గా బహుజన ధర్మ బుద్ధి తో ,ఆపన్నులను రక్షించే బుద్ధితో ,అనవధిక మైన కారుణ్యం తో ,రక్షణా భార నిర్వహణ తో ,సత్కర్మ లను చేస్తున్నది అని భావం .

58—‘’అరాళం తే పాళీయాగళ ,మగ రాజన్య తనయే –న కేశా ,మాధట్టే ,కుసుమ శర ,కోదండ కుతకం

     తిరశ్చేనో ,యత్ర శ్రవణ పద ,ముల్లంఘ్య విలసన్ –అపాంగ వ్యాసంగో ,దిశతి ,శర సంధాన దిషణం‘’

         తాత్పర్యం –శరవణ భవ జననీ !వంకర గా ఉన్న నీ కణతల జంట (తమ్మల జంట )మన్మధుని ధనుస్సు యొక్క  విలాసం గా అని పిస్తోంది .ఎందుకంటె ,నీ కనుల కటాక్షప్రసారం అడ్డం గా తిరిగి ,చెవిని దాటి మెరుస్తున్న బాణాలను సందిస్తున్నాయేమో ననే అనుమానాన్ని కల్గిస్తోంది .అంటే చెవి తమ్మలు అంటే కణత మన్మధుని విల్లులాగా ,అపాంగ వీక్షణం మన్మధుని పూల బాణాల్లా ఉన్నాయని భావం .   

          విశేషం –ఈ భావం ఎవరికి ?అమ్మ వారి చూపుతో మన్మధ ప్రసక్తి ఎవరికి ?సదాశివునికే .వేరెవరికీ కాదు అని అర్ధం 

            సశేషం –మీ –గబ్బిత దుర్గా ప్రసాద్ –22-10-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –42 దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

ఊసుల్లో ఉయ్యూరు –42

 

                                    దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

  మా ఉయ్యుర్లో మా చిన్నప్పుడు నవ రాత్రి ఉత్స వాలు శివాలయం లో నే బాగా జరిగేవి .మొదటి రోజు ఉదయం కలశాన్ని పెట్టి పూజ మొదలు పెట్టె వారు .దానికి ఎవరైనా కొద్ది మంది వెళ్ళే వారేమో .కాని రోజు సాయంత్రం వేళప్రత్యెక పూజ ఉండేది .సాయంకాలం ఆరింటికి పూజ ప్రారంభించే వారు .అక్కడ శివార్చకులున్నా ,మా వంగల సుబ్బావధాని గారి ఆధ్వర్యం లోనే పూజాదికాలు జరిగేవి .మా అమ్మవారు ‘’జగదాంబ ‘’స్వామి వారు సోమేశ్వర స్వామి .జగదాంబా సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్నే మేమందరం అప్పుడు శివాలయం అనే వాళ్ళం .ఇప్పుడూ అందరు అలానే పిలుస్తారు .అమ్మవారి అంత రాలయం చిన్నది .ఒక్కరే లోపల కూర్చుని పూజ చేసే వీలుంటుంది .పూజారి గారే లోన కూర్చుని కుంకుమ పూజ చేసే వారు .బయట సుబ్బయ్య గారు కూర్చుని పూజ చేయించే వారు .ఎంత మంది పూజ చేయిన్చుకొంటే ,అన్ని సార్లు లలితా సహస్ర నామాలు చదివే వారు .సుబ్బయ్య గారికి అంతా నోటికి వచ్చు .ఆయన కు పుస్తకం అక్కర్లేదు .ఆ స్పీడు ఎవరికీ ఉండేది కాదు .పది నిమిషాలలో సహస్రం పూర్తీ అయేంత స్పీడు ఆయనది ..ఆయన కళ్ళ జోడు పెట్టు కోవటం మాకు తెలీదు .చక చకా నామాలు చెబుతుంటే పూజారి కుంకుమ పూజ చేసే వారు .అమ్మ వారి పూజకు ప్రత్యెక ఎరుపు రంగు గల కుంకుమ ఉపయోగించే వారు .పూజ లన్నీ ఆయె సరికి రాత్రి ఏడున్నర ,ఎనిమిది అయేది .ఒక్కో యజమాని తన కిష్టమైన రోజు న పూజ చేయించుకొనే వాడు .పూజ అవగానే నైవేద్యం, మంత్ర పుష్పం ఉండేవి .మా నాన్న గారు, మామయ్యా ,కోట కృష్ణ మూర్తి గారు ,యనమండ్ర పార్ధ సారధి గారు ,శివాలయ అర్చకులు అందరు కలిసి ఒకే గొంతు కలిపి వంతుల వారీగా మంత్ర పుష్పం చెబుతుంటే ,మాకు మహా ముచ్చటగా ఉండేది .భూలోక కైలాసమే అని పించేది .భక్తికి పెద్ద పీట ఆ రోజుల్లో .వచ్చీ రాని మాటలతో నేనూ నోరు కలిపే వాడిని .కనీసం అరగంట పట్టేది .ఆ తర్వాతా తీర్ధ ప్రసాద విని యోగం .ఆ కాలం లో తీర్ధం కూడా ఉండేది కాదు .ప్రసాదం అంటే తాలింపు సెనగలే శివాలయం లో .వాటినే అందరు ‘’శున్తలు ‘’అనే వారు శివాలయం ప్రసాదాన్ని చాలా మంది పెద్ద వాళ్ళు తినే వారు కాదు ..అది తీసుకొని ఇంటికి వచ్చే వాళ్ళం .జనం కూడా పలచగా నే ఉండే వారు .ముఖ్యం గా బ్రాహ్మణ ,కోమట్లే ఎక్కువ గా వచ్చే వారు .విజయ దశమి నాడు బయటే శమీ పూజ చేసే వారు .అక్కడ ఒక శమీ కొమ్మ ను పాతి, దానికి పూజ చేసే వారు .దీనికీ సుబ్బయ్య గారే ఆధ్వర్యం .ఒక కాగితం మీద ‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శినీ ‘’అనే శ్లోకం రాసి ,ఈ సంవత్సరం విజయ దశమి నుండి వచ్చే విజయ దశమి వరకు తమ కుటుంబాలకు సర్వ దిక్కులా జయం కలగాలని ప్రతి వారు గోత్ర నామాలు ,పేరు రాసే వారు .ఆ కాగితాలన్నితికి పసుపు ,కుంకుమ పూసి జమ్మి కొమ్మ లో ఉంచి జమ్మి పూజ చేసే వారు .జమ్మి ఆకులనే ప్రసాదం గా ఇచ్చే వారు .దాన్ని కొద్ది గా నోట్లో వేసుకొని మగవారు చెవి లోను ,ఆడ వారు తలలోను పెట్టుకొనే వారు .శమీ పూజకు శివాలయం అంతా నిండి పోయేది .శమీ పూజ తర్వాతా మళ్ళీ గుడి లోపలి వెళ్లి మంత్ర పుష్పం చెప్పే వారు .ఇలా నవ రాత్రులు జరిగేవి .


అప్పుడు విష్ణ్వాలయం లో అసలు జనం ఉండే వారు కాదు .శివాలయం పూజ అయినతర్వాత ఇక్కడ  మంత్ర పుష్పం జరిగేది .అప్పటి దాకా ఇక్కడి వారు ఎదురు చూసే వారు .ఇక్కడా ప్రసాదాలు పెట్టె వారు ఇక్కడి ప్రసాదాలలో చక్ర పొంగలి, పులిహోర,దద్దోజనం ,రవ్వకేసరి,  ప్రసాదాలు భలే రుచిగా ఉండేవి . రెండు మూడు సార్లు అడిగి పెట్టించుకొనే వాళ్ళం .

              క్రమంగా శివాలయం లో,జోరు తగ్గింది .విష్ణ్వాలయం లో జోరు హెచ్చింది .పూజలు బాగా జరిగేవి ఏమైనా మంత్ర పుష్పం అంటే ,శివాలయం లో అయిన తర్వాతే .జనం కూడా విపరీతం గా పెరిగి పోయారు .అన్ని వర్ణాల వారు రావటం ప్రారంభ మైంది .ముఖ్యం గా కింది తరగతి భక్తులతో విష్ణ్వాలయం కిట కిట లాడేది .ప్రసాదాలు పెట్టాలన్నా ,తీర్ధం ఇవ్వాలన్నా ,పూజార్లవల్ల అయేది  కాదు జనాన్ని కంట్రోల్ చేయటం కష్టం గా మారింది .అందుకని మేమో ,ఆర్ ఎస్ ఎస్ వాల్లో నిలబడి భక్తులను క్యూ లో నిలిపి ,పెద్ద గేటు దగ్గర వరసగా ప్రసాదాలు పెట్టించే వాళ్ళం .జనాన్ని బెదిరించటానికి చేతిలో బెత్తాలు తప్పని సరి అయేవి .ఇలా మేము చేస్తే ,పూజార్లకు రిలీఫ్ గా ఉండేది .ఎంత ప్రసాదం చేసినా చాలేది కాదు .వెల్లువ లా జనం వచ్చే వారు .అందులో ప్రసాదం కోసమే వచ్చే వారేక్కువ గా ఉండే వారు .పూజ సమయం లో పిట్ట కూడా ఉండేది కాదు అదీ విశేషం .

       దసరా రోజుల్లో ముసురు బాగా పట్టేది. పిచ్చ వర్షాలు కురిసేవి .వర్షం లేక పోతే విపరీతం గా ఉక్క పోసేది .దానికి దీపపు పురుగులు వేల సంఖ్యలో చేరేవి .అవి తలలో దూరి బట్టల్లో దూరి ,కళ్ళల్లో పడిచాలా ఇబ్బంది పెట్టేవి .పాపం ఆడ వారికి మరీ చికాకుగా ఉండేది .స్త్రీ భక్తులు కూడా బానే వచ్చే వారు .మా చిన్న పిల్లలకు ఇదంతా సరదా గా ఉండేది ..

        మళ్ళీ కొంత కాలానికి వైభవం అంతా శివాలయానికి వచ్చింది .అక్కడ చుట్టూ ప్రక్కల ఉన్న తూర్పు కాపులు విప రీతం గా ఆలయానికి రావటం ప్రారంభించారు .పూజలు కూడా చేయించుకోవటం ఎక్కువైంది .ఇది కాక నవరాత్రులలో అమ్మ వారికి విశేష అలంకరణ చేయటం భక్తుల స్దంఖ్య పెరగటానికి కారణం అయింది .వైభవోపేత మైన అలంకారాలను అక్కడి అర్చకుడు ,మా శిష్యుడు ,క్రాఫ్ట్ మేష్టారు అయిన మామిల్ల పల్లి సోమేశ్వర రావు చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు ..అందుకని అలంకారాలకు స్పాన్దర్లు కూడా ఏర్పడ్డారు .రోజుకు పది పదిహేను మంది పూజ లో పాల్గొనే వారు .అందుకని పధ్ధతి కొంత మారింది .ఉదయమే ఉభయ దాతలు కూర్చుని పూజ చేసుకొనే విధానం అమలు లోకి వచ్చింది .రాత్రి పూట ఒకరిద్దరి పేరే పూజ జరుగుతోంది పూజ చేయించుకొనే వారు వందమంది ఉన్నా అందరికి కలిపి ఒకే పూజ వచ్చే సింది .అన్నీ కమ్మర్శియాల్ అయి పోయి నట్లే ,పూజకూడా  అయింది ..పెంద్రాళేమంత్ర పుష్పం అయి పోతోంది .ప్రసాదాలు కూడా మారి పోయాయి .ఇక్కడా పులిహోర ఇతర పదార్ధాలను ప్రసాదం గా పెడుతున్నారు .తీర్ధం ఇస్తున్నారు .ఇళ్లకు ప్రసాదాలను ఇస్తున్నారు .బయటా ,లోపలా విద్యుద్దీపా లంకరణ తో శోభాయమానం గా ఉండి .జనం పెరిగే సరికి ఇక్కడా కంట్రోల్ చేయటం కష్టమైంది అందుకు ఆలయ సిబ్బందికి సహక రించటానికి గోవింద రాజు సత్యమో కోలచల చల పతో ఉండి బెత్తం పట్టు కొని గేటు దగ్గర నిల బడి వరుస లో ప్రసాదాలను పెట్టించే వారు .ఎన్ని రకాల ప్రసాదాలుంటే ,అంత మంది కేన్ల లోప్రసాదాలు పట్టుకొని నిల బడి గేటు దగ్గరే పెట్టటం అల వాటైనది .మా నాన్న గారు లాంటి పెద్దలకు ఆలయం లో ప్రసాదాలిచ్చే వారు .మేము పెద్ద వాళ్ళం ఆయె సరికి మాకు ప్రసాదాలు ప్రత్యేకం గా ఇచ్చే వారు .ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రసాదాలు తీసుకొనే చాన్సు పోయింది .శివాలయం వంతులున్న ప్రతి పూజారి దసరా రోజుల్లో ఆలయం లో ఉండి సహకరించటం గొప్ప విషయం .ఆకట్టు బాటు శివార్చకులకు బాగా ఉండేది . .

               మళ్ళీ క్రమంగా విష్ణ్వాలయం లో వైభవం పెరిగింది .ఇక్కడ పూజారి ని  బట్టి జనం రావటం ప్రారంభించారు .రామచంద్రా చార్యులు గారు మహా కోపిష్టి .ఆయన వంతులో జనం తక్కువ గా ఉండే వారు .రామాచార్యుల గారి వంతులో భక్తుల సంఖ్య బాగా ఉండేది .అలానే దీక్షితుల వంతులో,వేదాంతం రమణ వంతులో  కూడా బాగా రద్దీ గా ఉండేది .కొంత కాలం వరకు శివాలయం లో మంత్ర పుష్పం అయిన తర్వాతే ఇక్కడ మంత్ర పుష్పం జరిగేది ఇప్పుడు ఎవరి టైం ను వారు పాటిస్తున్నారు .ఇది కొంత సౌకర్యం గా ఉండి .ఎవరికోసమూ ,ఎవరూ ఆగాల్సిన పని ఉండే అవసరం లేదు .ఒకప్పుడు శివాలయం ,విష్ణ్వాలయం మంత్ర పుష్పాలు అయి ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చే సరికి రాత్రి పదిన్నర ,పదకొండు అయేది .మేము నిద్ర మత్తులో జోగుతూ ఉండే వాళ్ళం .అయినా ప్రసాదాల మీద మోజు తో అలానే ఉండే వాళ్ళం .అప్పుడే ఇంట్లో భోజనాలు ..విష్ణ్వాలయం లో ప్రసాదాలను అడిగి అడిగి ,మా పిల్లలు బానే పెట్టించుకొనే వారు .మా శర్మ మరీ ప్రసాదం భక్తుడు ..

            దసరా రోజుల్లో ఊళ్లోకి దసరా వేష గాళ్ళు వచ్చే వారు .పులి వేషం వేసుకొని ,అర్ధ నారీశ్వర వేషం లోను రాముని వేషం లో ను ,ఆంజనేయ స్వామి వేషం లో ,కృష్ణుని వేషం లో వచ్చి ఇంటి ఇంటికీ తిరిగే వారు .వాళ్లకు తోచిన డబ్బులు ఇచ్చే వారు .కాపుల వీధి రామాలయం వారు ఎడ్ల బండీలో రాముడిని ఊరేగించే వారు ..పిట్టల దొరలు వచ్చి భలే కబుర్లు చెప్పి నవ్వించే వారు .ఎలుగు బంటిని తెచ్చి కొందరు ఇళ్ళ ముందు ఆడించే వారు .పాములను ఆడించే వారు కోతులను ఆడింఛి   వినోదం కల్గించే వారు .పెద్ద పెద్ద కొండ చిలువాలను ,నాగు బాములను బుట్టల్లోను ,వంటి మీద వేసుకొని వచ్చే వారు .నాగస్వరం ఊడుతే నాగు బాములు భలేగా ఆడేవి  ..దప్పుల మ్రోత లతో ఊరంతా దద్దరిల్లేది .గులాం చల్లుకోవటం ఎక్కువ గా ఉండేది 

         మాచిన్న తనం లో ,మా పిల్లల చిన్న తనం లో ప్రైవేటు మాస్టర్లు విద్యార్ధులను తీసుకొని విద్యార్ధుల ఇళ్లకు వచ్చి ‘’ఏదయా మీదయా మా మీద రాదు ‘’అని మొదలు పెట్టి ‘’అయ్యవారికి చాలు అయిదు వరహాలు ,పిల్ల గాన్ద్రకు చాలు పప్పు బెల్లాలు ‘’అంటూ పాటలు పాడించే వారు .మేస్టారికి సంభావన ఇచ్చే వాళ్ళం .పిల్ల వాళ్లకు మరమరాలు సెనగ పప్పు బెల్లం కలిపి పెట్టె వాళ్ళం .వారందరూ  సంతోషించే వారు .ఇలా దసరా మూడు రోజులు వారు ఇంటింటికీ తిరిగే వారు .అదో కళా వైభోగం .మగ పిల్లలు బాణాలు విల్లులు ,ఆడ పిల్లలు కోతి బొమ్మలు అంటే పైకి కిందికి గెంతే బొమ్మలు చేతిలో పట్టుకొని వచ్చే వారు .ముఖ్యం గా వత్తు మిల్లి సుబ్బారావు గారు అనే ‘’సుబ్బా రావు మేష్టారు ‘’గారి దగ్గర ఎర్క్కువ మంది పిల్లలు చదువు కొనే వారు .ఆయన పిల్లలందర్నీ తీసుకొని ఇంటికి వస్తే మహదానందం గా ఉండేది .మా పిల్ల లందరూ ఆయన దగ్గరే చదివారు .’’జయీభవా దిగ్విజయీ భవా –బాలల దీవెనలు బ్రహ్మ దీవెనలు ‘’అని ఆశీర్వా దించే వారు .కొత్త బట్టలు కట్టుకొని బాల బాలికలు ఊరంతా తిరుగుతుంటే రంగుల ఇంద్ర ధనుస్సు లా ఉండేది .అదో వింత అనుభూతి .దాదాపు ఇదంతా అంత రించి ఇరవై ఏళ్ళు అవుతోంది .ఇప్పుడే వ్వరూ అలా చేయటం లేదు

             పోస్ట్ మాన్  కు ,పాకీ వారికి ,ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ,పశువుల ఆస్పత్రి వారికి ,పాలేల్లకు పని మనిషికి చాకలి ,మంగలి వాళ్లకు స్కూల్ బంత్రోతులకు ,పంచాయితీ సిబ్బందికి ,బాంకికి బంత్రోతులకు ,,దసరా మామూలు ఇచ్చే వాళ్ళం .వెట్టి వాళ్ళు వెంట పడే వారు వారికీ వార్షికం ఇచ్చే వాళ్ళం .’’పాండవులు పాండవులు తుమ్మెద ,పంచపాండవు లోయమ్మ తుమ్మెదా ‘’అని అరుంధతీ స్త్రీలు బృందాలుగా పది రోజులు ఊరంతా తిరిగి పాండవుల కధ  అంతా పాట గా పాడే వారు . .వారికీ సంభావన ఇచ్చే వాళ్ళం .దీని నంతా దసరా మామూళ్ళు అనే వారు .ఇదొక ‘’మామూళ్ళ పండుగ ‘’గా తర్వాతమారి పోయింది .ఇప్పుడు వచ్చే వారూ లేరు ఇచ్చే వారు లేరు .చాలా భాగం తగ్గి పోయింది .మామూళ్ళకు కొంత బడ్జెట్ కూడా కేటాయించుకో వాల్సి వచ్చేది మరీ వేలం వేర్ర్రి అయి తగ్గి పోయింది .జనానికి రిలీఫ్ .అయితే ఇప్పుడు వినాయక చవితి శ్రీ రామ నవమి చందాలు ఎక్కువైనాయి .ఇదో మార్పు .ఇది రుబాబు గా కూడా మారిపోయిందని అందరికి తెలుసు .

         ఇన్ని విశేషాలు శివాలయం లోను ,విష్ణ్వాలయం లోను జరుగుతున్నా మా సువర్చలాన్జనేయ స్వామి గుడిలో ఏ హడావిడి ఉండేది కాదు .అప్పుడు ఆలయం శిధిలా వస్తా లో ఉండేది .ఒక్క హనుమజ్జయన్తికే కాసేపు వెళ్లి కూర్చుని ,పూజ చేయించి ,అప్పాలు నైవేద్యం పెట్టించే వాళ్ళం .1987లో ఆలయాన్ని పునరుద్ద రించిన తర్వాతా మా గుడికీ వైభవం వచ్చింది .ఇప్పుడు దసరా తొమ్మిది రోజులూ సాయంత్రం విశేష పూజ ఉంటోంది .వేదాంతం మురళి అమ్మవారిని పెట్టి రోజుకో అలంకారం వేసి మంచి అట్రాక్షన్ తెస్తున్నాడు .జన్మ కూడా బానే వస్తారు .అలాగే గీతా మందిరం లో కూడా దసరా పూజలు బాగా జరుగుతాయి .విజయ దశమి నాడు మా గుడిలో మా దంపతులం కూర్చుని శమీ పూజ చేస్తాము .రోజుకో రకమైన ప్రసాదం ఉంటుంది .దసరా సందడి అంతటా విస్తరిల్లింది .

       చిన్న పిల్లలు దసరా లో బొమ్మల కొలువు పెడతారు .పేరంటం చేస్తారు .వాయనాలిస్తారు .దసరాంటే అల్లుల్ల పండగ .కొత్తల్లుడు అత్త వారింటికి వస్తాడు .మామ గారు కొత్త బట్టలు పెడతాడు .మా చిన్నతనాల్లోను, ఇటీవలి పదేళ్ళ వరకు వినోదం అందరికి పంచేది రేడియో ఒక్కటే .ఎన్నో సరదా ప్రోగ్రాములు ,హాస్య నాటికలు రేడియో లో వినే వాళ్ళం .దసరా పాటలు ,చమక్కులతో ఆకాశ వాణిఅందరిని అలరించేది .ఇప్పుడు టి .వి.లు వచ్చి ఆ సంస్కృతికి కొంత నష్టం చేసింది .ఇప్పుడు హాస్యం అంటే సినీ క్లిప్పింగులే అయాయి .అప్పుడు రేడియో లో దూర దర్శిని లోనండూరి సుబ్బారావు ,రామ మోహన రావు , ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ‘’ఆనందో బ్రహ్మ’’ వంటివి కడుపుబ్బా నవ్వించేవి .నిజ మైన హాస్యాన్ని చవి చూసిన రోజు లవి .ఇవీ మా ఊరి దసరా నవరాత్రుల సంగతీ సందర్భామూనూ .

         దసరా శుభా కాంక్షలతో

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-10-12—ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24

55—‘’నిమేషోన్మేషాభ్యాం ,ప్రళయ ముదయం ,యతి జగతీ –తవే వ్యాహుస్సంతో ,ధరణి ధర రాజన్య తనయే

త్వదన్మేషాజ్జాతం ,జగదిద మశేషం ,ప్రళయతః –పరిత్రాతుం ,శంకే ,పరి హృత ,నిమేషాస్తవ ద్రుశః

తాత్పర్యం –మాతంగ తనయా !నీవు కను రెప్పలు మూస్తే ,జగత్ ప్రళయం సంభ విస్తుంది .కనులు తెరిస్తే ,జగత్తు ప్రభవిస్తుంది .ఇలా నీ కను రెప్పల కదలిక లో ,విశ్వ ఉత్పత్తి ,నాశనం జరుగుతున్నాయని వ్యాస మహర్షి మొదలైన వారు ,చెబుతున్నారు .నీ కనురెప్పల వికసనం వల్ల ,జన్మించిన ఈ సృష్టి అంతా ,నాశనం కాకుండా కాపాడటానికి నీ రెప్పలను మూయ కుండా అని మేష స్థితి లో ఉన్నావు .నీ దయ ఎంత గొప్పదమ్మా!

విశేషం –ఆమె రెప్ప పాటు లేకుండా ,నిరంతరం జగత్తును కాపాడుతోందని భావం .దేవి మహిమ అవాజ్మానగోచరం .

56—‘’తవాపర్నేకర్నె ,జపనయన ,పైశున్య చాకితాః—నిలీయన్తే తోయే ,నియతమ నిమేశాశ్శఫలికాః

ఇయంచ ,శ్రీర్బద్ధ చ్చదపుట ,కవాటం ,కువలయం –జహాతి ,ప్రత్యూషె,నిశిచ ,విఘటయ్యప్రవిశతి ‘’

తాత్పర్యం –అపర్నాదేవీ !నీ చెవుల వరకు వ్యాపించిన నీ రెండు కళ్ళు ,ఆ చెవులకు తమ రహస్యాన్ని వేల్లడిస్తాయేమో ననే భయం తో ,నీ కనుల రెప్ప పాటును దొంగిలించి ,ఆడు బెడిస చేపలు రెప్ప పాటు లేకుండా ,నీటిలో తమ రూపు కంపించ కుండా ,దాక్కున్నాయి .నీ నేత్రాలను చేరిన కాంతి ,అనే సౌభాగ్య లక్ష్మి ,ఉదయం పూట ,మూయ బడిన దొప్పల వంటి రేకులు కల ,నల్లకలువలను వదిలిపెడుతూ ,రాత్రి వేళ ,తలుపుల రూపం లో ఉన్న రేకులను తెరచికొని ,ఆ కలువలను ప్రకాశింప జేస్తోంది .అంటే నీ కనులు ఆకర్ణ విశ్రాన్తాలూ ,అసిత సుందరాలూ .

విశేషం —తమ సౌభాగ్యాన్ని శాఫరికలు అంటే బెడిస చేపలు దొంగిలించాయి అని కళ్ళు చెవులకు చాడీలు చెబుతున్నాయిఅని భావం .ఆడ బెడిస చేపలు నీళ్ళలో ఉండటం రెప్ప పాటు లేక పోవటం వాటి స్వభావ సిద్ధ గుణాలు .శ్రీ దేవి నేత్ర కాంతి ణి రాత్రులలో ,ఆమె నేత్రాలను వదిలి ,నీలోత్పలాల పై ప్రేమతో ,వాటిని కాపాడ టానికి వాటిని చేరుతున్నాయి రాత్రి పూతే కలువలకు వికాసం ఉంటుంది .పగలు ముడుచు కోవటం వాటి లోక రీతి .ఉదయమే ఆ కాంతి మళ్ళీ ఆమె ను చేరుతోందని భావం .అందుకని కలువలు ఉదయం ముడుచుకొంతాయి .

కాంతి లక్ష్మి పగలు ఆమె నేత్రాల్లో ,రాత్రి కాలువల్లో సంచరిస్తోందని అర్ధం .అపర్ణ అంటే శివుని కోసం పార్వతీ దేవి చేసే తపస్సు లో ఆకులను కూడా తిన కుండా ఉన్నది .లేక అపగత రుణ సంబంధం కలది అని అర్ధం .అంటే జగత్తు యొక్క సృష్టి ,స్తితి ,సంహార కర్మ లలో ,ఆలస్య కారణం గా ,యే కొంచే మైనా మిగిలిన కర్మ సమాపనం –అలాంటిది లేక పోతే అపగత రుణ సంబంధం అంటారని విజ్ఞులు తెలియ జేస్తున్నారు .చేపలు –కండ్లు చాడీలు చెబుతున్నాయి అనే భయం తో,శత్రు భయం తో  జలదుర్గం లో దాగాయి అని భావం .

సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –21-10-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి 23

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి 23

53—‘’విభక్త త్రైవర్న్యం  ,వ్యతికరిత ,లీలాన్జన తయా –విభాతి ,త్వన్నేత్ర ,త్రితయ మిద నదయితే

పున స్శ్రుష్టుం ,దేవాన్ ,ద్రుహిణహరి ,రుద్రానుపరతాన్ –రజస్సత్వం ,బిభ్రత్తమ ,ఇతి గుణానాం త్రియ మిద ‘’

తాత్పర్యం –ఈశాన ప్రియే !దేవీ !ఈ దీనుని వైపు చూసే ,నీ మూడు నేత్రాలు ,,వాని పై అర్ధ వలయాకారం గా తీర్చి దిద్దిన కాటుక కలవై ,తెలుపు ,నలుపు ,ఎరుపు అనే మూడు రంగులు కలవై ,జరిగి పోయిన జల ప్రళయ సమయం లో ,నీలో లీన మై,బ్రహ్మా ,విష్ణు ,రుద్రులను ,మహనీయ దేవతలను ,మళ్ళీ ఈ ,బ్రహ్మాండం లో సృష్టించ టానికి సత్వ ,రజస ,తమో గుణాలను ధరించాయేమో అన్నట్లు ప్రకాశిస్తున్నాయి .

విశేషమ –దేవి మూడు నేత్రాల్లో మూడు గుణాలున్నాయి .అవి –సృష్టి ,స్థితి ,లయాలకు కారణమవుతున్నాయి .కుడి కన్ను రజో ప్రధానం .ఎడమ కన్ను సత్వ ప్రధానం .ఫాల నేత్రం తమో గుణ ప్రధానం కలవి .భగవతి నేత్రాలు అనే ఉత్పలముల వల్ల ,బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను సృష్టిస్తోంది .అంటే ,వీరిని సృష్టించే త్రిగుణాలు ,ఆమె నేత్రా లలో నిత్య నివాసం గా ఉన్నాయని భావం .

54—‘’పవిత్రీ కర్తుం ,నః పశు పతి ,పరాధీన హృదయే –దయా మిత్రైర్నేత్ర ,రారున ధవళ ,శ్యామ రుచిభిహ్

నద స్శోనో,గంగా ,తపన ,తసయేతి ,ధ్రువ మయం –త్రయాణాం ,తీర్దానాం ముపనయసి,సంభేద మనఘం .’’

తాత్పర్యం –అపర్ణా !అజ్ఞాన ప్రాణులను కాపాడే పశు పతి హృదయ పత్నీ !దయా రసం చేత తడుప బడి ,మెత్తని ,ప్రసన్నాలైన యెర్రని ,తెల్లని ,నల్లని కాంతులు గల నీ కనులు మూడింటి చేత ,బంగారు రంగు నదీ ప్రవాహమైన శోణభద్రా ,తెల్లని రంగు గల గంగా ,నీలపు రంగు కల యమునా ,నదుల సంగమమైన స్థానమైన త్రివేణీ సంగమం గా ,పాపులను పవిత్రులను చేయటం కోసం మాకు లభిస్తున్నాయి .

విశేషం –దేవి నేత్రాలకు స్వభావ సిద్ధ మైన తెలుపు ,నలుపు ,ఎరుపురేఖలు గంగా ,యమునా ,షోనా నదుల కూడలి గా చెబుతున్నారుశంకర భగవత్పాదులు .ఇది ప్రయాగ సంగమం కాదు .అక్కడ సరస్వతి నది అంతర్వాహిని గా ఉంటుంది .కానీ బీహార్ చేరిన గంగ లో షోనానది (సోన్)

కలుస్తుంది .ఈ మూడు నదుల కలయిక మనకు కనిపించదు .మనల్ని కనిక రించ టానికి ,త్రివేణీ సంగమం లాగా ,అందిస్తోంది .భక్తులపై ఆమె దయా దృష్టి చాలా గొప్పది .అసంభవమైన దాన్ని సంభవం అఎట్లు దేవి చేస్తోందని భావం .

ఆమె కన్నులలో మూడు రంగులున్నాయి .ఎరుపు రంగు రక్త రాజిలో ,తెలుగు అపాంగం లో ,నలుపు నల్ల గ్రుడ్డు లో ,కనీ పించి ,శోభాయ మానం గా ఉన్నాయి .శోన-హిరణ్య బాహువు ,హిరణ్య వాహిని .’’శోనో హిరణ్య బాహుహ్ స్యాత్ ‘’అని శ్రుతి .వో అనఘాదేవీ ! పాప సంహారిణీ ,నీ చరణాలను సేవిన్చె  భక్తులకు ,నీకు వ్యతి రేకం గా ,తీర్ధ యాత్ర సేవ వ్యర్ధం అని అంత రార్ధం .ఆమె చరణాలే అన్నీ ఇస్తుంటే ,వేరే తీర్ధ యాత్రలు అనవసరం అని అర్ధం

సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –.20-10-12—ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –22

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –22

 

51—‘’శివే శ్రుంగా రార్ద్రా ,తదిత ,రజనే ,కుత్సువ పరా సరోషా,గంగాయాం  ,గిరిశ చరితే ,విస్మయ వతీ

హరా హిభ్యో భీతా ,సరసి రుహ ,సౌభాగ్య జననీ –సఖీషు ,స్మేరా ,తే ,మయి ,జనని ,దృష్టి స్సకరుణా‘’

తాత్పర్యం –నిత్యా నంద కరీ!నీ కంటి చూపు పరమ శివుని పై శృంగార భావం చూపి ,మోహనం గా కన్పిస్తోంది .ఇతరుల పై భీభత్స దృష్టీ (ఏవగింపు )సపత్ని యైన గంగ పై రోషం తో కూడిన రౌద్ర దృష్టి కలిగి ఉంది .త్రిపుర సంహారం మొదలైన శివుని విజయ గాధలు విని ,విస్మయంతో ,అద్భుత రాసా వేశంగా ఉంది .(శివుని మూడవ నేత్రాన్ని మన్మధ దహనం లో  చూసి –అద్భుత రసం).పరమ శివుని ఆభరణాలైన పాములను చూసి ,భయానక రసం కల్గిస్తోంది .యెర్ర కలువ కాంతి ,ఎరుపు కలిగి వీర రసం గా ఉంది .సఖీ జనం పట్ల ,లేత నవ్వు తో కూడిన స్థిర మైన హాస్య దృష్టి ఉంది .నిన్ను స్తుతించే భక్తు డైన నాయందు కరుణా రస దృష్టి ఉంది .నీ దృష్టులు నవ రసాలతో నిండి ఉన్నాయి .

విశేషం –భగవతి దృష్టి అధికార భేదం చేత నవ రసాలు ఒకే సారి కన్పింప జేస్తున్నాయి .నవ రాసా వాస భూతం ఆమె దృష్టి .దీనికి శివుడే వ్యాఖ్యాత .ఆయన సమస్త కళ్యాణ గుణ దారి .ఆమె అనుగ్రహ లబ్ధ నాముడు అని వ్యవ హరింప బడుతున్నాడుసదా శివుడు .

52—‘’గతౌ కర్ణాభ్యర్ణం ,గరుత ఇవ ,పక్ష్మాణి దధతీ –పురా భేత్తుస్చిత్త ప్రశమ రస ,విద్రాణ ఫలే

ఇమే నేత్రే ,,గోత్రాధర పతి ,కులోత్తంసకలికే –తవా కర్నాకృష్ణ స్మరశరవిలాసం కలయతః ‘’

తాత్పర్యం –పర్వత రాజ తనయీ !నేను ధ్యానిస్తుంటే ,నా హృదయ కమలం లో ప్రత్ర్యక్షం అయినావు .నీ దర్శన భాగ్యం కలిగింది నీ కనులు చెవుల వరకు వ్యాపించాయి .ఆ నేత్రాల రెప్పల పై గల వెంట్రుకలు ఎలాగఉన్నాయంటే ,బాణానికి రెండు ప్రక్కలా కట్ట బడిన గ్రద్ద ఈకలు గా ఉండి ,పరమ శివుని మనసు లో నిస్పృహ ను పోగొట్టి ,శృంగార రాసోత్పాదన చేస్తున్నట్లు న్నాయి .ఆ కర్ణాంతం లాగిన మన్మధ బాణ సౌందర్యాన్ని కల్గిస్తున్నాయి .

విశేషం –మన్మధుడు పంచ బాణుడు .ఆరవ బాణం స్త్రీ ల కడ గంటి చూపు .శివుని పై పంచ బాణాలు వేసి ,గెలవ లేక భస్మమైనాడు మన్మ్సధుడు .అలాంటి శివుని మనస్సు ను మోహ పర వశం తో మున్చేత్తేట్లు చేస్తున్నాయి శ్రీ దేవి చూపులు .అంటే ప్రకాశఅంశ మైన బ్రహ్మం లో సృష్టికి కారణ మైన వివర్శ అంశ స్పందనాన్ని కల్గిస్తోంది .అంటే అతి దుర్ఘట మైన కార్య కారణాన్ని చేసే సమర్ధత ఆమె చూపులకు ఉంది  అని భావం .

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18-10-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

గురజాడ సర్వస్వమైన ‘’గురు జాడలు ‘’

గురజాడ సర్వస్వమైన ‘’గురు జాడలు ‘’

ఒక రచయిత సాహిత్యాన్ని అంతటిని ఒక చోట చేర్చటం కష్టమైన పనే..అదీ నూట యాభై ఏళ్ళ నాటి రచయిత సాహిత్య సర్వస్వాన్ని ఒకే చోటికి చేర్చి అందించటం భగీరధ ప్రయత్నమే అవుతుంది .అసాధ్యం అని పిస్తుంది .కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహా కవి ,తెలుగు జాతి వైతాళికుడు గురజాడ అప్పా రావు గారి సాహిత్యాన్ని సర్వాంగ సుందరం  గా అందించారు’’ మనసు ఫౌండేషన్ ‘’వారు .దీన్ని తగిన సమయం లో అంటే గురజాడ నూట యాభై వ జన్మ దినోత్సవం నాడు అందించి తెలుగు జాతికి మహోప కారం చేశారు .వారి కృషి బహుదా ప్రశంశ నీయం .ఎక్కడా రాజీ పడ కుండా ఎంతో శ్రమ కోర్చి దీన్ని తీర్చి దిద్దారు .’’గురు జాడలు‘’అనే పేరు సార్ధకం చేశారు .’’అడుగు జాడ గురజాడ ‘’అన్న మహా కవి వాక్యానికి సజీవ దర్పణం ఈ గ్రంధం .దీన్ని వెలుగు లోకి తెచ్చిన వారందరూ పేరు పేరునా అభినంద నీయులు .

అయితే ఇందులో సింహ భాగాన్ని పోషించిన వారు స్వర్గీయ పెన్నే పల్లి గోపాల కృష్ణ గారు .నవతరానికి గురజాడ సాహిత్యాన్ని అందు బాటు లోకి తేవాలన్న వారి తపన ఫలించింది .తమ కృషి ఫలితాన్ని రుచి చూడ కుండానే వారు మరణించటం విచారకరం .గురజాడ అధ్యయన కేంద్రాన్ని నెల కొల్పి ,కన్యా శుల్కం పై అనేక వ్యాసాలను రాసి ,’’మధుర వాణి  ఊహాత్మక ఆత్మ కద‘’తో కొత్త పుంతలు తొక్కిన  గోపాల కృష్ణ గారే ఈ సర్వస్వానికి ప్రధాన సంపాదకులు .వీరికి సహకరించిన వారు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు .శ్యాం నారాయణ గారు ,వెంకట నారాయణ గారు మొదలైన వారి సలహా సంప్రదింపుల తో పుస్తకం  సుందరం గా హస్తానికి ఆభరణం గా  ఇమిడి పోయేట్లు రూపు దాల్చింది .బాపు చిత్రించిన ముచ్చటైన రంగుల గురజాడ ముఖ చిత్రం అదనపు ఆకర్షణ .ఆయన లోని ఠీవి దర్జా ,మూర్తీభవించి ,సజీవ చిత్రం గా కన్నుల ముందు నిలి చింది .

ఈ సర్వస్వం రూపు దాల్చటం లో పెన్నే పల్లి వారి అనుభవం ఎంతో సహకరించింది .ఆయన ఉదయం దిన పత్రిక కు సంపాదకులు గా పనిచేశారు .గురజాడ పై వచ్చిన విమర్శలను పదు నైన రచనా పాటవం తో త్రిప్పి కొట్టిన ఘనత వారిది .దక్షిణాఫ్రికా జాతీయ పోరాటా నికి భారతీయులు చేసిన కృషిని వివరిస్తూ వారు రచించిన ‘’ఇంద్ర ధనుస్సు ఏడోరంగు ‘’ప్రశంశ నీయమే కాక ,ప్రామాణిక గ్రంధం గా గుర్తింపు తెచ్చుకొన్నది .పరి శోధనకు ,కాల్పనిక సాహిత్యానికి మధ్య ఉన్న సరి హద్దు రేఖ ను చెరిపేసిన వారు గోపాల కృష్ణ గారు .ఆయన ‘’ఫెర్ఫెక్షనిష్టు ‘’గా గుర్తింపు పొందారు కనుకనే ఈ సర్వస్వాన్ని అంత పెర్ఫెక్ట్ గా తీసుకొని రాగలిగారు .

గురజాడ రాసిన అక్షర రాశి ఎక్కడెక్కడో చెల్లా చెదురు గా పడిఉంది .దీని నంతటిని సేకరించటం లో వీరందరూ పడిన శ్రమ అంతా ఇంతా కాదు ‘’.మనసు‘’వారిది మంచి మనసే కాదు అంతకు ముందు రావి శాస్త్రి ,కారా మాస్టారు ,శ్రీ శ్రీ ,బినా దేవి లలభ్య రచన లతో సర్వస్వాల ను అందించిన అనుభవం ఉన్న వారు .కనుక వీరు సంపూర్తిగా సంతృప్తి గా చేయ గలిగారు .గురజాడ డైరీల మీద పూర్వం ఎంతో వివాదం నడి చింది .అందుకని వీరు ఆ డైరీలను యదా తధం గా ఇంగ్లీష్వెర్షన్ తో చేర్చారు .గురజాడ వ్యక్తిత్వానికి ,రచన లకు సంబంధించిన దాన్ని దేన్నీ వదలకుండా చేర్చటం అభినంద నీయం .’’గురజాడ రాసిన దాని కంటే ,ఆయన పై తెలుగు జాతి రాసుకొన్నది ఎక్కువ’’అన్న మాట నిజం .అందులో పదార్ధం ఉండ బట్టే అంతా రాశారు రచయితలు .అంత విమర్శన గా చేశారు విశ్లేషకులు .

నేటి సమాజానికి గురజాడ అవసరం ఏమిటో చాలా విపులం గా చిత్రించారు వి.వి.నమూర్తి గారు .గురజాడ ‘’స్టాండ్’’ఏమిటో తెలియ జేశారు .’’మతము లన్నియు మాసి పోవును ,జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును ‘’అన్న గురజాడ ఆకాంక్ష సమస్త మాన వాళిఆకాంక్ష గా గుర్తించ టానికి ఈ సర్వస్వం దోహద పడాలని ఆకాంక్షించారు .నిజం గా నే వారి ప్రయత్నం సఫల మైందని భావించ వచ్చు .

ఈ సర్వస్వం లో గురజాడ జీవితం లో ప్రధాన సంఘటనలను సంవత్సర వారీగా చూపించారు .తరువాత గురజాడ కవితలను చేర్చి ,కన్యా శుల్క నాటకం తో ప్రారంభించి ,బిల్హణీయం ,కొండు భట్టీయం వేశారు .తొలి ఆధునిక కద గా గుర్తింపు బడ్డ ‘’దిద్దు బాటు ‘’కదానిక  తో ప్రారంభించి కధలను చేర్చారు .తరువాతి స్థానం వ్యాస పరంపరకు లభించింది .మాటా మంతీ తో ప్రారంభించి ,కన్నడ వ్యాకరణాలకు సంబంధించిన భట్ట కలంకుడు తో పూర్తీ చేశారు తరువాత గురజాడ డైరీ లను  .ఆయన ఆంగ్లం లో రాసిన myown thoughts ,correspondence ,ను చేర్చి చివరగా అందరు ఎదురు చూసే minute of descent తో సర్వస్వానికి మంగళ మహాశ్రీ పాడారు .

ఇంత విలువైన సమాచారాన్ని మనోహరం గా  సుమారు పది హీను వందల పేజీలగ్రంధాన్ని  సర్వాంగ సుందరం గా ,సంతృప్తి గా అతి తక్కువ వెలకు అంటే మూడొందల డెబ్భై అయిదు రూపాయలకే అంద జేయటం సాహసమే .దీనికి ప్రత్యెక అభి నందనాలు అంద జేయాల్సిందే.ఏమీ లేకుండానే పేజీలు నింపుకొన్న రచనలు అయిదొందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఇంత కనీస వెలకు ఇంతటి సర్వస్వాన్ని అందించి నందుకు ‘’మనసు ఫౌండేషన్‘’వారి విశాల మనసు కు  బహుదా  అభి నంద నలు .లాభా పేక్ష కాకుండా సాహితీ సేవా దృక్పధం లో చేసిన మహాత్తర కృషీ,కానుక ఇది . .ఈ అక్షర యజ్ఞం లో పాల్గొన్న వారందరినీ అభి నంద నీయులు ..

ఒక విన్నపం దాదాపు పదేళ్ళ క్రితం నేను అమెరికా కు మొదటి సారి గా వెళ్ళిన సందర్భం లో లైబ్రరి లో అమెరికా కు చెందినప్రసిద్ధ కవి ,రచయిత సాహిత్య మార్గ దర్శకుడు ,సాహితీ విమర్శకుడు ‘’ఎడ్గార్ అల్లాన్ పో ‘’సాహిత్య సర్వస్వాన్ని చూశా ను ,చదివా.ను .అందులో ఆయన రచనలే కాక ,ఆయన తో పరిచయం ఉన్న వారందరి తో ఆయన తీయిన్చుకొన్న ఫోటోలను కూడా చేర్చారు .చాలా గొప్పగా ముద్రించారు .ముచ్చట గా నూ ఉంది .’’పో ‘’గురించి ఇంక ఎక్కడా వెతకాల్సిన పని లేకుండా చేశారు .అలాంటి సమగ్ర సర్వస్వం మనప్రశిద్ధ  కవులు ,రచయితలు అయిన వీరేశ లింగం గురజాడ విశ్వ నాద శ్రీ శ్రీ మొదలైన వారి పై వస్తే బాగుండును అని ఆశ గా ఉండేది .గురజాడ సర్వస్వం ఆ లోపాన్ని దాదాపు పూర్తీ చేసింది .ఫోటోలు చేర్చటం నా అత్యాశ ఏమో కాని ఇక పై సర్వస్వాలు ప్రచురించే వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని మనవి .

‘’గురుజాడలు ‘’పేరుతో గురజాడ సర్వస్వాన్ని ఆంద్ర జనులకు అందించిన మనసు ఫౌండేషన్ వారికి ,ఈ విషయాన్ని నేనుఇటీవల  అమెరికా లో ఉండగానే ముందుగా తెలియ జేసిన శ్యాం  నారయన్ గారికి అందులో ఆయన పోషించిన పాత్రకూ అభి నందనాలు .సాహిత్యాభి మాను లందరూ కొని,చదివి ,దాచు కో వలసినవిలువైన పుస్తకం గురజాడ సర్వస్వంఅయిన” గురుజాడ లు ”

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-10-12–ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి త) సౌందర్య లహరి –21

 శ్రీ శంకరుల లలి (కవి )త సౌందర్య లహరి –21

49—‘’విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా ,కువలయైహ్ –కృపా దారా ,ధారా ,కిమపి ,భోగవతి కా

అవంతీ ,సృష్టిస్తే ,బహునగర ,విస్తార విజయా –ధ్రువం ,తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ‘’

తాత్పర్యం –విశాలాక్షీ !నీ చూపు విశాలం కనుక ,విశాల అనే నగరం గా వెలసింది .కళ్యాణ ప్రదం కనుక ,కల్యాణి గా ,నల్ల కలవ కాంతి కలది కనుక అయోధ్యా ,కృప అనే అమృత ధారకలది ,కనుక దారా నగరం గా ,అవ్యక్త మధుర మైనది కనుక మధురగా ,సర్వ భోగ భూమి కనుక భోగ వతి గా ,ఆశ్రిత రక్షణం కనుక ,అవంతి గా ,విజయ దృష్టి ఉన్నది కనుక విజయ నగరం గా విల సిల్లింది .

విశేషం –నగరాల పేర్లను శ్రీ దేవి దృష్టు లతో శంకరులు సమన్వయించారు .విశాల దృష్టి అంతర్వికాసం కలది కళ్యాణీ దృష్టి ,విస్మితం తో కూడిన చిరు నవ్వు .అయోధ్య దృష్టి కడ గంటి హాసం .దారా దృష్టి అలసత్వం .మధురా దృష్టి వంకర చూపు భోగవతీ –మెరుపు చూపు .అంటే తళుకు కలది .విజయ దృష్టి కటాక్ష వీక్షణ మైన క్రీగంటి చూపు . కలది అని భావం .అవంతి ముగ్ధ మైనది .అంటే యవ్వన ప్రారంభ కన్యా దృష్టి కలది అని అర్ధం .ఈ ఎనిమిది దృష్టులు సంక్షోభ ,ఆకర్షణ ,ద్రావణ ,ఉన్మాద ,వశ్య ,ఉచ్చాటన ,విద్వేషణ ,మారణ కార్యాలు చేయిస్తాయి .శ్రీ దేవి చూపు లోని విశేష ప్రసారం తో ఆయా నగరనామాలు వర్ధిల్లాయి .అని రామ లింగేశ్వర రావు గారు చక్కని సమన్వయం చేశారు .

50—‘’కవీనాం ,సందర్భ స్తబక ,మకరందైక భరితం –కటాక్ష వ్యాక్షేప ,భ్రమర ,కలభౌ ,కర్ణ యుగళం

అముచంతౌ ,దృష్ట్వా ,తవ ,నవరసాస్వాద ,తరలౌ –అసూయా ,సంసర్గా ,దలిక ,నయనం ,కించి దరుణం ‘’

తాత్పర్యం –సినీ వాలీ !తల్లీ కవీశ్వరులు రస గర్భితం గా రచించిన కావ్య రచనలు అనే ,పూవు లోని తేనెను గ్రోలటం లో ,మక్కువ కల్గిన నీ చెవులను అంటి పెట్టు కొన్నవీ ,నవ రసాలను ఆస్వాదించ టం తో అమిత మైన ఆసక్తి కలవి అయిన ,నీ క్రీ గంటి చూపులు అనే ,నెపం తో ఉన్న తుమ్మెద సమూహాన్ని చూసి ,అసూయతో ,నీ ఫాల నేత్రం కొంచెం యెర్ర బడిందేమో నమ్మా .

విశేషం –ఆమె రెండు కనులు చెవులను తాకి ఉన్నాయి .ఆకర్ణ విశాల నేత్రాలు వాటికి అమృత పానం లభించింది .నొసటి లో ఉన్న మూడవ కన్ను కు ,ఆభాగ్యం కలగ లేదు .అందుకే అసూయ తో యెర్ర బడిందని భావం .లలాట నయనం అగ్ని రూపకమే .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18-10-12-

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –20

  శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –20

47 —    భ్రువౌ భగ్నే కిన్చిద్భువన ,భయ భంగ వ్యసనిని –త్వదీయే ,నేద్త్రాభ్యాం ,మధుకర రుచిభ్యాం ద్రుత గుణం

ధనుర్మన్యే ,సవ్యేతర కర ,గృహీతం ,రతి పథెహ్ –ప్రకోస్తే,,ముష్టౌచ ,స్థగయతి ,నిగూ్dhaanతర ముమే ‘’

తాత్పర్యం –తల్లీ ఉమా దేవీ !జగత్తు లోని భయాన్ని పోగొట్టే దానివి నువ్వు .కొంచెం వంగి ఉండి,తుమ్మెద వరుసల్లాగా ,నీలి రంగుతో సుందరం గా ఉన్న నీ రెండు కండ్ల చేత కట్ట బడిన అల్లే త్రాడు తో కూడి ,ముడి పడ్డ నీ కను బొమల జంట ఎలా ఉందొ విను .రతి భర్త మన్మధుడు ఎడమ చేయి పిడికిలి తో పట్టు కొన్నప్పుడు కనపడ కుండా దాగి ఉన్న విల్లు మధ్య భాగం లా ఉన్న కోదండం అని అని పిస్తుంది .

విశేషం –మన్మధుని చాపానికి అల్లెత్రాడు తుమ్మెదల దండు .కనుబొమలు మన్మధుని ధనుస్సు లా ఉంటె ,కళ్ళు ,మధుర మైన నీలి రంగులో ఉన్నాయి .ఆమె భ్రూమధ్యం మన్మధుని చాప మధ్యమ గా ఉన్నదని భావం .ఆమె నిరంతరం జగత్తును ఉద్ద రించే ప్రయత్నం తోనే ఉంటుంది అని అర్ధం .

48—‘’అహస్యుతే ,సవ్యం ,తవ నాయన ,మార్కాత్మక తయా –త్రియామాం ,వామం ,తే ,సృజతి ,రజనీ ,నాయక తయా

త్రుతీయాతే దృష్టి ర్డ దలి త ,హేమామ్బుజ రుచిహ్ –సమాధత్తే ,సంధ్యాం ,దివస నిశయో రంతర చరీం .’’

తాత్పర్యం –జగద్దాత్రీ !నీ కుడి కన్ను సూర్యుడు అవటం వల్లపగలు కలుగు తోంది .కొంచెం గా వికశించిన ,బంగారు కమలం వంటి దైన ,నీ నొసలు లో  ,ఉన్న మూడవ నేత్రం దృష్టి ,దివారాత్రాల మధ్య ఉండే ఉభయ సంధ్యలను ధరిస్తోంది .

విశేషం –ఆమె మూడు కళ్ళు –పగలు ,రాత్రి ,సంధ్యా కాలాలు .అవి కాల ఉత్పత్తి హేతువులు .ఆమె కాలానికి అతీత .పగలు ఉపాసనా కర్మకు ,రాత్రి నిశాకృత్యాలకు ,సంధ్య –అగ్ని హోత్రాదులకు వీలు కల్గిస్తుంది .పగలు జాగ్రత్ స్థితి ,రాత్రి సుషుప్తి ,సంధ్య స్వప్నాన్ని సూచిస్తాయి .జాగృత్ లో జ్ఞానం కలిగి ,సుషుప్తి లో అజ్ఞాన అంధకారం తొలగు తుంది .చంద్రాత్మక నేత్ర కాంతి జ్ఞాన మయ మైన సమాధి స్థితి కన్పిస్తాయి .సంధ్యారూప స్వప్నా వస్త జ్ఞాన భూమికకు సోపానం .జ్ఞాన దృష్టికి ,బ్రహ్మిక్యానికి మధ్యలో ఉండే స్తితే సంధ్య అని భావం .

సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –17-10-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సంగీతం నచ్చింది – …. కాని బాల్యం పోయింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –19

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –19

45—అరాలైస్వాభావ్యా ,దళికలభస శ్రీ భిరలకైహ్ –పరీతం తే వక్త్రం ,పరి హసతి ,పంకేరుహ రుచిం

దర స్మేరే యస్మిన్ ,దశన రుచి కిన్జిల్క రుచిరే –సుగంధౌమాద్యంతి ,సమర దహన ,చక్షుర్మధులిహః ‘’

తాత్పర్యం –అన్నపూర్ణేశ్వరీ !స్వభావ సిద్ధం గా ,తుమ్మెద రెక్కల నల్ల దనం తో ,కాంతి వంతం గా ఉన్న నీ ముంగురు లచే ,చుట్ట బడిన నీ ముఖం ,తామర పూవు సౌభాగ్యాన్ని పరి హసిస్తోంది .చిరు నవ్వు కల పంటి తళుకులు అనే కేసరాల విలాసం తో ,అందమైన సుగంధం కల ,ఆ ముఖం లో ,మన్మధుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు మోహ పడుతున్నాయి .

విశేషం –మన్మధుని దహించిన శివునికి కూడా ఆమె  ముఖ సౌందర్యం వికారం పుట్టిస్తోంది .శివుడు ప్రకృతి స్వరూప లావన్యానికి ముగ్దుడౌతున్నాడని భావం .జిత మన్మదునికే అభిలాష కల్పించిన దేవి ముఖం యొక్క లోక ప్రియత్వం సర్వ లోకాతిశయంఅని గ్రహించాలి .

46—‘’లలాటం లావణ్యద్యుతి ,విమల మాభాతి తవయత్ –ద్వితీయం ,తన్మన్యే మకుట ఘటితం చంద్ర శకలం

విపర్యా సన్యాసా దుభయ మపి ,సంభూయచ ,మిదః –సుధా లేపస్యోథిహ్ పరిణమతి రాకా హిమ కరః ‘’

తాత్పర్యం –చిదగ్ని కుండసంభూతా !లావణ్యం అనే వెన్నెల చేత ప్రకాశించే ,నీ లలాటం ,రెండవ చంద్ర ఖండం గా భావిస్తున్నారు .మొదటి చంద్ర ఖండం నీ కిరీటం పైనే ఉంది .ఈ రెండు వ్యత్యస్తం  గా ,అర్ధ వలయాలు గా ఉండటం వల్ల ,కలిసి నప్పుడు అమృతం పూత పోసిన పూర్ణిమా చంద్రుడే నేమో నని పిస్తోంది .

విశేషం –భగవతి ని చంద్ర మండలం అనే లలాటం లో నిలిపి ధ్యానిస్తే అమృతత్వ లాభం కలుగు తుందని భావం .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-10-12-ఉయ్యూరు

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –18

 శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –18
              43-”ధనోతు ధ్వాంతం ,నస్తులిత ,దలి తేరి దేవర వనం –ఘనం స్నిగ్ధం ,శ్లక్ష్యం ,నికురుంబం ,తవ శివే 
                   య దేయం ,సౌరభ్యం ,సహజ ,ముప లబ్దుం ,సుమనసో –వసంత్యస్మిన్మన్యే ,బల మదనః ,వాటీ విట పినాం ”
                   తాత్పర్యం –శ్రీ లలితా!అప్పుడే వికశించిన నల్ల కలువల సమూహాన్ని మరపించే కారు మబ్బు లాగా దట్టమై  ,నున్నగా ,సుగంధం తో మెత్త గా ఉన్న నీ కురుల క్రొమ్ముడి ,మాలోపలి ,చీకటి అనే అజ్ఞాన అంధ కారాన్ని పోగొట్టాలి .నీ కురులకు ఉన్న సహజ గంధం సంపాదించ టానికి బలుడు అనే రాక్షసుని సంహరించిన ఇంద్రుని యొక్క నందనోద్యాన వనం లోని కల్ప వృక్ష పుష్పాలు ,నీ కొప్పులో చేరి ప్రకాశిస్తున్నాయి . పూలు సహజ గంధం పొందాలనే కోరిక తో శ్రీ దేవి కొప్పు లో నిత్య నివాసం ఉంటున్నాయని భావం 
            44–”తనోతు క్షేమం ,నస్తవ ,వాదన సౌందర్య లహరీ –ప్రీ వాహ స్రోత స్సరనివ ,సీమంత సరణీం 
                   వహంతీ సింధూరం ,ప్రబల ,కబరీ భార తిమిర –ద్విషాం ,బృందై ర్బందీక్రుత మివ ,దీనార్క కిరణం ”
                        తాత్పర్యం –త్రిపుర సుందరీ !నీ వదన సౌందర్యం  ,పొంగులు పొంగులుగా ,జాలు వారే ప్రవాహం లాగా ఉండగా ,వాని లోంచి చీలి ,చక్కగా ప్రవహించే నీటి పాయ లాగా నీ పాపట ,నీ కురులలో జన్మించి ,దట్టమైన చీకట్లు అనే శత్రుసేనల చేత చె ర పట్ట బడిన బాల సూర్యుని కిరణమా అన్నట్లు గా ఉన్న సిందూర పరాగాన్ని ధరించి ,మా యోగ క్షేమాలకు అభి వృద్ధి కలిగిస్తోంది .
                    విశేషం –పాపట లో సిందూరం ధరించటం సువాసినీ స్త్రీల ఆచారం .,సుమంగళీ చిహ్నం .శ్రీ దేవి వదన సౌందర్యం అనే ఎరుపు కాంతి పైకి ప్రాకుతూ ,పాపట లో వ్యాపించి ఉంది .ఇందులో ప్రాతక్హ్కాలం లోని సూర్యుడు చీకటిని పోగొట్టే విధానం సూచింపబడింది నీటి ప్రవాహం పల్లానికి సహజం గా ప్రవహిస్తుంది .శ్రీ దేవి సౌందర్య లహరి ఊర్ధ్వ గామిని -అంటే పైకి ప్రవ హిస్తుందని భావం .
                    
                        అందరికి నవ రాత్రి -దసరా శుభా కాంక్షలు 
 
 
                  సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –16-10-12–ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరులలాలీ లి కవి ) తా సౌందర్య లహరి –17

 శ్రీ శంకరులలాలీ లి కవి ) తా సౌందర్య లహరి –17
          42—”గతైర్మాణి క్యత్వం ,గగన మణి  నిభిహ్ ,సాంద్ర ఘటితం –కిరీటం తే ,హై మం ,హిమ గిరి సుతే కీర్తయతియః 
                 సనీడే యచ్చాయాచ్చురణ ,పటలం ,చంద్ర శకలం –ధనుహ్ శౌనా శీరం ,కిమతి ,నని బధ్నాతి దిషణం ”
                 తాత్పర్యం –హిమ గిరి తనయా !గగన మణు  లైన పన్నెండు మంది ఆదిత్యుల చేత ,చక్కని రత్నాలు గపొ ద గ బడిన నీ బంగారు కిరీటాన్ని ఎవరు కీర్తిస్తారో ,ఆ కవీశ్వరుడు గోళా  కారం గల ఆ కిరీటం లో కుదుళ్ళ తో ద్వాదశాదిత్య మణుల కాంతు లతో కలిసి ,చిత్ర చిత్ర వర్ణాలు గల నీ పాపట బొట్టు అయిన చంద్ర రేఖ ను చూసి ,ఇంద్ర ధనుస్సు అని తన మనసులో భావించి పరవ శిస్తాడు .      ,    
                –విశేషం –కిరీటం లోని చంద్ర రేఖ ద్వాదశాదిత్యులు అనే మణి  కాంతులచే ,చిత్ర విచిత్ర వర్ణాలు కలిగి ఉన్నట్లు అని పిస్తోంది .ఇంద్ర ధనుస్సు అనే భ్రమ ను కల్గిస్తోంది .  ఉషః కాలం లోనిఆకాశ ప్రకృతే అది .అదే కిరీటం .కృష్ణ చతుర్దశి ,అమావాస్య ల మధ్య సంధి కాలం లో వచ్చే ఉషః కాలం ఇలానే ఉంటుందని విజ్ఞులు తెలియ జేస్తున్నారు .కార్తీక బహుళ చతుర్దశి సాక్షాత్తు శ్రీ దేవి స్వరూపమే .దీనినే ”రూప చతుర్దశి ”అంటారు . కిరీటం లోని చంద్ర రేఖ ఇంద్ర చాపం లా కనీ పిస్తోంది .కిరీటాన్ని కీర్తిస్తే ,శ్రీ దేవి ని కీర్తించి నట్లే .”హేమ కిరీటా య సహస్రాదిత్య తేజసే నమః ”అని కిరీటానికి మంత్రం ఉంది .దీన్ని గురువు ద్వారా గ్రహిస్తే సాక్షాత్కారం కలుగు తుందని భావం .                
                     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15-10-12—ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య సుధ

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సమాజ సేవ భవానీ దీక్ష

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –16

   శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –16

          41–”త వా దారే మాతే ,సహా సమయ యా లాస్య పరయా –నవాత్మానం మన్యే ,నవ రస మహా తాండవ నటం 
                ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ,ముద్దిస్య దయయా –సనాదాభ్యాం జజ్ఞే ,,జనక జననీ ,మజ్జాగదిదం ”
                   తాత్పర్యం –కౌమారీ !మూలాధారం లో నాట్య రూప నృత్యాన్ని తిల కిస్తు ,సమయ అనే పేరు కలిగి ,ఆనంద భైరవి అనే శక్తి తో కలిసి శృంగారం మొదలైన నవ రసాలతో ,తాండవ నృత్యం చేసే నటుడు అయిన ,నవాత్ముడు అయిన ఆనంద భైరవుని గా తలుస్తాను .దగ్ధ జగత్తు ను మళ్ళీ సృష్టించాలి అంటే ,ఆనంద భైరవీ ,భైరవు ల చేత మాత్రమె చేత నవు తుంది . 
                   విశేషం –శివా శివు లిద్దరికీ ఆధార చక్రమే అధిష్టానం .జగత్తు కోసం జననీ జనకులు ఉన్నారు .అందుకోసమే ఇద్దరూ ప్రయత్నిస్తారు .నృత్యం లో ఇద్దరు ,ఏక రూపాన్ని పొందుతారు .ఇద్దరు అరుణ వర్ణులై ,అవస్థా రూప సామ్యం పొందారు .ఇద్దరు నవాత్మకలే .”తటి త్వంత్య్హం ”అంటే తటిత్తు  ,విద్యుత్తూ కల వారు అని అర్ధం .హృదయ కమలం లోని భగ వతి ఐహిక ఫలాలన్నీ ఇస్తుంది .సకల విద్యా దానం చేస్తుంది .స్త్రీ వశీ కరణ శక్తి నిస్తోంది .హృదయ కమలం లో హోమ ,తర్పణాలు చేస్తే ,ఐహిక ఫలాన్నిస్తుంది .కనుక అంతరిక పూజ చేయా లని భావం .
         జగత్తు ను ఉత్పత్తి చేయ టానికి లాస్య ,తాండవ పరాయణత్వం వల్ల  మాతా ,పితృ భావం కలుగు తుంది .ఆధార చక్రం లో ప్రాణ నిరోధకం కాగా ,యోగి నృత్యం చేస్తాడట .ఆధార చక్రం లోనే విశ్వం అంతా కనీ పిస్తుంది .సృష్టికి ఆధార మైంది ఆధార చక్రం .ఇదే సర్వ వేదాలకు ,దేవతలకు ఉనికి పట్టు .
               సశేషం –మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ –14-10-12–ఉయ్యూరు .
Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు వరకు – ఆలోచనా లోచనం

సాహితీ బంధువులకు -శుభ కామనలు –ఏప్రిల్ నుంచి  ఆరు నెలలు అమెరికా లో మా అమ్మాయి కుటుంబం తో సంతోషం గా గడిపి ,ఈ రోజే అక్టోబర్  అయిదు శుక్రవారం ఉదయం హైదరా బాద్ కులాసాగా చేరాం .భగవంతుని ఆశీస్సుల వల్ల ,మీ అందరి శుభా కాంక్షల వల్ల అంతా సవ్యం గా ఆనందం గా గడిచింది .ఈ ఆరు నెలలు  అనునిత్యం ,సరస భారతి మిమ్మల్ని పలకరిస్తూనే ఉంది .మీ స్పందనను గమనిస్తూనే ఉంది .. మీ లాంటి వీక్షకులు ఉండటం సరస భారతి అదృష్టం .మీ నిండు  ఆశీర్వచనాలు కలకాలం సరస భారతికి  లభించాలని కోరు కొంటు

సాహితీ బంధువులకు శుభ వార్త –ఆకాశ  వాణీ విజయ వాడ కేంద్రం వారి కోరిక పై ‘ఆలోచనా లోచనం ”శీర్షిక కునేను  రాసిన వ్యాస పరంపరను ఆర్ష  భారతీ వికాస పరిషత్ -గన్నవరం వారు పుస్తక రూపం లో తీసు కు వస్తున్నట్లు తెలియ జేశారు .త్వరలోనే పుస్తకం వెలువడు తుందని తెలియ జేయ టానికి సంతోషిస్తున్నాను .ఇది ”సరస భారతి ”కి లభించిన గౌరవం గా భావిస్తున్నాను మీ–దుర్గా ప్రసాద్

 https://sarasabharati-vuyyuru.com/tag/%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%A8%E0%B0%82/

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సాహిత్యం లో చైనా కు తోలి నోబెల్ సాధించిన మో యాన్

సాహిత్యం లో చైనా కు తోలి నోబెల్ సాధించిన మో యాన్

 

                  చైనా దేశానికి  ఇంత వరకు సాహిత్యం లో నోబెల్ పురస్కారం లభించ లేదు .ఆ కొరతను తీర్చి రికార్డు సృష్టించారు చైనా రచయిత మో యాన్

ఇది చైనా వారికే కాక ఆసియా  వారంతా గర్వించ దగిన వార్త   .చైనా దేశపు జానపద సాహిత్యానికి లభించిన కీర్తి కిరీటంఇది .జాన పదాన్ని ,భ్రాంతి పూర్వక వాస్తవం తో జోడించిన రచనలను ఆయన చేసినందుకు లభించిన పురస్కారం .దీని తో చైనా ఒక్క సారి గా ప్రపంచ సాహిత్య పటం  మీద చోటు దక్కించు కొన్నది .
-ఆయన అసలు పేరు గువాన్ మోయే.అయితే కలం పేరుగా ఆయన” మో యాన్” అనే పేరు ను ఎన్ను కొన్నారు .ఆ మాటకు చైనా లో అర్ధం -”మాట్లాడను(కు) ”అని . మన ”మౌనం ”- అనే మాట కు అది సరైన  పదమేమో ?అంతే కాక చైనా లో రచయిత ల,కళా కారులపై  పై నిర్బంధం,ఆంక్షలు సెన్సార్లు  కూడా కారణం కావచ్చు .అది కావాలని ఎన్నుకొన్నమాట అన్న మాట .
                  చైనా లో షాన్ డాంగ్ కు ఈశాన్య ప్రాంతపు గ్రామీణ వాతా వరణం లో యాన్ చిన్న నాటి జీవితాన్ని ,కల్లోల పరిస్తితులను తన రచన ల లో ప్రతి బిమ్బింప జేశాడు .ఆయన పన్నేండవ  ఏటనే స్కూలు జీవితానికి బల వంతం గా స్వస్తి  చెప్ప వలసి వచ్చింది .ఆయనేమీ ఆగర్భ శ్రీ మంతుడు కాదు .కటిక దరిద్రాన్ని అనుభ వించిన వాడు .కడుపు నింపు కోవటానికి తిండి దొరక్క పోతే కలుపు మొక్కలను ,చెట్టు బెరడు లను తిని బతికిన వాడు .చిన్న తనం లో గొడ్లను కాసి బతికాడు .బియ్యం ఎలా ఉంటాయో తెలీని దుర్భర దారిద్ర్యాన్ని అనుభ వించాడు .ఆయనకు పన్నెండేళ్ళ వయసు లో మావో గారి సాంస్కృతిక విప్లవం ఆరంభ మైంది .దాని వల్ల  గ్రామీణ జీవిత విభాగం ఎంత అల్లా కల్లోలానికి లోను అయిందో ఆయన రచనల లో ఆవిష్క రించాడు .వాటి నన్నిటిని యాన్ తాను రాసిన ”రెడ్  సొర్ఘం  ”పుస్తకం లో అద్దం  పట్టాడు .అది సినిమా గా వచ్చింది .చైనా దేశపు ప్రఖ్యాత సినీ దర్శకుడు ఝాంగ్ యిమౌవ్ ఆ నవలను అద్భుతం గా తెరకు ఎక్కించాడు .అది అవార్డులను గెల్చుకోన్నది .
              యాన్ నవల ల లో ఇరవై వ శతాబ్దపు చైనా లోని కల్లోల పరిస్తులను ,,సాంస్కృతిక విప్లవం తెచ్చిన సంక్షోభాన్ని, బల వంత ,కుటుంబ నియంత్రణ లో చూపిన రాక్షస విధానాలను  శక్తి వంత మైన పద జాలం తో ఎండ గట్టాడు .మూడేళ్ళ క్రితం ఆయన రాసిన ”ఫ్రాగ్  ”అనే రచన లో బల వంతపు భ్రూణ హత్యలకు ,వరుస గర్భ స్రావాలకు ప్రోత్సహించ టానికి సాక్షీ భూత మైన ఒక మిడ్ వైఫ్ జీవితాన్ని వర్ణించాడు , .

             నోబెల్ పురస్కార ప్రకటన విన్న యాన్ ను పత్రికా విలేకరులు చుట్టు  ముట్టి ప్రశ్నల పరంపర కురిపించారు .దానికి ఆయన చెప్పిన సమాధానం ఆయన వినయాన్ని తెలియ జేస్తుంది .”నా కంటే గొప్ప, మంచి , రచయితలు  ఎందరో చైనా లో ఉన్నారు .వారంతా నాకంటే పెద్ద వారు .వారితో  సమాన మైన సాహిత్య స్థాయి నాకు లేదు .అయినా నన్ను ఈ పురస్కారం వరించటం నాకు అమితాశ్చర్యం  గా ఉంది ”అన్నాడు .ఆయన రచనలకు నేపధ్యం ఆయన స్వగ్రామమైన గోమి గ్రామమే .తనకు చైనా దేశమన్నా ,దాని గ్రామీణ జీవన మన్నా ,అక్కడి ప్రజలన్నా  ,వారి జాన పద కధలన్నా వారి ఆచార వ్యవహారాలన్నా అమిత మైన ఇష్టం అన్నాడు యాన్ .అవన్నీ  తన రచన లలో చోటు చేసుకొన్నాయని చెప్పాడు .తాను కలం పట్టి సాహిత్య సృష్టి  ప్రారంభించిన నాటి నుండి జాన పద సంస్కృతికి సంబంధించిన మూల విషయాలకే ప్రాధాన్య మిస్తున్నానని చెప్పాడు .
            1987 లో ఆయన సృష్టించిన ”రెడ్ సొర్గం  ”.నవలా కధలో చైనా ను జపాన్ దేశం ఆక్రమించిన నాటి కాలం లో ఒక యువ తి జీవితాన్ని చిత్రించాడు .దీని తో ఒక్క సారి గా ఆయన ప్రసిద్ద రచయిత గా గుర్తింపు పొందాడు .ఆయన రచన లలో నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది .  అప్పటి నుంచి చైనా లోని విపత్కర పరిస్తితులను కళ్ళకు కట్టేట్లు రాస్తూనే ఉన్నాడు .సామాజిక జీవితాలను ఆదర్శ వంతం గా గడపాలన్న పూర్తీ నమ్మకం ఉన్న రచయిత యాన్ .అందుకే 1992 లో ”రిపబ్లిక్ ఆఫ్ వైన్ ”అనే రచన లో చైనా లోని తాగుడు సంస్కృతి ని,దాని తో ప్రభుత్వం లోఅన్ని స్తాయిలలో  పెరిగిన అవినీతి ని  ఎత్తి చూపించాడు .2004ఆయన రాసిన ”బిగ్ బ్రేస్త్స్ అండ్ వైడ్ హిప్స్ ”రచన లో క్వింగ్ రాజ వంశ పతన కాలం నేపధ్యం గా  ఒక తల్లి, ఏడుగురు కూతుళ్ళ జీవితా లను చిత్రించాడు . .
             మో యాన్ కు సాహిత్యం లో నోబెల్ పురస్కారం రావటం అక్కడ కొందరికి కంట గింపు గానే ఉన్నట్లు సమాచారం .అక్కడి రాజకీయం సాహిత్యం ఒకే గాడిన లేవని అంటున్నారు .చైనా రాజ కీయానికి వ్యతి రేకం గా రాసినందుకే బహుమతి వచ్చింది కాని ,ఆయన సాహిత్య ప్రతిభకు గుర్తింపు నిచ్చి కాదు అని అక్కడ చెవులు కోరుక్కున్తున్నారట .ఇది మామూలే .ఏమైనా సృజనాత్మక జాన పద సాహిత్యాన్ని పరి పుష్టి చేసిన రచయిత గా ,ప్రభుత్వ ప్రజా వ్యతి రేక కార్య కలాపాలను ప్రజల దృష్టికి తెచ్చిన ప్రజా రచయిత గా మో యాన్  గుర్తింపు పొందాడు .,ఆ ఘన విజయాన్ని తన దేశానికి మొదటి సారిగాలభింప జేసి ,తాను ఆ పురస్కారాన్ని దక్కించుకొని ,చరిత్రను సృష్టించిన  రచయిత మో యాన్ కు అభి నందనాలు .
                               మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ — 12-10-12-కాంప్–హైదరా బాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి 38 వ సమా వేశం —ఆహ్వానం

 సరస   భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ – — ఉయ్యూరు   

                                            
                                38  వ సమా వేశం —ఆహ్వానం   
వేదిక –శ్రీ సువర్చ లాంజ  నేయ స్వామి దేవాలయం –రావి చెట్టు బజారు ఉయ్యూరు 
తేది ,సమయం –20-10-12- శని వారం —  సాయంత్రం 6-30 గం .లకు  
                సభా ధ్యక్షులు –శ్రీమతి జోశ్యులశ్యామలా దేవి 
                వక్త —          శ్రీ మతి .పి .పద్మావతి శర్మ 
               విషయం –నవ రాత్రి వైభవం 
               దేవీ నవ రాత్రుల సందర్భం గా   ఏర్పాటు చేసిన ఈ  ధార్మిక ప్రసంగానికి అందరు ఆహ్వానితులే .పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన 
 శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవి —  గౌరవా ధ్యక్షులు
—శ్రీ  జి.వి.రమణ –కోశాధి కారి
–శ్రీ మతి మాది రాజు శివ లక్ష్మి –కార్య దర్శి
–శ్రీ  గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు 
                                                                                                           సరస భారతి -ఉయ్యూరు 
తెలుగు లో మాట్లాడటం మన  జన్మ  హ క్కు 

 

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –24 డైలీ అమెరికా

 అమెరికా  ఊసులు –24
డైలీ అమెరికా
డైలీ అమెరికా అంటే అమెరికా లో మేమున్న ఆరు నెలలు మా నిత్య కృత్యం ఎలా జారి గిం
దని   తెలియ జేయటమే

.ఉయ్యూరు  లో రోజు ఉదయం అయిదున్నర ఆరు మధ్యలో లేచే వాళ్ళం .ఇక్కడ రోజు యేడు ,ఏడున్నర మధ్యలో లేచాము .లేవాగానే పళ్ళు తోముకొని వాళ్ళం .నేను ఒక చెంచాడు మెంతి పిండి ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కలుపు కోని తాగే వాడిని .ఆవిడ ఆపాటికి కార్య క్రమాలైన తర్వాత మార్నింగ్ మీల్సు అంటే మందులు వేసుకోనేది .ఇద్దరం కాఫీలు తాగే వాళ్ళం .ఆ తర్వాతనేను స్నానం చేసే వాడిని .తర్వాతా పట్టు బట్ట కట్టుకొని సంధ్యా వందనం ,పూజా చేసుకొనే వాడిని సుమారు ముప్పావు గంట .అప్పుడు శ్రీ రామ కోటి రాసి, భగవద్గీత కొద్దిగా పారాయణం చేసే వాడిని .అప్పుడు టిఫిన్ రెడీ చేసి ఉంచేది మా అమ్మాయి విజ్జి .ఇడ్లీ ,దోసె ఉప్మా, గారే లేక పోతే స్సేరియల్సు తినే వాల్లం.మళ్ళీ రెండో రౌండు కాఫీ కొద్దిగా తాగే వాడిని .ప్రతి మంగళ ,శని వారాలలో శ్రీ ఆంజనేయ స్వామి సహస్రనామా లతో పూజ చేసే వాడిని .గురు వారం రాఘవేంద్ర సాయి బాబా అస్తోత్తరాలు స్పెషల్ .ఆవిడ కూడా స్నానం చేసి టిఫిన్ చేసేది .నేను అప్పుడు మందులు వేసుకొనే వాడిని. ఇదంతా అయేసరికి ఉదయం తొమ్మిదిన్నర ,పది అయ్యేది  .
అప్పుడు ”కంప్యూటర్ ఎక్కే వాడిని ” .నాకోసం ఒక డెస్కు టాపు సిద్ధం గా ఉంచారు .పిల్లలకు స్కూళ్ళు కనుక పోటీ లేదు .అయినా వాళ్లకు ఐ పాడ్ ఉంది .అందుకని పెద్దగా నా జోలికి వచ్చే వారు కాదు .నేను ఉదయం పదింటి నుంచి పన్నెండున్నర వరకు కనీసం రెండు ఆర్తికల్సు రాసే వాడిని .ఆ తర్వాతా భోజనం .లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదువు కొనే వాడిని .మధ్యాహ్నం నిద్రకు ప్రయత్నించినా వచ్చేది కాదు మూడింటి దాకా మంచం మీద దోర్లుడే .అప్పుడు చదివిన పుస్తకాలలో నోట్సు రాసుకో వలసినవి ఉంటె రాసుకొనే వాడిని .లైబ్రరి పుస్తకాలకు గడువు ఇరవై ఒక్క రోజులు .నేను వెళ్లి నపుడల్లా ఇరవైకిపై గా పుస్తకాలుతెచ్చుకొనే వాడిని .వాటిని పది రోజుల్లో పూర్తి  చేసే వాడిని .సాయంత్రం మా మన వాళ్ళు శ్రీ కేత్ ,ఆశు తోష్ ,పీయూష్ లు నాలుగుమ్బావుకు స్కూలు  నుండి బస్ లో వచ్చే వారు .ఇంటి దగ్గరే స్టాపు .వీలైతే వెళ్లి తీసుకొచ్చే వాడిని .వాళ్ళు తిఫినో, తిండో  తిని కంప్యూటర్ కోసం ఎగ బడే వారు .నేను అప్పుడు ఏదైనా రాసుకొనె వాడిని . మా పెద్ద మనవడు శ్రీ కేత్  ”తాత్ గారు ఎప్పురూ కంప్యూటర్ ఎప్పురూ ఎప్పురూ ”అని వచ్చీ రాని తెలుగులో అనే వాడు .మా ఇద్దరికే కంప్యూటర్ విషయం లో తగాదా .వాళ్లకు ఇచ్చి మళ్ళీ నేను పుస్తకం చదువు కొనే వాడిని .పిల్లలు బడి నుంచి వచ్చే లోపు మా అమ్మాయి మమ్మల్ని ఎక్కడి కైనా షాపింగులకు తీసుకు వెళ్ళేది .పిల్లలోచ్చే సమయానికి ఇంటి దగ్గర ఉండే వాళ్ళం .సాయంత్రం అయిదింటికి టీ తాగే వాళ్ళం .నేను కాసేపు బయట నడక సాగించి వచ్చే వాడిని .సాయంత్రాలు వాళ్ళు జిమ్నాస్తిక్సుకో ఆర్టు క్లాస్ కో లైబ్రరీ క్లాసులకో వెళ్తే నేనూ వాళ్ళతో వెళ్ళే వాడిని
మా ఆవిడ సాయంత్రం ఆరు గంటల నుండి మా టి.వీ .చూసేది .అందులో వసంత కోకిల ,చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టపడి చూసేది ,నేను చిన్నారి పెళ్లి కూతురు చూసే వాడిని .మిగతా చానేల్లెప్పుడు చూడా లని పించేది కాదు .రాత్రి తొమ్మిదింటికి ఈ టి.వి .లో వార్తలు చూడటం అల వాటు . రాత్రి ఎనిమిదింటికి భోజనం చేసే వాళ్ళం .మళ్ళీ చదువు .నా చదువు అంతా మంచం మీద పడుకొనే .రాత్రి పదిన్నర దాటి తె మా ఆవిడ ఇక చాలనేది .అయినా పదకొండున్నర వరకు చదువు కొనే వాడిని  .పుస్తకాలే నాకిక్కడ నేస్తాలు .మా అమ్మాయి పనులన్నీ పూర్తీ చేసుకొని పదిన్నరకో పదకొండింన్తికో మా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది .అప్పుడే ఇండియా కు ఫోన్లు చేయటానికి వీలుండేది .మా అల్లుడు రోజంతా ఇంట్లో నె ఉండి పని చేయటం ,ఎప్పుడూ ఫోన్లలో కాన్ఫరెంసులలో బిజీ గా ఉండటం వల్ల వీలయ్యేది కాదు .
ఉయ్యూరు నుండి మా మనవడు చరణ్ స్కైప్ప్ లోమధ్యాహ్నం పన్నెండు  కు  చక్కగా పది హేను రోజుల కోసారి మాట్లాడే వాడు .అక్కడ రాత్రి తొమ్మిదిన్నర అయ్యేది .పాపం కళ్ళు వాలి పోతున్నా కూర్చుని మాట్లాడే వాడు .మిగతా వాళ్ళంతా మేము చేస్తేనే .వచ్చిన మొదటి నెలలో సాయి సెంటరు వాళ్ళ భజనలకు బాగానే వెళ్ళాము .అవి రాత్రి పూట ఉండేవి .ఆ తర్వాత తగ్గించాం .ప్రక్క ఇంటి గాయత్రి వచ్చి పలకరించి పోతుంటుంది .ఆమె అత్తగారు ,మామ గారు వచ్చిఅన తర్వాతా వారితో పరిచయం బానే ఉంది .నాగమణి తన పని ఉంటె వచ్చి వెడుతుంది .ఇక్కడి కుటుంబాలలో పవన్ ,రాంకీ జగదీశ్ కుటుంబాలతో చాలా సన్నిహితం గా ఉండే వాళ్ళం .వాళ్ళకూ మా మీద గౌరవం బానే ఉంది .మా పెద్ద మనవడు శ్రీ కేత్ భజనలు ఐ పాడ్ నుండి నేర్చుకొని పాడే వాడు .మా చిన్నమనవాళ్లు తెలుగులో మాట్లాడటం తక్కువే .అమ్మా అని అంటారు తండ్రిని డాడీ అంటారు ” కాలికి దెబ్బ తగిలితే  ”కాల్నోప్”అంటారు .”ఐ డిడ్ స్నానం ”అంటారు కలగా పులగం గా .పప్పు ,కూరా చట్నీ అంటారు ”.బుజ్జి ముండలు” అల్లరి చేయ కుండా ముగ్గురు హాయిగా ఆడుకొంటారు .అందులో పీయూష్ నా పోలికే .నేను పిలిస్తే దగ్గరకు వెంటనే వస్తాడు .వాళ్ల అమ్మమ్మ పిలిస్తే రాడు .నేను ముద్దు పెట్టుకొంటే ,వాడూ పెట్టుకొంటాడు .లేక పోతే ”యు డూ ”అంటాడు .ఆశుతోష్ మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు బానే వస్తాడు ,ముద్దులిస్తాడు .రాత్రి తొమ్మిదిన్నరకు ఆశుతోష్ మా దగ్గరకు వచ్చి పడుకొంటాడు .ఒకో సారి ఇక్కడే .పీయూష్ మాత్రం రాడు.కాని వాడు మా దగ్గర పడుకొంటే వీడు  సహించలేడు .ఎలా గైనా వాడిని అప్ ష్ట యిర్ కు తీసుకు పోతాడు పోట్లాడయినా .ఆటలు లేక పోతే కంప్యూ టర్, లేక పోతే, టివి.తప్ప ఇంకే ధ్యాసా లేదు .వాళ్ల తో గడపటం మహా దానందం గా ఉంది .అప్పుడే ఆరు నెలలు అయిందా అని పిస్తోంది .
ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి సరస భారతి 30,000మందిని ఈ ఆరు నెలల్లో పలకరించింది .అంటే నేలకు అయిదు వేల మందిని స్పర్శించింది .అంటే రోజుకు సరస భారతిని నూట ఏభై మంది చూశారు .నేను ఈ ఆరు నెలల్లో 370ఆర్తికల్సు రాశాను .అంటే నేలకు అరవై.అంటే రోజుకు సరాసరి రెండు .ఒక సాహిత్య సంస్థకు ఇంత కంటే గొప్ప ప్రచారం ఏమి ఉంటుంది .అందరు చదివి ,ఆనందిస్తున్నారు ఆదరిస్తున్నారు .సాహితీ సేవ విదేశీ గడ్డ మీద ఇలా జరగటం సరస భారతికి ముందడుగే .అందరికి అభి నందనాలు .అమెరికా లో ఎన్నో కార్య క్రమాలలో పాల్గొన్నాం .ఎల్లా వారు, ఈల శివ ప్రసాద్ ,మణి శర్మ .మైనేని వారి హన్త్స్ విల్ ,అట్లాంటా ,దేవాలయాల సందర్శనం, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వగైరా .అన్నీ ఆనందాన్ని తృప్తినీ ఇచ్చాయి అమెరికా లోని భారతీయ మిత్రులకు వీడ్కోలు పలుకుతున్నాము .మాది ఈ సారి నిజం గా సాంస్కృతిక యాత్రే  . ఎవరైనా నన్ను ఇక్కడి వాళ్ళు మీరు ఎలా కాలం గడుపుతున్నారు ? అని అడిగితే నేను నవ్వుతూ ”కంచం ఖాలి -మంచం భర్తీ ”అనే వాడిని .కాని అలా చేయలేదని మీరు గ్రహించే ఉంటారు .గుడ్ బై అమెరికా —
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –3-10-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –15

 శ్రీ శంకరుల లలి  (కవి )తా సౌందర్య లహరి –15
38–”సమున్మలత్సంవిత్కమల ,మక రందైక రసికం –భజే హంస ద్వంద్వం ,కిమపి ,మహతాం ,మానస చరం
యదా లాపా ,దష్టా ,దశ గుణిత ,విద్యా పరి నతిహ్ –యదా దత్తే ,దోషాద్గుణ ,మఖిల మాధ్యం వయ ఇవ ”
తాత్పర్యం –భావనా గమ్యా -!వికసించే జ్ఞానం అనే కమలం లో ,అంటే అనాహతం లో ,పుష్ప రసాన్ని ఆస్వాదించే ,రసజ్ఞనత ను ,యోగీశ్వరుల మానస సరోవరం లో సంచ రించే ,అనిర్వచనీయ శక్తి గల ,హంసేశ్వర ,హంసేశ్వరీ దేవుల సమ్మిళితం అయిన రాజ హంస జంటను భజిస్తున్నాను .వాని వల్లే ,అష్టా దశ విద్యలూ లభించాయి .హంస పాలను మాత్రమె ఎలా గ్రహిస్తుందో ,ఈ జంట దోషాల నుండి సద్గుణాలను మాత్రమె గ్రహిస్తుంది .
విశేషం –అనాహతం లో అగ్ని జ్వాలారూపు డైన పరమేశ్వరుడు గా ఉన్న వాడిని ”సమయుడు ”అంటారు .అగ్ని జ్వాలా రూపిణి భగవతి ” సమయ” అంటారు .ఆ జంట ,నా హృదయ పద్మం లో నివ సించాలి .సోహం అంటే హంస అని హంస శబ్ద మహా వాక్యార్ధం ప్రబోదిస్తోంది .హ అంటే శివుడు .సహ్ అంటే శక్తి .”భజే హంస ద్వంద్వం ”అని శృతి చెప్పింది .శివ ,శక్తి జంటను భజించమని అర్ధం .అదే జీవాత్మ ,పరమాత్మ ల ద్వంద్వం .దీనినే ఉపనిషత్ ”ద్వా సుపర్ణా ”మంత్రం లో చెప్పింది .
39–”తవ స్వాదిష్టానే ,హుత వహ మధిష్టాయ నిరతం –తమీడే ,సంవర్తం ,జనని మహతీం ,తాంచ సమయం
యదా లోకే ,లోకాన్ దహతి ,మహతి క్రోధ కలితే –దయార్ద్రాయా ద్రుష్టిశ్శిశిర ,ముప చారం ,రచయితి ”
తాత్పర్యం –తేజో వతీ !నీ స్వాధి ష్ఠాన చక్రం లో ,అగ్ని తత్వాన్ని కల్గి ఉన్న ,నిరంతరం ప్రకాశిస్తున్న, ,సంవర్తాగ్ని పేరు తో నిరంతరం వెలిగే పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .ఆయనతో అధిష్టాన ,అవస్తాన ,అనుష్టాన అనే పేర్ల తో సమాన సమయవు అయిన నిన్ను స్తుతిస్తున్నాను .సంవర్తాగ్ని స్వరూపు డైన ఆ పర మేశ్వరుని ,అతి కోప వీక్షణం ,లోకా లను దాహిస్తుంటే ,నీ కృపా వీక్షణం తో చల్ల బడి ,ఉప చారం పొందు తోంది .
విశేషం –స్వాధి ష్టానం  లో సంవర్తెశ్వర ,సమయాంబ దేవ ,దేవీ యుగాళాన్ని పూజించాలి అని భావం.
40–”తటిత్వంతం శక్త్యా ,తిమిర పరి పంధి ,స్ఫురణయా –స్పురన్నానా రత్నాభరణ ,పరినేద్దేంద్ర ధనుశం
తవ శ్యామం ,మేఘం ,కమపి ,మణి పూరైక శరణం –నిషేవే ,వర్షంతం ,హర మిహిర తప్తం ,త్రిభువనం ”
తాత్పర్యం –మాలినీ !నీ మణి పూరక చక్రమే ముఖ్య మైన గృహం గా ఉండి ,అందులోని అంధ కారానికి శత్రువైన ,మెరుపు యొక్క ప్రకాశ శక్తి కలదీ ,అనేక రత్నా లచే నిర్మింప బడిన, నగల చేత అమర్చ బడిన, ఇంద్ర ధనుస్సు కలది ,శ్యామల వర్ణం కలిగి ఉన్నదీ ,హరుడు అనే మహా సంవర్తాగ్ని అనే ,సూర్యుని ఛే ,కాల్చబడిన ముల్లోకాలను ,తన వర్ష దారల చేత తడిపే ,వర్ణించ టానికి శక్యం కాని దైన మేఘం అనే సదా శివుని అధికం గా సేవిస్తున్నాను .
విశేషం –సూర్య కిరణాగ్ని ఛే మేఘాలు ఏర్పడి జల రూపం లో మణి పూరం లో ,ఆధార ,స్వాధిష్ఠానాల మధ్య ఉండే వాడు .అనాహతం పైన ,స్వాధిష్ఠాన అగ్ని తో కలిసి  ,మణి పూరాన్ని చేరి ,జల రూపం పొంది ,ఆ జాలం చేత స్వాదిష్టానాగ్ని దగ్ధ మయ్యే జగత్తును తడుపు తున్నాయి .ఆది ఆగమ రహస్యం.
అరుణ ఉపనిషత్ లో ”యోపాం పుష్పం వేదా ”నుంచి ”ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితా”వరకు ఉన్న దానిలో రహస్యం కూడా ఇదే నని విజ్ఞుల భావన .ఉదకం నుండి చంద్రుడు ,సూర్యుడు ,అగ్ని రోజులు ,నక్షత్రాలు ఉత్పత్తి అవుతున్నాయని భావం .ఉదకానికి సార భూతు డైన చంద్రుని యోగీశ్వరులు పొందుతారు .సూర్య మండలం లో అమృతం (శుక్రం )అన్ని చోట్లా పూరింప బడుతుంది .చంద్ర మండలం నుండి స్రవించే పీయూష (అమృతం )ధారల వాళ్ళ సూర్యుడు తపన కార్యం చేస్తాడు .మణి పూరకం లో శ్రీ చక్రం ప్రతిష్టితం .
మణి పూరకం లో మేఘేశ్వర ,సౌదామినులు ఉంటారు .అమ్రుతేశ్వర ,అమ్రుతేశ్వరి పేర్లతో పిలుస్తారు .ఇక్కడే104  మంది దేవతలు ,లోపాముద్రాదులు ఉన్నారని సాంప్రదాయం .”మేఘం నిషేవే –నితరాం సేవే భజామి ”అమ్రుతేశ్వర పేరు గల దంపతులను అనవరతం భజిస్తాను అని అర్ధం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –3-10-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –41 కాటా కుస్తీలు

ఊసుల్లో ఉయ్యూరు –41
                                       కాటా కుస్తీలు 

మా ఉయ్యూరు లో రెండు మూడేళ్ళు జోరుగా కుస్తీ పోటీలు జరిగాయి .వీటికి వేదిక రాజా గారి కోట .అక్కడ జనం కూర్చోవ టానికి ,కుస్తీ గోదా కు  స్థలం బాగా ఉండేది .అందుకని అక్కడ నిర్వ హించే వారు .వీటిని కాటా కుస్తీలని పిలిచే వారు .ఎక్కడెక్కడ నుండో పహిల్వానులు వచ్చే వారు .వాళ్ళను చూడటం మాకు ముచ్చటగా ఉండేది .అపర భీమిడిలా ఒక్కోరు కనీ పించే వారు .కుస్తీ చూడా లంటే డబ్బు పెట్టి టికెట్టు కొనుక్కోవాల్సి వచ్చేది . రేట్లు పాతిక నుంచి కిందకు ఉండేవి .కుర్చీలు ,బెంఛీ లు, నేల మీదా కూర్చుని చూసే  వారు .కుస్తీ పోటీ రంగాస్తలాన్ని” గోదా ”అనే వారు .దాని చుట్టూ గట్టి స్తంభాలతో సరుకు బాదులతో జనం లోపలి తోసుకు రాకుండా బందో బస్తు చేసే వారు . .టికెట్లు అమ్మటానికి ఒక ఏర్పాటు ఉండేది .మైకుల్లో  ఓ నెల రోజుల ముందు నుంచే బాగా ప్రచారం చేసే వారు .కుస్తీ జరిగే కాలం లో బజార్లన్నీ సందడి గా ఉండేవి .అంతా కుస్తీ ల గురించే మాట్లాడు కొనే వారు .ఎక్కడో బస్తీ ల లో జరగాల్సిన పోటీలు ఉయ్యూరు లాంటి పల్లె టూరి లో జరగటం వింత గా చెప్పుకొనే వారు .అదో జాతర .ఇవాళ క్రికేట్టుకు ఎంత క్రేజు ఉందొ ,ఆనాడు కుస్తీలకు అంతటి క్రేజు ఉండేది .ఆడా ,మగా అందరు ఆ విషయమే మాట్లాడుకొనే వారు .ఇదంతా పోటీలకు నేపధ్యం .మగ్గాళ్ళేకుస్తీ పోటీలు చూసే వారు .
కుస్తీ ఫహిల్వాన్లకు మహా ఫాలోయింగు ఉండేది .పేరు మోసిన ఫహిల్వన్ ఊళ్లోకి వస్తే బాజా భజంత్రీలతో అభి మానులు స్వాగతం చెప్పి తీసుకొని వచ్చే వారు .వారి మీద గులాం, పూలు చల్లుతూ జైలు కొడుతూ హడా విడి చేసే వారు .వారంతా గాల్ల లున్గీలే కట్టుకొనేవారు .కొందరు ఫహిల్వానులను ఆహ్వానించి  ముందు నుంచే వారికి వసతులు కల్పించే వారు .మా ఇళ్లకు దగ్గర లో ఉన్న వంగల వారి సందులో వంగల సూర్యం ఇంటి వెనక కోమటి సాంబయ్య గారి బావ గారి పెంకు టిల్లుండేది .అక్కడ ఫహిల్వానులకు మకాం ఏర్పాటు .ఫహిల్వానులకు రోజూ పాలు, బాదం పప్పు ,పిస్తా పప్పు, జీడి పప్పు లతో తిండి పెట్టి తయారు చేసే వారు .వేట మాంసం ,గుడ్లు సరే సరి .బలిసిన గొర్రెలు మేకలు అక్కడ కట్టేసి ఉండేవి .వంట చేసే వాళ్ళుండే వారు .ఫహిల్వానులకు అన్ని సపర్యలు చేసే సేవకులను లేదా చోటా ఫహిల్వానులను ఏర్పాటు చేసే వారు .గురువు గార్ల గురించి శిష్యులు మహా గొప్పగా చెప్పుకొనె వారు .ఒళ్లంతా నూనె తో మర్దనా స్నానం సాంబ్రాణి పోగా సెంట్లు అత్తరు లతో వాసనేసి పోయే వారు .  .వాళ్ళను  పందెం కోళ్ళను ను మేపి నట్లు మేపే వారు .వారు కండ పట్టి బలే నిగా నిగా లాడే వారు .కండలను ప్రదర్శించే వారు .కుస్తీ లంగోటీ ని కట్టివ్యాయామం చేసే వారు .దానికి ప్రత్యెక కర్ర సాధనాలున్దేవి .పరిగెత్తే వారు .బస్కీలు తీసే వారు .మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి వాళ్ల సాధన చూసే వాళ్ళం .అదో సరదా కాలక్షేపం .
కుస్తీపోటీలు   సాయంకాలం అదీ ఆది వారం నాడు జరిగేవి . .అప్పటికే బజారు నిండా జనం నిండి పోయే వారు .ఎవరు గెలుస్తారని పందాలు కాసే వారు .కొన్ని పోటీలు రంజు గా జరిగే వని చెప్పుకొనే వారు .మేమెప్పుడు టికెట్ కోని చూసిన జ్ఞాపకం లేదు .బందో బస్తు బాగా ఉండేది .ఫ్రీ గా లోపలి ఎవరినీ పోనిచ్చే వారు కాదు .పోలీసులు కూడా మోహరించే వారు .వాళ్లను మచ్చిక చేసుకొని కొందరు లోపలి దూరే వారు .కుస్తీ పోటీ కి రిఫరీ ఉండే వాడు .గోదాం లో అడుగున ఇసుక పోసే వారు .పోటీ దార్లు ఇద్దరి చేత రిఫరీ షేక్ హాండ్ ఇప్పించే వాడు .ఒంటికి నూనె రాసుకొని రంగుల లంగోటీ తో గోదా  లోకి దిగే వారు .చాలా తీవ్రం గా నె పోట్లాడు కొనే వారు .గెలుపోటముల నిర్ణయం రిఫరీదే .దానికి అందరు బద్ధులవాల్సిందే.గెలిచినా వాడిని డప్పు లతో ఊరంతా త్రిప్పి అభిమానాన్ని చాటుకొనే వారు .ఓడిన వాడు విచారం తో వెళ్లి పోయే వాడు .
ఒక్కో సారి బాగా దున్న పోతు లాగా బలిసిన ఫహిల్వాను అంత బలం లేని ఫహిల్వాన్ చేతిలో ఒడి పోవటం ఆశ్చర్యం గా చెప్పుకొనే వారు .అప్పుడే ”లాలూచి కుస్తీ ”అనే వారు .దీనికి బలిసిన ఫహిల్వానుకు  బక్క ఫహిల్వాను  ముందే డబ్బిచ్చి ఒడి పోయే పట్లు పట్టించే వాడన్న మాట .అదీ రహస్యం .మొదటి రెండేళ్లు బాగా సరదాగా పోటీలు జరిగేవి .ఆ తర్వాత తర్వాత లాలూచీ ఎక్కు వైంది .అందుకని పోటీలకు జనం వెళ్లటం తగ్గించారు .మా ఉయ్యురుకు చెందిన ఒక ముస్లిం ఫహిల్వాన్ ఉండే వాడు .ఆయన మా అత్తరు సాహేబు గారి కొడుకు .గల్ల లుంగీ కట్టి  జబర్దస్తీ గా ఉండే వాడు .ఆయన కూడా పోటీలలో పాల్గొనే వాడు .అయితే అయన గెలిచిన దాఖలా లేదని జ్ఞాపకం .కుస్తీ పోటీలను డబ్బున్న షావుకార్లు ఖర్చు పెట్టి నిర్వ హించే వారు .మొదట్లో వారికి డబ్బులు బాగానే గిట్టు బాటు అయేవి . .క్రమంగా తగ్గింది .జనానికి వ్యాపకాలు కూడా పెరిగి పోయాయి .దాని మీద ఆరాటం తగ్గింది .మరీ లాలూచీ కుస్తీలు అంటే ఇవాళ మనం అనుకొనే ”మాచ్ ఫిక్సింగులు ”ఎక్కువ అవటం తో గిరాకీ బాగా పడి పోయింది .లోపల జనాన్ని సర్దు బాటు చేయటం చాలా కష్టం గా ఉండేది .అందుకని నిర్వాహకులు కొందరు రౌడీలను మేపి తమ మనుష్యులు గా ఉంచుకొని పోటీ సక్రమం గా జరి గె టట్లు, బెవారసు జనం  లోపలి రాకుండా చేయ టానికిఉప యోగించు కొనే వారు ..
కోట బయట అన్ని రకాల దుకాణాలు వచ్చేవి .మిథాయి కోట్లు ,సోడా కోట్లు, డ్రింకు షాపులు, సిగరెట్ బీడీ, చుట్టా అన్నే అమ్మే వారు .జనం బాగా మందుకొట్టి వీరంగం వేసే వారు .మధ్యాహ్నం నుంచే చాలా హడా విడి ఉండేది .చివర్లో జనం గేట్లు తోసుకు లోపలి వెళ్ళే వారు .లేక పోతే ప్రక్క దొడ్ల లోంచి గోడ దూకి వెనుక వైపు నుండి వెళ్ళే వారు .మాకు ఈ విషయాలన్నీ మా మిత్రుడు ఆది నారాయణ చెప్పే వాడు .అతను విషయ సేకరణ లో భలే ముందుండే వాడు .కోమటి సాంబయ్య గారి స్థలం లో కూడా కొన్ని పోటీలు జరిగిన గుర్తు .అయితే స్థలం చిన్నది .ఇక్కడే” రక్త కన్నీరు” నాటకాలు  నాగభూషణం ఆడారు .ఆ డైలాగులు మాకు విని పించేవి .దానికి ప్రచారం గా ఆయన డైలాగుల రికార్డులు పెట్టె వారు ”గోపాలం ఏమిటి తప్పాలం లాగా -గోపాల్ కాదు ఓన్లీ పాల్ ”అనే డైలాగు ఎవరూ మరిచి పోనిది .ఆ నాటకం లో ఆయన స్థానిక విషయాలను చొప్పించి సందర్భానికి తగి నట్లు అల్లి, జనం చేత చప్పట్లు కొట్టించు కొనే వాడు .ఆది ఆయన స్పెషాలిటి .నాజర్ కూడా బుర్ర కధలో ఊరి రాజకీయాలను ఏకి పారేసే వాడు .కుస్తీల నుంచి ,నాటకం దాటి, బుర్ర కధలోకి ప్రవేశించాం . .అదీ  మా ఉయ్యూరు కోట ,సాంబయ్య గారి గొడ్ల దొడ్డి మహాత్మ్యం .
ఉండ్రాళ్ళ తద్దె గాంధీ, జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12-కాంప్ –అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –40 ఉప్పెన లో ఉయ్యూరు

 ఊసుల్లో ఉయ్యూరు –40     ఉప్పెన లో ఉయ్యూరు
                                                         

    
ఆది 1948-50 మధ్య కాలం . సంవత్సరం నాకు జ్ఞాపకం లేదు .అప్పుడు బ్రహ్మాండ మైన ఉప్పెన వచ్చింది .బహుశా వేసవి లో నని అనుకుంటా .వారం రోజులు భూమికీ ఆకాశానికి తాళం వేసి నట్లు ధారా పాతం గా వర్షం .కుండా పోత వర్షాలు .ఈదురు గాలి ,విపరీత మైన చలి .ఆ వారం జన జీవితం అంతా ఛిద్రం .ఎవ్వరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది లేదు .జోరు గాలికి తలుపు లన్నీ వేసేయ్యటమే .కరెంటు అప్పటికి ఇంకా మాకు రాలేదు .మాకే కాదు చాలా మంది ఇళ్ళల్లో ఉండేది కాదు . నాకు ఎనిమిది  నుంచి పదేళ్ళ లోపు .కిరస నాయలు దీపాలే .చిమ్నీ దీపాలు ,లాంతర్లె గతి .అవీ ఒకటో రెండో ఉండేవి .మాది మండువా లోగిలి పెంకుటిల్లు .నీళ్ళు ఇంటి మధ్యలో నుండి గరాటు లాంటి ”దోనే ”  ద్వారా సత్తు గొట్టాల ద్వారా దక్షిణం వైపు సందులో పడే ఏర్పాటు చాలా కాలం వరకు ఉంది .అదీ రెండంగు ళాల వెడల్పు గొట్టం .ఒక మాదిరి వర్షం అయితే ఫర్వా లేదు కాని ”దబాటు వాన ”కు ,తుఫాను వానలకు పడే నీటికి  అవి ఆగ లేవు .కనుక దోనే లో నుండి నీళ్ళు కారి ,మా సావిడి లోనే ఎక్కువ గా పడి పోయేవి .అదీ గాక పెంకు టిల్లు కనుక పెంకులు కూడా ఆ వర్ష భీభత్సాన్ని తట్టుకోనేవి కావు .దానితో  ఇల్లంతా వర్షమే .ఆ తుఫానుకు మా ఇంటి నిండా నీళ్ళే .కాలు తీసి కాలు పెట్టలేక పోయే వాళ్ళం .బట్ట లన్నీ తడిసి పోయేవి .చాకల్లు వచ్చి ఉతికే అవకాశం లేదు .
నదులన్నీ పొంగి పొరలి ప్రవహించాయి ఆ ఉప్పెనకు .కాలువ గట్లన్నీ తెగి పోయి ఊళ్లల్లోకి నీరు వచ్చి ,బయటకు కదిలే వీలు లేక పోయింది .బజార్లలో మొల లోతు నీళ్ళున్నాయి .ఇంటి తలుపు తీసే సావకాశమే లేదు .జోరుగాలికి తలుపులు బద్దలై పోతాయేమో నని భయం గా ఉండేది .అందరు మంచాలు ఎక్కి కూర్చునే వాళ్ళం .దాని మీదే తిండీ ,తిప్పలు .వంట ఎలా చేసే వారో జ్ఞాపకం లేదు .ఏదైనా ఎత్తైన దాని మీద కట్టెల పొయ్యి తోనో ,కుంపటి లోనో చేసే వారేమో .ఏది ఉన్నా లేక పోయినా తిండి తప్పదు కదా . అమ్భం లో కుంభం అన్నట్లు మా పెద్దక్కయ లోపా ముద్ర బయట  ఉంది .ఇంట్లో కలుపు కోవటం లేదు అప్పుడు . మా సావిట్లో పెద్ద పెద్ద కిటికీలు రెండున్నాయి .అవి కూచోటానికి కూడా పనికొచ్చెంత వెడల్పు గా ఉన్నాయి .ఒక కిటికీ లో బట్టలు ,చెంబు గ్లాసు ,కంచం పెట్టుకొనేది .ఇంకో దాంట్లో అలానే కూర్చునేది .రాత్రి ,పగలు అంతే .అలా కూర్చునే నిద్ర పోయేది ఆ మూడు రోజులు అదే పరిస్తితి .నిద్రలు ఎవరికీ లేవు .ఎప్పుడు గాలికి తలుపు చెక్కలు పగిలి పోతాయో, ఎప్పుడు కప్పు కూలి పోతుందో అనే భయం తో వణికి పోయే వాళ్ళం .మా నాన్న హిందూ పురం లో, మేము ఇక్కడా ఉన్నజ్ఞాపకం.చూరుల నుండి ధారా పాతం .వాకిలి లోంచి నీళ్ళు బయటకు పోయే అవకాశమూ అప్పుడు పెద్ద గాలేదు .వాకిళ్ళ లోను మోల లోతు నీళ్ళు .ఇంకా నయమేమి టంటే ఆ నీళ్ళు ఇంట్లోకి రాలేదు అంతే .గజ గజ వణుకుతూ వారం గడిపాం .రేడియోలు లేవు .పేపర్లు రాలేదు .రైళ్ళు ఆగి పోయాయి పట్టాలు కొట్టుకు పోయాయి .మా మేన మామగంగయ్య గారు  గుంటూరు అవతల ఏదో ఊరికి వెళ్లి రైలు లో వస్తు, ఉప్పు గుండూర్ దగ్గర చిక్కుకు పోయాడు .అక్కడి నుండి బయట పడే పరిస్తితి లేక వాన తగ్గిన తర్వాత అంచెలంచెలు గా ఇంటికి వచ్చి చెప్పే దాకా మాకు రాష్ట్రం లో ఏం జరిగిందో తెలీదు .ఆ వారం అంతా మేము ”అసూర్యం పస్యలం ”గా ఉండి పోయాం .రాత్రుళ్ళు పాస్ కు వెళ్ళా లంటే సావిట్లో కిటికీ దగ్గర తూము లో పోసేయ్యట మే .అ వాసన ఆ తర్వాతా భరించ టానికి కష్టం గా ఉండేది .కొంచెం జోరు తగ్గాక గొడుగు వేసుకొని” రెండు” కోసం బయటకు వెళ్ళే వాళ్ళం .అదీ మా ఇంటి పరిస్తితి .మాదే కాదు దాదాపు అందరి పరిస్తితీ అంతే .
బయట మా రోడ్ల మీద మొల లోతు నీళ్ళు ఉండేవని  చెప్పాను .బజారుల్లో పడవలు  వేసుకొని ప్రయాణం చేశారట . మా బజారు, సూరి వారి బజారు, రావి చెట్టు బజారు అంతా జలార్నావమే .పుల్లేరు , గట్లు తెంచుకొని ప్రవహించింది .కనుక నీళ్ళే నీళ్ళు .అంత భీభత్సం నాకు ఆ తర్వాతా 1977 దివి సీమ ఉప్పెన కు చూశాను .అయితే దివి ఉప్పెనప్పుడు నీరు రోడ్ల మీదకు రాలేదు .అదీ తేడా .ఎన్ని చెట్లు కూలి పోయాయో ఎన్ని పశువులు కొట్టుకు పోవటమో, చని పోవటమో జరిగింది . . .పెంకు టిల్ల వాళ్ళకే ఇంత ప్రమాదం గా ఉంటె ,పాకలు, పందిళ్ళలో నివ సించిన వారి  సంగతేమిటో పాపం . ఎన్నో పాత పెంకు టిల్లు కూలి పోయాయని తెలిసింది .ఒక్క సారి మాత్రం ధైర్యం చేసి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాతమా సందులోని  నీళ్ళలో ఈదుకొంటు మా రోడ్డు మీదకు వచ్చి చూశాను .అప్పుడే పడవ లలో  మనుష్యులు బజార్లలో వెళ్తున్నట్లు చూశాను . .అంత నీటి ఘోరం మళ్ళీ చూడ లేదు .అదో దుర్దినం ఆంద్ర దేశానికి .బహుశా అదే ”బందరు ఉప్పెన ”ఏమో ?బందరు ఉప్పెన గురించి కధలు గాధలుగా చెప్పుకొనే వారు .ఆ తర్వాత దివి ఉప్పెన గురించి .నేను దివి ఉప్పెన ఆగి పోయిన వారానికి ఉయ్యూరు నుండి బస్సులో వెళ్లి దివి తాలూకా అంతా తిరిగి చూశా.అదో ఘోరమైన తుఫాను .అయితే మొదట్లో  నేను చెప్పిన ఉప్పెన లాంటిది మళ్ళీ చూసిన గుర్తు లేదు .ఎందుకో ఆది బాగా మనసు లో నాటుకు పోయింది .ఇవాళ ఒక్క సారి ఆ రీలు అంతా కళ్ళ ముందు తిరిగి గుర్తున్న వరకు రాశాను .మా అమ్మా వాళ్ళు కూడా అంత ఘోరం ఎప్పుడూ చూడలేదనే వారు .అయితే అదృష్టం ఏమి టంటే మాకు తెలిసిన వారందరూ కులాసాగా నె ఉన్నారు .
జాతి పిత గాంధీ జయంతి మరియు ఉండ్రాళ్ళ తద్ది శుభా కాంక్షలు
దీనితో ”ఊసుల్లో ఉయ్యూరు ”40ఎపిసోడ్లు  పూర్తి  అయాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12—కాంప్–అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –39 మా ఇంటి మంచి నీటి బ్రాహ్మ(ణు)లు

   ఊసుల్లో ఉయ్యూరు –39
మా ఇంటి మంచి నీటి బ్రాహ్మ(ణు)లు

మేము ఉయ్యూరు వచ్చిన దగ్గర్నుంచి చాలా కాలం మా పుల్లేరు కాలువ నీళ్ళే తాగే వాళ్ళం .అప్పుడు చాలా భాగం స్వచ్చం గా నే నీళ్ళు ఉండేవి .కృష్ణా నది నుండి ఈ కాలువ బ్రాంచి కాలువ .తాడిగడప ,కంకిపాడు ఉయ్యూరు పామర్రు మీదుగా గుడ్ల వల్లేరు చేరి కొల్లేటి లో కలుస్తుంది .దీని కింద ఆయ కట్టు అంటే పంట భూమి ఎక్కువ గానే ఉంది .కృష్ణ కు ఆనకట్ట కట్టక ముందు ఉయ్యూరు లో కూడా జోన్నలే పండించే వారు .అదే జనాలకు ఆహారం .ఆ తర్వాత కాలువ నీటి తో వరి పంట ప్రారంభ మై సశ్య శ్యామలం గా మా ప్రాంతం ఉంది .మాది చాల భద్రమైన ఊరు అని అందరు అంటారు .బందరులోని బంగాళా ఖాతం మాకు నలభై కిలో మీటర్ల దూరం లో ఉంది .కనుక సముద్రం తో వచ్చే ఇబ్బంది లేదని ,కృష్ణా నదికి వరదలు వచ్చినా నీరు సముద్రసం లోకి పోయే వీలు ఉండటం వల్ల దాని వల్ల కూడా ప్రమాదం లేని ”సేఫ్ జొన్” లో ఉందని భావిస్తారు .అన్ని రకాల పంటలు పండుతాయి వరి ముఖ్య మైన మాగాణి పంట .మాగాణి లోను, మెట్ట భూముల్లోనూ చెరకు బాగా పండిస్తారు. మెట్ట లో పసుపు, కంద ,మొదలైన వాణిజ్య పంటలు వేస్తారు .తమల పాకు, దొండ ,పండిస్తారు .ఒక రకం గా చెప్పా లంటే బంగారం పండుతుంది .ప్రత్తి ఒకప్పుడు బాగానే సాగు చేశారు .కాని తర్వాత గిట్టు బాటు లేక వదిలేశారు .ఉయ్యూరు లో ప్రత్తి బాగా పండించి ”ప్రత్తి రైతు”గా ప్రసిద్ధి చెందిన వారు, ”ప్రత్తి పెద్ద ”అనే బిరుదు పొందిన వారు మైనేని గోపాల కృష్ణ గారి బంధువు శ్రీ అన్నే హనుమంత రావు గారు . కాలువలకు మా చిన్నప్పుడు వరదలు బానే వచ్చేవి .బాగా ఒండ్రు మట్టి నీరు ప్రవహించేది .ఇది చేలకు ఎంతో బలం .వరదలు వచ్చిన యేడు పంటలు బాగా పండేవి .వరద నీరు తాగటం కష్టం గా ఉండేది .అందుకని పటిక ,చిల్ల గింజ గంధం తో శుద్ధి చేసి తాగే వాళ్ళం .కాచుకొని తాగటం అప్పటికి ఇంకా లేదు .కాలువ నీరు దాదాపు ఎప్పుడూ పారుతూ, కల్మష రహితం గా ఉండేది .అందరు   కాలవ ఒడ్డున ఒకటి ,రెండు కానిచ్చినా ప్రవాహం తో  కొట్టుకొని పోయి తాగటానికి బానే ఉండేవి .అంటే ఆ నీరే అప్పుడు గతి .లేక పోతే కోమట్ల బజారు అంటే రావి చెట్ట్టు బజారు చివర కాలువను ఆనుకొని ‘షరాబు చంద్రయ్య బావి ”అని పెద్ద బావి ఉండేది .ఆ నీళ్ళు తెచ్చుకొని ఆ బజారు వాళ్ళు ఎక్కువ గా తాగే వారు .దాదాపు ముప్ప్ఫై ఏళ్ల నుండి పుల్లేరు కలుషిత కాసారం అయింది .గట్ల మీద ఇళ్ళు .అన్నీ కాలువ లోకే వది లేయటం తో ఇప్పుడెవరూ ఆనీరు తాగరు .మేం కూడా మానేసి ముప్ఫై ఏళ్ళు దాటింది .స్నాన్నానికి వెళ్లటం కూడా లేనే లేదు .
సుమారు యాభై అరవై ఏళ్ల కిందట ఇంట్లోని వారే  కాలువ లో  స్నానం చేసి బిందెలతోమంచి నీరు  తెచ్చుకొనే వారు .మగవాళ్ళు ఉదయమే కాల కృత్యాలు తీర్చుకొని కాలువ లో స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి మోయ గల బిందె తో నీళ్ళు తెచ్చుకొనే వారు .మడినీరే అందరికీ .మేమూ తడి బట్టలతో నీళ్ళు తెచ్చే వాళ్ళం .దాన్ని పెద్ద వాళ్ళు వాడే వారు కాదు .మాకోసమే వాడే వారు .మా మామ్మ గారు నాగమ్మ గారు పెద్ద పెద్ద గుండిగలతో నీళ్ళు కాలవ నుంచి తెచ్చేదని మా అమ్మ చెప్పేది .ఆ తర్వాతా ఆమె ఓపిక తగ్గి నీళ్ళు పోయిన్చుకోవలసి వచ్చేది .ఆడ వాళ్ళు సుమారు గా ఉదయం ఎనిమిది తర్వాత కాలువ స్నానానికి వెళ్ళే వారు .అప్పటికే అందరు స్త్రీలు కాలువ దగ్గర చేరే వారు. ముఖానికి పసుపు రాసుకొని, నీళ్ళ లో దిగి స్నానం చేసే వారు .పునిస్త్రీలు పూర్తిగా మునిగే వారు కాదని గుర్తు . నెత్తి మీదచెంబు తో పోసుకొనే వారు .నీళ్ళను బిందె తో అటూ ఇటూ కొట్టే వారు .దీన్ని ”తెప్ప కొట్టటం ”అంటారు .అప్పుడు మనం ఉన్న చోట కల్మశం  లేని నీరుంటుంది .దాన్ని బిందెల్లో పట్టు కొనేవారు .గట్టు మీదకు రాగానే కుంకుమ పెట్టుకొని అప్పుడు నీటికి నమస్కారం చేసి బిందతో  ఇంటికి వచ్చే వారు .మా అమ్మ తో బాటు చెరుకు పల్లి అన్నపూర్ణమ్మ గారు వారణాసి అన్న పూర్ణమ్మ గారు ,సూరి అనసూయమ్మ గారు మొదలైన ముత్తైదువు లందరూ స్నానం చేసే వారని జ్ఞాపకం .మా అమ్మ సుకు మారి .పన్నెండు మంది సంతానాన్ని కనీ ఓపిక లేని స్తితి లో ఉండేది .అందుకని చిన్న బిందె తో నీళ్ళు తెచ్చేది మరి ఇంట్లో వంటకూ ,టాగ టానికి నీళ్ళు అవి సరి పోయేవి కావు .అందుకని బ్రాహ్మణులతో మంచి నీటి బిందెలు తెప్పించుకొనే వాళ్ళం .వాళ్ళల నే ”మంచి నీటి బ్రాహ్మలు ”అంటారు .
మాకు మొదట గా నీళ్ళు పోసింది తంగిరాల సత్యం గారు .ఆయన చల్ల పల్లి నుంచి ఇక్కడికి వచ్చారు .ఆయన భార్యవంటలు చేసే వారు .బహు సంతానం .ఆయన కు లావు పాటి కంటి అద్దాలున్దేవి .తడి లుంగీ కట్టుకొని వచ్చి,బిందెలతో నీళ్ళు పోసే వారు .ఆ తర్వాత ఆపని మానేసి మా ఇంటి సందు దగ్గర చిన్న హోటలు పెట్టారు .ఇడ్లీలు చేసి ఇంటింటికీ తిట రిగి అమ్మే వారు .అందుకనే ”ఇడ్లీ సత్యం గారు ”అనే వారు .ఒక సత్తు పళ్ళెం లో ఇడ్లీలు వేసుకొని దాని పై ఒక తడి బట్ట కప్పి ,అల్లం చట్నీ ,సెనగ చట్నీల తో ఉన్న రెండు చిన్న గిన్నెలు దాన్లో పెట్టుకొని ఒక తడి బట్ట తో ఈగలు ముసర కుండా తోలుతూ, ఇడ్లీలు అమ్మటం నాకు గుర్తు .ఇడ్లీ లను అడ్డాకు లో పెట్టి దానిపై చేట్నీలు  వేసి ఇచ్చే వారు .మా ఇంట్లో ఆయన ఇడ్లీలే తినే వారు .పెద్ద వాళ్లెవరు తినే వారు కాదు .మా లాంటికుర్ర సరుకే తినే వారు .ఆయన కూడా ఉపాదానానికి వచ్చే వారు .బ్రాహ్మణార్థం కూడా  చేసే వారు .వారి అబ్బాయి ఒకతను స్మార్తం చెప్పుకొని ఇప్పుడు హ్హైదరా బాద్ లో గొప్ప పేరు తెచ్చుకొన్నాడు .ఆ కుటుంబం అంతా పెళ్ళిళ్ళు అయిన తర్వాతా ఉయ్యూరు నుండి వెళ్లి పోయారు .సత్యం గారు చాలా నెమ్మదైన మనిషి .ఆయన అంటే అందరికి గౌరవం .
నాకు గుర్తున్నంత వరకు మాకుతరువాత మంచి నీరు పోసింది తోలాపి లక్ష్మీ నారాయణ గారు .కాలువ లో స్నానం చేసి, తడి అన్గోస్త్రం కట్టుకొని పైన ఇంకోదాన్ని  వేసుకొని నీటి బిందెలు తెచ్చే వారు .ఆయన మంచి బలిష్టుడు .కనుక పెద్ద పెద్ద గుండిగల తో నీరు తెచ్చే వారు .మాకు రెండు మూడు బిందెలు పోసే వారు .మా లాంటి కుటుంబాలు చాలా మందికి ఆయన నీరు పోసే వారు .ఈ పని అంతా ఉదయం తొమ్మిది లోపలే పూర్తీ చేసే వారు .ఆ తర్వాతా పంచె కట్టు కోని చెంబు తీసుకొని యాయ వారం అంటే భిక్షా దానానికి బ్రాహ్మల ఇళ్లకు వచ్చే వారు .అందరం దోసిలికి తగ్గ కుండా ”ఉపాదాంనం ”వేసే వాళ్ళం ”సీతా రామాభ్యాం నమః ”అంటూ ఉపాదానానికి వచ్చే వారు .విభూతి ,కుంకుమ ధరించి వచ్చే వారు .ఆయన కొంచెం అమాయకులు .ఇంట్లో ఏదైనా హడావిడి, జనంకనిపిస్తే మంచీ చెడు లేకుండా ”మీ ఇంట్లో తద్దినమా ఇవాళ ”?అని అడిగే వారు .నిజం గా ఆరోజు ఆబ్దీకమైతే ఏమీ ఇబ్బంది  లేదు .ఏదైనా శుభ కార్యమైతే జనం బాధ పడే వారు .అదీ ఆయన తత్త్వం .మొదట్లో కోపం వచ్చేది తర్వాతా జనానికి అల వాటైనదిది .ఆయన్ను తద్దినాలకు బ్రాహ్నుడి గా అంటే ”భోక్త ”గా పిలిచే వాళ్ళం .బాగా తిండి పుష్టి ఉన్న వాడు .బాగా తినే వాడు .మొహమాటం పడకుండా అడిగి వేయించుకొనే వారు .అందుకనే ఆయన్ను తప్పక పిలిచే వారు .అలా తింటే యజ మానికి తృప్తి .పితృ దేవతలు సంతోషిస్తారనే నమ్మకం .నీళ్ళు పోసి నందుకు బిందెకు అణా ఇచ్చే వారు మొదట్లో .నెలంతా పోసిన తర్వాత డబ్బు ఇవ్వటం ఉండేది .వాళ్ళను చిన్న చూపు కొందరు చూసే వారు .నీళ్ళ బ్రాహ్మడు అంటే అలుసు .కాని మా ఇళ్ళల్లో అలా ఉండేది కాదు .ఉపాదానానికి వస్తే బియ్యం తో బాటు కూరలు వగైరాలు కూడా ఇచ్చే వాళ్ళం .ఆబ్దికం రోజున ఉపాదానం వేసే వారు కాదు .అదో నియమం .ఆయన్ను అందరు పూర్తీ పేరు తో పిలిచే వారు కాదు ”తోలాపి ”అనే పిలిచే వారు .దానికి ఆయనకు కోపం వచ్చేది కాదు .నవ్వుతూనే ఉండే వారు .               ఆ తర్వాతా నాకు జ్ఞాపకం ఉన్న వారు ”సూర్య నారాయణ పంతులు గారు ”ఆయనకు పెళ్లి కాలేదు .సీతం రాజు వారి సత్రం లో ఒంటరిగా ఉండే వారు .ఎప్పుడూ లుంగీ తోనే ఉండే వారు బక్క పలచ మనిషి .పైన ఉత్త రీయం ఉండేది .ఆయన కూడా మాకు మంచి నీరు పోసే వారు .నియోగులు .అయినా మా ఇంట్లో అభ్యంతరం లేదు .కొందరు ఆయన తో పోయించుకొనే వారు కాదు .సాధువు .నెమ్మదిగా నవ్వు తూ మాట్లాడే వారు .మాట నూతి లోంచి వచ్చి నట్లుండేది .వీరిని భోక్తగా పిలిచే వారు కాదు .కాని అందరి తో బాటు భోజనానికి పిలిచే వాళ్ళం. తప్పక వచ్చి భోజనం చేసి వెళ్ళే వారు. మిగతా సమయాలలో వండుకు తినే వారేమో . ఆయన చిన్న చెంబు తో ఉపాదానానికి వచ్చే వారు .లున్గీతోనే వచ్చే వారు .విభూతి పెట్టి ,బొట్టు పెట్టుకొనే వారు .అందర్నీ పలకరించే వారు .మంచి వారు అని అందరి చేత అని పించుకొన్నారు పంతులు గారు .
ఆ తర్వాత మాకు న్మంచి నీళ్ళు పోసింది చిలుకూరి వెంకటేశ్వర్లు గారు .ఆపద్బాంధవుడుఆయన బోలా మనిషి .నవ్వుతూ ఉండే వారు .ఆయన కు మాటలు తొందర .అర్ధమయే వి కావు .వారి కుటుంబం అంతా మాకు తెలుసు .వారబ్బాయిలు ,అమ్మాయిలూ నా శిష్యులు .వారిది శాయ పురం .అక్కడి నుండి ఇక్కడికి కాపురం వచ్చారు .మొదట్లో యడవల్లి శ్రీ రామ మూర్తి గారి ఎరువు ల కొట్లో గుమాస్తా గా ఉండే వారు .ఉదయమే లేచి కాలువ లో సంధ్యా వందనం చేసుకొని,తడి అన్గోస్త్రాన్ని కట్టు కోని ,పైన ఇంకో తడి ది వేసుకొని నీళ్ళ బిందెలు  తెచ్చే వారు .ఎన్ని  కావాలంటే అన్ని గబా గబా తెచ్చి పోసే వారు .వారిని భోక్త  గా పిలిచే వాళ్ళం .తిండి పుష్టి ఉన్న మనిషి .మనిషి సాయానికి బాగా ఉప యోగా పడ్డారు . ఆ తర్వాత ఉద్యోగం మానేసి నెమ్మదిగా మంత్రాలు నేర్చి వైదికం చేయటం ప్రారంభించారు .డిమాండు బాగానే ఉండేది .మా ఇళ్ళల్లో ఆబ్దీకాలకు వారినే ఏర్పాటు చేసే వారం .పెళ్ళిళ్ళకు, అపర కర్మలకు వెంకటేశ్వర్ల గారి సహాయం లేకుండా బ్రాహ్మల కుటుంబాలలో కార్య క్రమాలు జరిగేవి కావు .ఆయన్ను ఎవరూ వెంకటేశ్వర్లు గారు అనే వారు కాదా ”చిలుకూరి వారు ”అనే వారు .కుటుంబ సభ్యుల్లాగా కలిసి పోయే వారు .
ఈ విధం గా ఇంత మంది మా ఇంట్లో మంచి నీరు పోసి మాకు ”గంగాధర స్వరూపులు”గా ఉన్నారు .వారంటే మాకు మా కుటుంబానికీ ఎప్పుడూ గౌరవమే .వారు లేనిది మా  నిత్య జీవితం జరగేది కాదు కదా .పనికి విలువ నివ్వాలని మానాన్న గారి అభి ప్రాయం .అదే మా అందరికి ఆదర్శ మైంది .కనుక మా అభి వృద్ధికి వారి సేవా, సహకారాలున్నాయని భావించే, ఈ సందర్భం గా వారిని ప్రత్యేకం గా గుర్తుకు తెచ్చుకోన్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –14

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –14
34–”శరీరం త్వం ,శమ్భొహ్ ,శశి మిహిర వక్షో రుహయుగం –తవాత్మానాం మధ్యే ,భగవతి ,నవాత్మాన మనఘం
అతః శేషః శేషీ త్వయ ,ముభయ సాధారణ తయా –స్థితః సంబందోవాం ,సమరస పరానంద పరయొహ్ ”
తాత్పర్యం –మణి పూరాబ్జ నిలయా !జగత్ ఉత్పత్తి, మొదలైన ఆరు విషయాలు తెలిసిన భగవతి వి నువ్వు .ఆనంద భైరవివి .సూర్య చంద్రులు స్థన యుగ్మం గల శరీరం నీది .అయితే ,నవ వ్యూహాత్మకు డైన ఆనంద భైరవుని ,నీ దేహం గా భావిస్తున్నావు .ఈ రెంటి వల్ల నీవు శేషం ,ఆయన శేషి అవుతున్నారు .ఆయన శేషం ,నువ్వు శేషివీ కూడాఅవుతున్నారు .ఈ  రకం గా ఆనంద భైరవ ,ఆనంద భైరవీ రూపు లైన మీ ఇద్దరికీ అంటే శివ, శక్తులకు ఇది సాదా రణమే అవుతోంది .
విశేషం –ఆనంద భైరవుడు పరా నంద .భైరవి పరా .వీరిద్దరి తాదాత్మ్యమే నవాత్మకం .అందుకే శేష ,శేషీ భావం .లయ కాలం లో భైరవి ప్రయత్నం వల్ల  ,ప్రధానత్వం వల్ల  ఆమె శేషి అంటే మిగిలి ఉండేది .ఆనంద భైరవుని అప్రధానం వల్ల  ,గుణ భావ శేషత్వం కలుగు తోంది .శరీరం భైరవు ని లో అంతర్భావం కలుగు తోంది .అప్పుడు భైరవునికి శేషిత్వం ,భైరవికి శేషత్వం కల్గు తుంది .ఇద్దరూ కలిస్తే పూర్ణత్వం అవుతుందని భావం .దీనినే కాళి దాసు ”కుమార సంభవం ”కావ్యం లో ప్రారంభ శ్లోకం గా ”వాగార్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే -జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం ”అని ఆ ఆది దంపతులకు నమస్కరించాడు .
35—”మనస్త్వం ,వ్యోమత్వం ,మరు దపి ,మరుత్సారధి రసి –త్వ మాపస్త్వం ,భూమి స్త్వయి ,పరిణతయాం
త్వమేవ స్వాత్మానం ,పరిణమయితుం ,విశ్వ వపుషా –చిదా నందా కారం ,శివ యువతి ,భావేన భిభ్రుషె ”
తాత్పర్యం –ఛందస్సారా !ఆజ్ఞా చక్రం లోని మనస్తత్వం నీవే .విశుద్ధం లోని ఆకాశ తత్త్వం ,అనాహతం లోని వాయు తత్త్వం ,స్వాధీ ష్టానం లోని అగ్ని తత్త్వం ,నీవే .నీ కంటే వేరైనది ఏదీ లేనే లేదు .నీవే ,నీ స్వ స్వరూపాన్ని ,ప్రపంచం గా ,పరిణమింప జేయ టానికి చిదా నంద శివ తత్వాన్ని ,బ్రహ్మ రూప మైన ఆనంద భై రవ రూపాన్నీ ధరిస్తున్నావు .
విశేషం –భగవతి చిదా నందా కార .శివుని ఆకారమే ఆమె .అందు చేత ‘విశ్వ వపుషా ”అయింది .అన్డాండ ,పిండాండాలు ఒకే రూపం లో శ్రీ దేవి యే.అంతా ,ఆమె ఏక ఆకారమే అని భావం .
36—”త్వమాజ్నా చక్రస్త్వం ,తపన ,శశి కోటి ద్యుతి ధరం –పరం ,శంభుం ,వందే ,పరి మిళిత పార్శ్వం ,పర చితా
యమా రాధ్యన్ ,భక్త్యా ,రవి ,శశిహ్ ,శుచీనామ విషయే –నిరాలోకే లోకే ,నివ సతి ,హి ,భాలోక భువనే ”
తాత్పర్యం –నిఖిలేశ్వరీ !సూర్య ,చంద్ర ,అగ్నులకు కంపించ కుండా ,జనం లేని చంద్ర లోకం లో అంటే సహస్రారం లో ,నీ సాయుజ్యం పొంది ,(నీ భ్రూ మాధ్యమ లోని శ్రీ చక్రం లోని )ఆజ్ఞా చక్రం లోని చంద్ర కాంతిని ధరించి ,”సర” అనే చిత్ చేత ఆవ రింప బడిన శంభుని గూర్చి నమస్క రిస్తున్నాను .
37–”విశుద్దే తె ,శుద్ధ స్పటిక విశదం ,వ్యోమ జనకం ,–శివం సేవే ,దేవీ మపి ,శివ సమాన వ్యవస్తితాం
యయొహ్ ,కాన్త్యా,యాన్త్యాహ్ ,శశి కిరణ సారూప్య సరణే –విధూతాం తర్ధ్వాంతా ,విలసతి చకోరీవ జగతే ”
తాత్పర్యం –శివ జ్ఞాన ప్రదాయినీ !నీ విశుద్ధ చక్రం లో ,స్పటిక మణి లాగా నిర్మలుడు ,ఆకాశ వ్యుత్పత్తికి హేతు వైన శివుని ,ఆయనతో సమాన మైన దేవి వగు నిన్ను ,నేను ఉపాసిస్తున్నాను .శివా శివు లైన మీ నుండి వచ్చే ,చంద్ర కిరణా లతో సాటి వచ్చే వైభవం గల కాంతులతో ,మూడు లోకాల్లో ,అజ్నానాంధ కారాన్ని పార ద్రోలి ,వెన్నెలను ,తాగే చకోర పక్షి లాగా ,సంతుష్ట మైన అంత రంగం తో ,విశుద్ధం లో ధ్యానింప బడే శివా శివుల చంద్ర కాంతి ఛే ,లోపలి అజ్ఞానం తొలగి ,సాధకులు సంతుష్టులవు తున్నారు .
మహాత్మా గాంధీజీ జన్మ దిన శుభా కాంక్ష లతో
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ — వీడ్కోలు వారం

అమెరికా డైరీ —
వీడ్కోలు వారం 

సెప్టెంబర్ ఇరవై నాలుగు  సోమ వారం నుండి ,ముప్ఫై ఆది వారం వరకు విశేషాలు 
ఇరవై నాలుగు సోమ వారం మేసీస్ లో ఆపిల్ స్టోర్సు లో ఐ పాడ్ చూశాం .వాల్లవీ ఫ్రీ బుక్స్ డౌన్ లోడ్ చేసుకొనే వీలు ,మాక్లిన్ బెర్గ్ లైబ్రరి లో పుస్తకాలను ఆన్  లైన్ లో చదువు కొనే వీలూ కల్పించారు .లైబ్రరి పై అంతస్తు నుంచి మెట్లు దిగుతుంటే కుడి మోకాలు కొద్దిగా పట్టు తప్పింది .తూలి పడ బోయాను .వెంటనే సర్దుకుంది .మంగళ వారం సాయంత్రం పిల్లల్ని జిమ్నాస్టిక్సు క్లాస్ లో దింపి ,మేం ముగ్గురం” ఓల్డ్ టైం పాటరి ” (పాత కాలపు పెంకులు )కి వెళ్లి ఒక సారి అన్నీ తిరిగి చూశాం .ఫోటోలు తీసుకొన్నాము .ఇంటికి వచ్చిన తర్వాత ఉషా ఫోన్ చేసింది .శని వారం శ్రీ సత్య నారాయణ వ్రతం చేయిన్చుకొందామను కొంటున్నామని ,లిస్టు చెప్పమని అడిగితే చెప్పా. .బుధ వారం హైదరా బాద్ కు ఫోన్ చేసి మా అక్కయ్యా ,బావ గార్ల తో మాట్లాడాము .మేము మాట్లాడటం ఆయనకెంతో బలం గా ఉందని పించిన్దన్నారు బావ .గురు వారం ఈ నాడు నెట్ లో చదువు తుంటే ,పిన్నమ నేని కోటేశ్వర రావు గారు 84ఏళ్ల వయసులో కేన్సర్ తో బాధ పడుతూ మరణించారని తెలిసింది .ఆయన కృష్ణా జిల్లా పరిషద్ చైర్మన్ గా మూడు సార్లు ,ముదినే పల్లి శాసన సభ్యులుగా రెండు సార్లు పని చేసి విద్యా రంగానికి ఎంతోసేవ చేశారు .ఎన్ని పదవుల్లో ఉన్న ఆయన్ను అందరు ”చైర్మన్ పిన్నమ నేని ”అనే ఆప్యాయం గా పిలుస్తారు .అదీ ఆయన సాధించిన విజయం .దీని పై ”చైర్మన్ కోటేశ్వర రావు గారు ”అనే ఆర్టికల్ రాశానుచైర్మన్ కోటేశ్వ ర రావు గారు

.
గురు వారం మధ్యాహ్నం నాగ మణి ఇంట్లో భోజనం .రాత్రికి రవి గాయత్రి దంపతుల ఇంట్లో విందు .మేము ,శీతల్ ,ప్రశాంత్ దంపతులు ,ముక్కామల దుర్గ గారు అతిధులం .చపాతీ బంగాల దుంప కూర ,మామిడి కాయ పప్పు ,బీన్సు కూర ,ఉల్లి చట్ని ,అన్నం సాంబారు ,పెరుగు ల తో మంచి భోజనం .అదనంగా ”జున్ను ”అన్నీ బాగున్నాయి .ఇది వరకో సారి రాలీ దంపతులు వ చ్చి నప్పుడు ఉదయం టిఫిన్ కు పిలిచి అన్నిటి తో బాటు” జున్ను” కూడా పెట్టారు .సరదా గా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశాం .వాళ్ళు ఏర్పాటు చేసుకొన్నా హోమ్ధియేటర్ చూపించాడు రవి .వాళ్ల తలిదండ్రులు రాఘ వేంద్ర రావు ,కామాక్షి గార్లు సరదా, మర్యాదా ఉన్న మనుసులు .నాకు ఆయన తో ,మా ఆవిడకు వాళ్ళావిడ తో రోజూ కబుర్లు బానే ఉంటాయి .
శుక్ర వారంమధ్యాహ్నం ఎల్లా వెంకటేశ్వర రావు గారి అమ్మాయి ,గాయిత్రి ఆన్ లైన్ లో కూచి పూడి నాట్యా చార్యులు పసు మార్తి గురు వు గారి వద్ద మా ఇంట్లో ప్రాక్టీసు చేశారు .ఎల్లా అక్టోబర్ చివర్లో ఇక్కడికి వస్తారు .అప్పుడు ఒక నృత్య రూపకానికి ఇది రిహార్సిల్ .గురువు గారికి లైన్ లోనే నమస్కారాలు చెప్పాము ”.మేము వచ్చే దాకా మీరు శార్లేట్ లో  ఉండరా ?”అని మేం ఇండియా వెళ్తున్నామని తెలిసి అన్నారు పసు మర్తి వారు .సాయంత్రం  పిల్లలను  ఆర్టు క్లాస్ లో దించి రాం కీ ఇంటికి వెళ్లి బంతి పూలు ఇచ్చి వచ్చాం .క్లాస్ ఆవ గానే అటునుంచే ఎయిర్ పోర్టు కు వెళ్ళాం .అల్లుడు ఆవ దాని ఇండియా నుండి దుబాయ్ న్యూయార్కుల మీదుగా వచ్చారు .ఇంటికి వచ్చే సరికి ఎనిమిదిమ్బావు అయింది .ఈ రోజు మా ఇంట్లో భజన .మా మనవడు శ్రీ కేత్ ఏర్పాట్లు చూశాడు .వర కుటుంబం  ,జగదీశ్- లక్ష్మి కుటుంబం ,పవన్ దంపతులు వచ్చారు .గంట సేపు భజన జరిగింది .చివర్లో నేను ”శార్లేట్ లోని సాయి సెంటర్ వారి తో ఈ ఆరు నెలలు చక్క గా గడిచి పోయాయి .మా ఇద్దర్నీ మీ కుటుంబ సభ్యులు గా భావించి ఎంతో పెద్దరికం ఇచ్చారు .వచ్చే బుధ వారం సాయంత్రం మా ఇండియా ప్రయాణం .అందరికి వీడ్కోలు ”అని కృతజ్ఞతలు తెలిపాను .అందరు చాలా బాధ పడ్డారు మేం వెళ్లి పోతున్నందుకు .ఆది వారి సౌజన్యానికి గుర్తు .అంతే .
 మళ్ళీ శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం 
ఇరవై రోజుల కిందట నేను ప్రియా దంపతుల ఇంట్లో శ్రీ సత్య నారాయణ వ్రతం చేయించానని తెలిసి నప్పటి నుంచి రాంకీ ఉషా దంపతులు వాళ్ళు కూడా వ్రతం చేసుకోవాలనే సంకల్పానికి వచ్చారు .ఈ శని వారమే దాన్ని చేయిన్చుకోవాలను కొన్నారు .మేమిద్దరం ఉదయం అయిదు గంటలకే లేచి నిత్య కృత్యాలు ,సంధ్యా ,పూజ అయి, రెడీ గా ఉన్నాం .రాంకీ తొమ్మిదింటికి వచ్చి కారు లో మా ఇద్దర్నీ తమ ఇంటికి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఏర్పాట్లు దాదాపు నేను చెప్పినట్లే చేశారు .ఉషా వాళ్ల అమ్మా నాన్న ,రాంకీ ఉషా దంపతులు కూర్చుని చేసుకొన్నారు .మొదలు పెట్టె సరికి పదిన్నర అయింది .వ్రతం ,శ్రీ వెంకటేశ్వర దీపారాదనను శాస్త్రోక్తం గా చేయించాను .అంతా అయేసరికి ఒంటి గంట అయింది .దాదాపు యాభై మందికి పైగా అతిధులు వచ్చారు .అందరు సాయి సెంటర్ లో పరిచయం ఉన్న వాళ్ళే .పూజా విధానం చూసి అందరు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందారు .ఇంత వరకు ఎవరు ఇంత నిర్దుష్టం  గా చేయించ లేదని అందరు అన్నారు .ఆది స్వామి కృపా ,సరస్వతీ దేవి కటాక్షం .అంతే .ఆ తర్వాతా విందు. రెండు ఆకు కూరలు ,ఆలూ కూర,బెండ కాయ కూర ,చట్నీ ,పాయసం ,పులిహోర అప్పడం సాంబారు ,పెరుగు ,మాంగో లస్సీ ల తో,మంచి విందు ఏర్పాటయింది.అందరు హాయిగా కమ్మగా భోజనం చేశారు .నేను ,ఎందుకో  తిన లేక పోయా .నాకు షర్టు ,మా శ్రీమతికి శాలువ ,ఫోటో ఫ్రెం ,దక్షిణ గా నలభై డాలర్లు తాంబూలం ఇచ్చారు .జగదీశ్ ఎప్పుడు కుటుంబం తో మాకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవటం అలవాటు .వారంతా మా ఇద్దరికీ నమస్కరించి ,తాంబూలం లో యాభై ఒక్క డాలర్లు పెట్టి అంద జేశారు .ఆ తర్వాత ఆడ వాళ్ళు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేశారు ‘.రాంకీ ఉషా ల ఆనందానికి అంతు లేదు .”మీరు చేయిస్తారని తెలిస్తే చాలా మంది మీతో వ్రతం చేయించుకొనే వారు .ఈ సారి ట్రిప్ లో దీనికి సిద్ధం చేస్తాం ”అన్నారు సంతోషం గా ఉషా రామ్కీలు .నవ్వి’ మేము దీని నిమిత్తం రాలేదు. మా ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకోన్నట్లే మీకూ చేయించాం .అంతే ”అన్నాను . .’ఇంటికి వచ్చే సరికి సాయంత్రం అయిదున్నర దాటింది .
ఒకే రోజు మూడు భోజనాలు 
శని వారం రాత్రి మా ఇంటికి దగ్గర్లో ఇల్లు కొనుక్కున్న శీతల్ -ప్రశాంత్ దంపతులు సరదాగా భోజనాలు ఏర్పాటు చేసి మిత్రుల్ని మమ్మల్నీ ఆహ్వానించారు .వీళ్ళ గృహ ప్రవేశ ముహూర్తం నేనే పెట్టాను . .చాలా పదా ర్దాలు చేయించి హోటల్ నుండి తెప్పించారు .మేమిద్దరం రెండేసి సమోసాలు మాత్రమె తిన్నాం .కడుపు నిండింది .మిగతా వాటి జోలిలి వీల్లలేదు .వాళ్లకు బై చెప్పి వచ్చాం ‘
అక్కడ నుండి వల్లం నర సింహా రావు  దంపతుల కుమార్తె రేణు దంపతుల నూ తన గృహ ప్రవేశ సందర్భం గా విందు ఏర్పరచారు .వల్లం దంపతుల వివాహ యాభై వసంతాల పండుగ కూడా రేణు ఇది వరకు నిర్వ హిస్తే వెళ్ళాం .అప్పటినుంచి  వారి తో పరిచయం .వీళ్ళు బాగా హడా విడి చేశారు .వందమందికి పైగా అతిదులోచ్చారు .ఎన్నో పదార్ధాలు చేయించారు .కాని మేమేమీ తిన లేదు .మంచినీళ్ళు త్హ్హాగి కొద్దిగా కెరట్ హల్వా తిన్నాం .అంతా ఆయె సరికి రాత్రి పదిఅయింది .
ఈ విధం గా ఈ శని వారం ఉదయం రాంకీ ఇంట్లో ,రాత్రికి శీతల్, రేణు ఇళ్ళల్లో మూడు విందు భోజనాలు చేసి నట్లు .ఇంతకు ముందు గురువారం నాగలక్ష్మి ,గాయత్రి ఇళ్లలో విందులు .ఇవన్నీ మా మీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం గా వాళ్ళందరూ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులు .మంచి మిత్ర బృందం ఇక్కడ ఉండటం ఆనంద దాయకం .
ఆది వారం రాత్రికి పవన్ రాధా దంపతుల ఇంట్లో భోజనం .పప్పు ,వంకాయ కూర ,ఆవ కాయ ,పచ్చడి ,సాంబారు అన్నం పెరుగు ల తో విందు .మేము వేళ్ళ గానే అందరికి వేడి వేడి పకోడీలు వేసి పెట్టింది రాధ .అవి పూటుగా లాగించాం .ఇంకా అన్నం ఏమి లోపలి కి వెళ్తుంది ? ఏదో కతికామని పించాం  .నాకు షర్టు ,తల్లీ కూతుళ్ళకు చీర, జాకెట్ లు పెట్టి పవ న్ దంపతులు తమ సంతోషాన్ని వ్యక్త పరచారు .ఈ వారం అంతా ఇలా సందడి సందడి గా గడిచి పోయింది .మూడవ తేదీ బుధ వారం రాత్రి ఫ్లైట్ కు అ ఇండియా కు తిరుగు ప్రయాణం .సరిగ్గా వారం తక్కువ ఆరు నెలలు అమెరికా లో ఉన్నట్లు .చాలా వేగం గా కాలం గడిచి పోయింది
మా ఈ నాల్గవ అమెరికా పర్య టన సాంస్కృతిక పర్య టన అని పించి, మిగిలిన వాటికి భిన్నం గా జరిగింది .వచ్చిన దగ్గర నుండి ఎల్లా వారితో ,ఈల శివ ప్రసాద్ గారితో పరిచయాలు .ఆ తర్వాతా అలబామా లో మైనేని వారింట్లో కొలువు .అక్కడి ద్రోణవల్లి వారు, కాకాని సోదరులతో పరిచయం ,హెలెన్ కెల్లర్ ఇంటి సందర్శన ,ఆ పిమ్మట అట్లాంటా  పర్యటన ,అక్కడ దేవాలయ సందర్శనం ,రాలీ పర్యటన .అక్కడ బాలాజీ దేవాలయం, శివాలయ సందర్శనం .మౌంట్ సోమా సందర్శనాను భూతి ఎంతో త్రుప్తినిచ్చాయి .ఇక్కడి హిందూ సెంటర్ కార్య క్రమాలు, సాయి సెంటర్ భజనలు ,త్రిమూర్తి దేవాలయం లో ఉత్సవ విగ్రహ  ప్రతిష్ట ,ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ,అన్నీ అన్నే .ముహూర్తాలు పెట్టడం రెండు అ సత్య నారాయణ వ్రతాలు గృహ ప్రవేశం ఎంతో  మానసిక ఆనందాన్నిచ్చాయి . .కల కాలం గుర్తుంచుకో దగిన పర్యటన గా ఉంది .దీనిలో మాకు హార్దికం గా సౌజన్యాన్ని చూపిన వారందరి పేరు పేరునా కృతజ్ఞతలు .
 అక్టోబర్ రెండు మంగళ వారం  గాంధీ జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు .
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –1-10-12-కాంప్ –అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –13

 శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –13
32–” శివశ క్తిహ్ కామః ,క్షితి రధః రవిస్శీత  కరణః  –సమారో హంస శక్రః తదనుచ ,పరమార హరయః
హమీ ,హ్రుల్లెఖాభిస్తి సృభి రవ సానేషు ఘటి తాః –భజన్తే ,వర్నాస్తే ,తవ జనని నామా వయవతాం ”
తాత్పర్యం –కపర్దినీ !శివుడు (కకారం ),శక్తి (ఏ కారం )కాముడు (ఈ కారం )భూమి (ల కారం )మొదటి ఖండం గాను ,రవి (హ కారం )చంద్రుడు (స కారం )మన్మధుడు (క కారం )హమాస (హకారం ),ఇంద్రుడు (ల కారం )రెండవ ఖండం గా ,పరా శక్తి (స కారం )మన్మధుడు (క కారం )హరి (ల కారం )మూడవ ఖండం గా ఉన్న దాని ,విమర్శ స్థానం లో హ్రీమ్కారం తో కూడిన ,నీ పేరు తో ఉన్న త్రిపుర సుందరీ దేవి మహా విద్య కు అవయవాలు గా ఉన్నాయి .ఈ పన్నెండు వర్గాలు ,మోడు హ్రీం కారలతో ,కలిసి త్రిపుర సుందరీ మహా మంత్రమవుతుంది .”క ,ఏ ,ఈ ,ల ,హ్రీం ,హ ,స,క,ల,హ్రీం ,స ,క ,ల ,హ్రీం ”అనేదే మహా మంత్రం అని భావిస్తారు సాధకులు
విశేషం –ఇందులో పద హారు అక్ష రాలున్నాయి .ఇవి షోడశ ”నిత్య ”లకు రోప్పాలు .పద హారావడి షోడశి -నిత్య .ఆ పదహారవాడే పరా కళ .దానినే ”చిదేక రస ”అంటారు .దాని ఛాయా ఏ ,విశుద్ధ చక్రం లోని షోడశారం లో ,కళా స్వ రూపం గా ,వెలుగుతూ ఉంటుంది అని రహస్యం .ఆ షోడశి కలే ముఖ్య మైనది గా భావిస్తారు .అదే ప్రకృతి అయింది .మిగిలిన పడి హేను నిత్యాలు ,ఈ పదహారవ కళ కు అంగాలు మాత్రమె .
ఈ శోడశికళా రూపాన్ని గురు ముఖం గా తెలుసు కోవాలి .ఇది ”హాస్ట మస్తక ప్రయోగం వల్లనే ”సాధ్యమవుతుంది .అంటే గురువు గారు శిష్యుని ఆశీర్వా దిస్తూ దగ్గరకు తీసునిని శిరస్సు మీద చెయ్యి వేయటం .నెత్తిన చెయ్యి పెట్టటం అన్న మాట .ఇవాళ లోక వ్యవ హారం లో నెత్తిన చెయ్యి పెట్టాడు అంటే మున్చేశాడని అర్ధం .ఆది అలా కాదు .
షోడశ కళ అంటే ష ,రేఫా ,ఈ కారాలు ఉంది ,బిందువు చివర ఉన్న మంత్రం అని అర్ధం .ఈబీజమే శ్రీ విద్య .శ్రీ బీజాత్మక మైంది శ్రీ విద్య .ప్రతి పట్టి రోజున త్రిపుర సుందరి కళను ,విదియ నాడు కామేశ్వారిని ,తదియ రోజున భాగ మాలిని ని ,చవితి నాడు నిత్య క్లిన్నాను ,పంచమి నాడు భేరుండా ను ,షష్టి రోజున వహ్ని వాహినిని ,సప్తమి నాడు మహా వజ్రేశ్వారిని ,అష్టమి నాడు రౌద్రిని ,నవమి నాడు నీల పతక ,దశమి రోజున కుల సుందరిని ,ఏకాదశి నాడు నీల పతాకను ,ద్వాదశి రోజున విజయ ను ,త్రయోదశి రోజున సర్వ మంగళ ను ,చతుర్దశి నాడు జ్వాలను ,పూర్ణిమ రోజున మాలినీ కళ ను ఉపాసించాలి అని శ్స్స్త్రం చెబు తోంది .అన్ని తిధుల లో చిద్రూప కళ షోడశి ను ఇ ఉపాసించాలని భావం .
ఈ షోడశ, నిత్యలకు శ్రీ చక్రం లో విశుద్ధ చక్రం (షోడశారం )లో స్తానం ఉంది .తూర్పు నుండి ప్రారంభ మవుతాయి .దీని క్రింద ద్వాదశారమైనఅనాహతం లో12 మంది సూర్య మంద లాది పతులు ప్రా దక్షిణం గా చుట్టి ,ఉన్నాయి .ఇవి పన్నెండు మాసాల కు ప్రతీకలు .క నుండి ల వరకు ఉన్న వర్ణాలే ”కళ .అనుస్వారాలు ,నాలుగు సున్నాలు బిందువులు .దీని పై నాదం .ఈ విధం గా నాద ,బిందు కళాత్మకం గ శ్రీ చక్రం మూడు ఖండాలు గా గోచ రిస్తుంది .
33–”స్మరం యోనిం లక్ష్మీం ,త్రితయ మిద మాదౌ ,తవ మనొహ్ –నిధా యైకే ,నిత్యే ,నిరవధి మహా భోగ రసికాః
భజంతి త్వాం ,చింతా మణి ,గుణ నిబద్ధాక్ష వలయాః  –శివా జ్ఞౌ ,జుహ్వాస్త స్సురభి ఘ్రుత ధారా హుతి శతైహ్ ”
తాత్పర్యం –నిత్య స్వరూపా దేవీ !నీ మంత్రానికి మొదట కామ రాజ ,భువ నేశ్వారీ ,లక్ష్మీ బీజాలు (క్లీం ,హ్రీం ,శ్రీం )లను చేర్చి ,అపరిచ్చన్న మై ,అఖండమై ,మహా భోగ రూప మైన నిత్య సుఖానుభావం పొందిన పరమ యోగీశ్వరులు ఏ కొద్ది మంది , సమయా చార తత్పరులు ,చింతా మణు లతో కూడిన అక్ష మాలలను చేతిలో ధరించి ,త్రికోణ రూప మైన బైందవ స్తానం లో ,శివాగ్ని లో అంటే స్వాదిష్టానం లో కామ ధేనువు యొక్క ,సహస్ర నేతి ధారలతోనిన్ను హృదయ కమలం లో ఉంచుకొని ,హోమం చేస్తూ ,నిన్ను సేవిస్తున్నారు .
కాముడైనా ,మహేశ్వరుడైనా ,మానసిక హోమాలు చేయాలి .ఆమె జపం లోనే సర్వ కామాలు తీరు తాయి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 1-10-12-కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –38 మా హై స్కూల్ చదువు

       ఊసుల్లో ఉయ్యూరు –38
                                                    మా హై స్కూల్ చదువు 

హిందూ పురం నుండి మేము ఉయ్యూరు కు 1952లో వచ్చాం .ఆ క్రితం ఏడాదే అంటే1951 లో ఉయ్యూరు హైస్కూల్ వచ్చింది .జిల్లా బోర్డు స్కూలు .ఎనిమిదవ తేదీ తో మొదలైంది .మేము అంటే  నేను ,మా తమ్ముడు మోహన్ ప్రై వేటు గా శ్రీ వేమూరి శివ రామ కృష్ణయ్య మాస్టారి ఇంటి దగ్గర  చదివి, నేను ఎనిమిదో తరగతికి, మా మోహన్ ఏడ వ తరగతికి ఎంట్రన్సు పరీక్షలు రాసి పాసై ఇద్దరం 1953 లో స్కూలు లో చేరాం .మా అక్కయ్య సర్టి ఫికేట్ తో పదవ తరగతి లో చేరింది .స్కూలు శ్రీ వై గోపాల రావు గారు అనే అప్పటి సీనియర్ హెడ్ మాస్టారి తో ప్రారంభమయిందట .మేము చేరే సరికి శ్రీ కే.వి.ఎస్ .ఎల్. నరసింహా రావు గారు హెడ్ మాస్టారు .ఆయన ఎర్రగా ,పొడవు గా పంచె చొక్కా ఉత్త రీయం తో ఉండే వారు .చేతిలో బెత్తం ఎప్పుడూ ఉండేది .నేను ఎనిమిదో క్లాసు బి .సెక్షన్ .మా క్లాస్ టీచర్ శ్రీ లంకా బసవా చారి గారు .ఆయన ఇంగ్లీష ను ఇంగ్లీష లా చెప్పే వారు .ఎక్కడా తెలుగు శబ్దం వాడే వారు కాదు .భాష సింపుల్ గా బాగుండేది .ఆయన నల్లగా స్పోటకం మచ్చలతో ఉండే  వారు .నల్లద్దాల కళ్ళ జోడు గోచీ  పోసి కట్టిన పంచ ,సిల్కు లాల్చీ  ముఖానికి పౌడర్ తో ఉండే వారు .ఆయన వేషం  చూసి అంతా ”దసరా బుల్లోడు ”అనే వారు .మనిషికి కోపం ఎక్కువ .మాకు ఆయన అంటే  గౌరవం .చనువు తక్కువ .లెక్కలకు కే.ఆర్ . కాంతయ్య గారు, సైన్సు కు భమిడి పాటి వీర భద్ర రావు గారు సోషల్ కు బసవా చారిగారు ఆ తర్వాతా కొండి పర్రు రాదా కృష్ణ మూర్తి గారు వచ్చారు .తెలుగుకుమహంకాలి సుబ్బరామయ్య గారు,  హిందీకి కొడాలి రామా రావు గారు వచ్చే వారు .డ్రాయింగు మాస్టారు తాడి నాడ శేష గిరి రావు గారు .ఆయనకు కాళ్ళకు ,చేతులకు  కుష్టు వచ్చి తగ్గి, వేళ్ళు తినేసి నట్లున్దేవి .అయినా బొమ్మలు బాగా వేసే వారు ”తెలీలా ”అనేది ఆయన ఊతపదం .ఆయన మంచి హోమియో డాక్టరు .ఆయనే మందులు వాడుకొని జబ్బు పెరక్కుండా కాపాడు కొన్నారు .డ్రిల్లు మాస్తారు ఎస్.వి.సుబ్బా రావు గారు .ఆయన్ను చిన్న డ్రిల్లు మాస్టారు అనే వాళ్ళం .మా నాన్న గారు స్కూల్లో సీనియర్ తెలుగు పండితులు .వారి తో బాటే త్రిపిర్నేని  సుబ్రహ్మణ్యం గారు కూడా పని చేసే వారు .
హెడ్ మాస్టారు నర సింహా రావు గారికి రాని  విద్య లేదు ఆయన మాటల్లో నే చెప్పా లంటే ”జాక్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ మాస్టర్ ఆఫ్ నన్ ”.మంచి బాడ్మింటన్ ,వాలీ బాల్ ప్లేయర్ .చదరంగం  బాగా వచ్చు .పేకాట లోను రాజే .మంచి చిత్రకారులు .అద్భుత మైన చిత్రాలు గీసే వారు .కవిత్వం బాగా వచ్చు .ఎన్నో కవితలు రాసి ప్రచురించారు .మంచి సామాజిక దృక్పధం ఉన్న కవి .”పాకీ వాళ్ల ”మీద గొప్ప కవిత రాశారు .క్రమశిస్క్షణ ,స్కౌటు, చేతి పనులు ఒకటేమిటి అన్నిటి మీదా కవితలు రాశారు .గోదా వరి జిల్లా పెంట పాడు వాస్తవ్యులు .ఆయన తోడల్లుడే తరణీ రావు గారు .జిల్లాలో మంచి హెడ్ మాస్టర్ గా పేరు .ఎనిమిదో తరగతి లో చేరిన కొద్ది రోజుల వరకు పాథాలేమీ ప్రారంభం కాలేదు .మాకు ఆట విడుపు గా ఉండేది .అటెండెన్సు వేసి పంపేవారు .ఒక పూట వస్తే చాలు .రెండో వారం నుండి రెండు పూటలా వెళ్ళే వాళ్ళం .కాల క్షేపానికి నల్ల మట్టి తో బొంగరాలు తయారు చేసి పుస్తకాల మీదో, కాగితాల మీదో బెంచీల మీదో, తిప్పుకొనే వాళ్ళం .అప్పుడు పూచిక చీపుళ్ళు ఉండేవి .వాటి ముళ్ళు అన్నీ రాల గొట్టి చీపుళ్ళు చేసే వారు .అవి చాలా నున్నగా ఉండేవి .వాటి పుల్లలను నాలుగంగు ళాల పొడవు ఉండేట్లు గా ముక్కలు చేసి నిలువుగా నిలబెట్టి వదిలే   వాళ్ళం .అవి అడ్డం గా కింద పడేవి .వేరొక పుల్లతో పుల్లలకు తగల కుండా ,ఆ పుల్లలను వేరు చేయాలి. దీన్ని ”పుల్ల ఆట ”అనే వాళ్ళం. అదే కాక పోతే చొక్కా వెనక  చివరను తాడుతో కట్టి, దాన్ని దగ్గరున్న స్తంభాలకు కట్టే వాళ్ళం .వాడికి తెలియక లేచి నిల బడితే కింద పడే వాడు .ఒక సారి నేనే నా జూనియర్ సూరి శ్రీ రామ మూర్తికి ఇట్లా తాడుతో కట్టాను .వాడు ఉడుకు మోతు రకం . లేచి కింద పడ్డాడు .హెడ్ మాస్టారుకు వెళ్లి రిపోర్టు ఇచ్చాడు .ఆయన అసలే నరసింహం .ఇంకే ముంది ఉగ్రనరసిమ్హా వతారం తో నా దగ్గరకు వచ్చి నా రెండు చేతులు జాపించి నాలుగు దెబ్బలు పీకారు .వేళ్ళు కందిపోయాయి .మారు మాట్లాడ కుండా కూర్చున్నాను .అప్పటి నుంచి ఎవర్నీ స్కూల్ లో ఏడి పించ లేదు .ఎవరితోను దెబ్బలు కూడా తిన లేదు .ఒక్క సారి తో నే బుద్ధి వచ్చింది .
మా ఎనిమిదో తరగతి –తూర్పు వైపు చివరి పాక లో ఉండేది .అప్పుడన్నీ పాకలే .తడికలతో అడ్డుపెట్టె వారు తరగతుల మధ్య . ,అన్ని వైపులా లావు పాటి వెదురు బద్దలతో అల్లిన తడికలు .ఆ ప్రక్కనే స్మశానం .అక్కడ శవాలు కాలి  కమురు కంపు వచ్చేది .క్లాసు లోంచి శవ దహనం కనీ పించేది .ఆ వాసన భరించ రానిది  గా ఉండేది .ఆ పూట అన్నాలు సహించేవి కావు .పుర్రెలు కాలి , ఫెల ఫెల ధ్వనులోచ్చేవి .వానా కాలం వస్తే వర్షం కురుస్తుంటే బడి ని అయిదు పీరియడ్లు పెట్టి వదిలేసే వారు .అందుకే వర్షం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే వాళ్ళం .అంతా మట్టి, బురదా కనుక, క్లాసులు జరగటం కష్టం .బెంచీలు అందరికీ ఉండేవి కాదు. పైతరగతులకే వచ్చేవి మేమంతా ఈతాకు చాప ల మీద కూచునే వాళ్ళం .స్కూలు అయి పోయే ముందు వాటిని చుట్టి ఒక మూల పెట్టె వాళ్ళం .నరా సంహా రావు గారు వార్షి కోత్స వాలు బాగా నిర్వ హించే వారు .ఆటలు ,పాటలు నృత్యాలు దేశ భక్తీ గీతాలు నాటికల తో రంజు గా ఉండేవి .బహుమతులిచ్చే వారు .ఆటల పోటీలు వ్యాస రచన ,వక్తృత్వ పోటీలు నిర్వ హించే వారు .గ్రిగ్గు పోటీలు కూడా నిర్వహించారొక సారి .
వర్షం కురిసి వెలిసిన కొద్ది రోజులకు మట్టి చిన్న పెళ్ళాలు గా ,పెంకు ముక్కలుగా పైకి లేచేది .మద్ధ్య మధ్య కాలీలు ఏర్పడేవి .వాటిని ఇప్పుడు ఆలో చిస్తే తమాషా గా ఉంటుంది .ఒక పక్క కోన దేలి   ఆ ముక్కలున్దేవి .జంపా రెడ్డి గారనే స్కౌట్ సోషల్ మాస్టారు మంచి పాటలు నేర్పించే వారు .ఆయన గొప్ప కళా కారులు .1954హైస్కూల్ నుండి మొదటి బాచ్ ఎస్ .ఎస్.ఎల్ .సి.విద్యార్ధులు మార్చి పరీక్ష రాశారు .ఆ బాచ్ లో మా అక్కయ్యా వాళ్ళున్నారు .మేము స్కూలు ఫైనల్ కు వచ్చేసరికి మాది మూడో బాచ్ అయింది మేము1956 మార్చి పరీక్షలు రాశాము .నేను మొదటి నుంచి అన్ని పరీక్షల లోను మొదటి స్తానం లోనే ఉండే వాడిని .స్కూల్ ఫైనల్ ప్రీ పబ్లిక్ వరకు ఈ హవా సాగింది .నాతో పోటీకి స్వరాజ్య లక్ష్మి ,చంద్రా నిర్మల అనే అమ్మాయిలూ ఎప్పుడూ పోటీ పడే వారు .ఒక్కో సారి తెలుగులో నా కంటే ముస్లిం కుర్రాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించే వారు .మొత్తం మీద నాదే ఫస్టు .s.s.L.c.పబ్లిక్ లో నాకు365 మార్కులోచ్చి  ఒక్క సారి గా వెనక  బడి స్కూల్ సెకండ్ అయాను .స్వరాజ్య లక్ష్మి నా కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించి ఫస్ట్ గా నిలి చింది .ఇది అందరికీ ఆశ్చర్యం కలి గించింది .ఆమె ఏలూరు లేడీస్ కాలేజిలో బయాలజీ లెక్చరర్ అయింది .నిర్మల తెలుగు పండిత పరీక్ష పాసై చివరికి హెడ్ మిస్త్రేస్ అయింది .నేను అప్పుడు లెక్కల్లో పూర్ .మాకు అప్పుడు ఆల్జీబ్రా ఉండేది .దాన్ని కే.రాదా కృష్ణా రావు గారు అనే హెడ్ మాస్టారు చెప్పే వారు .ఆయన బోధన మాకు ఎక్కేది కాదు .అందులో నాకు మరీ.ఆయనే ఇంగ్లీష కూడా బోధించే వారు .అయితే పోయిట్రీ కి మాత్రమె వచ్చే వారు .సి హెచ్ .పూర్ణ చంద్ర రావు గారు అనే ఆయన గొప్పగా ఇంగ్లీష ప్రోజు బోధించే వారులెక్కల కోసం చాలా తంటాలు పడ్డాను మా నాన్న గారి శిష్యులు  మాకు పదో తరగతి లెక్కల మాస్టారు సీతం  రాజు కామేశ్వర రావు గారి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లి తెలియనివి చెప్పించుకొనే వాళ్ళం .ఆయన రాసిన ఇంగ్లీష నోట్సు ఇచ్చే వారు .వారమ్మాయి మా క్లాస్ మేట్ కూడా .ఆదినారాయణ  నరసిమ్హాలు  తప్పారు . నరసింహం   ఆ  తర్వాత బేజ వాడ   ఐ టి ఐ  లో   ఎలెక్ట్రికల్  కోర్స్    చదివి  ఉయ్యూరు  కే . సి .పీ   లో  ఎలేక్త్రీషియాన్  గా పని    చేసి   రిటైర్   అయాడు .  .
తొమ్మిదో తరగతి లో కూడా లెక్కలు తెల్సేవి కావు .అందుకని పండు అని మా తమ్ముడి క్లాస్ మేట్ అన్నగారుసెకండరీ టీచర్  కొబ్బరి తోటల ఉంటె  ,ఆయన దగ్గర ,లేక మా ఇంటికి వారాలకు వచ్చే పాలి టెక్నిక్ కాలేజి విద్యార్ధుల దగ్గర నేర్చుకొనే వాళ్ళం .నరా సింహా రావు గారి తరువాత బులుసు గౌరీ పతి శాస్త్రి గారు ,ఆ తర్వాత ఆచంట సత్య  నారాయణ గారు,చివరగా రాదా కృష్ణా రావు గారు  హెడ్ లు గా వచ్చారు . గాయత్రి దైవస్ర వస శర్మ గారు అంటే అనంత రామయ్య గారబ్బాయి మొదట్లో జూ నియర్ తెలుగు పండిట్గా ,ఆ తర్వాత సీనియర్ గా వచ్చారు .తుమ్మల లక్ష్మయ్య గారు మాకు స్కూల్ ఫైనల్లో తెలుగు మాస్టారు .ఆయన చిన్న స్లిప్పులు రాసి పుస్తకం లో పెట్టుకొని దాని సహా యం తో చెప్పే వారు .ఏదైనా సమయానికి స్లిప్ లో విషయం దొరక్క పోతే ”మేస్టారబ్బాయ్ మీరు చెప్పండి దీనికి అర్ధం ”అని నన్ను అడిగే వారు .ఆయన చాలా విషయాలు ,వ్యుత్పత్తులు,నానార్ధాలు బాగా నే చెప్పారు .పేపర్లు దిద్దటం బద్ధకం .మాతో దిద్దించే వారు .ఇన్స్పెక్షన్ అంటే భయం సెలవు పెట్టె వారు .
పదవ తరగతిలో గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారు భలే హుషారైన కధలు చెప్పుతూ తెలుగు లో గొప్ప అభి రుచి కలిగించారు .కామేశ్వర రావు గారు లెక్కలు చెప్పే పద్ధతి ముచ్చట గా ఉండేది .అర్ధం కాక పోవటం ఉండేది కాదు .ఏ స్టెప్పు వదల కుండా బోర్డు మీద లెక్కలు చేసే వారు .హోమ్ వర్కు ఇచ్చి చూసే వారు .పూర్ణ చంద్ర రావు గారి ఇంగ్లీష అదుర్స్ .సైన్సు ను కామేశ్వర రావు గారు చెప్పారు .ఆయన బాగా ఒదులుగా ఉండే పాంట్లు వేసే వారు .ఒక్కో జేబులో బస్తాడు బియ్యం పడతాయి అని” జోక్కునే” వాళ్ళం .అందుకని ”బియ్యం బస్తా ”అనే వారాయన్ను .ఎస్ ఎస్.ఎల్ .సి లో మాకు జంధ్యాల ప్రసాద శర్మ గారు సైన్సు చెప్పారు .అద్భుతం అంటే ఏమిటో దాని అర్ధం ఆయన మాకు చూపించారు .నేనంటే మహా అభిమానం .నా బోధనకు ఆయనే నాకు ఆదర్శం .అ తర్వాత మేమిద్దరం అదే స్కూల్ లో సైన్సు మాస్తార్లం గా కలిసి పని చేశాం .అలాగే నరసింహా రావు గారి వద్ద నేను సైన్సు మాస్టారు గా కలిసి పని చేయటం నాకెంతో గొప్ప విషయం అని పిస్తుంది .వై రామా రావు గారు సీనియర్ డ్రిల్ మాస్టారు .రామా రావు గారు హిందీ పండిట్ .సోషల్ పూర్ణ చంద్ర రావు గారు .బసవా చారి గారు నేనూ మళ్ళీ స్కూల్లో కలిసి టీచర్లు గా పని చేయటం నా అదృష్టం .
నాకు ఒక బాచ్ ఉండేది .దానికి నేను మకు టం లేని మహా రాజును. .నా బాచ్ లో నేను , పెద్దిభొట్ల ఆదినారాయణ ,సూరి నరసింహం, మామిల్ల పల్లి సత్య నారాయణ తో బాటు జూనియర్లుయినా మా తమ్మ్డుడు , ,పార్ది తమ్ముడు, నర సింహం తమ్ముడు  వగైరాలుండేవాళ్ళు .మే మందరం మా ఇంటి నుంచి కలిసి బడికి వెళ్ళే వాళ్ళం కలిసి ఇంటికి వచ్చే వాళ్ళం .మా మామయ్య గారి మామిడి తోటలోంచి వెళ్ళే వాళ్ళం మామిడి పిందెలు ఎరుకు తినే వాళ్ళం .సెనగ చేలున్దేవి తెలీకుండా చెట్టు పీకి సెనగలు తినే వాళ్ళం .అదో సరదా .మధ్యాహ్న భోజ నానికి ఇంటికి వచ్చే వాళ్ళం .బట్టలు విప్పి ఒక మూల పడేసి అక్కడే ముందుగా పెట్టుకొన్న లాగు కట్టుకొని అన్నం తిని మళ్ళీ దాన్ని విప్పి అక్కడే పడేసి బడి బట్టలు కట్టుకొని వెళ్ళే వాళ్ళం .ఇంటికి రాగానే సాయంత్రం వాటిని చాకలి బుట్టలో పడేస్తే మర్నాడు చాకళ్ళు తీసుకొని వెళ్లి ఉతికి తెచ్చే వాళ్ళు .మా స్కూల్ ఫైనల్ వరకు మా ఇంట్లో కరెంటు లేదు. గుడ్డి దీపాలు ,లాంతర్ల దగ్గరే చదువు .రోజు వాటి ఒత్తుల్ని సరి చేసి కిరస నాయాలు పోసుకొని,గ్లాసుల మసిని పాత బట్ట తో  తుడిచి,  అగ్గి పెట్టె దగ్గరుంచుకొని అన్నాలు  తిన్న తర్వాత వెలిగించి, చదువు కొనే వాళ్ళం .రాత్రి తొమ్మిదింటి దాకా చదువు నన్ను అందరు లీడర్ గా భావించి చెప్పింది చేసే వారు ఇందాక చెప్పిన బాచ్ అంతా మా ఇంటికే వచ్చి చదువు కొనే వారు .దాదాపు అందరు మా ఇంటి వద్దే పడుకొనే వారు .భలే హుషారుగా ఉండేది .మా అమ్మా నాన్న నా మిత్రులతో నన్ను గురించి మాట్లాడే టప్పుడు ‘ఎరా మీ గురు వుగారు ఎక్కడ ”?అని ముసి ముసి నవ్వులతో ప్రశ్నించే  వారు .అంతటి గురు శిష్య సంబంధం గా గడిపే వాళ్ళం .మా వడ్లు పోసుకొనే గది లో అందరం పుస్తకాలను దాచుకొనే వాళ్ళం .
సాయంకాలం బడి నున్చిరాగానే ఆటలుఆడుకొనే వాళ్ళం .ఆ రోజు ఆటలు అంటే బచ్చాల ఆట ,బొంగ రాలాట ,గోలీలాట, దూకుల్లు, కుంది కుట్టు ,గోడుం బిళ్ళా అనే  కర్రా బిళ్ళా .అన్నీ మాకున్న రెండు పెద్ద సందుల్లోనో లేక ఇప్పుడున్న  నీళ్ళ టాంకు దగ్గర పాడు బడిన బావి దగ్గర ఖాళీ లోనో, గుడ్ల సుబ్బమ్మ  గారి సందులోనో ఆడుకొనే వాళ్ళం .నేను పద్యాల పోటీలు, పాటల పోటీలు, వ్యాస రచన, డిబేటింగ్ పోటీలు నిర్వ హించే వాడిని వీళ్ళందరికీ .బహుమతులిచ్చే వాడిని .మా గొడ్ల దొడ్లో మేము గోడ కట్టు కోవటానికి తీసిన సిమెంటు రాళ్ళ పేర్పు ఉండేది .దాని మీద కూర్చుని అన్నీ పుర మాయించే వాడిని. పాపం ఎందుకో నేను అంటే భక్తీ గౌరవం స్నేహం వీళ్ళందరికీ .మా ఇంటి పక్క బ్రహ్మా జోస్యుల వారింటి బయట గదిలో కూర్చుని ‘మను చరిత్ర ”కు వేదం వారు రాసిన వ్యాఖ్యానం చది వి విని పిస్తూ పద్య సౌందర్యాన్ని ఆయన భాషలో తెలియ జేస్తూ ఉండే వాణ్ని .అందరు ఆసక్తి గా వినే వారు .ఇదే నాకు తర్వాత సాహిత్యం మీద అభి రుచి కలగ టానికి కారణం అయింది .
దేవాలయాలకు కలిసివ్ వెళ్ళే వాళ్ళం .ఎదేవుడికి ఏ స్తోత్రం చెప్పాలో మా మేన మామ గంగయ్య గారిని అడిగి రాయించుకొని బట్టీ పట్టి గుడిలో చెప్పే వాళ్ళం .దసరాలలో శివాలయానికి రాత్రి పూట అందరం వెళ్లి పూజ  ఆవ గానే జరిగే మంత్ర పుష్పం లో వంగల సుబ్బయ్య గారు మా నాన్న గారు, మా మామయ్యా, కోట కృష్ణ మూర్తి గారు ,యనమండ్ర పార్ధ సారధి గార్ల మంత్రాలను విని తన్మయు లయే వాళ్ళం .అవే తరువాత శ్రుత పాండిత్యం అయింది .మేమందరం కలిసి శివరాత్రికి తోట్ల వల్లూరు, ఐలూరు వెళ్లి వచ్చే వాళ్ళం .దీనికి మార్గ దర్శి మా ఆది నారాయణ .అతను చెప్పినట్లే వెళ్ళే వాళ్ళం .
దాదాపు మేమందరం వాకిలి అరుగు మీద చాపలేసుకొని పడుకొనే వాళ్ళం .ఆది నారాయణకు వాళ్ల నాన్న నులక మంచం తెప్పించి ప్రత్యేకం గా వేయించే వాడు. అతను దాని మీద పడుకొనే వాడు అతనికోసం ఒక ప్రత్యెక మైన చెంబులో మంచి నీళ్ళు, గ్లాసు .మేమెవరం దాన్ని ముట్టుకో రాదనీ వాళ్ల నాన్న శాసనం .అందుకని అతన్ని బాగా ఏడిపించే వాళ్ళం .దత్తు గారి అరుగు మీద నేను అటూ ఇటు తిరుగుతూ అతన్ని పరిగెత్తించే వాడిని అతడు వాళ్ల నాన్న కు చెప్పే వాడు ఆయన పరి గేత్తుకో చ్చే వాడు .ఆయన వస్తాడని తెలిసి నేను చెంబు తీసుకొని ”చామల్లో ”దూరే వాడిని .ఆయన కొంచెం దూరం నిలబడి ”ఎరా ఎంత సేపు .రా బయటికి ”అనే వాడు .”ఇదిగో అయి పోయిందని ”ఆయన కళ్ళు కప్పి వెనక నించి వెళ్ళే వాడిని .ఏమీ చేయ లేక ముసి ముసి నవ్వులు నవ్వి మా అమ్మకు చెప్పే వాడు ఆవిడ” పిల్లలేదోఆటల్లో అలా చేసుకొంటారు మధ్యమనం కల్పించుకోరాదండీ ”అనేది . చిలిపి తనం నాకు  బాగా ఉండేది .సత్య నారాయణ గబా గబా మాట్లాడే వాడు. అందుకని ”లోడ పిత్తరి ”అని పిలిచే వాళ్ళం .సెకండరీ మేస్తారోకాయనకు ”అత్తరు బుడ్డీ ”అనే హిందీ మేస్టారి ముక్కు లావు గా ఉంటె ”జాంబ వంతుడు ”అనీ మారు పేర్లు పెట్టె వాళ్ళం .సత్తార్ బేగ్ అనే ముస్లిం స్నేహితుడుండే వాడు. .ప్రాణ స్నేహం గా ఉన్నాడు .చిట్టురి పూర్ణ చంద్ర రావు అనే వైశ్యుడు, గండి వాసు అనే తూర్పు కాపు, జన్యావుల కేశవరావు  అనే వడ్రంగి ఇలా  అన్ని కులాల వాళ్ళు మాకు స్నేహితులే .అందరు నా మాట వినే వాళ్ళు .మా  బాచ్ కి పోటీ బాచ్ చోడ వరపు” ధాము ” గాడి బాచ్ .చదువుల్లో పోటీ ఎక్కువ .
మా ఇంటి దగ్గర- మా స్నేహితులు మేమెవ్వరం చెప్పకుండానే మంచాలు నేయటం ,నల్లులు చంపటం ,వడ్లు మర పట్టించటం ,పిండి మరాకు వెళ్లటం, కట్టెలు కొంటె సందులో నుంచి ఇంట్లోకి చేతుల మీద పెట్టుకొని తీసుకు రావ టం అన్నీ చేసే వారు .మా క్కయ్యలను ”అక్కయ్య గారూ ”అనీ మా అమ్మను ”పిన్ని గారూ ”అనీ ఆప్యాయం గా  పిలిచే వారు .మా కు కుటుంబ సంబంధాలు కూడా బాగా ఉండేవి .పెళ్లిల్లకూ ,పేరంటాలకు ఒకర్నొకరు పిలుచుకోవటం ఉండేది .కార్య, కరామతులు అయితే దాదాపు వాటిని ఆదినారాయణ ,నరసింహం తమ భుజ స్కంధాల పై వేసుకొని మంచి సహా కారం అందించే వారు .వారిద్దరూ మా ఇంటి సభ్యులే అన్నట్లు ప్ర వర్తించారు .సత్య నారాయణ కుల వ్రుత్తి అయిన ఆయుర్వేదం నేర్చి కుందేరు లో క్లినిక్ పెట్టి బాగా సంపాదించాడు .ఒకటి రెండు సార్లు అక్కడికి తీసుకొని వెళ్లాడు. కాని దాదాపు పాతికఏళ్ల క్రితం అకస్మాత్తు గా మరణించాడు .ఆది నారాయణ ఖాదీ లో పని చేసి ,రైల్వే లో పని చేసి ఉద్యోగం పోయి ,ఖాళీ గా ఉంటూ పౌరోహిత్యం నేర్చి దాని తో కాల క్షేపం చేశాడు .అతనూ పదేళ్ళ కృత మ్ చని పోయాడు .వాళ్ల పెళ్ళిళ్ళకు మేము మా పెళ్ళిళ్ళకు వాళ్ళు వచ్చే వారు .నరసింహం ఇంట్లో ఏ కార్య క్రమం అయినా మేమందరం హాజరు అదీ మా మైత్రి .ఆదినారాయణ మంచి హరికధలు చెప్పే వాడు శ్రావ్య మైన కాంతం .మా ఇంట్లో నోములు ,వ్రతాలు చేయించే వాడు
మేము హిందూ పురం లో ఉండగా ప్రతి శుక్ర వారం సాయంత్రం ”భారత మాత ”పూజ చేసే వాళ్ళం .అందరు నాయకులు ఉబ న్న భారత మాత ఫోటో ఉండేది .దాన్ని పెట్టి స్తోత్రాలు ,పాటలు ,పద్యాలు పాడే వాళ్ళం .ఉయ్యూరు వచ్చిన తర్వాతా కొంత కాలం కోన సాగించాం .తరు వాత దాన్ని  ప్రతి సోమ వారం ”శివ పూజ ”గా మార్చి చేశాం .చాలా ఏళ్ళు చేశాం .భజనకు కోసిన చదరపు చెక్కలను ఉప యోగించే వాళ్ళం .ఆది నారాయణ పద్యాలు బాగా పాడే వాడు ఒక్కో సారి అతనితో హరికధలు చెప్పించే వాళ్ళం. మా నాన్న గారు మా అమ్మ గారు అంటే అందరికి భక్తీ ,గౌరవం .మాట జవ దాటటం ఉండేది కాదు .నరసింహం వాళ్ళమ్మ గారు కంది పచ్చడి మహాద్భుతం గా చేసే వారు .వాళ్ళింట్లో పచ్చడి చేస్తే మా ఇంటికి ఆది రావాల్సిందే.మా అమ్మ పెసర పచ్చడి బాగా చేసేది ఆది వాళ్ళింటికి రవాణా .అలాగే వంకాయ కూరకూడా .ఆత్మీయతలు అను బంధాల కాలం ఆది అంతా .పరీక్షా ఫలితాలు తెలియ గానే ప్రతి ఇంట్లోను పార్టీ చేసుకొనే వాళ్ళం .అందరం అందర్నీ పిలుచుకొనే వాళ్ళం స్వీటు హాటు టీ ఉండేవి .అందరం కలిసి వీరమ్మ తల్లి తిరునాల కు వెళ్ళే వాళ్ళం .అక్కడ ”చేర బొప్పాయి గుండు ”ఆడే వాళ్ళం .తిరునాల లో ఖర్జూరం పండు తప్ప మా వాళ్ళు అప్పుడు ఏమీ కొనే వాళ్ళు కాదు .బూరాలు కొనే వాళ్ళం ”ధమ ధమాల బండి ”భలేగా ఉండేది రబ్బరు బూరాలతో అనేక రకాల డిజైన్లు చేసిచ్చే వారు .సొరకాయ బూరాలున్దేవి .నీళ్ళు పోసిన రబ్బరు బంతి దాని మూతి చివర రబ్బరు తాడు కొనే వాళ్ళం .దాన్ని చేత్తో తడితే కిందికీ పైకీ వస్తు బాగుండేది ..
ఉదయం పూట అందరం కలిసి పుల్లేరు కాలువకు వెళ్ళే వాళ్ళం .అక్కడ స్నానం చేసి ఈతలు కొట్టి బిందెలతో మంచి నీరు తెచ్చుకొనే వాళ్ళం .ఆ నీళ్ళకు చిల్ల గింజ అరగ దీసి కాని ,పటిక కలిపి కానీ బురదను తొలగించే వాళ్ళం .పైన ఉన్న స్వచ్చ మైన నీటిని తాగే వాళ్ళం .వేసవి లో చెలమలు తవ్వే వారు .అందులో నీరు తెచ్చుకొనే వాళ్ళం .శివాలయం లో సహస్ర ఘటాభి షషెకానికి నీళ్ళు బిందెలతో  మోసుకొని వెళ్లి అందించే వాళ్ళం .విష్ణాలయం లో వైశాఖ మాసం లో జరిగే కల్యాణాన్ని అర్ధ రాత్రి దాకా చూసే వాళ్ళం. కళ్ళు మూసుకు పోతున్నా అలానే కునికి పాట్లు పడుతూ చూసే వాళ్ళం . .ఇదంతా మా హై స్కూల్ చదువు గిదువూ ను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –37 ఫాక్టరీ కూతలు

    ఊసుల్లో ఉయ్యూరు –37
ఫాక్టరీ కూతలు 

మా ఉయ్యూరు లో కే.సి.పి.షుగర్ ఫాక్టరి ఉంది .ఇది ఆసియా లోనే అతి పెద్ద ఫాక్టరి గా పేరు పొందింది .ఇక్కడి చక్కర చాలా నాణ్య మైనది గా భావిస్తారు .ఎగు మతికి శ్రేష్టం అంటారు .యాజ మన్యం చాలా జాగ్రత్తలు తీసుకొంటూ రైతులను ,ఉద్యోగస్తులను, కార్మికులను, విశ్వాసం లోకి తీసుకొని నడుపుతూ సమస్యలు లేకుండా చేస్తూ ,కార్మికుల సమ్మె లేకుండా చేస్తూ ,అత్యుత్తమ నిర్వహణ కుజాతీయ స్తాయి లో  అనేక సార్లు ప్రశంసలు, బహుమతులు సాధించింది .అలాంటి ఫాక్తరి విద్యా విషయకం గా ,స్థానిక రోడ్ల విషయం లో ,సౌకర్యాల కల్పనలో, రైతులకు చేయూత నిచ్చే విధానం ,లో సాంస్కృతిక ,సేవా కార్య క్రమాలను నిర్వహించే పద్ధతి  లో రోటరీ క్లబ్బుకు చేదోడు వాదోడు గా ఉంటూ సేవా నిరతి తో ప్రశంశలను అందుకొంటూ ప్రగతి పధం లో దూసుకు వెడుతోంది .వృద్ధాశ్రమాన్ని సమర్ధం గా నిర్వ హిస్తోంది .ప్రభుత్వ ఆశు పత్రికి సహాయం అందిస్తోంది .కంటి ఆస్పత్రిని నిర్మించి లేజర్ చికిత్సా విధానం లో మార్గ దర్శ కత్వం వహించింది .డాక్టర్ రతన్ కుమార్ దంపతుల పేరు చెబితే ఆంద్ర దేశం అంతా చేతు లెత్తి నమస్కరిస్తారు .వారిద్దరూ వేలాది కంటి ఆప రేషన్లను  విజయ వంతం గా నిర్వహించి ఉత్తమ డాక్టర్లుగా ప్రసిద్ధి చెందారు .రాష్ట్రం లో మారు మూల ప్రాంతాలలో ఉన్న కంటి జబ్బు  వారు ఇక్కడికే వచ్చి చూపించుకొని కళ్ళ జోళ్ళు వేయించుకోవటం, ఆపరేషన్లు చేయించుకోవటం చూస్తేనే దాని విలువ ఏమిటో తెలుస్తుంది .ఇన్ని విషయాలలో కే.సి.పి.అగ్ర గామి గా ఉంది .ఇదంతా అందరి సౌజన్య, సహకారాల వల్లనే సాధ్య మయింది .అలాంటి ఫాక్టరి కూతలు వేసింది అంటే ?అంటే ఫాక్టరి కూసిందని కాదు -దాని లోని సైరన్ కూసింది అని అర్ధం .వాటినే జన సామాన్యం ఫాక్టరీ కూతలు అంటారు అక్కడ .
ఫాక్టరి కూతలు దాదాపు మూడు మైళ్ళ పరిధి గ్రామాలకు విని పిస్తాయి .ఈ కూతలు రెండు రకాలు గా ఉంటాయి .ఒకటి ఫాక్టరి లో సామాన్య ఉద్యోగులకు ఒక రకం గా ,రెండోవి షిఫ్టు లలో పని చేసే వారికి ఇంకో రకం గా ఉంటాయి .ఆఫీసు పని గంటలు ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పద కొండున్నర వరకు. మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం అయిదు వరకు .అందుకని వీరికోసం ఉదయం యేడు గంటలకు మొదటి కూత అంటే సైరన్ వేస్తారు. ఎడుమ్బావుకు రెండో సారి ఏడున్నరకు మూడో సైరన్ వేస్తారు .మూడో సైరన్ మోగే సరికి అందరు వచ్చి విధి నిర్వహణ లో ఉండాలి .అందరు దీన్ని తప్పక పాటిస్తారు .ఇవి సామాన్య జనాలకు సమయం తెలుసు కోవటానికీ బాగా ఉప యోగా పడ తాయి .ఎలిమెంటరీ  స్కూలు కు వెళ్ళే పిల్లలను తయారు చేయ టానికి తల్లి  దండ్రులకివి తోడ్పడేవి .రెండో కూత విని పించింది అంటే అంతా రెడీ అన్న మాటే .దారులన్నీ ఉద్యోగస్తులతో నిండి ఉంటాయి నడిచి వెళ్ళే వాళ్ళు, సైకిల్ మీద వెళ్ళే వారు ఇప్పుడు ద్విచక్ర వాహకులు .సందడే సందడి .మళ్ళీ పదకొండున్నరకు ఒక సారి కూత వేస్తారు అప్పుడు లంచ్ బ్రేక్ .ఆ సమయం లో ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తారు .కారీయర్లు తెచ్చుకొన్న వాళ్ళు అక్కడే కానిస్తారు .మళ్ళీ పన్నెండున్నరకోసారి పావు తక్కువ ఒంటి గంట కోసారి ,ఒంటి గంటకో సారి  కూతలు విని పిస్తాయి .లంచ్ అయిన తర్వాత మళ్ళీ విధుల్లో ప్రవేశిస్తారు .సాయంత్రం అయిదు గంటలకు ఒక లాంగ్ విజిల్ వేస్తారు .అప్పుడు ఎనిమిది గంటల పని అయి పోయినట్లు .మళ్ళీ ఇళ్లకు బయల్దేరు తారు .ఇదీ ఉద్యోగస్తుల కూ తలు
ఫాక్టరీ లో మూడు షిఫ్టులలో సీజన్ లో పని జరుగు తుంది. సీజన్ నవంబర్ నుండి ,దాదాపు మార్చి చివరకు లేదా ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది . ఈ షిఫ్ట్లు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఒకటి, సాయంత్రం ఆరు నుండి రాత్రి రెండు వరకు రెండో షిఫ్టు , ,రాత్రి రెండు నుండి ఉదయం పదివరకు మూడో షిఫ్టు ఉంటాయి . వీరిని సరైన సమయానికి ఫాక్టరీకి రప్పించేందుకు సైరన్ మోగిస్తారు .ఉదయం తొమ్మిదిన్నరకు ఒక సారి ఫాక్టరి కూత విని పిస్తుంది .పావు తక్కువ పదికి రెండో సైరన్ విని పిస్తుంది .సరిగా పది గంటలకు మూడో సైరన్ విని పిస్తుంది .మొదటి కూత దగ్గర నుండే కార్మికుల హడా విడి ప్రారంభ మావు తుంది .దూరం లో ఉండే వారు అప్పటికే బయల్దేరి దారిలో ఉంటారు .రెండో కూత కు దాదాపు ఫాక్టరి ఆవరణ లో ప్రవేశిస్తారు .మూడో కూతకు డ్యూటీ ఎక్కు తారు .సమయ పాలన బాగా పాటిస్తారు .ఈ కూతలు స్థానిక ,విద్యా లయాలకూ బాగా ఉప యోగ పడతాయి .ఆఫీసులకు వెళ్ళే వారికీ పనికొస్తాయి. సాధారణం గా అవన్నీ ఉదయం పదిగంటలకు ప్రారంభ మవుతాయి కనుక వాళ్ళూ ఎలర్ట్ అవటానికి వీలుగా ఉంటుంది .ఈ షిఫ్టులో పని వాళ్ళు లోపలి వెళ్తుంటే డ్యూటీ దిగే వారు బయటికి వస్తూ కన్పిస్తారు .రోడ్లన్నీ అందరితో నిండి ఉంటాయి. దూరం నుండి వచ్చే .కార్మికుల చేతుల్లో ,సైకిళ్ళకు కారీయర్లు ఉంటాయి .చుట్టప్రక్కల సుమారు పది నుంచి పది  హేను గ్రామాల నుండి వచ్చి పని చేస్తూ ఉంటారు .
సాయంత్రం షిఫ్టు కు రావటానికి ఐదున్నరకు ఒక మొదటి కూత విని పిస్తుంది .పావు తక్కువ ఆరుకు రెండోది ఆరు గంటల  కు మూడో కూతా విని పిస్తుంది .దీని తో మళ్ళీ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ల తో రోడ్లు కళకళ లాడుతాయి .కార్మికుల భాషలో దీన్ని ఆరు గంటల షిఫ్టు అనీ, పొద్దున్న దాన్ని పది గంటల షిఫ్టు అనీ అంటారు .రా త్రి రెండు గంటలకు మూడో షిఫ్టు ప్రారంభం .దీన్ని రెండు గంటల షిఫ్టులేక నైట్ షిఫ్టు  అంటారు .దీనికి సన్నద్ధం చేయ టానికి రాత్రి ఒంటి గంటన్నరకు మొదటి కూత వేస్తారు .పావు తక్కువ రెండుకు రెండో కూత విని పిస్తుంది .రెండు గంటలకు మూడో కూత తో షిఫ్టు పని ప్రారంభం అవుతుంది .ఆరింటి షిఫ్ట్ అయి పోయిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేస్తారు .ఒక్కో సారి డబల్ షిఫ్టు చేయాల్సిన అవసరం కూడా కలుగు తుందట .
నైట్ షిఫ్టుకూతలు  రైతులకు బాగా ఉప యోగ పడేవి .ముఖ్యం గా ధాన్యం నూర్పిడి కాలం లో ఇవి రైతులకు, పొలం కూలీలకు వరాలే .దాదాపు ఇరవై ఏళ్ల కిందటి వరకు ధాన్యం నూర్పిడి కోసం రైతులు కూలీలను మొదటి కూతకు అంటే ఒకటిన్నరకే లేపే వారు .పాలేరు వెళ్లి కూలీ నాయకుడినిలేపే వాడు బండి కట్టి రెడీ చేసే వాడు .  అతడు తన ముఠా నంతా లేపే కార్య క్రమం చేసే వాడు .రెండోకూత కు అంటే ఒంటి గంట ముప్పావుకు బళ్ళు కూలీలతో బయల్దేరి .మూడో కూతకు అంటే రాత్రి రెండు గంటలకు చేలల్లో దిగే వాళ్ళు .కాసేపు గడ్డి మంట వేసుకొని చలి కాచుకొని ఇక పని మొదలు పెట్టె వారు .మా చిన్న తనాల్లో రెండుమ్బావుకు పని జోరుగా సాగుతూ ఉండేది.  కుప్ప మీద ఎక్కి ఒకరు పనల కట్టలను తీసి ఇస్తుంటే కొంత మంది వాటిని అన్డుకొంటు  చిన్న కట్టలు గా అప్పటికే పెన వేసుకొన్న తాళ్ళ తో చుట్టి, బల్ల మీద కొడుతూ ఉండే వారు .ధాన్యం రాలి బల్ల చుట్టూ పడేది .ఎడ్ల తో ఈ కొట్టిన పనలను తోక్కించే వారు .సాధారణం గా మూడు నాలుగు జతల ఎడ్లు తోక్కేవి దీన్ని ”బంతి కట్టటం ”అనే వారు .ఒకడో ,ఇద్దరో ఎద్దులను అదలిస్తూ వెంట ఉండే వారు .బంతి తోలటం ఒక కళ.అవి తరచుగా పేడ వేసేవి .ముడ్డి దగ్గర గడ్డి చుట్టల తో పేడను పట్టి దూరం గా విసిరే వారు .సరదా గా కబుర్లు చెబుతూ బూతు పాటలు పాడుతూ, ఊళ్ళో కబుర్లు చెబుతూ సందడి చేసే వారు .మా ఉయ్యూరు పొలానికి ”చిన్నబ్బాయి ‘అనే అతను కడవ కొల్లు పొలానికి ”సీతా రామయ్య ”అనే అతను మాకు నిఖా మానులు .వాళ్ళే దగ్గ రుండి అన్నీ చూసుకొనే వాళ్ళు .ఎడ్ల బదులు గేదెలు ,ఒట్టిపోయినఆవులు  ,దున్నలను కూడా కట్టే వాళ్ళు .ఒక జత ఎడ్లు  మనిషికి ఒక రేటు ఉండేది .దాని ప్రకారం ఎన్ని రోజులైతే అన్ని రోజులకు, ధాన్యం రాసి తయారైన రోజున కొలిచి ధాన్యం ఇచ్చే వాళ్ళం .మా నాన్న గారి టైం లో ఆయన చేలోనే పడుకొనే వారు .నేనూ ఆయన తర్వాత నూర్పిడి సమయం లో పడుకొనే వాడిని .నూర్పిడిని ”మహాసూలు ”అనే వారు .
నా లాంటి యజమాని చలికి తట్టుకో లేడని మా నిఖా మానులు బండీ కింద వరి గడ్డి ఎత్తుగా పరచి, దాని మీద ధాన్యం పట్టే గోనే సంచులు వేసి, చుట్టూ గడ్డి కట్టలు పేర్చి ,చలి లేకుండా చేసే వారు .మేము ఇంటి నుండి తెచ్చుకొన్న జంపఖానా, దుప్పటి, దిండు ,కంబళిలతో చలి లేకుండా చేసుకొనే వాళ్ళం .స్వేట్టారు మఫ్లరు తప్పని సరి . రేడియోలు అభి వృద్ధి చెందిని కాలమ్  ట్రాన్సిస్టర్ ను వెంట ఉంచుకొనే వాళ్ళం .పెద్ద బాటరీ లైట్ తప్పని సరి .మాతో  పాటు నిఖా మానో అతని కొడుకులో తోడుకు పడు కొనే వారు .ఉదయం ఇంటి నుంచి ఎనిమిదింటికి మాకు టిఫిన్ కాఫీ పాలేళ్ళు తెచ్చే వారు .అప్పటికే దగ్గర లో ఉన్న కాలువ లో కాల కృత్యాలు తీర్చుకొని వచ్చే వాళ్ళం .అ టిఫిన్లు రాగానే తి ని కాఫీ, తాగే వాళ్ళం .నాకుతోడు మా చిలుకూరి నరసింహం ఉండే వాడు .లేక పోతే ఆదినారాయనొ  నరసింహమో  ఉండే వాళ్ళు .కూలీలకు  ఉదయం ఏడింటికి ఆడ వాళ్ళు అన్నాలు తెచ్చే వారు .పని ఆప కుండా ఒకరి తర్వాతా ఒకరు బయటికి వెళ్లి అన్నీ కానిచ్చు  కోని వచ్చి, అన్నాలు తినే వారు .ఆ సన్నీ వేశం చూడ ముచ్చటగా ఉండేది .మధ్యాహ్న భోజనం కూడా వాళ్లకు అందులోనే ఉండేది .మాకు మధ్యాహ్నం పదకొండు పన్నెండు మధ్య ఇంటి నుంచి కారీరు ను పాలేరు తెచ్చే వాడు .దాని తో పాటు సాయంత్రం టిఫిను, ఫ్లాస్కు లో ఫుల్ గా కాఫీ పోసి పంపే వారు .అరటి పళ్ళు వచ్చేవి .ఎన్ని తిన్నా ఆరగి పోయేవి ఆకలి బాగా అయేది .ఇవి అన్నీ ఖాళీ చేస్తూ పని చేయిస్తూ, మహాసూలు పూర్తీ చేసే వాళ్ళం .ఒక్కో సారి గాలి లేక, పోత సాగేది కాదు .ఎక్కువ రోజులున్దాల్సి వచ్చేది .సాయంత్రానికి పాలేరో మా అబ్బాయిలో ఎవరో ఒకరు వచ్చే వారు. నేను ఇంటికి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ చేలోకి వెళ్ళే వాడిని. మాకు ఉయ్యూరు, కడవకొల్లు -రెండు పొలాలు రెండు కిలో మీటర్లే కనుక ఇబ్బంది ఉండేది కాదు .ఉయ్యూరు పొలం ఫాక్టరి వెనకాలే బల్ల దొడ్డి దగ్గర .కడవ కోల్లు పొలం ఒంతెనకు కడి ప్రక్కనే .రేడు పొలాల్లో బోరు, మోటారు ఉండేవి .సాయంకాలం ఆరు గంటల షిఫ్టు మొద లయ్యే దాకా  చేలో పని చేసే వారు .
ఆ తర్వాత విధానం మారింది .తెల్ల వారు ఝామున మూడున్నర అయితే కాని చేలో దిగటం లేదు కాఫీ ఇడ్లీలు ఇప్పించాల్సి వచ్చేది .ఇప్పుడా శ్రమ లేకుండా ట్రాక్టర్ల తో నూర్పిడి తేలికైంది .కళ్ళం చేసే శ్రమ తప్పింది కూడా .పరజాలు అద్దె కు తెచ్చి పరిచి నూర్చటం తేలికైంది నూర్పిడి యంత్రాలోచ్చి ఇంకా సులభ తరం చేశాయి .ఫాక్టరి కూతలు రెండో పంట కాలం లో బాగా ఉప యోగ పడేవి .మినప తీతలు ఫిబ్రవరి చివర లేక మార్చి మొదట్లో వచ్చేవి .ఉదయం ఎడున్నరకే కూలీలు చేలల్లో  దిగే వారు .మళ్ళీ  మధ్యాహం ఒంటి గంట కూతలకు ఇంటికి వెళ్ళే వారు .ఈ విధానం గా మా ఫాక్టరి కూతలు ఉద్యోగ ,కార్మిక, రైతులందరికీ ఎంతో ఉపయోగ పడుతున్నాయి   .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –12

  శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –12
29–”కిరీటం ,విరించిం , ,పరి హర పురః ,కైట భిదః –కథోరే ,కోటీరే,స్ఖల సి ,జహి జంభారి మకుటం
ప్రనమ్రే ,శ్వేతేషుప్రసభ ,ముపయా తస్య భవనం –భావస్యాభ్యుత్తానే తవ ,పరి జనోక్తి ర్విజ యతే ”
తాత్పర్యం –అమ్మా శారదా రాధ్యా !నీ ముందు బ్రహ్మ గారి కిరీటం ఉంది .దాన్ని తగల కుండా నువ్వు రావాలి .తర్వాతా కైటభ మర్దనుడైన విష్ణు మూర్తి కిరీటం ఉంది .నీ కాలికి తగులు తుందేమో జాగ్రత్త సుమా .ఆ తర్వాత జమ్భాసుర మర్దనుడైన ఇంద్రుని కిరీటం ఉంది .దాన్ని అతి జాగ్రత్త గా దాటి రా .అంటే ,నీకు బ్రహ్మాదులు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంటె ,నీ పతి సాంబ శివుని దర్శించ టానికి నీవు వేగం గా వీటిని అన్నిటిని దాటు కుంటూ అతి జాగ్రత్త గా రావాల్సి ఉంటుంది .
30–”స్వ దేహోద్భుతాభి ర్ఘుణిభి, రణిమా ద్వాభి రభీతః –నిషేవ్యే ,నిత్యే ,త్వామహ మితి సదభి వయతియః
కిమా శ్చర్యం ,తస్య ,త్రినయన ,సంరుద్ధిం ,త్రుణయతః –మహా సంవర్తాగ్ని ర్విరచయతి ,నీరాజన విధిహ్ .”
తాత్పర్యం –ఆద్యంతాలు లేని చిచ్చక్తీ !లోకం చేత నీవు సేవింప బడుతున్నావు .నీ చరణ కమల కిరణాలతో అణిమ ,మహిమ ,గరిమ ,లఘిమ ,ప్రాప్తి ,ప్రాకామ్య ,ఈశత్వ ,వశిత్వాలు అనే ఎనిమిది సిద్ధుల తోకూడి ఉన్న ”అహం ”అనే భావం తో ఎవరు నిన్ను ధ్యానిస్తారో ,వారికి శివుని ఐశ్వర్య విభూతిని త్రుణీకరించిన వానికి ,మహా ప్రళయ కాలాగ్ని నీరాజనం పడుతుంది .
విశేషం –తాదాత్మ్యం తో ధ్యానిస్తే ,ప్రళయ కాలాగ్ని సాధకుని పాదాల వద్ద వెలుగు తుంది .వాడు శ్రీ దేవి తో కలిసి పోవటం వల్ల ,ప్రళయ కాలాగ్ని దేవి పాదాలకే నీరాజనం ఇస్తోందన్న మాట .అంటే అతడు దేవి గా మారి పోయాడు అని భావం .అలాంటి వాడికి శివుడిచ్చే ఐశ్వర్యాన్ని లెక్క చేయడు అని అర్ధం .
     శ్రీ దేవి శరీరం శ్రీ చక్రమే .శ్రీ చక్ర నవావరణ దేవతలు ఆమె శరీర కాంతులే .భూపుర త్రయం లో ఉండే వారు అణిమాది అష్ట సిద్ధులు .,బ్రాహ్మ్యాది అష్ట మాతృకలు ,సర్వ సంక్షో భిన్యాది దశ ముద్రా దేవతలు .షోడశార పద్మం లో కామ్మక్షి మొద లైన పదహారు మంది దేవతలు ,అష్ట దళ పద్మం లో మన్మధాది దేవతలు ఎనిమిది మంది ,చాతుర్దశారం లో సర్వ సంక్షోభిన్యా దులు14 గురు ,బహిర్దశారం లో సర్వ సిద్ధి ప్రదులు1౦ మంది ,అంతర్దశారం లో సర్వజ్ఞాది దేవతలు పది మంది ,అష్ట కోణం లో వశిన్యాదులు ఎనిమిది మంది ,త్రికోణం లో కామేశ్వరీ ,మొద లైన ముగ్గురు ,బిందు స్థానం లో మహా త్రిపుర సుందరీ దేవి ఉంటారని సర్వజ్ఞులు శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారుగొప్పగా  విశ్లేషించి చెప్పారు .
31– ”  చతు స్ష్యష్ట్యా తన్త్రైహ్ సకల మతి సంధాయ భువనం –స్తిత స్తత్తే ,త్సిద్ధి ప్రసవ పర తన్త్రైహ్ పశు పతిహ్
పునస్థ న్నిర్బంధా  దఖిల ,పురుషార్ధైక క ఘటనా –స్వతంత్రం తే తంత్రం ,క్షితి తల మవా తీతరదిదం ”
తాత్పర్యం –శ్రీ మహా రాజ్నీ!పశు పాలకుడు శివుడు .పర కాయ ప్రవేశం ,ఆకాశ గమనం ,తిరోధానం ,జల స్తంభన ,అగ్ని స్తంభన ,వాయు స్తంభన ,మొదలైన ఇంద్ర జాల విద్యలను ,వాటి విద్యా స్వరూపాలైన విద్యా స్వరూప సిద్ధాంతాలను సాధకులకు వారి వారి కోర్కెలను తీరుస్తూ ,మహా మాయ ,శామ్బరం మొద లైన 64తంత్రాలను తెలిపి ,ప్రపంచాన్ని మోహ పెడుతూ ,తాను నిశ్చలం గా ఉన్నాడు .ఈ విద్యల సారాన్ని గ్రహించిన నీవు ,వాటి వల్ల మోక్షం కలగటం లేదని భావించి ,నీ భర్త  శివదేవుడిని ఉత్తమ పు రుషార్ధాన్ని చ్చే విద్యన అందించ మని కోరావు .ఆయన సకలార్ధ సాధన మైన శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు .
  విశేషం –భగ వంతు డైన పశు పతి లోకాన్ని అనుగ్రహం చేత ఉద్ధరించాలను కొనే వాడు .భగవతి  యొక్క నిర్బంధం వల్ల వైదిక మార్గాలకు సాటి అయిన శ్రీ చక్ర విధా నాన్ని ,లోకానికి అంద జేశాడు .”ఈశానః సర్వ విద్యానాం ””అని శృతి చెబుతోంది .అన్ని తంత్రాలు ,విద్యలు ఆయన ముఖం నుండే వెలువడి నాయి .ఇదంతా శ్రీ దేవి అనుగ్రహం వల్లనే జరిగిందని భావం .శ్రీ విద్య పర దేవత .”ఆత్మా విద్యా ,మహా విద్యా, శ్రీ విద్యా, కామ సేవితా ,షోడశాక్షరీ విద్యా ,త్రికూటా ”అని లలితా సహస్ర నామాలలో ఉన్న సంగతి మనకు తెలిసిన విషయమే .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !!

   ఊసుల్లో ఉయ్యూరు –36
నాన్నా సినిమా – మామయ్యా సినిమా 

ఇదేదో నాన్నా , మామయ్య సినిమా కాదు .మా ఇంట్లో సినిమాకు మేము వెళ్ళాలంటే జరిగే భాగోతం .మా చిన్నతనం లో మేము సిని మాలు ఎక్కువ గా చూసే వాళ్ళం కాదు .అందులో హిందూ పూర్ లో ఉన్నప్పుడు టూరింగు టాకీసులే గతి .దానికి సాయంత్రం ఆటకో ,రాత్రి ఆటకో వేళ్ళ వలసి  వచ్చేది .మంచి నీళ్ళ మర చెంబు, తిన టానికి వేరు సేనక్కాయలు బోరుగులనే మర మరాలు జంతికలు ,  ,కారప్పూస ,పప్పుండలు తీసుకొని వెళ్లి తింటూ కూర్చుని సినిమా చూసే వాళ్ళం .అందరం నేల టికెట్టు కే వెళ్ళే వాళ్ళం .మా నాన్న సిని మాకు ఓ పట్టాన తీసుకొని వెళ్ళే వారు కాదు .దానికి కనీసం పది  ,పదిహేను రోజుల రిహార్సిల్ ఉండేది .నాకు మా నాన్న గారితో చనువు తక్కువే .మా రెండో అక్కయ్య దుర్గ  ,మా తమ్ముడు మోహన్ రోజు సాయంత్రం మా నాన్న స్కూల్ నుంచి న తర్వాత” నాన్నా సినిమాకు వెళ్దాం నాన్నా-తీసికెళ్ళు నాన్నా ”అని బతిమి లాడే వారు .”సరే ఆది వారం వెళ్దాం ”అని ఊర డించే వారు .మళ్ళీ పొద్దున్న అదే రికార్డు .దానికీ అదే సమాధానం .ఇలా రోజులు గడిచి పోయేవి .సినిమాకు వెళ్లటం కుది రేది కాదు . వాయిదాల మీద వాయిదాలు పడేవి .ఊరించి ,ఊరించి ఎప్పుడో పచ్చ జెండాఊపే వారు .ఆ రోజు మాకు కొండెక్కి నంత సంతోషం .ఆయన సాయంత్రం స్కూల్ నుండి రాగానే మేము రెడీ గా ఉండే వాళ్ళం .అప్పుడు సినిమాకు వెళ్ళే వాళ్ళం .ఒక్కో  సారి ఆ యన రాకుండా నే, మా అమ్మ తో మమ్మల్ని పంపించే వారు .ఇదీ హిందూపురం లో సినిమా భాగోతం .అక్కడ మేము చూసిన సినిమా లు సంసారం ,ఘోరా కుమ్భార్ ,వంటివి యే ఐదో, ఆరో ఉన్నాయి .సిన్మా గురించిన కర పత్రాలలో కొద్దిగా కధా, నటుల పేర్లు, నిర్మాత, దర్శకుడు సంగీత దర్శకుల పేర్లుండేవి .ఇతర భాషా చిత్రాలైతే గేటు దగ్గర ఒక మనిషి నుంచొని ఆ సంభాషణలను తర్జుమా చేసి చెప్పే వాడు .అంతా కాక పోయినా భావం అర్ధమయేది .అతను మంచి హాస్య గాడైతే సంభాషనలన రస వత్తరం గా తర్జుమా చేసి చెప్పే వాడు .అదో దసరదా .నేల మీద చాపలు కాని గడ్డి పరచుకు కాని కూర్చునే వాళ్ళం .ఎవరి చాప వారే తెచుకొని కూర్చుండే వాళ్ళం అని బాగా గుర్తు .చిన్న చక్రాల్ మీద అటు ఇటు తడికెలు కట్టి వాటి పై సినిమా కాగి తాలు అంటించి, డప్పులు కొట్టు కొంటూప్రచారం  చేసే వాళ్ళు .ఆ చప్పుడు విన గానే వీధి లోకి పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళం .ఆ కాగితాలు తెచ్చి దాచుకొనే వాళ్ళం .ఎవరి దగ్గర ఎన్ని రకాల సినిమా కాగితాలుంటే వాళ్ళు గొప్ప గా ఫీల్ ఆయె వాళ్ళం .హిందూ పూర్ లో మేమున్న డాబా కు లోపలి నుంచి పైకి మేట్లున్దేవి .కొద్ది మెట్లు ఎక్కిన తర్వాతా అక్కడ గూడు లాంటి దానిలో సినిమా కాగితాలు దాచుకొనే వాళ్ళం .అప్పుడు అదే హాబీ .
1951 మేము ఉయ్యూరు కాపురం పెట్టిన తర్వాత కూడా సినిమాకు ఇదే జాతర .మా కంటే ,మా ఇంటి పక్కన ఉన్న మా మెన మామ గారి అమ్మాయి రాజమ్మ కు మా నాన్న దగ్గర చనువు ఎక్కువ .అందుకని సిని మాకు వెళ్ళాలంటే ఆమ్మాయిని ఎక్కేసే వాళ్ళం ఆమెను ”దాచ్చి ”అనే వాళ్ళం అందరం .దాచ్చి వచ్చి మా నాన్న దగ్గర కూర్చుని ”మామయ్యా సినిమా ”అనేది గోముగా ”వెళ్దాం లేవే  మొన్ననేగా వచ్చింది. సినిమా బాగా రష్ గా ఉంటుంది ”అని వాయిదా వేసే వారు నాన్న .మా అక్కా ,తమ్ముడూ దాచ్చి తో వంత పాడే వాళ్ళు ”నాన్నా సినిమా ”అంటూ .దానితో బాటు మా స్నేహితులు ఆదినారాయణ ,నరసింహం కూడా ”మేస్టారూ సినిమా ”అని గోల చేసే వారు .ఇందరు ఇన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చిన తర్వాత ఎప్పుడో ముహూర్తం కుడి రేది .అప్పుడు వెళ్ళే వాళ్ళం .అప్పటికి మా క్లాసు బెంచీలకు పెరిగింది . .ఆరణాల టిక్కెట్టు .నేల పావలా .అందరం కలిసి కబుర్లు చెప్పుకొంటూ నడిచి సినిమా  హాల్ కు చేరే వాళ్ళం .రాత్రి యేడు తర్వాతే ఆట ఉండేది .అప్పటికి ఒకటే ధియేటర్ .అదే ”ఏకాంబరేశ్వర పిక్చర్ పాలస్ ”.రిజిస్త్రార్ ఆఫీసు వెనక ఉండేది .దాదాపు హాలంతా నిండి తే కాని ఆట మొదలు పెట్టె వారు కాదు .పరభాషా చిత్రాలకు డబ్బింగు చెప్పే వారు .మా పెద్దక్కయ్యలోపా ముద్ర  హిందీ సినిమాలు బాగా చూసేది .ఇంటికి వచ్చి కదా విశేషాలన్నీ కధలు, గాధలుగా చెప్పేది .అరవం కూడా వచ్చు కనుక అరవ సినిమా విశేషాలను వివ రంగా  చెప్పేది .సిన్మా లో తిన టానికేమీ కొనే వారు కాదు .ఏదైనా తింటే ఇంటి దగ్గర తిని వెళ్ళటమే .మళ్ళీ వచ్చిన తర్వాత తినటమే .రిజి స్త్రార్ ఆఫీసు వెనక ఖాళీ స్తలం ఉండేది సాయంత్రం వేళల్లో అక్కడికి వెళ్లి కూచునే వాళ్ళం. ధియేటర్ వాళ్ళు సినిమా పాటల రి కార్డులు , ఘంట సాల భక్తీ గీతాలు, గ్రామ ఫోను రికార్డులు పెట్టె వారు .అవి వింటూ ఒక గంట  కాలక్షేపం చేసి ఇంటికి వచ్చే వాళ్ళం .మాతో బాటు మా దాచ్చి, దాని చెల్లెళ్ళు, మా స్నేహితులు నరసింహం ,ఆది నారాయాణలకు , పాలేరుకు ,కూడా మా నాన్న టికెట్ తీసే వారు .
ఒక్కో సారి మంచి సిన్మాలు మా నాన్న వేసే వాయిదాల వల్ల వెళ్లి పోయేవి. చూసే ఆవ కాశం ఉండేది కాదు .కీలుగుఱ్ఱం చెంచు లక్ష్మి విప్ర నారాయణ ,ప్రహ్లాద ,పాతాళభైరవి లాంటి సినిమాలు చూసాం .మూడు  నెలలకు ఒక సారి సినిమాకు వెళ్తే గ్రేటే .అదీ బతిమి లాడి ,బతిమి లాడి ,ఓపిక  అంతా ఖర్చయిన తర్వాతే .చివరికి విసుగొచ్చి మా దాచ్చి ”మా మయ్యా ! రేపు సినిమాకు తీసికేల్లక పోతే ఇక మీ ఇంటికి రానే రాను ”అని భీష్మించేది . దానికీ, ఉలుకూ ,పలుకూ ఉండేది కాదు మానాన్న దగ్గర .పాపం ఆది మాత్రం  ఏం చేస్తుంది .ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ”మామయ్యా సినిమా ”అంటూ రికార్డు పెట్టేది .విసుగొచ్చి ఎప్పుడో నాన్న సరే అనే వారు .ఇంత భాగోతం జరిగి తే కాని సినిమా కు వెళ్ళే అవకాశం వచ్చేది కాదు .భోజనాలు చేసి రెండో ఆటకు ఎక్కువ గా వెళ్ళే వాళ్ళం .అక్కడ నిద్ర వచ్చి ఒక్కో సారి సగం సినిమానే చూసే వాళ్ళం .మా రెండో బావ ”వేలూరి వివేకా నందం ”గారు ఉయ్యూరు పాలి టే క్నిక్ లో సి విల్ చది వే వారు .ఆయన అప్ప టికి బావ కాలేదు కాని, చిరివాడ బంధుత్వం ఉంది కనుక తరచు మా ఇంటికి వచ్చే వాడు .నన్నూ మా తమ్మున్నీ  ఒల్లో  కూచో బెట్టుకొని ఎన్నో కబుర్లు చెప్పే వాడు .ఆయన బాగా మాట్లాడే వాడు. హిందీ సినిమాలు చూసి ఆ కదా సంభాషణలు పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .మాకు అప్పుడు ఆ సినిమా ల మీద మంచి మోజు ఏర్పడేది .అయినా ఏమి లాభం .?విని ఆనందించటమే ఎక్కువ .. ఆ తర్వాత పుల్లేరు కాలువ కు అవతల వీర భద్ర రావు గారి స్తలం లో వేసవి కాలం లో టూరింగ్ టాకీస్ వచ్చేది .అప్పుడు అక్కడ పెట్టె రికార్డులన్నీ మా ఇంటికి బాగా   విని పించేవి .ఇంట్లో ఉంది బొమ్మను చూడ కుండా సినిమా,విన గలిగే వారం .జన సమ్మర్దం తక్కువ కనుకఆది సాధ్యం అయ్యేది . .అలాగే ఎకామ్బరేశ్వర,వాళ్ళ పాటలూ విని పించేవి .సినిమా వదిలి నట్లు తెలిసేది .వేసవి లో ఒక్కో సారి సినిమా లోని పాటలూ మాటలూ కూడా స్పష్టం గా విన పడేవి .వేసవి లో ఆరు బయట పడుకొనే వాళ్ళం .అందుకే బాగా విని పించేవి .సినిమా హాళ్ల దగ్గర రంగు నీళ్ళు అమ్మే వారు .కొందరు అవి కోని తాగే వారు .మా వాళ్లెవరు మాకుకోని  పెట్టె వారు కాదు .సోడా తాగే వాళ్లమేమో ఎప్పుడైనా .సోడా అర్ధణా .మా ఉయ్యూరు కే.సి.పి గాస్ తో సోడాలు తయారు చేసే వారు .మాంచి ఘాటుగా ఉండేది .తిన్న అన్నం అరిగేది . ఉయ్యూరు సెంటర్ లో బిస్మిల్లావాళ్లషాప్ లో   సోడాకు మంచి గిరాకీ ఉండేది .ఆ తర్వాత నరసింహారావు ఆ తర్వాతఅతని కొడుకు  సోడా మోహన్ లు సోడా బండి తో ఇంటికి వచ్చిసోదాలు అడిగి కొట్టిచ్చే వారు సోడా మోహన్ సి ఆడాను చాలా సేపు సరదా గా శబ్దం వచ్చేట్లు కొట్టటం లో స్పెషల్ .అందుకే అతని సోడా కు గిరాకీ ఎక్కువ . సోడా  లేక పోతీ ”జీడీలు ”కొనుక్కొని తినే వాళ్లమేమో అని జ్ఞాపకం .తెర్మాస్ ఫ్లాస్కు లలో”రంగుల  పుల్ల అయిసు క్రీం లు అమ్మే వారు. ఒక్కో సారి అవి ఇప్పించే వారు .భలేగా ఉండేవి .పీచు మిథాయి గ్లాస్ బండిలో తెచ్చి అమ్మే వారు .చిన్న మెషిన్ తో గుండ్రం గా ఉండే దానిలో పంచదార ఇంకా ఏదో కలిపి తిప్పే వారు. దాని వల్ల ఆ గిన్నె కు లోపల సన్నని రంగు దారాలు లాంటి పంచ దార దారాలు చుట్టలు చుట్టలు గా చుట్టుకోనేవి .దాన్ని తీసి పావలాకు ఇచ్చే వారు .అలాగే ఒక నల్లని సాయిబు గారు ఒక కర్రకుపై చివర రంగుల  పంచ దార పాకం గట్టిగా చేసి  చుట్ట గా చుట్టి తీసుకొని వచ్చే వాడు .మనకు యే ఆకారం కావాలంటే ఆ ఆకారాన్ని ఆ పాకం కొద్దిగా తీసి సన్నగా లాగి బొమ్మ లా తయారు చేసి అమ్మే వాడు .సాధారణం గా సైకిళ్ళు ,గడియారాలు మనిషి బొమ్మలు చేయించుకొని తినే వాళ్ళం. బలే గా ఉండేది .దాని పేరు గుర్తుకు రావటం లేదు .
ఇదంతా మా చిన్నతనంలో .మా అబ్బాయిల కాలం వచ్చేసరికి మార్పు బాగా వచ్చింది .తరచుగా సినిమాలకు వెళ్ళే వాళ్ళం పిల్లలతో .సినిమాకు వెళ్లటం ఒక హాబీ గా మారిన కాలం వచ్చే సింది .కాలం తెచ్చిన మార్పు .వీడియోలు తెచ్చుకొనే రోజులు పోయి ,సిడి ల కాలం వచ్చి, ఇపుడు అవీ అవసరం లేకుండానే యు ట్యూబ్ లో,  నెట్ లో సినిమాలు చూస్తున్నాం .చానళ్ళు  సినిమాలుకుమ్మరిస్తూనే ఉన్నాయి .  .”నాన్నా  సినిమా! మామయ్యా సినిమా !మాస్టారూ సినిమా !” రోజులు పోయి ఇవాళ పిల్లలుయే సినిమాకు ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వస్తున్నారో తెలియ కుండా పోతోంది . మనమే ”అబ్బాయ్ సినిమా !,అమ్మాయ్ సినిమా !శిష్యా సినిమా !”అనాల్సిన కాలం  వచ్చింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-9-12–కాంప్ –అమెరికా

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11
26—” విరించి పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం –వినాశం ,కీనా శోభజ తి ధనదో  యాతి నిధనం
వితంద్రీ ,మాహేంద్ర వితతి రపి ,సమ్మిలిత దృశా –మహా సంహారే స్మిన్ ,విహరతి ,సతి ,త్వత్పతి రసౌ ”
తాత్పర్యం –స్వాధి స్టా నదేవతా !మహా ప్రళయం తర్వాతా బ్రహ్మాది దేవత లంతా ,సంహారం పొందుతున్నారు .నీ పతి సదా శివుడు మాత్రం ,విశ్రుమ్ఖలం గా విహరిస్తున్నాడు .ఆది నీ పాతి వ్రత్య మహాత్మ్యమే .దాని వల్లనే నీ పతి లయం కావటం లేదు .
విశేషం –సతీ అంటే సత్ శబ్దం యొక్క స్త్రీ లింగ రూపమే .సత్ రూప పర బ్రహ్మ మైన శివ బ్రహ్మానికి నాశనం లేదని భావం .
27–”జపో జల్పశిల్పం ,సకల మపి ,ముద్రా విరచనా –గథిహ్  ప్రాదక్షిన్య క్రమణ ,మశనా ద్యాహుతి విధిహ్
ప్రణామస్సంవేశ స్సుఖ ,మఖిల మాత్మార్పణ దృశా –సపర్యా పర్యాస్తవ భవతు ,యన్మే విలసితుం  ”
తాత్పర్యం –శర్వాణీ !ఆత్మ సమర్పణ బుద్ధి తో నేను నోటి తో పలికిన మాటలన్నీ  నీ వు నిర్మించినవే .నువ్వు నిర్మించినవే కనుక అవి నీ మంత్ర జపమే .ఈ శరీరం నీవే ఇచ్చావు కనుక ,నేను చేసే హస్త విన్యాసాలన్నీ నీకు చేసే ముద్రా విధానాలుగా నే భావించు .ఎంతటి వివేకమూ వినయమూ శ్రీ భాగవత్పాడులలో ఉన్నాయో దీనితో మనకు అర్ధ మవుతోంది .అంతా ఆమె ఇచ్చింది కనుక తాను కొత్తగా చెప్పేదేమీ లేదని ,తాను చేసే చేష్టలన్నీ ఆమె కైన్కర్యాలే నని గడుసు గా చెప్పారు .నీవు సర్వ వ్యాపివి కనుక నేను చేసే సంచారం అంతా నీకు చేసే ప్రదక్షినమే అనుకో .నా అంగ భంగిమ లన్నీ ,నీకు ప్రనామాలే .నీవే జతరాగ్ని వి కనుక  నేను గ్రహించే అన్న ,పానాదు లన్నీ ,నీ ప్రీతీ కోసం చేసే హోమం గా స్వీకరించు .శబ్ద స్పర్శాడులతో నేను చేసే చేష్ట లన్నీ నీ సపర్యలె అని భావించు .అని అమ్మ ఇచ్చినవన్నీ అమ్మకే సమర్పిస్తున్నానని భావన .
విశేషం –అన్ని అక్ష రాలు ,మాతృకా వర్ణ రూపాలే కనుక పలుకులన్నీ జపంతో సమానాలే అని భావం .హస్త విన్యాసాలన్నీ జపం లో చేసే ముద్రలే .అన్నీ ఆమెకే చెందు తాయి .మాత జథరాజ్ఞి స్వ రూపం .కనుక మనం తిన్నదంతా ఆమెదే .సందేశం అంటే శయనం నీ ముద్రాదులన్నీ ఆత్మ సమర్పణ ద్రుశాలు .ఇదంతా ”సపర్యా పర్యాయం ‘.’భగవద్ గీత లో కూడా ”మన్మనా భవ ,మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు –మమే వేశ్యసి కౌంతేయ  ,ప్రతి జానే ప్రయోజనే ”అన్నాడు శ్రీ కృష్ణ భాగ వాన్ .ఏమి చేసినా ,ఎలా చేసినా ,సర్వం భగ వతికి అర్పణమే .ఇంకేదైనా పూజ చేస్తే ఆది పూజా క్రమం కాదు అని తెలియ జేయటమే .
28–”సుధా మప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం –విపద్యన్తే విశ్వే ,విధి ,శత మఖ ,ముఖాద్యాది విషదః
కరాళం  ,యత్ప్రేళం ,కబలిత వతః కాల కలనా –న శంభో స్తన్మూలం ,తవ ,జనని ,తాటంక మహిమా ”
తాత్పర్యం –మహేశ్వరీ ! దేవత లంతా అమృతం త్రాగి నా ,జరా మృత్యువు లను పొందుతున్నారు .అంతా ప్రళయం లో లయమవుతున్నారు .అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు ,ప్రళయ కాలం లో కూడా చని పోకుండా  ,కాలానికి అతీతు డై ,మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు .దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే .
విశేషం –తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు .ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం .కారణం –కాలానికి ఉత్పత్తి ,స్తితి ,లయాలు శ్రీ దేవి తాటంక నియ తాలు .కనుక ఆమె పాతి  వ్రత్య మహిమ సర్వాతీ శయ  మైనది అని భావం .శ్రీ దేవి కాల సంకర్శిణి .అమే  ను సేవిస్తే, కాల భయం ఉండదు .సతుల పాతివ్రత్యమే పతులకు శ్రీ రామ రక్ష. .అందుకే సువాసినులు మంగళ ప్రద మైన చెవి కమ్మలను, కమ్మర ,ముంగర ,కుంకుమ ,మంగళ సూత్రం సర్వదా కాపాడు కోవాలి అని తెలియ దగిన విషయం. ఇతర దేవతల సౌభాగ్యం నశించేది .భగ వతి సౌభాగ్యం అనశ్వరం .అమృతం తాగిన వారికి కూడా చావు తప్పలేదు .మృత్యు రూపమైన కాల కూటాన్ని భక్షించిన వాడు శివుడు మ్రుత్యున్జయుడైనాడు .దీనికి కారణం కూడా భగ వతి పాతి  వ్రత్యమే .
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –29-9-12-కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

  ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

             మా చిన్నతనం లో మెట్ట చేలకు నీళ్ళు పెట్ట టానికి మోట బావులు తవ్వుకొనే వారు .సుమారు పది గజాల కైవారం గల బావులవి. లోపలి దిగ టానికి రాళ్ళ మెట్ల దారి .దాని లో నీరు బాగా ఊరేది .చాలా లోతు గా బావు లుండేవి .అలాంటి బావుల్లో నుంచి నీరు పైకి తోడి, చెరకు ,పసుపు, కంద ,పెండలం దొండ మొద లైనపంట  చేలకు నీరు పెట్టా లంటే చాలా కష్టం .అందు కని  బావికపైన ఇనుప కడ్డీ .లేక లావైన కర్ర కడ్డీ అడ్డం గా ఉండేది .దానికి మధ్యలో పెద్ద గిలక ఉండేది .దీన్ని కప్పీ అంటారు సైన్స్ లో .దాని పై నుండి తాడు తో నీరు బైటికి లాగాలి .అందుకని ఒక పెద్ద దీర్ఘ చతురస్రా కారపు ఇనుప బొక్కెన ఉండేది .దీనికి ఇనుప కొక్కెం ఉండేది . మోకు(లావైన తాడు ) ను ఈ కొక్కానికి కట్టే వారు .కప్పీ మీదు గా తాడును బైటికి పోనిచ్చి, దాన్ని ఎడ్ల కాడికి కట్టే వారు .రెండేడ్లు కాడిని బుజాన వేసుకోనేవి .బో క్కేన నీటిలో మునగాలంటే ఎడ్లు నూతికి దగ్గర గా ఉండాలి .నీటి తో బొక్కెన నిండ గానే ఎడ్ల ను  తోలే వాడు. వాటిని ముందుకు నడుపు తాడు .అప్పుడు నూతి లోంచి క్రమం గా బక్కెట్ పైకి వస్తుంది .అక్కడొక మనిషి ఉండి ఆ నీటిని కింద కుమ్మరిస్తే అవి కాలువ ద్వారా పొలం లోకి చేరేవి .ఎడ్లు ముందుకు వెనక్కు కడ ల టానికి వీలుగా వాటి మార్గాన్ని నూతి నుండి కిందకు స్లోపు గా చేస్తారు .ముందుకు వెళ్ళిన ఎడ్లు వెనక్కి నడ వాలి  .అలా నడిపించ టానికి మనిషి ఎలానూ ఉంటాడు .ఈ విధం గా పగలల్లా ఎడ్లూ మను షులు కష్టపడితే తప్ప చేలు తడిసేవి కావు .బక్కెట్ లో కనీసం ఇరవై కడవల నీళ్ళు పట్టేవి .ఇదే మోట బావి .కప్పీ అంటే ఇంగ్లీష లో ”పుల్లీ” .కష్ట మైన పనిని సులభం గా చేయ టానికి తోడ్పడింది అన్న  మాట .ఇలాంటి వాటినే లఘు యంత్రాలు సింపుల్ మెషీన్స్ అని చిన్నప్పుడు చదువు కొన్నాం .ఆర్కి మిడీస్ ”నాకు సూన్యం లో ఒక స్తిర బిందువు చూపించండి .లీవర్ల తో కప్పీ లతో విశ్వాన్నే ఎత్తే స్తాను ”అన్నాడని చదివాం. గుర్తు ఉండే ఉంటుంది .ఆ తర్వాతా బావికి మోటార్లు పెట్టి నీరు గొట్టాల ద్వారా కరెంటు టో తోడటం ప్రారంభ మైంది .ఆ తర్వాతా భూమిలో బోర్లు వేసి మోటారు తో తోడటం వచ్చి బావులు తీసే షారు .ఇప్పుడు సబ్మెర్సిబుల్ మోటార్లతో నేరు లాగుతున్నారు .

గింజల నుండినూనె  తీయా లంటే ఆకాలం లో గానుగ లుండేవి .కొబ్బరి, నువ్వులు, వేరు సెనగ ,ఆము దం నూనె లను గానుగ ల ద్వారా తీసే వారు .కొయ్య తో చేసిన పోడ వాటి లోతైన రోలు ఉంటుంది .దాని లో ఒక నిలువు లావైన కర్రను ఉంచు తారు .ఇది నున్నగా గుండ్రం గా అంటే స్తూపా కారం గా ఉంటుంది .దీనికి పైన గొలుసు తో కత్తి ఉంచు తారు .అక్కడి నుండి పోడ వైన లావైన కడ్డీ ఒకటి ఉంటుంది .దానికి చివర ఎద్దు కొమ్ముకు కడ తారు .ఎద్దు గుండ్రం గా ఆ ఇరుసును ఆధారం గా చేసుకొని తిరుగు తుంది .ఆ రోటిలో వేరుసెనగ గింజలో, నువ్వులో, కొబ్బరి ముక్కలో, ఆ ముదపు విత్త నాలో పోస్తారు .పోడ వైన కర్ర మీద మనిషి కూర్చుని ఎద్దును ఆది లిస్తే ఆది తిరగటం ప్రారంభిస్తుంది .రోటి లోని పప్పు నమ్మది నెమ్మదిగా ముక్కలై నలిగి అందులో నుండి నూనె బయటకు వస్తుంది .ఆ నూనెను గానుగ నుండి వేరు చేసే  రంధ్రం ఉంటుంది .దాని ద్వారా వచ్చిన నూనె ను డబ్బాల లో పడ తారు .నూనె వచ్చిన తర్వాత  అ గింజల చెక్క గుండ్రటి రోలు చుట్టూ అతుక్కొని ఉంటుంది .  .దానిని వేరు చేసి అమ్ముతారు .ఎద్దు కంటికి గంత కడ తారు .ఆది అదే దారిలో గుండ్రం గా తిరుగు తూనే ఉంటుంది .అందుకే ఎదుగూ బొదుగు లేని జీవితాలను గాను గెద్దు జీవితం అంటారు .గానుగ మనిషి ఒళ్లంతా నూనె అంటుకొని మహా జిడ్డుగా ఉంటాడు .మా చిన్నప్పుడు నూనె గానుగ, కాపుల వీధిలో రామాలయం దాటి మెయిన్  రోడ్డు మీద కు వెళ్ళే దారిలో ఉండేది .మంచి నంబర్ వాన్ నూనె కావా లంటే గానుగ దగ్గరే తెచ్చు  కొనే వాళ్ళం .అయితే కొంచెం మడ్డి గా ఉండేది .దాన్ని శుద్ధి చేసి  అమ్మే వారు .గానుగ తిరుగు తుంటే తమాషావింత  శబ్దం వచ్చేది .దాన్ని వింటూ కూర్చునే వాళ్ళం .
ఆకాలం లో సిమెంట్ కంటే గానుగ సున్నాన్ని బాగా వాడే వారు. బాగా చవక కూడా .ఇళ్లను దాని తోనే కట్టే వారు .అయితే కొంత కాలానికి చవుడు రాలేది .దాబాలు కూడా తారస రాయి, గానుగ సున్నం తో కట్టే వారు .సున్నపు గానుగ కు కొంచెం విశాల మైన ఆరు బయటి స్తలం కావాలి .సుమా రు ముప్ఫై  గజాల కైవారం లో ఒక అడుగు లోతు గుంటను చుట్టూ తీస్తారు .దాని అంచు ను రాతి తో కడతారు చుట్టూ .దాని మధ్య భాగం లో ఒక కొక్కెం లాంటిది ఉంటుంది .దీన్ని భూమిలో పాతిన మేకుకు కట్టేస్తారు .ఆ గాడి లో బాగా లావైన ఆ  తిరిగే  వీలున్న రాతి చక్రం ఉంటుంది .దానికి మధ్యలో రంధ్రం ఉంటుంది .దాని లో నుంచి ఒక ఇనుప కడ్డీ చక్రం రెండు వైపులా కు వచ్చేతంత  పొడవు గా ఉంటుంది .చివర్లలో రంద్రాలఉంటాయి వీటికి తాళ్ళు కట్టి  రెండు ఎడ్ల మీది కాడికి రెండు వైపులా కడ తారు .అప్పుడు ఎడ్లు కదిలితే రాతి చక్రం గాడిలో చుట్టూ తిరుగు తుంది .ఆ గాడి లో ఇసుక ,సున్నం లను వేసి సమ పాలల లో నీరు కలు పు తారు .ఎడ్లు తిరుగు తుంటే సున్నం, ఇసుక, నీరు కలిసి బాగా నలిఫ్  పాకం లా తయారవు తుంది .తగి నంత పాకం వచ్చే దాకా ఎడ్లను త్రిప్పు తారు .మధ్య మధ్యలో చిన్న పారల తో  సున్నాన్ని కలిపి బాగా కలిసి పోయే ట్లు చేస్తారు .అవసర మైతే నీళ్ళు పోస్తారు . గానుగ సున్నం మంచి పాకానికి తేవటం ఒక కళ .దాన్నిబట్టే నాణ్యత ఉంటుంది .తయారైన సున్నాన్ని గానుగ కు బయటికి తీసి కుప్పలుగా పోస్తారు .ఇది ఎండి పోయినా నీళ్ళు కలిపి వాడుకో వచ్చు .అవసర మై నంత  గానుగ సున్నాన్ని   కొనుక్కొని తెచ్చుకొంటారు .లేదా బండ్ల మీద తోలు కొంటారు .ఇప్పుడీ అవస్థ లన్ని తప్పాయి సిమెంట్ వచ్చిన తర్వాత .విజయ వాడ లో అలంకార్ ధియేటర్ యజ మాని సున్నం వీరయ్య  సున్నపు వ్యాపారం తో లక్షాధి కారి అయాడని చెప్పుకొనే వారు .స్ గానుగ సున్నాన్ని ఇంగ్లీష్ లో ”మోర్టార్”అంటారు .
కాలువ దగ్గర గా ఉన్న చేలకు నీరు పెట్ట టానికి వెదురు తో చేసిన బుట్టలున్దేవి .దానికి రెండు చివర్లా తాడు కట్టి ఇద్దరు మనుష్యులు కాలువ లోని నీటిని  బుట్టలో నింపి చేల  ల్లోకి గట్టు పక్కనుండి విసిరే వారు. దీన్ని ”గూడ వెయ్యటం ”అనే వారు .ముఖ్యం గా వేసవి లో నారు  పోయ టానికి ఈ పద్ధతి వాడే వారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-12-కాంప్ –అమెరికా –
Gabbita Durga Prasad

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

అమెరికా ఊసులు –23–ఇండియన్ అమెరికన్ లకు కుటుంబమే ముఖ్యం

  అమెరికా ఊసులు –23–
 ఇండియన్ అమెరికన్ లకు కుటుంబమే ముఖ్యం 
అమెరికా లో ఉండే ఇండియన్ అమెరికన్ లకు అన్నిటి కంటే కుటుంబమే ముఖ్యం అని సర్వే   ల వల్ల తేలింది .ఆసియా అమెరికన్ల పై విస్తృత అధ్యాయం నం చేసింది”pew research  center”అనే సంస్థ .67% ఆసియా అమెరికన్లు ,50%సామాన్య ప్రజలు కుటుంబం ముఖ్యం అని భావిస్తే 78%  ఇండియన్లు కుటుంబానికే మార్కులు ఎక్కువ  వేశారట .అంతే కాదు మంచి  తల్లి దండ్రులు అని పించుకోవటం వారందరికీ మరీ ఇష్టం గా ఉన్నట్లు తెలియ జేశారట .అంతే కాదు వివాహ వ్యవస్థను. చాలా చక్కగా 64%మంది ఇండియన్లు పాటి స్తున్నారట .ఈ విషయం లో ఆసియా అమెరికన్లు 54% లో ఉంటె ,అమెరికా లోని వయోజనులు 34%మాత్రమె ఉన్నారట .వివాహం చేసుకొన్నా ఇండియన్లు 71 శాతం ఉంటె ఆసియా అమెరికన్లు 59 శాతం మాత్రమే .మిగిలిన వారిలో వివాహితుల శాతం 51 %మాత్రమే నట .
ఒక ఎనిమిది శాతం ఇండియన్ అమెరికన్లు అమెరికా లో వివాహ బంధం ద్రుదం  గా ఉందని చెప్పారట .అదే ఇండియా లో 69 శాతం గా ఉందని మెచ్చారట .పన్నెండు శాతం ఇండియన్లు మాత్రమే ఆసియేతరులను వివాహం చేసుకోన్తున్నారట .86 శాతం మాత్రం తమ జాతేయులనే వివాహం చేసుకోవాలని అభి ప్రాయ పడుతున్నారట .ఒక్క రెండు శాతం మాత్రమే మిగిలిన  ఆసియా వారిని చేసుకోవాలను కొంటారట .వివాహ దంపతుల తో ఉండే పిల్లలు ఇండియన్ లలో 92 శాతం ,చైనా వారిలో 83 శాతం ,ఆసియన్లు 80 శాతం మిగిలిన వారి లో 63 శాతం ఉన్నారట .69 శాతం  మంది ఇండియన్ లు  ఇండియా లోని కుటుంబాల తో మంచి సంబంధాలు కలిగి ఉన్నారట .
ఇండియన్లు రెండు దేశాల లోని విలువలు సమానం గా నే ఉన్నాయని 42 శాతం భావిస్తున్నారట .57 శాతం ఇండియన్లు అమెరికా లో పిల్లలను పెంచటం హాయి అని భావిస్తున్నారట .83 శాతం భారతీయులు ప్రవాస భారతీయులు అమెరికా ను శక్తి వంతం గా చేస్తున్నట్లు భావిస్తున్నారట .దీన్ని 48 శాతం సాధారణ ప్రజలు ఆమోదిస్తున్నారట . పిల్లల కెరీర్ ను తీర్చి దిద్ద టానికి తలి దండ్రుల పర్య వేక్షణ అవసరం అని 68 శాతం మందిఇండియన్లు  భావిస్తే ,కొరియన్లు మాత్రం 75 శాతం దీన్ని మన కంటే ఎక్కువ గా సమర్దిస్తున్నారట .ఇదీ సర్వే ల లో తేలిన నిజాలు .ఏ మైనా కుటుంబ వ్యవస్థ మీద అత్యంత గౌరవాన్ని ఇప్పటికీ భార తీయులు కలిగి ఉండటం ఆనందించ దగిన విషయం .ఇలా గీ ఇది వర్ధిల్లాలని అందరు కోరుకొంటున్నారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28 -09 -12 -కాంప్ –అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –10

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –10
23–”త్వయా హృత్వా వామం ,వపుర పరి త్రుప్తెన మనసా –శరీరార్ధం ,శంభో ,రపర మపి ,శంకే హృత మభూత్
యదె తత్వ ద్రూపం ,సకల మరునాభ స్త్రినయనం –కుచాభ్యా మానమ్రం  కుటిల శశి చూడా ల మకుటం .”
తాత్పర్యం –హిమ గిరి పుత్రీ !నీవు శివ మహా దేవుని శరీరం లో ఎడమ భాగార్ధాన్ని ఆక్ర మించావు .దానితో తృప్తి పడక ,కుడి భాగాన్ని కూడా గ్రహించా వేమో ననే అనుమానం కూడా ఉంది .ఎందు కంటే -నా హృదయ కమలం లో ప్రకాశించే నీ రూపం ,బాల భానుని  లేత కేంజాయతో ,మూడు కన్నులు కలిగి స్తన భారం తో, ముందుకు వంగి నట్లు కనీ పిస్తూ ,జాబిల్లి కిరీట మణి గా ఉంచుకొని ప్రకాశిస్తున్నావు .
విశేషం –కౌల సిద్ధాంతం లో శక్తి తత్త్వం ఒక్కటే .శివ తత్త్వం అనేది లేదు .శివత్వం శక్తిత్వం లో అంత ర్భాగమే .దానినే ఉపాసించాలి .శరీరం ఎర్రగా ఉండటం ,స్తన ద్వయం ,త్రాలున్డటం ,వాళ్ళ శివుని శరీరం అపహరించావు అని భావం .అంటే భగవతి యే శివ రూపం .శివుడు శ్రీ దేవీ మయుడు అని అర్ధం చేసుకోవాలి .శివ ,శక్తులు అభేద్యాలు అని గ్రహించాలి .”న శివేన వినా శక్తి ర్నశక్తిరహితః శివః ”శక్తి లేక పోతే శివుడు లేదు .శివుడు లేకుంటే శక్తి లేదని అర్ధం .శ్రీ దేవి రూపం లో యెర్ర దానం శక్తిని కలిగి ఉండ తాన్ని ,కిరీటం సర్వేశ్వరత్వాన్ని ,శశి మకుట మణి ఆనంద మయత్వాన్ని ,మూడు కళ్ళు మూడు కాలాలను ,చనుల భారం సృష్టిలోని జీవుల అన్నమయాది పంచ కోశ పోషణ ద్రవ్య సమృద్ధిని తెలియ జేస్తున్నాయి .ఇదంతా శ్రీ మాత్రు విరాట్ స్వరూపం .
24–”జగత్సూతే దాతే ,హరి రవతు రుద్రః క్షప యతే –తిరస్కుర్వ న్నేనత్ ,స్వమపి ,వపురీ శస్తి రయతి
సదా పూర్వ స్సర్వం ,తదివ ,మను గృహ్ణాతి చ ,శివ –స్తవాజ్నా మాలంబ్య  ,క్షణ చరిత ర్భ్రూ లతికయోహ్ ”
తాత్పర్యం –జగన్మాతా !బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తే ,శ్రీ హరి రక్షిస్తే ,రుద్రుడు సంహారం చేస్తున్నాడు  ..ఈ మూడు తత్వాల లోని మహేశ్వర తత్వ మైన ఈశ్వరుడు అంతర్హితం గా ఉన్నాడు .ప్రళయం జరిగి పోయిన తర్వాతా మళ్ళీ బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయా లనే తలంపు సదా శివునికి కలిగింది .క్షణ కాలం శ్రీ దేవి కను బొమ్మల ఆజ్న కోసం కాచుకొని ఉండి ,దాన్ని స్వీక రించి బ్రహ్మా విష్ణు రుద్ర రూపం తో ఉన్న తత్త్వం సకల జగత్తును సృష్టించ టానికి సన్నద్ధం అవుతోంది .
విశేషం –సృష్టి ,స్తితి ,ఉప సంహారం తిరోధానం ,అనుగ్రహం అనే అయిదు పనులు బ్రహ్మా విష్ణు ,రుద్రా,మహేశ్వర సదాశివులు చేస్తూంటారు .ఇవన్నీ పరమేశ్వరి అనుజ్న తోనే జరుగుతాయి .బ్రహ్మ ఆమె కు పెద్ద కొడుకు .ప్రపంచోత్పత్తి చేస్తాడు .రెండవ కొడుకు హరి జగత పాలన చేస్తాడు .కాల రుద్రుడు మూడవ వాడు .సంహరిస్తాడు .వీరంతా కాల పురుషులే .బ్రహ్మాదులకు కారణ భూత మైన మహేశ్వరుడు చతుర్ధ పుత్రుడు .ఈ పనులన్నీ దేవీ శక్తి మూల కాలు .”ఆత్మా వై పుత్రా నామాసి ”– ”స ఏవాయుం పురుషః ప్రత్యక్షనోప లభ్యతే ”అన్నది వేదం .
25–  ”త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం  తవ శివే –భవేత్పూజా  పూజా ,తవ చరణ యోర్యా  విరచితా
తదాహిత్వా ,త్పాదో ద్వహన  మణి పీఠి కస్య నికటే –స్తితా హ్యేతోశశ్వన్ముకు లిత  కరోత్తంస మకుటః ”
తాత్పర్యం –శివ వామ భాగ నిలయా !సత్వ ,రజో ,తమో గుణాల వల్ల జన్మించిన బ్రహ్మా, విష్ణు, రుద్రులనే త్రిమూర్తులకు నీ పాదాలకు జరిగే పూజ యే వాళ్ళకూ పూజ అవుతోంది .ఇది సహజమే .ఎందు కంటే -వారు నీ పాదాల ను కలిగిన రత్న పీఠిక కింద ,చేతులు మోడ్చి ,శిరస్సు ల పై గల కిరీటాలతో వినతు లై ప్రార్ధిస్తున్నారు .
విశేషం –శ్రీ దేవికి పూజ చేస్తే విడిగా బ్రహ్మాదులకు పూజ చేయక్కర లేదు .ఆమె పూజ అందరి పూజ ల కంటే విశిష్ట మైనది .”విష్ణు పూజా సహస్రాణి ,శివ పూజా శతానిచ ,అంబికా చరనార్చాయః కాలం నార్హంతి షోడశం ”అంటే అమ్మ వారి పాద పూజే పూజ .మిగిలిన వేవీ పూజలు కాదు అని అర్ధం .”పూజ్య పూజనం పూజా ,నహో అపూజ్య పూజనం ”పూ జ్యు లైన వారికీ చేసిందే పూజ .అపూజ్యులకు చేసే పూజ పూజ కాదని భావం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –28-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

చైర్మన్ కోటేశ్వ ర రావు గారు

 చైర్మన్ కోటేశ్వ ర రావు గారు 

కృష్ణా జిల్లా అన్నిటి తో బాటు రాజకీయానికీ పెద్ద కేంద్రమే .ఆ జిల్లాకు ఒక ప్పుడు రాజకీయానికి గొట్టి పాటి బ్రహ్మయ్య ,అయ్యదేవర కాళేశ్వర రావు ,టి.వి.ఎస్ చాల పతి రావు గార్లు పెద్దదిక్కు . ఆ తర్వాత కాకాని వెంకట రత్నం గారి శకం  వచ్చింది ఉక్కు కాకాని అని పేరున్న ఆయన ప్రాజలకు అతి సన్నిహితం గా మెలిగారు .జిల్లా బోర్డు అధ్యక్షుని గా ఆయన ఆ జిల్లాకు విద్యా దానం చేశారు .అడిగిన చోట్ల అల్లా ప్రాధమిక ,ఉన్నత విద్యాలయాలను ఏర్పాటు చేసి కమిటీ లను ఏర్పరచి వారి సహకారము తో వాటిని అభి వృద్ధి చేశారు .ఎన్నో వేలమంది ఉపాధ్యాయులను నియమించిన ఘనత కాకానిది .రైతు బాన్ధవుని గా కూడా పేరొందారు .పాల కేంద్రాలనేర్పరచి ఉద్యోగాలిచ్చారు .ఆయన తర్వాత  మాగంటి అంకినీడు జిల్లా పరిషద్  అధ్యక్షు  లైనారు .ఆయనది అంతా అదో ధోరణి లో నడిచి, ఆ పదవి గౌరవం దెబ్బతింది .కాకాని రాజ కీయ దురంధరుడు. .చాణక్య నీతి తో ప్రతి గ్రామం లోను తన వర్గాన్ని ఏర్పరచుకొన్నారు .శాసన  సభ్యునిగా ,మంత్రిగా తన దక్షత ను నిరూపించుకొన్నారు .విద్యా విప్లవం ,శ్వేత విప్లవాన్ని కృష్ణా జిల్లాకు తెచ్చిన ఘనత కాకాని వారిదే .ఆ తర్వాతా అంతా నీరవం ,నీరసం ఆవ రించింది .
                     చైర్మన్ శ్రీ  పిన్నమ నేని కోటేశ్వర రావు 
అలాంటి శూన్యం లో రుద్ర పాక కుర్ర్రాడు శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారు అందరి దృష్టిని ఆకర్షించారు .సరైన నాయకత్వం కావాలంటే పిన్నమ నేనే అని అందరు భావించారు .నల్లగా వెడల్పు ముఖం తో మల్లె పూల వంటి తెల్ల ఖద్దరు పంచతెల్ల లాల్చీ , ఉత్త రీయం తో ముఖం లో లక్ష్మీ కళతో చూపరులను ఆకర్షించే వారు .ఆయనకు అంకినీడు గారి తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షా పదవి దక్కింది .కాకాని గారి ఆశీస్సులూ పుష్కలం గా ఉండటం తో పని తేలికయినది .ఆ రోజుల్లో  సమితి ప్రెసిడెంట్లు అందరు కలిసి ఎన్నుకొనే పద్ధతి ఉన్నట్లు జ్ఞాపకం .అందరు ఏక గ్రీవం గా వీరినే ఎన్ను కొన్నారు .అప్పటి నుంచి మూడు సార్లు ఆయన దాన్ని నిర్వహించి, రెండు సార్లు శాసన సభ్యులైనా ‘‘చైర్మన్ కోటేశ్వర రావు ”అనే పించుకొన్నారు .క్రమ క్రమంగా తన పని తీరుకు మెరుగులు దిద్దు కొన్నారు .పంచాయతీ రాజ్ వ్యవస్థను కూలం కషం గా అధ్యయనం చేశారు .ప్రజలకు చేరు వయ్యె మార్గాలను అను సరించారు .స్కూల్ కమిటీ అధ్యక్షులమాటకు విలువ నిచ్చి ఆ స్కూల్ లో ఎవరెవరు కావాలో వారి మాట మేరకు నియమించటం, బదిలీ చేయటం చేశారు .కాకాని విద్యాలయాలను శాంక్షన్క్ష చేస్తే వాటి భౌతిక పరిస్తితుల బాగోగు లను పిన్నమ నేని చూశారు కాకాని బ్రహ్మ ,పిన్నమ నేని విష్ణువు. కృష్ణా జిల్లా విద్యా రంగానికి ..కావలసిన అన్ని సౌకర్యాలు కలగ జేశారు ప్రధానో పాద్యాయుని మాటకు విలువ నిచ్చారు .కనుక సిబ్బంది ఆయన మాట వినే ఆవ కాశం ఎక్కువైంది .విద్యా లయాలన్ని కళ కళ లాడాయి .మంచి ఫలితాలు వచ్చేవి .కష్ట పడి బోధించే వారు .సమర్ధు లైన ఉపాధ్యాయులు తమ శక్తి సామార్ధ్యాలను చూపించే వారు .అలాంటి బంగారు కాలం పిన్నమ నేని వారిది .
నేను1963 లో అంకినీడు గారి పాలన లో సైన్స్ అసిస్టంట్ గా మోపి దేవి హైస్కూల్ లో నియమింప బద్దాను ..అంకినీడు గారే మమ్మల్ని  రెగ్యులర్ ఉపాధ్యాయులను చేశారు .అప్పటి దాకా వేసవి శలవల్లో ”హూస్టు” చేసే వారు కాని మా అదృష్టం అంకి నీడు గారు మమ్మల్ని సెలవల్లో తీసేయ కుండా కొనసాగెట్లు చేశారు .అయితే ఆయనకు బదిలీల విషయం లో ఆవ గాహన ఉండేది కాదు .ఒకే వ్యక్తికీ ఒకే రోజు మూడు పూటలా మూడు ఆర్డర్లు మూడు చోట్లకు వచ్చేవి .అర్ధ రాత్రి బదిలీలు .అంతా అస్తవ్యస్తం గా ఉండేది .అప్పుడు పిన్నమ నేని అధ్యక్షు లయారు .నేను రెండేళ్లు మోపి దేవి లో పని చేసి ఉయ్యూరు కు బదిలీకి ప్రయత్నిస్తున్నాను .నా స్నేహితుడు గండి వాసు తనకు కపిలేశ్వర పురం లో  మాజీ శాసన  సభ్యులు శ్రీ కొల్లి పర సూరయ్య గారు బాగా తెలుసు నని ఆయన, నా బదిలీకి సాయం చేస్తారని  చెప్పి నన్ను వారింటికి తీసుకొని వెళ్లాడు .ఆయన అప్పటికే వయో వృద్ధులు పాత తరం కాంగ్రెస్ నాయకులూ .ఆయన నన్ను ”మేష్టారు! కొద్ది రోజుల్లో జిల్లా పరిషద్ చైర్మన్ గా పిన్నమ నేనివస్తున్నాడు. ఆయన కుర్రాడే కాని అన్నీ తెలిసిన వాడు .మీ డైరీలో రాసుకోండి .వేసవి సెలవల తర్వాత మీరు మీ ఉయ్యూరు లో ఉంటారు. బాధ్యత నాది ”అన్నారు .అన్నట్లుగా నే నన్ను ఉయ్యూరు ట్రాన్స్ ఫర్ చేయించారు సూరయ్య గారు . ఆ తర్వాత జిల్లా పరిషద్ అభి వృద్ధి కార్య క్రమాలేన్నిటినో చే బట్టారు. రోడ్లు, భవనాలు ,ప్రైమరి హెల్త్ సెంటర్లు అన్నీ ఆయన చలవే .ఎక్క డా డాక్టర్ల,మందుల కొరత ఉండేది కాదు .అన్నిటినీ స్వయం గా ఆయన తెలుసుకొని చేసే వారు .ప్రధానో పాధ్యాయుల సమావేశాలలో స్పూర్తి నిచ్చే ప్రసంగాలు చేసే వారు .మంచిని మెచ్చే వారు .సరిగ్గా పని చేయని వారిని పిలిచి మంద లించే వారు .అన్నిటి లో ఆయన క్వాలిటీ ని నెలకొల్పారు మేష్టర్లందరూ ఆయనకు తెలుసు .ఆఫీసు సిబ్బందీఆయనకు తెలుసు .ఒక్కత్రాటి మీద జిల్లాను నడిపించిన నాయకుడైనా రు .క్రమం గా కాకాని వర్గం అంతా పిన్నమ నేని వర్గం గా మారి పోయారు .ప్రతి గ్రామం లోను పిన్నమ నేనికి స్వంత గ్రూపు మనుషు లుండె వారు .వారి పేర్లన్నీ ఆయనకు తెలుసు .కనీ పించి నప్పుడు పేరు పెట్టి పిలిచే వారు .ఒక్కో సారి విషయాలను కుండ బద్దలు కొట్టి నట్లు చెప్పే వారు .బాగా పని చేసే వారంటే మహా ఇష్టం. బాగా బోధించే ఉపాధ్యాయులేవ్వరో ఆయనకు గుర్తే .అయన కాంగ్రెస్ అభి మానే .శాశన మండలి ఎన్నికలలో కొల్లూరి కోటేశ్వర రావు గారికి పని చేసి మూడు సార్లు గేలి పించారు .వీరిద్దరి జోడీ గొప్ప గా ఉండేది .కమ్యునిస్టు  మాస్టర్లను బదిలీ చేయ మని అడిగినా ,వారు కొల్లూరికి పని చేయ లేదు పి.శ్రీ రామ మూర్తి గారికి చేశారని ఎవరైనా చెప్పినా ఆ సాకుతో వారిని బదిలీ చేయ లేదు .వారి సమర్ధత ఆయనకు తెలుసు .నా ఎదురుగుండానే ఒక సారి అలాటి ఫిర్యాదు వస్తే ఆయన వారిని మంద లించి ఆ ఉపాధ్యాయులకు అండగా నిలిచారు .
మాకు మా ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి ఎన్ని కైన కొల్లూరి గొప్ప అండా దండా .ఆయనా ,పిన్నమ నేని అన్నా తమ్ముడు లాగా పని చేసి ఉపాధ్యాయుల సమస్యలను జిల్లా లోనే పరిష్కరించే వారు .అవసర మైతే శాసన సభ మండలి లో ప్రస్తావింప జేసి, సాధించే వారు .ఉపాధ్యాయులంటే పిన్నమ నేనికి మహా గౌరవం .కనీ పించ గానే ఆయనే ముందు నమస్కరించేవారు .సంస్కారం ఉన్న మనిషి .జిల్లాలో ని నాయకు లంతా ఆయన అంటే ఇష్టం గా ఉండే వారు, గౌరవించే వారు .ఒక సారి  నేను పామర్రు నుండి ఉయ్యురుకు ట్రాన్స్ ఫర్ కు పెట్టుకొన్నాను .మా గాడ్ ఫాదర్  కొల్లూరి . .నేను ఒక సారి కొల్లూరిని కలవ టానికి బందరులోని ఆయన తెలుగు విద్యార్ధి ఆఫీసుకు వెళ్లాను .అప్పుడే పిన్నమ నేని తో మాట్లాడుతున్నారు ”కోటేశ్వర రావు గారూ! మీరు దుర్గా ప్రాసాద్ గారిని ఉయ్యూరు ట్రాన్స్ ఫర్ చేయ క పోతే అక్కడ మీకు, నాకు మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు ”అని చెప్పుతున్నారు .అంత అభిమానం ఉండేది కొల్లోరికి  నా మీద .అంతే వారం లో బదిలీ ఉత్తరువులు నాకు అందాయి .అలా కృష్ణార్జునులు లా వారిద్దరూ కృష్ణా జిల్లాలో పని చేసి, దాని ప్రగతిని తీర్చి దిద్దారు .ఆయన పదవి నుండి దిగి పోయిన ప్రతి సారి ఆయన్ను ప్రతి స్కూలు ఘనంగా ఆహ్వానించి సత్కరించేది .అదొక వేడుక గా అందరు జరిపే వారు .ఖద్దరు వస్త్రాలు శాలువాలు దండలు తో ఘనం గా నిర్వ హించే వారు. పార్టీలు భోజనాలు లెక్కే లేవు .సన్మాన పత్రాలు చెప్పనే అక్కర లేదు నేనే చాలా సభల్లో ఆయన పై కవిత్వం రాసి చదివా .అందరి వాడు అని పించుకొన్నారు పిన్నమనేని ”ఉపాధ్యాయ బంధు ”గా ఆయన్ను ఆప్యాయం గా పిలు,చుకొనే వారం .కాకాని వారసత్వాన్ని నిలిపి జిల్లాలో గణ నీయమైన నాయకత్వాన్ని సాధించారు .
బహుశా మూడో సారి ఎన్నికైనపుడు మేమంతా జిల్లా పరిషద్ కార్యా లయం లో ఉన్నాం .కొల్లూరి కూడా మాతో ఉన్నారు .హైదరా బాద్ నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి .ఆయన్ను రాష్ట్ర మంత్రి వర్గం లో చేరమని .ఆయన వాటికి సమాధానం గా ”నాకు జిల్లా పరిషద్ చాలు .నాకంటే సీనియర్ చనుమోలు వెంకట రావు గారున్నారు .వారికిస్తే నాకు ఇచ్చి నట్లే .నన్నిక బల వంతం చేయద్దు ”అని స్పష్టం గా  చెప్పారు .అలా వెంకట్రావు గారు మినిస్టర్ అయారు . జిల్లా పరిషద్ అంటే ఆయనకు వీరాభి మానం .మినిస్ట్రీ ని వద్దనుకొన్న మనీషి పిన్నమ నేని .ఆయనకు రైతు కష్టాలు తెలుసు, టీచర్ల బాధలు తెలుసు .అన్నీ తెలుసుకొని ఆయన పని చేసి అందరికి తృప్తిని కల్గించారు .
1987లో నాకు ప్రధానో పాద్యాయుని గా ప్రమోషన్ వచ్చి” వత్స వాయి” వేశారు .అక్కడి నుండి బయట పడ టానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే శని ఆది వారాలో ఉయ్యూరు వెళ్ళే వాడిని .ఒకసారి ఆ స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను రుద్ర పాక వెళ్లి ఆయన దృష్టికి తెచ్చాను .అప్పటికి ఆరు పోస్టులు ఖాళీ గా ఉన్నాయి  .ఆయన నవ్వుతూ ”మేస్టారూ ! అక్కడ  పని చేసిన యే హెడ్ మాస్టారు నన్ను ఇంత వరకు పోస్ట్లు ఫిలప్ చేయమని అడగ లేదు .వాళ్ళు అక్కడి నుండి బయట పడ టానికి మాత్రమె నన్ను కలిసి చెప్పే వారు .మీరే మొదటి సారి దీన్ని నాకు దృష్టికి తెచ్చారు .అక్కడి అన్ని పోస్టుల్ని ఒక పది  హేను రోజుల్లో నిమ్పుతాను .థాంక్ యు ”అన్న సౌజన్య మూర్తి .అన్న మాట నిల బెట్టుకొని అన్ని పోస్టులను నింపారు ,నేను అక్కడి నుంచి   బదిలీ ఆయె సరికి అన్నీ ఫిలప్  అయాయి.” దటీస్ పిన్నమ నేని ”.
కృష్ణా జిల్లా టీచర్సు గిల్డ్ అంటే విపరీత మైన అభి మానం .ఆది కాకాని వారి చలవ అనే వారు .తాను కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని గిల్డు కార్య క్రమాలలో పాల్గొనే వారు ముఖ్య మంత్రులను, మంత్రులను ,శాసన సభ్యులను పిలిపించి, వారి సముఖం లో సమస్యలను చెప్పించి పరిష్కరించటానికి సాయం చేసే వారు .కొల్లూరి కృషీ ఇందులో తక్కువేమీ లేదు .”కాకాని టీచర్సు గిల్డ్ హోమ్ ” ను బెజ వాడలో ఆయన పూనిక తోనే కట్ట బడింది .ఆ తర్వాతఉపాద్యాయు లందరూ ఆలో చించి, బందరు లో టీచర్స్ గిల్డ్ ను ”పిన్నమ నేని టీచర్స్ గిల్డ్ ”గా కట్టించి ఆయన సేవా నిరతికి నీరాజనం పట్టారు .అక్కడే ఆనాటి విదేశంగ మంత్రి పి.వి.నరసింహా రావు గారు వచ్చారు .గిల్డు కార్య క్రమం అంటే పిన్నమ నేని, కొల్లూరి  లేకుండా జరగ లేదు .గిల్డు అధ్యక్షులు గా ఎవ రుంటే బాగుంటుందో ఆయన్ను అడిగి తెలుసు కోని చేసే వారు .అంటే ఉపాధ్యాయ ఉద్య మానికి పిన్నమ నేని వెన్ను దన్ను గా నిలి చారు .విద్యాలయాలలో ఉత్తమ ఫలితాలను సాధించిన వాటికి బహు మతులు, సబ్జెక్టులో ఎక్కువ శాతం మార్కులు సాధించిన విద్యార్ధులకు,ఆ సబ్జక్తులను బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం  పారి తోషికాలను జిల్లా పరిషత్ సమావేశం లో నొ, ప్రధానో పాధ్యాయుల సమా వేశం లోని ఓ ఇప్పించేగొప్ప ఒరవడికి  పిన్నమ నేని శ్రీ కారం చుట్టారు . అదొక పండుగ లాగా జరిపించే వారు .విద్య మీద ఆయనకు అంత అభిరుచి , తపనా, ఆసక్తీ ఉండేవి .అందుకే ఆయన తర్వాతా ,ముందు ఎందరు చైర్మన్ గా చేసినా” చైర్మన్ అంటే పిన్నమ నేనే ”అని పించుకొన్నారు .అందుకే అందరు చైర్మన్ కోటేశ్వర రావు అనే అంటారు .ఆయన ముద్ర ను ప్రతి దాని లో చూపించిన మార్గ దర్శి పిన్నమ నేని .
పిన్నమ నేనికి పంచాయితీ రాజ్ మీద పూర్తీ అవగాహన ఉంది .అందుకే దేశం లో పంచాయితీ రాజ్ సమావేశం ఎక్కడ జరిగినా పిన్నమనేని ని సంప్రదించి సలహాలను తీసుకొనే వారు .దాని అభి వృద్ధికి ఆయన పడి నంత తపనా ,,చేసి నంత శ్రమ ఎవ్వరూ చేయ లేదు .జిల్లాలో ఒక పెద్ద మనిషి గా ఆయన దాదాపు అర వై సంవత్స రాలు నిలిచి అందరికి తలలోని నాలుక లాగా పని చేశారు .అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం పిన్నమ నేనిది .నా విషయం  లో నన్ను చాలా సార్లు బదిలీ చేశారు .నేను మళ్ళీ ప్రయత్నించి  రెండు మూడు నెలల్లో నాకు కావలసిన చోటుకు వచ్చే వాడిని .చెప్పింది సంపూర్ణం గా విని యే పనైనా చేసే వారాయన .ముఖం లో మంచి  వర్చస్సు ఉండేది. బొట్టు పెట్టు కొంటె మరీ కళ గా ఉండే వారు .సమయ పాలన బాగా పాటించే వారు .అలంటి దిగ్గజం శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారు అంటే చైర్మన్ కోటేశ్వర రావు గారు 84వ ఏట నిన్న స్వర్గస్తు లయారని తెలిసి ఉపాధ్యాయ లోకం విషాద గ్రస్త మైంది .వారి కి ఆత్మశాంతి కలగా లని కోరుకొంటున్నాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –27-9-12–కాంప్ –అమెరికా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ జగ్గీ వాసుదేవ్

 శ్రీ జగ్గీ వాసుదేవ్ 
శ్రీ సద్గురు వాసు దేవ్ ను అందరు” జగ్గ్గీ వాసుదేవ్” అని ,ఆప్యాయం గా పిలుచు కొంటారు .అసలు పేరు జగదీశ్ .అదే జగ్గీ అయింది .జగత్తుకు నాయ కత్వం వహించే లక్షణాలు ఆయన లో ఉన్నందుకే ఆ పేరు పెట్టారట  .ఆయన 3-9-1957  సుశీలా ,డాక్టర్ వాసు దేవ్అనే తెలుగు దంపతులకు కర్నాటక  లోని మైసూర్ లో జన్మించారు .చిన్నప్పుడే గురువు” మల్లాది హళ్లి రాఘ వేంద్ర స్వామి” వద్ద యోగాభ్యాసం నేర్చారు .అప్పటి నుండి అది ఆయనకు నిత్య క్రుత్యమైంది .మైసూర్  వర్సిటి లోఇంగ్లీష లిటరేచర్ లోడిగ్రీ  సాధించారు .మోటారు సైకిల్ పై దేశమంతటా పర్య టించారు .కారునడప గలరు .ఆయనకు రాని విద్య లేదు .  ఆయన మైసూర్లోని చాముండీ హిల్ పై ఒక రాతి మీద కూర్చుని తీవ్ర ధ్యానం లో నిమగ్నమయారు .23-9-1982 వారికి అకస్మాత్తుగా దివ్య దర్శనం అయి, జ్ఞానోదయం అయింది. మంచి యోగా కేంద్రాన్ని స్తాపించ మని  గురువు ఆదేశించారాయన్ను .తగిన స్థలం కోసం తీవ్రం గా గాలించారు .చివరకు తమిళ్ నాడు లోని కోయంబత్తూర్ కు నలభై కిలో మీటర్ల దూరం లో ప్రశాంత వాతా వరణం లో ‘వెళ్ళిం గిరిమౌంటేన్”  వద్ద మంచి ప్రదేశం లభించింది .అక్కడ ఒక ఆశ్రమాన్ని  నిర్మించి ,యోగా ను నేర్పుతున్నారు ”.ఈశా ఫౌండేషన్ ” ను స్తాపించి ఎన్నో సేవా కార్య క్రమాలను నిర్వ హిస్తున్నారు .”ఈశా ”అంటే ఆయన ”నిర్గుణ పర బ్రహ్మ ”అని అర్ధం చెప్పారు .ఇక్కడే” యోగిక్ టెంపుల్” ను నిర్మించి ధ్యానానికి కేంద్ర బిందువు గా ”ధ్యాన లింగాన్ని” ప్రతిష్టించారు .అక్కడ అన దారు యే భేదం లేకుండా ధ్యానం చేసుకో వచ్చు .సర్వ జన సన్నిహితుడు ఆయన .ఆ కేంద్రం లో అన్నీ నేర్పుతారు .అయన కు అన్ని ఆటలు వచ్చు .హాకీ కూడా ఆడతారు .తమిళ్ నాడు  ,కర్నాటక రాష్ట్రా లలో తరచు భారీ ”సత్సంగాలు ”నిర్వ హిస్తారు .ఆయనకు ఆరు ఖండాలలో, అనేక దేశాలలో శిష్య పరంపర ఉంది .   .పర్యటనలు చేస్తూ వారిని ఉత్తేజితులను చేస్తూంటారు .
”   ప్రముఖ భారతీయుడు” గా అనేక పత్రికలనిర్వ హించిన అభిప్రాయాలలో  స్తానం సంపాదించారు .ఆయన అంత గా భారీ కార్య క్రమాలను నిర్వ హించిన వారు అరుదు .క్రిందటి ఏడాది  మద్రాస్ లో ”ఆనంద్ అలై”(A wave of Bliss) అనే పేరున   ” భారీ సత్సంగ్ ను నిర్వ హిస్తే, లక్షా యాభై వేల మంది పాల్గొని,”న  భూతో ”అని పించారు .ఆయన చాలా సాధారణం గా ఉంటారు .ముఖం లో ది వ్య తేజస్సు వెలుగుతూ ఉంటుంది .చక్కని గడ్డం,.. జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకోరు .ప్రాచీన మహర్షి ఆయన లో దర్శనమిస్తారు .ఈశా ఫౌండేషన్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది .తమిళ్ నాడు లో ఆయన ఆధ్వర్యం లో ఒకే రోజు 80,000మొక్కలు 27జిల్లాలలో నాటి, రికార్డు సృష్టించారు .ఆ సంస్థ గ్రామీణ ఆర్ధిక విధానాన్ని ,ఆధునిక  అభి వృద్ధి మార్గాలు చేబట్టింది .ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వ హిస్తోంది .సంచార విద్యాలయాల ద్వారా 4,200గ్రామాలకు సేవ లందిస్తున్నారు .వీటి వల్ల 70 లక్షల మంది వైద్య సదు పాయాన్ని పొందుతున్నారు .అమెరికా లోని టెన్నిసీ రాష్ట్రం లో కంబర్లాండ్  లో mc Minvilleiలో  1200ఎకరాల స్థలం లోIsha Foundation ”isha institute of inner sciences ”2006 లో నిర్మించి, సేవ లందిస్తున్నారు .ప్రపంచ శాంతి, సుహృద్భావం, సమాజ పరి రక్షణ ,అందరికి విద్యా ,ఆరోగ్యం, సాంకేతిక వినియోగం, స్త్రీ విద్యా ,శిశు సంరక్షణ కోసం అవి రళ కృషి చేస్తున్నారు . ఏది బోధించినా తేలిక మాటలతో హృదయం లో నిలిచి పోయే టట్లు చేసే శక్తి సద్గురువు లది . వారి వాసుదేవ వాణి ని విందాం  .
                  సద్గురు వాసు దేవ  వాణి 
మాన వాళి కేవలం జీవించటం అనేదాన్ని అధిగ మించింది .ప్రతి మనిషి  లో మేధస్సు ఉంది .దాన్ని తెలుసుకొని సాధన లోకి తెచ్చు కోవాలి. దాన్ని తిండికో, విలాస  జీవితానికో ,ధన సంపాదనకో ఖర్చు పెడితే ప్రయోజనం లేదు .మనిషి మానసిక పరిస్తితిని వృద్ధి చెందిచాలి. సమానత్వం అనేది” ఒకే రకం గా ఉండటం ”అను కొంటె పోర బాటే .అలా అయితే రెండో వారి అవసరం లేదు కదా .సమానత్వం అంటే సమాన అవకాశాలు .నువ్వు ఇష్ట పడే వ్యక్తీ నీతో సమానం కాదు .అతనెప్పుడూ నీ కంటే పైనే ఉంటాడు .మనం ఇవాళ విలువలను కోల్పోతున్నాం .అన్నీ డబ్బు, హోదా లతో ముడి పెడుతున్నాం .స్త్రీ కూడా సమానత్వాన్ని కోరుతోంది .అంటే పురుషుని తో సమానం గా సంపాదించాలని మాత్రమె భావించ రాదు .ఆమె కు గృహ బాధ్యతలుంటాయి .కుటుంబాన్ని ఉన్నత స్తితికి తీసుకు రావాలనే తపన ఆమె లో ఉంటుంది .సాంకేతికత పుణ్యమా అని మార్పు అనేది చాలా వేగ వంతం గా జరిగి పోతోంది .
ఈ నాటి చిన్న పిల్లలు ఆరు బయట స్తలాల్లో ఆడు కోవటం తక్కువ గా ఉంది .వాళ్ళు ఇప్పుడు” ”గెలాక్సీల మధ్య” ఆడుకొంటున్నారు . అంటే కంప్యూటర్ లో ఆడుకొంటున్నారు .కృత్రిమ మ ఆటలు ఆడుతున్నారని అర్ధం .ఇరుగు పొరుగు వారితో ఆటలాడే తీరిక వారికి లేకుండా పోయింది .సాంకేతికత మనకు అన్నీ తెచ్చి అరచేతుల్లో పేడు తోంది .మరి సమస్య ఏమిటి ?ఉన్న ప్రతి దానితో మనమే సమస్యలను అనంతం గా సృష్టించు కొంటున్నాం .మనం వాడే సెల్ ,కంప్యూటర్ వగైరా లన్నీ మాన వ మెకానిజం కంటే గోప్పవేమీ కావని గ్రహించాలి .మీరు చెప్పిన మాట మీ పిల్లలు వినటం లేదు అంటే ,చెప్పే నైతిక విలువ ను మీరు  కోల్పోయారు అని అర్ధం .అధికారం తో వారిని శాసించ లేము .నువ్వు వారి నుండి గౌరవం ,మర్యాదా కోరు కొంటె ఆది ”వేళా కోళం” అవుతుంది .వారికి అందు బాటులో ఉన్న వన్నీ తెలిసేట్లు చేయండి .సలహా ఇస్తున్నట్లు గా మీ రు చెప్పేది వాళ్లకు అని పించాలి .అప్పుడు వాళ్ళు వినటమే కాదు ,ఏది ఎలా చేయాలని మిమ్మల్ని తరచు వచ్చి అడుగుతూ ఉంటారు .అప్పుడే మీరు చేప్పే దాని మీద వారికి గురి ఏర్పడుతుంది .
                భగవద్గీత పై వ్యాఖ్యానం 
భగవద్గీత ఆన్నది రాజకీయ బోధ కాదు .ఆది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని బోధించేది ఆది రాజకీయమే అయితే కృష్ణుడు అందరికీ చెప్పే వాడు కదా.తన ఆత్యంత అంత రంగికుడైన  అర్జునుడికి ఒక్కడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ?భగవాన్ శ్రీ కృష్ణుడు అర్జునునికి గీత ను బోధించిన తర్వాతా36 ఏళ్ళు అర్జునుడు జీవించే ఉన్నాడు .కాని దాన్ని ఎవరికీ చెప్ప లేదే ?.అసలా విషయాన్ని ఎవరి వద్దా  అతను ప్రస్తావనకు తీసుకు రాలేదే .ఆది నారా నారాయనులిద్దరి మధ్య ఉన్న రహస్య విషయం .బయటి నుంచి ఎవరూ వినను కూడా లేదు . అదంతా అతని స్వయం నిర్ణయం ,అనుభవానికి సంబంధించిన విషయం .భగవద్గీత హిందువులకుమాత్రమే అనుకోవటం పోర బాటు .ఆది అందరిదీ .జ్యూ అయిన న్యూటన్ గురుత్వాకర్షణసిద్ధాంతాన్ని కనీ పెట్టాడు కనుక ఆది యూదులకు మాత్రమె వర్తిస్తుందంటే వెర్రి తనం కాదా .సనాతన ధర్మం అంటే విశ్వ నిబంధన, చట్టం ధర్మం,న్యాయం . (యూని వరసల్ లా,).కృష్ణుడు బోధించి నప్పుడు ఆయన హిందువు అని అనుకో లేదు .ఆయనేమీ హిందూ మతాన్ని సృష్టించ లేదు .కృష్ణుడు గుర్తు చేసింది ”స్వధర్మం ”నే .స్వధర్మం అంటే హిందూ ధర్మం అని కాదు .స్వీయ మైన ,వైయక్తిక మైన ధర్మం అని అర్ధం ..గీత ఒక చక్కని డిబేట్ .సందేహాలకు సమాధానాలు .ఈ గ్రంధం ఇలా చెప్పింది ,ఆ గ్రంధం అలా చెప్పింది అని శంకలు పనికి రావు .అవన్నీ చిన్న టాంకుల లో ఉన్న నీరు లాంటివి ..అసలు అనంత నీటి ప్రవాహమే వస్తే ,వీటి ఉనికే ఉండదు కదా .
నేను చెబుతున్న వన్నీ ,నేను అనుభవ పూర్వకం గా తెలుసుకోన్నవే .మీ స్వధర్మమే అన్నిటి కన్నా ఉన్నత మైనది, ఉత్తమ మైనది అని మర్చి పోరాదు .అంతశ్సో ధన చేసుకోండి .మిమ్మల్ని అప్పుడు మీరే నడి పించుకో గల సామర్ధ్యాన్ని పొంద గలుగుతారు .ముందుగా దానికి అర్హత సంపాదించాలి .ఆది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లాడు ఐన్ స్టీన్ గారిE=mc 2సూత్రాన్ని బట్టీ పట్టి తనకు సాపేక్ష సిద్ధాంతం అర్ధం అయింది అని చెప్పటం లా ఉంటుంది .గీత లోని మాటలకు అర్ధ తాత్పర్యాలు తెలిసి నంత మాత్రం చేత గీత నీకు ఆవ గాహన అయి నట్లు కాదని తెలుసుకోవాలి .నీకు నీ స్వధర్మం -అంటే స్వీయ ధర్మం (లా ఆఫ్ ది సెల్ఫ్ )తెలియాలి అప్పుడే ఆది అర్ధము అయినట్లు .
టెక్నాలజీ నిన్నేమీ ”నన్ను ఉపయోగించుకో ”అని కోరటం లేదే .ఆది అందు బాటు లో ఉంది నువ్వుదాన్ని నీ సౌకర్యం కోసం  వాడుకొంటున్నావు .ఇక్కడ సమస్య ఏమిటి అంటే -నీ శరీరం తో ఎలా పని చేయించుకోవాలి ,నీ మెదడు మనసు లతో ఏవిధమైన పనులు చేయించు కోవాలో నీకు తెలియదు .అలాగే నీ భావోద్రేకాలను, నీ శరీర ధర్మాన్ని ఎలా నియంత్రించు కోవాలో తెలీని మూర్ఖత్వం లో ఉంటున్నావు .అందుకని నీ చుట్టూ ఉన్న ప్రతి దాని పైనా ఫిర్యాదులు చేస్తూండటం నీకు అలవాటై పోయింది .ఆధ్యాత్మికత్వం అంటే మింగుడు పాడనీ పదార్ధం అనుకొని పోర బడుతున్నావు .అవసరం వచ్చి నప్పుడు సాంకేతిక సహాయం తీసుకో .మిగిలిన  కాలాని ధ్యానం లో గడుపు .అప్పుడు అంతా స్వచ్చం గా కనీ పిస్తుంది .టెక్నాలజీ ని వాడ వద్దని ఎవరూ చెప్పరు .అవసరానికే విని యోగించు .జీవితాన్ని అధ్యయనం ,పరిశీలనా చేయాలి లేక పోతే బురద లో కూరుకు పోతాం .ఆన్ లైన్లో అన్నీ చేసుకో .ఇబ్బందేమీ లేదు .
ప్రపంచం లో అందరికీ అన్నీ చాలటం లేదని ఫిర్యాదు ఉంది .విషయాలను సమర్ధ వంతం గా పరిష్కరించే ఆలోచన చేయక పోవటమే లోపం .నువ్వు నిర్మించిన ఇంజినీరింగ్ వస్తువులను గురించి గొప్ప గా పొగుడు కొంటావు .కాని నీ లోని ఇంజినీరింగ్ శక్తిని గూర్చిన ధ్యాసే లేకుండా పోయింది .మేము ఇప్పుడు ”ఈశా క్రి యా ” అనే సులభ పద్ధతిని ఉచితం గా అందరికి అందిస్తున్నాం .ఇండియా లో దీని ని 12మిలియన్ల d.v.d.లనుచేసి  పంచి పెట్టాం .అమెరికా లో కూడా  వీటిని అందించే ఆలోచన లో ఉన్నాము .ఇది నెట్ లో లభించే టట్లు చేశాం .దాని ప్రకారం రోజుకు కేవలం 12 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు .అదే మిమ్మల్ని సరైన మార్గం లో ఉంచు తుంది .ఇంకా ఎక్కువ సమయం కేటా ఇంచే అవకాశం ఉంటె అలానే చేయ వచ్చు .”మేము బిజీ ,మాకు సమయం లేదు ”అను కొనే వారికే ఈ ”ఈశ క్రియ ”.ఇది క్రియ అని ఎందుకు అన్నాము అంటే దీనిలో ఉండటం ,శ్వాసించటం ,వికసించటం (be ,breatheand  blossom )అనేవి ఉన్నాయి కనుక .దీన్ని అందరు హాయిగా తేలిగ్గా చేయగలరు చేస్తున్నారు ప్రయోజనం పొందుతున్నారు కూడా .ఇది సరైన మార్గం లో పడ టానికి అతి తేలికైన మార్గం గా రుజువైంది .హాయిగా,తీరిగ్గా   కుర్చీ లో కూర్చుని చేయచ్చు .ధ్యానం మీద ధ్యాస పెట్టండి .అంతా చక చకా అదే జరిగి పోతుంది.స్విచ్ వేస్తె, బల్బు వెలిగి కాన్తినిచ్చి నట్లు .అదే మీకు మార్గ దర్శకత్వం చేస్తుంది .ఇందులో తెలీనిది అంటూ ఏమీ ఉండదు .నష్ట పోవటం జరగదు .ఏమి చేయాలన్న సందేహాలే మీ దేహానికి రావు .ప్రతి క్షణం లోను మిమ్మల్ని ముందుకు దారి చూపి నడిపిస్తుంది .
The Githa song
” The hollow bamboo can turn the passing wind into a sweet song
one filled with its own sap will be mute and dumb
when all of creation laughs and sings
if the hum of life’s sweet song has to be heard empty
Empty your self of your self
The sweetness ,the melody ,and the fragrance of the Divine Song shall be you
when you let yourself be absorbed in to the divine will ”–     Sadguru Vasu Deva
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9

  శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9
21–”తటిల్లెఖా తన్వీం ,తపన శశి వైశ్వానర మయీం –విషన్నానాం ,షన్నా మప్యుపరి కమలానాం తవ కలాం
మహా పద్మాటవ్యం ,మ్రుదిత మలమాయేన మనసా –మహాన్తః పశ్యంతో దదతి ,పరమాహ్లాద లహరీం ”.
తాత్పర్యం –హ్లాదినీ !మెరుపు తీగ లాగా సూక్ష్మమై ,పొడవైనదై,ఆజ్ఞా మొద లైన పన్నెండు వరకు క్షణ విలాసనం కలిగి,సూర్య ,చంద్రాగ్ని సార మైన ది అయిన ,పరాఖ్య ఐన నీ కళను ,ఆరు పద్మాల పై ,సహస్రారం అనే మహా పద్మ వనం లో కూర్చున్న దాన్ని ,అవిద్యా మొద లైన అహంకారాలు ,మాయ లేని మనసు తో ధ్యానించే సజ్జనులు పరమా నంద ప్రవాహ మయులై విల సిల్లు తున్నారు .
విశేషం –ఇది ఉత్తమాధి కారు లైన సాధకుల లక్షణం .కింది నుండి పైకి ,విద్యా పంచాదశాక్షరాలను ఒక దానితో ఒకటి లయం అవుతూ ,15వదిఅయిన మూడు బిందువులతో కూడిన త్రికోణం లో లీన మయ్యే ధ్యాన విధానం ఇప్పుడు చెప్పబడినది అంతా .బిందు త్రయం ,సోమ ,సూర్య ,అనలాత్మకం .సూర్యుడు అగ్ని లో ,అగ్ని చంద్రుని లో ,సోముడు ”స” తో కూడిన పదార్ధ కళ లో ( సకారానికి హకారం లో )లీనం కాగా ,సాధకుడు శివ శక్తి మేళ వింపు లో సదా శివుని లో ఐక్యమై ,జీవన్ముక్తుడు అవుతున్నాడు.
శ్రీ దేవి నే ”తపన ,శశి ,వైశ్వానర మయీ ”అంటారు .సోమసూర్య అగ్ని లయాత్మకం అని భావం .అంటే అవన్నీ ఆ పర దేవతే అని అర్ధం .వారికి విడి గా ప్రత్యెక మైన ఉనికి లేదు అని భావన .”షన్నాం ఉపరికమలానాం విషన్నాం”అంటే ఆరు కమలాల పైన ఆసీన అయిన అమ్మవారు .సహస్రార ,పద్మా రూఢ ,పరాకార రూపా ,చంద్ర కళా అయిన శ్రీ దేవి ని ధ్యానించి ,బ్రహ్మానందాన్ని పొందుతున్నారు సాధకులు .
22—” భవానీ త్వం ,దాసీ మయి ,వితర దృష్టిం స కరుణా –మితి స్తోతుం ,వాంచన్ ,కధ యతి ,భవానీ ,త్వ మితియః
తదేవత్వం .తస్మై ,దిశసి ,నిజ సాయుజ్య పదవీం –ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం ”
తాత్పర్యం –కరుణా మయీ !నీ కరుణా కటాక్షం నా పై ప్రస రింప చెయ్యమని ఎవరు స్తోత్రం చేస్తారో ,నిన్ను ”భవానీ – నీవు ”అనే రెండు మాటలు అనే లోపే బ్రహ్మా ,విష్ణు మొద లైన దేవతల కిరీటాల మణు లతో ,నీరాజనం చేయ బడే నీ పాద పద్మాలు కలది అయిన సాయుజ్య పదవిని వానికి అనుగ్రహిస్తావు .అంత త్వరగా నీ అనుగ్రహం నిన్ను నమ్మిన వారికి కలుగుతుంది .
విశేషం –”త్వం ”అంటే త్వమేవాహం అనే మహా వాక్య ప్రయోగమే .అంటే జప ,తపాల కంటే ,తాదాత్మ్యం అనే సంభావనే ఫలితాన్నిస్తుంది .బ్రమాదులు కూడా పాదార్చకులు గా ఉంది ,సాయుజ్య లాభం లేకుండా ,నిల్చి ఉన్నారని భావం .సకల మనో రధాలను శ్రీ దేవియే అనుగ్ర హిస్తుంది .పరమాత్మ లోకం చేరతానని సా లోక్య ముక్తి అంటారు .సన్నిధి లోకి చేరటం సామీప్య ముక్తి .పరమాత్మ తో సమాన రూపం పొందటం సా రూప్య ముక్తి .పర మాత్మ లో ఐక్యం అవటం సాయుజ్య ముక్తి .
ద్వైతులకు సామీప్య ముక్తి ఉత్తమం .వశిష్టా ద్వైతులకు సారూప్య ముక్తి శ్రేష్టం .అద్వైతులకు సాయుజ్యమే ముక్తి మోక్షం .దీనినే శ్రీ శంకరులు” శివా నంద లహరి ”లో వివరించారు ”సాలోక్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే –సామీప్యం ,శివ భక్తీ దుర్య జనతా సాంగత్య సంభాషణే–సారూప్యం ,చ ,చరా చరాత్మక ,తను ధ్యానే ,భవానీ పతేహ్  –సాయుజ్యం  ,మమ చిత్ర మత్రా భవతి స్వామిన్ ,క్రుతార్దో స్మ్రుహం ”.
సశేషం –27-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

జెనె టి( ట్రి)క్ కోడ్

జెనె టి( ట్రి)క్ కోడ్ 
జీన్సు కు సంబంధించిన కోడ్ ను జెనెటిక్ కోడ్ అంటారు .కోడ్ అంటే ఒక పరి భాష లేక చిహ్నం గుర్తు .డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్ (ది.యెన్.ఏ.)అణువు  మీద జీన్ ను చిత్రించ వచ్చు .అది  కోడ్ ఉన్న సంకేతాలను ప్రోటీన్ ను సిన్తేసిజ్ చేయటానికి ఉప యోగపడుతుంది . .ప్రోటీన్లు అంటే జీవం ఉండటానికి అవసర మైన అనేక పనులను చేసే మాలిక్యూల్సే .జెనెటిక్ కోడ్ అనేది పరిణామానికి సంబంధించిన సమస్తమూఅన్న మాట. .భూమి మీదఅనేక జీవ రాసులు ఒకే రక మైన జెనెటిక్ కోడ్ ను ఉపయోగించుకొంటాయి  ఇది సృష్టి చిత్రం .జెనెటిక్ కోడ్అనేక రంగాల్లో  ఉపయోగ పడుతోంది .మనుష్యులలో లక్షణాలను మార్చు కోవటానికిది సహక రిస్తోంది . అనేక విధాల ఆకారాలేర్పడటానికి కారణం అవుతోంది .జెనటిక్ ద్వారా మార్చ బడిన బాక్టీరియా ,మొక్కలు ,జంతువులను మందులు తయారు చేయ టానికి ఉప యోగిస్తున్నారు .తేనె టీగల తో వ్యాధి నిరోధక శక్తిని పెంచు తున్నారు .మార్పు చెందించిన ఈస్టు తో బాంబుల ఉనికి ని కనుక్కొంటున్నారు .జెనెటిక్ కోడ్ నుపయోగించి వ్యాధులను నయం చేసే కొత్త మార్గాలను కనుగొన్నారు .
2007లో”uni versity of copenhogins కు చెందినా  eske Willerslevశాస్త్ర వేత్త అతి శీతలం లో పాతి పెట్ట బడిన బాక్టీరియాసామ్ పుల్సు   ఏ మాత్రమూ తమలక్షణాలను కోల్పోలేదు అని గ్రహించాడు . అతి  ప్రాచీన కాలం నాటిబాక్టీరియా కూడా అతి శేతల పరిస్తులలోను జీవం కోల్పోదని రుజువయింది  .  . సుమారు అయిదు లక్షల సంవత్స రాల క్రిందటిబాక్టీరియా అతి శీతల వాతా వరణం లో కూడా చైతన్య వంతం గా ఉంటుందని గ్రహించారు .దీని వల్ల   భూమికి అవతల కూడా జీవం ఉంది అని తెలుస్తోంది .కనుక కుజ  గ్రహం లోను ఈరోపా గ్రహం లో మైక్రోబులు సజీవం గా ఉన్నాయని నిర్ణ యించారు .అవి అక్కడ సబ్ జీరో ఉష్ణోగ్రత వద్ద దాగి ఉన్నాయని నిర్ధారించారు .
dna . లాగా ,mt dna అనేది ప్రత్యెక మైనది కాదని చెబుతున్నారు . mt dna తల్లి తరఫున బంధువుల్ని గుర్తించ గలుగు తుంది .అంటే అన్నా ,సోదరి తల్లి ,ఆమె సంతానం అని అర్ధం .ఇది తల్లి నుంచే సంక్రమిస్తుందని తేల్చారు .mitochondrial dna నేmt dna అంటున్నారు . mtఅనేది మదర్ కు గుర్తు .రాలిన జుట్టు ,ఎముకలు ,పళ్ళు ,బూడిద లను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యెక పరిస్తితుల్లో పరి శోధిస్తేmt dna  రహస్యం తెలుస్తుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు .వ్రేలి ముద్రలు కూడాmt dna ను తెలుప గలవు .దీనితో కొత్త రక మైనపద్ధతులలో  నేరాలు ఘోరాలను చేదిస్తున్నారు . దీనికో ఉదాహరణ ను తెలుసు కొందాం .జెస్సీ జేమ్సు అనే సంఘ విద్రోహిని ,అతని సోదరుది  గాంగు కు చెందినా రాబర్టు ఫోర్డు జిమ్సును తల వెనుక వైపు పిస్టల్ తో కాల్చి చంపాడు .(1882 ఏప్రిల్ ౩).అతని శవం మిస్సోరీ లోని  కీర్నే లోని జెస్సీ పుట్టినఇంటికి చేరింది .వాళ్ల పొలం లో నే పాతి బెట్టారు .ఎవరో  అనుకోని ఫోర్డు అనే వాడు జేమ్సు ను కాల్చి చంపాడని ప్రజలు గుస గుస లాడారు .సరే -పరి శోధకులకు చేతి నిండా పని .సమాధి త్రవ్వి తీసి జేమ్సు రెండు పళ్ళను ,రెండు జుట్టు వెంట్రుకలను తీసి పరి శోధించారు .జేమ్సు తలిదండ్రుల  బంధువుల mtdna  లతో  పోల్చి చూశారు .పోలికలు సారిగా సరి పోయాయి .అవి జేమ్సువే అని రుజువైనాయి .ఈ విధం గా mt dna.నెర పరి శోధనకు బాగా ఉప యోగ పడుతోంది .
కుడి చేత్తో రాసే వారికి మెదడు లో ఎడమ వైపు మాట ,భాష లను నియంత్రిస్తుంది .కుడి వైపుది ఎమోషన్లను రెగ్యు లేట్ చేస్తుందని తెలుసు కొన్నారు .ఎడం చేత్తో రాసే వారికి ఇదంతా రివర్సు గా ఉంటుంది .పుర్రచెయ్యి వాటం వారిపై  lrrtni ప్రభావం ఎక్కువ గా ఉంటుందట .ఇదే మెదడు లో వ్యస్తత్వ పరిస్తికి కారణం అవుతుందన్ కనుగొన్నారు .
burkolderia mallie అనే ఒక రకం బాక్టీరియా ”గ్లాన్దర్సు ”అనే వ్యాధికి కారణం .ఈ వ్యాధి గుర్రాలకు ,గాడిదలకు  ,కంచర గాడిదలకు ఎక్కువ గా సోకు తుంది .దీని వల్ల శ్వాశ కోశం లో పుండ్లు ఏర్పడి  క్రమం గా రక్తం లో చేరి చావుకు కారణ మవుతుంది .ఈ బాక్తెరియా గోడ్లకే ఎక్కువగా సోకినా మనుష్యులకూ చేరా టానికి ఆవ కాశం ఉంది .దీంతో తీవ్రమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ..ఈ బాక్టీరియా నే పూర్వ కాలమ్ లో జీవ ఆయుధం గా అంటే బయ లాజికల్ వెపన్ గా ఉపగోగించి ఉండ వచ్చు అని అను మానిస్తున్నారు .అమెరికన్ సివిక్ వార్ లో కాన్ఫెడే రేట్ సైన్యం ఈ జబ్బు సోకినగుర్రాలను వదిలేసి పారి పోయారట .మొదటి ప్రపంచ యుద్ధం లో సైనికులకు సరఫరా చేసిన గుర్రాలకు ,కంచర గాడిదలకు ఈ వ్యాధి శోకించి పంపే వారట .రెండవ ప్రపంచ యుద్ధం లో కూడా ఈ బాక్టీరియా తో గుర్రాలను ,సైనికులను చంపినట్లు ఆధారాలున్నాయి .
జెనెటిక్ కోడ్ ద్వారా తెలిసిన విషయాలు -ఒక జీన్ ఒక ప్రోటీన్ ను సింత సైజ్ చేస్తుంది .dna లో జీన్సు ఉంటాయి ..అనేక చైన్ చర్యల వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా నిలవ చేయ బడుతుంది .
the julius saesar cipher —   46 b.c.లో జూలియస్ సీజర్అనే రోమన్  చక్ర వర్తి అంతకు ముందు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలను సాధించాడు .అతడు తన సైన్య నాయకులకు రహస్య కోడ్ లను పంపే వాడట .అవి ఆయనకు ,ఆ ఆఫీసర్లకు మాత్రమే తెలిసేవి .దీన్నే  ”యెన్  క్రిప్షన్ ”అంటారు ..అక్షరాలకు ,సంఖ్యలకు ప్రత్యెక చిహ్నాలుప యోగించాడు .దాన్ని పూర్తిగా చెప్పాలంటే ”Caesar created a cipher alphabet by replacing each letter in his message with a letter found 3places to the right in the plain alphabet .abcdefgh ,jkl లను సీజర్ సైఫర్ లోdefghijklmno  గా మార్చేశాడు furwwnkhulyhuqrz   అని కోడ్ పంపితే ”cross the river ”అని అర్ధం .ఇవాల్టి కోడ్ భాష అంటే”en scription ” ను సీజర్ పేరుతోనే” caesar cipher ”అని గౌరవం గా పిలుస్తున్నారు .
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -09 -12 -కాంప్ –అమెరికా .

Posted in రచనలు | Tagged | Leave a comment