అమెరికా లో ఆంద్ర తేజం సమాజ సేవా” భవానీ దీక్ష ‘

అమెరికా లో ఆంద్ర తేజం

సమాజ సేవా” భవానీ దీక్ష ‘

అమెరికా వచ్చి బాగా సంపాదిస్తూ హాయిగా విలాస జీవితం గడ పచ్చు నని అందరు అనుకోవటం సహజం .ఈ మధ్య కొందరు మాతృదేశాన్ని గుర్తించి ,అనేక సేవా ,అభి వృద్ధి కార్య క్రమాలలో భాగ స్వాము లవుతు ,జన్మ భూమి ఋణం తీర్చు కొంటున్నారు .ఎక్కడ ఉన్నా మన చుట్టూ సమాజం ఉంటుంది .సమాజ పురోగతే మానవ ప్రగతి .ఈ రెండు అవినా భావ సంబంధం కలిగి ఉంటాయి .మనం ఉంటున్న దేశం మనదే .అక్కడి సమాజమూ మనదే .అందు లో మనమూ ఒకల్లమే ఈ భావన వస్తే ,విశ్వ జనీన భావన కలుగు తుంది .అప్పుడు మనం చేసే సేవా కార్య క్రమాలకు ,అర్ధం ,పరమార్ధం లభిస్తాయి .ఇలా సమాజ సేవా కార్య క్రమాలలో నిర్వి రామం గా పాల్గొంటూ ,తన చుట్టూ ఉన్న సమాజ ప్రగతికి దోహద పడుతున్న తెలుగు వారెందరో ఉన్నారు .వారినే నేను ”అమెరికా లో ఆంద్ర తేజం ”అన్నాను .అలాంటి వారి లో అమెరికా ఆగ్నేయ రాష్ట్ర మైన అలబామా లోని హన్ట్స విల్ నివాసి ,కృష్ణా జిల్లా వాసి అయినశ్రీమతి కాకాని భవాని గారు ముఖ్యులు గా కనీ పించారు .క్రిందటి వారం నా అలబామా ప్రయాణం లో ,ఆమెను వారింట్లో భర్త డాక్టర్ ప్రసాద్ గారితో పరిచయం కల్గించారు నా మిత్రులు మైనేని గోపాల కృష్ణ గారు .ఆమె చేస్తున్న సమాజ సేవా కార్య క్రమాలను వివ రించి చెప్పారు . ”సమాజ సేవా భవానీ దీక్ష”గా ఆమె సాగిస్తున్న కార్య క్రమాలను మన వారందరికి అంద జేయట మే నా ఉద్దేశ్యం .మిగిలిన వారు కూడా ప్రేరణ పొందుతారనే విశ్వాసం .

ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో కూచి పూడి కి దగ్గర గ్రామం అయిన” పెడసన గల్లు” లో భవాని జన్మించారు .మెన మామ పెంపకం లో పెరిగారు .ఆయన ఈమె జీవితాన్ని తీర్చి దిడ్డ టానికి మంచి పునాది వేశారు .ఉయ్యూరు దగ్గర గ్రామ మైన ఆకునూరు నివాసి కాకాని బ్రహ్మేశ్వర రావు గారి పెద్ద కుమారుడుడాక్టర్ కాకాని ప్రసాద రావు గారి తో వివాహం జరిగింది .ఇద్దరు అమెరికా చేరారు .ప్రసాద్ వైద్య వ్రుత్తి లో విశేష అనుభవాన్ని సంపాదించి అలబామా లో హన్త్స్ విల్ లో స్థిర పడ్డారు .సంతానం కూడా అభి వృద్ధి లోకి వచ్చింది .సమాజం లో ఆదర్శమైన వైద్యులు గా ఆయన పేరొందారు .జెనరల్ మరియు వాస్క్యులర్ సర్జన్ గా ప్రసాద్ లబ్ధ ప్రతిష్టులు .కావలసి నంత సంపాదించి ,ఇక సంపాదన పై వైముఖ్యం పెంచుకొని వాలంటరీ గా పదవీ విరమణ చేశారు .సంసారం తో సంతృప్తి గా జీవిస్తున్నారు .

శ్రీ మతి భావాని34 ఏళ్ళు గా సమాజ సేవా కార్యక్రమాలలో ,విద్యా ,సంక్షేమ కార్య క్రమాలలో అగ్ర గామి గా నిలి చారు .భర్త కు చేదోడు గా ఉంటూ ,అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు .ఆమె మంచి వాణిజ్య వేత్త .హన్ ట్స్విల్ లో ఎన్నో స్వచ్చంద సంస్థ లకు ఆమె నిర్వా హకు రాలు . .2004లో girls inc. state అవార్డ్ పొందారు .మరుసటి ఏడాదిnational conference for community sister hood పురస్కారక్మ్ పొంది తన సేవా కార్య క్రమాలకు తగిన గుర్తింపు తెచ్చు కొన్నారు .అలాగే arthitis foundation ,women hounoring wmen;s health మొదలైన విలువైన అవార్డులను ,రివార్డు లను పొందిన మహిళా మాణిక్యం కాకాకి భవాని గారు .

ఆమె ఆలోచన లన్ని సమాజ అభి వృద్ధి మీదే ఉంటాయి .ఆమె మేదో జనిత మైన భావనే ”ఆశా కిరణ్ ”అనే లాభా పేక్ష లేని సేవా సంస్థ .అమెరికా లో ఉన్న దక్షిణ ఆశియా వాసుల కల్లోల జీవితాలకు వెలుగు నివ్వటానికి ఏర్పడిన సంస్థ ఇది ..భవాని ”progres bank and trustకు కు సెక్రెటరి మరియు డైరెక్టర్ .అంతే కాదు -international finance for intergraph corporation కు సీనయర్ స్టాఫ్ సూపెర్వైసేర్ .ఇలా ఆమెను వరించని పదవి లేదు అంటే ఆశ్చర్యంలేదు .

సమాజం లో వివిధ వవర్గాల మధ్య సమన్వయము సాధించ టానికి ఆమె గొప్ప కృషి చేస్తున్నారు .అందరికి ఆరోగ్యం అందించాలనే ఆమె దీక్ష ఆమెది .దానికోసం ఆమె నడుం కట్టి ముందు నిలిచారు .ఎన్నో స్వచ్చంద సంస్థలను ఈ కార్య క్రమం లో భాగా స్వామ్యులను చేయటం లో కృత క్రుత్యులయారు .madisaan county medical alliance medical society of the state of Alabama కు అధ్యక్ష త వహిస్తున్నారు .అలానేsouth medical association and hospice కు సారధి గా ఉన్నారు .ఆమె స్వచ్చంద సేవా దీక్షితు రాలు . authority of the city of hants villiie hospital foundation ,మరియు the state wide health planning council వంటి ఎన్నో సంస్థలకు గౌరవ స్థానం లో బాధ్యతలు నిర్వ హిస్తు ,సమాజ హితైషి గా జీవితాన్ని సార్ధకం చేసు కొంటున్నారు .

సమాజం లో వివక్షత కు గురైనపిల్లలను , సమాజవిస్మృత పిల్లలకు ఆమె అండా ,దండా గా నిలుస్తున్నారు .వివిధ కారణాల సల్ల విద్యకు దూరమైనబడి ఈడు బాల బాలికలను స్చూల్ల లో చేర్పించి ,వారి విద్యాభి వృద్ధికి పూర్తీ సహాయం అందిస్తున్నారు .దీనికి తార్కాణమే ఆమె the national children;s advocacy center in varjinia కు బోర్డ్ చైర్ పెర్సన్ గా గౌరవ స్థానాన్ని అది రోహించటం .ఆమె సేవకు తగ్గ ప్రతిఫలం, ,పురస్కారం ఇది .

విద్య నేర్వటం తో పాటు సరైన వృత్తిని ఎన్ను కోవటానికి తగిన సలహా సంప్రదింపులు ఇవ్వాలన్న ఆమె ఆలోచన మంచి కార్య రూపం దాల్చింది .ఎందరికో మార్గ దర్శనం చేసింది .దీనికోసంwomen council foundation కు ఆరేళ్ళు నిర్విరామం గా పని చేసి అనేక మంది కి ఉపాధి మార్గాలను కల్పించింది . U.A.H.foundation board commission ను ద్వారా అనేక ముందడుగు పధకాలను చేబట్టి ఆదర్శ మహిళా గా నిల బడింది .randolph school ,women;s economic development council foundtion boardవంటి మరెన్నో సేవా సంస్థలతో ,వాటి సేవలో ప్రత్యక్ష భాగస్వామ్యం భావాన్ని గారికి ఉంది .

సమాజాభి వృద్ధి పధకాలలో ముందుండి నడి పించిన ముందు చూపున్న మహిళా భవాని .వీటి కోసం Hants villiie maadisaan county కి అధ్యక్షు రాలిగా , హన్ ట్స్ విల్ తెలుగు సంస్థ కు ప్రారంభ అధ్యక్షు రాలిగా పని చేసి తెలుగు భాషా సంస్కృతుల ను సంరక్షించే అనేక కార్య క్రమాలను నిర్వ హించింది .కళా పురస్కారాన్ని అందుకొన్నది .కళా సంస్థart council కు నేతృత్వం వహించింది .హంట్ స్విల్ లోని అంతర్జాతీయ సంఘానికి మార్గ దర్శనం చేసింది .ఆ సంస్థ శత ,ద్వి శత వార్షికోత్సవ నిర్వ హాణ లో ప్రముఖ పాత్ర వహించింది .

ఆమె ఆర్ధిక శాస్త్రం లో డిగ్రీ సాధించింది .బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో హన్త్స్ విల్ లోని అలబామా యుని వేర్సిటి నుండి మాస్టర్ డిగ్రీ సాధించింది .ఆమె పత్రికా రంగం లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు .”ప్రవాసి హెరాల్ద్’అనే పత్రిక ను స్థాపించి ,దాని సంపాదకు రాలుగా ఉంటూ ,దానినీ తన అభిరుచి మేరకు తీర్చి దిద్దు తున్నారు .’సమాజ సేవే ఉచ్చ్వాస నిస్శ్వాసాలుగా అనుక్షణం జీవితాన్ని పండించు కొంటున్న ధన్య జీవి శ్రీ మతి కాకాని భవాని . అందరికి ఆమె జీవితం ఆదర్శం కావాలి .ఉత్తేజం,ప్రేరణ పొందాలి .

మీ— గబ్బిట దుర్గా ప్రసాద్– 4-7-12.–కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

ఆమె రికా డైరీ -మైనేని వారి వారం -02 సరస భారతికి నాటా సన్మానం

    ఆమె రికా డైరీ -మైనేని వారి వారం -02
                                             సరస భారతికి నాటా సన్మానం
            జూన్ ముప్ఫై  వ తేది శని వారం –ఉదయమే నిద్ర లేచి ,పనులు పూర్తి చేసుకొని కాఫీ త్రాగి ,కార్ లో నన్ను మైనేని గారు వారి అబ్బాయి కృష్ణ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అప్పటికే అక్కడికి ద్రోణ వల్లి రామ మోహన రావు గారు వచ్చి ఉన్నారు .కాసేపు మాట్లాడు  కొన్న తర్వాత మైనేని గారు రామ  మోహన రావు గారితో నాకు శాలువా కప్పించి ,వారి తొ జ్ఞాపికను అంద జేశారు .వారు ప్రచురించిన ”దేశ భాష లందు తెలుగు లెస్స ”పుస్తకాన్ని ,వారి అమ్మాయి అనుపమ స్పాన్సర్ చేసి,,వెలువ రించిన సి.డి.లను అంద జేశారు .ఇది నేను ఉయ్యూరు లో చేస్తున్న సరస భారతి సేవలకు అభి నందన అని అన్నారు .నేను కృతజ్ఞతలు చెప్పి ఈ సత్కారం ”సరసభారతి ”కి అమెరికా లో జరిగిన విలువైన సన్మానం అన్నాను .వారి సంస్థ నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్ (నాటా ) కు కృతజ్ఞత తెలియ జేశాను .ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం ఫోన్ లో గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ ”మీరు ఈ సారి అమెరికా వస్తే మీకు సన్మానం   చేయాలని మేమందరం అనుకుంటున్నాము ”అన్న మాట ఈ రోజూ అనుకోకుండా ఇలా  నెర వేరి నందుకు ఇక్కడి సభ్యు లందరికి కృతజ్నతలు అంద  జేశాను .ఇది నాకు తానా ,ఆటా ,నాటా లు చేసి నంత ఘన సన్మానం గా భావిస్తున్నానని ,సరస భారతి కి ఇంతటి ఆదరణ లభించటం ,అందులోను” అట్లాంటా లో నాటా సభలు” జరుగు తున్న సమయం లో ఈ సత్కారం అతి విలు వైనది గా భావిస్తున్నానని తెలియ జేశాను .ఊహించని రాక ,ఊహించని గౌరవం అని విన్న వించాను .కృష్ణ భార్య బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ చట్నీలు ,దోసె కాఫీ అందరికి అందించారు .కబుర్లు చెప్పు కుంటు అందరం హాయిగా లాగించే శాం .రామ మోహన రావు గారి అమ్మాయి ఇక్కడ  డాక్టర్ .ఆమే ఇక్కడి లైబ్రరి లో ‘తెలుగు విభాగం ”ఏర్పరచి పుస్తకాలను అందించి భాషా సేవ చేస్తున్నారు .ఇందరు తెలుగు భాషా ,సంస్కృతులకు చేస్తున్న సేవ ఎంతో ఆనందాన్ని కల్గించింది .
                                            తొలి ఏకాదశి న విష్ణు దర్శనం
        అక్కడి నుండి నన్ను గోపాల కృష్ణ గారు కార్ లో ఒక అరగంట ప్రయాణం చేసి ”శ్రీ విష్ణు దేవాలయం ”కు తీసుకొని వెళ్ళారు .అది ఒక దేవాలయ సమూహం .అందరు దేవుళ్ళు కొలువైన విలు వైన ఆలయం ..ఆ రోజూ తొలి ఏకాదశి కూడా .స్వామి దర్శనం దివ్య దర్శనం గా ఉంది .ఎక్కడో పుణ్యం మూట కట్టుకోన్నామేమో ,ఈ అదృష్టం దక్కింది .-కాదు దక్కించారు మిత్రులు గోపాల కృష్ణ గారు .గుడి లో ఉండ గానే ఆయనకు మా అబ్బాయి రమణ ఉయ్యూరు నుండి  ఫోన్ చేశాడు .
                                           హన్ట్స్ విల్ మహర్షి
           మైనేని వారి స్నేహితులెందరో ఉత్త ములున్నారు .అందులో ఒకరు జిం అబార్ క్రోమ్బి అనే అమెరికన్ .ఆయనకు సువిశాల వ్యవ సాయ క్షేత్రం ఉంది .ట్రాక్టర్ మెకానిక్ .స్టోర్స్ ఉంది .అక్కడికి తీసుకొని వెళ్లి నన్ను ఆయనకు పరి చాయం చేశారు .ఆయన ఎంతో ఆత్మీయం గా కౌగలించుకొని స్వాగతం చెప్పారు .ఆయనకు భారతీయ భావనలు ,ఆధ్యాత్మిక జీవనం చాలా అభి మానం అని చే ప్పా రు .యుద్ధం లో పని చేసి ఇప్పుడీ స్వంత కార్య క్రమం లో ఉన్నారు .ఎవరు ఏ సమయం లో ఫోన్ చేసినా ,అక్కడ వాళి ట్రాక్టర్ రిపేర్ చేసి వచ్చే సౌమ్యుడాయన .ఫోటోలు తీసు కొన్నాం .వారి కూరగాయల తోట చూ శాం .ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరూ ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ”ఇంగ్లీష్ విలేజ్ ”అని పేరు పెట్టు కొన్నారు .అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారు గోపాల్ గారు .అక్కడి వీధుల పేర్లు కూడా ఇంగ్లాండ్ కు సంబంధించినవే .అందులో ఒక పేరు ఇంగ్లాండ్ రాజ్యాంగం హక్కుల చట్టం అన బడే ”మాగన కార్టా ”ఆయన్ని ఇక్కడ అందరు ”పాల్ అని గోపాల్ ”అని అంటారు ..అక్కడ ”లారీ”అనే ఆయన ను నాకు పరిచయం చేశారు .వ్యాపారి .స్కేటింగ్ దియేటర్ ఉంది .ఇంకా వ్యాపారాలు  చాలా ఉన్నాయి.ప్రేమ గా పలకరించి ఫోటోలు తెసుకొన్నారు .ఏదైనా ఫంక్షన్ లు వస్తే ఆయన కు ఫోన్ చేస్తే చాలట .నిమిషాలలో అన్నీ ఏర్పాటు చేస్తారట .కృష్ణ కు మంచి స్నేహితుడు కూడా లారీ ..వీరి”కౌన్సెలింగ్”సంఘానికి లారీ ముఖ్య బాధ్యత లో ఉన్నారు .
        

This slideshow requires JavaScript.

      గోపాల కృష్ణ గారు చాలా ఉదారులు ,సౌమ్యులు ,,స్నేహ శీలి ,ఆపద్బాన్ధవులు .వ్యసనాలకు బానిస లైన వారి నేన్దరికో కౌన్సెలింగ్ ఇచ్చి వాటిని మాన్పించే ప్రయత్నం చేస్తున్నారు .వారందరూ వాటిని వదిలి మళ్ళీ జన జీవన స్రవంతి లో కలిసి జీవితాలను బాగు చేసుకొని మళ్ళీ కుటుంబాలకు దగ్గరవు తున్నారు .వారంతా మైనేని వారిని ఒక ”మహర్షి ”గా భావించటం ఆయనకు లభించిన అరుదైన గౌరవం .ఆప్యాయత ,ఆడరనీయత ప్రేమ ,సమాజం మంచి గా ఉండాలనే తపన దానికి తాను చేయ వలసిన కృషిని నిత్య కృత్యం గా భావించి చేయటం ఆయనకు ఒక విధి విధానం ,వ్యక్తీ సంస్కరణ కోసం ఆరాట పడతారు .అలానే చేస్తున్నారు .ఆయన కు ఇలాంటి పని లోనే విశ్రాంతి .నేను వారింటికి వచ్చిన శుక్ర వారం రాత్రి ఒక సమావేశం లో గోపాల కృష్ణ గారు వ్యసనాల నుండి బయట పడి ఇరవై ఏళ్ళ కు పైగా హాయిగా జీవిస్తున్న ”ప్రాడిగల్ సన్ ”లాంటి ఆయనకు సన్మానం చేసి ,మెడల్ బహూక రిన్చాఉ .నిజం గా ఆ కార్య క్రమం  గోపాల కృష్ణ గారి చేతుల మీదు గా జర గాలి .కాని నా కోసం దాన్ని ”లారీ ”గారికి ఆ బాధ్యత ను అప్పగించి మాతో కలిసి హెలెన్ కెల్లర్ జన్మ స్థలానికి వచ్చారు ..అదీ గోపాల్ గారి స్నేహం .అందుకే అందరు ఆయన కోసం అర్రులు చాస్తారు .చిన్న వాళ్ళల్లో చిన్న వారు గా ,పెద్దల్లో పెద్దగా సమాజ సేవలో ముందుగా ,వితరణ లో గుప్తం గా ,జ్ఞాన వృద్ధుల లో అగ్రేసరు లుగా ,సాహితీ ప్రియులకు మార్గ దర్శి గా ,ఆధ్యాత్మిక జీవులకు ఆదర్శం గా ఉంటారు .ఎన్ని గుప్త దానాలు చేస్తారో తెలియదు .ఎవరికి చెప్పారు .తన పేరు కోసం ప్రాకు లాడరు .మంచి జరగాలనే ఆరాటమే ఎప్పుడు .జీవితం లో దెబ్బ తిన్నా వారెందరికో వెన్నెముక  గా నిలిచి ధైర్యం చెప్పి ,హార్ధికం గా ,ఆర్ధికం గా సాయం చేసి వాళ్ల జీవితాలలో వెలుగులు నింపు తున్న పుణ్య పురుషులు మైనేని గోపాల కృష్ణ  గారు .లేక పోతే జన్మ భూమి మీద అభిమానం తో నలభై ఏళ్ళ క్రితం వది లేసిన స్వగ్రామం ఉయ్యూరు ను గుర్తు పెట్టు కోని అక్కడ లైబ్రరి కి భూరి విరాళాన్ని అంద జేసి దాన్నిదక్షిణ భారాత దేశం లోనే మొదటి  ఏ.సి.లైబ్రరి గా తీర్చి దిద్ది ,విలువైన పుస్త్సకాలను పంపించి ,,ఆవిష్కరణ రోజున అమెరికా నుండి వచ్చి దగ్గరుండి చూసుకొని ఆనందాన్ని అనుభవించారు .ఆ నిర్మాణం లో నన్నూ కన్వీనర్ ను చేసి బాధ్యత అప్పా గించారుఆనాటి జడ్పిటిసి ,ఈనాటి ఎంఎల్సి రాజేంద్ర ప్రసాద్ . .అప్పుడే అంటే ఎనిమిదేళ్ళ క్రితం వారిని ఉయ్యుర్లో మొదటి సారి చూడటం .అప్పటి నుండి కొద్దో గొప్పో ఫోన్ లో పలకరించు కొంటున్నా ,2008 లో మూడవ సారి అమెరికా కు వచ్చి నప్పుడు బందం బాగా పెరిగింది .ఫోన్లు మెయిల్ లో పలకరింపులే అయినా చాలా దగ్గరయారు మా కుటుంబానికి .మా ఇంట్లో అందరికి ఆయన తెలుసు .అంత ఫామిలీ ఫ్రెండ్ గా ఆదర్శం గా ఉన్నారు .ఇన్ని సుగునాలున్డటం వల్లే వారు నాకు ”హన్ట్స్ విల్ మహర్షి ”అని పించారు
                                             నాసా స్పేస్  సెంటర్
         హన్ట్స్ విల్ ను ”రాకెట్ నగరం ”అంటారు .ఇక్కడే మొదట అమెరికా రాకెట్లు తయారు చేశారు .దీనికి ముఖ్యుడు జర్మని కి చెందిన హిట్లర్ కు నమ్మిన బంటు అయిన” వాన్ బ్రూన్”  అనే శాస్త్ర వేత్త .అతన్ని అమెరికా కు పిలి పించి అన్ని సౌకర్యాలు కలిపించి రాకెట్ లను తయారు చేయించారు .ఎక్స్పోలరార్ వంటి ని ఇక్కడే తయారు చేశారు .ఎన్నోఅంత రిక్షా నౌకలకు రూప కల్పన జారి గింది ఇక్కడే .వాన్ మేధో జనితమే ఈకేంద్రం .అతను ”అమెరికా రాకెట్ పితామహుడు ”.స్నేహితులను చూసిన తరువాత  గోపాల కృష్ణ గారు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు .ఎక్సి బిషన్ చూశాం .గ్రావిటీ ఫోర్స్ మెషీన్ మీద పైకి వెళ్లి కిందికి దింపే దానిలో కూర్చుని అనుభవం పొందాం .అలాగే సెంట్రి ఫూగల్ మెషీన్ ఎక్కి బి.పీ..బరువు పెరిగే దాన్ని అనుభూతి పొందాం.అన్ని వివరం గా నాకు తెలియ జెప్పారు .అక్కడే పూర్వకాలం ఏనుగుల కు ముందు ”మామధ్ ”లనేభారీ శరీరం ఉన్న  ఏనుగుల వంటి వి ఉండేవి .వాటి మ్యుజియం చూశాం .అవి ఎప్పుడో అంత రించి పోయాయి .ఏదైనా చాలా బారీ గా ఉంటె ”మామధ్ సైజ్ ”అంటాం . అక్కడ స్టార్ బక్స్ లో” వన్ బై టు”కాఫీ త్రాగాం .మా మన వళ్ళు ముగ్గురికి ఆరోనాట్ బొమ్మ ఉన్న షర్ట్స్ టోపీ లు గిఫ్ట్ గా కొన్నారుగోపాల్ గారు ..ఇంటికి చేరే సరికి రెండు అయింది .భోజనం చేశాం .స్వీటు  బెండకాయ కూర ,పప్పు ,దోస చట్ని ,కాకర కూర సాంబారు ,అన్నం ,పెరుగు లతో మంచి భోజనం చేశాం .కాసేపు విశ్రాంతి తీసుకొన్నాం .
                    మధ్యాహ్నం మూడున్నరకు లేచి దంపతులతో వారి ఇంటి వెనక పెరటి తోట చూషాను ను .అన్ని రకాల కూరగ్యాలు ,ఆకు కూరలు కుండీలలో పెంచు తున్నారు .సార వంత మైన నేల కనుక బాగా కాస్తున్నాయి. సత్య వతి గారి పెంపకమే ఇది .ఎరువులు వెయ్యరు .అన్నీ నాచురల్ గా ఉండాలని  వారి ఆరాటం వాషింగ్ మెషీన్ ఉన్నా బట్టలు స్వయం గా ఉతికి దొడ్లో దణ్ణాల మీద ఆరేస్తారు .కుట్టు పని ,అల్లకం వచ్చు లాన్ ను స్వంతంగా మెషిన్ తో కట్ చేస్తారు .వర్షపు నీటిని వృధా పోకుండాపెద్ద కుండీలో నిల్వ చేసి  మొక్కలకు ఉపయోగిస్తారు ..తాను ఊరికి వెడితే గోపాల్ గారు కష్ట పడకుండా పదార్ధాలు చేసి ఫ్రీజ్ చేసి దాస్తారు ఫ్రిజ్ లో .ఆయన కష్టపడటం ఆవిడకు ఇష్టం ఉండదు .వారిద్దరూ” జీవికా జీవులు” గా ఉంటారు .అదీ వారి ప్రత్యే కత . .నాకు ఆయాన ఆరు విలువైన పుస్తకాలు బహూక రించారు .కరివేపాకు మొక్క ఇచ్చారు మా అమ్మాయికి .బూంది ఫలహారం చేసి కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమయాం .కృష్ణ కుటుంబం కూడా వచ్చింది .అందరం గ్రూప్ ఫోటో లు తీసుకొన్నాం .సాయంత్రం అయిదింటికి బయల్దేరి నన్ను బస్ స్టేషన్ లో దింపారు .బస్ ముప్పావు గంట లేటు .అప్పటి దాకా ఉండి ,వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్ళారు .
         నిన్నటి నుంచి మండు వేసవి లో 105 డిగ్రీల వేడి లో నన్ను వెంటేసుకనిక్క్షణం తీరిక లేకుండా తిప్పారు .నిన్న నేను బస్ దిగ గానే చూస్తె ”పచ్చగా డబ్బా పండు ఛాయా తో ముఖం వెలిగి పోయింది ”కాని ఇవాళ చూస్తె ”నల్ల బడి కమిలి పోయింది ‘.78 ఏళ్ళ ఈ వయసు లో స్నేహితులంటే అంత తాపత్రయం .నేను వారింట్లో నుంచి బయల్దేరే టప్పుడు వారి భార్య గారితో ”గోపాల కృష్ణ గారి ఆరోగ్యం నేను వెళ్ళిన తర్వాత దెబ్బ తింటే అది నా తప్పు .మెరుగ్గా ఉంటె అది ఆయన గొప్ప తనం ”అని అన్నాను .ఇద్దరు నవ్వారు .ఆయన లెక్క ప్రకారం నేను రావటం వల్ల ఆయన ఎనర్జీ లెవెల్ బాగా పెరి గిందని చెప్పారు .పెరక్క  పోయినా ఫర్లేదు కాని తరక్కుండా ఉంటె చాలు .బస్ బయల్దేరే ముందు నేను ఊహించని భారీ  కానుక ను నా చేతులో పెట్టి సరస భారతికి దాన్ని ఉప యోగించమని మంచి మనసు తో చెప్పిన త్యాగ మూర్తి గోపాల కృష్ణ గారు . సరస భారతి అంత ఒప్పగా ప్రాచుర్యం పొంది జన హృదయాలను కదిలిస్తున్నందుకు ఆనందం గా ఉందీ .
              ఇవన్నీ నేమరేసుకొంటు బస్ ఎక్కాను .అది రాత్రి తొమ్మిదింటికి బర్మింగ్హాం చేరింది .అక్కడ తొమ్మిదిన్నరకు బయల్దేరి రాత్రి పదకొండు కు మాంట్ గోమారి చేరింది .రవి గారు  వచ్చి నన్ను సత్యా వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ భోజనం ఏర్పాటు చేసారు .నేను ద్రాక్ష పళ్ళు తిని పడుకొన్నాను నిద్ర పట్ట లేదు .
                                               తిరుగు ప్రయాణం
    జూలై ఒకటి ఆదివారం -ఉదయాన్నే లేచాం .సత్యభార్య జయంతి దోసెలు చేసింది .తిని కాఫీ తాగాం వాళ్ల దొడ్లో అరటి మొక్కలున్నాయి .కూరలు మల్లెలు బాగా ఉన్నాయి  ఆమె ఉయ్యూరు లో కోట శ్రీ రామ గారింట్లో పుట్టిందట .అనుకోకుండా అలబామా లో ఉయ్యూరు వాళ్ళు ఇంకొరు  దొరికారు .వాళ్ల నాన్న ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ..కోట వారిన్త్లొఅద్దె కున్నారట .అసలు గుడి వాడ .పుట్టింటి వారి ఇంటి పేరు గూటాల .
రవి గారి కార్ లో పదిన్నరకు హాన్స్ విల్ లో ఉన్న ఆయన గ్యాస్ స్టేషన్ ,గ్రోసరీ షాప్ కు చేరాం .దీన్ని జీవన్ ,రమేష్ అనే ఇద్దరు చూస్తుంటారు . .ఇద్దరు కుర్రాళ్ళే .రమేష్ వంట చేశాడు బెండ కాయ కూర కాకర కాయ పులుసు మ్దొండ కాయ కూర .అన్నం లో పసుపు జాపత్రి వంటివి వేసి కిచిడి చేశాడు ,పెరుగు తో తిన్నాం .జీవన్ పదేళ్ళ నుంచి రవి దగ్గర పని చేస్తున్న నమ్మ కస్తుడు .ఇద్దరు షాప్ లోనే నివాసం .వంటా ,పడక అంతా అక్కడే .ఏడాదికో రెండేళ్ళకో ఇండియా వెళ్లి వస్తారు .జీతాలు బానే ఇస్తారు రవి .నిజామాబాద్ కు చెందిన రెడ్ల కుర్రాళ్ళు ..మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు కార్ లో బయల్దేరాం ఇంటికి .రెండు గంటల్లో అట్లాంటా టైం ప్రకారం సాయంత్రం అయిదుకు చేరాం .అక్కడ ”శరవణ భవన్ ”లో మషాలా దోష తిని కాఫీ త్రాగం .బానే ఉన్నాయి .అక్కడి నుండి బంగారు నగల షాప్  కు వెళ్లాం .రవి భార్య గాయత్రి కోసం బంగారు గొలుసు కొన్నారు .ఆరవ తేది ఆమె పుట్టిన రోజూ కానుక గా .ఆయన తో పాటు నాకూ గిఫ్ట్ గా వినాయకుని విగ్రహాన్ని ఇచ్చారు షాప్ వాళ్ళు .అక్కడినుంచి ”చెరియన్ ”అనే భారీ గ్రోసరీ లో కూరలు సరుకులు రవి  కొనుక్కొన్నారు .చెరుకు రసం త్రాగాం ఫ్లారిడా లో చెరుకు పండుతుంది కూరలు కూడా అక్కడి నుంచే వస్తాయి .చాలా చవక ..పెద్ద గ్లాసుల్లో ఇంటికి పిల్లలకు తీసుకొన్నాం .రాత్రి ఏడున్నరకు బయల్దేరి పదకొండు గంటలకు షార్లెట్ లో ఇంటికి చేరాం..దారిలో వర్షం పడింది .మజ్జిగ తాగి పడుకొన్నాను .
            ప్రయాణం లో పద నిసలు –బర్మింగ్హాం అలబామా రాష్ట్రం లో పెద్ద నగరం .ఇనుము ,ఉక్కు పరిశ్రమకు పెద్ద పేరు .బొగ్గు విస్తారం గా లభించే ప్రాంతం .వాణిజ్య కేంద్రం .అలబామా రాష్ట్ర రాజ  దాని మాంట్  గోమారి .సముద్రం దగ్గరే .నాలుగైదు బీచెస్ ఉన్నాయి .మార్టిన్ లూధర్ కింగ్ ఇక్కడ చర్చి బోధకుడు గాఉండే వాడు .  .అతను జన్మించింది జార్జియా రాష్ట్రం లోని అట్లాన్తానే ..అలబామా కు ”కాటన్ స్టేట్ ”అని పేరు .పత్తి బాగా పండే రాష్ట్రం .దాని కోసమే బానిసలను తెచ్చి తెల్ల వాళ్ళు వాళ్ల తో వ్యవ సాయం చేయించే వారు .బానిసల తిరుగు బాటు కూడా ఇక్కడే ప్రారంభ మైంది .దక్షిణ రాష్ట్రం అలబామా .సివిల్ వార్ కూ కేంద్రమే .ఈ రాష్ట్ర పక్షి ”ఎల్లో hammer బర్డ్ ;;ఆ పేరు తోను రాష్ట్రాన్ని పిలుస్తారు సౌత్ ఈస్ట్ లో అంటే అమెరికా ఆగ్నేయ భాగాన అలబామా ఉంది .నార్త్ ఈస్ట్ లో అంటే ఈశాన్య భాగం లో ఫ్లారిడా ఉంది .ఈ రెండిటిని చూశాను .ఫ్లారిడా ను మొదటి సారి అమెరికా కు టెక్సాస్ లోని హూస్టన్ కు వచ్చి నప్పుడు అంటే పదేళ్ళ క్రితం అల్లుడు అవధాని గ్రాడ్యుయేషన్ కు నోవా యూనివెర్సిటి లో జరిగి నప్పుడు   అందరం వెళ్లి మయామి బీచ్ వగైరాలు చూశాం..ఇలా మొదలై అలబామా పర్యటన రవిగారు , మైనేని గార్ల సౌజన్యం తో అనుకోకుండా అలవోకగా ఆనందం గా జరిగింది .నిరుడు జూన్ లో మా బావ మరిది ఆనంద్ కుటుంబం తో కాశీ రామేశ్వరాలు  చూస్తె ఈ జూన్ లో ”అలబెమా ”చూశాను ఇక్కడ అలానే పిలుస్తారు ..ఇదో ప్రపంచం .ఎక్కువ ఆఫ్రికన్ ఇండియన్స్ ఉన్న దక్షిణ రాష్ట్రాలివి .భాష లో యాస ఎక్కువ .ప్రభుత్వం వీరికోసం చాలా సహాయం చేస్తోంది .ఇప్పుడే నాగరక జీవితం సాగిస్తూ అబ్యుదయం చెందుతూ అన్నిపదవులను నిర్వహిస్తూ వారి జాతికి గర్వ కారణం గా నిలు  స్తున్నారు .
                   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ —3 -07 -12 —కాంప్ –అమెరికా

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Posted in అమెరికా లో | Tagged , | Leave a comment

అమెరికా డైరీ మైనేని వారి వారం –1

  అమెరికా డైరీ   మైనేని వారి వారం –1
ప్రయాణానికి నేపధ్యం 
 

కిందటి వారం అంటే  25-6-12 సోమ వారం నుండి 1-7-12 ఆది వారం వరకు జరిగిన విషయాలు అమిత ఆశ్చర్యాన్ని ,అమిత ఆనందాన్ని కల్గించాయి ..మంగళ వారం సాయంత్రం మా అమ్మాయి విజ్జి  పక్క ఇంటి రవి  గారు స్వంత పని మీద అలబామా లోని మాంట్ గోమారి కి కార్ లో వెళ్తున్నారని ,మైనేని వారుండే హన్త్స్ విల్ దానికి దగ్గర్లోనే ఉంటుందని ,ఆయన ఊర్లో ఉంటె ఆరోగ్యం గా ఉండి ఇబ్బంది లేక పోతే అక్కడికి వెళ్ళచ్చు అని చెప్పింది .వెంటనే గోపాల కృష్ణ గారికి ఫోన్ చేశాను .ఆయన ఇంట్లో లేరు .కాసేపటి తర్వాత ఆయనే ఫోన్ చేశారు .విషయమ్  చెప్పాను .అంత కంటే ఆనంద కారక  మైంది లేదని మాంట్ గోమారి కి వస్తే హన్త్స్ విల్ కు తీసుకొచ్చే బాధ్యత తనదే నని చెప్పారు .అప్పుడు రవి గారి తో చెప్పాను .అలానే వేల్దామన్నారు .గురువారం సా యంత్రం అయిదు గంటలకు బయల్దేరి ,రాత్రి పద కొండు గంటలకు మాంట్ గోమారి వెళ్తామని ,మర్నాడు ఉదయం మైనేని వారు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళే ఏర్పాటు చేసి ,మళ్ళీ ఆదివారం ఉదయానికి లేక శని వారం రాత్రికి  నన్ను మాంట్ గోమారి కి చేరిస్తే చాలని ,ఆ మధ్యాహ్నం బయల్దేరి శార్లేట్ కు రాత్రికి రావచ్చు అని చెప్పారు .ఈ సంగతి గోపాల కృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పాను .ఆయన వెంటనే బస్ డిపో  వారితో మాట్లాడి శుక్రవారం తెల్ల వారుజ్హామున అయిదింటి బస్ కు మాంట్  గోమారి నుంచి హన్త్స్ విల్ కు  ,శని వారం రాత్రి ఆరున్నరకు హన్త్స్ విల్ నుండి మాంట్ గోమారికి టికెట్స్ రిసేర్వ్ చేసి నట్లు ఫోన్ చేసి చెప్పారు .రెండే రెండు రోజుల లో నిర్ణయ మైన ప్రయాణం ఇది .ఎందుకో ఆయన్ను చూడాలని మనసు లో అని పించినా అంత దూ రం వెల్ల లేని విషయమే నాకు .ఆ కోరిక ఇలా తీరింది .ప్రభావతి ,మా అమ్మాయి  చాలా సంతోషించారు .ఇదీ ఈ ప్రయాణానికి నే పద్యం .ఇదంతా మా అమ్మాయి విజ్జి ఆలోచనే .ఫలించింది .

ప్రయాణం – గోప్లక్రిష్ణ గారితో -ఫొటోస్
 అలవోక గా అలబామా
నేను రాస్తున్న ”సిద్ధ యోగి పుంగవులు ”ఇరవై ఎపి సోడ్లతో పూర్తీ చేయాలని పించింది .అందుకే రోజుకు మూడు చొప్పున రాసి బుధ వారానికే ఇరవై పూర్తీ చేసి ఈ వ్యాస పరంపర ను మైనేని గోపాల కృష్ణగారికి”అన్కితమిచ్చాను .మూడు రోజులు ఊర్లో ఉండను కనుక అంతా పూర్తీ చేయాలనే సంకల్పం తో నిద్ర కూడా పట్ట లేదు .అయిన తర్వాత ”హమ్మయ్య ”ఆ కొన్నాను .గురు వారం సామాను సర్దుకొని రెడి గా ఉన్నాను .సాయంత్రం అయిదు కే భోజనం చేసి సిద్ధ మయ్యాను .దారిలో తిన టానికి టాగ టానికి విజ్జి బిస్కట్లు ,మంచి నీళ్ళు ,జ్యూసులు ఇచ్చింది .భక్తికి సంబంధించిన కొన్ని సి.డి.లు ,శ్రీ ఆంజనేయ స్వామి చిన్న ఫోటో తీసుకొన్నాను .ఐదున్నరకు రవి గారి కారు లో బయల్దేరాం .పటేల్ బ్రదర్స్ లో కూరలు కొన్నారు రవి .మళ్ళీ ఆరున్నరకు అక్కడి నుండి బయ లు దేరాం .చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ రవి .చాలా హాయిగా స్పీడ్ గా నడిపిస్తూ రెండు గంటల తర్వాతా సౌత్ కరోలినా లో ప్రవేశించాం .అక్కడ ఒక పెద్ద”సవాన్నా  నది” ఉంది .అక్కడ నాకు కాఫీ ని మాక్దోనాల్ద్ లో ఇప్పించారు .స్ప్రైట్ కూడా తాగించారు .రెస్ట్ రూమ్స్ కు వెళ్లి మళ్ళీ బయల్దేరాం .ఒక గంట తర్వాతా జార్జియా రాష్ట్ర ప్రవేశం చేశాం .దీని రాజ దాని అట్లాంటా .ఇక్కడ కొన్నేళ్ళ క్రితం ఒలిం పిక్స్  జరిగాయి .అప్పుడు నగరాన్ని సర్వాంగ సుందరం గా తయారు చేశారు .పదహారు లైన్ల ఎక్స్ప్రెస్ రోడ్ నిర్మించారు .జిమ్మీ కార్టర్ ఇక్కడి వాడే .అట్లాంటా నగరమే వంద మైళ్ళ పొడవుంటుంది అంటే 150కి.మీ.దాటటానికి గంటన్నర పడుతుంది .ఎక్స్ప్రెస్ లైన్ లో గంటకు వంద మైళ్ళ స్పీడ్ తో కారు నడపాలి అంటే నూట యాభై కిలో మీటర్ల వేగం .మిగతా చోట్ల ఎనభై మైళ్లకు అంటే నూట ఇరవై కి.మీ.తగ్గ కుండా ప్రయాణం చేయాలి .అలానే రవి కార్ నడి  పారు .అట్లాంటా లో విమానాల రన్వే రోడ్ల మీదకే ఉంటుంది .బ్రిడ్జిల కింద కార్లు ప్రయాణిస్తుంటే పైన రన్ వే మీద విమానాలు ఎగరటం దిగటం ఆశ్చర్యం గా ఉంటుంది .అంత వేదలపిన బ్రిడ్జిలు రెండున్నాయి .
అట్లాంటా దాటితే అలబామా రాష్ట్రం లో ప్రవేశిస్తాం .ఇక్కడ ఆబర్న్ యుని వేర్సిటి కి మంచి పేరు .ఇక్కడే కియా అనే మోటారు కార్లు తయారు చేసే సంస్థ ఉంది .హ్యుండై వారి కర్మాగారాము ఉంది .ఇంకో కార్ల ఫాకే టరి కూడా ఉంది .ఇవి చూసుకుంటూ ,రాత్రి పదకొండు గంటలు అంటే అలబామా కాల ప్రకారంమాంట్ గోమారి  చేరాం .శార్లేట్ కాలమానం ప్రకారం రాత్రి పన్నెండున్నర.ఇక్కడి కంటే అక్కడి టీం ఒక గంట వెనక .రవి స్నేహితుడు సత్య వాల్ల ఇంటి కి తీసుకొని వెళ్లాడు .అక్కడ రాత్రి బస .మంచి నీళ్ళు తాగి పడుకొన్నాను .
శుక్ర వారం ఉదయం నాలుగు గంటలకే సిద్ధం అయి రవి నన్ను బస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి ”గ్రే హౌండ్స్ ”అనే బస్ సర్వీస్ నడిపే బస్ ఎక్కించారు పస పోర్ట్ ఉండాలి .అది అరగంట లేటు గా బయల్దేరి ,ఏడు గంటలకు బర్మింగ్ హాం చేరింది .అక్కడ సామాను తో దిగి మళ్ళీ బస్ ఎక్కాలి .అలానే ఎక్కి కూర్చున్నాను .గ్రే హౌండ్స్ అంటే సన్నగా ఉండే ”వేట కుక్క జాతి” .బాగా వేగం గా పరుగెడు తుంది .అందుకని ఆ పేరు .బస్ మీద దాని బొమ్మ కూడా ముద్రించి ఉంటుంది .దీన్ని ప్రభుత్వం దాదాపు డెబ్భై ఏళ్ళు గా నడుపు తోంది .మన ఆర్.టి.సి.లాంటిది సౌకర్యం గా ఉంటుంది .ఎనిమిడి న్నర  కు బస్ బయల్దేరింది .డౌన్ టౌన్ మీదు గా ప్రయాణం చేసి ఉదయం తొమ్మిదిన్నరకు హన్త్స్ విల్ చేరింది .దారిలో ”తెన్నిసి నది ”కనించింది .ప్రముఖ నాటక కర్త తెన్నిసి విలియమ్స్ గుర్తుకొచ్చాడు .ఇది చాలా సార వంత మైన రాష్ట్రం .జార్జియా ,అలబామా లు తెల్ల బంగారం అన బడే ”ప్రత్తి పంట ”కు కేంద్రం .మన బొంబాయిని బర్మింగ్ హాం ఆఫ్ డి ఈస్స్ట్ ”అనటం గుర్తుకొచ్చింది .మైనేని వారు నన్ను రిసీవ్ చేసుకొని కార్ లో ఇంటికి తీసుకొని వెళ్లారు .ఎంతో ఆప్యాయత చూపించారు దంపతులు గోపాల కృష్ణ ,స త్య వతి గార్లు .
మంచి కుటుంబం
గోపాల కృష్ణ గారు ఆరడుగుల అంద”గారు” .పచ్చని శరీరం .కోటేరు తీరిన ముక్కు .సంస్కారం శరీరం అంతా నిండిన  వారు .ఆప్యాయత కు ,ఆత్మీయత కు పెట్టు .స్నేహానికి అర్రులు చాచే స్వభావం .నిరంతర అధ్యయన శీలి .ప్రపంచ సాహిత్యాన్ని పుడిసిలి పట్టారు .భారతీయ సాహిత్యం అంటే యేన లేని మక్కువ .ఇక్కడి లైబ్రరి లో అత్యున్నత హోదా లో పని చేసి రిటైర్ అయారు .ఇంకా చాలా సంవత్స రాలు చేయచ్చు .కాని సంతృప్తి తో  విరమణ చేశారు .భార్య సత్య వతి గారు సాధ్వి .ఆయనకు నిజమైన అర్ధాంగి .అంతా తానే అయి ఇల్లు దిద్దు కొంటారు .ఆయన వ్యాసంగానికి అడ్డు పడరు చాలా సాధారణ చీర జాకెట్ తో సామాన్య గృహిణి లా ఉంటారు .న్యాయం గా అలా ఉండాల్సిన ఆవ సరం లేదు .కాని ఆవిడకు అదే ఇష్టం ”స్వయం సిద్ధ”అని పిస్తారు .వాళ్ళున్న ఇంటిని ”రాంచ్ హౌస్ ”అంటారు .వెనక విశాల మైన దొడ్డి వుంటుంది .దానిలో అన్ని రకాల కూర గాయల్ని స్వయం గా పెంచి పండిస్తారు .అందరికి ఉచితం గా అందిస్తారు .నాలు గెల్ల క్రితం మాకు డెట్రాయట్ కూడా పంపారు .ఆమెకు గోపాల కృష్ణ గారే సర్వస్వం .వీరి పెద్దబ్బాయి కృష్ణ ఇక్కడి స్పేస్ సెంటర్ లో ఫిసిక్స్ లో రిసెర్చ్ పెర్సన్ .ఎన్నో కొత్త విషయాలను కనీ పెట్టారు .ఒక సారి ఉయ్య్యురు వచ్చి నప్పుడు కంప్యుటర్ ను లైబ్రరి కి అందించిన ఉదారుడు .తండ్రికి తగ్గ కుమారుడు .ఇండియా వచ్చి నప్పుడు నేను చూశా .అతని భార్య రమ .ఫార్మసి లో ఉద్యోగం .వీరి కుటుంబం ఇక్కడే అయిదు మైళ్ళ దూరం లో ఉంటుంది .ఇతని ఆడపిల్లలు శ్రేయ ,సనారా.పెద్దబ్బాయి రవి .”బన్యన్ ట్రీ”అనే ఫైనాన్స్ సంస్థకు అది నేత .స్వయం కృషి తో వ్యాపా ర ,వాణిజ్య రంగాలలో ఎదిగిన వాడు .భార్య కవిత డాక్టర్ .వీరికి ఒక అబ్బాయి ,ఇద్దరమ్మాయిలు .పిల్లలకు తలి దండ్రుల ఆత్మీయత ను పంచటం లో ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు .తండ్రి మాట జవ దాటని కొడుకులు .వారి దారికి అడ్డం రాని తండ్రి .వారి అభి వృద్ధే ధ్యేయం గా జీవిస్తున్న సంతృప్తి ఉన్న కుటుంబం .అందుకే ”మంచి కుటుంబం ”అన్నాను .
నేను స్నానం చేసి న తర్వాతా ఇడ్లి ,దోసె చట్నీ సాంబారు లతో టిఫిన్ పెట్టారు .తిన్నాను గోపాల కృష్ణ గారితో .కాఫీ బాగా ఉంది .గోపాల కృష్ణ గారి కార్ లో బయల్దేరి ఊరంతా కొంత చూపించారు .
అమెరికా లో ఆకునూరు

This slideshow requires JavaScript.


ఉక్కు కాకాని అని పిలువ బడే స్వర్గీయ కాకాని వెంకట రత్నం గారిది ఉయ్యురు రు దగ్గర ఆకునూరు గ్రామం .అక్కడికాకాని బ్రహ్మేశ్వర రావు గారి కుమారులు ప్రసాద్ ,బాబూ రావు లు దాదాపు ముప్ఫై ఏళ్ళ పై నుండి ఇక్కడ స్తిర పడ్డారు .బ్రహ్మేశ్వర రావు గారితో నాకు మంచి పరిచయం ఉంది .ఆయన ఆజాను బాహువు .తెల్లని ఖద్దరు అంచు పంచలు లాల్చీ తో ఉండే వారు .దబ్బ పండు మై ఛాయ .చాలా ఆప్యాయం గా పలక రించే వారు .ఒక సారి ప్రసాద్ గారు ఆకునూరు వచ్చి నప్పుడు అతన్ని నాకు పరిచయం చేశారు అప్పుడు భార్య ,ఇద్దరు పిల్లల్ని చూసిన  జ్ఞాపకం .ఆ తర్వాత ప్రసాద్ ఇండియా వచ్చి నప్పుడు నేను కానీ పిస్తే పలకరించే వారు .అడిజ్ఞాపకం .బ్రహ్మేశ్వర రావు గారు ఈ మధ్యనే 98 ఏళ్ళ వయసు లో పరమ పదించారు .వెంకట రత్నం గారికి కజిన్ అని గుర్తు . వప్రసాద్ తండ్రి కార్య క్ర  మాలకు ఇండియా వెళ్లి వచ్చారు .వాళ్ళిద్దర్నీ కలుద్దామని మైనేని వారి ఆరాటం .
కాకాని బాబూ రావు గారు బిజినెస్ మాగ్నెట్ .ఎంతో సంపాదించారు .ఎన్నో సంస్థలకు అది నేత .”ఇండియా హౌస్ ”అనే విశాల మైన స్థలం లో బిల్డింగ్ కట్టి ఎన్నో చెట్లుపెంచి  కూరలు పండిస్తున్నారు పెద్ద ఆశ్రమం లా ఉంది ..దాన్ని చూశాం.అక్కడి నుండి బాబూ రావు గారి ఇంటికి వెళ్ళాం .ఆయన చాలా ఆప్యాయం గా మాట్లాడారు .ఆయన భార్య కృష్ణ కుమారి గారు గొప్ప డాక్టర్ .ఇక్కడ ఎంతో మందికి పురుళ్ళు పోసిన పుణ్య మూర్తి గా గోపాల కృష్ణ గారు చెప్పారు .ఎన్నో సంఘాలకు ఆమె ప్రతినిధి ,వైద్యం లో మంచి పేరు ఆమెకు .మేము వెళ్లి నప్పుడు ఇంట్లో లేరు
   సామాజిక సేవ లో ధన్య మైన వనిత
కాకాని ప్రసాద్ పేరు మోసిన వైద్యులు .చాలా కాలం వైద్య రంగం లో ఉంది ఇంకా డబ్బు చాలు అని అని పించి స్వచ్చందం గా విశ్రాంతి తీసుకొంటున్నారు .భార్య శ్రీ మతి భావాని గారు ప్రసాద్ గారు మమ్మల్ని ఆదరం గా ఆహ్వా నించారు .ఆమె గొప్ప సాంఘిక సేవా కర్త .ఎన్నో మంచి పనులు చేస్తూ హన్త్స్ విల్ కు గుండె కాయగా నిలిచి మన్నన పొందు తున్నారు .మన సరసభారతి అన్న దమ్ములిద్దరికి మైనేని వారి వల్ల బాగా తెలుసు .ఉయ్యూరు ఊసులు చదివి ఆనందించారు .తమ చిన్న  తనం అంతా జ్ఞాపకం వచ్చిందన్నారు .నా రాక వారికి ఆనందం కల్గిందని చెప్పారు .భవాని గారు చాలా ఆప్యాయం గా పలకరించారు .భారతీయ ధర్మ మైన సేవ ను ఆచరించి చూపిస్తున్నారు .ఒక రకం గా కాకాని వెంకట రత్నం సేవా నిరతి ఇక్కడ ప్రతి ఫలించిందని పించింది .అందుకే” అమెరికా లో ఆకునూరు” అన్నాను .
హెలెన్ కెల్లర్ జన్మ స్థల సందర్శనం
ఇంటికి వచ్చే సరికి రెండు అయింది .భోజనం లో పప్పు చిక్కుడు కాయ కూర ,వంకాయ కూర స్క్వాష్ పచ్చడి ఆవకాయ ,సాంబారు జిలేబి పులిహోర పాయసం తో సత్య వతి గారు భోజనం వడ్డించారు ,కూరలన్నీ దొడ్లో పండినవే .చాలా రుచి కరం గా చేశారు .కాసేపు విశ్రమించన తర్వాతా ద్రోణ వల్లి రామ మోహన రావు గారు వచ్చారు .ఆయన ఇక్కడి ”నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్ ”అధ్యక్షులు .చాలా బోళా గా నిర్మోహ మాటం గా  మాట్లాడు తారు .అన్నీ తెలిసిన వారు .రాజకీయాలను కాచి వడ బోశారు .”దేశ భాష లందు తెలుగు లెస్స ”అనే పుస్తకాన్ని సంకలీకరించారు .తెలుగు ను గురించి ఎవరు ఏయే భావాలు పద్యాల్లో వచన కవిత ల్లో చెప్పారో అవన్నీ క్రోడీకరించి పుస్తకం గా తయారు చేశారు .కాసేపు మాట్లాడి వెళ్లారు .ఆయన సమక్షం లో బాల మురళి పాడిన ”శివా నంద లహరి ”మొదలైన సి.డి .లు అందజేశాను గోపాల కృష్ణ దంపతులకు .
ఆ తర్వాత గోపాల కృష్ణ గారి పెద్దబ్బాయి కృష్ణ పిల్లల తో వచ్చారు .గోపాల కృష్ణ గారు నేను అతని కార్ లో బయల్దేరి గంటన్నర ప్రయాణం చేసి మస్కామ్బియా అనే ప్రదేశం చేరాం .అదే హెలెన్ కెల్లర్ పుట్టి న ఊరు .ఆమె జన్మించిన భవనాన్ని ప్రభుత్వం స్మృతి చిహ్నం గా చేసింది .ఆమె పెరిగిన వాతా వరణం అంతా చూశాము .దీనికి టికెట్ ఉంది .ఆ తర్వాతా హెలెన్ జీవిత చరిత్ర ను ”గిబ్బన్ ”రాసిన నాటకం ఆధారం గా ఒక నాటకాన్ని ప్రదర్శించారు .చాలా బాగా అందరు చేశారు .ఆరు బయట గాలరీ ముందు ప్రదర్శన .నూట ఆరు డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత .చెమటలు కక్కుతూ విసురు కొంటూ జనం చూశారు .నిండి పోయారు .ఆమె పై అంతటి అభి మానం .మేము ముందుగా పులిహోర ,ద్రాక్ష పళ్ళు డ్రింక్స్ లాన్ లో కూర్చొని తిన్నాం ఎనిమిది నుంచి పది గంటల దాకా నాటకం .మధ్య లో పావు గంట విరామం .హెలెన్ జీవితం పై ”పాకెట్ ఎడిషన్ ”కొని నాకు ఇచ్చారు గోపాల కృష్ణ గారు .ఒక గొప్ప ప్రదేశాన్ని గొప్ప ఆవిడ చరిత్రను కను లారా చూసే మహా భాగ్యం కలిగింది అని మహా సంతృప్తి చెందాం .బయల్దేరి ఇంటికి వచ్చే సరికి రాత్రి పదకొండున్నర .మేము వచ్చే సరికి సత్య వతి గారు మజ్జిగ చేసి అందులో కరివే పాకు అల్లం కలిపి రెడి చేశారు .చెరో రెండు గ్లాసులు తాగి పడుకోన్నాం.ఆ రోజు రాత్రి మంచి నిద్ర పట్టి బడలిక పోయింది .ఇంత ప్రయాణం లో నిద్ర లేమి లోను నేను చాలా ఫ్రెష్ గా కనీ పిస్తున్నానని మైనేని వారు చాలా సార్లు అనడం వారి విశాల దృక్పధానికి తార్కాణ ,
షార్లేట్  నుంచి  హంట్స్ విల్ కు  600 మైళ్ళు .అంటే 900 కి.మీ.మాంట్గోమారి నుండి హన్త్స్ విల్ కు రాను ,పోను బస్ చార్జి  250 డాలర్లు .మాంట్ గోమారి లోనే బానిసల తిరుగు బాటు ఉద్యమం ఊపందుకొంది .ఇతర చోట్లకు పాకింది .అక్క డె మార్టిన్ లూధర్ కింగ్ ఎక్స్ప్రెస్ వే ”ఉంది .ప్రత్తి పంట,గోధుమ జొన్నపంటలకు అలబామా ప్రసిద్ధి .పరిశ్రమలు కూడా .హన్త్స్ విల్ రాకెట్ కేంద్రం .రాకెట్లను స్పేష్ షిప్ లను ఇక్కడే తయారు చేసి ఫ్లారిడా లోని మియామి అనే అట్లాంటిక్ సముద్ర తీరం నుండి ప్రయోగిస్తారు .మిగిలిన విషయాలు మళ్ళీ తెలియ జేస్తాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-7-12.–కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 3 Comments

గోపాల కృష్ణ గారి – ఆతిధ్యం

నమస్తే -గోపాల కృష్ణ గారు -”రేడియేషన్ పోయెమ్స్ ”అనే కవితా సంకలం గురించి నేను రాసిన ఆర్టికల్ ఈ నెల విహంగ వెబ్ మాగజైన్ లో పడింది .దానిని మీకు పంపాను .మీరు దాన్ని బాపు గారికి పంపుతామన్నారు కదా -పంపండి .కాకాని ప్రసాద్ ,రామ మోహన రావు గార్లకు ఫోటోలు పంపాను .ప్రసాద్ గారికి వెళ్లి నట్లు లేదు .మీరు ఫార్వార్డ్ చేయండి –మీ ఊళ్ళో నాకు అత్యంత ఆడరమైన స్వాగతాన్ని ,ఆతిధ్యాన్ని మీ ”మంచి కుటుంబం ”అందరు అంద జేసి నందుకు కృతజ్ఞతలు .నేను వచ్చి ఇబ్బంది పెట్టానేమో నని మనసు లో ఉన్నా ,మిమ్మల్ని చూడాలన్న తపన అంత పని చేయించింది .మీ సా హితీ, సాంఘిక మిత్రుల్నీ పరిచయం చేసినందుకు మీ” నార్త్ అలబామా తెలుగు అసోసియేషన్” (నాటా ) తరఫున మీ సంఘ అధ్యక్షులు రామ మోహన రావు గారితో సన్మానం చేయించి ,జ్ఞాపికను అంద జేసి నందుకు మీ అందరికి కృతజ్ఞతలు .బహుశా ఈమాట సరి పోదు -చిన్న మాట అవుతుంది ..హన్త్స్ విల్లి ని నేను ”వేట పాలెం లేక వేట పల్లి” అనచ్చు అని  మీతో  చేప్పా ను .అది వేట పాలెం అయితే మీరు దాని లైబ్రేరియన్ .అంతే కాదు హన్త్స్ విల్ ”రుషి పుంగవులు ”మీరు అని నా అభిప్రాయం .మీ ఆలోచనా ,సాంఘిక సేవ ,సహనం,సమాజం పై అణు కంప స్నేహశీలత ,సచ్చీలత ,ఉదారహృదయం ,మిత్రత్వం ,బంధు హితం అన్నీ ఒక రుషి కి ఉండే లక్షణాలు .అవి మీలో మూర్తీభావించాయి .అందుకే ”హన్త్స్ విల్ రుషి ”అన్నాను .మీ సహధర్మ చారిణి గారు ”స్వయం సిద్ధ ”.మీకు అను క్షణ అనుగామిని .సౌశీల్యం కుటుంబ భావన మూర్తీ భావించిన మాత్రు మూర్తి .మీ పిల్లలు రత్న మాణిక్యాలు .ఇంత కంటే  తల్లి దండ్రులకు ఇంకేం కావాలి ?మీ అందరి మధ్య రెండు రోజులు క్షణం తీరిక లేకుండా గడి పీ నందుకు అమితా నందం గా ఉంది ..నన్ను షార్లెట్  నుంచి మీ ఊరికి రావటానికి నన్ను కార్ లో ఇక్కడి నుండి మాంట్  గోమారి కి ,మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ,అనుక్షణం  ‘అంకుల్ ”అంకుల్ ”అంటూ నాకే లోటు రాకుండా చేసిన మా అమ్మాయి వాళ్ల ప్రక్కింటి పసుపుల రవి కి నేనేమిచ్చి ఋణం తీర్చు కో గలను ? మీరు  నాకు మాంట్ గోమారి నుండి హన్త్స్ విల్ కు ,ఆక్కడి నుండి మాన్త్గోమారి కి మీ” గ్రే హౌండ్స్(వేట కుక్కల ) ”బస్ లో రేసేర్వేషణ్ చేయించి  ,నా ప్రయాణానికి  వీలు కల్పించిన మీకు ఎన్ని కృతజ్ఞతలు చే ప్పినా తక్కువే .
      సరసభారతి కి మీరు భారీగా  అండగా నిలిచిన విషయం జీవితం లో మరువలేనిది .మీరు చేసిన సత్కారం నాకు కాదు ”సరస భారతి ”కి  అనిమనస్పూర్తి గా భావిస్తూ ,అట్లాంటా లో నాటా సభలు జరిగుతున్న సందర్భం లో మీ హన్త్స్ విల్ లో సత్కరించటం నాకు తానా ఆటా ,నాటా అలలో సన్మానం అందు కొన్న మహదానందం గా ఉంది .అందరి లోని మంచినీ ఒక్క సారి చూసే అరుదైన అవకాశం కల్పించారు .రెండు రోజుల ముందు మాత్రమే అనుకొన్న ప్రయాణం అత్యంత ఆనందంగా ఫలవంతం గా జరిగింది .ఊహించని ప్రయాణం ఇది .”అలబామా కు అలవోక గా ”రావటం జరిగినా ,మనసంతా మధుర భావన నిండింది .–మీ దుర్గా ప్రసాద్
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం – విహంగ లో

రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం

Posted on July,2012 by విహంగ

                                       http://vihanga.com/?p=4440

              సాధారణం గా కుటుంబం లో ఎవరి కైనా జబ్బు చేస్తే కాలూ ,చేయి ఆడక తన్ను కొంటాం .నానా కంగారు పడిపోతాం .మన కంగారుని ఇతరులకూ అంటించి ,వారినీ ఇబ్బంది పాలు చేస్తాం .మరి ఆ జబ్బు కుటుంబ పెద్ద ,భర్త అయితే ,అది కేన్సర్ వంటి తీవ్ర వ్యాధి అయితే అతని భార్య తట్టుకో గలదా ?.దానికి రేడియేషన్ చికిత్స నలభై మూడు   రోజులు, రోజూ  చేయాల్సి వస్తే ,ఆమె మానసిక స్తితి తట్టు కోగల దా.?అలాంటి విపత్కర పరిస్తితి నే ఎదుర్కొంది ‘జేన్ ఎలన్ ‘’ అనే  కవయిత్రి , రచయిత్రి .ఆ బాధను తగ్గించు కోవటానికి ,భర్తకు సాంత్వన కల్గించటానికి’’రేడియేషన్ పోయెమ్స్ ‘’ పేరిట రోజుకొక సానెట్ అంటే పద్నాలుగు పంక్తుల కవిత ను రాసింది .చికిత్స విజయవంతం అయి,భర్త మళ్ళీ మామూలు మనిషి అయాడు .ఆ కవితలు ఎంతో మంది డాక్టర్లకు ,కేన్సర్ పేషంట్లకు ఊరట  కలిగించి ,మనో నిబ్బరం పెంచాయి .ఇదే ఈ వ్యాస  విషయం .

          జేన్ ఎలన్ అంతకు ముందు ఎన్నో పుస్తకాలు రాసింది .ఎన్నో అవార్డులు పొందింది .చిన్న పిల్లలకు  ఆమె రాసిన పుస్తకాలు బాగా ప్రచారం అయాయి .’’ఔల్ మూన్ ‘’, ది డేవిస్ అరిత్మాటిక్ ‘’’’హౌ డు  డైనోసార్స్ సే  గుడ్ నైట్ ?’’అనే పుస్తకాలు ఆమెను ‘’అమెరికా స్ హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ‘’ను చేశాయి .ఆమెను ఆధునిక ‘’ఈసప్ ‘’అని న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రసిద్ధ  పత్రికలు  ప్రశంసించాయి .ఆమె పుస్తకాలను ఇరవై ఒక్క భాషల్లోకి అనువాదం చేశారంటే ,ఆమె ఎంత గొప్ప రచయితో మనకు అర్ధమవుతుంది .క్రిస్టోఫర్ అవార్డ్ ,రెజీనా మెడల్  ,’’దిసొసైటీ ఆఫ్ చిల్డ్రన్స్ బుక్ రైటర్స్ అండ్ ఇల్లస్ట్రెటర్సు ’’అవార్డ్ లాంటి ఎన్నో అవార్డులు ,రివార్డులు పొందింది .ఆమెరచన  నేషనల్ బుక్ అవార్డ్ కు నామినేట్ అయింది .మూడు ఆనరరి డాక్టరేట్లను పొందిన విదుషీ మణి. భర్త డేవిడ్ స్టేమ్పుల్  తో మసా చూసెట్స్ ,సౌత్ లాండ్ లో ఉంటోంది .

           భర్త కూడా తక్కువ వాడేమీ కాదు . మసా చూసెట్స్ లో కంప్యూటర్ ప్రొఫెస్సర్ .చివర్లో ఆ శాఖకు చైర్మన్ గా పని చేశాడు.రిటైర్ అయిన తర్వాత పక్షుల విషయం పరిశోధన చేబట్టాడు .రికార్డ్ చేయటానికి మద్య ,దక్షిణ అమెరికాలలో బ్రిటీష్ ఆయిల్స్ లో విస్తృతం గా పర్యటన చేశాడు .తన పరిశోధనా ఫలితాలను ,రికార్డింగ్ లను ‘’మెకాలే లైబ్రరి ఆఫ్ నేచురల్ సౌండ్స్ ఎట్  కార్నెల్ యూనివర్సిటీకి’’ దానం చేశాడు . అలాంటి విద్యా నిష్ఠ గల దంపతులు వారిద్దరూ .ఆయన కు కేన్సర్ వ్యాధి బ్రెయిన్ ట్యూమర్  వచ్చింది .చికిత్స చాలా కష్టం .రేడియేషన్ ట్రీట్ మెంట్ మాత్రమే శరణ్యం అని తేల్చారు .అదీ వరుసగా నలభై మూడు రోజులు చేయాలని నిర్దారించారు .

              దీన్ని తట్టు కోవటం భార్య జేన్ ఎలన్ కు బహు కష్టమైంది .ఆయన ఎలా అయినా గండం గడచి బయట పడాలని శత కోటి దేవుళ్ళకు మొక్కు కుంది .మనసును చిక్క బట్టుకోవటం కోసం రోజూ చికిత్స అయి ఇంటికి చేరిన తర్వాత ఆమె ఒక సానెట్  రాసేది.వాటికే ‘’రేడియేషన్ పోయెమ్స్ ‘’అని పేరు పెట్టింది .

                వాటిలో ఆమె భయం ,ఆందోళన ,ప్రేమ ,బాధ్యత ,చికిత్సా విధానం ,ఆధునిక టెక్నాలజీ… చేస్తున్న సేవ మొదలైన వాటిని నింపింది .తాను స్వాంతన పొంది ,భర్తకూ స్వాస్థ్యం చేకూర్చటమే ఆమె ధ్యేయం .అన్ని కవితలూ రాసి ‘’నేషనల్ పబ్లిక్ రేడియో ‘’లో విని పిస్తే అనూహ్య మైన ప్రతి స్పందన వచ్చింది .వైద్య సాంకేతికత కు ఆమె జోహార్లు అర్పించింది .ఈ కవితల్లో దేవుడి పై కోపం ,కొద్దిగా భర్త ఆరోగ్యం మెరుగైతే ఆనందం ,ఇంతలో ఆవేశం ,నిరాశ ,ఆశల పొరలు అన్ని ఎమోషన్స్ కవితల్లో నింపింది .తను ఆరోజు పొందిన అనుభూతినంతా సానెట్ లో పొందు పరచింది .భర్త తో ఉన్న అనుబంధం , ప్రేమ , వివాహ బంధాలు అన్నీ గుర్తు చేసుకొన్నది .తన నిస్వార్ధత ను ,అంకిత భావం తో తాను చేస్తున్న సేవను ,కోలుకుంటాడనే ఆత్మ ధైర్యాన్ని ,ఎవరైనా బంధువులు ,స్నేహితులు భర్త ను వచ్చి చూసి నప్పుడు పొందిన ఉద్విగ్నతలను  చక్కగా నిక్షిప్తం చేసింది జెన్స్..ఈ కవితలు విన్న వారందరికి ఊరట కల్గింది .మనో ధైర్యం పెరిగింది .జీవిస్తాం అనే ఆశ ,నిబ్బరం హెచ్చాయి .అంత గొప్ప ప్రాభావం చూపించాయి ఆమె సానేట్స్ .

          భార్యా భర్తల మద్య ఉండాల్సిన సయోధ్యతను ,కష్ట  సమయాల్లో ఉండాల్సిన ఆత్మ ధైర్యాన్ని ప్రబోదిస్తాయి .’’’కష్టాల కడలి లో ఈదే వారికి ఈ కవితా సంకలనం ఒక తెడ్డు లాగా ఉపయోగ పడుతుంది ‘’అని పత్రికలూ మెచ్చాయి .ఆమె ప్రశాంత మనస్కురాలై ,అందరికీ ఆ ప్రశాంతత పంచింది ..హృదయాలను తాకే ఎన్నో కవితా పంక్తులు అందు లో ఉన్నాయి .’’కవిత్వాన్ని చికత్స కోసం ప్రయోగించిన కవయిత్రి జెన్స్’’.

   రేడియేషన్ చికిత్స పరమ బాధా కరం .దాన్ని ఏ పేషెంటూ తట్టు కోలేడు  ,చూసే వారు తట్టు కోలేరు .దాన్ని తట్టు కొని నిలబడే ధైర్యం కలగటానికే ఆమె రాశానని చెప్పింది . wit is the only wall between us and the daark ‘’అన్నMark Van Do ren  అనే రచయిత మాటలు ఆమెకు ప్రేరణ నిచ్చాయి .ఈ కవితలను ‘’పెర్ఫార్మన్స్ పోయెమ్స్ ‘’అన్నారు .అంటే గట్టి గా బయటకు చదివి వినిపించేవి .అప్పుడే దాని ప్రభావం తెలుస్తుంది .ఈ కవితల్ని తనను తాను ఆవిష్కరించు కోవటానికి,గుండె గొంతులో కొట్టుకుంటున్న బాధను బయట పడేసేదానికోసం రాశానని ఆమె చెప్పుకోంది ‘సానెట్ అంటే నాల్గు పంక్తులున్న మూడు భాగాలు చివర్లో ఒక ద్విపద అంటే కప్లేట్.కప్లేట్ లో ముందు రాసిన దాని సారాంశం అంతా ఉండటం విశేషం .కేన్సర్ వ్యాధి ఏడవ టానికి సమయం ఇవ్వదని,తాను,తన భర్త ‘’ఇద్దరం ఫైటర్స్’’ మని అంటుంది .సానెట్ నే ఎందుకు రాశావు అంటే compression of poetry echos compression of emotions ‘’అని చెబుతూ , విషయాన్ని తాను ఎంచుకొన్నానని ‘’ఫారం’’ తన్ను ఎన్నుకొన్నదని జెన్స్ అన్నది .వీటిని భర్త డేవిడ్ కు అంకిత మిచ్చింది . కొన్ని కవితా పంక్తులు మీ,  మన కోసం –

 I want another April ,May and June –I want still the wanting so muchh .

  if we breathe enough to share ,-to give you ,along with care

If i could know that it was best,–i would feed you ,husband,at mya breast ‘’

         చివరి పంక్తి చాలా అద్భుతం గాఉందికదూ.దీన్ని చదివితే కొలకలూరి ఇనాక్ గారి కధ ఒకటి గుర్తుకు వస్తోంది .పేరు జ్ఞాపకం లేదు.కాని భార్యా భర్త రాయల సీమ ప్రాంతం వారు .తిండికి గడవక వలస వెళ్తూ ఉంటే భర్త కు దాహం అయి గొంతెండి పోయి పడి పోయే పరిస్థితి లో ఉంటే భార్య స్తన్యం ఇచ్చి ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆయన ఎన్నో గొప్ప కధలు రాసినా ఈ కధే నాకు బాగా నచ్చింది .కాని పేరు ఎందుకో ఎన్ని సార్లు ప్రయత్నించినా గుర్తుకు రాదు.ఆ కధ  విషయం ఇనాక్ గారికి నేను ఒక సారి గుర్తు చేస్తే ,చాలా సంబర పడిపోయారు.*

– గబ్బిట దుర్గా ప్రసాద్

 

Posted in రచనలు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం ) అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.

 సిద్ధ యోగి పుంగవులు –20(చివరి భాగం )

                                                       అపర పతంజలి యోగి- మాస్టర్ సి.వి.వి.

          క్రీ.పూ.మూడవ శతాబ్ది లో పతంజలి మహర్షి రాసిన యోగసూత్రాలను ,ఆధునిక జగత్తుకు అను కూలం గా మార్చి ,మేడం బ్లావస్కీ సిద్ధాంతాలను జోడించి ‘’భ్రుక్త రహిత తారక రాజ యోగం ‘’పేరు తో తయారు చేసిన వారు మాస్టర్ సి.వి.వి.అని మంత్ర నామాన్ని పొందిన కంచు పాటి వెంకట వేంకా స్వామి రావు గారు .

          విజయ నగర సామ్రాజ్య కాలం లో ఆంద్ర దేశంనుంచి అరవ దేశానికి ఎన్నో కుటుంబాలు వలస పోయాయి .అందులో కుంభకోణం దగ్గర అమ్మార్ సత్రం అనే ఊరిలో 19 శతాబ్దం లో వెళ్ళిన కామమ్మ ,కుప్పు స్వామి దంపతులు ఉన్నారు .ఆయనకు సుబ్బమ్మ ,ధర్మంబ అనే ఇద్దరు తోబుట్టువులు .సుబ్బమ్మకు కుంభ కోణం మునసబు ,భూస్వామి అయిన కంచు పాటి ధర్మా రావు కొడుకు వెంకట్రావు కు ,ధర్మంబ ను తన బావ మరది కి ఇచ్చి వివాహం చేశాడు .రంగా రావు  భార్య అమ్మణమ్మ మహా పతి వ్రత .కోడలు సుబ్బమ్మ ను కన్న కూతురు లాగా చూసింది .సుబ్బమ్మ కు అన్నా ,వదినలంటే ప్రాణం .కామమ్మ  కు కుంభకోణం లో4-8-1868 న మన మాస్టర్ జన్మించారు .వేంకా స్వామి అని పేరు పెట్టారు .రంగా రావు దేశాంతరం పోయి తిరిగి రాలేదు .సంసార బాధ్యత కొడుకు మీద పడింది.వేంకా స్వామి తలిదండ్రుల వద్ద పెరిగాడు .కుప్పు స్వామి వేంకా స్వామికి ఉపనయానం చేశాడు .వెంకట్రావు చని పోయాడు .సుబ్బమ్మ కు సంతానం లేదు .ఆమెకు ఈ పిల్లాణ్ణి దత్తత ఇచ్చారు కామమ్మ ,కుప్పు స్వామి దంపతులు ..కనుక అతను ఇప్పుడు కంచు పాటి దత్త తండ్రి వెంకట్రావు వేంకా స్వామి  తాత పేరు రావు కలిసి కంచుపాటి వెంకట వేంకా స్వామి రావు అయాడు .ఆయనే సి.వి.వి .

              సుబ్బమ్మ శ్రీ మంతురాలు .మగ దిక్కు లేనిది .కనుక దగ్గరుంటే మంచిదని కుప్పు స్వామి దంపతులు కుంభకోణం కాపురం మార్చి చెల్లెలి ఇంటికి దగ్గర ఇంట్లో ఉన్నాడు .వేంకా స్వామి వీధి బడిలో తెలుగు ,తమిళం ,సంస్కృతం ఇంట్లో సుబ్బమ్మ వద్ద సంస్కృతం నేర్చాడు .వెంకట్రావు చెల్లెలి కూతురు రుక్మినమ్మనిచ్చి వేంకా స్వామికి పెళ్లి చేశారు .ఆయన పద్నాలుగో ఏట మెట్రిక్ లో మొదటి వాడుగా పాస్ అయాడు .శ్రీ రంగం లో చేరాడు .శ్రీరంగం ,పుదుక్కోట జమీందార్ల పిల్లలు సహాధ్యాయు లైనారు .ఇంటర్ అయింది డిగ్రీకి మద్రాస పంపటం తల్లికి ఇష్టం లేనందున  ఇంటి వద్దే ఆధ్యాత్మిక గ్రంధాలు చదివాడు .

                                                                   యోగ ప్రవేశం

                  అప్పుడు మెడ్రాస్ లో దివ్య జ్ఞాన మహా సభలు జరిగాయి .మిత్రులతో కలిసి వెంకాస్వామి వెళ్లాడు .ఎందరెందరో మహాను భావులు వచ్చారు .మేడం బ్లావేస్కీ తో పరిచయం అయింది .ఆమె తో కలిసి యోగ సాధన చేశారు .నిష్ఠ కుదిరింది .స్వామి మునిసి పాలిటి అధ్యక్షు లైనారు .యోగం లో బ్లావ్స్కీ దర్శన మిచ్చే వారు .రైల్వే కాంట్రాక్టులు తీసుకొని నష్ట పోయి ఆస్తి అమ్మేయాల్సి వచ్చింది .భార్య మర నిం చింది .మద్దూరు వారమ్మా యి వెంకమ్మను ద్వితీయం చేసుకొన్నారు .పురోహితుని స్వామి నిజం గా నే అరుంధతీ నక్షత్రం చూపించారు .కొత్త భార్య ఆయన యోగ సిద్ధికి ,ఉన్నతికి బాగా సహకరించింది .బ్ల్లవస్కీ యే వెంకమ్మ గా జన్మించిందని భావిస్తారు .

          స్తూల ,సూక్ష్మ శర్రీఅరాలపై వ్యూహాలపై ఆది పత్యం సాధించారు .ఆయ ప్రజ్ఞా భావం ముందు గా భార్య మీద పడింది .ఆమె ప్రజ్ఞను వదిలించి ఆమెతో వివిధ కోశాలలోని విజ్ఞాన విషయాలను పలికించి రాయించారు .1908లో వచ్చిన హేలీస్ తోక చుక్క ను తన శరీరం లోకి ఆవాహన చేసుకొన్నారు .దానితో శక్తి విపరీతం గా చేరింది .సృష్టి క్రమం తెలుసు కొన్నారు .జన్మించటానికిముందు మనుషులు అణు రూపం లో పురుషుని లో ప్రవేశించి .వ్యాపించి మూడు నెలల తర్వాతా స్త్రీ గర్భం లో ప్రవేశిస్తారు .స్వామి గారు తనలో జరుగు తున్న అన్దోత్పత్తిని స్తూల ప్రజ్ఞా చెదనీకుండా ,సూక్ష్మ రూపాన్ని వేరు చేసి నవగ్రహాల ప్రభావం తగల కుండా ఆ అండాన్ని వెంకమ్మ గారి గర్భం లో ప్రవేశ పెట్టారు .ప్రతి రోజు ప్రార్ధన సమయం లో ఆమె స్తూల శరీరంనుండి శూక్ష్మ శరీరాన్ని వేరు చేస్తూ ,ఆమె గర్భం లోని పిండానికి కుండలినీ ప్రభావం తో శక్తిని అందించే వారు .తొమ్మిది నెలల తర్వాతా 13-4-1909 న బ్రహ్మ స్వరూపు డైన కొడుకు పుట్టాడు .అతనికి ‘’చందు ‘’అని పేరు పెట్టారు .

         చందు భిన్నం గా ప్రవర్తించాడు .ఒక నేలకే మాట లోచ్చాయి .ఇంటికి వచ్చే వారి భూత భవిష్యత్తు లను చెప్పే వాడు .నాస్తికుడై జందాలు తెమ్పుకొన్న తాత కుప్పు స్వామిని నాలుగు నెలల  చందు జందెం వేసి సంధ్యా వందనం చేయించాడు .పదో నెలలో తండ్రికి M.T.A.అనే కొత్త మంత్రాని నేర్పి వారానికొక కొత్త మంత్రాన్ని నేర్పించాడు .లోకానికి కొత్త వెలుగు ప్రసాదించమని చెప్పి చని పోయాడు .అతన్ని స్వామి24 సార్లు బ్రతి కించారు .బంధువును ఒకావిడను మీడియం చేసి ప్రాణ ధార తెప్పించి బ్రతికించారు .కాని చందు తను భూమి మీద ఉంటె సృష్టి ఆగి పోతుందని తండ్రికి నచ్చ చెప్పి చని పోయాడు .

   ఈ రకమైన సాధన ద్వారా తనను పిలిచినా వారికందరికీ అందు బాటు లో ఉండే సి.వి.వి.మంత్రం 29-5-1910 న నేర్పారు .ముందు కుటుంబ సభ్యుఅలకు నేర్పి పరీక్షించి తరువాత మిగిలిన వారికి అందించారు .అప్పటినుండే మాస్టర్ సి.వి.వి.గా ప్రసిద్దు లయ్యారు .

                                                           మహిమ ల ప్రదర్శన

       ఒక సారి మాస్టర్ గారు ముక్కు లోని ఒక రంధ్రం ద్వారా  ఆరు గంటలు నిర్వి రామంగా గాలి పీల్చి ,రెండో రంధ్రం ద్వారా ఆరు గంటల సేపు వదిలారు .మరో ఆరు గంటలు ఉచ్చ్వాస ,నిస్స్వాసాలు లేకుండా ఉన్నారు .వారి శరీరం దూది లాగా తేలికై గాలిలో తేలింది తన మనుమడు మట్టి బొమ్మ తిని చని పోతే సమాధి స్తితి లో ఉండి  ప్రాణ సప్ప్లై చేసి బ్రతికించారు .ఆయన్ను దత్తత తీసుకొన్న సుబ్బమ్మ గారు ఏటి లో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి కళ్ళు తిరిగి పడి  పోతేమూడు రోజులు ఆమెను చూస్తూ ఉండమని ఊరికి వెళ్లి ,అక్కడినుంచే ఆమెను బ్రతికించారు

   మనుష్యులను ట్రాన్స్ లోకి పంపి విషయాలను సేకరించే వారు .గ్రహ మండలాలలో ప్రవేశించి అనుభూతులను గ్రంధస్తం చేశారు .చంద్ర మండలం విస్తరించి పది మైళ్ళు వెనక్కి వేడు తుందని చెప్పారు .ఆరు నెలల తర్వాత సైంటిస్టులు నిజమే నని రుజువు చేశారు .భూమి వంకర గా ఉందని అందుకని సూర్యుని వెలుగు చంద్రుని పై సరిగ్గా పడటం లేదని అందుకే కృష్ణ పక్షం వస్తోందని ,వంకర పోతే ఎప్పుడూ పౌర్ణమి నాటి చంద్రుడే కని పిస్తాడని చెప్పారు .ఖగోళ శాస్త్ర వేత్తల పరిశోధన లో భూమి రెండు వందల మైళ్ళు వంకరగా ఉన్నట్లు తేలింది .అంతటి సూక్ష్మ పరిశీలన మాస్టారు గారిది .

                                                  భ్రుక్త రహిత తారక రాజ యోగం

     మాస్టర్ గారు స్థాపించిన కొత్త యోగా పద్ధతిని భ్రుక్త రహిత తారక రాజ యోగం అంటారు భ్రుక్తం అంటే పూర్వకర్మ .రహితం అంటే లేకుండా చేయటం ..అంటే తమ దగ్గరకు వచ్చి శరణు కోరితే పూర్వకర్మలన్నీ పోయి తరిస్తారు .అని అర్ధం .ఆయన్ను తలిస్తే చాలు అన్నీ ఆయనే చూసుకొంటా రనే నమ్మకం .మాస్టారు గారి శిష్య పరం పరలో ఎక్కి రాజు కృష్ణ మాచార్యులు వేటూరి ప్రభాకర శాస్త్రి మొదలైనప్రముఖులు  ఎందరో  ఉన్నారు మాస్టారు గారు 12-5-1922న శరీరాన్ని వదిలేశారు .కొడుకు అంత్య క్రియలు నిర్వహించ గా అకాల వర్షాల వల్ల వారి చితా భస్మం అంతా కావేరి నది నీటి లో కొట్టుకు పోయి ఏమీ మిగల లేదు .22-5-1922 న అంటే పది రోజుల తర్వాతా మాస్టారు గారి సూక్ష్మ శరీరం భార్య వెంకమ్మ కు దర్శన మైంది .

      సమాప్తం –

    అంకితం ‘’–సిద్ధ యోగి పుంగవులు’’ అనే శీర్షికతో రాసిన ఈ ఇరవై వ్యాసాలూ నాకు అత్యంత ఆప్తులు ,ఆత్మీయులు ,స్నేహితులు ,సాహిత్యాభి లాషి  ,భారతీయతను జీర్ణించుకొని ,మన సంప్రదాయం సంస్కృతి భాష లనుఅమితం గా ఆదరిస్తూ మన పురాణ గ్రంధాలను వేద వేదాంగాలను మధిస్తూ అమెరికా లో ఉన్నా భారతీయ విధానాన్ని అనుసరిస్తూ ,గౌరవిస్తున్న సంస్కారి మంచి పుస్తక ప్రియులు ,నిరంతర చదువరి , మా ఉయ్యూరు వాసి, ప్రస్తుతం అమెరికా లో అలబామా లోని హన్త్స్ విల్లీ నివాసి -శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అత్యంత ఆత్మీయం గా అంకిత మిస్తున్నాను ..

 

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-6-12.-కాంప్ –అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –19 ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

 సిద్ధ యోగి పుంగవులు –19

                                                  ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి –తరి గొండ వేంగ మాంబ

           బ్రహ్మా ను భావం పొందటం తో పాటు అనేక కృతులను రచించిన రచయిత్రి గా తరిగొండ వేంగ మాంబ యోగినుల్లో మహా యోగిని అయింది .

        చిత్తూరు జిల్లా వాయల్పాడు కు రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్న తరిగొండ –శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం .కర్నూలు జిల్లా కా నా ల నుండి ఈమె వంశీకులు ఇక్కడికి వచ్చి స్తిర పడ్డారు .కానాల క్రిష్నయ్య ,మంగమ్మ దంపతులకు 1750లో శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల వేంగ మాంబ జన్మించింది .స్వామి పేరే పెట్టారు .కన్న వారితో పాటు పూజ లో పాల్గొనేది .ఈడు తో పాటు భక్తీ పెరిగింది .పరవశించి పాడుతూ నామ సంకీర్తన చేసేది .తగిన భర్త కోసం వెతుకు తుంటే లౌకిక వివాహం వద్దన్నా ఆమెను ఇంజేటి తిమ్మయ్య కొడుకు వెంకటా చల పతి తో వివాహం జరిపించారు .అయినా ఆమె భక్తీ సాధన మాన లేదు .శోభన గృహం లో భర్తకు తన శరీరం ,మనసు వెంకటేశునికే అంకితం కనుక శరీర సుఖం కోర వద్దని చెప్పింది .అతడు స్వగ్రామం వెళ్లి పోయాడు .మనో వేదన తో  చనిపో యాడు . ఆమె లో మార్పు లేదు .సంఘాన్ని ఎదిర్చి నిల బడింది .రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి ని బ్రహ్మోప దేశం చేయ మని కోరింది .

      ఆయన అంగీకరించి సోమేశ్వర స్వామి సన్నిధి లో వేదాంతం బోధించాడు .గురువును త్రిమూర్తి స్వరూపుడి గా కొలిచింది .మంట్రో పదేశం చేసి వేద శాస్త్ర రహస్యాలూ నేర్పాడు .తీవ్ర సాధన చేసి జ్ఞానాన్ని పరి పక్వం చేసుకొన్నది .తరిగొండకు వచ్చి ,నరసింహ దేవాలయం లో విగ్రహం చాటున యోగ సమాధి లో ఉండేది ..ఇది ఎవరికి తెలీదు .ఇంటికి వచ్చి భక్తీ కవితా రచనలు చేసేది .అందులో మొదటిది ‘’తరిగొండ లక్ష్మీ నృసింహ శతకం ‘’.అది ఆస్వా మికే అంకిత మిచ్చింది ..శివ విలాస యక్ష గానాన్ని రాయ చోటి వీర భాద్రస్వామికి అంకితం చేసింది .ఆమె ను అందరు ఎగతాలి చేసే వారు .యోగం తో పాటు కవిత్వమూ పరి పక్వ మైంది .’’రాజ యోగామృత సారం ‘’అనే తాత్విక ద్విపద కావ్యం రాసి ,నరసింహ స్వామికి ,బాల కృష్ణ నాటక మనే యక్ష గానాన్ని వాసుదేవ పరబ్రహ్మకు అంకిత మిచ్చింది .

      వేంగ మాంబ వైరాగ్యం బ్రాహ్మణులకు నచ్చ లేదు .ఆమెకు వైధవ్యం కల్పించాలని ,తల గోరగాలని ఆంక్ష పెట్టారు .మంగలి వచ్చి నిలబడితే పులిని చూసి నట్లు భయ పడి  పారి పోయాడు .మిగతా వారు పరుగు లంకిన్చుకొన్నారు ..పుష్పగిరి పీతాది పతి విద్యా నృసింహ స్వామి దేవాలయం లో విడిది చేసి వెంగమ్మను రమ్మని కబురు చేశారు .ఆమెను చూడరాదని తేర కట్టించారు .ఆమె ను తల గోరిగించు కొ మన్నారు .ఆమె పరపురుశుడైన మంగలిని తాను తాకటం ధర్మమా అనీ ,కేశాలు తీయిస్తే ,పాతి వ్రత్యం నిలుస్తుందని యే శాస్త్రం లో ఉందొ చెప్పమని సవాలు చేసింది .ఆమె సమాధానాలు స్వాములకు కోపం తెప్పించాయి .తమకు ఎందుకు నమస్కరించ లేదో చెప్ప మన్నారు .సింహాసనం దిగి పక్కకు వస్తే నమస్కరిస్తాను అంది .ఆమె చెప్పినదానిలో ఏదో రహస్యం ఉందని భావించి తేర తీయించి ,సింహాసనం దిగి పక్కన నిల బడ్డారు .ఆమె లక్ష్మీ నృసింహ స్వామిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించింది .వెంటనే సింహాసనం భగ్గున మండి  పోయింది .స్వాములు వెంగమ్మ ప్రహ్లాదుని అవతారం అని ప్రకటించి ,బ్రాహ్మణులను మందలించి వెళ్లి పోయారు .ఆమె మూలంగా తమ జీవితం అవమానాల పాలైందని ఇంటి నుండి తరిమేశారు .

                  మళ్ళీ ఆలయం చేరి తపస్సు తీవ్రం చేసింది .ఆంజనేయ స్వామి సన్నిధిలో తీవ్ర మగ్న అయింది .ఒక సారి వెంకటేశ్వరస్వామి ప్రత్యక్ష మై తిరుమలకు రమ్మని కోరారు .తిరుమల చేరి భక్తీ తో ఆవేశం తో స్వామిని స్తుతించింది .ఆ నాటి మహానటు ఆమె కు తూర్పు మాడ వీధి లో ఒక పూరిల్లు నివాసానికి ఏర్పరచి పాక శాల నుండి వకుల మాలిక పేరు తో సంబారాలు పంపించే వాడు .ఆమె స్వయం పాకం చేసుకొని ,వెంకన్న కు నివేదించి తినేది .ఆమె భక్తిని గుర్తించి అన్నమాచార్యుల వారి వంశీయులు ఉత్తర మాడ వీధి లో తమ ఇంటి ప్రక్కమిద్దె  ఇల్లు ఇచ్చారు .అక్కడ తులసి వనం  పెంచి మాలలు కట్టి  స్వామికి కైంకర్యం చేసేది .’’రమా పరిణయం ‘’అనే ద్విపద కావ్యం పెళ్లి పాట గా రాసి నది .ఇలా చేయటం అక్కా రామయ్య దీక్షితులు అనే పోరుగాయనకు ఇష్టం లేదు .ఆమె ధ్యానం లో ఉండగా ఎంగిలి విస్తళ్ళు ఆమె పై విసిరేశాడు .’’నీ వంశం నిర్వీర్యమవుతుంది ‘’అని శపించింది .చాలా మంది పుట్టి చని పోయారు .బుద్ధి వచ్చి ఆమె కాళ్ళ మీద పడితే ఇక నుంచి నీ కుటుంబం లో ఒక్కడే ఒక్కడు పుడతాడని శాపాన్ని మరల్చింది .

            స్వామి మందిరానికి ఉత్తరాన తుంబురు కోన లో తపస్సుచేసింది   .బ్రహ్మ చర్యం ,ప్రాణాయామం తపస్సు చేసే వారే అక్కడ ఉండ గల రమణీయ ప్రదేశం అది .అ సమయం లోనే ‘’చెంచు నాటకం ‘’యక్షగానం రాసింది .ఈమెను వెదికి వేసారి ఇక్కడ చూసి మళ్ళీ ఇంటికి తీసుకు వెళ్లారు .పూల తోట వేసింది .బావి తవ్వ్వ్వితే నీళ్ళు పద లేదు .బావి లోకి దిగి గంగను కీర్తించింది .పుష్కలంగా నీరు పడింది .వెంకటేశ్వర స్వామికి రోజు ఏకాంత సేవలో ‘’కర్పూర హారతి ‘’ఆమె ఇవ్వటం అల వాటు .ఇది పూజారులకు నచ్చక ఈసడించుకొనే వారు .గుడికి వెళ్లి హారతి ఇవ్వ కుండా ఇంట్లోనే ఇచ్చేది .ఒక రధోత్సవం రోజు రధం వచ్చి వెంగమ్మ ఇంటి ముందు ఆగి పోయింది .ఎంత లాగినా కదలలేదు .అర్చకులు వెంగమ్మను క్షమా భిక్ష వేడారు .ఆమెను హారతి ఇవ్వమన్నారు .ఆమె హారతి ఇవ్వ గానే రధం కదిలింది  .అదే ఇప్పుడు ‘’తరి గొండ వారి ముత్యాల హారతి ‘’అయింది .

     ఆమెకు నరసింహస్వామికి వెంకన్నకు భేదం లేదు .నృసింహ ఉత్సవాలు ప్రతి ఏటా జరి పేది .అన్నదానం నిర్వ హించేది .అనేకులు భూరి విరాళాలు ఇచ్చే వారు .ఎనిమిది మంది వ్రాయస గాల్ల ను పెట్టు కొని ‘’ద్విపద భాగవతం ‘’రచింది .వేంకటాచల మహాత్మ్యాన్ని చంపూ కావ్యం గా రాసింది .18 వ శతాబ్ద ఉత్తర భాగం 19 వ శాతాబ్ద పూర్వ భాగం ఆమె దివ్య సారస్వతాది దేవత గా వెలుగొందింది .3-8-1817 న ఆ ఆధ్యాత్మ తేజో రాసి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదార విన్దాల్లో ఒక పూ రేకు అయి పోయింది .ఆమె రోజు ధ్యాన సమాధి లో కూర్చునే చోట సమాధి నిర్మించారు .దాని మద్య తులసి వనం ,మండపం కట్టారు .సమాధికి ఎదురుగా నేరేడు చెట్టు కింద గూటి లో ఆంజనేయ స్వామి ని ప్రతిష్టించారు .అన్నమయ్య ,హాదీరాం బాబా ,వెంగమాంబ తిరుమలేశుని తో అభేదం గా జీవించిన పుణ్య మూర్తులు .

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-6-12.—కాంప్—అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –18 త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

సిద్ధ యోగి పుంగవులు –18

                                                     త్రికాల జ్ఞాన యోగి –ప్రకాశానంద స్వామి

     ఈ లోకం లో భాగస్వామి గా ఉంటూ ,కోరికలు లేకుండా ముక్తులై బ్రహ్మాన్ని పొందే వారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన త్రికాలవేదే అనంతయ్య అనే సామాన్య్డు డు బ్రహ్మ ప్రకాశాన్ని పొంది ప్రకాశానందులైనారు .

     విజయనగరం ప్రాంతం లో గౌరమ్మ ,అనంత రామయ్య ల కుమారుడే అనంతయ్య .1871లో జన్మించాడు .ఎనిమిదవ ఏట  ,తండ్రి ,పందొమ్మిదవ ఏట తల్లి చని పోయిన దురదృష్ట వంతుడు ..తాత గారి పెంపకం లో ఉపనయనం జరిగింది .పదిహేనవ ఏట బడి చదువులు వదిలి సంస్కృతం ,జ్యోతిషం నేర్చాడు .పెళ్లి చేద్దామని తాత ,మామ్మ ప్రయత్నాలు చేసి యోగ్యురాలిని చూసి తాంబూలాలు పుచ్చుకొన్నారు .కాని ఆ పిల్ల పెళ్ళికాక ముందే చని పోయింది .ఇంగ్లీష బోధించిన దత్తయ్య పంతులు మంచి వేదాంతి .తగిన గురువు వెతుక్కొంటూ వస్తాడని శిష్యుడికి చెప్పాడు అత్యంత  మిత్రుడొకడు సైన్యం లో సుబేదార్ .అతని భార్య అందాల సౌందర్య రాసి .ఆమె పిల్లను ప్రసవించి చని పోయింది ..స్నేహితునితో శ్మశానానికి వెళ్ళిన అనంతయ్య ఆ అందం భస్మం అవటం తో తీవ్ర వైరాగ్యం చెందాడు .

                                                         గురు అన్వేషణ

          1887 లో అంటే పదహారేళ్ళ వయసు లో ఇల్లు వదలి బెల్గాం చేరాడు .అక్కడ లల్లూభాయ్ గోవర్ధన దాస అనే ఉపదేశకుని తో పరిచయం కలిగింది ..ఆయన గుజరాతే వైశ్యుడు .ఈయన వద్ద యోగా వాశిష్టం మొద లైన వేదాంత గ్రంధాలు చది వారు .ఆయన అను మతి తో తీర్ధ యాత్రలు చేస్తూ  తిరుమల చేరి ,పుష్కరిణి లో స్నానం చేసి ,ప్రేష మంత్రం చెప్పుకొని ,శిఖా ,యజ్నోపవీతాలను తీసి వేశాడు .అక్కడే బుచ్చయ్య పంతులు దగ్గర ఉపనిషత్ భాష్యం అధ్యయనం చేశాడు .నాసిక్ వగైరాలు తిరిగి నాసిక్ చూసి హరిద్వారం వెళ్లి అమరేశా నందుల వద్ద సిద్ధాంత కౌముది ,వ్యాకరణ మహా భాష్యం నేర్చాడు .గురువు గారు అనంతయ్య లోని జ్ఞాన ప్రకాశాన్ని గుర్తించి ‘’ప్రకాశా నంద స్వామి ‘అనే   ఆశ్రమ నామం  పెట్టాడు .

                  ప్రకాశా నంద స్వామి ఋషీ కేశం వెళ్లి సుఖానంద స్వామి వద్ద హత యోగం నేర్చాడు .గుజరాత్ లోని నడియాద్ చేరి జానకి దాస వద్ద వ్రుత్తి ప్రభాకరం ,మొదలైన వాణ్ణి నేర్చారు .లల్లూభాయ్ ని తరచూ సేవిస్తూ పదిహేనేళ్ళు గడిపారు .అయన మరణం తరువాత మాధుకర వ్రుత్తి చేస్తూ దొరికిన దాన్ని తింటూ కాల క్షేపం చేశారు .ఎందరో శ్రీ మంతులు ఆశ్రమాలు నిర్మించి ఇస్తామన్నా ,ధనం కురి పిస్తామన్నా తిరస్కరించారు .స్మశానం .లేక పాడు బడ్డ దేవాలయమే ఆయన నివాసం .సర్వ సంగ పరిత్యాగి గా ఉంటూ వేలాది జనానికి జ్ఞాన భిక్ష పెట్టారు .ఒక చినిగిన బొంత ,ఒక మట్టి పిడత ,నల్లని దుస్తులు ఆయన ఆస్తులు .అందుకే జనం ఆయన్ను బొంత ముంత స్వామి (గోదాదియా స్వామి )అనే వారు .

                                                 +త్రికాలజ్నుని మహిమలు

      ఒక సారి భావ నగర కాలేజి సంస్కృత ప్రొఫెసర్ సందర్శించి నపుడు ‘’మీ ఇంటి నుంచి ఉత్తరం ఏదైనా వచ్చిందా /’’అని అడిగారు .రాలేదని చెప్పాడాయన ..అంతా కులాసానేనా / అని స్వామి అడిగితే అంతా క్షేమమే నని ఆయన చెప్పాడు .తాను రెండు రోజుల్లో ప్రొఫెసర్ గారి ఊరు నడియాద్ వెళ్తున్నానని ,వాల్లింటికీ వెళ్లి వస్తానని చెప్పారు .స్వామి అక్కడికి వెళ్ళే సరికి ప్రొఫెసర్ గారి ఆరు నెలల పసివాడు మసూచికం తో బాధ పడుతున్నాడు .’’శరీరం అశాశ్వతం .మొహం వద్దు ‘’అని ఆ పిల్లాడి తల్లికి చెప్పి రెండు రోజుల తర్వాతా వస్తానని చెప్పి స్వామి వెళ్లి పోయారు .మళ్ళీ వచ్చి చూస్తె పిల్లాడు చని పోయాడు .ఆస్వామి త్రికాల వేడి అని అందరు గుర్తించారు .ప్రొఫెసర్ గారికి ఒక శివ రాత్రి రోజున స్వామి తపస్సు లో ఉండగా నొసట త్రిశూలం కనిపించింది .ద్వారక లో విశ్వనాధ నందీశ్వారుల మందిరం దగ్గర గదిలో ఓంకారాన్ని స్వామి జపిస్తుంటే ఫాల భాగాన ఓంకారం దర్శన మిచ్చేది .

               స్వామి సర్వ మత సమభావం గా ఉండే వారు .స్వార్ధం వదిలి సమాజ సేవ చేయమని ధన వంతులకు నచ్చ జెప్పే వారు .ఒక సారి ‘’మొరబీ మహా రాజు ‘’కు ప్రాణా పాయ మైన జబ్బు చేసింది .స్వామి వచ్చి ఆశీర్వా దించారు .ఆరు మాసాలు మొరాబీ లో ఉంది రాజు జబ్బు తగ్గినా తర్వాతా వెళ్ళ బోతుంటే రాజు లక్ష రూపాయలు ఇచ్చి ధర్మ కార్యాలకు ఉపయోగించమని కోరాడు .దాన్ని తృణ ప్రాయం గా భావించి పంటలు నష్ట పోయి ప్రజలు బాధ పడుతున్నారని పన్నులు తీసేయ్య మని  కోరారు .వెంటనే 20 లక్షల ఆదాయం వచ్చే ఆ ఏడాది పన్నులను రైతులు ఇవ్వక్కర లేదని శాసనం చేశాడు రాజు .పిల్లలంటే మహా ఇష్టం తాతా (దాదా )అని ఆయన్ను పిలిచే వారు .గుజరాతు ,సౌరాష్ట్ర లలో అనేక మంది సాదు శాంతులను దర్శించి ,వేదాంత గోష్టి జరిపారు .అహ్మదా బాద్ సరయు దాస ,కచ్చ నివాసి నారాయణ దాస ,చరోతార్ వాసి జానకీ దాస ,పీతియా నివాసి నిత్యానంద స్వాములు మహా త్యాగ పురుషులు గా పేరు పొందారు .ఆ నలుగురి తో పాటు మన స్వామికీ ఎక్కడా ఆశ్రమాలు లేవు .

                   నిత్యా నదులు 24లక్షల గాయత్రి మంత్రం చేసిన ధన్యులు రాజ కోట దగ్గర బాణ గంగా నదీ తీరం లో నివాసం ఉంటున్నారు .ప్రకాశా నందులు వీరిని దర్శించి వేదాంత గోష్టి జరిపారు .ప్రకాశా నందుల సమక్షం లో నిత్యా నందులు 1934  లో శివైక్యం చెందారు .బ్రహ్మ విద్యా రహస్యాన్ని తెలియ జేసే ‘’వార్తా లాపం ‘’ను స్వామి గొప్ప గ్రంధం గా రాశారు . 1032 పేజీల బృహత్ గ్రంధం .1965 నాటికే ఎనిమిది ముద్రణలు పొంది విశేషం గా ఖ్యాతి పొందింది .వీరి శిష్యు రాలు ‘’శిరోహి రాజ మాత ‘’ఆంధ్రులకు కూడా స్వామి వారి అమృత వాణి చేరాలని

రాజ  మాండ్రిడ్రి  నుండి హిందీ ,తెలుగు ,సంస్కృతం తెలిసిన ఆంద్ర పండితుణ్ణి గుజ రాత్ కు రప్పించి నాలుగు నెలలు సకల సౌకర్యాలు కలుగ జేసి అనువాదం చేయించి ఆ బృహద్ గ్రంధాన్ని ప్రచురింప జేశారు .జిజ్ఞాసులకు ,ముక్షులకు ఉచితం గా ఆ గ్రంధాన్ని అంద జేశారు .స్వామి-అనంత గురు పరిచయం ,అపనో ధర్మ ,ధర్మ జ్యోతి ,సప్త శ్లోక గీత గుజరాతీ లో రాశారు ఆయన అముద్రిత సాహిత్యం చాలా ఉంది .స్వామి తెలుగు లిపి లోనే తెలుగు ,గుజరాతీ భాషలు రాసే వారట .అదీ వారి ప్రత్యేకత .వార్తాలాపం లో ఎన్నో వేదాంత విషయాలు సులభ బోధకం గా రాశారు .

        ప్రకాశానంద స్వామి నిత్యా నంద స్వామిని ‘’బుద్ధ భాగ వానుని ‘’తో పోల్చే వారు .నిత్యా నదులే ఒక సారి స్వహస్తాలతో ప్రకాశానాడ స్వామి కి పాద్యం ఇచ్చారు .అంతటి అన్యోన్యం వారిద్దరిది .ఇంత మంది శిష్యులుండగా మీకెందుకు ఈ శ్రమ అని అడిగితే ‘’శ్రీ కృష్ణుడికి రుక్మినే సపర్యలు చేసిందని ,దాసీలు కాదని చెప్పారు .ఒక సరి చేతి లో డబ్బు లు లేక గురు దర్శనానికి వెళ్ళ లేక గురువు గారినే వచ్చి కటాక్షించ మణి కోరి జాబు రాస్తే నిత్యా నందులు వైద్యుని తో సహా వెళ్లి ఆయనకు ఆరోగ్యం కలిగించారు . 
                                                     మహా ప్రస్తానం

    ఒక సారి స్వామి నారాయణ పరమ హంస ను చూడ టానికి వెళ్లారు ఆయనకు పంచ శిఖలున్డటం చేత గుర్తు పట్టలేదు ..మౌనం లో ఉన్న పరమ హంస గుర్తు పట్టి ‘’రెండు కర్ర లెందుకు ‘’/అని మౌనం గానే స్వామిని ప్రశ్నించారు .’’నాకు ఇంకా అద్వైత సిద్ధి కలగ లేదు ‘’అన్నారు .పరమ హంస ఆయన దగ్గరున్న రెండు కర్రల్లో ఒక దాన్ని తాను తీసేసు కొన్నారు .’’ఇప్పుడు అద్వైతం కుదిరిందా ?’’అని ప్రశ్నించారు .ఆ రోజు నుండి స్వామి ఒకే కర్ర తో ఉంటున్నారు .    ప్రకాశా నందులు ద్వారకలో దేహ త్యాగం చేయ నిర్ణయించి అక్కడికి చేరారు .అప్పటికి వారి వయస్సు 92.తనకు ఆతిధ్య మిచ్చిన గృహస్తు కొడుకుకు నామ కారణం చేయమని కోరితే తన పేరే పెట్టి ఆనంద్ ప్రకాష్ అని పిలుచు కొ మన్నారు .22-2-1962న జబ్బు చేసింది .అందరికి  వార్త వెళ్ళింది . కాషాయ వస్త్రాలు తెప్పించి కట్టుకొన్నారు .బాగై నట్లని పించి చాలా మంది వెళ్లి పోయారు .మధ్యాహ్నం స్వామి అందర్ని చూసి నవ్వా రు ..అందరు నవ్వారు .స్వామి చిటి క వేసి ‘’చలో ‘’అన్నారు .అప్పుడు సమయం మధ్యాహ్నం 12-20  ద్వారకా దీశుడైన కృష్ణ దేవాలయం లో కోటి రూపాయలకు పైన విలువ చేసే శ్రీ కృష్ణుని కిరీట ,కుండలాలు   హథా ట్టు గా జారి పడి  పోయాయి .అంతా ఏదో విప రీతం జరుగుతుంది అను కొన్నారు .  స్వామి ‘’చలో ‘’మన్నప్పుడే ఇది జరిగిందని తెలుసు కొన్నారు .అదే సమయం లో స్వామి అనంత వాయువుల్లో తమ శ్వాశ ను కలిపారు .వారు భౌతికం గా లేక పోయినా వారి సమాధి భక్త జనానికి జ్ఞాన ప్రకాశాన్ని నిరంతరం అందిస్తూనే ఉంది .

     ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ,ఎక్కడో ఆధ్యాత్మిక గురువులై ,ద్వారకలో సిద్ధి పొందిన స్వామి ఆశ్రమం లేకుండానే లక్షలాది మందికి జ్ఞాన బోధ చేసి అతి సాధారణం గా జీవించి మిగిలిన వారిలో తానూ ఒక్కరిగా మిగిలి పోయారు .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-6-12.—కాంప్—అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు —17 బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

సిద్ధ యోగి పుంగవులు —17

          బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి –శ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి

            ‘’నాకోసం మీరు కంచి కి ఇంత దూరం రావలసిన పని లేదు .చందోలు లో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా !ప్రతి గురువారం వారిని దర్శించండి ‘’అని కంచి కామ కోటి పీథ పరమా చార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారు చెప్పారు అంటే శాస్త్రి గారి యోగ సిద్ధి మహిమ ఎంతటి దో మనకు అర్ధమవు తుంది .

     గుంటూరు జిల్లా చంద వోలు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి ,హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున లో జన్మించారు .నిష్టా గరిష్ట కుటుంబం వారిది .చంద వోలు శాస్త్రి గారని అందరు పిలుస్తారు .తాడి కొండ వాసి కేదార లింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ‘’వీరికి ఇచ్చారు .పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసి నందు వల్ల అమ్మ వారు వీరికి పిలిస్తే పలికేది .దెందు కూరి పాన కాల శాస్త్రి వద్ద తర్కం ,పొదిలి సీతా రామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు .యవ్వనం లోనే సన్య సించాలి లనే కోరిక కలిగింది .శ్యామ లాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపం లో జన్మించాడని చెప్పింది .శాస్త్రి గారికి చిన్న తనం లో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచ రించింది .అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వారి అయిన కామేశ్వరి దూరం గా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది .ఒకరిని మోసుకొని ఇద్దర్నీ  తీసుకొచ్చాడు .అమ్మ వారు చిరు నవ్వు తో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకం లో జన్మించమని  తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి తో వివాహ మైంది .పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరు ను శ్రీ దేవి గా శాస్త్రి గారు మార్చారు .

                                          పాండిత్య ప్రకర్ష  

      శాస్త్రి గారు తండ్రి గారి వేద పాథ  శాల నిర్వహణ లో తోడు  పడుతూ ఉన్నారు .అయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికా కు రమ్మన్నారు .వారికి ఇష్టం లేదు .పిన పాటి వీరభద్రయ్య తో నేత్రావధానం ,ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రి తో కవిత్వ సాధన చేశారు .అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్  ఇచ్చారు .వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి తో అనేక అవధానాలు చేసి ,ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు .పుష్పగిరి పీథా ది పతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధి లో జరిగిన అష్టావదానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యం గా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతం గా చెప్పి ఒప్పించారు .

                             అమ్మ వారి సాక్షాత్కారం

     దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి  తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అన్గోస్త్రం నేల మీద పరచి నిద్ర పోయారు .10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఒర్ ! ముష్టి పె డ  తాను .కొంగు పట్టు ‘’అన్నది .దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది .తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజు గారి బండి వచ్చింది .అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే .

          అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు .ప్రాణాయామం తపస్సు కోన సాగించారు .ఇంట్లో వేరు సెనగ  నూనె, వేరు సెనగ వాడ లేదు .దొండకాయ ,టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి  కాబేజీ ,నిశిధం .కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు కూతురు లక్ష్మి ని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు .ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు

                                       అష్ట సిద్దులు కైవశం

            శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .తాడి కొండ వేద పాథ శాలలో దేయాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు .ఒక సారి ‘’వశ్యంకర ఔషధి ‘’ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి ,దాన్ని గుర్తు పట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు .బలవంతాన లాక్కో బోతే ‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’అన్నాడు .ఇంతలో గ్రహణం వదిలింది .బాలుడు మాయమయ్యాడు .తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు .అది దత్తాత్రేయ స్వామి అది పతి గా ఉన్న ఓషధి .పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి  పోతుంటే తల నే లకు తగిలే సమయాన ఆయోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృష్యుడైనాడు .

              తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కదామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తీ చేస్తున్నారు అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు .అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బద్దావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ  మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది

      ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెన పల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతీ కని పించి ,నమస్కరించి లోపలి వెళ్ళింది .ఆమె గ్రహ పీడి తురాలు .అందర్ని కొడుతూ ,తిడుతూ ఉండేది .అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు /’’అని అడిగారు .’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది .శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు .ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది .దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది .అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వెయ బూనితే ‘’గారుడ మంత్రం ‘’జపించారు .సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు .నా జోలికి నువ్వు రావద్దు .పోర పాటున నా కాలు తగిలింది .వెళ్లి పొండి  ‘’అనగానే పాము వెళ్లి పోయింది .ఆ రోజంతా గారుడ మంత్రం పతిస్తూనే ఉన్నారు .

                           శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు చ్గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది .శాస్త్ర్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ  ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కని పించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉప యోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు .ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .

    ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో ,పేరు పెట్టమనో అడిగే వారు .కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త న్నిర్ణయం చేసే వారు .అంతే .ఆ కార్య క్రమం శుభప్రదం గా జరిగి పోయేది .దానికి తిరుగు లేదు .అదీ వారి మంత్ర సిద్ధి .

    దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం కాంచీ పరమాచార్యులు ఉయ్యూరు కే’సి’పి’వారి ఆహ్వానం ,గురజాడ లోని చల్లా శర్మ గారు ఏర్పాటు చేసిన కార్య క్రమం లో వారం రోజులున్నారు .అప్పుడు రాఘవ శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని రోజులు .అప్పుడు వారిని చూశాను .జగద్గురువుల ను వీరినీ ఒకే సారి చూసే భాగ్యం కలిగింది .అప్పుడే ‘’నడయాడే దైవం ‘’అని పరమా చార్య మీద పుస్తకం ఆవిష్కరణ జరిగి నట్లు జ్ఞాపకం .10-12-1990ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతం గా చేరి పోయారు .వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారం గా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతం గా వర్ణించారు .శాస్త్రి గారు కారణ జన్ములు .వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం – కల్పవృక్షపు స్త్రీలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –16 అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

  సిద్ధ యోగి  పుంగవులు –16

                                                       అవధూత చక్ర వర్తి- కురుమద్దాలి పిచ్చమ్మ

    మనిషి యే కులమో కాదు, మనసు యే కులమో చూడాలి .అప్పుడే మనం జ్ఞాన వంతులమవుతాం  .మాల కులం లో జన్మించి ,జన్మ ల  జన్మల సంస్కారాన్ని వెంట నిడుకొని ,రామ భక్తీ సామ్రాజ్యాన్ని యేలి మహాత్మా గాంధీని ,రమణ మహర్షిని ,మళయాళ స్వామి వంటి వారినే సంభ్రమాశ్చర్యాలలో ముంచి వేసిన కురు మద్దాలి పిచ్చమ్మ చరిత్ర సర్వ పాప హారం .ఆ అమ్మ ప్రత్యక్ష సచ్చిదానంద మూర్తి ,అవధూత చక్ర వర్తి .

           పిచ్చమ్మ మాల కులం లో బెజవాడ బందరు రోడ్డు లో పామర్రు కు దగ్గర గా ఉన్న కుగ్రామం కురుమద్దాలి లో వర్రే ముత్తయ్య ,వీరమ్మ దంపతులకు 1870  లో జన్మించింది .మంచి ఆజాను బాహువు శరీరం తో ముచ్చటగా ఉండేది .పిల్లగా ఉన్నప్పుడే మంత్రం వేసి నట్లు పడి  పోయేది .ఆడుతూ ,పాడుతూ పరవశించేది .ఏది చేసినా తాదాత్మ్యం చెంది చేయటం ఆమెకు అల వాటైనది .ఆమె కేదో రోగం అనుకొన్నారు తలి దండ్రులు .రామాలయం లో రామ చంద్రుని రూపం చూస్తూ పరవశించేది .ఎన్నో వైద్యాలు చేయించినా తీరు మార లేదు .’’పిచ్చి పిచ్చమ్మ ‘’అని పిలిచే వారు .తుమ్మల పల్లి గ్రామం లో నీలి శోభనాద్రి కిచ్చి వివాహం చేశారు కాపురానికి వెళ్ళినా ఏకాంత జీవితమే .గోసేవ చేసేది .నిర్జన ప్రదేశం దొరికితే ధ్యానం లో మునిగి స్పృహ తప్పి పడి  పోయేది .ఆమెకు రామ నామమే అండా,దండా .

      పిచ్చమ్మ గర్భ వతి అయింది .నాల్గవ నెలలో నే  భర్త చని పోయాడు .ఆడ పిల్ల ను కని భాగ్యమ్మ అని పేరు పెట్టింది .మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి తండ్రి కోరితే తిరస్కరించింది .కూలి చేసి బిడ్డను సాకింది .కష్టపడి పని చేసి ముతా మేస్త్రి అయింది .ఆమె పని అంటే అందరికి ఇష్టం .ఒళ్ళు దాచుకోకుండా చేసేది ,చేయించేది .పిల్లను పోషిస్తూ మిగిలిన డబ్బు ను మంచి పనులకు ఖర్చు చేసేది .యుక్త వయసు రాగానే భాగ్యమ్మను ఒక అయ్య చేతి లో పెట్టి పెళ్లి చేసింది .అల్లుణ్ణి కన్న కొడుకు గా చూసుకోంది .కాని అత్తవారు ఆమె ను రాచి రంపాన పెట్టె వారు .తల్లికి వచ్చి చెప్పుకొని ఏడ్చేది .బతిమిలాడి పంపించేది .ఒక సారి అత్తారింటికి వెళ్లనని భీష్మిస్తే ‘’యే నూతి లో పడి చచ్చినా బాగుండును కూతురు -అను కొన్నది మనసులో .అనుకోన్నట్లే భాగ్యమ్మ నూతి లో దూకి చని పోయింది .పోలీసులకు తెలిసి వచ్చి విచారిస్తే అత్తమామల మీద నేరం చెప్ప కుండా తన కూతురికి మూర్చ రోగం అందుకే తెలీకుండా నూతిలో పడి  చని పోయిందని చెప్పిన ఉత్తమా ఇల్లాలు పిచ్చమ్మ .

                                                      రామావదూత గా పరిణామం

         పిచ్చమ్మకు వైరాగ్య భావన పెరిగి పోయింది .మొలకు ఒక గోనే సంచి మాత్రం కట్టు కొని తిరిగేది .స్మశానం లో నివాసం .రామ నామం ,హనుమన్నాపం జపిస్తూ తిండీ తిప్పలు లేకుండా గడి పింది .కూతురు భాగ్యమ్మ కోసం యిప్పటి దాకా ఏడ్చిన పిచ్చమ్మ భగవద్భాగ్యం కోసం ఏడవటం ప్రారంభించింది .అలాంటి సమయం లో ఎక్కడి నుంచో ఒక గోసాయి వచ్చి ,ఓదార్చి ఏదో ఉపదేశించి వెళ్లాడు .ఆయన కోసం వెదికితే కంపించ లేదు .వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీ రాముడే అని నమ్మింది .ఆ దుఖం లో నే జ్ఞాన సిద్ధి కలిగింది .త్యాగరాజు కృతులు రామదాసు భజనలు వేమన పద్యాలు ,బ్రహ్మం గారి తత్వాలు పాడుకొంటూ ఉండేది .ఆకులు అలములు స్మశానం లో ఒండ్రు మన్నే ఆహారం .పాములతో సహజీవనం .అవి ఆమెను ఏమీ చేసేవి కావు .ఆమె కు పిచ్చి బాగా ముదిరిందని పిల్లలు రాళ్ళతో కొట్టే వారు . అలానే సహించేది .ఒక సారి ఒక కుర్ర కున్క విపరీతం గా రాళ్ళు విసిరాడు ‘’ఒరి  కుర్ర కుంకా ! చేతులు బొబ్బలేక్కు తాయిరా ‘’అంది .నిజం గా వాడి చేతులకు ఎర్రగా బొబ్బలేక్కి పోయాయి .వాడి తల్లి దండ్రులు వచ్చి ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డారు ‘’పోతాయిలే పోరా ‘’అన్నది .అంతే వాడిబొబ్బలు మాయం .పిచ్చమ్మ లో ఏదో శక్తి ఉందని అప్పుడు కురుమద్దాలి జనం గ్రహించారు .కుటీరం నిర్మించి అమ్మకు అఆశ్రయం కల్పించారు .వారి బలవంతాన అందులో చేరింది .ఒక సారి కాళ్ళు పడి  పోయిన ఒక వ్యక్తిని బండి లో ఆస్పత్రి కి తీసుకు వెళ్తుండగా బండిని ఆపించి ఆరోగిని కిందికి దింపి ,వీపు మీద చెయ్యి వేసి రాసింది ‘’ఇంటికి పోరా ‘’అంది .వాడు హాయిగా నడుచు కొంటు ఇంటికి వెళ్లాడు .ఇలా క్రమ క్రమంగా ఆమె మహత్తు జనాలకు తెలిసి గురి బాగా కుదిరింది .పిచ్చి పిచ్చమ్మ రామావదూత పిచ్చమ్మ గా పరిణామం చెందింది .

                                                             జ్ఞానయోగిని పిచ్చమ్మ

          పిచ్చమ్మ ను చూడ టానికి వచ్చే జనం పెరిగి పోతున్నారు .ఆమె క్రమంగా తత్వ రహస్యాలను ,ఉపనిషద్ రహస్యాలను పామర భాషలో తెలియ జెప్పెది .ఆమె ‘’పని అవుతుంది ‘’అంటే అయ్యేది ‘’కాదు ‘’అంటే పని జరిగేది కాదు .రాముడు ఏది పలికిస్తే అది పలుకుతున్నాను అనేది .తనను ‘’వీడు ‘’అను కొనేది .అమ్మ దేహం నుండి జ్ఞానాగ్ని ,యోగాగ్ని సెగలు ,పొగలు వచ్చేవి .అప్పుడు చన్నీళ్ళు ధారగా పోసి వెంకమ్మ ,వరలక్ష్మ తాపం చల్లార్చే వారు .ఆమె లో ‘’బ్రహ్మా నంద భావన ‘’క్రమంగా పెరిగింది .రాముడు ,కృష్ణుడు మొదలైన దశావతారాలు తనకు కన్పించినా మనశ్శాంతి ముఖ్యమని వారిని తిరస్కరించానని చెప్పేది .1925 పిన్నమ నేని రామయ్య వగైరాలు ఆశ్రమం నిర్మించారు .ఆమె తపస్సు కు అను కూలం గా ‘’భూగర్భ భువనేశ్వరం ‘’నిర్మించారు .రోజు విడిచి రోజు సమాధి లోకి ,మూడు రోజులకో సారి మౌనం లోకి వెళ్ళేది .

                                                              మహిమాన్విత యోగిని  

     అమ్మ సమాధి నుండి లేచి నప్పుడు  దర్శించుకొన్న వారి బాధలు తీరేవి .’’అమ్మా నీకేమివ్వ మంటావు ‘’/అని ఎవరైనా అడిగితే ‘’వీదికేమి కావాల్రా –గోడకట్టు ‘’అని ఆశ్రమ సేవ చేయించేది. మనుష్యుల ముఖాలు చూసి వాళ్ల అర్హతలను చెప్పేది .ఎప్పుడు అర్ధ నగ్నం గా ఉండేది .దురుద్దేశం ఉన్న వాళ్ళు వస్తే ‘’వాడి కంట్లో దోషం ఉంది .నాకు దుప్పటి కప్పండి ‘’అనేది .అక్కలు ,బంధువులు ఇళ్లకు రమ్మని పిలిస్తే వెళ్ళేది కాదు .తాను మంచి మార్గం లో నడుస్తున్నానని , ,వాళ్ళనూ సన్మార్గం లో నడవ మని  బోధించేది .అమ్మ దగ్గర ఎప్పుడో అప్పు తెసుకొన్న వాడు చెల్లించ టానికి వస్తే ‘’వీడు ఎవ్వరికీ ఋణం లేడు .ఎవ్వరూ వీడికి ఋణం లేరు ఫో’’అన్నది .బ్రాహ్మణులు దర్శించ టానికి వస్తే వాళ్లకు ఆచారం ఎక్కువ ,మలినం పోలేదు అని దూరం గా ఉంది దండం పెట్ట మనేది .

            ‘’ వీడు అనేది రాముడే ‘’ అని అద్వైత భావన లో అనేది .డబ్బు బంగారం లాంటి వాటిని ముట్టు కొనేది కాదు .వాటిని ‘’రోత ‘’అనేది .వాటిని దాన ధర్మాలు చేసి బాగు పాడమని చెప్పేది .ఆమెకు తెలీకుండా వ్రే లికి ఉ బంగారు ఉంగరం ఒకడు తొడిగితే మురికి కాల్వ లోకి విసరేసింది .ఒకడు వెండి గ్లాసును కొంగుకు కట్టితే వాడి గొడ్ల సావిడి అంటూ కుంది .ఆమె ను పరీక్షించాలను కొన్న వారి ముఖాలు వేల వేల బోయాయి .ఆమె మాటల్లో ‘’అడవి ‘’అంటే అజ్ఞానం .ఒక సారి మళయాళ స్వాములతో ‘’ఒరేయ్ నీకు ఇంకో చొక్కా ఉన్దిరోయ్ ‘’అన్నది .అంటే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంది అని అర్ధం .ఆమె పాముల్ని దూడలు అనేది .ఒకసా  రి భక్తుడు ఒకడు పాము ను కర్రతో కొడితే అమ్మ కు దెబ్బలు తగిలి నంత బాధ పడింది .దాన్ని చేతి లోకి తీసుకొని ‘’నువ్వ్వు మనిషివౌతావు ‘’అన్నది .ఆ పాము ఆమె ఒడిలోనే కన్ను మూసింది .పదేళ్లు తనతో సహవాసం చేసిన కుక్క చని పోతుంటే ‘’మానవ లోకం వదిలి పోతున్నావా .పొ.మనిషిగా నే పుద్తావులే ‘’అంది .’’ఎద్దల్లె తిని మోద్దల్లె తిరిగితే దేవుడు కని పించడు  ‘’అనేది .ఆడ వాళ్ళను ‘’ఒసేయ్ ముడ ల్లారా ! మాయ మగన్ని  చూసి మిడిసి పోకండి .కమ్మని మగడు ఇక్కడ ఎలా రమిస్తున్నాడో చూడందే అ’’అని తన భ్రుకుటి మద్య లో వేలు పెట్టుకొని సమాధి లోకి పోయిన్దొక సారి .

                                                          తీర్ధ యాత్రలు –మహాత్ముల దర్శనం

       భద్రాచలం తిరుపతి ,శ్రీ శైలం కాశీ ,ప్రయాగ వంటి పుణ్య క్షేత్రాలన్నీ వల్లబనేని అన్న పూర్ణ ,పిన్నమ నేని నాగయ్య ల మొదలైన భక్త బృందం తో సందర్శించింది .దక్షినేశ్వరం లో’’ శ్రీ రామ కృష్ణ పరమ హంస దేవిలో ఇమిడి పోయాడు .దేవి పరమ హంస లో ఇమిడి పోయింది .పరమ హంస కు చావు పుట్టుకలు లేవు ‘’అని అద్భుత భాష్యం చెప్పింది .శ్రీ రమణాశ్రమానికి వెళ్లి సరాసరి రమణ మహర్షి కూర్చునే ఆసనం పై కూర్చుంటే రమణులు ఆమె ప్రక్కన ఆసీను లయారు .అమాంతం గా మహర్షి పై వాలి పోయింది .లేచి ‘’ఎప్పుడూ అంత దూరం ఏమి చూస్తున్తావు ?అనిఆయన్ను అడిగింది .ఆయన భావ గర్భితం గా ‘’నువ్వు చూస్తున్నదే నేనూ చూస్తున్నాను ;;అన్నారు .

                 తిరుమలకు వెళ్లి అర్చకులు చూస్తుండగానే గర్భ గుడి లోకి వెళ్లి ‘’ఏరా వెంకన్నా !ఇక్కడున్నావా ?’’ అని పసి పిల్లాణ్ణి పలక రించి నట్లు పలక రించింది .1936 శ్రీ మళయాళ స్వాములు కురుమద్దాలి ఆశ్రమానికి అమ్మ ను దర్శించ టానికి వస్తే ఆయనకు ఎదురు వెళ్లి కౌగలించు కొన్నది .1924 లో గాంధి మహాత్ముడు బందరు వస్తే స్వామి సీతా రాం అమ్మను వెంట బెట్టు కొని గాంధి గారికి దర్శనం కల్గించారు ..మహాత్మున్ని ఆలింగనం చేసుకొని అరటి పండు బోసి నవ్వుల తాత నోటి కందించి ‘’ఒరేయ్ ! లోక సేవ బాగా చేస్తున్నావు .ఇంకా బాగా చెయ్యి ‘’అంది .పెను మత్చ యోగిని ,లలితా నంద సరస్వతి ప్రనవానంద స్వామి వంటి వాళ్ళు వచ్చి అమ్మ తో తత్వ గోష్టి  చేసే వారు .గడిపాటి వెంకట చలం ,ఆయన కూతురు పదమూడేళ్ళ సౌరీస్ తో వచ్చి చాలా సార్లు  అమ్మ దర్శనం చేసుకొన్నారు .ఆ అనుభవాలను చలం చింతా దీక్షితులు గారికి రాశారు ఆంద్ర ప్రదేశ్ మొదటి ఆస్థాన కవి శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి ,ఉన్నావ లక్ష్మీ నారాయణ ,కాటూరి వెంకటేశ్వర రావు ,త్రిపుర నేని గోపి చాంద్ ,వేలూరి శివ రామ శాస్త్రి వంటి కవి పండితు లెందరో అమ్మ దర్శనం తో పులకించి పోయారు .

    .1938 లో వేలూరి శివ రామ శాస్త్రి గారు ఆంద్ర పత్రిక లో అమ్మను గురించి అనేక వ్యాసాలూ రాశారు .మహా భక్త విజయం గ్రంధ కర్త పంగులూరి వీర రాఘవుడు అమ్మ సమాధి నుండి లేచే సమయానికి వెడితే లేచి వచ్చి కౌగలించుకొని ‘’నీకు ఆకలవుతోంది ‘’అని లడ్డు చేతి లో పెడితే ‘’నువ్వు మాల దానివి .నేను బ్రాహ్మన్ని .’’అంటే ఆమె ‘’ఒర్! బత్తికి కులం ఉందన్త్రా /అన్నది .ఆయన మహా సంతోషం గా కళ్ళ కద్దు కొని తిన్నాడు .ఆమె ఇచ్చిన మంచి నీళ్ళు అమృతం గా తాగాడు .

     శ్రీ లలిత నంద సరస్వతి స్వామి ఆహ్వానిస్తే ఆయన నిర్వహించిన రుద్ర యాగానికి వెళ్లి సన్మానం పొందింది .గాలి లాగా తేలికై కొండెక్కి నాగ సర్ప రూపం లో సుబ్రహ్మనఎశ్వరున్ని   సందర్శించి వచ్చింది పిన్నమ నేని వీరయ్య చౌదరికి రైస్ మిల్లు కట్టు కోవటానికి ప్రభుత్వం అనుమతిని ఇవ్వక పోతే ,వాళ్లకు నచ్చ చెప్పి ఇప్పించింది .

          1951 జనవరి లో భక్తులతో ‘’ఈ మతం తగల బడి పోతోంది ఒరేయ్ వంట వాడు పైకి ఎక్కు తున్నాడు .ఇక వంట తయారు కాదు ‘’అని నర్మ గర్భం గా పలికింది .15-1-1951 ఖర నామ సంవత్సర పుష్య శుద్ధ శ్టమి నాడు రాత్రి ఒంటి గంటకు తనువు చాలిస్తున్నట్లు తెలియ జేశింది .ఎవరేమి పెట్టినా తిన్నది .రామ నామం చేస్తూ ,చేయిస్తూ సరిగ్గా రాత్రి ఒంటి గంటకు అమ్మ భ్రూ మాధ్యమ నుండి గొప్ప వెలుగు వెలువడి ఆశ్రమం అంతా ప్రకాశింప జేసింది .అమ్మ పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మ లోకం చేరింది .శాస్త్రోక్తం గా ఆమె దేహాన్ని నిక్షేపం చేశారు .ఆమె ఆజ్న ప్రకారం దేవీ రూపం లో ఉన్న నల్ల రాతి విగ్రహాన్ని అమ్మ సమాధి పై ప్రతిష్టించారు .తరువాత ఇంకో తెల్ల రాతి విగ్రహ ప్రతిష్ట చేశారు రోజు ఈ విగ్రహాలకు అర్చన జరుగు తుంది .ఖమ్మం జిల్లా బూర్గం పహాడ్ లో కూడా పిచ్చమ్మ అవధూత ఆశ్రమం ఉంది

 ఈ విధం గా కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర లోనే పిచ్చమ్మ ,పెన్మత్స యోగిని వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు .

   మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –26-6-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

అమెరికా డైరీ raliegh బంధువుల rally

అమెరికా డైరీ

                                                             raliegh బంధువుల rally

          జూన్ నేల18  సోమ వారం నుంచి 24  ఆదివారం వరకు గడిచిన వారం అంతా మా అమ్మాయి వాళ్ల పెళ్లి రోజు,  విందులు, బంధువులరాక తో గడిచింది .సోమ వారం  సాయంత్రం చక్ర వర్తి  అనిలా దంపతుల గారింట్లో భజనకు వెళ్ళాం .వాళ్ల అప్ స్తైర్స్ లో భజన మందిరం లో అన్ని రకాల దేవుళ్ళు విగ్రహాల రూపం లో ఉంటారు .వాటికి చక్కని అలంకరణ దుస్తులు ఆయన భార్య శ్రద్ధగా చేస్తుంది .చూడ ముచ్చటగా ఉంటుంది మామిడి పనస ముక్కలతో ప్రసాదం పెట్టారు .

          సోమవారం పద్దేనిమిదో  తేది మా అమ్మాయి విజయలక్ష్మి ,అల్లుడు అవధాని ల పెళ్లి రోజు .ఉదయమే పులిహోర చేసింది .సాయంత్రం మినప సున్ని ఉండలు చేసి అందరికి పెట్టింది మా అమ్మాయి .మంగళ వారం లైబ్రరి కితీసుకొని  వెళ్లి ‘’సమ్మర్ రీడింగ్ ‘’లో నన్ను ,పిల్లల్ని సభ్యులనుగా చేసింది . .దీని వల్ల ఎక్కువ గంటలు చదివిన వారికి బహుమతి ,ఏదైనా పుస్తకం ఆలస్యం గా తిరిగిస్తే ఉండే ఫైన్ ఉండవు .నాపేరు మీద కార్డ్ ఇచ్చ్చారు .దాని పై  నాలుగు పుస్తకాలు తెచ్చుకోన్నాను .

ఫొటోస్

This slideshow requires JavaScript.

                                                               రాలీ బంధువుల రాలీ

    అవధాని మేనత్త  లక్ష్మి గారు ,భర్త చీమల పాటి దుర్గా ప్రసాద రావు గార్లు నార్త్ కరోలినా లోని రాలీ లో సుమారు పదహారేళ్ళ నుంచి ఉంటున్నారు .అంతకు ముందు చికాగో, న్యు జెర్సి న్యూయార్క్ వగైరాలలో గత నలభై ఏళ్లుగా ఉంటున్నారు .విజ్జి వాళ్ల పెళ్ళికి వచ్చారు .నార్త్ కరోలినా కు రాజ దాని రాలీ .కాని పెద్ద సిటి శార్లేట్ .అమెరికా రాష్ట్రాలకు ముఖ్య పట్నాలు చిన్న ఊళ్లల్లోనే ఉంటాయి .అది ఇక్కడి వింత .రాలీ నుంచి వాళ్ళిద్దరూ ,వాళ్ల రెండో అమ్మాయి బుచ్చి తో మన ఇంటికి శుక్ర వారం మధ్యాహ్నం వచ్చారు .అందరికి దోసే లు వేసి పెట్టింది విజ్జి .ఆ సాయంత్రం వాళ్ళు పవన్ వాళ్ళింటికి వెళ్లి రాత్రికి ఇక్కడికి వచ్చారు .వాళ్ల అమ్మాయి స్నేహితురాలింటికి వెళ్ళింది .రాత్రి ఇక్కడే వాళ్ళిద్దరూ భోజనం చేసి పడుకొన్నారు .

          శని వారం ఉదయం ఇడ్లి టిఫిన్ చేసింది .నేను ఆయనకు మన హనుమత్ కదానిది   ,అక్కయ్య పుస్తకాలు ఇచ్చాను .చాలా సంతోషించారిద్దరూ .మధ్యాహ్న భోజనం ఇక్కడే .మామిడి కాయ పప్పు తోటకూర పులుసు ,దోసకాయ పచ్చడి ,వంకాయ కూర  కెరట హల్వా తో భోజనం చేశాం .సాయంత్రం ,వాళ్ళిద్దరూ మేమందరం కలిసి ‘’ikea’’  అనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కు అరగంట ప్రయాణం చేసి కార్ లో వెళ్ళాం .ముసలి వాళ్ళిద్దరూ నడవ లేరు కనుక చెరో కార్ట తీసుకొని చెరో దాల్లో కూర్చో పెట్టి ఎవరి భార్యల్ని వాళ్ళం తోసుకుంటూ షాపింగ్ మాల్ అంతా తిరిగాం .పైన కూడా ఉంది కాని అప్పటికే అలిసి పోయి పైకి వెళ్ళ లేదు .ఇంటికి కావలసిన వంట పరికరాలు పరుపులు దుప్పట్లు దిండ్లు కొవ్వొత్తులు  ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి .లేనిది లేదు .వరైటీ బాగా ఉంటుంది .ప్రభావతి గిమూడు గిన్నేలున్న సెట్టు పది డా లర్ల కు  కొన్నది .వాల్లెవో స్టాండ్స్ ,విజ్జి ఐస్ కప్పులు కొన్నది .ఇక్కడ రిజిస్టర్ చేసుకొన్నా వారందరికి కాఫీ ఫ్రీ .ఇది చూస్తె ఉయ్యుర్లో ‘’సుధీర్ టింబర్ డిపో ‘’జ్ఞాపకం వచ్చింది .అక్కడ ఉదయం పది గంటలకు ఉన్న వారందరికి ఇడ్లి  కాఫీ ఫ్రీ గా పెడతారు .ఎన్ని ఇడ్లీలు తింటే అన్ని .సాయంత్రం ఆరుగంటలకు కూడా అంతే పునుగులు టీ ఫ్రీ .కొనే వారు ఉండాల్సి వస్తే భోజనం ఫ్రీ . అన్నీ  చూసి బేవార్సు కాఫీ అందరం తాగాం .చాలా బాగుంది .ఇంటికి రాత్రి ఏడు గంటలకు వచ్చాం .

         శని వారం రాత్రి పవన్ వాళ్ళింట్లో డిన్నర్ .రాలీ వాళ్ల ఇద్దరమ్మాయిలు మాకంటే ముందే వాళ్ల ఫ్రెండ్ తో పవన్ ఇంటికి చేరారు .మేము ఎనిమిదింటికి వెళ్ళాం .కాకర కాయ సెనగ పిండి పెట్టి కూర విజ్జి చేసి తీసుకొచ్చింది .తోటకూర పులుసు దోస పచ్చడి కెరట్ హల్వా కూడా చేసి తీసుకొచ్చింది .వాళ్ళు వేడి వేడి గారెలు అల్లం చట్నీ ,పుట్నాల చెట్నీ తో పెట్టారు .చాలా తిన్నాం .చాలా బాగున్నాయి గారెలు చట్నీలుకూడా . వంకాయ కూర ఆవకాయ ,కారత్ కూర కంది పొడి అప్పడాలు ,పొట్టు ఒడియాలు ,అన్నం పెరుగు లతో మృష్టాన్న భోజనం .అన్నీ బానే ఉన్నాయి .గారెలు ఎక్కువ తిన్నాను కనుక మిగిలినవి వాసన చూసి నట్లుగా అతికోద్దిగా తిన్నాను .ఆతిధ్యం అదిరింది .వాళ్ల ఆడపిల్లలుబుల్లి బుచ్చి  భోజనం చేసి  స్నేహితురాలితో వెళ్లి పోయారు .వాళ్ళిద్దరూ పాపం వచ్చీ రాని  తెలుగు తో సతమత మవుతున్నా మాట్లాడాలనే తపన ఉన్న వాళ్ళు .మాట్లాడింది కరెక్టేనా అని అడిగి సరి చేయించుకోవటం మెచ్చ దగింది .రాత్రికి రాలీ దంపతులు పవన్ వాళ్ళింట్లోనే పడక శీను .మేము ఇంటికి పదిన్నరకు తిరిగి వచ్చాం .

          ఆది వారం విజ్జి వాళ్ల ప్రక్క ఇంట్లో ఉండే హైదరాబాద్ వాళ్ళు రవి, గాయత్రి దంపతులు రాలీలను మమ్మల్ని ముందే ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించారు .అందరం తొమ్మిదిన్నరకు వెళ్ళాం .మళ్ళీ గారెలు రెండు చట్నీలు సంబారు ,తమిళుల పొంగల్ చేశారు .అన్నీ బాగా ఉన్నాయి .జున్ను కూడా చేసి పెట్టారు .బాగా రుచిగా ఉంది .కాఫీ కూడా బాగుంది .రవి గారి అమ్మా ,నాన్న హైదరాబాద్ నుండి కిందటి వారం వచ్చారు .వారి తో పరిచయం అయింది .ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయి విజయ నగర కాలని లో స్వంత ఇంట్లో ఉన్నారు .మన కృష్ణ యాజికి వాళ్ళిద్దరూ petients.అతన్ని గురించి చాలా సదభి ప్రాయాన్ని వెలి బుచ్చారు మా లాగానే .ఆడ వాళ్ళు ముగ్గురికి జాకెట్టు పండ్లు వెండి పువ్వు బొట్టు పెట్టి ఇచ్చింది గాయత్రి . రాలీ దంపతులు ఇక్కడున్న రోజులు సరదా గా గడి పారు .విజ్జి కూడా ఆవిడకు తగిన సత్కారం చేసింది .ఆవిడ  మనవాళ్ళకు ముగ్గురికి చేతుల్లో దా లర్లు పెట్టింది .వాళ్ళు కూడా అమ్మమ్మా  తాతయ్యా అంటూ బానే ఉన్నారు .వాళ్ళిద్దరూ మధ్యాహ్నం పదకొండు గంటలకు కార్ లో బయల్దేరారు రాలీ కి .దారిలో తిన టానికి పులిహోర చేసి పాక్ చేసి ఇచ్చింది విజ్జి .ఇలా ఈ వారం సరదాగా ,బంధుజన సందోహం గ గడిచి పోయింది –రాలీ ఇక్కడికి మూడు గంటల ప్రయాణం .సుమారు నూట ఎనభై మైళ్ళు .ఆయన ఆవిడా రాలీ లో దేవాలయాలలో స్వచ్చంద సేవ చేస్తుంటారు .భగవత్ సేవలో జీవితాలను పండించు కొంటున్నారు ‘’దొరకునా ఇటు వంటి సేవా ‘’

  ఈ వారం లో చదివిన పుస్తకాలు –north carolina in american revolution ,,the battles of lexington and concord ,german indians the treaty of paris ,to wake the dead ,the invention of air the navjos ,edgae allan poe

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-6-12.—కాంప్—అమె

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

సిద్ధ యోగి పుంగవులు –15 భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు


                               సిద్ధ యోగి పుంగవులు –15

                                                          భ్రుక్త రహిత రాజ యోగి– వేటూరి ప్రభాకర శాస్త్రి గారు

       వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం .ఆయన రాయని పీఠిక లేదు .తరచని సాహిత్య మూ లేదు తిరగేయని శాసనం  సేకరించని తాళ  పత్రంలేదు . .దేశభక్తి లో అనుపమాన మైన వారు .ఇవన్నీ మనకు అందరికి తెలిసిన విశేషాలే .కాని అందరికి తెలియని  మహా పార్శ్వం  వేటూరి వారిలో ఉంది .వారు మాస్టర్ సి.వి.వి.గారి శిష్యులై ఎంతో యోగ సాధన చేసి ఆధ్యాత్మిక తీరాలను చూసి  ,తన వంటి వారెందరినో శిష్యులను  తయారు చేసి దీనులను ఉద్ధరించారు .అదే మనం తెలుసు కొ బోతున్నాం .

        కృష్ణా జిల్లా లో దివి తాలూకా చల్ల పల్లికి సమీపం లో పెద కళ్ళే పల్లి లో ప్రభాకర శాస్త్రి గారు 7-2-1888న వేటూరి శేషమ్మ ,సుందర శాస్త్రీ దంపతులకు జన్మించారు .పదహారేళ్ళకే తెలుగు ,సంస్కృతం పుక్కిట పట్టారు .కవిత్వ మూ చక్కగా అలవడింది .శతావధాన ,అష్టావదానాలెన్నో చేశారు .మద్రాసు  లో తెలుగు పండితులుగా పని చేశారు .అప్పుడే వేపా రామేశం గారి వద్ద ఖగోళం ,చరిత్ర అధ్యయనం చేశారు .1910  లో పిసుపాటి మహాలక్ష్మమ్మ గారితో వివాహ మైంది .మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం లో పండితుని గా చేరి ఇంగ్లీష ,కన్నడ,తమిలాలు నేర్చారు .చరిత్ర సంస్కృతి ,వాజ్మయం ,శాసనాలు తాళ  పత్రాలు ,కైఫీయతులు ,గ్రంధాలు సేకరించి ,పరిశీలించి పరిష్కరించి,ముద్రించారు .’’ఎన్నో బండ్లకు ఎత్త దగి నంత సాహిత్య వాజ్మయాన్ని శాస్త్రి గారు సంత రించారు ‘’అని ఆయన్ను గురించి అంటారు .

                                                         యోగ సాధన

           1912-16 మద్య కాలం లో శాస్త్రి గారు తీవ్ర బాధలకు గురైనారు .మానసిక స్వాస్త్యమూ కోల్పోయారు .మద్రాస లో రైలు ఎక్కి ఎక్కడో ఆత్మా హత్య చేసుకోవాలని భావించిరైలు ఎక్క టానికి స్టేషన్ కు పోతున్నారు . అబ్బూరి జగన్నాధ రావు అనే వారితో పరిచయమైంది .ఆయన తన బావ గారైన ప్రేసిదేన్సి కళా శాల ఫిలాసఫీ ప్రొఫెసర్ పోత రాజు నరసింహం గారిని పరిచయం చేశారు .ఈయన  మాస్టర్ సి.వి.వి.గారి శిష్యులు .పోత రాజు గారు ఇచ్చిన పరిచయ ఉత్తరాన్ని తీసుకొని వేటూరి వారు కుంభకోణం లో ఉన్న మాస్టర్ గారింటికి చేరి ఉత్తరం ఇచ్చారు .ఆయన చదివి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు ఆ మాట తోనే శాస్త్రి గారిలో ‘’ప్రజ్ఞ ‘’ప్రవేశించింది .అప్పటికి ఆయన చేతి గూడు జారి చా లా కాలం నుంచి చాలా బాధ పడుతున్నారు .ఇక్కడికి రాగానే తగ్గి పోయి గూడు మళ్ళీ యదా స్తానం చేరింది .ఒక చెయ్యి పైకి లేప గలిగే వారు కాదు .ఇప్పుడు హాయిగా చెయ్యి పని చేస్తోంది మాస్టర్ గారి అను మతి తో రాదా కృష్ణ పిల్లే ,మహాదేవ్య గార్లు శాస్త్రి గారిని పరీక్షించి పూర్వజన్మ వృత్తాంతం తెలుసు కొని మాస్టర్ గారికి నివేదించారు .అప్పటి నుంచి శాస్త్రి గారు మాస్టర్ గారి శిష్యులై పోయారు .

      ఇతరుల బాధలను చూసి శాస్త్రి గారు తట్టు కొ లేక పోయే వారు .తన ఆత్మ శక్తి తో బాధలు తీర్చే వారు .’’నిన్నటి వరకు నువ్వు ప్రజ్ఞా ప్రభాకరుడివి .ఈ రోజు నుండి నన్ను గురించి రాయ గల యోగ్యత నీకు కల్గింది ‘’అని గురువు గారు శాస్త్రి గారిని మెచ్చారు .1918 లో తంజావూర్ సరస్వతి గ్రంధాలయం లో పనిచేశారు .వారాంతపు శలవల్లో మాస్టర్ గారిని దర్శించి యోగ రహస్యాలు నేర్చే వారు శాస్త్రి గారు ‘’తమ లో సమస్త విశ్వాన్ని ,సమస్త విశ్వం లో తమను చదర్శించ గల యోగి పుంగవులు ‘’అయారు .భార్యను కూడా మాస్టార్ జీ  కి శిష్యురాలిని చేశారు .శాస్త్రి గారు ‘’గౌతమ బుద్ధుని అవతారం ‘’అని నాడీ  గ్రంధాలు తెలిపాయి ..అందుకే ఆయన లో కరుణ ,దయ ,ప్రేమ ,శాంత గంభీరత స్పష్టం గా కన్పిస్తాయి .ఆయన ముఖం చూస్తె నే చాలు మానసిక ప్రశాంతి లభిస్తుందని చాలా మంది చెప్పే వారు.

                                                             యోగ ప్రభాకరామ్రుతం

             ఒక రిక్షాలాగే వాడి కొడుకు నోట మాట రాక మూతి వంకరపోయి చేతులు ,కాళ్ళు స్వాధీనం లో లేక శాస్త్రి గారి దగ్గరకు వస్తే ,ధ్యానం చేసి వాడితో కాఫీ తాగించి  శరీరం అంతా నిమిరి ప్రేమ కురిపించారు .అంతే వాడు తనకే జబ్బు లేనట్లు లేచి కూర్చున్నాడు

         బందరు లోని వేమూరి దుర్గా నాగేశ్వర రావు కు రెండు కిద్నీలలో రాళ్ళు చేరి ఎన్ని మందులు తిన్నా తగ్గక వేటూరి వారి వద్దకు చేరాడు .డాక్టర్లు అది తగ్గే జబ్బు కాదని హేళన చేశారు .ఒక సారి తీవ్రం గా బాధ అనుభవిస్తూ శాస్త్రి గారికి కబురు చేస్తే ,తాను అక్కడి నుండే చికిత్స చేస్తున్నానని భయం లేదని చెప్పారు కాసేపటికి మూత్రం ద్వారా రాళ్ళు పడి  పోయి బాధ నివారణ జరిగింది .ఆలస్యం ఎందుకు జరిగింది అని ఆయన వేటూరి వారిని ప్రశ్నిస్తే ‘’నమ్మకం నీకు పూర్తీ గా లేనందువల్ల ‘’అని చెప్పారు .

        ఒక సారి శాస్త్రి గారు అయాచితుల హనుమత్చాస్త్రి ,అప్పల సోమేశ్వర శర్మ లతో ‘’భ్రుక్త రహిత రాజ యోగం ‘’గురించి ,మాస్టర్ గారి గురించి మాట్లాడు కొంటున్నారు .వారిద్దరూ ఈ యోగా మహాత్యనికి ఏదైనా నిదర్శనం చూపమని అడిగారు .’’మీకు యే పువ్వు ఇష్టమో చెప్పండి ‘’అన్నారు శాస్త్రి గారు ‘’సంపంగి ‘’అన్నారు వారిద్దరూ .వేటూరి వారు ధ్యానం లో మునిగి పోయారు .వెంటనే వాళ్ళున్న ప్రదేశమంతా సంపంగి పూల వాసనలు  గుబాలించాయి .కాలం కాని కాలం లో సంపంగి పూల వాసన రావటం అందర్ని ఆశ్చర్యం లోకి నెట్టేసింది ఇదే ఆ యోగానికి నిదర్శనం .

        కల్లూరి వీర భద్ర శాస్త్రి వేటూరి వారిని దర్శించ టానికి మద్రాస వెళ్లారు .అక్కడ ‘’కూం నది ‘’మురికి కంపు భరించ లేకుండా ఉంది .వీరభద్రం గారు ‘’శాస్త్రీ ! ఈ కంపు పోగోతట్టవా’’అని మనసులో అనుకొన్నారు  .అంతే శాస్త్రి గారు కళ్ళు మూసుకొని ధ్యానిస్తే సుగంధ పరిమళాలు అంతటా వ్యాపించాయి

      ఇంకో సారి ‘’అనాస పండు ‘’తినాలని పించింది .కాసేపటి లో ఆయన దర్శనం కోసం రాజ మాండ్రి నుంచి వప్పుడే వచ్చిన పద్మ నాభ స్వామి అనే సాధకుడు అనాస పండ్ల గంప తో వచ్చి ఇచ్చాడు .

     ప్రఖ్యాత శాస్త్ర వేత్త విస్సా అప్పా రావు వేటూరి వారికి వియ్యంకులు .అప్పా రావు గారు శాస్త్రి గారి యోగాద్భుతాలు31 ని గ్రంధస్తం చేశారు .అందులో ఒకటి కుష్టు రోగం తో  బాధ పడుతున్న వకీలు గుమాస్తాకు తన ఇంటి వద్దనుంచే నయం చేశారు .తిరుపతి లో ఉండే నరసింహా చారికి ,ఒక రెడ్ల కుర్రాడికి మద్రాస నుండే కుష్టు రోగం కు చికిత్స చేసి పోగొట్టారు .దీన్నే’’ డి స్తంట్ హీలింగ్ ‘’అంటారు .తిరుపతి లోని పార్ధ సారధి అయ్యంగార్ భార్యకు గర్భకోశ కేన్సర్ .డాక్టర్లు ఆమె పని రోజుల్లోనే ఉందన్నారు .శాస్త్రి గారు ఆయన కోరితే వాళ్ళింటికి వెళ్లి ప్రార్ధన చేశారు నలుపు ,ఎరుపు ద్రవం బయటికి పోయి  పదిహేను రోజుల్లో ఆమె మామూలు మనిషి అయింది .

           1939-40ప్రాంతం లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారికి నిద్ర  రా క పోవటం గుండె దడ ,వీధిలో నడవటానికి భయం ఉండేవి .శాస్త్రి గారిని సంప్రదించారు .అదేదో ఆయన సూక్ష్మ శరీరం లోని బాధ అని తెలుసు కొన్నారు .అది అవధాని గారి మొదటి భార్యదే .ఎంత గా ట్రీట్ చేసినా తగ్గలేదు అవధాని గారికి .ఒక సారి ‘’నువ్వు నా మాట వినక పోతే వినేట్లు చేస్తాను ‘’అని గట్టిగా మందలించారు .వారి ఆదేశం ప్రకారం అవధాని గారి రెండో భార్యకు మొదటి భార్య మొదటి సంతానం గా పుట్టి ఋణం తీర్చుకోంది .అప్పటి నుండి అవధాని గారికి యే బాధలు లేవు  

      అలాగే కుప్పు స్వామి శాస్త్రి గారి మొదటి భార్య చని పోయి ఆయన్ను చాలా బాధ పెడితే వేటూరి వారు ఆమెను న ఆయన కొడుకు శేషగిరి కి కూతురు గా పుట్ట మని  చెప్పి  అల్లానే జరిగితే ఆయన కు ఆనందం  కలి గింది .

        ప్రఖ్యాత దేశ భక్తులు ,మహా వక్త చెరుకు వాడ నరసింహం పంతులు గారికి క్షయ వ్యాధి చాలా తీవ్రం గా వచ్చింది .దాన్ని ట్రీట్ చేసి నయం చేశారు శాస్త్రి గారు .అలానే ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు భార్యకు పార్శ్వపు నొప్పి ,తిరుపతి ప్రాచ్య శోధన సంస్థ సంచాలకుడు రామానుజ స్వామి భార్యకు జలోదరం తగ్గించారు .

          ‘’నా చుట్టూ ఆనందాన్ని ,అమృతాన్ని పంచి పెట్టాలనే సంకల్పం ఉన్న వాణ్ని నేను .అందర్ని ఆపదల నుంచి రక్షించటం ,అందర్లో ఆనందాన్ని నేల కొల్పటం అనే రెండు భావాలే నాకు ఉచ్చ్వాస నిస్స్వాశాలు .అవి రెండు ఆడటం లోనే నా ఊపిరి ‘’అన్న మహా ను భావులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు .నిజం గానే ఆయన ప్రభాకరుడు అంటే సూర్యుడు లానే ఆరోగ్యాన్ని చ్చేవారు .ఆరోగ్యం భాస్కర్ర్ దిచ్చేత్ కాదు ఆరోగ్యం ప్రభాకరదిత్యేత్ ‘’అయింది ఆయన పట్ల .సార్ధక జీవులు వారు .

       ఒక సారి వారు తళ పత్రాల కోసం ఊళ్లు తిరుగుతూ ఒక వూరిలో ఉండగా నిద్ర పట్టక బయట తిరుగుతూ ,దీపం వెలుగుతున్న ఇంటికి పోయి మంచి నీళ్ళు అడిగారు .గృహిణి మంచినీళ్ళ చెంబు అందించి ,తన భర్త ప్రాణాపాయ స్తితి లో ఉన్నారని దీనం గా విల పించింది .అంతే కరుణార్ద్ర హృదయులు శాస్త్రి గారు మంచి నీళ్ళు థా గ కుండా తన బసకు చేరి కాళ్ళు కడుక్కొని నిద్ర పోకుండా  ప్రార్ధన చేశారు .తెల్లారి వెళ్లి ఆమెను పలకరించారు ‘’మీరు పలక రించి వెళ్ళిన తర్వాత మా వారికి ఆరోగ్యం కుదుట బడింది ‘’అని కృతజ్ఞత చెప్పింది ఆ ఇల్లాలు .ప్రార్ధనకు ,ఈశ్వర అనుగ్రహానికి ఉన్న మహత్తర శక్తి ఇక్కడ మనకు కన్పిస్తుంది .ఆయన అనుకంప అలాంటిది .అందుకే ఆయన బుద్ధుని అపర అవతారం అన్నారు .యోగ ప్రభాకరులు 29-8-1950న తమ హంసను సవిత్రు మండల నారాయణ మూర్తి లోనికి చేర్చి ధన్యులయారు .వారికి దేశం అన్ని విధాలా ఎంతో రుణ పడి ఉంది .

                                                        యోగ ప్రభాకర కిరణాలు

           ప్రభాకర శాస్త్రి గారి యోగ శిష్యులలో కొత్త వెంకటేశ్వర రావు ,కొత్త రామ కోటయ్య ,అర్చకం ఉదయ గిరి శ్రీని వాసాచార్యులు ,ఏం.ఎల్.నారాయణ రావు ,వెన్నెల కంటి ముని క్రిష్నయ్య ,గాలి బాల సుందర రావు ,తిమ్మా వజ్ఝాల కోదండ రామయ్య ,సింగరాజు సచ్చిదానందం ,పోచిరాజు శేషగిరి రావు ,శ్రీమతి కల్ప వల్లి ,శ్రీ మతి చంద్ర కాంతమ్మ మొదలైన వారెందరో ఉన్నారు .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-6-12.కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –14 అమృత యోగిని – పెను మత్స సీతమ్మ ఆవ ధూత

  సిద్ధ యోగి పుంగవులు –14

                                                 అమృత యోగిని – పెను మత్స   సీతమ్మ ఆవ ధూత

     సాధారణ గృహిణి పూర్వ జన్మ  వాసన ,సంకల్ప బలం ,వరిష్ఠ గురుత్వం లభించి ,మహా మహిమాన్విత యోగిని గా మారిన ఉదంతమే పెను మత్చ సీతమ్మ యోగిని వృత్తాంతం .

                 సీతమ్మ 26-8-1921 న కృష్ణా జిల్లా పెను మత్స అనే చిన్న పల్లె టూ రిలో చెరుకూరి బ్రహ్మయ్య ,శ్రీ రామమ్మ అనే కమ్మ దంపతులకు జన్మించింది .పుట్టింటి పై మమ కారం ,ఇరుగు పొరుగు పై ఆదరాభిమానాలు చిన్నప్ప టి నుంచే అలవడ్డాయి .ఎనిమిదవ ఏట ఉయ్యూరు కు అతి దగ్గర లో ఉన్న చిన్న కుగ్రామం గండి గుంట  లో ని నాదెళ్ళ క్రిష్నయ్య పెద్ద కొడుకు పదిహేనేళ్ళ సీతా రామయ్య తో వివాహం జరిగింది .ఈమె తలి దండ్రులు అయిదు రోజుల పెళ్లి రంగ రంగ వైభవం గా చేశారు .పదహారవ ఏట కాపురానికి వెళ్ళింది .భర్త కు కుడి చేతి మీద వ్రణం పుట్టి  ,ఎన్ని చికిత్స లకూ తగ్గక చని పోయాడు .ఆమె కాపురం రెండేళ్ళ ముచ్చట అయి పోయింది .

       పుట్టి నింటికి తిరిగి వచ్చి, ఎప్పుడు దిగులుగా ఏడుస్తూ గడిపేది ..బల వంతం చేస్తే రెండు ముద్దల అన్నం తినేది అంతే .ప్రక్క ఇంటి దండ మూడి పూర్ణయ్య గారు రోజు వచ్చి ఒదార్చె వారు .పాటించ వలసిన లోక రీతి ,ధర్మం ,కర్తవ్యం బోధించే వారు .కొంత వరకు తేరుకొని తనకు సంపూర్ణ జ్ఞానం కావాలని ఆయన్నే దారి చూపించ మని  కోరింది .శ్రీ రామ కోటి రాయమని ,శ్రీ రాముని చిత్రాన్ని ఇచ్చాడు .ఆమె రామ కోటి రాయటం ప్రారంభించి ,కథిన నియమాలను పాటిస్తూ తులసి పూజ చేస్తూ గడి పింది .1942 సూర్యోపాసన ప్రారంభించింది .ఉదయం ఆరు గంటల నుండి ,మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సూర్యునికి ఎదురు గా నిలబడి దీక్ష గా కోన సాగించింది .1945 కు రామ కోటి పూర్తీ అయింది .అన్న ,వదిన ళ తో భద్రాచలం వెళ్ళింది .రామ కోటి ని శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి  దగ్గర లో ఉన్న ప్రదేశాలు చూసి హంసలదీవి వేనుగోపాలున్ని దర్శించి చల్ల పల్లి కోటకు వెళ్లి రాణి గారి చె సన్మానం పొంది .మళ్ళీ పెను మత్స  కు చేరింది

                                                                           మలుపు

          1946వ సంవత్సరంలో  ఆమె జీఎవితం ఒక మలుపు తిరిగింది . ఏలూరు నుండి కమ్ముల అప్పన్న అనే యోగా వ్యాయామ విద్యా ప్రవీణుడు పని మీద పెను మత్చ కు దగ్గర లోని నరసన్న పాలెం వచ్చాడు .సీతమ్మ విషయం ఆయనకు తెలిసింది .పెను మత్స కు వచ్చి ,ఆసనాలు ,యోగం నేర్పి వాటి వల్ల మనస్సు కుదుట బడు తుందని చెప్పాడు .ఆమె సాధన ప్రారంభించింది .అప్పుడప్పుడు అప్పన్న గారు వచ్చి చూసి పోతుందే వాడు .వారానికో సారి అన్నం తినటం , ఆ తర్వాతా నిమ్మ కాయ నీళ్ళుమాత్రమే  తాగి ఉండటం తో సాధన తీవ్రం చేసింది .ఆమె సాధన అప్పన్న గారికే ఆశ్చర్యం వేసింది .తాను సాధించిన యోగ విద్య తన పెరటి లో అందరికి చూపి ఆబ్బురమ్ లో ముంచే సింది .ప్రాణాయామం ,అందులోని తేడాలు ,ఫలితాలు అప్పన్న  తెలియ జెప్పాడు .వాటినీ సాధించింది .కుండలనీ యోగ సాధన చేసి ‘’అమృత పానాన్ని ‘’అలవాటు చేసుకొన్నది .ఇది సాధారణ యోగులకు అసాధ్యం .

                                                                        మహిమల వ్యాప్తి

         1948 లో అప్పన్న గారు తాను కట్టిన ఇంటి గృహ ప్రవేశ వార్షి కోట్స వాలకు సీతమ్మ కుటుంబాన్ని రమ్మని ఆహ్వా నించాడు .అప్పన్న శిష్యులు ,బంధువులు ,అనేక మంది పెద్దలు ,ప్రభుత్వోద్యోగులు అందరు వచ్చారు .అప్పన్న గారి కోరిక మీద ‘’భక్తీ యోగం ‘’గురించి అద్భుత ప్రసంగం చేసి అందర్నీ ఆకర్షించింది .జిల్లా కలెక్టరు, భార్య కూడా హాజ రైన ఆ సమా వేశం  లో సీతమ్మ ‘’కుండలినీ యోగం ప్రదర్శించి ,సహస్రారం నుండి అమృతం తీసింది ‘’హాలు అంతా సువాసన లతో గుబాలించి పోయింది .అప్పుడే ఆమె కీర్తి అన్ని జిల్లా లకు వ్యాపించింది .అమృత పానంచేయటం ఎంతో యోగ సిద్ధి ఉన్న మహాత్ములకే సాధ్యం ..ఎంద రెందరో భక్తులు పెను మత్స వచ్చి దర్శించి వెళ్ళే వారు .ఇంట్లోనే ఒక తడికల గది  లో ఎనిమిదేళ్ళు యోగ సాధన చేసింది .అప్పటికే పేరు ,ప్రఖ్యాతి పొందిన కురుమద్దాలి లోని మాల పిచ్చమ్మ అనే రామావ ధూత ను సందర్శించింది   .సీతమ్మ ను పిచ్చమ్మ ఆప్యాయం గా ఆదరించి ‘’బిడ్డా ! కొద్ది రోజుల్లో ణీ కోరిక తీరు తుంది ‘’అని ఆశీర్వ దించింది .

                         ఇంటికి తిరిగి వచ్చి తడికల గదిలోనే ఉంది. ధృఢ మైన వైరాగ్యం తో ఒకే ఆసనం లో 4నెలలు ‘’సవి కల్ప సమాధి ‘’ లో ఉంది .పిరుదులు చిల్లి పడి రక్తం కారటం ప్రారంభ మైంది .ఇంట్లో వాళ్ళు కంగారు పడి అప్పన్న గారిని పిలి పించారు .ఆయన వచ్చి కంగారేమీ లేదని ,ఆమె యోగానికి భంగం కలిగించవద్దని ,ఆమె ‘’బ్రహ్మానంద మ జ్ఞ ‘’గా ఉందని తనత తానే లేస్తుందని ధైర్యం చెప్పాడు .యోగం పూర్తీ అవగానే ఆమె మామూలు రూపం లోకి వచ్చింది కుటీరం లోనే ఉంది1951 అంతా గడి పిండి .అనేక దివ్య దర్శనాలను పొందింది .శ్రీ లక్ష్మీ నారాయణుల వరం లభించింది .

                                                                      భక్తులకు దర్శనం

          1952  లో అప్పన్న గారు వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వ వలసిందిగా సీతమ్మ గారికి సూచించారు .ఇది తెలిసి తండోప తండాలుగా జనం వచ్చే వారు .గ్రామం లోని దేవాలయం వద్ద ఎత్తైన వేదిక నిర్మించారు .దిగంబరం గా వెళ్లి వేదిక మీద పద్మాసనం లో కూర్చొని అయిదు రోజులు దర్శనం ఇచ్చింది .1952లో తన తడికల గది లోనే ఉంది ,హత యోగం ,రాజ యోగం ,ఆత్మా రామాయణం రాసిన కాగితాలను బయటకు విసిరింది .వాటిని చూసిన పెద్దలు ఆమె సమాధి నుంచి లేచి నపుడు తీరిక వేలల్లో ఈ రచనలు చేసి ఉంటుందని భావించారు .1954 వ సంవత్సరం లో కూడా ఆగస్ట్ ఎనిమిదో తేది నుండి ,సెప్టెంబర్ ఇరవై ఆరవ తేది వరకు దివ్య దర్శనం ఇచ్చింది .అప్పుడు ఆమె తల వెంత్రు కలన్ని పాము మెలికలు తిరిగి ఉన్నట్లు కని పించేవి .ఆ గ్రామ కరణం కట్టమూరి పుండరీ కాక్షుడు ఆమె తల వెంట్రుక లను భక్తీ తో  తాకి కళ్ళకు అద్దు కొన్నాడు .అప్పుడు అమ్మ ఆయన తో ‘’నేను వెళ్లి పోయిన తర్వాత వాటిని తెసుకొని జాగ్రత్త చేసుకోండి ‘’అని చెప్పింది .1955  సెప్టెంబర్ లో ‘’పిండోత్పత్తి ‘’గురించి రాసి కాగితాలను గడి బయటకు విసిరేసింది .చాలా మంది దర్శనానికి రోజు వచ్చినా ,బయటకు రాకుండా తనగది లోనే ఉండి పోయేది .1956 లోమార్చి ముప్ఫై నుంచి పది రోజులు దర్శనం ఇచ్చింది .ఆమె కోసం తండ్రి గారి పొలం లోనే ఒక సమాధి మందిరం నిర్మించారు . 9-2-1957న అశేష భక్త జనం వెంట రాగా ఇంటి నుండి ఊరే గింపు గా వెళ్లి మందిరం చేరింది .రెండు రోజులు మాత్రమే దర్శన మిచ్చింది .ఈ రెండు రోజులు చల్ల పల్లి రాణి వెంకట దుర్గాంబ గారు వచ్చిన వేలాది జనాలకు అన్న సంతర్పణ చేసింది .జనం ఎక్కు వై పదార్ధాలు అయి పోతే అక్క నాగరత్నమ్మ వచ్చి సీతమ్మ కు చెప్పేది .’’నువ్వు వెళ్లి అఖండం వెలిగించి .అన్న రాశులను ముట్టుకో ‘’అనేది అంతే పదార్దాలాన్ని అందరికి సరి పోయేవి .అంటే అక్షయం గా సమారాధన జరిగి పోయే దన్న మాట .

                తన మందిరం లోనే సీతమ్మ యోగిని ఎప్పుడుయోగ  సమాధి లోనే ఉండేది .భక్తులు ప్రతి సోమ వారం వచ్చి సమాధిని పూజించి వెళ్ళే వారు .మాస శివ రాత్రికి అన్నదానం జరిగేది .ప్రతి గురువారం రాత్రి భజనలు ,హరి కధలు ,జంగం కదా కాలక్షేపం ఉండేవి .సమాధి మందిరం దగ్గరే భక్తులు నిద్ర పోయి తమ కోరికలను విన్న విన్చె వారు .ఆమె అనుగ్రహం తో వారి మనో భీష్టాలన్ని నేర వేరేవి .

                                                                   లక్షల మందికి దివ్య  దర్శనం

            5-3-1958 నాడు ఒక్క రోజే దర్శనం లభిస్తుందని తెలిసి ఆంద్ర దేశం లోని అన్ని జిల్లాల నుండి రాష్ట్రేతరాల నుండి లక్షలాది మంది ముందు రోజు రాత్రికే పెను మత్చ చేరారు  .సమాధికి ముందు కట్టిన ఎత్తైన వేదిక మీద అమ్మ దర్శనమిచ్చి అందరిని సంత్రుప్తుల్ని చేసింది .ప్రేమ ,కరుణ ,వాత్సల్యం కురిపించి ఆశీర్వ దించింది .దర్శనం ఇచ్చే ముందు తన వారితో ‘’ఈ దర్శన మండపం ఎందుకు ?ఇంకో ఎడాదేగా ?’’అన్నది అమ్మ జీవ సమాధి ఆవ టానికి నిశ్చయించు కొన్నది అన్న వార్త విప రీతం గా వ్యాపించింది .కృష్ణా జిల్లా కలెక్టర్ అమ్మను దర్శించటా నికి వచ్చాడు .ఆమ్మ శీర్షాసనం లో ఉంది .ఆమె తల వద్ద  వింత వెలుగుకని పించి ఆశ్చర్య పోయి వెళ్లి పోయాడు .ఒక సారి అక్క నాగ రత్నమ్మ ‘’నీ  మహాత్మ్యం ఏదైనా చూపించమ్మా?’’అని అడిగింది .దానికి నవ్వి ‘ నాకు ’భగవంతుని మెప్పించే విద్య వచ్చు  వచ్చు కాని మనుష్యులను మెప్పించే విద్య రాదు ‘’అని అన్నది . మళ్ళీ ఫాల్గుణ పౌర్ణమి నాడు24-3-1959  దర్శన మిస్తానని ప్రకటించింది .ఆ నాటి ఉదయానికే లక్షలాది భక్తులు చేరు కొన్నారు .అందరికి కనుల పండువు గా దివ్య దర్శనం అనుగ్ర హించి  తరింప జేసింది . మళ్ళీ మంది రం లోకి వెళ్లి పోయింది .మందిరం బయట తాళం వేసి తాళం చెవి తల్లి శ్రీ రామమ్మ తన దగ్గర దాచుకోవటం అలవాటు .

                                                                   బ్రహ్మైక్యం  

             ఎనిమిదేళ్ళు నిరాహారం గా తపస్సు చేస్తున్న అమ్మ లో హతాట్టు గా ఒక పరిణామం కలిగింది . ఎనిమిది రోజుల తర్వాతా అమ్మ మందిరం లో ఉండగానే ,అక్క నాగరత్నమ్మ   గంట కొడుతూ మందిరానికి  ప్రదక్షిణాలు చేస్తోంది .సమాధి నుంచి అమ్మ తలుపు తీయమని మూడు సార్లు పిలి చింది .అక్క ,అమ్మని పిలుచుకు వచ్చి ,తాళం తీఇంచి తలుపు తెరిచింది .’’నేను వెళ్లి పోతున్నాను .నా నెత్తిన బిందెడు నీళ్ళు పోయండి ‘’అంది అమ్మ .వాళ్ళు భయ పది నీళ్ళు పోయకుండా కరణం గారిని పిలుచుకు రావ టానికి  మనిషిని పంపారు .ఆయన వచ్చే లోపే అమ్మ ‘’కపాలం భేదించు కొని ‘’బ్రహ్మైక్యం చెందింది .ఆ రోజు 2-4-1959 ఫాల్గుణ బహుళ అష్టమి సాయంత్రం అయిదు గంటలు మర్నాడు చల్ల పల్లి రాణి గారు వచ్చారు .లెక్కకు మించిన  జనాల తో అమ్మ ను ఊరేగించి ఆమె శిరోజాలను ఖండించి ,ముందే ఏర్పాటు చేసిన సమాధిలో అమ్మపార్ధివ శరీరాన్ని నిక్షిప్తం చేశారు .తరువాత అమ్మ సమాధి నుండి దివ్య పరి మళాలు వ్యాపించి అందరిని సంభ్రమాశ్చర్యాలలో ముంచింది .ప్రతి ఏడు ఫల్గున పౌర్ణమి నుండి బహుళ అష్టమి వరకు తొమ్మిది రోజులు అమ్మ ఆరాధన ఉత్స వాలు అత్యంత వైభవం గా నిర్వ హిస్తారు ..

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-6-12.—కాంప్—అమెరికా

 

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –13 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ

 కరగ్రహార యోగి –ఫరీద్ మస్తాన్ ఔలియ

           ఒక హిందువు ముస్లిం మత పీఠం అధిష్టించిన  ఆశ్చర్య కర విషయమే అప్పలస్వామి  ఫరీద్ ఔలియా గా మారిన  చరిత్ర .

                విజయ నగరాన్ని పూస పాటి విజయ రామ రాజు పాలిస్తున్న కాలం అది .ఆయన సేనా ధి పతి నడి  పల్లి అప్పల స్వామి .ఆయన భార్యయే పైడి తల్లి .అందాల సుగుణ రాశి .రాజు ఆమె పై మోజు పడ్డాడు .తనను చంపి సతీత్వాన్ని కాపాడ మని భర్తను కోరింది పైడి తల్లి .కత్తి తీసుకొని  –ఓకే దెబ్బతో ఆమె  శిరసుఖండించి ,ఆమె కోర్కె తీర్చి,ఊరు  వదిలేసి,బడి పాలెం చేరి పైడి తల్లి ఆదేశం మేరకు మల్లీ పెళ్లి చేసుకొన్నాడు .  పైడి తల్లి  ‘’ఇక నుంచి రాజు వంశం లో   సంతాన ఉండదని,నడి  పల్లి వారి ఏడవ తరం లో ఓక సత్పురుషుడు పుట్టి విజయనగరం లో ప్రవేశించి నప్పుడు  మాత్రమే విజయ నగరానికి వారసుడు జన్మిస్తాడు ‘’అని  పైడి తల్లి శాపం  పెట్టింది .+విజయ రామ రాజు పశ్చాత్త పడి  .ప్రాయశ్చిత్తం కోసం  పైడి తల్లికి గుడి కట్టించి ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించాడు .ఇప్పటికీ మహా వైభవం గా పైడి తల్లి ఉత్స వాలు జరుగు తున్నాయి

                  దిబ్బడి పాలెం లో అప్పల స్వామి వంశం లో నడి పల్లి పాపయ్య ,రాజమ్మ దంపతులకు19-8-1902 లో  జన్మించిన మగ పిల్ల వాడే మన కధా నాయకుడు అప్పల స్వామి .లోక కళ్యాణం కోసం విష్ణు మూర్తి ఆమె గర్భం లో జన్మిస్తున్నట్లు తల్లి రాజమ్మ కు కలలో చెప్పాడు .అతనిమేన  మామ కొడుకు ఇతని పై కుట్ర పన్ని మంత్ర ప్రయోగం చేయించాడు .అవి అప్పల స్వామిని ఏమీ చెయ్య లేక పోయాయి .చిన్న తనం లో కావడి లో కూర్చొని విజయ నగరం కోట కు వెళ్లాడు .పూర్వం పైడి తల్లి ఇచ్చిన శాపం తీరి పోయింది .రాజ వంశం లో మళ్ళీ సంతానం కలిగింది .

             ఒకప్పుడు అప్పల స్వామి ని కాల పిశాచం పట్టు కొంటె ,బంధించిఇంటికి  తెచ్చాడు .తొమ్మిదేళ్ళ కే నారద తుమ్బురులు దర్శన మిచ్చారు .దేవతలు బందరు సముద్ర తీరానికి తీసుకొని వెళ్లి భవిష్యత్తు లో అతడు ఉండాల్సిన ప్రదేశాన్ని చూపించారు .నెల్లి మర్ల  జూట్ మిల్లు లో పని చేశాడు .అప్పుడు ఫాక్టరి కట్ట టానికి పునాదులు తవ్వు తుంటే వెంటనే పూడి పోయే వట  అప్పల స్వామి అక్కడ నిల బడితే  నిర్మాణం నిల బడి   నిర్మాణం సాగిందట .తోళ్ళ కర్మా గారం లో పని చేసే వారితో మద్య పానం మాన్పించాడు .బుచ్చమ్మ తో వివాహమైంది .కంటోన్మెంట్ రోడ్డు లో టోల్ గెట్ ఉద్యోగం లో పని చేశాడు .అక్కడే దగ్గర్లో ‘’ఖాదర్శా ఔలియా’’ఉన్నారు .భార్య చని పోయింది .ఉద్యోగం ఊడి పోయింది .విజయనగరం లో పైడి తల్లి సంబరాలకు వెళ్లి  నాటకం వేసి ఖాదర్ శా ఔలియా ను సందర్శించాడు .ముప్ఫై ఏళ్ల వయసులో ఉన్నాడు . ఆయన ను దర్శిస్తే మళ్ళీ రమ్మని వాయిదా వేశారాయన .ఇలా రెండు మూడు సార్లు అయింది .అయినా విసుగు లేకుండా వెళ్లి వస్తున్నాడు .ఒక సారి ఒక సాధువు కన్పించి వలీ గారిదగ్గర ఏమీ లేదని తాను తాయత్తు ఇస్తానని ఆశ పెట్టాడు .వెళ్ళ లేదు .అనుకొన్న సోమ వారం బాబా దగ్గరకు వెళ్లాడు ‘’మా దగ్గరకు వచ్చేవాడెవ్వరు మరొకరి దగ్గరకు పోడు .ఈ పాదాలు పట్టుకొన్న వాడెవ్వడు ఇంకోరి పాదాలు పట్టడు ‘’అని సాధువు సంగతి తెలిసి నట్లు అన్నారు ఆయన పెట్టె పరీక్షలో గెలిచి అభిమానం పొందాడు .బాబా దగ్గరికి ఎప్పు డైనానా వెళ్లి దర్శించే అనుమతి లభించింది

     అయిదేళ్ళ తర్వాతా బాబా అప్పల స్వామికి ‘’ఫరీద్ మస్తాన్ ఔలియా ‘’అనే పేరు పెట్టారు .మచిలీ పట్నం ,తెనాలి ,రేపల్లె లలో ఎక్కడో ఒక చోట ఆశ్రమాన్ని స్తాపించి సేవ చేయమని ఆదేశించాడు .అన్నీ చూసి మచిలీ పట్నం దగ్గర కరగ్రహారం సరైన స్థలం అని భావించి అక్కడ ఉండి  పోవాలను కొన్నాడు .క్రమంగా శిష్య బృందం ఏర్పడింది .ఎందరో హిందువులు ,ముస్లిములు ఆయన శిష్యులైనారు .ప్రత్యర్ధులను శాంత పరచి సయోధ్య కూర్చే వారు .’’మేము అవసరమైతే గడ్డి పరకతో కూడా పని చేయించు కోగలం ‘’అని ఒక సారి .మరో సారి ‘’మేం నిమిత్త మాత్రులం .అంతా పై వాడి దయ ‘’అని  ఔలియా అంటుండే వారు .అందర్ని గౌరవం గా ‘’మీరు, ఏమండీ ,వారు ‘’అంటూ మర్యాద గ సంబోధించటం ఆయన సంస్కార విధానం ..తమ గురువులను సందర్శించ టానికి విజయ నగరం వెడితే వంద గజాల దూరం లో చెప్పులు వదిలేసి ఖాదర్ వలీశా గారిని సమీ పించి  పాదాల దగ్గర అతి భక్తీ తో  కూర్చొనే వారు .ఆయన అందరి శిష్యుల్లో ఈయనదే అగ్ర స్థానం .అంత ప్రత్యేకత పొందారు మస్తాన్ ఔలియా .అన్ని మతాల వారు ,అన్ని కులాల వారు ఆయనకు భక్తు లయ్యారు .తాడిత ,పీడిత జనానికి ఔలియా గారు ఆత్మీయులైనారు .వారి బాధలన్నీ పోగొట్టే వారు .వ్యాపార ,ఉద్యోగ వర్గాల వారు ఆయన సలహాలను తప్పక పాటించే వారు .

             ఫరీద్ మస్తాన్ గారు చేపల వ్రుత్తి లో ఉన్న వారికి సముద్ర మరణ గండాలను చాలా సార్లు తప్పించారు .వారిలో నైతిక ప్రవ్రుత్తి కలిగించారు .వారి పాలిటి దేవుడైనాడు .బాబా గారికి తెలిసి నన్ని చేపల్లో రకాలు అక్కడి జాలర్లకు కూడా తెలియవని జాలర్లె ఒప్పు కొన్నారు .పాగోలు లక్ష్మీ కాంతమ్మ గారి కేన్సర్ వ్యాధి ని పోగొట్టారు .ఆదూరి ఉమా మహేశ్వర రావు కు ఉబ్బసం తగ్గించారు .ఉద్యోగాలు ఇప్పించటం అడిగిన వారికి పేర్లు పెట్టటం చేసే వారు ..ఇరవై ఏళ్ళ తర్వాతా గురువు ను దర్శించి వచ్చారు .మస్తాన్ బాబా సమాధి చెండ టానికి పది రోజుల ముందు అక్క పైడి తల్లి  మరి కొందరు బంధువులు విజయ నగరం నుండి వచ్చారు .6-12-1968న ఫరీద్ మస్తాన్ ఔలియా గారు సమాధి చెందారు .ప్రతి ఏడు రంజాన్ పండగల్లో ఔలియా ఉరుసు ఉత్స వాలు జరుగుతాయి .అందరు హాజరౌతారు .

 కరగ్రహారం నిత్యం భక్తుల సందర్శన తో అలారారు తుంది .బాబాకు అత్యంత భక్తులు ఆంద్ర రాష్ట్ర పూర్వ ముఖ్య మంత్రి మర్రి చెన్నా రెడ్డి ,మాజీ ప్రధాని పి.వి.నర  సింహా రావు మొదలైన వారున్నారు .ముఖ్యం గా చెన్నా రెడ్డి విజయ వాడ వైపు వస్తే కరగ్రహారం వెళ్ళ కుండా ఉండే వారు కాదు .ఇక పి.వి.గారు బాబా సంస్థాన కార్య వర్గానికి అధ్యక్షులే .షిర్డీ సాయి బాబా ,నాగాపురం తాజుద్దీన్ బాబా ,విజయ నగరం ఖాదర్ బాబా ల లాగానే మచిలీ పట్నం ఫరీద్ మస్తాన్ ఔలియా ఎన్నో అద్భుతాలు చేసి ప్రజల మనస్సుల్లో శాశ్వ తం గా నిలిచి పోయారు .ఇప్పటికి ఆయన సమాధి నుండే భక్తుల అభీష్టాలను నేర వేరుస్తారని ప్రగాఢ విశాసం .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-6-12-.-కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –12 రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

    సిద్ధ యోగి పుంగవులు –12

                                                           రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

 ఒక మంగయ్య పరమ హంస గా ,రాజ యోగి గా మారటం అమిత ఆశ్చర్యం   కలిగించినా, అది నిజమే .అదే ఇప్పుడు మనం తెలుసుకొనే విషయమ .

    మంగయ్య గారు న్యాయ వాది అయిన సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 నాడు విజయ నగరం దగ్గర కూకల మెట్ట లో జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు తారస పడితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని అడిగారు .ఆయన బలవంతం గా హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దానితో మంచి వాక్సుద్ధి కలిగింది .ఎప్పుడూ ఊరవతల గుట్టల పై ఏకాంతం గా కూర్చునే వాడు .ఒక రోజు ఎవరో తమ నగ ఇంటి దగ్గర పోయింది అని ఆయనకు చెప్పారు .దానికి ఆయన కాసేపటికి ఆ నగ ఇక్కడికే వస్తుంది అన్నాడు మంగయ్య .ఇంతలో ఒక కాకి ఆ నగను తీసుకొని వచ్చి చెట్టు మీద నుంచి కిందికి జార విడచింది .ఊరంతా మంగయ్యమహత్యం గురించి పాకి పోయింది .ఎనిమిదో ఏట ఉపనయనం జరిగి ,పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ఆంధ్రం ,ఆంగ్లం నేర్చాడు .ఒక సారి బయటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన పై పడింది .దానిలోని పదార్ధాన్ని ఒంటికి పూసు కొని ,ఆ కాయను బొడ్లో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువు గా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం లో ఉన్నత పాత శాల  చదువు పూర్తీ చేసి ,తండ్రి వద్ద శైవ మంత్రాలను ఉపదేశం పొందాడు .

                     పదహారవ ఏట పెళ్లైంది .రైల్వే లో పని చేసే ఒకాయన ‘’రాజ యోగం ‘’క్షున్నం గా నేర్పాడు .ఆ యోగ ప్రభావాల్ని చూపించ మని  స్నేహితులు కోరారు .అప్పుడు ఒక బండి వస్తోంది .దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమన్నారు .అనేక సార్లు దాన్ని వెనక్కి ముందుకు నడి పించి తన యోగ శక్తి ని నిరూపించాడు .కొంత కాలం తర్వాతా బాలానంద పరమ హంస అనే పేరుగల సిద్దేశ్వర బ్రహ్మ చారి అనే ఉత్తర దేశేయుని వద్ద రాజ ,హత యోగ రహస్యాలు ఆకలింపు చేసుకొన్నాడు .మద్రాస క్రిస్టియన్ కాలేజి లో లెక్కల్లో బి.యే.లో చేరాడు .ఒక డిబేటింగ్ లో ఇంగ్లీష వాడైన  గణిత ఉపన్యాసకుడు’’ సైకాలజీ లో ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్’’అని వాదిస్తే ,లెక్కలు వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొన్నాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ఘట్టాన్ని పేరుతో ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .శిష్యుడైనాడు .గురు శిష్యు లిద్దరూ శాస్త్ర కావ్య గోష్టి నిరంతరం జరిపే వారు .ఒక సారి ప్రయోగం కోసం ఇద్దరు గంజాయి పీల్చారు .గురువు దిమ్మ తిరిగి పడి  పోతే శిష్యుడు నిమ్మ కాయ నీళ్ళు తాగించి పైత్యం పోగొట్టాడు .ఇద్దరు శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి శకుంతలకు దుష్యంతుడు చేసిన దానికి అభ్యంతరం తెలిపి చూడ కుండా తిరిగి వచ్చారు .బి.యే.ఆయె సరికి మంగయ్య తర్క శక్తి ఎదురు లేకుండా ఉంది .

           నాడీ  శుద్ధి ,కుంభక ప్రాణాయామం సాధిస్తూ ఒంటి పూట భోజనం చేస్తుంటే క్షయ రోగం పట్టు కుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని తగ్గించారు .కొడుక్కి మేధా దక్షిణా మూర్తి మంత్రం నేర్పారు .పర్లాకిమిడి లో పోలిస్ హెడ్ క్లార్క్ గా పని చేశాడు. ఉద్యోగం వదిలి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శి గా కొంత కాలం పని చేశాడు .ఒక సిద్ధుడు శ్రీ స్వప్నాన్జనేయ ,వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ విశేషాలు తెల్పాడు ..

         మంగయ్య తన భార్య ,పిల్లలను మామ గారింట విడిచి మద్రాస వెళ్లి ఎల్ .టి.ట్రైనింగ్ లో చేరారు .ఈయన రాసిన ఆంగ్ల రచనలు చూసి ‘’ఈరాక్ ద్రు’’ అనే దొర గుండెలు బాదుకొన్నాడు .నిజం రాష్ట్ర విద్యా శాఖ లో ఉపాధ్యాయుడిగా చేరారు .ఆయన ప్రతిభ గుర్తించిన విద్యాది కారి బి .ఎడ్  .జిల్లా కేంద్రఉన్నతవిద్యాలయానికి హెడ్ మాస్టర్ ను చేశాడు .

             నిజామా బాద్ లో పని చేస్తున్నప్పుడు గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ‘’సమాధి భేదాలు ‘’వీరి వద్ద గ్రహించారు .రిగ్వేద ,యజుర్వేద ములను గురుముఖతః నేర్చారు .రామ స్వామి అయ్యర్ ‘’వాసుదేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దానితో శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందారు .హైదరాబాద్ లో గౌలిగూడా లో కాపురం ఉన్నారు .ఇద్దరు స్నేహితులకు వేరు చోట్ల కన్పించి వారిని ఆశ్చర్య పరచారు .హరిపత్ అనే దంపతులు శివ జపం చేస్తుంటే మంగయ్య గారు అనుకో కుండా ప్రత్యక్ష మై రుద్రాభి షేకం చేసి మై మర పించారు .ఒక శిష్యుడు ఒక సారి వచ్చి చూస్తె మంగయ్య గారు అగ్ని జ్వాలల మద్య కన్పించారు .భయ పడి పారి పోతుంటే మళ్ళీ యదా స్తితి లో కన్పించారు .పశు వైద్య శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివలింగం ఇచ్చి ఆ తరువాత వరుసగా పదకొండు ఇచ్చారు .గృహస్తులైనా మంగయ్య గారు శ్రీరామ ,శ్రీ కృష్ణుల వలె బ్రహ్మ చారులు .విదేశీ డాక్టర్లే ఈ విషయమ  పరి శోధించి నిర్ధారణ చేశారు .

          పెద్ద కొడుకు పెళ్లి ముహూర్తాన్ని తానే పెట్టి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు పండితులు  ఆ ముహూర్తానికి కేతు ,కుజవే  ధలున్నాయని ,ఆ పెళ్లి జరగదని చెప్పారు పెళ్లి జరుగు తుందని మంగయ్య వాదించారు ..దేవాలయానికి పెళ్లి కొడుకు ను తీసుకొని వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది .వెళ్ళ టానికి వీల్లేదన్నారు పండితులు .ఇది కేతు వేద .అని చెప్పారు ఈయన .పాము మాయమై పోయింది .పెళ్లి పీట ల మీద పెళ్లి కొడుకును ,పెళ్లి కూతురును కూర్చో బెట్టి ముహూర్తం కోసం పండితులు గడియారాలను చూస్తున్నారు .ఒకళ్ళ టైం నాలుగు అని .ఒకల్ల ది ఏడు ,మరొకరిది ఆగి పోయిందని చెప్పారు .అదే కుజ వేద అని చెప్పి అక్షంతలు తాను తీసుకొని ,అందరికి ఇప్పించి అనుకొన్న ముహూర్తం రాగానే తాను వేసి అందరితో అక్షతలను వేయించారు .’’ఇప్పుడు గడియారాలు చూడండి ‘’అన్నారు .అందరి గడియారాలు అనుకొన్న ముహూర్త సమయాన్నే చూపించాయి .అందరు వారి మహా శక్తికి, అఘటన ఘటనా సమర్ధత కు నివ్వెర పోయారు .

            దేవీ దాసు అనే వాడికి యే.బి.సి.డి.లు కూడా రావు .అతని తో కొన్ని గంటల సేపు ఆంగ్లం లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్య గారు .తనకు షోడశీ మంత్రాన్ని దేవుజీ మహారాజే వచ్చి ఇస్తారని ముందే చెప్పారు .అందరు గణన్జయ మహా రాజు గారి తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .గణన్జయుడు రాలేదు .దేవుజీ వచ్చి మంత్ర దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత గొప్పది .

      మంగయ్య గారి వైదుష్యం నిరుప మానమైంది .ఆంగ్లం లో అయిదు పద్య కావ్యాలు ,పదహారు ఆధ్యాత్మ గ్రంధాలు రాశారు .సంస్కృతం లో కామ ప్రబంధం ,దక్షిణ గీత ,సౌభాగ్య రత్నాకరం ,అద్వైత పారిజాతం ,వ్యావహారిక దర్పణం వంటి అలోకిక గ్రంధాలు రాశారు .ఇంకా యే న్నో స్తుతి స్తోత్రాలు రాశారు .ధర్మాష్టకం వంటి అష్టకాలు రాశారు .కాల చక్రాన్ని దాని నడకను ప్రత్యక్షం గా చూడాలని ఒక శిష్యుడు కోరితే ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లువైఖరీ వాక్కు లో  జపించే  మంత్రాన్ని మంగయ్య గారు పశ్యంతీ వాక్కు తో ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో  మేడ దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్య గారు వైఖరీ వాక్కు లో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు .అంటే ఆయన కు సమస్త జీవ జాల జన్మ వృత్తాంతాలు తెలుసునన్న మాట .

             మంగయ్య గారి శిష్యులైన  పెద్దలలో జర్మన్ విద్వాంసుడు స్పర్జ్ ,నిజాం కాలేజి ప్రిన్సిపాల్ బర్నేట్ ,విద్యా మంత్రి నవాబ్ ఆజమ్యార్జంగ్ ,ఇంజినీరింగ్ మంత్రి మెహిదీ నవాజ్ జంగ్ ,గణితా చార్యుడు సయ్యద్ సిరజుల్ హాసన్ మొదలైన వారెందరో జాతి మత ,కుల భేదాలు లేకుండా అభిమానులు ,శిష్యులు అయారు .మంగయ్య గారికి ఒక విచిత్ర మైన అలవాటు ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షతలనుంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంతుందే వారు .నడుస్తున్నా ,కూర్చున్నా ,తమ లో తాము మాట్లాడుకొంతుందే వారు .మంగయ్య గారు రాసిన ఒక ఆంగ్ల పుస్తకం పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం వారు ‘’ఇందు లోని అభి ప్రాయాలను గ్రహించ టానికి 300 ళ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు

                       బాల బ్రహ్మ చారి అని పేరొందిన చిన్మయా నంద స్వామి మంగయ్య గారికి సన్యాస దీక్ష నిచ్చి ,’’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమ నామకారణం చేశారు .ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .అది మంచి ఫలితం ఇవ్వలేదు .విశాఖ వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసి లలితా దేవిని ప్రతిష్టించారు .ఆ ప్రాంతానికి ‘’లలితా నగరం ‘’పేరు వచ్చింది .పరమ హంసలు 1954 లో సిద్ధి పొందారు .వీరి శిష్యులు వాల్వేకర్ ఆశ్రమాది పతి అయి అనేక అభివృద్ధి కార్యాలు నిర్వహించి1995 లో సిద్ధి పొందగా గురువు గారి సమాధి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు లలితాశ్రమాన్ని కుర్తాళం పీతాది పతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (పూర్వాశ్రమం లో ప్రసాద రాయ కుల పతి గారు )28-6-1998   న దత్తత తీసుకొని శ్రీ రామా నంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలను అప్ప గించారు .   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-6-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అమెరికా ఊసులు –6

   అమెరికా ఊసులు –6

    జోసెఫ్ ప్రీస్త్లీ ఇంగ్లండు  నుంచి పారి పోవాల్సి వచ్చిందని చెప్పాను .ఆ వివరాలిప్పుడు తెలుసు కొందాం .1782 లో the history of the corruption of christianity అనే పుస్తకం రాశాడు .దానికి అనుబంధం గా తర్వాతా institution of natural and revealed religion రాశాడు .ఆనాటి చర్చి లో జరిగే భాగవతం అంతా ఎండ కట్టాడు .జీసస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చాడు .మంత్రాలు ,మహిమలను కాదన్నాడు .క్రీస్తు మనిషే నని  మతం లోని లొసుగులను  గురించి చాలా తక్కువ స్థాయి భాషలో రాసి క్రిస్టియన్లకు బాధ కల్గించాడు .భగవంతుడు జీసస్ ను తన ప్రతిన్డిది గా మాత్రమే భూమికి పంపాడ న్నాడు .క్రిస్టియన్ గాడ్ లేదన్నాడు .తన భావాలను ఆనాటి అమెరికా ప్రముఖుడైన జెఫర్సన్ కూడా పంపాడు .ఆయన బాగా అభిమానించాడు .తనను విమర్శించే వారికి సమాధానం గా ఒక కరపత్రం ప్రింట్ చేసి వదిలాడు .దీనితో యూని టేరియన్ క్రిస్టియన్ భావాలకు వ్యాప్తి కల్గించాడు .ఫ్రెంచ్ విప్ల వాన్ని  సమర్ధించాడు .ఇతని తో బాటు హానెస్ట్ విగ్స్ బృందం సమర్ధించింది .అతనికి చాలా బెదిరింపు ఉత్త రాలోచ్చాయి .ఇంగ్లాండ్ చర్చి రాజు ఇతని అంతు తేలాల్సిందే నని పట్టు బట్టారు .

          అప్పటికే తన ప్రయోగాల లాబ్ ను తగల బెట్టారు .ఫెయిర్ హిల్స్ అనే చోట ఇల్లు, లాబ్ లను  ఏర్పరచుకొన్నాడు .వంద మంది అల్లరి మూక లాబ్ ను తగల బెట్టారు .లైబ్రరి ధ్వంసం చేశారు .ఎంతో విలువైన పరికరాలు పాడై పోయాయి .ఇన్నాళ్ళ శ్రమ బూడిద లో పోసిన పన్నీరు అయింది .స్నేహితులంతా తామే డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ అన్నీ సమకూర్చి పెడతామని హామీ ఇచ్చారు .కాని భార్య మేరీ తో సహా ఫ్రాన్క్లిన్ సహాయం తో అమెరికా చేరాడు ‘

    అమెరికా లో అతను ఆ దేశ నిర్మాణ బాధ్యులలో  ఒకడు అని పించుకొన్నాడు .పెన్సిల్వేనియా లోని ఫిలడెల్ఫియా కు చేరుకొన్నాడు .అమెరికా వైస్ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ తో మంచి దోస్తీ కుదిరింది ..1792 లో ఇంగ్లాండ్ వెళ్లాడు .ఫ్రెంచ్ ప్రభుత్వం గౌరవ పౌరస త్వం ఇస్తా నంది .మరుసటి ఏడాది మళ్ళీ అమెరికా చేరాడు .కవి కాల్రిద్జ్ ప్రీస్త్లీ కి జరిగిన అన్యాయాన్ని గొప్ప కవిత గా రాశాడు .ఫిలడెల్ఫియా లోని అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ లో చాలా కాలం గా సభ్యుడి గా ఉన్నాడు .గత్యంతరం లేని పరిస్థితుల్లో అమెరికా కు శరణార్ది గా వచ్చాడు .ఇక్కడి వాతా వరణం భార్యకు సరి పోలేదు .అందుకని నార్త్ అంబర్  లాండ్ అనే చోట స్తిర పడ్డారు .అప్పటికి రవాణా సోకర్యాలు లేవు .రోజు పోస్ట్ రాదు .న్యూస్ పేపర్లు లేవు .అందుకని ఆడమ్స్ ను రోజు ఒక కోచ్ లో టపా వచ్చే ఏర్పాటు చేయమని ఉత్తరం రాశాడు  .

          రాడికల్ బోధనలు చేసే వాడు .ఇవి ఇక్కడ ఇబ్బంది కలిగిస్తాఎమో నని ఆడమ్స్ బాధ పడ్డాడు .అమెరికా లోని రాజ కీయాల పై ఘాటు విమర్శలే చేశాడు .భార్య మరణించింది .ఆమె ను గురించి చెబుతూ ‘’నేను ఎప్పుడు  ఇంట్లో ఆమెకు ఒక అతిధి గానే ఉన్నానని ,అన్నీ ఆమె చూసుకొనేది ‘’అని బాధ పడ్డాడు .

 జెఫర్సన్ 1794 లోరాజకీయాలను వదిలి  తిరిగి వచ్చి  అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకొన్నాడు .అయితే రెండు రోజుల్లోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఆడమ్స్ కు పని చేశాడు .ప్రీస్త్లీ ఆడమ్స్ ,జెఫర్సన్ ళ మద్య ఇరవై ఏళ్లు ఉత్తర ప్రత్యుత్త రాలు జరిగాయి అందులో ఎక్కువ సార్లు ప్రీస్త్లీ ప్రస్తావన ఆడమ్స్ ,జఫర్సన్ మద్య జరిగిన ఉత్తరరాలలో వచ్చింది .ఇదులో అపార్ధాలు చోటు చేసుకొన్నాయి ఆడమ్స్ ప్రీస్త్లీ ని ‘’ఆధునిక సోక్రటీస్ ‘’అన్నాడు .తరువాత జెఫర్సన్ ప్రెసిడెంట్ అయాడు .అతనికి ఆడమ్స్ కు పడ  లేదు .పదవి లో ఉండగానే ప్రెసిడెంట్ ఆడమ్స్ విధానాలను ఎండ గట్టె వాడు .

           ప్రెసిడెంట్ జఫర్సన్ కు ప్రీస్త్లీ జాబు రాస్తూ ‘’ఐ థింక్ మై సెల్ఫ్ హాపీ టు హావ్ లివేడ్ సో లాంగ్ ఉండర యువర్ ఎక్సేలేంట్ అడ్మినిని స్త్రేషన్ అండ్ ప్రపోస్ టు డై ఇన్ ఇట్  ‘’ అన్నాడు .తమాషా ఏమిటంటే జఫర్సన్ ఆడమ్స్ లు ఇద్దరు ఒకే రోజు july 4-1846లో చని పోయారు .అది అమెరికా కు స్వాతంత్రం వచ్చిన 50  వ స్వాతంత్ర్య వార్షికోత్సవం అంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండి పెందేన్స్ కు యాభై ఏళ్ళు అన్న మాట .ప్రీస్త్లీ బోధించిన నేచురల్ ఫిలాసఫీ అమెరికా కు దశా ,దిశా నిర్దేశం చేసింది అని విశ్లేషకుల భావన .

            ప్రీస్త్లీ తనను చాలా కాలానికి కని పించే తోక చుక్క గా పోల్చుకొన్నాడు .ఒక కామెట్ లాగా చాలా వేగం గా కడులుతానని ,అదే వేగం తో వేడి ,వెలుతురూ ప్రసరించి మాడి  మసి అయి పోతానని అన్నాడు .దీనికి స్పందించిన ఆడమ్స్ ‘’గ్రహ స్తితి లో కామెట్ ఒకటి అని వాల్టర్ లాగా అమెరికా కు ప్రీస్త్లీ భావజాలాన్ని అందించాడని మెచ్చాడు .అమెరికా నిర్మాణం లో ప్రీస్త్లీ భావజాలం స్వాతంత్రానికి ,స్వేచ్చా ప్రకటనకు ప్రజాస్వామ్య విలువలకు భూమికలైనాయి .   తాను క్రిస్స్టియానిటి ని వదలకుండా ప్రీస్త్లీ సహాయ పడ్డాడని జెఫర్సన్ ప్రశంషించాడు .17 75 లో దేబ్భై అయిదేళ్ళ వయసు లో ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను, గాలి నిర్మాణాన్ని  లోకానికి అందించిన ప్రీస్త్లీ ప్రాణ వాయువు అనంతా కాశాలకు చేరింది .

            జెఫర్సన్ ఆడమ్స్ లు పన్నెండు ఏళ్ళు  ముఖాలు చూసు కోలేదు .మళ్ళీ పన్నేన్దేల్ల తర్వాతా ప్రీస్త్లీ ని జ్ఞాపకం చేసుకొని ఉత్తర ప్రత్యుత్త రాలు జరుపు కొన్నారు ..ఈ విదం  గా ప్రీస్త్లీ చని పోయి కూడా వారిద్దరిని కలిపాడు .   

    మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –22-6-12.—కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –5

    అమెరికా ఊసులు –5
దినో సార్స్ కు ముందు కాలమ్ లో అంటే 300 మిలియన్ల సంవత్స రాలకు పూర్వం చాలా పెద్ద జీవ రాసులున్దేవి   ఈ విషయాలను ఫ్రెంచ్ పాలన్తాలజిస్ట్ చార్లెస్ బ్రాన్న్గ్నియార్ట్ 1877 లో పరిశోధించి కని పెట్టాడు .మధ్య ఫ్రాన్స్ లోని కామెంట్రి కి దూరంగా ఫాజిల్స్ కని పెట్టాడు .అతనికి ఈ నాటి ఆకు చెత్తత లావు ,ఎత్తు ఉన్న ఫెరన్ ఫాజిల్స్ కని పించాయి . .మన పక్షులున్నా సైజ్ లో ఈగల అవశేషాలు చూశాడు .అందులో  మాన్స్టర్ డ్రాగన్ అనే పెద్ద ఈగ కు 63  సెంటి మీటర్ల రెక్కలున్నాయి . దానికి ”మెగా న్యూరా ”అని పేరు పెట్టాడు .దీన్ని మనం ఇప్పుడు పారిస్ లోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ లో చూడ వచ్చు .తరు వాతి పరిశోధన లలో 75 సెంటి మీటర్ల పొడవున్న రెక్కలు గల ఈగల ఫాజిల్స్ కని పించాయట .నోరెళ్ళ బెట్ట కండీ అవి నోట్లో దూరితే ఊపిరాడదు  జాగ్రత్త  ..
అంతేనా ,అడుగు పొడవున్న సాలీడులు కని పించి ఆశ్చర్య పరిచాయి .వాటర్ స్కార్పియాన్లు అనే ”నీటి తేళ్ళు ”ఎంత ఉంటాయో తెలుసా?.ఒక పెద్ద కుర్రాడంత .క్లబ్ మాస్ అనే నాచు 130 అడుగుల  ఎత్తు ఉందట . ఇది ఇప్పుడున్న నాచు కు   వంద రెట్లు ఎక్కువ .సరే గుర్రాల సంగతి వింటే బుర్రే  తిరిగి పోతుంది ..గుర్రం కాదండి బాబు దాని తోక సంగతి వింటే మతి పోతుంది .గుర్రం తోక అయిదు అంతస్తుల భవనం అంత పొడవున్దేదట .ఇప్పుడు గుర్రాల తోక మహా ఉంటె నాలుగు అడుగుల బారు .సరే కోని ఫర్ వృక్షాల ఆకులు మూడు అడుగుల పొడవు ఉండే వట .మీ 250 మిఇయన్ సంవత్స రాకు మీ మార్పు ఒచ్చాయి .ఇదంతా వాతా వరణం లోని ఆక్సిజన్ శాతం బట్టి మారిందట .సైనో బాక్టీరియా కూడా ప్రధాన పాత్ర వహించిందని అంటున్నారు .ఈ కాలాన్ని కార్బోని ఫెరస్ కాలమ్ అనీ అన్నారు .
                ఇంగ్లాండ్ కు చెందిన జే.బి.ప్రీస్ట్లీ ఆక్సిజన్ కని పెట్టాడని మనం చదువు కున్నాం .కాని ఆయన దాన్ని ఫ్లాజిస్తాన్ అని పిలిచాడు .గాలిలో ఉన్న పదార్ధాల గురించి కూడా ఆయన పరిశోధించాడు .అందుకే ఆయన్ను ”ఇన్వెంటర్ ఆఫ్ ఎయిర్ ”అంటారు .గాలిలో ఫ్లాజిస్తాన్ ఉందంటాడు .అదే మంటలు మంద టానికి కారణం అని రుజువు చేశాడు .బాబూ అది ఆక్సిజన్ అని మొట్టు కోన్నా తన పట్టు వదలలేదు .శీలే కూడా ఆక్సిజన్ నుముందే  కని పెట్టినా ప్రీస్ట్లీ ముందు రాత పూర్వకం గా తెలియ జేశాడు .
     ”  ప్రయోగాల పిత” గా ప్రీస్ట్లీ పేరు పొందాడు ..౬౨ ఏళ్ళ వయస్సు లో ఆయన అమెరికా లో ” copley  medal  ” ను జీవ్విత సాఫల్య పురస్కారం గా పొందాడు .అది ఈ నాటి నోబెల్ బహుమానానికి సమానం .
.ఆయన 500 పైగా రచనలు చేశాడంటే ముక్కు మీద వేలు వేసు కొంటాం .ఆయన గొప్ప మత బోధకుడు ”yuniterian మతాన్ని నమ్మి ,తీర్చి దిద్ది ప్రచారం చేశాడు .మత మౌధ్యాన్ని వదిలించాడు .చర్చిని సంస్కరించే అనేక విషయాలు రాశాడు .ఒక రకం గా ఆయన్ను ”రాడికల్ క్రిస్టియన్ ”అన్నారు .అంతే కాదు ఆయన మాటలు తూటాల్లా పెలేవి .ఎప్పుడు గన్స్ ,గన్ పౌడర్ అని తీవ్ర పదాలను ఉప యోగించాడు .అందుకే ప్రీస్ట్లీ ని ”గన్ పౌడర్ poe ”
అనే వారు .
అమెరికా నిర్మాణం లో బహుముఖ పాత్ర వహించి ఫిసిక్స్ లోని ఎలేక్త్రిసిటి లో అద్భుత పరిశోధనలు చేసిన బెంజమిన్ ఫ్రాన్క్లిన్ ఈయనకు ముఖ్య సహచరుడు .’పాపం” సాల్మన్  రష్దీ” లాగా చివరికి దేశం వదిలి అమెరికా కు వెళ్ళాల్సి వచ్చింది ప్రీస్త్లీకి .ఆ కధ ఇంకో సారి తెలుసు కొందాం .ఇంత భ్తీవ్ర భావ ప్రకటనలు చేసిన ప్రీస్ట్లీ మహాశయుడికి నత్తి ఉంది .దాన్ని పోగొట్టు కోవ టానికి చికిత్స కూడా చేయించు కొన్నాడు .ఆయన ఆరు భాషల్లో మహా పండితుడు .అన్నిట్లో ధారాళం గా మాట్లాడే సామర్ధ్యం ఉన్న వాడు .
         బెంజమిన్ ఫ్రాన్క్లిన్ విద్యుత్తూ గురించి ముఖ్య విషయాలను ముందు గా లోకానికి తెలియ జేశాడు .అవే ఫండా మెంతల్స్ .విద్యుత్తూ అంటే ఒక ప్రవాహం అని ,అందులో విభజించలేని రెండు చార్జెస్ ఉన్నాయని ,వాటినే పాజిటివ్ ,నెగటివ్ చార్జి అంటారని విద్యుత్తూ ఎప్పుడు ధన విద్యుత్ చార్జి నుండి రుణ విద్యుత్ చార్జి కి ప్రవహిస్తుందని తెలియ జెప్పిన మొదటి శాస్త్ర వేత్త ఫ్రాన్క్లిన్ .విద్యుత్తూ పుట్టదు ,నశించాడని -ఒక రూపక్మ్ లో నుంచి ఇంకొక రూపం లోకి మారుతుందని చెప్పాడు .ఇవన్నీ ఈ నాటికీ సత్యాలే .ఆయన పెట్టిన పేర్లే-బాటరీచార్జి ,కండక్టర్ ,అనే మాటలు .ఇప్పటికి వాటినే వాడుతున్నాము .  
  మెరుపు మెరిసి నప్పుడు భవనాలు కాళి పోకుండా లైతినింగ్ కండక్టర్లు గా పొడవైన సూది మొన ఉండే రాడ్ లను అమర్చాలని సూచించింది కూడా ఫ్రాన్క్లినే .ఆయన్ను ”మోస్ట్ సేలిబ్రేతేడ్ ఎలేక్త్రిశియాన్ ”అంటారు .లండన్ లో ”లండన్ కాఫీ క్లబ్  లో ఫ్రాన్క్లిన్ ,ప్రీస్త్లి మొదలైన మేదావు లంతా రోజూ సమావేశ మాయే వారు .తమ పరిశోధనలను చర్చించు కొనే వారు .,

సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –22 -06 -12 –కాంప్–అమెరికా  

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –11 త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి

   సిద్ధ యోగి పుంగవులు –11

                                                త్రికాల జ్ఞాని మహా యోగి –గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి

     పాత నిజాం  రాష్ట్రం రాయ చూరు జిల్లా అలుకూరు గ్రామం లో శ్రీ వత్స గోత్రీకులైన గోల్లా పిన్ని అనే ఇంటి పేరున్న వైదిక బ్రాహ్మణులు ఉండే వారు .ఏడు తరాలకు పూర్వం మోట  ప్ప అనే ఈ వంశీకుడికి ‘’పల్లెలాంబ ‘’అనే దేవత ప్రత్యక్షమై ,బంగారు పలకా ,బలపం ఇచ్చి ,ఏడు తరాల వారు ఆ వంశం లో పండితు లౌతారని దీవించింది ..ఆ వంశం లో 18 71 l లో జన్మించిన వాడే మన మల్లికార్జున శాస్త్రి .తండ్రి రామ శాస్త్రి –తల్లి సుబ్బమ్మ .

      నాలుగేళ్ల వయసు లో వీధి బడికి పంపారు శాస్త్రి ని .ఆ సాయంత్రం పంతులు గారు ఈ బాలున్ని ఇంటికి తీసుకొని వచ్చి ,తండ్రికి అప్పగించి తనకు వచ్చిందంతా శాస్త్రి ఒక్క రోజు లో నే నేర్చుకోన్నాడని ఇంకా తాను చెప్పవలసిన్దేమీ లేదని చెప్పాడు .అంతటి ‘’బాల లీలా సరస్వతి ‘’మల్లికార్జున శాస్త్రి .తండ్రి ,పిన తండ్రుల  వద్ద నాటకాంత  సాహిత్యాన్ని ,తత్వ బోధినీ వ్యాఖ్య తో కౌముది  ,న్యాయ వేదాంత శాస్త్రాలు నేర్చాడు .తండ్రి వెంట గద్వాల, వనపర్తి ,ఆత్మకూరు సంస్థానాలు తిరిగి తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి ‘’భారతీ బాల లీల స్వరూప’’బిరుదు పొందాడు .జ్యోతిషం ,భాష్యంత వ్యాకరణం ముహూర్త ,జాతక ,సిద్ధాంత రూప స్కంద త్రయ జ్యోతిషం గురుముఖతా నేర్చాడు .ఆ నాటి జ్యోతిష పండితుడు విక్రాల రాఘవాచార్యులు’’ కన్ను  స్వామి’’ అనే మారు పేరు తో indian ephimeriesరాశాడు .ఆయన గారి అనుమతి పొంది మల్లికార్జున శాస్త్రి ‘’10 వేల సంవత్స రాలకు సరి పోయే తిది ,వార ,నక్షత్ర ,యోగ ,కరణ ,ఘటిక,విఘటిక లకు సరైన ప్రమాణం ఉన్న ‘’ఖచర మణిపేటి’’ అనే అత్యద్భుత పంచాంగాన్ని తయారు చేశాడు .గురువు అనుమతి తీసుకొని కాళ హస్తీశ్వరాలయం లో నిష్టగా కూర్చుని ‘’శని అష్ట వర్గు ‘’వేస్తుంటే శనైశ్చరుడు ప్రత్యక్ష మైనాడు .అలుకూరు తిరిగి వచ్చి తాత గార వద్ద వేదాంత అధ్యయనం చేసి మొత్తం చదువు నంతా 21 ఏళ్ళ వయస్సు లోనే సాధించాడు .ఈ యన తమ్ముడు రామ శాస్త్రి గొప్ప సూర్యోపాసకుడు .సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెప్ప వాల్చ కుండా సూర్యుని చూస్తూ ధ్యాన నిమగ్నం ఆయె వాడు .మల్లికార్జుని లానే ఈయనా త్రికాల జ్ఞాని .

                  మల్లికార్జున శాస్త్రి కడప ,బళ్ళారి నగరా ల్లో అనేక ‘’శతావధానాలు ‘’చేషారు .అనేక సంస్థానాల్లో తన పాండిత్య ప్రకర్ష చూపి ‘’కవితా సార్వ భౌమ ‘’బిరుదు పొందారు .ఆది శంకరా చార్యుల జనం ఆస్థానం ‘’కాలడి ‘’లో శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతీ స్వామి ఆహ్వానం పై వెళ్లి జగ్ద్గురువులను ‘’శ్రుత్యంత గీతాల ‘’తో స్తుతిస్తూ  తన్మయం చెందుతూ పాడుతూ ఉంటె వీరి బ్రహ్మాత్మానుభావాన్ని గుర్తించిన భారతీ స్వామి అభి నందించారు .శృంగేరి స్వామి అనుజ్న తో తాను రచించిన ‘’ఖచర మణి’’గ్రంధాన్ని తెచ్చి అందులో నుంచి 2000నాటి  స్వాముల వారు  అడిగిన తిదికి పంచాంగ గణనం చేయమని సభా సదులను కోరారు .చాలా మంది చెప్ప లేమన్నారు .కొందరు మూడు గంటల వ్యవధి కోరారు .మల్లికార్జున శాస్త్రి ఇరవై నిమిషాలలో గణించి సరైన సమాధానం చెప్ప గలిగి తన ప్రజ్ఞా ను  రుజువు చేసుకొన్నారు స్వామి తో సహా అందరు ఆశ్చర్య పోయారు .జగద్గురువులు ‘’పండిత సార్వ భౌమ ‘’బిరుదు ను  ప్రదానం చేశారు .సగౌరవం గా సత్కరించారు .’’ఉపాధి భేదం చేత మీరు అక్కడ ,మేము ఇక్కడ .మీరే మేము ,మేమే మీరు ‘’అని జగద్గురువుల చేత ప్రశంసలు పొందిన మల్లికార్జున శాస్త్రి ధన్య జీవి .

                ఆయన సంస్కృతం లో శ్రీ వాసుదేవా నందం అనే అలంకార శాస్త్రాన్ని ,రాశారు .ఇది చిత్ర విచిత్ర కవితా భాండారం .అనేక కవితా బంధాలు ఉన్నాయి .అందులో బాగా ఆశ్చర్య పరచేది ‘’సహస్ర దళ పద్మ బంధం ‘’1008దళ పద్మా లలో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వ సృష్టి .ఇందులో500  శ్లోకాలు ,16 ప్రకరనాలున్నాయి .అయితే ఇందులో నూరు శ్లోకాలున్న గ్రంధమే ముద్రితమైంది .దీన్ని నలభై రోజుల్లో రాశారు .ఇరవై అయిదు వివిధ ఛందస్సులతో పురుషోత్తమ శతకం రాశారు .జ్యోతిశ్శాస్త్ర సుధర్మ సార నిబంధం ,ధర్మ శాస్త్ర రత్నాకరం ,అనే తెలుగు రచన ,రాసినా లభ్యం  కావటం లేదు .పాతంజలి భాష్యార్ధం ,ఖచర మణి పేటి ,10,000  సంవత్సర పంచాంగం వీరి ఇతర రచనలు .

                 శాస్త్రి గారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరు లో ఒక ఏడాది పాటు ‘’దీర్ఘ బ్రహ్మ సత్ర యాగం ‘’నిర్వ హించారు .వందలాది పండితులు ,రాజులు ,మంత్రులు  ధన వంతులు ,వేలాది మంది పేదలకు కుల  మత భేదం లేకుండా  అన్న సంతర్పణ జరిగింది .అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీ విరూపాక్ష స్వామి కలలో కన్పించి’’అవబ్రుధ స్నానం ‘’కాశీ లో చేయమని ఆజ్ఞా పించాడు .బంధు జనం తో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తి గా నిర్వహించి ప్రయాగ ,గయాది క్షేత్ర సందర్శనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు .

          గద్వాల రాజు రాంభూపాల్ మరనించగా  సంస్థానం పదేళ్లు ‘’కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ‘’ లో ఉంది .అప్పుడు వారసుడైన సీతా రాం మల్లి కార్జునుని శరణు వేడాడు .ఈయన ఏడాది గడువు పెట్టి ,హంపీ విరూపాక్షునికి ‘’అగ్ని శ్తోమ ,కోటి బిలార్చన చేయ సంకల్పించి అందరి సహకారం తో ఆ పని పూర్తీ చేశారు .గడువు లోపలే సీతా రాం కు గద్వాల రాజ్యం దక్కింది .

        ఒక సారి యవ్వనం లో శాస్త్రి గారు ఎండలో నడిచి వస్తున్నాడు .ఒక పేద రైతు కనిపించి వర్షాలే లేవని కరువు తో జనం అలమటిస్తున్నారని చెప్పాడు .’’పెద్ద వర్షం వస్తుంది .ఇంటికి పొ ‘’అన్నారు శాస్త్రి .అంతే కుండ పోత గా వర్షం కురిసింది ఇంకో సారి స్వగ్రామం బయట ఏటి ఇసుక లో  ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతం గా వర్షం కురిసి ఇసుకలో కూరుకు పోయాడు .కొన్ని రోజుల తర్వాతా ఆ వాగు ఎండి పోయింది .మంచి నీటి కోసం చలమలు తవ్వు తుంటే శాస్త్రి గారు పద్మాసనం లో అలానే చలించ కుండా కని పించారు .ఏదైనా మహిమ చూప మని ఒక శిష్యులు  అడిగితే ‘’ఒక శివా లయం లో నాలుగు స్తంభాల మద్య శివుడికి ఎదురు గుండా కూర్చొని కనులు మూసు కొని ఒక్క సారిగా శరీరాన్ని గాలి లోకి లేపి, ఆ స్తంభాల మద్య చుట్టూ  వేగం గా గిర గిరా తిరిగి  ,మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు .

         మరో సారి మల్లేశ్వరాలయం లో బావ మరది దోనే కంటి రామయ్య భాగవతం లో ‘’పురంజనో పాఖ్యానం ‘’చదువు తుంటే శాస్త్రి గారు ఆధ్యాత్మ పరం గా వ్యాఖ్యానం చేస్తున్నారు .పూర్తీ అవగానే రామయ్య ‘’అంతేనా బావా?’’అన్నాడు .శాస్త్రి గారు ‘’అంతేరా’’అన్నారు .అంతే- రామయ్య వెంటనే లేచి భుజం పై ఖండువా దులిపి  మళ్ళీ బుజం మీద వేసుకొని అదే పోత పోయాడు .తల్లీ, శాస్త్రి  భార్యా మొట్టుకొన్నా వేను  తిరిగి చూడ లేదు ‘’’’వాడిక రాడు లే అంతే ‘’అని వారికి సమాధానం చెప్పాడు శాస్త్రి .అంటే ఆత్మ బోధ అయిందన్న మాట బావ మరది కి .

            శాస్త్రి గారి లీల ఇంకోటి .గద్వాల రాజు మూడు రోజుల పండిత గోష్టి లో ఉండగా ఒక రోజు   నిజాం  ప్రభువు తాను రాయ చూరు వస్తున్నానని తనను అక్కడ కలుసు కోమనిరాజుకు  ఫర్మానా పంపాడు .ఏమి చేయాలో తోచక శాస్త్రి గారిని అడిగాడు రాజు .కంగారేమీ పడక్కర లేదని నిజాం  రాడనీ  రేపే ఆవిషయం తెలుస్తుందని చెప్పాడు ఇరకాటం లో పడ్డాడు రాజు .అనుకోన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చే సరికి కడుపు నొప్పి ఎక్కువై హైదరాబాద్ తిరిగి వెళ్లి పొయ్యి నట్లు మర్నాడు వార్త వచ్చింది .అంతటి వస్య వాక్కు శాస్త్రి గారిది .

          1917 లో అలుకూరు గ్రామం లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించింది .శాస్త్రి గారు మల్లికార్జున పుష్కరిణి ణి ‘’అష్ట దిగ్బంధం ‘’చేసి .ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు .’’మారికా దేవి ‘’ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికి రాదనీ అది తనకే నష్టం అనీ చెప్పింది .అందర్నీ ధర్మ వరం పంపించి ,తానొక్కడే ఆ ఊర్లో ఉండిపోయాడు .గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించే శాడు .తాను కుటుంబం తో తుంగ భద్రా నది ఒడ్డున ఉన్న రామా పురం వెళ్లారు .శాస్త్రి గారికి ప్లేగు సోకింది .కుండ పాతగా వర్షం కురుస్తోంది .ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు .శాస్త్రి గారికి సమయం లో వైద్య సాయం అంద లేదు .అంతే 5-9-1917 నాడు చని పోయారు .ధర్మ వరం లో ఉన్న అల్లుడు శ్రీని వాస శాస్త్రి  టెలిగ్రాం చూసి వచ్చాడు .అప్పటికే ఆలస్య మై పోయిందని శవ దహనం చేశారు .చితా భస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకు పోయింది .చితా భస్మం కూడా మిగుల కుండా చేసి యాభై ఏళ్ళ వయసు లో నే చని పోయిన మహా జ్ఞాని గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు .

                    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-6-12.—కాంప్ –అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రచయితల రచయిత –కేథరీన్ మాన్స్ ఫీల్డ్

  రచయితల రచయిత –కేథరీన్ మాన్స్  ఫీల్డ్

           ఒక సారి బెంగాలి నవలా రచయిత  శరత్ ను  కొందరు అభిమానులు ‘’మీ రచనలు మాకు బాగా అర్ధమవుతున్నాయి .కాని రవీంద్రుని రచనలు అర్ధం చేసుకోవటం కష్టం గా ఉంది ‘’అన్నారట .దానికి ఆ మహా నవలా రచయిత ‘’నేను మీ కోసం రాస్తున్నాను .టాగూర్ నా వంటి వాళ్ల కోసం రాస్తున్నారు ‘’అని సమాధానం చెప్పాడట .అంటే రచయితలకే రచయిత గురు దేవుడు అని అర్ధం .అలానే ఆంగ్ల సాహిత్యం లో 19 వ శతాబ్దపు ఉత్త రార్ధం లో stream of consciousness –అంటే చైతన్య స్రవంతి అనే ప్రక్రియ కు బీజం వేసి ,అసలు రచనలు ఎలా ఉండాలో రాసి చూపించి న రచయితలకే రచయిత అని పించుకొన్న మహిళా రచయిత కేతలీన్ మాన్స్  ఫీల్డ్ .

          న్యూజిలాండ్ లోని సంపన్న కుటుంబం లో 1888 అక్టోబర్ నాలుగున కేథరీన్ పుట్టింది .చిన్నప్పటి నుండి రచయిత కావాలనే తపన ఉండేది ..లండన్ లో చదువు కొన్నది .సంగీతం కూడా బానే నేర్చింది .స్కూల్ న్యూస్ పేపర్లలో చాలా రాసింది .ఆస్కార్ వైల్డ్ లాంటి ప్రముఖ రచయితల నందర్నీ చదివి జీర్ణించు కొంది .మూడేళ్ళ తర్వాతా మళ్ళీ న్యుజి లాండ్ చేరింది .మంచి కుర్రాణ్ణి చూసి పెళ్లి చేయాలని తలిదండ్రులు భావించారు .కాని ఆమె లో తిరుగు  బాటు తనం ఎక్కువ .artistic adventurous society తో అనుబంధం పెంచు కొన్నది .ఆస్ట్రేలియా మాగజైన్స్ కు రాస్తూ ఉండేది .మళ్ళీ లండన్ చేరింది .విశృంఖలత ఆమె లక్షణం అయింది .కడుపు వచ్చిందని తెలిసి మూడు వారాల పరిచయం మాత్రమే ఉన్న జార్జి బౌడెన్ ను  పెళ్లి చేసుకోంది .ఆమె కడుపులోని బిడ్డకు అతడు తండ్రి కాదు .పెళ్లి రోజున నల్ల డ్రెస్ వేసుకొని పెళ్లి చేసుకొన్నది .ఆ రాత్రే అతన్ని ఓది లేసింది  తల్లి ఈమె ను భరించలేక ఆర్టిస్ట్ లకు దూరం గా ఉంచాలనే కోరికతో లండను కు తీసుకొని వచ్చింది ..జర్మని లో’’’ స్పా’’లో బోహీమియన్ ఆర్టిస్ట్ లకు దూరం గా చేర్పించింది ..అయినా ఆమె తిరుగుళ్ళు మాన లేదు .మళ్ళీ కడుపు వచ్చి పోయింది .లండన్ తిరిగి వచ్చి రచన లో నిమగ్న మయింది .

               In a German pension నే కధా సంకలనాన్ని 1911లో విడుదల చేసింది ..జాన్ ముర్రే అనే అతని తో పరిచయం పెంచు కొంది .అతను లిటరరీ మాగజైన్ ఎడిటర్ .పెళ్లి అయినా ఆమె అఫైర్ లకు అడ్డూ ,ఆపు లేదు .ఇద్దరు కలిసి’’ బ్లూ రివ్యు ‘’పత్రిక నడిపారు .మూడేళ్ళ తర్వాత పత్రిక పడకేసింది .డి.హెచ్.లారెన్స్ లాంటి ప్రముఖులతో బాగా పరిచయమేర్పడింది .పాత భర్త బాడెన్ తో విడాకులు పొంది ముర్రే ను పెళ్లి చేసుకోంది .1917లో  క్షయ వ్యాధి సోకింది .అయినా రచన చేస్తూనే ఉంది .Bliss and other stories ప్రచురించింది .మంచి పేరొచ్చింది .garden party and other stories రాసి ప్రచురించి మంచి ఆదరణ పొందింది .ఆరోగ్యం మీద ఇప్పుడు శ్రద్ధ కలిగింది .ఫ్రాన్స్ చేరింది .భర్త ముర్రే కు దూరం గా ఉన్నా ,ఆమె ఉత్తరాలు ,కధలను ప్రచురిస్తూనే ఉన్నాడు .1923 లో 34ఏళ్లకే కేథరీన్ టి.బి.తో అల్పాయుర్దాయం తో మరణించి సాహితీ లోకానికి తీరని లోటు కల్గించింది .

                                                            కేథరీన్ ప్రత్యేకతలు  

       garden party లో అత్యాధునిక శైలి తో రచన చేసింది .అదే ఆ తర్వాత‘’impressionanistic style of stream of conscious ness —చైతన్య స్రవంతి గా పేరు వచ్చింది .ఈ విధానం లో జార్జి ఇలియట్ ,వర్జీనియా ఉల్ఫ్ లాంటి వారు రాశారు .తెలుగు లో నవీన్ ఈ ధోరణి లోనే ‘’అంపశయ్య ‘’నవల రాసి ‘’అంప శయ్య నవీన్ ‘’అయి పోయాడు .అంతకు ముందు గోపీచంద్ లాంటి వాళ్ళు ప్రయత్నించారు .ఆంగ్ల రచయితలు ఉల్ఫ్ ,రిచార్డ్ సం లు కూడా ఇలానే రాశారు .1920 కేథరీన్ లాంటి రచయితలు ,కళా కారులు  పాశ్చాత్య సంస్కృతి నుండి దూరమై పోయారు ..జాతీయ స్రవంతికి దూర మైన వారందరికి ‘’Generation x’’అనే పేరు 1990  లో వచ్చింది .

            మాన్స్  ఫీల్డ్ ముఖం చూస్తె ధైర్యం ,వ్యతిరేక భావం ,స్వీయ వ్యక్తిత్వం ,ఆత్మా స్థైర్యం ,ఒకే భావానికి కట్టుబడటం ,వాదనా సామర్ధ్యం ఎల్యుసివ్నేస్స్ కని పిస్తాయి .ఇవన్నీ ఆమె రచనల లోను ప్రతి ఫలిస్తాయి .బెర్ట్రాండ్ రసెల్ ఆమె మేధస్సును మెచ్చి వశ పరచు కోవాలని ప్రయత్నిస్తే ఆమె వలలో పడ లేదు .వర్జీనియా ఉల్ఫ్ తనకు సాహిత్యం లో ఎవరు పోటీ కాని ,సాటి కాని లేరని అన్నది .కాని కేథరిన్ విషయం లో’’ stank like a ciret cat that has taken to street walking ‘’అంటూ ‘’I suppose her in my own way ‘’అని మెచ్చింది .కేథరిన్ రచనల పై మాత్రమే అసూయ అని ఆమె పై కాదని చెప్పింది ఉల్ఫ్ .ఆల్దస్ హక్స్లీ ,క్రిస్టఫర్ కొలంబస్ లు కేథరీన్ వాడిన అనేక మాటలనే తమ రచన లలో వాడారు .లారెన్స్ తన ‘’women in love ‘’నవల లో gudrem అనే పాత్ర ను కేథరీన్ ను దృష్టి లో పెట్టు కొనే రాశాడని అంటారు .అందులోని గుద్రేన్ ఎవరో కాదు -మాన్స్ ఫీల్డ్ .వీ ఇద్దరు రచయితలకు సయోధ్య బానే ఉన్నా ఒక సారి ఆమెను ‘’you are a loathe so me reptile ,i hope you will die ‘’అని శపించాదట .       కాతేరీన్ కు తన అస్తిత్వం మీద నమ్మకం లేదు .తళుక్కు మని మేర వాలనే ఆరాటమే ఎక్కువ .జపాన్ బొమ్మ లాగా హెయిర్ ట్  తో ఉండేది .కాని ఆమె కాలం లో స్త్రీలు అందరు ఎద్వర్దియాన్ ఫాషన్ లో ఉండే వారు .వారికి ఈమె పూర్తి విరుద్ధం ..ఆకర్షణ గా ఉండే ప్రత్యెక దుస్తులను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించు కొనేది .ఆమె రచన ల న్నిటి లో సంస్కృతి విహీనత కన్పిస్తుంది .’’life and work are one thing ,indivisible ‘’అనేది ఆమె సిద్ధాంతం .ఎలా ఉండేదో అలానే రాసేది .రెంటికి తేడా ఉండకూడదని భావించేది .విశృంఖలత తో వీర విహారం చేసింది .ఆడ ,మగా అనే తేడా లేకుండా తిరిగింది .దాని ఫలితమూ అనుభ వించింది .ఎంత బాధ లో ఉన్నా ,చాలా ధైర్యం గా’’ డేర్ డెవిల్’’ లా రచనలు చేసింది .ఆమె విమర్శకుల దృష్టిని ఆకర్షించిన రచయిత అవటం గొప్ప విషయం .అందుకే ఆమెను’’ రైటర్స్ రైటర్ ‘’ అని విమర్శక లోకం గౌరవించింది .ఆమె రాసింది అంతా ‘’post modernism ‘’భావజాలంతో రాసింది .అప్పటికి ఆమె దానికి బీజాలు వేసిన రచయిత్రి .ఆమె చని పోయి నప్పుడు ఆమె సమకాలీన రచయిత లందరూ ‘’our missing cotemporary ‘’అని కితాబు ఇచ్చారు .

       వర్జీనియా ఉల్ఫ్ కు కేథరీన్ తో పరిచయం లేక పోతే;; Mrs Dollway ‘’నవల రాసి ఉండేది కాదు అని విమర్శకుల అభి ప్రాయం ‘’.process of writing ‘’మీద అద్భుత రచనలు చేసి మార్గ దర్శకత్వం చేసింది .ఆమె రాసిన ఉత్తరాలు ,నోట్ బుక్స్ అన్నీ సాహిత్య స్థాయిని పొందాయి .అంత వరకు యే రచయితకు ఇది దక్క లేదు .తన స్వీయ అపజయాలతో విశ్వ శోధన చేసిన మహా రచయిత్రి కేథరీన్ .పోస్ట్ ఇంప్రెషన్ భావాలు ,ఆ పెయింటింగ్స్ ఆమె కు అధిక ప్రేరణ కల్గించాయి .

                     1923  లో gurdjeff లో మానసి క  ప్రశాంతత కోసం చేరింది .మనసు సరిగ్గా పని చేస్తే శరీర ఆరోగ్యం బాగా ఉంటుందని ఇప్పటికి తెలిసింది ‘’హెమరేజ్’’ వచ్చింది .కుటుంబ డాక్టర్ జేమ్స్ యంగ్ చేతుల్లో ప్రాణాలు విడిచింది .తాను చూపించి నంత ప్రేమ భర్త ముర్రే తన పై చూపించ లేదని మనో వ్యధ చెందింది .తన ఆస్తినంతా తనకు సహాయం గా ఉంది  సేవ చేసిన ‘’idaa bekar ‘’కు ఇచ్చేసింది .భర్త ముర్రే ఆమె మరణం తర్వాత ఆమె రచన లన్ని ప్రచురించి కాష్ చేసుకొన్నాడు. ఆమె మరణానికి స్పందిస్తూ ముర్రే ‘’catherine ‘s love survived her own physical death ‘’అన్నాడు .       
                      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-6-12.—కాంప్—అమెరికా
Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అభాగిని -సిల్వియా పాత్

        అభాగిని -సిల్వియా పాత్

డిప్రెషన్ కాలమ్ లో అమెరికా లని మాసా చూసేత్స్ లో ఉన్న జమైకా కాప్లేయిన్ నైబర్ హుడ్ లో 1932 అక్టోబర్ 27 న జన్మించింది సిల్వియా పాత్ .తల్లి ఆస్ట్రియన్ అమెరికా మొదటి తరానికి చెందిన స్త్రీ .తండ్రి జర్మన్ .ఆయన బోస్టన్ universiti  లో జూవాలజి ప్రొఫెసర్ గా పని చేస్తూ బంబుల్   బీస్ మీద పుస్తకం రాశాడు .మూడేళ్ళ వయసు లో ఈమె కుటుంబం విన్త్రాప్ కు మారింది .ఆమె రాసిన మొదటి కవిత బోస్టన్ హెరాల్డ్ లో పడింది .పైంటింగ్ లో అవార్డ్ గెల్చుకొంది .unitreriyan  క్రిస్టియన్ గా ఉండేది ..ఎనిమిదవ ఏట తండ్రి మరణించాడు .కాలేజి లో చేరింది .”పుచ్చకాయ పండి విచ్చు కొన్నట్లుగా ప్రపంచం కని పిస్తోంది ”అని రాసుకొంది .ది స్మిత్ రివ్యూ కుఎడిటర్ అయింది .న్యూయార్క్ సిటిఉండి విశ్లేషనాత్మక వ్యాసం రాసిఅనుభవాలను ”బెల్ జార్ ”అనే నవల లో పొందు పరిచింది .హార్వర్డ్ రైటింగ్ స్కూల్ లో ప్రవేశానికి ప్రయత్నిస్తే తిరస్కరించారు . 

          దీనితో డిప్రెషన్ కు లోనైంది .ఎలక్ట్రో కన్వల్సివ్ తెరపి జరిపారు .బాధ భరించ లేక 1953 లో మందులు మింగి ఆత్మ హత్య కు ప్రయత్నం చేసింది .పాపం మళ్ళీ చికిత్స చేయించు కొన్నది .
ఇక సైకియాట్రిక్ కేర్ లో ఉంచాల్సిన స్థితి ఏర్పడింది .ఇన్సులిన్ షాట్లు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది .కొంత నయం అయింది .మళ్ళీ కాలేజి లో చేరింది .1955 లో దాస్తో విస్కీ నవల మీద ”మాజిక్ మిర్రర్ ”అ పేర తిసీస్ సమర్పించింది .అంత అనారోగ్యం గా ఉన్నా ఆమె లో సాహిత్య సృజన ఆగలేదు .గ్రాడ్యుయేట్ అయింది .ఫుల్ బ్రైట్ స్కాలరశిప్ తో కేంబ్రిడ్జి కాలేజి లో చేరి రచన కొన సాగించింది ”.వర్సిటి ”అనే కాలేజి మాగా జైన కు విపరీతం గా రాసేది .
          1961 లో టేల్ హఘ్ అనే ముజిసియన్ ను పెళ్లి చేసుకోంది .ఇప్పటి నుంచి జ్యోతిషం మీద ,అతీత శక్తుల మీద నమ్మకం బాగా పెరిగింది .1958  లో దంపతులు బోస్టన్ చేరారు .అక్కడ సైకియాట్రిక్ కాలేజి లో రిసెప్షనిస్ట్ గా పని చేసింది .ఈ విషయం చదివితే మనకు రామినీడు తీసిన సినెమా ”చివరికి మిగిలేది ”లో సావిత్రి పాత్ర గుర్తుకు వస్తుంది .క్రియేటివ్ రైటింగ్ సెమినార్ లో పాల్గొంది .మహిళా పక్ష పాతి గా రాసేది .తన అనుభావాలన్నిటిని ఎప్పటికప్పుడు రాసేది .జంట కెనడా మొదలైనవి తిరిగి బ్రిటన్ చేరారు .1960  లో మొదటి కవితా సంకలనం ” కలోస్సాస్”ప్రచురించింది . తన ఆత్మ కధను అంతా నిక్షిప్తం చేసి ,”the bell jar ”నవలను పూర్తి చేసింది .భర్త కు తేనెటీగల పెంపకం పై ఆసక్తి ఎక్కువ.దాని పై కవితలు రాసి మెప్పు పొందింది .భర్త ఇంకో అమ్మాయి తో అఫైర్ సాగించాడు .ఈమెకు కార్ ప్రమాదం జరిగింది .
1962 లో ఆమె కవితా ప్రవాహం ఉధృతం గా ఉంది .ఒంటరి గా పిల్లలతో లండన్ తిరిగి వచ్చింది .అద్దె ఇంట్లో కాపురం .ఆ ఇంట్లో నే ఒకప్పుడు w బి..యేట్స్ కవికవి ఉన్నాడు అని సంబర పడింది .ఆ సంవత్సరం శీతాకాలం లో వందేళ్ళ లో ఎప్పుడు లేనంత చలి  విపరీత మై,నీతి గొత్తకల్లొ నీరు గడ్డ కట్టేసింది .పిల్లలకు జబ్బులు .టెలిఫోన్ సౌకర్యం లేదు .ఇవన్నీ మళ్ళీ డిప్రెషన్ కు దారి తీశాయి ఆ అభాగ్యురాలికి .మరుసటి ఏడాది బెల్జార్ నవల విడుదల అయింది .ఈ నవలను ”విక్టోరియా లూకాన్ ” అన్న మారు పేరు తో రాసింది   డాక్టర్ జాన్ హోర్దర్ ఆమె దయనీయ స్థితి ని గమనించి హాస్పిటల్ లో చేర్పించా టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు .అఆమే ఒప్పు కోలేదు .తప్పని సరి పరిస్థితులలో ఒక నర్సు ను తానే ఏర్పాటు చేశాడు .డాక్టర్ల లోను మాన వత్వం ఉంటుందని రుజువు చేశాడు .ఆమెకు” ఆంటీ డిప్రెషన్ ”మందుల్ని వాడాడు .అంతకు పూర్వం ఆమెకు జరిగిన చికిత్స లో డాక్టర్లు ఇంక ఏ పరిస్తితుల్లోను ఆ మందులు వాడకూడదని సలహా ఇచ్చారు .కానీ ఈ డాక్టరు ఆ విషయం తెలిసో తెలీకో వాడే శాడు .1963 ఫిబ్రవరి పద కొండున ,సిల్వియా పాత్ తన పిల్లల్ని రాకుండా తలుపులు బంధించుకొని గాస్ స్టవ్ఓవెన్ లో  తలను -ఉంచుకొని కార్బన్ మొనాక్సిడ్ వాయువు పీల్చి  చని పోయింది .పాపం తానెం చేస్తోందో ఆ అభాగినికి తెలీదేమో ?
              పాత్ ను అందరు” symbol of blighted female genius ”అని ప్రస్తు తించారు .ఆమె కవిత్వం అంతా చంద్రుడు ,రక్తం హాస్పిటల్స్ fetues  ,పుర్రేలే .ఆమె ఇంట్లో పూర్వం కాపురం ఉన్న ఈట్స్ కవి కూడా ఇలానే రాసే వాడు” .పోఎమ్స్ ఫర్ బర్త్ డే” లో ఏడు భాగాలున్నాయి .కలోస్సాస్ కవితల్లో ఆమె చావు ప్రయత్నాలన్నిటినీ రాసింది ”.ariel ” కవితల్లో విలియమ్స్ ప్రభావం ఉందని అంటారు .తన మానసిక వ్యాధిని tulips ,doddy ,lady lazarus కవితల్లో పొందు పరచింది .ఆమె రాసిన కవిత్వాన్ని ”comfessional poetry ”గా భావిస్తారు .ఆమె మీద సినిమా తీద్దామని ప్రయత్నిస్తే ఎదిగిన  ఆమె కూతురుతిరస్కరించింది .ఆ విషయాన్ని ఆమె ఒక కవిత రూపం లో రాసింది .అది చదివితే మనకు కన్నీళ్లు వస్తే,ఆ అభాగిని కవయిత్రి పై సాను భూతి కలిగి ,ఆమె పిల్లలను అనాధ లను చేసి నందుకు బాధా మెలి బెడుతుంది
”Now they want to make a film -for any one lacking the ability –to imagine the body head in oven –orphaning children
 they think –I should give them my mother’s words –to fill the mouth of  their mother –their sylvia suicide doll ”

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -06 -12 -కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

మహా మేధావి అయిన్ స్టీన్ గురించి కొన్ని జ్ఞాపకాలు .

మహా మేధావి అయిన్  స్టీన్  గురించి కొన్ని జ్ఞాపకాలు .

           చిన్న తనం లో కొడుకు చదువు ఎలా సాగుతోందో తెలుసు కోవటానికి ఐయిన్  స్టీన్  తండ్రి స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుడి ని ‘’మా వాడు దేనిలో రాణిస్తాడు ?’’అని అడిగితే దేనికీ పనికి రడ నీ నిర్మోహ మాటం  గా చెప్పాడట ఆ మేష్టారు.ఆ నాడు బట్టీ పట్ట మే చదువు అంటే .మన వాడి కి అది నచ్చడదు .అందుకే ఆ తర్వాత ఎప్పుడో ‘’ఎలిమెంటరి స్కూల్ టీచర్లు అంటే నాకు మిలిటరి సార్జేంట్లు లా గా అని పిస్తారు ,కని పిస్తారు .డ్రిల్లు మేస్తారంటే లెఫ్టి నేంట్ లు అని పిస్తారు ‘’అని రాసు కొన్నాడా మేధావి .అందుకని ఇంటి వద్దే ఉండి  చదువు కొన్నాడు .అదే ఆయన కు బాగా పయోగ పడింది .

                  తన జీవితం లో రెండు సంఘటనలు సైన్స్ చదవ టానికి ఆకర్షణ కలిగించాయని అన్నాదాయన.నాలుగు లేక అయిదు ఏళ్ళ వయసు లో తండ్రి ఆయనకు ఒక ‘’మాగ్నెటిక్ కంపాస్ ‘’కొనిచ్చాడు .అది ఎప్పుడూ ఉత్తర ధృవాన్ని మాత్రమే చూపిస్తుందని తెలుసు కొన్నాడు .దీనికి మించిన దేదో రహస్యం ఉంది, ఉండాలని పించింది .పన్నెండేళ్ళ వయసు లో యూక్లిడ్ జామెట్రీ ని చదివాడు .ఒక త్రిభుజం లోని మధ్యగత రేఖలు ఒక బిందువు వద్ద కలుస్తాయి అని తెలుసు .కాని అంత సులువుగా ప్రతి సైన్స్ విషయం అంత ఖచ్చితం గా రుజువు చేయ లేము అని భావించాడు .కనుక ప్రపంచం లోని వింతలు అతడి దృష్టిని అప్పుడే ఆకర్షించాయి .ఒక ఖచ్చిత మైన నిర్ధారణకు అనేక మార్గాలు ఉండ వచ్చు అనే ఆలోచనా కలిగింది .

     అయిన స్టీన్ తండ్రి ధన వంతుడే మీ కాదు .రియల్ ఎస్టేట్ బిసినెస్ లో చేతులు కాల్చు కొన్నాడు .అందుకని స్కూల్ మానేయాల్సి వచ్చి ,స్వతంత్రం గా లెక్కల మీద దృష్టి సారించాడు .పదహారేళ్ళ వయసు లో స్విస్స్ స్కూల్ లో  pure mathematics వదిలేసి భౌతిక శాస్త్రం వైపు మళ్ళాడు .ఇక్కడ కూడా స్వతంత్రం గానే చదువు కొన్నాడు .కాలేజి క్లాసులకు హాజరు కాకుండా పరిశోధన శాలలో ప్రయోగాలు చేస్తూ ,తన స్వీయ భావాలను రాసుకొంటూ గడిపాడు .గ్రాడ్యు ఎషన్ సాధించాడు .అయితే  ఫిజిక్స్ లో శిక్షణ పొంద టానికి ‘’ అసిస్టంట్ షిప్ ‘’నిరాకరించారు  బెర్న్ లోని .పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం లో చేరాడు .అందులో తన మనో భావాలన్నీ పరి పక్వం అయాయి అని రాసుకొన్నాడు ‘’that secular cloister where i hatched my most beautiful ideas ‘’అని కవితాత్మకం గా చెప్పుకొన్నాడు .తనతో పాటు చదువుకొంటున్న’’ మిలేవా మారిక్ ‘’అనే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .ఇద్దరి ఆర్ధిక పరిస్థితీ ఒక్కటే .పేదరికమే .దాన్ని గురించి ఆయన ‘’in my theories i put a clock at every point in space ,but in reality I can hardly afford one for my house ‘’అంటాడు .చాలా మందికి తెలిసే ఉంటుంది –ఐయిం స్టీన్ క్లాక్స్ గురించి .అంత రిక్షం లో ఊహల్లో చాలామూలల్లో గడియారాలను ఏర్పాటు చేశాను కాని ఇంట్లో ఒక్క గడియారం కొంటా నికైనా డబ్బు లేదు అని ఆయన భావం .అయితే ఆఊహా గడియారాలు బానే డబ్బును వర్షించాయి .1905లో ఆయన  the electro dynamics of moving bodies మీద ఒక పేపర్ ప్రకటించాడు .ఇదే ఆయన సాపేక్ష సిద్ధాంతం మీద విడుదల చేసిన మొదటి పేపరు .అందులో కాంతి వేగం అన్నిటి కంటే చాలా ఎక్కువ అని చెప్పాడు .అంతే కాదు ఆ వేగం లేక వేలాసిటి అందరికి ,ఎక్కడ ఉన్నా సమానం గా నే ఉంటుంది అనే గొప్ప ఆలోచన బయట పెట్టాడు .అంటే ఏకాలం లో నైనా కాంతి సెకనుకు 3,00,000 కి.మీ .వేగం తో ప్రయాణం చేస్తుంది .ఇంకా యే వస్తువు వేగమైనా ప్రాంతం, కాలం బట్టి మారవచ్చు కాని కాంతి వేగం చచ్చినా మారదు .అని ఘంటా పధం గా రుజువు చేశాడు .మిగిలిన వన్నీ సాపెక్షాలే కాని కాంతికి సాపేక్షత లేదు .కాలం, ద్రవ్య రాసి ,స్పేస్ మారి పోతాయి .ఈ సిద్ధాంతం తో పాత సిద్ధాంతాలన్నీ మారి పోయాయి .దీని తర్వాతా ఆయన సామాన్య సాపేక్ష సిద్ధాంతాన్ని వివరించాడు .అందులో వస్తువుల త్వరణ వేగాన్ని దృష్టిలో పెట్టు కోవాలని సూచన చేశాడు .దీనితో అయిన స్టీన్ ఒక కొత్త భావానికి తెర  లేపాడు .అదేమిటి అంటే సైన్స్ సరి అయిన రుజువు ను ఇవ్వలేదు అందుకే సరైన నిర్ణయాలకు రాలేము అంతే కాక మన నిర్ణయాలు conjectures మాత్రమే అన్నాడు .దీనికి కారణం విశ్వం లో లెక్కకు మించిన విషయాలను గమనించాల్సి వస్తుందని ,అవి ఎప్పటికప్పుడు మారి పోతు ఉంటాయని అన్నాడు .అందుకే సైన్స్ ఖచ్చిత మైన నిర్ణయాలకు రాలేము( nothing can be proved decisively ‘’)  అని తేల్చి వేశాడు మహా మేధావి అయిన స్టీన్ .

             ఆయన ప్రసిద్ధ సిద్ధాంతం సూత్రం అందరికి తెలిసిందే—E==mc2..ఈ రెండిటి వల్ల అనేక యురోపియన్ యుని వేర్సిటి ల లో లెక్చరర్  పోస్ట్ కు ఆహ్వానాలు అందాయి .1913 లో kaiser whilhem instititute of physics లో బెర్లిన్ వర్సిటి లో ఉద్యోగం లో చేరాడు .అయన భావాల పై తరచూ చర్చలు జరుగు తూనే  ఉన్నాయి .1919 లో బ్రిటీష వ్యోమ గాములు దక్షిణ అమెరికా కు ప్రయాణించి నపుడు అయిన్  స్టీన్ ప్రతి పాదించిన  ‘’నక్షత్ర కాంతి వంగుతుందని ,సూర్యుడు చాలా విపరీత ద్రవ్య రాసి ఉన్న వాడు అవటం వల్ల నక్షత్ర కాంతిని లెక్కించ దగ్గ పరిమాణం లో వాంఛ   గలుగు తున్నాడు ‘’అని చెప్పింది నిజం అని తేల్చి చెప్పారు . 1919 నవంబర్ లో అయిన స్టీన్ ఊహించిన విషయాలు ఖచ్చితమైన వే నని చెప్పారు .దీనితో ఐన్స్టీన్ ప్రతిభ విశ్వ వ్యాప్త మైంది .

             అయిన స్టీన్ అంటే అమెరికా వారికి తగని గౌరవం ..ఆయన సామాన్య సాపేక్ష సిద్ధాంతం గొప్పదే కాని దాన్ని సామాన్యులకు వివరించటం కష్టమైన పనే .ఇప్పడు ఈ రుజువు తో ఆయన సిద్ధాంతానికి వ్యాప్తి బాగా కలిగింది .అంతటి మేధావి అయిన సైంటిస్ట్టిస్ట లేడు అన్నారు .అంతే కాదు ‘’ఇరవయ్యవ శతాబ్దపు  న్యూటన్ ‘’అన్నారు .ఇన్ని ఆలోచనలు బుర్ర నిండా ఉన్నా నిబ్బరం గా ,తాపీగా పైప్ కాలుస్తూ వయోలిన్ వాయిస్తూ కలల్లో తేలిపోయే వ్యక్తీగా  మనకు కన్పిస్తాడు . 1921 లో ఫిసిక్స్ లో’’క్వాంటం థీరి’’ కి నోబెల్ బహుమానం అందుకొన్నాడు .దీనితో’’ లెజెండ్’’  అయాడు .అయితే తనకు వచ్చిన పురస్కారం గురించి ‘’some thing of the beauty of this mysterious  universe should not be personally celebrated ‘’ అని అతి వినయం గా చెప్పాడు .దట్  ఈస్ ఐన్స్టీన్

           .1932 లో జర్మని లో జాతి దురహంకారం పెచ్చు పెరగటం తో ,అమెరికా వారు అంతకు ముందే ఆహ్వానించిన ఆహ్వానాని మన్నించి అమెరికా చేరాడు .అక్కడ జర్మనీ లో  యూదు అవటం వల్ల ఆయన సాపేక్ష సిద్ధాంత కాగితాలన్నీ తగల బెట్టి ,వాళ్ల అహంకారాన్ని రుజువు చేసుకొన్నారు .ఇక్కడ ఒక మేధావికి ఘన స్వాగతం లభించింది .ప్రిన్ స్టన్ లో అడ్వాన్సెడ్ స్టడి బోధించా టానికి చేరాడు .1955 లో మరణించే వరకు అక్కడే పని చేశాడు .

         వేసవి కాలాన్ని  లాంగ్ ఐలాండ్ లో ‘’ నాసువా పాయింట్’’ వద్ద గడిపే వాడు .నౌకా విహారం సంగీతం లతో చుట్టూ ప్రక్కల వారితో కాల క్షేపం . .ఒక ఉత్తరం లో మానవ క్రూరత్వం ,పైశాచిక చేష్టలు ఇంత దారుణం గా జర్మనీ లో జరుగుతుండటం మానవత్వానికే సిగ్గు చేటు అని వాపోయాడు .మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఏవగించుకొని యువకుడు గా ఉండగానే జర్మన్ పౌరసత్వాన్ని వదులు కున్నాడు .హిట్లర్ కు ఆయుధాలతోనే బుద్ధి చెప్పాలని గాదంగా భావించాడు .అణు విచ్చేదాన్ని అమెరికన్ శాస్త్ర వేత్తలు, మిలిటరి చేస్తున్నారని తెలుసు కొని, ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ ను సమరర్ధించమని ఉత్తరం రాశాడు .యుద్ధానంతరం హిట్లర్ పతనం తర్వాథ ‘’హీరో శీమా’’ పై ఆటం బాంబ్ ప్రయోగం జరిగిన తర్వాత అణు  విచ్చదం వల్ల ఏర్పడిన ఆటం బాంబు ను ఇంక యే దేశం మీదా ప్రయోగించ వద్దని గట్టిగా చెప్పాడు .

     చిన్నప్పటి నుంచి ఒంటరిగా గడపటం అయిన స్టీన్ కు ఇష్టం అని తెలియ జేసుకొన్నాడు .తాను ఇంత ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తీ అయి ఉండి  కూడా ఒంటరిగా ఉండటం ఇష్టమంటే వింతగా ఉంటుంది అంటాడు .ఆయన 1879 లో జన్మించి76 ఏళ్లు జీవించి1955లో మరణించాడు . 1921 లో ఆయన న్యూయార్క్ మొదటి సారిగా వీజ్మన్ తో కలిసి   .జెరుసలెం లో హిబ్రు యుని వేర్సిటి  కి నిధుల సేకరణకు వచ్చాడు .అమెరికా లో అందరు ముఖ్యం గా యూదులు ఆయన ను చూడ టానికి ఎగ బడ్డారు .వై హౌస్ లో ఘన స్వాగతం లభించింది .ఎక్కడ చూసినా జన సముద్రం ఆయన్ను  ఆప్యాయం గా పలకరించి .ఆయన ఉపన్యాసాలను శ్రద్ధ తో విన్నారు .ఆయన తన సాపేక్ష సిద్ధాంతాన్ని జెర్మని భాష లోనే వివ రించటం కొస మెరుపు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-12.—కాంప్—అమె

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

వాయువీరుడు చార్లెస్ లిండ్ బెర్గ్

  వాయువీరుడు చార్లెస్ లిండ్ బెర్గ్

          సాహసమే పూపిరిగా ,ధైర్యమే భూషణం గా ఉన్న వారు చరిత్ర ను సృష్టిస్తారు .తర తరాలకు ఆదర్శ ప్రాయు లవుతారు .స్వంత విమానం లో అమెరికా లోని న్యుయ్యార్ నగరం నుండి ,ఫ్రాన్స్ దేశం లోని పారిస్ నగరానికి నాన్ స్టాప్ గా అట్లాంటిక్ సముద్రం మీద ప్రయాణం చేసి’’ వాయువీరుడు’’ అని పించుకొన్నాడు చార్లెస్ లిండ్ బెర్గ్ –అతని చరిత్ర సాహసులకు ప్రేరరణ .1927 may 20న ఇరవైయిదేల్ల లిండ్ బెర్గ్ ఈ సాహసం చేశాడు .

                                                                          పుట్టుక –విద్య

            1902 లో ఫిబ్రవరి నాలుగున మిచిగాన్ లోని డెట్రాయిట లో జన్మించాడు .తండ్రి ఆగస్టస్ స్విద్జేర్లాండ్ ఇమ్మిగ్రంట్ ..కుటుంబం మిన్న సోటా  కు మారింది .తండ్రి120 ఎకరాల స్థలం కొన్నాడు .చార్లెస్ నాలుగేళ్ల వరకు బయటే తిరిగాడు .స్వంత ఇల్లు కట్టే డబ్బు తండ్రికి లేదు .తలిదండ్రులు చాలా ముభావులు .తండ్రి అమెరికా house of representativ అయాడు .అందుకని భార్యకు విడా కులివ్వకుండా దూరం గా ఉంచాడు కొడుకుతో .1909 లో వాషింగ్టన్లో గ్రామర్  స్కూల్ లో చేరాడు .  1912 లో వర్జీనియా లో జరిగిన air plane exhibition కు తండ్రి తో  వెళ్లాడు . తండ్రి మొదల టి.ఫోర్డ్ కారు కొంటె ,అది చాలా కష్టపడి తొక్కితే నే కాని స్టార్ట్ అయేది కాదు .తానే నడపటం నేర్చాడు చార్లెస్ .ఈ బాధ పడలేక తండ్రి కొత్త కారు కొన్నాడు .అమ్మమ్మ ఇంటికి చేరి అక్కడి వ్యవసాయం చూసు కొంటు ,తల్లిని సేవిస్తూ గడిపాడు .గ్రాడ్యు ఎషణ్  అవగానే ఆర్మీ లో చేరాలను కొన్నాడు .చదువు కంటే అడవులు ,లోయలు ,సరస్సులు అతన్ని బాగా ఆకర్షించాయి .

          reserve officer training corps లో చేరాడు .విస్కాన్సిస్ వర్సిటి లో రైఫిల్ పిష్తల్ స్క్వాడ్ లో చేరాడు .ఇంగ్లీష లో తప్పాడు .నిరాశ చెంది ఇంగ్లీష తనకు అచ్చి రాదనీ గ్రహించాడు .విమాన పైలట్ అవాలని ప్రగాఢ మైన కోరిక ఉండేది .లింకన్ లోని నెబ్రాస్కా వర్సిటి లో చేరాడు .అక్కడ అతనొక్కడే అప్పుడు స్టూడెంట్ .దాని నిర్వాహకుడు’’ రే పేజి’’ తో కలిసి అన్ని పనులు చేశాడు .క్లాసులు ప్రారంభమైనాయి .ట్రైనింగ్ పూర్తీ అవగానే స్వంత విమానం కొనాలని ప్లాన్ లో ఉన్నాడు .తల్లి మిచిగాన్ చేరింది .1923 లో రెండవ ప్రపంచ యుద్ధం లో వాడిన విమానాలను వేలం వేస్తుంటే ‘’జెన్ని ‘’అనే విమానాన్ని వెయ్యి డాలర్లు పెట్టి కొన్నాడు .కల నిజం చేసు కొన్నాడు .దాన్ని విజయ వంతం గా నడి  పాడు .సెయింట్ లూయీస్ అనే బాగా రద్దీ గా ఉండే విమానాశ్రయానికి సురక్షితం గా చేరాడు .

                                                                               పోటీలు

international air race లలో పాల్గొన్నాడు .కొత్త రకమైన విమానాలను అధ్యయనం చేశాడు .u.s.army air service reserve cadetగా చేరాడు .ట్రైనింగ్ చాలా కష్టం గా ఉండేది .25 అతి కష్టమైన సబ్జెక్టులు చదవాల్సి వచ్చింది .అవకాశం మళ్ళీ రాదు అని తెలుసు కొని క్షణం తీరిక లేకుండా చదివి ఉత్తీర్ణుడై అందరి ప్రశంసలను పొందాడు బెర్గ్ .క్లాస్ లో ఫస్ట్ .1926 ఏప్రిల్ పదిహేనున మొదటి సారిగా సెయింట్ లూయిస్ నుండి ఇలినాయిస్ కు air mail delivery ని మొదటి సారిగా చేసి శేహబాష అని పించుకొన్నాడు .

                                                                    ట్రాన్స్ అట్లాంటిక్ ఏవియేషన్ పోటీ

             ఫ్రాన్సు దేశానికి చెందినా అమెరికా హోటల్  ఓనర్ ‘’రిమాండ్ ఆర్తీగ్ ‘’తన పేరు తో ఒక పోటీ ని నిర్వహించ దలచాడు .అట్లాంటిక్ సముద్రం మీదుగా న్యూయార్క్ నుండి ,పారిస్ కు ఒకే ఒక ప్లేన్ లో నాన్ స్టాప్ గా ప్రయాణించాలి అదీ పోటీ .లిండ్  ఈ వార్త విన్నాడు .అప్పటికే ఫ్రెంచ్ కెప్టెన్ ‘’రిని ‘’ప్రయత్నించి విఫలుడైనాడు .ఒంటరి ప్రయాణం .నిద్ర ఉండదు .దాదాపు 24గంటలు నాన్ స్టాప్ గా ప్రయాణం చేయటం సాహసమే ..ఏమైనా సాహసుడు కనుక పాల్గొని గెలవాలి అని నిర్ణయానికి వచ్చాడు ..ప్రయాణానికి తనకు తగిన విమానం తయారు చేసు కోవాలి .దానికి ఖర్చు పది వేల డా లర్లవుతుంది .తన చేతి లో రెండు వేలే ఉన్నాయి .స్నేహితులు ,ఇలాంటి సాహసాన్ని ఉత్సాహ పరిచే వారు తగిన ధనాన్ని సమ కూర్చి పెట్టారు .

             ryon air craft అనే తనకు కావాల్సిన విమానాన్ని కావలసిన హంగులతో తయారు చేసిస్తామని ఆ కంపెని హామీ ఇచ్చింది .కాలిఫోర్నియా లో ఉంది 36గంటలు నిద్ర లేకుండా దాని పని చూశాడు .ప్రయాణానికి అవసర మైన వివ రాలన్ని సేకరిన్చుకొన్నాడు .1927 కు విమానం సర్వ హంగులతో తయారైంది .దాని బరువు 2,150 పౌండ్లు .ఇంధనం నింపితే 5,180 పౌండ్లు .450 గాలన్ల పెట్రోల గాస్ నింపాలి ఆ విమానానికి ఏమి పేరు పెట్టాలని అలోచించి చివరికి ‘’spirit of saint louis ‘’అని తనకు సాయం చేసిన వారందరికి కృతజ్ఞత గా ఆ పేరు పెట్టాడు .డజన్ల కోద్దె సార్లు దాన్ని తెస్త చేసి నడిపాడు .

                                                                                 పోటీ కి ఏర్పాట్లు

         1927 మే 12న సాన్ డీగో లోని నార్త్ ఐలాండ్ నావల్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3-55కు సెయింట్ లూయిస్ లోని లామ్బాస్ట్ ఫీల్డ్ కు బయల్దేరాడు .రెండు ఆర్మీ విమానాలు రక్షణ గా అనుసరించాయి .విమానం తయారు చేసిన రైయాన్ వాళ్ల ప్లేన్ కూడా అనుసరించింది .నాలుగు విమానాలు ryon air craft ఫాక్టరి చుట్టూ ప్రదక్షిణం చేసి ,12000 అడుగుల ఎత్తున ఎగురుతూ మర్నాడు ,ఉదయం 8-20 కు సెయింట్ లూయిస్ చేరారు .14 గంటల్లో1550 మైళ్ళ ప్రయాణం చేశాడు . వెంటనే బయల్దేరి మర్నాడు ఉదయం ఏడు గంటలు ప్రయాణం చేసి  న్యూయార్క్ చేరాడు .ఇది కూడా రికార్డే .మే 12న 1927  న్యూయార్క్ చేరే సరికి ఈ సాహస వీరునికి వేలాది మంది చేరి శుభా కాంక్షలు అంద జేశారు ..ఒక వారం న్యూయార్క్ లో గడి పాడు .

                                                                            పోటీ రోజు

         1927 may 20న ‘’లిన్దెర్బెర్ఘ్ ‘’విమానం ఉదయం 7-54 కు న్యూయార్క్ నుండి పారిస్ బయల్దేరింది .ముందుగా అట్లాంటిక్ సముద్రం పై 150 అడుగుల ఎత్తున నడిపాడు .ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం తో సంప్రదిస్తూనే ఉన్నాడు .కళ్ళు మూసుకు పోతున్నాయి .చార్టులు తిరగేస్తున్నాడు .అలసట పెరిగి పోయింది .ఎనిమిది గంటల తర్వాతా భూమి కని పించింది .అది అమెరికా ఉత్తరాన ఉన్న ‘’నోవా స్కాటియా’’మొదటి రోజు రాత్రి 10,500అడుగుల ఎత్తున తుఫాను కన్పించింది .వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వస్తుందేమో నని భయ పడ్డాడు ..విమానం పై మంచు దుప్పటి లాగా పరుచుకోండి .రెక్కల పై మంచు చేరితే ప్రమాదం .వెంటనే విమానం తిప్పి దూరం గా వెళ్లి ఊపిరి పీల్చుకొన్నాడు .

                    మగత కమ్ముతోంది .అలసట పెరిగింది .దగ్గర్లో దీవులు కని పిస్తున్నాయి .అవి ఎండ మావులని తెలిసింది . 27 గంటల ప్రయాణం తర్వాతా కిందికి చూస్తె వస్తువులు కని పించాయి .కిందికి దింపి ఎగిరాడు .ఐర్లాండ్ కు దారెటు అని వాల్లనడి గితే జవాబు రాలేదు .గంట తర్వాతా ఐర్లాండ్ దక్షిణ తీరం కన్పించింది .అలసట పోయింది .ఇంకో గంట తర్వాతా ఇంగ్లాండ్ మీదుగా ఎగిరాడు .ఇంతకీ అతని ఆహారం ఏమిటో తెలుసా /’’అయిదు సాండ్ విచులు’’ మాత్రమే .అందులో ఒకదాన్ని తిన్నాడు . 9-52  కు పారిస్ లోని ‘’ఈఫిల్ టవర్ ‘’కన్పించింది .10-24 p.m. కు అంటే 21-5—27 న పారిస్ లోని le-borget విమానాశ్రయాన్ని చేరాడు .అశేష జనం స్వాగతం పలికారు .ఫ్రాన్స్ ప్రభుత్వం గౌరవ పురస్కారం అందించింది .అమెరికా ప్రభుత్వం శుభా కాన్క్షలను తెలియ జేశింది ..ప్రపంచం జేజేలు పలికింది .అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు .

                                                                       అమెరికా చేరిక

    1927 జూన్ 10న అమెరికా చేరాడు లిండ్ బెర్గ్ .i my self symbolize ing avation ‘’అని జనం భావించారని సంబర పడ్డాడు .అమెరికా ప్రభుత్వం తరఫున 48 గంgoodwill tour చేశాడు .బెర్గ్ ను ‘’ambassador of the air ‘’అన్నారు .december 13న తన విమానం లో బయల్దేరి ఇరవై ఏడు గంటలు ప్రయాణం చేసి మెక్సికో సిటి చేరాడు .అక్కడి నుంచి ఆరు వారాలు లాటిన్ అమెరికా దేశాల్లో పర్య తించాడు .’’సెలెబ్రిటి ‘’గా ఉండటానికి అసలు ఇష్ట పద లేదు .కమ్మర్శియాల్ ఏవియేషన్ కోసం పని చేయాలను కొన్నాడు .1928 లో trans conti nental air trans port ,pan american air ways కు సాంకేతిక సలహా దారుగా ,కన్సల్టంట్ గా ఉన్నాడు .పని చేసి జీతం తీసుకోవాలి అన్నది అతని ఆదర్శం .  ఇలా వాయు వీరుదయాడు లిండ్ బెర్గ్ .ఎయిర్ హీరో అని అందరు కీర్తించారు .           

                                                                       పెళ్లి –తదనంతర జీవితం

            1929లో అన్నే మర్రో తో వివాహమైంది .కొడుకు చార్లెస్ జూనియర్ ను కిడ్నాపర్లు ఎత్తుకు పోయారు .ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరక లేదు పాపం .అప్పటికే న్యు జెర్సి లో 450 ఎకరాల స్థలాన్ని కొని వ్యవసాయ క్షేత్రం గా మార్చాడు .అది నిర్జన ప్రదేశం .అందుకే కొడుకు కిడ్నాప్ కు గురి అయాడు .కొంత కాలానికి పిల్లాడి శవం పొదల దగ్గర కని పించింది .ఇక ఇక్కడ ఉంటె క్షేమం కాదని అంతా అమ్మేసి ఇంగ్లండ వెళ్లాడు భార్యతో జర్మనీ నుంచి  t.a.t.కు కన్సల్టంట్ గా పని చేశాడు .నాజీలను సపోర్ట్ చేశాడు .అమెరికా యే యుద్ధానికి కారణం అన్నాడు .హిట్లర్ అనుచరుడు ఇచ్చిన విందు లో పాల్గొని మరీ అమెరికా కు దూరమైనాడు .జర్మని వారిచ్చిన మెడల ను భార్యకు చూపిస్తే ‘’it is like albartos –the bird that symbolized doom ‘’అని భవిష్యత్తు ను బాగా ఊహించి చెప్పింది .నాజీలు యూదులను హిమ్సిస్తుంటే విమర్శించాడు .అమెరికా తమ ‘’వాయు వీరుడు ‘’ను దేశ ద్రోహి అంది .జర్మనీ ఇచ్చిన మెడల ను వాపస్ చేయమని చాలా మంది ఒత్తిడి తెచ్చినా ఇవ్వ లేదు .

                                                                      మళ్ళీ అమెరికా

                  1939లో అమెరికా చేరాడు .అయినా అతను అమెరికా ను విమర్శించటం మాన లేదు .ఇతన్ని సపోర్ట్ చేసే వారూ వేలాదిగా ఉండే వారు .చివరికి యుద్ధం మనమే తెచ్చు కొన్నాం కనుక పోరాడా వలసిందే అన్నాడు .సైన్యం లో చేరి సేవ చేస్తానంటే ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఒప్పు కోలేదు .అవమానించి ,అవహేళన కూడా చేశాడు .కాని హెన్రీ ఫోర్డ్ తన కన్సల్టంట్ గా తీసుకొన్నాడు ..రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాడు .ఎంత జీతం కావాలన్నా ఇస్తానన్నాడు ఫోర్డ్ .తను రిటైర్ అయినప్పుడు ఎంత జీతం తీసుకోన్నాడో అంతే తీసుకొన్నాడు .666-66డాలర్లు మాత్రమే నెలకు .u.s.air craft corporation కన్సల్టంట్ గా తీసుకోండి .సివిలియన్ అబ్జర్వర్ అయాడు .తెస్త పైలట్ గా కూడా పని చేశాడు .వార్ పైలట్ గా చేయాలన్న కోరిక ఇలా నేర వేరింది .1945 లో జర్మని వెళ్లి హై స్పీడ్ ఎయిర్ క్రాఫ్ట్ కు డిజైన్ చేయటం లో సాయం చేశాడు .అమెరికా హీరో అన్న పేరు క్రమంగా ఇప్పటికే కను మరుగైంది .

                      1960 లో ‘’కన్జర్వేశానిస్ట్ ‘’అయాడు .world wide life fund ,international union for conservation of nature and natural resources కు యేన లేని సేవ చేశాడు .చాలా సార్లు ప్రపంచ పర్యటన చేసి నిధులు సమ కూర్చాడు .species కు కేతలాగింగ్ లో iternational union కు బాగా సాయం చేశాడు . కేన్సర్ వ్యాధి వచ్చింది అయినా 1974లో ఇంగ్లండ చేరి world wild life fund  నిది సేకరణకు సాయ పడ్డాడు .కనెక్టికట్ నుండి న్యూయార్క్ కు కుటుంబం ,మిత్రులతో ప్రయాణం చేశాడు .

                చావు కు దగ్గరయ్యానని తెలుసు కొని చివరి పది రోజులు తన అంత్య క్రియలకు కావలసిన అన్ని ఏర్పాట్లు స్వయం గా చూసుకొన్నాడు .1974 ఆగస్ట్ ఇరవై ఆరున అందరి సమక్షం లో’’ చార్లెస్ లిండ్ బెర్గ్ హంస అనంత ఆకాశాల లోకి యెగిరి పోయింది’’ .అతని మనవడు ఎరిక్ తాత సాధించిన విజయానికి 75వ ప్లాటినం జుబిలీ ని నిర్వహించాడు .అతను 2002 ఏప్రిల్26 న new spirit of saint louis అనే సొంత  విమానాన్ని అమెరికా అన్ని రాష్ట్రాలలో పర్యటించి న్యూయార్క్ చేరాడు .అతని వయసు అప్పుడు ముప్ఫై ఏడు .అతను ఎమచ్యుర్ పైలట్ .తహాతకు తగ్గ మనవడు అని పించుకొన్నాడు ఎరిక్ .

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-12.—కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

బుద్ధ భూమి – జూన్ లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

 అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

      ఈ వారం అంతా సందడి గా ,సరదాగా గడిచింది .మంచి పుస్తకాలూ చదివాను .రెండు పుట్టిన రోజు పండుగలు ,ఒక రేడియో ప్రోగ్రాం ,ఒక భజన, ఫాదర్’స్ డే లతో ఈ వారం సాగింది .సోమవారం సందడే మీ లేదు .ట్విన్స్ ను జిమ్నాస్టిక్స్ లో సాయంత్రం చేర్చటానికి వెళ్ళాం .ఆశుతోష్ బాగా చేశాడు .పీయుష్ చేతి నెప్పితో ఉన్నా వాడు చేసిన వన్నీ బయటే చేశాడు .వచ్చే వారం వాడూ ఇందులో చేరతాడు .శ్రీ కెత్ క్లాస్ వీళ్ళ క్లాస్ అయిన తర్వాత .జి మార్ట్ కు వెళ్లి కూరలు కొన్నాం .పనస పండు కూడా . ఆ రోజు రాత్రి ‘’ఇదే మంటే ప్రేమంటా  ‘’సినిమా కు రాత్రి తొమ్మిదిన్నర ఆటకు వెళ్ళాం .కాని ఫిలిం’’ కీ’’రాలేదని ఆట వెయ్య లేదు .మర్నాడు మంగళ వారం రాత్రి కి వెళ్ళాం .సినిమా లో దమ్ము లేదు .అయితే సరదా గా కూర్చో బెట్టాడు డైరెక్టర్ .మాకుటుంబం కాక ఇద్దరే హాల్ లో ఉన్నారు .డబ్బా లేపెసేట ట్లుంది .శుక్ర వారం జగదీశ్ ,లక్ష్మి దంపతుల అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు .ఇంటి దగ్గరే చేశారు .అందరం వెళ్ళాం .మంచి దంపతులు .నలభై మందికి పైగా వచ్చారు .రాత్రి ఏడున్నర నుండి ఒక గంట భజన ,ఆ తర్వాతా బర్త్ డే పార్టీ .గులాబ్జాం పులిహోర ,మరిరెండు స్వీట్లు ,చపాతీ కూర అప్పడం అన్నం ,పెరుగు ,ఐస్క్రీం కేకు .వగైరా .అన్నీ బాగున్నాయి .లక్ష్మి మా మేనకోడలు పద్మ లాగా ఉంటుంది .ప్రభావతిని పొదివి పట్టు కొంటుంది .అంత అభిమానం .మేము రావటం అదృష్టం గా భావించే దంపతులు జగదీశ్ ,,లక్ష్మి .ఆదిత్య ను మాకు నమస్కరింప జేసి ఆశీస్సులు పొందే టట్లు  చేశారు .అందుకే వాళ్ళింటికి వెళ్లటం ఇష్టం గా ఉంటుంది .సుమారు నేల క్రితం ఆహోబాల స్వాములు వీరింట్లో చేసిన పూజకు వెళ్ళాం .మర్నాడు  శని వారం మా ఇంటికి దగ్గర్లో పిల్లల స్కూల్ కు వెళ్ళే దారిలో ఉన్న యై.ఏం.సి.యే.భవనం లో విజ్జివాల్లకు తెలిసిన కన్నడ కుటుంబం వాళ్ల అబ్బాయి బర్త్ డే .వెళ్ళాం .ప్రభావతి రాలేదు .ఒక క్లౌన్ వేషం లో అమ్మాయి  పిల్లలకు  సరదా గా బలూన్లు చేసి సరదా చేసింది .ఐటమ్స్ చాలా పెట్టారు కాని తిన్నది చపాతి ,పెరుగు వడ మాత్రమే .అక్కడి నుంచి లైబ్రరీ కి వెళ్లి ఇరవై రెండు పుస్తకాలు ఇచ్చేసి ,పద కొండు తెచ్చుకోన్నాను .బుధ వారం రాహుల్ ఇంట్లో భజన కు వెళ్ళాం అందరం .

                                                 

This slideshow requires JavaScript.

                      టోరీ భేరీ

        శార్లేట్ లో విజ్జి ఫ్రెండ్ నాగమణి గత నాలుగేళ్ళుగా టోరీ రేడియో ప్రోగ్రాం ను ప్రతి బుధ వారం చేస్తోంది .మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు .ఈ ప్రోగ్రాం లోనే మార్దంగిక విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వర రావు గారిని ,ఈల లీలా వినోడదులు కొమర వోలు శివ ప్రసాద్ ను మా ఇంట్లోనుంచే ఇంటర్వ్యు చేశాం .ఆవిడ వాళ్ళింట్లో ఉండి  ఫోన్ లో ప్రశ్నలడిగితే ఇక్కడ ఫోన్ లో సమాధానం చెప్పటం .దీని లింక్ అంతా హైదరాబాద్ లో జరుగు తుంది .లైవ్ ప్రోగ్రాం  .మధ్యలో పాటలు శ్రోతల ప్రశ్నలు వాటికి సమాధానాలు ఉంటాయి .టోరీ అంటే’’టెలివిజన్ ఆన్ లైన్ రేడియో ఇంటర్ నేషనల్ ‘’అని అర్ధం .ప్రపంచ దేశాలన్నిటికీ చేరుతుంది లైవ్ లో .ఆ విద్వాంసులను నేనే మనింటి నుంచి పరిచయం చేసి ,ప్రశ్న లడిగి సమా చారం చెప్పించాను . నాగమణి  నేను వచ్చిన్దగ్గర నుంచి నన్ను ప్రోగ్రాం చేయ మని అడుగుతూనే ఉంది .నేను వాయిదా వేస్తూనే ఉన్నాను అది మొన్న బుధ వారం కుదిరింది .ప్రోగ్రాం నాగమణి గారింటి వద్దే చేశాం .విజ్జి నన్ను అక్కడ దింపింది .లింక్ కుదరక ఒక అరగంట ఆలస్యం గా అంటే పన్నెండున్నర కు ప్రారంభమైంది .గంటన్నర అంటే మధ్యాహ్నం రెండుకు పూర్తి అయింది .’’ ఊసుల్లో ఉయ్యూరు’’ గురించి మాట్లాడాను .

రేదియోలో పూర్తీ ప్రసంగం

                                                            ఊసుల్లో ఉయ్యూరు

            నేను ముందుగా నా పరిచయం చేసుకొన్నాను .ఉయ్యూరు ప్రాముఖ్యాన్ని ,అది బందరు ,బెజవాడ మద్య ఉందని చెరకు వరి ,కంద తమల పాకు ,పసుపు ,మొదలైన పంటలకు కేంద్రమని ,ఆసియా లోనే అతి పెద్ద షుగర్ ఫాక్టరి ఇక్కడ ఉందని ,ఇక్కడి పంచదార చాలా నాణ్యమైనది గా భావిస్తారని ,మొదలు పెట్టాను .గత యాభై ఏళ్లుగా సాహితీ రంగం లో ఉన్నానని .నా చదువు ఉయ్యూరు విజయ వాడ లలో సాగిందని రాజ మాండ్రి లో బి.ఎడ్ .పూర్తి చేశానని ,కృష్ణా జిల్లా పరిషద్ లో ఇరవై రెండేళ్లు ఫిజికల్ సైన్స్ టీచర్ గా పని చేసి ఆ తర్వాతా పద కొండే ళ్ళు  ప్రధానో పాద్యాయుడి గా చేసి 1998 జూన్ లో పదవీ విరమణ చేశానని చెప్పాను .’’విశ్వం లో ఉన్న తెలుగు వారి గుండె చప్పుళ్ళు విని పిస్తున్న టోరీ కి వందనం ,అభి వందనం అని ,శ్రోతలకు అభినందనం అన్నాను ‘’టోరి లో టి అనేది టెలివిజన్ అని మీరు భావిస్తే ‘’తెలుగు ‘’ని నేను భావిస్తానని ,కనుక తెలుగుకు చేస్తున్న సేవ గా టోరి  ని అభినదిస్తున్నానని అన్నాను .

                        ఉయ్యూరు ఊసులు ఎలా మొద లైనాయో చెప్పాను .మా ఊళ్ళో అన్నీ తెలిసిన వారు చాలా మంది ఉన్నారని వారిని గుర్తుంచు కోవటం కోసం మా తమ్ముడు కృష్ణ మోహన్ తో ముందు రాయిన్చానని ,ఆ తర్వాతా వాటిని పుస్తక రూపం లో తెచ్చి మా అబ్బాయి రమణ వివాహ రిసెప్షన్ లో ఏం .ఎల్.సి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరింప జేశామని చెప్పాను ‘’.సరస భారతి’’ అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ ను ఉయ్యూరు లో సుమారు మూడు ఏళ్ళ క్రితం ప్రారంభించి ప్రతి నేలా ఒక కార్య క్రమం చేస్తూ , ప్రతి ఏడూ ఉగాది కి కవి సమ్మె లనాలు నిర్వహిస్తున్నామని ,వాటిని పుస్తక రూపం లో తెచ్చి అంద జేస్తున్నామని ,ఇప్పటికి సరసభారతి తొమ్మిది ప్రచురణలను తెచ్చిందని అందులో నేను నాలుగు పుస్తకాలు –ఆంద్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ,జన వేమన ,దర్శనీయ దేవాలయాలు ,శ్రీ హనుమత్ కదానిది రాశానని చెప్పాను .ఉగాది పురస్కారాలను మా తలి దండ్రులు గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గార్ల పేరిట అంద జేస్తున్నామని తెలియ జేశాను .మా ఊరి వాడు కొలచల సీతా రామయ్య రష్యాలో పేరు మోసిన శాస్త్ర వేత్త అని ,సూరి భగవంతం నెహ్రు గారికి సైంటిఫిక్ అడ్వైజర్ అని గుర్తు చేశాను .అలాగే ఆరిక పూడి ప్రేమ చాంద్ ఎన్నో దేశాలకు ఆర్ధిక సలహా దారులని చెప్పను .

         మాకు రెండు బ్ల్లాగులున్నాయని వాటి వివరాలు చెప్పాను .అవి బాగా ప్రాచుర్యం పొందాయని వివ రించాను .నేను నాకు జ్ఞాపకం ఉన్న మా ఉయ్యూరు విషయాలను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే పేర ‘’ నెట్లో’’ రాస్తున్నానని  ఇప్పటికి ముప్ఫై  రెండు ఎపిసోడులు రాశానని అన్నాను .ఇటీవల అందరికి తాము పుట్టి ,పెరిగిన గ్రామాలను గుర్తుకు చేసుకోవటం ,వాటికి సేవ చేయటం జరుగు తోందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ‘’మా ఊరు  ‘’అనే శీర్షిక లో ప్రముఖుల గ్రామాల విశేషాలను రాస్తున్నారని ,అలాగే ‘’ఉయ్యూరు ఊసులు ‘’శీర్షిక తో ఈనాడు దిన పత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్ లో ఉయ్యూరు వార్తలనుప్రచురించటం గమనింప దాగిన విషయమని ,దాని ప్రభావం అంతగా ఉందని చెప్పాను .

          ఊసులు అంటే కబుర్లు ,లేక జ్ఞాపకాల దొంతరలు అని వాటికీ సాహిత్య గౌరవం కల్పించామని,అందరు గొప్ప వారే కానవసరం లేదని సంఘటనలు ,ప్రభావాలు ఆత్మీయతలు గుర్తు చేసుకోవటమే నని అన్నాను . మా ఊసుల్ని చదివి ప్రముఖ క ధకులు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ,విహారి అమెరికా లోని ప్రేమ్చంద్ ,గోపాల కృష్ణ గార్లు (వీరిద్దరూ ఉయ్యూరు వారే )మెచ్చారని మొదటి ఇద్దరూ ఇలాంటి ప్రయత్నం తామూ చేద్దామని ఆలోచిస్తున్నామని చెప్పారని చెప్పాను .ఆ తర్వాతా నా మొదటి ఎపిసోడ్ ‘’అమ్మ బోణీ –నాన్న కాణీ ‘’ తో ప్రారంభించాను .అమ్మ బోణీ చేస్తే కూరగాయలన్నీ అమ్ముడు అవుతాయని ముందు మా ఇంటికి వచ్చే వారని కొన్నా కొనక పోయిన బుట్ట మీద చేయి వేయించే వారని ,అలానే నాన్న కానీ డబ్బు ఇచ్చినా ఊరంతా బాగా డబ్బులు లభిస్తాయని వేద పండితులు ,కూచి పూడి భాగవతులు మొదటిగా మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర డబ్బులు తీసుకొనే వారని చెప్పాను .ఆ తర్వాతా రవీంద్రుడు రాసిన ‘’కాబూలి వాలా ‘’ఆకారం లో ఉండే అత్తరు సాహేబు గారు ఉండే వాడని ఆయన అత్తర్లు సేన్ టు  మందార నూనె సురమా అగరు వత్తులు అమ్ముతూ మా ఇంటికి వచ్చే వాడని చూడ టానికి భయంకరం గా ఉండే వాడని  మనిషి మంచి వాడని ఆయన్ను ‘’మహాత్తర్ సాహెబ్ ‘’పేరుతో రాశానని చెప్పాను .నాకు రోజుకు కనీసం పది సార్లైనా ‘’అవు –పులి ‘’కధ చెప్పి నిద్ర పోయే ముందు మళ్ళీ చెప్పి నన్ను నిద్ర పుచ్చిన చిన్న మూతి ఉండే మా పాపాయి పిన్ని గురించి ‘’పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని ‘’రాశానని చెప్పాను .మా ఇళ్లకు ఇంజినీర్ గా సలహాలకు చాణక్యుడిగా ఉండే ‘’కొలచల శ్రీ రామ మూర్తి మామయ్యను కొలతల మామయ్యా గా రాశానని చెప్పాను .మా మామయ్యా గారింట్లో వేసవి కాలం లో వచ్చ్చే తద్దినాలను ‘’మామిడి పల్ల  తద్దినాలు ‘’అనే వాళ్లమని ,తిన్నన్ని  మామిడి పళ్ళు వేసే వారని విస్తళ్ళ పక్క అవి చిన్న గుట్టలుగా ఉండేవని ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిదు రోజులు ,ఒడుగులు నాలుగు రోజులు జరిగే వని  ఊరిలో బంధువు లందరికి రెండు పూటలా భోజనాలని వంట పూర్తీ కా గానే ఇంటింటికీ వెళ్లి’’ భోజనాలు- సిద్ధం రండి ‘’అని వెళ్లి చెప్పే ఆచారం ఉండేదిఎవరి మంచినీళ చెంబు వాళ్ళు తీసుకొని వెళ్ళే వారని గుర్తు చేశాను .లక్ష్మి అనే ఆమె ఫోన్ చేసి’’ చాలా మంచి జ్ఞాపకాలు’’అని అభినందించారు .ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు గురించి, అంతరించి పోయిన చేతి వృత్తుల గురించి ,వర్షం పడుతున్నా ,తుఫాను వచ్చినా రోజు రాత్రి ఎనిమిది గంటలకు శివాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొనే చంద్ర మౌళి ,సర్వేశ్వర రావు గార్ల్ గురించి ఉయ్యుర్లో యే మంచి పని కైనా ముందుండే మా నా న్న ,మామయ్యా ,చంద్ర శేఖర రావు ,సదాశివ రావు గార్ల గురించి ,మా గృహ వైద్య నారాయణులు అని మా డాక్టర్ల గురించి  ,దసరా ల్లో ఇంటింటికీ తిరిగి ‘’అయ్య వారలకు చాలు అయిదు వరహాలు ‘’అంటూ పిల్లలతో వచ్చే మేష్టర్ల గురించి ,ఆప్యాయతలు ,ఆదరాభిమానాలు గురించి ,గరిక పర్తి కోటయ్య దేవర అనే ప్రముఖ సంగీత విద్వాంసుడు హైదరాబాద్ నవాబును సంగీతం తో మెప్పించి ఆస్థాన విద్వాంసుడై ఆ తర్వాతా బందరు వచ్చి సంగీత విద్యాలయం నెలకొల్పి ఎందరికో ఉచితం గా సంగీతం నేర్పించి భోజనాలు కూడా ఏర్పరచిన విషయం చెప్పాను .ఆయన కుమార్తె ఉయ్యూరు లో ఇంటింటికీ వెళ్లి సంగీతం నేర్పేదని మా అక్కయ్యలిద్దరు ఆమె వద్ద నేర్చుకోన్నారని జ్ఞాపకాల దొంతర ను దిన్చేశాను . ‘’ అమెరికా ఊసులు ‘’అని కూడా మొదలు పెట్టి రాస్తున్నానని అందులో నుంచి కూడా రెండు ఎపిసోడులను అమెరికా ప్రెసిడెంట్ పియర్స్ గురించి చెప్పా ను ,ఆనాటి అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవెస్ ఆఫ్ గ్రాస్ ‘’అవిత ను ఎమర్సన్ మెచ్చిన విధానాన్ని ,తోరోగారు  గాంధీ గారికి గురువైన తీరు, శ్రీ శ్రీ కి ‘’అగ్గి పుల్లా ,సబ్బు బిల్లా కాదేది కవిత కనర్హం ‘’అని నేర్పింది విట్మన్  అని ఫ్రాంక్లిన్ గారు లింకన్ కొడుకు చని పోతే రాసిన ఉత్తరం మెమొరబుల్ లెటర్ గా ఉందని చెప్పాను ..టోరీ యువకులకు పిల్లలకు తగిన ప్రాతి నిధ్యం కల్పించాలని నాకు ఇంతటి మహత్తర ఆవ కాశం ఇచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియ జేశాను .ఇదీ టోరీ భేరీ కధా ,కమామీషు              

          నిన్న అంటే పదిహేడవ తేదీ ‘’ఫాదర్స్ డే ‘’.మా అమ్మాయి విజ్జి ‘’హాపీలు ‘’చెప్పి హల్వా చేసి అందరికి పెట్టి డే ని మరింత మదురం చేసింది . 

                   ఈ వారం లో చదివిన ముఖ్య పుస్తకాలు –jim bowie ,brante’s jane eyre ,laura ignal wilder ,sylvia erlie ,franklin pierse ,the greatest minda and ideas of all times ,a view of the ocean ,wyatt earp ,malcomx ,ruben blades ,the cherokees ,roger williams ,the conquest of alexander the great ,tortured noble tolstoi ,

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-6-12 –కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

స్వాతంత్ర పోరాటం లో నార్త్ కరోలినా


                                       స్వాతంత్ర పోరాటం లో నార్త్ కరోలినా

      బ్రిటీష వారి కబంధ హస్తాల నుంచి బయట పదాలని మొదట తీర్మానం చేసి ,మిగిలిన వారికి ఆదర్శం గా నిలిచినమొట్ట మొదటి కాలని నార్త్ కరోలిన .ఆ వివరాలే  ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .

   1771ప్రాంతం లో అమెరికా లో 13బ్రిటీష కాలనీలున్దేవి .అందులో నార్త్ కరోలిన ఒకటి .బ్రిటీష రాజు ఇక్కడ ఫ్రెంచ్ వారితోను ,అక్కడ మిగిలిన వారి తో పోరాటానికి కావలసిన డబ్బు ను అమెరికా లోని కాలనీ ల నుండి పిండుకొందామను కొన్నాడు .పార్లమెంట్ లో కొన్ని పన్నులు విధించే చట్టా న్ని చేశాడు .నార్త్ కరోలిన అసెంబ్లి దాన్ని తిరస్కరించింది .పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని తమపై పన్నులు వేయటం సరికాదని చెప్పింది ..మిగిలిన కాలనీలు అలానే పోరాడితే వెనక్కు తీసుకొన్నారు .అప్పుడు దొడ్డి దారిన స్టాంప్ చట్టం చేసింది .అమ్మకం ,కొను బడు ల కు స్టాంప్ లు కొని అంటించాలని దీని భావం .దీన్నీ వ్యతి రేకించారు .స్టాంపులను  బయటికి రాకుండా కాపలా కాశారు .ఆ నావ లన్నిటి ని వెనక్కి పంపించే  టట్లు తీవ్రం గా అన్ని కాలనీలు పోరాటం చేశాయి .దిగి వచ్చింది బ్రిటీష ప్రభుత్వం .ఆ తర్వాత ఎత్తు డ గా కొత్త పన్నులు వేసే పద్ధతి తెచ్చింది .మళ్ళీ తిరుబాటు బావుటా ఎగరేశారు .no taxation without representation ‘’అని నినదించారు .ఇక్కడి కాలనీ వాసులేవరికీ బ్రిటీష పార్ల మెంట్ లో సభ్యత్వం లేదు .బ్రిటీష వస్తువులను కొనడం ,అమ్మడం కూడా కాలనీలు బహిష్కరించాయి .మళ్ళీ దిగి వచ్చి తేయాకు తప్ప అన్నిటి మీదా పన్ను తీసేసింది ప్రభుత్వం .

               సమష్టి పోరాటం చేయాలని కాలనీలన్ని ఒక నిర్ణ యానికి వచ్చాయి .తమలో తాము సంప్రదిన్చుకోవటం ప్రారంభించాయి .committees of correspondence ఏర్పడ్డాయి .అప్పటికి అమెరికా లో కేంద్రీయ ప్రభుత్వం అనేది లేదు .అక్కడ బ్రిటన్ లో తేయాకు విప రిథం గా పండి ,మార్కెట్ లేక అమెరికా తెచ్చి అమ్మాలను కొంది .షిప్పు నిండా తేయాకు వచ్చింది మాసాచుసేత్స్ లో ని బోస్టన్ రేవుకు .1773లో బోస్టన్ పౌరులు ,mohawkఇండియన్లు కలిసి నావను రాత్రి పూట రహస్యం గా ఎక్కి 342పెట్టెల తేయాకు ను సముద్రం లో విసిరేశారు .దీన్నే ‘’బోస్టన్ టీ పార్టి ‘’అన్నారు .ఇలాగే మిగిలిన కాలనీ లలో ను చేసి బ్రిటీష వారికి శ్రుంగ భంగం కల్గించారు .దీనితో ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేబట్టి బోస్టన్ రేవు నుంచి వ్యాపారం చేయటాన్ని నిషేధించింది .

           కాలనీ వాసులలో ఏకాభి ప్రాయం సాధించి సంయుక్తం గా బ్రిటీష వారి పై పోరాడాలని సంకల్పించారు .దీని కోసం conti nental congres ను ఏర్పరచు కొన్నారు .అప్పుడు నార్త్ కరోలిన లో బ్రిటీష గవర్నర్ మార్టిన్ అనే వాడున్నాడు .నార్త్ కరోలిన ఆసెంబ్లీ ని సమావేశ పరచమని వాడిని కోరితేతిరస్కరించాడు .నార్త్ కరోలిన అసెంబ్లి కి మాత్రమే పన్ను విధించే హక్కు ఉంది కాని ,పార్లమెంట్ కు లేదు అని నిర్ద్వందం గా తెలిపారు వాడికి .ప్రతి కాలనీ కి ప్రతినిధులను ఎన్ను కొన్నారు .విలియం హూపర్ ,కస్వేల్ ,జోసెఫ్ హ్యూస్ లు నార్త కరోలినా ప్రతినిధులు .ఇక్కడి విషయాలను ఎప్పటి కప్పుడు రాజుకు గవర్నర్ తెలియ జేస్తున్నాడు .ప్రోవిన్సియాల్ కాంగ్రెస్ వాళ్ళు అప్పటికే రెండు సార్లు సమావేశమైనారు .సమావేశం జరుపు కొనే హక్కు తమకు ఉందని తెలియ జేశారు .రాజుకు విదేయులమే కాని ,అధికారము తమకివాలని స్వాతంత్రమే తమ లక్ష్యమని చెప్పారు .నార్త్ కరోలిన అసెంబ్లీ  ని సమావేశ పరచుకొని తమ కోరిక ను బలం గా చాటారు .వీళ్ళను దారిలోకి తెద్దాం అన్న అతని ప్రయత్నాలు ఫలించ లేదు .మసాచుసెట్స్ లో ప్రజలు రహస్యం గా ఆయుధాలు ,మందుగుండు సామాను సేకరించి భద్ర పరచారు .దీన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం సిద్ధ పడింది .కాపాడుకోవటానికి ప్రజలు సమాయత్తమైనారు .1775 april 18 న ఇరు వైపులా మోహరింపు జరిగింది .జనాన్ని చూసి పోలీసులు వారి పై కాల్పులు జరిపారు .ఇదిగో ఇప్పుడే బ్రిటీష వారితో యుద్ధం ప్రారంభమయింది .ముందు  కాలు దువ్వింది బ్రిటీష సైన్యమే ..దీన్నే ఎమర్సన్ మహా కవి ‘’ the shot heard –round the world ‘’అని కవిత్వీక రించాడు .ఈ వార్త నార్త్ కరోలినా కు ఆలస్యం గా చేరింది .

            1775 మే లో శార్లేట్ ,మేకేంస్ బర్గ్ వాసులు వీధుల్లోకి వచ్చి బ్రిటీష రాజుకు ఇంకా ఏమాత్రము అధికారం లేదని ,తమ దేశానికి బ్రిటన్ శత్రువు అని నినాదాలు చేశారు .అప్పుడు కాలనీ లలో మూడు వర్గాలున్దేవి .రాజుకు వ్యతి రేకుల్ని whigs అనీ ,అనుకూలుర్ని torees అనీ ఎటు తేల్చుకో లేని వారిని neautrals అన్నారు .ఇక్కడి గవర్నర్ మార్టిన్ కు థారు పుట్టి పెళ్ళాం ,పిల్లల్ని న్యూయార్క్ కొ తోలేశాడు .న్యు బెరిన్ లో కొన్ని ఫిరంగులు కాల్చటానికి ఉంచాడు .జనం వచ్చి పడుతున్నారని తెలిసి వాటిని నిర్వీర్యం చేశాడు .ప్రజలను రక్షించు కోవాలని నాయకులు భావించి ‘’committee of safety లను ఏర్పాటు చేసుకొన్నారు .పోరాడటానికి సైన్యాన్ని సమకూర్చుకొన్నారు .హిల్స్ బరో లో సమా వేష మై శామ్యుల్ జాన్స్టన్ ను ప్రిసైడింగ్ ఆఫీసర్ ను చేసి అందరు శాపదాలు చేశారు .విభేదాలున్నా ఇంకా రాజుకు విదేయులమే నని ప్రకటించారు యుద్ధ సామాగ్రి కొనటానికి డబ్బు ను సమకూర్చుకొనే ప్రయత్నాలు చేశారు .

          ఫిలడెల్ఫియా లో రెండో కాంటినెంటల్ కాంగ్రెస్ సభ జరిగింది .జార్జి వాషింగ్టన్ ను కమాదర్ చీఫ్ గా ఎన్ను కొన్నారు .కాంటినెంటల్ ఆర్మీ ఏర్పడింది .నార్త్ కరోలిన లో రెండు రిజి మెంట్లు జేమ్స్ మూర్ ,రోబర్ట్ హోవే నాయకత్వం లో ఏర్పడ్డాయి .సౌత్ కరోలిన లో ఉన్న చార్లేస్తాన్ గొప్ప ఓడ రేవు .దాన్ని స్వాధీనం చేసుకోవటానికి సైన్యాన్ని పంపమని గవర్నర్ మార్టిన్ రాజుకు రాశాడు .కారణ వాలీస్ తో ఒక దళాన్ని ,హెన్రీ క్లింటన్ తో ఒక దళాన్ని రాజు పంపాడు .వారిద్దరూ వచ్చి నార్త్ కరోలినా నే చాల సమస్య అని నిర్ణయించారు .ఇక్కడ హోలిఫాక్స్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పరచు కొన్నారు .తమకు తాము స్వాతంత్రం పొంది నట్లుగా ప్రకటించుకొన్నారు .ఇలా నార్త్ కరోలిన మిగిలిన కాలనీలకు మార్గ దర్శక మై ముందు నిలి చింది .హాలి ఫాక్స్ లో కాంగ్రెస్ మళ్ళీ 1776 ఏప్రిల్ పన్నెండు న సమావేశమై  స్వాతంత్రాన్ని ప్రకటించింది .తర్వాత వర్జీనియా ,ఆ తర్వాత మిగతా కాలనీలు ఆ పని చేసి తామంతా విముక్తులం అని ప్రకటించే శాయి .ఇక రాజు కు తమ పై పెత్తనం లేదని చెప్పే శాయి .అందరికి కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొన్నారు .declaration of inde pendence ను 1776 july 4న ప్రకటించారు .ఆ తేదీ యే ఇప్పటి ఫార్మేషణ్ డే .

 న్యూయార్క్ లో జార్జి వాషింగ్టన్ బ్రిటీష రాజు విగ్రహం తలను కిందికి లాగి పడేశాడు .బుల్లెట్లతో మసి చేశాడు .ఈ డిక్ల రేషన్ నార్త్ కరోలినా చేరటానికి రెండు వారాలు పట్టింది .హాలిఫాక్స్ లో సమావేశమై1776 august 1 న ఆ డిక్లరేషన్ ను ప్రజలందరికి చదివి విని పించారు .అలానే మిగిలిన చోట్లా చదివారు .అన్ని కాలనీలు ఆ పని చేసి స్వాతంత్రాన్ని ప్రకటించు కొన్నాయి .దీనికి ముందు దారి చూపింది మాత్రం నార్త్ కరోలినా అని నిస్సందేహం గా చెప్ప వచ్చు. ఆ తర్వాత బ్రిటీష ప్రభుత్వం యుద్ధం చేసి లొంగ దీసుకొనే ప్రయత్నాలు చేయటం కారన్ వాలీస్ అన్ని యుద్ధాల్లో పరాజితుదవటం చివరికి జార్జి వాషింగ్టన్ అనే కమాన్దరిన్ చీఫ్ కు లొంగి పోవటం వరుసగా జరిగి పోయాయి  ఈ యుద్ధాలలో అనేక యువకులు సమర్ధులైన నాయకులు బలి పోయారు . ‘’. north  carolina and most of the colanies won inde pendence by fighting a war against britan with practically with an empty treasury .  ‘’   అంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా నార్త్ కరోలినా తో బాటు అనేక కాలనీలు బ్రిటీష వారి తో యుద్ధం చేసి తమ స్వాతంత్రాన్ని సంపాదించుకొన్నాయి. నార్త్ కరోలినా ప్రజలకు ,వారి త్యాగాలకు ,పోరాట పటిమకు స్వాతంత్ర కాంక్షకు  బలిదానానికి జోహార్.          

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-6-12-కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –10 యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్

       సిద్ధ యోగి పుంగవులు –10

                                                                యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్

           మహారాష్ట్ర నుంచి కొందరు యోగి పుంగవులు హైదరాబాద్ వచ్చి సిద్ధి పొంది ఇక్కడి మత మౌధ్యాన్ని న్ని పెకలించి ,సామాజిక ధార్మిక రంగాలలో చైతన్యం తెచ్చారు .అలాంటి వారిలో కేశవా స్వామి ప్రముఖులు .ఆయన భాగ్య నగర వాసి అని తెలియ జేయటానికి కేశవా స్వామి భావ నాగర్కర్ అంటారు .

    చత్రపతి శివాజీ మహా రాజు కు గురువు లైన అయిదుగురు మహాత్ములున్నారు .వారే సమర్ధ రామ దాస స్వామి ,జయరామ స్వామి వరగాన్కర్ ,రంగ నాద స్వామి నిగిదీ కర ,కేశవా స్వామి భాగా నాగర్కర్ ,ఆనంద మూర్తి బ్రహ్మ నాలాకర్ –వీరిని సమర్ధ పంచాయతనం అంటారు .

     కేశవా స్వామి మహారాష్ట్ర లో నీలంగా దగ్గర కళ్యాణీ నగరం .ఇప్పుడు అది కర్నాటక లోని బీదర్ లో ఉంది .అక్కడ రుగ్ శాఖ కు చెందినా గంగా బాయి ,ఆత్మా రామ్ దంపతు లకు గంగా బాయి 80 వ ఏట పండరి నాధుని అనుగ్రహం తో కేశవా స్వామి జన్మించారు .అయిదేళ్ళ వరకు మాటలు రాలేదు .అప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారు  బాలుడి చెవిలో  మంత్రం చదివి, శిరస్సు పై చేతి ని ఉంచారు . బాలుడి వైఖరీ వాక్కు బయట పడింది .మాటలు ఊతల్లాగా ప్రవహించాయి .ఉపనయనం చేశారు .వివాహము జరిగింది .కానీ విరక్తుడు గానే ఉండే వాడు .కాశీ రాజ స్వామి అనే గురువు వద్ద దీక్ష తీసుకొని ,భక్తీ ,వేదాంత ప్రచారం చేశాడు .దేశాటనం చేస్తూ చివరికి భాగ్య నగరం అనబడే మన హైదరాబాద్ కు వచ్చాడు .ఆయన బోధనలకు ముస్లిం లు కూడా ఆకర్షితు లై భక్తులయ్యారు .

             ప్రపంచ జీవితం గడుపుతూ కూడా ,పారమార్ధికం గా జీవించిన సత్పురుషుడు కేశవ స్వామి .సమర్ధ రామ దాస స్వామిని కలిశాడు .సమర్దునితో కేశవ స్వామి ‘’నువ్వు సాధువై ఉంది కూడా స్త్రీ కి భయ పది పారి పోయావా ? మాయకు సంసారానికి భయ పడ్డావా ?’అని ప్రశ్నించాడు .అంటే సంసార జీవితం గడుపుతూ నిస్సంగం గా ఉండాలని భావం .వేదాంత విషయాలను సు స్పష్టం గా జనాలకు అర్ధ మయ్యే భాషలో చెప్పటం కేశవ స్వామి ప్రత్యేకత .’’శరీరం రోలు .మనస్సు రోకలి .ఆ రోకలి తో జీవ భావాన్ని దంచి ,పిండి కొట్టాలి .జ్ఞానం అజ్ఞానం అనే ఊకను తొలగించి ,శుద్ధ రూపం అయిన పిండి ని  గ్రహించాలి ‘’అని బోధించే వారు .

           ఆ రోజుల్లో హైదరాబాద్ లో హిందువులను ‘’కాఫిర్లు ‘’అనే వారు .అడుగడుగునా హిందువులకు అవమానం జరిగేది .స్వామి ముస్లిముల ను బాగా ఆకర్షించటం వల్ల స్వామి ధర్మ ప్రతిష్ట బలం పుంజు కొన్నది .హిందువులు కాని వారిలో హిందూ ధర్మం పట్ల ఆదరాన్ని కల్గించటం ,హిందువులకు తాము పాటిస్తున్న దానిలో సత్య స్వరూపం ఏమిటో తెలియ జేసి అందర్నీ ఆకట్టు కొన్నారు .పాండురంగని భక్తీ ఆయన కు సర్వ విధాలా తోడ్పడింది .షాహ తురాబ్ అనే సూఫీ కవి స్వామి ప్రభావానికి గురై శిష్యుడైనాడు .’’రామ దాసును ,కేశవా స్వామిని ఎప్పుడు చూస్తానో ,ణా దుఖాన్ని ఎప్పుడు పోగొట్టు కొంతానో ‘’అని వాపోయాడు .ఈ సూఫీ కవి సమర్ధ రామ దాస స్వామి రాసిన ‘’మనాచే శ్లోక ‘’అనే భుజంగ ప్రయాత శ్లోకాలను ‘’మాన్ సంజ్హావన్ ‘’పేరు తో అనువాదం చేశాడు .

 

         కేశవ స్వామి హిందువులకు అనుష్టాన వేదాంతాని బోధించాడు .సమర్ధులు మహారాష్ట్ర లో చేసినట్లు కేశవులు హైదరాబాద్ లో ప్రేరణ కల్గించారు .భక్తీ మార్గాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేశారిద్దరూ .పండిత సదా శివ ఖండో ఆల్తేకర్ ‘’సమర్ధ రామదాస చరిత్ర ‘’రాశాడు .అందు లో స్వ్మికి కేశవునికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల విషయం చక్కగా వివరించాడు .ఆత్మారాం మహా రాజు కేశవా స్వామిని ‘’యోగాధ్య బాలీ’’అని తన ‘’దాస విశ్రామ ధామ ‘’అనే గ్రంధం లో పేర్కొన్నాడు .కేశవా స్వామి ముకుంద రాజ సంప్రదాయానికి చెందినా వారు గా చెప్పు కొంటారు కాని స్వామి ఎక్కడా చెప్పు కొ లేదు .కాని ఆయన ముకుంద రాజ సంప్రదాయం ,వార్కరీ సంప్రదాయం ,సమర్ధ సంప్రదాయాలను మూదిటినీ మేళవించి ప్రచారం చేశాడు ఈ మూడు సంప్రదాయాల త్రివేణీ సంగమమే కేశవ స్వామి .జ్ఞాన దేవుని వంటి గొప్ప యోగి అయినా కేశవా స్వామి భాక్తి మార్గం లో నే నడిచాడు .ఆత్మా సాక్షాత్కారం పొందిన మహా యోగి కేశవా స్వామి .

               కేశవా స్వామి మరాఠీ ,హిందీ భాషల్లో అనేక అభంగాలు ,పదాలు  రచనలు రచించాడు .రాగ నిర్దేశం చేసి రాసిన 850పదాలు అచ్చైనాయి .’’శ్రీ కేశవ స్వామి ఛీ కవితా ‘’అనే ఆధ్యాత్మిక శ్రుంగార గేయాలు జయదేవుని గీత గోవిందాన్ని తలపిస్తాయి అన్నారు .అనేక ప్రహేళికలు రాశాడు .వీటికి అద్భుత మైన అంతరార్ధం ఉంటుంది .మహా రాష్ట్రలో వాటిని ‘’కూట  రచనలు ‘’అంటారు .కేశవుడు రచించిన 2700శ్లోకాలు ,231పదాలు ‘’దులియా’’లో శంకర కృష్ణ దేవ్ గారి ‘’సమర్ధ వాగ్దేవతా మందిరం ‘’లో అముద్రితం గా ఉండటం శోచనీయ మైన విషయమే .

          ఒక సారి సమర్ధ పంచాయతనం కృష్ణా నది దాటటానికి వచ్చారు .వరద ఉధృతం గా ఉంది .యోగా శక్తి తో దాటాలని భావించారు .సమర్ధ రామ దాస స్వామి హనుమత్ స్తోత్రం చేసి ఆయన్ను ప్రత్యక్షం చేసుకొని కృష్ణ ను దాటారు .మిగిలిన ముగ్గ్గురు తమ ఇష్ట దైవాలను ప్రసన్నం చేసుకొని దాటే షారు .కాని కేశవ స్వామి అక్కడ ఉన్న పదవ వాడికి పావలా డబ్బు లిచ్చి నదిని దాటాడు .ఆయన్ను చూసి మిగిలిన నవ్వురు నవ్వారు .అప్పుడు కేశవా స్వామి ‘’చిన్న చిన్న పనుల కోసం ఉపాసించే దేవుళ్ళను కష్ట పెట్టటం మంచిది కాదు .మీరు మీ యోగా శక్తులతో నదిని దాటారు .నేను పావలా ఇచ్చి నదిని దాటాను .ణా దృష్టి లో మీ యోగా శక్తి ణా పావలా కంటే ఎక్కువేమీ కాదు .భక్తుని ముక్ష్య లక్షణం స్వాత్మానుభావం ,నిష్కామ భక్తీ ‘’అని తెలిపి వారిని ఆలోచన లో పడేశారు .

    హైదరాబాద్ లో స్వామి ఒక సారి హరికధ చెప్తున్నారు .భక్తీ పారవశ్యం లో తాను మునిగి ,శ్రోతలకూ ఆ అనుభూతి కలిగిస్తున్నారు .ఒక ముస్లిన్ వస్తాద్ కూడా వచ్చాడు .అక్కడే గోడకు రాదా కృష్ణుల పాఠం ఉంది ..అందులో రాధ చేతి లో తమల పాకు ఖిల్లీ ఉంది .వాడు పిచ్చి గా ఊగి పోతు ‘’ఆ చిత్రం లోని రాధ కృష్ణుని చేత ఖిల్లీ టిని పిస్తే నువ్వు చెప్పెహరికద నమ్ముతా .లేక పోతే ఇక్కడున్న వారందరి దగ్గరా తలో వంద రూపాయలు వసూలు చేస్తాను ‘’అని స్వామితో చెప్పి తలుపులు మూసి రుబాబు చేశాడు .అందరు భయ పది పోయారు .స్వామి మనసారా శ్రీ కృష్ణుని ధ్యానించి ‘’యది ఆప్కో హో కదావోం మె ప్రీతీ –బతాలో చమత్కార్ దిఖావో ప్రచీతి ‘’అన్నారు అంటే ‘’కృష్ణా ౧ నీ కధల్లో నీకు ఇష్టం ఉంటె సాక్షాత్కరించి ,చమత్కారం చెయ్యి ‘’అని అర్ధం కృష్ణ నామ స్మరణ చేశారు,చేయించారు .ఒక్క సారిగా మెరుపు మెరిసింది .శ్రీ కృష్ణుని నోటిలో రాధ ఇచ్చిన కిల్లీ కణ పడింది ‘’ఈ అద్భుతం చూసి పఠాన్ కాళ్ళ మీద పది క్షమా భిక్ష వేడాడు .స్వామి అనుగ్రహించారు .స్వామి శిష్యుడైపోయాడు వాడు .

        ఒక సారి సుల్తాన్ కేశవ స్వామి ని  అందరి తో బాటు విందుకు ఆహ్వానించి అందరికి మాంసం వడ్డించే ఏర్పాటు చేశాడు ‘’అందరి లో ఉన్న ఆత్మా ఒక్కటే నంతారుగా మీరు .మరి  ద్వంద్వ భావం లేకుండా ఈ భోజనం ఆరగించండి ‘’అని పరీక్ష పెట్టాడు .కేశవా స్వామి సందేహం లో పడ్డాడు .వరాహావ తారాన్ని ధ్యానించారు .వెంటనే చిన్న పండి పిల్ల అక్కడ ప్రత్యక్ష మై ఆయన పళ్ళెం లో ఉన్న మాంసాన్ని తినేసింది .తురకలకు పండి అంటే అసహ్యం .సుల్తాన్ స్వామితో’’ ఇదేమిటి ఇలా చేశారు ?’’అని అడిగితే ఆయన ‘’ఆత్మా భేదానికిఅతీత మైంది .మీకూ మాకూ భోజనం చేయటం లో ఎలాంటి సంకోచం ఉండ రాదు ‘’అని సమాధానం చెప్ప్పారు .సుల్తాన్ కు శ్రుంగా భంగమై తల దిన్చుకొన్నాడు .

      మరో సారి కేశవా స్వామి భజన చేస్తుంటే ,దేవుడి మేడ లో ఉన్న పూల దండ ఈయన మేడ లో పడింది .ఇంకోసారి స్వామికిచ్చే ప్రసాదం లో ‘’వస నాభి ‘’కలిపారు దుష్టులు .అనడరు తిన్నారు .ఎవరికి ఏమీ కాలేదు .కాని దేవుడి విగ్రహం నీలం రంగు గా మారింది .మరోసారి స్వామి భజన చేస్తుంటే ఆయన భుజం మీద బాల కృష్ణుడు ఉన్నట్లు ఒక ముస్లిం భక్తుడికి కన్పించింది .అంటే సర్వ కాల సర్వావస్థలాలో శ్రీ కృష్ణుడు కేశవ స్వామి వెంట ఉన్నాడని అర్ధం అవుతోంది .కేశవా స్వామి1610 లో జన్మించారని భావిస్తారు . 1-1-1683 దుందుభి నామ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి సోమ వారం హైదరా బాద్ లో’’ ము చికుండా నది’’అయిన  మూసీ నది ఒడ్డున మహా  సమాధి చెందారు ఇప్పుడిదికేశవా నగర ,జియాజి గుడా –హైదరాబాద్ లో  మహా భక్తీ కేంద్రం గా వర్ధిల్లు తోంది  .

 మరో యోగి కధ మరో సారి —

    సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-6-12.—కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –9 బ్రహ్మ జ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి

   సిద్ధ యోగి పుంగవులు –9

                                             బ్రహ్మ జ్ఞాన యోగి –బ్రహ్మ స్వామి

      జన్మ జన్మల సంస్కారం సాధన ,ఉత్తమ గురు శిష్యరికం ,తపస్సు ఒక పశువుల కాపరి ని బ్రహ్మ జ్ఞాని గా రూపొందించాయి .ఆయనే లింగాల దిన్నె బ్రహ్మ స్వామి .

         తమిళ నాడు లో సేలం లో నుదురు పాటి లక్ష్మీ నరసయ్య కు  1820 లో జన్మించారు .అసలు పేరు నరసయ్య . చిన్నప్పుడే గున్నమ్మ తో వివాహమైంది .బర్రెల కాపరి గా బతికారు .పదిహేనేళ్ళ వయసు లో సేలం కొండ పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్స వాలకు వెళ్లి ఒక గుహలో యోగుల దర్శనాన్ని పొంది ,శ్రీ లక్ష్మీ నృసింహ మహా మంత్రాన్ని ఉపదేశం పొంది ,ఆయన అనుగ్రహం తో కళ్ళు మూసి తెరిచే లోపు కాశీ వెళ్లాడు నరసయ్య .ఎంత వెదికినా నరసయ్య కని పించక పోయే సరికి చని పోయాడని అనుకోన్నారంతా .కాశీ లో కడప జిల్లా కంబాల దిన్నె వాసి అచ్చన సోమయాజి కని పించి ,చదువు నేర్పిస్తానని తీసుకొని వెళ్లి గోడ్లకాపరిగా ,కూలీ గా ,మంచి నీళ్ళు మోసే వాడిగా అరవ చాకిరీ చేయించాడు కాని చదువు నేర్పించనే లేదు .ఏదైనా పెడితే తినటం .లేక పోతే పస్తు గా గడిపాడు నరసయ్య .పిచ్చి నరసయ్య అని అందరు పిలిచే వారు ..ఒక రోజు మిద్దె మీదఅం అందరి తో బాటు  పడు కొన్నాడు .కుంభవృష్టి కురిసింది .అందరు కిందకి దిగి వెళ్లి పోయారు .నరసయ్యను మర్చి పోయారు .తెల్ల వారి వచ్చి చూస్తె అతను పడుకొన్న భాగం లో చుక్క నీరు కూడా పడక పోవటం గమనించి అందరు ఆశ్చర్య పోయారు .పిచ్చి నరసయ్య ను   మహాయోగి గా గుర్తించి మర్యాద చేశాడు యజమాని .

          ఎవరికి చెప్ప కుండా బెస్త వారప్పేట చేరి త్రిపురారి భట్ల బుచ్చి వెంకట దీక్షితుల వద్ద విద్యార్ధి గా చేరి ఏదో కొంత నేర్చాడు .మంచి గొంతు  తో అలోకగా పాడే వాడు .తన తండ్రి ఆబ్దికం అని చెబితే దీక్షితులు పట్టించు కొ లేదు .కోమటి గురుమూర్తి తద్దినానికి కావలసిన పదార్ధాలన్నీ అంద జేశాడు .అప్పట్నించి రోజు  నరసయ్యకు కావాల్సిన అన్ని పదార్ధాలు దీక్షితుల ఇంటికి పంపుతూ ,ఆయన వద్ద రామాయణాదులు చెప్పించుకొని వినే వాడు ..పిచ్చి నరసయ్య గా ముద్ర పడింది .ఒక సారి ఒక వేశ్యను ఉసి గొల్పి నరసయ్య వద్దకు పంపారు .అతని జితెన్ద్రియత్వానికి జోహారు చెప్పి పాదాక్రాంతు రాలైన్దామే .మ్మరో సారి కంబం తీసుకొని వెళ్లారు .వేశ్యల ఇళ్ళ ల్లో వదిలారు .ఆయన ముసుగు తనని పడుకొంటే ఆయన్ను బలాత్కారించాతానికి వచ్చిన వేశ్యలకు ,ఆయన ముసుగు ను తొలగిస్తే అయిదు తలల నాగు పాము కనిపించి భయ పది పోయారు .కాళ్ళ మీద పది క్షమా భిక్ష వేడుకొన్నారు .అప్పటి నుంచి నరసయ్య బ్రహ్మ స్వామి గా ప్రసిద్దుదయాడు .

             భీమ గుండం చేరి సూర్య గ్రహణం రోజున గుండా స్నానం చేయటానికి వెళ్లి అందులో మునిగి పోయాడు .నరసయ్య ఎంతకూ రాక పోయేసరికి మునిగి చని పోయాడని అనుకొన్నారు ..మరుసటి ఏడాది సూర్య గ్రహణం నాడు అందరు గుండానికి స్నానానికి వెళ్తే నీటి పై పద్మా సనం లో బ్రహ్మ స్వామి కని పించి ,ఆశ్చర్య పడేశాడు .అప్పటి నుంచి ఆయన భక్తులు పెరిగి అడుగులక్కు మడుగు లోట్టారు .విందు భోజనాలు ఏర్పాటు చేసే వారు .పెండ్లి లో లాగా నలుగు పాటలు ,బువ్వం బంతి పాటలు ,శోభనపు పాటలు మొదలైనవి పాడే వారు ..ఆ పాటల్లో ఆయన్ను ‘’సత్య పూరి వాసి ‘’అని పొగిడే వారు .మార్కాపురం తాసీల్దారు ఆయన్ను మేనా లో తీసుకొని వెళ్తుండగా ,మద్య లో మాయమై ,గుండ్ల కమ్మ నది లో స్నానం చేస్తూ కన్పించాడు .అక్కడికి వెళ్లి ఇంటికి తెసుకు వెళ్లారు .

         ఒక శివ రాత్రికి భక్తులు కొందరు తమతో శ్రీశైలానికి ,కొందరు మహా నందికి ,కొందరు కాల హస్తి కి రమ్మని ఆహ్వానించారు .అలానే అని చెప్పి ఆయా క్షేత్రాలలో వారితో స్నానం చేసి నట్లు కని పించి అందర్ని సంతృప్తి పరిచారు .స్వామికి ముప్ఫై ఏళ్లు వచ్చాయి .ఒక సారి వత్తు మడుగు నుండి ,తిమ్మ రాజు పల్లె కు శిష్యులతో బయల్దేరారు ..మార్గ మాధ్యమ లో కుమ్భావ్రుస్తి కురుస్తోంది .అందరు భయ పడ్డారు .తన వెన కాలే నడవమని చెప్పారు .వారికి ఫర్లాంగు దూరం అవతలే వర్షం పడింది కాని వీరి మీద ఒక్క చినుకు కూడా పడలేదు .బెస్త వాణి పేట లోని సుందరమ్మ అనే ఆమెకు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రంగం వెళ్లాలని కోరిక పుట్టి స్వామికి తెలియ జేసింది .ఆయన తన అంగ వస్త్రాన్ని పరచి ,ఆమె ను అందులో కూర్చోమని చ,కండ్లు మూసు కోమని చెప్పి ,మరుక్షణం శ్రీ రంగం చేర్చాడు .అక్కడ తన తోటి వారందరి తో రంగ నాదున్ని దర్శించి ,ద్వాదశి పారణకు స్వస్థలం చేర్చి మహిమ ప్రకటించారు స్వామి .

            బ్రహ్మ స్వామి భక్తుడు కరి బసప్ప లింగ దారి .స్వామిని తన గ్రామం లో స్వామిని ఊరేగించాలని ఆశ పడ్డాడు .అలానే పల్లకి లో తీసుకొని వెళ్లి ఊరి బయట విడిది చేయించి ,మేళ తాళాలతో ఊర్లోకి తీసుకు వెళ్ళ టానికి తోడి లింగ దారులన్దర్నీ రమ్మన్నాడు .వారెవరికి ఇష్టం లేదు లింగ దారి కాని వాడికి ఈ సత్కారాలేమట ని విసుక్కొని ,అలా చేస్తే వెలి వేస్తామని బెదిరించారు .స్వామి తన శిష్యుడికి వచ్చిన కష్టం తెలిసింది .వెల్దుర్తి లోని లింగ దారు లంతా భోజనాలకు ముందు తమ లింగ కాయలు తెరిస్తే అందులో లింగాలు కనపడ లేదు ..అప్పుడు స్వామి మహిమ తెలుసు కొని కాళ్ళ మీద ప డి  ,బ్రహ్మాండం గా ఊరేగించి సత్కరించారు .ఆ ఊర్లో ప్రచండ శాక్తేయుడు మంత్రగాడు యాదాటి పాపయ్య ఉండే వాడు .సన్మాన సభకు వచ్చాడాయన .మనస్వామి ఆయన కు నమస్కరించ నందుకు  కోపం వచ్చి స్వామి పై అనేక దుష్ట ప్రయోగాలు చ్చేశాడు .అతి క్రూర మైన ‘’దూమావతి ‘’ని కూడా ప్రయోగించి విఫలుడైనాడు .మర్నాడు ఉదయం పాపయ్య స్వామి కాళ్ళ మీద పది క్షమించమని కోరాడు .తనకూ తుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు .స్వామి దగ్గరుండి ,ఆ అమ్మాయికి మేనరిక వివాహం జరిపించారు .

                            స్వామి గొప్ప తనం విన్న పుష్ప గిరి పీతాది పతి శ్రీ శంకర భారతీ స్వాములు ,తమ ఆస్థానానికి రప్పించు కొని ‘’తూగుటుయ్యాల ‘’పై ఊరేగించి సంభాషణం చేశారు .నంద్యాలలో ఖాదర్బాదరు వెంకట్రావు ఇంట్లో కొన్నాళ్ళుండి ,వారి బాధలు పోగొట్టి బంగారు పాదుకలు అనుగ్రహించారు .తొడుగు పల్లె అగ్రహారం లో బ్రహ్మ సత్రం చేశారు .అక్కడ ఒక బావి ని తవ్వించి ఆబావి నీటి ని ‘’కాశీ గంగ ‘’అన్నారు .ఇప్పటికి ఆజలాన్ని గంగ గా భావిస్తారు జనం .రాయ ప్రోలు సుబ్బయ్య ఇంటికి ఒక సారి వెళ్లగా భక్తుల కోరిక పై గాలిలో తేలుతూ ఇల్లంతా తిరిగి అం దారని ఆశ్చర్య పరిచారు .నూక రాజు పుల్లయ్య సంతానార్ధం స్వామిని వేడు కొన్నాడు .పుల్లయ్య పై గిట్టని వాళ్ళు సర్ప ప్రయోగం చేయించారు .పెద్ద కొండ చిలువ అంత నాగు పాము వచ్చి స్వామి సన్నిధి లో వాకిట్లో ఏమీ చేయలేక వాకిలికి అడ్డం గా పడు కొంది .స్వామి గడ్డి పరక ను మంత్రించి దాని పైన వేస్తె చచ్చ్చి పోయింది

                  అచ్చమ్మ అనే భక్తురాలు స్వామిని ద్వాదశ పారణకు చాలా సార్లు ఆహ్వానిస్తే వస్తాను ,వస్తాను అని దాత వేస్తుండే వారు .మరోసారి ఆమె ప్రార్ధిస్తే ఒక సారి పారణ రోజున నల్లని వ్యక్తిగా వచ్చి భోజనం చేసింది తానే నని చెప్పారు .ఆమె కంచి గరుడ సేవ చూడా లని కోరితే ఉత్తరీయం లో మూట గట్టి చూపించి తీసుకొని వచ్చారు .దేవతార్చన లో పెట్టు కోవటా నికి భక్తులకు అనేక పాదుకలు ఇచ్చారు .ఆయన అనేక భాషల్లో సంభాషించే వారు .కనిగిరి తాలూకా రామ పురం నివాసి పద్మ నాభుడు  స్వామికి అనన్య భక్తుడు .సేవ బాగా చేసే వాడు .కాని మూగ .అతనితో’’ రామ’’ అ  ని పించి ,తరువాత’’ రామ రామ’’ అని పించి మాటలు వచ్చేట్లు చేశాడు .ఒకసారిస్వామికి కడుపు నొప్పి విపరీతం గా ఉన్నప్పుడు శిష్యులు విందు భోజనానికి బలవంతం చేశారు ..తమ యోగా దండాన్ని కడుపు కు తగిలి ఉండేట్లు చేసి భోజనం చేశారు .ఆ బాధ అంతా దండం అను భావిన్చేట్లు చేశారన్న మాట .

           పుష్ప గిరి అధిపతులు భారతీ స్వాముల నిర్యాణం తర్వాతా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి పీథాది పతి అయారు .ఆయన్ను బ్రహ్మ స్వామి మీద చర్య తీసుకోమని ఒత్తిడి తెచ్చారు .బహిష్కార పత్రం పంపారు .బ్రాహ్మణ్యం బహిష్కారాన్ని సమర్ధించలేదు .బ్రాహ్మణుల గురు ధిక్కారానికి అలిగి కోపించి ప్రాయశ్చిత్తం జరిగే దాకా చంద్ర మౌళీశ్వర స్వామికి నివేదన చేయను అని పట్టు బట్టారు .స్వామికి ఇది తెలిసి తన వల్ల బ్రాహ్మణులు ఇబ్బంది పడటం ఇష్టం లేక ఔకు ను వదిలి జమ్మల మడుగు వెళ్లారు .అడిగిన వారందరికి దగ్గరుండి ఒడుగులు ,పెళ్ళిళ్ళు ,ప్రతిష్టలు స్వామి జరి పించే వారు .ఒక సారి కట్టిన ధోవతి మళ్ళీ కట్టు కునే వారు కాదు .మైల వరపు నరసింహా రావు అనే ఆయన తిరుపతి వెళ్తూ కడప లో స్వామిని దర్శించటానికి వెళ్లాడు .’’నిన్ననే నీ మొక్కు వెంకటేశ్వర స్వామికి చెల్లించారు ‘’ అని స్వామి చెప్పగా ఆశ్చర్య పడి తన ముడుపును స్వామి సన్నిధి లోనే ఉన్న అగ్ని హోత్రం కృష్ణ మాచార్యుల వారికి సమర్పించి  తిరుపతి వెళ్లాడు .తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆయన  కు కలలో కన్పించి ‘’నీ మొక్కు కడప లోనే నిన్న తీరి పోయింది ‘’అని చెప్పాడు .అప్పటి నుంచి తిరుపతి మొక్కులు స్వామి సన్నిధి లోనే సమర్పించు కొనే సంప్రదాయం ఏర్పడింది .’బ్రహ్మ స్వామి 32లక్ష్మీ నృసింహ బంగారు కప్పు తో ఉన్న  సాలగ్రామ మాలను ధరించే వారు .కనుక అవిచ్చిన్నం గా అన్నదానం జరిపే వారు తమ సాలగ్రామాలను తమ తర్వాతా ధరించే యోగ్యుని కోసం వెతుకుతూమహా దేవ పురం లో  నిరతాన్న దానం జరుపు తున్న అనుముల వెంకయ్యకు ఇచ్చారు ..ఆయన బంగారు కప్పులు స్వామి కే ఇచ్చి ,రాగి కప్పులు వేయించి అర్చన చేసే వాడు . ఒక రోజు మంగళ హారతి సమయాన సాలగ్రామాలన్ని పట ,పటా పగిలి పోయాయి .వాటిని మహానందిలో కలిపేశాడు వెంకయ్య ..అనేక మంది కవులు ,రచయితలు ,పండితులు రచనలు చేసి స్వామికి అంకిత మిచ్చారు .

             తాను దేబ్భై అయిదేళ్లకు దేహం చాలిస్తానని తెలియ జేశారు స్వామి .ఎవరికి వారు తమ గ్రామం లో దేహం చాలించమని కోరుకున్నారు .కాని ఆయన లింగాల దిన్నె చేరి సన్య సించి  ‘’సదాశివ సిద్ధ యోగేశ్వర స్వామి ‘’పేరు తో ‘’పరివ్రాట్టు లు ‘’అయి ,.13-10-1889 అమావాస్య నాడు’’ బ్రహ్మ రంధ్రం చేదించుకొని’’ పరమాత్మ లో కలిసి పోయారు .ఇప్పటికీ ఆ ప్రాంతం లో స్వామి భక్తుల మనో భీష్టాలను నేర వేరుస్తూనే ఉన్నారు .11-2-1926 మహాశివ రాత్రికి స్వామి జీవిత చరిత్ర రాసిన మద్దుల పల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానందికి వెళ్ళ దలచి డబ్బు లేక ఉండి పోయారు .గారడీ వాడి వేషం లో స్వామి స్వప్నం లో కని పించి కావాల్సినంత ధనం ఇచ్చి యాత్ర చేయించారు .అందుకే బ్రహ్మ స్వామిని ‘’భక్త కల్పద్రుమం ‘’అంటారు .

                  మరొకద మరో సారి

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-12—కాం

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

నాటి వుయ్యలురే నేటి వుయ్యూరు

నాటి వుయ్యలురే నేటి వుయ్యూరు

Posted in సేకరణలు | Tagged | 2 Comments

సిద్ధ యోగి పుంగవులు –8 హథ యోగి బ్రహ్మానంద సరస్వతి స్వామి

  

   సిద్ధ యోగి పుంగవులు –8

 

                                                 హథ  యోగి బ్రహ్మానంద సరస్వతి స్వామి

 

       కృష్ణా జిల్లా విజయ వాడ దగ్గర పటమట లో 27-9-1863న గోవింద రాజు రాఘవయ్య ,తిరుమలాబకు జన్మించారు .పానకాలు అని పేరు పెట్టారు .యనమల కుదురు వాస్తవ్యులు గోవింద రాజు సీతమ్మ ,నరసింహా రావు దంపతులు దత్త పుత్రుని గా స్వీకరించారు .రామప్ప అని పిలిచే వారు .బందరు లో చదివారు .గాయత్రి ,శివ పంచాక్షరి ,రామ శాడ క్షరి వగైరా లను దీక్ష గా జపించారు .పెంపుడు తలి దండ్రులు చని పోయారు .దేశ యాత్రలు చేస్తూ శ్రీ శైలం చేరి ఒక బాబాజీ సత్సంగం పొంది ,లోక జ్ఞానం పొందాడు .సాదు ,సత్పురుషులను సేవిస్తూ కాలం గడిపాడు .గౌడ యతీశ్వరుడు ఒకాయన కని పించి దత్తాత్రేయ ఉపాసన చేయమని బోధించాడు .మళ్ళీ క్షేత్ర సందర్శన చేస్తూ ,ప్రముఖ దత్తో పాసకు లైన ‘’వాసుదేవానంద స్వర్స్వతి ‘’వారిని దర్శించి ,ప్రబోధం పొందారు .తీర్ధ యాత్రలు కొన సాగిస్తూ మానసిక ప్రశాంత స్థితి ని పొంది ,సన్యాసాశ్రమం పై తీవ్ర కోరిక పెరిగింది .శ్రీ సచ్చిదానంద సరస్వతి యతీంద్రులు సన్యాస దీక్ష నిచ్చి ,’’బ్రహ్మా నంద సరస్వతి ‘’అనే యోగా నామం పెట్టారు .

 

       బ్రహ్మా నందులు నేపాల్ చేరి ;;ముక్తి నాద క్షేత్రం ‘’ లో ఘోర తపస్సు చేసి చిత్తాన్ని ఏకాగ్రం చేస్తేనే మనస్సు స్వాధీన పడుతుందని భావించాడు .హథ యోగమే శరణ్యం  అని నిశ్చయించు కొన్నారు .కొన్ని నెలలు ‘’పంచ గవ్య  ప్రాసన ‘’చేశారు .మహారాష్ట్ర చేరి నారాయణ దాస బావాజీ ఉపదేశం తో శరీర శోధన చేశారు .ధోతి ,బస్తీ ,నేతి ,నోలి ,వజ్రోలి ,త్రాటకం అనే ఆరు క్రియలతో ప్రాణాయామ పూర్వక యోగం ‘’చేశారు .నైమిశారణ్యం చేరి పరమ విరాగి అయారు .కురుక్షేత్రం వెళ్లి భగవద ధ్యానమే వాసనా క్షయానికి దారి అని తెలుసు కొన్నారు ..శృంగేరి చేరి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ జగద్గురు వరేణ్యు లను దర్శించారు .వారి సన్నిధి లో భాష్య శ్రవణం చేశారు .శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని కలిసి ,వారు ఆంద్ర దేశం లో పర్య టించి నపుడు రాజ మాండ్రి లో శంకర మతం లో దత్తాత్రేయ స్వామిని ,పాదుకలను ప్రతిష్టింప జేశారు .రుతంబర ప్రజ్ఞా తో పాటు అనేక సిద్ధులు సాధించారు .

 

                   ఇప్పటి దాకా బ్రహ్మా నందులు చేసినది అంతా ఆత్మా ఉద్ధరణ కోసం .ఇప్పుడు లోకోద్ధారణం గురించి ఆలోచించారు .సనాతన ధర్మ ప్రచారం చేస్తూ ,దేశ సంచారం చేస్తూ ,మంత్ర దీక్ష ను చాలా మందికి ఇచ్చారు .అందరికి అర్ధమయే తెలుగు లో ‘’శ్రీ దత్తం శరణం మామ ‘’అనే అక్షర్రాలను అమర్చి చిత్రపటం ముద్రించి ,పూజా పుస్తకాన్ని కూడా అచ్చు వేయించి అందరికి పంచారు .శ్రీ శంకరా చార్య సహస్ర నామావళి రచించారు .’’శ్రీ దత్తం శరణం మామ ‘’అనే శీర్షిక తో 108 శ్లోకాలను సంస్కృతం లో రాశారు .అనేక పుస్తకాలను రాసి ప్రచురించారు .అందులో ‘’యోగాభ్యాస దర్పణం ‘’,సజ్జన సేవ ,తీర్దాతనం వగైరాలున్నాయి .కాశీ లో ఉండగా గురుదేవులు మరణించిన వార్త తెలిసి అక్కడి నుండి గరడే శ్వార్ చేరి అంత్య క్రియలను గురుదేవునికి నిర్వ హించారు .మహా రాజు బంగారు నవర్సులున్న18 కిరసనాయిల్ డబ్బాలు ,వెండి రూపాయలున్న18కిరసనాయిలు డబ్బాలు గురువు అందించామన్నారని చెప్పి వీరికి అంద జేశారు .అందరి తో సంప్రదించి ఆ డబ్బు ను హరిద్వారం బదరి ,గరుదేశ్వార్ మొదలైన చోట్ల మథాలు నిర్మించటానికి సద్విని యోగం చేశారు .

 

          ఒక సారి బ్రహ్మానందులు నిజం రాజ్యం లో రైల లో ప్రయాణిస్తుంటే ఒక చోట బండి ఆగి పోయింది .డ్రైవర్ ఆంగ్లేయుడు .ఎంత ప్రయత్నించినా అది కదల లేదు .ద్రివర్ దగ్గరకు వెళ్లి ఎందుకు కదలటం లేదని అడిగితే వాడు జాతి అహంకారం తో  ‘’YOU GO FOOL UNSUCCES FUL DIRTY MAN ,A MONK ASKS ME ?’’  అని తిట్టాడు .వెం నటనే బ్రహ్మా నందులు ‘’yes ,yes you are correct .iam a lesser fool .dont you see you alone are unsuccesful now.yes i am a monk .but not a monkey like you ..you come down ,first ,with your fire man ‘’  అని సమాధానం చెప్పే సరికి వాడు డంగై దిగాడు .స్వామి ఇంజెన్ లో కి వెళ్లి అక్కడ తమ దండం తో ఒక చోట తాకారు .అది వెంటనే పని చేయటం ప్రారంభించింది .డ్రైవరు ప్రయాణీకులను బండి దిగమని చెప్పి గార్డ్ ను రమ్మన్నాడు .గార్డు ను తీసుకొని రావా టానికి ఫెయిర్ మాన ను పంపాడు .అతడు వెళ్లి చూస్తె గార్డ్ స్థానం లో బ్రహ్మా నందులు మహా నిష్ఠలో తపస్సు లో ఉన్నారు .డ్రైవర్ వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ jesus in India .I am fortunate .I have seen with my eyes ..you all pepple say three cheers to the monk christ ‘’అని చెప్పి అందరి చేతా నమస్కరింప జేశాడా ఆంగ్ల డ్రైవర్ .

 

                    ఒక సారి స్వామి అహ్మదా బాద్ లో సంచరిస్తుండగా కర్ఫ్యూ విధించారు .ఆ సమయం లో వారు అర్ధ రాత్రి రైల దిగి ఒంటరిగా ఆశ్రమానికి పోతుంటే ,పోలీసులు పట్టుకొని జైలు లో పెట్టారు .స్టేషన్ సబ ఇన్స్పెక్టర్ భార్యకు కలలో స్వామి కని పించాడు .కంగారుగా ,ఆమె భర్తను లేపి స్టేషన్ కు వెళ్ళ మంది .ఆయన వెళ్లి చూసి ,ఆశ్చర్య పోయి వెంటనే విడుదల చేసి ఇంటికి తీసుకొని వెళ్లి పూజించి శిష్యుడై దత్త మంత్రం ఉపదేశం పొందాడు .ఆ తర్వాతా జన్మించిన కొడుకు కు ‘’దాత్త బ్రహ్మానంద మూలే ‘’పేరు పెట్టు కొన్నారా దంపతులు .

 

                  మరో సారి బళ్ళారి లో ఒక జడ్జి ఇంటి ముందు భిక్షాటన చేస్తుంటే ,ఆయన కు కోపం వచ్చి ‘’వేడిని మేడ బెట్టి మెయిలు దూరం తొయ్యి ‘’అని జవాను తో అన్నాడు జడ్జి .’స్వామి ప్రశాంతం చిత్తం తో ‘’జవానుకు వీలు కాదు .మీరే రండి ‘’అని వెళ్లి పోయాడు .జడ్జి భార్యకు విపరీతం గా కడుపు నొప్పి వచ్చింది .డాక్టరు వచ్చినా తగ్గలేదు .ఈ కంగారు లో జడ్జి కోర్ట్ మాట మరిచాడు .విధి నిర్వహణ లో అలసత్వం అని అతన్ని తప్పించి రికార్డు స్వాధీనం చేసుకొన్నది ప్రభుత్వం .అప్పుడు ఎదురింటి వర్తకుడు ఇదంతా స్వామికి చేసిన అపచార ఫలితం అని జడ్జి కి చెప్పాడు ..జడ్జి ఊరంతా తిరిగి ఒక చెట్టు కింద జపం చేసుకొంటున్న స్వామిని చూసి ,కాళ్ళ మీద పది క్షమించ మన్నాడు . ‘’అయిదు రోజుల్లో నీ కుర్చీలో నిన్ను కూర్చోబె డ  తాను ‘’అని స్వామి అభయం ఇచ్చారు కనికరించి .జనం విపరితంగా అక్కడికి చేరారు .స్వామి ఉన్నట్లుంది అంతర్ధానమై పోయారు .మర్నాడు జడ్జి కోర్టు కు వెళ్లాడు స్వామి కోసం వెదికితే రైల ప్లాట్ ఫాం మీద కన్పించారు .జడ్జి ని మద్రాస రమ్మని ఆదేశం వచ్చింది .భార్య నెప్పి పోయింది .హైకోర్టు ఆయన్ను మళ్ళీ ఉద్యోగం లో చేర్చుకొనే ఆర్డర్ ఇచ్చింది .నాలుగు నెలల తర్వాతా జడ్జి అభ్యర్ధన మీద స్వామి ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించారు అప్పుడు స్వామి ‘’స్వబోధ దర్పణం ‘’అనే టీం టేబుల్ రాసిచ్చి జడ్జికిచ్చారు .రాత్రి పాడుకొనే ముందు ఒక సారి చదువు కొమన్నారు .జడ్జి ఆ తర్వాతా సన్యాసం స్వీకరించి ,ఆశ్రామ ధర్మాలను పాటించారు .

 

        బ్రహ్మానంద స్వామి వారు షష్టి పూర్తీ ని అందరు తమ ఇళ్ళల్లో జరుపు తామనితొమ్మిది మంది  పోటీ పడ్డారు .ఆయన ఒకరింటికి వెళ్లి ,మిగతా ఎనిమిది ఇళ్ళల్లో ను ప్రత్యక్షమై భిక్ష ,పాద పూజ అందుకొని అనడర్ని సంతృప్తి పరచారు .2-12-1938 బహుధాన్య  మార్గ శిర శుద్ధ దశమి శుక్రవారం నాడు ప్రతి రోజు లాగానే  అర్చన కోసం స్వామి వారి పాదుకలను  శిష్యుడు దత్తు గారు తీసి  చూస్తె అవి చెదలు పట్టి కన్పించాయి .ఏదో కీడు జరిగింది అని భక్తులు శంకించారు .రెండు రోజుల తర్వాత  దత్తు గారికి కాశీ లో స్వామి దశమి నాడు అంటే పాదుకలు చెదలు పట్టినట్లు గమనించిన రోజునేసిద్ధి పొంది నట్లు  టెలిగ్రాం వచ్చింది .ఇది దత్తు గారికి స్వామి వారు చూపిన నిదర్శనం .

 

               మరో మహాత్ముని గురించి ఇంకో సారి –

 

                                               

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు — 7 ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు   —  7

                                                ఆధునిక శుక యోగీన్ద్రులు మళయాళ స్వామి  

                 అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసి కూర్మం లాగా అంత దాచుకొని ఉండి ,స్త్రీలకూ దీక్షనిచ్చి కులం కు ప్రాధాన్యత నివ్వని యోగి పుంగవులు మళయాళ స్వామి .

  కేరళ లోని తిరువాయుర్ సమీపం లో కరియప్ప ,నొత్తి యమ్మ దంపతులకు29-3-1885   జన్మించారు . వేళప్ప అని పేరు పెట్టారు .ఒక బైరాగి చూసి సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు .పసితనం నుండే నేలమీదనే హాయిగా నిద్ర పోయే వాడు . జీవకారుణ్యం పుట్టుక తోనే వచ్చింది .పంజరం లోని పక్షులను విడిపించే వాడు .ఇంటి దగ్గర కుటీరం లో ఎప్పుడు ధ్యానం లోనే ఉండే వాడు ..ఒక సారి అన్న చూసి కోపం తో చెంప మీద చెల్లు మని పించి వెళ్తుంటే ద్వారం దగ్గర అడ్డంగా తెల్లని నంది కనిపించింది .భయమేసి తల్లికి చెప్పాడు .ఇంగ్లీష చదవటం ఇష్టం లేక సంస్కృతం నేర్వటా నికి వెళ్లి పోయాడు .

  తిరువంత పురానికి దూరం లో శివగిరి చేరాడు అక్కడి’’ నారాయణ గురుదేవు’’ల ఆశ్రమం ఉంది .ఆయన సామాజిక విప్లవ కారుడు .మానవులంతా ఒకే కులం ,ఒకే జాతి అనే వాడు .  ఆయన శిష్యుడు శివ లింగ స్వామి పెరింగోత్కర గ్రామం లో ఆధ్యాత్మ విద్య బోధించే వాడు .వేళప్ప  ఆయన్ను చేరాడు .అందరు ఇతన్ని ‘’భక్తాన్’’ అనే వారు .మంత్రోపదేశం చేసి ,యోగ రహస్యాలు నేర్పాడు గురువు ..పాతంజలి యోగ రహస్యాలు అలవాడ్డ్డాయి .నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సు పొందాడు వేలన్ .ఇంటికి వెళ్లి జబ్బు తో ఉన్న అమ్మకు సేవలు చేసి నయం చేశాడు .వివాహ ప్రయత్నాలు చేస్తే తిరస్కరించాడు .

            వేళప్ప కాళి నడక తో దేశం లోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు .రోజుకు ఇరవై మైళ్ళు నడిచాడు .ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు .రక్త విరోచనాలతో ఒక వారం ఒక సత్రం లో బాధ పడ్డా ,ఇంటికి వెళ్ళ లేదు .స్వప్నం లో ఎవరో వచ్చి ఒక మాత్ర నోట్లో వేశారు .మళ్ళీ యే రోగము రాలేదు .ఓంకారేశ్వర్ ,గిర్నార్ ,ద్వారక లను సందర్శించి కాశ్మీరం వెళ్లాడు .కురుక్షేత్రం లో గీతా పారాయణం ముగించి ,హరిద్వారం ,రుశీకేశం చేరి ,బదరికాశ్రమం లో పితరులకుపిండ ప్రదానం  సమస్త ప్రాణి కోటి కి బ్రహ్మార్పణం చేసి,నైమిశారణ్యం లో కొన్ని రోజులుండి ,అయోధ్యలో రామ తారక మంత్రం లక్ష సార్లు జపించి ,,ప్రయాగ త్రివేణీ సంగమ స్నానం చేసి ,ఆ జలాన్ని కాశీ విశ్వేశ్వరునికి అభిషేకించి అక్షర లక్షలు శివ మంత్రం జపించి ,నవద్వీపం లో భజనలు చేసి ,కలకత్తా ,పూరీ సింహాచలం ,శ్రీశైలం క్షేత్రాలు దర్శించి .తిరుమల శ్రీని వాస దర్శనం చేసి ,గోగర్భ క్షేత్రం చేరాడు .అది తపస్సు కు అనుకూల మైన ప్రదేశం గా భావించాడు .అరుణాచలం ,చిదంబరం ,లలో అక్షరలక్ష శివమంత్రం జపించి ,పలని ,రామేశ్వరాల మీదుగా కన్యాకుమారి చేరి ,నేల రోజులుండి మళ్ళీ నారాయణ గురు పాద సన్నిధికి చేరాడు .గురువు అనుమతి తో ఇంటికి వెళ్లాడు .తండ్రి అప్పటికే చని పోయాడు .  29 ఏళ్ళ వయసు లో మళ్ళీ ఇల్లు వదిలి కుర్తాళం  వగైరా ప్రదేశాలు తిరిగి తిరుమల లోని ‘’గోగర్భ క్షేత్రానికి ‘’చేరుకొన్నాడు .

                  అవి భారత స్వాత్నత్ర్య ఉద్యమం రోజులు .స్వరాజ్యం తో పాటు’’ స్వారాజ్యం’’ అంటే ‘’ఆత్మా రాజ్యం ‘’రావాలని అప్పుడే శ్రేయస్సు అని భావించాడు .భగవంతున్ని ‘’అతీత వైరాగ్యం ,అఖండ బోధ ,ఉత్తమ సమాధి నిష్ఠ ,సర్వభూత సమదృష్టి తనకు లభించాలని కోరుకొన్నాడు .గోగర్భం లోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు .ఆయన భాష,వేశం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని పిలిచే వారు .అదే వాడుక నామమ అయింది .

    మైసూరు తిరువెంకతాచార్యుడు వెంకటేశ్వర పూజ చేసి రోజు ప్రసాదం ఇచ్చి వెళ్ళే వాడు స్వామికి .మూడు రోజులు విపరీతం వర్షాలు పది కదిలే వీలు లేక పోతే వెంకటేశ్వర స్వామి సుబ్బరామ శెట్టి అనే అతనికి కలలో కన్పించి స్వామికి ఆహారం పెట్టమని ఆదేశించాడు .ఆయన వెదురు గడకు ప్రసాదం కతట్టి ఆవలి ఒడ్డున ఉన్న స్వామికి అంద జేశాడు .భగవంతుడే ఆహారం పంపితే తింటాను అని ప్రతిన చేశాడు .అప్పట్నించి ఎవరో ఒకరు సమయానికి ఆహారం సమకూర్చే వారు .  

   తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు .పెద్ద పులి వస్తే ,భగవంతుడిని ప్రార్దిన్చాగానే అది పారి పోయింది .ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి  ఒక వెతకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు .వెంగమాంబ స్వామిని దీవించింది .తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకస నంద తీర్ధం నుండి ,తుంబురు తీర్దానికి వెళ్లారు .భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు .ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందం తో ఆహారం అందించాడు .ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు .వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం పెట్టె ఏర్పాటు చేశారు స్వామి .కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు .తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మా సాక్షాత్కారం లభించా లేదు .ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి విని పించింది .ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు .

                తిరుమల విడిచి ‘’ఏర్పేడు ‘’దగ్గర ‘’కాశీ బుగ్గ ‘’లో ఆశ్రమం య్ర్పాటు చేసుకొన్నారు .కాళహస్తి జమీందార్ కుమారా వెంకట లింగమ నాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు .వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి ,పంటలు పండించారు .జంతు బలి మాన్పించారు .’’యదార్ధ భారతి ‘’అనే పత్రిక ను స్తాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు .అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు .వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది .కేరళ లో నారాయణ గురు గారు ఏమి బోధించారో ,వ్యాసాశ్రమం లో అది అమలు పరచారు .బందరు లో పట్టాభి సీతా రామయ్య గారింట్లో గాంధీజీ ని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు ..దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .

         19 37 ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రి లో ప్రారంభించి స్త్రీలకూ ,ఇతర కులాల వారికి ప్రనవాన్ని బోధించారు .’’1943లో శివ గిరి లో జ్ఞాన యజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధ భారతీయ తత్వ చరిత్ర లో ఒక అపూర్వ అధ్యాయం ‘’అన్నారు బిరుదు రాజు వారు .1945 ఒక స్త్రీకి సన్యాస దీక్ష నిచ్చి చరిత్ర సృష్టించారు .1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసి నపుడు ,వేలాది మంది పంచములు పాల్గొన్నారు .అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి మహా పండితులు ,సర్వవేద శాస్త్ర్ర్ధ్యాయి వేద ప్రవచన నిపుణులు బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి గారు మహదానంద పది మనస్పూర్తిగా ఆశీర్వదించారు .వ్య్సాసాశ్రమం లో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచు రించి ఆ స్తిక జనాలకు అందించారు .

 మళయాళ స్వామి వేదాంత ప్రచారానికి ఎంత ప్రాముఖ్యత నిచ్చారో సంఘ సంస్కరణకు అంతే ప్రాధాన్యమిచ్చారు ‘’.ఆంద్ర నారాయణ గురు ‘’అని పించుకొన్నారు .వ్యాసాశ్రమ పూజా కార్య క్రమాలలో ‘’పరబ్రహ్మ గోత్రోద్భావస్య ,పరబ్రహ్మ గోత్రోద్బవాయాః’’ అని సంకల్పం చెప్పించే వారు .ఆహార నియమాలలో ,ఆశ్రమ నిర్వహణలో కఠోర నియమాలు పాటించే వారు .ఆసేతు హిమ నాగం పాదాలకు చెప్పులు లేకుండా తిరిగిన మహాను భావులు మళయాళ స్వాములు .అనారోగ్యం తో బాధ పడుతున్నా పాయకాపురం షాద్ నగర ,గాగిల్లా పురం లో జరిగిన సనాతన సభలకు వెళ్లారు .తన తర్వాతి ఆశ్రమాది పతులుగా విమలానంద స్వామిని నియమించారు .12-7-1962 లో మళయాళ స్వామి కై వల్యం పొందారు .మండలారాధన లో ముప్ఫై వేల మ్మంది పాల్గొని స్వామి వారిని అర్చించారు .వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి . .విద్యాప్రకాశానంద స్వామి వారు ఈ ఆశ్రమాది పతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరై నారు .వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అని పిస్తుంది .ఇప్పుడు విద్యానంద గిరి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు .ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు   మళయాళ స్వామి చరిత్ర పుణ్య ఫలం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అమెరికా డైరీ ఈల లీలామృత వర్షిణి వారం

      అమెరికా డైరీ

                                                          ఈల లీలామృత వర్షిణి వారం

       ఈల లీలాలోలుడు ,ముఖ వంశీ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు కిందటి వారం లో మొదటి రెండు రోజులు అంటే నాలుగు ,అయిదు తేదీలు –సోమ ,మంగళ వారాలు శార్లేట్ నగరం లో ఉండి రసజ్నులకు ఈలా వినోదాన్ని పంచారు .సోమవారం సాయంత్రం శ్రీ చక్ర వర్తి ,అనిలా దేవి దంపతుల ఇంట్లో సాయి భజన లో పాల్గొన్నారు .సాయి బృందం లో ని సభ్యులు బెల్లం కొండ రవి ,ఉషా దమతులు ఇండియా వెళ్లి పోతున్న సందర్భం గా ఆత్మీయ సమావేశం జరిగింది .వారిద్దరికిహృదయభారం తో వీడ్కోలు చెప్పాము .కేక్ కూడా కట్ చేయించారు .దాదాపు గంట సేపు శివప్రసాద్ తమ ఈల లీల ను అన్ని రకాలుగా ప్రదర్శించి ,అన్ని రకాల భజన కీర్తనలను పాడి ,జనంతో పాడించి భక్తీ ని రాశీ భూతం చేశారు .ఆయన మిషన్ చాలా అద్భుతం గా పండింది .ఆ తర్వాతా విందు ఏర్పరిచారు .నలభై మంది కి పైగా హాజరై,ఆసాంతం విని తరించారు .చపాతి కూర ,బిర్యాని ,సాంబారు ,పెరుగన్నం ,మామిడి పల్ల ముక్కలు ,పుచ్చముక్కలు ,పరవాన్నం తో విందు ఇందించారు .ఒక రకం గా రెండు విన్డులందు కొన్నాం .ఒకటి ఈల విందు ,రెండు భోజన విందు .ఆ దంపతుల ఆత్మీయత చాలా బాగా ఆకర్షించింది .అందరు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి పోయారు .రవి వాళ్లకు మన వాళ్ళందరూ గిఫ్ట్ అంద జేషి ,గ్రూప్ ఫోటో తీయించు కొన్నారు .

            మర్నాడు మంగళ వారం మధ్యాహ్నం శివ ప్రసాద్ గారు భోజనానికి మా ఇంటికి వచ్చారు .కారట్ హలవా ,మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,కొబ్బరి చట్ని ,అన్నం ,సాంబారు ,పెరుగు ,ఒడియాలు ,ఆవకాయ తో విజ్జి భోజనం వడ్డించింది .మేమిద్దరం కలిసి భోజనం చేశాం .ఆయన ఈ వంటా ,వాతా వరణం చాలా బాగా ఉన్నాయని మెచ్చు కొన్నారు .నాకు వారి సిడి లు రెండు కానుక గా ఇచ్చారు ,మా అమ్మాయింకి ఒకటి ఇచ్చారు .మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు ‘’టోరి’’లైవ్ రేడియో ప్రోగ్రాం చేశారు ఇక్కడే ఉండి .శ్రీమతి నాగ మణి గారు చాలా హుందాగా ,విశ్వాసం గా నిర్వహించారు .చాలా నిదానం గా తన జీవితాన్ని ,చదువు ,దీనిలోకి ప్రవేశించిన విధానం ,ఎదిగిన పద్ధతి  తనకు వెన్నెముక గా నిలిచినా వ్యక్తులు గురించి రెండు గంటలు అనర్గళం గా వివ రించి శ్రోతలను ఆకట్టు కొన్నారు .నేను ప్రక్కనే ఉండి ,కొన్ని ప్రశ్నలడిగి సమాధానం రాబట్టాను .ఆ రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .శివ ప్రసాద్ గారు ‘’ఆంజనేయ వీర ,హను మంత శూరా ‘’అనే కీర్తన తో పాటు ఇంకా కొన్ని పాడి మంచి అనుభూతి కల్గించారు .హిందీలో ‘’చౌదవీక చాంద్ హో ‘’తెలుగు లో ‘’నా హృదయం లో నిదురించే చెలీ ‘’,’’లాహిరి లాహిరి లాహిరి లో ‘’పాడి విని పించి ఎక్కడికో తీసుకొని వెళ్లారు .ప్రతి పాటకు చప్పట్లు చరచి భిమానాన్ని చాటాం .నేను ‘’సరసభారతి’’ తరఫున ‘’శ్రీ హనుమత్కదా సుధా   ‘’ను వారికి అందరి సమక్షం లో కానుక గా ఇచ్చాను .ఇండియా వెళ్లి నప్పుడు విజయ వాడ వైపుకు వస్తే తప్పక ఉయ్యూరు రమ్మని కోరాం .తప్పకుండా వస్తామని హామీ ఇచ్చారు .నలభై మంది హాజరైన డిన్నర్ లో మా అమ్మాయి అల్లుడు మంచి పదార్ధాలు వడ్డించారు .నాగమణి ,గాయత్రి గార్లు సహాయం చేశారు .హల్వా ఇడ్లి సాంబారు ఉప్మా ,ఆవకాయ ,అన్నం పెరుగు ,పుచ్చముక్కలు తో పసందుగా విందు .అందరు ఆత్మీయం గా వచ్చి ఆనందం గా విని ఆనందించారు .ప్రక్కనున్న అమెరికన్స్ కూడా వచ్చి ఎంజ్జాయ్ చేయటం చాలా గొప్ప విషయం .ఇప్పుడు రేడియో లో శివ ప్రసాద్ గారు చెప్పిన సారాంశం తెలియ జేస్తాను

                                                             శివ ప్రసాదీయం

             తెలుగు వారికే ప్రత్యెక మైన రెండు ప్రక్రియలు ఉన్నాయి .అవి కవిత్వం లో అవధానం చేయటం .రెండు ఈల తో సంగీతాన్ని విని పించటం .ఈల పాటకు ఆద్యులు స్వర్గీయ కే.రఘు రామయ్య గారు .ఆయన పాడిన దానికి శివ ప్రసాద్ పాడిన దానికి తేడా ఉండి .ఆయన చూపుడు వ్రేలును మడిచి నోటిలో ఉంచి ,గాలి పీల్చి వదులుతూ ,ఈల వేస్తారు ,పద్యం పాడుతారు . ఆగాలి అయి పోగానే మళ్ళీ పీలుస్తారు .కనుక మధ్యలో విరామమ ఉంటుంది .ఆయన ఎక్కువగా పద్యాలే ఈల తో పాడే వారు .అది ఆయన ధోరణి .ఆయన పౌరాణిక నాటకాలు ,సిని మాలలో నారదుడు శ్రీ కృష్ణ పాత్రలు ధరించి బాగా ప్రఖ్యాతి పొందారు .ఆయనకు ఈల పాట ఒక హాబీ .కాని శివ ప్రసాద్ గారికి అది జీవన వేదం .ఉచ్వాస ,నిస్స్వాసాలలో రెండిటి లోను వీరు ఈలను పలికిస్తారు .కనుక గాప్ అనేది ఉండదు .ఒక మహా ప్రవాహం గా సాగి పోతుంది .ఆయన ఈల పాట పాడటానికి కొంచెం కష్ట పడి నట్లున్తుంది .వీరి పాట అలవోక గా ,సెలయేరు లా సాగి పోతుంది .కూర్చుంటే ఎన్ని గంట లైనా అలా పాడేస్తూనే ఉంటారు .విశ్రాంతి అక్కర్లేదు ..ఈల వీరికి ‘’శ్వాసావధానం ‘’అని పిస్తుంది .ఆయన మొదట దాన్ని స్టేజి గౌరవం కల్పిస్తే ,ప్రసాద్ గారు అంతర్జాతీయ వేదిక ను ఈల కు నిర్మించి ,అదొక గొప్ప కళ గా’’ ఆర్ట్ ఫాం ‘’గా ప్రచారం చేసి ,యేన లేని కీర్తి తాను పొంది ,ఈల కూ సంపాదించారు .

         ఈలలో అన్ని స్థాయిల్లో ను పాడగల సత్తా శివ  ప్రసాద్ గారిది .యే స్థాయిలోను ఎక్కడా పలకటం లో తేడా రాదు .అన్ని రకాలైన పాటలు ,అన్ని భాషల్లో పాడుతున్నారు .ఎవరికి వారు శివ ప్రసాద్ తమ వాడే అని పిస్తుంది .అంత బాగా మనస్సుల్ని రంజింప జేస్తారు .బయటకు వెడితే ఎప్పుడు పడితే అప్పుడు పాడ టానికి వీలుగా ‘’ట్రాక్ ‘’తయారు చేసుకొన్నారు .అది లక్ష రూపాయలకు పైనే ఖర్చు అయింది .అది ఉండటం చాలా హాపీ గా పా డ టానికి వీలవు తోంది .ఇంత అంతర్జాతీయ కళా కారుడు మామూలు ఇళ్ళల్లో కూర్చుని పాడటం అంటే ,ఆయన ఎంత ఉదార హృదయం గల వారో అర్ధం అవుతుంది .ఆయన అతి సాధారణం గా ఉంటారు .వేడి నీరే తాగుతారు .పెరుగు వేసుకోరు .ఆరోగ్య సూత్రాలను బాగా పాటిస్తారు .కళా  కారులు వ్యసనాలకు బలి పోవటం తనకు బాధ కలిగిస్తుందని ,అలాంటి వారి జీవితాలు తన కు గుణ పాథం అని  చెప్పారు .

                                                                   బాలమురళి ప్రభావం

            తనను బాగా ప్రోత్స హించిన వారు ముగ్గురు సంగీత కళా కారులు అన్నారు .ఒకరు వాగ్గేయ కారులు ,పద్మ విభూషణ్ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు .ఈల ఏమిటి ? వదిలెయ్యి .అది దేనికీ పనికి రాదు అని నిరుత్సాహ పరిచారు మహా మహా విద్వాంసులు .అప్పుడు బాల మురళి ఆదరించి మద్రాస్ లో తన ఇంట్లో ఉంచుకొని ,తన కుమారుడిగా చూసి శాస్త్రీయ సంగీతపు మెళకువలు నేర్పారు .తాను పాడి  ,ఈయనను అలాగే ఈల తో పలక మని ,దగ్గరుండి అమిత వాత్సల్యం తో నేర్పి ఈల కు శాస్త్రీయత కలగటానికి ,తన అభి వృద్ధికి ఎంతో తోడ్పద్దారని శివ ప్రసాద్ మురిసి పోతారు .బాల మురళి గారి భార్య అన్న పూర్ణ గారు నిజం గానే అన్న పూర్ణ .రోజు వారింట్లో ఎంత మంది వచ్చి ఆతిధ్యం తీసు కొంటారో లెక్కలేదు . .అందరికి వండి వడ్డించే ఇల్లాలు ఆమె అని రెండు చేతులు ఎత్తి నమస్కరించారు .పేరు సార్ధకం చేసుకోన్నారామే .మను చరిత్ర లో పెద్దన గారు ప్త్రవరాఖ్యుని ఇల్లాలిని ‘’వడ  నలయదు వేవురు వచ్చి రేని ,నడి కి రెయైన ‘’అన్న పద్యం జ్ఞాపకం వస్తుంది .అంతే కాదు బాల మురళి కుమారులు తనను ఒక సోదరునిగా కుమార్తెలు తమ్మునిగా చూశారని అంటారు .అల్లుళ్ళు ,కోడళ్ళు బాల మురళి గారిని ‘’నాన్న గారు ‘’అనే పిలుస్తారాట .’’మామ గారు ‘’అనరట .అంతటి సంస్కారం వారిది .మామ గార్ని తండ్రి లా భావించటం బాల మురళికి అరుదైన గౌరవం .అంతే కాదు రాత్రి బాలమురళి నిద్రించ టానికి ముందు అల్లుళ్ళు ఆయన కాళ్ళను ,పాదాలను ఒత్తి భక్తీ ని ప్రదర్శించటం తనకు ఆశ్చర్యమేసింది అంటారు శివ ప్రసాద్ .

            ఎందరెందరో సంగీత విద్వాంసులకు పరిచయం చేసి వారి ద్వారా నేర్చుకో దగింది నేర్పించారట బాల మురళి .తనకు తెలీకుండా నే తన తో ఈల పాటల కేసట్టు రికార్డ్ చేయించే పని చేబట్టి ఒక్క రోజు ముందు మాత్రమే చెప్పి చేయించారట .అంత ముందు చూపు ,ప్లాన్ బాలమురలికి ఉండేదట .తనకు తెలీకుండా రికార్డింగ్ సమయం లో బాల మురళి ,తన పాటలకు కంజీర  వాయించి మరీ ఆశ్చర్య పరిచారట .మిగిలిన కళా కారుల్లా తాను కింద కూర్చుని ,శివ ప్రసాద్ ను కుర్చీలో కూచో బెట్టి ఫోటో తీయిన్చుకున్నారట పద్మ విభూషణుడు .అదీ ఆయన గొప్ప తనం అన్నారు .బాల మురళి  దగ్గరే సంగీతం నేర్చిన అపర బాల మురళి అని పించుకొన్న డి .వి.మోహన కృష్ణ శివప్రసాద్ గారికి సహాధ్యాయి .తనే సీనియర్ అంటారు ప్రసాద్ .మోహన కృష్ణ వివాహం చేయించింది ,ఉద్యగం ఇప్పించిండీ గురువు గారే .

                                                                      బిస్మిల్లా ఖాన్ ,శ్రీనివాసన్ గార్ల ప్రేరణ  

            ప్రముఖ శ హనాయ్ విద్వాంసులు ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ గారు శివ ప్రసాద్ గారి ఈల పాట విని ఎంతో మెచ్చుకొని ,ప్రోత్స హించారట .తన శాహనాయినీ ముందుగా ఎవరు ఆదరించలేదని ,ఆ తర్వా దానికి తాను స్టేజి గౌరవాన్ని తెచ్చిన తర్వాతే గుర్ర్టింపు లభించిందని ,ఇది మామూలే నని ,నిరాశ చెండ వద్దని బోధించారు .అలాగే శ్రీనివాసన్ గారు వయోలిన్ వాయిస్తూ శాస్త్రీయ విషయాలను దగ్గర కూర్చో బెట్టుకొని నేర్పి తన ఉత్సాహానికి ఉద్దీపన కల్గించారు .ఈ ముగ్గురు ప్రోత్సహించక పోతే తనకు శాస్త్రీయ సంగీతం లో అవగాహన వచ్చేది కాదని ,అది అలవడి నందు వల్లే తాను రాణిస్తున్నానని వినయం గా చెప్పారు .

                                                        కోన ప్రభాకర రావు ప్రభావం

          తానూ రఘు రామయ్య గారు గుంటూరు  జిల్లా నుంచి వచ్చిన ఈల కళా కారులం అని గర్వం గా చెప్తారు శివ ప్రసాద్ .తన’’ మెంటార్’’ కొన ప్రభాకర రావు గారని చెప్పారు .ఇద్దరిది బాపట్ల .తన తండ్రి , తాత గార్ల దగ్గర ఆయనకు బాగా పరిచయం వారంటే విపరీత మైన గౌరవం కొన గారికి ఉండే వనిఅందుకే తనను వీలైన చోట్ల కల్లా తీసుకొని వెళ్లి పరిచయం చేసి తనతో ఈల పాట పాడించే వారని .అంతగా ప్రోత్సహించే వారు అరుదు అని ప్రభాకర రావు గారు ఆంద్ర ప్రదేశ్ స్పీకర్ గా ,మహారాష్ట్ర గవర్నర్ గా పని చేయటం తనకు మంచి అవకాశాలు రావటానికి తోడ్పడ్డాయని బిస్మిల్లా ఖాన్ గారి వద్ద పాడే అదృష్టం బాల మురళి గారి ముందు పాడే అవకాశం అలానే కల్గాయని అన్నారు .ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధి గారికి పది నిమిషాలు ఈల పాట విని పించే పర్మిషన్ కోన గారు పొంది ,తనను తోటి సహవాద్య కారులను తీసుకొని వెళ్లారట .ఈల మొదలైంది .ఆమె అన్ని కార్య క్రమాలను వాయిదా వేసుకొంటూ గంఅ సేపు అలానే కూర్చుండి పోయారట .అది మరపు రాని  సంఘటన అన్నారు .ఘన సన్మానం చేసి పంపారట .

           ఒక సారి బాపట్ల లోప్రముఖ హరికధకులు ,శాస్రీయ సంగీత విద్వాంసులు  ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికదను రామ నవమి పందిరి లో ఏర్పాటు చేశారట .ఆయన తెనాలి నుండి రావాలి .ట్రైన్ఒక గంట  లేటు .అందుకని తనను ఆయన వచ్చే దాకా ఈల పాట పాడ  మన్నారట .అలా ‘’అరంగేట్రం చేశాను’’ అంటారు శివ ప్రసాద్ .తన కుమారుడు ఫ్లూట్ వాయిస్తాడని మాన్దలీన్ ఈల కూడా బాగా చేస్తాడని ,కుమార్తె సంగీతం బానే నేర్చిందని ,తన భార్య సాధారణ గృహిణి అని తెలియ జేశారు .

          మీరు ఏమి సాధించారు ?ఇంకా ఏమైనా సాధించాలని అనుకొంటున్నారా /అని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం గా ,ఈల కు శాస్త్రీయ స్థాయి కల్పించే తపన ఉందని ,ఈల కు విద్యా కోర్సు ను ఏర్పరచి యునివేర్సిటి స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అను కొంటు న్నానని చెప్పారు .తనకు సంతృప్తి గా ఉందని ,సత్య సాయి బాబా అనుగ్రహం తనను  ఎంతో ముందుకు తీసుకొని వెళ్తోందని అందరికి ఈల ద్వారా ఆనందం పంచటం సేవ ,ప్రేమ లను ప్రపంచం అంతటా చాటి చెప్పటం తన బాధ్యత గా భావించి పని చేస్తున్నానని తెలియ జేశారు . నేను శివ ప్రసాద్ గారికోరిక తీరాలని చెబుతూ వారి ఈల కళ ను ప్రభుత్వం గుర్తించి అత్యంత ప్రతిష్టాకరమైన ‘’పద్మ పురస్కారం ‘’వారికి లభించాలని అందరి తరఫునా కోరాను .శివ ప్రసాద్ పాడ  టానికి కూర్చుంటే ,తాళం వేయటం ఊగి పోవటం ,తల అష్ట వంకర్లు తిప్పటం వంటి ఆర్భాటా లేమీ ఉండవు .ఒక మహర్షి ధ్యాన సమాధి లో ఉండి అనాయాసం గా ,అసంకల్పితం గా సంగీత శ్రోతస్విని జాలు వారుస్తున్నట్లు  ఉంటుంది .అది మాత్రం శివ ప్రసాద్ గారి ప్రత్యేకత .తాను తన్మయం అయి మనల్ని తన్మయులను చేస్తారాయన .కారణ జన్ములు . ఆయన నోట్లో మురళి ఉందా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది .పదాలు తెలుస్తాయి .దాటివేయటం లేదు .ప్రతి పదం మనకు వినపడుతుంది .అక్షరం తెలీదు కాని అక్షర ధ్వని స్పర్శ ఫీల్ అవుతాం .ఆయనకు అన్ని వేళలా విజయ పరంపర లభించాలని కోరు కుంటున్నాం .శార్లేట్ నిజం గా ఈలామ్రుత వర్షిణి లో పునీత మైంది .

                                                           యాభై వసంతాల వివాహ వేడుక

                                   పదవ తేది శని వారం రేణు అనే విజ్జికి తెలిసిన అమ్మాయి వాళ్ల నాన్న గారి ,అమ్మగారి ‘’యాభై వసంతాల వివాహ వేడుక ‘’కు ఆహ్వానిస్తే వెళ్ళాం .తండ్రి గారు ప్రముఖ నాటక ,సినీ నటుడు వల్లం  నర సింహా రావు గారి అన్న కుమారుడు .ఈయన పేరు నరసింహారావు .భార్య సత్య వతి .కమ్యునిటి హాల్ హో ,రేణు కుమారుడు రిశభ్ పుట్టిన రోజు ఆమె మేనల్లుడి గ్రాడ్యుయేషన్ ,ఇదీ మూడు కలిపి చేశారు .మంచి కుటుంబం .ఆయనది కృష్ణా జిల్లా తిరువూరు .హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లో పని చేసి రిటైర్ అయారు ..హైదరాబాద్ లో ఉంటున్నారు .అనుకో కుండా ఆయన తో పని చేసిన వడ్లమన్నాటి టి శర్మ గారు వచ్చారు. శర్మ గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ కు బి.డి .ఎల్ .లో సహా ఉద్యోగి .అంతే కాక విజ్జి ఆడపడుచు బుల్లి మామ గారు బాగా తెలిసిన వాడు .అనుకోకుండా తమాషా పరిచయాలు ఇలా జరుగు తుంటాయి .విందు ఇచ్చారు .పది పైగాఐటమ్స్  వున్నా తిన్నాది పెరుగన్నమే . ఈ విధం గా ఈ వారం అంతా ఈలా వినోదం తో   విందులతో సరదా గా గడిచింది .

                 మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –12-6-  12 .  కాంప్–అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –3

  అమెరికా ఊసులు –3

              అమెరికా లో ఫ్రీ సాయిల్ పార్టి అనేది ఉండేది .అది స్లేవారి ని ఇంకా వ్యాపించకుండా చేయాలని కోరే సంస్థ .అలాగే లిబర్టి పార్టీ అనేది ఉండేది .ఇది స్లేవారి ని నిర్మూలించాలి అనే పార్టి .ఫ్రాంక్లి పియర్స్ అధ్యక్షుడి గా పోటీ చేసినప్పుడు ఈ రెండు పార్టీలకు ఓట్లు బానే వచ్చాయి .అంటే అప్పుడు అమెరికా లో ఇంకా ప్రజలు బానిసత్వం పై పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేక పోయారు .

 పియర్స్ నలబహై ఎనిమిదేల్లకే ప్రెసిడెంట్ అయాడు .అప్పటికి ఆయన యంగెస్ట్ ప్రెసిడెంట్ .నతానియాల్ హతార్న్ ఆయన గురించి చక్కని బ్రీఫింగ్ ఇచ్చాడు .అది బాగా అతని పర్సనాలిటి ని పెంచింది .ప్రెసిడెంట్ గా ఆయన చేసిన ఉపన్యాసం 3,319 మాటలతో ఉండి .దాన్ని ఆయన కాగితం మీద రాసుకోవటం కాని ,లేక బ్రీఫింగ్ అంటే పాయింట్లు గా రాసుకోవటం కాని చేయ లేదు .అనర్గళం గా మాట్లాడాడు .ఆయన నడిచే బజార్లన్నీ తిరిగే వాడు .వీలయితే గుర్రం ఎక్కి వెళ్ళే వాడు .సెక్యురిటి ఉండేది కాదు .  అధ్యక్షా భవనం గురించి మాట్లాడుతూ ‘’అది  మీ అందరిది .నేను అద్దెకున్న వాడిని మాత్రమే ‘’అన్నాడు . అతని భార్య కొడుకు చావును జీర్ణించు కొ లేక కొడుక్కి రోజు ఉత్తరాలు రాసేది .

   అధ్యక్షుడు గా మెక్సి కొ కు అమెరికాకు సరిహద్దు ను నిర్ణయించే బాధ్యత ను జేమేస్ గాడ్స్దేన్ కు అప్ప గించాడు .ఆయన వాళ్ళతో మాట్లాడి అమెరికా పది మిలియన్ల డాలర్లు వారికిచ్చేట్లు ,వారు గిలా నదికి దక్షిణాన ఉన్న ౩౦,౦౦౦ చదరపు మైళ్ళ భూభాగానిన్ని అమెరికా కు వదిలారు .అదే రార్వాత సదరన్ అరిజోనా ,సదరన్ న్యు మెక్సికో లు గా మారాయి .దీన్ని ‘’గాడ్సన్ కొనుగోలు  ఒప్పందం ‘’అంటారు .దీనితో అమెరికా విస్తరణ పూర్తీ అయింది .ఇదే ఆధునిక అమెరికా మాప్  వేయటానికి తోడ్పడింది .

 క్యూబా తో కూడా ఒప్పందం చేసుకొని దాన్ని అమెరికా లో కలిపే ప్రయత్నం పియర్స్ చేశాడు కాని అది కుదర లేదు .క్యూబ కు వచ్చిన మొదటి సెట్లర్స్ అందరు ఆఫ్రికా నుంచే వచ్చారు .హవాయి ద్వీపాలను అమెరికా లోకలిపే ప్రయత్నించాడు .బ్రిటన్ ,ఫ్రాన్సులు అడ్డుపడ్డాయి .చివరికి 1959లో హవాయి అమెరికా యాభైవ రాష్ట్రం గా చేరింది .ఆనాటి పియర్స్ ఆలోచన ఇప్పటికి నిజమైంది .

 జపాన్ తో ఎవరు వర్తక వాణిజ్యాలు జరపలేదు .అది ఏకాకి గా ఉండేది .పియర్స్ దాన్ని ఒప్పించి వాణిజ్యం చేశాడు .తన వైస్ ప్రెసిడెంట్ పదవి చె బట్టిన కొత్త లోనే చని పోయినా మళ్ళీ ఎవర్నీ నియమించా లేదు .అతని కాలం లో అంటి స్లేవారి సొసైటీ అనే తోరోంతో లో ని సంస్థ 30,000 మంది బ్పట్టుబడిన బానిసలను విడుదల చేస్చేశాడు .వారంతా కెనడా లో భూములు కొన్నారు .

 పియర్స్ లింకన్ ఉద్ద సన్నాహాలను అంగీకరించా లేదు .కాని ఏమీ నిర్ణయం తీసుకో లేక పోయాడు .రెండో సారి ప్రెసిడెంట్ గా నిలబడ లేదు .భార్య ,సంతానం అందరు చని పోయారు ,బాధను మర్చి పోవటానికి చివర్లో మళ్ళీ మందు మొదలు పెట్టాడు .1869  లో ఫ్రాన్క్లిన్ పియర్స్ మరణించాడు .ఒద్దు అనుకున్న వాడికి అధ్యక్షా పదవి దక్కింది .బానిసత్వం పై నిర్ణయం తీసుకో లేక పోయాడు .చివరికి లింకన్ యుద్ధమే పరిష్కారం అయింది .ఉనియన్ నిలిచింది .  

         మరి కొన్ని విశేషాలతో మరోసారి 

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 11-6-12 –కాంప్-అమెరికా    

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –2

   అమెరికా ఊసులు –2

     మిలీషియా అనే మాటకు అర్ధం పౌర సైన్యం అని అంతే కాని మిలిటెంట్లు అని కాదు .మాటల కంటే చేతలకే విలువ ఎక్కువ అన్న దానికి actions speak louder than words అంటారు .ఒక సారి ఫ్రాంక్లి పియర్స్ స్కూల్ నుండి ఎగా కొట్టి ఇంటికి రావాలని ఆలోచించి వచ్చే శాడు .ఇంటికి వస్తే ఇంట్లో ఎవరు లేరు .ఇంతలో తండ్రి వచ్చి గుర్రబ్బండి ఎక్కించు కొని సరదాగా తీసుకొని వెళ్లి స్కూల్ కు అరమైలు దూరం లో ఆపి నడిచి వెళ్ళమన్నాడు .విపరీతం గా వర్షం పడుతోంది .అయినా తండ్రి మాట కు విలువ ఇచ్చి నడుచు కుంటూ బడికి వెళ్లాడు .అంత క్రమశిక్షణ తో ఉండ బట్టే అమెరికా ప్రెసిడెంట్ అయాడు ఫ్రాంక్లిన్ పియర్స్ .if your past is limited ,your future is boundless అనేది అతని సూక్తి .తన అల్లర చిల్లర వేషాలు ఎలా చదువు కు హాని కలిగిస్తున్నాయో గ్రహించి ,దారి మార్చుకొని గ్రేడులు పెంచుకొన్నాడు .

     ఆకాలం లో యే రాష్ట్రం అధికారం దానిదే .మిస్సోరి బానిస రాష్ట్రం గా ఉనియన్ లో చేరితే ,మైనే అనేది ఫ్రీ స్టేట్ గా చేరింది .1825 లో ఈరీ కెనాల్ ద్వారా నౌకా యానం ప్రారంభమైంది .అది 360 మైళ్ళ పొడవు ,40 అడుగుల వెడల్పు ఉండి .దీనితో నౌకల ద్వారా వ్యాపారం విపరీతంగా పెరిగింది .1909 లో దాని పొడవు 340 మైళ్ళు వెడల్పు 150 అడుగులకు పెంచి పన్నెండు అడుగుల లోతు చేసి న్యు యార్క్ స్టేట్ బార్జి కెనాల్ సిస్టం గా రూపొందించారు .

 ఫ్రాన్క్లిన్ పియర్స్ సైన్యం లో పదమూడు ఏళ్ళ కే చేరాదు .అతన్ని తోటి సైనికులు  old hickery అనే వాళ్ళు .అంటే హికారీ చెట్టు లాగ ద్రుధం గా ఉన్నాడని అర్ధం .అప్పటి ప్రెసిడెంట్ జాక్సన్ అంటే అందరికి అభిమానం .ఆయన్ను ‘’పీపుల్స్ ప్రెసిడెంట్ ‘’అని ఆప్యాయం గా పిల్చే వారు .ఆ కాలం లో అమెరికా లో ఒకే ఒక్క బాంక్ ఉండేది .అది ‘’బాంక్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ‘’అది ధనికుల బాంక్ అని పేదలకు ఉపయోగం లేదని జాక్సన్ అభి ప్రాయ పడ్డాడు .దాన్ని రద్దు చేసి చిన్న బంకులను ఏర్పాటు చేయాలని భావించాడు .అప్పటి దాకా డెమొక్రాటిక్ రిపబ్లికన్ పార్టి అని పిలువా బడే దాన్ని జాక్సన్ డెమొక్రాటిక్ పార్టి అని మార్చాడు .            

 నతానియాల్ హతారన్ అనే రచయిత పియర్స్ క్లాస్ మేట్ .ఆయన గురించి చక్కని చిన్న పరిచయాన్ని రాసి ప్రెసిడెంట్ గా పియర్స్ పోటీ చేసినప్పుడు ఇచ్చాడు .అది అందరికీ నచ్చి అతను ప్రెసిడెంట్ అవటానికి బాగా తోడ్పడింది .పియర్స్ 1831లో శాసన సభకు ఎన్నికైన అతి చిన్న వాడు .

          అప్పుడు ఆడ వాళ్లకు వోటింగ్ హక్కు లేదు .చదువుకునే వీలు వోటు వేసే హక్కు ,మగవారితో సమాన వేతనాలు ఉండేవి కావు .Elizabeth cady Stantan అనే మహిళా అనేక మంది స్త్రీల తో కలిసి భారీ రాలీ నిర్వ హించి diclaretion of sentiments ను 1848 జూలై ఇరవై న న్యూయార్క్ లో విడుదల చేసింది .అదే అమెరికా లో స్త్రీ ల సమాన హోదాకు ప్రాతి పదిక ఉద్యమం అయింది .అయితే వెంటనే వారికి అవి లభించాయి అనుకొంటే పోరా బాటే .ఆ తర్వాతా 72 ఏళ్లకు కాని వారి కళలు ఫలించ లేదు .పందొమ్మిదవ రాజ్యాంగ సవరణ వల్ల వారికి సమాన హక్కులు లభించాయి .

         బానిస తనం అంటే కొద్ది మంది ధనికులు కొందరు మనుషుల్ని కొనుక్కొని వెట్టి చాకిరి చేయించు కోవటం .కొన బడ్డ వాళ్ళు ప్రైవేట్ ఆస్తి కింద జమ .దీన్నే స్లేవారి అన్నారు .ఇది ప్రపంచం అంతా పూర్వ కాలం లో ఉండేది .గ్రీసు ,రొమే లలో బాగా ఎక్కువ .జయించిన దేశాలలోని జనాన్ని బానిసలుగా వాడు కొనే వారు .అమెరికా కు మొట్ట మొదటగా బానిసలు మొదటి బ్రిటీష కాలని జేమేస్ టౌన్ లో ఏర్పడి నప్పుడు1620 లో  వచ్చారు .ఆఫ్రికా లోని నల్ల జాతి వారిని ఇంగ్లీష ,స్పానిష్ ,పోర్చుగీసు వారు దిగుమతి చేసుకొన్నారు .అదే బానిస వ్యాపారం .మద్య దళారీలుందే వారు .వారికి డబ్బు బాగా గిట్టేది .ఎంత ఎక్కువ మంది బానిసలుంటే అంత గొప్ప వాడు అని భావించే వారు .బానిసలను దక్షిణ రాష్ట్రాలలో పంటలు పండించా తనికి ఎక్కువగా వాడు కొనే వారు .ఇంత తిండి పడేసి ఉండటానికి కాస్త చోటిస్తే చాలు రెక్కలు ముక్కలు చేసుకొని పగలు రాత్రి సేవ చేసే వారు .జీతం ఇవ్వక్కర్లేదు .మంచి లాభ సాటి పని .వారి పంతో బానిస అధికారులు పిచ్చ డబ్బు సంపాదించారు పంటలు బాగా పండటమే కారణం ..బానిసలకు ఒరిగిందేమీ లేదు .యజమానులు డబ్బు చేసింది వీరికి చాకిరి మిగి లింది .బానిస కుటుంబం అంతా ఊడిగం చేయాల్సిందే .

              ఈ బానిస విధానం ఉత్తర రాష్ట్రాలలో లేదు .బానిస విమోచన ఉద్యమం క్రమంగా పెరిగింది .దీన్ని లాయడ్ గారిసన్ ,ఫ్రెడరిక్ దగ్లాస్ బాగా ప్రచారం చేసి వారిలో ఐక్యత తెచ్చి పోరాటాలు చేసి ,హక్కుల కోసం ఉద్యమాలు నది పించారు .దేశం డెందు గా చీలింది .ఉత్తర ,దక్షిణ రాష్ట్రాల మద్య యుద్ధం సాగింది .దక్షిణాది వారికి బానిసత్వం కావాలి లేకపోతే వారికి పంటలు పండించే జనం ఉండరు ..దీన్నే అమెరికన్ సివిల్ వార్ అంటారు .1863 లో ప్రెసిడెంట్ లింకన్ యుద్ధం చేసి బానిసలకు విముక్తి ప్రసాదించాడు .జేమేస్ పొలాక్ అనే స్పీకర్ బానిసత్వం అసాన్ఘికం అని భావించాడు .1836 లో టెక్సాస్ రాష్ట్రం మెక్సికో తో యుద్ధం చేసి స్వాతంత్రాన్ని సంపాదించు కొంది .యునియన్ లో చేరింది .

  అమెరికా లోను సభల్లో బాగా తాగి వచ్చి సభ్యులు గోల చేసే వారు .ఒక సారి పియర్స్ ఎనేట్ సభ్యుడై పిత్మన్ అనే ఆయన ఇంట్లో ఉన్నాడు .ఆయన ఎవర్నీ తాగానిచ్చే వాడు కాదు . పియర్స్ తాగాను అని ప్రతిజ్ఞా చేసి అక్కడ ఉన్నాడు .మళ్ళీ చ్తాగలేదు మాట నిలుపు కొన్నాడు .ఎన్నేతర్ గా ,కల్నల్ గా పని చేశాడు .తర్వాతా లా ప్రాక్టీస్ చేసి హాయిగా రాజ కీయాలకు దూరం గా ఉన్నాడు .ఇంట్లో నే ఉన్నాడు .అప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చాయి .అతనేమీ ఆలోచించ లేదు .అప్పుడు డెమొక్రాటిక్ పార్టి వాళ్ళు అతన్ని నామినేషన్ వేయమని ఒత్తిడి చేశారు .వద్దన్నాడు చేసింది .అయినా చివరికి ఒప్పుకొన్నాడు .ముప్ఫై తొమ్మిది సార్లు అభిప్రాయ సేకరణ చేసి చివరికి పియర్స్ నే ఏకగ్రీవం గా డెమొక్రాటిక్ అభ్యర్ధి గా నిలబెట్టారు .అయిష్టం గా నే నిలబడ్డ గెలిచి ప్రెసిడెంట్ అయాడు .అదృష్టం అతని ఇంటి తలుపు తట్టి ప్రెసిడెంట్  ను చేసింది .

    సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-6-12.—కాంప్ –అమెరి

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –1

    అమెరికా ఊసులు –1

          అమెరికాపన్నెండవ   ప్రెసిడెంట్ గా ఫ్రాంక్లిన్ పిఎర్స్ ఉన్న కాలం లో అమెరికా లో ప్రఖ్యాత రచయితలు ,తత్వ వేత్తలు కవులు ఉండే వారు ..వారి లో నతానియాల్ హతారన్ ,,లాంగ్ ఫెలో ,మెల్విల్లే ,ఎమేర్సన్ ,హెన్రీ డేవిడ్ తోరో లతో పాటు అమెరికా కు చెందినా అసలైన కవిత్వాన్ని సృష్టించిన వాడు ,అమెరికా ఆత్మను తట్టి లేపిన వాడు ,అగ్గి పిల్లా కుక్క పిల్లా కాదేది కవిత కనర్హం అని శ్రీ శ్రీ కి ప్రేరణ నిచ్చి సమస్త వృత్తుల వారికి కవిత్వం లో స్థానం కల్పించి ,అమెరికా జాతీయ కవి అని పించు కొన్న వాడు   ‘’గడ్డి పరకలు ‘’అనే దీర్ఘ కవిత రాసిన వాడు వాల్ట్ విట్మన్ కూడా ఉన్నాడు .ఇందులో తోరో గారు గాంధీని ప్రభావితం చేసిన వాడు .ఆయన ఎక్కడో అడవి లో జనాలకు దూరం గా వాల్డెన్ పాండ్ దగ్గర ఉండే వాడు .రుషి జీవితం గడి పాడు .అమెరిక న్ రుషి అని పించుకొన్నాడు .అడవి లోని ప్రక్రుతి తనకు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకం బా   బో ధించిందని చెప్పాడు .సాధారణ జీవితం గడి పాడు అన్నీ ఉన్నా ,అంత రంగ సంగీతాన్ని విన మని ప్రబోధించాడు .

      వాల్ట్  విట్మన్ గొప్ప కవిత్వం  ర్రాసినా ,ఆయన రాసిన’’ లీవెస్ ఆఫ్ గ్రాస్స్ ‘’ కవిత ను ఎవ్వరు ముద్రించటానికి ముందుకు రాలేదు .ఆయన కవిత్వం అతి సాధారణం గా ఉందన్నారు .విప్లవాత్మకం గా ఉందన్నారు .అప్పటి దాకా ఇంగ్లాండ్ ప్రభావం తో అమెరికా కవులు రాస్తున్నారు .దీన్ని వదిలి కొత్త  మార్గం తొక్కాడు విట్మన్ ‘’.అందరి మాన్ ‘’ అయాడు .విసుగెత్తి తన పుస్తకాన్ని స్వంత చమురు వదిలించుకొని అచ్చేసి వదిలాడు .అది సూపర్ డూపర్ హిట్ అయింది .అప్పుడు తెలిసింది అసలు కవిత్వం అంటే ఏమిటో /తమ ఆత్మను తట్టి లేపాడు విట్మన అని భావించారు .అదే పని ని వచనం లో మార్క్ ట్వేన్ చేసి చూపించాడు .అసలు అమెరికన్ వచనానికి పదును పెట్టాడు .సజీవమైన పాత్రల్ని సృష్టించాడు .వాడుక భాష ను రాశాడు .పాత్రలలో పరకాయ ప్రవేశం చేశాడు .విస్తృతం గా పర్యటించాడు .ఇదీ అమెరికన్ భాష అని రాసి చూపించి మెప్పు పొందాడు నిద్రిస్తున్న అమెరికా జాతిని జాగృతం చేశాడు .భాష లో భావం లో ఎన్నో మార్పులు తెచ్చాడు .అతను రాసినవీ హిట్టు పై హిట్టులే ..విట్మన్ ,మార్క్ ట్వేన్ లకు అమెరికన్ జాతి సర్వదా రుణ పడి ఉంటుంది .విట్మన్ కవితా పుస్తకాన్ని జాన్ విత్తర్ అనే కవి ‘’ఇదేమి కవిత్వం ?’’అని తగల బెట్టాడు .కాని దీన్నే ఎమర్సన్ తాత్వికుడు విల్త్మన్ కవిత్వాన్ని మెచ్చుకొని వెన్ను తట్టాడు .అది ‘’free and great thought ‘’అన్నాడు ఆ మహా రచయిత .అయితే విట్మన్ గొప్పతనం ఆయన చని పోయిన తర్వాతే ప్రపంచం బాగా అర్ధం చేసుకొన్నది .

     i celebrate my  self ,and sing my self –and what i assume you shall aassume –for every atom belonging to –as good belongs to you ‘’అన్నాడు విట్మన్ leaves of grass లో .

          అమెరికా లో నల్ల జాతి అస్తిత్వాన్ని నిలబెట్ట టానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి మార్క్ ట్వేన్ నవలల్లో వాళ్లకు స్తానం కల్పించి వారి భాష మాట్లాడించాడు .harriet  Beacher  Stowe అనే రచయిత్రి uncle tom’s cabin ‘’ అనే నవలలో బానిసత్వం పై తిరుగు బాటు బోధించింది .దక్షిణ రాష్ట్రాలలో ఈ నవల సంచలనం రేకెత్తించింది .1852లో ఇది ప్ర చురిత మై బానిసల కడగండ్ల ను కళ్ళకు కట్టించింది .బానిసల తిరుగు బాటు కు మార్గ దర్శకత్వం వహించింది .ఆ పుస్తకం అంత ర్జతీయం గా బెస్ట్ సెల్లార్ అని పించు కొంది .ఒక మిలియన్ కాపీలు అన్ని భాషల్లో అమ్ముడు అయాయి .దీని ప్రభావాన్ని చూసి ఎమర్సన్ మహాశయుడు ‘’ఇది విశ్వ హృదయాన్ని తెలియ జేసింది .అందరు అదే ఉత్కంత తో చదివారు .వంటింట్లో కారిడార్లో క్లాసుల్లో ఎక్కడ చూసినా దాన్ని చదివే వారిని చూశాను ‘’అన్నాడు .ఎమర్సన్ గారి ముద్ర పడింది అంటే ఆ కాలం లో ‘’తాతా చార్యుల ముద్ర ‘’పడిందన్న మాట .అంత గౌరవం .ఎమర్సన్ అంటే .మన ప్రాచీన మహర్షుల స్థానమే .ఆయన్ను ఎక్కువ గా ఉదాహరిస్తుంటారు  మన వాళ్ళు .ఆయనకూ ఇండియా అంటే పరమ గౌరవం ,ఆదరం .మన క్లాసిక్స్ అన్నీ ఆయనకు కరతలా మలకాలే .ఇలా ఎమర్సన్ ,విట్మన్ మార్క్ ట్వేన్ ,స్టీవ్ లు సాధారణ జన ఘోష ను ,వారి అనుభవాలను గురించి రాసి ,వారి హృదయాలను ,పాథకుల హృదయాలను స్పందింప జేశారు .

             మాములుగా అందరు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తన కొడుకు చదివే స్కూల్ ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరాన్ని ఉదాహరిస్తుంటారు .కాని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ పేయర్స్ లింకన్ గారి అబ్బాయి చని పోతే రాసిన ఉత్తరాన్ని ఎవరు గుర్తుంచు కోరు .అదే ఇది –

     ‘’the impulse to write you ,,the moment i heard of your great domestic affliction was very strong ,but it brought back the crushing sorrow which be fell me just before i went to washington ,in 1853 ,with such power that i feel your grief to be too sacred for instruction .even in this hour ,so full of danger to our country ,and of trial and anxietyto all good men ,your thoughts will be ,of your cherished boy ,who will nestle in your heart ,until you meet in that new life ,where tears and toils and conflicts will be unknown ‘’

          ఈ ఉత్తరాన్ని one of the most  moving letters  గా సాహిత్య కారులు భావిస్తారు .ఒక ప్రెసిడెంట్ కు ఇంకో పదవీ విరమణ చేసిన ప్రెసిడెంట్ రాసిన జాబు ఇది .ఇక్కడ ఇంకో విషాదం ఏమి టంటే పియర్స్ సంతానం అంతా చిన్నతనాలలోనే చని పోయారు .అంతే కాదు ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికై పదవీ బాధ్యతలు చేబట్ట టానికి కొన్ని రోజుల ముందు రైల లో ప్రయాణం చేస్తుండగా ఒకరైలు దుర్ఘటన లో ఉన్న ఒక్క గానోక్క కొడుకు మరణించాడు .కనుక పుత్రశోకం అంటే ఏమిటో పూర్తిగా ఫ్రాంక్లిన్ కు తెలుసు .అందుకే అంత గొప్పగా స్పందిన్చాదాయన . పియర్స్ కోక్కగానోక్క కొడుకు పోయినప్పుడు ఆయన ‘’  i have lost the center of my hopes ‘’   అని దుఃఖ పడ్డాడు .ఆ బాధ తోనే వైట్ హౌస్ లో కాలు పెట్టాడు పాపం విధి వంచితుడు .

 ఫ్రాంక్లిన్ న్యుహాంప్ షైర్ వాడు .అమెరికా లో ముందు నుంచి ఉన్న పదమూడు కాలనీ లలో అది ఒకటి .కెప్టెన్ మార్టిన్ ప్రింగ్ 1603లో  అక్కడ కాలు పెట్టిన మొదటి ఆంగ్లేయ పరిశోధకుడు .తర్వాతా రెండేళ్లకు సామ్యుయాల్ డే చాంపియన్ అనే ఫ్రెంచ్ వాడు అక్కడికి వెళ్లాడు .అంతే కాదు ఆ రాష్ట్రం బ్రిటీష వారి నుండి మొదటిగా స్వాతంత్రాన్న5-1-1 776 లో ప్రకటించుకొన్న రాష్ట్రం కూడా .అయితే పూర్తీ స్వాతంత్రం రెండేళ్ళ తర్వాతా పొందింది .ఆ రాష్ట్రం విధానం అప్పుడు ‘’live free or die ‘’.న్యు ఇంగ్లాండ్ రాష్ట్రాల్లో అదొకటి .అక్కడ చాలా సరస్సులు జల ప్రవాహాలు చేపలు పట్టటానికి అనుకూలం గా ఉంటాయి .అక్కడి ఆదివాసులను ‘అబెనాకి ఇండియన్స్ ‘’అంటారు .అక్కడి గొప్ప వైన white mountains ఉన్నాయి .వాటిలో ఎత్తైన శిఖరం 6,288అడుగుల ఎత్తున్న మోంట్ వాషింగ్తన్’’ ఈ రాష్ట్రం అనేక వస్తువుల ఉత్పత్తి కేంద్రం .ప్రత్తి మిల్లులు ,పేపర్ మిల్లులు యంత్ర సామగ్రికి పేరు .అట్లాంటిక్ సముద్ర తీరం లో ,మేర్రిమాక్ ,కనెక్టికట్ నదీ తీరాల్లో లెక్కలేనన్నిఫాక్టరీలున్నాయి .

     సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —10-6-12—కాంప్—అమెరికా .

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –6 ఆత్మారామధన యోగి –జగన్నాధ స్వామి

  సిద్ధ యోగి పుంగవులు –6

                                                       ఆత్మారామధన యోగి –జగన్నాధ స్వామి

 సవరింపు –గణపతి ముని గారి వ్యాసం-5-అందులో మూడు భాగాలు అందులోవే .కనుక అదంతా అయిదు కిందే లెక్క .ఇప్పుడు 6 –జగన్నాధ స్వామి గారిది అని గమనించగలరు

         వైశ్య కులం లో జన్మించి ,భగవదాదేశం గా అనేక పెద్ద దేవాలయాలను నిర్మించి ,తనకు జయన్తులక్కర్లేదని ఆరాధన చాలు నని ఆరాధన అంటే ఆత్మా అనే రామ ధనాన్ని సంపాదించటమే నని గొప్ప అర్ధం  చెప్పిన యోగి జగన్నాధ స్వామి .

      ఒంగోలు లో కోట సుబ్బయ్య ,కావమ్మ , దంపతులకు11-8-1885న జగన్నాధ స్వామి జన్మించారు ..పసివాడుగా ఉన్నప్పుడే ఉయ్యాలలో యోగాసనాలు వేసే వాడు ..మహర్షులు సూక్షమ రూపం లో వచ్చి మాట్లాడి వెళ్ళే వారట ..మిథాయి దుకాణం లో కొంత కాలం పని చేశాడు .ఒక సారి కోతి కొమ్మచ్చి ఆడుతుంటే కేశవా రాజ యోగీంద్రులు వచ్చి ఆకాశ మార్గం లో తీసుకొని పోయి శ్రీ శైల గుహల్లో దింపాడు .అక్కడి మహర్షులు పరకాయ ప్రవేశం వంటి మహా సిఇద్ధులు నేర్పారు .త్రిమూర్తులు ప్రత్యక్షమై మానవ లోకం లో దేవాలయాలను నిర్మించి భక్తిని ప్రచారం చేయమని ఆదేశించారు .ఆయనతో ఆడు కొంటున్న పిల్లలు ఇతడు కని పించక పోయే సరికి కంగారు పడ్డారు .కొన్ని రోజుల తర్వాతా ఆయన ఇంటికి వచ్చి ,జరిగినవి అందరికి చెప్పాడు .ఒక సారి పొరలు దండాలు పెట్టు కొంటు ఒక చోట ఆగి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించమని గురువైన లక్ష్మీ కాంత యోగికి చెప్పాడు .వెంటనే అక్కడ దేవాలయం నిర్మించారు .నల్లపాడు లో నరసింహ స్వామి కొండ పై శివ కేశవులు ప్రత్యక్షమై యోగావిద్యను ,మంత్ర ఉపదేశాలు చేసి ధార్మిక ప్రవృత్తిని ప్రజల్లో ప్రచారం చేయమని కోరారు .దాని ప్రకారం ఎల్లలూరు ,మంచాల ,చేబ్రోలు ,బ్రాహ్మణ కోడూరు లలో భక్తినీ ,యోగాన్ని విస్తృతం గా ప్రచారం చేశారు .

                       జగన్నాదునికి చెంచంమ తో వివాహం జరిగింది .ఆమె కొద్ది కాలానికే మరణిస్తే కోటి రత్నమ్మ తో మళ్ళీ పెళ్లి జరిగింది .సీతమ్మ అనే ఆడ పిల్ల పుట్టింది .భార్యకు రోజు ఇరవై ఒక్క ఇళ్ళల్లో భిక్ష చేసుకొని బ్రతకమని చెప్పి ,ఆనదాశ్రమం చేరాడు .భార్య మరణిస్తే ,పిల్లను బాపట్లకు తీసుకొని వచ్చాడు .అక్కడ బొమ్మి సెట్టి సుబ్రహ్మణ్యం ,శేషారత్నం దంపతులు స్వామికి భిక్షనిచ్చే వారు .ఒకసారి భక్తులందరూ కలిసి కలశ పూజ పెద్ద ఎత్తున చేసి అన్నదానం చేశారు .అప్పుడు ఆకాశం మేఘావృత మై విపరీతం గా వర్షం కురిసేట్లుంది .చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపెయే ప్రమాదం వచ్చింది .స్వామిమేఘాలను తొలగి పొమ్మని ఆదేశిస్తే అవి ఎక్కడికో వెళ్లి పోయాయి .చుక్క వర్షం కూడా పద కుండా సంతర్పణ జరిగి స్వామి మహిమ బయట పడింది .

   జగన్నాధ స్వామి ఉత్తర ,దక్షిణ యాత్రలు చేశాడు ..కాశీలో భక్తులతో గంగలో పవిత్ర స్నాలాను చేయిస్తుండగా వారు ‘’స్వామీ ! మా పాపాలు పోయాయి అనటానికి రుజువేమిటి ?’’అని అడిగారు .స్వామి వారితో ప్రార్ధన చేయించి తమ చేతి లో గంగా జలాన్ని విడువమని చెప్పాడు ..అప్పుడు కొన్ని పీపాల నూనె పోసినట్లు గంగ నీటి పై నూనె తెట్టు వ్యాపించింది .అంటే వారి పాపాలన్నీ పంకిలమై బయటికి తెట్టు లాగా కొట్టుకు పోయాయన్న మాట .

        నల్లపాడు లో ఉండగా కేశవా రాజ యోగి ఆయన్ను ఆవేశించి ఒక పుడకతో ఇసుక మీద ఆలయ నిర్మాణానికి ప్లాన్ గీసి .కకోమ్మమూరు నరసింహం అనే కారణం దాన్ని కాగితం మీద కాపీ చేశాడు .దేవాలయ నిర్మాణం కోసం తగిన స్థలం కోసం వేడుకు తున్నాడు స్వామి ..చీరాల నుండి పొన్నూరు దాకా పొరలు దండాలు పెట్టు కుంటూ అక్కడి బస స్టాండ్ ఎదురుగా ఆగిపోయాడు .అది మహర్షులు పూర్వం తపస్సు చేసిన భూమి అని గుర్తించి అక్కడే దేవాలయాన్ని కట్టాలని సూచించాడు .విరామం లేకుండా చుట్టూ ప్రక్కల గ్రామాలన్నీ తిరిగి చందాలు వసూలు చేసి  1108 మందిడంపతులతో ‘’సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం ‘’కట్టించారు .స్వామి ఆదేశం ప్రకారం ఎడ్ల పాడు కొండ దగ్గర రెండేళ్లు నిష్టగా ఉండి కనిగాల్పుల ఆంజనేయులు ,జాలమ్మ దంపతులు రెండు తాడి చెట్ల ఎత్తున వుండే రాయిని తీయించి చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు ..ఆ కొండమీద ఉండే చిరుత పులులు ఈ దంపతుల జోలికి రాకుండా స్వామి కట్టడి చేశాడు .కొన్ని వేల మందికి దీక్షలనిచ్చి జపాలు చేయించారు .బొంబాయి నుంచి పెద్ద ట్రాలీలు తెప్పించి దానిపై ఆ భారీ విగ్రహాన్ని చేర్చి 100 జతల ఎడ్ల తో దాన్ని లాగించి చేబ్రోలు వంతెన దాకా తెప్పించారు .వంతెన కూలి పోతుందని ప్రభుత్వం అనుమతించలేదు .స్వామీ తాను పూచీ వహించ ,యే ప్రమాదం లేకుండా వంతెన దాటించి యోగాబలం తో పొన్నూరు దేవాలయ ప్రాంగణానికి తెప్పించారు .ఆంజనేయ గరుడ విగ్రహాల ప్రతిష్ట అత్యంత వైభవో పేతం గా జారి పించారు .ఆంజనేయులు దంపతులకు ఒక పిల్లాడున్నాడు .దంపతులను వైకుంఠానికి పంపుతాను వెళ్తారా అని అడిగారు స్వామి వారు వద్దు అన్నారు .అప్పుడు వారి పుణ్య ఫలాన్ని కొడుక్కు ధారా పోయించి ,అతన్ని వైకుంఠం పంపారు జగన్నాధ స్వామి .అతని సూక్ష్మ శరీరం ఆంజనేయ ఆలయం లో ఉండేట్లు చేసి ,ఆ దేవాలయానికి గొప్ప ప్రచారం కల్పించారు .జాలమ్మ చేత 108ఏకాదశీ వ్రతాలు స్వామి చేయించారు .

         ఒక సారి శ్రీశైల యాత్ర చేస్తూ కాలినడకన భక్తులతో వెళ్తూ కొండమీద నుంచి లోయ లోకి జారి పడ్డాడు .ఒక మహర్షి ఆయన పది పోకుండా ఒళ్ళోకి తీసుకొని స్వామి నాలుక పై బీజాక్షరాలు రాశాడు .వేరొక సారి కేశవా రాజ స్వామి జగద నాధస్వామి ని జీవుడిని పర లోకాలకు తీసుకొని వెళ్లి ,త్రిమూర్తుల లోకాలు చూపించి నాలుగు గంటల తర్వాతా మళ్ళీ ఆనందాశ్రమం లో చేర్చాడు .స్వామి నల్లపాడు నరసింహ స్వామి కొండ పై తిరుగుతూ ఉంటె కేశవ స్కామి వచ్చి ఆయన పొట్ట ను గొల్ల తో చీల్చి ,ఒక గొట్టం లాంటి నరం పెట్టి మూసేశాడు ..అప్పటి నుడి పరక్సాయప్రవేశ విద్య అలవడింది .కేశవస్వామి చెప్పి చూపించిన చెట్టు ఆకులు తిని రెండు నెలలు ఆకలి దప్పులు లేకుండా గడిపాడు .చెట్లు ఎక్కి దూకటం ఆయనకు అలవాటు .కొమ్మ నుంచి కొమ్మకు దూకటం తో పూరకం ,చిటారు కొమ్మ కు ఎగరటం టో కుంభకం ,,కింది కొమ్మ మీదికి దూకటం లో రేచకం కేశవ స్వామే నేర్పారు .ఆయనకేమీ దెబ్బలు తగిలేవి కావు .

             కాల భైరవ ఆలయాన్ని అమరా రాదా కృష్ణ మూర్తి దంపతులచే కాల భైరవ ఆలయాన్ని కట్టించారు .ఆపరేషన్ లేకుండా మద్దుల వెంకట రత్నమ్మ కు బల్ల వ్యాధిని పోగొట్టారు .నొసట బొటన వ్రేలితో నొక్కి సుబ్రహ్మణ్యం అనే భక్తుడి జ్వరం తీశేసి తాను పొందాడు .స్వామి ఒక సారి అరకాయ ప్రవేశం చేస్తున్నాడు .దాన్ని ఎవరు చూడ కుండా ఒక గదిలో చేయాలి .ఎమ్జరుగు తుందో చూద్దామని ఒకడు ఆ గడి లో ఆటక ఎక్కి కూర్చున్నాడు .స్వామి హంసను వదిలాడు .అప్పుదేర్పడిన ప్రకాశానికి అటకెక్కిన తుంటరి రెండు కళ్ళు పోయాయి .మాటలు రాణి వాడికి మాటలు నేర్పాడు .ఒక సారి చందోలు వెళ్లి వెంకటేశ్వర్ల అనే ఆయన ఇంటి అరుగు మీద కూచున్నాడు .ఎవరు పలకరించలేదు .అప్పుడు ఆ వూరి బ్రాహ్మీ మూర్తి అమ్మ అనుగ్రహానికి పాత్రులై ఏది పలికితే అది జరిగే తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు చూసి వెంకటేశ్వర్లకు కబురు చేసి ఆడరించేట్లు చేశారు .భగవద్గీత నేర్పమని బొమ్మి శెట్టి సుబ్రహ్మణ్యం అనే అతను కోరితే చెంబు లోని నీళ్ళు మూడు దోసిళ్ళు ఇచ్చి తాగించాడు ,తెల్లారేసరికి భగవద్గీత వచ్చేసింది ఆయనకు .ఇలాంటి వెన్నో మహిమలు చూపాడు స్వామి .

  భక్తులు జగన్నాధ స్వామికి ఏటేటా ఆరాధనోత్సవాలు జరిపే వారు .జయన్తులను జరుపుకొనే వారు కాదు .దీనికి కారణం ఏమిటని ఆరాధన అంటే ఏమిటని  ప్రశ్నిస్తే ‘’ఆ అంటే ఆత్మా అని ,రా అంటే రాముడని ,ధన అంటే ధనం అనీ చెప్పారు అంటే ‘’ఆత్మా రాముడు అనే ధనం సంపాదించాను .కనుక నాకు ఆరాధనే సరి అయినది ‘’అని విస్పష్టం గా చెప్పాడు 10-9-1974 లో జగన్నాధ స్వామి శరీరం  చాలించారు .భాద్ర పద నవమి నాడు స్వామి ఆరాధనోత్సవాన్ని భక్తులు వైభవం గా నిర్వ హిస్తున్నారు .

       మరో యోగికద మరో సారి

         సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-6-12.—కాంప్ –అమెరికా .

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు — 07 వాసిష్ట గణపతి ముని –03

         సిద్ధ  యోగి పుంగవులు —  07 

                                                                వాసిష్ట గణపతి ముని –03

                                                                  కాంగ్రెస్ కు వీడ్కోలు

    1923లో కాకినాడ కాంగ్రెస్ సభల్లో పురుషులతో పాటు స్త్రీ లకు ఉపనయన ,హోమ ,శ్రాద్ధ కర్మల్లో సమాన హక్కు ఉందని వేద శాస్త్ర ప్రమాణం గా నిరూపించారు గణపతి ముని .ఆలమూరు సబలో అస్పృశ్యతా నివారణ గురించి మాట్లాడి మహా మహా పండితుల నోళ్ళు మూయించారు .ద్రావిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షహోదాలో బెల్గాం కాంగ్రెస్ సభలో ఆ మరుసటి ఏడు పాల్గొని అస్పృశ్యత జాతికి అవమానం అని ప్రసంగించారు .గాంధీ గారు హిందీ ని రాష్ట్ర భాష గా సమర్దిన్చగా ,నాయన’’ సంస్కృతాన్ని జాతీయ భాషగా’’ చేయాలని వాదించటానికి సిద్ధ పడగా ,గాంధీ నాయనకు అవకాశం ఇవ్వ లేదు .విసుగొచ్చి రాజకీయాల నుండి వైదొలగారు .అయినా దేశ భక్తీ ని ప్రబోధించే ‘’రాష్ట్ర నిబంధన ‘’గ్రంధం రాశారు ‘’.సంస్కృతం ప్రపంచ భాష’’ కావాలని ‘’లాలి భాశోపదేశః ‘’పుస్తకం రాశారు .సంస్కృతం అంటే నాయనకు అంత అభిమానం .దాని పారం ముట్టిన భాషా కోవిదుడు .అతి మూత్ర వ్యాధి వచ్చినా గ్రంధ రచన మాన లేదు .అనేక సూత్ర ,ప్రామాణిక గ్రంధాలు రాస్తూనే ఉన్నారు .

                     ముని అని పించుకొన్న విధానం

         1925 లో బందరు ‘’సనాతన ధర్మ సభ ‘’లో సాంఘిక సంస్కరణల గురించి మాట్లాడారు .మంగళ గిరి నృసింహ క్షేత్రాన్ని ఇంద్ర క్షేత్రం గా గుర్తించారు నాయన .1926  లో తిరువన్నామలై చేరి ‘’పూర్ణ’’అనే సంస్కృత నవల రాశారు .నాయన రచనలు75 పైనే ఉన్నాయి .అందులో ఇరవైఒక్క  స్తోత్రాలు ,ఇరవైనాల్గు సూత్ర గ్రంధాలు ,మూడు తత్వ గ్రంధాలు ,ఏడు వ్యాఖ్యానాలు ,మూడు ఆయుర్వేద గ్రంధాలు ,మూడు జ్యోతిష గ్రంధాలు ,ఒక చారిత్రికం మిగిలినవి ప్రకరణాలు . 18-7-1926 నఅమ్మ మరణించింది .

         మరుసటి ఏడు సికందరాబాద్ వచ్చి శ్రీ రమణుల సందేశాన్ని విని పించి వేల మందికి మంత్ర దీక్షనిచ్చారు .4-2-1927 ణ జరిగిన శ్రీ కృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం రజతోత్సవాలకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లోని ‘’ఆది హిందూ సంఘం ‘’నాయనను పల్లకీలో ఊరేగించి ‘’ముని ‘’బిరుదు ను ప్రదానం చేశారు .డిసెంబర్ లో మచిలీ పట్నం లో జరిగిన మదన మోహన మాలవ్యా అధ్యక్షస్థానం లో ఉన్న సభలో అస్పృశ్యతా నివారణ గురించి మాట్లాడి ఆయన ఆదరానికి పాత్రులయారు .కాని చాందసుల నిరసన కు గురి అయారు .చండాలురకు దేవాలయ ప్రవేశం కల్గించాలని మల్లాది వారితో వాదించారు .

                                    అరవిందుల దర్శనం    

          అరవింద మహర్షి నుండి ఆహ్వానం అందుకొని శ్రీ రమణుల అనుమతి పొంది అరవిందాశ్రమం చేరారు .అరవిందులు తమకు పూర్వజన్మ లో  తపస్సు లో సఖులని ,తనకంటే అరవిందులు పెద్ద వారు , గొప్ప వారని చెప్పారు .అరవింద జయంతికి అరవిందాశ్రమం లో ఉన్నారు .రెండు నిముషాలు ఇద్దరు ఋషులు ఒకరి నొకరు తేరి పార చూసు కొన్నారు .ఒకరి మహిమను ఇంకోరు గ్రహించారు .అరవింద మాత నాయన తోధ్యానం చేశారు .నాయన ‘’జనని ‘’గ్రంధానికి పీఠిక ,108 సూత్రాల తత్వాను శాసనం రాశారు ..తిరువన్నామలై వచ్చి ;;ఇంద్ర స్తోత్రం ‘’రాశారు .

                             నాయన మహిమలు

                                  గోకర్ణం చేరి ‘’కాలువే ‘’ఆశ్రమం లో తపస్సు చేశారు .అహల్యా అనే స్త్రీకి గ్రహపీడను ,ఆమె భర్తకు టైఫాయిడ్ జ్వరాన్ని మంత్ర శక్తి తో వదిలించారు ..ఒక సారి శిష్యులతో ఆశ్రమం లో ఉండగా ప్రక్కనున్న గడ్డి వాము లు అంటుకొని మండుతుంటే ‘’పారాశర అగ్ని మంత్రం ‘’ప్రయోగించి అగ్ని జ్వాలలను,గడ్డి వాముల్ని  దూరం గ చిమ్మి వేసి ప్రమాదం నుండి కాపాడారు .ఇంకోసారి కొడుకు మహాదేవుడి తో  కారు లో ప్రయాణిస్తుంటే కారు ప్రమాదం జరిగి కొడుకు మోచేతి  ఎముక విరిగింది .నాయన కారు లోనే ‘’ఋగ్వేదం లోని ఆస్థి సంధాన మంత్రం ‘’పఠించి మోచేతిని అతి కించారు .1929-31 మద్య శీర్షి ఆనందాశ్రమం లో ఉండి వందలాది జనానికి మంత్ర దీక్ష నిచ్చి రమణ మహర్షి సందేశాన్ని బోధ పరచారు .’పూర్వం జరిగిన కపాల భేదన సిద్ధి తో తనలో ఏదో దివ్య శరీరం పుట్టి ఇతరులను ఆవహిస్తున్నట్లు తోచింది .రామ చంద్ర భట్టు అనే నిరక్షర కుక్షిని ఆ దివ్య శరీరం ఆవహించి అతన్ని సంస్కృత పండితుడిని చేసింది .రమణ మహర్షికి అనేక జాబులు రాశారు .అందులో తన శక్తి స్థానాలు మూడు అని పేర్కొన్నారు .మొదటిది రమణ మహర్షి ,రెండు భగవాన్ ఇంద్రుడు ,మూడు భారత మాత .ఇంద్రున్ని ఉపాశించి భారత మాత కు పట్టిన దుర్గతి ని తొలగించటమే తన ధ్యేయం అన్నారు నాయన .నాయన మాతృభక్తి ఎంత ఉత్క్రుష్టమైనదో మనకు దీని వల్ల తెలుస్తోంది .’’ఉన్నది నలుబది ‘’,ప్రచండ చండీ శతి ‘’,ఈశ ఉపనిశాత్తుకు భాష్యం రాశారు1933లో ఋగ్వేదం ఆధారం గా ‘’భారత చరిత్ర పరీక్ష ‘’అనే ఉద్గ్రంధాన్ని నాయన రాశారు ,వేద ,పురాణాలను సమన్వయము చేస్తూ రాసిన ,అరుదైన ,అద్భుత మైన గ్రంధం ఇది .నాయన నిశిత దృష్టికి సమన్వయ దృష్టికి నిలువెత్తు దర్పణం .దీన్ని చదివే అరుదై న  అవకాశం,పొందిన అదృష్ట వంతున్ని నేను .1934లో ఆంద్ర విశ్వ విద్యాలయం లో చేసిన ఉపన్యాసాలకు వైస్ చాన్సలర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుడు ముగ్ధుడై నాయనకు ఆచార్య పదవి లో నియోగిస్తామని కోరారు .తాను తపస్సును విడిచి ఉండలేనని మర్యాదగా తిరస్కరించారు .

                                                చివరి రోజులు

      ఖర్గ పూర్ i.i.t.లోని నేమాని సూర్య నారాయణ గారు నాయనను కలకత్తాకు  ఆహ్వానించారు అక్కడ గుంటూరు లక్ష్మీ కాంతం గారింట్లో ఉన్నారు .తాను పదేళ్ళ క్రితం కలలో చూసిన సిద్ధ పురుషుడే నాయన అని ఆయన గుర్తించారుఆయన . .కలకత్తా లో అవతార విశేషాలు ,రమణుల సందేశం ,వేదకాలం వంటి వాటి  పై విస్తృతం గా ప్రసంగించారు .అక్కడ గోపాల స్వామి అనే యోగితో పాటు కంచి చంద్ర శేఖర యతీన్ద్రులను దర్శించారు .స్వామి వారు నాయన గారిని గౌరవ ,ఆద రాలతోసత్కరించారు .

                                  స్వర్ణ సిద్ధి యోగం

     మనుమడి బారసాల కు కలువ రాయి వస్తుంటే నాయన  కు అనుకోకుండా దొరికిన రాగి నాణెం బంగారు గా మారింది .మళ్ళీ ఖర్గపూర్ వెళ్లి అక్కడ ఆశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేశారు .ఒక రోజు రాత్రి నాయన ‘’స్వర్ణ సిద్ధి యోగం ‘’ప్రదర్శించారు .కలకత్తా వెళ్లారు  .అక్కడ నేమాని సూర్య నారాయణ నెత్తిన అడుగున్నర ఎత్తున ఇనుప బీగం (తాళం ) పడ బోతుంటే దాన్ని పట్ట్టు కొని మూడు నిముషాలున్నారు .అది అయస్కాంతం లా ఇనుప వస్తువుల్ని ఆకర్షించింది .అంటే నాయన శరీరం లో శిరస్సు నుండి అవిచ్చిన్నం గా విద్యుత్తు ప్రవహిస్తోందని అర్ధమైంది .విశ్శమీమాంశ  కు తాత్పర్యం ,ఆత్మకధ ,పూర్వ కధ తెలుగు లో రాయటం ప్రారంభించారు .కర్మల్లో ప్రయోగించే మంత్రాలకు ఆధ్యాత్మిక వ్యాక్ష్యానం రాశారు .25-4-1936 మళ్ళీ ఖర్గపూర్ చేరారు .వేల సంఖ్యలో భక్తులేర్పడ్డారు ..నాయన ఎన్నో అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శించారు ‘’అబిసీనియా చక్ర వర్తి రాజ్య భ్రష్టుడు అవుతాడు ‘’అని ముందే నాయన చెప్పారు .నాయన ఆరోగ్యం బాగా క్షీణించింది .

                            నాయన అనాయాస మరణం

             తాన మరణించే సమయాన్ని నాలుగు రోజుల ముందే అందరికి తెలియ జేశారు .25-7-1936 నాడు దాత్రు నామ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి శని వారం మధ్యాహ్నం శిష్యులతో హోమం చేయించి అనాయాసం గా మరణించారు .భారతీయ వేద ,శాస్త్ర ,పురాణ ,ఇతి హాసాలను నాయన లాగా సమన్వయము చేసిన వారు లేరు ,లేరు ,లేరు .నాయనజీవిత చరిత్ర ను గుంటూరు లక్ష్మీ కాంతం గారు పుస్తకం గా రాశారు .నాయన  ‘’అయిదున్నర అడుగుల ఎత్తు ,బక్క పలుచని బంగారు రంగు శరీరం ,విశాల ఫాలభాగం ,బట్ట తల ,పూర్ణ వికాసం స్పురించే శిరస్సు ,విజ్ఞాన పూర్ణ నేత్రాలు ,గంభీరమైన కను బొమ్మలు ,సన్నని మీసాలు ,పలుచని గడ్డం ,ఘంటానాదం వంటి కన్తధ్వని ,అధికారయుత మైన వాణి ,చిరు నవ్వులు చిందించే పెదవులు ,వాత్సల్య ,అనుకంప లను పుట్టించే పిత్రుభావం ,క్రుతయుగపు రుషి ఆకృతి ,’’ తో ఉండే వారని లక్ష్మీ కాంతం గారు రాశారు .శ్రీ రామ కృష్ణ పరమ హంస కు వివేకానంద స్వామి ఎలాగో శ్రీ రమణ మహర్షికి నాయన లాంటి వారు

  నాయనాను ప్రశంసిస్తూ నవద్వీప పండితులిచ్చిన ప్రశంసా శ్లోకం –

         ‘’ప్రాచేనైస్తైహ్ కవికుల వరైహ్ కాళిదాసాది భిర్యా—లబ్ధా కీర్తి ర్భావదనుగాతా శైవ భూయా దిదానీం

         సద్భిర్దాత్తో య ఇహ ,రుచిరః కావ్య కన్తోప హారః –తెవ శ్రీమానిహ భువి భావానుజ్జ్వలస్క్స్చాపి భూయాత్ ‘’  

    అంకితం –నాకు అత్యంత ఆప్తులు ,నేనంటే ఎంతో అభిమానం చూపించే వారు నేను రాసిన ‘’ఆంద్ర వేద శాస్త్ర విద్యా లంకారులు ‘’పుస్తకానికి అడిగిన వెంటనే తమ స్పందనను ముందు మాటగా రాసి ఇచ్చిన వారు, గణపతి మునికి అత్యంత అభిమాని ,గుంటూరు లక్ష్మీ కాంతం గారు రాసిన ‘’నాయన ‘’పుస్తకాన్ని నన్ను చదవమని నాకు ఆదరం తో పంపిన వారు .ఇటీవలే పరమ పదించినచిన అమృత హృదయులు ‘’అమృత హస్తాలు ‘’వంటి కదానికలెన్నో రాసిన వృద్ధ తేజో మూర్తి ,నవ్వు మొగం తో  పలకరించే సహృదయులు సాహితీ మూర్తి  స్వర్గీయ  బ్రహ్మశ్రీ గంధం వేంకా స్వామి శర్మ గారికి నాయన గారి పై నేను రాసిన ఈ వ్యాస పరంపరను స భక్తికం గా ,సవినయం గా  అంకిత మిస్తూ మిత్ర ,గురు రుణాన్ని కొంత వరకు తీర్చు కొంటున్నాను .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –9-6-12—కాం

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

నల్ల జాతి ముస్లిం మత పెద్ద- మాల్కం ఎక్స్

        నల్ల జాతి ముస్లిం మత పెద్ద- మాల్కం ఎక్స్

       అతని తండ్రిని చిన్నప్పుడే హత్య చేశారు .తల్లి డిప్రెషన్ లో కుంగి మానసిక స్తితి ని కోల్పోయి ఆస్పత్రి పాలైంది ,కుటుంబం లో మిగిలిన వారి బతులులు ప్రభుత్వపరమైనాయి ,ఇతను వీధి రౌడీ గా వ్యభి చారిగా మాదక్క ద్రవ్యాలను అమ్మే వాడిగా దొంగగా జీవితం గడి పాడు .జైలు కు వెళ్లాడు అక్కడ పుస్తకాలు చదివి జీవితాన్ని సరి దిద్దు కొన్నాడు .ముద్దాయి ముస్లిం మత పెద్ద గా ఎదిగాడు అతడే మాల్కం ఎక్స్ .

             సోదరి  హీల్డా సోదరులు రిజినాల్ద్ ,ఫైల బర్న్ లు ఇతను జైలు లో ఉండగానే national islaam అనే మత సంస్థలో చురుగ్గా పాల్గొన్నారు .ఇది ఆద్రికన్ అమెరికన్ల కోసం ఏర్పడింది .వారందర్నీ మళ్ళీ ఆఫ్రికా కు పంపటమే ధ్యేయం గా ఏర్పడింది ‘’ఇదే బాక్ టో ఆఫ్రికా ‘’ఆ సంస్థ అధ్యక్షుడు elijaah mahmad రచనలు చదివి ప్రభావిత మయ్యాడు .అది నల్ల వారి వెన్నెముక గా నిల్చే సంస్థ అని భావించాడు .నల్లవాడిని అని గర్వించటం ,తెల్ల వారి కంటే నల్ల వారు జాతి ,సాంఘిక విషయాల్లో గొప్ప వారని అనుకోవటం ,నల్ల జాతి స్వయం సమృద్ధి సాధించటం అనే లక్ష్యాలు ఆ సంస్థ లో ఉన్నందుకు ఆనందించాడు ..తెల్ల వారే ప్రపంచం లో అన్ని అనర్ధాలకు కారణం అని అనుకొన్నాడు .వారి పై ద్వేషం పెంచు కొన్నాడు .

 మురికి కూపాల్లో ఉంటున్న నల్ల జాతి వారి దగ్గరకు వెళ్లి వారి శక్తి సామర్ధ్యాలను తెలియ జేస్తున్న మహమ్మద్ అంటే ఆరాధన ఏర్పడింది .అతడు జైలు పక్షుల దగ్గరకూ వచ్చి ప్రబోదిస్తున్నాడు .మాల్కం అతని తో ఉత్తర ప్రత్యుత్త రాలు నది పాడు .వర్ణ వివక్షతను అంతం చేయాలని ప్రభుత్వానికి ,అది కారులకు జైలు నుండి అనేక ఉత్తరాలు రాశాడు .అతనికి పదేళ్ళ శిక్ష పడితే అతని సత్ ప్రవర్తనకు మూడేళ్ళు శిక్ష తగ్గించి విడుదల చేశారు .డెట్రాయిట చేరాడు .ఫర్నిచర్ షాప్ లో ఉద్యోగం చేశాడు .నేషనల్ ఇస్లాం వాళ్ళు వేసుకొనే దర్జా అయిన వేశం ధరించాడు .1952 లో ఎల్జః మహ్మద్ ను కలిశాడు .తోలి చూపు లోనే ఫ్లాట్ అయ్యాడు .అతన్ని సంస్థ లో చేర్చుకొని సభ్యులను పెంచే కార్యక్రమం అప్ప గించాడు .మాల్కం లిటిల్ గా ఉన్న పేరు ను మాల్కం ఎక్స్ గా మార్చుకొన్నాడు .ఎక్స్ అనేది ఊరూ పేరు తెలీని అనేక వేల నల్ల జాతి వారి కి ప్రతీక .దీనితో కొత్త జీవితం ప్రారంభమైంది .డెట్రాయిట లో టెంపుల్ నంబర్ వాన్ లో చేరిన కొన్ని నెలలకే సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచాడు .మంచి వాగ్ధాటి ,స్పురద్రూపం సూటిగా చెప్పే నేర్పు అతనికి బాగా ఉపయోగ పడ్డాయి .దేశం లో ‘’బెస్ట్ రిక్రూటర్ ‘’అని పేరొచ్చింది .అసిస్టంట్ మినిస్టర్ హోదా ఇచ్చారు . 1954 లో బోస్టన్ వెళ్లి కొత్త టెంపుల్ ఏర్పరచాడు .మహ్మద్ అతన్ని ఫిలడెల్ఫియా పంపాడు .అక్కడ టెంపుల్ పన్నెండు ఏర్పాటు చేశాడు .న్యూయార్క్ దగ్గరలోని హార్లెం టెంపుల్ సెవెన్ కు మినిస్టర్ అయ్యాడు .ఇలా క్రమంగా మత పెద్ద అయాడు .

          అతనిది సంభాషణా శైలి .అప్పటికే మార్టిన్ లూధర్ కింగ్ సివిల్ రైట్స్ ఉద్యమం తీవ్రం గా సాగిస్తున్నాడు .కింగ్ భావాలను వ్యతి రేకించాడు .అతని అహింస నచ్చ లేదు .పౌరహక్కుల ను ఎవ గిన్చుకొన్నాడు .ఉత్తరాది మురికి వాడల్లోకి వెళ్లి నల్ల జాతి ఆత్మా గౌరవాన్ని తెలియ జేశాడు .కింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలు లో పెడితే వేలాది మంది నల్ల జాటీయులు స్టేషన్ వద్ద భాతా ఇంచారు .మాల్కం అక్కడికి వెళ్లాడు .అందరు అతను హింసా వాడి .యే ఉపద్రవం జరుగు తుందో నని భయపడి పోయారు .చాలా ప్రశాంతం గా మాట్లాడి అందరని శాంతింప జేశాడు .ఆ నాటి మాల్కమేనా ఇతను /అని పోలీసులే ఆశ్చర్య పోయారు ..మాల్కం కు జనం పై ఉన్న ప్రభావం చూసి ఆశ్చర్యపోయి భయపడి పోయారు .నల్ల జాతి సమీకరణానికి మాల్కం ఏంటో కృషి చేశాడు .

                 మ్స్లిం నేషన్ అధ్యక్షుడు మహమ్మద్ తన సెక్రెటరి లతో వ్యభియా చరిన్చాడని ఎందరికి తండ్రి అయ్యాడని ,ముస్లిం మతాన్ని అవమానం చేస్తున్నాడని ప్రారోపణలు బాగా వచ్చాయి .మొదట బుకాయించినా చివరికి మహ్మద్ ఒప్పు కొన్నాడు .ఇది మాల్కం జీర్ణించు కొ లేక పోయాడు .దేవుడని ,తన తండ్రి లాంటి వాడని నమ్మిన వాడు ఇంత దిగ జారి పోవటం దిగ మింగు కొ లేక పోయాడు .అతని కోసం ప్రాణాల నైనా అర్పించా టానికి సిద్దమ నుకొన్న మాల్కం పునరాలోచన లో పడ్డాడు .అప్పుడే ప్రెసిడెంట్ కేంనేది హత్యకు గురైనాడు .దాని పై స్పందిస్తూ మాల్కం ‘’a case of chickens coming home roosted ‘’అని నోరు జారాడు .ఇది ముస్లిం లలో కలవరం సృష్టించింది .కేంనేది చావటం వారికి ఇష్టం అనే అభిప్రాయం గా ఆ మాటలున్నాయి వెంటనే మాల్కంను సస్పెండ్ చేసి తరువాత తొలగించే శాడు మహ్మద్ .తన ఉనికి కి కూడా ప్రస్మాదం అని భావించాడు ..తన రహస్యాలను బయట పేద తాడని అనుకొన్నాడు

    సంస్థ లోంచి బయటికి వచ్చి తానే muslim maque అనే సంస్తనేర్పరచి తానే మతాధి కారి అయాడు .తాను ఒక సామాన్య మత గురువునే కాని మహ్మద్ లా మత ప్రవక్త ను కాదు అని ప్రజలకు తెలియ జేశాడు .ఆత్మా గౌరవం పెరిగింది .1964 లో మక్కా యాత్ర చేశాడు .అక్కడి సాంప్రదాయ దుష్టులైన తెల్ల వస్త్ర ధారణా చేశాడు .అక్కడి ముస్లిం సోదరత్వం అతనికి ఎంతో నచ్చింది .అక్కడ గరీబు వజీరు అందరు ఒక్కటే .అందరు సమానమే .అందరికిసమాన అవకాశాలున్నాయి అక్కడ .అలాంటి ఆతిధ్యం ,ప్రవర్తన ఇంకెక్కడా లేవు అని భావించాడు .

 న్యూయార్క్ కు తిరిగి వచ్చి తన పేరు el hajj maalik el shabaajj గా మార్చుకొన్నాడు .షాబాజ్ అంటే50,000 సంవత్స రాల క్రితం తూర్పు ఆసియా నుండి ఆఫ్రికా కు చేరిననల్ల జాతి వారు .అది వారికి ప్రతీక .ఎల హాజ్జ్ అంటే మక్కాకు వెళ్లి వచ్చినందుకు గుర్తు .మాలిక్ అనేది మాల్కం కు అరేబియా లో పేరు .తన స్వీయ చరిత్ర రాసుకొన్నాడు .organaizzetion of afro amerikan unity ‘’అనే సంస్థను స్తాపించాడు .ఆఫ్రికన్ యునితి లో ని విషయాలనే ఇందులో పొందు పరచాడు .ఇరవై రెండు మిలియన్ల నల్ల జాతి వారు నాలుగు వందల ఏళ్లుగా అమెరికా కు సేవ చేస్తూ ,అనేక యుద్ధాలు ,తిరుగు బాటలలో ప్రాణాలను కోల్పోతూ అమెరికా అస్తిత్వాన్ని కాపాడుతున్నా తమకు ఒరిగిందేమీ లేదని మొదటి సమావేశం లో ప్రసంగించాడు .నల్ల జాతి వారు వెన్నెముక ను గట్టి పరచు కోవాలని చెడు ప్రవర్తనకు దూరం గా ఉండాలని ,తమను తాము హీన పరచు కోరాడని ,నల్ల వారుగా పుట్టినందుకు గర్వ పదాలని బోధించాడు .కింగ్ పై ఉన్న ఇదివరకటి భావాల్ని మార్చుకొని పౌరహక్కులు కావాల్సిందే నని ఉద్యమించాలని ,సహకరించాడు .హ్యుమన్ డిగ్నిటి వస్తే హ్యుమన్ రైట్స్ వస్తాయని చెప్పాడు .right to self defence కు ఉద్యుక్తులవ్వాలని నల్ల జాతి వారిని ఉత్తేజితులను చేశాడు .

     మాల్కం కు కస్టాలు ప్రారంభ మయ్యాయి .అతన్ని చంపుతామని బెదిరింపు లేఖలు ఫోన్లు వస్తున్నాయి .ముస్లిం నేషన్ నుంచి మరీ ఎక్కువ గా వస్తున్నట్లు భావించాడు .మహ్మద్ రహస్యాలను మరిన్ని బయట పీడా తాదేమో నని భయం .ఇంటికి నిప్పు అంటించారు .చాలా భాగం తగలడింది .1965 fibruary 21ణ ఉదయం న్యూయార్క్ లోని audubaan baalroom ‘’హాలులో students non violent co ordinating committee సభలో నాలుగు వందల మంది సభ్యులనుద్దేశించి ప్రసంగించాతానికి గర్భ వతి అయిన భార్య బెట్టీ శబ్బాజా తో వచ్చాడు .వేదిక ఎక్కి ప్రసంగం ప్రారంభించే లోగా కింద ఎవరో స్మోక్ బాంబ్ పేల్చారు .జనం కంగారు పది పారి పోతున్నారు .మాల్కం కు రక్షణ గా ఉండాల్సిన సెక్యురిటి బాంబ్ వైపుకు వెళ్లారు .ఇంతలో నలుగురు వ్యక్తులు మాల్కం మీద పదహారు బుల్లెట్లను వర్షం గా పాయింట్ బ్లాంక్ గా కురి పించారు .నేల కూలాడు మాల్కం .హాస్పిటల్ లో చేచారు మధ్యాహం మూడింటికి తుది శ్వాస విడిచాడు ..ఆ కేసు ఇన్వెస్ట్ గేషణ్ జరిగినా ఏమీ చివరికి తెల లేదు .ముస్లిం నేషన్ తామే ఆపని చేసి నట్లు చెప్పు కొంది .తగిన శాస్తి జరిగిందని ప్రకటించింది కూడా .. 

              temple chrch god in haarlom అని పేరు పొందిన మాల్కం దుండగుల చేతి లో హత మైనాడు’  ’నీగ్రో ‘’ అనే పదాన్ని ఏవగించుకొని తమ జాతిని నల్ల జాతి వారని లేక పోతే ఆఫ్రో అమెరికన్స్ అని సంబోధించాలని లోకానికి చెప్పిన తోలి తరం నల్ల నాయకులలో మాల్కం కూడా ఒకడు .నల్ల జాతి వారి ఆత్మా గౌరవాన్ని పెంచాడు .గౌరవ హీనం అన్న జాతికి గర్వ కారణం అయాడు .యువ సాహస యోధుడు గాgallant youth chaampion గా చరిత్ర లో నిలిచాడు మాల్కం .తన జాతి వారిని అమితం గా ప్రేమించి వారి ఆదరాభిమానాలకు పాత్రుడైనాడు .అతని మరణం తర్వాతా వేలాది యువకులు అతని బొమ్మ ఉన్న టీషర్ట్స్  ధరించి గౌరవం చాటారు .ఇప్పుడు అంటే 2012  may  మాల్కం ఎనభై ఎదవా జయంతి .నల్ల వారి అస్తిత్వ నిరూపకుడు ,నల్ల ముస్లిం మతాధి కారి మాల్కం ఎక్స్ అమర జీవి .

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-6-12.—కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –6 గణపతి ముని –2

సిద్ధ యోగి పుంగవులు –6                                గణపతి ముని  –2                    
    గణపతి ముని ఒక సంవత్సరం వేదాధ్యయనం చేసి సాయన భాష్యం చదివారు .అప్పటికే ఆయన కీర్తి తమిళ దేశమంత వ్యాప్తి చెందింది .ఒక రోజు దొరస్వామి అనే శిష్యుడు షేక్స్పియర్ నాటకం మేక్బెత్ ను కధ గా విని పిస్తే ,ఆశువు గా సంస్కృత కావ్యం గా చెప్పేశారు ..వేరొక శిష్యుడు ఇంగ్లీష పేపర్ చదివి విని పిస్తే దాన్ని కింది నుంచి పైకి ,పైనుంచి కిందికి చెప్పిన ఏక సంధా గ్రాహి ..వేదం వెంకట శాస్త్రి గారి సమక్షం లో గొప్ప సన్మానం జరిగింది భట్తశ్రీ  ,బాల సరస్వతి బిరుదులూ పొందిన ఒక పండితుడిని ఓడించి బంగారు తోడా బహుమానం గా పొందారు .ఇలా ఎక్కడికి వెళ్ళినా విజయ పరం పర తో  సాగి పోతున్నారు .

                     భారత దేశోద్ద్ధరణ —శ్రీ రమణుల సందర్శనం –జన్మరహస్యం

   పూర్వ జన్మ లో తనకు శిష్యులైన విద్యార్ధులను గుర్తించి ,వారిని పిలి పించి మద్రాస్ సముద్ర తీరం లో దేశోద్ధారణ కోసం ఉపాయాలు చర్చించారు .నాలుగు ముఖ్య ఆశయాలతో పని చేయాలని నిర్ణ యించారు .ఒకటి కర్మ యోగం ,రెండు –వేదకాల రుషి జీవన విధానం ,మూడు –స్త్రీ పురుష వివక్ష–వర్ణ వివక్ష ను దూరం చేయటం,నాలుగు –ప్రతి ఇల్లు మంత్రాలతో నినదించటం .ఇవి చాలా గొప్ప నిర్ణయాలు .సాహసో పెతమైనవి .ఆయన ‘’దశాం దేశ స్యైతాం ప్రతి పద మయం –ధ్యాయతి జనః’’అంటే –‘’భారత దేశ దశను గురించే నేనెప్పుడు ధ్యానిస్తున్నాను ‘’.ఇంత గొప్ప ఉదార ఆశయం ఆ నాడు యే మహర్షికీ లేదు .ఆ నాటి సమర్ధ సద్గురు రామ దాసుగా ,విద్యా రన్య  మహర్షి గా ఈ నాటి వివేకానంద ,అరవిందులు గా గణపతి స్వామి కనిపిస్తారు .

              రాయవేలూర్ క్రిస్టియన్ కాలేజి లో తెలుగు పండితులు గ  పని చేస్తూ అక్కడే ఉండి పోయారు ..ఎందరో స్త్రీ ,పురుషులకు మంత్ర దీక్ష ఇచ్చారు .సర్వేపల్లి రాదా కృష్ణన్ పిన తండ్రి నరసింహం కూడా దీక్ష పొంది ,సన్య సించి ‘’ప్రణవా నందులు ’అయారు .బహిరంగ సభల్లో వేద ప్రాశస్త్యాన్ని నొక్కి చెప్పటం తో ఇతర మతాల వారు వెనక్కు తగ్గారు .’’ఇంద్ర సంఘం ‘’స్థాపించి ‘ఉమాం వందే మాతరం ‘’అనే మంత్రాన్ని అందరికి బోధించారు .17-2-1907 లో కలలో ‘’భద్రకుడు ‘’కన్పించి తన దేహ యాత్ర ముగి సిందని ,గణపతి బోధనలతో సంఘం త్వరలో స్పందిస్తుందని చెప్పాడు .తన సోదరుడు చని పోయి నంత గా దుఃఖించి స్నానం చేసి తర్పణం వదిలారు .ఆ మర్నాటి పేపర్ లో ఆల్కాట్ గారే భద్రకుడు అని రాశారు .ఇంటికి వెళ్లి తండ్రి ని కాశీ యాత్ర చేయించి  వేలూరు లో కొడుక్కి మశూచికం వస్తే ‘’ఉగ్రమారీచి ‘’ని ప్రార్ధించి దాన్ని పోగొట్టారు .దసరా ఉత్సవాలకు ‘’పడై వీడు ‘’కు వెళ్లి ‘’రేణుకా దేవి ‘’ని దర్శించి ,తపస్సు మీది విపరీతమైన కోరికతో ఉద్యోగం వదిలేశారు .

               అరుణా చలం చేరి ‘’మరకత శ్యామలా దేవి (పచ్చై యమ్మన్ )దేవాలయం లో కొంత కాలం ,నైరుత లింగం లో కొన్ని నాళ్ళు తపస్సు చేశారు ..అరుణా చలేశ్వరుని కృత్తి కోత్త్ష వాలు జరుగుతున్నాయి .ఏడవ నాడు రధోత్సవం .దారిలో రధం ఆగి పోయి కదలలేదు .గణ పతి స్వామి రధం దగ్గరకు వచ్చి ప్రార్ధించగానే కది  లింది .ఆ మహాత్ముని కోసం అందరు వెతుకు తుంటే అదృశ్యమై పోయాడు .విరూపాక్ష గుహ లో బ్రాహ్మణ స్వామి ని దర్శించాడు గణపతి ఆయనకు సాష్టాంగ పడి తనకు తపోసాధన కుదరటం లేదని ,మార్గ నిర్దేశం చేయమని ప్రార్ధించాడు .అప్పటి దాకా ఎన్నో ఏళ్లుగా మౌన వ్రతం పాటిస్తున్న రమణ మహర్షి ‘’నేను అనే స్పురణ ఎక్కడి నుండి వస్తోందో విచారిస్తే మనస్సు దానిలోనే లీనం అవుతుంది .అదే తపస్సు ‘’అని చెప్పి మౌనాన్ని విడిచారు 18-11-1906 న.తన మౌనాన్ని చేదించిన వాడు మహా మహిమాన్వితుడు అని గ్రహించాడు బ్రాహ్మణ స్వామి .తనకు తపో విధానం తెలిపి గురుస్తానాన్ని పొందారు బ్రాహ్మణ మహర్షి అని గణపతి స్వామి భావించాడు .ఆయనకు భగవాన్ ‘’రమణ మహర్షి ‘’అనే పేరు గణపతి స్వామి పెట్టారు .రమణ మహర్షి ఈయనను ‘’నాయనా ‘’ అని సంబోధించారు .శ్రీ రమణులకు,గణపతి కి పురజనులు  సాష్టాంగ పడ్డారు ..తరువాత తాను ‘’మరుద్గణ పతి అయిన వృషా కపి యొక్క ఏడవ అవతారం ‘’అని నాయన ప్రకటించు కొన్నారు .

                       ఇక్కడి నుండి నాయనకు మరో జన్మ ప్రారంభ మైంది .అనేక గ్రంధాలు రచించారు .తపస్సు తీవ్రతరం చేశారు .తీర్ధ యాత్రలెన్నో చేశారు .ఉపన్యాసాలిచ్చారు .పండితుల్ని జయించి విజయ పత్రికలన్డుకొన్నారు .భార్య విశాలాక్షమ్మ దీపోత్స వానికి ముప్ఫై మంది శిష్యులతో వచ్చింది ..శ్రీ రమణులు ఆమె ను చూసి ‘’అమ్మ వచ్చింది ‘’అన్నారు .నాయన కూడా అప్పటి నుండి భార్యను ‘’అమ్మా ‘’అని పిలవటం ప్రారంభించారు .ఆమె కూడా భర్తను ‘’నాయనా ‘’అని పిలవటం మొదలు పెట్టింది .ఆ రోజు నుండి భార్యా భర్తలు వాన ప్రస్తాశ్రమం స్వీకరించారు .నాయన ఆమె కు ‘’తారా మంత్రం ‘’ఉపదేశించారు .నాయన ‘’చూత గుహ ‘’ లో తపస్సు చేస్తూ ఇరవై రోజుల్లో ‘’ఉమా సహస్రం ‘’రాయటానికి పూను కొన్నారు .అయిదుగురు రాసే వాళ్లకు ఒక్కక్కరికి యాభై శ్లోకాలు చెప్తూ 250 శ్లోకాలు అవ్యవదానం గా చెప్పారు .దీని వెనక రమణ మహర్షి సూక్ష్మ రూపం లో హృదయం లో కూర్చుని రాయించారని నాయన భావం ..ఆ వాక్ ప్రవాహం రమణుల హృదయం లో ఊరి ,నాయన ముఖతా వెలువడింది .రమణుల ఆదేశం తో కొండ శిఖరం ‘’సప్త ఝరి ‘’లో ఉండి ‘’దూర దృష్టి ,దూర శ్రవణం ‘’అనే సిద్ధులను పొందారు .చిరుపాకం కొండయ్య అనే గణ పతి ఉపాసకునికి హోమ జ్వాలలో ‘’నాయన దివ్యాక్రుతి ‘’కన్పించింది .శ్రీ రమణులు ‘’షణ్ముఖుని ‘’అవతారం గా నాయన లోకానికి చాటి చెప్పారు .కాశీ లోసుకేతుడు చెప్పిన’’ స్తూల శిరస్సు రమణులే’’అని నాయన గుర్తించారు ..అప్పటి నుంచి రమణుల అ నుచరుని గా ఉన్నారు .పడై వీడు కు వెళ్లి రేణుకా దర్శనం చేసి ,దేశ భక్తు లైన యువకుల్ని సమీకరించారు .ఇక్కడే ‘’కపాలి శాస్త్రి ‘’అనే మహా విద్వాంసుడు నాయన శిష్యుడైనాడు .నాయన పై పోలీసులు నిఘా పెంచారు .దేశ ద్రోహం చేస్తున్నాడని ఆరోపణ ..వారి కంట పద కుండా తప్పించు కొంటున్నాడు నాయన ..శిష్యులు ‘’ఉమా సహస్రం ‘’ను పోలీసుల కంటికి కనపడకుండా కుండలినీ నదీ తీరం లో ఇసుకలో పూడ్చి పెట్టారు ..అను కోకుండా ఆ రాత్రి నదికి వరద వచ్చి గ్రంధం కొట్టు కు పోయింది .ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళమని నాయనకు పోలీసులు ఆదేశించారు .వేలూరు వెళ్లి భార్య ప్రసవించిన ఆడపిల్లకు ‘’వజ్రేశ్వారి అని పేరు పెట్టాడు .మళ్ళీ రేణుకా క్షేత్రం చేరి నలభై రోజులు తపస్సు చేశాడు .దీక్ష చివరి రోజున రేణుకా దేవి 200 మంది పరి చారికలతో ప్రత్యక్షమై నాయన శరీరం లోకి శక్తిని ప్రసరింప జేసింది .శక్తి ఆయుధం లభించిన అనుభూతి పొందారు నాయన .ఋగ్వేదం లోని ‘’అస్త్ర మహా విద్యా మంత్రం ‘’నాయన కు గోచరించింది ..వేలూరు వెళ్లి ‘’ఇంద్ర సభ ‘’పెట్టి ఆ అస్త్ర మంత్రం వారికి బోధించారు .బ్రిటీష ప్రభుత్వం దీన్ని ‘’విప్లవ చర్య ‘’గా భావించి అరెస్ట్ వారంట్ జారీ చేసింది .రహస్య మార్గం లో హంపీ కి బయల్దేరి హాస్పేట లో ఒక మోసగాని వల్ల ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది ..మర్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ నాయన దివ్యత్వం తెలుసు కొని విడిచి పెట్టి మంత్ర దీక్ష పొంది శిష్యుడైనాడు .నాయన ‘’మా ఉలి ‘’అనే చోట తపస్సు చేసి ఆ గ్రామ దేవతను ప్రత్యక్షీకరించుకొన్నారు .ఆమె అస్త్ర సిద్ధి కి ఇంకా సమయం రాలేదని వేచి ఉండమని బోధించింది .

        రమణుల వద్ద సెలవు పొంది దక్షిణ యాత్రలు చేస్తూ ;;జంబుకేశ్వరం ‘’చేరి అక్కడి ‘’అఖిలాండేశ్వరి ‘’ని కొలుస్తూ నష్ట పోయిన ఉమా సహస్రాన్ని పూర్తీ చేశారు .దాదాపు ఏడు వందల శ్లోకాలు పది రోజుల్లో రాశారు .మళ్ళీ వేలురుకు వచ్చి కొడుకు మహాదేవుడికి ఒడుగు చేసి ,అందరితో అరుణా చలం చేరారు ..ఆ తర్వాతా రెండేళ్లు మద్రాస్ లో ఉన్నారు ..ఉడిపి బలరామ క్షేత్రం ,లో తపమాచరించి పీతాది  పతి టో సత్కరింప బడి ,ఆ సభ లో మతత్రయ సిద్ధాంత సారాన్ని ‘’తత్వ ఘంటా శతకం ‘’గా ఆశువు గా చెప్పారు నాయన ..గోకర్ణం చేరి తాపం చేసి అనంత శాస్త్రి అనే పండితుణ్ణి ఓడించి ,’’ఇంద్ర మత ప్రాశస్త్యం ‘’స్థాపించాడు .అక్కడి పండితులకు పరాశర సంహిత లో కల్గిన సందేహాలను తీర్చి ‘’లఘు సంహిత ‘’రచించాడు .గోకర్ణ ప్రాంతం లో ఉన్న వేద శాఖను పదిహేను రోజుల్లో కన్తస్తం చేశారు .ఉమా మహేశ్వర పర్వతం పై నాయనా ,అమ్మా తపస్సు చేస్తుండగా వారిని సేవించిన గణేశ శర్మ తర్వాతా ‘’దేవరాతుడు ‘’గా ప్రసిద్ధి పొందాడు .నాయన వద్ద ఆయన అనేక దివ్యానుభూతులను పొందాడు .పౌరాణిక కధలను బట్టి వేదార్ధాలను ,వేదార్ధాలను బట్టి పురాణ కధలను సమన్వ యించే పనికి పూను కొన్నారు .

               1912 లో స్వగ్రామం కలువ రాయి చేరి తండ్రి అవసాన కాలం లో దగ్గరుండి అంత్యక్రియలు చేసి ,అరుణాచలం చేరి రమణ దర్శనం చేసి గోకర్ణ ములో ‘’నాన్న బేలా ఆశ్రమం ‘’లో జరిగిన ‘’జ్యోతిష్టోమం ‘’కు బృహస్పతి గా ఉండి యజ్న కర్మలను మంత్రార్ధాలను సంస్కృతం లో సుబోధకం గా వివ రించారు .కన్నడం లో అనర్గళం గా ఉపన్య సించి అందర్నీ ఆశ్చర్య పరవశులను చేశారు నాయన ..తర్వాతా సికందరాబాద్ వచ్చిజంత నగర వాసులు చాలా మందికి మంత్ర దీక్షనిచ్చారు .అక్కడికి దగ్గర్లో ఉన్న ‘’కర్కేలి ‘’లో నాలుగు నెలలు తపోదీక్ష లో ఉన్నారు .అమ్మ తో ఉత్తర దేశ యాత్రలు చేసి ,ఆమె భువనేశ్వరం లో పాక మహిమ ,అక్షయ సిద్ధి పొందింది ..మండసా చేరి తల్లి తద్దినం పెట్టి ,రాజా వారి కోర్కె పై ఇద్దరు అక్కడే చాలా కాలం ఉండి పోయారు .అక్కడి కొండపై ఉన్న శివ లింగానికి ‘’దాహార గోకర్నేశ్వరుడు ‘’అని నాయన పేరు పెట్టారు ..తనలో పరశు రాముని తేజం ప్రవేశించి నట్లు గుర్తించారు .

             1917 లో అరుణా చలం చేరి విరూపాక్ష గుహలో రమణుల అనుమతి టో ఉండ టానికి అనుమతి పొంది గుహకు వస్తే కాపలా వాడు తాళం చెవి ఇవ్వక పోతే క్రోధాగ్ని ప్రజ్వలింప జేషారు .తర్వాతా పశ్చాత్తాపపడి ‘’ఇంద్ర స్తుతి ‘’చేస్తే విపరీతం గా వర్షం పది దేవాలయ రధం పై పిడుగు పది గండం తప్పింది ..రమణులు నాయన టో ఇంకా కోపం ఎవరి మీద చూప్నని శపథం చేయించి ,స్వహస్తాలతో పెరుగు అన్నం టిని పించారు నాయనకు ..రమణుల తో పాటు స్కందాశ్రమం లో ఉంటూ ‘’దశ మహా విద్యా సారం ‘’ను 475 సూత్రాలను మూడు రోజుల్లో రాశారు .’’రమణ గీత ‘’ను రాసి ,పది వీడు వెళ్లి నలభై రోజులు తపం చేశారు ..శ్రీ రమణుల తమ్ముడికి ,తల్లికి సన్యాస దీక్ష నిచ్చి మళ్ళీ స్వగ్రామం కలువ రాయి వెళ్లారు .కొడుకు మహాదేవుడి వివాహం చేసి సికందరాబాద్ చేరి 1919 డిసెంబర్ దాకా ఉండి స్వరాజ్య ఉద్యమ సంనాహాని చూసి సంబర పడ్డారు .గాంధీ ని ‘’మైత్రేయ రుషి ‘’గా నాయన గుర్తించారు ..అమ్మ తో మద్రాస్ వెళ్లి ‘’రాజ యోగా సారం ‘’రాశారు .

                  1922 లో అరుణా చలం చేరి ‘’ఉమా సహస్రం ‘’సంస్కరించి ,’’ఇంద్రాణీ సప్తశతి ‘’రచన మొదలెట్టారు .వెన్నెముక లో విపరీత మైన నొప్పి శిరో వేదన తో బాధ పడ్డారు .రమణ మహర్షికి చీటీ ద్వారా తెలియ జేసినా సమాధానం రాలేదు .అర్ధ రాత్రి గుహలో నాయన శిరస్సు నుంచి ‘’తప్ ‘’అనే ధ్వని తో పెద్ద శబ్దం గుహ బయటి వారికి కూడా విని పించింది .చంద్ర కాంతి వంటి జ్యోతి గుహ పైకప్పు ను తాకింది .నాయన శరీరం నుండి దత్త మైన పొగలు బయటికి వచ్చాయి .శీర్ష కపాల భేదనం జరిగి అమ్రుతప్రాప్తి లభించింది .బాధ అంతా మాయ మైంది .రమణులు వచ్చి తనతో తీసుకొని వెళ్లి పాలు తాగించారు .నాయన నెట్టి మీద అరచెయ్యి వెడల్పున వెంట్రుకలు ఊది పోయాయి .రమణ మహర్షి నాయన కు సపర్యలు చేయించారు .ఇంద్రాణీ సప్త శతి పూర్తీ చేసి పది వీడు వెళ్లి అక్కడ దాన్ని పతించారు .రేణుకా దేవి ప్రత్యక్షమై ఆశీర్వా దించింది

                      నాయన –స్త్రీల స్వాతంత్ర్యానికి ,పంచముల దీన స్తితి తొలగించటానికి ,వేదార్దాల సందేహాలు తీర్చటానికి ,వర్ణ భేదాలు తొలగి పోవటానికి ఇంద్రాణి ని ప్రార్ధించారు .దేశ వైభవం కోసం ఆయన చేసిన శ్లోకాలు చిర స్తాయి గా నిలిచి పోయాయి .1922 లో రమణుల తల్లి అలఘమ్మ మరణిస్తే .సమాధి కట్టించి దానిపై రమణులు స్తాపించిన శివ లింగానికి ‘’మాత్రు భూతేశ్వర లింగం ‘’అని నాయన పేరు పెట్టారు .1923 లో ‘’ఉమా సహస్రం ‘’ను శ్రీ రమణులకు సమర్పించారు .అది 1942  లో అచ్చయింది .

      చివరి భాగం తరువాత రాస్తాను .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-6-12-కాంప్—అమెరికా

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అమెరికన్ల పై స్పానిష్ ప్రభావం

       అమెరికన్ల పై స్పానిష్ ప్రభావం

      ఇవాళ ప్రపంచాధీ పత్యాన్ని వహిస్తున్న అమెరికా ,దశాబ్దాలుగా ప్రతి దేశం ,అక్కడి ప్రజల భాష సాహిత్యాలు ,సంస్కృతు లపై విశేష ప్రభావం చూపించిన అమెరి కా కూడా స్పెయిన్ ,ఇంగ్లాండ్ ,ఫ్రెంచ్ దేశాల ప్రభావానికి లోనయింది అన్న విషయం మర్చి పోయాం .ఇప్పుడు కని పిస్తున్నదే మనకు తెలుస్తోంది .కాని కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా ను మౌల్డ్ చేసిన వారి గురించి తెలుసు కొంటె ఆశ్చర్యమే వేస్తుంది .అన్ని దేశాల గురిచి కాక ప్రస్తుతం స్పానిష్ ప్రభావం గురించి ఇప్పుడు మనం తెలుసు కొందాం .స్పానిష్ ప్రభావం అంటే ‘’హిస్పియానిక్ ‘’అంటారు .అంటే స్పానియార్డులు ,స్పానిక్ అమెరికన్లు ,ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తులు ,అంటే స్పానిక్ మూలాలను ప్రత్యక్షం గానో ,పరోక్షం గానో వున్నా వ్యక్తులు అందర్నీ హిస్పానియన్లు అంటారు .

    స్పానిక్ భాషా ,సంస్కృతి ఆమెరికా దేశ ఆవిర్భావానికి ముందే కన్పిస్తాయి ..ఇవి ఐబీరియన్ ద్వీప కల్పం ,మెక్సికోగుండా ,కరేబియన్ బేసిన్ ,,మద్య దక్షిణ అమెరికా ల నుండి వచ్చి అమెరికా చేరాయి .స్పానిష్ సంస్కృతీ ప్రభాయం ఈ దేశీయులపై చాలా ఎక్కువే ..ప్రస్తుతం అవన్నీ ఇక్కడి వాటి తో కలిసి పోవటం వల్ల అవి ప్రత్యెక మైనవి గా కని పించావు .ఈ హిస్పానిక్ ప్రభావం గనామ్కాలలో చూస్తారు కాని ,వ్యక్తీ గతం గా వారి ప్రభావం ఏమిటో తెలుసు కొ లేక పోతున్నారు ..ఇప్పుడే స్పానిష్ పుట్టుక ,స్వభావం ,తమతో సమైక్య మైన విధానం గురించి ఆలో చించి అమెరికన్లు తెలుసు కొంటున్నారు .

        యు.ఎస్.యే.అని పిలువబడే ఈ దేశానికి స్పానిష్ సముద్ర నావికులు ముందుగా చేరారు .అ.అందుకే హిస్పానిక్ పేర్లు అన్ని చోట్లా కన్పిస్తాయి . Juan de fora  అనేది ఫసిఫిక్ సముద్ర వాయువ్య ప్రాంతాన్ని పరిశీలించిన మొదటి నావికుని పేరే ఆ పేరు అని ఇప్పుడు చాలా మందికి తెలీదు .అలాగే అరిజోనా ,మాన్తోనా ,ఫ్లోరిడా రాష్ట్రాల పేర్లు ‘’అరిద్ జానే ‘’,మౌంటైన్ ,ఈస్తర్ రోజున స్పెయిన్ వారు ఇచ్చే విందులకు సంబంధించినవి .అలాగే కాలిఫోర్నియా పేరు కూడా amaadis of gaul అనే నవల లోని పేరు .ఎన్నో పర్వతాలు ,నదులు ,కాన్యాన్న్లు ,పట్నాలు ,నగరాల పేర్లన్నీ స్పానిష్ పదాలే ..అంతగా మమైకం చెందాయి .

   అమెరికన్ సంస్కృతీ ని పెంపొందించిన వారి లో స్పానిష్ వాళ్ళే ఎక్కువ ..స్పెయిన్రాజు afanso xగొప్ప విద్యా వంతుదని మనకిప్పుడు తెలీదు ..అమెరికన్ చట్టాల పై ఆ రాజు స్పెయిన్ దేశం లో చేసిన చాటాల ప్రభావం చాలా ఎక్కువ .ముఖ్యం గా అమెరికా వాయువ్య భాగం లో బాగా ఎక్కువ .washigton d.c.లో ఆ రాజు విగ్రహం ఉండటమే ప్రత్యక్ష సాక్షం .అలాగే diego rivera అనేది మెక్సికన్ చిత్రకారుదిది .అతని ప్రభావం ఈ దేశం లో బాగా ఉండి .1930 లో అతని చిత్రాలు అమెరికన్ ప్రభుత్వ భవనాలలో అలంకరింప బడ్డాయి .ప్యూర్తోరికాన్ ,మెక్సికన్లు ,మెక్సికన్ అమెరికన్లు ,(చినోనాస్ ),క్యూబన్ల ప్రభావం గణనీయం ..ఈ ప్రభావం బోస్టన్ ,చికాగో ,లాస్ ఏంజిల్స్ ,మయామి ,,మిన్నిపోలిస్ ,న్యూయార్క్ ,సాన్ ఆంటోనియా లలో విపరీతం .

          స్పానిష్ భాషా ప్రభావం కూడా చెప్పు కోడగిందే .ఇక్కడ కాని ,ప్రపంచం లో కాని ఇంగ్లీష మాట్లాడే వారి తర్వాతా స్పానిష్ భాష ను మాట్లాడే వారు ఎక్కువ అని లెక్కలు తెల్చారట ..ఈ ప్రాచుర్యానికిక్కడ చరిత్రను అధ్యనం చేస్తే కాని తెలియదు ‘’.న్యు వరల్డ్ ‘’ అని పిలువా బడిన అమెరికా ఏర్పడిన తర్వాతా స్పానిష్ భాషా సంస్కృతులు విపరీతం గా చొచ్చుకు పోయాయి .ఇంగ్లిష్ ఇమ్మిగ్రంట్లు ఇక్కడి వచ్చే తప్పుడు తమతో ‘’గోల్డెన్ ఏజ్ ‘’కు చెందినా అనేక ప్రసిద్ధ రచనలను తమతో 1863లో  తెచ్చుకొన్నారు .ఫిలడెల్ఫియా ,బోస్టన్ ,లలో అనేక మంది ప్రముఖుల ప్రైవేట్ లైబ్రరీలలో lazarillaa de tomes .los squenos వంటి రచనల అనువాదాలున్నాయి .ఎన్నో నవలలు కొలువు దీరాయి .సేర్వాన్తిస్ అనే స్పానిష్ రచయిత రాసిన don quixoteనవల ఆ కాలం లో చదవని వారు ప్రపంచం లోనే లేరంటే ఆశ్చర్యం లేదు .ఆ నవలా ఇక్కడికి చేరి,ప్రభావాన్ని చూపింది .cotton mather అనే ప్యురిటాన్దాన్ని అమెరికా లో స్పానిష్ భాష లోనే చదివాడని రికార్డులు తెలియ జేస్తున్నాయి ..ఈ నవల తో తన భాషా సాహిత్యాలను కాటన్ పరి పుష్టం చేసుకొన్నాడని విశ్లేషకుల భావం ..ఎన్నో స్పానిష్ పదాలు అందులో చేరి అమెరికన్ పదాలై పోయాయట .

            స్పానిష్ రచయితలు అమెరికన్ రచయితలను ప్రభావితం చేశారు .వాషింగ్టన్ ఇర్విన్ నుండి ,కాళి ఫోర్నియా నవలా కారుడు జాన్ స్టీన్ బెక ,ఎర్నెస్ట్ హెమింగ్వే,లాంగ్ ఫెలో ,వరకు ఆ ప్రభావం లో ఆకర్షణ లో పాడనీ రచయిత లేదు .కూపర్ ఎడ్గార్ అలాన్ పొ ,నిజమైన ఆత్మను మేల్కొల్పిన వాడు అమెరికన్ జాతీయ కవి అయిన వాల్ట్ విట్మన్ ,అమెరికన్ భాషను నవలలలో బంధించి ఇదీ నీ భాషా ,నీ సాహిత్యం ఇది అని తట్టి లేపి ఇంగ్లాండ్ సాహిత్యంనుంచి అమెరికన్ సాహిత్యాన్ని వేరు చేసి ,అమెరికన్ ఆత్మను తట్టి లేపిన మార్క్ ట్వేన్ ,హీర్మాన్ మెక్ విల్లి అందరు స్పానిష్ సాహిత్య సంప్రదాయానికి రుణ పడే ఉన్నారు maaksvel ,aandersan ,మొదలైన వారంతా స్పానిష్ భావాలను వస్తు జాలాన్ని  తమ రచనల్లో ప్రతి ఫలింప జేసినావారే .

                     స్పానిష్ సంస్కృతీ ప్రభావం పాడనీ ప్రదేశం ,వ్యక్తులు ,సాహిత్య ప్రక్రియలు ,సంస్థలు ,వ్యవస్థలు అమెరికా లో లేవు అంటే అతి శాయోక్తికాడు .పచ్చి నిజం .ఎక్కువ గా ప్రభావితం చేసిన వాడు abiel smith అనే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ .1764లో ఆయన –ఇక్కడ స్పానిష్ ,ఫ్రెంచ్ బోధించే ప్రొఫెసర్ల కు జీత భత్యాల కోసం 20,000 డాలర్లను మూల ధనం గా సమ కూర్చి ,వారికి అండగా నిలిచాడు .1819 యునివేర్సిటి కి స్వావలంబన లభించి ,ఆర్ధిక బాధల్లోంచి బయట పది ,వారికి పూర్తీ జీతాలు ఇవ్వ గలిగే స్తితి ని పొందింది .ఇది స్మిత్ చేసిన మేలే .abiel smith పేరా ఒక పీఠం –(చైర్ )నేల కోల్పారు .జార్జి తోక్నార్  దాన్ని అందుకొన్న మొదటి వ్యక్తీ .ఆ తర్వాతా లాంగ్ ఫెలో ,జేమ్స్ రాసిల్ కు ఆ గౌరవం దక్కింది .

   విద్యా వేత్త ,ఉత్తమ అధ్యాపకుడు అయిన తిక్నార్ ఎన్నో స్పానిష్ పుస్తకాలను విశ్వ విద్యాలయం కోసం సేకరించి భద్ర పరచాడు ..దీనితో అమెరికన్లకు స్పానిష్ సాహిత్య అధ్యయనానికి గొప్ప అవకాశం లభించింది .ఆయన స్వంతం గా ఎన్నో స్పానిష్ పుస్తకాలను ,వ్రాత ప్రతులను స్వంత లైబ్రరికోసం సేకరించు కొన్నాడు .ఆ తర్వాతా వాటిని బోస్టన్ పబ్లిక్ లైబ్రరి కి దారా దత్తం చేశాడు .abiel smith చైర్ ఏర్పడిన తర్వాతా హార్వర్డ్ లో స్పానిష్ భాశాధ్యనం కర్రిక్యులం లో చేరింది .రోమాన్స్ లాగ్వేజేస్ లలో గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రవేశ పెట్టిన మొదటి విద్యాలయం హార్వర్డ్ .దీని తర్వాతా నే అమెరికా లో మిగిలిన విశ్వవిద్యాలయాలు ప్రవేశ పెట్టాయి .

                   కలల మీద స్పానిష్ ప్రభావం కూడా ఎక్కువే .జాన్ సింగర్ సార్జెంట్ ,జేమ్స్ విజిలర్ ,థామస్ ఈకిన్స్ ,.మేరికేస్సాట్ ,మొదలైన కళా కారులు స్పానిష్ సాంకేతికత లను అధ్యయనం చేసి తమ కళ ను ఉత్కృష్ట స్తితి కి తెచ్చుకొన్నారు .అన్ని రంగాలలో ఉన్న ఈ నాటి కళా కారులంతా స్పానిష్ స్రస్తల కళాభి రుచిని నిశితం గా పరిశీలించారు .అంతే కాదు ఇరవై వ శతాబ్దపు స్పానిష్ paintars సాల్వడార్ దాలి ,జోఆన్ మీరో  పాబ్లో పికాస్సాల ప్రభావం అమెరికన్ కళా కారుల పై విపరీతం .

 సంగీతం దగ్గర కు వస్తే  lionardo bernstiens ల ప్రభావం ఎక్కువ .షేక్స్ పియర్ రాసిన రోమియో జూలియట్ కు స్పానిష్ అనువాదానికి న్యూయార్క్ లో పిచ్చ క్రేజ్ .అలాన్ రిధంస్ అంటే ఇక్కడి అమెరికన్లఉ ఊగి పోతారు .టాంగో నుంచి మామ్బో దాకా ,గువార్చా నుండి సల్సా దాకా అన్నిటి పై స్పానిష్ ప్రభావం చెప్పలేనంత ఎక్కువ .

,      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-6-12.—కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు –5 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

    సిద్ధ యోగి పుంగవులు –5

                                                          స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

     ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు  అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే  శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .

                                   జననం –విద్యా భ్యాసం –వివాహం

    అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి  దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .

                 పిన తండ్రి  ప్రకాశ  శాస్త్రి దగ్గర కావ్యాలు చదివటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహత్యా లనుకరతలా మలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయనాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .

                                         దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు

              1896లో అంటే పదహారేల్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువ రాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన  కన్పించిగణపతి  గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవాని   శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్తూల శిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు  చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి  నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావదానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900  లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహం టో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంథ    వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తుఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని  అనే  ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంథ గణపతి  ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .

                    వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు .గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో  సహా మంద సా వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి ,తమ్ముడు శివ రామ శాస్త్రి తో  కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు  చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం  చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ ఇంచుకొన్నాడు .

          కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులేవారిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు .రోజు అరుణాచల నందీశ్వరుని  ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—07 -06 -12   –కాంప్ –అమెరికా

Posted in మహానుభావులు | Tagged | 2 Comments

వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు — 14 మూడు సముద్రాల తీరం –కన్యా కుమారి

వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు — 14

 

                                                     మూడు సముద్రాల తీరం –కన్యా కుమారి

          భారత దేశానికి ఉత్తరాగ్రం హిమాలయాలు అయితే దక్షిణ అగ్రం  కన్యా కుమారి ..తూర్పున బంగాళాఖాతం ,దక్షిణాన హిందూ మహా సముద్రం ,పడమర అరేబియా సముద్రం చేత  ఆవరింప బడిన చిన్న గ్రామం ..తమిళ నాడు లో కన్యాకుమారి ఉంది ..సూర్యుడు తూర్పున బంగాళాఖాతం లో నుంచి ,క్షితిజ రేఖ లో సముద్ర గర్భం లో నుంచి ,నెమ్మది నెమ్మది గా ఉదయించి తన్మయులను చేస్తాడు ..అల్లాగే సాయంత్రం అస్తమయ బింబం ఎర్రగా ,నెమ్మది నెమ్మదిగా ,అరేబియా సముద్రం లోకి దిగి పోతున్నట్లు కన్పిస్తూ మళ్ళీ పరవశులను చేస్తుంది . ..ఒకే ఊరి లో ఈ రెండు దృశ్యాలు కన్పించటం కన్యాకుమారి ప్రత్యేకత .మిగతా తూర్పు తీరం లో యే ప్రదేశం లో నైనా సముద్రం ఉంటె ,సూర్యోదయాన్ని కనుల పండువు గా చూడ వచ్చు ..అలాగే పశ్చిమ సముద్ర తీర ప్రజలు కూడా సూర్యాస్తమయాన్ని చూసి పరమానందం పొంద వచ్చు ..ఈ రెండు దృశ్యాలు ఇక్కడే కన్పించటం వింతల్లో వింత .పరమాద్భుతం .అయితే సంవత్సరం లో తొమ్మిది నెలలు వర్షాలు ఉన్న ప్రదేశం కనుక ,వారానికి ఒక్క రోజు ఈ రెండు దృశ్యాలు కని పిస్తే గొప్ప .ఆకాశం ఎప్పుడు మేఘావృత మై ఉంటుంది ..అందుకని యాత్రికులకు నిరాశ కల్పించే రోజులే ఎక్కువ గా ఉంటాయి ..ఇక్కడ రంగు రంగుల ఇసుక ,మట్టి కన్పించటం మరో వింత ..వాటిని సేకరించి యాత్రికులు తమ తో తీసుకొని వెళ్తారు .

                                             వివేకానంద కేంద్రం

           స్వామి వివేకానంద 1892 లో చికాగో లో జరిగిన అఖిల మత సమావేశానికి కన్యాకుమారి నుండే బయల్దేరి వెళ్లాడు ..తీరానికి నాలుగు ఫర్లాంగుల దూరం లో ,సముద్రం లో ఉన్న ఎత్తైన రాతి గట్టు మీద ఆయన తపస్సు చేశాడు .1963 లో ఆయన శత జయంతికి ,ఈ రాతి పై చిరస్మరణీయ స్మృతి మందిరం ను వివేకా నంద స్మారక ట్రస్ట్ వారు నిర్మించి ,ఆయనకు ఘన నివాలులనర్పించారు ..బయట అంతా యెర్ర రాయి ,లోపల గ్రానైటు .తో భవన నిర్మాణం చేశారు .తీరం నుంచి లాంచి లో మందిరం చేరి వివేకానంద విగ్రహం ,ధ్యాన మందిరం మొద లైన వి చూడ వచ్చు ..ఈ రాక్ మెమోరియల్ లేక పోతే ఈ ప్రాంతం లో హిందూ ధర్మం లుప్తమై పోయి ఉండేది అని విశ్లేషకుల భావన .

                                            అతి పెద్ద తిరువల్లువార్ విగ్రహం

                        తమిళనాడు ప్రభుత్వం ఇక్కడే వేరొక సముద్ర గర్భం లో ఉన్న కొండ రాతి పై ,మూడు సముద్రాలు కలిసిన ప్రాంతం లో 133  అడుగుల భారీ తిరువళ్ళు వార్ విగ్రహాన్ని నేల కోల్పింది . 38 అడుగుల ఆ రాతి విగ్రహ చట్రం ఆయన రాసిన ‘’కూరల్ ‘’లోని 38అధ్యాయాలకు ప్రతీక .95 అడుగుల విగ్రహం మిగిలిన భాగాలను సూచిస్తుంది .సంపద ,ప్రేమ లకు ఆధారం సుగుణ మే అని ఈ శిల్పం తాత్పర్యం .140మెట్లు ఎక్కి విగ్రహం పైభాగాన్ని చూడ వచ్చు ..అదో దివ్య అనుభూతి నిస్తుంది .ఈ విగ్రహాన్ని 1-1-2000 న తమిళనాడు ముఖ్య మంత్రి కరుణానిధి ఆవిష్కరించారు ..గణపతి స్తపతి ఈ విగ్రహ రూప శిల్పి ..తిరువల్లువార్ తమిళుల ఆరాధ్య కవి .ఆయన సూక్తులను బస్సుల్లో రాసి ఉంటాయి .

                                               గాంధీ స్మారక మందిరం

   గాంధీ మహాత్ముడు ఇక్కడికి వచ్చి ,ప్రకృతి సౌందర్యానికి పులకించి సముద్ర తీరం లో తన్మయులై కూర్చున్న చోట గాంధి స్మారక మందిరం కత్తి ,జాతికి అంకితమిచ్చారు .

                                                            కన్యా కుమారి ఆలయం                 

             ఇక్కడి అమ్మవారు ‘’కన్యా కుమారి ‘’పార్వతీ దేవి అవతారం ..ఈ ప్రాంతపు రాజు కుమార్తె గా జన్మించన  ‘’కన్య ‘’శివున్ని మాత్రమే వివాహం చేసుకుంటానని పంతం పట్టింది ..తండ్రి ఈ విషయాన్ని శివునికి నివేదించాడు ..ఆయన పెళ్ళికి ఒప్పుకొన్నాడు .బృహస్పతి ముహూర్తం పెట్టాడు .లగ్న సమయానికి పరమేశ్వరుడు రాక పోయే సరికి ,కన్య ఆయన్ను వెదుక్కొంటూ బయల్దేరింది ..శివుడు బయల్దేరి తెల్లారే సరికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉన్న ‘’శుచీన్ద్రం ‘’వద్ద నిలిచి పోయాడు .దేవతలకు పగలు ప్రయాణం నిషిద్ధం ..కన్యా కుమారికి విషయం తెలిసి వెనక్కి వెళ్లి పోయింది .ముహూర్తం మించి పోయింది కనుక ఆమె ‘’కన్య ‘’గానే ఉండి  పోయింది .పెండ్లి కోసం చేసిన పిండి వంట లన్ని చిన్న రాళ్ళు ,గవ్వలుగా మారి పోయాయట .అందుకే యాత్రికులు వీటిని కొనుక్కొని భద్రం చేసుకొంటారు ..చిన్న ఆలయం లో నిలుచుని ఉన్న అమ్మ వారి విగ్రహం ఆకర్షణీయం గా ఉంటుంది ..ఆమె ముక్కు పుడక విపరీత మైన కాంతి తో ఆకర్షించి ,మెరుస్తూ మురిపిస్తుంది ..ఇక్కడ నవ రాత్రి ఉత్సవాలు ఘనం గా జరుపుతారు ..తెప్పోత్సవం కన్నుల పండువు గా ఉంటుంది .

                                                          సునామీ స్మారకం

       సునామీ వచ్చి ప్రపంచ దేశాలను ఈ మద్య అల్లా కల్లోలం చేసి ,ఎంతో జన నష్టాన్ని కల్గించింది .ఆ సమయం లో మరణించిన వారి కోసం స్మృతి చిహ్నాన్ని ఇక్కడ నేల కొల్పి వారందరికి అంజలి ఘటించారు

                        కన్యా కుమారి లో క్రైస్తవ   చర్చిలు  చాలా ఉన్నాయి ..అందుకే కన్యా కుమారి అమ్మ వారిని దాదాపు అందరు ‘’కన్య మేరి ‘’గా పిలుస్తారు ..కన్యా కుమారికి ఎనిమిది మైళ్ళ దూరం లో ‘’శుచీన్ద్రం ‘’ఉంది ..ఇక్కడే త్రిమూర్తులను శిశువులను చేసి అనసూయా దేవి పాతివ్రత్యాన్ని నిరూపించు కొన్నది .ఇక్కడే దేవేంద్రుడు తను చేసిన పాపాలను ప్రక్షాళనం చేసుకోవ టానికి శివున్ని ఆరాధించాడు .ఇఆయన అనుగ్రహం తో ఒళ్లంతా ఉన్న కళ్ళు పోయాయి .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక శుచీన్ద్రం అయింది

      మరో ఆలయం గురించి ఇంకో సారి –

                సశేషం —గబ్బిట దుర్గా ప్రసాద్ —7-6-12 —కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అమెరికాడైరీ —- విజిల్ విజార్డ్ వీక్ -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –13 అనంత పద్మ నాభ క్షేత్రం –తిరువనంత పురం

 వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –13

                                                  అనంత పద్మ నాభ క్షేత్రం –తిరువనంత పురం

          ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో జగన్నాధ ,బలభద్ర ,సుభద్ర ల మూర్తులు దారువు అంటే చెక్క తో నిర్మించ బడ్డాయి .అందుకే దాన్ని దారుకా వనం అని అంటారు .అలానే కేరళ లోని తిరువనంతపురం లోని అపురూప సుందర విగ్రహమైన శ్రీ అనంత పద్మ నాభ స్వామి దీ మొదట్లో దారు విగ్రహమే .ఇప్పుడు శిలా రూపం లో కన్పిస్తున్నాడు ..సాధారణం గా ఈ క్షేత్రాన్ని ‘’అనంత శయనం ‘’అంటారు ..ఇది చాలా ప్రాచీన దేవాలయం ..తిరుపతి శ్రీ శైలం లకు ఉన్న ప్రసిద్ధి దీనికీ ఉంది .

                                               చరిత్ర

       ఒకప్పుడు ఇది దట్టమైన అడవీ  ప్రాంతం ..ఒక రైతు దంపతులు ఇక్కడ పొలం పని చేస్తుండే వారట ..వారికి ఒక రోజున ఒక చెట్టు కింద ఏడుస్తున్న పసి పిల్లాడు కన్పించాడు ..పాలిచ్చి ,నిద్ర పుచ్చి ,పొలం లోకి పని లోకి మళ్ళీ వెళ్ళిందిభార్య . ..తిరిగి వచ్చేసరికి ,ఆ బాలుడి తలపై అయిదు తలల నాగు పాము ,ఎండ తగలకుండా కాపలా కాస్తోంది .ఆ పిల్లాడు విష్ణు మూర్తే అని భావించి ,ఇంటికి తీసుకొని వెళ్లారు .ఆ  దంపతులే అతడిని పెంచుతున్నారు .రాజు గారికి ఈ విషయం తెలిసి దేవాలయం నిర్మించారని చారిత్రిక కధనం .

                                           స్థలమహాత్మ్యం

     దివాకరుడు అనే ముని ఇక్కడ తపస్సు చేశాడు .విష్ణు మూర్తి చిన్న బాలుడి వేషం లో ఆయన దగ్గరకు వచ్చాడు ..బాలుడు ఆయన వద్దే ఉండటానికి ఇష్ట పడ్డాడట .ఆ బాలుడు తను ఏమి చేసినా ఏమీ అనకూడదని షరతు పెట్టాడు బాలుడు .సరే అన్నాడు మహర్షి ..పూజా ద్రవ్యాలను ,సాలగ్రామాన్ని విసిరి పారేస్తున్నా ముని కిమ్మనకుండా ఊరు కొంటున్నాడు ..అల్లరి పెరిగి పోయింది ..భరించ లేక ఒక దెబ్బ వేశాడు ముని ..వెంటనే ఆ పిల్లాడు ‘’అనంత అడవులు ‘’లోకి పోతున్నానని చెప్పి  మాయమై పోయాడు .ముని ఆ పిల్లాడి కోసం వేదుకు తుంటే ఒక చోట ‘’అల్లరి చేస్తే నిన్ను అనంత అడవుల్లో వదిలేస్తా ‘’అనే కొడుకును గడమాయించే ఒక స్త్రీ గొంతు విని పించింది ..ముని ఆమె వల్ల అనంత అడవి ఎక్కడుందో తెలుసు కొని ,వెదకటం ప్రారంభించాడు ..చివరికి పిల్లాడు కని పించాడు ..పట్టు కొ బోతే ఒక పెద్ద మామిడి  చెట్టు లోకి దూరి కనిపించకుండా పోయాడు ..అప్పుడా చెట్టు రెండుగా చీలి పడి పోయింది ..అందు లోంచి ఆది శేషుని పై శయనిస్తున్న శ్రీ మహా విష్ణువు దర్శనం ఇచ్చాడు ..అనంతుడే ఆదిశేషువు ..అదే అనంత శయనం అయింది ..ఆ రూపం తొమ్మిది యోజనాల పొడవు ఉంది ..తాను ఆ రూపాన్ని చూడ లేనని దివాకర ముని ప్రార్ధిస్తే ,ఆయన దండానికి మూడు రెట్లు మాత్రమే పొడవు ఉన్న ఆకారం లో అనంత శయనుడు గా మారి పోయాడు .కొబ్బరి చిప్ప లో ఉప్పునీరు ,,కాయ కసరులు వేసి ముని నైవేద్యం పెట్టాడు. దివాకర మహర్షి ‘’తుళువ ‘’వంశీకుడు ..అప్పటి నుంచి ,ఆ వంశీకులే ఇక్కడి అర్చకులు గా ఉన్నారు ..దివాకర మునియే ‘’బిల్వ మంగళుడు ‘’అంటారు ..బ్రాహ్మణ వంశీకుడు .వీరే స్వామికి ఉదయం పుష్పాన్జలిఅనే ప్రత్యెక పూజ చేస్తారు ..బలరాముడు ఈ క్షేత్ర దర్శనం చేశాడట ..శ్రీ వైష్ణ వులకు మహా దివ్య క్షేత్రం అనంత శయనం .

                          దారు విగ్రహం –శిలా విగ్రహం

              బాలుడు అదృశ్యం అయిన మామిడి చెట్టు చెక్క తోనే మొదట్లో విగ్రహాన్ని చెక్కి ప్రతిష్టించారు ..అయితే 1686లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ,ఆలయం ,విగ్రహం తగలబడి పోయాయి ..కొచ్చిన్ ,తిరువాన్కూర్ మహారాజు మార్తాండ వర్మ నూతన ఆలయాన్ని నిర్మించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ..అత్యంత పవిత్రమైన 12000 సాలగ్రామాలను దేశం అన్ని వైపులా నుంచి తెప్పించి ,,పటిక బెల్లం జిగురుతో అంటించి ఇప్పుడున్న విగ్రహాన్ని మలచారు ..గర్భాలయం ఎదుట నల్ల రాతి సుందర మండపం ఉంది ..మార్తాండ వర్మ కు అనంత పద్మ నాభ స్వామి పై అంతులేని భక్తీ విశ్వాసం  ఉండేవి .నిత్యం స్వామిని అర్చించి మాత్రమే రాజ కార్యాలు నిర్వహించే వాడు ..రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి కారణం స్వామి అనుగ్రహమే నని భావించాడు ..1750 లో తన రాజ్యాన్ని సర్వస్వాన్ని అనంత పద్మనాభునికి ధార పోసి ,తన ఖడ్గాన్ని స్వామి పాదాల చెంత ఉంచాడు ..ఇక నుంచి స్వామి సేవకుని గా నే ఉండి పోతానని తీర్మానించు కొన్నాడు .’’పద్మ నాభ దాసుడు ‘’గా పిలువ బడ్డాడు ..అప్పటి నుంచి రాజ్యానికి కొత్తగా వచ్చిన ప్రతి రాజు ,తన ఖడ్గాన్ని స్వామి సన్నిధి లో ఉంచి ,స్వామి దాసులు గా పని చేస్తామని శపథం చేసి ,రాజ్య పాలన చేసేవారు .ఈ నాటికీ ప్రజా ప్రభుత్వం లో కూడా ఈ సంప్రదాయాన్నే పాలకులు పాటించటం కొనసాగిస్తున్నారు .

                                    ఉత్సవాలు

   శ్రావణ మాసం లో పది రోజులు ఉత్సవం జరుగుతుంది .లక్షలాది దీపాలు వెలిగిస్తారు .తర్వాతాఊరేగింపు చేస్తారు ..విగ్రహాలకు సముద్ర స్నానం చేయించి రాజ వంశీకులు వెంట రాగా మళ్ళీ ఆలయానికి తీసుకొని వస్తారు .ఆ రెండు రోజులు విమానాశ్రయాలు బందు చేస్తారు .ఆలయం మీద విమానం ఎగుర రాదనే పవిత్ర భావం ..శ్రావణ మాసం లోను ఉత్సవాలు నిర్వహిస్తారు .స్వామిని పంచె ,లుంగి తోనే దర్శించటం ఇక్కడ సంప్రదాయం .రాజ వంశీకులైనా అంతే .స్వాతి తిరుణాల్ మహా రాజ వంశీకులే ఇప్పటికీ వంశ పారం పర్య ధర్మ కర్తలు ..ఇక్కడున్న కోవలం బీచ్ చాలా అందం గా ,ఆహ్లాదం గా ఉంటుంది .

    ఇక్కడ జ్యూ ,మ్యూజియం ,చూడదగిన ప్రదేశాలు ..కేరళ సంస్కృతి నాగరకత ,జీవన విధానం ,ప్రతిబింబించే అనేక విధానాలు చూడ వచ్చు .మ్యూజియం అంతా చెక్క తోనే చేసి ఉండటం ఒక వింత .ఇక్కడి ఇల్లు ,ఆలయాలు  భవనాలు అన్నీ దాదాపు దారు నిర్మితాలే .అదీ విచిత్రం .దట్టమైన అడవి ఉండటం తో అటవీ సంపదకు నిలయం .రబ్బరు తోటలకు ప్రత్యేకత .అన్నత పద్మ నాభుని నేల మాలిగ లలో అనంత మైన సంపదను పూర్వపు రాజులు భక్తులు ఇచ్చినవాటిని  నిక్షిప్తం చేశారు .ఆ సంపద విలువ ఎంతో లెక్క కట్టే షరాబు లేడు .పేరుకు తగ్గట్టే సంపదా అనంతమే ..అనంత పద్మ నాభుని దర్శనం అనంతానందం శుభకరం ,మోక్ష దాయకం .

      మరో ఆలయం –మరోసారి

   సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ – 6-6-12   కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | 2 Comments

ఊసుల్లో ఉయ్యూరు –32 వారధి సారధులు

     ఊసుల్లో ఉయ్యూరు –32 
                                                                    వారధి సారధులు 

ఉయ్యూరు  లో మా శివాలయం బజారు నుండి పుల్లేరు కాలువ దాటటానికి వంతెన లేదు .చాలా కాలమ్ గా  ఆందోళన చేస్తున్నా పట్టించు కోలేదు ప్రభుత్వం ,పంచాయితీ కూడా .అవతలి ఒడ్డుకు వెళ్ళాలంటే పూర్వం చిన్న డింగీలు ఉండేవి . పల్లెకారులు వాటిని నడిపే వారు .వాళ్ళు పంచాయితీ పాటల్లో పాల్గొని నడిపే హక్కు సంపాదించు కొనే వారు .దాటే వారెవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవటమే కాని ఇంత డబ్బు ఇవ్వాలనే నియమం  లేదు .కాపుల బజారు లో ఒక రేవు వుండేది  . అక్కడి నుంచే దాటే వారు .మాకు యాకమూరు దగ్గరలో కర్రల చిన్న వంతెన ఉండేది . ఇరుగ్గా ఉంటుంది . ఒక రిక్షా అతి కష్టం మీద వెళ్ళ గలిగే వీలు .సైకిళ్ళు ,స్కూటర్లు ఎక్కిన్చాలంటే ఒంతేన చాలా ఎత్తు గా వుంది అప్రోచ్  రోడ్డు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళం వర్షాకాలం బురద లో యమ యాతన గా ఉండేది ..వల్లూరు  వెళ్ళాలన్నా  ,యాక మూరు ,పెనమకూరు దేవర పల్లి వగైరాలకు వెళ్ళాలంటే ఆ చిన్న వంతెనే గతి . లైట్లు కూడా ఉండేవి కాదు . రాత్రి పూట మరీ ఇబ్బందిగా ఉండేది .నిర్మానుష్యం .అలానే సినిమాకి వెళ్ళిన జనం , పొరుగూరి నుండి వచ్చిన వాళ్ళు ఈ ఇబ్బందుల్ని భరిస్తూ కాలవ అవతలికి చిన్న వంతెన మీద నుంచే వెళ్ళే వాళ్ళు .కాలేజి విద్యార్ధులు ,స్కూల్   విద్యార్ధులు ,కూరగాయల అమ్మకం వాళ్ళు అందరికి అంత కంటే గత్యంతరం లేదు .కే.సి.పీ.లో పని చేసే కార్మికులైనా ఇతర ఉద్యోగస్తుల కైనా అంతే గతి .అదీ చిన్న వంతెన పరిస్థితి .సి.బి.యం .ఆస్పత్రి దగ్గర పెద్ద వంతెన ఉండేది .దాని మీద బస్సులు తో సహా అన్నీ వెళ్ళటానికి వీలైనానంత వెడల్పు గా ఉండేది .అక్కడ లాకులు కూడా ఉన్నాయి .అదీ చాలటం లేదని కే.సి.పీ సహకారం తో దాన్ని వెడల్పు పెంచి కొత్త వంతెన కట్ట్టారు .ఇన్ని జరిగినా చిన్న వంతెన పని ఎవరు చేబట్ట    లేదు .అది మరీ ఆ చివర అయి పోయింది .ఊరూ పెరిగింది .కాలవ కట్ట అంతా ఇల్లు వేసుకొన్నారు పేద ప్రజలు .నడిచే వీలు కూడా లేకుండా ఉంది .ప్రజల గోడు బధిర శంఖారావమే అయింది ..

              అన్నీ ప్రభుత్వమే చేయలేదు .ప్రజలు కూడా తమ వంతు పని చేయాలి .ఈ విషయం లో ప్రజా ప్రతినిధులు ,పంచాయితీ ,గ్రామ పెద్దలు అందరు ఒకటై ఆలోచన చేశారు ..దీనికి పరిష్కారం ఆలోచించారు ..మంచి పని చేస్దామను కొంటె వదాన్యులకు కొదవ వుండదు .అయితే గంట కట్టే వాడున్డాలి ..ఆపనికి ఉయ్యూరు లో అత్యంత ధనికులు ,కే.సి .పీ.లో వేలాది షేర్లు వున్నవారు ,ఎన్నో కంపెనీలలో పెట్టుబడు లున్న వారు ,కాలువ అవతల ఎంతో విలువైన భూమి ఉన్న వారు ,ఇన్ని ఉన్నా నేత పంచె ,చొక్కా తో పైన ఖండువాతో పాత  సైకిలు తొక్కు కుంటు , నడిచి వస్తుంటే చంకలో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తో వచ్చే వల్లభ నేని వీర భద్ర రావు గారు అందరి దృష్టి లో పడ్డారు .ఆయనకూ ఇక్కడ వంతెన పడితే .తనకూ లాభమే .పొలాల విలువ పెరుగుతుంది .తనకూ నడకా ,చుట్టూ తిరిగి వచ్చే బాధా తప్పూ తుంది .ఆయన మనసు లోను ఇది సుళ్ళు తిరుగు తోంది .శాసన సభ్యులు అనే బాబూ రావు సర్పంచ్ గెల్లి మల్లికార్జున రావు ,బ్రాహ్మనుడైనా మంచి వ్యవసాయం లో దిట్ట గోవింద రాజుల పరబ్రహ్మానంద శర్మ అనే” అబ్బి” గారు  యువకుడు ఉత్సాహ వంతుడు ,మంచి పనుల్లో ముందుకు దూకే యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇప్పటి శాశన మండలి సభ్యుడు అందరు కలిసి ఆలోచించారు .పరిష్కారం దొరికింది .వీరభద్ర రావు గారు రెండు లక్షలు ,పంచాయితీ కొంత ,డబ్బు వేసుకొని ,మిగిలిన డబ్బు మా బజారు లో ఉన్న కుటుంబాల వారు తలో వెయ్యి రూపాయలు చందా వేసుకొని .ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ను కలుపు కోని కే.సి .పీ.వారి సహకారం తో వంతెన నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు .డబ్బు సమకూర్చు కొన్నారు .పని ప్రారంభించారు .డబ్బును బాంక్ లో డిపాజిట్ చేసి ,అవసరమైనప్పుడు తీస్తూ మా బజారు లో వంతెన పూర్తి చేశారు .చాలా తక్కువ సమయం లోనే నాణ్యత గా కట్టటం విశేషం .దీనితో పుల్లేరు దాటటానికి వారధి ఏర్పడింది .దానికి వీరభద్ర రావు గారు ధన రూప సాయం చేసి అవసరమైతే ఎంత పెట్టుబడి పెట్టతానికైనా ముందుంది పని ని వేగ వంతం చేశారు .మరి ప్రజల నుండి డబ్బు వసూలు చేయటానికి ఆయన ఇంటింటికీ రాలేరు కదా .ఆ బాధ్యత గోవిందరాజుల శర్మ గారికి అప్పా గించారు . ఆయన కొద్ది మంది ప్రముఖులతో ఇంటింటికీ తిరిగి ఇంటికి వెయ్యిరూపాయల చొప్పున వసూలు చేసే బాధ్యత ను తీసుకొని చాలా పకడ్బందీ గా ,అందరికి  నచ్చ చెబుతూ వసూలు చేశాడు .నేనుకుడావెయ్యి రూపాయలు ఇచ్చాను .మిగతా వాళ్లకు చెప్పి ఇప్పించాను .అంతా సమకూరి సద్వినియోగమై మా వంతెన రూపు దాల్చింది .ఈ వారధికి నిజమైన సారధులు వల్లభనేని వీర భద్ర రావు గారు ,రెండో వారు మా బజార్లో ఎత్తు అరుగుల మీద ఉండే గోవిందరాజు శర్మ గారు ..వీరిద్దరి కృషి ,ప్రయత్నం ,మిగిలిన వారి సహకారం వల్లే ఇంత మంచి పని జరిగి ఆ వంతెన ఎంతో ఉపయోగ కారం గా ఉంది .ఈ వంతెన పై లారీలను వెళ్ళ నివ్వ రాదు అనే నియమం ఉంది .కాని దాన్ని పాటించక పోవటం బాధా కారం .ఈ వంతెన మూలం గా ట్రాఫిక్ విపరీతం గా పెరిగింది .స్కూల్ బస్సులు ఆటోలు ,రిక్షాలు ,చిన్న కార్లు అన్నీ హాయిగా వెళ్ళ గలుగు తున్నాయి .,
.            గోవింద రాజు శర్మ గారు నాకు స్కూల్ లో సహాధ్యాయి .ఎప్పుడు గ్లాస్కో లుంగి ,గుండీలు పెట్టని గ్లాస్కో చొక్కా ,పైన తువ్వాల ,డొక్కు లూనా తో ,చైన్ స్మోకింగ్ తో దర్శనం ఇస్తుంటాడు .మంచి వ్యవసాయం చేసే వాడు .కాలేజి కి అవతల గరుగు కు దగ్గరగా పొలాలున్నాయి .మెత్త వ్యవసాయం .చెరుకు బాగా పండించే వాడు .కందా ,పశుపు ,కూడా .మంచి స్నేహ శీలి .అనుక్షణం ఆయనతో కనీసం పది మంది మిత్రులుంటారు .వాకిట్లో ఎప్పుడు సందడే .అందరికి కాఫీలు ఇవ్వటం ఆ ఇల్లాలి డ్యూటి .వాళ్ళ అబ్బాయిలు  నాశిష్యులే .మా అబ్బాయిలకు సహాధ్యాయులే .శర్మ గారు రాజకీయం గా తెలుగుదేశానికి దగ్గర వాడు .అన్నే  బాబూ రావు గారు వడ్డే శోభనాద్రీశ్వర రావు గార్లతో చాలా సన్నిహిత సంబంధాలుండేవి ..బాబూ రావు , వడ్డేలు శర్మ గారితో  సంప్రదించ కుండా ఏ పనీ చేసే వారు కాదు .అలాగా బ్రాహ్మ సంఘం లోను ఆయన మాటే చెల్లు బాటు .అందర్లో తలలో  నాలుక గా ఉండే వాడు . అతని మాటలు కొంచెం పంజేంట్ గా ఉండేవి .మనిషి సౌమ్యుడే .పాపం ఒక సారి ఆయన మా వార్డ్ మెంబర్ గా ఎన్నికలలో దిగాడు .ఎంతో మంది తో పరిచయాలు ,ఎందరో కూలీలు ఆయన పొలాల్లో పని చేసే వారున్నారు ,బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారుకానీ చాలా విశ్వాసం తో బరిలో దిగారు .కాని అంచనాలు తారు మారయ్యాయి .దారుణం గా ఓడిపోయారు .పాపం కుంగి పోయాడు .అయితే నేను ఆయన గెలిచే అవకాశాలు లేవని ముందే తెలుసు కొన్నాను .సరే ఫలితాల రోజూ న ఆయన ఇంట్లో నే ఉన్నాం అందరం .అందరికి కాఫీలు ,టీలు ఇచ్చాడు ఫలితం తో సంబంధం లేకుండా .అదీ ఆయన ప్రత్యేకత .”ఏమయ్యా ”అని పిలిస్తే ”మీరు ”అని అతను పలకరించే వాడు .మా రమణ కు వాళ్ళింట్లో మంచి చనువు ..అలాంటి శర్మ గారు మార్చి చివర్లో అకస్మాత్తుగా చని పోయాడు .ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను .
 ఇవాళ మా అబ్బాయి రమణ మెయిల్ రాస్తూ వల్లభనేని  వీరభద్ర రావు  గారు చని పోయారని తెలియ జేశాడు .వీరభద్ర రావు గారు సాదా సీదా జీవితమే గడిపారు .ఆయన ఎంత ధన వంతులు అంటే ఉన్న పాలం గా మా ఉయ్యూరు ను అమ్మేస్తే కోనేంత సంపన్నులు .అయినా చాలా మామూలు గా ఉండే వారు .సైకిలు ,లేక నడకే ..ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది .కోమట్ల బజారు లేక రావి చెట్టు బజారు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న సమయం అది 1988 సంవత్సరం ..అందరి దగ్గరకీ చందాల కోసం తిరుగుతున్నాం .అలానే వీరభద్ర రావు గారికోసం వెళ్లాం .ఇస్తాను ఇతాను అంటూ  చాలా సార్లు తిప్పించుకొన్నారు .కాని రూపాయి కూడా చేప లేదు .సరే రేపుప్రతిష్ట అనగా ముందు రోజూ న మేము వెళ్లి ఆయనకు మళ్ళీ జ్ఞాపకం చేసి ,ఆహ్వానం ఇచ్చి ,డబ్బు సంగతి మర్చి పోయి రమ్మని కోరం .కే.సి.పీ.మేనేజర్శ్రీ ఇంజేటి జగన్నాధ రావు గారు ,అనే బాబో రావు గారు వంటి పెద్దక్లు వస్తున్నారు అని తెలియ జేశాం .కానీ ఆయన ప్రతిష్ట రోజూ న రాలేదు .మర్నాడు ఉదయం నేను మా ఇంట్లో సంధ్యా వందనం ,పూజ లో ఉండగా వీరభద్ర రావు గారు నడిచి మా ఇంటికి వచ్చి నేను బయటికి వచ్చేదాకా వాకిట్లో కుర్చీలో కూర్చున్నారట .నేను వెళ్లి పలకరించాను .ఆయన అన్న మొదటి మాట ”ప్రసాద్ గారూ ! నేను అనుకున్న డబ్బు అంటే రెండు వేల రూపాయలు అనుకొన్న సమయానికి ఇవ్వ లేక పోయాను .ఏమీ అనుకో వద్దు .సరిగ్గా అక్టోబర్ మొదటి వారం లో  మీకు ఆ డబ్బు అంద జేస్తాను ..”అన్నారు .” సరే నండీ మా స్వామి  ఆయనే తెచ్చు కొంటారు ”అన్నాను .కాఫీ ఇచ్చి పంపాను .అంతే సరిగ్గా ఆయన అన్నరోజు ఆయనే ఫోన్ చేసి మమ్మల్ని రమ్మన్నారు .వెళ్ళగానే కాష్ ఇచ్చేశారు .దాన్ని ఆయన వాగ్దానం చేసిన అయిదు నెలలకు ఇచ్చారు .అందరు ఆయన డబ్బు ఇచ్చారు అంటే ఆశ్చర్య పోయారు ”.ఎనిమిదో వింత ”అన్నారందరూ  నవ్వు కొన్నాం .మా ఆంజనేయ స్వామి మహాత్మ్యం అది .ఆ డబ్బు ఆయనకు ఒక లెక్క లోది కాదు ..కానీ ఎందుకు అంతా తాత్సారం చేశారో అర్ధం కాదు .పోనీ ఆయన కు దేవుడి మీద భక్తీ లేదా అంటే అదేమీ కాదని తెలిసింది .భార్య మహాయోగ్యురాలు .మేము వెళ్ళిన ప్రతిసారి కాఫీ ఇచ్చి పంపేది .వీరభద్ర రావు గారి తండ్రి గారు గోపాల రావు గారు .ఎప్పుడు వాలు కుర్చీలో వరండాలో కూర్చుని కని పించే వారు .తెల్లనిపొడవైన  గడ్డం ,లుంగి ,చొక్కా తో ఉండే వారు ..అంతటి ధన వంతుడు మా ఇంటికి వచ్చి ఈ చిన్న మొత్తం కోసం అంత సేపు మా వాకిట్లో కూర్చోవటం ఆశ్చర్యం .ఆయన బజార్లో కని పించి నప్పుడల్లా చక్కగా మపలకరించి మాట్లాడే సహృదయులు ..మా నాన్న గారంటే విపరీత మైన అభిమానం త వారికి .ఎప్పుడు నాన్న గారి గురించే జ్ఞాపకం చేసే వారు .దేశ ఆర్ధిక స్థితి పై మంచి అవగాహన ఉన్న వారు .షేర్లు ,పెట్టు బదులు ,లాభ నష్టాలూ బాగా తెలిసిన వారు .కాని ఆయన పిల్లలేవారు ఆయన కు అందు బాటు లో లేరు .భార్య ముందే చని పోయింది .ఇప్పుడు వీరి మరణం .
        మా వారధికి సారదులైన వారు శర్మ గారు ,వీరభద్ర రావు గారి మరణం కుతీవ్ర విచారం తెలియ జేస్తూ ,వారి కుటుంబాలకు సాను భూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నాను .
                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —06 -06 -12 . -కాంప్–అమెరికా
Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment