వా యు రాణి- ఎమీలియా ఎర్హార్ట్

వా యు  రాణి- ఎమీలియా ఎర్హార్ట్  
ఆమె అట్లాంటిక్ ,ఫసిఫిక్ మహా సముద్రాలమీదుగా విమానాన్ని నడిపిన మొదటి మహిళా ,అమెరికా దేశం అంతా స్వంత విమానం లో చుట్టి వచ్చిన మొదటి మహిళా పైలట్ ,ఆకాశం లో అధిక ఎత్తు  లో రికార్డు స్తాయి లో విమానాన్ని నడిపిన మొదటి మహిళ ,ఇన్ని రికార్డులను నెలకొల్పి ,ప్రపంచం అంతా చుట్టి వచ్చిన మొదటి మహిళా కావాలనే ధ్యేయం తో బయల్దేరి గమ్యానికి కేవలం వంద మైళ్ళ దూరం లో ఉండగా .ఆమె విమానం కనిపించకుండా పోయి మిస్టరీ గా మారి,అమెరికా వాయు  రాణి అని పించుకొన్నమహిళా పైలట్  అమీలియా ఎర్హార్ట్ హిస్టరీ ఇది .
అమీలియామేరీ  ఎర్హార్ట్24-7-1897 న అమెరికా లోని కాన్సాస్ రాష్ట్రం లో ఆచిన్సన్ లో జన్మించింది .ఆమె పుట్టి నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వెలిసింది .తల్లి అమీ ఓటిస్14,110 అడుగుల ఎత్తున్నరాకీ పర్వతాలలోని  పైకేస్ పీక్ ను అధిరోహించి రికార్డు నేల కొల్పిన మొద టి మహిళ .తండ్రి ఎడ్విన్ స్టాన్తాన్.చిన్నప్పుడే తాత అమ్మమ్మల ఇంటికి వెళ్లి అక్కడి గుర్రాలను ఎక్కి స్వారీ చేయటం ,కొండ గుహల్లో తిరగటం అలవాటు చేసుకోండి .అయితే ఆమెను రూల్లెర్ కాస్టర్ ఎక్కి తిరగటాన్ని ఒప్పుకోలేదు .బాస్కెట్ బాల్    ఆడేది .స్లెడ్జి ల పై చక్కగా నడిచేది గుర్రపు కాళ్ళ మధ్య నేర్పుగా స్లెడ్జి పై జారటం నేర్చింది .
తండ్రి రైల్  కంపెని లో ఉద్యోగి .అందుకని ఫ్రీ గా వీలైన ప్పుడ ల్లా కుటుంబం తో ప్రదేశాలు తిరిగి చూసే అవకాశం వచ్చింది .ఆయనకు ఉన్న కార్ లో కిచెన్ ,భోజనాల గది  ,వంట వాడు ఉండే వారు .తండ్రి బాగా తాగుబో తు  .అందువల్ల ఉద్యోగ భద్రత ఉండేది కాదు .ఈమె అమ్మమ్మ తాత చని పోవటం తో తల్లికి ఆస్తి బానే సంక్రమించింది .తండ్రి మిన్న సోట లో రైల్  క్లెర్క్ గా పని చేయాల్సి వచ్చింది .కుటుంబం మిస్సోరి లోని మిన్నే సోటా కు మార్చాడు .అక్కడి నుంచి చికాగో వెళ్లి ఉన్నాడు .అక్కడ ఎమీలియా బేస్ బాల్  టీం లో చేరి ఆడింది .కుటుంబం పెనిసిల్వేనియా కు చేరింది .అక్కడ రైడాల్ లోని ogantz school లో చేరి చదివింది .ఇట్లా ఊళ్లు తిరగటమే సరి పోయింది చిన్న తనం అంతా .అక్కడ హాకీ నేర్చింది అక్కడి alpha phi టీం ఈమెను తమ టీం లోకి ఆహ్వానించి ఆడమన్నారు .ఈమెకు మొదటి నుంచి సంప్రదాయ విధానాలు నచ్చేవి కావు .స్థానిక రెడ్ క్రాస్ కు సెక్రెటరి గా పని చేసింది .
1917 లో టోరంటో లోని సోదరి దగ్గరకు వెళ్ళింది అప్పుడే యుద్ధ భీభత్సాన్ని కళ్ళారా చూసింది .రెడ్ క్రాస్ లో ఉన్న ఎమీలియా సైనికుల కోసం స్వెట్టర్లు అల్లి అంద జేసింది గాయ పడిన సైకులకు సాయం చేసింది .ఇదంతా మనసును కలచి వేసింది .అందుకని మళ్ళీ స్కూల్ లో చేరి చదవటానికి మనసు అంగీకా రించ లేదు .ఒక నర్సు దగ్గర సహాయకురాలిగా పని చేసింది .ఆమ్బులన్స్ బ్రిగేడియర్ లో వాలంటరీ చేసింది .తర్వాతా స్పాడినా మిలిటరి హాస్పిటల్ కు వచ్చి యుద్ధం లో అసహాయు లైన వారికి సేవ లందించింది .అందులో ”షెల్ షాక్ ”తో బాధ పడ్డ వాళ్ళు ,ఉండే వారు .వారి మానసిక పరిస్తితి వింత గా ఉండేది. రోజుకు పన్నెండు గంటలు పని చేసేది .ఉదయం యేడు నుండి రాత్రి యేడు వరకు ఆమె డ్యూటి .సోదరి తో ఖాళీ సమయాన్ని గడిపేది .అక్కడ గుర్రపు సవారీని ఇద్దరు బాగా చేసి ఆనందాన్ని పొందే వారు .అమీలియా గుర్రం పేరు ”డైన మైట్”.వీరున్న చోటికి దగ్గరే విమానాలు నడిపే ట్రైనింగ్ సెంటర్ ఉంది .అక్కడి ఆఫీసర్ ఈమె ఉత్సాహాన్ని చూసి విమానాలు ఎగరటం వచ్చి చూడమన్నాడు .అలా చూస్తూ విమాన యానం పై అభిమానం బాగా పెంచుకోంది  .ఈమెకు సైన స్  బాధ ఉండేది .దానికి ఆపరేషన్  చేయించు కొంది
టోరంటో వదిలి మాసా చూసేట్స్ లోని నార్త్ ఆంప్ టన్  కు చేరింది .అక్కడ తల్లి సోదరి ఉన్నారు . ఆటో మోటివ్ మేషిన్ ట్రైనింగ్ పొందింది .డాక్టర్ కావాలన్న ఆలోచన కలిగింది .న్యూయార్క్ వెళ్లి కోంబియా వర్సిటి లో చేరింది .అక్కడి సంగీత కచేరీలకు వెళ్ళేది .గుర్రపు స్వారి చేసేది .యూని వేర్సిటి లోని ఎత్తైన బిల్డింగ్ టాప్ ఎక్కి అందర్ని ఆశ్చర్య పరిచింది .అకస్మాత్తు గా వర్సిటి చదువు మానేసి కాలి ఫోర్నియా లోని తలి దండ్రుల దగ్గరకు చేరింది .
                           విమాన యానం 
కా ఫోర్నియా లో అప్పటికే విమాన యానం బాగా ప్రాచుర్యం పొందింది .అక్కడి లాంగ్ బీచ్ దగ్గరున్న daughert field లోని ఎయిర్ మీట్ కు హాజరైంది .అప్పుడే పైలట్ కావాలి అన్న ఆశయం మనసు లో మెదిలింది .అక్కడి అది కారులతో మాట్లాడి ఆమె తండ్రి ఈమెను విమానం ఎక్కించి చక్కర్లు కొట్టించే ఏర్పాటు చేశాడు .ఆది అద్భుతం అని పించిన్దామెకు .పైలట్ శిక్షణ తీసుకోవాలను కొంది .చాలా ఖర్చు తో కూడిన పని ఆది .ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నేర్చుకోవాలను కొంది .మహిళా పైలట్ అయితే బాగా నేర్పు తుందని భావించింది .అక్కడ ఇరవై నాలుగేళ్ల ”నేతా స్నూక్” అనే ఆమె నేర్పటానికి అంగీకరించింది .1920 decembar లో గ్లేన్దేల్ లోని కిన్నెర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొంది .స్నూక్ దగ్గరుండి నేర్పాలి గాలిలో ఉన్న ప్రతి నిమిషానికి ఒక డాలరు ఆమె కు ఇవ్వాలి .అప్పటికే యుద్ధం లో దాచుకొన్న libertyబాండ్లను ఉపయోగించి ఆమె బిల్లు చెల్లించింది 1921 january 3న మొదటి లెసన్ ..ఐరో డైనమిక్స్ మీద పుస్తకాన్ని తన దగ్గర ఉంచు కొంది .ముందు భూమి మీడదే విషయాలన్నీ నేర్పింది .ఆరు నెలల శిక్షణ తర్వాతా స్వంత విమానాన్ని రెండు వేల డాలర్లు పెట్టి కొనుక్కోన్నది .అదే ఎల్లో కిన్నెర్ ఐర్స్తేర్ .దాన్ని ఆమె” ది కానేరి ”అని ముద్దుగా పిల్చుకోన్నది .ఒక టేలి ఫోన్ కంపెని లో కూడా పని చేసింది .లక్ష్య సాధనానికి ఎన్ని తంటాలు పడాలో అన్నీ  పడింది .ఇంకా ఒంటరిగా విమానం నడపటం సాధ్యం కాలేదు .స్టంట్ ఫ్లైయింగ్ ,బ్యాంక్స్ ,బారెల్ రోల్ల్స్ ,లూపస్ లలో ప్రాధమిక విషయా లన్నీ నేర్చింది .అన్నీ నేర్చిన తర్వాతామొదటి సారిగా ఒంటరిగా విమానం నడిపి 5000అడుగుల ఎత్తుకు యెగిరి దిగింది .
                            మొదటి రికార్డు 
ఎమీలియా కు నేర్పిన స్నూక్ వివాహం చేసుకొని ఉద్యోగం మానేసింది .ఇక బాధ్యత అంతా ఈమె మీదే పడింది .ఆమెను గురించి స్తానిక పత్రికలన్నీ పెద్ద పెద్ద ఫోటో లతో గొప్ప గా రాశాయి .1922 october 22 న తన ఐర్స్తేర్ విమానం ఎక్కి ఒంటరిగా ఆకాశం లో విహరించి వీలైనంత ఎత్తుకు ఎగిరింది .బారో గ్రాఫ్ ను సీల్ చేయించింది .చివరికి చూస్తె తాను 14000అడుగుల ఎత్తు న ఉన్నట్లు గమనించింది ఇది అంతవరకు యే మహిళా పైలట్ కూడా చేరని ఎత్తు  .అంటే అమీలియా రికార్డు స్తాపించిందన్న మాట .వీరి కుటుంబం నవేడా లోని జిప్సం మైనింగ్లో పెట్టు బడి పెట్టిన డబ్బు కు ప్రతి ఫలం లభించలేదు .ఇదో నిరాశ .
సోషలిస్టు భావాలున్న industrial workers of the world  కు మిత్రులతో హాజ రింది .అక్కడ అరవై ఏళ్ళు దాటినా వారందరికి పెన్షన్ ను ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేశారు .1923 may 16న ఎమీలియ కు ఫ్లయింగ్ సర్టిఫికేట్ చేతికి వచ్చింది .తన విమానాన్ని అమ్మేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది .ఒక ఫోటోగ్రాఫ్ స్టూడియో లో ఉద్యోగం లో చేరింది .తర్వాతా తానే స్వంతం గా ఫోటోలు తీయటం అమ్మటం నేర్చింది .మళ్ళీ కొత్త విమానాని కొనుక్కోంది .మళ్ళీ సైన్స్ ఆపెరేషన్ చేయించు కోవాల్సి వచ్చింది పాపం .విమానాన్ని అమ్మేసి ఇంకోటి కొంది దీనికి కిజేల్ (ఎల్లో పెరిల్ )అని పేరు పెట్టింది .తల్లి తో 7000మైళ్ళు విమానం లో ప్రయాణం చేసి బోస్టన్ చేరింది .మళ్ళీ సర్జరీ అవసరమై చేయించింది .తర్వాత న్యూయార్క్ వగైరాలు తిరగటం తో చేతిలో డబ్బు ఖాళీ .బోస్టన్ చేరి హార్వర్డ్ సమ్మర్ స్కూల్ లో లెక్కల కోర్సు లో చేరింది .                                      సాంఘిక సేవా కార్య క్రమాలు 
విమానం నడిపే దానిలో ఎక్కడా ఉద్యోగాలు రాలేదు .పొట్ట గడవాలి .డేనిసాన్ హౌస్ లో సోషల్ వర్కర్ గా పని చేసింది .అక్కడే syrian mother’s club స్తాపించి ,సిరియా నుంచి వచ్చిన వలస దారుల పిల్లలకు చదువు కొనే వీలు కల్పించింది .చైనీస్ ఆడ పిల్లల తో బాస్కెట్ బాల్ ఆడించింది .ఆ హౌస్ కు డైరెక్టర్ అయింది .బోస్టన్ లో జరిగే జాతీయ బోస్టన్ సెటిల్ మెంట్స్ సమావేశానికి ఎమీలియా ప్రతినిధి గా ఆహ్వానాన్ని పొందింది .1927లో బోస్టన్ నగరం పై విమానం లో ఎగురుతూ మెమోరియల్ డే కు ఫ్రీ పాస్సేస్ ను వేద జల్లింది .
               వెతుక్కొంటూ వచ్చిన అవకాశం 
హరాల్డ్ దేన్నిసన్ అనే ఆయన కు మాసా చూసేట్స్ లో ఒక విమానాశ్రయాన్ని నెలకొల్పే ఆలోచన కలిగింది .అమీలియా ను సంప్రదించాడు .ఈమె బోస్తానియాన్ పత్రిక లో మహిళా పైలట్ల గురించి మంచి వ్యాసం రాసింది ఇంకా ఎక్కువ మంది విమానాలు నడపటానికి ముందుకు రావాలని కోరింది .చార్లెస్ లిన్డెర్ బెర్ఘ్ మొదటి సారి అట్లాంటిక్ ను దాటినప్పటి నుండి అమీలియా కు తానూ దాన్ని సాధించాలన్న కోరిక పెరిగింది .1928 april 7న ఆమెకో ఫోన్ వచ్చింది .అందులో ఆమె అట్లాంటిక్ సముద్రాన్ని దాటే విమానం నడ ప టానికి ఆహ్వానం వచ్చింది .వెంటనే న్యు యార్క్ వెళ్లి జార్జి పుత్నాం ,డేవిడ్ లెమన్ లను కలిసింది ఆ ప్రయాణానికి స్పాన్సర్ అయిన amy phipps guest కు బదులు ఈమె ప్రయాణం చేయాలి పుస్తక రూపం లో లెక్చర్ల రూపం లో వచ్చిన ధనాన్ని గెస్ట్ కు ఇచ్చేయాలి .అదీ ఒప్పందం .సరే నంది అమీలియా .ఫ్రెండ్ షిప్ అనే విమానాన్ని నడపాలి .జూన్ మూడు న బోస్టన్ నుంచి న్యు ఫౌంద్ లాండ్ ,కెనడా మీదుగా నోవా స్కాతియా లోని హాలిఫాక్స్ విమానాశ్రయం చేరింది .అక్కడి నుంచి వేల్స్ లోని బారీ పాయింట్ చేరి ప్రయాణాన్ని విజయ వంతం గా ముగించింది . పేపర్లన్నీ విజయ గీతికలు పాడాయి ఆమెను ”లేడీ లిన్దెర్ బెర్గ్  ”అని పొగిడారు .అట్లాంటిక్ ను దాటిన మొదటి మహిళా గా రికార్డు సాధించింది .వేల్స్ లో చాలా కాలం ఉన్న తర్వాతా ఇంగ్లాండ్ కు వెళ్ళింది .అందరు తనను పొగుడుతుంటే ”నేను ఒక ప్రయాణీకు రాలను మాత్రమె ”అని చెప్పింది .అమెరికా కు తిరిగి వచ్చి ఎంతో అభిమానాన్ని సంపాదించింది .ఆమె ను lady Lindy ” ”the queen of the air ”అని గౌరవం గా పిలిచారు .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ఆమె కు వీరోచిత స్వాగతం పలికాడు .న్యు యార్క్ సిటి తాళం చెవిని ఇచ్చి గౌరవించారు .ఆమె అమెరికన్ హీరోయిన్ అయి పోయింది .ఇది చారిత్రాత్మక సత్యం .అనేక సభలు సమావేశాలలో మాట్లాడి ఎందరికో స్పూర్తి కలిగించింది ..ఎంతో డబ్బు చేతికి వచ్చింది. అప్పులన్నీ తీర్చేసింది .
              రికార్డులే రికార్డులు 
పుట్నం ను వివాహమాడాలని నిర్ణ యించింది . .లేడీ హీత్ నుండి విమానాన్ని కొని న్యు యార్క్ నుంచి అతని తో తో బయల్దేరింది .కాని పిట్స్ బర్గ్ లో ఆది దొర్లి పోయింది .ఇంగ్లాండ్ నుంచి తగిన పరికరాలు తెప్పించి బాగు చేయించాడు పుత్నాం .1931లో పుత్నాం ను పెళ్లి చేసుకోంది .ఆ తర్వాతా 19000అడుగుల ఎత్తుకు విమానాన్ని నడిపి రికార్డు నేల కోల్పింది .తాను మొదటి సారి అట్లాంటిక్ ను దాటినా స్వంతం గా స్వంత విమానం లో దాట లేదనే బాధ ఆమెలో ఉంది .ఆ కోరిక 1932 లో తీరింది .ఒంటరిగా అట్లాంటిక్ ను నాన్ స్టాప్ గా దాటి రికార్డు సాధించింది అమెరికా కాంగ్రెస్ ఆమెకు అత్యంత విలువైన ”the distinguished flying cross ”ను ప్రదానం చేసి గౌరవించింది .1932 లో ఫసిఫిక్ మహా సముద్రాన్ని ఒంటరిగా దాటి రికార్డు నేల కోల్పింది .ఈ రెండు సముద్రాలను దాటిన వారిలో మొదటి స్థానం  ఆమెదే .హనో లూలు నుండి కాలిఫోర్నియా లోని ఓకే లాండ్ కు చేరింది ఫసిఫిక్ మీదుగా .అంతకు ముందే అమెరికా అంతా తన విమానం లో చుట్టి వచ్చి మరో రికార్డు నెలకొల్పింది .మహిళా ల స్పీడ్ రికార్డు 2100మెయిల్లను సాధించింది .మెక్సికో నుండి వాషింగ్ టన్ కు 14గంటల్లో చేరి లిండ్ బెర్గ్ రికార్డును బద్దలు కొట్టింది .విమాన యన చరిత్రనే తిరగ రాసింది రికార్డులతో .అడిగిన చోటికల్లా వెళ్లి ఉపన్యాసాలు చేసి మొత్తం మీద సుమారు లక్ష మందిని ఆనందింప జేసింది .ఒక్కో సమావేశానికి మూడు వందల డాలర్లు వసూలు చేసింది .
                ప్రపంచం చుట్టాలనే తీరని కోరిక .
1935 లో purdue university  మహిళా ల ఉద్యోగ విషయాల డిపార్ట్ మెంట్ లో లెక్చరర్ ఉద్యోగం పొందింది .సాలుకు రెండు వేల డాలర్లు. ఆమె కు ఎయిరో  నాటిక్స్ లో రిసెర్చ్ చెయ్యాలనే సంకల్పం కలిగింది .దానికి విరాళాలు కావాలి. జనానికి తెలియ జేశింది .విరాల వెల్లువె వచ్చింది దానితో ఒక విమానాన్ని కొని ”flying laboratory ” గా మార్చాలనుకోంది .ఆమె”ameelia earhaart fund for aeronautical reserch ” అనే సంస్థను నేల కోల్పింది .” ఎలెక్ట్రా ”అనే రెండు ఇంజన్ల విమానాన్ని కొన్నది .దాని వేగం గంటకు 210మైళ్ళ అత్యంత వేగం .దాదాపు 27000అడుగుల ఎత్తు కు ఎగిరే సామర్ధ్యం దానిది .అప్పటికి అలాంటి విమానాలు ప్రపంచం లో ఇద్దరి వద్దనే ఉన్నాయి .ఒకటి అమీలియా దగ్గర రెండోది ఏవియేషన్ గురు అని పిలువా బడేhoward hughes  దగ్గరా మాత్రమె ఉన్నాయి .ఈ విమానం తో ప్రపంచ యాత్ర చేస్తూ విమానం లోని విషయాలను తెలుసుకొంటూ ,దేశకాల పరిస్తితులకు ఆది ఎలా నిలబడుతుందో గ్రహిస్తూ పర్యటన చేయాలని  ఆమె ఆశ .కాలి  ఫోర్నియా లోని ఓక్లాండ్ లో1937  february 12 ప్రపంచ యాత్రకు శ్రీ కారం చుట్టింది .తూర్పు పడమర లను కాలి  ఫోర్నియా నుండి హవాయి కి ప్రయాణించి రికార్డు నేల కోల్పింది .మియామి నుండి రెండో దశ ప్రారంభించింది .ఇండియా పాకిస్తాన్ ఐరోపా దేశాల్ని చుట్టింది .పసిఫిక్ సముద్రం లోని ”హౌలాండ్ ఐలాండ్ ”కు చేరితే ప్రపంచ యాత్ర సంపూర్ణం .అశేష జనం ఆమె కు స్వాగతం పలకటానికి ఆ ద్వీపం చేరారు .ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేసింది .కాని దురదృష్ట వశాత్తు ఇంకా వంద మైళ్ళు గమ్య స్త్నానికి దూరం గా ఉన్న సమయం లో అప్పటి దాకా వచ్చిన రేడియో  సంకేతాలు ఆగి పోయాయి .ఆమె విమానం ఎక్కడ ఉందొ తెలీ లేదు .అందరు కంగారు పడ్డారు .
ఎంత ప్రయత్నించినా విమానం జాడ లభించ లేదు .అమెరికా ప్రభుత్వం2,50 000 చదరపు మైళ్ళ విస్తీర్ణం అంతా వేదికించింది .65విమానాలు పర్య  వేక్షణ జరిపి వెతికాయి .10నౌకలు 4000మంది జనం అడుగడుగు గాలించి జల్లెడ పట్టినా విమానం మిస్టరీ గా అదృశ్య మైంది .బ్రిటన్, జపాన్ దేశాలు కూడా సహక రించాయి . 1937 july 18న అన్వేషణ ను నిలిపి వేశారు .ఆమెను రష్యా వాళ్ళు హైజాక్ చేసి తీసుకొని వెళ్లారనే ఊహాగానాలున్నాయి .కాని ఏదీ నిర్ధారణ కాలేదు .ప్రపంచ యాత్ర చేయాలన్న అమీలియా ఎర్హార్ట్ సంకల్పం చివరి క్షణాల్లో విఫల మైనా ఆమె చరిత్ర  సంకల్పానికి, ధైర్య సాహసాలకు పట్టు దలకు, సేవా నిరతికి ఆదర్శం గా నిలిచి పోయింది సమాజం లోని మౌధ్యాలను తిరస్కరించిన మహిళ ఆమె .”వాయు  రాణి ”అని అందరి చేతా ఆప్యాయం గా పిలిపించుకొన్న గగన విహారిణి ప్రాణ వాయువు అనంత గగనం లో కలిసి పోవటం బాధా కరం.
”.though she may gone from this world ,the spirit of Amelia Earhart lives on in any a person who looks out to the horizon and dreams that ,despite their circumstances ,they can fly higher ”.
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్–అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

జన వేమన –23 వేద దీక్ష

     జన వేమన –23
                                                          వేద  దీక్ష 

మంచి గురువు తన శక్తి సామర్ధ్యాలతో అ థ యోగ సాధన చేసి శిష్యుడి కష్టాన్ని చూసి దయతో ,స్వ శక్తి తో ఒక్క నిమిషం లో అసంప్రజ్నత సమాధి కల్గించి ,బ్రహ్మ సాక్షాత్కారం చేయించ గలడుఅని ”సద్గురు నాద ప్రసాదంబున క్షణమున రాజ యోగమున మనసు నాశము తోడనే ,నాశము గాలియు ”అని శివ తత్వ సారం తెలుపు తోంది .దీనినే తాంత్రికులు ”వేధ దీక్ష ”అంటారు .శిష్యుని దేహం లో ఉన్న షట్ చక్రాలను  గమనించి ,మంత్ర బీజాక్షర న్యాసం చేసి ,మోకాళ్ళు మొదలు ,నాభి ,హృదయం ,కంథం ,దవడ వరకు గురువు వేదిస్తాడు .వెంటనే శిష్యుడి పాపాలన్నీ నశించి ,బయటి వ్యాపారాలన్నీ నిలిచి పోతాయి .ఇంత బాధ పడటం వేమన కూ ఇష్టం లేడు .ఎవరికి వారు స్వయం గా నే సాధించాలనే కోరాడు .అందుకే ”వెర్రి గాను జూడ వేలుగేల్ల బారురా ”అన్నాడు .దీనికి ఆధారం గా ”బ్రహ్మ జంపి ,విష్ణు భాగంబులో గల్పి –విష్ణు జంపి ,శివుని వీరు గలిపి -శివుని జంపి తాను శివ యోగి గావలె ”అని త్రిమూర్తులకు అతీత మైన బ్రహ్మ జ్ఞానం పొందాలని చెప్పాడు .ఇవన్నీ తాను సాధించానని తెలియ జేయటానికి ”బ్రహ్మ వ్రాత కెదురు బల్కిన వాడును –ఆది విష్ణు సూత్ర మడచు వాడు –మూడు కనుల వాని మొనసి నిల్పిన వాడు -కాన బడరు నీవు కాని వేమా ”అని తన సామర్ధ్యాన్ని తెలుపు కొన్నాడు వేమన .
                        తాంత్రికులు 
తంత్రం అంటే పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన .మంత్రం ,బీజాక్షరాలు ,యంత్రాలు ,ముద్రలు పూజలు ,షట్ చక్ర భేదనం ,కుండలిని ,యోగం ఇవన్నీ కలిస్తే తంత్రం .ఇవన్ని బహి రంగం గా నే చేస్తారు .తంత్ర సాధన లో కొంత మంది మద్యం ,మాంసం ,మొదలైన ”పంచ మకారాలకు  ”ప్రాధాన్యత నిచ్చి ,రహస్యం గా సాధన చేసే వారిని ”తాంత్రికులు ”అంటారు .వీళ్ళూ అద్వైతులే .శక్తిని ముందు పూజిస్తారు .కనుక ”శాక్తేయులు ”అని అంటారు .శ్మశానం లో ఇలాంటి పూజ చేసే వారిని ”వామాచారులు ”అంటారు .వీరికి ”కులార్ణ వితంత్రం ”,”మహా నిర్వాణ తంత్రం ”అనే రెండు గ్రంధాలు పూజ నీయాలు .వాటి లోని తత్వాన్ని ఆచరిస్తారు .వేమన ”వేద విద్య లెల్ల వేశ్యల వంటివి –భ్రమల బెట్టి తేది పడగ నీవు –గుప్త విద్య ఒకటి కుల కాంత వంటిది ”అన్నాడు .వేమన తాంత్రికుడు అని కొందరు అంటే కాదు పొమ్మన్నారు మరి కొందరు .
                     వేమన భావ తీవ్రత 
విద్వాంశు లైన వారిని లక్శ్యం చేయ కుండా తన భావ తీవ్రత తో తేలిక పదాలతో హృదయాలకు హత్తు కోనేట్లు చెప్పాడు వేమన .ఎవరేమను కొంటారో నాన్న భయం లేని వాడు .ఒకరి మెచ్చు కోరని అచ్చ మైన కవి .అందుకే ”ఆదిమ కవుల వలె అల్పుండు ,తా నెరిగి -చెప్ప  లేదు తప్పు బట్టు –త్రోయ నేర్చు కుక్క దొంతులు బెట్టునా ”అని ఎద్దేవా చేస్తాడు .తాను చెప్పిన మాటల్ని ఎప్పటికైనా పండితులు అర్ధం చేసుకొంటారని ,పద్ధతి మార్చు కొంటారని ఆయనకు తెలుసు .”వేముడిట్లు చెప్పు వివరపు వాక్యముల్ –వేము డిట్లు పోవు వెర్రి పోక –పామరులకు నెల్ల ప్రతి పక్షమై యుండు -పండితులకు నెల్ల పరము వేమా ”అని వాళ్ళు తన దారి లోకి రావాల్సిందే ,కాలం వాళ్లనే దారికి తెస్తుంది అని నమ్మాడు .ఇంతకీ వేమన పద్యాలకు కవితా గుణం ఉందా ?ఉంటె ఎలాంటి గుణాలున్నాయి ?
”  ఒక వస్తువు గురించి తనకున్న భావాల్ని భాషతో ఇతరుల మనసుకు పట్టే టట్లు తెలియ జేయటమే కవిత్వం ”అన్నారు రాళ్ళ పల్లి వారు .ఈ కోణం లో ఆలోచించారు .కవిత్వం లో ముఖ్య జీవ ధర్మం ”ఇతరుల మనసుకేక్కటం ”.కవి ,,భాష ,వినే వాడు ఒక సహృదయ చక్రం .కవితన భావాలకు తగ్గ భాషను ఎన్ను కొంటాడు. ఆ భావం సంగ్రహం గా ,స్పష్టం గా సరళం గా ఉండాలి ,చెప్పాలి .వినే వాడికి సహృదయ గుణం ఉండాలి .యే భావాన్నైనా అనుభవించే సహజ సహ్రుదయత్వం ఉన్న వారిని సహృదయులు అంటారు .వారే ,తమ హృదయాలను మరచి కవి హృదయం తో చూడ గలరు .అంటే అహంకారంపనికి రాదు .అహంకారం అంటే నా సిద్ధాంతం ,నేను ,నాది అనే భావం .కనుక కవితో ఏకీభ వించి వింటే ,అనిర్వచనీయ మైన ఆనందం కల్గుతుంది .ఆది ప్రత్యక్ష సిద్ధం .ఇలాగే మమతను త్యాగం చేసి న సాయుజ్యమే మోక్షానందం .అని అనంత కృష్ణ శర్మ గారు అభి ప్రాయ పడ్డారు .అప్పుడే వేమన మనకు అర్ధమవుతాడన్నారు .ఆరాధనీయుడౌతాడు .అలాంటి సాయుజ్యానికి ఛందస్సు బాగా ఉపయోగిస్తుంది .ఛందస్సు కు లయ ప్రాధాన్యం .లయ అంటే క్లుప్తం గా ఉన్న  వివిధ శబ్దాల నడక.దీనికి మండించే గుణం ఉంటుంది .లయకు తీవ్ర భావం ,వెలువరించే భాషా తోడైతే త్రివేణీ సంగమమే .
వేమన కవిత్వం లో చాలా ముఖ్య మైనది భావ తీవ్రత .దీనికి కారణం భావాలన్నీ ఆయన స్వంతాలు కావటం .భావాలు స్వంతం ,సహజం అవటం వాళ్ళ భాషకు బిగువు ,బలం వస్తాయి .”భావం నీళ్ళు నిండిన పాత్ర .భాష ,దాన్ని పైకి లాగే త్రాడు ”అని చక్కని విశ్లేషణ చేశారు శర్మ గారు .వేమన కవిత్వం లో భావం భాష జమిలి గా పెన వేసుకొని పోయాయి .వేమన కవిత్వం లో అర్ధం కాని ఇంకో విషయం ఆటవెలది .”ఇంత చిన్న వృత్తం లో అంత గొప్ప భావాలను ,యతి స్తానాలను వదల కుండా ,వెనుక ,ముందు అతుకులు ,తిరుగుడులు లేకుండా కత్తి రించి నట్లు ఉన్న శబ్దాలతో ఎలా అచ్చు గుద్దాడో ?”‘అని మహా ఆశ్చర్యం కలిగిస్తుందని వేమన కవితా శైలికి జోహార్లు అర్పించారు రాళ్ళ పల్లి మహా నీయులు .తెలుగు ఛందస్సు లో ఆట వెలది చిన్నది .మిగిలిన ఛందాలలో రాసినా ”ఈ ముద్దు ,ఈ చెక్కిన చిక్కదనం ,ఈ బిగువు ,ఈ లగువు లేదు ”అని మురిసి పోయారు సహృదయ పండిత కవి విమర్శక సార్వ భౌములైన అనంత కృష్ణ శర్మాజీ .యతి స్తానానికి ”ఒక యతికి ఇచ్చిన గౌరవం ,మర్యాదా వేమన ఇచ్చాడు ”అని పొంగిపోతారు .తక్కిన యతి విషయం  లో యతి కనుక్కోవటం కష్టం ,వేమన్న యతి విషయం  లో పట్టు బట్టాడు .దాని స్తానం ,గౌరవం దానికి చ్చాడు .ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచాడు .అభిప్రాయం కూడా అక్కడే ఆగి నిలుస్తుంది ,అదీ వేమన ప్రత్యేకత .ఇంతకీ యతి అంటే?-లయాను సారం గా పాదం మధ్యలో ఒక చోట పదాన్ని ఉంచటమే యతి .
హాస్యం ,వ్యంగ్యం మేళ వించటం లో కవిత్వం హృదయ రంజకం ఆయి నది .”పాల సాగరమున పవ్వ ళించిన వాడు –గొల్ల ఇండ్ల పాలు కోర నేల ?”అని ప్రశ్నిస్తూ ”ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారికి తీపి ”అని ఆ దేవున్నె వాయిన్చేశాడు .కృష్ణుడిని ఏదో అన్నాడని ఎవరికీ కోపమే రాదు .దాన్ని అద్భుతం గా సమర్ధించాడు .ఆది మనకు ఆనందం ,నవ్వు తెప్పిస్తాయి .ఇదే వేమన కవి ప్రత్యేకత .ఇలాంటిదే ఇంకో పద్య చమత్కారం -”గుహల లోన జొచ్చి గురువుల వెదకంగా –క్రూర మృగ మొకండు తారసిలిన –ముక్తి మనియ ముందు గా జూపురా ”అని మనకు ముసి ముసి నవ్వులు కురిపిస్తాడు .వేమన సంగీత రాగాలలో ”తోడి రాగ మేల ”?అని ప్రశ్నించి దాని స్వారస్యాన్ని వివరించి చెప్పాడు .వేమన గురువు శివయోగి స్వర్ణ కార వ్రుత్తి వాడని అందరు భావించారు. వీళ్ళకు ”పశ్యతోహరులు ”అని కవితా పరం గా పేరుంది .అంటే మనం చూస్తూండగానే మన బంగారాన్ని హరిస్తారని భావం .పెద్దన గారే ఈ మాటకు సృష్టి కర్త .వేమన కూడా ”కంసలికిమించు కడజాతి లేదయా ”అని తీక్ష్ఞానం గా నే దూషించాడు .ఆ జాతి వారు అందరు అలాంటి వారు కాదు ,కొందరి చెడు వ్రుత్తి అందరికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పటమే ఇందులో వేమన ఉద్దేశ్యం .వేమన్న ను కూడా ఎవరో ఇలానే మోసం చేసి ఉంటారు .ఆది మనసు లో పడి బయట పెట్టి ఉంటాడు . .వాడి మూలం గా కులం అంతా నింద పడాల్సి వచ్చింది .అంతటి భావ తీవ్రత వేమన్నది .అందులో మంచి వారినీ మెచ్చు కొన్నాడు ”మొదట బ్రహ్మ ,మనువు మొనయ రెండు యముడు -మూడు త్వష్ట శిల్పి మొనయ నాల్గు –విశ్వ కర్మ నెగడె విశ్వజ్ను డైదింట ”అని విశ్వానికే బ్రహ్మలు గా విశ్వ బ్రాహ్మణులను కీర్తించాడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం

   అమెరికా డైరీ —
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత వారం 

సెప్టెంబర్ మూడు సోమ వారం నుండి తొమ్మిది ఆది వారం వరకు విశేషాలు
సెప్టెంబర్ మూడు అమెరికా లో ”లేబర్ హాలిడే”.అన్నిటికి సెలవే .అంతకు ముందు శని ఆది వారాలతో కలిసి సోమ వారం కూడా సెలవు అవటం తో దీన్ని ”లాంగ్ వీకెండ్ ”అంటారు .శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఎక్కడికో అక్కడికి కుటుంబం తో సెలవులకు వెళ్లి హాయిగా గడిపి వస్తారు .మంగళ వారం కోసూరు ఆదినారాయణ గారికి ఫోన్ చేశాను .వాళ్ళ కోడలికి ఒంట్లో బాగా లేదని ఆ కంగారు లో ఉన్నామని చెప్పారు .అప్పుడే మైనేని గారికీ ఫోన్ చేశాను .ఆయన అందు బాటులో లేరు .గురువారం రాత్రిఆదినారాయణ గారికి  మళ్ళీ ఫోన్ చేసి ఆయన కోడలి ఆరోగ్యం సంగతి వాకబు చేశాను .ఇప్పుడు బానే ఉందని ,టెన్షన్ తగ్గిందని ,సెప్టెంబర్ ఇరవై మూడు న ఇండియా ప్రయాణం అనీ చెప్పారు .సంతోషించాము .శుక్ర వారం రాత్రి మా ఇంట్లో భజన .రాత్రి ఎనిమిదింటికి ప్రారంభమై ఒక గంట జరిగింది .సుమారు పదిహేను మందే వచ్చారు .వచ్చిన వారి లో శ్రీ వల్లం  నరసింహా రావు దంపతులున్నారు .ఆవిడను చూస్తె ఉయ్యూరు లో నా దగ్గర చదువుకొన్న భాగ్య లక్ష్మి గుర్తుకు వస్తుంది .మంచి నవ్వు ముఖం, వర్చస్సు గోచరిస్తుంది .ఆ దంపతులకు సరస భారతి ప్రచురించిన ”మా అక్కయ్య ”కవితా సంకలనాన్ని కానుక గా ఇచ్చాను .చాలాసంతోషించారు .
      శ్రీ సత్య నారాయణ వ్రతం 
అమెరికా కు వచ్చిన కొత్త లోనే మా అమ్మాయి విజ్జి స్నేహితురాలు ప్రియా అనే అమ్మాయి తాము స్వంత ఇల్లు కొనుక్కున్నామని గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టమని ఇంటికి వచ్చి అడిగింది .అయితే ఇల్లు స్వాధీనం కావటానికి ఇంకా కొంత కాలం పడుతుందని చెప్పింది .నేను వైశాఖ మాసం లో ఒక ముహూర్తం పెట్టి పాలు పొంగించమని చెప్పాను .ఆ ప్రకారమే పొంగించి ,ఇల్లు స్వాదీనం  అయిన తర్వాత అందులో చేరారు .చేరిన తర్వాత  నన్ను సత్య నారాయణ వ్రతం చేయిస్తారా అని అడిగింది .ఎవ్వరూ లేక పోతే చెప్పు చేయిస్తాను అన్నాను .ఒక ఇరవై రోజుల క్రితంవచ్చిసెప్టెంబర్ ఎనిమిది శని వారం వ్రతం చేయించమని కోరింది .  ఏమేమి వస్తువులు కావాలో లిస్టు రాయించుకు వెళ్ళింది . ఈ శని వారం ఆమె భర్త వెంకట్ వచ్చి నన్ను ,మా శ్రీమతిని కార్ లో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లాడు అతనిది నెల్లూరు దగ్గర కావలి .ఆమెది గుంటూరు దగ్గర రేపల్లె .మంచిగా మర్యాద గా మాట్లాడాడు .ఇంటికి చేరే సరికి తొమ్మిదిన్నర అయింది .
ముఖ్య ద్వారం వద్ద ,వంటింట్లో ,పైన మేడ మీదదంపతులతో  కొబ్బరికాయలు కొట్టించి ,నవధాన్యాలను చల్లించాను .  సరిగ్గా పది  గంటలకు శ్రీ సత్య నారాయణ వ్రతం ప్రారంభించాం .అన్నీ శాస్త్రోక్తం గా యధా  విధి గా చేయించా.దంపతులిద్దరూ ఎంతో శ్రద్ధా శక్తులతో భక్తీ తో కూర్చుని  చేశారు .సుమారు రెండున్నర గంటలు పట్టింది . వెంకట్ స్నే హితుడు అతనితో ”ఎప్పుడో పెళ్లి నాడు చేసుకోన్నావు వ్రతం .మళ్ళీ ఇప్పుడే”అన్నాడు .దానికి వెంకట్ ”ఆ వ్రతం కంటే ఈ వ్రతాన్ని అంకుల్ చాలా బాగా చేయిస్తున్నారు ”అని ఆనందించాడు .అందరు చిన్నా ,పెద్ద చాలా బాగా చేయించానని ఎంతో సంతృప్తిని ,ఆనందాన్ని వ్యక్తం చేశారు .వాళ్ళ కళ్ళ లో ఎంతో సంతోషం వ్యక్తం అయింది .స్వామి అనుగ్రహం,సరస్వతి మాత కటాక్షమే ఇది .ఇండియా నుంచి ప్రత్యెక మైన చాలా ఖరీదైన పట్టు పంచె ,పట్టు చొక్కా గుడ్డ తెప్పించి తాంబూలం లో నాకు నూట పదహారు డాలర్లు పెట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రియా దంపతులు .ఇంకెవరికి బట్టలు పెట్టలేదు .వారి మనసు లో యే మంచి గొప్ప భావం ఉందొ తెలీదు .మా శ్రీ మతికి తాంబూలం లో వంద డాలర్లు పెట్టి ”ఆంటీ పట్టు చీరే కొనుక్కోండి ”అని ఎంతో ఆప్యాయం గా ప్రియ చెప్పింది .తమ తల్లిదండ్రుల్ని మాలో చూసుకోన్నారేమో అని పించింది .లేక పోతే ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదు .వాళ్ళేదో ఇస్తారనే ఆశ తో వ్రతం చేయించలేదు .మా అమ్మాయి మాట చెల్లించాను అంతే .మా అమ్మాయికి ,వాళ్ళ అమ్మకు చిన్న ఖరీదైన వెండి” శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాలు  ”బహూక రించింది .ప్రియా వాళ్ళ అన్నా వదినే కుటుంబం లూ విల్  నుండి వచ్చారు .అన్న ఇండియా వెళ్లి నప్పుడు విగ్రహాలు ,పట్టు బట్టలు తెప్పించిందట .మొత్తం మీద అందరికి వ్రత విధానం నచ్చి సంతోషం తృప్తి కనపరచారు .ఉదయం టిఫిన్ కాఫీ అందరికి ఇచ్చారు .ఆ తర్వాత.పూర్ణాలు, లడ్డు ,జిలేబి ,చక్ర పొంగలి , స్వీట్లు ,నాలుగు హాట్లు ,పప్పు, కూర లు ,చపాతీ ,పులిహోర ,అన్నం ,పెరుగు తో విందు .మేమిద్దరం రెండు స్వీట్లు ,పెరుగు అన్నం మాత్రమె తిన్నాం .పొద్దున్న టిఫిన్ కూడా ఇంటి దగ్గరే చేసి వచ్చాం .మా ఇద్దరికీ ఎంతో భక్తిగా నమస్కారం చేసి ప్రియా దంపతులు నిండు ఆశీర్వాదాలు పొందారు .వాళ్లకు ఇద్దరు ఆడ పిల్లలు .వ్రతానికి సుమారు అరవై మంది వచ్చి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లారు .
                   పిల్లల పిక్నిక్ 
ప్రియా వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దర్ని మా అమ్మాయి పిక్ అప్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చింది .ఆ తర్వాతానేను మా అమ్మాయి యార్క్ రోడ్ లో ఉన్న మక్.డోవేల్ వారి” nature preserve ”దగ్గర సాయి సెంటర్ వాళ్ళు పిల్లలకు ఏర్పాటు చేసిన పిక్నిక్ స్తలానికి వెళ్ళాం .మా మన వల్ల ను పొద్దున్నె  అక్కడ దింపి .ఆ తర్వాతా ప్రియా వాళ్ళింటికి వచ్చింది మా అమ్మాయి .మేం వెళ్ళే సరికే పిక్నిక్ దాదాపు అయి పోయింది .పెద్ద వాళ్ళ మీటింగ్ జరుగు తోంది . ఒక గంట అక్కడ గడిపాం .ప్రక్కనే ”వైలీ లేక్ ”ఉంది .పిక్నిక్ కు చాలా మంది వచ్చే ప్రదేశం .దట్ట మైన చెట్లు అందమైన సరోవరం అందులో బోటు షికారు కు వీలు ఉండటం తో జనం బాగా వస్తారు .ఈ లేక్ ఒడ్డునే ఎక్కడో చాలా దూరం లో అణుకర్మాగారం ఉందట .ఇంటికి  వచ్చేసరికి సాయంత్రం  ఆరు అయింది .మా అల్లుడు వారానికి రెండు రోజులు  నిర్వహించే ”వీక్లీ రీడింగ్ ”క్లాసులు ప్రారంభించాడు .ఆది వారం కొత్త విషయాలేమీ లేవు   .
ఈ వారం లో చాలా మంచి పుస్తకాలే చదివాను .political corruption ,global warming ,emily bronte ,the jungle ,pat conroy ,climate confusion ,humorists ,dublin వగైరా పుస్తకాలు చాలా బాగున్నాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-9-12-కాంప్ –అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –20 గ్లోబల్ వార్మింగ్ కు భయపడక్కర్లేదా ?

 అమెరికా ఊసులు –20   గ్లోబల్ వార్మింగ్ కు భయపడక్కర్లేదా ?
అక్కరలేదనే ”గ్లోబును గుద్ది ”మరీ చెబుతున్నారు Hunts ville   లో ని  యూని వేర్సిటి  ఆఫ్  అలబామా principal  research scientist  రాయ్ స్పెంసేర్ .ఆయన అనేక రిసెర్చి ప్రాజెక్టులను నిర్వహించారు .విస్కాన్సిన్ వర్సిటి నుండి meteorology లో ph.d.పొందారాయన .నాసా సంస్థ కు సీనియర్ సైంటిస్ట గా పని చేశారు .అంతే కాక అడ్వాన్సెడ్ మైక్రో వేవ్ స్కాన్నింగ్ రేడియో మీటర్ (నాసా )లో సైన్స్ బృందానికి నాయకుడు గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది .కనుక ఆయన మాటలకు విలువ ఉంటుంది .ఇంతకీ ఆయనేమి చెప్పారో సూక్ష్మం గా చూద్దాం .
గ్లోబల్ వార్మింగ్ వల్ల  శీతోష్ణ స్తితుల్లో మార్పులు వస్తాయని అందరం భావిస్తాం .ఆ నమ్మకం కూడా ఇటీవలి అనేక విషయాల వల్ల  ఎక్కు వింది . .ఏది జరిగినా దానికే ముడి పెడుతున్నాం .కనుక మన భయం పోవాలి అంటే వాతా  వరణం అంటే ఏమిటి ?శీతోష్ణ స్థితి అంటే ఏమిటి ? ఈ రెంటికి ఉన్న సంబంధం ఎలా ఉంది ?అని తెలుసు కోవాలి .శీతోష్ణ స్తితి అంటే ఒక నిర్దుష్ట ప్రాంతం లో ,నిర్దుష్ట సమయ కాలం లో ఉండే సరాసరి వాతా వరణం .లేక పోతే భూమి పై చాలా కాలం గా ఉన్న సరాసరి ఉష్ణోగ్రత .మొత్తం మీద శీతోష్ణ స్తితి లేక క్లైమేట్ అంటే సరాసరి వాతా వరణం అని అనుకో వచ్చు .వాతా వరణం అంటే గాలి లోని తేమ ,ఉష్ణోగ్రత ,గాలి మొదలైన అంశాలు అని మనకు తెలుసు .
జనం లో బాగా భయం కల్గిస్తున్నవి ”గ్రీన్ హౌస్ వాయువులు ”.వీటి వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందనే భయం .ఇంతకీ ఆ వాయువులు ఏవి ?అంటే వాతా వరణం లోని వాయువులే .అవి బాగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలశక్తిని పీల్చగలిగేవి .మంచు ప్రతి చోటా ఉంటుంది .భూమి వాతావరణం లో ని గ్రీన్హౌస్  గాస్ లు అంటే గాలిలోని నీటి ఆవిరి ,కార్బన్ డై ఆక్సైడ్ మరియు మిథేన్ .అంతే కాదు మేఘాలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను బాగా కల్గిస్తాయి .కాని మేఘాలు మాత్రం గ్రీన్ హౌస్ వాయువు లని పిలువ బడవు కారణం అవి వాయువులు కావుకనుక . గ్రీన్ హౌస్ వాయువులు ఒక దుప్పటి లాగా కప్పి భూమి దగ్గర గా ఉన్న వాతా వరనాన్ని వేడిగా ఉంచుతాయి .కాని పైన ఉన్న పొరలను చల్లగా ఉంచుతాయి అంటే మన దుప్పటి లాగా పని చేస్తాయి అని అర్ధం .లోపల వెచ్చగా ఉంచి బయట చల్లగా ఉంచుతాయి గ్రీన్ హౌస్ వాయువులు .గ్రీన్ హౌస్ గాస్ ను ”రేడియో ఆక్టివ్ బ్లాంకెట్ ”అన వచ్చు .మనకు ఉన్న వాతా వరణం గ్రీన్ హౌస్ ప్రభావం వల్లనే అన్న సంగతి మాత్రం మనం మర్చి పోతున్నాం .
భూమి ఉపరితల ఉష్ణోగ్రత సరాసరి 140ఫారన్ హీట్ డిగ్రీలు .జెట్ విమానాలు ప్రయాణం చేసే ఎత్తైన ప్రాంతం లో చాలా చల్లగా ఉండి,ఇంధనం ”జెల్ ”లాగా మారిపోతుంది ..కనుక ఈ140డిగ్రీలే గ్రీన్ హౌస్ ఉష్ణోగ్రత అంటారు .ఇదే మన వాతా వరణాన్ని గురించి చెప్ప  టానికి వీలయిన స్థానం .ఇక్కడి నుంచే దేన్నైనా మనం ప్రారంభించి తెలుసు కోవాలి .సోలార్ మరియు ఇన్ఫ్రా రెడ్ రేడి యేషన్ల కలయిక  భూ ఉపరితలాన్ని విపరీతం గా వేడిగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది .కాని ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చేర టానికి ముందే ఉష్ణ సంవహనం వల్ల (కన్వేక్షన్ ) ఆస్థిరం గ ఉంటుంది .అప్పుడు వేడి గాలి పైకి వెళ్లి ,చల్లని గాలి కిందికి దిగుతుంది .దీని వల్ల  ఎక్కువ గా ఉన్న వేడి పై పైకివాతా వరం లోకి  పోతుంది .ఇదంతా మనకు ప్రమేయం లేకుండా జరిగి పోయే నిరంతర ప్రక్రియ .బాగా గమనిస్తే వాతా వరణం లోని చల్ల దనపు ప్రభావం గ్రీన్ హౌస్ వాయువుల వేడి ప్రభావం  కంటే చాలా  ఎక్కువ గానే ఉంటుంది .కనుక గ్లోబల్ వార్మింగ్ భయం అనేది లేదుఅంటారు రాయ్ స్పెన్సర్ .
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదో ఉపద్రవం వస్తుందనేది అసంబద్ధం .దానికి సైంటిఫిక్ విలువ లేదు .ఇలా భయ పెట్టి అనేక సంస్తలు లాభాలు గడిస్తున్నాయని రాయ్ ఆరోపించారు కూడా .గ్రీన్ హౌస్ వాయువులప్రభావం వల్ల  భూమివేడిబాగా పొందుతుంది  అనేది అంత నమ్మ దగిన విషయం కాదు .కారణం ,వాతా వరణం ఎప్పుడూ భూమిని చల్ల గానే ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది .భూమికి ఉన్న సహజ గ్రీన్ ఔస్ వాయువులే దాన్ని కావాల్సినంత వేడిలో ఉంచుతాయి .నీటి ఆవిరి తో పుష్కలం గా ఉన్న సహజ గ్రీన్ హౌస్ వాయువులు సహజం గా ప్రభావం చూపిస్తూ నియంత్రణ చేస్తూనే ఉంటాయి .ఉదాహరణకు భూమి పై ఉన్న సహజ గ్రీన్ హౌస్ వాయువైన నీటి ఆవిరి నే తీసుకొందాం .సూర్యుని వేడికి భూమి పై ఉన్నజ లాశాయాల లోని నీరు ఆవిరి అయి, గాలిలోకి చేరుతుంది .కాని వాతా వరణం  దీనిని అంతటిని గ్రహించి తనలో నింపు కోదు. అని మనకు తెలిసిన విషయమే .ప్రకృతి దాన్ని కావలసిన మేరకు చేర్చుకుంటుంది .దానితో గ్రీన్ హౌస్ వాయువులు పారి పోయి, ప్రభావం చూప లేవు .ఇది సహజ ప్రక్రియే .దీనికి కారణం నీటి ఆవిరి ని వాతా వరణప్రక్రియే నియంత్రిస్తుంది .ప్రమాద ఘంటికలను మోగించ కుండా .దీనినే అవక్షేప చర్య లేక (ప్రిసిపి టేషన్ ) అంటారు .ఈ అవక్షేప చర్య నే సహజ దేర్మో స్టాట్ అంటారు .ఎంత నీటి ఆవిరిని వాతా వరణం లో ఉంచాలో అంతటిని ఉంచుతుంది .దానితో భూమి పై గ్రీన్ హౌస్ ప్రభావాన్ని నియంత్రిస్తుంది .
మేఘాల విషయమే తీసుకొందాం . ఇదే భూమి పై గల మరో సహజ గ్రీన్ హౌస్ గాస్ వాయువు .ఇదే భూమికి చేరే సూర్య కాంతిని మళ్ళీ ఔటర్ స్పేస్ లోకి పరావర్తనం గా నెట్టివేస్తుంది .చాలా మంది శాస్త్ర వేత్త్తలు దీన్ని గమనించకుండా భయ పెట్టు తున్నారు .ప్రిసిపిటేషన్ చెందని అతి దూరం లో ఉన్న మేఘాలు కూడా ప్రిసిపి టేషన్ ప్రాసెస్  నియంత్రణ  లోనే ఉంటాయి .కనుక ఏతా వాతా తేలింది ఏమిటి  అంటే  భూమి మీద ఉండే శీతోష్ణ స్తితిపై ప్రభావంచూపి చాలా ఎక్కువ భాగం నియంత్రించే ఏకైన ప్రక్రియ ప్రిసిపి టేషన్ ప్రక్రియ మాత్రమె . .దీన్ని కంట్రోల్ చేయటం అంటే దేర్మో స్టాట్ లా గా పని చేయటమే .ఇదేసహాజ దేర్మో స్టాట్ .ఒక వేళ భూమి చాలా వేడేక్కితే, ప్రిసిపిటేషన్ ప్రక్రియ దాన్ని వెంటనే చల్ల బరుస్తుంది .ఒక వేళ భూమి బాగా చల్ల బడి పోతే ,ఈ విధానాలు మళ్ళీ వేడిని చెందించే ప్రక్రియలు చేస్తాయి .మన ఇళ్ళల్లో ఉండే ఉష్ణ నియంత్రణ వ్యవస్థ అంటే దేర్మోస్తాట్ వ్యవస్థ సంక్లిష్టం గా ఉంటుంది .దీన్ని అర్ధం చేసుకొంటే వాతా వరణం లోని వేడిని నియంత్రించే ఇప్పటి దాకా చెప్పుకొన్న దేర్మో స్టాట్ వ్యవస్థ బాగా అర్ధమవుతుంది .
అయితే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే ప్రయత్నాలు బానే వచ్చాయి .ప్రత్యామ్నాయ ఇంధనాలను కని పెట్టి ఉప యోగిస్తున్నారు .న్యూక్లియర్ విద్యుత్తు ,సౌర విద్యుత్తు అంత తక్కువ ఖరీదు లో వచ్చేవి కావు అని తెలుస్తోంది .అందులో మొదటిది చాలా ప్రమాద కర మైనది కూడా .ఉన్న వనరులను నియంత్రణ లో వాడుకొని, భవిష్యత్తు తరాలకు మిగిల్చాల్సిన బాధ్యత మన మీదేఉంది . .మనమే కర్తా భోక్తా అని మరువ రాదు . ఊరికే గ్లోబల్ వార్మింగ్ అంటూ గుండెలు బాదుకోవద్దని ,ప్రకృతి లోనే నియంత్రణ సాధనం ఉందని నమ్మకం గా తెలియ జేశారు శాస్త్ర వేత్త రాయ్ డబ్ల్యు .స్పెంసేర్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు — 19 అవినీతి భాగోతం

అమెరికా ఊసులు –19
  అవినీతి భాగోతం 
ఇవాళ అవి నీతి ఒక అంటూ జాడ్యం లా విస్తరించి పోయింది .”ఇందుగలదు అందు లేదుఅని సందేహము వలదు  .ఎందెందు వెదకి జూచిన అందందే కలదు అవినీతి అనరా బ్రదరూ ”అన్నట్లు గా పాకి పోయింది .ఈ దేశం ,ఆ దేశం అని లేడు విశ్వ వ్యాప్తం అయింది .గుర్రపు దెక్క లాగా పీకిన్ అకొద్దీ విస్తరిస్తూనే ఉంది .అవినీతి అనేక రూపాల్లో ఉంది .అందులో రాజకీయ అవినీతి సమాజాన్ని దేశాన్ని భ్రస్టు పట్టించి ,తల ఎట్టు కోలేకుండా చేస్తోంది .దీని నివారణ సాధ్యం కాదేమో నని చేతులేస్తే పరిస్తితి వస్తోంది .అయినా ఈ మధ్య చాలా దేశాల్లో విద్యార్ధులు ఐక్యం గా కదిలి పిడికిలి బిగించి నియంతల్ని వారి సామ్రాజ్యాల్నీ కూల్చేసిన సంగతి మనకు తెలుసు .బలమైన శక్తి నిల బడితే ఆది దెయ్యం లా పారి పోతుందనే ఒక భరోసా మనకు దీని వాళ్ళ కలిగింది .లేక పోతే వారి వికృత చేష్టలకు గుడ్లు అప్ప గించి చూస్తూ ఉంది పోవాల్సి వచ్చేది .ఇది అందరికి కను విప్పు .రాజ కీయ అవినీతి చేసిన ,చేస్తున్న కొంత విక్రుతిని ఇప్పుడు తెలుసు కొందాం .
బ్రిటీష సామ్రాజ్యానికి ఎదురు తిరిగి ,విప్లవ భేరి మోగించి ,యుద్ధాలు చేసి స్వంత డిక్లరేషన్ చేసి 1776లో స్వాతంత్రాన్ని పొందింది .అయితే ఆ తర్వాత వందేల్లకే అవినీతి లో కూరుకు పోయిందని చరిత్ర కారులు రాశారు .అబ్రహాం లింకన్ కాలం లోని వార్ సెక్రెటరి సైమన్ కామెరాన్ అనేక యుద్ధ కాన్ ట్రాక్తులలో విపరీతం గా సంపాదిన్చాడట. .కాని అతన్ని ప్రెసిడెంట్ లింకన్ ఏమీ చేయ లేక పోయాడట .ఆ తర్వాత అతి అవినీతి ప్రెసిడెంట్  అని ముద్ర పడింది యులిసేస్ గ్రాంట్ .ఆయన సివిల్ వార్ లో సైనిక జెనెరల్ కూడా .సివిల్ వార్ యుద్ధ విజేత అని పించుకొని ప్రెసిడెంట్ అయాడు .కాని అనేక వ్యాపార ,వాణిజ్య వర్గాలు ప్రభుత్వం లోని బడా బాబులకు ముడుపు లిచ్చి తమ స్వార్ధం కోసం దేశాన్ని పణం గా పెట్టారట .ఆ కాలం లో” black friday conspiracy ”అనే కుంభ కోణం జరిగిందట .ఇది యుద్ధ మ్ లో లాభ పడ్డ వారు చేసింది .జిం ఫిస్క్ ,జేమేస్ గోల్డ్ అనే ఇద్దరు ప్రభుత్వం దగ్గరున్న బంగారాన్ని అంతా కొనేసి ,ఆ తర్వాతా బంగారం రేటు విపరీతం గా పెంచేశారట .దీనితో అమెరికా లో ఆర్ధిక పరిస్తితి అట్టడుక్కు పడి పోయిందట .ఆ నాటి జాతీయ పత్రిక ”the nation ” వెల్లడించిన దాని ప్రకారం ”there is hardly a legislature in the country that is not suspected of corruption ,there is hardly a court over which the same suspivion does not hang ”అని 1868 లో రాసింది .1856లో న్యూయార్క్ రిపబ్లికన్ విలియం ట్వీడ్ ఒక అవినీతి సామ్రాజ్యాన్నే చాలా ఏళ్ళు నిర్వహించి దొంగల దోపిడీ చేశాడట .కొత్తగా వచ్చిన ఇమ్మిగ్రెంట్లను డబ్బిచ్చి వోటర్లు గా చేయటం లో ఘనుడట .అతని ప్రభావం చాలా కాలం ఉందట .అతన్ని తప్పించటం ఎవరి వల్లా కాలేదట .
1880 లోఏడాదికి వెయ్యి డాలర్ల  ఉద్యోగం కావాలంటే లంచం తోనే సాధ్యం అట .ఈ విషయాన్ని పేపర్లో ప్రకటించే వారట ఉద్యోగం కోరుకొనే వారు .ఉద్యోగం ఇప్పించిన వారికి వంద డాలర్ల నజరానా అని కూడా తెలియ జేసే వారట .ఒక సారి ఆ ప్రకటన చూద్దాం ” wanted a government clerkship at a salary of not less than 1000&per anum .will give &100to any one securing me such a position ”ఇదేదో బానే ఉంది .అందరికి ఆదర్శనీయం గా లేదూ ?.1896ప్రేసిడేన్షియల్ ఎన్నికలో రిపబ్లికన్ అభ్యర్ధి మక్.కేంలీ తన ప్రత్యర్ధి పార్టే అభ్యర్ధి కంటే పది రెట్లు ఖర్చు చేశాడని ముక్కు మీద వేలు వేసుకోన్నారట.”టీ పోట్ డో మ్ స్కాండల్ ”అనేది ఇంకోటి .1920 లో ప్రెసిడెంట్ హార్దిన్గ్స్ వద్ద పని చేసిన ఇంటీరియర్ సెక్రెటరి” ఆల్బర్ట్ ఫాల్ ”రెండు వందల మిలియన్ల కాంట్రాక్టులను ఆయిల్ కంపెనీ లకు ఇచ్చాడు .దీన్ని ప్రెసిడెంట్ గారు సమర్ధించి దెబ్బ తిన్నాడు ,దీనికోసం ఫాల్ గారు ఎంతో డబ్బు లంచం గా నోక్కేశాడని జనం గగ్గోలు అదే ”tea pot dome scandel ”.తర్వాత విచారణ జరగటం తప్పు రుజువవటం ఫాల్ గారికి ఒక ఏడాది జైలు శిక్ష పడటం చరిత్ర లోని విషయమే ”what a fall my country men ?’అని పిస్తుంది కదా ఫాల్ గారి అవినీతి ని చూస్తుంటే .’.దీని మీద కార్టూన్లు కూడా పేపర్లలో చాలానే వచ్చాయట .
1945-53లో ప్రెసిడెంట్ ట్రూమన్ కాలం  లో జెనెరల్ హారీ వాఘన్ తన పలుకు బడి తో ”తెల్ల సౌధం ”లో అధికారం చెలాయిస్తూ ఎన్నో కంపెనీ వాళ్లకు లాభాలు కూర్చి ,తనూ బాగా వెనకేసుకొన్నాడు .ఆది ఆ తర్వాతా ఎన్నికైన ఐసెన్ హోవర్ కు ప్రెసిడెంట్ గా ఎన్నిక కావటానికిఅవినీతి భాగోతాన్ని ప్రజల దృష్టికి తెచ్చి  గొప్ప చాన్సే అయింది .ఇలా రాజకేయ అవినీతి తామర తంపరగా వర్ధిల్లు తూనే ఉంది .ఇవాల్టి అమెరికా లో జాన్ గోరింజి అనే న్యు జెర్సి సెనేటర్ 2000ఎన్నిక లో 63మిలియన్లు ఖర్చు పెట్టాడట .మార్క్ గ్రీన్ అనే విశ్లేషకుడు సేకరించిన సమాచారం ప్రకారం పది రాష్ట్రాల లోని సెనేటర్లు వారానికి 34,000డాలర్ల కు పైగా పార్టీ ఫండు ను ఆరు నెలల కాలం సంపాదిస్తున్నారు .జార్జి బుష్ హార్కిన్ ఎనెర్జీ లో తండ్రికాలం లో పెట్టు బడి పెట్టి దాన్ని 1990  లో 8,48,000డాలర్ల లాభానికి అమ్ముకోన్నాడని చెవులు కోరుక్కున్నారని మనకు తెలిసిందే .ఈయన గారి వైస్ ప్రెసిడెంట్ డిక్ చీనీ ఇరాక్ యుద్ధ సమయం లో వార్ కాంట్రాక్టులను దక్కిన్చుకోన్నాడని అంటారు .
అయితే ప్రజల మనసు మారుతోంది .”clear money elections ”కావాలని అమెరికా లోని మెయిన్ ,అరిజోనా రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి .ఈ రెండు రాష్ట్రా లలో చాలా మంది సెనేటర్లు ప్రజా ధనం తో నే ఎన్నికై ఆదర్శ వంతం గా నిలుస్తున్నారు .ఇది మిగిలిన రాష్ట్రాల వారికీ ఆదర్శం గా మారుతోంది .అంటే ప్రజా హృదయం అ రాజ కీయ అవి నేతిని తుడిచి పెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది .ఈ విషయం లో వారు సత్ఫలితాలను సాధించాలని కోరుకొందాం .రాజ కీయ అవినీతి ని అంతర్జాతీయ ద్రవ్య నిది చాలఛ  క్క గా నిర్వచించింది ”to abuse public office for private gain .మాజీ ”యు.యెన్ .జెనెరల్ సెక్రెటరి కోఫీ అన్నన్ అవినీతి, ప్రజాస్వామ్యాన్నిచులకన చేసి,  విస్మరింప జేస్తుంది అనిహెచ్చ రించాడు  ”corruption is an insideous plague that under mines democracy and the rule of law ,leads to violations of human rights ,distorts markets erodes the quality of life and allows organized crime ,terrorism ,and other threats to human security to flourish ”అన్నఅన్నన్  మాటలు అందరు ఆలోచించి ఆచరణ సాధ్యం చేయాల్సిందే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన–22 హథ(hatha) యోగం

   జన వేమన–22
                                                      హథ(hatha) యోగం 

ధ్యానం ,తపస్సు ,యోగం సాధన లో కైవల్యం సాధించాలి అంటే చాలా కాలం పడుతుంది ..వస్తుందో ,రాదో అని అనుమానం .తక్షణం ప్రయోజనం కలగాలని మనందరి భావం .దీనికోసం అవసర మైతే దేహాన్ని చాలా కష్ట పెట్టి .మనసు ను బాధించి లొంగ దీసుకొనే ప్రయత్నం చేస్తారు .”హ” అంటే పైకి నడిచే ప్రాణ వా యువు అని ,”థ”అంటే ,కిందికి దిగే లేక నడిచే అపాన వాయువు అని అర్ధం .ఈ రెండిటిని ఐక్యం చేసి సాధించేది ”హథ యోగం ”.కనుక వీళ్ళకు ఆసనం ,ప్రాణాయామం చాలా ముఖ్యం .శరీరం లో ఉన్న మలినాలను శుభ్రం చేసుకోవ టానికి అంటే శ్వాశ కోసం పొట్ట ,ముక్కు రంధ్రాలు మొద లైన వాటి లో ఉండే కఫం ,శ్లేష్మం వగైరాలను బయటకు తీసి శుభ్రం చేసుకోవ టానీకి ”ధౌలి ”,”,నౌలి ”అనే ప్రక్రియలు చేస్తారు బ్రహ్మ చర్యం నిలకడ గా,స్తిరంగా ఉండ టానికి ”వజ్రోలి ”యోగం చేస్తారు .మూలా దారం లో కుండలిని నిద్రించి ఉంటుంది .ఈ యోగ సాధన లో పైకి లేవటం ప్రారంభిస్తుంది .కుడి ,ఎడమ ల ముక్కుల్లోని ఇడా ,పింగళ నాడుల్లో సహజం గా సంచ రించే వాయువు .ఈ రెంటి మధ్య ఉన్న ”శుషుమ్న ”నాడి ద్వారా ప్రవహిస్తుంది .ఆరుచాక్రాలలో క్రమం గా ప్రయాణం చేసి ,సహస్రారం చేరి నప్పుడు  అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం పొందటం వల్ల  ,”అసం ప్రజ్ఞాత సమాధి ”కలుగుతుంది .ఇదే జీవన్ముక్తి .కుండలిని కది లించక పోతే ,బ్రహ్మ స్థానం లభించదు .దీనికే ”రాజ యోగం ”అని కూడా పేరు ఉంది .
ప్రాణ వాయువు లోపల ఉంటె బ్రతుకు .బయటకు పోతే చావు .అందుకనే ”హథ యోగం ”.”యావద్బద్దో ,మరుద్దేహే ,యావచ్చిత్తం నిరాకులం -యావ ద్రుష్టిర్భువో ర్మధ్యే తావత్కల భయం కుతః ?అని శివ యోగా తత్త్వం చెబుతుంది .దీనిని ”కష్ట పడి యుండు నేన్దాక ,గాలి మేన -చిత్తమేన్దాక నెందును జెంద కుండు -కదల కందాక భ్రూమధ్య కలిత దృష్టి -యరయ నందాక ప్రాణ భయంబు లేదు  ”అని తెలుగు అర్ధం .హత యోగానికి మంత్ర యోగం ,లయ యోగం అని రెండు ఉప యోగాలున్నాయి .మంత్రాలను జపిస్తూ ,తన్మయుడవటం మొదటిది .ప్రాణాయామ , ధ్యానాలతో దేహం పరి శుద్ధ మైనపుడు లోపల ”ఒక రక మైన నాదం ”అఖండం గా విన్పి స్తుందట .బయటి శబ్దం ”ఆహతం ”అంటే ,దెబ్బ కొడితే కలిగే శబ్దం .రెండోది ”అనాహతం ”అంటే యే పదార్ధాల స్పర్శ లేకుండా విన్పించేది .ఆ నాదాన్ని వింటూ ,మనసును ,ప్రాణాన్ని లయింప జేయటమే ”లయ యోగం .”చాలా లయలున్నాయి .కాని ”నాద లయ ”చాలా ముఖ్య మైనది అని హథయోగ ప్రవక్త ”శ్రీ ఆది నాధుడు ”చెప్పాడు .వేమన గురువు లంబికా శివ యోగి గొప్ప  ”హథయోగి ”.
                              లంబికా యోగం 
లంబిక అంటే దవడ .దాని పై శిరో రంధ్రం లో నాలుక ను ప్రవేశ పెట్టాలి .భ్రూ మధ్యమ ఎడమ వైపు దాన్ని ”చంద్ర స్తానం ”అంటారు .నాలుక  చంద్ర స్తానాన్ని అందుకోవాలి .అప్పుడు అగ్ని పుడుతుంది .ఆ స్తితి లో చంద్ర స్తానం లో అమృతం కరిగి ప్రవహిస్తుంది .దాన్ని తాగితే యోగికి రోగం ,ఆకలిదప్పులు ఉండవు .చావు రాదు .దీన్ని సాధించాలి అంటే చాలా కష్ట ప డాలి .నాలుక అంత పొడవు సాగటం అసాధ్యం కాదు కాని అసాధారణమే .అందుకోసం నాలుక కింద ఉన్న నరాలను క్రమం గా కోసి ,వ్రేళ్ళతో నాలుకను ఇటు అటు తిరిగే ట్లు చేస్తారు .ఆ తర్వాత లంబికా రంధ్రం లోకి దూరెట్లు సాగ దీస్తారు .ఇదే లంబికా యోగంలేక ఖేచరి ముద్ర. .
కళ్ళు మూసుకొని ,దృష్టిని నాశికా గ్రంపై కేంద్రీక రిస్తే మండలాకారం గా జ్యోతి దర్శన మిస్తుంది .అందులో మనసు ,,ప్రాణం లీనం చేసి ,రెప్పలు కదల్చ కుండా ,చూసే వాడు ”జగద్గురువు ”.ఇదే నిజ మైన ఖేచరి విద్య అని శివ యోగ సారం చెబుతోంది .వేమన కు ఈ విద్య పై నమ్మకం బాగా ఉంది .తన గురువు లంబికా శివ యోగి దీన్ని సాధించాడు కదా .అందుకే ”ఖేచరీ లేరుంగ లేక  లేక –వాదు లాడు నట్టి వారి నెల్ల -తొక్కి నాల్క బట్టి తుద గోయ వలయురా ”అని తన నమ్మకాన్ని చెబుతూ ,దీన్ని వ్యతిరేకించే వారికి మాటల వాతలు పెట్టాడు .తానూ సాధించి అనుభూతి చెందాడు .”నాద మలర జేసి ,నాదంబు జొన్గించి –ఖేద మింత లేక పెనిగి నపుడు –పారు కాల్వ వలెను పారురా ఈనాడు ”అని చెప్పాడు .”కనుల చూపు నిలిపి ,కాంతిని గమనించి –కాచ వలెను చిత్ర కళల దాటి ”అని రహస్యాన్ని వివ రించాడు .రాజ యోగం ద్వారా అద్వైతా నుభావం పొంది న వేమన ఆసనాలు ,ప్రాణాయామం వగైరా హథ విద్యల్ని తిరస్కరించి నట్లు ”ఆసనంబు పన్ని ,అంగంబు బిగి యించి -యొడలు విరిచి కొనేడు యాగ మెల్ల –జెట్టి సాము కన్నా చింతాకు తక్కువ ”అన్న పద్యం ద్వారా మనకు తెలుస్తోంది ..
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –.9-9-12-కాంప్–అమెరికా
.

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్

చారిత్రిక నవలా రచయిత్రి- ఈస్తర్ ఫోర్బ్స్ 

అమెరికా కాలనీ వాసుల కాలం లో జరిగిన అనేక సంఘటన ల పై స్పందించి ,ఆ చరిత్రను నేపధ్యం గా తీసుకొని గొప్ప నవలలు రాసిన రచయిత్రి ఈస్తర్ ఫోర్బ్స్ .ఆ నవలల్లో గొప్ప ఖ్యాతి పొందిన నవల ”జాని ట్రేమేన్ ”.ఆమె మాసా చూసేట్స్ రాష్ట్రం లో బోస్టన్ నగరానికి దగ్గర లో ఉన్న వెస్ట్ బోరో లో28-6-1891లో జన్మించింది .మాసా చూసేట్స్ ను ”న్యూ ఇంగ్లాండ్ ”అంటారు .చిన్నప్పటి నుండి అక్కడ యుద్ధ వాతా వరణమే .తలి దండ్రులు బాగానే విద్యా వంతులు .తండ్రి ఆమ్హేస్ట్ కాలేజి గ్రాడ్యుయేట్ .ఆయన కాన్ స్టాంటి నోపుల్ ,టర్కీ లకు వెళ్లి గణితం బోధించే వాడు ఆయన గ్రీకు నగరం ”ట్రాయ్ ”వెళ్లి అక్కడి త్రవ్వ కాలు చూసి ఆ విషయాలన్నీ వచ్చిన తర్వాత ఇంట్లో పిల్లలకు చెప్పాడు .ఆది వారి మీద పెద్ద ప్రభావమే కల్గిచింది .ఆయన ప్రోబేట్ కోర్టు లో జడ్జి అయాడు .తల్లి హారిఎట్ మెర్రి ఫీల్డ్ ఆనాటి మొదటి విద్యా సంస్థ అయిన” oread academy in worsester ”చదువు కొంది మంచి చరిత్ర కారిణి .రెండు మూడు పుస్తకాలు రాసి ప్రచురించి ,కూతురికి ప్రేరణ కల్గించింది .కాలనీ ల చరిత్ర రాయటం లో తల్లి కూతుళ్ళు కలిసి పని చేశారు .
తలిదండ్రులకు ఉన్న సంతానం లో అయిదవ అమ్మాయి ఈస్తర్ .పై వాళ్ళంతా బాగా చదువుకొన్నారు .చిన్నప్పటి నుండి ఈమెకు కధలు చెప్పి చెల్లెలు కతేరిన్ తో కాలక్షేపం చేసేది .ఎనిమిదేల్ల కే  పక్క పిల్లల తో కలిసి ఒక సామాజిక మేగజైన్ తయారు చేసింది .ఆమె రాసింది రెండవ సంచికలో వచ్చింది .తోమ్మిదేల్లప్పుడు డు కీళ్ళ జబ్బు తో బాధ పడింది .తల్లి ఈమెను చదవమని ,రాయమని, బొమ్మలు వేయ మని ప్రోత్స హించేది .,హై స్కూల్ చదువు అయినతర్వాత బోస్టన్ లోని worester art museum లోను బ్రాడ్ ఫోర్డ్ లోని జూనియర్ కాలేజి లోను చది వింది .తన రచన కోన సాగిస్తూనే ఉంది .1912లో బ్రాడ్ ఫర్డ్ నుండి గ్రాడ్యుయేట్ అయింది .మళ్ళీ బోస్టన్ లో రచయిత ల ట్రెయినింగ్ లో చేరింది .చెల్లెలు కేథరిన్ విస్కాన్సిస్ వర్సిటి లో టీచింగ్ లో చేరితే ఈమె  కూడా వెళ్ళింది .గుర్రపుస్వారీ చేసేది .ఆమె కధకు బహుమతి వచ్చింది .విస్కాన్సిన్ లిటరరీ మేగజైన్ లో ఆమె కధ పడింది .దాన్ని వో.హెన్రీ అవార్డు కు పంపారు .
1917 లో మొదటి ప్రపంచ యుద్ధం లో వాలంటీర్ గా పని చేసింది .వెస్ట్ వర్జీనియా లోని ఒక వ్యవ సాయ క్షేత్రానికి ఈస్తర్ ను పంపారు .అక్కడి రైతు ఈమె కున్న ఉత్సాహాన్ని గమనించి గుర్రాలను ఆమెకు అప్పగించాడు .వాటితో బాగా గడిపింది .విస్కాన్సిన్ లో చదువుతూ రచనకు మెరుగులు దిద్దు కొంది .విస్కాన్సిన్ లిటరరీ మెగ జైన ఎడిటోరియల్ బోర్డు లో పని చేసింది .అక్కడే రౌలింగ్ అనే మహా రచయిత తో పరిచయం ఏర్పడింది .ఆయన రాసిన” yearling ”పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది .తను విస్కాన్సిన్ రావటానికి కారణం గొప్ప నవల రాయటానికే అని చెప్పేది ఫోర్బ్స్ .1919లో ఇంటికి తిరిగి వెళ్ళింది .అక్కడ ఒక పబ్లిషింగ్ కంపెని లో అసిస్టెంట్ ఎడిటర్ అయింది .ఆమె స్పెల్లింగ్ మిస్టేకులు ఎక్కువ గా చేసేది .అందుకనే హోదా తగ్గింది .లేక పోతే చీఫ్ ఎడిటర్ అయి ఉండేది .అక్కడ ఆమె ఎంతో మంది రచయితలు పంపే రాత ప్రతుల్ని శ్రద్ధ గా చదివేది .అందులో పదార్ధం ఉంటె తప్పక ప్రచురించేది .ఫ్రెంచి విప్లవ నేపధ్యం లో వచ్చిన ఒక నవల ను అవసరం మేరకు తగ్గించి ఎడిట్ చేసి పత్రిక లో ప్రచురితం అఎట్లు చేసింది .ఆది ”rafael sebatini ”రాసిన” scaramouche ”.ఆ నవల చారిత్రిక నేపధ్యం తో రాయబడి ఉండటం తో బాగా పాప్యులర్ అయింది సినిమా గా కూడా తీశారు .ఇది ఈస్తర్ పుణ్యమే .
తాను పని చేస్తున్నా, నిరంతరం రాస్తూనే ఉంది .బోస్టన్ ఈవెనింగ్ ట్రాన్స్క్రిప్ట్ కు తరచురాసేది . అందులో మెసా చూ సెట్స్  లోని రచయితల జీవిత చరిత్ర ఆ రాష్ట్ర చరిత్ర రాసేది .అవి బాగా పేరు పొందాయి .కేంబ్రిడ్జి అపార్ట్మెంట్ లో మిగిలిన యువ స్నేహితులతో కలిసి ప్రతి వారం డిన్నర్ పార్టి ని చేసుకొంటూ కొత్త అతిధిని ఆహ్వానిస్తూ ఆయన చెప్పింది తెలుసుకొంటూ ఉండేది .అప్పుడే హార్వర్డ్ లా కాలేజి విద్యార్ధి ఆల్బర్ట్ హాస్కిన్స్ తో పరిచయమైంది అయితే అదేమీ ప్రేమ గా చిగురించి పూలు పూయలేక పోయింది కారణం ఆమె కు దీని గురించి ఆలో చించే సమయం తీరికా లేక పోవటమే .కాని 1926లో అతన్నే పెళ్లి చేసుకోంది.
పెళ్లి అయిన తర్వాతా కొన్ని నెలలకు ”o genteel lady ”అనే విక్టోరియా పాలన లోని ఒక స్త్రీ గురించి నవల రాసింది .దీనికి తనకు ప్రేరణ ”goodies lady’s books ”అని తెలియ జేసింది .ఎప్పుడో ఇంగ్లాండ్ లో జరిగిన చారిత్రిక విషయాల నేపధ్యం లో ఆమె అంత విషయ సేకరణ చేసి అద్భుతం గా రాసిందని మెచ్చారు .newyork time book review  ”miss forbes has caught and kept through out the charm of the by gone days she describes .she has captured the elusive lace and lavender element without its mustiness ”అని పొగిడింది .ఒక్క నెలలో ఈ పుస్తకం అమ్మకాలు విపరీతం గా పెరిగాయి .హనీ మూన్ కు దంపతులు యూరప్ వెళ్లి వచ్చారు .న్యూయార్క్ లో నివాసం .భర్త లా ఫారం లో పని చేస్తున్నాడు .ఈమె కొత్త నవల ”a mirror for witches ”పై ద్రుష్టి పెట్టింది .తన తల్లి కుటుంబం సేకరించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది .అందులో తల్లి చెప్పిన ఒక యదార్ధ గాధ ఆమెను బాగా కదిలించింది .rebeca chamberlain అనే ఆమెఒక దెయ్యం అని  జైల్లో విచారణ ఎదుర్కొంటుండ గానే  చని పోయిన కధ ఆది .దీని ప్రభావం ఈమె మీద బాగా ఉంది .కేంబ్రిడ్జి లో ఉండగా కూడా దేయ్యపు కధలు చాలా విన్నది .
ఒక అభాగ్యురాలిన యువతీ మాంత్రికు రాలు అని నింద మోసిన  ఏడవ శతాబ్ది లో ”సేలం ”లో జరిగిన కధ ఆధారం గా1928 లో ”a mirror of witch craft ”నవల రాసి ప్రచురిస్తే అద్భుత మైన అప్ప్లాస్ వచ్చింది .విమర్శకులూ మెచ్చారు అందులో డాల్ బిల్లీ అనే ఇంగ్లీష్ అమ్మాయి ని హీరోయిన్ ను చేసింది .ఇది గొప్ప సృజనాత్మక నవల అన్నారు .ఇలా మంత్ర గత్తే లు ,దేయ్యాల  కధలు చివరిదాకా రాస్తూనే ఉంది .ఫోర్బ్స్ భర్తకు తన కంటే భార్యకు పేరు ఎక్కువగా రావటం అసూయ కలిగించింది .ఆమె ను రాయ వద్దు అని ఆంక్ష పెట్టాడు .అతను ఇంట్లో ఉన్నంత సేపు రాసేది కాదు .ఆ తర్వాతా రాసేది .చివరికి ఇద్దరు విడాకులు తీసుకొన్నారు .ఈమె మళ్ళీ స్వంత ఊరు వోర్సెస్టర్ చేరింది .తన ఇంటికి కొద్ది దూరం లోనే సోదరి కేథరిన్ ఉండేది .ఆమెకు అప్పుడు అర్ధమైంది రచయిత రాసుకోవటానికి ఏకాంతం అవసరం అని .అమ్మా చెల్లెలు సోదరి కర్నిల్లా ఉన్న ఇంట్లో మూడో ఫ్లోర్ లో ఏకాంతం గా రాసుకొనే ఏర్పాటు చేసుకోంది.
షార్ట్ హాండ్ రాసి నంత వేగం గా రాసేది ;మళ్ళీ తిరిగి చదువుకొని సాఫు చేయటం అలవాటు .మెసా చూసెట్స్ లోని కాలనీలజనాన్ని గురించి నవల రాయాలని సంకల్పించింది .ఈ లోపునే ”మిస్ మర్వేల్ ”అనే నవలను కేవలం పది రోజుల్లో రాసేసింది .ఇది వరకు అనుకొన్న ప్లాట్ ఆధారం గా ”paradise”పై ఆలోచన పెట్టి ఆరునెలల్లో పూర్తీ చేసి 1937లో పబ్లిష్ చేసింది .ఇదీ విపరీతం గా అభిమా నం సంపాదించింది .తర్వాతఏడాది    ”the genteel lady  ”విడుదలై విజం సాధించింది .ఇది ”బాత్ శీబా స్పూనేర్ ”అనేఆమె  తన భర్తను మరో ముగ్గురిని చంపిన నేరం కింద ఉరితీయబడిందిఅనే కధ .మంచి పాత్రలు ,నిర్వహణ ఆమె కు పేరు తెచ్చాయి . .ఉరితీయ బడ్డ ఆవిడకు బ్రిటీష ఆఫీసర్ తో అనైతిక సంబంధం ఉందనేది తరువాత తెలుస్తుంది .ఇందులోని చారిత్రకయదార్ధం అందర్ని ఆశ్చర్య పరచింది .ఆమె పరిశీలనా దృష్టికి జేజేలు పలికారు .పులిత్జేర్ బహుమతి పొందిన స్టీఫెన్ విన్సెంట్ బెనేట్ అనే ఆమె గొప్ప రివ్యు రాసింది .ఈ నవల విడుదల అయిన తర్వాత గొప్ప పార్టీ కూడా ఇచ్చింది ఫోర్బ్స్ .
” paul revere and the world he lived in  ” అనేది1943పులిద్జేర్ బహుమతి పొందింది .న్యాయం గా ఆ బహుమతి తన తల్లికి చెందాలని అంటుంది ఈస్తేర్ .మంచి విమర్శలతో ఈ పుస్తకం దూసుకు పోయింది .పులిద్జేర్ సాధించిన తర్వాతా మరో విజయ వంత మైన నవల రాసి చరిత్ర లో స్తిర స్తానం సంపాదించాలని మనస్పూర్తిగా కోరుకొన్నది .అప్పుడే అమెరికన్ రివల్యూషన్ నాటి యదార్ధ గాధ ”johney tremain ” జీవితాన్ని నవల గా రాయాలని పించింది .అంతే దీక్ష గా దానిపై పరిశోధన చేసి నవలను సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దింది .1943 లో ప్రచురితమై గొప్ప విజయం సాధించింది దీనికి న్యు బేరి అవార్డు పొందింది .ఆ తర్వాతా నాలుగేళ్ళు నాన్ ఫిక్షన్ రాసింది .1948లో ”the running of the tide ”రాసింది దీనికి m.g.m.ప్రిఅజ్ వచ్చింది సినిమా గా తీశారు .దీనికి ఆమెకు ఒక లక్షా యాభై వేల డాలర్ల పారితోషికం లభించింది .వాల్ట్ డిస్నీ జానీ ట్రేమన్ ను సినిమా గా తీశాడు .దీని మూవీ హక్కుల కింద ఆమె కు దక్కింది కేవలం అయిదు వేల డాలర్లే .
1954 లో చివరి నవల”rain bow on the road ” రాసి విడుదల చేసింది .ఇది 1830కాలం నాటి జాన పద కళా కారుని యదార్ధ కధ .పడి హేడవ శతాబ్దం లోనిమాసా చూసేట్స్   ”విచ్ క్రాఫ్ట్ ”పై రాయాలని మొదలు పెట్టింది .కాని పూర్తీ చేయ లేక పోయింది . .”american Antiquarian Society in worester ”కు 1960లో ఎన్నిక అయిన మొదటి మహిళా రచయిత్రి ఫోర్బ్స్ .ఆ సంస్థ అరుదైన విషయాలను సేకరించి భద్ర పరచి ప్రజలకు అందు బాటు లోకి తెస్తుంది .డెబ్భై ఆరేళ్ళు జీవించి అమూల్య మైన చారిత్రాత్మక నవలలు రాసి న ఈస్తేర్ ఫోర్బ్స్ 12-8-1967లో మరణించింది .ఆమె నవల జానీ ట్రేమేన్ పదికి పైగా భాషల్లోకి అనువదించ బడింది .ఎన్నో సార్లు పునర్ముద్రణం పొంది లక్షలాది కాపీలు అమ్ముడు పోయాయి .ఆమెను గురించి new york time ”పత్రిక గొప్ప ప్రశంషను కురిపించింది ”Forbes is a novelist who wrote like a historian ,and a historian who wrote like a novelist ,achieved a reputation as one of the most exciting and knowledgeable authors on the revolutionary era ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన -21 ఆంద్ర మత కర్తలు లేరా ?

  జన వేమన -21
                                                                              ఆంద్ర మత కర్తలు లేరా ?
”ఆంధ్రుల లో మత ప్రచారకు లున్నారు కాని మత కర్తలు లేరు .నాకు ఇయ్య లేదని తిట్టిన వారే కాని నువ్వు చెడి పోతున్నావు అని చెప్పిన వారు లేరు .తనకు తోచిన సత్యాన్ని నిర్భయం గా దేశ మంత తిరిగి మథాలు స్తాపించి ,బోధనచేసినతెలుగు  వారిలో వేమనే మొదటి వాడు .పుస్తకాలలోని విషయాలను చెప్ప కుండా యోగా సాధన తో తత్వాన్ని గ్రహించి ,దాన్ని తాను అనుభవించి ,తన దేశం వారిని తరింప జేయాలన్న ఉదారాశయంతో ఉపన్యాసాలిచ్చాడు .అతని బోధలలో జీవం ఉంది .మత కర్తలు కాని మత ప్రచారకులలో ,మత కర్తలకున్నంత విలువను ,వ్యాప్తిని కొంత వరకు సంపాదించిన ధీరుడు వేమనే .వేమన పద్యాలు చిటికే లో ముగింపగలిగే  చిన్న పలుకులు .అచ్చ తెనుగు పద్యం నడక ,గుండు దెబ్బ లాగా గురి తప్పని చి క్కని చెక్కిన మాటలు ఆయనవి .వేమన ను పరిచయం చేసిన బ్రౌన్ వేమన ను కవి అనక పోవటం ఆశ్చర్యం .”వ్రాలకందని పద్యాలు వేలుగా చెప్పాడు ”ఆటవేలదే కాక ,”భువి రాజ తారకంబులు -ప్రవిమల తార హంస యోగభావంబులకున్ -వివరంబులు గావించెద ”వంటి కంద పద్యాలూ చెప్పాడు .కొన్ని పాటలూ చెప్పాడు .”శ్రీ కరుడగు వేమన చెప్పి నట్టి ”వంటి తేట గీతులు చెప్పాడు .”వేమన వాక్యాలు ”అనే పేర పద్యాల వంటి వచనాలు కూడా ఉన్నాయి .వీటికి చివర ”విశ్వదాభి రామ ”మకుటం ఉంది .అవి యోగా ,సాంఖ్య తత్వాలు అని రాళ్ళ పల్లి వారన్నారు .అంటే వేమన ఛందో వైవిధ్యం పాటించాడని తెలుస్తోంది .మచ్చుకు ఒక వేమన వాక్యం చూద్దాం –”పూర్ణ సమాధి లో రేచించి ,పూరించి ,కుమ్భించి ,పెద్ద గాలి వలె ,బరగు చుండు -యేడు కోట్ల వెర్రి నాదంబులు గాన బడును .మేను చల్లని గాలి వలె విసరును .గాలి లోపల నుండును .గాంధర్వ గానంబు గాన బడువిను బాట లో నుండు ఎంతైన నడు వీధి నాడు చుండు ”అలాగే ”ఆది మూల మందు ”అంబికా శివ యోగి మూల గురుడు మాకు ముక్తి జూపె ”అనీ ఉంది లంబికా అనటానికి బదులు అంబికా అని పొరబడి ఉండవచ్చు .
    మహ్మ దీయుల పై వేమన అభిప్రాయం 
మహమ్మదీయులు పాలించిన రోజుల్లో హిందువులు అనుభవించిన కష్టాలను స్వయం గా చూశాడు వేమన .దాని పై స్పందించాడు ”.పసరపు మాంసము బెట్టియు ,-మసలక సుల్తాను ముసలి మానుల జేసెన్ –”అని మత మార్పిడులను నిరషించాడు .”లింగ మతము లోన దొంగలుగా బుట్టి -ఒకరి నొకరు నింద నొరగ జేసి -తురక జాతి చేత దూలి యై పోదురు ”అని మన మతం లోనే దొంగలు ఉండి  ,ఒకరి నొకరు నిందించు కుంటూ ఉంటె చివరికి తురక జాతి అందర్ని కబళించి  మట్టి పాలు చేస్తుందని హెచ్చ రించాడు .”షేకు నాయుడు మొగలు ,చెంగు పతానులు -తురకల దొర తనము తొలుత జేసి –రాగ రాగ విడిచి ,రైతులై కొలిచిరి ”అని మహ్మదీయుల క్రమ పతనాన్ని వివరించాడు .మనకున్న మూఢ విశ్వాసాలు వాళ్ళకు కూడా ఉన్నాయని ,ఎద్దేవా చేస్తూ ”మక్కాకు జన నేల ,మగుడ ,దా,రానేల -ఏక మైన చిత్త మెందు కలదు -అన్నిటా పరి పూర్ణ మల్లా మహమ్మదు ”అని వాళ్ళకూ బోధింఅని వెంపర్లాడ వద్దు అనిచాడు .అసలు విషయం ఏమిటి అంటే -ఎక్కడో ఏదో ఉంది .
             
 శివ యోగి తత్త్వం ఏమిటి ?
శ్రీ శంకరాద్వైతానికీ ,శ్రీ వైష్ణవాద్వైతానికి మధ్య లో ఉన్న వారిని వీర శైవులు అంటారు . శివ తత్త్వం లో శక్తి ,లింగం అని ,అంగం అని రెండున్నాయి .లింగాన్ని పూజిస్తారు .ఆది రుద్ర రూపం .అంగం జీవాత్మ యేకాక శక్తి కూడా .కళఅని భక్తీ అని రెండు రకాలు .శివుని లో కళ ఉంటుంది .అదే సంసారానికి ,సృష్టికి కారణం .భక్తీ జీవుని లో ఉంది ముక్తికి కారణమవుతుంది .భక్తీ నిరంతరం గా ఉంటే ,జీవుడికి శివుడి తో ఆనందం తో కూ డిన ఐక్యం లభిస్తుంది .-ఇదే ముక్తి .దీనికి యోగ సాధన కావాలి .ఈ రక మైన అద్వైతాన్ని అభ్యాసం చేసే వారంతా శివ యోగులు .దీనిని అవలంబించే వారంతా బ్రాహ్మణులు కాని వారే .వీరి లో కొందరు గృహస్తులు ,కొందరు మథనివాసులు ,ఎక్కువ మంది బ్రహ్మ చారులు .వీరందరూ స్వర్ణ కార విద్య లో నేర్పరులే .అందుకే వేమన కూడా ”ఇహ లోకమున సుఖియింప హేమ తారక విద్య –పరమున సుఖియింప బ్రహ్మ విద్య –కడమ విద్య లెల్ల మూధుల విద్య ”అని తేల్చి చెప్పాడు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తాత్విక రచయిత జె.డి.శాలింజేర్

    తాత్విక రచయిత జె.డి.శాలింజేర్  

”the catcher in the rye ” నవల తో ప్రఖ్యాతి చెందిన రచయిత శాలింజేర్  .అసలు పేరు” జేరోం డేవిడ్ శాలింజేర్  ”(j.d.salinger ).పేరు ,ప్రఖ్యాతులకు దూరం గా జీవించాడు .న్యూ ఆంప్ షైర్ లోఏకాంత జీవనం సాగిస్తున్నాడు అదే ఆయన కోరుకొనేది .వ్యక్తిత్వానికి ,శక్తి వంత మైన అభి భాషణకు ఆయన ప్రసిద్ధి .అమెరికా లోని మాన్ హట్టన్ లో 1-1-1919 న జన్మించాడు .తండ్రి సోల్ .తల్లి మేరీ జిల్లీచ్ .మాన్హట్టన్ లో రెండేళ్లు చదివాడు .1936లో valley forge military academy -నుంచి గ్రాడ్యుయేట్ అయాడు .ఇది పెన్సిల్వేనియా లోని వెన్ లో ఉంది .అక్కడే crossed sabers పత్రిక కు సంపాదకుడి గా చేశాడు .ఆయన చదివిన అకాడెమి జీవితం లో నుంచే ఆయన రాసిన నవల కధ కు విషయం గా ఎంచుకొన్నాడు .
1937 లో ఆస్ట్రియా లోని వియన్నా వెళ్లాడు .ఆ తర్వాత,పోలాండ్ కూడా చూశాడు .అక్కడే దిగుమతి వ్యాపార రహస్యాలను తండ్రితో పాటు తెలుసుకొన్నాడు .తిరిగి వచ్చి పెన్సిల్వేనియా లోని ”అర్సినాస్ ”కాలేజి లో చేరాడు .అప్పుడే ”skipped diploma ”ను కాలేజి మేగజైన్ కు రాసి  మంచి పేరు తెచ్చుకొన్నాడు .కొలంబియా వర్సిటి లో చిన్న కధలు రాసే కోర్సు చేశాడు .క్లాసులకు వెళ్ళ కుండా ,వెళ్ళినా చివరి బెంచీల్లో చేరి కాలక్షేపం చేసే వాడు .ఆయన మొదట ప్రచురిత మైన  కధ ”దియంగ్ ఫోక్స్”.ఇది ”స్టోరి ”అనే పత్రికలో 1940 లో వచ్చింది .దానికి పాతిక డాలర్ల పారితోషికం అందుకొన్నాడు .ఆ తర్వాత”the hang of it ”,the heart of a broken story ”  మొదలైన కధలు ప్రముఖ పత్రికల లో వచ్చాయి .రెండో ప్రపంచ యుద్ధం లో ఆయనకు  సైన్యం నుంచి పిలుపు వచ్చింది .సెలెక్టివ్ సర్విస్ లో చేరి M.S.kung sholm లో వినోద నిర్వహణ డైరెక్టర్ గా పని చేశాడు .
1942లో అమెరికా ఆర్మీ లో కి ఆయన్ను తీసుకొన్నారు .ఆయన ఆఫీసర్ల మొదటి సార్జేంట్లు మరియు ఇంస్త్రక్తర్ల స్కూల్ లో చేరాడు .తర్వాత army counter intelligence corps కు బదిలీ అయాడు .అప్పుడే ”స్టోరి ”అనే పత్రిక లో ఆయన రచన” the long debut of lois taggett ”అచ్చయింది .అలాగే ”colliers”పత్రిక లో”personal notes of an infantryman ”వచ్చింది .ఈ కాలం లోనే చార్లీ చాప్లిన్ భార్య ,ప్రఖ్యాత నాటక రచయిత యూజీన్  వో.నీల్ కుమార్తె ఊనా తో పరిచయమయింది .తర్వాతా టేన్నీసీలోని నాష్ విల్ లో ఉన్నప్పుడు” the varioni brothers ”ను సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ పత్రికలో రాశాడు .తర్వాతా ఆర్మీ కొంటర్ ఇంటలిజెన్స్ కార్పస్ కు బదిలీ అయి ఇంగ్లాండ్ లో tiveton in Devonshire లో శిక్షణ పొందాడు .6-6-1944 న నార్మండీ మీద యుద్ధానికి వెళ్లాడు .ఈ రోజునే” D -Day ”అని చరిత్ర కారులు పిలిచారు .ఆ తర్వాతా utah beach లో నాల్గవ డివిజన్ కు పని చేశాడు .యుద్ధ కాలం లో అంతా ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు .యూరప్ లో సెక్యురిటి ఏ జేంట్ గా పన్నెండవ ఇన్ ఫాన్ట్రీడివిజేన్  కు పని చేశాడు .దీని లో వసతులు లేని ,నడకకు అసాధ్యం గా ఉన్న రోడ్ల మీద నడవాల్సి వచ్చేది .అలాగే పారిస్ చేరాడు .అక్కడే ఉన్న అమెరికా ప్రఖ్యాత రచయిత ఎర్నెస్ట్ హెమింగ్ వే ను కలుసుకొన్నాడు .ఆయనా యుద్ధ వార్తలను రాయటానికి అక్కడికి వచ్చాడు .హెమింగ్వే సాలింజేర్ రాసిన the last day of the last furlough ”కధనుహృదయ పూర్వకం గా  మెచ్చుకొన్నాడు .
పారిస్ లో కొంత కాలం ఉండి బెర్లిన్ చేరాడు  .ఆయన రాసిన” a boy in france ”  సైనికుడి జీవాలను పోగొట్టే సుదీర్ఘ ప్రయాణం ను వివరిస్తుంది .మళ్ళీ జెర్మని చేరి ,గడ్డ కట్టే చలిలో ,ఎందరో మృత్యు వాత పడుతుండగా” ట్రెంచులలో ” నక్క బొక్కల్లో , గడపాల్సి వచ్చింది అతని భార్య అల్లిన సాక్సు వల్లనే అతను ఆ చలిని తట్టుకో గలిగా డట .1945 may 5న నూహాస్ లోని హీర్మాన్ గోరింగ్స్ సౌధం ను స్వాధీనం చేసుకొనే కార్యక్రమం లో పని చేశాడు .అక్కడ సెక్యురిటీ ని పర్య వేక్షించాడు .ఎందరో ఉద్యోగం లోంచి తొలగించ బడ్డ వారి మధ్య పని చేయాల్సి వచ్చింది .జూలై లో యుద్ధ అలసట వల్ల ఆస్పత్రి పాలైనాడు .తన పరిస్తితిని హెమింగ్వే కు ఉత్తరం ద్వారా తెలియ జేశాడు .ఆయన యుద్ధ అనుభూతులనన్నిటిని ”the catcher in the rye ”నవల లో అద్భుతం గా ఆవిష్కరించాడు .ఇదే సమయం లో ”elaine ”అనే కదా సంపుటిని ప్రచురించాడు .తర్వాతా  ”i am crazy ”,”no mayonnaise ”పుస్తకాలు వెలువరించాడు .
1945 సంవత్స రాం తానికి ఆర్మీ నుండి విముక్తి లభించింది .న్యూయార్క్ చేరాడు .”గ్రీన్ విచ్” విలేజి యొక్క రాత్రి సౌందర్యాన్ని చాలా కాలం అనుభవించాడు .తర్వాతా ఆసక్తి అంతా ”జెన్  బౌద్ధం ”మీదకు మళ్ళింది .తరచుగా the newyorker ”పత్రికకు రాస్తూనే ఉన్నాడు .1949లో” మై ఫూల్ హార్ట్ ”రాశాడు .1950లో ”for esme with love and squalor ”న్యూయార్కర్ కు రాశాడు .ఆయన రాసిన ”కాచేర్ ఇన్ రై” నవల న్యూయార్కర్ బెస్ట్ సెల్లర్ గా పేర్కొన్నది .పబ్లిసిటీ అంటే ఇష్టపడని సాలింజేర్ న్యు హంప్  షైర్ లోని కోర్నిష్ కు లో  ప్రశాంతం గా గడిపటానికి వెళ్లాడు . .కాని అ క్కడ నీటి వసతి, సౌకర్యాలు లేవు .కూతుళ్ళు బాధ పడ్డారు .తనకు హాయిగా అడవిలో ప్రశాంతం గా జీవించటానికి చిన్న షెడ్డు చాలు అని వారికి చెప్పాడు .ఇక్కడే ఆయన రోజుకు పద హారు గంటలు పని చేస్తూ ,రాసుకొంటూగడుపుతున్నాడు ..శాకా  హార భోజనం, ఎరువులు వెయ్య కుండా పండించిన కూరలు తింటాడు . ఆయన విధించుకొన్న ఏకాంత జీవితం ఇది హెన్రీ డేవిడ్ థోరో లాగా . ఆ తర్వాత అందులో అనేక రచనలు చేశాడు .ఆయన కధలన్నీ సంపుటాలుగా వచ్చాయి .1987 లో సాలింజేర్ జీవిత చరిత్ర ప్రచురిత మైంది .చివరి జీవితం అంతా తాత్విక భావనలతో గడుపుతున్నాడు .
సృజన ఉన్న రచయిత గా ,సాధించాలన్న తపన ఉన్న వాడిగా సాలింజేర్ కనిపిస్తాడు .ఆయన భావాలను rouseaustic అని ఈసడించిన వారూ ఉన్నారు .ఆయన న్యూ యార్క్ నగరాన్ని ”spiritual waste land of isaiah ”అని తీసి పారేశాడు .దాన్ని the city of wealth and dissipation ,the city of anti christ అంటాడు .సెక్స్ లో   ఎక్స్పెర్ట్ ను ”sexpert”అని అర్ధవంతం గా అంటాడు .తను పని చేసిన సైన్యాన్ని గురించి” the army was as practically as full of bastards as the nazis were ” అన్నాడు .యుద్ధానంతర కాలమంతా ఆయనకు నిరాశా జనకం గా కనిపించింది .అందుకే ఆయనకు ప్రాచ్య దేశాల భావన మీద గురి ఏర్పడింది .ముఖ్యం గా బౌద్ధం మీద మోజు కలిగింది .అందులోను అమెరికా లాంటి దేశాల లో పిలువ బడే ”జెన్ బుద్ధిజం ”మీద వ్యామోహం కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-12-కాంప్–అమెరికా

Posted in సేకరణలు | Tagged , , | 1 Comment

ఎమిలి బ్రాంట్

 ఎమిలి బ్రాంట్ 

1847లో ఇంగ్లాండు దేశం లో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల సంప్రాదాయ జీవన విధానం దెబ్బతిన్న తీరును ,సాంఘిక వర్గ భేదాలను ,భూమి పై యాజ మాన్యం పోవటాన్ని దానివల్ల అప్పటి దాకా వచ్చిన సాంఘిక హోదా మారి పోయి ధనిక సంపన్న వర్గాలకే హోదా రావటాన్ని వారే” జెంటిల్  మెన్ ” గా చేలా మణీ అవటాన్ని ఎమిలీ బ్రాంట్ అనేఇంగ్లాండ్  రచయిత్రి  ”wuthering heights ”అనే తన నవల లో అద్భుతం గా ఆవిష్కరించింది .ఆమె జీవిత విశేషాలను తెలుసు కొందాం .
1818 లో ఎమిలి బ్రాంట్ట్ జూలై 30న లండన్ దగ్గర thornton -yarkshire లో జన్మించింది .తండ్రి పాట్రిక్ బ్రాంట్   ,తల్లి మెరియా .ఆరుగురు సంతానం లో అయిదవ పిల్ల ఎమిలి .మూడేళ్లకే తల్లిని కోల్పోయిన అభాగిని .ఆతల్లి సోదరి ఎలిజ బెత్ వీరందర్నీ సాకి ,పెద్ద వాళ్ళను చేసింది .ఏడేళ్ళ తర్వాతా స్కూల్ లో చదువుతున్న అక్కలు మెరియా ఎలిజే బెత్ లు అంట వ్యాధి తో మరణించారు .ఎమిలీ ని వేరు గాహావర్త్ లో  ఉంచారు .ఇక్కడ ఆమె పదేళ్లు ఉంది .తండ్రి పిల్లల కోసం కొయ్య సైనికుల బొమ్మలు కొని ఇచ్చాడు .వీటితో ఈమె ఆడుకొంటూ వాటి గురించి ఊహ తో కధలు రాసింది .అవే ”గొందాల్ ”కధలు గా ప్రసిద్ధి చెందాయి అవి ఆమె భావోద్వేగాలే అంటారు విశ్లేషకులు . చార్లెట్అనే సోదరి టీచర్ గా చేరి ఏమిలిని తన శిష్యురాలిగా చేసుకోంది.తర్వాతా ఎమిలీ కూడా అసిస్టంట్ టీచేర్ అయింది .ఆమెకున్న సిగ్గు ,బిడియం కలిసి పోనీ తనం, ఆమె ను టీచేర్ గా రాణించ టానికి ఉపయోగ పడ లేదు .
ఇరవై ఏళ్ళ వయసు లో ఎమిలి ”హావర్త్ ”కు తిరిగి వెళ్ళింది .సోదరి లంతా కలిసి ఒక స్కూల్ పెడదామని అనుకొన్నారు కాని .డబ్బు లేక ఆగి పోయారు .తండ్రి పైన్టింగ్ చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .ఇతర భాషలు నేరిస్తే కాని బడి పెట్టటం కుదరదని తెలిసి ఎమిలి ,చార్లేట్లు  బ్రసేల్సు కు వెళ్లారు .అక్కడ ఫ్రెంచ్ ,జర్మన్ భాషలు నేర్చారు .వీరిని పెంచిన పేద తల్లి చని పోయింది .ఆమె వీరికి కొంత ధనం ఇచ్చి చని పోయింది .దాన్ని ఎలా బాగా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ తండ్రి దగ్గరే ఉంది ఎమిలి .తాను ఇది వరకు రాసిన కవితలన్నీ కాపీ చేసి ”గోదాన్ పోయెమ్స్ ”గా పేరు పెట్టింది .వీళ్ళ సోదరుడు బ్రాన్వేల్ సరిగ్గా పని చేయక పోవటం ఉద్యోగం పోగొట్టుకొని నెత్తిన కుంపటి లాగా ఉన్నాడు .
చార్లేట్ బ్రాంట్ రాసిన” jane eyre ;”నవలా ఎమిలీ రాసిన” wuthering heights ”నవల ఒకే సారి ప్రచురితం అయాయి .చార్లేట్ నవల బాగా ఆకట్టు కొంది కాని ఎమిలి నవల ఆశ్చర్యాన్ని కల్గించింది .ఈమె రాసిందా అనుకొన్నారు అందరు .సోదరుడు బ్రాన్వేల్ చని పోయాడు .మిగిలిన ముగ్గురు సోదరిలు చాలా ఆందోళన కు గురై నారు .తండ్రి కూడా అంతకు ముందే పోయాడు .చివరికి ఎమిలీ కూడా క్షయ వ్యాధి తో1948 december 19 న మరణించింది .ఆమెను హోవార్త్ స్మశాన వాటిక లో సమాధి చేశారు .32ఏళ్ళ కే ఆమె తనువు చాలించింది .సోదరి చార్లేట్ shirley అనే పుస్తకాన్ని ఎమిలీ అన్నే లకు అన్కితమిచ్చింది .1850లో  ఎమిలీ రాసిన wuthering heights ;;నవలను పునర్ముద్రణ చేస్తూఎడిట్ చేసి ఉపోద్ఘాతం రాసింది చార్లేట్ . .ఈ నవలను సినీమా గా కూడా అదే పేరుతో తీశారు .చార్లేట్ ,ఎమిలీ లు ఇద్దరు అక్కచెల్లెళ్ళు నవలా సాహిత్య రచన లో నవలా మణులని పించుకొన్నారు .
ఈ నవలలో ఎమిలీ తాను చూసిన పల్లె ప్రాంతాలను ,జనుల్ని కధలో చేర్చింది .తన ఊహా శక్తిని జోడించింది .ఆమె లోని బిడియాన్ని పాత్రలలో ప్రవేశ పెట్టింది .అందులోని eath cliff పాత్రకు ఆమె ప్రేరణ .సోదరుడు బ్రాన్వేల్ పాత్రను అందులో చొప్పించి చెడుకు సమాజం లో స్తానం లేదని తేల్చింది .ఈ నవలలో వర్గ పోరాటం ఉంది .దాని ప్రతిభా వంతం గా చిత్రించింది .ఇంగ్లాండు లోని పారిశ్రామీకరణ విప్లవం వల్ల సమాజం లో వచ్చిన కొత్త సామాజిక అధికారాలను,హోదా లను .పారిశ్రామీ కరణ తో మధ్య తరగతి కుటుంబాలు పొందిన ఆటు పోట్లను తెలియ జెప్పింది . వర్గ శత్రుత్వాలను వివరించింది .సమాజం పై దీని ప్రభావం ఎలా ఉందొ ,దాని వల్ల  వచ్చిన కొత్త విదానాలేమితో తెలుస్తాయి.సహజ విలువలకు సామాజిక విలువలకు మధ్య ఉన్న విభేదాలు తెలుసుకొనే లా చేసింది .ఒక రకం గా సమాజ ఐక్యతను బో ధించిందని చెప్ప  వచ్చు .
కాపిటలిజం పెరుగుతున్న తీరును చూపించింది .వర్గ పోరాటం తప్పదన్న మార్కిస్టు భావనా కనిపిస్తుంది .మనుష్యులు అప్పటి దాకా అనుభ వీస్తున్న స్వాతంత్రం పోతోంది అనే భావన కల్పించింది నవలలో .కొందరు విశ్లేషకుల భావన లో డార్విన్ సిద్ధాంతానికి ఈ నవల ఒక వ్యాఖ్యానం .వారసత్వ అధికార కేంద్రీకరణ ను నిరసించింది .బీద వారు బ్రతకటానికి సమర్ధ వంతులు అని చాటి చెప్పిన్దిఎమిలీ అన్నారు .మనషి ఈ విశ్వానికి కేంద్రం కాదని చెప్పింది అన్నారు ఒకరు .సంపద ను కేంద్రీక రించే వారిని ఎదిరించి నిలవాలనేది సిద్ధాంతం గా కనిపిస్తుంది .అనేక సాంఘిక సమస్యలను ఈ నవలలో చర్చించి తన భావనా బలాన్నిరచనా శక్తిని అధ్యన స్వభావాన్ని  జోడించి ఎమిలీ బ్రాంట్ట్ రాసిన ఈ నవల ఇప్పటికీ అందర్నీ చదివిన్చేట్లు చేస్తూనే ఉంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —6-8-12- కాంప్–అమెరికా

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

జన వేమన -20 దేశీయుల పై వేమన ప్రభావం

 జన వేమన -20
దేశీయుల పై వేమన ప్రభావం

వేమన గారి శిష్యులు ఆయన పై ఒక ద్విపద కావ్యం రాసి భక్తిని ప్రకటించుకొన్నారు .వేమన శిష్యులకు ముఖ్య మైన యేడు సిద్ధాంతాలను బోధించాడు .అవి -దొంగతనం చేయరాదు ,భూత దయ కలిగి ఉండాలి ,ఇతరులను నొప్పించ రాదు, ,ఉన్నదానితో తృప్తి చెందాలి ,మాత్సర్యం కూడదు ,కోపాన్ని వదిలేయాలి ,సదా ఈశ్వర ఆరాధన చేయాలి .ఇవన్నీ సర్వ మతాల సారమే .
వేమన లాంటి వారెవ రైనా ఉన్నారా అని అనుమానం వస్తుంది .కొంత పరిశీలించి చూస్తె ,ఉన్నారనే తెలుస్తోంది .కన్నడ దేశం లో 1760 లో జన్మించిన ”సర్వజ్ఞుడు ”వేమనకు సరి సాటి గా తోస్తాడు .ఈయనకు తన శక్తి పై అపార నమ్మకం .”త్రిపద ”అనే గీతాలు రాశాడు .వీటి సంఖ్య అయిదు వేలు ట.పెద్దలఎడ వినయ విధేయతలు ,ఓర్పు ఉండాలని  బోధించాడు .”సర్వజ్ఞ  వేమన సంవాదం ”అనే సమానార్ధం గల పద్యాలు కన్నడం లో ఉన్నాయట . మహా రాష్ట్ర కు చెందిన ”సంత్ తుకారాం ”  వేమన వంటి వాడే .సమానత్వాన్ని బోధించాడు .శివాజీ కి సమకాలికుడు .1608 లో జన్మించాడు .  4600   ల పదాలున్న గ్రంధం రాశాడు .ఉపనిషత్ సారాన్ని బోధించాడు .తమిళ దేశానికి చెందిన ”అవ్వయ్యార్ ”చాలా ప్రసిద్ధి చెందిన బోధకు రాలు .”అత్తి సూడి ” అనే  108   సూత్రాలను, ”కొంరై వెండ్రాన్ ”అనే 91సూత్రా లను రచించిన యోగిని .సుమతీ శతకం లా గా పాఠ్య పుస్తకాలలో వాటిని చేర్చారు .”అవ్వై కూరల్ ”అనే వేదాంత గ్రంధాన్ని రాసింది .ఆమె పై సినిమా కూడా వచ్చింది .పండరి బాయి అవ్వయ్యార్ గా నటించింది ,
ద్రావిడ కవి ”అరుణ గిరి నాధుడు ”1465లో జన్మించాడు ..సహజ పాండిత్యం ఉన్న కవి .వేమన లాగా వేశ్యా లోలుడై ,చివరికి జ్ఞాని యై ”తిరుప్పుహళ్ ”అనే 16వేల పదాలు రాశాడు .”కందరనబూతి ”,,”కందరలంకారం ”అనే గ్రంధాలు కూడా వ్రాసి నట్లు ఉంది .ఈయన భాష కూడా వేమన భాష అంత మాధుర్యం గా ఉంటుంది .తమిళ దేశానికి చెందిన”తిరు వల్లువార్ ””కురలీ ”అనే 1330 పద్యాలున్న ప్రఖ్యాత గ్రంధం రాశాడు .సత్యాన్ని ,నీతిని పాటించాడు .చాలా అద్భుతాలు చూపించాడు .దీనినే కను పర్ వెంకట రామ శ్రీ విద్యా నందుల వారు ”త్రివర్గ దీపిక ”పేర తెలుగు లో అనువదించారు .భావాల్లో వేమన కు సమానం గా ఉన్నాయట .వీరంతా వేమన లాంటి ఇతర భాషా కవులు .
ఇప్పుడు మన వేమన ను ఎవరెవరు అనుసరించారు అనే విషయానికి వద్దాం .ఆయన శిష్యులు ,ప్రశిష్యులు చాలా మందే కన్పిస్తారు .విరాట్ పోతు లూరి వీర బ్రహ్మేంద్ర రుషి వేమన్న ను,ఆయన మతాన్ని  అనుసరించారు .యోగ సాధన చేశారు .విగ్రహారాధన నిరాకరించారు .దూదేకుల సిద్దయ్య ఆయన కు ముఖ్య శిష్యుడు .జాతి భేదం పాటించలేదు బ్రహ్మం గారు .”సిద్ధ బోధనం ”అనే గ్రంధాన్ని రాశారు బ్రహ్మం గారి ”కాలజ్ఞానం ”ప్రసిద్ధం ..కుమార్తె ఈశ్వరమ్మ బ్రహ్మ  చారిణి గా ఉండి ,తండ్రి కి తగ్గ వారసు రాలైంది .బ్రహ్మం గారి సమాధి ”కంది మల్లయ్య పాలెం ”లో ఉంది .సజీవ సమాధి పొందిన సిద్ధ పురుషుడు వీర బ్రహ్మం గారు .
1780లో పుట్టిన తుంగ వేమన శిష్యుడు .ఈయన్నే మనం ”డూప్లికేట్ వేమన్న” అని చెప్పుకొన్నాం .”ఏగంటి వచనాలు ”రాసిన ఏగంటి లక్ష్మయ్య వేమన శిష్యుడే .ఈయన వచనాలు బాగా ప్రచారం పొందాయి .”ముత్యాల నార సింహ యోగి ”వేమన గారి మీద భక్తీ తో ”వేమన జ్ఞాన మార్గ పద్యములు ”రాశాడు .దిగంబర యోగికి ఈయన శిష్యుడైనాడు .”జీవ తత్వ ప్రబోధక సుమాలి ” .అనే కంద పద్య గ్రంధం రాశాడు .రాజ మండ్రి నివాసి ”నిట్టల ప్రకాశ దాసు ”వేమన మార్గాన్ని అనుసరించిన సాధకుడు ,గొప్ప యోగి .యోగ మహిమ తో గోదావరి నీటి పై కూర్చుని అవతలి ఒడ్డుకు చేరిన శక్తి శాలి ..పాటలు ,తత్వాలు రాశాడు .
తూర్పు గోదావరి కి చెందినా వాడు కాకినాడ వాసి ”ఎడ్ల రామ దాసు” చాలా గ్రంధాలు రాశాడు .ఈయనకు శిష్యులు కూడా ఎక్కువే .పద్యాలు ,పాటలు ,తత్వాలు రాశాడు .వేమన లాగా కీర్తి సాధించాడు .వీటి నన్నిటిని శ్రీ నేదునూరి గంగాధరం గారు విపులంగా చర్చించారు .”యెడ పాటి ఎర్రా ప్రగడ ‘కవి ”మల్హణ చరిత్ర ”లో ,తురగా రామ కవి రాసిన ”నాగర ఖండం ‘లో పింగళి ఎల్లన్న రాసిన ”తోభ్య చరిత్ర ”లో వేమన గురించి ఉంది .వేమన 150పద్యాలను ఆంగ్లం లోకి అనువదించి ప్రచురించారు శ్రీ యే.ఎల్.యెన్ .మూర్తి .విద్వాన్ బండ్ల సుబ్రహ్మణ్య కవి ”వేమన -వేయి పద్యాలు ”పేరిట వేమన కవితా విశేషాలను ,వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ ”విశ్వ వినుత చర్య -వేమనార్య ”అనే మకుటం తో గొప్ప పద్యాల ముత్యాల పందిరి వేసి వేమన యోగిని ఊరేగించారు .మచ్చుకో పద్యం –”నీదు కవితా స్రవంతి లోనిశిత భావ -జీవ రత్నాల వెలుగులు చిందు లాడ -వెలుగు గన లేని చీకటి పులుగు లెల్ల -దొలగి పోయిన నీకేమి దొసగు పొసగు ?”ఈ విధం గా ఆనాడే కాదు400 సంవత్స రాలు దాటినా వేమన్న అంటే భక్తీ ,అనురక్తి ,ఆసక్తి వ్యాసక్తి తగ్గ లేదు .జనం నాలుక పై వేమన నిత్యం నర్తిస్తూనే ఉన్నాడు .అందుకే కట్టమంచి రామ చంద్రా రెడ్డి గారు ”తారకలలో ధ్రువ తార -వేమన ”అనటం సముచితం గా ఉంది .’శతక కవి రాజు ”అన్నారు రాజా ఏం .భుజంగ రావు .ఆంగ్లం లో పోపు రాసిన ”హీరియిక్ కప్లేట్ ” లకు ఎంత ప్రచారం ఉందొ వేమన ”ఆటవెలది ”అంత సర్వాంగ సుందరం గా ఉంది ”అన్నారు నార్ల వారు .
ఆంగ్లం లో ”రాబర్ట్ బర్న్స్ ”కవిలా వేమన గ్రామీణ కవి .స్వయం సమృద్ధ మైన ఉదాత్త సంప్రదాయాన్ని సృష్టించాడు .భావోద్వేగం పొంగి పొరలిన గడియల లో ఆవిర్భా వించిన కవిత ఆయనది .ఉపమానాలు వేమన కవిత లో సూక్తులు గా ఉండి ,నవ్యతా ,నాణ్యత పొందాయి .ఆట వెలది లోని మోడో పాదాలు తెలుగు సామెతలుగా చేలా మణి అయాయి .వ్యాజ స్తుతి ,వ్యంగ్య పరిహాసం వేమన సహజ ప్రకృతి .చురుక్కు మనే వాడి దనం నుండి ,మృదు వైన పరిహాసం గా సరళ మైన వ్యంగ్యం గా దశల వారీగా వేమన శైలి మారుతుంది ”అని కట్టమంచి ,కొట్టొచ్చి నట్లు గ మెచ్చి ,ఇచ్చిన కితాబుమతాబే. మంచి వెలుగులను కుమ్మరించింది .జర్మన్ కవి ”గోథే ”ను గురించి మాధ్యూ ఆర్నోల్డ్ ”బాధిత ప్రజానీకానికి పాటు పడ్డాడు .వారి ప్రతి గాయాన్ని ,ప్రతి బలహీనత ను పరిశీలించాడు ”అన్న మాటలు మన జన వేమన కూ వర్తిస్తాయి .”సహజ హాస్య చతురుడైన గ్రామీనుడు ,ప్రకృతి దార్శనికుల లో ఒకడు ”అన్న హూరెన్ అన్న మాటలు వేమనకూ చెందుతాయి .విశ్రుం ఖల మైన    ఆయన మేధస్సు ,ఆవేశ పూరిత స్వభావం ,స్వవచో ఘాతం చూస్తె అమెరికా జాతీయ కవి ”వాల్ట్ విట్మన్ ”తనను తాను చెప్పుకొన్న మాటలు ”నా వచనాలకే నేను వ్యాఘాతం కల్గిస్తున్నానా /అలా అయితే ,మంచిదే .నన్ను నేను వ్యతి రేకిస్తున్నాను .నేను విస్తార మైన వాడిని .నాలో సమస్తమూ నిండి ఉన్నాయి .”అనే మాటలు జ్ఞాపకం వచ్చి సాల్యూట్ చేయాలని పిస్తుంది .బెర్నార్డ్ షా కు ఉన్న చమత్కారం ,చాపల్యం ,స్పష్టతా ,టాల్ స్టాయ్ కున్న సార్వ కాలిక నైతిక అభినివేశం వేమన లో ఉన్నాయని పిస్తుంది .వేమన అసలైన చిత్రం వేయా లి అంటే ”ఆ కళ్ళ లోని కాంతిని ,పెదవుల పై వక్ర దరహాసాన్ని ,నడక లో చురుకు దనాన్ని ప్రతిబింబింప జేయ గలిగిన ”రఫెల్ రేమ్బ్రాన్దేంట్ ”వంటి చిత్ర కారునికే సాధ్యం ”అని నార్ల వెంకటేశ్వర రావు నానా విధ వేమన స్తుతి చేసి వేమన సాక్షాత్కారం కలిగిం చారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-9-12-కాంప్–అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –18 ” ఫర్ ”వ్యా పారం

 అమెరికా ఊసులు –18
                                                         ”  ఫర్ ”వ్యా పారం 

పది హేడవ శతాబ్దం నుంచి ఇతర దేశస్తులకు అమెరికా మీద వ్యామోహం ఎందుకు కలిగింది అంటే ఇక్కడ ఫర్ చర్మాలు విపరీతం గా లభిస్తాయని ,వాటిని వ్యాపారం చేసి కోట్లు సంపాదించ వచ్చు అనే ఆశ .ఇంతకీ ఫర్అంటే ఏమిటి ?అదొక జంతువు చర్మం .ఆ జంతువు పేరు ”బీవర్ ”.ఫ్రెంచి ,డచ్ వాళ్ళు క్యూబెక్ ,మాన్ హట్టన్ లకు కొద్ది సంఖ్యలో1606-1626కాలం లో . వచ్చారు .అప్పటికి వారికీ వాణిజ్య పంటలేమీ కనీ పించ లేదు .వారి ద్రుష్టి” ఫర్” ల మీద పడింది.  దీనితో వ్యాపారం చేసి ,లాభాలు గడించ వచ్చుననుకొన్నారు .డచ్ వాళ్ళు వాటి చర్మాలతో టోపీలు ,కోట్లు తయారు చేసి యూరప్ లో అమ్మితే ”డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ”అని గ్రహించారు .నెమ్మదిగా అందరు చేరారు .ఫ్రెంచి వారు ఇక్కడి ఉన్నత కుటుంబాలమగ  వారు ఫర్ కాప్ లను , ,ఆడవారు ఫర్ కోటు ను ధరించే సదుపాయం చేశారు .అంటే వారు దీన్ని స్థానికం గా నేవినియోగించాలని భావించారు .1640లో అధికం గా శిఖరాగ్రానికి ఫర్ వ్యాపారం చేరింది .అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా నుంచి ఫర్ లను దిగుమతికి అనుమతించింది .దీనితో బీవర్ల సంఖ్య క్రమం గా తగ్గి పోయి వ్యాపారం మందగించింది .ఈ జంతువులూ ఎక్కువ గా కెనడియన్ కాలనీల దగ్గర సెయింట్ లూయీస్ నది సమీపం లో ఉండేవి .అక్కడే వాటిని వల పన్ని పట్టుకొనే వారు .ఎప్పుడైతే ఇక్కడ బీవర్ ల సంఖ్య తగ్గిందో అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఒంటారియా సరస్సు వైపుకు ,ఆ తర్వాతా సుపీరియర్ సరస్సు వైపుకు కదిలి వెళ్లారు .డచ్ వాళ్ళు మాత్రం మాన్ హట్టన్ ,అల్బని లలో ఉండి పోయారు .మాన్ హట్టన్ ను వాళ్ళు” న్యూ ఆమ్ స్టర్  డాం ”అనీ ,ఆల్బని ని” ఫోర్ట్ ఆరంజి” అని పిలిచారు .1680లో బీవర్ మార్కెట్ దెబ్బతింది .1700నాటికి గ్రేట్ లేక్స్ వద్ద ఉన్న బీవర్ లన్ని పట్టు బడి ,ఖాళీ అయి పోయాయి .వ్యాపారం మందగించింది .మళ్ళీ ఈ వ్యాపారం 18 వ శతాబ్దం వచ్చే సరికి ఊపు అందుకోంది .వీటిని పట్టుకోవటానికి నేటివ్ అమెరికన్లు సాయం చేసే వారు .ఒకప్పుడు 60 మిలియన్లు ఉండే బీవార్లు ఇప్పుడు కేవలం 15 మిలియన్లు మాత్రమె ఉన్నాయి అంటే సిగ్గు పడాలి .
ఉత్తర అమెరికా స్వాతంత్రాన్ని పొంది బ్రిటన్ నుండి వేరు పడి పోయింది .అప్పుడు అమెరికన్లు మళ్ళీ బీవర్ల వేట కోన సాగించారు .రాకీ పర్వతాల దాకా వెళ్లి వీటిని పట్టుకోవటం ప్రారంభించారు .దానితో 1850నాటికి మళ్ళీ బీవర్ల సంఖ్య తగ్గి వ్యాపారం కుదేలయింది .ఇది శాస్త్ర వేత్తల దృష్టి లో పడింది .బీవర్ జంతువులను సంరక్షించు కోవాలనే తలంపు బలీన మైంది .అదృష్ట వశాత్తు బీవర్ జంతువులూ ఇరవై వ శతాబ్దం నాటికి గణనీయం గా అభి వృద్ధి చెందాయి .కెనడా ,అమెరికా లలో వీటి రక్షించే మార్గాలను విస్తృతం గా అమలు చేశారు .దీనితో పదిహేడవ శతాబ్దం నాటికి యూరోపియన్లు అమెరికా కు రాక ముందు ఎంత బీవర్ సంతతి ఉందొ ,ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువ సంఖ్య లో బీవర్లు ఉండటం ప్రకృతి లో ఒక గొప్ప ప్రయోగాత్మక ఫలితం ”.లాంగ్ లివ్ బీవర్ ”.
 మరిన్ని అమెరికా ఊసులు 
రాబర్ట్ డిల సాల్వే అనే అనే అన్వేషకుడు ఫ్రాన్సు నుండి కెనడా కు గ్రేట్ లేక్స్ ను అన్వేషించాలని వచ్చాడు .ఇక్కడి ఇండియన్ అమెరికన్లతో స్నేహం చేశాడు .వారున్న చోట్ల చాలా ఫ్రెంచి కోటలను నిర్మించాడు .అయితే ఆయన్ను మిసిసిపి నది ని చూసిన వాది గానే భావిస్తారు కాని అతని ఉద్దేశ్యం మిసిసిపి నది ఒడ్డున ఫ్రెంచి కాలని ఎర్పరచాలన్నదే ఆయన ధ్యేయం .ఒంటారియా సరస్సును కు  ఇండియన్లు ”అందమైన సరస్సుఅని వాళ్ళ భాష లో అర్ధం చెబుతారు . ఆ రోజుల్లో ఇక్కడి ఇండియన్ అమెరికన్లకు అయిదు రాజ్యాలున్నాయి .అవి mohawk ,oneida ,onandaga ,cayuga.వీరందరి సంస్కృతి ఒకటే .ఒకే భాష మాట్లాడుతారు .వీరు విపరీత మైన పోరాట పటిమ కల వారు .వీరేప్పుడూ యుద్ధాలలో జయం పొందిన వాళ్ళే .ఈ అయిదు రాజ్యాలు డచ్ వారితో చేతులు కలిపారు .వీరికి ఫ్రెంచ్,కెనడా  వారంటే విపరీత మైన ద్వేషం .దీనికి కారణం 1690లో సామ్యుఎల్ డీ చామ్ప్లాన్ తమతో యుద్ధం చేసి” న్యు ఫ్రాన్స్” ఎర్పరచాడని కోపం. .1660నాటికి ఫ్రెంచి వారికి వీరే దిక్కు అయారు .బ్రిటీష వారిని ఎదిరించటానికి వీరు వారికి తోడ్పడ్డారు .
మిసిసిపి నదిని ఇండియన్లు ”ఫాదర్ ఆఫ్ వాటర్స్ ”అంటారు వారి భాష లో .ఫ్రెంచి వారు మిస్సోరి నది లోని ఒండ్రు నీటి ని మొదటి సారిగా చూశారట .అలాగే ఒహాయో నది లోని నీటిలో ఒంద్రుమన్ను ఉండటం గమనించారు .జోలిఎట్ అనే యాత్రికుడు ఒంటారియా సరస్సును అన్వేషించే పనిలో ఉండగా మాంట్రియల్ మరియు గ్రేట్ లేక్స్ ల మధ్య గమ్యానికి ఎనిమిది మైళ్ళ దూరం లో ఓడ తలక్రిందులై అతను అప్పటిదాకా రాసి పెట్టుకొన్న విలువైన సమాచారం అంతా సెయింట్ లారెంసు నది నీటి లో కలిసి పోయింది  పాపం .మిసిసిపి నది మీదుగా ప్రయాణించిన మొదటి యాత్రికుడు లా సాల్.అయితే అతని అహంభావత్వం మోసం చూసి తోటి నావికులు భరించలేక 1687 లో ఈనాటి టెక్సాస్ లోని నవ సోటా వద్ద హత్య చేసి శరీరాన్ని నక్కల పాలు చేశారు .1697-99మధ్య కాలం లో పద్నాలుగవ లూయీ అనే ఫ్రాన్సు రాజు ఫ్రెంచ్ సోల్జర్ ”pierre le moyne d’iberville” ని కమాండర్ గా చేసి మిసిసిపి నది ముఖ ద్వారం లో ఒక ఫ్రెంచ్ కాలని ని ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాడు .అతను బిక్సౌలి వద్ద లూసియానా లో  మొదటి ఫ్రెంచి కాలని ని ఏర్పాటు చేసి రాజు గారి కోరిక తీర్చి ప్రభు భక్తీ చాటుకొన్నాడు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

గ్రీకుల స్వర్ణ యుగం

 గ్రీకుల స్వర్ణ యుగం 

భారత దేశం లో గుప్తసామ్రాజ్య పాలన ను ”స్వర్ణ యుగం ”అని గొప్పగా చెప్పుకొంటాం .అలానే గ్రీకు దేశస్తులు ”అయిదవ శతాబ్దాన్ని” తమ ”స్వర్ణ యుగం ”గా భావిస్తారు .అప్పుడే విద్యా వైద్య కళా సాహిత్య శిల్ప రాజకీయ,సాంస్కృతిక  వేదాంతాదివిషయాలలో ఏంతో అభి వృద్ధి సాదించిం దని ,ఆ కాలం లో జన్మించిన కవులు రచయితలు ,కళాకారులు ,శాస్త్ర వేత్తలు ఆదర్శ వంతులని  ,అప్పుడే అద్భుత గ్రంధాలన్నీ వెలువడి భవిష్యత్తు తరాలకు కర దీపికలు గా నిలిచాయని వారి భావం .అంతే కాదు వారి వైద్య శాస్త్ర పితామహుడు హిపోక్రటీస్ ఆ కాలం లోనే జన్మించి వైద్య శాస్త్రానికి పునాదులు నిర్మించాడనీ గర్వ పడతారు .అందుకే వారు ఆ కాలాన్ని ఆయన పేరు మీద గౌరవం గా ‘హిపోక్రటీస్ యుగం ”అంటారు .
ఈ కాలం లోనే ప్రపంచమ్ లో మొట్ట మొదటి ప్రజా ప్రభుత్వం -డేమోక్రాసి ఏర్పడింది ఎతేన్సు లో .ప్లాటో ,అరిస్టాటిల్ మొదలైన తత్వ వేత్తలు సత్య దర్శనం చేసి ప్రపంచానికి చాటారు .ఆనాడు దేశాలకు సరి హద్దులనేవి లేవు .అంతా ఐక్య గ్రీకు రాజ్యమే .పోలిస్ అనే పౌర రాజ్యాలున్దేవి .తమ ప్రభుత్వాలను తామే పాలించుకొనే వారు .పోలిస్ అంటే ముఖ్య పట్టణం దాని చుట్టూ జనావాసాలు పొలాలు ,అడవులు చుట్టూ ప్రక్కల గ్రామాలు అన్నీ పోలిస్ కు చెంది ఉంటాయి .అక్కడ గ్రామీణ వికాసం బాగా జరిగేది .ఎన్నో మార్బుల్ ,వెండి గనులున్దేవి .ముఖ్య నగరానికి చుట్టూ ఎత్తైన గోడ ఉండేది .ఆ కాలం లో యుద్ధాలు ఎక్కువే .సాధారం గా గ్రీకు నగరాలు ఒక కొండ దగ్గరే నిర్మింప బడేవి .దేవాలయాలు ఎత్తైన కొండల మీద ఉండేవి .వీటిని ”ఆక్రోపోలిస్ ”అనే వారు .గ్రీకుల నగర మధ్యభాగం లో ఎంతో సందడి ఉండేది .దీన్ని ”అగోరా ”అంటారు .మన డౌన్ టౌన్ లాటివన్న మాట .ఇక్కడే ప్రభుత్వ ఆఫీసులు దుకాణాలు ,మార్కెట్లు దేవాలయాలు  గ్రీకు పోలిస్ లుఈ నాటి  ఉత్తర ఆఫ్రికా ,ఆసియా మైనర్ ,ఫ్రాన్సు ,ఇటాలి రష్యా ,సిరియా ల వరకు వ్యాపించి ఉండేవి .అన్నిటి మధ్య దృఢ మైన బంధం ఉండటం విశేషం .
హిపోక్రాటి క్ కాలపు రచయితలు ”కాస్”,మరియు” స్నిడాస్ ”అనే ప్రాంతాలకు చెందిన వాళ్ళు .కాస్అనేది ఏజియన్ సముద్రం లోని దీవి .ఏషియా మైనర్ కు సమీపం లో ఉండేది .ఇప్పుడు దాన్ని టర్కీ అంటారు .”స్నిదాస్ ”దానికి దగ్గరే ఉన్న తీర ప్రాంతం .హిపోక్రటీ ”కాస్ ”నివాసి .గ్రీకులు తమను తాము ఎతీనియన్లు ,కొన్సు ,క్నాడియన్లు అని గర్వం గా చెప్పుకొంటారు .అంటే ఒకే గ్రూప్ రక్తం కల వారని  ఒకే భాష కల వారని ,ఒకే మతం కల వారని భావన .వీరందరి పూర్వీకులు గ్రీకులు అని అర్ధం .వారందరి భాషా గ్రీకు .గ్రీకు భాష మాట్లాడని వారిని ”బార్బెరియన్లు ”అంటారు .అంటే వీరికి మిగిలిన భాషా శబ్దాలు ”బర -బర”లాగా వినిపిస్తాయని భావం .మనం అరవ భాష మాట్లాడే వారిని ”డబ్బా లో రాళ్ళు పోసి వాయించి నట్లు ఉంది ”అనటం తెలిసే ఉంటుంది .అలానే వాళ్ళకూ .ఒకే మతం అంటే ఒకే  ”దేవతా సమూహం ”ను అందరు పూజిస్తారు అని అర్ధం .గ్రీకు పురాణాలలో పన్నెండు మందిదేవుళ్ళు  దేవతలు ఉన్నారు .వారంతా మానవ రూపాలతో  సంక్లిష్ట వ్యక్తిత్వాలతో ఉంటారు .మానవ జీవితాలతో చెలగాటం ఆడతారు .ప్రతి దేవతకు నిర్దుష్ట శక్తి కార్యక్రమం ఉంటాయి .అందులో ”జియాస్ ”అధిక శక్తి వంతుడు .పోసిదాన్ సముద్రానికి అది పతి .ఆఫ్రోడైట్ ప్రేమ కు నిలయం .వీరు గాక కొందరు చిల్లర దేవుళ్ళు కూడా ఉన్నారు  .సైన్స్ కు సంగీతానికి వేరే దేవతలుంటారు .మూడో వర్గం లో హీరో లు ఉంటారు .హీరోలు శక్తి సామర్ధ్యం ఉన్న వారే కాని మరణాన్ని తప్పించుకో లేరు .ఆస్లేపియాస్ అనే దేవుడు రోగ  నివారణకు ప్రాతి నిధ్యం వహిస్తాడు .
గ్రీకు కాలెండర్ లో పండుగలకు ప్రాముఖ్యం ఉంది .దేవతలను ప్రసన్నం చేసుకొనే ప్రక్రియలు చేస్తారు .సంబరాలు ఉత్స వాలు పూజలు నిర్వ హిస్తారు .దేవతలకు విలువైన కానుకలు సమర్పిస్తారు జంతుబలి చేస్తారు .వారిని ప్రసన్నం చేసుకోవటానికి చాలా చేస్తారు అందమైన శిల్ప సౌందర్య విలసిత మైన దేవాలయాలను నిర్మించి అందులో వీరిని ఉంచి   సేవిస్తారు .హిపోక్రటిస్ కాలానికి బాలుర బడులు  బాగానే ఏర్పడ్డాయి .ఎడేల్లకే బడిలో చేరే వారు .ఆడ వారికి విద్య లేదు .ఇంటి పని ,పెనిమిటి పని తప్ప .బడులలో హోమర్ రాసిన ”ఒడిస్సీ ””ఇలియడ్ ”లను నేర్పే వారు సంగీత వాయిద్యాలతో వాటిని గానం చేసే వారు .”లైర్” అనే వాయిద్యం బాగా ప్రచారం లో ఉండేది .ఆటలను అబ్బాయిలు బానే ఆడే వారు .పరుగు పందెం ,డిస్కస్ త్రో ,జావెలిన్ ,కుస్తీ పోటీలు జరిగేవి .అన్నీ ప్రైవేటు బడులే .కొద్ది కాలమే బడి చదువు .ధన వంతుల పిల్లలు ఎక్కువ కాలం చదివే వారు .
గ్రీకు పురాణాలలో విజ్ఞాన ద్రుష్టి కనిపిస్తుంది .జియాస్ అనే దేవుడు మెరుపులు సృష్టిస్తాడని నమ్మకం .పాసిదాన్ భూకంపాలు.తుఫాన్లు ,గ్రహణాలు ఋతువులు  ఎర్పరుస్తాడని నమ్మే వారు .ఈ కాలం లో ప్రకృతిని అధ్యయనం చేయటం పెరిగింది .వివేచనా తో కార్య కారణ దృష్టితో సమాదానాలకోసం ప్రయత్నించారు .తెలేస్ అనే ఆయన అన్ని వస్తువు లకు కారణ భూత మైన ఒక పదార్ధం ఉంటుందని అదే ”నీరు ”అని భావించాడు .భూమిలోని నీటి పొరల కదలిక వల్ల భూకంపం వస్తుందని చెప్పాడు .ఇలా పురాణాల నుండి కాక సహజ ప్రకృతి నుండి సమాధానాలను తెలుసుకోవటం ప్రారంభామైనదిఇ ప్పుడే .anaximander అనే అతను సూర్య చంద్ర నక్షత్రాలను అధ్యయనం చేశాడు .భూమి సిలిండర్ ఆకారం లో ఉంది అని చెప్పాడు. జంతువులూ ”తడి ”నుంచి ఉద్భవించాయి అన్నాడు మనిషి ఒక రక మైన చేప నుండి ఆవిర్భా విన్చాడని భావించాడు .మన మత్సా వతారానికి దగ్గర్లోనే ఉంది కదా .
ఈ కా లం లో మేదావులందరూ తరచూ గా కలుసు కొంటూ తాము సాధించింది మిగిలిన వారికి తెలియ జేస్తూ దాని పై తర్జన భర్జనలు చేస్తూ నిజాన్ని రాబట్టు కొనటం గొప్ప అలవాటు గా ఉండేది .అలా చేయటం వల్ల ఎవరు యే రంగం లో ఏమేమి సాధించారో తెలుసుకొనే ఆవ కాశం లభించింది .తరు వాతి తరాల వారికి మార్గ దర్శనం చేసి నట్లూ ఉండేది .హిపోక్రటిస్ కు ముప్ఫై ఏళ్ళ ముందు empedocles జన్మించాడు .ఆయన ప్రకృతి లో నాలుగే నాలుగు మూల కాలున్నాయని వాటి వల్లనే పదార్ధాలన్నీ ఏర్పడుతున్నాయని చెప్పాడు .అవే అగ్ని ,నీరు ,భూమి ,గాలి .వాటిని ఆయన మూలకాలు అన్నాడు కాని అవి సంయోగ పదార్ధాలు ,ఇవాళ మనకు117 మూలకాలున్నాయి .ఆయన భావన లో ఎముక అనేది నాలుగు భాగాల నిప్పు ,రెండు భాగాల నీరు ,రెండు భాగాల మట్టి కలిస్తే ఏర్పడుతుంది .ఈ నాలుగు మూలకాల భావన చాలా కాలం గ్రీకు శాస్త్ర వేత్తల దృష్టిలో ఉండి పోయింది .
ఈ యుగాన్నే హిపోక్రటిస్ యుగం అన్నాం  కదా  మరి ఆయన వైద్య శాస్త్రానికి చేసిన సేవ లేమిటో తెలుసు కొందాం .ఆయన కాస్ దేశ వాసి .460 b.c.లో జన్మించాడు .వైద్య శాస్త్ర పితామహుడు అనిపించుకొన్నాడు .వైద్యాన్ని ఒక శాస్త్రం గా నిర్వహించాడు .ఆరోగ్యం ప్రకృతి ఇచ్చే వరం అన్నాడు వ్యాధులను వర్గీకరణ చేసి ”the sacred diseases ”పేరా ఒక విభాగం రాశాడు .అలాగే హృదయం పైన విషయాలను క్రోడీకరించి చెప్పాడు .శరీరం లో blood ,yello bile ,black bile ,pelgm ”,అనే రసాలున్నాయన్నాడు .ఇవి నియంత్రణ ను కోల్పోతే శరీరాంకి జబ్బు చేస్తుందని అన్నాడు .on the nature of man లో వీటిని గురించి పూర్తిగా వివరించాడు .వైద్యాన్ని ”ఒక కళ”గా గుర్తించిన మహానుభావుడాయన .ఆయన పుస్తకం లో మొదటి వాక్యాన్ని మనకు ఆయన రాశాడని తెలీకుండానే ఉప యోగిస్తాం ఆది ”life is short and the art is long ;”
వైద్యులకు నీ తి సూత్రాలు చెప్పాడు .రోగిని బ్రతికించే అన్ని ప్రయత్నాలు చెయ్య మన్నాడు .మంచి” పధ్యం” గురించి చెప్పాడు .ఎముకలు విరిగితే, కీళ్ళు జారితే చేయాల్సిన ప్రక్రియ లన్ని హిపోక్రటిస్ యుగపు వై ద్యు లకు తెలుసు .వైద్యులు రోగం తగ్గించటానికి విశ్వ ప్రయత్నం చేయాలి ”the prime objective ofthe phy sician .in the whole art of medicine should be to cure that which is diseased and if this can be accomplished in various ways ,the least troublesome should be selected ”.అని డాక్టర్లకు జ్ఞాన బోధ చేశాడు .వైద్యు లందరూ వ్రుత్తి లో చేరే టప్పుడు ఒక ప్రమాణాన్ని చేయాలని శాసించాడు .అదే ” hipopocrates oath” అనే పేర పిలువ బడుతోంది .అందరు డాక్టర్లు ఆ ప్రమాణాన్ని చేస్తారు .ఆది నిలుపు కోవా టా నికి మంచి వైద్యులు అందరు  ప్రయత్నిస్తారు .ఒక తరాన్ని తన పేరు మీద పిలి పించుకొనే ఘనత హిపోక్రటి స్ కు దక్కింది .ఆయన కాలం అందుకే స్వర్ణ యుగం అయింది .
మీ –గబ్బట   దుర్గా ప్రసాద్ –5-9-12-కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

జన వేమన –19 వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు

   జన వేమన –19
వేమన పై ప్రసరించిన వెలుగు చీకట్లు  

వేమన కవిత్వానికి ముగ్ధులై ప్రశంశల జల్లు కురి పించిన పాస్చాత్యాలలో మొదటి వాడుఫ్రెంచి దేశానికి చెందినమత గురువు జె.యే.దుబాయ్ ,”ఉదార వేదాంత విషయాలను రాసిన హిందూ రచయిత లలో ,అందులో హిందూ మాతా చారాలను విమర్శించిన వారిలో ఒక్క బ్రాహ్మణుడు కూడా లేడు .ఇలాంటి విమర్శ గ్రంధాలు రాసిన వారిలో బ్రాహ్మణేతర కవులే ఉన్నారు .అలాంటి వారిలో తిరువళ్ళువర్ ,అగస్త్యుడు ,తమిళులు .సర్వజ్ఞా విజ్ఞాన మూర్తి కన్నగిడు .తెలుగు లో ప్రఖ్యాత కవి -వేమన .ఆయన రాసినవి ఇతర భాషల్లోకి ప్రవేశించాయి .ఆయన రచనలు చిత్తా కర్శణం గా ,సూక్ష్మ బుద్ధి తో చేసిన విచారముగా ,స్వతంత్ర భావో పేతం గా ,ఒక ప్రత్యేకత లో ఉన్నాయి .”అని కీర్తించాడు .హెన్రీ బ్యూ చాంప్ అనే ఆయన దుబాయి రాసిన దాన్ని అనువాదం చేసి ప్రచురించాడు .విలయం బెంటిక్ ప్రభువు ఆ ప్రతిని మెచ్చి ,”సమైక్యత కు బాగా తోడ్పడు తుంది ”అని కితాబిచ్చాడు .ప్రభుత్వం చేత ఆ పుస్తకాన్ని కొని పించి ,ప్రచురించే కార్యక్రమానికి నాంది పలికాడు .దుబాయి గారికి 8000రూపాయలు బహుమతి గా ఇప్పించాడు లార్డ్ బెంటి క్ .
సి.పి.బ్రౌన్ మద్రాస్ లో   సివిల్ సర్వీసు ఉద్యోగం చేశాడు .భాష మీద ఆయనకు శ్రద్ధ కలిగింది .తాటాకుల మీద ఉన్న వేమన పద్యాలను సంగ్రహించి ,సవరించి ,ముద్రణ చేసి తెలుగు జాతికి వేమన ను ప్రసాదించిన మహా మహుడు .693పద్యాలను ఆంగ్లం లోకి అనువాదం చేసి ,తాత్పర్యం రాసి ,ముద్రించిన మొదటి వ్యక్తీ బ్రౌన్ .ప్రతి ఫలా పేక్ష లేకుండా ,తెలుగు జాతికి బ్రౌన్ చేసిన సేవ చిరస్మరణీయం .వీటిని లాటిన్ భాషలోకీ అనువాదం చేశాడు ”.the verses of Vemana -moral .religious and statistical ”అనే పేరు తో అనువాదం చేశాడు బ్రౌన్ .వేమనకు సరి తూగా గలిగే వాడు గ్రీకు దేశానికి చెందినా ”లూశియాస్ ”ఒక్కడే అన్నాడు .లూసియాస్ లాగా వేమన తెలుగు భాషా సాహిత్య ప్రారంభకులకు ఉపకారి అన్నాడు .బ్రౌన్ దొర వల్లే మన పండితుల కాళ్ళ కు వేమన ఆనాడు ,గుర్తించారు .నీతి ,వ్యంగ్యం ,తాత్వికం ,ప్రకీర్ణం అనే వర్గా లుగా వేమన పద్యాలను బ్రౌన్ విభజించాడు .
అబే దుబాయి రాసిన ”hindu manners customs and ceremonies ”అనే పుస్తకానికి సంపాదకీయం రాసిన పోప్అనే దొర వేమన పద్య మాధుర్యాన్ని ,అనుప్రాస,యమకాలన్కారాలను మించిన మరో కవిత లేదు అన్నాడు .మెక్డో నాల్డ్”వేమన రచనలు దేశీయులను ఆకర్షించి నంత గా ,మరోకవి రచనలు లేవు ”అని పొగిడాడు .చార్లెస్ యి.గోవర్అనే అనువాదకుడు ”వేమన -తిరువల్లువార్ కంటే తక్కువ ”అని చీకట్లు కుమ్మరించాడు .అయినా” the folk songs of southern india ”అనే పుస్తకం లో వేమన పద్యాలను నాలుగింటిని ఎంపిక చేసి చేర్చాడు .
వేమన పై గొప్ప వెలుగు ను ప్రసరింప జేసిన  వాడు ”క్యాంబెల్ ”.”వేమన ప్రజల కవి .ఆయన రాసింది నిరక్షరు  లైన గ్రామీణుల కోసం .ఆయన శైలి శక్తి వంతం .వేమన పండితుల ప్రశంశలను కోర లేదు .సాంప్రదాయ కవితా నియమాలను ఉల్లంఘించాడు .వ్యంగ్య సూక్తి వైచిత్రి వల్లనే ప్రజాదరణ పొందాడు .తోటి ప్రజలకు సేవ చేయాలన్న తీవ్ర కాంక్ష ఉన్న సంస్కర్త .అతనిది ఆస్తిక వాదం .మానవ శక్తికి ఒక స్తానాన్ని సంపాదించాడు .లూధర్ ,విల్క్లిఫ్ ల వంటి మత సంస్కర్తలు వేమనకు సాటి రారు .”అని మనస్పూర్తిగా వేమన కవినీ ,ఆయన కవిత్వాన్ని అంచనా వేసి ఆయన స్తానం ఏమిటో నిర్ణయించాడు క్యాంబెల్ కవిగా వేమన్న ను గుర్తించని వారి కళ్ళు తెరిపించాడు దొర .
డాక్టర్ ఈశ్వర తోపా ”saint vemana and his philosophy ”అనే గ్రంధం లో ”మానవతా సిద్ధాంతాలను పునాదులుగా చేసి ,వేమన తన ఆదర్శ సంస్కరణల భవనాన్ని నిర్మించాడు .ఆత్మ శుద్ధికి మానవుడు తానే స్వయం గా పాటు పడాలి .మానవుని లో అంతర్గత మైన ఆంతరంగిక శక్తుల్ని వెలికి తీయడం లో యే మానవాతీత శక్తి కూడా తోడ్పడదు .అయితే ,సర్వ మానవ సంక్షేమం కోసం మానవ శక్తుల్ని ఉదాత్తం గా సంస్క రించటం చాలా ముఖ్యం అన్న గ్రహింపు అవసరం ”అని వేమన సంకల్ప బలానికి జేజేలు పలికాడు. డాక్టర్ ఎల్.డి.బార్నేట్ ”the heart of india -”అన్న పుస్తకం లో ”మానవులకు సంబంధించి నంత వరకు వేమన దేనినీ నిర్లక్ష్యం చేయలేదు ”అని శ్లాఘించాడు .భారత దేశ చరిత్రను మొట్ట మొదటి సారి రాసిన ”విన్సెంట్ స్మిత్ వేమన గురించి చెబుతూ వర్ణ వ్యవస్థ లోని దోషాలను గురించి రాసే సందర్భం లో వేమన పద్యాలను నాలుగింటిని ఉదాహరించాడు .
మద్రాస్ ప్రభుత్వం పాఠ్య గ్రంధాలను సవరించి ,పరిశీలించటానికి మాక్దో నాల్డ్ ను అధ్యక్షుని గా ఒక కమిటీ ని వేసింది .”హెన్రీ బావర్సు” అనే ఆయన్ను తెలుగు పాఠ్య పుస్తకాలపై ఒక నివేదిక నిమ్మని కోరింది .ఆయన వేమన పద్యాలను పూర్తిగా తీసేయాలని సిఫార్సు చేశాడు .ఆయన రిపోర్టు లో ”ఒక యూరోపియన్ కు వేమన తన కాలం కంటే ఎంతో ముందుకు అభిగమించిన వ్యక్తీ గా కన్పిస్తాడు .కాని ,ప్రభుత్వం హిందూ విద్యార్ధులను క్రైస్తవ మతం లోకి కలుపు కొనే ప్రయత్నం చేస్తోంది అనే అపోహకు తావు ఇవ్వ రాదు .”అని చెప్పాడు .డాక్టర్ జె.ముదారాక్ కూడా నిషేధించాల్సిందే నని చెప్పాడు .”ప్రభుత్వం ప్రచురించిన పాఠ్య గ్రంధాలలో బైబిల్ దూషణ ఎలా ఉండ కూడదో ,అలానే వేద నిండా కూడా ఉండ రాదు .స్వజాతి దూషణ గల పద్యాలను ఆ బ్రాహ్మణులనే చెప్పమనటం ఉచితం కాదు ”అని రిపోర్టు ఇచ్చాడు .
ఒక చోట మెచ్చిన బార్నేట్ మరో చోట ”వేమన వెర్రి సన్యాసి అని ,పూర్ రిచర్డ్ అని ,కల్పిత గ్రామీణ యోగి ”అని మరింత చీకటి రుద్దాడు .ఈనాటి ఐన్ స్టీన్  శాస్త్ర వేత్త మహాత్మా గాంధీజీ ని గురించి ”ఇలాంటి మానవుడు భూమి మీద జన్మించి ఉన్నాడంటే ,భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పోతాయి ”అని అమితాశ్చర్యపోయాడన్న సంగతి మనకు తెలుసు .అలాగే లూర్నేట్ కూడా ”రక్త మాంసాలతో మానవ శరీరం ధరించి ,వేమన అనే పేరుతో ,ఈ భూమి మీద పుట్టి ,నిజం గా దాన్ని పవిత్రం చేశాడా ”?అని ఆశ్చర్య చకితుడైనా డట .చివరగా ”మానవ హృదయాంత రాల పరీక్షకుడు ,ఒకడు లోక ప్రవక్తల ఉపదేశాల విలువను కట్టటానికి తూస్తే ఎందరో ఉన్నతులు ఎన్నో మహిమలు గల ఆత్మలు ఈ తెలంగాణా (వేమన తెలంగాణా లో పుట్టి నట్లు బార్నేట్ భావించాడు )వినీత ,వినమ్ర కృషికుని (రైతు )కంటే ,ఎంతో తక్కువ గా తూగి నట్లు తెలుసుకో గలడు ”అని మనస్పూర్తిగా మెచ్చుకొన్నాడు .ఇలా పాశ్చాత్య  వేత్తలు వేమన పై గొప్ప వెలుగు చీకట్ల ను కుమ్మరించారు .ఆ వెలుగుల ముందు ,చీకటి తన అస్తిత్వాన్నే కోల్పోయింది .చివరగా అంతటా తేజస్సే నిండి పోయింది .అదీ వేమన వ్యక్తిత్వ ప్రభావం .వీటి నన్నిటిని శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు చక్కని తులనాత్మక పరిశీలన చేసి వేమన నిండు పున్నమి కాంతిని తెలుగు దేశానికి అందించారు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-8-12-కాంప్–అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –17 జనాభా విస్ఫోటనం

  అమెరికా ఊసులు –17
                                         జనాభా విస్ఫోటనం 

అణు బాంబు పేలితే ఎంత అనర్ధం జరుగుతుందో ,జనాభా పెరిగినా అంతే అనర్ధం జరుగునది కనుక జనాభా పెరుగుదలను ”జనాభా విస్ఫోటనం అన్నారు .ఇప్పటికే విపరీత జనాభా తో ప్రపంచం కలత చెందు తోని .ఆహారధాన్యాలు చాలటం లేడు .శక్తి వనరులు కుంచించుకు పోతున్నాయి .తాగునీటికీ ,సాగునీటికీ కరువోచ్చేసింది .జనాభా కు నిలవటానికి నీడ కూడా దొరకని స్థితి .ఇంకో ముప్ఫై ఏళ్లలో జనాబా బాంబు బద్దలైతే తట్టుకొనే పరిస్తితి లేదని గనాక శాస్త్ర వేత్తలు గగ్గోలు పెడుతున్నారు .ఒక్క సారి ఈ బాంబు దాడి ఎలా ఉంటుందో చూద్దాం .
శీతోష్ణ స్తితి లో మార్పులు, ఖనిజ నూనెలు వాయువుల విపరీత మైన వాడకం వల్ల కలుగుతున్నాయి .భూమి మీద నీరు కలుషిత మై పోతోంది .అడవుల నరుకు లాట పర్యావరణానికి హాని కల్గిస్తోంది .దీనితో జనం భవిష్యత్తు ఎలా ఉంటుందో నని భయం పట్టుకోంది .ఎక్కువ ఆహారం పండించాలంటే చాలా ఖర్చవుతోంది .ఒక్క శాతం ఆహారం పెంచటానికి నాలుగున్నర రెట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది .ఉన్న వనరులు అందరికి సమానం గా పంచటం సాధ్యం కావటం లేదు. ప్రజల జీవన ప్రమాణం అంతటా సమానం గా లేదు  .జింబాబ్వే లో చదరపు కిలో మీటర్ కు ముప్ఫై మూడు మంది మాత్రమె ఉన్నారు .అందుకని ఎంతో ఆహారాన్ని ఇతర దేశాలకు పంప గలిగేది .అందుకే దాన్ని” బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ సదరన్ ఆఫ్రికా” అన్నారు ..అయితే 2007 లెక్కల ప్రకారం ఆరు మిలియన్ల మంది అక్కడ కరువు ,ఆహార కొరత తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది .ఆస్ట్రేలియా లో చదరపు కిలో మీటర్ కు 2.7మంది మాత్రమె జనం ఉన్నారు .అక్కడ అన్ని రకాల సౌకర్యాలు బాగా ఎక్కువే .అందుకని ఆస్ట్రేలియా బాగు పడాలంటే అక్కడి జనాభా జీవన ప్రమాణాన్ని తగ్గించాలి అంటున్నారు ”డేమోగ్రాఫార్లు” .ఇదో వింత .
2050కి ఇథియోపియా  జనాభా170 మిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు .ఇప్పటికే ఆకలి చావులు ఎక్కువ .అక్కడ జన సాంద్రత తక్కువే .పండే పొలమూ ఎక్కువే .అయినా తట్టుకోలేక పోతోంది .ఒక వ్యక్తికీ అవసర మైన దాన్ని అందించటానికి కావలసిన భూమి ని” ecological foot print” అంటారు .ఇది ఇరవై అయిదు ఎకరాలు కావాలి .కాని మనకున్న వనరు ఏడున్నర ఎకరాలు మాత్రమె .భూమి మీద దొరికే నీటిలో రెండున్నర శాతం మాత్రమె మంచి ఆరోగ్యకర మైన నీరు .ఇది హిమానీ జలాల లోనే లభ్యమవుతోంది .మిగిలిన నీరంతా దాదాపు ఉప్పు నీరే .చైనా లోని ningxia ప్రాంతం అసలు నీటి వనరులు లేని ప్రాంతం .అక్కడ పంట మొక్కలదగ్గర బొక్కలు చేసి ప్లాస్టిక్ కవర్లలో నీరు నిలవ చేసి బతికించాలి నీరు లేక పోతే పంట లేనే లేదు  . సముద్రాల లోని జలాన్ని” డీ సాలినేషన్”  పద్ధతి లో శుద్ధి చేసి మంచి నీరుగా మార్చుకొంటున్నారు .దీని వల్ల రైతులు పంటనీరు పొందే అవకాశామేర్పడింది .అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకొన్న పద్ధతి .
ప్రపంచ భూమిలో26 శాతం భూమినే మనం పంటలు పందిన్చుకోవటానికి ఉప యోగించ గలుగు తున్నాం .జనాభా పెరిగితే అధిక పంట కావాలంటే భూ విస్తీర్ణాన్ని పెంచుకోక తప్పదు .అలాగే శక్తి వనరుల వాడకం పెరిగి పోతుంది. కనుక ఆల్టర్నేట్ ఎనెర్జీ ని తయారు చేసుకోవాలి .అందుకే సూర్య కాంతిని ,విండ్ మిల్స్ను సముద్ర విద్యుత్ ను ,బయో డీసెల్ ను తయారు చేసుకొంటున్నాము .ఇప్పుడు శాస్త్ర వేత్తల దృష్టి కృత్రిమ జీవ పదార్ధంను” సింత టిక్  d.N.A.”  నుంచి తయారు చేసే ఆలోచన చేస్తున్నారు . d.n.a ను బాక్టీరియా కు కలిపి ,వాటి ద్వారా ప్రోగ్రామింగ్ చేసి ,బయో ఇంధనాన్ని అంటే మిథేన్ లేక హైడ్రోజెన్ గాస్ ను తయారు చేస్తున్నారు .ఇవి ఫాజిల్ ఇంధనాలకు బదులుకృత్రిమ ఇంధనాలుగా ఉప యోగ పడుతున్నాయి .ఈ బాక్టీరియా ను ఆహార పదార్ధాల నుండి సేల్ల్యులోజు ,వ్యర్ధ పదార్ధాల నుండి ,పనికి రాని  కారు టైర్ల నుండి తయారు చేసి సెభాష్ అని పించారు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నారు కదా ..ఇవి భవిష్యత్తు లో తరగని ఇంధనం గా మనకు పని చేస్తుంది .అదీ శాస్త్రజ్ఞుల నిరంతర పరిశోధనా ఫలితం .
u.n.సంస్థ  అధ్యయన  లెక్కల ప్రకారం 2050నాటికి వలసప్రజల జనాభా 98మిలియన్లకు చేరుతుంది .మరణాలు పెరిగినా వలస వల్ల  జనాభా పెరుగుతుందని తేల్చారు . 1950లెక్కల ప్రకారం ఒక మిలియన్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న సిటీలు 83 మాత్రమే ఉంటె , 2007 కు వీటి సంఖ్య468 కి పెరిగి ముక్కు మీద వేలు వేసుకోనేట్లు చేశాయి .u.n.లెక్కల ప్రకారం ప్రపంచం లో మొత్తం మీద 850 మిలియన్ల జనం సరైన పోషకాహారం లేక ,ఆకలితో ,అలమటిస్తున్నారు .ఒక మిలియన్ జనాభాకు తాగు నీటి సౌకర్యమే లేదు . .అయితే కొంత మంది మాత్రం జనాభా చాలా తక్కువ గా ఉన్న కాలం లోనూ ఆకలి చావులు ,బీదరికం ఉన్నాయి అంటున్నారు .పారిశ్రామిక అభి వృద్ధి చెందిన సమాజాలలో ”పిల్లల అవసరం తక్కువ ”అనే భావం బలీయం గా వ్యాపించి ఉంది .
అమెరికా లోని అరిజోనా రాష్ట్రం లోని ”ఫోనిక్స్ ”లో ముసలి వారి శాతం బాగా పెరిగి పోయి ,పని చేసే యువకుల శాతం బాగా పడి పోయి దారుణం గా ఉందని గగ్గోలు పడుతున్నారు .దీని వల్ల  నైపుణ్యం ఉన్న పని వారు తగ్గి పోయి ,ముసలి ముఠా ను పోషించాల్సిన బాధ్యతా ,ఖర్చులు పెరిగి పోతున్నాయని ఆందోళన చెందు తున్నారు .2006 లో సేకరించిన లెక్కల ప్రకారం ఇంగ్లాండు లో ఒక పిల్ల లేక పిల్లాడిని 18 ఏళ్ళు వచ్చే వరకు పెంచటానికి సగటున 86,000 డాలర్లు ఖర్చు అవుతుందట .దీనిలో కాలేజి చదువు ,ఇల్లు ,ఆహారం ఖర్చు కలిసి ఉన్నాయి .అందిన మరో సమాచారం ప్రకారం ప్రపంచం లో 350 మిలియన్ల ఆడ వారికి తమ కుటుంబాన్ని తీర్చి దిద్దుకొన టానికి ,వసతి కల్పించుకోవటానికి తగిన సాధారణ సమాచారం కూడా అందు బాటులో లేనే లేదట .ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప రీతం గా పెరిగి పోయిందని జబ్బలు చరచుకొనే మనం ఇంకా సిగ్గు పడాల్సిన విషయం కాదా ఇదీ .
”తక్కువతో ఎక్కువ ” సాధించాల్సిన సమయం ఆసన్నం అయింది .రేపు రావాల్సిన విప్లవం ఆహార ఉత్పత్తి లోనే .దీనికి ” genetically modified”(g.m.) ఆహారం పండించటం ఒక్కటే శరణ్యం .వీటిని కూడా బాగా సార వంత మైన భూముల్లో కాకుండా ,ఊసర క్షేత్రాలలో ,ఉప్పు ఉరిసిన భూముల్లో పండించే ఆలోచన చేయాలి .అప్పుడే తిండికి కరువు ఉండదు .ఇప్పటికే అడవు లన్ని నరికి భూసారాన్ని నిలవ నీ కుండా చేశాం .భూమి సారమూ తగ్గి పోయింది .ఎడారులుగా భూముల్ని మనమే మార్చి, పాపం ఒడి గట్టుకొంటున్నాం .ఆధునికవ్యవ సాయ పద్ధతులను అమలు జేసి జన పోషణ కు అందరు నడుం కట్టాలి .అప్పుడే జనాభా విస్ఫో ట నాన్ని తట్టుకో గలం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-8-12.–కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

జన వేమన –18- కొండ వీటి వైభవం

  జన వేమన –18-  కొండ వీటి వైభవం 
”పరరాయ పర దుర్గ పర వైభవ శీల -గోన కొని ,విడనాడు కొండ వీడు
పరి పంధీ  రాజన్య బలముల సంధించు -గురుతైన యురి తాడు కొండ వీడు
ముగురు రాజులకును మోహంబు పుట్టించు -కొమరు మీరిన వీడు కొండ వీడు
చటుల విక్రమ కళా సాహసంబోనరించు -కుటిలాత్మకులకు సూడు కొండ వీడు
సాధు సైంధవ భామినీ సరస వీర -భటనటానేక  హాటక ప్రకట గంధ
-సిందురాద్భుత మోహన శ్రీ ల దనరు -కూర్మి నమరావతికి జోడు కొండ వీడు ”
అని శ్రీ నాద మహా కవి చేత ప్రశంసలు పొందింది కొండవీడు .ఆ కొండ వీడే ,మన వేమన కు స్థావర మైంది .”కొండ వీటి దండ కవిలె ”లో దాని విషేషా లన్నీ ఉన్నాయి .”కొండ వీటి కైఫీయత్ ”కూడా చరిత్ర చెప్పింది .కొండ వీటి కోనప్ప అనే అతను దండ కవిలె సంపాదించాడు .
గుంటూరు జిల్లా లో నరస రావు పేట దగ్గర ఉన్న అరణ్యం లో కొండ వీడు ఉంది .అక్కడ ఒక ఎత్తైన పర్వత దుర్గం ఉంది  .దాని ఎట్టు 1725అడుగులు .చుట్టూ కొలత 30 మైళ్ళు .ఈ పర్వతానికి 50శిఖరాలున్నాయి .వెంకటేశ్వర ఆలయం ,కన్యకల బావి ,శివాలయం ఉన్నాయి .వీటిలో ఆరు గుహలున్నాయి .పర్వతం పై మూడు పెద్ద చెరువులున్నాయి . 36స్తంభాల మహా మండపం ఉండి .శిధిల మైన రాజ మందిరాలు చాలా కన్పిస్తాయి .మహమ్మదీయులు కట్టించిన నమాజు చేసే మందిరాలూ ఉన్నాయట .6,4,1,1/2గజాల కొలతలున్న రాతి నేతి తొట్టె ఉంది  .దానిలోరెడ్డి రాజులు  నెయ్యి పోసుకొనే వారట .24స్తంభాలు ,22స్తంభాలు ఉన్న మండపాలుండే వట .గణపతి ,సుబ్రహ్మన్యేశ్వర స్వామి గుడులున్నాయి .నాగ కన్యల విగ్రహాలున్నాయి .కొండ గుహ పై పాను వట్టం పై శివ లింగం ఉండేదట .ఇవన్నీ చదు నైన ప్రదేశం లో ఉంటె ,దీని చుట్టూ ,పర్వత శిఖరాల మీద కొండంతా వ్యాపించి ఉండే కోటలు ఉండి ,శత్రు దుర్భేద్యం గా ఉండే వట .నృసింహ ఆ లయం ఉంది  .దీనికి రెండస్తుల ద్వారం మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది .దీనికి తూర్పున రెండు వరుసలు ఉన్న16 స్తంభాల మండపం ఉంది .”దీన్ని ”యోగి వేమన మండపం ”అంటారు .తూర్పున అంబ గుడి ఉంది .పర్వతానికి దక్షిణాన  గంజి కాలువ ,దాని దగ్గర గంగాధర రామేశ్వరాలయం ఉన్నాయి .ఆలయ స్తంభం మీద శ్రీ రంగ రాయల వారి శాసనం ఉందట .కొండ పై రెండు మసీదులున్నాయి .కొండల మధ్య ఉన్న గుహ లో ”కొండ సింగరయ్య ”అనే నరసింహ స్వామి దేవాలయం ఉంది .దీనికి బయట నవులూరి పోత రాజు ,నాగ వర్మ గుళ్ళున్నాయి .పోత రాజు గుడినే శ్రీ నాధుడు ”గృహ రాజు మేడ ”అన్నాడు .
కొండ దిగితే ”కోట” అని పిలువా బడేగ్రామం ఉంది .దీనికి దక్షిణం లో గోపీ నాద స్వామి ఆలయం రమణీయం గా ఉంటుంది .దీని ప్రక్కన వేయి కాళ్ళ మండపం శిధిలా వస్త లో ఉండి పోయింది .ఇప్పుడు అదే మసీదు గా మారింది .దీనికి ఎదురుగా20 గజాల ఎత్తున్న రాతి ధ్వజ స్తంభం ఉంది.సదాశివ రాయల నాటి శాసనాలిక్కడ కనిపిస్తాయి గుడికి దక్షిణం లో శిధిల శివాలయం ఉంది .శివుని కెదురుగా అంద మైన నంది ఉంది .నంది కడుపు లో వరహాలు ఉండేవట .దొంగలు తోక దగ్గర కన్నం చేసి ,దోచేశారట .”లంకెల బావి ”,వసంత ఘర్”అనే రాజ మందిరాలు కూడా శిధిలమై పోయాయి .
పుట్ట కోట సమీపం లో రెడ్డి రాజులు కట్టించిన ”రంగ నాయక ఆలయం ”ఉంది.దీనిలో నాగేంద్రుని విగ్రహం చెక్కు చెదర కుండా ఉంది .దగ్గర్లో మాణిక్యాల రావు కోనేరుంది .అంతఃపుర స్త్రీలు సహగమనం చేయటానికి గుండాలున్నాయి .గృహ రాజు మేడ దిబ్బల దగ్గర ”జడ్డిగల బావి ”ఉంది .ఇది గృహ రాజు మేడ లోని ”శ్రీ ఆది లక్ష్మీ అమ్మవారు ”జలక్రీడలు చేయటానికి ఉప యోగ పడేదట .దీనికి దక్షిణాన పెద్ద చెరువు ఉంది .రెండు పెద్ద తోటలున్దేవి .చెరువు కట్ట మీద వేణు గోపాల స్వామి దేవాలయం ఉంది .కొండల క్రింద ”తిరుమల శ్రీ లక్ష్మీ నరసింహాలయం ”ఉంది .పడమర రామేశ్వరాలయం ,తూ ర్పున గోపాలస్వామి గుడి ఉన్నాయి .పడమర లో ”సీతా పతి ”అనే రాతి మూత గల చెరువు ఉంది .కొండ వీటికి ఉత్తరం గా వీరభాద్రాలయం ,”పోదిలే రహినా సాహేబు దర్గా ”అనే మూడు గోరీ మండపాలున్నాయి .దీనికి ఉత్తరాన ”పతేఖాన్ మసీదు ”,”భోజరా ”అనే అత్తరు సాహేబు మసీదు ఉన్నాయి .సురఖాన మసీదు, నల్ల మసీదు ,గుమ్మల్ మసీదు ,జామ్తానా మసీదు చిన మసీదు ఉన్నాయి .
ప్రస్తుతం ఉన్న కొండ వీడు కి దక్షిణం లో రెండు మైళ్ళ దూరం లో ”శిఖా వస్ ఖాన్ పేట ”అనే గ్రామం ఉంది .అక్కడ శ్రీ వెన్న ముద్దు కృష్ణ స్వామి ఆలయం ఉంది .దీన్ని కొండవీటి రాజులే కట్టించారు .పోలయ వేమ రాజు, చదల వాడ రాఘవాలయం ను ,నాదెండ్ల గోపయ్య రఘునాయక ఆలయాన్ని నిర్మించారు .కొండ వీటి కోట ను 800ఏళ్ళ క్రితం ”విశ్వంభర రాజు ”నిర్మించాడు .కొండపై అరకోట ,పిల్ల కోట ,పెదమూలం కోట ,తట్టు కోట మొదలైన అయిదు కోటలున్దేవట .ఈ కోటల గుండా పైకి వెళ్ళే దారిలో ”ఖిలై  దర్వాజా ” మందిరం ఉంది .కొండ కింద పడమర లో ఒకటిన్నర మైళ్ళ చుట్ట కొలత ఉన్న కోట ,దాని చుట్టూ యాభై గజాలు వెడల్పు ,పది గజాల లోతు ఉన్న అగడ్త ఉంది .ఈ కోటను రాయని భాస్కరుడు కట్టించి గోపీ నాద పురం అనే గ్రామాన్ని, ఆలయాన్ని కట్టించాడు .రాయని భాస్కరుని ప్రస్తుతిస్తూ పద్యం ఒకటి రాతి మీద చెక్క బడి ఉంది .దీన్ని ”కొండ పల్లి గవా”అంటారు .దక్షిణ ద్వారమే ”నాదెండ్ల గవని ”.కొండకు  -ఉత్తరాన కొండల మధ్య ”పుట్ట కోట ”ఉంది .దీన్ని ప్రోలయ వేమా రెడ్డి కట్టించాడు .”కుండిన నగరం ”ఇందు లోనిదే నంటారు .ఇదే శ్రీకృష్ణుని భార్య రుక్మిణి తండ్రి భీష్మకుడు పాలించిన ప్రదేశం అంటారు .పర్వత సోపానాలకు ఉత్త రానతారా బురుజు ల తో అయిదు కోటలున్నాయి .మొత్తం 25బురుజులున్నాయి .ఇంత ప్రశస్తి చెందిన కొండ వీడు లో శిల్ప ,రసవాద ,ఆయుర్వేద ,యోగ ,తాకిల ,రాజ కీయ ,వేదాంతాలను జ్ఞానియై పొంది ,యోగి యై ప్రవర్తించాడు మన వేమన కవీశ్వరుడు .స్థల మహాత్మ్యం అనటానికి ఇంత కంటే మంచి ఉదాహరణ లేదేమో .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 4-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విహంగ మహిళా సాహిత్య పత్రిక September,2012 — జలగామి సిల్వియా ఎర్లీ

 

జలగామి సిల్వియా ఎర్లీ

          అంతరిక్ష శకటాలలో అంతరిక్షాన్ని పరిశోధించే వారిని వ్యోమ గాములు  – ఆస్ట్రో నాట్లు అంటారు .సముద్రాల వంటి జలాలపైనా ,లోపలా పరిశోధించే వారిని జలగాములు లేక ఆక్వా నాట్లు అంటారు .సముద్రాన్వేషణ  లో అనేక సాహసాలు చేసి,అరుదైన రికార్డులు సాధించి ,ఎన్నో అవార్డులు ,రివార్డులు అందుకొన్నఆక్వానాట్, అమెరికా  మహిళా మాణిక్యం సిల్వియా ఎర్లీ  జీవితం ఎందరికో ఆదర్శం ,ప్రేరణ .

  బాల్యం -విద్యాభ్యాసం

             సిల్వియా ఆలిస్ ఎర్లీ అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం లో గిబ్బన్ టౌన్ లో 30-8-1935 న జన్మించింది .అమెరికన్ ఒషనోగ్రాఫర్ గా ,ఆక్వా నాట్ గా ,రచయిత గా ఆమె చిర కీర్తినార్జించింది .1955 లో ఫ్లారిడా  యూనివర్సిటీ  నుండి డిగ్రీ పొందింది .మరుసటి ఏడాది ఎం.ఎస్.సాధించింది .1966 లో డ్యూక్ వర్సిటి లో పి.హెచ్.డి. చేసింది .1979-86 మధ్య కాలం లో కాలి  ఫోర్నియా అకాడెమి ఆఫ్ సైన్సెస్ లో క్యూరేటర్ ఫర్ పైకాలజి గా పని చేసింది .తరువాత కాలి  ఫోర్నియా లోని బెర్కిలీ వర్సిటి లో రిసెర్చ్ అసోసియేట్ గా 1969-81లో ఉద్యోగం చేసింది .రాడిఫ్ ఇన్స్టిట్యుట్ లో స్కాలర్ గా కొంత కాలం ఉంది .1967-81మధ్య కాలం లో హార్వర్డ్ యూనివర్సిటీ  లో రిసెర్చ్ ఫెలో ఆఫ్ అసోసియేట్ గా వరుస క్రమం లో ఎదుగుతూ తన విద్యకు తగిన ప్రతిఫలాన్ని పొందుతూ రాణించింది .

అన్వేషణ

                 సిల్వియా కు మొదటి నుంచి సముద్రం లో ఈదటం ,అక్కడి జలచరాల విషయం తెలుసు కోవటం సరదా . 1970లో ఆమె అభిరుచికి తగిన పని కలిగింది .ఆమె లోని ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించింది .చాలా మంది మగ వారితో ఈమెను సముద్రాన్వేషణ కు ఒక షిప్ లో పంపారు .అందులోని మగ వారంతా షిప్ లో ఆడది ఉంటే  ”బాడ్ లక్” అని ఈసడించారు .పేపరు వాళ్ళు కూడా పెదవి విరిచి ఏదేదో రాశారు .ఆయాత్ర ను దిగ్విజయం చేసింది సిల్వియా .అప్పుడు పత్రికలూ అదే నోటితో ఆమెను ”ship’s social ambassador ”అని కీర్తించాయి .మాటలతో కాక చేతలతో జనం నోరు మూయించిన సాహసి ఆమె .ఆమె ఆ యాత్ర లో కనుగొన్న” రెడ్ ఆల్గాను   ”హంబ్రేల్లా హైడ్రా ”అనే  పేరు తో పిలిచింది . ఆది గొడుగు ఆకారం లో ఉంటుంది .అందుకని కొంచెం మార్చి హంబ్రేల్లాఅని పేరు  పెట్టింది. .దీనిలో ఆమె గురువైన” హమ్”అనే శాస్త్ర వేత్త పేరు కూడా కలిసి ఉండటం విశేషం .
ఆ కాలం లో ”షార్క్లే లేడీ”అని పేరు పొందిన డాక్టర్ క్లార్క్ తో ఆమె కు మంచి పరిచయమేర్పడింది .1970లో ”నాసా ”సంస్థ ఏర్పాటు చేసిన మొత్తం ఆడ వాళ్ళే అన్వేషకులు గా ఉన్నమొట్టమొదటి  టీం కి    నాయకత్వం వహించే బాధ్యత సిల్వియా కు దక్కింది . అప్పుడు ”ఓపెన్ ఓషన్ జిం సూట్” తో సముద్ర గర్భాన ఈది అరుదైన రికార్డు సాధించింది .లోతు సముద్రం లో” oahu ” ప్రాంతం లో సముద్ర జీవులను అన్వేషించింది .తన పరిశోధనలను రికార్డు చేసింది .ఈ పరిశోధన లో అంతా ”ఫ్రోజెన్ మీల్ ”మాత్రమె తిన్నారు .సముద్రం లో 381 మీటర్ల లోతున ఆమె అన్వేషణ సాగించి రికార్డు నెలకొల్పింది .ఇదే అప్పటి మహిళా రికార్డు . ఆ తర్వాత ఒంటరిగా సబ్ మెరీన్ లో 3,300 అడుగుల లోతు లో విహరించి రికార్డు సాధించింది  సముద్రాలలో లోతు జలాలో ఆక్టోపస్ లు చీకటి లో మాత్రమే బయటకు వస్తాయి .ఏదైనా దానికి ఆహారం అయ్యే జీవి దాని దగ్గరకు వచ్చి నపుడు ఆక్టోపస్ రంగు బ్రౌన్ కలర్ నుండి ”బ్లూగ్రీన్ ”కు మారటాన్ని గుర్తించింది ..

  నిర్మాణాత్మక కార్య క్రమాలు

                       1980-84 మధ్య ” National  advisory committee on oceans and Atmosphere ”లో పని చేసింది .1982లో భర్త గ్రాహం హాకేన్ తో కలిసి దీప ఓషన్ ఇంజినీరింగ్ ను డిజైన్ చేసి నిర్వహించి ,కావాల్సిన వారికి ఆసరా గా నిలిచి ,సలహాలను ఇచ్చింది .దీన్ని భార్యా భర్తలు లాభాపేక్ష లేకుండా చేసిన గొప్ప కార్యక్రమం .ఆమె నిరంతర   పరిశోధకు రాలు .సముద్ర జలాలలో లోతుగా తిరిగే వారికి అవసర మైన ఆధునిక సూట్లను తయారు చేసింది .డీప్ ఓషన్  రోవేర్ రిసెర్చ్ సబ్ మరీన్ ”నిర్మించింది .దీనితో సముద్రం లో 3,300అడుగుల లోటున పరిశోధించ వచ్చు .”ఫాంటం”అనే రిమోటింగ్ ఆపరేటేడ్ వెహికల్  ”తయారు చేసింది . దీన్ని30 దేశాలు కొని చక్కగా ఉపయోగించు కొన్నాయి .

ప్రతిభా పురస్కారాలు

1990లో అమెరికా అధ్యక్షుడు జార్జి. w. బుష్ సిల్వియా ను ”national oceanic and atmospheric  administration ”చీఫ్ కెమిస్ట్  గా నియమించి అత్యంత విలువైన గౌరవాన్ని కల్పించాడు .ఒక మహిళ ఆ పదవిని నిర్వహించటం సిల్వియా తోనే ప్రారంభ మైంది .అయితే అందులో ఆమె చేయాల్సిన దేమీ కనీ పించ లేదు .ప్రభుత్వం రిసెర్చ్ చేయటానికి తగిన ఫండు ను ఇవ్వలేదు.సిల్వియా కు కోపం వచ్చి బుష్ కు జాబు రాస్తూ ”స్పేస్ షటిల్ లో టాయిలెట్ల కు  పెట్టె ఖర్చు కూడా” అండర్ వాటర్ రిసెర్చ్” కు ఇవ్వటం లేదని నిందించింది .
ఎన్నో టి.వి.ప్రోగ్రాములు చేసింది .వాటిల్లో సైన్స్ ,టెక్నాలజీ ,సాధారణ అంశాల పై గొప్ప ఉపన్యాసాలిచ్చి యువకులకు ,చిన్నారులకు ప్రేరణ గా నిలిచింది .అత్యంత ప్రసిద్ధి పొందిన ”టైం మాగజైన్ ” 1998లో ప్రత్యేక సంచిక వేసి ఆమె ను ”first hero for the planet ”అని ప్రశంసించింది .నెదర్లాండ్ ప్రభుత్వం ”ఆర్డర్ అఫ్ ది గోల్డెన్ ఆర్క్” తో ”knight ”బిరుదు నిచ్చి సత్కరించింది .google earth లో అయిదవ వెర్షన్ లో సముద్రాల పై కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టింది .


marine conservetive biology institute వంటి  ఎన్నో బోర్డులు ఆమెకు గౌరవ స్థానాన్నిచ్చి  గౌరవించాయి .united nations conference లో  3500 మంది ,ప్రపంచ రాయబారులు ,డెలిగేట్లు ,మొదలైన విశిష్ట వ్యక్తులున్నసభలో 14 నిముషాలు మాట్లాడి తన దేశానికి ప్రాతినిధ్యం వహించి  సాహస మహిళా మణి అనిపించుకొన్నది . under water laboratory కి నాయకత్వం వహించిన ధీర వనిత సిల్వియా .ఆమె గౌరవార్ధం ఫ్లారిడా లో ఆమె యాభై ఏళ్ళ లోతు సముద్ర జలాల అన్వేషణ ను సగౌరవం గా నిర్వహించి సత్కరించింది .2009 లో ”tedd prize ”ను అందుకొంది .వీరి ఆసరాతో , marine protected areas around the globe ” కోసం ”మిషన్ బ్లూ ”అనే యాత్ర చే బట్టి క్యూబా ,బెల్జి ,గాలపెగాస్ దీవులను చుట్టి వచ్చింది .ఆమె ఎక్క డ ఉంటే  అక్కడ సముద్ర జీవులకు రక్షణ అనే భావం ఏర్పడింది .sustainable sea expeditions కు అయిదేళ్ళు పని చేసింది .అందులో అమెరికా లోని సముద్రాల రక్షణ విషయం కోసం ఎంతో కృషి చేసింది .గల్ఫ్ యుద్ధం లో సహాయం చేసింది .అనేక రిసెర్చి ట్రిప్పులను నిర్వ హించింది .1998 లో ”explorer in residence at national geo phisicssociety ”లో గౌరవ స్థానాన్ని పొందింది .2011లో స్మిత్ కాలేజి ,సిల్వియా ను గౌరవ డాక్ట రేట్   తో సత్కరించింది .harte research institute for the gulf of mexico studies at texas కు చైర్మన్ పదవి పొంది రాణించింది .deep  search foundation కు వ్యవస్థాపక అధ్యక్షురాలైంది . advisory council for the ocean in google earth కు చైర్మన్ గా ఉంది .

రచనలు

               సిల్వియా ఎర్లీ సుమారు 125పుస్తకాలు రాసింది . సముద్ర విషయాలు ,సైన్స్ ,సముద్రాన్వేషణలు తో వాటిని తీర్చి దిద్దింది .the atlas of the ocean ,wild ocean america;s parks under the sea ,the atlas of the ocean మొదలైన ఆమె పుస్తకాలు ఎంతో విలువైనవి .భవిష్యత్త్ తరాలకు కర దీపికలని పించేవి .అరవైదేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చింది .చిన్న పిల్లల కోసం coral reefs ,hello fish ,devil పుస్తకాలను ఆకర్షణీయం గా రాసింది .sea change -a message of the ocean అని ఆమె 1995లో రాసిన పుస్తకం చాలా విలువైనది గా భావిస్తారు .
1992లో  deep ocean exploration and re search అనే సంస్థ ను ఏర్పరచి మరిన్ ఇంజినీరింగ్ లో మరింత ముందుకు సాగింది .ఇప్పుడు ఆ సంస్థ ను ఆమె కుమార్తె నిర్వహిస్తోంది .ఇలా నిరంతరం ఆమె కృషి చేస్తూనే ఉంది .ఎందరికో ఆదర్శం గా ,ప్రేరణ గా నిలిచింది .ఆమె జీవితం మొత్తం మీద 60కి పైగా అన్వేషణా కార్య క్రమాలను చేసింది 6000.గంటలు సముద్ర జలాల లోపల   గడిపి పరిశోధన చేసింది .మూడు కంపెనీలు పెట్టి సముద్ర జలాన్వేషణ లో ఎంతో సేవ చేస్తోంది ”.diadema sylvia ”అనే” సముద్ర ఆర్చిన్” ”,pilina earlie ”అనే రెడ్ ఆల్గే స్పెసిమెన్ లకు  సిల్వియా పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని కల్పించారు .ఆమె  భూమి ,సముద్రాలలో ఉన్న జీవు లన్నిటిని ”marine world ”అని ముద్దు గా పిల్చింది .అందుకే 1998 సంవత్సరాన్ని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ”యియర్ ఆఫ్ ది ఓషన్స్ ”అని గుర్తింపు తెచ్చాడు .నిత్యాన్వేషి సిల్వియా పెర్లీ ని ”ocean Everest ”ఎక్కిన వీర వనిత  గా భావిస్తారు .*

– గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా డైరీ శ్రీ భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన వారం

        అమెరికా డైరీ –
శ్రీ  భ్రమ రాంబా మల్లికార్జున-శ్రీ ఉమా సోమశేఖరస్వామి వారల సందర్శన  వారం 

     ఆగస్టు ఇరవై యేడు సోమ వారం నుంచి ,సెప్టెంబర్ రెండు ఆది వారం వరకు విశేషాలు 

ఆగస్టు ఇరవై యేడు సోమవారం నుంచి మా మన వళ్ళ కు బడులు ప్రారంభమయాయి .మళ్ళీ సందడి .నిన్న ఆదివారం నాడు మా అల్లుడి మేనత్తశ్రీ మతి లక్ష్మి గారు  ,భర్త, రాలీ నుండి వచ్చారు .ఆవిడను ఇక్కడ ఉంచి ఆయన వెంటనే వెళ్లి పోయారు . మంగళ వారం మా అమ్మాయి మామ గారు కోమలి సూర్య నారాయణ శాస్త్రి గారి అధిక భాద్ర పద మాస ఆబ్దికం .ఒక అరవ బ్రాహ్మణుడు వచ్చి మా అల్లుడితో కార్యక్రమం చేయించాడు .మా అమ్మాయి మడి కట్టుకొని యధావిధిగా అన్నీ చేసింది .మూడు పచ్చళ్ళు ,మూడు కూరలు ,పప్పు ,గారెలు ,పరవాన్నం చేసింది .పవన్ దంపతులు భోజనానికి వచ్చారు .వీళ్ళ మేనత్త గారు దీనికోసమే వచ్చి ఉన్నారు .కార్య క్రమం యదా విధి గా జరగటం అందరికి నచ్చింది .భోజనం తర్వాత ఆవిడను పవన్ వాళ్ళింటికి తీసుకొని వెళ్లారు .
బుధ వారం లైబ్రరీ లో పుస్తకాలు ఇచ్చి ,ఇరవై పుస్తకాలు తెచ్చుకోన్నాను .పిల్లలు జిమ్నాస్టిక్స్ నుండి రావటం ఆలస్య మవుతుందని లైబ్రరి లోనే ఉండి ఒకటి న్నర పుస్తకం చది వేశా .గురువారం ఉదయం శ్రీ మతి రమా రాచ కొండ వచ్చింది .ఆవిడను ,భర్తను ఇదివరకు రెండు సార్లు అంటే ఎల్లా వెంకటేశ్వర రావు ,కొమర వోలు శివ ప్రసాద్ గార్ల సభల్లో చూశాను .ఆమె ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు సెక్రెటరి .రమ తూర్పు గోదావరి జిల్లా అమలా పురం దగ్గర్లో ఉన్న ‘ముంగండ ”అమ్మాయి .ఆమె మా అల్లుడు మేనత్తకు దగ్గర బంధువు కూడా .వీల్లదీ, అంటే మా అమ్మాయి మామ గారిదీ ముంగండే .ఆ బంధుత్వం తో వీళ్ళకు రాక పోకలు బానే ఉన్నాయి .మర్నాడు శుక్ర వారం వాళ్ళింటికి భోజనానికి పిలవటానికి వచ్చింది రమ .
శుక్రవారం అందరం కలిసి రమా వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం .చాలా పెద్ద భవనం .ఇంగ్లీష వాళ్ళ భవనాల్లా గా ఉంది.వాళ్ళ ఆయన” శివ ”ఆఫీసుకు వెళ్లారు-ఇంట్లో లేరు .మంచి మర్యాద చేసింది .పప్పు ,కాబేజీ కూర ,దోస చట్ని ,మజ్జిగ పులుసు ,అన్నం ,చారు ,పెరుగు తో భోజనం పెట్టింది రమ .అన్నీ బానే ఉన్నాయి .రమా దంపతులకు ”ఆంద్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ”,శ్రీ హనుమ కధా  నిధీ  ”మా అక్కయ్య ” అనే సరస భారతి ప్రచురించిన మూడు పుస్తకాలనుఅందజేశాను . ఇంటికి తిరిగి వచ్చ్చే సరికి మధ్యాహ్నం మూడు అయింది .

 రాలీ కి రాలీ 

శుక్ర వారం రాత్రి ఏడున్నరకు మేనత్త తో సహా అందరం కారు లో వాళ్ళ ఊరు రాలీకి బయల్దేరాం .పులిహార చేసింది మా అమ్మాయి .బయల్దేరే ముందు పెరుగుతో కలిపి కొంత అందరం తిన్నాం .సుమారు రాత్రి తొమ్మిదింటికి ఒక చోట ఆగాం .పిల్లలకు” పీజా” పెట్టించారు  .మేము మళ్ళీ” పులి మీద దండ యాత్ర ”చేసి దాన్ని పూర్తిగా సఫా చేశాం .మళ్ళీ బయల్దేరి రాత్రి పదకొండున్నర కు రాలీకి చేరి దానికి దగ్గర్లో ఉన్న” దర్హాం” లో వాళ్ళ ఇంటికి చేరుకోన్నాం .కాఫీతాగి పడుకున్నాం .

  శ్రీ భ్రమ రాంబా మల్లికార్జున స్వామి  దర్శనం 

శనివారం ఉదయం స్నానాలు పూర్తీ చేసి మేనత్త చేసిన ఉప్మా తిని ఆదంపతులతో కలిసి నేను ,మా అల్లుడువాళ్ళ  కారులో సుమారు పది హేను మైళ్ళ దూరం లో ఉన్న దేవాలయాలకు వెళ్ళాము .ముందుగా శ్రీ భ్రమ రాంబా సమేత మల్లికార్జున స్వామిని దర్శించాం . .అప్పుడే అభిషేకం ప్రారంభించారు .నేను పుస్తకాలు తీసుకొని వెళ్లాను .పూజారితో స్వరం కలిపి నమక ,చమకాలు పురుష సూక్తం  బిల్వా ష్టకంవగైరాలు చదివాను .బాగా చేశారు .తర్వాతా అష్టోత్తర నామాలు కూడా పూజారితో గొంతు కలిపాను .మంచి అలంకరణ కూడా చేశారు స్వామి వారలకు .గొప్ప అనుభూతి  చెందాము .పూజారి విజయ వాడకు చెందినగణపతి శాస్త్రి .కుర్రాడే .ఉయ్యూరు లో మా ఇంట్లో అద్దె కుంటున్న గణేష్ శర్మ అనే వేద పండితునికి స్నేహితుడే .ఇలా అమెరికా లో ఒక్కో సారి తమాషా గా కలుస్తూ ఉంటాము .తీర్ధ ప్రసాదాలను తీసుకొన్నాము .

This slideshow requires JavaScript.

 

 బాలాజీ స్వామి  దర్శనం 

ఈ దేవాలయానికి ప్రక్కనే విశాల మైన స్తలం లో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఉంది.చాలా ఎత్తు మీద కట్టారు .స్వామి విగ్రహం చాలా భారీ గా ఉంది .మేము వెళ్ళే సరికి అక్కడ కూడా అభిషేకం పూర్తీ అయి ,దర్శనం ఇస్తున్నారు .దర్శనం చేసుకొని బయటికి వచ్చాము .స్వామికి అలంకరణ చేసి పదకొండున్నరకు పూజా జరిపారు .గంట పట్టింది .ఈ లోపు ఒక కుటుంబం చక్కగా భక్తీ గీతాలు పాడుతున్నారు .అందులో ఒక అమ్మాయి చాలా శ్రావ్యమైన గొంతుతో పాడి రసానుభూతి కలిగించింది .బాలాజీ స్వామి కి వైభోగం బాగా ఉంది. .కనీసం ఎనిమిదిమంది  పూజారులు ,ప్రసాదాలు చేసే వారు ఉన్నారు .పెద్ద ఎస్టాబ్లిష్ మెంటే .జూన్ నేల చివర్లో బ్రహ్మోత్స వాలు నిర్వ హించారు .ప్రసాదాలు తయారు చేసి పాకెట్ల లో విక్ర యిస్తారు .మా అల్లుడి మేనత్త భర్త చీమల కొండ దుర్గా ప్రసాద రావు గారు రిటైర్ అయాక స్వామి సేవలో వారానికి నాలుగు రోజులు సోమ వారం నుండి శుక్ర వారం వరకు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని చేస్తారు .మేనత్త కూడా వాలంటీర్ చేస్తారు .ఆయనకు సుమారుడెబ్భై రెండు , ఆవిడకు అరవై ఎనిమిది ఏళ్ళు  ఉంటాయి .జీవితాన్ని ధన్య వంతం చేసుకొంటున్నారు స్వామి సేవలో .స్వంత ఇల్లు ఉంది.పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లారు .ఇద్దరే ఉంటున్నారు .అమెరికా వచ్చి సుమారు యాభై ఏళ్ళు ,రాలీ వచ్చి పదహారేళ్ళు .పూజ తర్వాత తీర్ధ ప్రసాద విని యోగం .ఈ లోపు మా అమ్మాయి ,పిల్లలు ఇంటి నుంచి వచ్చారు .ఇంటికి చేరే సరికి మధ్యాహ్నం ఒకటి దాటింది .మాకు మేడ మీద గదుల్లో వసతి కల్పించారు .సాయంత్రం వేమన పై ఆర్టికల్ వీళ్ళ కంప్యుటర్ నుంచే రాశాను .
రాత్రి వాళ్ళు ,మేము అందరం కలిసి ”ఉడిపి హోటల్ ”కు వెళ్ళాం .ఆది అనంత పురానికి చెందిన రెడ్డి గారిది ..ఆయనా వచ్చాడు కాసేపు మాట్లాడాం .మేము పూరీ ,పిల్లలు మషాలా దోసె ,చానా పూరీ ఎవరికి కావాల్సింది వాళ్ళు తిన్నాం .మాంగో లస్సీ తాగాం .ఇంటికి చేరే సరికి రాత్రి పదిన్నర అయింది .హాయిగా నిద్ర పోయాం .
ఇప్పుడు” రాలీ ”గురించి కొన్నివిశేషాలు –నార్త్ కేరోలీనా రాష్ట్రానికి రాలీ రాజధాని .రాష్ట్రం లో రెండవ పెద్ద నగరం .మొదటిది మేముంటున్న శార్లేట్ .రాలీలో” ఓక్ ”చెట్లు విపరీతం .అందుకని దీన్ని ”సిటీ ఆఫ్ వోక్సు ”అని ముద్దుగా పిలుస్తారు .సర్ వాల్టర్ రాలీ అనే అయన పేరు మీదుగా ఈ పట్టణం  ఏర్పడింది .ఇది టెక్నికల్ హబ్ .రాలీ ,దర్హాం ,చాపెల్ అనే మూడుపట్టణాలు  దగ్గర దగ్గర మూడు త్రిభుజ కొణాల్లా ఉంటాయి .దీనినే ”three primary cities of research triangle”అంటారు .1959లో రిసెర్చ్ ట్రైనింగ్ పార్కు ఏర్పడి నప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ అనే పేరు వచ్చింది .ఇక్కడ నార్త్ కెరొలినా స్టేట్ వర్సిటి ,డ్యూక్ వర్సిటి ,యూని వేర్సితి ఆఫ్ నార్త్ కెరొలినా -చాపెల్ హిల్స్ అనే మూడు ప్రసిద్ధ విశ్వ విద్యాలయాలున్నాయి .అమెరికా ఏడవ ప్రెసిడెంటు అయిన” ఆండ్రు జాన్సన్ ”రాలీ లోని ”కాస్సో ”లో జన్మించాడు  జీవన నాణ్యత విషయం లో ను ,వ్యాపార దృష్ట్యా అమెరికా నగరాలలో టాప్ టెన్ నగరాలలో రాలీ ఒకటి .ఇక్కడి రాలీ మెమోరియల్ మ్యూజియం చాలా ప్రసిద్ధి చెందింది .ఇది ఈశాన్య ప్రదేశం లో ఉన్న నగరం .ఇక్కడికి అట్లాంటిక్ సముద్రం నూట ఎనభై మైళ్ళ దూరం లో ఉంది .ఇక్కడి కేరోలీనా హరికేన్సు అనే హాకీ జట్టు బాగా ప్రసిద్ధ మైంది .మన తెలుగు వాళ్ళు ఎక్కువ గా కనీ పిస్తారు .దేవాలయాలున్న ప్రాంతాన్ని ”కారీ ”అంటారు ..శార్లేట్ కు రాలీ రెండు వందల మైళ్ళ దూరం .సుమారు మూడు గంటలు ప్రయాణం .

                    ఆష్ విల్

ఆది వారం ఉదయం ఐదింటికే అందరం లేచి స్నాదికాలు పూర్తీ చేసుకొని కాఫీ లు తాగాం .మా ఇద్దరికీ రాలీ దంపతులు బట్టలు పెట్టారు .ఉదయం ఆరుమ్బావుకు కార్ లో మేము సోమా మౌంట్ లో ఉన్నశ్రీ ఉమా సోమ   శేఖర స్వామి దర్శనానికి బయల్దేరాం .రెండు గంటలు ప్రయాణం చేసి ఒక చోట ఆగి మాక్ డో నాల్ద్ లో రొట్టె టిని కాఫీ త్రాగాం .మళ్ళీ బయల్దేరి రెండుగంటలు ప్రయాణం చేసి ”ఆష్ విల్”చేరాం .ఈ పేరు నాకుతమాషా గా ఉంది .”బూడిద పల్లె ”అవుతుంది అనువాదం చేస్తే .ఇక్కడే ”ఆష్ వర్త్”కూడా ఉండి .దీన్ని తెలుగు లోకి మారి స్తే ”బూడిద భోగం ”అనచ్చు .”శ్వన్న నోవా” అనే నది ఉంది .దీన్ని” సువర్ణ ముఖి ”అని సుమారుగా అనచ్చు .పెద్ద పెద్ద  కొండలు బ్లూ మౌంటేన్ రిద్జి లో  శ్వన్న నోవా ,ఫ్రెంచ్ బ్రాడ్ రివర్ ల సంగమ స్తానం లో ఈ పట్టణం ఉంది .ఆష్ విల్  పూర్వం ”చెరోకీ నేషన్ ”లో ఉండేది .అమెరికా లో 25 ”art desti nations ”లో ఆష్ విల్ ఒకటి అదీ ఇక్కడి విశేషం .దీన్ని  ”happiest city of women ”అంటారు .దీనికే ”new age mecca”అని కూడా పేరు .అంతేనా ”eye of america ”అంటే అమెరికా ”చక్షువు ”(కన్ను)అన్న మాట .”best out side town ”అనీ పేరు తెచ్చు కొన్నది ఆష్ విల్ .చుట్టూ ప్రకృతి దృశ్యాలు  అందాల విన్దులే చేస్తాయి ముగ్ధ మనోహర ప్రకృతి మానసికా నందాన్ని ఇచ్చి మరోలోకపు అనుభూతినిస్తుంది .అందాల హరి విల్లు ఆష్ విల్ .ఇక్కడి ”బ్లూ రిడ్జి పార్క్ వే” తరగని సౌందర్యపు గని .ఇవన్నీ చూసుకొంటూ ఇంకోగంట ప్రయాణం చేసి ఉదయం పదకొండున్నరకు మౌంట్ సోమా చేరాం

 మౌంట్ సోమా –ఉమా సోమ శేఖర స్వామి దర్శనం .

కొండలు లోయలు దాటుకొంటూ ,ఎత్తైన వృక్షాల సౌందర్య దర్శనం చేస్తూ ,దాదాపు  ఊటీ లాగా ,కోడై కెనాల్ లాగా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ  ఇరుకు దారి లో జాగ్రత్త గా కారు నడుపు కొంటూ మొత్తం మీద ఎత్తైన మౌంట్ సోమా అంటే సోమా పర్వతం చేరాం .చుట్టూ లోయలు వృక్షాలతో నిండిన ఎత్తు కొండలు ,మబ్బులు తాకే అగ్రాలు, లోయల్లో జారి ప డుతున్న మబ్బులు భలే అందమైన ప్రకృతి సౌందర్యం మధ్య ఈ పర్వతం ఉంది  .ఎత్తు  మీద ఉమా సోమ శేఖర స్వామి దేవాలయం ఉంది. .సుమారు ఇరవై మెట్లు ఎక్కి వెళ్లి దర్శించాలి .లోపల లింగం సోమనాద్ దేవాలయ లింగం లా భాసించింది .పూజారి గారు విజయ వాడ కు చెందిన గార్లపాటి ప్రసాదావధాని గారు .చాలా శాస్త్రోక్తం గా అభిషేకం నిర్వ హించటం ప్రారంభించారు ..నేనూ వారితో స్వరం కలిపి నమక ,చమకాలు ,పురుష సూక్తం ,శ్రీ సూక్తం, దశ శాంతులు, పట్టాభి షేకం అష్టోత్తరం చివరికి మంత్ర పుష్పం పూర్తీ చేశాం .స్వామికి అలంకారం బాగా చేశారు ప్రసాద్ గారు .అపర కైలాసం గా ,ఆర సోమనాద్ లా మహత్తరం గా ఉంది .నిన్నా ఇవాళ కూడా స్వాముల అభిషేకం సమయం లో రావటం పూర్వ జన్మ సుకృతం   అని పించింది . మనస్సు ఎంతో ప్రశాంతమైంది .ఎందుకో నేల రోజులుగా తెలీనిచిరాకు మనసును కల్లోల పరుస్తోంది . ఈ శివ దర్శనా లతో కొత్త శాంతి లభించింది .కమ్మగా కన్నుల పండువు గా స్వాముల దివ్య దర్శనానుభవం పొంది ఎంతో సంతృప్తి చెందాం .తీర్ధం, ప్రసాదం గా మైసూర్ పాక్ అందరికి పెట్టారు .ఈ ఆలయాన్ని కట్టించిన వారు బ్రహ్మర్షి మహేశా నంద అనే అమెరికన్ స్వామి .ఆలయం కట్టి ఏడాది మాత్రమె అయింది .పూజారి వచ్చీ ఏడాదే అయింది .ప్రక్కన యాగ శాల ఉంది.పూజారిదంపతులకు  ప్రక్కనే ఉన్న మూడంతస్తుల భవనం లో కింద భాగం ఇచ్చారు .స్వామీజీ ఇక్కడే ఉంటారట .ఆయనకు అనేక మంది శిష్యులు .అందరు ఎంతో శ్రద్ధగా ఇక్కడి పనులను చేస్తుంటారు .ఆలయానికి ఇంకా ధ్వజ స్తంభం యేర్పడ లేదు  .ఇంకా అభి వృద్ధి లోకి రావాలి. భక్తులు అత్యంత భక్తీ విశ్వాసాలతో స్వామిని కోలుస్తున్నట్లు కనీ పిస్తోంది .ఆలయం చాల చిన్నదే .ఈ రోజు భక్తులతో ఆలయం  కిట కిట లాడింది .
మెట్లు దిగి కిందకు భోజన శాల కు వచ్చాం .అప్పుడే వర్షం ప్రారంభ మైంది .అద్భుతం గా అని పించింది ఆ వర్షం లో. ఆ అందాల సీమ మరింత అందాలను సంత రించుకోంది  .లోయల్లో మబ్బులు దోబూచు లాడుతున్నాయి.ఫోటోలు తీసుకొన్నాం .ఆశ్రమం వారే పది  డాలర్లకు భోజనం ఏర్పాటు చేశారు .ఆది లేక పోతే ఇక్కడ ఏమీ దొరకదు .భోజనం లో చపాతి, పులిహోర ,పప్పు ,మజ్జిగ పులుసు,అన్నం ఏర్పాటు చేశారు .అన్నీ బాగానే రుచిగా ఉన్నాయి అందరం కమ్మగా తిన్నాం .శివుడికి ఎదురుగా కొండ మీద పాలరాతి పెద్ద నందీశ్వరుడు చూపులకు అద్భుతం అని పిస్తాడు .భోజన శాల దగ్గర చిన్న శివ లింగం దానిపై అభిషేక పాత్ర వేలడ దీశారు . వర్షపు నీరు పాత్రలో పడి శివునికి అభిషేక చేస్తున్నట్లు ఉంటుంది .ప్రక్కనుంచి కారే నీటిని గోలుసులకు వ్రేలాడే పాత్రలను ఒక దానికింద ఒకటి ఉండేట్లు చేశారు .అందులో పై నుండి కిందకి పాత్రలలో పడుతూ భలేగా కనీ పిస్తుంది .శివుడికి ఎదురుగా చిన్న నందీశ్వరుడు వర్షపు నీటి తో హర్షాన్ని పొందు తున్నట్లు ఉంటాడు గొప్ప ఆలోచనా, దాని అమలు చేసిన తీరు బ్రహ్మానందాన్నిస్తుంది .అందరు తప్పక సందర్శించి తరించాల్సిన క్షేత్రం మౌంట్ సోమా .అమెరికా లో అద్భుతం .అపర కేదార నాద్అనీ అని పిస్తుంది .ఇంత గొప్ప దివ్య ధా మాన్ని సందర్శించిన మా జన్మ  ధన్యం .
భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కారు లో బయల్దేరి మళ్ళీ అందాలన్నీ చూసుకొంటూ ,ఆ అందాలను ఆరవేసుకొన్న ప్రకృతి సౌందర్యాన్ని తలచుకొంటూ ,అనుభ విస్తు .నాన్ స్టాప్ గా మూడు గంటలు ప్రయాణం చేసి సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి చేరాం .యాత్ర సంపూర్ణం .రాలీ నుంచి సోమా మౌంట్ సుమారు నాలుగు  వందల యాభై  మైళ్లకు తక్కువ ఉండదు .సోమా నుంచి శార్లేట్ సుమారు మూడు వందల యాభై మైళ్ళు ఉంటుంది .మొత్తం మీద రాను పోనువెయ్యి మైళ్ళు అంటే పది హేను వందల కిలో మీటర్లు . దాదాపు పదకొండు గంటల డ్రైవింగ్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-9-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన –17 డూప్లి కేట్ వేమన

  జన వేమన –17
                                                   డూప్లి కేట్ వేమన 

”బాల చక్ర వేమ భవ్య నామ ”     అనే మకుటం తో వందకు పైగా పద్యాలు రాసిన ”తుంగ వేమన ”ను మన వేమన గా కొందరు భ్రమించారు .ఆయనే ,ఈయన అనే ప్రచారం సాగింది కొంత కాలం .కొన్ని పద్యాలు ”విశ్వదాభి రామ ”మకుటం తో అందులో చేరాయట ఇతడు శార్వరి నామ సంవత్సర చైత్ర శుక్ల నవమి రోజున చని పోయాడట .ఇద్దరి జనన ,మరణ కాలాలు ఒక్కటే అవటం భ్రాంతికి కారణమైంది .తుంగ వేమన తన గురించి పద్యం చెప్పుకొన్న కధ తనదే అని అభిప్రాయం .తుంగ వేమన 1869 చని పోయి నట్లుంది .ఇలా సందట్లో సడే మియా లా తుంగ వేమన ,మన వేమన సరసన ”డూప్లికేట్ వేమన ”గా తుంగ చాప పై కూర్చున్నాడు .
                                                          రస వాదం 
ఎవరు వేమన గురించి యే కధ చెప్పినా ,అందులో వస్తువులని బంగారం గా మార్చే ”పరుస వేది ” గురించి చెబుతూనే ఉన్నారు .దీన్ని రస వాదం అంటారు .”హేమ కార విద్య ”అనే పేరూ ఉంది .రస వాదశాస్త్రజ్ఞులు బంగారాన్ని చేసే కొన్ని ప్రక్రియలు చెప్పారు .అసలు బంగారం గా కాక పోయినా ,దానితో సమానం గా ఉంటుందట .అందులో ఒక పద్ధతి — 800   గ్రాముల రాగి ,28గ్రాముల ప్లాటినం , 20 గ్రాముల అసలు బంగారం తో కలపాలి .అప్పుడు బంగారం తయారవుతుందట .రెండో పద్ధతి –వెండి2.48 భాగాలు ,ప్లాటినం 32.02 భాగాలు రాగి  65.50భాగాలు కలిపి కరగిస్తే బంగారం తయారవు తుందట .మూడో పద్ధతి –16భాగాల రాగి ,7భాగాల ప్లాటినం ,1భాగం జింకు కలిపి కరిగిస్తే 16కేరట్ల బంగారం అంటే” పదారు వన్నెల  బంగారం” ఏర్పడు తుందట .సాధారణ నైట్రిక్ ఆసిడ్ కూడా దీన్ని ఏమీ చేయ లేదట .ఆధునిక కాలం లో పరమాణు రహస్యం తెలిసిన తర్వాతఒక మూలకం  పరమాణు చివరి ఆర్బిట్ లో ఉన్న ఎలేక్త్రాన్ల సంఖ్యను మారిస్తే ,ఆది ఇంకో మూలకం గా మారి పోతుంది అని కనీ పెట్టారు .ఇలా వచ్చే బంగారం చాలా ఖరీదు గా ఉంటుంది .
అయితే వేమన కాలం లో ను ,అంతకు ముందు కూడా బంగారాన్ని తయారు చేయటాన్ని గురించిన శాస్త్రాలు ఉన్నాయి .అందులో మొదటిది ”మందాన భైరం ”,రెండోది ”రసేంద్ర చింతా మణి ”,మూడవది ”రస రత్న సముచ్చయం ”గ్రంధాలు చాలా ప్రసిద్ధి చెందాయి .
ఇవన్నీ విన్నా ,కన్నా వేమన్న కు బంగారం చేయా లానే కాంక్ష తీవ్రం గా ఉండేది .ఆ విషయం లో ఆయన కొన్ని పద్యాలు కూడా చెప్పాడు .”నిమ్మ పండు పుట్టే ,నిజమైన రసముండే -హేమమునకుయేడ్తు రేల ప్రజలు -సొత్తు పొత్తు చేసి సాధింప రేలకో ”అని బంగారం చేసేతేలిక  విధానాన్ని చెప్పాడు .ఇంకో పద్యం లో -”ఇంగిలీక మహిమ హేమింప నేరక -చిత్ర పటమువ్రాసి చేరచి నారు -బొంత జెముడు పాలు పొంగించ నేరరు ”అన్నాడు .ఇలా ఆయన చెప్పిన వాటిని బట్టి బంగారం సాధించాలని చాలా మంది యోగులు ప్రయత్నించి విఫలు రయ్యారు .చింత నిప్పుల బూడిదే తో బంగారం తయారు చేయ వచ్చునని తాలకం
,రంగు ,పాదరసం, రాగి లకు హేమాక్షి మొదలైనవి కలిపి బంగారం చేయ వచ్చును అనే వాదమూ ప్రచారం లో ఉందని ,ఇలాంటి
వివరాలనేన్నిటినో నేదు  నూరి గంగాధరం గారు పొందు పరచారు.
ఆచార్య నాగార్జునుడు ”రస వాద సిద్ధాంత కర్త ”అని మనందరికి తెలిసిన విషయమే .మహా భారతం లో దుర్యోధనుడికి
పరుస వేది విద్య తెలుసునని ,అదే అతని బలం అనీ  చెబుతారు .భట్టి విక్రమార్క చరిత్రకధల  లోను దీని ప్రస్తావన ఉంది .కాకతి
ప్రతాప రుద్రునికీ పరుసవేది ని అంటించింది ఐతిహ్యం .రవీంద్ర నాధ టాగూర్ తండ్రి దేవేంద్ర నాధ టాగూర్  కూడా బంగారం
తయారు చేయటానికి చాలా ప్రయాస పడ్డారు అని చెప్పుకొంటారు .కాంతమీద  వ్యామోహం కంటే ,కనకం మీది వ్యామోహం
ఎక్కువని అర్ధం అవుతోంది .ఇంత కధా  ,కమా మీషు ఉంది” స్వర్ణ కార విద్య” మీద .దీన్ని ఇంతటి తో ఆపేసి ,ఆ తర్వాత”కొండ
వీటి వైభవం” దర్శిద్దాం ”.
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-9-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –16 అందరికి తెలిసిన కధ —

    జన వేమన –16 అందరికి తెలిసిన కధ —

తన వల్ల  ఇల్లంతా దివాలా తీసింది అని వేమన తెలుసుకొన్నాడు .ఒది నే మెడ బోసిగా ఉండటం భరించ లేక పోయాడు .బంగారం తయారు చేసి ,ఒదిన న ఒళ్లంతా బంగారం తో నింపాలనే గాఢ మైన ఆలోచన ఆయన మనసును నిద్ర పోనీ యటం లేదు .వేమన స్నేహితుడు అభిరామయ్య స్వర్ణ కారుడు .అతనితో కలిసి ఆలోచిస్తుండే వాడు .అభిరాముడు దూరం గా ఒక కొండ గుహ లో ఉంటున్న ”లంబికా శివ యోగి ”కి రోజూ ,చెంబుతో పాలు ఇచ్చి వస్తు శిష్యరికం చేసే వాడు .దీన్ని వేమన రహస్యం గా గమనించాడు .ఒక రోజు అభిరామా చారి జ్వరం తో బాధ పడుతు పాలను యోగికి ఇవ్వమని స్నేహితుడు  వేమన్న ను పంపాడు .వచ్చిన వాడు అభి రామే అను కొని యోగి అతడు రోజు పాలు తెస్తున్నందుకు అతనికి ఆ రోజే ”అమృత దానం ”చేస్తానన్నాడు .తాను అభి రాముడిని కాదు అని వేమన చెప్పలేదు .యోగి కనులు మూసుకొని ,ఆత్మ సాక్షాత్కారం చేసుకొని వేమన కు మోక్ష వివరాలు తెల్పాడు .పరోప కార కార్యాలలో జన్మ సాఫల్యం చేసుకోమని హితవు చెప్పాడు .జనానికి జ్ఞాన బోధ చేయమని ,మానవ సేవ చేయమని బోధించాడు .అప్పటికి స్పృహ లోకి వచ్చిన వేమన తాను అభి రాముడిని కాదు అని నిజం చెప్పాడు .”నేను అనేది ఆత్మ కాని శరీరం కాదు .ఆత్మ కు బాంధవ్యాలు లేవు .సర్వం శివ మయం .రేపు రావద్దు .నేనిప్పుడే వెళ్లి పోతున్నాను ”అని శివ యోగి వేమన కు చెప్పి ,అభిరామునికి తన ఆశీస్సు లందజేయమని ”.అజ్ఞాని తిరిగితే నష్టం ,జ్ఞాని తిరక్క పోతే నష్టం అని విజ్ఞాన కాంతుల్ని ప్రసరింప జేస్తూ చీకట్లను చీలుస్తూ ,సంచారం చేస్తూనే ఉండమని”వేమన కు చెప్పి వెళ్లి పోయాడు లంబికా శివ యోగి .
ఆ కొండ మీడే ఒక చెట్టు కింద కూర్చుండి పోయాడు వేమన .అభి రామయ్య వచ్చి అసలు విషయం తెలుసు కొన్నాడు .ఆశ్చర్య పడ్డాడు .”కామి గాని వాడు ,కవి కాడు,రవి కాడు -కామి గాక మోక్ష గామి కాడు ” – అని అభిరామునికి తత్వోపదేశం  చేశాడు వేమన .వేమన మారిన విషయం పై ప్రశ్నించాడు అభి రామి .తాను చేసిన తప్పుకు దిద్దు బాటు గా నాలుగు చరణాల ఆటవెలది పద్యానికి మకుటం గా ”విశ్వ దాభి రామ వినుర వేమ ” అని తాను అభిరామునిగాకృతజ్ఞత తో  వేమన ప్రకటించుకొన్నాడు .మూడవ పాదం గా ”కామి యైన వాడు కవియౌ ను ,,రవి యౌను ” అని అద్భుతం గా భావం తో సాంద్రం చేశాడు .ఇక ఇంటికి వెళ్ళ లేదు .ధ్యానం ,మౌనం అంతే .అవసర మైతే పద్యం తో పలకరింపులు .దేశాటనం చేశాడు .తమ్ముడు వేమన్న సంగతి విన్న అన్న బాధ పడి ,ఉనికి తెలుసుకొని ,రమ్మని బ్రతిమి లాడాడు .పిచ్చి నవ్వే వేమన్న సమాధానం .అన్న నిరాశ తో తిరిగి వెళ్లి పోయాడు ..ధ్యానం లో లీనమయాడు వేమన .దేశ సంచారం లో శిష్య పరంపర పెరిగింది .సందర్భాను సారం గా పద్యాలు చెప్పాడు .చివరికి గుహ లోకి వెళ్లి జీవ సమాధి చెందాడు .
వేమన సినిమా వచ్చింది .చిత్తూరు వి.నాగయ్య గారు వేమన గా చిరస్మరణీయ మైన నటనను ప్రదర్శించారు .దర్శకుడు కే.వి.రెడ్డి అద్భుతం గా చిత్రీకరించారు .ఆ సినిమా కధ కూడా ఇలానే ఉండి .వేమన కధను ”మలయ శ్రీ ”అనే రచయిత నాటకం గా మలిచి తానే వేమన్న పాత్ర ధరించి దర్శకత్వమూ చేస్తూ అనేక ప్రదర్శనలిచ్చారు .ఆయనదీ ఇదే కధ .కరీం నగర లోని కల భారతి జూనియర్ లెక్చర ర్ల సంఘం రాష్ట్ర సదస్సు లో ఈ నాటకాన్నిమొదటి సారిగా  ప్రదర్శించి ప్రశంశలు పొందారు .
వేమన కధ లో కొంత మార్పు చేసిన శ్రీ చిల్లర భావనారాయణ గారు ”యోగి వేమన ”పేరుతో క చారిత్రాత్మక మైన నాటకాన్ని రాశారు .వేమన గా నటించిన పద్మశ్రీ నాగయ్య గారి ప్రసంశలండుకొన్నారు .నాటక ప్రయోక్త శ్రీ సుంకర కనకా రావు గారు రంగ స్తలం పై దీన్ని ప్రదర్శించ తనికి ప్రోత్సహించారు .నటుడు శ్రీ వి.సత్యనారాయణ రాజు గారు వేమన పాత్ర ధరించి సేహబాస్ అని పించుకొన్నారు .”భారతీయ నాట్య మండలి ”ఈ నాటకాన్ని అనేక ప్రదర్శనలిచ్చింది .కధలో జరిగిన మార్పులు గమనించండి .దేవ దాసీ పేరు మదాలస .విలాసయ్య అనే విలన్ వేమన పతనానికి కారకుడు .వేమన ఓదిన పేరు సీతాంబ .అన్న  అన వేమా రెడ్డి. బంగారం చేస్తాను అంటే,మదాలస  ఒప్పు కోలేదు .అఆమే అతన్ని ఆరాధించింది .వేమన కూడా ఆమెనే శృంగార రస రూపిణి గా ,తనకావ్యాదిష్టాన దేవత గా భావించాడు .మదాలస తాను శారదను అని ,వేమన జగతికి స్రష్ట అని ,ఆయన ”తమ్మి కంటి (శివుడు ) అనీ ,తాను గిరిజ (పార్వతి )అని ఆయన కాల కన్ధరుడు అనీ చెప్పింది .వేమన ”వాల్లభ్య సౌభాగ్యాన్ని ”ఆశించాను కాని రాచరిక భోగ భాగ్యాలను కాదని ప్రాధేయ పడింది .తమ వ్రుత్తి పవిత్ర మైన కళా తపసు  అని ,జగదేక సుందరి కళామతల్లి తమ ఇలా వేలుపు అనిన్యాయాధి కారియినా రాజుకు  వివరించింది .వేశ్యలు ఎందుకు వివాహం చేసుకో రాదో తెలపమని ప్రశ్నించింది .సాని వాళ్ళ తెగను నిర్ణ యించి నట్లు పరదారాగమనం ఉన్న విటులకూ , ఒక తెగను ఎందుకు నిర్ణయించే లేదు..? అని నిల దీసింది .వేమన్న ను జైలు పాలు చేస్తే ఆయన శిక్ష ను రద్దు చేయమని రాజు ను  ప్రాధేయ పడింది . రాజు కు ఇచ్చిన మాట ప్రకారం మదాలస దేశం విడిచి వెళ్లి పోయింది .అనవేమా రెడ్డి చకితుడై ”దేవదాశి కులం లో మదాలస తప్ప బుట్టినది ”అని మెచ్చాడు .వేమన ఆ తర్వాత శివ బ్రహ్మం అనే వాడిని బంగారం చేసే రహస్యం చెప్పమని కోరుతాడు .”పసి పిల్ల వాడి చేతికి పదునైన కత్తి ఇవ్వటం లాంటిది ”అని చెప్పి ,ఒక బంగారు హారం ఇచ్చి పంపించేస్తాడు .
ఆ తర్వాత ఎప్పుడో వేమన్న ను మదాలస కలిసి ”ఈ లోకపు దుస్తంత్రాన్ని ,దురాచారాలను అందరికి తెలిసేలా చాటి చెబుతూ ”ఆట వెలది ”అయిన తనను కావ్య ప్రతిభ తో చిరంజీవిని చెయ్య మని కోరుతుంది .తన నాలుక మీద నిత్యం ”ఆటవెలది” నాట్యం చేస్తుందని వేమన ఆమెకు తెలియ జేశాడు .పై రెండు నాటకాలు అర్ధ వంత మైన సంభాషణ లతో వేమన జీవితాన్ని ,కవితా తత్వాన్ని ఆవిష్కరించాయి .రస సిద్ధి కలిగించాయి .మనో విజ్ఞానాన్ని పెంచాయి .అంతకు చాలా కాలం క్రితమే ”పంచ నాదం ”గారువేమన  నాటకం వ్రాసి బాగా ప్రశస్తి పొంది నట్లు తెలుస్తోంది .ఇదంతా అసలు వేమన కధ .దీని తర్వాత ”డూప్లి కేటు ”వేమన గురించి తెలుసుకొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-9-12-కాంప్–శార్లేట్ -అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జనవేమన -15 వేమన గురించి కధలు -గాధలు

 జనవేమన -15
                          వేమన గురించి కధలు -గాధలు
               కొండవీటి రాజులు పాలించే కాలమ్ లో వేమన పూర్వీకులు మూగ చింత పల్లి నుంచి ,కొండవీడు చేరి ఉంటారని ,ఆ కాలమ్ లో రాజుల కొలువు లో పని చేసిన ఉన్నతోద్యోగులు తమ పిల్లలకు రెడ్డి రాజుల పేర్లు పెట్టటం అలవాటు గా ఉండేదని ,అదనం గావేమన పూర్వీకులకు రెడ్డి పదం చేరి ఉంటుందని భావిస్తున్నారు .అది వేమన వరకు పాకి ఉంటుంది .కొండవీటి పడమర వీధి లో శివాలయం ఉండేదని ,దాని దగ్గరలో వేమన ఇల్లు ఉండేదని పండిత బండారు తమ్మయ్య అభిప్రాయ పడ్డారు .బ్రౌను దొర వేమన వాడిన మాండలీకాలను పరిశీలించి ,”తెలంగాణా ”లోని నైరుతి ప్రాంతం వాడని భావించాడు .ఇది నిజం అకాడని తేల్చి పారేశాడు మేజర్ మాగ్దోనాల్ద్ .వేమన రాయల సీమ వాడే నని స్పష్టం చేశాడు కూడా .మూగ చింతపల్లి చిత్తూరు జిల్లా చంద్ర గిరి తాలూకా లో మాత్రమే ఉందని ఆరుద్ర పరిశోధించి చెప్పాడు .చాలా జిల్లాల లో ఆ పేరిట ఊళ్లు ఉన్నట్లు తెలుస్తోంది .”వడ్ల లో ఎన్ని రకాలో ,రెడ్ల లోను అన్ని భేదాలున్నాయి ”అందుకే తాను ”కాపు ”అని చెప్పుకోన్నాడని కొందరు తేల్చారు .దీనికి ఉదాహరణం గా ”కలి యుగంబున నున్న కాపు కులానికి -వేమన తన కీర్తించే ”అన్న పద్యం చెప్పాడు .”కాపు రెడ్లు ”గా వేమన వంశాన్ని భావించి కృషీవలుడు అన్నారు .
                                               అందరికి తెలిసిన కధ
              వేమన చిన్నతనం లోనే ,తలిదండ్రుల్ని కోల్పోయాడు .అన్న రాచ వేమన ,ఒదిన నరసమాంబ వేమన్న ను చాలా గారాబంగా పెంచారు .ఒదిన అంటే వేమన్నకు తల్లి తో సమానం .ఆమె మాట ఆయనకు వేద వాక్కు .అన్న వదినల కూతురు ”జ్యోతి ”అంటే వేమనకు ప్రాణం .వేమన్నే ఓదినకు కొడుకు .అన్న గ్రామాది కారి కనుక ఎప్పుడూ తీరిక గా ఉండే వాడు కాదు తమ్ముడి సంగతి అసలు పట్టించుకో లేదు .దానితో వేమన కు చదువు అబ్బలేదు .కొండ వీడు దేవాలయం లో దేవదాసి తో పరిచయం పెరిగి ఆ ఆకర్షణ లో పది పోయాడు వేమన .వేశ్య తల్లికి డబ్బు పిచ్చి .ఎలాగైనా వేమన నుంచి డబ్బు గుంజాలని ఆమె పాచికలేస్తోంది .అన్న చాటు బిడ్డ వేమన .ఒదిన ఏమీ ఇవ్వగలిగే స్తితి లో లేదు .వేశ్య తల్లి కూతుర్ని ఒత్తిడి చేసి డబ్బు లాగామంతోంది .చివరికి గత్యంతరం లేక ఒదిన నగలు కాజేసి వేశ్యకు ఇచ్చాడు వేమన .ఒక రోజూ జ్యోతి తల్లి నగలు పెట్టుకుంటానని మారాం చేసింది .తల్లి పెట్టె తెరచి చూస్తె నగలు గల్లంతు .అన్నకు ఈ విషయం తెలిసి ,వేమన్న ను ఇల్లు వదిలి పొమ్మన్నాడు .నిర్లిప్తం గా బయటకు వచ్చేశాడు .కొడుకును పోగొట్టు కొన్న తల్లిలా బాధ పడింది ఒదిన .వేమన పై ఆమెకు మమకారం మాత్రమే కాదు ,అతను మారి మళ్ళీ దారి లో పడతాడని తల్లి గా భావించింది ..
            వేమన కు ఒక వరుస మరదలు ఉంది .పేరు లక్ష్మి .బావను పెళ్ళాడాలని ఆమె ఉబలాటం .ఈయనకు ఆ ధ్యాసే లేదు .ఇంట్లో చేరి వలపుల చూపులు రువ్వింది .ఏమీ చలించలేదు .ఒదిన ఆమె కు ఆసరాగా ఉన్న కధ ముందు వస్తుంది .పెళ్లి మాట ఎట్ట వద్దని లక్ష్మికి చాలా సార్లు చెప్పాడు వేమన .దేవదాసిని పెళ్లి చేసు కొన్నానని నమ్మించాడు కూడా .ముత్తైదు చిహ్నం గా ఒదిన గారి ముక్కెర ఇమ్మని ప్రార్ధించాడు .అదొక్కటే తనకు మిగిలిందని ,అదే తమ పెళ్లి గుర్తు అని ,నచ్చ చెప్పింది ఒదిన .ముత్తైదువ ముక్కెర తీసి ఇవ్వాడు అని స్పష్టం చేసింది .తన చివరి కోరిక ముక్కేరే నని మంకు పట్టు పట్టాడు .ఒదిన ,ఒక షరతు విధించి  ముక్కెర ఇచ్చింది .అది చాలా విచిత్ర మైన షరతు .”దేవదాసి ని నగ్నం గా వెనక్కు వాలి ముక్కెర తీసుకొనేట్లు చెయ్యి ”అన్నది .పరుగు పరుగున దేవ డాషి దగ్గరకు వెళ్లి షరతు చెప్పి ముక్కెర ఇచ్చాడు .ఆమె అలానే చెప్పినట్లే తీసుకొంది .దిమ్మ తిరిగి పోయింది వేమన కు ఆమె రూపం చూసి .రక్త మాంసాలతో ఉన్న తోలు తిత్తి కోసమా ఇంత వెర్రిగా ,ఇంత కాలమ్ తాను వేమ్పర్లాడాను?అని తెలుసుకొన్నాడు .తల తిరిగింది .తల్లిగా చూసే ఒదిన కన్నులు తెరిపించింది అని అర్ధం చేసు కొన్నాడు .వెంటనే ,ఆ ముక్కెర ను ఒదిన పాదాల చెంత ఉంచి కన్నీరు మున్నీరు గా విలపించాడు వేమన .ఆయనకు జీవితం పై రోత కల్గింది .వేశ్య పై విముఖత ఏర్పడి నది . .మారి మంచి వాడవుతాడు అనుకొన్న మరిది విరాగి అవటం తో ఒదిన నిస్చేస్తురాలైంది .తల్ల డిల్లి పోయింది .మౌనం గా ఉండే వాడు .దేన్నీ పట్టించు కొనే వాడు కాదు .జ్యోతిని కూడా ప్రేమగా పలకరించే వాడు కాదు .
                 సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -09 -12 -కాంప్–రాలీ -నార్త్ కెరొలినా -అమెరికా
Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –14 వేమన గురించి కధలు గాధలు —

   జన వేమన –14
వేమన గురించి కధలు గాధలు —

ప్రోలయ వేమా రెడ్డి డ్డి ,అన వేమా రెడ్డి కొడుకులు .అనపోతా రెడ్డి రాజై 1362వరకు రాజ్యమేలాడు .తర్వాతా తమ్ముడు రాజై,1380వరకు పాలించాడు .ఇతడు కవి ,పండితుడు ,రసజ్ఞుడు .కవుల పాలిటి కల్ప వృక్షం .తర్వాతా అనపోతవేమా రెడ్డి కుమారుడు ”కుమార గిరి వేమా రెడ్డి ” 1400 వరకు రాజ్య పాలన చేశాడు .”అనంత రాజీయం ”అనే నాట్య శాస్త్ర గ్రంధ కర్త .ఈయన తర్వాతా ఇతని పేద తాత మనవడు ”పేద కోమటి వేమా రెడ్డి ”కొండ వీటి కి రాజై ,1420 వరకు పాలించాడు .”సర్వజన చక్ర వర్తి ”బిరుదాంకితుడు .శ్రీ నాద కవి ని ఆస్థాన కవి ని చేశాడు .”అమరుక ”కావ్యానికి ”అమరక దీపిక ”వ్యాఖ్యానం రాశాడు .ధరణి కోట లో జరిగిన యుద్ధం లో పేద కోమటి వేమా రెడ్డి తమ్ము డైన ,”మాచయ ”ను దేవగిరి చంపేశాడు.దేవ గిరి ని వేమా రెడ్డి చంపాడు .దేవగిరి లింగయ ప్రతీ కారం తో పేద కోమటి వేమా రెడ్డి ని చంపేశాడు .ఇదంతా ఎందుకు అంటే -మన వేమన ఈ కాలానికి చెందినా వాడే అని చెప్ప టానికే .
పేద కోమటి వేమా రెడ్డి కొడుకు రాచ వేమా రెడ్డి1420-24 వరకు రాజ్య పాలన చేశాడు .ఈయనే కొండ వీటి రెడ్డి రాజుల్లో చివరి వాడు .”పురిటి పన్ను ”విధించి ,జన కన్తకుదయాడు .”సీరం ఎల్లప్పు ”అనే బలిజ నాయకుడు ముత్యాలమ్మ గుడి దగ్గర వేమా రెడ్డి ని చంపాడు .దీనితో రెడ్డి రాజ్యం నిర్మూలమైంది .వేమా రెడ్డి కొడుకు రాచావేముడు .ఇతని తమ్ముడే వేమన అని అంటారు .వేమన పడి హేనవ శతాబ్ది వాడు కాదని పదిహేడవ శతాబ్దం వాడని బ్రౌన్ అన్నాడు .మాక్లిన్ దొర పద్దేనిమిదివ శతాబ్ది వాడని చెప్పాడు .మొత్తం మీద వేమన రెడ్డి కులానికి చెందినా వాడు అని తెల్తోంది .వేమన పద్యం కూడా దీన్ని ద్రువీకరిస్తోంది .”మనమున వేసిన మైనపు జడ్డి -ప్రనతము నీదగు రావుల దొడ్డి -యనువున జేసెను నందన నొడ్డి -విత్తము గా గాను వేమన్న రెడ్డి ”అన్న ఓరియెంటల్ లైబ్రరీ లోని ప్రతి సాక్షం గా కానీ పిస్తోంది .దాదాపు అందరు వేమన 1652వాడు అని చివరికి తేల్చారు .జన్మ స్తలం ”కొండ వీడు ”అని వేమన చెప్పుకొన్నాడు .ఆ పట్నం లో 82పేటలు ఉండేవి .అందులో మూగ చింత పల్లి అనే పేట లో మొదటి ఇల్లు వేమన గారిదే నట .
తను జన్మించిన కాలాన్ని వేమన ఒక పద్యం లో బంధించాడు ”నందన సంవత్సరమున -పొందుగా గార్తీక శుద్ధ పున్నమి నాడున్ -వింధ్యాద్రి సేతు బంధన న్-సందున నొక వీరు డేగు సరగున వేమా ”అన్నీ పరి శీలించి ,1412వ సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు వేమన జన్మించి నట్లు తేల్చారు .68ఏళ్ళు జీవించి ,1480 శార్వరి -చైత్ర శుద్ధ నవమి నాడు వేమన సిద్ధి పొందాడు .ఈ విషయాన్ని కవి కోకిల ,వాస్తు విశారద ,అముద్రిత వాజ్మయ శేఖర శ్రీ నేడు నూరి గంగాధరం గారు ”మాహా యోగి వేమన కవి జీవితం ”లో విపులం గా వ్రాసి చదువరులకు అపూర్వ కానుక గా అందించారు .
                     రెండో కధ
వేమన కొండ వీటి రెడ్డి వంశం ”కనుగొల్ల ”గోత్రం వాడని ,అసలు పేరు పుల్లా రెడ్డి అని ,అన్నగారు రాజు అని తెలుస్తోంది .అన్నతో పోట్లాడి ,తల్లితో కదిరి పట్టణం దగ్గర ..నల్ల చెరువు ”అనే ప్రదేశానికి వచ్చి ,వ్యవసాయం చేసుకొంటూ జీవించాడని ఒక రోజు నెత్తిన పిడుగు పడి చని పోయాడని దహన క్రియలు జరుప బాగా ,తల్లికి కలలో కన్పించి యేడు రోజుల్లో తాను బ్రతుకు తా నని చెప్పాడని ,ఎనిమిదవ రోజు న పు నరుత్తానం చెందాడని ఆశ్చర్య పడిన జనం తో తాను పుల్లా రెడ్డి కాదని ”వేమన ”అని చెప్పాడని ఒక కధ ప్రచారం లో ఉంది.ఆ తర్వాత అనేక మహాత్యాలు చూపుతూ ,దేశ సంచారం చేస్తూ ,కడప జిల్లా రాజం పెట దగ్గర ”కోడూరు ”చేరాడని ,తల్లి అచ్చమ్మ ,భార్య ఆది లక్ష్మి కుచ్చెర్ల పాడు లో మరణించారని వాళ్ళిద్దరికీ వేమన సమాధులు కట్టించాడని అవి ఇప్పటికి అక్కడ ఉన్నాయని ,తర్వాత ”కటార్ల పల్లె ”చేరి జీవ సమాధి పొందాడని ఇంకో కధ ఉందని శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు ”వేమన ”పుస్తకం లో వివ రించారు .అయితే ఆ వేమన మన వేమన కాదని తేలినట్లు చెప్పారు .ఇదంతా ”పుక్కిటి పురాణం ”అని తేలిగా కొట్టి పారేశారు శర్మ గారు .
          మూడో కధ
వవైకుంఠం లో ఒక రోజు విష్ణు మూర్తి లక్ష్మీ దేవి కలిసి వేమన్న ను పిలిచి భూలోకం లో అవతరించమని కోరగా ,తుంగ వంశం లో కేశవుడు ,లక్ష్మమ్మ కు సంతానం గా జన్మించాడని ,తర్వాత కదిరి చేరి ,వేమన తత్వాన్ని అందరికి ఉప దేశిన్చాడని పురాణ పురుషుడు గా వేమన్న కు ఒక కధ ప్రచారం లో ఉందిఅని రాళ్ళ పల్లి వారు తెలియ జేసి ఆయన 15 వ శతాబ్ది వాడు అన్నారు .కడప జిల్లా లో జమ్మల మడుగు తాలూకా ”ముడియం ”అనే ఊళ్ళో వేమన శిష్యుల పీఠం ఉందని ,యోగాభ్యాసమే వాళ్ళ వ్రుత్తి అని ,అలాంటి వారు ,ఆ మండలం లో వంద కుటుంబాల వారు ఉన్నారని శ్రీ కావ్య తీర్ధ జనమంచి శేషాద్రి శర్మ చెప్పినట్లు అనంత శర్మ గారు రాశారు .తంజావూరు రాజ అంతఃపురం లో వేమన చిత్ర పటం ఉందట .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-8-12-కాంప్-అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మౌన యోగి మరియు బ్రామ మౌన యోగి(the sage who never speaks )

 మౌన యోగి మరియు బ్రామ
                                         మౌన యోగి(the sage who never speaks )

ఒక చిన్నతాళాలు వేసిన  గది లో ఆయన ఒక్కరే పద్మాసనం లో కూర్చుని ఉన్నారు .గీచీ గుడ్డ తప్ప యే వస్త్ర ధారణా లేదు .అప్పటికే సమాధి స్తితి లో ఉన్నారు .భౌతిక విషయాలేమీ ఆయన కు తెలీవు .ఆయన చిరు నవ్వు ,లో ప్రపంచాన్ని జయిన్చానన్న భావం గోచరిస్తోంది .కళ్ళు తీక్షణం గా దేనినో వెతుకు తున్నాయన్నట్లుంది .ఆది ఐర్వచనీయ సమాధి .ఆయనకే అనుభావై క వేద్యం  .కళ్ళు ఆర్పటం లేడు .కను రెప్ప కూడా కదలటం లేడు .అలా రెండు గంటల నుండి ఉండి పోయారు .ఆయన మనసు ఇతే ,ఇహ లోక జ్ఞానం ఉండదు .శరీర భాగా లన్ని నిద్ర పోతాయి .వాటికి చలం ఉండనే ఉండదు .అప్పుడప్పుడు కను కోణాల నుండి ,ఒక నీటి బిందువు రాలు తోంది .దృష్టి ని కేంద్రీకరించటం వాళ్ళ కన్నీటి గ్రంధుల పని ఆగి పోయింది .ఒక కాంశ్య విగ్రాహం లా గా అని పిస్తున్నారు మౌన యోగి .
ఆయన శ్వాస జరుగు తూనే ఉంది .అదీ చాలా నిదానం గా .ఆది ఎవ్వరికీ వినపడ నంత గా ఉంది కాని చాలా క్రమ బద్ధం గా ,లయ గా శ్వాశిస్తున్నట్లు కన బడు తోంది .ఆయన ఈ శరీరాన్ని వదల లేదు అని చెప్పటానికి శ్వాస ఒక్కటే ఆధారం అని పిస్తుంది .ఆయన గురించి బర్టన్ చాలా విన్నాడు ,తెలుసు కొన్నాడు అయినా అన్నీ సందేహాలే .మౌన యోగి వివరాలు ఆయన దగ్గర నిరంతరం ఉన్న అతన్ని అడిగాడు .అతను చెప్పటం ప్రారంభించాడు .స్వామి ఎప్పుడు వచ్చాడో ,ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు .ఇంతవరకు ఎవ్వరి తోను మాట్లాడి నట్లు గమనించలేదు .ఎవరి  గురించీ ఆయనకు తెలీదు .ఎవరి గురించీ అడ గరు  .ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్ళు అయింది .అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలో అన్నాన్ని అడిగి వేసింది తినే వాడు .రోడ్డు మీద ఒక చెట్టు కింద ఎత్తైన రాతి మీదే ఆయన జీవితం .ఎండా, వాన, చలి అంతా అక్కడే .ఆయన కూర్చునే విధానం ఎప్పుడూ మారలేదు . యువకులు ఆయన్ని హేళన చేస్తున్నా ,వారినేమీ అనే వాడు కాదు .ఒక సారి మద్రాస్ వెళ్తున్న  ఒక పెద్ద మనిషి ఈ దృశ్యం చూశాడు .వెంటనే మద్రాస్ నుండి ఇక్కడి పోలీసులతో చెప్పి ఆ మౌన యోగికి రక్షణ కల్పించే ఏర్పాటు చేశాడు .పోలీసు వచ్చి ఆయన్ను ఎంతో అడిగితే కాని తన గురించి చెప్పలేదు .
”నేను మారకాయర్ అనే గురువు శిష్యుడిని .ఆయన నన్ను దక్షిణ మద్రాస్ కు వెళ్ళ మని  ఆదేశించారు .ఇక్కడ ఉండటానికి అనువు గా ఉందని చేరాను .నాకు ఇహ భోగాల మీద ఆసక్తేమీ లేడు .సత్య దర్శనం కోసమే జీవిస్తున్నాను” అని యోగి చెప్పాడు . .మరకార్ అంటే ఆ మధ్యనే చని పోయిన మహమ్మదీయ గురువు అని పోలీసాఫీసరు గ్రహించాడు .మద్రాస్ లో ఆయన చాలా మంది కి తెలుసు .ఒక బంగ్లా లో బస ఏర్పాటు చేస్త్తానంటే వద్దన్నాడు .అప్పుడు ఇప్పుడున్న గది  లో ఉంచి తనను సేవకుని గా నియ మించారని మౌన యోగి దగ్గరుండే సేవకుడు చెప్పాడు .యోగి కి ఒక్క డంటేటే ఒక్క శిష్యుడు కూడా లేడు .ఏకాంతం గా ఆత్మ ముక్తి కోసమే ఆయన ఉంటున్నారని చెప్పాడు ‘
సంచార యోగి మరిన్ని వివరాలు చెప్పాడు .ఇక్కడికి రవా టానికి ముందు మౌన యోగి సైన్యం లో సిపాయి గా పని చేశాడు .తర్వాత  మారకాయర్ శిష్యుడైనాడు .మౌన యోగి నుండి తనకు ఏదో ”టేలి పతిక్ ”కరెంటు  తనను ఆవేశించి నట్లు గా పాల్ బ్రంటన్ అభి ప్రాయ పడ్డాడు .ఆయన తన దృష్టిని .ఆలోచన ల కన్నాలోతుగా కేంద్రీక రించటం వల్ల  ఆయన చేతన అంతా విశ్రాంతి స్తితి లోకి వెళ్ళింది .ఇదే ప్రపంచం కంటే ప్రేమ గా మారి పోయింది .ఆ ఆత్మా నందం లో రమిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకొంటున్నారు మౌన యోగి ”అని పాల్ అభి ప్రాయ పడ్డాడు .అంతటి తాదాత్మ్య స్తితిని పొందిన ఒక మహా యోగి ని దర్శించి నందుకు  తన జన్మ ధన్యం అయిందను కొన్నాడు బ్రంటన్ .
                     బ్రామా -(the yoga which conquers death )
బ్రామా నిరంతర సాధకుడు .అడయార్ దగ్గర ఉండే వాడు .బ్రంటన్ ఈయనను సందర్శించి ,ఆయన అనుభూతులను తెలుసు కొన్నాడు .ఈయన చక్క గా మాట్లాడి వివరించాడు .యోగా విద్య లన్ని పూర్తిగా గురు ముఖం గా బ్రామా నేర్చుకొన్నాడు .ఆయన చూపే అద్భుతాలు మనల్ని వివశుల్ని చేస్తాయి .ఒక సారి పాల్ వెళ్లి నప్పుడు బ్రామా శిలా విగ్రహం లా గా కూర్చుండి  పోయాడు .కదలిక లేనే లేదు .ఆయన గుండె చప్పుడు క్రమంగా క్షీణిస్తోంది .చివరికి గుండె కొట్టు కోవటం మానేసింది .అలా యేడు సెకన్లు గడిచింది .చని పోయాడను కొన్నాడు .రక్షించాలి అనే ప్రయత్నం లో పాల్ ఉన్నాడు .క్రమం గా శరీర అవయవాలు కదలటం ప్రారంభించాయి .హమ్మయ్య అనుకొన్నాడు .మళ్ళీ గుండె కొట్టు కోవటం ప్రారంభించింది .మామూలు మనిషి అయాడు బ్రామా .”గుండె ఆగి పోవటం గమనించావా ? అని బ్రామా అడిగాడు .”స్పష్టం గా .ఆది విభ్రాంతి కాదు ”అని స్పష్టం చేశాడు బ్రంటన్ .ఇదేమీ గొప్ప విషయం కాదని తన గురువు రక్త ప్రసరణ ను కూడా ఆపి వెయ గల సమర్దులని తెలిపాడు .బ్రామా ను ఆ విధానం చూపించ మని అర్ధించాడు పాల్ .
బ్రామ బ్రంటన్ ను తన మణి కట్టు వద్ద నాడిని పట్టు కో మన్నాడు .అప్పుడు రక్త ప్రసరణ స్పష్టం గా కనీ పించింది పాల్ కు .రెండు లేక మూడు నిమిషాల తర్వాతా క్రమంగా రక్త ప్రసరణ  తగ్గు తున్నట్లు గమనించాడు .నాడి స్పందన తగ్గుతోంది .మరి కొద్ది సేపటికి నాడి  కొట్టు కోవటం ఆగి పోవటం స్పష్టం గా గమనించాడు బ్రంటన్ .పల్సు ను ఆపేశాడు బ్రామా .తర్వాత మూడో నిమిషం వరకు అలాగే నాడీ  స్పందన ఆగి పోయింది .నాలుగో నిమిషానికి నెమ్మది గా స్పందన ప్రారభం అయి నట్లు గమ నించాడు .చివరకు మామూలు గానే నాడి కొట్ట్టు కుంది . .పాల్ ఆశ్చర్య పోయాడు .”ఇదేమీ ఆశ్చర్య పడాల్సిన విషయం కాదు ”అన్నాడు బ్రామా తాపీగా .”కావాలంటే శ్వాస కూడా ఆపేస్తాను చూస్తావా ”అన్నాడు .సరే నన్నాడు పాల్ .
బ్రామా కళ్ళు మూసుకొన్నాడు .తన ఉచ్చ్వాస ,నిస్శ్వశాలను గమనించమని ముందే చెప్పాడు .అలాగే చూస్తున్నాడు పాల్ .బ్రామా ఒక రాయి లాగా మారి పోయాడు కాసేపటిలో .ఒక రక మైన సమాధి స్తితి లోకి వెళ్లి పోయాడు .ఆయన ముక్కు దగ్గర వేళ్ళు పెట్టి చూశాడు పాల్ .ఎక్కడా ప్రాణ స్పందన కనీ పించలేదు .శ్వాస పూర్తిగా స్తంభించి పోయింది .ఆయన నాసా పుటాలను , ,భుజాలను , ,పెదిమలను ,చాతీ ని అన్నీ తట్టి చూశాడు .కాని ,ఎక్కడా ప్రాణం కనీ పించలేదు .ఒక పాలిష్ చేసిన అద్దం తెచ్చి ముక్కు పుటాల దగ్గర పెట్టాడు .శ్వాస జరిగితే దాని పై నీటి బిందువులు ఏర్పడాలి .అదీ లేదు .పెదిమల దగ్గర పాలిష్ చేసిన ఇత్తడి పళ్ళెం పెట్టాడు .ఎక్కడా నీటి బిందువుల జాడే లేడు .అంటే ఖచ్చితం గా శ్వాస ఆగి పోయిందని నిర్ణయానికి వచ్చాడు బ్రంటన్ .తాను ఊహించని విషయాలు బ్రామా చేసి చూపించటం తో ”మైండు బ్లాక్ ” యిపోయింది పాల్ కు .యోగా అంటే పనికి మాలింది అని ఇప్పటి దాకా అనుకొన్నందుకు సిగ్గు పడ్డాడు .బ్రామా క్రమం గా స్పృహ లోకి వచ్చాడు .”ఎంతో గొప్ప గా ఉంది ”అని పొగిడాడు దాని విధానం వివరించమని బ్రామా ను కోరాడు .అలా చెప్పలేమని ఇదంతా” అడ్వాన్సుడు యోగా” కు చెందినక్రియలు అని  తెలిపాడు .
”  వీటి లో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి ”అని అడిగాడు పాల్ .”కొన్ని జంతువులను గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి .ఏనుగు చాలా నెమ్మది గా శ్వాసిస్తుంది .అందుకే ఎక్కువ కాలం బతుకు తుంది .పెద్ద సర్పాలు ఇంకా నెమ్మదిగా శ్వాసిస్తాయి .కనుక ఎక్కువ కాలం జీవిస్తాయి .హిమాలయాల్లో శీతా కాలం లో చాలా జంతువులూ ”వింటర్ స్లీప్ ”లోహిమాలయ గుహల్లో ఉంటాయి .అక్కడ ఒక్క సారి కూడా శ్వాస పీల్చుకోవు కొన్ని వారాల తరబడి .హిమాలయ ఎలుగు బంట్లు ధృవపు ఎలుగు బంట్లు ఇలానే చలికాలం గడుపు తాయి .కొన్ని నెలలు ఇలా ఉండగలవు .శ్వాస ను నిలిపి వేసుకొంటా యి . ప్రాణం నిరంతర కొనసాగుతుంది .చావు శరీరానికి ఒక అలవాటు మాత్రమె .”
రాజా రంజిత్ సింగ్ హరిదాస్ అనే ఒక ఫకీరు నులాహోరు లో  ఒక సమాధిలో బంధించాడు ..ఆ తర్వాత బ్రిటీష సైన్యం,రంజిత సింగు  సమక్షం లో ఆ సమాధి ని తవ్వి చూశారు .ఆరు వారాల తర్వాత కూడా ఆ ఫకీరు జీవించే ఉండి హాయిగా నవ్వు కొంటూ బయటికి వచ్చాడు .ఇది ప్రభుత్వ రికార్డు లలో నమోదై ఉంది .ఆత్మ బలం తో శ్వాస ను నిరోధించుకొని ఆ యోగి చావు నుండి తప్పించుకొన్నాడు .ఇవన్నీ యోగ రహస్యాలే .వీటిని గురువు సమక్షం లో అభ్యాసం చేయాలి .వీటిని ప్రదర్శన గా చేయ రాదు .అయితే వాటి పై నమ్మకం కలిగించటానికి అప్పుడప్పుడు తప్పదు .
  మనవి —          మా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు  (అలబామా ) నాకు పాల్ బ్రంటన్ పుస్తకం ”  in search of secret india ”     హన్త్స్ విల్ లో ఉన్న వారింటికి వెళ్లి నపుడు చదవ మని  ఇచ్చారు .ఈ పుస్తకం గురించి ఎన్నో ఏళ్ళు గా విన్నానే కాని ఇప్పటి వరకు చదవ లేదు  .చదివి ఆశ్చర్యాను భూతి కి లోనైనాను .అందులో నాకు నచ్చిన విషయాలను ఇ ప్పటికి  ఆరు ఆర్తికల్స్ గా రాశాను .నేను పొందిన ఆనందం మీకూ అందించాలనే నా తపన  మాత్రమె ఇది. దీనికి కారకులైన మైనేని వారికి కృతజ్ఞతలు .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ — 30-8-12-  కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged , | Leave a comment

జన వేమన –13 వేమన గురించి కధలు -గాధలు

 జన వేమన –13
వేమన గురించి కధలు -గాధలు 

”dates are the weakest links in indian history ”అని మాక్సు ముల్లర్ మేధావి అన్నాడు .భారత దేశ చరిత్ర లో తారీఖులు సరిగ్గా ఉండవు .నిజమే .మన కవులు ,రచయితలు తాము రాసిన విషయాలకే ప్రాధాన్యం ఇచ్చారు కాని ,తమ జీవిత చరిత్ర కు ప్రాధాన్య త నివ్వ లేదు.యే కొద్ది మందో ,తండ్రి ,తాతలగురించి కొద్ది గా చెప్పుకొన్నారు .అవీ అరకొరగా .చరిత్ర కు ప్రాధాన్యత నివ్వ లేదు .మన చరిత్ర అంతా పాశ్చాత్యులే రాశారు .కాల నిర్ణయానికి సరైన తేదీలు ఇవ్వక పోవటం తో వాళ్ళ ఇష్టం వచ్చి నట్లు చరిత్ర సృష్టించి మన నెత్తిన రుద్దారు .అదంతా తప్పుల తడక అని తెలుసు కోవటానికి చాలా కాలం పట్టింది .దీనిని సరి చేసుకోవటం లో మన చరిత్ర కారులు కొంత కృషి చేశారు .దొరికిన ఆధారాలన్నీ గాలించారు .రాజుల కాలం ,కవుల కాలం బేరీజు వేసి ఎవరికి తోచింది వారు చెప్పారు .ఇక్కడా పొంతన కుదర లేదు .ఒకరిద్దరు దరి దాపులకు వచ్చినా ,మిగిలిన వారు కాదు పొమ్మన్న స్తితి .ఇదీ మన చరిత్ర .అందుకే అంతా సుమారు కాల నిర్ణయమే జరిగింది .పాశ్చాత్య వాదాన్ని కాదని మన చరిత్ర కారులు నిత్య ,చారిత్రిక ఆధారాల దృష్ట్యా కాల నిర్ణయం చేసినా ఇంకా అనుమానం .మూడు ,నాలుగు వందల క్రితం ఉన్న రచయితల చరిత్రే మనకు నిర్దుష్టం గా తెలియదు .అలాంటిది రామాయణ ,భారత కాల నిర్ణయం గగనమై పోయింది .పాశ్చాత్య నిర్ణయం లో వారికి తెలిసిన మూడు లేక నాలుగు వేల ఏళ్ళ నాటి విషయాలే ఆధారం .మనదిఅలా కాదు .మన భారతం ,భవిష్యత్ పురాణం మంచి ఆధారాలే ఇచ్చాయి .
భారత యుద్ధం ఆధారం గా ,కాల నిర్ణయం జరగాలి .మన పంచాంగాలే మన ప్రమాణాలు .వీటి అన్నిటి ఆధారం గా మన విజయ వాడ వాస్తవ్యులు స్వర్గీయ కోట వెంకటా చలం గారు భారత  దేశం లోని రాజులు పాలించిన కాలాన్ని ,గుప్తుల కాలాన్ని ఆంద్ర రాజుల కాలాన్ని ,శంకరాచార్యుల కాలాన్ని నిర్దుష్ట ఆధారాలతో ప్రచురించారు .దాదాపు ఇరవై పుస్తకాలు చరిత్ర పై రాసి” చరిత్ర భాస్కరులు” అని పించుకొన్నారు .పాశ్చాత్య చరిత్ర కారు లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు .భారత చరిత్ర కారుల అభి ప్రాయాలను సేకరించారు .పెద్ద ,పెద్ద విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పనిని వెంకటాచలం గారు ఒక్కరే ఒంటి చేత్తో నిర్వహించారు .అవును అనటానికి మనసు ఒప్ప లేదు .కాదు అనే దమ్మూ లేదు .ఇదీ మన చరిత్ర స్తితి .మన వాళ్లకు ఒక విచిత్ర భావన  కూడా ఉంది .రాసే కవి ,రచయిత గొప్ప వాడు అని పిస్తే వారి చుట్టూ ,అభూత కల్పనలు ,అసంగత విషయాలు మా యలు, మహిమలు అంట గట్టి నమ్మ శక్యం కాని స్తితి లో అసలు చరిత్ర ను నేట్టేయటం వెగటు అని పిస్తుంది .అద్భుతాలు లేక పోతే చరిత్ర కు లోపం వస్తుందని భావం .కవుల ,రాజుల చరిత్ర లలో నిజమెంతో ,అల్లిక ఎంతో తెలియని అగమ్య గోచర పరిస్తితి .తెనాలి రామ లింగడి చుట్టూ ,శ్రీ నాధుడి చుట్టూ ఈ అల్లిక లన్నీ ,అల్లి బిల్లి గా అల్లుకున్నాయి .ఇంకా వేమన సంగతి చెప్ప నక్కర లేదు .కులం ,ఊరు ,పెరుల్లో మార్పులు .మహిమలు ,మంత్రాలు ఎన్నో చేరాయి .అదో కీకారణ్యం .ఒక సారి అందులో ప్రవేశించి ,తమాషా చూద్దాం .”షికారు ”చేసి నట్టుంటుంది .”నిజం సిరి ”దొరక్క పోయినా ,కాల క్షేపం బానే ఉంటుంది .
”రాష్ట్ర కూటులు ”రెడ్డి పదం తో వర్దిల్లారు .రాజ్య స్తాపన చేసి ,చరిత్ర సృష్టించారు .రెడ్డి రాజ్యానికి మూల పురుషుడి గా ”దొంతి అల్లాడ రెడ్డి ”పంట శాఖ కు చెందినా వాడు .నైజాం లోని ”చదల వాడ ”లో వ్యవసాయం చేస్తూండే వాడు .ఒక రోజు ఆయనకు అపార ధనం లభించింది .దాన్ని దోచు కోవటానికి కొందరు ప్రయత్నించారు .ఆ వూరి దేవుడు ”వీర రాఘవ స్వామి ”కలో కల్పించి ,వెంటనే ఊరు వదిలి వెళ్ళమని అన్నాడు .అక్కడి నుండి ”హనుమ కొండ ”చేరాడు .బంగారం తో ,రాఘవ దేవ విగ్రహం చేయించి ,పూజిస్తున్నాడు .అక్కడి నుండి కొండ వీడు లోని ,కవులూరు ,ఆ తర్వాత ధరణి కోట చేరి అందరి తో మంచిగా ఉంటూ ,సంపన్నుడై మన్ననలు పొందాడు .ఇది ఇలా ఉంటె వేమన అనే వైశ్యుడు శ్రీ శైలం వెళ్లి ,”పరుస వేది ”ని సంపాదించాడు .అతనికి ఆశ్రయం కల్పించాడు .దాని ప్రభావం తో ,అక్కడ ఉన్న నాగలి బంగారం గా మారింది .ఆది చూసిన అల్లాడ రెడ్డి పరుస వేది రహస్యం అర్ధమై ,ఆ కుండ ను ఇంట్లో దాచి ,పాకలకు నిప్పంటించాడు .ఆ మంటల్లో కోమటి వేమన సజీవ దహనం అయాడు .కధ అంతటి తో ఆగ లేడు .అల్లా రెడ్డి కి కలలో వేమన  కన్పించి ,రెడ్డి చేసిన ద్రోహాన్ని అంతా వివరించి ,తనకు ఆశ్రయం ఇచ్చి నందుకు గాను కొంత జాలి పడి రెడ్డి వంశం లో ఆరుగురు రాజులు వంద ఏళ్ళు మాత్రమె రాజ్యం చేస్తారని ,వంశం లో పుట్టిన ప్రతి వాడికి  తన పేరు పెట్ట మని ,దాన ధర్మా లన్ని తన కు సమర్పించ మని” శాపం లాంటి వరం ”ఇచ్చాడు .వంశం నిర్వంశం కాకుండా చేసి నందుకు రెడ్డి సంతోషించాడు .అప్పటి నుండి రెడ్డి రాజు లందరికి ”వేమ” అనే ది పేరుకు ముందు చేరింది .వీరిలో పొంతి ,దేసటి అనే రెండు ఇంటి పేర్ల వారున్నారు .ఈ విధం గా” కోమటి వేమన రెడ్డి ”వేమన ”గా రూపు దాల్చాడని ఒక కధ ప్రచారం లో ఉంది .అల్లాడ రెడ్డి కుమారుడు ”కోమటి ప్రోలయ వేమా రెడ్డి ”.ఇతడే కాకతి ప్రతాప రుద్రుని సైన్యాధ్యక్షుడై నాడు .తురుష్కులు రాజు ను బందీ చేసి తీసుకొని పోతే, రాజ్య పాలన చేశాడు .1324లో రెడ్డిరాజ్యాన్ని స్తాపించి 1350వరకు పాలించాడు .ఎర్రన రాసిన హరి వంశం లో ఇతడు అద్దంకికి రాజ దాని గా చేసు కొని పాలించి నట్లుంది .అక్కడి నుండి కొండ వీడు చేరి, గొప్ప కోట ను కట్టి పరి పాలించాడు .మరిన్ని కధలు తర్వాతచూద్దాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged , | Leave a comment

అమెరికా ఊసులు –16 తెలుపు -నలుపు

 అమెరికా ఊసులు –16
తెలుపు -నలుపు 

ఫిలిప్స్ వీట్లీ అనే ఆమె మొదటి ఆఫ్రికన్ రచయిత .ఆమే ఆఫ్రికా లో1753 లో సేనేగాల్ లో జన్మించింది .ఆమె బందీ గా పట్టు బడి ,ఏడేళ్ళ వయసు లలోనే బానిస గా అమ్ముడు అయి పోయింది . ఆమె1773 నుంచి అంటే పద్దెనిమిదేళ్ళ వయసు నుండి కవిత్వం రాసింది .ఆమె కవిత లంటే అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్ టన్ మురిసి పోయే వాడు .ఆయన కోసం ఆమె ఒక కవిత ను కూడా రాసింది .అమెరికా దేశతెల్ల జాతి ” లి బెరల్ రచయిత” హార్రిఎట్ బీచేర్ స్టొవ్1852  లో బానిసల నికృష్ట జీవితాన్ని”అంకుల్ సాంస్ కేబిన్ ” ఫిక్షన్ గా రాశాడు .దానిని ఎందేరెందరో చదివి మెచ్చారు .

1930-70మధ్య డిప్రెషన్ కాలం లో నాలుగు మిలియన్ల మంది ఆఫ్రికన్ అమెరికన్లు దక్షిణ రాష్ట్రా ల నుండి ,ఉత్తర రాష్ట్రా లకు వలస వెళ్లారు .ఆ కాలం లో” షేర్ క్రాప్పింగ్ ”ఉండేది .పొలం లో పంట పండిస్తూ ,పండిన దాన్లో సగం యజమానికి ఇవ్చ్చే వారు .పెట్టుబడులన్ని నల్ల వారివి ,కష్టం కూడా వారిదే .కాని ఫలితం లో సగం తెల్ల యజ మానిది .ఈ వ్యవసాయం గిట్టక వలస లేక్కువ అయాయి .నల్ల జాతి వారికి చదువులు లేవు .పెద్ద వాళ్ళు పిల్లలకు కధలు చెప్పి కొద్దో గొప్పో జ్ఞానం కల్గించేవారు
అమెరికా లో 1930నాటికి నీలి కళ్ళు ఉన్న అమ్మాయిలూ అంటే క్రేజు ఎక్కువ గా ఉండేది .shirley temple అనే బాలసినీ  నటి బంగారు వంకీల జుట్టు ,నీలి కళ్ళ తో అందర్ని ఆకర్షించేది.ఈ అమ్మాయికి అందరి కంటే పారి తోషికం ఎక్కువ ఇచ్చే వారు .ఆ అమ్మాయి బాగా పాడేది ,డాన్సు చేసేది .అప్పటికి ఆ పిల్ల వయస్సు ఆరేళ్ళు మాత్రమె .ఆ వయసు లోనే ఆ చిన్నారి అకాడెమి అవార్డు పొంది ,అందర్ని ఆశ్చర్య పడేట్లు చేసింది .ఆమె ముఖ చిత్రం తో రికార్డులు ,మగ్గులు ,షరతులు ,హాట్లు ,గిఫ్ట్ కార్డులు వచ్చాయి .
రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో అమెరికా లోని పెరల్ హార్బర్ దాడి లో అమెరికా సైన్యం లో వీరోచితం గా పోరాడిన ఆఫ్రికన్ అమెరికన్ నావికుడు డోరీ మిల్లర్ కు నేవీ క్రాస్ ను మొదటి సారిగా అందజేశారు .ఒక నల్ల జాతీయుడు ఈ అవార్డు అందుకోవటం ఇదే మొదలు
1943లో అలబామా లో మొబైల్ అనే చోట నల్ల జాతి వారికి పన్నెండు  మందికి  షిప్ యార్డ్ లో ప్రొమోషన్ ఇచ్చి నందుకు తెల్ల జాతీయులు రెచ్చి పోయి ,విధ్వంసానికి దిగారు . .
1930-40కాలం లో తరచూ గా తెల్ల వారు నల్ల వారి పై దాడులు చేసి హింస సృష్టించే వారు .తెల్ల వారు నల్ల వారిని చెట్టు కు తాళ్ళ తో వేలాడ దీసే వారు .దాన్ని చూసి తెల్ల మూక ఆనందం తో గంతు లెసే వారు .1940లో ఆఫ్రికన్ అమెరికన్ ల కడ గండ్లను కళ్ళకు కట్టించే రచన ”native son ”వచ్చింది .దీన్ని రాసిన నల్ల జాతి రచయిత richard wright కు సాహిత్యం లో ప్రముఖ స్తానం లభించింది .1952లోRalph Ellison  రాసిన” the invisible man ”లో నల్ల జాతి వారి ఐడెంటిటి ని స్తిరపరిచింది .కనీ పించని మనిషి అంటే ,గుర్తింపు లేని నల్లజాతి అని సింబాలిక్ గా చెప్పిన రచన ఆది. వందేళ్ళ పోరాటం వల్లవారికి సమాన హక్కులు లభించాయి .
.1957లో కూడా ఆ హక్కు వచ్చినా ,లిటిల్ రాక్ అనే ఆర్కాన్సాస్ లోని ఊళ్ళో సెంట్రల్ హై స్కూల్ లో చేర టానికి ,తొమ్మిది మంది నల్ల విద్యార్ధులు ప్రయత్నించారు .రాష్ట్ర గవర్నర్ ఆర్వెల్ ఫాబాస్ నేషనల్ గార్డు లతో వారిని అడ్డ గిన్చేట్లు చేశాడు .సివి రైట్స్ ను సమర్ధించి అమలు చేస్తున్న ప్రెసిడెంట్ ”ఐసెన్ హోవేర్” వె య్యి మంది సైనీకు లను పంపి ,ఆ పిల్లలు స్కూల్ లోకి వేల్లెట్లు చేయించాడు .దీనితో ఆగలేదు .1960  నవంబర్ పధ్నాలుగున ఆరేళ్ళ నల్ల పిల్ల రూబీ బ్రిడ్జెస్ స్కూల్ లోకి ప్రవేశిస్తుంటే ,గేటు వద్ద తెల్ల వారు హేళన చేశారు .ఫెడరల్ మార్శల్సు సహాయం చేసి ,ఆ అమ్మాయిని లోపలి పంపారు .దీనికి ప్రతి స్పందన గా తమ పిల్లల్ని ఆ స్కూల్ నుంచి తెల్ల వాళ్ళు మాన్పించారు .ఆ పిల్ల ఒక్కతే అక్కడ ఆ ఏడాది అంతా చదువు కొంది .ఈ విషయాన్ని” నార్మన్ రాక వెల్ ”అనే చిత్ర కారుడు గొప్ప పెయింటింగ్  వేసి ”the problem we all live with ”అని పేరు పెట్టాడు .1960నాటికి తెల్ల వారి జీతం లో సుమారు నలభై నుండి అరవై శాతమే నల్ల వారి జీతం .దీని పై స్పందించిన నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్టీన్ బెక్ ”the big maarshals stood her on the curb and a jangle of jeering shrieks went up from behind the barri cades .the little girl didi not look at the howling croud but from the side the whites of her eyes showed like those of a frightened faun ”అని అక్షర శిల్పం గా చెక్కాడు .
అమెరికా లో వంద ”హిష్టారికల్లి  బ్లాక్ కాలేజీలు యూని వేర్సిటీలు ”1964ముందే ఏర్పడ్డాయి .ఆఫ్రికన్ అమెరికన్లు అందరు వీటి లోనే చదివి పైకి వచ్చారు .వీటిలో చదివిన నల్ల ప్రముఖుల్లో ఆండ్రూ యంగ్ ,du bois ,oprah winfreyవంటి వారున్నారు .అలబామా లో1955 december 1 న రోసా పార్కర్ అనే నల్ల జాతీయురాలు బస లో తాను కూర్చున్న సీటు ను తెల్ల జాతీ యుడికి   ఇవ్వ నందుకు ఆమెను అరెస్టు చేశారు .దానికి వ్యతి రేకం గా యాభై వేల మంది ఒక ఏడాది పాటు బస్సు లను బాయ్ కాట్ చేశారు .దీనికి ప్రపంచం అంతా సానుభూతి ప్రకటించి ,నల్ల జాతీయులకు పూర్తీ మద్దతు ప్రకటించింది .1956లో సుప్రీం కోర్టు వివక్ష తగదని తీర్పునిచ్చింది .అప్పుడే పౌరహక్కులకు ప్రాతి పదిక ఏర్పడింది .ఆ తర్వాతా మార్టిన్ లూధర్ కింగ్ నల్ల జాతి పౌరహక్కుల కోసం తీవ్ర ఉద్యమం నడి పాడు .1968 august 28 న వాషింగ్ టన్ డి.సి.లో రెండు లక్షల మంది తో భారీ ప్రదర్శన నిర్వ హించి నల్ల జాతి అస్తిత్వం ప్రదర్శించాడు .ప్రెసిడెంట్ కేన్నెడి”no city or state or legisletive body can prudently choose to ignore rights for equality ”అని ప్రకటి మ్ చాడు .1964 july 2న ప్రెసిడెంట్ జాన్సన్ పౌరహక్కుల చట్టం చేశాడు .ఆ సందర్భం గా ఆయన చారిత్రాత్మక మైన ఉపన్యాసం ఇచ్చాడు ”we believe that all men are equal .yet many are denied equal treat ment .we believe that all men have certain rights .yet many americans do not enjoy those rights .we believe that all men are entitled to the blessings of liberty .yet millions are being deprived of those blessings .not because of their own failure ,but because of the color of their skin .but it can not continue.”
క్రమంగా నల్ల వారు అన్నిటా ముందుకు వచ్చారు ”నలుపు చాలా ముఖ్యం ”అనే నినాదం పెరిగింది .బ్లాక్ ఈస్ గోల్డ్ అన్నారు .అలంకరణ సామగ్రి మీద ,”ఆఫ్రో ”అనే బ్రాండ్ ఉంటేనే వారు కొనే వారు .సిని మాల లో తెల్ల వారిదే సామ్రాజ్యం .తర్వాతా నల్ల వారు దున్నేశారు .hattie mc Daniel అనే ఆఫ్రికన్ అమెరికన్ నటి ఆస్కార్ అవార్డు అందు కొన్న మొదటి నల్ల జాతీయు రాలు .అదీ సహాయ నాయిక పాత్రకే .ఆ సినిమా” gone with the wind”.1940-50ల మధ్య లీనా హార్నే ,dorothi dandridge లు అత్యధిక పారితోషికం తీసుకొన్న నల్ల నటులు .దోరోతీ ముఖ చిత్రం తో లైఫ్ మేగజైన్ వచ్చింది .ఇది అపూర్వం .బెస్ట్ ఆక్త్రేస్ గా అకాడెమీ అవార్డు కు నామినేట్ అయిన మొదటి నల్ల మహిళ .ఆ తర్వాత ఆమె అవకాశాలు తగ్గాయి ఆమె బాధ పడుతూ ”if i were white ,i could capture the world ” అన్నది ఆమెను లైఫ్ మేగజైన్ అందాల రాశి గా అభి వర్ణించింది .తెల్ల మహిళల కు దీటు గా నల్ల వారు నటన లో మెప్పించారు .josephine beker అనే నల్ల జాతి స్త్రీ ”the black venus ”గా విపరీతం గా ప్రాముఖ్యం పొందింది .నల్ల జాతి సంగీత జ్నులు దున్నేశారు .ఆటల్లో కూడా వారే ముందున్నారు .ఎన్నో మత సంస్థల్లో వారు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు .
టోనీ మారిసాన్ అనే ఆఫ్రో అమెరికన్ రచయిత రాసిన ;;the bluest eyes ” నవలకు పులిట్జర్ బహు మతి లభించింది అలాగే gwendolyn brooks అంతకు ముందే we real cool అన్నదానికి పులిట్జర్ సాధించిన  మొదటి నల్ల రచయిత అని పించుకోన్నది .1981march  ”time maagazine ” మారిసన్ ముఖ చిత్రం తో వెలువడి నల్ల వారి కీర్తిని పెంపొందింప జేసింది .1993టోనీ మారిసాన్ కు సాహిత్యం లో అత్యున్నత ”నోబెల్ పురస్కారం ”లభించింది దీన్ని పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత ఈమె .ఈమెతో కలిసి నోబెల్ సాహిత్య బహు మతి పొందిన మహిళలు ఎనిమిది మంది మాత్రమె .అవార్దింగ్ కమిటీ ”maarison ‘s novels gave life to an essential aspect of american reality ”అని ప్రశంసించింది .మాయా ఆన్జేలో ,ఆలిస్ వాకర్ లు గొప్ప ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రులు .ఈ ప్రగతి అంతా ఎన్నో ఏళ్ళకృషి ,పట్టుదల ,అంకిత భావం ఉద్యమాలు ,అస్తిత్వ నిరూపణ ,హక్కుల సాధన వల్ల జరిగింది .1980లో టోనీ ivy league university కి ప్రొఫెసర్ అయిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ .ఆమెకు national humanities medal ను2000  లో ఇచ్చి అత్యున్నత గౌరవాన్ని కల్పించారు .ఆమె సందేశం అందరికీ ప్రేరణ  ”i was always interested in efforts people make to thrive ,survive ,and to relate to one another ..the search for love and identity runs through most every thing i write ”అందుకే ఆమెను ‘she was honoured for her work that celebrated our diversity ,tested our beliefs and connected us to each other and our common humanity ”అని ప్రశంసించారు ‘ఇదీ తెలుపు నుండి నలుపు కు ప్రస్తానం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మహర్షి శ్రీ రమణుల అనుగ్రహ భాషణం

 మహర్షి శ్రీ రమణుల అనుగ్రహ భాషణం 
”ప్రాపంచిక కార్యాలను వదిలి పెట్ట రాదు .రోజుకు ఒకటి రెండు గంటలు ధ్యానం చేసి నీ విధ్యుక్త ధర్మా లన్ని యదా ప్రకారం నిర్వర్తిన్చాల్సిందే .సరైన విధానం లో నీ ధ్యానం ఉంటె ,నువ్వు చేస్తున్న ప్రతి క్రియ లోను దాని ప్రభావం ఉంటుంది .నువ్వు యే విధానాన్ని ధ్యానం కోసం ఎంచు కొంతావో ,అదే విధానం నీ సకల చర్యల్లోను ప్రతి ఫలిస్తుంది .అలా చేస్తూ పోతూంటే ,మనుష్యుల పై నీ కున్న భావాలన్నీ మారి పోతూ ఉంటాయి .నీవు చేసే పను లన్ని ,నీ ధ్యానాన్నే పూర్తిగా అనుసరించి నడుస్తాయి .మనిషి తనను ఈ ఐహిక ప్రపంచం తో బంధించే వాటిని అన్నిటిని  త్యాగం చేయాలి .మాయ గా ఉన్న ”నాది ”ను పూర్తిగా వదులు కోవాలి .ప్రపంచం లో జీవిస్తూ ,నిస్వార్ధం గా ఉండటం కుదురు తుందా అని చాలా మంది సందేహిస్తారు .పనికి ,జ్ఞానానికి తగాదా కాని భేదం కాని లేదు .వ్యక్తీ అంతఃకరణ క్రమంగా ”ఆ దివ్యత్వం ”పైకి ఆకర్షింప బడుతుంది ”.ఆది” గా మారి పోతుంది .ముందుగా స్తిరత్వం కోసమే ఆసనం ,నిష్టా ,సమయం అవసరం .క్రమేపీ ఇవన్నీ నువ్వు చేసే పనుల్లోనే ఒదిగి పోతాయి .పని చేస్తున్నా ,చెయ్యక పోయినా ఆది ఒక నిరంతర చైతన్యమే అవుతుంది .మనమేమో విడి గా చేస్తున్నామనే భావన ఉండదు .మనిషి సంఘం లో ఉండిదాని పని చేస్తున్నా ,అతని మనస్సు బుద్ధి దీనికి అతీతం గా ప్రవర్తిస్తాయి .ప్రశాంతం గా నర్తిస్తాయి .,
యోగాను చేయాలి అంటే యోగి మనసును దాని లక్శ్యం వైపు లగ్నం చేయాలి .”నేనెవరు ”?అని ప్రశ్నించు కోవాలి .ఇలా అన్వేషణ సాగితే చివరికి నీలోనిది ఏమిటో నీకు ఆవిష్కారం అవుతుంది .ఆది బుద్ధికి అతీతం గా ఉండి,నీకు వింత అనుభూతినిస్తుంది .ఆ సమస్య ను నువ్వు పరిష్కరించు కొంటె ,మిగిలిన సమస్యలన్నీ వాటంతటికి అవే పరిష్కారం అవుతాయి .ప్రాణులన్నీ సుఖాన్ని ,ఆనందాన్ని కోరుతాయి .అప్పటి దాకా తాము అనుభవిస్తున్న అనంత దుఖాన్ని మర్చి పోవటానికే ఇవి .అయితే ఆనందం అనంతం గా పొందాలని వీరందరి కోరిక .ఆది సహజమే .ఒక దాని నుంచి ఇంకో దాని కోసమే ఆరాటం .వాళ్ళందరికీ తమ స్వార్ధమే కదా బాధిస్తోంది ?మనిషి నిజ వర్తనమే ఆనందం .ఆది పుట్ట్టుక తోనే వస్తుంది అతని సుఖానికి చేసే అన్వేషణ ,కూడా నిరంతరం సాగేదే .కానిదాన్ని పొంద గలుగు తున్నాడా? లేదే .కనుక అతను అనుకొనే ఆనందంశాశ్వతం కాదు . సుఖా  లకు అంతు అనేది లేదు .మరి ప్రపంచం దుఃఖ భాజనం గా కన్పిస్తోంది కదా ?దీనికి కారణం మన ఆత్మ ను సరిగ్గా గుర్తించని అజ్ఞానమే ‘
మనిషి పాపం చేయ టానికి కారణం దాని వల్ల సుఖాన్నో ఆనందాన్నో పొందుదామనే ఆశ .ఇది సహజాత మైంది .అయితే వారికి నిజం గా సుఖం పొందటం లేదనే విషయం తెలియదు .అతని పాపపు పనులే అతన్ని దెబ్బ తీస్తాయి .కనుక ఆత్మానందాన్ని మించిన ఆనందం అనేది లేదు .తన గురించి సరి అయిన జ్ఞానం కలగాలి .ఆ తత్త్వం లో నుంచే ”నేను ”అనేది ఏర్పడు తోంది .మళ్ళీ ఇది  అందులోకే చేరాలి .అదేజ్ఞానం .  నేను అనే ఆలోచన ప్రారంభం అవుతుంది పుట్టుక తోనే .తర్వాత ”నువ్వు ” అనే దానితో ఆది కన్పిస్తుంది .నువ్వు మనస్సు లో ”నేను ”అనే ఆలోచనా దారాన్ని అనుసరిస్తూ పోతుంటే ,ఆది మళ్ళీ నిన్ను అక్కడికే చేరుస్తుంది .అప్పుడు ”నేను ”కనీ పించదు . .ఇది మాటల్లో వివరించి చెప్పలేనిది .ఎవరికి వారు స్వీయ అనుభవం తో పొందాల్సిందే .
ఇలాంటి అన్వేషణ సాధ్యమా ?అని పిస్తుంది .సాధ్యమే .సాధన కావాలి. అప్పుడు ”నేను ”అదృశ్యమై పోతుంది .అదే జ్ఞానం, ఆనందం, సత్యం, శివం, సుందరం .మనసు ,బుద్ధి లకు  అతీతం గా ఒకటి ఉంది అని తెలిస్తే -అదే తెలుసుకోవటంఅంటారు . .దానినే స్వర్గం ,అంటారు అదే ఆత్మ అంటారు .నిర్వాణం అని కొందరంటారు .మనం దాన్ని ముక్తి అంటాం .యే పేరు పెట్టినా ,మనిషి తనను తాను కోల్పోతే ,అంటే తనను తాను తెలుసు కొంటె అదే ఆనందం, శాశ్వత మైన సుఖం .”ఎవరు తన జీవితాన్ని రక్షించాలి అనుకొంటారో వారు దాన్ని కోల్పోతారు .ఎవరు జీవితాన్ని  కోల్పోతారో వారు దాన్ని భద్రం గా దాచుకోన్నట్లే” అని పాశ్చాత్య వేదాంత భావన .తానెవరో తెలుసుకో వాలనే తపన ఉన్న వాడికి అనుమానం అని శ్చ యత  ఉండవు .మహా రాజులు ,చక్ర వర్తులు గొప్ప గా పరి పాలించి నట్లు కనీ పిస్తుంది ,కాని వారి హృదయాలలో ఇంతటి పని తాము చేయటం లేదని ,ఒక మహత్తర శక్తి తమను నడి పిస్తోందని నమ్ముతారు .మహా మేధావు లను కొన్న వారిని” మనిషి మిస్టరీ ని ఛేదిన్చారా”? అని అడిగితే సమాధానం లేక, తల వంచుకొంటారు .ఆది అసాధారణ మానవాతీత శక్తి అని అనుకో వచ్చు .కాని అదీ, ఎవరికి వారు అనుభవించి తెలుసు కోవలసిన సత్యమే .
సత్యాన్ని గురించి ఎరుక భారతీయుల కైనా ,పాశ్చాత్యు ల కైనా ఒక్కటే .ధ్యానం లో ఉత్పన్న మయ్యే శక్తి  అన్ని కార్య క్రమాలకు సహాయం చేస్తూనే ఉంటుంది .కనుక ధ్యానానికి, బయట చేసే ఇతర కర్తవ్యాలకు తేడా అంటూ ఏమీ లేదు .సత్యాన్వేషణే ఎవరు చేసినా .నిజ మైన ఆత్మ ను తెలుసుకో .అప్పుడు సత్యం సూర్యోదయ  కాంతి లాగా ప్రకాశిస్తుంది ప్రభావం చూపు తుంది .నీ మనస్సు కు యే బాధా, బందీ ఉండవు .అసలు ఆనందం వెల్లువై ప్రవహిస్తుంది .ఆనందం,  ఆత్మ,వేరు కావు .రెండు ఒక్కటే నని తెలుస్తుంది .ఈ ఆత్మ జ్ఞానాన్ని పొంది తే ఇక సందేహాలకు తావే ఉండదు .సందేహం లేక పోతే ,అంతా సచ్చిదా నందమే .
ఇదీ మహర్షి శ్రీ రమణులు నిత్యాన్వేషి అయిన బ్రిటన్ రచయిత పాల్ బ్రంటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యు లో దయ చేసిన ”అనుగ్రహ భాషణం ”.అందరికీ విజ్ఞాన సుధా మరందం.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన — 12 ఇతిహాస పౌరాణిక అంశాల పై వేమన

  జన వేమన — 12 
                                                     ఇతిహాస పౌరాణిక అంశాల పై వేమన 

ఆది కవి రాసిన శ్రీ మద్రామాయణం ఆది కావ్యం .రామ చరిత్ర కనుక ఇతి హాసం .కృష్ణ ద్వైపావను డైన వ్యాస మహర్షి రాసిన మహా భారతం కూడా భారత దేశాన్ని పాలించిన రాజ వంశాల చరిత్రే కనుక ఇతి హాసం .వ్యాసుడే రాసిన శ్రీ కృష్ణ లీలా విలాస మైన శ్రీ మద్భాగవతం ,మత్ష్య ,కూర్మ ,వరాహ వగైరా లన్ని పురాణాలు .”ఇలా జరిగింది ”అని చెప్పినది ఇతి హాసం అని ,”పాత డైనా ,కొత్త గానే ఉన్న్డది ”గా అని పించేది పురాణం అనీ అంటాం .ఈ రెండిటి లోను ,విషయాల పైనే వేమన దృష్టి సారించాడు .వాటిని సూక్ష్మ పరి శీలన చేశాడు .వాటి రహస్య లను అందించాడు .అలాంటి వాటి లో కొన్నిటిని గురించి తెలుసు కొందాం .
నిర్మల ధర్మాన్ని ధర్మ రాజు మొద లైన వారు అనుసరించారని ,”ధర్మమే నృపులకు తారక యోగంబు ”అని వేమన భారత పరమార్ధాన్ని తెలియ జెప్పాడు .”అందు ,ఇందు నందుననక బరికించి -విష్ణు వరయు చుండు విదితముగను –చక్రి తిరుగు భూమి చక్రంబు లోపల ” అని భాగవత పరం గా శ్రీ హరి విలాసాన్ని చెప్పాడు .రామ నామ మహాత్మ్యం చాలా గొప్పదని ,బోయ అయిన వాల్మీకి ”రామ నామ పథనమహిమచే –బాపడయ్యాడు ”అని ,”కులము ఘనము కాదు ,గుణము ఘనమ్బురా” అని గుణానికే ప్రాధాన్యత నివాలనివ్వాలని వాల్మీకి చరిత్ర ఆధారం గా చెప్పి ,జ్ఞానోదయం కలిగించాడు .స్త్రీ కి విలువ ను దేవుళ్ళు  ఎలా ఇచ్చారో ,అనే విషయాన్ని తెలుపుతూ ”స్త్రీ నెత్తిన రుద్రునకు, -స్త్రీ నోటను బ్రహ్మ, కపుడు సిరి గుల్కంగా, -స్త్రీ నెదిరి రొమ్మున,హరికి, -స్త్రీ నెడపగా ,గురుడ నీవు దేవర వేమా ?”అని త్రిమూర్తుల చాపల్యాన్ని ,వారు తమ భార్యలను ఎక్కడేక్కడ ఉంచుకున్నారో అనే విషయాన్ని చమత్కారం గా చెప్పాడు .ఒకరి కంటే ఒకరు స్త్రీ కి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారని తెలిపాడు .స్త్రీ ని దూరం చేసుకొనన్న గురుడే దేవుడు అన్నాడు .అంటే ,స్త్రీ వ్యామోహం అతిగా ఒద్దని భావన .బుద్ధికర్మను అనుసరిస్తుంది అని మన ఆర్యోక్తి .దీన్ని రావణా సురుని పరం గా అన్వయించాడు .”నిలకడ బుద్ధి లేని కోతి సేన తో ,లంకంతా నాశనం అయింది .అరి వీర భయంకరుడైన రాక్షసాధి పతి రావణ బ్రహ్మ ,ఆయన రాక్షస సైన్యం కపి సేన ముందు నిలువ లేక పోయారు .పూర్తిగా ఒడి పోయారు .పోగాలము వస్తే ,గడ్డి పోచ ,పామై కరుస్తుంది .”చేటు కాల మైన ,జేరుప నల్పుడే చాలు -”అని రావణ పరం గా అతి సూక్ష్మం గా చెప్పాడు .
కొందరి పుట్టుక ,ఆ వంశానికి మేలు ,గౌరవం చేకూరుస్తాయి .కొందరు పుట్టి ,వంశాన్ని సర్వ నాశనం చేస్తారు .మొదటి రకం లో శ్రీ రాముడు ,రెండవ రకం లో రావణుడు ఉన్నారని మనకీ పాటికి తెలిసే పోయింది కదా .”ఎవరి మంచి చెడ్డ లెంచి జూచిన దేట ”అని ,మంచి,చెడులకు శ్రీ రాముడు ,కురు సార్వ భౌముడు అని చెప్పాడు .కులం కాదు -గుణమే ప్రధానం అని మరో సారి చెబుతూ వశిష్టుని వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తాడు .ఆయన తల్లి దేవ వేశ్య అయిన ఊర్వశి .భార్య మాదిగ కులం లో జన్మించిన అరుంధతి .అయితే మాత్రమేం ?వసిష్టుడు శ్రియః పతి అయిన శ్రీ రామునికే గురువై ,అరుదైన గౌరవాన్ని దక్కించు కొన్నాడు .ఇవన్నీ ఆయన తపస్సు చేత సాధించిన దివ్యత్వం, ద్విజత్వం .కనుక బురద లో పుట్టినంత మాత్రం చేత పద్మ ప్రభకు ఏమీ కొదువ ఉండదు .అందుకే ”తపము చేత ద్విజుడు తర్కింప కులమేట్లు ?”అని నిలదీశాడు .
ఎంతో మంది రాజులు ,చక్ర వర్తులు భారత దేశాన్ని పరి పాలించినా షట్చక్ర వర్తులు ,షోడశ రాజులు మాత్రమె ప్రసిద్దు లైనారని గుర్తు చేశాడు .దశరధ మహా రాజు శ్రీ రామునికి పట్టాభి షేకం చేయాలని అనుకొన్నాడు .కాని విధి విలాసం -ఆయన అరణ్యాల పాలై నాడు .జటా జూట దారి అయాడు కాని ,కిరీట దారి కాలెక పోయాడు .”తలపు మనదే ,కాని దైవిక మది వేరే ”అని తానొకటి దాలిస్తే దైవం వేరొకటి తలుస్తాడని లోక పరం గా జరిగే విషయాన్ని రామ పరం గా చెప్పి ,అంతా మన అధీనం లో ఏమీ లేదు అన్న సత్యాన్ని తెలియ జేశాడు .రామాయణం లో రాక్షస సంహారం ,భారతం లో బంధు నాశనం ఉంటె ,బసవ పురాణం లో” పాప హరణం” ఉందని దాని విశిష్టతను చాటి చెప్పాడు .రామ నామం విశిష్టతను వేమన బానే చాటాడు .”రామ ,రామ యనుచు రంజిల మది వేడి -రహిత పడగ ,మదిని రవళి వినుచు  -మనసు నంటి యున్న మహా నీయు డన దగు”అని ,కమ్మగా ,రస రమ్యం గా రామ నామాన్ని పొగిడాడు .మాయ ఎంతటి వారి నైనా లోబర్చు కొంటుంది .వారితో ఆడు కొంటుంది . హరి ,అజుడు ,దేవ మునులు ,శివుడు జన్మలు పొందారు .జరా ,మరణాలు పొందారు .విధి వైప రీత్యం తప్పదు ఎంత వారి కైనా .ఇదంతా ”మాయా వాసన వేమా ?”అని తత్త్వం బోధించాడు .రాజ యోగ సాధన చేసిన వాడికి అసాధ్యం ఉండదు .హను మంతుడు రాజ యోగ రహస్య జ్ఞాని .అందుకే ,తేలిగ్గా శత యోజన విస్తీర్ణ లవణంబుధిని అవలీలగా దాటగలిగాడు . లంకకు చేరి సీతా మాత దర్శనం చేయ గలిగాడు .ఆయన హృదయం అంతా రాముడు కొలువై ఉన్నాడు .మహాత్ములకు సాధ్యం కానిది లేదని రుజువు చేశాడని ”మాయలడచి ,రామాజ్న మీరక వర్తించాడు ”అని హనుమన్న ను పోగి డాడు .
కష్టాలు వచ్చి నప్పుడు ధైర్యం తో ప్రవర్తించటం గొప్ప వారి లక్షణం .లక్ష్య సాధన కోసం ఎంత వారి తో నైనా పోరాడి గెలవటం వారి సహజ లక్షణం .అలాగే అర్జునుడు సాక్షాత్తు కాల కం థుదు అయిన శివుని తో ద్వంద్వ యుద్ధం చేసి మెప్పించి ,పాశు పతాస్త్రాన్ని వరం గా పొందాడు దానితో కౌరవ నాశనం సుసాధ్య మైంది అని వివరిస్తాడు వేమన .అలాగే ,నల మహా రాజు అడవులకు వెళ్లి ,ఇబ్బందులు పడి ,భార్యను కోల్పోయి ,రూపం చెడి ,చివరికి అంతా సుఖాంతం కాగా ,శని ప్రభావం పోగా ,మళ్ళీ రాజ్యాన్నీ, భార్య ను దక్కించు కొన్నాడు .”బుద్ధి నొక్కి ఎరుక పోకార్చు టలు ముక్తి  ” అని నల చరిత్ర కు భాష్యం చెప్పాడు .పెద్ద వాడికి అతి సామాన్యుడు సాయం చేస్తే ,దొడ్డ మనసు తో మెచ్చి హత్తుకొంటాడు .అలానే ,లంకకు వారధి కట్టే సమయం లో ఉడుత చేసిన సాయానికి అచ్చేరువంది,వీపు నిమిరి ,తన చేతి వ్రేలి గుర్తులు దాని వీపు పై శాశ్వతం గా ఉండేట్లు అనుగ్రహించాడు శ్రీ రామ చంద్రుడు .చిన్న సాయానికి అతి పెద్ద వరం లభించింది .ఈ సందర్భం గా ”ఉడుత రాముని కెంత ఊడిగంబు చేసే –ఉడుతను ,రాముడు వాంఛ చేత -వర కరంబు చే ,వీపు దువ్వగ లేద ”అని ,ఆ ఘట్టాన్ని చిరస్మరణీయం చేశాడు వేమన .”ఉడతా భక్తీ ”అన్న మాటకు చరితార్ధకత కల్పించాడు ..ఈ విధం గా ఇతి హాస ,పురాణాల ను చక్కగా ,సమన్వయము చేసి వ్యాఖ్యానించాడు వేమన .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

దైవ వనం

  దైవ వనం 
మా చిన్నతనం లో సిరా కావాలంటే దయాల్బాగ్ సిరానే వాడే వాళ్ళం .లేక పోతే కృష్ణ వేణి సిరా .ఆ తర్వాత చాలా వచ్చాయి .అందులో బ్రిల్ లాంటివి ఉన్నాయి .పెన్ను అంటే రత్నం పెన్నే ప్రసిద్ధం .దానికి ఇరిడియం టిప్ ప్ర త్యేకం .కాలం తో పాటు అన్నీ మారాయి .ఇవాళ బాల్ పెన్నులయుగం .అన్నిటిని దూసుకు వెళ్ళింది .చేతుల కు సిరా మరకలు ,వాటిని తుడుచు కోవటానికి పాత గుడ్డ ముక్కలు .ఇంకు పోసుకోవటానికి ఇంకు ఫిల్లర్ .చొక్కా ,లాగూలకు  సిరా మరకలు అంటని వాళ్ళుండే వారు కాదు .పెన్ను కక్కుతూ ఉండేది .జేబు పెన్ను పెట్టిన మేరా సిరా తో పెద్ద మరక తో కనీ పించటం సర్వ సాధారణం .పెన్ను రాయక పోతే విది లించి విదిలించి చేతులు పడి పోయేవి .బెంచీలు ,చాపలు సంచీలు అన్నీ సిరా చిందులతో తమాషా గా కనీ పించేవి .ఈ సిరా లకు ముందు ”కరక్కాయ సిరా ”అనె దాన్ని వాడే వాళ్ళం .దానికి పొడవైన పాళీ తో కలాలున్దేవి .సిరా లో ముంచి రాసే వాళ్ళు .గచ్చకాయ సిరా కూడా ఉన్నట్లు జ్ఞాపకం .వీటన్నిటి నుంచి విముక్తి నిచ్చింది బాల్ పాయింట్ పెన్ .ఇవన్నీ” దయాల్బాగ్ ”అనే మాట రాగానే గుర్తు కొచ్చిన విషయాలు .దయాళ్ బాగ్ అంటే ”దైవ వనం ”అని అర్ధం .దాని విశేషాలే ఇప్పుడు మనం తెలుసు కో బోతున్నాం .
ఉత్తర ప్రదేశ్ లో ఆగ్రా నగర సమీపాన దయాళ్ బాగ్ అనే ఒక చిన్న ఊరు లాంటి కాలని ఉంది .అడదిచక్కనిచెట్ల తో ,తోటలతో కళ కళ లాడుతూ ఉంటుంది  అక్కడే మనం చెప్పు కొన్న ”ఫౌంటెన్ పెన్ వర్క్ షాప్  ”ఉంది .అదే భారత దేశం మొత్తం మీద మొట్ట మొదటి సిరా పరిశ్రమ .బంగారు పాళీ లకు ఇర్డియం టిప్ పెట్టటం వీరి ప్రత్యేకత .దీన్ని స్వయం గా అమర్చ టానికి ముందు యూరప్ కు పంపి ఆ విధానాన్ని చేయించే వారు .ఆ తర్వాత ఆ పధ్ధతి తెలుసు కొని తామే అమర్చటం నేర్చుకొన్నారు .ఎక్కడ చేసినా ,చేయించినా నాణ్యత కు ప్రాధాన్యం .తరువాత ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు అక్కడ .ఆనితో సాహిత్య, వ్యాపార విషయాలన్నీ ముద్రించే వారు .హిందీ ఉర్దూ ఇంగ్లీష భాషల్లో ప్రచురించటం వీరి ప్రత్యేకత .”ప్రేమ్ ప్రచారక్ ”అనే వార పత్రిక ను కూడా నడి పారు .ఇంతకీ వీటన్నిటికి స్పూర్తి ఎవరు ?”రాదా స్వామి ”మత సంస్థ .ఈ కార్య కర్తలను ”రాదా సోమిష్టులు అంటారు .
ఈ కాలని ప్రత్యేకత ఏమిటో తెలుసు కొందాం .వీరందరూ పాజిటివ్ ఆలోచన కల కార్య కర్తలు .ఇక్కడ ట్రేడ్ యూనియన్ లేదు .ప్రతి వాడు పని చేస్తాడు .ఆది చిన్న పని ,పెద్ద పని అనే తేడా లేకుండా చేయటం వీరి ఆచారం .ఈ కాలనీ లాంటి నగరానికి విద్యుత్ శక్తి కేంద్రం ఉంది .వీరి యంత్రాలకు ,ఫాక్టరీ లకు ,గృహ సముదాయానికి అంతా దీని నుంచే పవర్ సప్ప్లై అవుతుంది .ప్రతి ఇంటికి విద్యుత్తు సమాజం అంతా భరిస్తుంది అందుకని మీటర్ల ప్రసక్తి దానిపై  ఖర్చు లేదన్న మాట .వ్యవ సాయ క్షేత్రాన్ని వీరందరూ నిర్వహిస్తున్నారు .దీన్ని ఒక మోడల్ ఫారం  గా చేయటమే ధ్యేయం . .స్టీం ట్రాక్టర్ ను ,స్టీం నాగలి ని ఉపయోగిస్తారు .పాలు ,తాజా కూర గాయాలు పండించి అందరికి అందు బాటు లో తెస్తారు .వీరి పాల డైరీ కేంద్రం చాలా వ్యూహాత్మకం గా ఉంది .అప్పటి వరకు ఇండియా లో అలాంటి డైరీ ఎక్కడా లేడు .ఇదే మొదటిది .ఇది కూడా మోడల్ గా నిర్వ హిస్తున్నారు .వీరు తీసుకొనే చర్య లవల్ల  ఉత్పత్తి గణనీయం గా ఉంటుంది .పాల శుద్ధి ,శీతలీ కరణ అనే వాటి పై వీరి శ్రద్ధ అమోఘం .క్రిములు లేని పాలను ఆగ్రా ,దయాళ్ బాగ్ పట్ట ణాలకు వీరు సరఫరా చేసి అభి నందనలు పొందారు . దీని కంతటి ప్రశస్తి తెచ్చిన వారు సోహాబ్జీ మహా రాజ గారి కుమారుడు .ఇతను దీనికోసం హాలాండ్,డెన్మార్క్ అమెరికా లలో పర్య టించి అక్కడి పాల ఉత్పత్తి కేంద్రాలను చూసి ,ఇక్కడ అమలు చేశాడు .
మంచి నీటి వ్యవహారం లోను అత్యంత శ్రద్ధ వహించారు .కాలువలు త్రవ్వి మొదట్లో నీటి వ్యవస్థ కల్పించారు .ఆ తర్వాత ఆది చాలక  ,ప్రభుత్వాన్ని సాయం కోరి వారి ఇంజినీర్ల సాయం తో బోరు బావులు త్రవ్వించి నీటికి ఆటంకం కలుగ కుండా చేశారు .దయాళ్ బాగ్ కు స్వంత బ్యాంకు వ్యవస్థ ఉంది .”రాదా స్వామి జెనెరల్ అండ్ అస్స్యూరెంస్ బాంక్ లిమిటెడ్ ”అనే బాంకు ద్వారా కాలనీ వాసుల కు ఆర్ధికం గా ఎన్నో సేవ లందించారు .అప్పటికే ఇరవై లక్షల మూల ధనం ఉంది .నగర బాన్కింగు ను కూడా వీరు తీర్చి దిద్దు తున్నారు .
రాదా స్వామి విద్యా సంస్థ కు దయాళ్ బాగ్ కేంద్రం .అన్ని వసతుల తో బిల్డింగులు నిర్మించారు .కను విందు చేసే తోటలను పెంచారు .వీరి ఆధ్వర్యం లో నడిచే ”మోడ ల్హై స్కూల్ ”లో వందలాది విద్యార్ధులు విద్యాభ్యాసం చేస్తున్నారు .ప్రిన్సిపాల్, ముప్ఫై రెండు మంది ఉపాధ్యాయులతో విద్యా సేవ చేస్తోంది .దీని నిర్వహణ సోహాబ్జీ మహా రాజ్ చూస్తారు .గొప్ప స్తాయి గల విద్య ఇక్కడ ఉంటుంది .మామూలు మత బోధ ఉండదు .మనిషి ని తీర్చి దిద్దే విద్య నేర్పిస్తారు .ఆయన మంచి పర్య వేక్షణ చేస్తూ దీని అభ్యుదయానికి కారకులవు తున్నారు .అవసర మైన పుస్తకాలతో గ్రంధాలయం ఉంది .మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు .అలాగే బాలికల కు ప్రత్యెక విద్యా లయాన్ని నడుపు తున్నారు .దీనికి తోడు టెక్నికల్ కాలేజి ఉంది .ఇందులో మెకానికల్ ,ఎలేట్రికల్ ,ఆటో మొబైల్ మొదలైన ఇంజీ నీరింగ్ విద్యలు బోధిస్తారు .ఫాక్టరీ లకు పంపి అక్కడ జరిగే విషయాల పై అవగాహన కల్పిస్తారు .
మంచి హాస్టళ్ళను నిర్వ హిస్తు విద్యార్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు .దయాళ్ బాగ్ నివాసుల మంచి చెడ్డలను చూడ టానికి ”దయాళ్ బాగ్ బిల్డింగ్ డిపార్ట్ మెంట్ ”ఉంది .నాలుగు రకాలైన నివాస భవనాలున్నాయిక్కడ .ఇంతటి బృహత్తర కార్య క్రమాలను లాభా పేక్ష లేకుండా నిర్వహించటం అసామాన్య విషయం .దీని కి రాదా స్వామి సభ్యులే ధనాన్ని సమ కూరుస్తారు .ఆది తమ మత కార్యం అనే పవిత్ర భావన తో చేస్తారు .స్వయం సమృద్ధి ,స్వయం పోషణ వీరి ధ్యేయం .వీరంతా ధన వంతులేమో నని అను మానం వస్తుంది మనకు .ఎంత మాత్రం కాదు .అందరు సామాన్యులే .మధ్య తరగతి ప్రజలే .దీని ప్రగతికి వీరందరి నిస్వార్ధ సేవా శక్తులే కారణం .ఆపాటికే చాలా లక్షల రూపాయలు ఖర్చు చేశారు .ఇంకా ఎంతో చేయాలి .
ఆ నాటికి వీరి మెంబర్ల సంఖ్యా 1,10,000.అందులో కొన్ని వేల మంది మాత్రమె కాలనీ లో నివాసం ఉంటున్నారు .అప్పటికి ఆ సంస్థ పెట్టి 75 ఏళ్ళు అయింది .వారిది;; ”సెమి సి క్రేట్ ఆర్గ నైజేషన్” .వీరి మెంబర్లు దేశం అంతా వ్యాపించి ఉన్నారు .దయాళ్ బాగ్ వీ రందరికీ కేంద్రం .వేలాది ఎకరాల భూమిని ఇప్పటికి కొన్నారు .ఒక రకం గా ”ప్లాటో ”గారి ఆదర్శ సామ్రాజ్యం లాగా ఉంటుంది .ఆధునికతను సనాతనం తో మేళ వించి ప్రగతి సాధిస్తున్నారు .మెంబర్లు సేవలను స్వచ్చందం గా నిర్వ హిస్తారు .సౌకర్యాలతో బాటు ఆధ్యాత్మిక ప్రగతినీ సాధిస్తారు .ప్రతి సభ్యుడు ఒక వెయ్యి రూపాయలు సభ్యత్వం గా సమర్పిస్తాడు .దీని పై సంవత్స రానికి అయిదు శాతం వడ్డీ ని అంద జేస్తారు .అతను చని పోతే ,వారసునికి కూడా అంతే డబ్బు వస్తుంది .మూడవ తరం లో ఆ పెట్టు బడి సొసైటీ కి చెందుతుంది .ఒక వేల సభ్యుడికి అత్యవసరం గా డబ్బు కావలసి వస్తే కొంత డబ్బు అందజేస్తారు .ప్రతి ఆది వారం సమా వేశం ఉంటుంది .చే బట్ట వలసిన విషయాలపై చర్చిస్తారు .ఆమోద యోగ్య మైన విధానాలను నిర్ణయించి ,అమలు చేస్తారు .గాంధి మహాత్ముడు ఇక్కడికి వచ్చి ,ఈ ఆదర్శ వ్యవ్యవస్థ ను చూసి ,ముచ్చటపడ్డాడు .అమెరికా ,జపాన్ ల ను చూసి సాంకేతిక త ను అమలు పరిచి తమ రాదా స్వామి మత వ్యాప్తికి సేవా పూర్వ విధానం లో .ప్రేమ పూర్వకం గా సేవ లందించటం వీరి ప్రత్యేకత్ .దీని కంతటికీ స్పూర్తి శ్రీ సోహాబ్జీ మహా రాజ్.
ఇక్కడ కార్య క్రమాలు ఉదయం ఆరు గంటలకే ప్రారంభం అవుతాయి .సోహాబ్జీ ఎత్తైన ఆసనం పై కూర్చుంటారు .వందలాది భక్త కార్య కర్తలు కూర్చుంటారు .వారికి చెప్పవలసింది సూటిగా ,స్పష్టం గా క్లుప్తం గా చెప్పిస్పూర్తి .ప్రేరణ కల్గించి   కార్యోన్ముఖులను చేస్తారు .ఆయన మాట వేద వాక్కే .ఆయనకు ఇంగ్లీష ధారాళం గా మాట్లాడటం వచ్చు .హిందీ సంస్కృతాలు  కరతలా మలకాలు .

ప్రస్తుత అద్యఖులు

ప్రస్తుత అద్యఖులు

ఇదీ పాల్ బ్రంటన్ 1950 ప్రాంతం లో దయాళ్ బాగ్ ను చూసి ముచ్చట పడిన తీరు .ఇప్పుడు ఇంకా మారి పోయి ఎంతో అభి వృద్ధి సాధించింది అని తెలుస్తోంది .పూనిక ,పట్టు దళ ,కృషి నిస్వార్ధ సేవ ,అంకిత భావం ఉంటె దయాళ్ బాగ్ వంటి దైవ వనాలెన్నో ఏర్పడి భువి పై నందన వనాలే అవుతాయి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-8-12- కాంప్–అమెరికా

Posted in మహానుభావులు, సమయం - సందర్భం | Tagged , | Leave a comment

ఆయనా -ఈయనా

  ఆయనా -ఈయనా 
” ఈయన” వచ్చే సరికి ”ఆయన” దాదాపు బట్టలు ఏమీ లేకుండా ఒక్క గోచీ గుడ్డ తో ఆసనం పై సుఖాసీను లయి ఉన్నారు .శరీరం కొంచెం రాగి రంగు లో ఉంది .వయస్సు యాభై ఉండి ఉంటాయి .జుట్టు గడ్డం మీసం తెల్ల బడ్డాయి .ఆయన విశాల ఫాల భాగం విజ్ఞాన ప్రభ లను వెద జల్లు తోంది .ఆయన మూర్తి మత్వం అపురూపం గా గోచరించింది .ఆయన చుట్టూ శిష్యులు పర్య వేష్టించి ఉన్నారు .అంతా నిశ్శబ్దం తాండ వీస్తోంది .ఆయన కళ్ళ లో అతీద్రియ తేజస్సు గోచరం అవుతోంది .ఆ  కళ్ళు  విప్పారి ఏదో లోకోత్తర  శక్తిని దర్శింప జేస్తున్నాయి .ఆయన కాయం అతీన్ద్రియత్వానికి ప్రతీక గా కన్పిస్తోంది .ప్రశాంత చిత్తం గా ఆయన కన్పిస్తున్నారు .ఎవరు వచ్చారో ,ఎవరు వెళ్తున్నారో ఆయన గమనించే స్తితి లో ఉన్నారు .మనిషి ఉనికి గురించిన ఎరుక ఆ కళ్ళ లో గోచరించింది .ఈయన ఇంతకు ముందు ఎందరి నో చూశాడు .వారెవరి  లో లేని ఏదో మహత్తర ఆకర్షణ ,తేజస్సు ఆయన లో కనీ పించింది ఈయనకు నోట మాటే రావటం లేడు .ఎన్నో సందేహాలను తీర్చు కొందామని ఈయన, ఆయన దగ్గరకు వచ్చాడు .ప్రశ్నలన్నీ ఏమై పోయాయో తెలీటం లేడు .ఆయన ఒక మహా సమాధి స్తితి లో ఉన్నట్లు గోచరించింది .అంతా శూన్యం లో విహరిస్తున్నట్లుంది .ఆయన లో ఏదో ఉంది .అదేమిటో తెలీటం లేదు.ఈయన కూడా రెప్ప వాల్చ కుండా ఆయన నె చూస్తూ కూర్చున్నాడు .అంతే -కాలం గడిచి పోతోంది .మనసు లోని సందేహాలు గంటలు గడిచిన కొద్దీ పటా పంచలయి పోతున్నాయి.ఒక పుష్పానికి సువాసన లా  ఆయన సమక్షం లో మనోనైర్మల్యం అంతటా వ్యాపించి ఉంది .ఆయన నుండి రేడియో ఆక్టివ్ తరంగాలు వ్యాపించి నట్లు ,తనను శక్తి మంతం ,కాంతి మంతం చేస్తున్నట్లు ఈయన భావించి ,ఆ ప్రభావానికి ముగ్ధుడై పోతున్నాడు .మనసంతా ప్రశ్నల మయం గా వచ్చిన ఈయనకు ఇప్పుడు మనసంతా సర్వ శూన్యం  అయి పోయింది .గుండె గొంతుక లో కొట్లాడు తోంది .మాట మాత్రం పెదవి దాటి రావటం లేదు .అగాధ సముద్రాలను అవలీల గా దాటిన  ఆనందాన్ని పొందిన తీరు లో ఉన్నాడీయన . చివరికి అదృష్టం తలుపు తట్ట్టింది .మౌన ఘోష విడి పోయింది .ఆయన దృష్టి ఈయన వైపు ప్రసరించింది కొన్ని గంటల మౌనం తర్వాత.అంతకాలం తాను అనుభ వించిన ప్రశాంత త కు ఈయన ముగ్దుడయాడు .శాంతి ,అశాంతిని జయించి ,విజయం సాధించింది .ఇప్పటికే ప్రక్కనున్న గైడు”ఏమైనా ప్రశ్నిస్తారా ??”అని రెండు మూడు సార్లు ఈయనను అడిగాడు .ఇప్పుడు ఈయన ”లేదు .ఇప్పుడు కాదు తరువాత ”అని నెమ్మదిగా చెప్పాడు .అప్పటికే చాలా మంది భక్తులు వెళ్లి పోయారు .ఈయన మౌనం గా ఆయన కు నమస్కరించి నెమ్మదిగా ఆశ్రమం లోని తన గదికి చేరాడు ఆ రాత్రి పొద్దు పోయిన చాలా సేపటికి .ఇంతకీ ఎవరు ఆ ”ఆయన ?”-ఎవరు ఈ”ఈ  యన ?”ఆయన అంటే అరుణాచలం లోని రమణ మహర్షి .ఈయన అంటే -భారత దేశం లో మహర్షుల ,యోగుల దర్శనం చేసుకొని ,వారి ఆత్మ శక్తులను తెలుసు కోవటానికి ఇంగ్లాండు దేశాన్నించి వచ్చిన జర్నలిస్టు డాక్టర్ పాల్ బ్రంటన్ .”A search in secret India” పుస్తకాన్ని రాసి పాశ్చాత్యులకు భారతీయ యోగుల ,మహాత్ముల ప్రభావాలను తెలియ జెప్పిన వాడు .
మర్నాడు మహర్షి శ్రీ రమణుల ను దర్శించాడు పాల్ బ్రంటన్ .ఇప్పుడు తన ప్రశ్నా పరంపరను సంధించటం ప్రారంభించాడు పాల్ .”మానవులకు అతీతం గా ఏదైనా ఉన్నదా ?దాన్ని నేను ఎలా కను క్కో గలనో వివరించండి ”అని అడిగాడు .లోపల ఈయన చెప్పా గలదా ,సరైన వాడినే ప్రశ్నించానా అనే సందేహం పట్టి పీడించింది పాల్ ను .మహర్షి కొద్ది సేపు మౌనమే పాటించారు .ఏదో ఆలోచన లో ఉన్నట్లు కనీ పించింది .మళ్ళీ పాల్ ”మా పాశ్చాత్య దేశం వారు దీనికి సరైన వివరణ ఇవ్వ లేక పోతున్నారు .నాకు మీరు పరి పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించా గలరా  లేక ఇదంతా ఒత్తి శ్రమ ఏనా”?అని అడిగాడు .అప్పుడు మహర్షి నెమ్మదిగా మొదలు పెట్టారు ”నువ్వు -”నేను ”అన్నావు .నేను తెలుసుకోవాలి అని ,నేనెవరినో చెప్పమని అడిగావు నిజమేనా ?అని ప్రశ్నించారు .తడబడ్డాడు బ్రంటన్ .ప్రశ్న కు ప్రశ్న సమాధానమా?.మళ్ళీ మహర్షి ”నేను అడిగింది స్పష్టం గా లేదా ? మళ్ళీ ఆలోచించు ”అన్నారు .అప్పుడు బ్రంటన్ ఒక వేలు తనకు తాకించు కొని తన పేరు చెప్పాడు .రమణులు ”అతను నీకు తెలుసా ?”అని ప్రశ్న వేశారు .”ఆ తెలుసు .నేనే ”అన్నాడు పాల్ .”ఆది నీ శరీరం మాత్రమె .మళ్ళీ ఆలోచించి చెప్పు నీవేవరివి ?”అన్నారు ఇదేమి వింత ప్రశ్న అని పించింది పాల్ కు .అప్పుడు మహర్షి ”ముందుగా” నేను” ను తెలుసుకో .అప్పుడు సత్యం బోధ పడుతుంది ”.అన్నారు ప్రశాంతం గా .పాల్ కేమీ బోధ పడ లేడు .అయో మాయం గా అయి పోయాడు .అప్పుడు ప్రక్కన ఉన్న దుబాసీ వివరించి చెప్పాడు .””నీలోకి నువ్వు చూసుకో .అదీ సరైన మార్గం లో .అప్పుడే నీకు సమస్యలు ,ప్రశ్నలు వాటికి  సమాధానాలు కనీ పిస్తాయి ”.యే పద్ధతి నేను అవలంబించాలి “‘అని మరలా ప్రశ్న .
”లోతైన భావన తో నిన్ను నువ్వు వెతుక్కో .దానికి నిరంతర ధ్యానం అవసరం .అప్పుడే ఆ కాంతి నీకు దర్శన మిస్తుంది .”అని అరుణా చాల ముని సమాధానం .”నేను సాధించానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది ?గురువు అవసరం ఉందా ?””ప్రశ్న .”అవసరం కావచ్చు ”ముని జవాబు .”సరైన గురువు దారి  చూప గలడా ?”పాల్ .”గురువు కు శిష్యుడికి ఏమి కావాలో తెలుస్తుంది .దాన్ని తీర్చ గల సమర్ధుడు .”అని మహర్షి .”జ్ఞాన జ్యోతి ని గురువు చూపించ గలడా ?”సందేహం ”సాధకుని పరిణతి మీద ఆది ఆధార పడి ఉంటుంది .గన్  పౌడర్ వెంటనే అంటుకొని మండు తుంది. కాని దాన్ని మండించే బొగ్గు  నిప్పుగా మారటానికి ఎక్కువ కాలం పడుతుంది .”.
”ప్రపంచ భవిష్యత్తు గురించి చెప్పండి ?”‘అని పాల్ ప్రశ్న .”నీ సమీప భవిష్యత్తే నీకు తెలీదు .ముందు నీ వర్తమాన పరిస్తితి తెలుసుకో .అప్పుడు భవిష్యత్తు దాని సంగతి ఆది చూసు కొంటుంది ”అన్నారు మహర్షి .”ప్రపంచం అస్తవ్యస్త పరిస్తితులకు లోను అవుతుందేమో ,స్నేహానికి విలువ ఉండదేమో ఒకరికొకరు శత్రువులు అవుతారేమో ”అని ప్రశ్నా వర్షం.. .నవ్వుతూ చిదానందం గా శ్రీ రమణులు ”ఈ విశ్వాన్ని పాలించేది ఒక్కడే .ప్రపంచాన్ని సరిదిద్దాల్సినదీ ఆయనే .ప్రపంచానికి జీవాన్ని ప్రసాదించిన వాడు ,దాని పరి రక్షణ ,నిర్మూలనా బాధ్యత లన్నీ ఆయనవే .ఈ ప్రపంచ భారాన్ని మోసేది ఆ పరమాత్మ .నువ్వు కాదు”.అని సమాధానం .”ఈ విశ్వాసం తో జనం ఉండగలరా ”?బ్రంటన్ సమాధానం పొందక, వేసిన ప్రశ్న .”నువ్వు ఎలా ఉంటె ,ప్త్రపంచం అలా కనీ పిస్తుంది .నిన్ను నువ్వు అర్ధం చేసుకో కుండా ,ప్రపంచాన్ని యెట్లా అర్ధం చేసుకో గలవు ?సత్యాన్ని తెలుసు కొన్న వారు  ఈ విషయాలేమీ గమనించరు .ప్రజలు ప్రశ్నల బరువు తో కుదించుకు పోతున్నారు .ముందు నీ వెనుక ఉన్నదేదో తెలుసుకో .అప్పుడు నీ వెనుక ఉన్న ప్రపంచం బాగా అర్ధం చేసుకో గలవు . .అందులో నువ్వూ ఉన్నావు అన్న సంగతి మర్చి పోవద్దు ”అని మహర్షి శ్రీ రమణుల స్పష్ట మైన సమాధానం .ఇదీ -కావ్యకంథగణ పతి మునిని ”నాయన గారూ ”అని ఆప్యాయం గా పిలుచుకొని, ఆయన చేత ”శ్రీ రమణ మహర్షి ”అని సార్ధక నామాన్ని పొందిన   అరుణాచల మహా యోగి భగవాన్  శ్రీ రమణ మహర్షుల ప్రధమ దర్శనం లో, ద్వితీయ దర్శనం తో పాల్ బ్రంటన్ పొందిన అనుభూతి .
మీ–గబ్బిట  దుర్గా ప్రసాద్ –28-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన -11 సామెతల ఆమెతలు

 జన వేమన -11
                                         సామెతల ఆమెతలు —

మహిమ ,ప్రతాపం లేని  దేవుడిని ,వీరుడిని కొలిస్తే ,ఏమీ ప్రయోజనం లేడు .”మహిమ లేని వేల్పు ,మంటి జేసిన పులి ”.రాజు చాలా తెలివి తో ప్రవర్తిస్తాడు .ఆశ్రితుల యెడ ,ఆదరంగా ,దయగా ఉన్నట్లే ఉంటాడు .ఏమాత్రం తప్పు చేసినా చంపేస్తాడు .”పట్టా నేర్చు పాము ,పాడగా నొరగ జేయు -చెరుప జూచు వాడు చెలిమి చేయి -చంప దలచు రాజు చను విచ్చి చూడడా ”అని లోకోక్తి రాజ బాధ అనుభ వించిన వారి పట్ల ,వాడుతాం .దానం చెయ్యి అని లోభి వాడి దగ్గరకు వెడితే ,గొడ్డు టావు దగ్గరకు పాలు పిండ టానికి వెళ్తే ఈడ్చి తన్ని నట్లు ఉంటుందని సామెతను మహా గొప్పగా చెప్పాడు వేమన్న .ఈ పద్యం రోజు మన నాలుక పై ఆడే పద్యమే .”గొడ్డు టావు బితుక కుండ గోమ్పోయినా -పండ్లు నూడ దన్ను బాలు రావు -లోభి వాని నడుగ లాభంబు లేదురా ”.చావు తెలివి కావాలి ,రావాలి .మిగతాది ఎంత చదివినా వృధానే .”చావు తెలియ లేని ,చదువు ల దేలరా ”అంటాం .చావు తెలివి అంటే చావును గురించిన జ్ఞానం .ఆది తెలిస్తే బ్రహ్మ జ్ఞానే అవుతాడు .మిగతా చదువులు కూడు ,గుడ్డా పెడతాయి కాని ,పరాన్ని ఇవ్వవు .అయితే -ఇప్పుడు లోకం లో చావు తెలివి అంటే -పనికి రాని తెలివి తేటలు అనే అర్ధం రూధీ అయి పోయింది .బలం లేని సమయం లో ,బలహీనుడు కూడా బల వంతుడిని ఓడిస్తాడు .అందుకే ”బలిమి లేని వేళ బంతంబు చెల్లదు ”అనే సామెత వాడుక లోకి వచ్చింది .సింహం బక్క చిక్కి తే బక్క కుక్క పిల్ల కూడా దాన్ని ఇక్కట్ల పాలు చేస్తుంది .
ముండనం (గుండు )చేయించు కొని ,కాషాయాలు కట్టు కొన్న మాత్రం చేత ,సన్యాసి కాడు .అందుకే ”తలలు బోడు లైన ,తలపులు బోడులా ?”అన్న లోకోక్తి ప్రచారం లోకి వచ్చింది .వేమన సూక్తులలో ,లోకోక్తుల్లో ,మనమందరం ఎప్పుడు వాడే పద్యం ”ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు -చూడ ,చూడ రుచుల జాడ వేరు -పురుషు లందు పుణ్య పురుషులు వేరయా ”అన్నది .చూడ టానికి అందరు పైకి ఒక లానే కనీ పిస్తారు .దాన్ని చూసి మోస పో కూడదు .ఆంతర్యం చాలా ముఖ్యం .పుణ్య పురుషులు ,మహాత్ములు కర్పూరం లా గా కరిగి పోతారు .ఆత్మ త్యాగం తో నీరాజ నాలు అందు కొంటారు .సామాన్యులు మాత్రం ఉప్పు లాగా ,ఉప్పగా ఉంటారు .అలాగే శరీరాన్ని కుల ,మతా లను బట్టి కాకుండా ,మనసును బట్టి విలువ నివ్వాలి ..”మిరప గింజ చూడ మీద నల్లగా నుండు -కొరికి చూడ లోన ,చురుకు మనును –సజ్జను లగు వారి సార మిట్టుల నుండు ”అని సజ్జన సాంగత్యం గురించి తెలియ జేశాడు .పెత్తనం ఇస్తే పరాయి సొమ్ము కాజేసే ప్రబుద్దుల్ని చూసి ”ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారికి తీపి ”అంటాం కదా .
కులం గొప్పా ,గోత్రం గొప్పా విద్య గొప్ప లను గురించి ప్రగాల్భాలను పలుకు తూ ఉంటాం .అలాంటి వారిని కుహనా సంస్కారులం అను కొంటాం .”కులము గల్గు వారు ,గోత్రము గల వారు -విద్య చేత విర్ర వీగు వారు -పసిడి గల్గు వాని బానిస కొడుకులు ”అని వేమన్న లాగా చీదరిస్తాం .తనకు తెలిసిందే సర్వస్వం అని ,తనకు తెలియనిది ఏమీ లేదని భావించే ,అల్ప మనస్కులు ”బావి లోని కప్పు పరి కిన్చునే జగంబు లాగా  గిరి గీసుకొని ,అదే ప్రపంచం అన్న చందం గా ప్రవర్తిస్తారని పోలుస్తాం .చంప దగిన శత్రువు తన చేత చిక్కి తే మేలు చేయాలి అనే ఆదర్శం అందరికి రావాలని అంతే కాని ”ఒకరి మేలు జూడ నొల్లక యితరుల -చెరుప దలతు వేని ,చెడేద వీవు — జింక జంప గుట్ర జేసి ,నక్క యే జచ్చె ”అని పంచ తంత్ర నీతి కధను గుర్తు చేస్తాడు .అర్ధాంతరం గా ఆస్తి వస్తే ,వాడు గర్వం తో కన్నూ ,మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటే ”కలిమి హెచ్చె నేని ,కనులు నెత్తికి వచ్చు ”అని లోకోక్తి చెబుతాం .కళ్ళు నెత్తికి రావటం అన్న వేమన మాట జన సామాన్యం లో పాతుకు పోయింది .
అడ్డూ ,ఆపు లేక విచ్చల విడి గా తిరిగే ,వాణ్ని చూసి ,జాగ్రత్త గా ఉండమని ”విచ్చల విడి గ తిరుగుట -చిచ్చు న బడు నట్టి ,మిడుత చెలువమే వేమా ” అని హెచ్చ రిస్తాం .ముందు ఏమి ఉందొ తెలీక కళ్ళు మూసు కొని తిరిగే మిడుత అగ్ని ఎదుట ఉన్నా తెలుసు కోలేక దూకి చస్తుంది .అలా మీరూ కావద్దని చెప్పటమే మన ఉద్దేశ్యం .దీంతో బాటు ”లోభి నడుగ ,లాభంబు లేదు ”అని చురక వేస్తాం .ఆప్యాయం గా ,ప్రేమగా ,పెట్టని కూడు ”పిండాకూడే ”అవుతుంది అని చెబుతాం .కులాన్ని కోరే వాడు కుల హీను డవుతాడు అని చెబుతూ కుల గజ్జి పనికి రాదు అని స్పష్టం చేస్తాం .ఆచారాలు బయటి వేషాలు మోసాలే .ఆత్మ ప్రక్షాళనం అయితేనే ముక్తి .అలాంటి వారి గురించి ”కుక్క సింహ మగునే -గోదావరికి బోవ ”అని వేమన మాటను గుర్తు చేస్తాం .ఇలా నిత్య వ్యవహారాలలో ,పనులలో ,పాటల్లో ,ఆలోచనల్లో ,ఆచార వ్యవహారాల్లో ,భావనల్లో ,బాన్ధవ్యాలలో ఉన్న వైరుధ్యాలను స్వోత్కార్శలను ,తేడాలను బేరీజు వేస్తూ వేమన సూక్తుల్ని సామెత లుగా విసరుతూ మనమేదో గొప్ప అని హెచ్చరిల్లు తాం ,పెచ్చ రిల్లి పోతాం .ఆయన చెప్పిన వన్నీ మనకూ వర్తిస్తాయన్న నిజాన్ని మరచి పోరాదు .ఇంత స్పష్టం గా సామెతల ఆమెత లను ఇచ్చి విందు భోజనం కల్పించాడు వేమన్నయోగి .యోగులకు సాధ్యమేదీ లేదు .ఇదంతా భరద్వాజ విందు గా జీర్ణించు కొందాం .ఒక్క సందర్భం లో నైనా ,మనం ఇతరులకు మార్గ దర్శకత్వం చేద్దాం .వేమన్న ఆశించిన దాన్ని నిజం చేసి ”పురుషు లందు పుణ్య పురుషులు వేరయా ”అని నిరూపిద్దాం .
                      ఇంతకీ వేమనది యే ఊరు ?
”ఊరు కొండ వీడు ఉనికి పశ్చిమ వీధి -మూగ సేత లెల్ల మొదటి ఇల్లు –అ రసి చూడ నది ,ముక్తికి మార్గమే ”అని వేమన తన ఊరు ను గురించి చెప్పుకొన్నాడు .ఇందులో గూడార్ధం ఉంది అని ”బ్రౌను ”అభిప్రాయ పడి ,ఆంగ్లం లో వ్యాఖ్యానించాడు .”శరీరం అనే గ్రామం లో ఎత్తైన ప్రదేశ మైన శిరస్సు లో పరమాత్మ ఉంటాడు .వెనక వీధి అనేది ”వెన్నెముక”. అందులో ఆరు చక్రాలు ఉన్నాయి .మొదటిది నిశ్శబ్దం గా ఉండే మూలాధారం .అక్కడి నుండి ప్రయాణం చేస్తే ,సహస్రారం చేరితే ,ఆత్మ దర్శనం అవుతుంది .ఆది అంతా ఆనంద మయం .సచ్చిదానందం ..సుందరం” అని భావించి నట్లు బ్రౌను వివరణ ఇచ్చాడు .ఆయన మార్గం యోగ మార్గం .ఆయన గమ్యం ఆత్మ దర్శనం .ప్రాంత ,కుల భాషా పరిధులకు అతీతుడు వేమన .విశ్వ కుటుంబి వేమన అని భావించాలి .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –28-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా డైరీ–స్కూళ్ళ రిఒపెనింగ్ వారం

       అమెరికా డైరీ–స్కూళ్ళ రిఒపెనింగ్ వారం 
                                    ఆగస్ట్ ఇరవై సోమ వారం నుండి ,ఇరవై ఆరు ఆదివారం దాకా విశేషాలు –
సోమ ,మంగళ వారాలలో విశేషాలేమీ పెద్ద గా లేవు . పుస్తకాలు చదవటం ,నోట్సు రాసుకోవటమే ఎక్కువ గా జరిగింది .మైనేని గారు మెయిల్ రాస్తూ బాపు గారి ఆరోగ్యం బానే ఉందని ,రెండు నెలల తర్వాత మళ్ళీ టేస్ట్ చేయించాలని చెప్పారు .
  అభిమానులు  అల్లుడు అవధానికి హడావిడి గా  చేసిన పుట్టిన రోజు వేడుక 
ఆగస్ట్ ఇరవై రెండు బుధ వారం మా అల్లుడు అవధాని గారి కి తెలుగు తిధుల ప్రకారం పుట్టిన రోజు .దీన్ని పసి గట్టిన ఆయన అభి మానుల కుటుంబం నాగ మణి దంపతులు గప్ చిప్ గా రాత్రి యేడు గంటలకు కేకు తెచ్చి ఆయన తో కోయించి ,వాళ్ళ ,వీళ్ళ పిల్లల తో సహా హేపీ బర్త్ డే పాటపాడించి హడా విడి చేశారు .అందరు ఇక్కడే భోజనాలు చేశారు .మా అమ్మాయి రసగుల్ల ,వెజిటబుల్ బిర్యానీ చేసింది .అంతా బానే లాగించారు .
ఈ ఇరవై మూడో తేది గురువారం నాటికి సరస భారతి ”వెయ్యి ఎపిసోడుల’‘ పండుగ పూర్తీ చేసుకొని అందరి అభి మానాన్ని పొందింది .ఇరవై నాలుగు శుక్ర వారం రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .పాతిక మంది వచ్చారు .తొమ్మిది దాకా భజన .ఆ తర్వాతా విందు .పాయసం అన్నం ,సాంబారు ,వెజిటబుల్ బిర్యానీ ,పెరుగు ,దోసకాయ చెట్నీ చేసింది మా అమ్మాయి .వల్లం నరసింహా రావు  గారు, భార్యా ,అమ్మాయి రేణుక ,మనవడు కూడా రావటం బాగుంది .ఆ జంటే ఇక్కడ రెండు నెలల క్రితం యాభై వ పెళ్లి రోజు వేడుక చేసుకొన్నారు .ఆయన నాటక, సినీ నటుడు స్వర్గీయ వల్లం నరసింహా రావు గారికి స్వయానా అన్న గారి కుమారుడే .ఇద్దరి పేర్లు ఒకటే అవటం తమాషా గా ఉంది .ఈ నరసింహా రావు గారు  గొప్ప పైంటర్ .ఆయన వేసిన ”అష్ట లక్ష్మీ దేవి ”చిత్రాన్ని స్కాన్ చేసి ఫ్రెం కట్టించి ,వాళ్ళ పెళ్లి రోజు వేడుకల నాడు అందరికి కానుక గా మా అందరికి  ఇచ్చారన్న సంగతి ఇప్పుడే తెలిసింది .శని వారం రాత్రి జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఇంట్లో భజన .ముప్ఫై మంది పైగా వచ్చారు .అందరికి రెండు స్వీట్లు రెండు హాట్లు ,అన్నం ,పులిహోర ,చపాతి కూర ,పెరుగు ల తో భోజనం .ఇంటికి వచ్చే సరికి రాత్రి తొమ్మిది అయింది .మా  అమ్మాయి వాళ్ళ ఇంటి కి దగ్గరే ఉన్న నీలిమా దంపతుల గృహ ప్రవేశ పార్టీ కి వెళ్లారు .మేమిద్దరం వెళ్ళ లేదు .కాని మా కోసం ఫ్రూట్ సాలిడ్ ,ఐస్ ఫ్రూట్ పంపారు .ఆ రోజు మధ్యాహ్నం ”గోదా వరి ”సినిమా యు ట్యూబు లో ఆసాంతం చూశాం .ఒక రకం గా దృశ్య కావ్యం .దర్శకుడు శేఖర్ కమ్ముల కు మెయిల్ రాయాలని అని పించింది .మెయిల్ అడ్రెస్ ను మా పెద్దబ్బాయి శాస్త్రి సంపాదించి ,పంపించాడు .తీరిగ్గా రాయాలి .
       వేసవి సెలవుల అనంతరం బడుల ప్రారంభం
అమెరికా లో పిల్లల వేసవి సెలవులు అయి పోయాయి .ఆగస్టు మధ్య నుంచి విద్యా లయాలు దాదాపు అన్ని చోట్లా ప్రారంభ మైనాయి . మా మనవళ్ళ స్కూళ్ళు ఈనెల ఇరవై యేడు సోమ వారం నుండి ప్రారంభం .సుమారు మన లాగానే ,రెండు నెలలు వీళ్ళకూ సెలవులు . మనకు బడులు ఏప్రిల్ ఇర వై  నాలుగు నుండి మూసేస్తారు .మళ్ళీ మనకు జూన్ పన్నెండు న తెరుస్తారు .ఇక్కడ జూన్ పది న మూసేస్తారు .ఆగస్టు రెండో వారం లో తెరుస్తారు .ఇక్కడ విద్యార్ధుల కోసం నోటు పుస్తకాలు ,తెల్ల కాగితాలు ,పెన్నులు ,పెన్సిల్లు ,మొదలైన స్కూల్ కు అవసర మైన వాటి నన్నిటిని చాలా తక్కువ రేట్లకే ఈ నెలంతా అమ్మటం విశేషం .తలి దండ్రులు ,పిల్లల తో వాల్ మార్టు ,టార్గెట్ ,శామ్సు,కే.మార్ట్ లాంటి మాల్సు లన్ని కళ కళ లాడాయి .చూడ ముచ్చటగా ఉంది .140పేజీల రూళ్ళ స్పైరల్ పుస్తకం కేవలం 17  సెంట్లు మాత్రమె .150 పేజీల రూళ్ళ కాగితాలు దస్త్రం కేవలం ఎనభై ఎనిమిది సెంట్లు .ఇంత కారు చవక గా దొరికే టట్లు చేయటం ఇక్కడి వారు తీసుకొనే ప్రత్యెక శ్రద్ధ .ఈరేట్లు మన కు నలభై పైసలే ,రెండోది రెండు రూపాయల లోపే .అదే మనకు బడులు తెరిచే సమయం లో పుస్తకాల రెక్కలు ఆకాశం అంటు తాయి .దొరకటం కష్టం కూడా .బ్లాక్ మార్కెట్ లో అవి నల్లగా  మెరుస్తుంటాయి .అదీ తేడా .ఇంకో విషయం .ఇక్కడ ప్రభుత్వ బడులలో విద్యార్దు లందరికి సెకండరి స్థాయి వరకు ఉచిత విద్య .పుస్తకాలు ఫ్రీ .బస్సు ఫ్రీ .ఇదీ ఇక్కడి వెసులు బాటు .కాలేజి లో చేరి నప్పుడే తలి దండ్రులకు ఖర్చు .అప్పుడు దాదాపు పిల్లలు స్వంత కాళ్ళ మీద నిల బడి సంపాదించు కొంటూ ,చదువు కోవటం విశేషం .
ఈ వారం లో lydia maria child అనేమహిళా  రచయిత, బానిసత్వ నిర్మూలన కోసం ముప్ఫై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి, సాధించిన ఆమె జీవిత చరిత్ర చదివాను .గొప్ప గా ఉంది .స్పూర్తి దాయకం గానూ ఉంది . Al goreఅనే పర్యా వరణ ప్రేమికుడు ,అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంటు గురించి చదివాను .అలాగే” న్యూక్లియర్ ఫిషన్,”పై పరిశోధన చేసి తనతో పని చేసినశాస్త్రజ్ఞుడి మోసం వల్ల నోబెల్ బహు మతి ని కోల్పోయి ,ఆమె చేసిన భౌతిక శాస్త్ర పరిశోధనలకు అనేక బహు మతులను పొంది,మొదటి జర్మన్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ,నాజీ ఉద్యమం లో దేశాన్ని విడిచి వెళ్ళి, పీరియాడిక్ టేబుల్ లో 109 వ మూల కాన్నిఆమె గౌరవం గా ”Meitnerium ”అన్న పేరు తో  ఆమె సేవలకు ప్రతి ఫలం గా కానుక గా పొందిన” Lise Meitner”   అనే ఆమె చరిత్ర చదివి ఎంతో ఆనందాన్ని ,బాధను పొందాను . Gar field ,Madison ,Beeethoven ల పై పుస్తకాలు ఎంతో అనుభూతినిచ్చాయి .ఇవీ ఈ వారం విశేషాలు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-12-కాంప్–అమెరికా ,

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

జన వేమన -10 సామెతల ఆమెతలు

 జన వేమన -10
                                          సామెతల ఆమెతలు 

వేమన అనగానే మనకు ఏదో పద్యం గుర్తుకు వస్తుంది .సందర్భాను సారం గా సామెత లను వాడటం తెలుగు వారి ప్రత్యేకత .మనం వాడే సామెత లలో చాలాభాగం వేమన చెప్పిన పద్యాలే ఉంటాయి .అంతగా ,ఆయన జన జీవనం లో మమైకం అయారు .కనుక తెలుగింట ఆయన సామెతల ఆమెతలు నిత్యం తృప్తిని ,సంతోషాన్ని కల్గించి  భావ పుష్టిని ,ఆరోగ్యపు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి .ఇంతకీ ”సామెత ”అంటే ?లోకోక్తి .అంటే ,ప్రజలు వాడుక లోని ,నీతి ,అనుభవం మొదలైన వాటిని తెలిపే వాక్యం లేదా పదాల సముదాయం .మరి ”ఆమెత ”అంటే ఏమిటి ?ఆమెత అంటే ”విందు, భోజనం ”.కలిస్తే విందు భోజనం .నిత్యం వేమన వాక్యా లను నేమరేస్తూ ,విందు భోజనం చేసి ఆనందిన్చటమే-”సామెతల ఆమెతలు ”.విన్దులే విందులు .ఆనందపు చిందులే చిందులు .అందులో మొట్ట మొదటిది ”ఆత్మ శుద్ధి లేని ఆచార మది ఎల -భాండ శుద్ధి లేని పాక మేల -చిత్త శుద్ధి లేని శివ పూజ లేలరా ”ఈ మూడింటిని మూడు ప్రత్యెక సందర్భా లలో వాడని వారున్నారా ?వేరు పురుగు వృక్షాన్ని ,చీడ పురుగు చెట్టునీ చెఱచి నట్లు ”కుత్సి తుండు చేరి గుణ వంతు జేరచురా ””అని అందరూ చెప్పే సామెతే .చెడు స్నేహం పనికి రాదనీ అర్ధం .”నీరు పల్ల మెరుగు ,నిజము దేవు డేరుగు-”అనీ వాడుతాం .”నీరు పల్ల మెరుగు నిజముగాను -తనయుని జననంబు తల్లి థా నేరుగును ”అనీ అంటాం .నిజమేదో ,అబద్ధం ఏదో తెలీని సందర్భం లో . స్టాన బలిమి చాలా గొప్పది .తనకు బలం లేని చోట పరుల బలం బలం గా ఉన్న చోట ,విర్ర వీగటంమంచిది కాదు .అప్పుడు తగ్గి ఉంటె ,మనకు పోయేదేమీ ఉండదు .”అనువు గాని చోట అధికుల మన రాదు -కొంచే ముండు టేల్ల కొదువ గాదు -కొండ అద్దమందు గొంచెమై యుండదా ?”అన్న పద్యం అందరికి స్పూర్తియే .అలాగే కీడు చేసే వాడికీ మేలు చేయటం మనకు అనాదిగా వస్తున్నాదే .భారతం లోనూ చెప్పిన నీతి .దీన్ని సూక్షం చేసి ”చంప దగిన యట్టి శత్రువు తన చేత -జిక్కె నేని కీడు సేయ రాదు -పొసగ మేలుచేసి పొమ్మనుటే  చాలు ”అని పాటించ దగిన నీతిని ,లోక రీతినీ చెప్పాడు .డబ్బా కొట్టే వాడు అప్పుడూ ఇప్పుడుఎప్పుడూ ఉంటారు .మంచి వాడు ఒదిగి ఉంది మాట్లాడుతాడు .ఇద్దర్నీ పోలుస్తూ ”కంచు మోగు నట్లు కనకంబు మోగునా ”అని అంటూనే ఉంటాం .సూటీ పోటీ మాటలతో మనసులు విరిగి పోతాయి .ఇనుము విరిగితే కాల్చి అతుక వచ్చు .మనసు విరిగితే అతకటం అసాధ్యం ”మనసు విరిగే నేని  ,మరి అంట నేర్చునా ”అని వేమన్న సామేతనే చెబుతాం .”మేడి పండు జూడ మేలి మై యుండు -పొట్ట విచ్చి చూడ పురుగు లుండు -బిరికి వాని మదిని బింక మీ లాగురా ”అని పైన పటారం ,లోన లొటారం లాంటి గొట్టం గాల్ల ను గురించి అంటూనే ఉంటాం .తలిదంద్రుల్ని ఆద రించ లేనికొడుకులను చూసి ,”తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుండు -”పద్యం విని పించి జ్ఞాన బోధ చేస్తూనే ఉంటాం .
ఆలోచన కార్య రూపం లోకి రావాలి ఆది తీవ్ర మైతే పను లన్నీ లాభిస్తాయి .అందుకే వేమన ”అనగ అనగారాగ మతి శయిల్లుచు నుండు – తినగా తినగా వేము తియ్యనుండు -సాధనమున పనులు సమ కూరు ధరలోన ”అని నమ్మకం గా చెప్పి ఒప్పిస్తాం .సంగీతం కష్టమే .నిత్య సాధన తో రాగం దారికొస్తుంది .వాము చేదుగా నే ఉంటుంది .తినటం ప్రారంభిస్తేక్రమంగా తీపి అని పిస్తుంటుంది .కనుక పని సాధించాలి అంటే నిత్య సాధన కావాలి .కస్టాలు వచ్చాయి అనో ,సరిగా రావటం లేదు అనో నిరాశ చెంది వదిలెయ రాదు అని గుర్తు చేస్తాం .ఆనాడే కాదు ఈ నాడు కూడా ఇది ఆచరణ యోగ్య మైన సామెతే .”ఎలుక తోలు తెచ్చి ఏడాది నుతికిన –నలుపు గాక ,ఎల తెలుపు గలుగు ”అన్నదీ బుద్ధి మారని వారి గురించి చెప్పే మాటే .”కుక్క తోక బట్టి గోదావరి ఈదటం ”కూడా బాగా వాడుక లో ఉంది .”గంగి గోవు పాలు గరిటె డైనను జాలు -కడివెడైన నేమి ఖరము పాలు -భక్తీ కల్గు కూడు పట్టే డైనను చాలు ”పద్యాన్ని మన నిత్య జీవితం లో ఎన్ని సార్లు వాడి ఉంటామో లెక్కే లేదు .తెలుగు వారి మనసుకి ,శరీరానికి శల్య గతం గా పట్టిన సామెత ఇది .శ్రద్ధా భక్తీ లేకుండా యే పని చేసినా ఫలితం లేదు ,రాదు .భగ వంతుడికి కొండంత పత్రీ ,నైవేద్యాలు అక్కర్లేదు .పట్టెడు అన్నం ,పరమ పవిత్ర మైన మనసు తో సమర్పిస్తే విపరీతం గా సంతోషిస్తాడు. ఫలితం కలుగుతుంది .రంతి దేవుడు ,ద్రౌపది ,ఇలా చేసి చరితార్దులైన వారే .
సరైన వాడిని సరైన స్తానం లో కూర్చో బెట్టాలి .ప్రలోభాలకో ,పైరవీ లకో లొంగి అనర్హుడికి అధికారం ఇవ్వ రాదు .అలా చేస్తే చెప్పును తినే కుక్క చెరకు రసం తీపి తెలియ నట్లు గా ఉంటుంది .”అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన -దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు -చెప్పు తినేది కుక్క చెరకు తీపెరుగునా ”అని నేటి రాజకీయ పరిస్తితుల పై బాధ పడుతూ చీద రించు కొంటూ అంటూనే ఉంటాం .కాని జరిగి పోయే దేదో జరిగి పోతూనే ఉంటుంది .కులం, భాష, మతం, బంధుత్వం ,ఆశ్రిత పక్ష పాతం తో అనర్హులు పదవులు దక్కించు కొంటూ అర్హులు దూరమై పోతుంటే వేమన పద్యాలను మననం చేసు కొంటూ మనస్సు లోనే గోణుక్కుంటాం .అవతలి వాడిలో తప్పు లు వెదికే ”రంద్రాన్వేషకులు ”ఎక్కువ .తమ తప్పు తెలుసు కో లేరు .”తప్పు లెన్ను వారు తమ తప్పు లేరుగరు ”అన్న వేమన్న అన్న మాట గుర్తుంచుకోవాలి మనమందరం .ఒక వేలుఅవతలి వాడి వైపు చూపిస్తే ,నాలుగు వెళ్ళు మన వైపు చూపిస్తాయి అన్న ఏసు క్రీస్తు మాట మరిచి పోరానిది .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన -9 వేమన సార్వ కాలీన

 జన వేమన -9
                                 వేమన సార్వ కాలీనత —

”వినుము వివేక మని  యేడి వింత గొడ్డలి చేత –వలయు విద్య యనెడు నడవి నరికి -తెలివి యనేడు గొప్ప దీపంబు చే బట్టి -ముక్తి జూడ వచ్చు మొనసి వేమ ”ముక్తి కి మార్గ వివేకం .విద్యా రణ్యాన్నిచేదించాలి .తెలివి అంటే ,పరమేశ్వర జ్ఞానం అనే దీపం తో ,వెతికి తేనె మోక్షం .ఈ శరీరం మట్టి కుండ,శిధిలం అయేది .ఆత్మ కు చావు లేదు. ఎన్ని కుండలు ఉన్నా ,అందులో ప్రతి ఫలించేది ఒకటే ఆకాశం .”ఎరుక సాటి ఎరుకయే ”.అని ఆత్మ జ్ఞాన రహస్యం .గురువు చిల్ల గింజ .దేహం కుండా .ఆత్మా కలుషిత నీరు .ఆ నీటికి గురువు అనే చిల్ల గింజ గంధం కలి పితే ,మాలిన్యా లన్ని అడుగుకు చేరి ,స్వచ్చ ,సత్య పరమాత్మ దర్శనం లభిస్తుంది .ఆది తెలిస్తే ,దివ్యామ్రుతమే నంటాడు .”పశుల వన్నె వేరు పాలేక వర్ణ మౌ -పుష్ప జాతి వేరు ,పూజ యొకటి -దర్శనంబు వేరు ,దైవంబోక్కటే ”అని, యే రీతి లో కొలిచినా చేరేది పరమ పదమే .చిత్తం అనే వేరు శిధిల మైతే ,శక్తి అనే చెట్టు కూలి పోతుంది .అప్పుడే కోరికలు అనే పెద్ద కొమ్మలు ఎండి పోతాయి .కనుక చిత్తాన్ని శిధిలం చేసు కోవాలి .
మానవుడు దేవుడు గా మారటమే మానవ జీవిత లక్శ్యం .ఆది సాధిస్తే ఇంకేమీ అక్కర లేదు .”సొమ్ము దొరకు దనుక జ్యోతి యంతియే కాక -సొమ్ము దొరుకు వెనుక ,వెనుక జ్యోతి ఎల -దేవుడైన వెనుక దేహంబు మరి ఏల ?”అని ప్రశ్నించాడు .ఆత్మ బుద్ధి అనేది ఉంటె ,అంతా తాను గానే కానీ పిస్తుంది .చెట్టు లో అగ్ని దాగి ఉంది .కాని అగ్ని లో చెట్టుబతక  లేదు .చెట్టు లో ఉన్న అగ్ని లాంటి వాడు సంసారి .ఆశ వదిలేస్తే ,బంధం పోతుంది .బంధం విడి పోతే ము ని గా మారి పోతాడు .ముని అయితే ,సర్వ మొహాలు పటా పంచేలవుతాయి .”ఆత్మా లోని నాద మాలించి ,ఆలించి –నప్పుడే ,తత్వ జ్ఞాని అవుతాడు ”.త్రిగుణాలు నశిస్తే ,ముక్తి ఖాయం ”.తోలు తిత్తిఇది తూటులుతొమ్మిది,తుస్సు మనుట ఖాయం ”దీన్ని నమ్ము కోకు .బ్రహ్మాన్ని తెలుసుకో అన్నాడు .”నాశిక మధ్య నను జూచు యోగి –కాశి నాధు నైన గన గలడా యోగి -” అని సాధన రహస్యాన్ని వివ రించాడు .కను చూపు ను భ్రూ మాధ్యమ లో ఉంచి ,తరచి ,తెరచి చూస్తె ,ఆత్మ రాక పోక లన్నీ తెలుస్తాయి అని విశ్వాసం గా చెప్పాడు .”బ్రహ్మ మనగ ,వేరే పర దేశమున లేదు -బ్రహ్మ మన గలినే బట్ట బయలు -తనను దానేరిగిన తానే పో బ్రహ్మంబు ” అని బ్రహ్మోప దేశం చేస్తాడు .
”ఆణువు లో అఖిల జగాలు ఉన్నాయి .ఆ ఆణువు మన లోనే దాగి ఉంది .మనసు నిలి పితే నే ముక్తి సాధ్యం ”అని స్తూల సూక్ష్మ జగతిని గమ నించి చెప్పాడు .”చేతి లో వెన్న ఉన్నా ,నెయ్యి కోసం వెతికే మూర్ఖుడు మానవుడు ””తాను దైవ మయ్యు -దైవంబు దలచును ,”అంటాడు .”శివోహం”  నేనే  పరబ్రహ్మాన్ని అన్న విషయం మరిచి పోతూనే ఉంటాడు అని జాలి పడ్డాడు .”తనువు లేని వాడు తానే తనేనయా –”అని చెప్పాడు వేమన్న .శరీర భ్రాంతి వదిలితే ,”సోహం ”అనే భావం ఏర్పడుతుంది .దాని తో ముక్తి .”తాను సకల మైన సకలంబు -తనదు లోన ,వెలుగు ,తానేరింగి -యున్న మాన వునకు నోన రంగ ముక్తి రా ”అని ఈశ్వర వ్యాపకం జగత్తు అంతా నిండి ఉంది అని కమ్మగా ,నమ్మకం గా ఉపనిషత్ రహస్యాన్ని విప్పి చెప్పాడు .”ఆకృతి అంటే ,నిరాక్రుతే ”ఆ రెండు అపు  రూపాలే .లోపలి దృష్టి ఉంటె ,లోకం అంతా ,అభి రామం గా దర్శన మిస్తుంది .బయటి దానికి మురిసి పోతే బంధనమే .”తనను జూడ ,జూడ ,తారక బ్రహ్మంబు ”అని రహస్యాన్ని చేదించి చెప్పాడు .విత్తనాన్ని భూమి లో నాటితే ,పై పొట్టు ఊడి ,మొలక గా బయట పడి నట్లు ,”వేత్త యగు వాని కర్మం-బత్తేరగున విడిచి పోవు ననువున వేమా ”అని బోధించాడు .మాయ పోర వదిలితే ,అంతా చిదానందమే .
ఎన్నో భోగాలు చుట్టూ ఉన్నా ,యోగి కర్మ సహాయాన్ని అంట కుండా తిరుగు తుంటాడు .అన్నానికి అంటుఉన్నట్లే ,ఆత్మకూ ఉంది .ఆత్మ శుద్ధి ఉంటె ,అన్న శుద్ధి ఉంటుంది .కనుక ఆత్మ మిన్ను ,మన్ను లాగా మెరుస్తుంది .శత్రు పంచకాన్ని జయించి ,కామ వాసన విసర్జించి ,శివ పంచాక్షరి జపిస్తే ,పంచత్వం నశించి ,శివుని పంచన చేరి పరుడౌతాడు .”ప్రవణ మరయలేక ,భక్తుడు కాలేడు -జ్యోతి నరయ లేక జోగి కాడు -నిత్య మరాయ లేక ,నిర్వాణి కాడయా ”అని ముక్తికి సోపానాలు చెప్పాడు .”సూక్ష్మ మధ్యమం లో జీవుడు ,స్తూల మధ్యమం లో సూర్యుడు ,నాద బిందు కళల మధ్య బ్రహ్మమూ ఉంటారు” అని వివరం గా తెలియ జేశాడు .ఆసనాలు ,యోగాలు అన్నీ బాహ్య ఆడంబరాలే .అవన్నీ సాము గరిడీ ల కంటే చింతాకు అంత తక్కువ .
నీటి మీది బుడగే జీవితం అంటే .దాని సోకు చూసి మోస పోవద్దు .జీవితం -విరిగి పోయే పచ్చి కుండ .దాని కోసం భ్రాంతి అనవసరం .మనం మాట్లాడే ప్రతి మాటా పరమేశ్వరుడికి తెలుస్తుంది .”నీవు పలుకు నిర్మలుం డేరుగడా” ?అని హెచ్చ రించాడు .ఎవరూ వినరని ,మనం ఇష్టం వచ్చి నట్లు మాట్లాడ కూడదు అని భావం .ఆ పై వాడికి చూపూ ,వినికిడీ ఉంటాయి .అతడు సర్వ సాక్షి అని మనం అను క్షణం గుర్తుంచు కోవాలి .”ప్రాణ మిలను లేక ,పర మందగా రాదు -ప్రాణ ముండ గానే పరము గద్దు -” అంటే -ప్రాణం ఉండగానే ఏదైనా సాధించాలి .అందుకే ”ప్రాణి పోయి నపుడు పనికి రాదీ దేహము ”అని గట్టిగా నే చెప్పాడు .శరీరం ధర్మ సాధన కోసం అనే ఆర్యోక్తి నిమళ్ళీ చెప్పాడు .పర తత్వ యోగి తత్వ మేమిటో ఇలా వివరించాడు ”మనసు హక్కు కర్మ మనిఏమి లేకయ -రాక ,పోక లేని రాజ వీధి -పరగ హాని గలదే ,పర తత్వ యోగికి ”నిర్వికారం గా నిర్బంధం గా ,చరించే వారికి నిబంధనలు వర్తించవు .జ్ఞాన ముద్ర చేత తళుకుకానీ పిస్తుంది .అదే మనకు శ్రేష్టం అని మహర్షులందరు చెప్పిన పరమ మైన మాట .ఆది తెలిస్తే
,పరమార్ధం తెలిసి నట్లే నని వివరించాడు యోగి వేమన .ఎంతో గహన మైన వేదాంత రహస్యాలను ,ఉపనిషత్ ,శాస్త్ర  యోగ
విశేషాలను ,ధర్మ సూక్ష్మా లను ,అల వోకగా అరటి పండు ఒలిచి చేతి లో పెట్టి నట్లు హాయిగా తేట తేట పదాల ఆట వేలదుల్లో
కూర్చి జ్ఞాన బోధ చేశాడు .సార్వకాలీన సత్యాలను సర్వ జనులకు సత్య స్పూర్తి తో తెలియ జేశాడు వేమన యోగి పుంగవుడు .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జీవులన్నిటి మేల్ కోరే ”-ఆల్ గోరె ”

  జీవులన్నిటి మేల్ కోరే ”-ఆల్ గోరె ”
ఆయన రెండు సార్లు అంటే ఎనిమిదేళ్ళు డెమొక్రాటిక్ పార్టితరఫున అమెరికా ఉపాధ్యక్షునిగ ,అదే పార్టీ కి చెందిన ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తోకలిసి  పని చేసిన వాడు .ఉపాధ్యక్షుడు అంటే ఉత్స విగ్రహం కాదు, అని తన పాత్ర ద్వారా రుజువు చేసిన వాడు .అమెరికా ఆర్ధిక స్తితి ని సరైన దారి లో పెట్టి ,వేలాది యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన వాడు . క్లింటన్ పై ”నీలి నీడలు ”కమ్మి నపుడు ధైర్యం గా ఆయన వెన్నంటి నిలిచి ,దేశానికి వీటి కంటే ప్రజా పాలన ముఖ్యం అని నిరూపించిన వాడు .క్లింటన్ తర్వాత అధ్యక్షా స్తానానికి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాడు .2000దేశాధ్యక్ష ఎన్నికలలో పాప్యులర్ ఓట్లను అత్యధికం గా పొందినా ,ఫ్లారిడా రాష్ట్ర ఎలేక్టరల్ వోట్ల విషయం ఏర్పడిన సందిగ్ధ స్తితిలో సుమారు అయిదు వారాలు గెలుపు -ఓటముల మధ్య ”sea saw ”ఆటలో సంక్షోభా న్ని ఎదుర్కొని నిలిచినవాడు ,చివరికి సుప్రీం కోర్టు నిర్ణయం తో ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టి అభ్యర్ధి బుష్ గెలిస్తే ,హృదయ పూర్వకం గా అభినందనలు తెలిపి ఉత్తమ రాజకీయ పండితుడు అని పించుకొన్న వాడు ,ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ రాజ కీయ జీవితానికి స్వస్తి చెప్పి ,మొదటి నుడి తన కిష్టమైన పర్యావరణం పై ప్రజలను చైతన్య పరుస్తూ , ఇంటర్నెట్వ్యాప్తికి కృషి చేస్తూ ,లాభా పేక్ష లేకుండా అనేక సంస్థలను నెలకొల్పి జనుల జీవన ప్రమాణా లనుమెరుగు పరుస్తున్న వాడు ,శీతోష్ణ స్థితి మార్పుల తో విశ్వం ప్రమాదం అంచున ఉందని ప్రచారం చేస్తూ  జాగృతి కల్పిస్తున్న వాడు , నోబెల్ శాంతి బహు మతి పొంది  ప్రశాంత చిత్తుడైన వాడు టేన్నీసీ రాష్ట్ర ముద్దు బిడ్డడు  అందరి రి చేత ఆప్యాయం గా ” ఆల్ గోరె”  అని పిలువ బడే   ఆల్ఫ్రెడ్ ఆల్బర్ట్ గోరె . 
16  ఏళ్ళు కాంగ్రస్ కు సేవ లందించాడు గోరె .పర్షియన్ గల్ఫ్ వార లో పాల్గొని దేశానికి సైనికుడిగా సేవలు చేశాడు . ‘తనను వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని క్లింటన్ కోరి నప్పుడు ”అగస్త్య భ్రాత ”గా ఉండ టానికి ఇష్ట పడను అని  చెప్పి ,సముచిత గౌరవం స్తానం సంపాదించు కొన్నాడు .గోరె వల్ల అమెరికా కు ”పాజిటివ్ చేంజి ”వస్తుందని క్లింటన్ భావించాడు    .అదే నిజ మైంది. క్లింటన్ -గోరె ల సన్నీ హితత్వం తో అంతకు ముందు పాతిక ఏళ్లుగా గెలవని దక్షిణ రాష్ట్రాలన్నీ డెమొక్రాట్ల వశం అయి చరిత్ర సృష్టించాయి .దీనికి వీరిద్దరి జంట పై ఉన్న అపూర్వ నమ్మకం .క్లింటన్42 వ అమెరికా ప్రెసిడెంట్ అయితే గోరె 45వ వైస్ ప్రెసిడెంట్ .గోరె- క్లింటన్ కు అత్యంత నమ్మక మైన వాడు .ప్రభుత్వ వ్యవస్థ లోని అన్ని టి ని అధ్యయనం చేశాడు .ఎన్నో సంస్కరణలు చేయించాడు .
టి.వి.లకు వాలంటరీ రేటింగ్ సిష్టెం ను ప్రవేశ పెట్టించాడు .టి.వి.లు తయారు చేసే వారికి .వాటిలో ”వి చిప్స్ ”పెట్టమని దాని వల్ల పిల్లలు చెత్త ప్రోగ్రాములు చూడ కుండా తలి దండ్రులు అడ్డుకో గలరని చెప్పి ,అమలు చేయించాడు .ఇంటర్నెట మీద విప రీత మైన అవగాహన ఉన్న వాడు గోరె .అందుకని white house లో web site ను ప్రవేశ పెట్టించి ప్రజలకు ప్రభుత్వ విధానాలను తెలుసు కొనే అవకాశం కల్పించాడు .తాను ఇదివరకటి వైస్ ప్రెసిడెంట్ల లాగా ఆలోచించనని ,తాను ఆ పదవి లో ఉంటె ,ఇది వారికంటే మేలు చేయ గలననే నమ్మకం తనది అన్నాడు ”I am not spending any time or energy ,thinking about to morrow and the ambition to be president .some people might find that implausible ,but that is the honest truth” అని తన మనసు లో మాట స్పష్టం గా చెప్పాడు
రెండవ సారి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ”గ్లోబల్ వార్మింగ్ ”అనేది ప్రధాన సమస్య అయింది .భూమి క్లైమేట్ లో మార్పులు వస్తున్నాయని దీని ఫలితం దారుణం గా ఉంటుందని యు.యెన్.రిపోర్ట్ వచ్చింది 1997లో జపాన్ లోని ”క్యోటో ”లో ప్రపంచ దేశాలన్నీ సమావేశమై దీని పై చర్చించాయి .కార్బన్ ఉద్గారాలను లిమిట్ చేయాలనే సూచన వచ్చింది .దాన్ని అమలు చేయాలని క్లింటన్ ప్రభుత్వానికి సూచన చేశారు .360బిలియన్ డాలర్ల జాతీయ అప్పును పెయిడ్ ఆఫ్  చేయించారు .ఇరవై రెండు మిలియన్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి .అప్పుడే దేశం లో మొదటి సరిగా నిరుద్యోగ శాతం అత్యంత కనిష్ట స్తితి కి చేరి భేష్ అని పించుకోంది క్లింటన్ -గోరె ప్రభుత్వం .ఉద్యోగులకు జీతాలు విప రీతం గా పెరిగాయి .పన్నులు చాలా తగ్గి పోయాయి .దాని వల్ల స్వంత ఇల్లు కొనుక్కొనే అవకాశాలు ఎక్కువై ఎక్కువ మంది స్వంత ఇంటి వారయ్యారు .  .స్టాక్ మార్కెట్ ఆశా జనకం గా ఉంది .ప్రెసిడెంట్ క్లింటన్ ఇంపీచ్ మెంట్ కు గురి అయాడు .ఆ కల్లోల సమయం లో గోరె క్లింటన్ కు బాసట గా నిలిచి పోరాడాడు .చివరికి క్లింటన్ దేమీ తప్పు లేదని తీర్పు వచ్చింది .క్లింటన్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాడు .ప్రెసిడెంట్ గా కోన సాగాడు .ఆ సందర్భం గా గోరె టి.వి.ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ ”you know what american people want ..they want us to move us on the future ,and talk about them ,and work on their problems and build their future ,not wallow in the past ”.అని ప్రజల ను అభి నందించాడు .వాళ్ళ సేవ లో ఉన్న వాళ్ళం తామే నని నిర్భయం గా పలికాడు .
                   పదవి  కంటే పర్యావరణమేమిన్న 
రాజ కీయాల పై విసుగు పుట్టి ,తన జీవితాన్ని మరో మాలు పు తిప్పు కొన్నాడు గోరె .”గ్లోబల్ క్లైమేట్ చేంజి ”ని సవాలుగా తీసుకొని సమస్త జీవ రాసుల మేలు కోరి ఉద్య మించాడు .పదవి లోంచి తప్పుకోగానే అనేక యూని వేర్సిటీలు ఆయన్ను విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండమని అర్ధించాయి . కాని కొలంబియా, ఫిస్క్ ,మిడిల్ టేన్నేసి,కాలి ఫోరియా వర్సిటీ లలో మాత్రమె విసిటింగ్ ప్రొఫెసర్ గా ఉండటానికి ఒప్పు కొన్నాడు .గూగుల్ ఇంటర్ నెట్ సెర్చ్ కంపనీ కి సీనియర్ అద్వైసేర్ గా ఉన్నాడు .ఆపిల్ కంప్యూటర్స్ బోర్ద్ ఆఫ్ డైరెక్టర్ ల లో ఒకని గా ఉన్నాడు .జెనెరేషన్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజి మెంట్ లోభాగ  స్వామి అయాడు .ఇది claints  ధనాన్ని మదుపు చేసి సమాజ సేవ కు తోడ్పడుతుంది .దీని ముఖ్య కేంద్రం లండన్ .గ్లోబల్ వార్మింగ్ నివారణ లో సహాయ పడే కంపెనీ లకు ఆసరా గా నిలబడుతుంది .ఆయనకు వాణిజ్య ,వ్యాపారా లలో ,సాంకేతిక విషయాలలో మహా అభి నివేశం ఉంది .ట్రెండు లను గుర్తించటం లో ,భవిష్యత్తు లో లాభాలు తెచ్చే ఏర్పాట్లు ఆయనకు కొట్టిన పిండి .బుష్ పై ఒడి పోయినా సెప్టెంబర్ 11,2001నాడు జర్గిన సంఘటన పై దేశాధ్యక్షుని కి అండగా నిలబడి ,ఒక జాతీయ ప్రతి పక్ష నాయకుడి పాత్రను సమర్ధ వంతం గా పోషించాడు .జాతీయ ఐక్యత కావాలని సందేశం ఇచ్చి బుష్ కు బాసట గా  నిలిచాడు .2004అధ్యక్ష ఎన్ని కలలో గోరె నే పోటీ చేయాలని డెమోక్రాట్లు అర్ధించినా ససేమిరా అన్నాడు .”re -elect gore ”అనే నినాదం అమెరికా అంతా ప్రతిధ్వనించింది .ప్రజల హృదయాలలో ఆయనే నిలిచి ఉన్నాడు .కాని ఆయన నిర్ణయం మార్చు కోలేదు .కిందటి ఎన్ని కలలో తనకు వచ్చిన ఫండు లో మిగిలిన ఆరు మిలియన్ డాలర్లను అనేక డెమొక్రాటిక్ పార్టి గ్రూపు లకు ప్రచారం నిమిత్తం ఇచ్చేసిన ఆదర్శ వంతుడు గోరె .
అమెరికన్ ప్రజాస్వామ్యం అడ్డ దిద్దం గా నడుస్తున్నందుకు బాధ పడ్డాడు .”the assault on reason ”అనే పుస్తకాన్ని రాశాడు అందులో చివరిగా american democracy is in anger -not from any one set of ideas ,but from un precedented changes ,in the environ ment within which ideas either live and spread ..or wither and die .i do not mean the physical environ ment ,,i mean what is called the public sphere or the the market place of ideas ”అని యదార్ధ స్తితిని చూపించాడు .”indeendent cabletelivison  net work called current t.v.ని ఏర్పాటు చేశాడు .యువకులకు చిన్న చిన్న ఎపిసోడు ళు తీసి వారిలో పర్యా వారం స్పృహ కల్గించాడు సామాన్య ప్రజలకు ఇది ఒక వరమే అయింది .వారి అభిప్రాయాల ఫీడ్ బాక్ కు కూడా గొప్ప అవకాశం కలిగింది .అయన ఒక” visionary  ”అని అల్గోరే ను అందరు ప్రశంసించారు .”gore is doing things that are new ,daring ,difficult ,just as he tried to do as a public servant ”అని ఎంతో అనుభవం ఈ రంగం లో ఉన్న వారు గోరె కు నీరాజనాలు పట్టారు .
ఇప్పుడు ఆయన దృష్టి గ్లోబల్ క్లైమేట్ చేంజి మీద కేంద్రీక రించాడు .భార్య టిప్పర్ సలహా పై పూర్వకాలం లో ”స్లైడుల ”ద్వారా విషయాలను జనానికి తెలియ జేశారో ఇప్పుడు ఆయనా అలా స్లైడు లను మళ్ళీ విన యోగం లోకి తెచ్చి ప్రజలను అప్రమత్తం చేశాడు .వేల ప్రదర్శనలు ఇప్పించాడు గోరె స్వంతం గా ”earth in the balance ”అనే అంశాన్ని బాగా ప్రజా దృష్టికి తెచ్చాడు .దీనికోసం ఆధుఇనిక సాఫ్టు వేర్ ను ఉప యోగించాడు .విషయాలను కంప్యూటరీకరించాడు .అమెరికా అంతా తిరుగుతూ ,ప్రదర్శన లిస్తు ,ఉపన్య సిస్తు ప్రజా చైతన్యం తెచ్చాడు .రాబోయే కాలం లో కూడా ప్రదర్శన లు ఇచ్చే ఏర్పాటును పకడ్బందీ గా చేశాడు .గ్లోబల్ క్లైమేట్ చేంజి గురించి ఆయన సోదాహరణం గా మాట్లాడుతూ ,దాని వల్ల కలిగే ప్రమాదాలను చిత్రా ల ద్వారా చూపిస్తున్నప్పుడు వేలాది మంది భవిష్యత్తు లో జరుగ బోయే అనర్ధాన్ని తలచు కొని ”ఎడ్చేసే వారట ”ఇదొక ఉద్యమం గా కోన సాగిస్తున్నాడు .సుశిక్షితు లయిన  వెయ్యి మందిఉపన్యాసకులను ప్రపంచం మొత్తమీద  తయారు చేశాడు .
గోరె చేస్తున్న ఈ అద్భుతాలను చూసి డేవిస్ డగ్గిఎంహెం అనే ఫిలిం ప్రొడ్యూసర్ స్లైడ్ షో ను సినెమా గా తీశాడు .దీని పేరు”an inconvenient truth ” .ఇది2006 may 24 న విడుదలై హిట్ల మీద హిట్లు కొట్టింది.ఎన్నో ఎద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్లి ప్రజాభి మానం పొందింది .దీన్ని చూసిన జనం ”లేచి నిలబడి హర్ష ధ్వానాలు చేసే వారు ”అంటే స్టాండింగ్ వోవేషన్ అన్న మాట .అంత పాప్యులర్ అయింది .లెక్క లే నన్ని అవార్డు లను గెల్చు కొన్నది ఈ సినిమా .బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి 50  మిలియన్ల డాలర్ల పంట పండించింది .కనకాభి షేకం చేశారు ప్రేక్షకులూ ,పర్యావరణ ప్రేమికులూ కలిసి .ఇది ఆల్గోరే కు ఎంతో సంతృప్తి నిచ్చింది ఒకటిన్నర మిలియన్ల డి.వి.డి .లు అమ్ముడయాయి .దీనిలో గ్లోబల్ వార్మింగ్ గురిచి చెబుతూ గోరె సేవ లనూ స్ప్రుశించటం కూడా శించటం జరిగింది .ఒక రాజ కీయ వేత్త, పర్యావరణ వేత్త గా రూపొందిన క్రమ విధానం అందులో చూపించారు .క్లైమేట్ క్రైసిస్ అత్యంత ప్రమాదకరం అని జనం పూర్తిగా తెలుసు కోనేట్లు చేశాడు గోరె .కార్బన్ డై ఆక్సైడ్ విడుదల ఎక్కువై వేడి ఎక్కువ అవుతోందని ఆయన ప్రపంచ పర్యటనలకు విమానాల మీద వెళ్తున్నప్పుడు” కార్బన్ ఆఫ్ సెట్”ఉపయోగించే వాటిల్లోనే వెళ్తాడు ”.carbon offsets provide sell the green house gas reductions associated with projects like wind farms ,to customers who want to off set the emission they caused by flying driving ,or using electri city ”
”an inconvenient truth ”అని గోరె తీసిన సిని మా 2007 బెస్ట్ డాక్యు మెంటరి ఫీచర్ ఫిల్ముఅవార్డు ను అకాడెమి అవార్డు లలో సంపాదించింది అవార్డు ప్రదానం రోజున గోరె ,సినీ డైరెక్టర్ మిగిలిన బృందం అందరు కలిసి దాన్ని స్వీకరించారు .ఆ సందర్భం గా మాట్లాడుతూ గోరె ” my fello Americans ,people all over the world ,we need to solve the climate crisis .it is not political issue ,it is a moral issue .we haave to create renewable resource .let us renew it” అని చక్కని సందేశాన్నిచ్చాడు .దీని తర్వాత కార్బన్ ఏమిషాన్  తగ్గించాలనే ఆందోళన తీవ్రమైంది .పరిశ్రమ ల మీద కార్బన్ టాక్స్ వేయాలనే ఆలో చన వచ్చింది.ఇది దృష్టి లో ఉంచుకొని గోరె” alliance for climate protection  ” అనే లాభా పేక్ష లేని సంస్థ ను ఏర్పాటు చేశాడు .సమస్యను రాజ కీయ సమస్య గా కూడా చేయాలని భావించాడు .ఈ సంస్థ ఒక పెద్ద ఇంటర్నెట ను టి.వి మరియు పత్రిక లను ప్రారంభించి విస్తృతం గా ప్రచారం చేస్తోంది .ఈ అలఎన్సు సంస్థ ”live earth benefit ” కోసం సంగీత కచేరీలను పెద్ద పెద్ద సంగీత కారు లతో ఇప్పిస్తోంది .ప్రపంచ వ్యాప్తం గా ఈ కార్య క్రమాలను నిర్వహించటం ప్రశంషనీయం .ఇదంతా గోరె పుణ్యమే .
ఇలా తన పని ని తాను చేసుకొని పోతున్న సమయం లో నోబెల్ పురస్కార ప్రదాన కమిటీ 12-10-2007న నోబెల్ శాంతి బహు మతి ని గోరె కు ,అతని తో పాటు united nation’s inter govern mental panel on climate change ” కు కలిపి ప్రకటించింది .ఈ సంస్థ భారత దేశానికి చెందిన కే.పచౌరి నాయకత్వాన పని చేస్తోంది .గోరె కు ఆయనకు సంయుక్తం గా ఈ అవార్డ్ ను ఇస్తారన్న మాట .10-12-2007న అవార్డు ను ప్రదానం చేశారు గోరె ,పచౌరీ ఇద్దరు తీసుకొన్నారు .ఆ సందర్భం గా గోరె ను ప్రశంసిస్తూ ”gore ,the individual who has done most to create ,greater world wide understanding of the measures that need to be adopted”అని అన్నది .గోరె తనకు వచ్చిన బహుమతి మొత్తం 1.5మిలియన్ డాలర్లను Alliance for climate protection ” సేవలకు విని యోగించాలని అంద జేసిన  త్యాగ ధనుడు గోరె .గ్లోబల్ వార్మింగ్ పై రిసెర్చ్ చేసి వివరించి నందుకు పచౌరీ కి ,ఆ విషయాన్ని ప్రపంచ వ్యాప్తం గా ప్రచారం చేసి నందుకు గోరె కి ఆ బహుమతిని ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది .
”  Newyork times ”పత్రిక ఒక పూర్తీ పేజి advertise ment  తో ఒక విజ్ఞప్తిని గోరె కు చేసింది ”మీ కు మీ పార్టీ కి దేశానికి భూమికి మీ నాయకత్వం అత్యవసరం ”అని 2008 ఎన్నిక లలో మళ్ళీ పోటీ చేయమని కోరింది .తనకుఇప్పుడు  ఆ ఉద్దేశ్యం లేనే లేద ని స్పష్టం గా చెప్పాడు .భవిష్యత్తు లో లేక పోలేదని విశ్లేషకులు ఊహా గానం చేశారు .తన భావాన్ని ” I honestly believe that the highest and best use of my skills and experience is to try to change the minds of people in the u.s. and else wher e in the world about this planetary emergency that we simply have to confront ‘అని సవినయం గా తన లక్ష్యాన్ని స్పష్టం గా తెలియ జేసిన పర్యా వరణ ప్రేమికుడు,ప్రధమ  సేవకుడు ‘మన ఆల్  గోరె ”.long live Al Gore ”
ఆల్ గోరె లో1948 మార్చి ముప్ఫై ఒకటిన జన్మించాడు.హార్వర్డు వర్సిటి లో గ్రాడ్యు ఎట్ అయాడు .మేరి ఎలిజే బెత్ ఐ చెంసన్ అనే ఆమెను వివాహం చేసుకొన్నాడు .ఈమెనే ”టిప్పర్ ”అని పిలుస్తారు  1971 లో వియత్నాంయుద్ధం లో ఆర్మీ జర్న లిస్టు అయాడు .1984లో టెన్నిసీనుంచిడెమొక్రాటిక్ పార్టి  సెనేట్ సభ్యుడయాడు .మళ్ళీ ఆరేళ్లకు తిరిగి ఎన్నిక అయాడు .1988లో డెమొక్రాటిక్ పార్టి నుంచి అధ్యక్ష స్తానానికి పోటీ చేద్దామను కొన్నాడు కాని పార్టి నుంచి సపోర్టు రాలేదు .1989 లో”earth in the balance ” అనే గొప్ప పుస్తకం రాశాడు .1992 లో క్లింటన్ ప్రెసిడెంట్ గా, గోరె వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయారు .ఇంకో సారి కూడా 1996లో ఈ జంట అదే పదవి దక్కించు కొన్నారు .2000ఎన్నిక లలో బుష్ పై ఓటమి పాలై నాడు .ఆ తర్వాత ఆయన చరిత్ర అంతా పైన చెప్పు కొన్నాం .2007లో పర్యా వరణ రక్షణకు ఆయన చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి ని పొందాడు .ఓడినా, దేశం, ప్రపంచం ,పర్యా వరణం అంటూ స్వచ్చంద సేవ లందిస్తున్న గోరె అందరికి ఆదర్శమే .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-12-12-కాంప్ -అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

జన వేమన –8 వేమన సార్వ కాలీనత

జన వేమన –8
                                                     వేమన సార్వ కాలీనత 

దేశ ,కాలాలకు అతీతం గా చెప్పేది సార్వ కాలీనం అంటారు ..సత్యం ఒక్కటే నని నమ్మి ,దాని సర్వ వ్యాప్తిత్వాన్ని ఆవిష్క రించారు వేదాంతులు ,దాన్తులు ,దార్శనికులు .”బహుజన హితాయ ,బహుజన సుఖాయ ”అన్నదే వారి ధ్యేయం .”తత్వమసి ”అన్నది చాన్దోగ్యోప నిషత్ సారాంశం .”తత్ అంటే ఆది అని ,త్వం అంటే నీవు అని అసి అంటే అయి ఉన్నావు .అని దాని అర్ధం .అంటే ,అంతా ఒక్కటే ,పరబ్రహ్మ స్వరూపమే .అందులో ఆత్మ జ్ఞానం ,ప్రపంచ జ్ఞానం ,బ్రహ్మ జ్ఞానం కలిసి ఉన్నాయని శ్రీ అరవిందులు వివరించారు .బ్రహ్మం , ,ప్రపంచం  ,నువ్వు ఒక్కటే అని భావం ..”సో కామయత ఎకోహం ,బహుస్యాం ప్రజాఎతి ”న్న ఉపనిషత్ వాక్యం కూడా విశిష్టతను సంత రించు కొన్నది .భగవంతుడు తాను అనేకం గా మారి ,ఆనందిస్తాను అన్నాడని అర్ధం .మన లోని పర బ్రహ్మ పదార్ధం ,,బయటకు వచ్చి ప్రకటించ బడి నప్పుడే ,భగ వంతుడు తాను ,అనేకం గా మారి ,అందించాలి అనే సంకల్పం నేర వేరుతుంది .అంటే ,బ్రహ్మ గా మారే ప్రయాణం లో ,ఉన్న మాన వుడివి .మానవుడిగా కనీ పించే బ్రహ్మ వే నువ్వు .కనుక భగ వంతుడిని జీవితం లో అభి వ్యక్తం కానివ్వటమే ,మానవ జీవిత పర మార్ధం అని శ్రీ అరవిందుల అభి భాషణం .ఈ భావన ఏర్పడితే ద్వంద్వం అనేది లేదు .అంతా భగవదంశ లానే కనీ పిస్తుంది .మనం బ్రతి కేది అందరి వికాసానికి అన్న స్పృహ చాలా అవసరం .మనం పడే వేదన ,బాధ ,కష్టం ,కన్నీళ్లు అన్నీ ,రాబోయే మహా మాన వుడిని ప్రాస విన్చె దిశ గా పుడమి తల్లి పడుతున్న ప్రసవ వేదనలే అని తెలిస్తే ,బ్రతుకు ,ఆనందం గా ,హాయిగా సాగి పోతుంది అని శ్రీ అరవిందుల తత్వ రహస్యం .
”విశ్వాన్ని గురించో ,దాని ఆధారం గురించో ,తనను గురించో ,ప్రత్యక్ష ,అనుమానా లపై కాకుండా ,చింతన చేస్తే ,ఆది ఫలించి ,మంచి భావన తో ఆవిష్కరింప బడిన దానినే ”దర్శనం ”అంటారు .చింతన చేసిన వారు దార్శనికులు .అనుభూతి ,నిరంతర మననం ,విశ్లేషణ ,ద్వారా శ్రద్ధ ను నిర్మిస్తే ,ఆ దర్శనం పరి పూర్ణం .”దృశ్యతే అనేన ఇతి దర్శనం ”అంటే -దేని వల్ల చూడ బడుతుందో ,ఆది దర్శనం .దేన్నీ చూడాలి ?సత్యాన్ని.అడ్డంకులను ,పరిమితులను అదిగ మించి ,వివిధ అనుభవాల ,శాస్త్రాల సంస్కృతుల ,సిద్ధాంతాల మధ్య సంబంధాలను స్థాపించి ,విశ్వ దృష్టి ని కల్పించటం దర్శనం కోరే మహాదాశయం .ఈ విశ్వ దృష్టి తో చెప్పిన ప్రతి మాటా ,మాన వాళి కి శిరో దార్యమే .వివిధ వాదాలు ,శాస్త్రాలు ఆధారంగా సత్యాన్వేషణ జరుగు తుంది .అతీంద్రియ దృష్టి ,రుశిత్వం తపస్స్వాధ్యాయణం ఉన్న మహాను భావులకు ఇవన్నీ ,మనో ఫలకం పై ఆవిష్క్ర్రం జరుగు తాయి .వాటిని మాన వాళి అభ్యుదయానికి తేలిక మాట లతో హృదయానికి గాదం గా హత్తు కోనేట్లు చేస్తారు యోగులు ,మనీషులు .అలాంటి దార్శనిక దృష్టి ఉన్న వేమన్న చెప్పిన మహా వాక్యా లను ఇప్పుడు మననం చేద్దాం .వాటి సార్వ కాలీనత్వానికి ముచ్చట పడుదాం . ఆయన సాధించిన ఆత్మా పరి నతి కి నివాళులర్పిద్దాం ..నిజం తెలుసు కొందాం .ఆ ”ఎరుక ”తెలిస్తే ,అంతా ఆనందో  బ్రహ్మ ”మే .
”అజ్ఞానం శూద్రత్వం సుజ్ఞానం బ్రహ్మం ”అని శ్రుతి చెప్పిందన్నారు .దీనిని వేమన ”ఇంద్రియ జయుడే ఉత్తముడు .తన గుణాన్ని తెలుసు కో కుండా ,ఇతరుల గుణాలనుఎంచే వాడు భ్రష్టుడు .”జీవ భావ మెరుగ జేడ డేన్నటికి మది -దైవము నేరుగా ,దనరు బుద్ధి –తేజము  దయ యందు దిమిరంబు నిలవదు ”జ్ఞానం కలిగితే అజ్ఞానమనే చీకటి నిలవదు .జ్ఞానం ,సత్యం తెలిస్తే ద్విజుడు అవుతాడు ”నిశ్చ లాత్మ యున్న నిర్వి కారంబున –ముక్తి యండ్రు దాని మొగిని వేమ ”అంటే -నిశ్చల మైన అంతఃకరణ ఉంటె అదే ముక్తి .”ఇంద్రియాలను రోసి ,ఈశ్వరుణ్ణి చూడు ”అన్నాడు .బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తే ఏమీ లాభం లేదు .”తనువు గుడి గ జేసి తనను నిలిపి –లోక బుద్ధి విడిచి ,లో జూపు జూడరా ”అని చింత అనే అనేది హృదయ గతం కావాలి అని చక్కగా చెప్పాడు .శాస్త్రాలతో సంశయం తీరదు .స్వా ను భూతి తోనే సాధించ గలం .కోపం ,రోషం ఆవేశ ,కావేశాలు సంతోషాన్నివ్వవు .ధర్మ రాజు విజయ రహస్యం శాంతం .సకల కార్యాలు శాంతం వల్లనే సాధ్యం .సంతోషం కలిగితే సత్యమేవ జయతే .అవుతుంది .అభిరుచులు వేరే అయినా ,సారం ఒకటే .సత్యాన్వేషణ మార్గాలు వేరే అయినా సత్యం ఒక్కటే .”పరమ పురుషులు వేరు బావ్యు డోక్కండురా ”అని సత్య దర్శనం చేయించాడు వేమన యోగి .ప్రకృతి ని తెలుసు కోవాలి .ఆది తెలియక పోతే భక్తీ కానే కాదు .భగ వంతుడిని  చూడాలి అంటే ”చూచు కనులు వేరు ,చూపు వేరు –చూపు లోన మరచి చూడు ”అన్నాడు .అప్పుడే దర్శనం అనేది సాధ్యం అవుతుంది .ఎంత విద్య నేర్చినా ,తన తో పాటే మట్టి లో కలిసి పోతాయి .”దేవుడు ఆత్మ లోన నుండు ననగి ,పెనగి –”దాన్ని దర్శించాలి .సర్వానికి ధర్మమే మూలం .”ధర్మమే నృపులకు తారక యోగంబు ”అని సార్వ కాలీన సత్యాలను ఏకరువు పెట్టాడు .
మిగిలిన సార్వకాలీన సత్యాలను తర్వాత తెలిసి కొందాం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సరసభారతి 1000 పోస్ట్స్ – మైలు రాయి దాటింది

 

సరసభారతి 1000 పోస్ట్స్ – మైలు రాయి 

సరభారతి 1000 పోస్ట్స్ – మైలు రాయి  దాటింది. దీనికి మీ ఆదరాభిమానాలే కారణం. 

వీక్షకులు : 68,321

ప్రపంచం లోని తెలుగు వారి అందరికి పరిచయమయ్యింది. బ్లాగ్ ప్రారంభం అయ్యిన తరువాత గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు లో ఉసూల గూడు (బ్లాగ్స్) కూడా రాస్తారు అని ప్రపంచానికి తెలిసింది.

అమెరికా ప్రయాణం లో పరిచయం లేని వాళ్ళు కూడా గుర్తు పట్టి బ్లాగ్ గురించి గొప్పగా చెప్పటం విశేష అనుభూతి.

73 ఏళ్ళ వయసులో కంప్యూటర్  నేర్చుకొనటం, తెలుగు లో టైపు చేయటం, నోట్స్ తయారు చెయ్యటం ఈమెయిలు రాయటం. సమాధానాలు రాయటం నేను నేర్చుకోన్నవి.

టైపింగ్ లో కొన్ని తప్పులు దొర్లినా మంచి మనసుతో దానిని అర్ధం చేసుకొని బ్లాగ్ కి సహకరించిన వారి అందరికి ధన్య వాదాలు.

పేరు పేరు నా రాయక పోయినా, అందరికి ఇవే నా ధన్య వాదాలు మరొకసారి

 

Posted in సరసభారతి | Tagged | 6 Comments

కల్పవృక్షపు స్త్రీలు – స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ లో వచ్చిన సత్య కధా సుధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జన వేమన -7 సాంఘిక దురాచారాల పై వేమన్న

 జన వేమన -7
                                 సాంఘిక దురాచారాల పై వేమన్న 

”హాస్యం పరమౌషధం ”దాన్ని అన్నిట్లో రంగ రించి ఇస్తే  బాగా పని చేస్తుంది .అందుకే వేమన్న తాను నవ్వు కోవటమే కాదు ,లోకుల్నీ నవ్విస్తూ హితోప దేశం చేస్తాడు .సంఘం లో ఉన్న దురాచారాలను కడగ టానికి రేవు పెట్టాడు .మతా చారాలను ,అన్ని వర్ణాల వారినీ ,లోభుల్ని ,యోగుల్ని ఝడించివదిలాడు .”పాప మనగ వేరే పరదేశమున లేదు -తాను చేయు పనుల దగిలి యుండు ”అని పాపం ఎక్కడో లేదు మనం చేసే పనుల్లోనే దాగి ఉందని చెప్పాడు .”స్వార్ధ పరులను ఎదిరించ టానికి హాస్యాయుధా న్నే వాడాడు .మొదట్లో ముతగ్గా ,పనస తొక్కు అంత పెళుసు గా ఉన్నా ,రాను రాను ,నాజూగ్గా ,పనస తోన లంత తియ్యగా ,కమ్మగా మారింది ఆయన ధోరణి ” అన్న ఆరుద్ర మాట యదార్ధమని పిస్తుంది .బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకొంటేనే వేదాభ్యాసానికి అర్హుడు .బ్రాహ్మణ స్త్రీ లకు ఉపనయనార్హత లేదు .అందుకని వేమన్న ”తల్లి శూద్రు రాలు ,తానెట్లు బాపడో ”?అని ప్రశ్నించాడు .ఇతర కులాల వారికి వేద విద్య నిషేధం అన్నప్పుడు ,ఉపనయం లేని స్త్రీ శూద్రు రాలే కదా ?అని ఆయన అనుమానం .ఆమెకు పుట్టిన వాడు శూద్రుడే అవుతాడు కదా అని సమాధానం . అని ఆ వేలి తోనే ఆ కంటిని పొడిచాడు .”గుప్త విద్య ఒక్కటే కుల కాంత వంటిది ”అని భావించి ,దాని ప్రచారానికి దేశమంతా తిరిగాడు .పరి పక్వ మైన మనసున్న వారికి, కులం ,మతం ,స్థలం అక్కర్లేదని ఆయన భావం .పెరిగిన వాతా వరణమే మనిషిని తీర్చి దిద్దు తుందని ఆయన అభి ప్రాయం .
ఆడ పిల్ల ను అమ్ము కొనే ”కన్యా శుల్కం ”అనే దురాచారాన్ని ఖండించాడు .పిల్లను అమ్ము కోవటం అంటే కూతురి థో వ్యభిచారించటం అంత తప్పు అన్నాడు .”పేద వాడి నను పెంటి నిచ్చెద నని -పైడి నడుగ రాదు పరుసము గను –పైడి గొనుట పెంటి బట్టి నట్లయా ”అని చెప్పేశాడు .ఇచ్చి పుచ్చు కొనే వారిద్దరూ గతి లేని వారైతే ,ఇంత తిండి పెట్టి కన్యా దానం చేస్తే చాలు అన్నాడు .”కాడి వే దాన్న ము నిడకన్నె నీవలె గాని –పడుపు గూడు గుడువ వలదు ”అని హెచ్చరిక .చేత నై నంత వరకు వర దక్షిణ నిచ్చి ,పేద వానితో బంధుత్వం కలుపు కోవాలి .”కలిమి జూచి ఈయ ,కాయ మిచ్చిన యట్లు –సమున కీయ నదియు సరస తనము -పేదకిచ్చు మనువు పెన వేసి నట్లుండు ”అని ,బీదరికం లో ఉన్న వారితో వియ్యం అందు కొంటె ,బంధు లాభం ,ఆపేక్షలు పెరుగు తాయని  పేద ల పాలిటి పెన్నిధి గా చెప్పాడు .”మనసు లేని మనువు పనికి రాదు ”అన్నాడు ”కలుగు వాడు ,లేమి కాన కిచ్చు మనువు –కలిమి లేము లటుల కలిసి యుండు -”అనటం లో ఆప్యాయతలు ఉండాలని ధనం అడ్డు కారాదు అని,  కుటుంబ వ్యవస్థ బాగా ఉండాలని ఆశించాడు .
చదువు, సంస్కారం తేవాలి .ఒట్టి చదువు వన్నె లేదు .”ఎంత చదువు చదివి యే నీతి ఎన్నను –హీను డవగుణంబు మాన లేడు–బొగ్గు ,పాల గడగ ,పోవునా మలి నంబు ”అని చక్కని ఉప మానం తో సంస్కారం యొక్క అవసరాన్ని చెప్పాడు .కుహనా మేధావుల వల్ల ,సమాజానికి కీడు అని ,చిత్తం విత్తం మీద ఉండి ,కలుషిత మనస్సు ఉన్న వాడు ఎంత చదివినా ,దాలి గుంట లోని కుక్క లాంటి వాడని నిందిస్తాడు .”చదువు లెన్ని చదివి ,చాల వివేకియై –కలుష చిత్తుడైన ఖలుని గుణము -దాలి గుంటకుక్క దలచిన చందము ”-విద్య నేర్పిన గురుని ఉచిత రీతి లో సత్క రించాలి .కాని ,రేవుదాట గానే ,తెప్పను తగ లేసి నట్లు ,విద్య నేరవ గానే ,గురుని గౌరవించటం మరువ రాదు .వేశ్య కివ్వ టానికి డబ్బు ఉంటుంది కాని ,గురువు కివ్వ టానికి సంకోచిస్తాడు మనిషి అని అసహ్యించు కొంటాడు .’ఎన్న గురుని కన్న నెక్కువ లేదయా” అని గురువు గారి గురుత్వాన్ని శ్లాఘించాడు .”తాళం చెవి లేకుండా ,తాళం యెట్లా రాదో ,గురుని శిక్ష లేకుండా గురుతు రాదు ”అంటాడు .గురువులు కూడా విద్యా గురువులు ,మిధ్యా గురువులు అని రెండు రకాలు .”కస్తూరి నల్లగా ఉన్నా ,దాని పరి మలం పరిధ విల్లి నట్లు మంచి గురువు లైన వారి గుణాలు ఉంటాయట .
”వైద్యో నారాయణోహరిహ్ ”అని భావిస్తాం .సాక్షాత్తు నారాయణ స్వరూపుడే వైద్యుడు .దేవుడు భవ రోగ నివారణ చేస్తే ,ఈయన ఇహ రోగాన్ని నివారణ చేస్తాడు .అందుకే వైద్యులను ”వ్యాధి నెరిగి నట్టి ,విశ్వోప కారులు ”అని కీర్తించాడు .వైద్యుడు ప్రాణ దానం చేస్తాడు .ఇది అన్ని దానాలలో మిన్న .రోగం ముదరక ముందే చికిత్స చేయాలని వైద్యులకూ బోధించాడు .అందుకే ”కూల బడిన నరుడు కుదురుట అరుదయా –”అన్నాడు .రోగం ఏమిటో తెలుసు కొ లేని వైద్యుడు శుద్ధ దండగ అన్న విషయాన్ని ”వ్యాధి నేరుగలేని వైద్యు డేల ?”అన్న పద్యం లో చెప్పాడు .
చిన్న వాడైనా తగి నట్లు ప్రవర్తించిన నా ,మాట్లాడినా ,అతన్ని ఆదరించి గౌర వించాలి .అక్కడ చిన్నా ,పెద్దా తేడా లేదు .చిన్న దీపం పెద్ద కాంతి నిస్తోంది కదా .”అంకిలేరిగి మాట లాడ నేర్చిన యపుడు –పిన్న తనము పేర్మి ఎల –పిన్న చేతి దివ్వె పెద్దగా వేలుగదా ?”అని ,ప్రతి భ కు పట్టం కట్ట మన్నాడు .కౌరవ సభ లో కర్ణుడి కుమారుడు ఇలానే మాట్లాడితే ప్రశంశించారు కదా అని గుర్తు చేస్తాడు .
వివాహాది శుభ కార్యాల కు జ్యోతిషం చూడటం ముహూర్త నిర్ణయం ,శకునాలు ,మొద లైన వాటి పై వేమన విమర్శలను సంధించాడు .ముహూర్తాన్ని మంచిది గా ఎన్ను కొని ,పెళ్లి చేసినా ,వైధవ్యం ఎందుకు వస్తోంది అని ప్రశ్నిస్తాడు .”విప్రు లెల్ల గూడి వెర్రి కూతలు కూసి –సతి ,పతుల గూర్చి సమ్మతమున-మును ,ముహూర్త ముంచ ,ముండేట్లు మోసేరా ? ”అని నిలదీస్తాడు .జ్యోతిషాన్ని అతి గా నమ్మద్దు అంటాడు .శాకునాలకు అవకాశం ఇవ్వద్దు అన్నాడు .పాల పక్షి మంచి శకునం అని నమ్ముతారు .శకున ఫలం దానికేం తెలుసు పొమ్మంటాడు .”తనదు మేలు ,కీడు ,తన లోనే యుండక ”దేన్నో చూసి మోస పోవద్దు అన్నాడు .శకునం మంచిది అయితే సరే ,లేక పోతే ”కాని పనులకు తన కర్మము ”అంటాడు మానవుడు .అన్ని వారాలు ,అన్ని రోజులూ మంచివే నని ఆయన ఉద్దేశ్యం .”న్యాయ శాస్త్ర మరయ నన్యాయ మొన రించు –ధర్మ శాస్త్ర మొసంగు దుర్మతంబు -జ్యోతిషంబు జునుల నీతుల దప్పించు ”అని ,మెత్తగా చివాట్లేశాడు .అతి గా దేనినీ నమ్మ వద్దు అని భావం .నీ మనస్సే నీకు మంచి చెడు తెలియ జేస్తుంది .దాన్ని నొక్కేసి ,ఇతరు ల పై ఆధార పడ వద్దు .వివేకం ,విజ్నా నం తో ప్రవర్తించు .దేనికోసమో ,ఎవరి కోసమో ఎదురు చూడ వద్దు .”రానిది ,కోరిన రాదది -రానున్నది కోరకున్న దానే వచ్చున్ -తానెంత చింత జేసిన ,-కానున్నది కాక పోదు గదరా వేమా ?” అని ఎంతో దార్శనికం గా తెలియ జేశాడు .దయతో ప్రవర్తించాలి .సాను భూతి చూపాలి .”ముష్టి వేప చెట్టు మొదలుగా ప్రజలకు –పరగ మూలికలకు పనికి వచ్చు –నిర్దయాత్మకుడు నీచు దేన్డునాను –పనికి రాదు ,గదర ,పరగ వేమా “”అని నిర్దయుడిని ,దయా హీనుడిని గూర్చి వాళ్ళు” ఒట్టివేష్టు కాండి డేట్లు” అన్నాడు .
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –24-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

జర్మని సంగీత త్రయం -ముగ్గురు మహా ”బీ”లు

 జర్మని సంగీత త్రయం -ముగ్గురు మహా ”బీ”లు 
జర్మనీ సంగీత త్రయం అని పిలువ బడే ముగ్గురు మహా ”బీ”ల గురించి మనం తెలుసు కుందాం .వారి ముగ్గురి పేర్లు బి అనే అక్షరం తో ప్రారంభం అవటం ఒక విశేషం .అందుకే వారిని” ది త్రీ బి” లని గౌరవం గా పిలుచు కొన్నారు . .వారే బాచ్ ,బ్రామ్స్ మరియు బీథోవెన్ .ముగ్గురి సేవా గణనీయ మైనదే .వారి సంగీతజ్నత ను తెలుసు కొనే ప్రయత్నమే మనం చేస్తున్నాము .
      జోహాన్ సే బాస్టియన్ బాచ్ (ష్)(johan sebastian bach ).
బాష్ 31-3-1665 లో జన్మించి ఎనభై అయిదేళ్ళు జీవించి 28-7-1750లో మరణించాడు .ఈయన జర్మన్ కంపోజర్ , ,వాద్య కారుడు- సైకార్దిస్ట్, హార్ప్ కార్దిస్ట్ ,వయోలిస్ట్ మరియు వయోలనిస్ట్ .ఆయన ఉన్న కాలాన్ని”Baroque period ”అంటారు .అప్పటికే ఉన్న అనేక సంగీత శైలులను శోభాయమానం చేసి నాణ్యత చేకూర్చాడు .కౌంటర్ పాయింట్ లో ఆయనది ప్రత్యెక మైన స్తానం ఉంది .శ్రావ్య మైన ,ప్రేరక మైన ,వాద్య సమ్మేళనం నిర్వహించాడు. లయ కు ఎక్కువ వీలు కల్పించాడు . ఇటలీ మరియు ఫ్రాన్సు దేశాల నుండి భావాలను ,ప్రేరణ ను పొందాడు .ఆయన సంగీతం లో ప్రతిభా వంత  మైన లోతులున్నాయని,సాంకేతిక పరి ణతి.వాటి పై గొప్ప పట్టు ఉన్న వాడు అని  విశ్లేషకులు భావించారు . ఆయన చేసిన వన్నీ కళా సౌందర్యం తో విల సిల్లేవే అని భావిస్తారు .అసలు ఆయనది గొప్ప సంగీత వంశం .అంటే ఇంగువ కట్టిన గుడ్డ అన్న మాట .వాద్య కారుడిగా ఎంత పేరు పొందాడో పాటకుడి గా,సుమధుర శ్రావ్య స్వరాలతో  అంతే కీర్తి పొందిన వాడు .యూరపు అంతా ఆయన సంగీత ఝరి లో ఒల లాడింది .ఆ నాటి leopald music academy కి డైరెక్టర్ గా పని చేశాడు . బ్రతికినప్పటి కంటే ,చని ఆయిన తర్వాత ఆయన కీర్తి బాగా వ్యాపించింది .మొత్తం మీద యూరప్ అంతటిని తన సంగీతం తో స్నానం చేయించిన మహా విద్వాంసుడు బాష్ .బాష్ సంగీతం లో భేష్అని పించుకొన్నాడు
         . జోహాన్నెస్ బ్రామ్స్(johannes brahms )

బ్రామ్స్ 7-5-1833న జన్మించి ,అరవై నాలుగేళ్ళు జీవించి 3-4-1897లో మరణించాడు .రొమాంటిక్ కాలం లో సంగీతం లో నాయక స్థానాన్ని సాధించాడు .ఈయనా మంచి కంపోజర్ కాక గొప్ప పియానిస్టు కూడా .జీవితం లో ఎక్కువ కాలం ఆస్ట్రియా లోని వియన్నా లో ఉన్నాడు

పుట్టిన ఇల్లు

.అక్కడే ఆయన కీర్తి పతాక స్తాయి ని పొందింది .ఆయన ప్రభావం చాలా మంది సంగీత కారు ల పై ఉండేది .బీథోవెన్ తో కలిసి సంగీత కచేరీలు చేసే వాడు .అలాగే బాష్ తోను కచేరీలు నిర్వహించిన చరిత్ర ఆయనది .పియానో వాయించటం లోనే కాక ,సింఫనీ సృజించటం లో ,ఆర్కెస్ట్రా తో సంగీత కార్య క్రమాలకు మార్గ నిర్దేశం చేయటం లో సంగీత పాటకుడి గా ,కోరస్ లు పాడటం లోను వాటిని పాదించటం లోను ప్రశస్త మైన భూమిక నిర్వ హించాడు .అన్నిటి కంటే పియానో వాయించటం లో అత్యధిక ప్రతిభా వంతుడి గా గుర్తింపు పొందాడు .ఆనాడు బ్రామ్స్ చేసిన వన్నీ ,ఈ నాటికిఆదర్శ ప్రాయం గానే సంగీతజ్ఞులు భావించి ,వాటిని ఉపయోగిస్తున్నారు .”never compromise in perfection” అని పేరు తెచ్చు కొన్నాడు .సంపూర్ణత పరి పూర్ణతా  సాధించే దాకా నిద్ర పోయే వాడు కాదు .అందుకనే ఇప్పటికీ ఆయన సంగీతానికి ప్రాచుర్యం ఉంది .తనకు నచ్చని ట్యూనులను ,సింఫనీ లను రాసిన వన్నీ మిగల కుండా తగుల బెట్టె వాడు .కొన్ని రచనలు ఆయనకే నచ్చక ప్రచురించ నే లేదు .అంతటి perfectionist  బ్రామ్స్ కు రాసి కంటే వాసి ముఖ్యం అని భావించిన సంగీత నిది ,అంబుధి .    బ్రామ్స్ సంప్రదాయ వాది .దానితో పాటు సృజన శీలి .
అతని సంగీతం అంతా ”firmly rooted in structure and compositional techniques of Boroque and classical masters”  అని సంగీత మర్మజ్నులు నిగ్గు తేల్చారు .ఆయన ”కౌంటర్ పాయింట్ ”లో అద్వితీయుడు అంటారు .దీనిలోనే బాష్ చాలా కృషి చేశాడని ముందే చెప్పు కొన్నాం .ఈయన దానికి మెరుగులు దిద్ది మరింత ముందుకు తీసుకొని వెళ్లాడు .ఈయన హేడెన్ ,మోజార్ట్ ,బీథోవెన్ లు చేసిన దానికి మెరుగులు పెట్టాడు .జర్మన్ structure ను పరిశుద్ధి చేసి (ప్యూరిఫై )రొమాంటిక్ idioms  లోకి తెచ్చిన వాడిగా ఈయనను చెప్పు కొంటారు .వాటి స్తాయిని గౌరవాన్ని పెంచిన ఘనత బ్రామ్స్ దే   .కొత్త మార్గాలు తోక్కటం అంటే మహా సరదా .ఐక్యత ,శ్రావ్యత లను సంగీతం లో బాగా సాధించి సంగీతాన్ని ఉన్నత స్తానం లో కూర్చో పెట్టాడు

సమాధి

.అయితే” మరీఎకడమిక్ ”అనే ముద్ర నుంచి తప్పించు కోలేక పోయాడు .ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఘనత సాధించాడు సంగీత బ్రహ్మ బ్రామ్స్ .
    లుడ్విగ్ వాన్  బీథోవెన్(ludwig van Beethoven ) 
బీథోవెన్ జెర్మని లోని బాన్ లో 16-12-1770లో జన్మించి ,కేవలం యాభై ఏడేళ్ళు మాత్రమె జీవించి26-3-1827 న ఆస్ట్రియా లోని వియన్నా లో మరణించాడు .సంగీత వంశం లో జన్మించాడు .తాత ,తండ్రి సంగీత విద్వాంసులే .తండ్రి ఇతని చిన్నప్పుడే తీవ్రం గా సంగీత సాధన చేయించే వాడు .ఒకో సారి అలా చేస్తూ నిద్ర పోయే వాడు .ఏడవ ఏట సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు .బాల మేధావి అనే వారు .నీఫే అనే ఆయన వద్ద శిష్యరికం చేశాడు .తండ్రి పని చేసే కొలువు లోనే ఆర్గానిస్ట్ గా ఉద్యోగం పొందాడు .పద మూడేళ్ళ వయసు లోనే మొదటి సారిగా కంపోజు చేసిన పుస్తకాన్ని ప్రచురించిన ఘనత బీ థోవెన్ ది .దీనిలో key board variations అద్భుతం గా చూపి గొప్ప గొప్ప సంగీత విద్వామ్సులనే ఆశ్చర్య పరిచాడు .గురువు నీఫే తో కలిసి కొన్ని కచేరీలు చేసే గౌరవాన్ని పొందాడు .పద్నాలుగేళ్ళ కే court chapel లో ఉద్యోగి అయాడు .వెంటనే మూడు పియానో సొనాటా లను రాసి ఎలేకక్తార్ మాక్సి మిలియన్ ఫ్రేజర్ కు అంకితమిచ్చాడు .
1787లో అంటే పద్దెనిమిదో ఏట వియన్నా వెళ్లి ఆ నాటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మొజార్ట్ దగ్గర శిష్యరికం చేశాడు.  ,రెండు వారాలు మాత్రమె ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు .తల్లి చని పోయింది .తండ్రి విపరీత మైన తాగు బోత’ .ఎలేక్తార్ ను అడిగి తండ్రి జీతం లో సగం కుటుంబ పోషణ కు ఇచ్చే ఏర్పాటు చేసుకొన్నాడు .1790లో హేడెన్ అనే గొప్ప సంగీత విద్వాంసుడి తో పరిచయం కలిగింది .అప్పటికే బీథోవెన్ ఎన్నో వాటిని కంపోజు చేసి గొప్ప పేరు పొందాడు .మోజార్టు చేసిన ఒపేరా లకు మూడింటికి సంగీతం కూర్చిన ఘనత బీథోవెన్ ది .అతను కూర్చిన వాటిలో స్థాయి, పరి పక్వత గొప్ప గా ఉంటాయి .హేడెన్ దగ్గర శిష్యరికం చేసి చాలా విశేషాలు గ్రహించాడు .ఇరవై మూడు ఏళ్లకే గొప్ప improviser అని పేరు పొందాడు .క్లావియర్ విద్య లో నిష్ణాతుడు అని పించుకొన్నాడు .బీథోవెన్ పై హేడెన్ ,మొజార్ట్ ల ప్రభావం ఉంది .బీథోవెన్ శ్రావ్య మైన స్వరాలు సంగీతం ,సంగీతం లో పరిణత ,అభి వృద్ధి ,అవసరానికి తగిన మాడ్యు లేషన్ ,భావాల వ్యక్తీ కరణ (ఎమోషన్స్ )బీథోవెన్ ను మిగిలిన సంగీత విద్వాంసుల కంటే ఎంతో ఉన్నతాసనం పై కూర్చో బెట్టాయి .ఆయన సరసన కూర్చునే స్తాయి ఎవరికి లేదని సంగీత విశ్లేషకులు భావిస్తారు .అందుకే ఇప్పటికీ ఆయన అంటే క్రేజు .
దురదృష్ట వశాత్తు 26ఏళ్లకే బీతోవెన్” చెవిటి వాడు” అయాడు .ఒక సంగీత విద్వామ్సుడికి  ఇది పెద్ద శాపమే .అయినా దాన్ని అధిగమించి ముందుకు సాగి పోయాడు .ఫుల్ మూన్ సొనాటా అనే ఆయన చేసిన సంగీత సృష్టికి ప్రపంచం అంతా అమోఘం గా స్పందించి జేజే లు పలికింది .అతన్ని అన్ని దేశాల వారు తమ వారు అనుకొన్నారు .సంగీతానికి ఎల్లలు లేవు అని నిరూపించాడు బీథోవెన్ ఆయన చేసిన” ninth symphony ”న భూతో న భవిష్యతి అంటారు .18 వ శతాబ్దపు క్లాసిజం నుండి ,సంగీతాన్ని19  వ శతాబ్దపు ”రోమాన్ టిజం ”లోకి తీసుకు వెళ్ళిన ఘనత బీథోవెన్ దే .సందేహం లేదు .ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్నో తరాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాడు .సింఫనీ కి ఒక కొత్త శోభ, నాణ్యత గౌరవం తెచ్చిన ఘనా ఘనుడు .ఆయన సంగీతాన్ని ఎస్టి మేట్ చేస్తూ”A broad sample of images ,cmmon sounds ,languages ,music of earth ” ఆయన సంగీతం లో ఉన్నాయని ప్రపంచం అంతా శ్లాఘించింది .అందుకే ఆ మహా విద్వామ్సుడికి ”హాట్స్ ఆఫ్ ”అంటారు .ఎన్నెన్నో వాయిద్యాలను అవసరాన్ని బట్టి వాడాడు .నిండుదనం పరి పూర్ణతా సాధించాడు .ఆయన గొప్పగా పాడనూ గలడు .పాడించను గలడు.  శబ్దానికి ఉన్న సంగీత శక్తి బీథోవెన్ కు తెలిసి నంత గా ఎవ్వరికీ తెలీదు అని విశ్లేషకుల భావన .చేంబర్ మ్యూజిక్ కు విలువైన సంగీతం అందించాడు .మొత్తం మీద ఆరు వందల కార్య క్రమాలను నిర్వ హించిన ఘనత బీతోవన్ ది. ఆయన సంగీతం ఇచ్చిన వాటిలో 32 piono sonataas ,10 violin sonatoas ,5 cello sonatas ,16 string quartets 12 wind istruments  ఉన్నాయి .
ఆయన మరణిస్తే ఇరవై వేల మంది ప్రజలు ఆయన అంతిమ యాత్ర లో పాల్గొని నివాళులు అర్పించారు .అదే అతని గురువు మొజార్ట్ అంతకు ముందెప్పుడోఅక్కడే  చని పోతే ,పట్టు మంటూ పది మంది కూడా స్మ శానానికి వెల్ల లేదట .  ఆయన మరణానంతరం 75 .వ పుట్టిన రోజున ఆయన పుట్టిన బాన్  లోవిగ్రహం  ఏర్పాటు చేశారు .జర్మని లో ఒక సంగీత విద్వామ్సుడికి ఏర్పాటు చేసిన మొదటి విగ్రహం ఇది .1880వరకు వియన్నా లో ఆయన విగ్రహం పెట్ట లేదు .బోస్టన్ లోని సింఫనీ హాల్ లో ఆయన పేరు ను బంగారు అక్ష రాలతో రాశారు బాన్ లో ఆయన పేర మ్యూజియం ఏర్పాటు చేసి గౌరవాన్నిచ్చారు .ఆయన పై ”erocia”అనే సినిమా ను ఆస్ట్రియా  ప్రభుత్వం 1949లో నిర్మించింది .ఇది cannes film festival కు వెళ్ళింది .1962లో వాల్ట్ డిస్నీ ” the magnifishient rebel ”పేర టి.వి.కి తీశాడు .1994లో” immortal beethoven  ”సినీగా వచ్చింది .2006లో బీథోవెన్ ninth symphony ఆధారంగా ”copying beethoven ”సినీమా తీసి ఆ సంగీత సార్వ భౌముడికి నివాళు లర్పించారు .”లుడ్విగ్ వాన్ బీథోవెన్ ”అంటుంటే నే ఒక రిధం ఆ మాటల్లోనే ప్రతిధ్వనిస్తుంది .పేరులోనే సంగీత పెన్నిది ని దాచుకొన్న” ముగ్గురు బీ ”లలో” బిగ్ బీ ” బీథోవెన్ .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –23-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

జన వేమన -6 సంసార యోగం —

 జన వేమన -6
                                                         సంసార యోగం —

సంసార విషయం లో వేమన తాను చెప్పిన దానికి ఎవరైనా భిన్నం గా ప్రవర్తిస్తే ఉతికి ఆరేశాడు .అక్కడ ఆడా ,మగా తేడా చూపించలేదు .తప్పు ఉంటె చాలు ఉప్పు పాతరే  వేశాడు .అంతటి క్రమ శిక్షణ జీవిత విధానం లో ఉండాలని వేమన కాన్క్షించాడు .”వెలయ భూమి తల్లి ,విత్త నంబు తండ్రి -పంట లరయ ,సుతులు ,పాడి పరము –ధర్మ మే తన పాలి దైవంబు తల పోయఅని సంసార సూత్రాన్ని ఆవిష్కరించాడు .దీనికి వ్యతి రేకం గా ప్రవర్తిస్తే సాహిస్తాడా ?స్త్రీ ల విషయం లో పురుషుల దాష్టీ కానని నిలదీశాడు .”భర్త వ.ర్త నమ్బే పడతికి గ్రాహ్యంబు -”అన్నాడు . ”ఆడది అంటే నరకం అనే భావన సరి కాదు అని చెప్పాడు .పురుషులు అంతా పుణ్యం చేత జన్మించారని ,పాపం అంత స్త్రీ రూపం అనీ భావించిన వారి కళ్ళు తెరిపించాడు .”కాంత నెల్లప్పుడు కావ లేని వాడు చావ వలయు ”అని ఆడదానికి రక్షణ నివ్వని మగాణ్ణి నిందించాడు .ఇల్లాలిని వదిలి ,పర స్త్రీ పొందు కోరే వ్యభి చారులపాటి యమ పాశమే అయ్యాడు .”పంట చేను విడిచి ,పరిగ ఏరి నట్లుంది ”అన్నాడు అలాంటి వారిని .వేశ్య డబ్బు గుంజి ,జబ్బు అంట కడుతుంది .”కొరక నేర్చిన గేదె చేపు తుందా ?”అని ప్రశ్నించాడు 
.వేశ్య మాతల దౌష్ట్యాన్ని కళ్ళకు కట్టించాడు .యవ్వనం లో ఉన్న స్త్రీ లను బజారు లో ఉంచి ,విటుల నుంచి డబ్బు గుంజి ,వారిని ”పాపర్లను ”చేసేసి ,వారితో బాటు ,వసి వాడిన తమ కూతుల్లనూ తరిమేస్తారు వేశ్య మాతలు .వాళ్లకు కావల సిందిడబ్బు ,నగా నట్రా మాత్రమె .కనుక ఇల్లాలి తోనే సుఖం పొందమని హితవు చెప్పాడు .వేశ్యల వలపు బూటకం .ఆడది అంటే అందరికీ అలుసే ,ఆశే .”వెర్రి వాని కైన ,వేష ధారి కి నైన –రోగి కైన బరమ యోగి కైన -స్త్రీ ల జూచి నపుడు చిత్తమ్ము రంజిల్లు ”అని మగ వాడి ”చిత్త కార్తే  తనాన్ని ”బయట పెట్టాడు .ఆలి వంక వారిని ఆత్మీయులు గా చూడటం ,తల్లి వంక వారిని దూరం చేయటం తండ్రి వంక వారు దాయాదులు అవటం లోక సహజ రీతి గా చెప్పాడు .మగడు ఉన్నప్పుడు ఆడది కష్ట పడితే ,కొడుకుల కాలం లో సుఖం అనుభ వీస్తుంది .కనుక ”కలిమి లేము లెందు గల వెంత వారికి –బలిమి ,పుత్ర బలమే బలిమి ”అండగా ఉంటె నిండుగా ఉన్నట్లే .”మాల పైన ప్రేమ మర్యాద కాదొకో ”అని మాత్రు ప్రేమ విలువ చెప్పాడు .”డబ్బున్నప్పుడే స్త్రీ,ధవుని మర్యాద గా చూస్తుంది .డబ్బు లేకుంటే దుబ్బు కు కొరగాని వాని గా చూడటం లోకం లో భార్య లక్షణం .”వెలయాలి వల్ల కూరిమి రాదు .వస్తే ,వదలదు .అందరు నడిచే దారిలో గడ్డి మొలవదు .”మొలిచే నేని పొదలడు ”.మొలిచినా పెరగదు .కాళ్ళ కింద నలిగి పోతుంది అని లోక సహజం గా చెప్పాడు .ఇలా ఎవ రైనా కుటుంబాన్ని వదిలి ,దారి తప్పితే .ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తమై, కష్టాల పాలు అవుతుంది అని గట్టిగా అందరికి బుద్ధి చెప్పాడు వేమన తాత .
                          వేమన దృష్టి లో స్త్రీ 
స్త్రీ కి సమాజం లో ఉన్నత స్థానం ఉంది .దాన్ని ఆమె కాపాడు కోవాలి .మంచి నడవడిక ,సంస్కారం ,సంప్రదాయం ఉన్న స్త్రీ అంటే వేమన్న గారికి గౌరవమే .అయితే ,కొంత మంది పురాణ స్త్రీలు స్వార్ధం తో ప్రవర్తించిన సందర్భం లో ,ఆయన ,వారి ప్రవర్తనను ,పద్యా లలో బంధించి ,ఆలోచించి చూడమని చెప్పాడు .అంత మాత్రం చేత ఆయన్ను స్త్రీ ద్వేషి అన లేము .”ఔరా ఆడు దాని నా బ్రహ్మ సృష్టించే -పురుషు పాలిటి పెను భూత మట్లు”అన్నాడు .అంత మాత్రాన అయన స్త్రీ ద్వేషా?శ్రీ రామ కృష్ణ పరమ హంస ”కాంతా కనకాలకు దూరం గా ఉండమని ”పదే  పదే  చెప్పే వారు .ఒక ఉత్కృష్ట స్తితి ని పొంద టానికి అదొక మార్గం .అంతా సన్యాసులు కాలేరు కదా .లోక రీతి జరగాలి .సృష్టి కార్యం సాగాలి .దీనికేమీ వ్యతి రేకతలేదు .ఆ మొహాన్ని తగ్గించు కోమనే సలహా .స్త్రీ శరీరాన్ని ”చెలగి యగ్ని జూచు శలభంబు చాడ్పున ”ఆ మహాగ్ని లో దగ్ధం కావద్దు అనే ఆయన సలహా .వివాహం ,సంసారం వద్దన లేదే .చెప్పిన మాట వినే గృహిణి ఉంటె స్వర్గం ,లేకుంటే నరకం అన్నాడు .”ఆడ బుద్ధి కంటే అపర బుద్ధి ఏది ? ”అని ప్రశ్నించాడు .ఇది స్త్రీ ని అవమానించటం అని ,ఆడవారి మనసు వేమన తెలుసు కొ లేక పోయాడని రాయసం లక్ష్మి గారు అభి ప్రాయ పడ్డారు .ఇది సరైన అభి ప్రాయం కాదని వేమన తత్త్వం తెలిసిన వారు అభి ప్రాయం చెప్పారు .”మూడు కొప్పు లున్న చోట చుక్కలు పోడుచును ”ఆన్నాడు వేమన .ఇది లోక రీతి .ముగ్గురు స్త్రీలు ఒక చోట చేరితే వారి అభి ప్రాయాలు కలవక పోట్లాడు కొంటారని అర్ధం .”కైక బుట్టి చేర్చే -కౌసల్య తనయుని -సీత పుట్టి లంక జెరచే గాదే -కౌరవులను జెరచే ద్రౌపది యును గూడ ”.అని ,రామాయణ ,మహా భారత కధల్లో ఉన్న పాత్ర ల స్వభావాన్ని చెప్పాడు .ఒక్కొక్క అవతా రానికి ఒక్కొక్క పరమార్ధం ఉంటుంది .ఆది గూధం గా ఉంటుంది .అయితే సామాన్యుల భావన వేరుగా ఉంటుంది .దీన్ని ప్రతి బిమ్బించే పద్యమే ఆది .స్త్రీలు ఉంటె తగాదాలు ఉంటాయి .వాళ్ళు లేక పోతే శోభే లేదు .రెండూ నిజమే .సందర్భాన్ని బట్టి కవి చెబుతూ ఉంటాడు .ఏదో ఒక దానికి కొమ్ము కాశాడని కాదు
స్త్రీ కి ఉన్న శక్తి సామర్ధ్యాలు వేమన కు బాగానే తెలుసు .అందుకే కుటుంబం లో స్త్రీ స్తానాన్ని ఉన్నతం గా ముందే చెప్పాడు .ఆ మార్గాన్ని దాటిన వారినే ఆయన ఎత్తి చూపించాడు .ఆమె కున్న ఓర్పు భూదేవి ఓర్పు .”ఓడు శిధిల మైన నోరుపు గల సతి -గుణము  ,పేర్మి ,బట్టి కోటి సేయు -”  అన్నప్పుడు స్త్రీ కి ఉన్న వో ర్మీకి పట్టాభి షేకం చేసి నట్లు కాదా ?”అన్య పురుష వాంచ నాడు దానికి నుండు ”అన్నాడు .ఇది అందరి స్త్రీ లకు వర్తించదు .లక్ష్మణ రేఖ దాటినవారికే .శతక కర్త లందరూ ఇలా చెప్పిన వారే యే భాష లో చెప్పినా .ఇదంతా లోక రీతి వ్యాఖ్యానమే .అందర్ని ఒకే గాడిన కట్టటం కాదు .ఎక్కడ తప్పు ఉంటె ,అక్కడ మాటల తో చెళ్ళుమణి పిస్తాడు .ఎక్కడ మంచి ఉంటె అక్కడ ప్రశంసించాడు .ఆయన అన్నిటికి అతీ తం గా ఉండి చెప్పిన హితవులే ఇవి .మనకున్న పరిమిత పరిజ్ఞానం తో ఆయన్ను ఒక వర్గానికి ద్వేషి అని ముద్ర వేయటం వివేకం అని పించు కోదు.
”యోగి వేమన నిస్సంగం గా ఉన్నప్పుడు దార్శనికుడు గా కనీ పిస్తాడు .ఆ స్తాయి లో ఉన్నా ,పూర్వ భోగాశ్రమా గతులూ ,సంగతులు మెదలి నపుడు ,లోకులు తమ కష్టాలను ఆయనతో చెప్పుకోన్నప్పుడు ,ప్రజా కవి గా ,సంస్కర్త గా ,దర్శనమిస్తాడు .ఆ సందర్భం లో జన వ్యవ హారం లోని మాటలు వాడి నప్పుడు పెడసరి ,గడసరి ,తనం కనీ పిస్తుంది .భోగ స్త్రీ ల గురించి చెప్పినపుడు ,భర్తలు చాటుగా వ్యవహారం చేసిన స్త్రీల గురించి చెప్పినపుడు అవును -వేమన్న స్త్రీ ద్వేషి గా నే కన్పిస్తాడు ”.అని ఆచార్య కసి రెడ్డి వెంకట రెడ్డి చక్కగా తీర్మానం చేసి తీర్పు ప్రకటించారు .ఇలా అర్ధం చేసుకోవాలి .కువాదాలు చేసి  మనసుల్ని గాయ పరచ రాదు .ఆ మహా మహుని ఆంతర్యాన్ని శంకించటం తగని పని ”.భార్యా భర్తల బంధం -జీవాత్మ పరమాత్మ ల బంధం .ఇతరుల కోసం జీవిస్తూ ,వారి బాధలు తీర్చే వాడే వేదాంతి .తన భార్య తో మాత్రమె దాంపత్య ధర్మం నేర వేర్చె వాడు ”సంసార యోగి ”.విషయాలను నెగాటివు లు గా చెప్పి, పాజిటివులు గా మార్చటానికి వేమన ప్రయత్నించాడు .ఒక భోగినీ ,యోగిని ల మధ్య వేమన జీవాత్మ వికశించింది .అందుకే ”నడుమ బట్ట కట్ట నగు బాటు కాదొకో ”అన గలిగాడు” అని కసి రెడ్డి కమ్మగా విశ్లేషించి చెప్పారు  . .బుద్ధి చెప్పేటప్పుడు గుద్ది చెప్పాలి అన్న సత్యం ఒంట బట్టిన వాడు వేమన .మార్గ దర్శి ,మహిత తత్వ దర్శి .
అంతే కాదు -తమాషా ఏమిటంటే -యే పద్యం వేమనది / ఏది కాదు ?అని తీర్మా నిన్చటానికి వీలు లేని స్తితి లో ఆయన పద్యాలున్నాయి .అందులో ప్రక్షిప్తాలు ఎన్నో కలిసి పోయాయి .”ప్రపంచం లో ఏదైనా సామెత చెప్పాలంటే ,వేమన్న దగ్గరకే పోవాలి మనం ”.”ఆట వెలది వలచి అడుగంటే వేమన -ఆట వెలది వలచి ఆయే ఘనుడు -వెలది వెలది లోన కలదురా భేద మ్ము”అని ఆయనే తన నిజ స్వరూపాన్ని ,ఆయన భావాలంత దిగంబరం గా ఆవిష్కరించుకొన్నాడు .దేన్నీ దాచలేదు .మగ వాని ఉత్థానాని కైనా ,పతనాని కైనా ఆడదే కారణం అని పురాణాలు ,లోక రీతి ఘంటా పధం గా చెబుతున్నాయి .పైకి పాకితే ఆమె గొప్ప తనాన్ని కీర్తిస్తాం .దిగ జారితే ఆమె కారణం అని నిందిస్తాం ”ఎంత రాసినా ,ఎంత ఎదురు తిరిగినా వేమన మిత వాదే .తీవ్ర వాది కాదు .దిగంబరుడే కాని ,దిగంబర వాది కాదు .కొన్ని సాహిత్య మర్యాదలను పాటించాడు .ప్రాపంచిక విలువల వలువల్ని కాపాడటమే పరమ లక్శ్యం గా పెట్టు కొన్నాడు .”అని గన్ను కృష్ణ మూర్తి పెన్ను సాక్షి గా ”గన్  షాట్ ” గా చెప్పి కళ్ళు తెరి పించాడు .ఆ నాడే కాదు ఈ నాడూ నవ నాగర కత లో ఉన్నామని మురిసి పోతున్న మనం ఆడవాళ్ళ కు సమాన న్యాయం ఇస్తున్నామా ?సమాన హోదా వస్తోందా ?క్లబ్బులు, పబ్బులు ,రెడ్ ఏరియాలు ఎంత వద్దన్నా పెరిగి పోవటం లేదా ?స్త్రీ విశ్రుం ఖలంగా  ప్రవర్తించటం  టి.వి.లలో ,ప్రసార మాధ్య మాలలో జుగుప్స కల్గించటం లేదా ?దాన్ని ఖండిస్తూనే ఉన్నాం కదా .కల్పనా చావ్లా చేసిన సాహసాన్ని కీర్తిస్తున్నాం .సేరినీ విలియమ్సు వ్యోమ గానాన్ని స్వాగతిస్తూనే ఉన్నాం .ప్రపంచం మొత్తం మీద స్త్రీలు చేసే ప్రతి గొప్ప పనినీ శ్లాఘిస్తూనే ఉన్నాం .మహిళా ప్రధానులు మహిళా ముఖ్య మంత్రులు మహిళా రాష్ట్ర పతి ఉన్న దేశం మనది .మహిళాభ్యున్నతికి పాటు పడిన వారందరికీ జేజేలు చెబుతూనే ఉన్నాం .వారికి చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించ మని ఒత్టిడితెస్తూనే ఉన్నాం .వారిలో నైనా, మగ వారి లో నైనా లోపాలు కన్పిస్తే సవరించు కోమని చెబుతూనే ఉన్నాం .సమ సమాజ జన జీవనాన్ని అందరం కోరు కొంటూనే ఉన్నాం .మహిళామ తల్లుల్లారా వేమన్న స్త్రీ ద్వేషి కాదని మళ్ళీమళ్ళీ  విన్న విస్తున్నాం .
మ్సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-8-12- కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

బీథోవెన్ నాటికి యూరప్ పరిస్థితులు

  బీథోవెన్ నాటికి యూరప్ పరిస్థితులు 
జెర్మని, ఆస్ట్రియా దేశాలు సంగీతానికి ప్రసిద్ధి చెందితే ,ఫ్రాన్సు ఇటలీలు చిత్ర లేఖనానికి ,శిల్ప కళకు ప్రాచుర్యం పొందాయి .ఇంగ్లాండు దేశం సాహిత్యం లో అద్వితీయం గా ఉంది .haydn ,mozart ,beethoven లు ప్రపంచ ప్రసిద్ధి సాధించిన కంపోసర్లు .వీరి లో వరుసగా ,ఒకరి తర్వాత ఇంకొకరరు ,50 ఏళ్ళ కాల దూరం లో జన్మించారు .అందరు ఆస్త్రియా  లోని వియన్నా నగరం చుట్త్తు ప్రక్కల ఉండే జీవించారు ,సాధించారు ,పేరెన్నిక గన్నారు .అయితే వారి జీవితాలు ,విధానాలు విభిన్నాలే .ఆ కాలం లో జరుగు తున్న సామాజిక మార్పు లకు వారు ముగ్గురు ప్రతి నిధులై వ్యవహరించారు .ఈ ముగ్గురు సంగీత విద్వాంసు లు ,18 వ శతాబ్దం గడిచి 19 వ శతాబ్దం ప్రవేశించిన తరుణం లో ఉండటం విశేషం .
ఈ ముగ్గురు విద్వాంసులలో ”హేడన్ ”ఎక్కువ కాలం జీవించాడు .వీరిలో పెద్ద వాడు ,ముందు కాలం వాడు .హాయిగా జీవించాడు .పాత రాజ్యా లకు చెందిన పోషకులు ఉన్న కాలం లో ఉన్నాడు కనుక జీవనానికి ఇబ్బంది పడ లేదు .prince Ester hazy కాలం లో ఆస్థాన సంగీత విద్వాంసుడి హోదా లో ఉన్నాడు .గౌరవ సేవకుడు- ఒక రకం గా చెప్పా లంటే .రాజు గారికి ఇష్ట మైన వే పాడాలి ,రాయాలి ,వాయించాలి .ఆది యే రాజు కొలువు లో నైనా సాధారణమే .అయితే ప్రిన్స్ ఈయనకు ఎక్కువ స్వేచ్చ నే ఇచ్చాడు .అంతే గాక యువ రాజు మంచి అభి రుచి ఉన్న పోషకుడు .అలాంటి వాడి కొలువు లో ఉండటం హేడన్ అదృష్టం ..రాజ వంశీకుల అభి నందనాలు పుష్కలం గా అందుకొన్నాడు .స్తిర మైన ఉద్యోగం తో సంతృప్తి కర జీవితాన్ని గడిపిన అదృష్ట వంతుడు హేడన్ .
మొజార్ట్ అనే విద్వాంసుడు హేడన్ కన్నా24 ఏళ్ళ చిన్న వాడు .హేడెన్ లా నే జీవించాడు దాదాపు .arch bishap of salz burg కొలువు లో ఉన్నాడు .ఆయన పెట్టె నిబంధనలు వ్యతి రికి .స్వేచ్చ కావాలని కోరాడు .సర్వ స్వతంత్రం గా స్వేచ్చగా జీవించాడు .”ఫ్రీలాన్స్ సంగీత కారుడు ”అని పించుకొన్నాడు .బాల మేధావి గా విపరీత మైన క్రేజ్ పొందాడు ఆరేల్లకే సంగీత దిగ్గజాలను వణి కించాడు .స్వర కల్పనా చేశాడు .వియన్నా కు మకుటం లేని మహా విద్వామ్సుడైనాడు .బీథోవెన్ ఈయన దగ్గర రెండు వారాలు శిష్యరికం చేశాడు కూడా .చిన్న తనం లో ఉన్న కీర్తి, డబ్బు క్రమంగా వయసు వచ్చే సరికి తగ్గి పోయాయి .ఒక రకం గా గర్విష్టి అని పించుకొన్నాడు విశిష్ట లక్షణాలున్న వారికి మన వాళ్ళందరూ తగిలించే తోక అదే .1780 కాలం లో ఆస్ట్రియా సమాజం లో డబ్బు అంతా అరిస్తోక్రాట్ ల చేతుల్లోనే ఉండేది .వాళ్ళ దయా ధర్మమే కళా కారులకు శ్రీ రామ రక్ష.సామాన్య ప్రజా డబ్బుల్లేక విల విల లాడి పోయే వారు .మేధావి అని గొప్ప పేరు తెచ్చుకొన్నా, మొజార్ట్ ఆర్హిక ఇబ్బందులకు గురి అయాడు .మిగిలిన సంగీత కారుల అసూయ కు బలి కూడా అయాడు” by his own refusal to play the part of the humble cringing courtier ” అని ఆయన్ను గురించి చరిత్ర కారులు రాశారు .ఎంతటి సంపన్నుడి నైనా, ఎదిరించే తత్త్వం ఆయనది .
లుడ్విగ్ వాన్ బీథోవెన్ యువకుడు అయిన తర్వాత1790 లో పరిస్తితులు విపరీతం గా,వేగం గా  మారి పోయాయి .1770లో ఆయన పుట్టి నప్పుడు ,ఫ్రాన్సు దేశ రాజు వారసుడు ,15ఏళ్ళ dauphin louis అయాడు .ఆస్స్త్రియా  సామ్రాజ్ఞి  కుమార్తె  13ఏళ్ళ ”మేరీ ఆన్తనేట్ ”తో అతని వివాహం జరిగింది .యూరప్ లోని రెండు బలీయ మైన రాదేశాలరాజ వంశాల  మధ్య వివాహం .అందరికి గొప్ప ఆనందం కల్గించింది .వివాహ వేడుకలు ,విందులు ,వినోదాలుసంబరాలతో అంబరాన్ని అంటింది సంతోషం .సామాన్యులు కూడా తమ ఇంట్లోనే ఆ పెళ్లి జరిగి నంత సంబర పడ్డారు .23ఏళ్ళ తర్వాతయూరప్ లో  ఈ పరిస్తితి అంతా మారి పోయింది  విప్లవ యుగం ప్రారంభ మైంది .మధ్య తరగతి ప్రజలు, కూలీ జనం రాజు ను ఏది రించారు .మొదట రాజు ,ఆ తర్వాతారాణి  ఫ్రాన్సు విప్లవం లోguillotine కు బలిఅయి  చని పోయారు .ఆ తర్వాతా విప్లవం కూడా అదుపు తప్పింది .టెర్రర్ కొంత కాలం రాజ్య మేలింది .వేలాది సామాన్యుల,అరిస్తోక్రాట్ ల తలలు గుల్లషీన్ మెషీన్ కు బలి అయాయి .ఇది సహించని ఆస్ట్రియా దేశం ఫ్రాన్సు పై యుద్ధం ప్రకటించింది . 
ఈగందర గోళం లో ఫ్రెంచి సేనాని నెపోలియన్ బోన పార్టే ఒక కొత్త సమాజ నిర్మాణానికి పూ ను కొన్నాడు .సమాన అవకాశాలను ప్రజ లందరికి కల్పించాడు .తర్వాతఅతని అత్యాశ కొంప ముంచింది .ఆ తర్వాతా ఇరవై ఏళ్ళ కు యూరప్ అంతా యుద్ధాల్లో మునిగి తేలింది .నెపోలియన్ కు ప్రపంచ విజేత కావాలనే దురాశ పెరిగింది .1815లో వాటర్లూ లో wellington అనే సేనాని ఓడించి మళ్ళీ స్వేచ్చా వాయువులు పీల్చే టట్లు చేశాడు .liberty ,equality ,freternity అనేది దివ్య మంత్రం అయింది .ప్రపంచం అంతా ఈ భావాలు వ్యాపించాయి .కొత్త శతాబ్దం లో సమూల మైన మార్పులు రావాలని ప్రజలందరూ ఆశించారు .tom paine రాసిన declaration -the right of man ( manifesto of the french revolution )పుస్తకం గొప్ప ప్రభావాన్ని కలిగించింది .johann wolfong von gothe అనే జర్మన్ దార్శనికుడు రచయిత,కవి ”the sorrows of the young werther  ”నవల  గొప్ప ప్రభావం చూపించింది .ఇందులో ఒక యువకుడు సున్నిత మనస్కుడు ,ఒక వివాహిత యువతీ పై వ్యామోహం పెంచుకొన్నాడు .ఆ తర్వాత ఆది భావ్యం కాదు అని భావించి ,ఆత్మ  హత్య చేసు కొంటాడు .ఇవాల్టి సమాజం లో ఆది విడ్డూరం గా నే అని పిస్తుంది .1700లో దాని ప్రభావం విప రీతం .ఆ కాలం  లో యువకులు ”werther ” డ్రెస్ ను ధరించే వారు .ఆడ వాళ్ళు ఆ నాటకం చూసి ఎడ్చేసే వాళ్ళు .అప్పటి నుంచి ఆత్మా హత్య ఒక ఫాషన్ అయింది .ఆ కధ పై ఒపెరాలు ,నాటకాలు ,కవితలు విప రీతంగా వచ్చాయి .గోతె గారి ఈ రచన తోనే” romantic age ”ప్రారంభమైంది .అప్పటి నుంచే వ్యక్తీ భావాలు ,ఆలోచనలు ఫీలింగ్సూ ,అతని సాంఘిక స్తాయి కంటే ,విలువైనవి గా భావించటం జరిగింది .ఇవి బీథోవెన్జీవితం , లో ,అతని సంగీతం లో ప్రతిధ్వ నించాయి ”.werther” గోథేగారి మొదటి నవల .బీథోవెన్ కు గోథే ఆరాధనీయుడైనాడు .1823లో ఒక ఉత్తరం రాస్తూ ,గోథే పై ప్రేమ ,గౌరవం ఆరాధనలను వర్షించాడు, బీథోవెన్ సంగీత విద్వాంసుడు .
బీథోవెన్ పుట్టుక నాటికి ప్రపంచం ఏమీ పెద్ద గా మారలేదు .ఆ వందేళ్ళ లో జీవన స్తితులు అంతే అధ్వాన్నం గా ఉన్నాయి .అప్పటికీ గుర్రమే ప్రయాణ సాధనం .56ఏళ్ళ తర్వాతా రాజకీయ ,ఆర్ధిక ,సామాజిక ,పారిశ్రామిక మార్పులు అతి వేగం గా విప రీతం గా చోటు చేసుకొన్నాయి .ప్రజల జీవితాలలో వెలుగు చోటు చేసుకొన్నది .అసమర్ధ రాజుల అధికారాలకు మంగళం పాడారు .కొవ్వొత్తుల స్తానం లో గాస్ దీపాలు వచ్చాయి .కొత్త రిపబ్లిక్కులు ఏర్పడ్డాయి .విద్యుత్తు వచ్చింది .స్టీం బండ్లు వచ్చాయి .అట్లాంటిక్ సముద్రం లో మొదటి స్టీం షిప్ ప్రయాణించింది .హేడెన్ ,మోజార్టు ల కు రాజ కీయా లపై మోజు లేదు .కాని బీథోవెన్ కు రాజ కీయాలు ఇష్టం .వ్యక్తీ స్వాతంత్రం కోసం పోరాడాడు .ఉన్న వ్యవస్థ లోనే జీవించాడు .విప్లవ యుగం లో గడిపిన అనుభవం ఆయనది .అందుకే బీథోవెన్ సంగీతం లో ఆ నాటి passion,పోరాటం ,కస్టాలు ,ఎదురు సవాళ్లు కన్పిస్తాయి ..విన్పిస్తాయి .భౌతిక ఆధ్యాత్మిక ,దాహం ,తృప్తి ,అతని సంగీతం లో ప్రతిధ్వనిస్తుంది .బీథోవెన్ ది ”quest for personal and spiritual fulfilment ”.జర్మనిసంగీతానికి  కి చెందిన ముగ్గురు ”బిగ్ బి ”లు ఉన్నారు .వారే–johan sebastian bach( 1665-1750 ),johannes brahms (1833-1897 ),ludwig van beethoven (1770 -1827 ) ఈ ముగ్గు రిని” జర్మని సంగీత త్రయం ”అని గౌర వంగా పిలుద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged , , | Leave a comment

అమెరికా ఊసులు –15 మేధావి ప్రెసిడెంట్ మాడిసన్

  అమెరికా ఊసులు –15
                                     మేధావి ప్రెసిడెంట్ మాడిసన్ 

అమెరికా ఫౌండర్ ఫాదర్స్ లో ఒకరి డిక్లరేషన్ తయారీ లో ,రాజ్యాంగం తయారు చేయటం లో ముఖ్య పాత్ర వహిస్తూ ,అగ్ర నాయకుల మధ్య తీవ్ర భేదాలు వచ్చి నప్పుడు చాక చక్యం గా వారి తో చర్చలు జరిపి ,బాల్యా వస్త లో ఉన్న అమెరికా ప్రజా స్వామ్యానికి కాపు కాస్తూ వరుస క్రమం లో అమెరికా అధ్యక్షస్థానం అధిష్టించి ,”పొట్టి వాడైనా గట్టి వాడు” అని పించుకొని ,తన మాటకు అత్యంత విలువ ను సంత రించు కొన్న వారు అమెరికా నాల్గవ ప్రెసిడెంట్ జేమేస్ మాడిసన్ .ఎనభై అయిదేళ్ళు నిండు జీవితాన్ని అనుభ వించి ,చివరి దశ లో నరాల బల హీనత  (రుమేటిజం )తో మంచం లోంచి లేచే పరిస్తితి లేకుండా జీవితాన్ని ముగించిన వర్జీనియా వ్యవ సాయ దారుడు మాడిసన్ .
మాజీ ప్రెసిడెంట్ జెఫర్సన్ కు అత్యంత ఆత్మీయుడై ,ఆయన తర్వాత గద్దె నేక్కాడు .జెఫర్సన్ చేత ”ప్రపంచం లోనే గొప్ప వ్యవ సాయ దారుడు ”(the best farmer in the world ‘)అని పించుకొన్న రైతు బిడ్డ .నలభై ఏడవ ఏట తన కన్నా ఇరవై రెండేళ్ళ తక్కువ వయసున్న ”డాలీ ”అనే ఒక పిల్లాడికి తల్లి విధవ రాలు అయిన ఆమె ను వివాహం చేసుకొన్నాడు .ఈ జంట కు పిల్ల లు కలగా లేదు .ఆమె కొడుకే వీరి సంతానం .అతడు డబ్బు విపరీతం గా ఖర్చు చేసి ఈయన్ని చివరి దశ లో ఇబ్బందుల పాలు చేశాడు .మాడిసన్ గారు రెండు సార్లు అధ్యక్షులై పదవిని వదిలారు .స్వగ్రామం చేరి వ్యవ సాయం చేశారు .అప్పటికే ఆయనకు5000  ఎకరాల భూమి ఉంది .స్థానిక వ్యవ సాయ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నికయాడు .చివరికి వ్యవ సాయం గిట్టక ,గిట్టు బాటు ధర లభించక కొంత నష్ట పోయారు .సైంటిఫిక్ పద్ధతి లో వ్యవ సాయం చేసే వాడు .
తాను రాసిన విషయాలన్నీ భవిష్యత్ తరాలకు ఉప యోగా పడ తాయని ఆయన జాగ్రత్త చేశాడు .ఆయన మరణించిన తర్వాత జాన్ క్విన్సీ ఆడమ్స్ అనే మాజీ ప్రెసిడెంట్ ”maadison ‘s small voice still echoed through the country ”అని శ్రద్ధాంజలి ఘటించాడు .ఆయనకు వన్డ మంది బానిసలుందే వారు .వారిని పదవి దిగి పోగానే వదిలేశాడు .1814మళ్ళీ బ్రిటీష సైన్యం దాడి చేస్తే వారి మీద యుద్ధాన్ని ప్రకటించి ,గెలుపు సాధించి ”హీరో ”అని పించుకొన్న ధీరుడు ప్రెసిడెంట్ మాడిసన్ .
మాడిసన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బ్రిటీష వారు వాషింగ్ టన్ప  ట్టణం మీద విరుచుకు పడి భస్మీ పటలం చేశారు .అధ్యక్ష భవనాన్ని తగల బెట్టారు .విపరీతమైన వర్షం పడి అగ్ని చల్లారింది కాని ఎంతో ఘోరం జరిగి పోయేది .అప్పుడు వైట్ హౌస్ అనే పేరు లేదు .అధ్యక్ష భవనం అనే అనే వారు .పోస్టాఫీసు ,పేటెంటు ఆఫీసులను మీటింగు ల కోసం తాత్కాలికం గా వాడుకొన్నారు .మొదటి సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దేశ పరిస్తితులను చూసి వణుకు వచ్చింది .క్రమంగా మామూలు మనిషి అయాడు .
మాడిసన్ ఎప్పుడు నల్ల సూటు ధరించే వాడు .జెఫర్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన పదవి లోకి రాక ముందే జెఫర్సన్ భార్య మరణించింది .అందుకని అధ్యక్షుని ఇంట్లో విందులు వగైరా కార్య క్రమాలను సెక్రెటరి ఆఫ్ స్టేట్ అయిన మాడిసన్ భార్య డాలీ యే నిర్వ హించేది .మాడిసన్ నెపోలియన్ తో మంతనాలు జరిపి లూసియానా ప్రాంతాన్ని15 మిలియన్ డాలర్లిచ్చి అమెరికా లో కలిపే ఒప్పందాన్ని సాధించాడు  .యే రాజ కీయ పార్టీ వారైనా మాడిసన్ అంటే గౌరవం చూపే వారు ”though maadison ‘s short height made fun ,they could not challenge his advice or intellect ”
జార్జి వాషింగ్ టన్ రెం డో సారి ప్రెసిడెంట్ గా ఉండటానికి ఇష్ట పడ లేదు .వీడ్కోలు సందేశం రాసివ్వ మని మాడిసన్ ను కోరాడు .ఈయన వద్దన్నాడు మళ్ళీ ఆయనే ఉండి తీరాలి అని చెప్పాడు .బాలా రిష్టాలతో ఉన్న ప్రజా స్వామ్యాన్ని ఇప్పుడు అర్ధాంత రమ్ గా వది లేసి వెళ్ళద్దు అన్నాడు .చివరికి మాడిసన్ మాటే నెగ్గి రెండో సారి ప్రెసిడెంట్ అవటానికి ఒప్పుకున్నాడు ఆయన మొదటి స్పీచ్ నూ మాదిసనే రాశాడు . .వీళ్ళిద్దరూ తరచుగా కలిసి పొలిటికల్ ఫిలాసఫీ మాట్లాడు కొనే వారు .మాడిసన్ సూచించిన అనేక రాజ్యాంగ సవరణలు తర్వాత బిల్ ఆఫ్ రైట్స్ అయాయి .ఆయన భావనలన్నీ ఆ కాలా ని కంటే ముందున్నాయని అందరి అభి ప్రాయం .అందుకే ఆయన్ను ;;రాడికల్ ”అన్నారు .ఒక రకం గా ఆయన అమెరికా దార్శనికుడు .ప్రభుత్వ విధానాలను ప్రజల కు తెలియ జెప్ప టానికి ”national gazette ”ను ఏర్పాటు చేయించాడు 
మాడిసన్ బానిసత్వానికి వ్యతి రేకి .వోటు హక్కు ఎవరికి ఉండాలి అని సమస్య వచ్చింది మొదటి ఎన్నికల నాటికి .కనీసం యాభై వేల డాలర్ల ఆస్తి లేక డబ్బు ఉన్న వారికే ఓటు హక్కు ఉండాలని కొందరు వాదించారు .ఒక్కొక్క పోస్ట్ కు ఒక్కో విలువ కట్టారు .ఇవన్నీ విన్న మాడిసన్ తన భావాలను విస్పష్టం గా చెప్పాడు .”మనది ప్రజాస్వామ్యం .అరిస్టాక్రసి కాదు .ఇక్కడ సంపన్నులు కాదు ప్రభుత్వాన్ని నడి పేది”అని చెప్పి ”america must be governed by all ,rich and poor ”అని స్పష్టం గా తెలియ జేశాడు .బానిసలను ఎలా లెక్కించాలి అనే సందేహం వచ్చింది .వాళ్ళు ఆస్తి మాత్రమె కాని ,పౌరులు కాదన్నారు .అయినా వాళ్ళు ఎందరున్నారో లెక్క తెలియాలి కదా .అందుకని”to count  a slave  as three fifths of a person when basing representation on population ”అని రాజీ పడ్డారు .
మాడిసన్ చిన్నప్పుడే కవిత్వం రాశాడు .సరదా కవిత్వం ఆది బ్రిటీష దేశం లోని విగ్గులు ,టోరీల మీద కవిత చెప్పాడు విగ్గులు లిబరల్సు గా టోరీలు బాగా కన్సర్వేటివేస్ గా ప్రసిద్ధులు –”come noble whigs ,disdain these sons –of screech owls ,monkeys ,and baboons –keeep up your minds to humourous themes ”అని ఉతికే శాడు .ఈయనను చిన్నప్పుడు ”జేమ్మీ ”అని పిలిచే వారు .
మాడిసన్ 1751 మార్చి పద హారన వర్జీనియా లో పుట్టాడు న్యు జెర్సి కాలేజి అనే ప్రిన్ స్టన్కాలేజి లో చది వాడు .వర్జీనియా జెనెరల్ అసెంబ్లీ ,లో సభ్యుడయాడు .ఫిల దడేల్ఫియా లో కాంటి నేన్తల్ కాంగ్రెస్ లో .1780లో చేరాడు .రాజ్యాంగాన్ని తయారు చేశాడు దీనినే ”వర్జీనియా ప్లాన్ ”అంటారు .హామిల్టన్ తో కలిసి ”ఫెడరలిస్ట్ పేపర్స్ రాశాడు.1789 లో కాంగ్రెస్ సభ్యుడు అయాడు .జెఫర్సన్ ఎన్నిక కావటానికి సహాయ పడ్డాడు .ప్రెసిడెంట్ మాడిసన్ ను సెక్రెటరి ఆఫ్ స్టేట్ ను చేశాడు .1808లో మొదటి సారి అమెరికా అధ్యక్షుదయాడు మాడిసన్ .నాలుగేళ్ల తర్వాతా రెండో సారి ఎన్నిక అయాడు .1815లో బ్రిటన్ తో శాంతి ఒప్పందం చేసుకొన్నాడు .పదవీ విరమణ తర్వాత వర్జీనియా యూని వేర్సిటి”రెక్టార్ ”గా పని చేశాడు .1836జూన్ ఇరవై ఎనిమిది న మేధావి ప్రెసిడెంట్ మాడిసన్ మరణించాడు .వాక్ స్వాతంత్రం ,మత స్వాతంత్రం ప్రతి వారికి కావాలని కోరుకున్న స్వాతంత్ర ప్రియుడు మాడిసన్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

జన వేమన –5 విశ్వ కుటుంబి

జన వేమన –5 విశ్వ కుటుంబి 
తాను చూసిన ప్రతి విషయాన్ని ప్రజలకు అనుభవం లోకి తేవటం కవి చేసే పని .దీనికి మంచి భావనా శక్తి ,పదు నైన పదశక్తి తోడైతే ,రాసేదంతా బంగారమే .ఆ రెండు శక్తులు వేమన లోపుష్కలం .  విపరీత మైన లోక పరిశీలన తో లోకాన్ని కాచి వడ పోశాడు .అనుభవ సారం సామ్ద్రం గా ఉంది .తత్వ జిజ్ఞాస ఆయన లో వేళ్ళూను కొని ఉంది .దార్శనికత దారి చూపింది .ప్రతి దాన్ని విచారించి తెలుసు కొనే విచక్షణత ఉంది .విజ్ఞానం విపులం గా ఉండనే ఉంది .ఈ మూడు లక్షణాలు వేమన లో త్రివేణీ సంగమం లా చేరాయి .అందుకే ,ఆయన మాట్లాడిన ప్రతి మాటా పవిత్ర మైంది .చైతన్య వంత మైన ఆలోచన ఉంది .”దార్శనికులు ప్రపంచాన్ని వ్యాఖ్యా నిస్తారని ,ప్రవక్తలు మాత్రమె ప్రపంచాన్ని మార్చ టానికి ప్రయత్నిస్తారని ,వేమన అభ్యుదయ ప్రవక్త ”అని ఆరుద్ర కితాబిచ్చారు .
వేమన సిద్ధాంతం ”సంసార యోగం ”ఇది ఉంటె స్వర్గం కూడా అక్కర్లేదన్నాడు .ఆ యోగాన్ని బాగా ప్రచారం చేశాడు .ఇన్ని విషయాల పై సాధి కారం గా మాట్లాడిన వేమన, యే విద్య నేర్చాడు ? అని మనకు సందేహం వస్తుంది .వేమన కు పుస్తక జ్ఞానం లేదు అని కట్ట మంచి రామ లింగా రెడ్డి గారు అంటే ,వేమన రామాయణ ,భారతాలు ,బసవ పురాణం ,శివ పురాణం పుక్కిలి పట్టాడని మాన్యులు రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు అన్నారు .శ్రుత పాండిత్యం ఎక్కువ ,ఉప నిషత్తులు చదివి ఉండచ్చు అన్నారు వావిళ్ళ రామ శాస్త్రి .ఆరుద్ర మాత్రం -యోగం ,తంత్రం ,ఉపనిషత్తులు గుప్త విద్యలు ,వేమన కు కరతలా మలకం అని స్పష్టం చేశారు .కవి చౌడప్ప ”వానకు తదియని వాడును -పూనిక వేమన్న చేత బోరయని వాడున్ –నానా దిక్కుల వెదకిన కానమురా –కుంద వరపు కవి చౌడప్పా ”అని మెచ్చాడు .
”విశ్వదాభి రామ వినుర వేమ ”అనే మకుటం చాలా ప్రాధాన్యత సంత రించు కొన్నది .విశ్వం అంటే సకల ప్రపంచం అని వేమన భావన .తాను చెప్పేది ,విప్పేది ,బోధించేది ,నీతులు నేర్పేది ”అభి రామం ”గా అంటే మనసుకు ఆహ్లాదాన్నిచ్చి మనోహరం గా ఉంటూ ,కర్ణ పెయమై ,”దా ”అంటే ఇచ్చేవాడిని గా తనను తాను వేమన్న భావించు కొన్నాడు .అంటే -”ప్రపంచ ప్రజలకు ,ఆదర్శ వంతం ,నీతి మంతం ,అయిన మాటలను మనోహరం గా హృదయాలను తాకే టట్లు ,విన టానికి ఇంపు గా అందించే కవి గా ,అనగా ”ప్రజా కవి ”గా తనను భావించు కొన్నాడు .అందుకే” జన వేమన” అయ్యాడు .అయితే ఎవరికి చెప్పినా ,ఆ చెవిన విని ఈ చెవిన వది లేయటం లోక సహజం .అందుకే ఎవరికో ఎందుకు -తనకు తానే చెప్పు కొంటున్నట్లు ”వినుర వేమా ”అను కొన్నాడు .తానే గురువు ,తానే శిష్యుడు .ఆత్మ బోధకం గా ,ముక్త కాలుగా చెప్పిన” పద్య మౌక్తికాలు” ఇవి .
”ఆట వెలది ”ఆయన్ను సన్యాసాశ్ర మం లోను వెంటాడుతూనే ఉంది .ఆ ప్రభావం గాధం అవటం తో పద్య ఛందస్సూ ”ఆటవెలది ”యే అయింది .మురిపించింది .జనాన్ని మరపించింది .స్వాధీన పతిక అయింది .తెలుగు వారికి ప్రీతీ పాత్రమూ అయింది .అందుకే వేమన గారిని ”విశ్వ కుటుంబి ”అని ఆరుద్ర అనటం సహజం, శోభస్కరం ,ఉచితం అయింది .వేమన తన జీవిత గతి నే మార్చు కొన్నాడు .సంస్కారం సాధించాడు .ఆత్మ సంస్కార శోభితుడూ అయాడు .అందుకే ఆయన మాట కు అంత పదును .భావానికి అంత నిగ్గు .ఆయన పద సంపద కు అంతటి ఆదరణ ,అభిమానం .”లోకాభి రామం వేమన పద్యాలు ”.
 వేమన గారి” సంసార యోగం” 
”తన దేశ కాల పరిస్తితుల వల్లా ,తన తనువు లో పుట్టిన తత్త్వం వల్లా ,వేమన గారు ఎన్నో ఆచారాలు వ్యవహారాలూ ,కర్మ కండలు ధర్మ శాస్త్రాలు చూసి ,కాచి వడ పోసి ఒక సిద్ధాంతానికి వచ్చారు .దాన్నే ”సంసార యోగం ”అన్నారు దానినే పని కట్టు కొని ప్రచారం చేశారు .ఇది ఉంటె స్వర్గం అక్కరలేదన్నారు వేమన ”అని ఆరుద్ర వేమన ను కాచి వడ పోసి చెప్పారు .ఆ వివరణ లోకి వెళ్లి చూద్దాం .”సుగుణ వంతు రాలు సుదతి యై యుండిన -బుద్ధి మంతు లగుచు పుత్రు లొప్ప” –అన్నాడు .”స్వర్గాదపి గరీయసి” అన్న మాట .సమాజం లోని వైరుధ్యాలను సమన్వయము చేసుకోవాలి .జ్ఞానం యొక్క పూర్వా పరాలను ఆకలింపు చేసుకోవాలి .ఆహార ,ఆచార వ్యవహార విషయాలల్ లోని మూల తత్వాలను తెలుసు కొని ,బ్రతికి నపుడే ”గృహస్తు ”అన్న పేరు సార్ధకమవుతుంది .”ఇంటికి దీపం ఇల్లాలే ”.ఆమె మాటల్లో మాధుర్యపు ఊటలుంటాయి .”పసిడి కన్నా మిగుల పడతి మాటలు తీపి ”అన్నాడు అందుకనే .తల్లి ,తండ్రి లతో అక్క ,అన్నా సమానం .వాళ్ళను ఎదిరించటం పాపం .తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలే .వారిని గౌరవిన్చాటమే ”దేవతార్చన ”.”తల్లి దండ్రి కంటే వేరు దైవంబు లేదయా ”అన్నాడు .కుటుంబం చల్లగా ,చక్కగా సాగాలి అంటే అందరు శ్రమించాలి .తలిదండ్రుల పై ఆధార పడటం మంచిది కాదు .”శ్రమ ఎవ జయతే ”అన్నది పాటించాలి .
”చెమట కారు నట్లు శ్రమ చేసి దేహంబు -గడన చేసి కూడు గుడువ వలయు -తల్లి దండ్రి సొమ్ము దా దింటగా రాదు ” అని సుతి మెత్త గా చెప్పాడు .”కులం లో ఒకడు గుణ వంతుడు ఉన్నా ,వాడి వల్ల కులం వెలిగి పోతుంది ”.”తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుడు పుట్టినా ,గిట్టినా ఒకటే ”.అలాంటి వారు పుట్ట లో ఉన్న చెద పురుగుల వంటి వారు .సమాజం లో ఇలాంటి చెద పురుగులు చేరితే సమాజ వృక్షా నికే ప్రమాదం .వాటిని ఎదగ నీయ రాదు .”అమ్మనూ ,ఆలిని సమానం గా చూడాలి ”అలా చూసిన వాడే నేర్పరి .భార్యా భర్తలు పోర పోచ్చాలు లేకుండా ఒకే మాట తో జీవిస్తే సంసారం స్వర్గం అవుతుంది .ఆలు మగని మాటకు మాటి మాటికీ అడ్డం వస్తే ఆమె ”మారగాలు ”అవుతుందని ,అలాంటి దాన్ని వదిలించుకోవటం క్షేమం అనీ చెప్పాడు .సంసార రధానికి భార్యా భర్తలు రెండు చక్రాలు ,రెండు గుర్రాలు .ఒకరు ఏటి కీడిస్తే ఇంకోరు కోటికీడ్చ రాదు .అని గుర్తు చేశాడు .సంసారం కోసం కష్ట పడే యజ మానికి తోడు ఎవరు ఉండరు .బ్రహ్మ లోకమే తోడు .అలానే సతికి సుతుని వల్ల సౌఖ్యం కలుగు తున్దన్నాడు .తండ్రి కంటే కొడుకు గుణ వంతు డైతే చిన్న వాడైనా కొడుకు నే గౌర వించాలి .మత్సరం ,మదం ,మమకారాలు అనే వ్యసనాలను వదిలి ,పరోప కారం చేస్తే వాడే ”రాజ యోగి” .”అధిక సంతానం అనర్ధ దాయకం ”అని ఆ నాడే వేమన చెప్పాడు .”పందిలా పిల్లల్ని కన వద్దు ”అని హితవు చెప్పాడు .”ఏనుగు ఒక్క పిల్ల నే కంటుంది ”అదే ఆదర్శం అన్నాడు .ఇద్దరు కూడా ఒద్దు .ఒక్కరే ముద్దు అన్నాడు .
”పతి యొప్పిన ,సతి యొప్పును –పతి సతు లోక టైన పరమ పావన మందున్ –సతి పతి న్యాయమే మోక్షం –బతు లిత పరమాత్మ యైక్య మగురా వేమా ”అని సతీ ,పతి ఐక మత్యమే సంసారం సుఖ సారం అని ఆ మాధుర్యాన్ని విడమరచి చెప్పాడు .ఇంకొంచెం ముందుకు వెళ్లి ”సతి యందె పతి పుట్టే –పతియు సతి యందె పుట్టే పరమార్ధముగా –సతి పతు లనగా నెవ్వరు –మతి లో దల పోసి చూడు మహిలో వేమా ”అనే పరమ వేదాంత సత్యాన్ని వివ రించాడు .వేదాంత గురువు అయాడు .ఆడది చేసే తప్పు మగ వాడికి చెందు తుంది .పతి చేసే మంచి సతికి సగం చెందు తుంది .పతి చేసే తప్పు సతికి ఎందుకు రాదు అని ప్రశ్నిస్తాడు .ఈ రకం గా మంచి అవగాహన తో కుటుంబ సభ్యులు ఉంటె ఇల్లు స్వర్గమే .కాకుంటే నరకమే .అందరిదీ సమాన భాగస్వామ్యమే .యే ఒక్కరు గడిదాటినా సంసారం చిద్రమే .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-12-కాంప్–అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –14 –ప్రెసిడెంట్ -గార్ ఫీల్డ్

అమెరికా ఊసులు  –14  –ప్రెసిడెంట్ -గార్ ఫీల్డ్ 
అమెరికా 20  వ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన జేమ్స్ అబ్రాం గార్  ఫీల్డ్ 1881 మార్చి 4   న పదవీ స్వీకార ప్రమాణం చేశాడు .కాని పదవిలోకి వచ్చిన నాలుగు నెలల లోపే న్యు జెర్సి లోని అల్బెరాన్ లో  ”చార్లెస్ గుటయు ”అనే దుండగుడి కాల్పులకు  గురైనాడు .సెప్టెంబర్ 19  న పాపం మరణించాడు .లింకన్ తర్వాత దుండగుడి కాల్పుల్లో వెంటనే చని పోయిన ప్రెసిడెంట్ ఈయనే .పదవిలో గట్టిగా ఆరు నెలల పదిహేను రోజులు మాత్రమె ఉన్నాడు .  
గార్ఫీల్డ్ పదవీ స్వీకారం చేసే టప్పుడు ఎనభై ఏళ్ళ అతని తల్లి ఎలిజా కూడా వైట్ హౌస్ కు వచ్చి హాజరై స్వయం గా చూసింది .అలా యే ప్రెసిడెంట్ తల్లి అప్పటి వరకు తన కొడుకు ప్రమాణ స్వీకారాన్ని చూసి ఉండలేదట . అదో రికార్డు .
గార్ ఫీల్డ్ అధ్యక్ష భవనాల  గేట్ల వద్ద సోల్జేర్లను కాపలా ఉంచటానికి వ్యతి రేకిన్చాడ ట . అధ్యక్ష భవనం లోఅతిధుల కోసం  జరిగే విందులు ,వినోదాలు   ఆయె ఖర్చు అంతా తనకు వచ్చే జీతం లోంచే ఖర్చు చేసే వాడట .

ఇల్లు 

అమెరికా లో మొదటి సారిగారెడ్ క్రాస్  అంతర్జాతీయ సహాయక సంస్థ గా జెనీవా ఒప్పందాన్ని అమలు పరచ టా నికి అమెరికా లో దీనికోసం క్లారా బార్టన్ అనే ఆ సంస్థ ప్రతినిధి కోరితే వెంటనే రెడ్ క్రాస్ సంస్థను ఏర్పాటు చేసిన ఘనత గార్ఫీల్డు దే.గార్ ఫీల్డు  నే దానికి నాయకత్వం వహించమని కోరితే ఆమె నే దానికి నాయకురాలిని చేశాడు .దీనికి అమెరికన్ కాంగ్రెస్ అంగీకారం కావాలి .దాన్ని కూడా చేశాడు .గార్ ఫీల్డ్  తన మంత్రి వర్గం లో అబ్రహాం లింకన్ కుమారుడు తాడ్ లింకన్ ను secretary of war ”ను చేశాడు .
గార్ఫీల్డు కు తాను చదివిన ప్రతి పుస్తకం వివ రాలు రాసుకోవటం అలవాటు .తన స్నేహితులకు సంవత్సరం చివరలో ఆ సంవత్సరం లో తన విజయాలు ,అపజయాలు ఉత్తరాల ద్వారా రాయటం కూడా అలవాటుగా ఉండేది .అధ్యక్షుడైన తర్వాతస్నేహితునికి జాబు రాస్తూ వైన్ లేకుండా డిన్నర్ చేసుకోన్నామని గర్వం గా రాసుకొన్నాడు (sine vino ).

దస్తూరి

కాల్పులు జరిగి వైట్ హౌస్ లో ఉన్న ప్పుడు వైస్ ప్రెసిడెంట్ చెస్టర్ యే.ఆర్ధర్ పరా మర్శించ టానికి వస్తే అనుమతించలేదు .అతను అక్కడున్న వారితో తన మనసు లోని కోర్కెను నర్మ గర్భం గా బయట పెట్టాడు ” god knows i donot want the place .i was never elected to ”అన్నాడు .
గార్ఫీల్డు కు బుల్లెట్ శరీరం లో ఉండి పోయి ఇన్ఫెక్షన్ వచ్చి ,కుడి వైపు పక్ష వాతం వచ్చి ,బరువు సగానికి సగం తగ్గి జ్వరం రక్తం చీము కారి చని పోయాడు .అతన్ని కాల్చిన’ గుటయు ”కు మతి స్తిమితం లేదని 160 మంది డాక్టర్లు ఒక పిటీషన్ ఇచ్చినా, దాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆర్ధర్ తిరస్కరించాడు .అయినా వాడిని ఉరి తీసి చంపారు .ప్రెసిడెంట్ గార్ ఫీల్డు కాలేయం దగ్గర చేరిన తుపాకి గుండు ను పరీక్షించే టప్పుడు డాక్టర్లు స్టెరిలైజేషన్ పద్ధతులను, అంటి సెప్టిక్ పద్ధతులను పాటించ లేదనే అభి యోగం ఉంది .
గార్ ఫీల్డ్ జీవించిన 49 ఏళ్ళ కాలం లో సగం కాలం దేశానికి సేవ లందించాడు .ఈయన పదవి లోకి వచ్చిన పదిరోజుల్లో రష్యా లోని జార్ చక్ర వర్తి రెండవ అలెగ్జాండర్ హత్యకు గురైనాడు .ఇంకా కొంత మంది ఐరోపా నాయకులు హత్య గా వింప బడ్డారు .ఈ విషయాలన్నీ తెలిసినా ఆయన ”assasination can no more be guarded against than death ,by lightning -it is best not to worry about either ” అని తేలిగ్గా తీసుకొన్న వాడు .ఈయన అమెరికా సైన్యానికి జెనరల్ గా కూడా పని చేసిన ధైర్య శాలి .
రిపబ్లికన్ పార్టి ప్రెసిడెంట్ కాండి డేట్ నుసమా వేశం నిర్వ హిస్తుండగా హేమా హేమీలు పోటీ పడ్డారు .ఈయన సీన్ లో లేడు ”ఈయనను ”బ్లాక్ హార్స్”అన్నారు .కాని అందరు చివరికి  ఈయన్నే సమర్ధించారు .కొద్ది మెజారిటి తో అధ్యక్షుని గా గెలిచాడు .1878 లో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంట టివ్ లకు మైనారిటీ నాయకుడ యాడు
గార్ఫీల్డ్ 1831లో ohio  రాష్ట్రం లో orange toun ship లో జన్మించాడు

పుట్టిన ఇల్లు

పుట్టిన ఇల్లు

.పది హేడు ఏళ్లకు ఈవెనింగ్ స్టార్ అనే నౌకకు కెనాల్ బాయ్ గా పని చేశాడు .geauga అకాడెమీ లో చదివాడు

విద్యార్ధి గా

విద్యార్ధి గా

.disciples of christ church  లో మత బోధకుడు గా పని చేశాడు .హిరం కాలేజి లోని western reserve electic institute లోను ,ఆ తర్వాతా విలియమ్స్ కాలేజి లోను చదివాడు .విలియమ్స్ నుంచే గ్రాడ్యు ఎట్ అయాడు . ఎల్క్టిక్ కాలేజి ఫాకల్ టిసభ్యుడయాడు .ఆ సంస్థకు ప్రెసిడెంట్ అయాడు 
గార్ ఫీల్డ్” లుక్రేషియా ”అనే ఆమె ను వివాహం చేసుకొన్నాడు 1959.లో అంటే ఇరవై ఎనిమిదేళ్ళకు ఒహాయో సెనేట సభ్యుడిగా ఎన్నికయాడు .స్వంతం గా, ”లా” పుస్తకాలు చదివి, పాసై లాయర్ అయాడు .యూనియన్ ఆర్మీ లో చేరి ,కెంటకి ,తెనిసీ లకు సేనను నడిపాడు .ముప్ఫై ఒకటవ ఏడాదిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రేసెంట టివ్ గా ఎన్నికయాడు .1863లో మేజర్ జెనరల్ గా పదోన్నతి పొందాడు .బాంకింగ్ అండ్ కామర్సు కు హౌస్ కమిటీ చైర్మన్ అయాడు .రెండేళ్ళ తర్వాతా అప్రాప్రిఎషన్  కమిటీ చైర్మన్ అయాడు .1877 ప్రెసిడెంట్ ఎన్నికలలో వివాదం వస్తే దాన్ని పరిష్కరించే electoral committee కి ప్రభుత్వం చె నియమింప బడి అన్నిటిని కూలం కషం గా అధ్యయనం చేసి  రిపబ్లికన్ పార్టి అభ్యర్ధి hayes కే మెజార్టి ఉందని నివేదిక ఇచ్చాడు .ఈ వివాదం ఆమధ్య జార్జి wబుష్ కు ఆల్ గోరె(2000)కు  మెజార్టి మీద వచ్చిన చిక్కు ముడి లాంటిదే .
గార్ ఫీల్డ్ మహా వక్త గా ప్రఖ్యాతి పొందాడు .అరగంట కు ఒక ఉపన్యాసం చొప్పున ఒకే రోజు ఇరవై ఉపన్యాసాలు ఇచ్చిన ఘనుడు .ఆయన కు లాటిన్, గ్రీక్ లభాష ల పై మహా భి నివేశం ఉంది .ఆ రెండు భాషల్లో రాయ గలడు మాట్లాడ గలడు.అసలు ఆయన ది ”పుర్ర చేతి వాటం ”.ఆతర్వాత కుడి చేత్తో కూడా రాయటం అల వాటు చేసుకొన్నాడు .ఒక చేతితో గ్రీకు భాషను ,ఇంకో చేత్తో లాటిన్ భాషను ఒకే సారి రాసే ”సవ్య సాచి” అయాడు   .సాధనమున పనులు సమకూరు అనే దానికి నిదర్శనం గార్ఫీల్డ్.ఆయన మాట్లాడే శైలికి ముగ్దులయే వారు .జీవితాంతం ఒక ”చేతి రాత ప్రతి” గా  జర్నల్ నడిపాడు .తన సామర్ధ్యం మీద నమ్మకం ఉంది .తాను క్లాస్ లో మొదటి స్థానాన్ని సంపాదించాలి అనుకొని ,కష్ట పడి సాధించాడు ” to stand at first or die .i believe i can do it .,if granted a fair trial ”అని రాసుకొన్నాడు .
ఫీల్డు- కెనాల్ బాయ్ గా ఉన్నప్పుడు 14సార్లు నదిలో పడి మునిగి పోయాడు చలి లో తానే ఏదో విధం గా బయట పడే వాడు .ఖాళీ దొరికితే ఏదో పని చేసి డబ్బు సంపాదించే వాడు .ఫారం హౌస్ లో పని చేసే వాడు .తల్లికి బాగా సాయం చేసే వాడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు .అన్నిటికీ అమ్మే .బైబుల్ ను తానే స్వయం గా చదవటం నేర్చుకొన్నాడు ఎనిమిదేల్లకే ”బెస్ట్ రీడర్ ”అని పించుకొన్నాడు .రాబిన్సన్ క్రూసో నవలన్నా ,నెపోలియన్ సాహస గాధలన్నా మహా ఇష్ట పడే వాడు .డిబేటింగ్ లో ఎప్పుడూ ఇతనికే బహుమతి లభించేది .ఇళ్లకు కంచే వేసే వాడు .వంద అడుగులకు డెబ్భై అయిదు సెంట్లు సంపాదించే వాడు .           ఆ కాలం లో బడులుఎలా ఉండేవో తెలుసా -వేసవి ,శీతా కాలాల లోనే పిల్లలు స్కూళ్లకు  కు వెళ్ళే వారు .మిగిలిన సమయాల్లో పొలం పనులు .అందరికి ఒక టే గది .ఆడ పిల్లలు ఒక పక్కా మగ వాళ్ళు ఒక పక్క .అన్నీ బట్టీ పట్టించటమే .బడి లో ఒక స్టవ్ ,నీళ్ళ బకెట్ ,మాత్రమె ఉండేవి .కింద కూర్చునే చదువు .ఎనిమిదో క్లాస్ వరకే చదువు .క్లాసులో మగ పిల్లలు ”మహా ముదుళ్ళు” గా ఉండే వారు .మాష్టారిని చదువు చెప్ప నిచ్చే వారు కాదు .అన్నిటికీ అడ్డు కొనే వారు . .మాస్టారు రాక ముందే స్కూల్ గేటు మూసే సే వారు . ఆయన లోపలి రాగలిగితే ఆ రోజు బడి ఉన్నట్టు లేక పోతే బెల్ కొట్టి ఇంటికి చెక్కే యటమే .ఇదీ1840-50ప్రాంతం లో గ్రామీణ విద్యాలయాల స్థితి .మనం మాత్రం దీనికేమీ తీసి పోలేదేమో .వీటినే మన వాళ్ళు ”వానా కాలం చదువులు ”అన్నారు .
బానిసత్వాన్ని నిర్మూలించాలి అనే ధ్యేయం ఉన్న వాడు గార్ ఫీల్డ్ .1862లో ఇరవై వ బ్రిగేడ్ నాయకుడి గా ఉన్నప్పుడు ఒక బానిస -యజమాని నుంచి తప్పించుకొని పారి పోయి ఇతని ఆశ్రయం చేరాడు .ఇది తెలుసు కొన్న పై అధికారి అతన్ని యజమానికి అప్ప గించమని హుకుం జారీ చేశాడు .”నేను ఆ పని చేయలేను చేయను ”అని ఖచ్చితం గా చెప్పాడు ఫీల్డ్ .ఇది ఒక రకం గా ఆజ్ఞను ఉల్లంఘిన్చటమే .తీవ్ర నేరమే .కాని ఇతని సచ్చీలత ను చూసి ఎవరూ దాన్ని తీవ్రం గా తీసుకో లేదు . ఆ తర్వాతా ఒక సాధారణ సూచన జారీ అయింది .దా ని ప్రకారం సైన్యం చేతికి చిక్కిన బానిస లను యజ మానులకు ఇవ్వ రాదు .ఆ రోజుల్లోku klux klan అనే సంస్థ పూర్వపు బానిసలకు వారి హక్కు లను కోరే వీలు లేదు అని వాదించేది .
ఫీల్డు -హౌస్ లో అప్రాప్రిఎషన్ కమిటీ లో పని చేసి నపుడు రోజుకు 15 గంటలు పని చేసే వాడు .ఇలా మూడు నెలలు చేశాడు . చక్కని సంస్కరణలు సూచించాడు .నేటివ్ అమెరికన్ లకు కూడా పూర్తి పౌరసత్వం ఇవ్వాలని వాదించాడు .వాషింగటన్ లో సెనేటర్ గా ఉన్న ప్పుడు ఇంటికి ఉత్త రాలు రాసే వాడు .అందులో పిల్లలకు జాగ్రఫీ  హిస్టరీ పాథాలు ,పజిల్సుపంపించే వాడు .

మెమోరియల్

ఆ రోజుల్లో green backers  అనే రాజ కీయ పార్టి ఉండేది .వీళ్ళు రైతు అనుకూలురు .ఇది కాక ”ప్రొహి బిషన్ పార్టి ”అనే ఇంకో పార్టి ఉండేది .వీళ్ళు దేశం లో ఆల్కహాల్ అమ్మ కుండా చేయాలి అని కోరే వారు .ఇదీ గార్ ఫీల్డుగారి నాటి ఒహాయో తదితర రాష్ట్రాలలో ఉన్న పరిస్తితి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-12-కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment