అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్

అమెరికా డైరీ —వీక్ గా” గడిచిన” వీక్

              అమెరికా వచ్చి అప్పుడే నెల దాటింది . వచ్చిన ఇరవై ఐదు రోజులకు కాని లైబ్రరీకి వెళ్ళ లేక పోయాను .అయిదవ తేదీ charlotte mecklen burg లైబ్రరి కి వెళ్ళాం .అక్కడ ఇరవై పుస్తకాలు తీసుకొన్నాను .ఇక్కడి పధ్ధతి వేరుగా ఉంది .మనమే పుస్తకాలను చేకౌట్ చేసు కోవాలి .అంతా అయిన తర్వాత లిస్టు వస్తుంది .నేను ,మా అమ్మాయి విజ్జి చెరో పది పుస్తకాలను పట్టు కొని కారులో పెట్ట టానికి వెళ్తుంటే అందరు విజ్జిని ‘’is all this stuff for you ?అని నవ్వుతు అడిగితే ‘’no -it is my father’s stuff ‘’అని వెనక ఉన్న నన్ను చూపించింది .వాళ్ళు నవ్వుతు’’ ఓహ్ వెరీ గుడ్ ‘’ అని అభి నందించారు .దానర్ధం ఈ మొహం అన్ని పుస్తకాలు చదివేదేనా అని కాని, అమ్మో ముసలాడు చాలా చదువు తున్నాడే అని మెచ్చి కోలు కావచ్చు. నాకు రెండోదే అని పించింది నిశ్చయం గా .అమెరికా కాంగ్రెస్ కు, కౌంటీ మాజిస్త్రేట్ మొదలైన వాటికి ఎన్నికలు జరుగు తున్నాయి .ఎక్కడా హంగూ ,ఆర్భాటం లేదు అరుపులు గోలలూ లేవు .నినాదాలు లేవు .లైబ్రరి లో పోలింగ్ జరుగుతోంది .మనకైతే సెలవ ప్రకటిస్తారు .ఇక్కడ ఎవరి పని వారిదే .ఒక పక్క పోలింగ్ ఇంకో వైపు యదా ప్రకారం లైబ్రరి కార్య క్రమాలు .లైబ్రరీ లలో పిల్లలకు ట్యూషన్ చెబుతారు టీచర్స్ .రెండు గంటలు .శని వారం రోజున .డబ్బు తీసుకొంటారు .ఎన్నిక చాలా పధ్ధతి లో జరగటం నాకు ముచ్చటేసింది .ప్లే కార్డ్స్ పట్టు కొని లైబ్రరి బయటి గేటు కు అవతలే ఏజెంట్స్ నుంచుని ఉంటారు .నవ్వుతు అందర్ని పలకరిస్తారు .లోపల ఎన్నికల బూత్ ను కూడా చూశా.ఎవరి గోల వారిదే .చక్కగా ఓటేసి వెళ్లి పోతున్నారు .సీక్రేసి మైంటైన్ చేస్తున్నారు .బాలెట్  షీట్ చాలా పెద్ద గా కని పించింది .రెండు పార్టీల అభ్యర్ధుల పేర్లు కని పించాయి రెండు  వరుసలలో .బహుశా నేను చూసింది నమూనా పేపర్ అయి ఉండ వచ్చు .లైబ్రరి లో ఎలుగు బంటి  అంత నల్లని కుక్కను చూశా  . .దంపతులిద్దరూ దాన్ని తెచ్చి చిన్న పిల్లలకు చూ పిస్తున్నారు .అన్ని రకాల గేమ్స్ ఆడు కోవా టానికి వీలుంది .నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది ఎప్పుడు .నేను తెచ్చిన ఇరవై పుస్తకాలలో పద్నాలుగు నిన్నటి తో చదివేశా .అందు లో ఒకటి రెండు అంత గా బాగా ఏక పోతే తిరగేశాను అక్కడదక్కడ చదువుతూ .చదివిన పుస్తకాల లిస్టు రాస్తా చివర్లో .ఈ వారం లో వర్షం పడింది రెండు మూడు సార్లు .శామ్స్  ,వాల్మార్ట్ ,జి మార్ట్ లకు వెళ్లి పాలు ,పళ్ళు కూరలు తెచ్చు కోవటం తప్ప బయటికి పెద్ద గా వెళ్ళ లేదు .పన్నెండవ తేది శని వారం మదర్స్ డే కోసం ఒకరింటికి వెళ్ళాం . ఈ వారం లో ఇంటి చుట్టూ రాళ్ళు పెట్టించి మట్టి పోయించి పూల మొక్కలు కూర గాయల మొక్కలు పెట్టింది విజ్జి .శ్రీ కెత్ కరాటే క్లాస్ కు వెళ్ళాం శుక్రవారం .

        ఈ నెలలో దాదాపు సరస భారతి కి నలభై అయిదు కు పైగా ఆర్టికల్స్ రాసినట్లు గుర్తు .’’చినుకు మాస పత్రిక’’ లో  నేను రాసిన ‘’అన్నం పెట్టిన చేతుల తోనే—‘’అనే ఆర్తికల్  మే సంచిక లో పడింది . ఇదిsynthetic    అమోనియా తయారు చేసి సస్యవిప్లవానికి నాంది పలికిన హేబర్ అనే శాస్త్రజ్ఞుడి గురించి .స్టేట్ లీడర్ ,సన్ఫ్లవర్ మాగజైన్లలో నేను రాసినవి  వస్తున్నాయి .ఆధునిక  స్త్రీ కవుల గురించి ఆర్టికల్స్ రాశాను .ఇంకా కొన్ని నోట్స్ రూపం లో ఉన్నాయి .వాటిని డెవలప్ చేయాలి .ఏ బయటి ప్రోగ్రాములు లేక పోవటం టో ఈ వారాన్ని ‘’weak గా గడచిన week’’ అన్నానంటే రైం బాగుందని.

                                                      కళ తప్పిన మదర్

          మే పన్నెండు శని వారం మదర్స్ డే.ప్రపంచం అంతా గొప్పగా జరుపుకుంటుంది ,జరుపు కొన్నది .ఇక్కడికి అరగంట ప్రయాణ దూరం లో మా అల్లుడు అవధాని మేనత్త గారి ఊరుకు చెందిన కుటుంబ స్నేహితులు మదర్స్ డే కార్యక్రమం వారింట్లో జరుపుతున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళాం .మేనత్త  కుటుంబానికి వీరికి నలభై ఏళ్ళ కు పైగా స్నేహం .తరచు ఆ రెండు కుటుంబాలు కలుసు కొంతాయట .  .స్నేహాన్ని ఇంత బంధం గా ,పదిలంగా భద్ర పరచు కొంటున్న వారిద్దరి కుటుంబాలకు అభి నందనాలు .దాదాపు ఇరవై తెలుగు కుటుంబాల వారు చేరారు .మా అమ్మాయి వాళ్లకు ఈ కుటుంబం తప్ప మిగిలిన వారితో పరిచయమే లేదట .అయితే ఆ దంపతులు మమ్మల్ని చక్కగా మర్యాదగా ఆహ్వానించారు .కుశల ప్రశ్నలు వేశారు సంగతు లన్నీ తెలుసు కొన్నారు .ఇంటి ఆవిడ తాను తెచ్చిన గిఫ్ట్ లను పిల్లలతో వారి తల్లులకు ఇప్పించి హాపీ మదర్స్ డే చెప్పించింది .మా అమ్మాయితో వాళ్ళ అమ్మకు అంటే మా శ్రీమతికి ,మా మనవడి తో మా అమ్మాయికి గిఫ్ట్ లు ఇప్పించారావిడ.మేము అక్కడికి రాత్రి ఏడు గంటలకు చేరాం .ముందుగా అందరికి” ముంత కింద పప్పు” లాంటి దాన్ని  కప్పుల్లో పెట్టి అందించారు .పిల్లలకు బిస్కట్లు జ్యూసులు .మదర్స్ డే సందడి ఏదైనా ఉంటుందేమో నని ఎదురు చూశాను .ఆ జాడ కని పించలేదు .మగ వాళ్ళందరూ ఒక గది లో హాయిగా పేకాట లో మునిగి పోయారు .ఆడ వాళ్ళందరూ షరా మామూలుగా చీరలు ,నగలు ,పిల్లల  గొప్పతనాల ముచ్చట్లలో  లో మునిగి పోయారు .మా ఇద్దరికీ  ఏ మ్బరాసింగ్ గ ఉంది .కనీసం అక్కడ చేరిన స్త్రీలు తమ తల్లుల గురించి తలో అయిదు నిమిషాలు గుర్తు చేసుకొంటే సార్ధకం గా ఉండేది .తాము సమస్యల్లో వున్నప్పుడు తమ తల్లులు ఎలా మార్గ దర్శనం చేశారో వాళ్ళు మాట్లాడు కొంటె నా కంటే  సంత సించె వాడు ఇంకోడు ఉండే వాడు కాదు .అదే చాలా బాధ కల్గించింది .అయితే ఒక గొప్ప విషయం ఏమి టంటే అక్కడికి వచ్చిన వారందరూ దశాబ్దాల పాటు అమెరికా లో ఉంటున్నా చక్కని తెలుగు లో మాట్లాడు కొన్నారు మాట్లాడారు .మగ వారు ,ఆడ వారు ,పిల్లలతో సహా .ఇది మహత్తరం  అని పించింది .ఆడవారు సంప్రాదాయ చీర లతో వచ్చారు .అదీ ముచ్చటేసింది .వీరందరి సంస్కారానికి ,పోషిస్తున్న సంస్కృతికి జేజేలే

                      రాత్రి ఎనిమిదన్నరకు విందు మొదలైంది .రసమలాయి స్వీట్ ,–చపాతి -బంగాళా దుంప కూర ,బీన్స్ కూర ,కాప్సికం కూర ,ఇంకో రక మైన చికిడీ ,.పప్పు, కొబ్బరి చట్ని ,మామిడి కాయ  ఆవకాయ ,టమేటో పచ్చడి అన్నం ,రసం , గడ్డ పెరుగు .అందరు చక్కగా మాట్లాడు కొంటూ తిన్నారు .అడిగి అడిగి ఆడవాళ్ళు వడ్డించారు .మదర్ ను జ్ఞాపకం చేసుకోక పోయినా , మదర్ వంట లాంటి వంట తిన్నాం .అన్నీ ఇంటి ఇల్లాలే చేశారట .మదర్లీ ఎఫెక్షన్ తో  చేశారేమో .అందరు లొట్ట లేసుకొంటు ,ఆమె ను అభినందిస్తూ తిన్నారు .కృతజ్ఞతలను చెప్పి అందరం పదింటికి బయల్దేరి రాత్రి పదిన్నరకు ఇంటికి చేరాం .మదర్ పై ఒక చిన్న పద్యం లాంటి కవిత ఆంగ్లం లో –

m –merciful ,majestic ,memorable  ,magnana mous

o- –omni present ,omni potent ,occcupational

t—talented ,tactful ,terribly inspiring

h—honest ,honourable ,humble ,homely

e—enduring ,ever helpful ,energetic

r—resourceful ,rewarding  and with,right judje ment .

    is mother –  I adore you the mother for all .

     నేనీ వారం లో చదివిన పద్నాలుగు పుస్తకాలు –canary capers ,charles lind bergh ,buddhists hindus ,sikhs in americaa ,lindon  johnson ,ice maiden of the andies ,hundred modern poems ,are you happy ?,making modernism –and picasso ,mrs lincoln ,lenok’s journey ,charlotte then and now ,the abolition of marriage in americaa ,god and the evolving universe ,how shakespere become shakespere .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —14-5-12.

           కాంప్—అమెరికా

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

స్వాతి మాస పత్రికలో వచ్చిన సరసభారతి ఉగాది పురస్కారం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస భారతి ఆధ్వర్యంలో జరిగిన ఆదిత్య హృదయం పుస్తక ఆవిష్కరణ గురించి వివిధ దిన పత్రికలలో వచ్చిన వార్తలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సత్య కధా సుధ—10 (చివరి భాగం)

సత్య కధా సుధ—10 (చివరి భాగం)

           ఏ జన్మ  లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు  –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు   చుట్టూ విచారిస్తు న్నాడు   .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని ,ముందు పండి  జన్మ తర్వాత మోక్షం వస్తుందని చెప్పాడు గురువు .గురువు గారు పంది  జన్మ ఎత్తటం శిష్య్డుదు  జీర్ణించు కోలేక పోయి తన కర్తవ్యమ్ ఏమిటో చెప్ప మన్నాడు ..దానికాయన ‘’ఊరికి ఉత్తరాన ,ఒక ఎరుకల వాని ఇంట్లో ఒక పంది పిల్లగా  జన్మించ బోతున్నానని ఆ పిల్లకు మొహం మీద తెల్ల మచ్చ ఉంటుందని ,వెంటనే తన్ను చంపేస్తే సరాసరి తనకు మోక్షం వస్తుందని చెప్పాడు .శిష్యుడు అలానే చేస్తానని  మాట ఇచ్చిన తరువాత గురువు  హాయిగా ప్రాణం వదిలాడు

     గురువు చెప్పినట్లే ఎరుకల వాడింటికి శిష్యుడు వెళ్లాడు .అక్కడ ఒక పంది  ఈన టానికి నొప్పులు పడుతోంది .కాచుక్కూచున్నాడు శిష్యుడు దుడ్డు కర్రతో .పంది ఈని ఇరవై పిల్లల్ని కన్నది .అందులో ముఖం మీద తెల్ల మచ్చ పిల్ల కని పించింది .శిష్యుడు ఎరుకల వాడిని బతిమి  లాడి ఆ పిల్లను తీసుకొని ,చాటుగా దుడ్డు కర్రతో దాని కపాల మోక్షం చేసి గురువు గారికి మోక్షం కల్పించాలని కర్ర ఎత్తాడు .ఇంతలో  గురువు గారి గొంతు ఆ తెల్ల మచ్చ పంది పిల్ల నుంచి విని పించింది ‘’నాయనా !నన్ను చంపవద్దు .నాకు చాలా ఆనందం గా ఉంది .పాలు తాగే సమయ మైంది .మా అమ్మ దగ్గర పాలు తాగుతాను .’’అని చెప్పాడు గురువు గారు .దీనిని బట్టి తేలేదేమి టంటే ఎంత నికృష్ట జన్మ ఎత్తినా మరణానికి జీవి భయ పడుతుంది అని .

                   మేక ‘’మే,మే’’అని ఆరుస్తుందని మనకు తెలుసు .మానవ మేక యేమని అరుస్తుందో సరదాగా అయినా, సత్యమే చెప్పాడు ఒక కవి .

    ‘’అపత్యం చ మే –కళత్రం మే –ధనం మే –బంధవాస్చ మే —జల్పస్త మితి మర్త్యాజం హన్తి కాల వృకో బలాత్ ‘’

దీని అర్ధం ఇది –మానవుడు అనే మేక సంతానం నాది –భార్య నాది ,ధనం నాది –బంధు వర్గం నాది అని ‘’మేమే ,మేమే ‘’అంటూ అరుస్తుందట .ఈ అరుపు విని కాలం అనే తోడేలు మీద పడి   బలాత్కారం గా మేక మానవున్ని చంపేస్తుంది .సంస్కృతం లో మే –మమ –అంటే నాది అని అర్ధం .

          చని పోతే నాది అనేది ఏదీ ఉండదని తెలియ జెప్పే ఒక కధ –

ఒక రాజు వంది  మాగధుల స్తోత్రాలతో హాయిగా నిద్ర లేచాడు .తన వైభవాన్ని తానే మురిసి పోతు మనసు లో ఒక శ్లోకం కూర్చు కొంటున్నాడు .ఒక పండితుడు రాజు గారికి తెలీకుండా ఆయన మంచం కింద నక్కి వింటున్నాడు .రాజు గారు శ్లోకాన్ని బిగ్గరగా చదివాడు

‘’చేతో హరాయువతః సుహ్రుదోను కూలః –సద్బాన్ధవాహ్ప్రనయ గర్భ గిరిస్చ భ్రుత్యాః

గర్జంతి దంతి నివహః తరలాస్తూ రంగాః –మన్యే మమై తదపి సర్వ మదృష్ట జాతం ‘’

వెంటనే మంచం కింద ఉన్న కవి పండితుడు ‘’సంమీలనే నయనయొహ్ సహ కించి దస్థి’’అని అయిదు పాదాలు ఉండే  ఆ శ్లోకాన్ని అయిదవ పాదం చెప్పి పూర్తీ చేసి మంచం కింద నుంచి బయటికి వచ్చాడట .పేదరికం బాధ తట్టు కోలేక దొంగతనం చేయటానికి మనసొప్పక  తను ఇలా మంచం కింద దాక్కో వాల్సి వచ్చిందని నిజం చెప్పాడు పండితుడు .రాజు పండితుడిని క్షమించి ధనం భూమి ఇచ్చి సత్కరించి పంపాడట .ఇంతకీ ఆ శ్లోక స్వారస్యం తెలుసు కోవాలి కదా –రాజు తన శ్లోకం లో ‘’నా మనస్సుకు ఆనందం కల్గించే సుందరాన్గులున్నారు ,అనుకూలమైన స్నేహితులున్నారు ,కష్ట సుఖాల్లో పాలు పంచుకొనే బంధువు లున్నారు ,మాటలతో ,రాజ భక్తీ తో  సేవ లందించే నౌకర్లు చాకర్లున్నారు ఘీన్కరించే మత్త గజాలున్నాయి .వాయు వేగాలైన గుర్రాలున్నాయి .ఈ భాగ్యం అంతా నా  అదృష్టం నుంచి వచ్చిందే ‘’అని పొంగి పోయాడు .మంచం కింది కవి పూరించిన దాని అర్ధం –‘’కన్ను మూస్తే ఈ ప్రపంచం లో నాది అనుకో దగిన దేదీ నీకు ఉండదు ‘’.

                    సజ్జన ,దుర్జన మైత్రి ఎలా ఉంటుందో తెలిపే శ్లోకాన్ని అందిస్తాను

‘’దిక్ దిక్ –సజ్జన మైత్రీ –దుర్జన సంసగా ఏవనో భవతు –సజ్జన వియోగ కాలే భవంతి తీవ్రాణి దుఖాని ‘’—అర్ధం –

‘’ఛీ ఛీ –సజ్జన మైత్రి మాకు వద్దు –దుర్జన స్నేహమే మాకు లభించాలి .ఎందు  కంటే సజ్జనులతో యెడ బాటు కల్గితే తట్టు కొ లేనంత దుఖం కలుగుతుంది .దుర్జనుల తో యెడ బాటు మహాదానందం గా ఉంటుంది ‘’అని తమాషా గా అర్ధ వంతం గా చెప్పాడు కవి .దీని అంతరార్ధం –దుర్జన సాంగత్యం వెంటనే వాదులు కోమని .’’శుక మహర్షి ‘’సాంగత్యం పరీక్షిత్తు మహారా జుకు మోక్ష మార్గాన్ని చూపించింది .అదే ‘’శకుని ‘’సాంగత్యం దుర్యోధనుడిని సర్వ నాశనం చేసిందని మనకు తెలిసిన విషయమే .

‘’సాధూనాం దర్శనం పుణ్యం ,స్పర్శనం పాప నాశనం –సంభాషణం సర్వ తీర్ధాని ,వందనం మోక్ష దాయకం ‘’అని పెద్దలు చెప్పారు అందుకే ఆడి శంకరులు ‘’లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ‘’అని దైవాన్ని చేయూత నిమ్మని మనసారా ప్రార్ధించారు .

          సాంగత్య ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యక్ష ఉదాహరణ లతో ఎలా చెప్పారో తెలియ జేస్తాను –గాలితో సాంగత్యం చేసిన ధూళి దేవాలయ గోపురం ఎక్కింది .నీళ్ళ తో  కలిసిన ధూళి పాతాళానికి పోయింది .నన తో సాంగత్యం చేసిన నార తల కెక్కింది .ఇనుము నిప్పుతో కలిసి మెత్త బడింది .మట్టి తో నీళ్ళ తో కలిసి త్రుప్పు పట్టి  నశించింది .మహాత్ముల చేతు లతో ప్రతిష్టింప బడిన రాయి దేవత్వం పొందింది .అంధుడికి కళ్ళున్న వాడితో సంబంధం పురోగమ నానికి సహక రించింది .జ్ఞాని కి  జ్ఞాని సంబంధం ప్రజ్ఞాని ని చేసింది .

 మహాత్ములు తీర్ధాలకే మహా పవిత్ర శక్తిని అందించ గలరు –వివేకానంద స్వామి తపస్సు చేసిన కన్యా కుమారి లోని సముద్ర శిల ‘’వివేకానంద రాక్ ‘’అని పేరు పొందింది .బుద్ధుడు తపస్సు చేసిన గయ ‘’బుద్ధ గయ ‘’అయింది ఆదీ  కవి నన్నయ భట్టారకుడు తపస్సు చేసిన ‘’తారకాసుర పట్టణం ‘’-తణుకు అయింది .నిప్పు రవ్వ ఎంతటి మహారన్యాన్ని అయిన దగ్ధం చేస్తుంది .సజ్జన సాంగత్యం ఎంత అజ్ఞాంద కారాన్నైనా అంత రింప జేస్తుంది .

   ప్రార్ధన అంటే ప్ర+అర్ధన వివరం గా చెప్పాలంటే భగవంతున్ని వేరుగా ఉంచి ,తాను వేరుగా ఉంది అర్ధించటమే ప్రార్ధన .మరి ధ్యానం అంటే –‘’నేను భగవంతున్ని స్మరిస్తున్నాను అనే భావం నశించి తాదాత్మ్యాన్ని పొందటం .

     మానవ మనస్సు మర్కటం లా చపలం అని భగవత్పాదులు సౌందర్య లహరి లో ఒక శ్లోకం లో చమత్కారం గా జ్ఞాన బోధకం గా చెప్పారు –

   ‘’కపాలిన్ భిక్షో –మే హృదయ కపి మత్యంత చపలం –దుధం భక్త్యా బధ్వా శివ భవ దదీనం కురు విభో ‘’

  కపాలం చెత్తతో పట్టు కొని బిచ్చ మెత్తు కొనే ఆది భిక్షూ !మహా చపల మైన నా మనస్సు అనే కోతి నాకు ధ్యానానికి భంగం కలిగిస్తోంది .మహాత్మా !ఈ కోతి ని బంధించి నీతో తీసుకొని పో ..నాకు మనస్సు లేకుండా చేస్తే అమనస్క యోగం కలిగి మోక్షం కరతలా మలకం అవుతుంది’’ .ఇక్కడి చమత్కారం ఏమిటో తెలిసే ఉంటుంది .భిక్ష గాడి చేతి లో గొలుసు తో కట్టేసి ఉన్న కోతి ఉంటె ,ఆ కోతిని ఆడిస్తూ వినోదం కల్గిస్తూ ఉంటె అందరు సంతోషం తో  భిక్ష ఎక్కువ గా వేస్తారు   బాగా లా భిస్తుందని వెటకారం .

    ఒకప్పుడు దత్తాత్రేయ మహర్షి అరణ్యం లో నడుస్తున్నాడు .ఒక చోట మార్గం రెండుగా చీలింది .ఏ దారి లో వెళ్ళాలో తెలియ లేదు .దగ్గర్లో ఒక చెరువు దగ్గర చేపలు పట్టే వాడు గాలం తో చేపలు పడు తున్నాడు .వాడి దగ్గరకు వెళ్లి ఎటు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .వాడికి ఈ లోకం టో సంబంధం లేదు చేప గాలానికి తగిలితే బుట్ట లో వేసుకోవాలనే ధ్యాస .తప్ప.మహర్షి ఎంత  మొత్తు కొని అరచినా వాడేమీ ఉలక లేదు ,పలక లేదు .చేప చిక్కి బుట్టలో వేసుకొన్న తర్వాత దత్తుని చూసి ‘’ఏమి కావాలి ?’’అని అడిగాడు .ఆ చేపల వాడికి మహర్షి నమస్కరించి ‘’చేపలు పట్టటం లో నీకున్న శ్రద్ద్ధ నాకు  ధ్యాన సాధన లో ఉంటె,ఏ నాడో మోక్షాన్ని పొందే వాడిని ‘’అని ఆశ్చర్య పోతూ దారి తెలుసుకొని వెళ్లి పోయాడు దత్తాత్రేయ మహర్షి

     వ్యాస మహర్షి ఒక సారి అరణ్య మార్గాన వెడుతుంటే ఒక చిన్న పురుగు ,ఆ దారి ని దాట టానికి కంగారు  పడు తూన్డటం చూశాడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చి కంగారు కు కారణం అడిగాడు ‘ఆ పురుగు ‘’మహర్షీ !ఒక మహారాజు ఈ దారి లో రధం మీద వస్తున్నట్లు భగ వచ్చక్తి తో  తెలుసు కొన్నాను .రధం వచ్చే లోపు అవతలి వైపుకు చేరాలి  లేక పోతే చావు తప్పదు ,రధంకింద పడి నలిగి పోతాను ‘’అంది .దానికి వ్యాసుడు ‘’చిన్న పురుగువి నువ్వు ఉంటె ఎంత ,చస్తే ఎంత ?’’అన్నాడు తేలిక భావం తో .దానికా కీటకం ‘’మునీంద్రా !అలా అన వద్దు .మానవులకున్నట్లే మాకూ సుఖ దుఖాలుంటాయి .సుఖం మీద ఆశ ,దుఖం మీద భయం మాకూ సహజమే .’’అని జవాబు చెప్పే సరికి వ్యాసునికి లోక జ్ఞానం లేకుండా తాను ప్రశ్నించి నందుకు సిగ్గు పడి  క్షమాపణ చెప్పి వెళ్లి పోయాడట .

  చితి ,చింత –లకు భేదం ఏమిటి అని శిష్యుడొకడు గురువు ను  ప్రశ్నిస్తే –చితి ప్రాణం లేని శరీరాన్ని కాలుస్తుంది .చింత ప్రాణం ఉన్న దేహాన్ని కాలుస్తూనే ఉంటుంది అని గురువు సమాధానం చెప్పాడు .

         బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునుడు మట్టి పాత్ర తో భిక్షాటన చేసుకొనే వాడు .అది చూడ లేక ఒక ధనికుడు ఆయనకు బంగారు పాత్రనిచ్చాడు .దానితో నే భిక్షాట నానికి వెళ్లాడు .ఒక రోజు రాత్రి నాగార్జునుడుందే గుహ లోకి దొంగ ప్రవేశించాడు .దొంగను చూసి ఏమి కావాలని అడిగాడు .బంగారు పాత్ర కావాలన్నాడు వాడు .ఓస్ ఇంతేనా తీసుకో అని తానే దాన్ని ఇచ్చేశాడు దొంగకు . .మళ్ళీ పాత పాత్రే .అను కోకుండా కొన్ని రోజుల తర్వాత దొంగ గుహ లోకి వచ్చాడు.ఇంకేమి కావాలని అడిగాడు ఆచార్యుడు .’’నాకేమీ వద్దు .ఈ పాత్ర తీసుకొని వెళ్ళిన దగ్గర్నుంచి నాకు నిద్రాహారాలు లేవు .ఎవరు ఎత్తుకు పోతారోనని భయం .అదే దిగులు .మీ బంగారు పాత్రను మీరు తీసుకొని నాకు మనశ్శాంతి ని ప్రసాదించండి ‘’అని కాళ్ళ మీద పడి పాత్రను అక్కడే వదిలేసి వెళ్లి పోయాడట

    ఇవన్నీ సత్య దర్శనం చేసే కధలే,విషయాలే . .ఈ వ్యాస పరంపరను ప్రారంభించ టానికి ముందే నేను చెప్పి నట్లు ఈ విషయాలన్నీ శ్రీ టి.వి.కే.సోమయాజులు గారు రచించిన ‘’సత్య దర్శనం ‘’లోనివి .వారికి ప్రేరణ కల్పించిన వారు ‘’స్వామి శ్రీ నిశ్రేయ సానంద జీ మహారాజ్ ‘’ –స్వామీజీ తణుకు లో శ్రీ రామ కృష్ణ సేవా సమితి స్థాపించి ఎందరికో ప్రేరణ నిచ్చిన గురు వరెన్యులు .సోమయాజులుగారు వీరి అనుగ్రహం తో  రాసిన పుస్తకం ఇది .నన్ను ఆకర్షించింది ఆ సుధను మీకూ అందించాలని చేసిన ప్రయత్నమే ఇది .

 సమాప్తం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-5-12—కాంప్ –అమెరి

Posted in రచనలు | Tagged | Leave a comment

”ఆదిత్య హృదయం ”పుస్తక ఆవిష్కరణ దృశ్య మాలిక

సాహితీ బంధువులకు -శుభా కాంక్షలు –మీరు అందరు ”ఆదిత్య హృదయం ”పుస్తక ఆవిష్కరణకు విచ్చేసి జయప్రదం చేసి నందుకు కృతజ్ఞతలు ..ఆహ్వానించిన అతిధులు అందరు రావటం మహా దానందాంగా ఉంది ..శ్రీ ఆదిత్య ప్రసాద్ గారి సాంస్కృతిక సేవలకు ఇది ఉడతా భక్తీ గా ,చంద్రునికో నూలు పోగు గా చేసిన కార్య క్రమం .పుస్తకాన్ని అందం గా ,అర్ధ వంతంఅయిన ముఖ చిత్రం తో   అధిక శ్రద్ధ తీసుకొని తన పై నేను పెట్టిన అధిక భారాన్ని అత్యంత ఆనందం గా భరించి ముద్రించిన మిత్రులు శ్రీ చల పాక ప్రకాష్ గారికి ఆత్మీయ అభి నందనాలు ..అమెరికా నుంచే మెయిల్ లో ఆ సభకు వచ్చి పుస్తకావిష్కరణ చేయమని కోర గానే నిమిషాల మీద జవాబు ఇస్తూ తప్పక కార్యక్రమం లో పాల్గొంటానని హామీ ఇచ్చి అన్న మాట నిలబెట్టు కున్న శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు ..సభాధ్యక్ష స్తానాన్ని సమర్ధత తో నిర్వ హించిన మిత్రులు శ్రీ పూర్ణ చంద్ గారికి సహృదయ నమస్సులు .నందన నామ కపద్య కవి సమ్మేళనాన్ని నా అభ్యర్ధనపై నిర్వహించి ,ఇప్పుడు ఆ పుస్తకాన్ని విశ్లేషించి అందులోని ఆదిత్య దీదితులను ,మిత్రత్వ చంద్ర కాంతిని పంచిన శ్రీ గుమ్మా సాంబశివ రావు గారికి అభినందనలు .ఆదిత్య హృదయాన్ని ,ఆదిత్య హృదయం తో అంకితం పొందిన సాంస్కృతిక మిత్ర మహోదయులు శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి ఎన్ని మాటల మల్లెలు చల్లినా తక్కువే .వారికి నా హృదయ పూర్వక క్రుతజ్ఞాతాన్జలులు ..సరసభారతి మీద ఉన్న విశ్వాసం తో ఇక్కడి సభలకు తప్పక వచ్చి పాల్గొంటూ ,ఈ సారి కూడా ఆ పరంపరను కొనసాగించిన శ్రీ మతి పుష్పాదేవి శ్రీమతి సూర్య కుమారి ,శ్రీ వల్లభ రావు మొదలైన సహ్రుదయులందరికి పేరు పేరునా సరసభారతి తరఫున కృతజ్ఞతలు .

This slideshow requires JavaScript.

ఈ కార్య క్రమం లో నేను అక్కడ లేక పోయినా  అమెరికా లో ఉన్నా మనసంతా ఆక్కడే కేంద్రీకృతం అయింది .ఇప్పుడే ఫోటోలు చూసి ఆనందాన్ని పంచుకొన్నాను .నేను అక్కడ ఉన్నట్లుగానే సహకరించి దిగ్విజయం చేసిన శ్రీమతి శివలక్ష్మి దంపతులకు ,శ్రీ గంగాధర రావు గారికి మా  ఛి .రమణకు అభినందనలు ..దేవాలయం లో  శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల సన్నిధి లో ఈ కార్య క్రమం జరగటం భగవదిచ్చ .ఆయన అనుగ్రహమే మాతో ఇంత లేసి మంచి పనులను చేయిస్తోంది ..కార్యక్రమాన్ని మీడియా వారు బాగా కవర్ చేసి నట్లు తెలిసింది .వారందరికీ కృతజ్ఞతలు .కార్య క్రమం లో ఏవైనా చిన్న ల్లోపాలు జరిగి ఉంటె మన్నించమని ప్రార్ధన .    మీ –దుర్గా ప్రసాద్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీ మిత్రులు – మచిలీ పట్నం – “ఆకాశవాణి పద్య పుష్పకం” గ్రందా ఆవిష్కరణ – ఆహ్వానం

Sahithimitrulu

Posted in సభలు సమావేశాలు | Leave a comment

సత్య కధా సుధ—9

  సత్య కధా సుధ—9

          పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి సముదాయిస్తూ ‘’హుళక్కి ,హుళక్కి హాయి ‘’అని పాడుతుంది కదా .ఆమె అర్ధం ఏమిటంటే ‘’నాయనా ! ఈ లోకం లో హాయి అంటే ఆనందం  హుళక్కి అంటే ఏమి లేదు –నిండు సున్నా ‘’అని  ప్రపంచ సత్యాన్ని తెలియ జేస్తుందని వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పిందన్న మాట .

                లండన్ నగరం లో ఒక చోట  ఉపన్యాసాన్ని ఇవ్వటానికి సిద్ధ పడ్డాడు చికాగో హీరో వివేకానంద స్వామి .వేదిక మెట్లు ఎక్కుతుండగా ,కొంత మంది జనం ఆయన అవతారాన్ని చూసి ‘’mad ,mad ,mad  ‘’అని అరుస్తున్నారట .ఆయనేమీ లెక్క చేయకుండా తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించి నోళ్ళు మూయించాడు ‘’some mad after money ,some mad after women ,Iam mad after god ‘’దానితో వాళ్ళ జ్ఞాన నేత్రాలను తెరిపించాడు దైవీ  శక్తిని బోధిస్తూ .

              వాయువు ప్రేరణ వల్లనే మేఘాలు కమ్ము కుంటాయి .అదే వాయువు వల్ల మేఘాలు తొలగి పోతాయి .ఒకే వాయువు మేఘాలు దగ్గరకు చేరటా నికీ ,విడి పోవటానికీ కారణం అవుతున్నాయి .అలానే మానవుడు మనసు లో రాగాన్ని పెంచు కొని రాగి అవుతున్నాడు .రాగాన్ని వదిలించుకొని విరాగి అయి ముక్తి పొందుతున్నాడు .దీన్ని వివరించే చక్కని శ్లోకం –

‘’వాయునా నీయతే మేఘః  పునః తేనైవ మోక్షతే –మనసా కల్ప్యతే బంధః మోక్షః తేనైవ కల్ప్యతే ‘’

            బౌద్ధ గురువు ,రస సిద్ధుడు ఆచార్య నాగార్జునుడు యోగ శక్తి తో ,ఔషధ శక్తి తో దాదాపు నాలుగు వందల సంవత్స రాలు జీవించి ,చివరికి ‘’అనవసరంగా శ్రమ పడ్డాను ‘’అని గ్రహించి  ఈ  లోకం నుండి విముక్తుడ య్యాడట .

          ఒక జ్ఞాని what can make me afraid? death is a joke to me’’అన్నాడు ఆనందం గా .

              ఒక రాజు గారి కి ఒకడే వడో వెయ్యి మైళ్ళ అవతల,మహా పర్వత శిఖరం మీద అమృత గంగ ఉందని తాగిన వారికి మరణం లేదని తెలియ జేశాడు .ఇంకేముంది –రాజు సైన్యంతో శ్రమ పడి  అంత దూరం వెళ్లి .పర్వతా రోహణం చేసి శిఖరం చేరే సరికి దారిలో చాలా మంది నడవ లేక ,ఎక్క లేక చని పోయి రాజుగారితో పాటు ఒక్క పది మందే మిగిలారట .చివరికి అమృత గంగను చేరాడు .ఒక చెంబు తో  ముందుగా రాజు గారికి భటుడు ఆ జీవన గంగ ను అందించాడు .అక్కడే ఎత్తైన చోట కూర్చొని ,భగవన్నామ స్మరణ చేసి తాగటానికి చెంబు పైకెత్తాడు . ఇంత లో ‘’ఆగండి ఆగండి ‘’అని పిచ్చి కేకలు విని పించాయట  .ఆ వైపు చూశాడు రాజు .అరిచే  వాళ్ళందరూ గోచి పాత రాయుళ్ళు ,వికృతా కారాలతో పిచ్చి చూపులతో కళ్ళు పీక్కు పోయి పళ్ళు లేక నడవ లేక తూలీ పోతూ కన్పించారట .వాళ్ళందరూ రాజు దగ్గరకు చేరి ‘’తాగ కండి బాబూ !ఆ అమృత గంగ తాగి చావటానికి వీలు లేక ,బతక టానికి శక్తి లేక చావు బతుకుల మధ్య గిల గిల లాడుతున్నాం .చావు రాదు. బతికే శక్తి లేదు.మేం చేతు లారా తెచ్చు కొన్నాం .మీరు దాని బారిన పడి  మా లాగా కావద్దు ’’’అని గోల చేశారట.రాజు గారికి జ్ఞానోదయం అయింది .చెంబు విసిరి ఆ నీళ్ళలో పడేశాడు .తనతో పాటు మిగిలి ఉన్న వారితో కిందికి దిగి రాజ్యం చేరు కొన్నాడట .అందుకే ఒక మహానుభావుడు ‘’death is a most important event of life ,man has sufficient time to know how to die ‘’అన్నాడు .

                      ‘’కాశ్యాంచ మరనాన్ముక్తిహ్ ‘’అని అందరికి తెలిసిన విషయమే .కాశీ లో చని పోవటం కూడా మన చేతి లో లేదు అని శూద్రక మహా రాజు కధ తెలియ జేస్తోంది .కాశీ లో మరణించాలి అనే ధృఢ సంకల్పం టో శూద్రక మహా రాజు రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి ,కాశీ చేరి అక్కడ ఒక భవనం కట్టించు కొని అందులో ఉంటున్నాడు .ఒక వేళ బుద్ధి మారి ఇంకో చోటుకు పోవాల్సి వస్తుందేమో అని పించి రెండు మోకాలి చిప్పలు తీసేయించుకొని నడిచే పని లేకుండా చేసు కొన్నాడు .ఇక ఏ భయం లేదు .కాశీ  లో మరణం ఖాయం అను కొన్నాడు .

                    శూద్రక మహారాజు  అశ్వ శిక్షణ లో నల మహారాజు అంతటి వాడు .కాశీ రాజు అశ్వ శాలకు ‘’అజానేయం ‘’అనే ఒక కొత్త గుర్రం వచ్చింది .అది ఎవరికీ లోన్గటం  లేదు .చాలా ఇబ్బంది పెడుతోంది .దాన్ని లొంగ దీసి స్వారీ చేసిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని ప్రకటించాడు .ఉండ బట్ట లేక పోయాడు ఆ ప్రకటన విని శూద్రక రాజు .తాను ఆ గుర్రాన్ని అదుపులో పెట్టగలను అని భటుడి తో కాశీ రాజుకు కబురు పంపాడు .మోకాళ్ళు లేవు లేవు ఎలా సాధ్యం అని వాళ్ళు అన్నారు .తనను ఆ గుర్రం మీద ఎత్తి కూర్చో పెట్టండి అన్నాడు .అలానే చేశారు కాశీ రాజ భటులు .అంత వరకు గుర్రాన్ని అదుపు లోకి తేవాలని ప్రయత్నించిన వారందర్నీ ఆ గుర్రం ఎక్క గానే కింద పడేశింది .వాళ్లు భంగ పడి వెళ్లి పోయే వారు .ఈ యన కూర్చున్నాడు కదా అని అందరు సంతోషించి ,గుర్రాన్ని అదుపులోకి టే గలడు అని నమ్మారు కాశీ రాజు తో సహా .గుర్రం రివ్వున దూసుకు పోయింది ఆఘ మేఘాల మీద .శూద్రకుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని జనం ఎదురు చూస్తున్నారు .

                 ఆ పెంకి గుర్రం కాశీ ప్రభావం లేనంత దూరం  సుమారు మూడు వందల మైళ్ళు ప్రయాణించి ,ఒక మర్రి చెట్టును డీకోన్నది .అంతే దెబ్బకు శ్శూద్రక రాజు అక్కడి కక్కడే చని పోయాడు .పాపం కాశీ లో చావాలను కొని ,మోకాలి చిప్పలు కూడా తీసే యించుకొన్న వాడికి కాశీ లో చావు రాలేదు .దిక్కు లేని చావు వచ్చింది .దీనినే భాస్కర శతకం లో చక్కని పద్యం లో చెప్పాడు హుళక్కి భాస్కరుడు –

‘’గిట్టుట కేడ  కట్టడ లిఖించిన ,అచ్చట గాని ,యొండు చో

పుట్టదు చావు !జానువుల పున్కల నూడిచి ,కాశి చావ ,గా

ల్గట్టిన శూద్రకున్ ,భ్రమల గప్పుచు ,తద్విధి గుర్రమౌచు ,ఆ

పట్టున గొంచు ,మర్రి కడ ,ప్రాణము దీసే కదయ్య భాస్కరా “’

             అందుకే కర్తవ్య నిర్వహణ లో ఏమరు పాటు తగదు –మృత్యువు ఎప్పుడు వచ్చి మీద పడుతుందో తెలీదు .ఎప్పుడు చేయాల్సిన పని వాయిదా వెయ్య  కుండా అప్పుడే చేయాలని చెప్పే శ్లోకం –

‘’శ్వః కార్య మద్య కుర్వీత –పూర్వాహ్నే చాప రాహ్నికం –యమస్య కరుణా నాస్తి కృతం వప్యవదాకృతం ‘’

   దీని భావం –రేపు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి .మధ్యాహ్నం పూర్తీ చేయాల్సింది ఉదయమే చెయ్యి .యముడు దయా రహితుడు .అయ్యో పాపం వీడు తన కర్తవ్యాన్ని పూర్తీ చేశాడా అని చూడడు .పని చేసే ట ప్పుడు ముందే పూర్తీ చేసుకోవాలి .

                       మీ –గబ్బిట దుర్గా  ప్రసాద్ –13-5-12

                             కాంప్ —అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

     

మార్గ దర్శి మార్గరేట్అట్వుడ్

కవి ,రచయిత సమాజ సేవకురాలు ,సాంస్కృతిక చరిత్ర కారిణి ,పత్రికా సంపాదకురాలు ,బాల సాహిత్య సృష్టి కర్త,అన్నిటికి మించి మంచి అధ్యాపకు రాలు మార్గరేట్ అట్ వుడ్ .సృజనాత్మక సాహిత్య రచన లో నలభై ఏళ్ళు ప్రజలను ప్రభావితం చేసి సమకాలీన రచయితల్లో అన్నిటా అగ్రగామి గా నిలి చింది అట్ వుడ్ . .అన్ని సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసింది .మేటి విమర్శకుల మెప్పు పొందిన విదుషీ మణి. మహిలో ద్యమ నాయకు రాలు ..పర్యావరణ రక్షకు రాలు .మానవ హక్కుల పోరాటం లో అగ్రగామి గా నిలిచినా ధీర వనిత .ఆమె జీవితం లో అధికారం ఆమెకు గొప్ప వరమే అయింది .జీవన పోరాటం లో ఎదుర్కొంటున్న అనేక సమస్య ల పై కవిత్వము ,రచనలు చేసి తరాలను ప్రభావితం చేసిన మాన నీయు రాలు .బహుముఖ ప్రజ్ఞా శాలి .

ఫిక్షన్ లో పేరు పొందినా ఆమె సాహితీ జీవితం కవిత్వం తో ఆరంభమైంది .అద్భుత కవిత్వాన్ని వర్షించింది .నవలలు ,కధలు ,మానవ జీవిత చరిత్ర (anthro pology ),అనేక సాహిత్యేతర అంశాలు ,విమర్శ రాసి పుంఖాను పున్ఖం గా పుస్తకాలను విడుదల చేసింది .ఆమె రచనలు చాలా భాగం ప్రజా పక్షమే అయినా ,కవిత్వం మాత్రం ఆమె స్వంతమే .సాంద్రం గా ,భావ స్పోరకం గా ,సూటిగా ఆమె కవిత్వం ఉండటం తో మనసును ఇట్టే ఆకర్షిస్తాయి .వాటిల్లో మానవులు ప్రకృతికి దూర మై పోవటం ,మనుష్యుల మధ్య సంబంధాలు దృశ్యమాన మవుతాయి .మంచి తెలివి తేటలతో చాతుర్యమైన వాదాలతో ,వివేకం టో ,ఆలోచనా ధోరణి టో ,ఇతిహాసాల కధలను ఆధారం గా చేసుకొని ఆమె రచనలు చేసింది .నాటకీయ ముగింపులు ,మాటల్లో అమిత శక్తి ఆమె కు పెద్ద వరాలైనాయి .

బాల్యం –విద్యాభ్యాసం

అసలు పేరు మార్గరేట్ ఎలినార్ అట్ వుడ్ . ..అమెరికా లో ఒంటారియా రాష్ట్రం లో అట్టావా లో 1939 నవంబర్ పది న జన్మించింది .తండ్రి జంతు శాస్త్ర వేత్త .అరణ్య ప్రాణుల పై పరిశోధన కోసం ఉత్తర క్యుబెక్ అడవులకు తరచూ గా వెళ్ళే వాడు .కుటుంబం ఆయనతో నే ఉండటం వల్ల ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువు సాగింది .అయితేనేం అందిన ప్రతి పుస్తకం చది వింది .క్లాసిక్స్ నుంచి కామిక్స్ దాకా దేన్నీ వదల్లకుండా చదివేసింది .కెనడా దేశం మీద అభిమానం పెరిగింది .wildernes tips and other stories లో తన అనుభావాలన్నిటిని రాసే సింది .కుటుంబం తత్వాత కెనడా లోని torento కు చేరింది .అక్కడి యునివేర్సిటి లోని విక్టోరియా కాలేజి లో చదివింది . .అక్కడి అధ్యాపకులు సాహిత్య కారులు ,సాహితీ విమర్శకులు అయిన ఫెయిర్ ,మాక్ ఫెర్సన్ ల దృష్టిని ఆకర్షించింది .వారి ప్రభావం ఆమె పై గాడ్హం గా పడింది .మొదటి పుస్తకం’’ ”డబల్ పెర్స ఫోన్ ‘’స్వంతం గా ప్రచురించింది .ఇది గ్రీకు మైథాలజీ లోని స్త్రీలను ఉద్దేశించి రాసిన కవితలు .దీనికి E.J.Pratt మెడల్ ను మొదటి సారిగా అందు కొంది .ఉడ్రో విల్సన్ ఫెలోషిప్ తో హార్వర్డ్ ఉమెన్స్ కాలేజి లో ,చదివి ,ఆ తర్వాతా విక్టోరియన్ సాహిత్య పరిశోధన కోసం పి.హెచ్.డి..కోర్సుకు చేరి పూర్తీ కాకుండా నే ఆ డిగ్రీ పొందకుండానే మానె సింది .కాని ఆ తర్వాతా డజన్ల కొద్దీ గౌరవ డాక్టరేట్లను అందుకొన్న విద్యా రాణి

ఉద్యోగం –రచనా వ్యాసంగం

టోరంటో లో ‘’అనంసి ప్రెస్ ‘’లో ఎడిటర్ గా చేరి ‘’survival –A thematic guide to canadiyan literatureరచన చేసి జాతీయ స్తాయి గుర్తింపు పొందింది .కెనడా స్వాతంత్ర పోరాటం ,జాతీయ అస్తిత్వం ,శతాబ్దాల బ్రిటీష పాలకుల అకృత్యాలు ,అన్యాయాలు దాష్టీకం ,అణచి వేత లను అద్భుతం గా చిత్రించిన రచన అది .దీనితో కెనడా సాహిత్య స్వతంత్ర రచనా వార సత్వానికి ఆద్యురాలు అని పించు కొంది .తాను ఆక్స్ ఫర్డ్ లో చేసిన ఉపన్యాసాలను ఆధారం గా ‘’the strange thing –the melovelent North in Canadian literature ‘’ పుస్తకాన్ని రాసి జన జాగృతి చేసింది .

తర్వాత రెండు చిన్న కవితా సంకలనాలు మొదటి నవల మొత్తం అయిదింటిని అతి తక్కువ కాలం లో రాసి ప్రచురించింది .తన తరం ప్రసిద్ధ రచయిత గా గుర్తింపు లభించింది .’’the animals of that country ‘’,the journals of susannaa ‘’,moodee ‘’రచనలు ఆమెకు గొప్ప పేరు తెచ్చాయి .రెండోది కెనెడియన్ పయనీర్ చరిత్ర .అంటే ఆ దేశాన్ని మలుపు తిప్పిన మహనీయుల చరిత్ర .తరువాత నవలలు రాసి మెప్పు పొంది నవలా రచయిత గా చిరస్తాయి పొందింది .వాటిలో ముఖ్యమైనవి –procedures for under ground ,power politics ,you are happy ,lady oracle ,suffering ,Edith women .ఆమె రాసిన the handa maid’s tale ఆర్ధర్ సి.క్లార్క్ అవార్డ్ పొందింది .అది సినెమా గా కూడా తీశారు .ఇప్పటికే లబ్ధ ప్రతిష్టు రాలిన నవలా రచయిత అని గుర్తింపు వచ్చింది .కవిత్వం వెనకడుగు వేసింది ..ఆమె కవిత రాసినా ,నవల రాసినా జీవన పోరాటం అందు లో ఉంటుంది .అంటే సర్వైవల్ ను ద్దృష్టి లో పెట్టు కొనే ఏదైనా రాసింది .ఆమె నవలలో ని నవలా మణులు అధికార పోరాటం లో నలిగి పోవటం సర్వ సాధారణం .వ్యంగ్యాన్ని మేళవించి రచనకు జీవం పోస్తుంది .

మార్గరేట్ బ్రిటీష కొలంబియా ,మాంట్రియల్ ,ఆల్బెర్తా లలో బోధనా చేసింది .టోరంటో లో ని న్యూయార్క్ వర్సిటి లో అధ్యాపకురాలైంది .న్యూయార్క్ ,ఆస్ట్రేలియా,అలబామా లలో” రైటర్ ఇన్ రెసిడెన్స్” గా పని చేసింది .గ్రీన్ గిబ్సన్ అనే నవలా రచయిత ను పెళ్ళాడింది .1982లో’’ సెకండ్ వర్డ్స్’’ ,-‘’సెలెక్టెడ్ క్రిటికల్ ప్రోస్ ‘’రాసింది ‘’.ది న్యు ఆక్స్ ఫర్డ్ ఆన్తాలజి ఆఫ్ కెనెడియన్ వేర్స్ ‘’ కు ప్రధాన సంపాదకు రాలి గౌరవం పొందింది .ప్రతిభకు తగ ప్రతి ఫలం లభించింది .

ఎనభై వ దశకం లో అట్ వుడ్ రాసిన నవల లన్ని కెనడా ,బ్రిటన్ దేశాల బహుమతులను సాధించి నవే. ‘’.కాట్స్ ఐ ‘’ అన్నది 1988 లో రాసింది .ఇదీ బహుమతి పొందింది .1970 –2006 మధ్య కాలం లో తొమ్మిది సంపుటాల షార్ట్ స్టోరి ఫిక్షన్ ,మూడు ఆంత్రో పాలజిలు , ఎడిట్ చేసింది .అందులో రెండు ఆక్స్ ఫర్డ్ కోసం చేసినవి ఉన్నాయి .అరడజన్ కు పైగా బాల సాహిత్య పుస్తకాలు రాసింది .negotiating with dead ,a writer on writingwith intent ,essays ,reviews ,personal prose వంటివి ఓహ్ ఎన్నో రాసింది .రాసినవన్నీ వన్నె ,వాసి గలవే .నవల మీద ద్రుష్టి ఎక్కువ అవటం టో కవిత్వం పలచ బడింది .అయితేనేం -2007లో’’ ది డోర్ ‘’ కవితా సంకలనం టో తానేమీ వెనక పడి లేనని సామర్ధ్యాన్ని రుజువు చేసుకొంది. .అభిమానం కూడా పెంచు కొంది . కవి గా తన స్థానం ఎప్పుడు అగ్రభాగమే అని రుజువు చేసింది .

” రైటర్స్ యునియన్ ఆఫ్ కెనడా” కు ఆఫీసర్ అయింది .’’P.E.N. ‘’ కు ప్రెసిడెంట్ అయి రాజ కీయ ఖైదీలుగా బందీలైన రచయిత లను విడి పించే అవకాశాన్ని పొందింది .వారి తరఫున తీవ్ర పోరాటమే చేసింది .మార్గరేట్ రాసిన ‘’బ్లైండ్ అస్సాసిన్ ‘’ అనే నవలకు 2000 సంవత్సరం లో’’ బుకర్ ప్రైజ్ ‘’వస్తే ,వారు అంద జేసిన 50,000 డాలర్ల భారీ నగదు పారి పారితోషిక ధనాన్ని’’environmental group ‘’కు ఉదారం గా ఇచ్చిన త్యాగ మూర్తి ఆమె .మాటల్లోనే కాదు చేతల్లో ను తనకు సాటి లేరని నిరూపించు కొంది .గత పాతిక ఏళ్లుగా ఆమె సాహిత్యం పై నిరంతర అధ్యనం జరుగు తూనే ఉంది .ఎన్నో పరిశోధనాత్మక గ్రంధాలను వెలువ రించారు .వేలువరిస్తూనే ఉన్నారు .అందులో ముఖ్యమైనది ‘’the cambridge companion to M.Atwood అనేది రెండు వేల సంవత్సరం లో ప్రచురిత మైనది .ఇంకో పుస్తకం ‘’అట్ వుడ్ ఎ .క్రిటికల్ కంపానియన్ ‘’

మార్గరేట్ కవితా సంకలనాలన్ని నిత్య నూతనం గా ఉంటాయి .ఆమె లోని ధైర్యం ,నిబ్బరం గా చెప్పే భావాలు ,ఎంచుకొన్న భాషా ,పద జాలం అందర్ని ఆకర్షిస్తాయి .పురాతన విషయ మైనా ,ఆధునిక విషయ మైనా ఒక” లాండ్ స్కేప్” గా మన ముందు చిత్రించి నిల బెట్టటం ఆమె ప్రత్యేకత .హింసాత్మక సంఘటనలను రాయాల్సిన అవసరం వచ్చినా ఎక్కడా బాలన్స్ తప్పక పోవటం ఆమె కున్న గొప్ప రచనా లక్షణం .కోపాన్ని ,ద్వేషాన్ని చాలా అదుపు లో ఉంచు కొని రాసి, ఆ భావాలను నిండుగా ఆవిష్కరించే నేర్పు ఆమెది .అందుకే అట్ వుడ్ అన్నిటా అగ్రగామి అంటారు .మార్గ దర్శి మార్గ రేట్ అని గౌరవిస్తారు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —12-5-12

కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ – 8

  సత్య కధా సుధ – 8

            ఆశ కు అంతు  లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది  లోకి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడవటం మొదలు పెట్టాడు .ఎందుకు ఏ డుస్తున్నాడో ఎవరికి తెలీటం లేదు .కాసేపు ఏడవ   నిచ్చి భార్య వెళ్లి పలకరించి” సమస్త భూమి రాజు గారు మీకు  దారా దత్తం చేశారు కదా ఇంకా ఏడవటానికి  కారణం ఏమిటి” అని  అడిగింది .వాడు ;’’;అయ్యో ఆకాశాన్ని దానం చేయమని  అడగ లేక పోయాను కదా “’అని బావురు మన్నాడట

     సంతృప్తి ఉన్న వాడు మూడు లోకాల్లోను పూజ్యుడు .దరిద్రుడు ఎవడు అని ప్రశ్నిస్తే ఆశకు అంటూ లేని వాడు అని సమాధానం .ధన వంతుడేవడు   అన్న ప్రశ్న కు –పరి పూర్ణ తృప్తి కలవాడు అని సమాధానం చెప్పారు పెద్దలు .మేరు పర్వతాన్ని సృష్టించిన బ్రహ్మ దేవుడిని ఒక జ్ఞాని ఇలా ప్రశ్నించాడట –ఈ మేరువు ను ఎవరి కోసం సృష్టించావు /–ఆశ లేని వాళ్ళకు అది అక్కర లేదు .దురాశా పరులకు అది సంతృప్తి ని ఇవ్వదు .బంగారు పర్వతాన్ని సృష్టించానని మురిసి పోతున్నా వేమో –ఎవరికీ ఉపయోగం లేని నిర్వాకం చేశావ్ –అని దేప్పాడటజ్ఞాని .

          భార్యా ,పిల్లలు అనే వాళ్ళు ప్రతి జన్మకు మారి పోతారు .పరమాత్మ నుండి విడి పోయిన ఈ జీవుడు ఎన్ని జన్మ లేత్తదో ,ఎన్ని సముద్రాలు దాటాడో తెలీదంటాడు జ్ఞాని .దీన్ని గురించిన చిన్న కధ భారతం నుండి –కురుక్షేత్ర సంగ్రామం లో పద్మ వ్యూహాన్ని చేదించి ,బయటకు రాలేక అవక్ర పరాక్రమం టో పోరాడి వీర మరణం పొందాడు అభిమన్య కుమారుడు .తండ్రి పుత్రా శోకం టో బాధ పడుతున్నాడు .స్వయం గా శ్రీ కృష్ణ పరమాత్మ వచ్చి ఓదార్చినా దుఖాన్ని తగ్గించు కొ లేక పోయాడు .అప్పుడు కృష్ణుడు అర్జునుడిని స్వర్గ లోకానికి తీసుకొని వెళ్ళాడట .అక్కడ హాయిగా ఆడు కొంటున్న అభి మన్యున్ని చూశాడు కిరీటి .అర్జునుడు ఆనందం పట్టా లేక దగ్గరికి వెళ్లి ,ఆప్యాయం గా కావలించుకొన్నాడు .అభికి అంతా కొత్తగా వుంది .వింతగా చూస్తున్నాడు ‘’నేను నీ తండ్రి అర్జునుడిని ‘’అన్నాడు చివరికి ధనుంజయుడు .’’ఎన్నో తండ్రివి ?’’అని ప్రశ్నించాడు కుమారుడు అతి నిర్లిప్తం గా .కనుక సంసార బంధాలు జన్మ జన్మ కూ మారుతాయని తెలియ జెప్పటమే ఇందు లోని ఆంతర్యం .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-5-12.

          కాంప్ —అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ –7

  సత్య కధా సుధ –7

             ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ గద్దించాడు .అన్నని మొండి కేశాడాయన .కోపం వచ్చి తిట్టి కొట్టి తరిమేశాడు .  .భయ పడి  అతిధి పారి పోయాడు .ఆ కోపం తోనే భోజనం ముగించాడు గృహస్తు .భార్య కూడా భోజనం చేసి భర్త అలా  చేయటం బాగా లేదని నెమ్మదిగా చెప్పింది .అతన్ని కొట్టటం తప్పు అని చెప్పింది .భార్య మాటలు విన్న తర్వాతతాను తప్పు చేశానేమో నని బాధ పడ్డాడు .రాత్రి కి ఏమీ తిన కుండానే నిద్ర పోయాడు .ఆ రాత్రి దేవుడు కలలో కన్పించి ‘’అంత ఆవేశం పడ్డావెం నాయనా !’’అని లాలన గా పలకరించాడు .’’ఆ మూర్ఖుణ్ణి అరవై ఏళ్ళు గా నేను భరిస్తున్నాను  .ఒక్క అర్ధ గంట నువ్వు భరించ లేక పోయావా ?’’అని గృహస్తు ను మంద లించాడు .అన్దుకె భగవానుడు గీత లో

‘’క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్ స్మృతి విభ్రమః –స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః  –బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ‘’అని చెప్పాడు .అందరం గమనించ వలసిన విషయమే ఇది .

     మరణ సమయం లో భగవన్నామ స్మరణ చేయ మని చెబుతారు .కాని బుద్ధి గడ్డి మేస్తే ఆ పని చేయలేడు  జీవుడు .దీనికి  శ్రీ విద్యా ప్రకాశానంద స్వామీ జీ ఒక కధ చెప్పారు .కన్నడ దేశం లో ఒక గృహస్తు సంసారాన్ని జాగ్రత్త గా పోషిస్తూ ,సంపదలతో ఆనందం సుఖం అను భావిస్తున్నాడట .మరణం సమీ పించింది .పిల్లలు భార్య చుట్టూ చేరి ‘’రామా .కృష్ణా ‘’అనమని గోల చేస్తున్నారు .బ్రతికి ఉన్నప్పుడు ఎలాగూ దేవుణ్ణి గురించి ఆలోచించ లేక పోయాడు .ఇప్పుడన్నా స్మరిస్తే ఉత్తమ గతులు కలుగు తాయని వారందరి విశ్వాసం కాని  ఆ వృద్ధుడు ‘’క.క.క.కా’’అంటున్నాడు .ఎవరికి అర్ధం కావటం ఏమంటున్నాడో .వైద్యున్ని పిలి పించి ఇంజేక్షన్ ఇప్పించారు .కొంత శక్తి వచ్చింది ఆయనకు .ఇప్పుడు మళ్ళీ అడిగారు ‘’నాన్నా ! గంట నుంచి కకకకా ‘’అంటున్నారు .అర్ధం ఏమిటి అని .దాని అకి వృద్ధుడు ‘’క రు కస బరికి యన్న కాడి యుత్తదే  ‘’అని కన్ను మూశాడు .దాని అర్ధం ‘’చీపురు కట్టను దూడ మేస్తోంది .జాగ్రత్త చేయండి .        మన వాళ్ళు ఒక కద చెప్పే వారు .చావు సమయం లో ఒకడిని నారాయణ అనమంటే అనలేదు .కనీసం నార ను  చూపిస్తే నన్నా అంటాడేమో నని ఎదురుగా పెట్టి   కనీసం ‘’నారా ,నారా ‘’అంటాడని ఎదురు చూశారట .వాడు దాన్ని ‘’పీచు ,పీచు ‘’అంటూ చచ్చాడట .అంటే నారా అనే ఇంగితం కూడా వాడికి లేకపోయిందని అర్ధం .

                భాగ వంతుడు ఎక్కడ ఉంటాడని అందరికి సందేహం .దానికి ఆయనే సమాధానం చెప్పాడు ‘’సుజను లందు తరచు చొచ్చి యుందు ‘’అని భాగవతం లో చెప్పాడు .మరి సజ్జనులు అంటే ,సత్ ప్రవర్తన అంటే ?

‘’తను హృద్భాషల సత్యమున్ శ్రవణమున్ ,దాసత్వమున్ ,వందనా

ర్చనముల్ ,సేవయు ,ఆత్మలో నేరుకయున్ ,సంకీర్తనల్ ,చింతనం

బను ఈ తొమ్మిది భక్తీ మార్గ మ ల సర్వాత్మున్ –హరిన్నమ్మి ,స

జ్జనుడై యుండుట భద్ర మంచు దలతున్సత్యంబు దైత్యోత్తమా ‘’

          నవ విధభక్తి మార్గాలతో పాటు సజ్జనత్వం తప్పదు .ప్రవర్త నాలో ఆధ్యాత్మిక లక్షణాలు అలవాటు చేసు కొన్న వారి ణని దగ్గరకు పరమాత్మ చేర్చు కొంటాడు .

               హృదయాన్ని వికసింప జేసుకొన్న పుష్ప పూజ నే పరా భక్తీ పూజ అన్నారు

‘’అహింసా ప్రధమం పుష్పం ,పుష్ప మింద్రియ నిగ్రహహ –సర్వ భూత దయా పుష్పం ,క్షమా పుష్పం విశేతః

శాంతి పుష్పం ,తపః పుష్పం ,ధ్యాన పుష్పం తధైవచ –సత్యం అష్ట విధ పుష్పం విష్నోహ్ ప్రీతి కరం భవేత్

ఈ లక్షణాలు లేక పోతే ఎంత భక్తీ ఉన్నా నిష్ప్రయోజనమే .ముప్ఫై అయిదు సజ్జన లక్షణాలను పరమాత్మ వివరించిన సంగతి మనకు తెలిసిందే .

            జ్ఞాని ,కర్మ యోగి ఇద్దరు కూడా ఎంత సిద్ధూ లైనా సత్కరాల్ని ,భక్తిని విడి ఛి పెట్ట రాదు అని తెలిపే ఒక కధ తెలుసు కొందాం –

  ఒక సద్గ్రువు గారి ఆశ్రమం శ్రావణ ,మనన ,నిది ధ్యానాలతో కర్మ ,,భక్తీ జ్ఞాన మార్గాలమార్గాలను శిష్యులకు నిత్యం బోధిస్తూ అనుష్టింప జేస్తూ ఉన్నారు .అది కార్తీక మాసం .పగలు నదీ స్నాన్నం జపతపాలు అభిషేకాలు పగలంతా ఉపవాసం రాత్రికే భోజనం గా గురుశిష్యులందరూ పాటిస్తున్నారు .అంతకు ముందు రాత్రి ఒక స్వామీజీ కొత్తగా ఆశ్రమం లోకి వచ్చి గురువు అనుమతి టో నిద్రించాడు .మర్నాడు తెల్ల వారు ఝామున శిష్యులు స్నానానికి వెళ్తుంటే కొత్త అతిధి స్వామిని కూడా లేపి తెసుకు వెళ్ళండి అని గురువు చెప్పారు .ఎన్ని సార్లు లేపినా చలిగా ఉందని లేస్తాను ,లేస్తాను అంటూ తాత్సారం చేస్తున్నాదాయన .ఇక తప్పదురా బాబూ ఈ చలిలో స్నానం అను కొని శిష్యులతో ‘’నాయన లారా ౧ గంగా ,యమునా ,సరస్వతి నదులు నాలోనే ఉన్నాయి .నేను వాటిలో ఉన్నాను .’’అని చెప్పి ముసుగు తనని పడుకొన్నాడు .విషయం గురువు గారికి చేరింది . అందరు ‘’నక్తం ‘’కనుక వారెవరు భోజనం చేయలేదు .కాని గుర్వాజ్న పై అతిధి కి మంచి భోజనం ఏర్పాటు చేశారు .సుష్టుగా భోజనం చేసి త్రేనుస్తూ ఒక గదిలో పగలు హాయిగా నిద్ర పోయాడు అతిధి .గదికి బయట గొళ్ళెం పెట్టించారు గురూజీ .లోపల ఆయనకు కొంత సేపటికి మెలకువ వచ్చి ‘’దాహం దాహం ‘’అని అరుస్తున్నాడు .ఎవరు తలుపు తీయ వద్దని ఆజ్ఞ.మంచిన నీళ్ళు కావాలని తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు .ఇంతలో గురుజీ వచ్చి ‘’గంగా కావేరి గోదావరి మొదలైన నదులు అన్నీ   నీ దగ్గరే ఉంటె ,నీకు నీళ్ళు కరువయ్యాయా నాయనా !’’అన్నాడు .అందరికి అర్ధం అయింది .తలుపు తీయించి మంచి నీళ్ళు ఇప్పించాడు గురువు గారు .సిగ్గుతో తల వంచు బుద్ధి తెచ్చు కొని   వెళ్లి పోయాడు ఆగంత అతిధి .అప్పుడు గురువు గారు శిష్యులతో ‘’నాయన లారా !కర్మా ,భక్తీ మార్గాలలో జ్ఞాన శిఖ రాన్ని ఎక్కినా ,లోకాన్ని అనుసరించాలి .జ్ఞానినే అందరు అనుసరిస్తారు .జ్ఞాని అజ్ఞానిగా ప్రవర్తిస్తే అందరికి నష్టం ‘’జ్ఞాని కి కర్మా భక్తీ అవసరం లేక పోయినా లోక రీతి ని అనుసరించాలి .మార్గ దర్శకం చేయాలి .’’ అని హిత బోధ చేశాడు .

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-5-12

                      కాంప్ –అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ -6

    భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా  పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం .

            ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు .కాని తమతో పాటు సముద్ర స్నానానికి వచ్చిన ఒక సాధువు ఎంత సేపైనా నీటి నుంచి బయటికి రాకుండా ,నీళ్ళలో వణుకుతూ కని పించాడు .ద్రౌపది ఆయన విషయం కనుక్కో మని ధర్మ రాజుకు చెప్పింది .ఆయన సేవకుల ద్వారా విచారించాడు .సాధువు కౌపీనం సముద్ర కెరటా లకు కొట్టు కు పోయిందట .నగ్నం గా బయటకు రావటానికి ఇబ్బంది పడుతూ ఆ చలిలో అలానే వణుకు తున్నాడని చెప్పారు .వెంటనే ద్రౌపదీ దేవి క్షణం ఆలో చించ కుండా తన చీర చెరగు చింపి ,ఆ సాధువు కు ఇమ్మని పంపించిందట .పాపం ఆయన అది కట్టు కొని తీరం పైకి వచ్చాడట .అందుకనే నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణాన్ని దుశ్శాసనుడు చేసి నప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఈ పుణ్యాన్ని దృష్టి లో ఉంచు కొని రంగు రంగుల విలువైన చీరలు అసంఖ్యాకం గా అందించి ఆమె గౌరవాన్ని ,శీలాన్ని కాపాడాడట .అవే’’ అక్షయ వలువలు’’ గా ప్రసిద్ధి చెందాయి పాపం దుర్యోధనుడికి ద్రౌపదీ మానాన్ని మంట గలుపు  దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది ‘

            చేసుకొన్న వారికి చేసుకోన్నంత .ప్రపంచం లో అంతకు ముందు ఎవ్వరు చూడని రంగు రంగుల ఖరీదైన చీరల వర్షం ద్రౌపది మీద కృష్ణుడు కురి పించే సరికి దుర్యోధనుడికి కడుపు ఉబ్బరం చేసింది .తట్టు కొ లేక పోయాడు .దేశమంతా వెతికించి అతి విలువైన చీరలను తమ సోదరుల భార్య లందరికి అంటే నూరు చీరెలు తెప్పించి ఇచ్చి ,వారిని కట్టు కొ మన్నా ట .వారందరూ ఎంతోసంతోషం గా వాటిని ధరించి ,వాటి సౌందర్యాన్ని నగర వాసుల కు కూడా చూపించాలనే ఉత్సాహం తో అంత పురం పైకి చేరి ప్రజలకు కని పించే టట్లు పచార్లు చేస్తున్నారట .ఇంతలో శ్రీ కృష్ణ పరమాత్మ మురళి ని అద్భుతం గా వాయిమ్చాడ ట…ఆ వేణు గానానికి ముచ్చట పడి  ఆ చీరలన్నీ చిలకలుగా  మా రి పోయి, మధుర వైపు యెగిరి పోయాయట .పాపం కక్కా లేక మింగా గా లేక, శీలం కాపాడు కొనే వీలు లేక ,ప్రజల ద్రుష్టి నుంచి తప్పించు కోలేక, నానా ఇబ్బందీ పడ్డారట ఆ నూరుగురు రాణులు  . ఒక్క ద్రౌపదీమాన సంరక్షణ చేసిన వాడే ఒకే సారి నూరుగురికి వస్త్రాపహరణం చేసి బుద్ధి తెప్పించాడ న్న మాట .కన్నయ్య లీలలు అందుకే అద్భుతాలు .గుణ ప్రదానాలు .

                            భగవంతుని కంటే ఆయన నామం గొప్పది అని తెలియ జేసే కధలు చాలా విన్నాం .శ్రీ రాముని గురించిన కధ ఒకటి చెప్పుతున్నాను .సముద్ర లంఘనం చేసి నప్పుడు హనుమ రామ నామాని జపిస్తూ సునాయాసం గా లంకకు చేరాడని మనకు తెలుసు .శ్రీ రాముని సైన్యం రావణ సంహారం కోసం సముద్ర తీరం చేరింది .సముద్రం పై వారధి నిర్మించే ఏర్పాటు నీలుడు అనే ఇంజనీర్ చూస్తున్నాడు .రావణ వధ తర్వాత ఒక రోజు రాముడు ఒంటరి గా సముద్రం ఒడ్డున కూర్చున్నాడు .ఆ నాడు వానరులు కట్టిన సేతువు దృశ్య మానం గా కని పించింది .అంటే  మనసు ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళింది .ఎలా కట్టామా అని ఆశ్చర్య పోతున్నాడు . సముద్రం లో వేసిన శిలలన్నీ తేలి పోవటం ఇప్పటికీ ఆశ్చర్యం గా నే ఉంది ఆయనకు .. .తాను స్వయం గా ఒక పెద్ద రాయి తెచ్చి సముద్రం లో విసిరేశాడు .అది డబుక్కున మునిగి పోయింది .సంభ్రమం లో మునిగి పోయాడు .ఇదేమిటి ఇలా జరిగిందేమిటి అని విచారిస్తున్నాడు .కొంప తీసి ఎవరు చూడలేదు కదా అని అటు ,ఇటు చూశాడు .హనుమ కన్పించాడు ‘’.చూశావా ‘’అని అడిగాడు .’’చూశానన్నా’’డు మారుతి .ఎవరికీ చెప్పవు కదా అని అడిగాడు ‘’.ముల్లోకాలకు చాటించి మరీ చెబుతాను’’ అన్నాడు పావని ‘’.యేమని చెబుతావు’’ మళ్ళీ రామ ప్రశ్న .పరువు పోతుందేమో నని భయం .అప్పుడు హను మంతుడు ‘శ్రీ రాముని చేతి పట్టు విడిచిన వారు మునిగి పోవటం ఖాయం అని ఎలుగెత్తి చాటు తాను’’ అన్నాడు నవ్వుతు .రాముడు ముసి ముసి నవ్వులు నవ్వుతు’’ అమ్మయ్య’’ అను కొన్నాడు .కనుక భగ వంతుని కంటే భగవన్నామం గొప్పది .వారధి కట్టేటప్పుడు రాళ్ళ మీద రామ నామం రాసిన విషయం మనం విన్నదే కదా .

                         ఒక సారి నారదుడు విష్ణు మూర్తి ని’’ అందరి కంటే గొప్ప వాడేవారు ‘’?అని ప్రశ్నించాడు .దానికి పరమాత్మ ‘’నారదా !అన్నిటి కంటే గొప్పది భూమి .దాని కంటే సముద్రం గొప్పది .అంతటి సముద్రాన్ని ఒక్క గుక్క లో తాగేసిన అగస్త్య మహర్షి గొప్ప వాడు .ఆ అగస్త్యుడిని నక్షత్ర రూపం లో భరిస్తున్న ఆకాశం గొప్పది .అలాంటి ఆకాశాన్ని ఒకే ఒక్క పాదం లో నేను అక్రమించాను .విశ్వ వ్యాప్తి ని అయిన నన్ను హృదయం లో దాచుకొన్న భక్త శిఖా మణి అందరి కంటే గొప్పవాడు ‘’అని సందేహాన్ని నివృత్తి చేసి భక్తుడే భగ వంతుని కంటే గొప్ప అని రుజువు తో  సహా పరమాత్మే తెలియ జేశాడు .

 ఇప్పుడు ఒక భక్తుడు చెప్పిన శ్లోకం, దాని లోని సత్యం తెలుసు కొందాం

   ‘’దాసోహమితి యా బుద్ధిహ్ పూర్వ మాసీత్ జనార్దనే —దకారో అపహృహృస్తేన గోపీ వస్త్రాప హారినా’’

    దీని అర్ధం –పూర్వం నేను భక్తీ తో ’’  దాసోహం ‘’అంటూ ఉండే వాడిని .అలా అనుకొంటుంటే గోపికా వస్త్రాపహరుడైన ఆయన  దాసోహం అనే నా భావనలో ‘’ధా’’ అనే అక్షరాన్ని అపహరించాడు .’’సోహం ‘’అనే భావం తో  నన్ను ముంచేశాడు .అంటే నాకు పరమాత్మ కు భేదం లేదని తెలియ జేశాడు .దీన్నే వ్యాజ స్తుతి అంటారు .పైకి నింద ఉన్నా లోపల అందమైన ఆనందార్ధం ఉంటుంది .

          భక్తీ అంటే ఏమిటో ‘’శివా నంద లహరి ‘’లో శంకర భగవత్పాదులు గొప్పగా వివ రించారు –ఆ వైభవం చూద్దాం –‘’      ‘’అన్కోలం నిజ బిందు సంతతి ,మయస్కామ్తోపలం సూచికః –సాధ్వీ నిజ విభుం లతాక్షి తిరుహం సిన్దుస్సరిద్వల్లభం –ప్రాప్నోతీ హయదా తధా పశు పతే పాదార వింద  ద్వయం –చేతో వ్రుత్తి రుపెత్య తిష్టతి సదా సా భక్తీ రిత్యుచ్యతే‘’బూరుగ చెట్టు విత్తనాలు పండి నేల రాలి తమకు తామే చెట్టు వైపుకు  ఆకర్షింప బడి మానుకు అంటూ కుంటాయి ..ఇనుప సూది అయస్కాంతానికి తానె ఆకర్షింప బడు తుంది పవిత్రత అనేది మనస్సు  భక్తీ భావం అనే మనో వాక్కాయ కర్మ లచే అనుసరిస్తుంది.తీగ చెట్టుకు  చుట్టు కోవటం ,నది సముద్రాన్ని చేరటం సహజం .అలానే  మనసు శివుని పాద పద్మము లను పట్టు కొని ఉండటం భక్తీ అంటారు .

 భాగవతం లో  భక్తీ అంటే ఏమిటో ప్రహ్లాదుని గురించి చెబుతూ పోతన గారు రాసిన అద్భుత పద్యం  జగద్విదితం

  ‘’పానీయమ్బులు త్రావుచున్ ,కుడుచుచున్ ,,భావించుచున్ ,హాస లీ

  లా నిద్రాదులు చేయుచున్ ,తిరుగు చుం ,లక్షించు చుం ,సంతత

 శ్రీ నారాయణ పాద పద్మయుగళ ,,చిన్తా మృతా  స్వాద సం

దానున్డై ,మరచేన్ సురారి సుతుడే తద్విశ్వమున్  భూవరా’’

     మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –10-5-12.

            కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 2 Comments

చినుకు మాస పత్రిక లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిల్డా డూ లిటిల్

            హిల్డా డూ లిటిల్

H.D.గా అని అందరికి  సుపరిచిత మైన రచయిత్రి ,కవి హిల్డా డూ లిటిల్ .ప్రముఖ ఇమేజిస్ట్ కవులు ఎజ్రా పౌండ్ ,మూర్ ల చేత ఇమేజిస్ట్  ముద్ర పడినకవి, అమెరికా కవయిత్రి .ఆమె రచనలు సూటిగా ,గ్రీకు వారి మాటల్లా ఉంటాయని ప్రశంస పొందింది .ప్రయోజనాత్మక కవిత్వం రాసి మెప్పు పొందింది. ఇమేజిస్ట్ ల ప్రభావం నుంచి క్రమంగా దూర మైనా ,ఇంకా ఆమె ను అలాగే భావిస్తారు .

               హిల్డా ,అమెరికా లోని పెన్సిల్వేనియా లో బెతేల్హాం లో 1886 సెప్టెంబర్ పది న జన్మించింది .తండ్రి ఆమె కు ఖగోళం ,గణితం బోధించాడు .పెన్సిల్వేనియా యూని వేర్సిటి  లో ప్రొఫెసర్ గా ,ఫ్లవర్ అబ్సర్వేటరి డైరెక్టర్  గా పని చేసింది .తల్లి ప్రోతెస్తంట్ మతంలో అసమ్మతి వర్గానికి చెందినా మొరోవియన్ బ్రదర్హుడ్  లో సభ్యురాలు .దేవుని తో  ప్రత్యక్ష అనుభవం ఉన్నట్లుగా తల్లి భావించేది .కూతురు కూడా తన కవితా ప్రతిభ దైవీ కృతం అన్నది .క్వేకర్ స్కూల్ లో ,బ్రియాన్ మార కాలేజి ల్లో విద్య నేర్చింది .మిరియాన్ మూర్ అనే ఆర్టిస్ట్ టో పరిచయం కలిగింది .ఎజ్రా పౌండ్ తో సరస సల్లా పాలు సాగించింది .తర్వాతా w.c.విలియమ్స్ కవితో క్లోజ్ గా ఉంది   .కాలేజి లో కొద్ది కాలమే చదివింది .పౌండ్ ,గ్రెగ్ ల ప్రవర్త నతో మానసికం గా కుంగి పోయి,డిప్రెషన్ లో పడింది .ఈ విషయాన్ని స్వేయ చరిత్ర HERmione లో రాసుకోన్నది .గ్రెగ్ ,అతని తల్లి టో యూరప్ పర్యటనకు వెళ్ళింది .లండన్ లో పౌండ్ ఆమెను ప్రముఖులకు పరిచయం చేశాడు .అప్పటికి ఇంకా జేమ్స్ జాయిస్ వెలుగు లోకి రాలేదు .D.H. laarens తో H.D.స్నేహం చేసింది .ఈ విషయాన్ని portrait of a genius పుస్తకం లో ఆల్లిన్గ్తాన్ రాశాడు .పౌండ్ ఒంటెత్తు పోకడ లకు విసిగి పోతోంది .ఆలింగ్తాన్ ఆమెను ఫ్రెంచ్ సింబాలిజం అధ్యయనం చేయమని ప్రోత్స హించాడు .దాని పై ద్రుష్టి పెట్టింది

         1913 లో ఆలింగ్తాన్ ను పెళ్ళాడింది .పౌండ్ ,భర్త ల సహకారం తో  the egoist పత్రికా సంపాదకు రాలు అయింది . . 1917 లో భర్త’’ గ్రేట్ వార్’’ లో పని చేయటానికి వె డితే, సిసిలీ గ్రే అనే సంగీత కళా కారుడి తో  వ్యవహారం నడిపింది .   న్యు మోనియా వచ్చి బాధ పడింది .బ్రిహర్ అనే నవలా రచయిత టో పరిచయం పొంది ,చివరిదాకా కోన సాగించింది .అతడు ఇంకో అమ్మాయి మెక్ ఆల్మన్ తో ప్రేమాయణం సాగిస్తే వారితో పాటే పారిస్ చేరింది .ఆమె రచనలను సరి దిద్ది ప్రచురించింది .1921 లో hymen అనే కవితా సంకలనాన్ని ప్రచురించింది హిల్డా .ఆ తర్వాతా hyppolitus timporizes ,the red roses for bronze కవితా సంకలనాలను విడుదల చేసింది .

        బ్రిహర్ భార్య కు విడాకులిచ్చాడు .కెన్నెత్ ను కళ్యాణం ఆ డాడు .ఆమె సినీ నిర్మాత .భార్యా భర్తలు’’ క్లోజప్’’ అనే జర్నల్ నడిపారు ‘హెచ్ .డి .మూడు సినిమాల్లో కన్పించింది .ఫిలిం డైరెక్టర్లతో పరిచయం పెంచు కొంది .బ్రిహర్ ఆమె ను ఇటలి తీసుకొని వెళ్లి సిగ్మండ్ ఫ్రాయిడ్ కు పరిచయం చేశాడు .tributes to freud అనే విశ్లేషణాత్మక రచన 1956 లో  చేసింది .అందులో ఫ్రాయిడ్  జబ్బులు కని పెట్టె విధానం తప్పు అని తేల్చింది .తర్వాతా బ్రిహర్ కుటుంబం టో స్విత్జేర్లాండ్ వెళ్ళింది .నాజీ ల ఘోర కృత్యాలకు బలి పోతున్నయూదులను , ,వామ పక్షీయులను తప్పించటానికి బ్రిహేర్ సరి హద్దు దాటి వారిని తప్పించు కోనేట్లు సాయం చేశాడు .

               రెండవ ప్రపంచ యుద్ధం కాలం లో లండన్ నగరం లోని హైడ్ పార్క్ దగ్గర్లో కాపురం ఉండే వారు .అతను life and letters to day అనే మాగజైన్ ప్రచురించే వాడు .కొత్త వచనం కవిత్వం మీద డూ లిటిల్ శ్రద్ధ వహించింది .the walls do not fall అనే కవిత లో యుద్ధ సమయం లో లండన్ వణికి పోతున్న స్తితిని కళ్ళకు కట్టి  నట్లు వర్ణించింది .ఆ తర్వాతా tribute to angels ,flowering of the rod కవితా సంకల నాలను తెచ్చింది .ఈ మూడిటిని triology అంటే త్రయం అంటారు .ఆ తర్వాతా ఆమె ఆధ్యాత్మిక భావన లో మునిగి  పోయింది .తంత్ర శాస్త్రం ,ఖగోళ శాస్త్రం ,tarot cards వంటి వాటి మీద ద్రుష్టి ఎక్కువైంది .యుద్ధానంతరం నరాల బలహీనత బాధించింది .స్విస్ లో చికిత్స చేయించు కొన్నది .అయినా ఆమె లోని కవితా వేశంఆగ లేదు .నిత్య శ్రోతస్విని లా ప్రవహిస్తూనే ఉంది .1957  లో ‘’ సెలెక్టెడ్ పోయెమ్స్ ‘’ప్రచురించింది .1960 ,61 ల లో bid me to live ,,helen in egypt అనే నవల ల ను రాసింది .చివరి సారిగా 1960 లో అమెరికా వచ్చి వెళ్ళింది .అప్పుడామే కు American academy of arts and letters మెడల బహూక రించారు .1961 లో జూరిచ్ వెళ్ళింది .అక్కడే తీవ్ర మైన గుండె పోతూ వచ్చి మరణించింది .

           ఆమె మరణించిన తర్వాతా ఆమె కవిత్వాన్ని అధ్యయనం చేయటం ఎక్కు వైంది .సాహిత్య చరిత్ర కారులు దృష్టిని కేంద్రీకరించారు .Her self Defined ane aame jeevitha charitra raashaaru .the poet HD.and her world  1984 లో వచ్చింది .ప్రముఖ విమర్శకులందరూ ఆమె సాహిత్యం పై పరిశోధనలు చేస్తూ గ్రంధాలు రాస్తూనే ఉన్నారు .ఆమె పేరు  ’’ Doo Litil ‘’అయినా ‘’Did a great job ‘’అని పించుకోన్నది హిల్డా డూ లిటిల్ .

                         walls do not fall

an incident here and there –and rails gone (for guns )—from your (and my )old town square

        must and must gray not colour –still the luxor bee –chick and hare –pursue un alterable purple

for i know how the lord god —is about to manifest  when I –the industrious worm –spin my own shroud ‘

 

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —9-5-12.

                    కాంప్—అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ -5

     సత్య కధా సుధ

              దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి అన్నం మూటను చెట్టు కు వేలాద దీసి తువ్వాల వేసుకొని హాయిగా నిద్ర పోయాడు .ఇంతలో పెద్ద పులి గాండ్రింపు విని మూటను వదిలి పారి పోయాడు .కొంత సేపటికి ఒక దొంగల ముథ  దొంగిలించిన ధనం తో  అక్కడికి వచ్చి పడుకో బోతూ చెట్టు కు ఉన్న మూటను చూసి ఎవరో తమకు విషాన్నం పెట్టి ధనాన్ని కాజేయాలను కొన్నారని భావించి వెదికారు .పాపం చెట్టు మాటున నాస్తికుడిని చూసి లాక్కొచ్చారు .ఆ మూట అతనిదే నను కొన్నారు .వాడు లబో దిబో తనకేమీ తెలీదు అంటున్నాడు .మూట లో అన్నం తినమన్నారు. అన్నం తినను అని  శపథం చేశాడుగా .తిననని మొరాయించాడు .కొట్టి ,భయ పెట్టి తి ని పించారు .వాడు చావ లేదే అని ఆశ్చర్య పోయి ,వాడే చస్తాడు లేఅనుకొని వెళ్లి పోయారు దొంగలు.కనుక తినటం తినక పోవటం నీ ఇష్టం లో లేదు అని ఆ తర్వాతా ఆస్తికుడు చెప్పాదన్నది మనం గ్రహించే విషయం .

             విధి ఆడే వింత నాటకాన్ని గురించి ఇంకో కధ –ఒక రాజు తన కుమార్తెకు సంగీత సాహిత్యాలు నేర్పించమని ఒక గురువు ను ఏర్పాటు చేశాడు .బానే నేర్పాడు ఆమె కు యుక్త వయసు వచ్చింది గురుదక్షిణ గా పెద్ద సంపదను ఇచ్చి రాకుమారి నమస్కరించింది . .దాన్ని గ్రహించ కుండా రాజకుమార్తె తనను పెళ్లి చేసుకోవటమే గురుదక్షిణ   అన్నాడు .రాకుమారి అతనితో గురువు తండ్రి లాంటి వాడని అలా కోరటం తప్పని చెప్పింది గురువు కు కోపం వచ్చి అంతు    చూస్తానని వెళ్లి పోయాడు .

              ఒక రోజు రాజు గురువు ను పిలిచి కూతురు జాతకాన్ని పరిశీలించి తగిన వరున్ని చూడ టానికి సహాయం కోరాడు .దుష్టుడు అయిన  గురువు ఆమె వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోతాడని చెప్పాడు .ఉపాయం ఏమిటి అని అడిగితె చంపెయట మే అన్నాడు ఆ పని చేయ లేనన్నాడు రాజు .అయితే ఆమెను ఒక పెట్టె లో పెట్టి నీళ్ళ లో వదిలేయమని అప్పుడు పీడా విరగడ అవుతుందని చెప్పాడు .అలానే చేశాడు రాజు .ఆ పెట్టె నీటి లో కొట్టు కు పోతోంది .అప్పుడే వేటకు వచ్చిన రాజ కుమారుడు ఒకడు ఆ పెట్టెను నీటి లోంచి బయటకు తెప్పించి చూశాడు అందులో రాకుమార్తె ఉంది .ఆమెను విషయం అంతా వివరించ మని కోరితే చెప్పింది .రా కుమారుడు రాజ గురువు దుష్ట పన్నాగం తెలుసు కొని తన దగ్గర పట్టు బడిన ఒక ఎలుగు బంటి  ని  పెట్టెలో పెట్టించి మళ్ళీ నీళ్ళ లోకి వదిలేశాడు .

     గురువు శిష్యులతో ఒక దేవాలయం లో ఉండి  పెట్టె కోసం ఎదురు చూస్తున్నాడు .పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేసు కొన్నాడు .పెట్టె  కని పించాగానే శిష్యులతో తెప్పించాడు .గుడి లో పెట్టించాడు .ఎవరు వచ్చి గోల చేసినా తలుపు లు తీయ వద్దని ఒక వేళ తానే కేక లేసినా కూడా గుడి తలుపులు తీయ వద్దని గట్టి గా హెచ్చ రించి లోపలి చేరాడు .నెమ్మదిగా పెట్టె తలుపు తీశాడు .మెత్తగా తగిలితే సుకుమార రాకుమార్తె అను కొన్నాడు .పూర్తిగా తీయ గానే  భల్లూకం కోరలతో వాడి మేడ పట్టుకొని చీల్చి తినేయటం మొదలెట్టింది .గట్టిగా అరుస్తున్నాడు ,ఏడుస్తున్నాడు గురువు .గురువు అజ్ఞా ప్రకారం శిష్యులు తేలిగ్గా తీసుకొని తలు పులు తీయ లేదు . గురువు ను హాయిగా భక్షించి జారు కుంది .దురాశ ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలిపే కధ ఇది .

 ‘’అన్యదా చిన్తితం కార్యం దైవ మన్యాత్ర  చింత ఎత్—రాజ కన్యా పహారే ణ విప్రో భల్లూక భక్షితః ‘’అన్న శ్లోకానికి ఈ కధ వివరణ .

           మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ —9-5-12

                    కాంప్—అమెరికా +

Posted in రచనలు | Tagged | 1 Comment

ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

  ప్రజా కవ యిత్రి ఫిలిస్ మెక్ గిన్లి

        ‘’నేను బాగా ఉపయోగ పడే దానిని అని నా నిశ్చితాభి ప్రాయం .యూని వేర్సిటి  లకు మాత్రమే కవిత్వం పరిమిత మై పోయి ,సామాన్యులకు సంబంధం లేకుండా పోయిన కాలం లో ,నేను నా కవిత్వం వల్ల లక్షలాది  చదువరు లకు   చేరు వైనాను .కవిత్వ ద్వారాలు తెరిచి ,గొప్ప కవిత్వం వైపుకు మార్గ దర్శకత్వం చేసి ,వారిని నడ పించాను ‘ ‘ అని సగర్వం గా ప్రఖ్యాత టైం మేగజైన్ కు ఇంటర్వ్యూ లో చెప్పిన ప్రముఖ  అమెరికన్ ఆధునిక కవ యిత్రి ‘’ఫిలిస్ మెక్ గిన్లి ‘’ ‘

    ఆధునిక అమెరికాసాహిత్య చరిత్ర లో నలభై ఏళ్ళ కు పైగా లలిత కవిత్వాన్ని (light verse ) రాసి ప్రజాభి మానాన్ని పొందిన కవయిత్రి ఆమె .రెండవ ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందే కవిత్వ రచన ప్రారంభించి ,ఆ తర్వాతా మూడు దశాబ్దాలు పాటు అప్రతి హతం గా రాసి,విజయ బావుటా ను ఎగా రెసిన గొప్ప రచయిత్రి .సమకాలీన కవులందరి కంటే ముందుకు దూసుకు పోయింది .హాస్యం ,వ్యంగ్యం జోడించి సమకాలీన విషయాలను వెలుగు లోకి తెచ్చింది .ప్రజా జీవితానికి అద్దం  పట్టింది . మేటి పత్రిక లైన’’ న్యూయార్కర్’’ ‘’,సాట ర్ డే ఈవెనింగ్ పోస్ట్’’ పత్రికల లో ఆమె రచనల చోటు చేసుకోన్నాయంటే ఎంత గొప్ప రచనలు చేసిందో తెలుస్తుంది ..

                                  బాల్యం విద్య

       1905 మార్చ్ 11 ణ గిన్లి అమెరికా లోని ఓరిగాన్ రాష్ట్రం ఒంటారియా లో జన్మించింది .తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసి నష్ట పోతూ తరచుగా వూళ్ళు మారుస్తుందే వాడు అందుకని ఆమె బాల్యం ఒక ఊరికే పరిమితం కాలేదు .చివరికి కొలరేడా లోని ఐలిఫ్ అనే మారు మూల ప్రాంతానికి కుటుంబాన్ని మార్చాడు .అక్కడ తమ్ముడి టో వంటరి గా ఉండాల్సి వచ్చింది .పన్నెండవ ఏటే తండ్రి మరణం .తల్లి ఊతా కు వీరిని తీసుకొని వెళ్లి ఉంది .అక్కడి యునివేర్సిటి లో చేరింది కాని తానేమీ పెద్దగా నేర్చు కొన్నదేమీ లేదని చెప్పింది .కవిత్వం ,కధ ,వ్యాస రచన పోటీల్లో పాల్గొని రెండు సార్లు నగదు బహుమతి సాధించింది .ఆపాటికే ప్రసిద్ధ పత్రికల కు రాసేది .న్యూయార్కర్ పత్రిక వాటిని స్వీకరిస్తూనే ‘’మీ స్త్రీలందరూ రాసే ఏడుపు గొట్టు కవిత్వాన్నే నువ్వూ ఎందుకు  రాసి ఏడి  పిస్తావు ?ఏదైనా కొత్త గా రాయటానికి ప్రయత్నించు ‘’అని సున్నితం గా సలహా కూడా ఇచ్చాడు సంపాదకుడు .అది మనసు లో పడి ,నచ్చి కొత్తగా రాయటం ప్రారంభించింది .

           గిన్లి న్యూయార్క్ చేరింది .రాయటం ,ప్రచురించటం ప్రారంభించి కోన సాగించింది .హాస్యం ,వ్యంగ్యం కలిపి జోడించి మనసులకు చేరు వై నది. జూనియర్ స్కూల్ లో టీచర్ ఉద్యోగమూ చేసింది .ఆమె హాస్యం ఆ ప్రిన్సిపాల్ వంటికి పడ .లేదు .మానేసి’’ టౌన్ అండ్ కంట్రి ;; పత్రిక లో చేరింది .బెల టెలిఫోన్ లో పని చేస్తున్న చార్లెస్ హేదేన్స్ కు చేరువై  పెళ్లి చేసుకొన్నది .ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .చిన్న ప్పటి  నుంచి స్వంత ఇల్లు ఉండాలని కల లు కనేది .ఆ కల ను భర్త సాఫల్యం చేశాడు న్యూయార్క్ దగ్గర్లో ఇల్లు కొని సంతోషం కలిగించాడు అక్కడ రచనా వ్యాసంగాన్ని అప్రతి హతం గా సాగించింది .

                     పేరు ప్రఖ్యాతులు

     అప్పుడు ప్రపంచాన్ని ఆర్ధిక డిప్రెషన్ కుంగదీస్తున్న కాలం అది .ఆమె తెలివిగా ,తమాషాగా నిత్య జీవిత విషయాలను హాస్యం తో  రంగరించి రాసింది .ఆ టెన్షన్ నుంచి తట్టు కోవ టానికి అవి బాగా ఉప యోగ పడ్డాయి .పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి .ఎగ బడి చదివారు జనం .కుటుంబ బంధాలు ,కష్ట సహిష్ణుత ,సాధారణ తెలివి తేటలు మొదలైన వాటి పై రచనలు చేసి మెప్పించింది .1934 లో మొదటి కవితా సంకలనం ‘ఆం ది కాంట్ర రి’’తెచ్చింది ఆ తర్వాతా మూడు సంకలనాలు ప్రచురించింది .ఇల్లాలి ముచ్చట్లు ,ఇంటి గుస గుసలు లాంటి గృహ సంబంధ విషయాలు రాసి అందరికి చేరువయింది .వ్యంగ్యం ఆలంబన గా ఆమె కవిత్వం ఉండటం టో జన హృదయాలను పట్టు కొన్నాయి ఆనంద సంతోషాలను కల్గించాయి .

       కుటుంబ వ్యవహారాలే కాదు సాంఘిక కార్య క్రమాలలోను పాల్గొంది .ఆనాడు bright young అని పించుకొన్నా ఆడెన్ వంటి యువా కవులు యుద్ధ నినాన్దాలతో లేక్చర్లతో రాజకీయాలను చెరిగి పారేస్తున్నారు .వారంతా హాయిగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ,కుర్చీలకే పరి మిత మైన వారు .వారి పై ’stones from the glaas house ‘’,small wonder ‘’వంటి మ్యూజికల్ లిరిక్స్ రాసి ప్రచు రించింది .ఆమె ప్రతిభకు తగ్గ పురస్కారాలు లభించాయి .గౌ రవాలు దక్కాయి .national academy of arts and letters కు ఎన్నిక అయింది .లైట్ వేర్స్ లో పులిట్జర్ బహుమతి పొందిణ మొదటి మహిళా గా గుర్తింపు పొందింది .బాలల కోసం డజను కు పైగా పుస్తకాలు రాసింది .అమెరికా ,అమెరికన్ స్కాలర్ ,రీడర్స్ డైజెస్ట్ వంటి పేరున్న పత్రికలలో ఆమె రచనలు చోటు చేసుకొని ఆమె కు గౌరవాన్ని కల్గించాయి .ఆనాటి ప్రసిద్ధ చర్చి బిషప్పు లతో ప్రముఖ రచయితలైనా జాన్ అప్డైక్ వంటి వారితో ,మాకార్దీ ,రాక్ ఫెల్లర్ వంటి రాజ కీయ నాయకులతో థియేటర్ ఆర్టిస్ట్ లతో ఆమె ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపింది ..1968లో వచ్చిన న్యూయార్క్ అబార్షన్ యాక్ట్ పానెల్ కమిటీ లో సభ్యురాలైంది .

       1965  జూన్ 18  టైం మేగజైన్ ఫిలిస్ మెక్ గిన్లి  ముఖ చిత్రం వేసి ప్రచు రించి ఆమె ఖ్యాతి కి  నీరాజనం పట్టింది .గృహానికే పరిమిత మైనా .ఆమె తన పై విమర్శలు చేసిన వారి ని దృష్టి లో ఉంచు కొని సమాధానం గా ‘’సిక్స్ పెన్స్ ఇన్ హర్ షో ‘’, లో’’ ఎంత చదువు కొన్న వారి కైనా సుఖ సంతోషాలు ఇంటి లోనే సాధ్యం అని చెప్పింది .ఆడ వారు ఇంట్లోనే ఉండటం వారికే కాక సమాజానికీ మంచిది అని తెలియ జేసింది .గృహిణి మిగిలిన వారి కంటే విచక్షణ జ్ఞానం ఎక్కువ గా కలిగి ఉంటుందని ,రాజకీయాలకు చక్కని భాష్యం చెప్ప గలదని ,పేపర్లో వచ్చే విషయాలను బాగా విశ్లేషించ గలదని,భర్తల వ్యాపార లావా దేవీలలో స్పష్టమైన సలహా ఇవ్వగలరని ,వారికి సహాయ కారి గా ఉండగలరని స్పష్టం చేసింది .పిల్లలకు వినోదాన్ని గృహిణి మాత్రమే పంచ గలదని ఆమె నిశ్చితాభి ప్రాయం .ఇప్పటికే పుస్తకాలు ,సంగీతం ,నాటకం ,చిత్ర లేఖనం మొదలైన రంగాలలో స్త్రీలు గొప్ప సాంస్కృతిక విని యోగా దారు లు గా చేలా మణి లో ఉన్నారని కుండా బద్దలు కొట్టింది .’’మహిళలు గా ,ఇల్లాండ్రు గా మేము రాబోయే తరాలను ప్రభావితం చేయ గల శక్తి సంపన్నులం .ఆడ ,మగ తమ పరిధుల్లో తాము పని చేసుకొని పోతూ ఉంటె ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు .గృహ ధర్మానికి భంగం కలుగ నంత వరకు ఇంటికి బయట సాంఘిక సేవ చేయటం మంచిదే .’’అని తన సిక్స్ పెన్స్  రచన ముగించింది .ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడటం చెప్పటం రాయటం గిన్లి ప్రత్యేకత .అందుకే ఆమె కు అందరు అభిమానులున్నారు .ఆ పుస్తకం ఒక లక్ష కాపీలు అమ్ముడు పోయింది అంటే ఆమె పాప్యులారిటి ఎంత గొప్పదో ,ఆమె ప్రభావం ఎందరి మీద ఉందొ అర్ధం అవుతుంది .

              గిన్లి రాసిన వచన రచనలు province of the heart ‘’,wonderful time ‘’,saint watching ‘’పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి .1972 లో భర్త చని పోయే వరకు రాస్తూనే ఉంది .1978 ఫిబ్రవరి 22 న గిన్లి ఇహ జీవితాన్ని చాలించింది .

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-5-12.

        కాంప్ –అమెరికా

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ –3

  సత్య కధా సుధ –3

               భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు .మొదటి వాడు ఎప్పుడూ అంతా దైవాధీనం అంటూ ఉండటం వల్ల’’దైవాధీనం’’ అనే అందరి చేతా పిలువ బడే వాడు .రెండో వాడు అంతా రాజు గారి దయ అని భావిస్తూ‘’రాజాదీనం ‘’అని పిలువా బడ్డాడు .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .

                   ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతుంటే దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అనిఆలోచన వచ్చింది .ఒక శెట్టి గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .శెట్టి కి ఒక ఆలోచన వచ్చింది .గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని అను కొన్నాడు .అప్పుడే అను కొ కుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించాడు .ఇంటికి ఆహ్వానించి ఆయనకు దక్షిణ తో సహా కూష్మాండ దానం చేశాడు శెట్టి .దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు

                        మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు .గుమ్మడి కాయ కూర తిన్నారాని రాజు అడిగాడు .ఆహా ,ఓహో అద్భుతం అని బొంకాడు ఆయన .రాజు గారికి అర్ధమైంది .గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని .భటులను పిలి పించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .శెట్టి ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్ని కొన్నానని దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు .తాను  ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాదేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .మరో సారి రాజాదీనానికి ఏదో ఇవ్వాలని సంకల్పించాడు

              ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి రాజా దీనం గారు వచ్చే దారిలో పెట్టి ,భటుడి ని  కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు.రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు .రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు .అదృష్ట వంతున్ని ఎవరు చేద గొట్ట లేరు .దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది .దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది .అని ఇందులో ఉన్న సారాంశం .

                  పరమాత్మ ను పూర్తిగా మనస్పూర్తిగా నమ్మాలి అప్పుడే ఆయన కటాక్షం మన మీద పడుతుంది .మన ప్రయత్నం అంతా అయిన తర్వాత ,నువ్వే తప్ప ఇతరం లేదు అని శరణాగతి పొంది నప్పుడే పరమాత్మ అనుగ్రహిస్తాడని గజేంద్ర మోక్షం లో ద్రౌపదీ వస్త్రాప హరణం లో గోపికా వస్త్రాపహరణం లో తెలిసిన విషయమే .అలాంటిదే ఇంకొకద .ఒక చాకలి వానికి ఒక భక్తుడి తో విరోధం వచ్చింది .బాగా తప్ప తాగి ఆవేశం తో వాడు కావడి బద్ద తీసుకొని భక్తుణ్ణి బాదేస్తున్నాడు .దెబ్బ దేబ్బకూ భక్తుడు’’హరీ హరీ ‘’అంటూ  బాధ అను భావిస్తూ భగవంతడిని  తలచు కొంటుఅరుస్తున్నాడు .అప్పుడు వైకుంఠ వాసుడు రమా పర్యం కం లో విహరిస్తున్నాడు .ఆమె కు చెప్ప కుండా ఎక్కడికో వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు శ్రీ హరి .లక్ష్మీ దేవి అడిగింది ఎందుకు అంత త్వరగా చెప్ప కుండా వెళ్లి ,అప్పుడే వచ్చారేమిటి అని .అప్పుడు రమా రమణుడు ‘’ఓక  భక్తుడిని ఒక చాకలి తాగిన కోపం తో కావడి బద్ద తో  బాదు తుంటే అతడు నన్నే స్మరించాడుదెబ్బలను ఒర్చుకొంటు .అతన్ని రక్షించాలని ఆలస్యం చేయ కుండా వెళ్లాను ఈ లోగా ఆ భక్తుడు చాకలి చేతి లో కావడి బద్ద  లాక్కొని చాకలిని వీర బాదుడు బాదు తున్నాడు .ఇక నా పని అక్కడ లేదు అని గ్రహించి వెంటనే తిరిగి వచ్చేశా అని చెప్పాడు దీన పరాధీనుడు

                ఒక సారి వ్యాసుల వారు జనమేజయ మహా రాజు వద్దకు వచ్చి అతనికి ఒక పని చెబుతానని దాన్ని ఆచరించ గలడో  లేడో  అని అడిగాడు .తప్పకుండా చేస్తానన్నాడు రాజు .అప్పుడు ద్వైపాయనుడు ‘’నాయనా !కొద్ది రోజుల్లో ఒక గుర్రాల మంద అమ్మకానికి వస్తుంది .అందులో నల్లని పెద్ద గుర్రం ఉంటుంది .దాన్ని మాత్రం కోన వద్దు .కొన్నా దాన్ని ఎక్క వద్దు .ఎక్కినా ఉత్తర దిక్కుకు వెళ్ళద్దు .వెళ్ళినా నీకు కనిపించిన అమ్మాయితో మాట్లాడకు .,మాట్లాడినా ఆమె ను పెళ్లి చేసుకోకు ,ఆడినా ఆమె చెప్పి నట్లు వినకు ‘’అని చెప్పాడు .ఇదెంత పని అనుకొన్నాడు రాజు

                  కొన్నేళ్ళుగడిచాయి .గుర్రాల మంద వచ్చింది .కొనద్దను కొంటూనే నల్ల గుర్రాన్ని కొన్నాడు వద్దను కుంటూనే ఎక్కిస్వారి చేస్తూ వద్దను కొంటూనే ఉత్తర దిక్కు కు వెళ్లాడు అక్కడ ఏడుస్తున్న అందమైన అమ్మాయిని చూశాడు .మహర్షి చెప్పింది జ్ఞాపకం ఉంది .అయినా ఏమవుతుంది లే అనే ధీమా వచ్చింది ఆమెతో మాట్లాడటం గాంధర్వ వివాహం చేయటం రాజధానికి తీసుకు రావటం జరిగి పోయాయి .ఆమె కోరిక మీద సాధువులకు సంతర్పణ ఏర్పాటు చేశాడు .ఆమె వారికి నెయ్యి వడ్డిస్తూ ,జారుతున్న పైటను సద్దు కొంటోది .రాజు పర్య వేక్షణ చేస్తున్నాడు .ఆమె పైట వంక సాధువు లు చూస్తుండటం సహించ లేక పోయాడు ఓర లోని కత్తి లాగి దెబ్బకు పది మందిని గా ఆ సాధువు లందర్నీ చంపేశాడు పురోహితులు అడ్డ గిన్చినా ఆగ లేదు .అంతా అయిపోయిన తర్వాతా ‘’అయ్యో సాదు హత్య చేశానే ‘’అని కూల బడి పోయాడు .ఎదురు గా వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు .సిగ్గు తో తల వంచు కున్నాడు రాజు .వ్యాసుడి చ్చిన ఆరు అవకాశాలను తాను దాటి నందుకు ,మహా అపరాధం చేసి నందుకు కుమిలి పోయాడు రాజు .              ఈ విషయాన్నే భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ‘’ప్రక్రుతిస్త్వాం నియోక్షసి ‘’అని చెప్పాడు అర్జునుని తో .’’నువ్వు అహంకారం తో యుద్ధం చేయను అను కుంటావేమో .మానటం నీ అధీనం లో లేదు .ప్రకృతి బలాత్కారం గా నీ చేత చేయిస్తుంది ‘’అని వివరించాడు .ఈ సత్యాన్ని చాటి చెప్పే కధ మనం ఇప్పుడు చెప్పుకొన్న సత్య కధా సుధా .an unknown power always leads అంటారు అందుకే .ఇంతకీ ఈ కధ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే– వ్యాసుడిని జన మే జయుడు ‘’మహర్షీ !యమ ధర్మ రాజు అంశతో జన్మించి ,సకల సద్గుణాలు కలిగి జితేంద్రియుడు అని పిలి పించుకొన్న యుధిష్ఠిరుడు జ్యూదం లో పాల్గొనటం ,అన్నీ పణం గా పెట్టటం ,ఓడి పోవటం వింటుంటే ఆయన్ను ‘’అవి వేకి ‘’అనక తప్పటం లేదు .పెద్ద తాత గారు ధర్మ రాజు పెద్ద తప్పే చేశారు ‘’అన్నాడు దానికి పై అర్ధం ఉన్న గీతా శ్లోకం చెప్పి ఎంతటి వారి నైనా విధి  ఆడిస్తుందని మనం అందరం దాని చేతి లో కీలు బొమ్మలం అని తెలియ జెప్పే కధే ఇది .

       సశేషం —మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –8-5-12

                    కాంప్—అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ – దృశ్య మాలిక

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్య కధా సుధ—2


                                      సత్య కధా సుధ—2

            ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి ‘’ అని కుంతీ దేవి తన కొడుకులు కురు క్షేత్ర యుద్ధానికి బయల్దేరి నప్పుడు ఆశీర్వ దించి పంపింది .అందుకే లోకం లో ఒక సామెత వచ్చింది ‘’పాండవుల ఆదాయం కౌరవుల తద్ది నాలకు చాల లేదు ‘’అని .అంటే పాపం అంత కష్టపడి అరణ్య ,అజ్ఞాత వాసాలు చేసి ,యుద్ధం చేసి ,చేసిన ప్రతిజ్ఞ లను నేర వెరచు కొని రాజ్యాన్ని పొందినా వాళ్ళకు దక్కింది చాలా తక్కువే .

               ఒకే పనిని చాలా మంది చేస్తారు .కాని ఫలితాలు వేరు వేరు గా ఉండటం గమనిస్తాం .దానికి కారణం ఏదీ మనకు కని పించదు .దీన్ని అర్ధం చేసు కోవా టానికి ఒక కధ చెబుతాను ఒక ఊరిలో ఇద్దరన్న దమ్ములున్నారు .పేదరికం ఇద్దర్నీ బాధిస్తోంది .దాని నుంచి బయట పద టానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు .పెద్ద వాడి భార్య తమకు ఆ ఊళ్ళో ఏమీ లభించటం లేదని ,ఇతర గ్రామానికి వెళ్లి సంపాదన కు ప్రయత్నించ మని సలహా ఇచ్చింది .అలాగే అతడు బయల్దేరి వెళ్లాడు .బాగా నడిచి ఒక మర్రి చెట్టు కింద అలసట తో నిద్ర పోయాడు .చీకటి పడబోతుండగా దగ్గర్లో ఉన్న చెరువు లో స్నానం చేసి తాను తెచ్చు కొన్న అన్నం తిందాము  అను కొన్నాడు .స్నానం చేసి వచ్చి చుస్తే తను తెచ్చు కొన్న అన్నం మూట లో అన్నం లేదు .కాని అందులో ఒక పళ్ళెం ఉంది .కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .ఆ పళ్ళాన్ని నేల కేసి కొట్టాడు .అది బోర్ల పడింది .అందులే షడ్రసో పెత మైన భోజన పదార్దాలున్నాయి .కమ్మగా భోజనం చేసి ఇంటికి చేరాడు . భార్యతో విషయం చెప్పాడు .మర్నాడు ఊరి వారందరినీ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అందరికి ఆశ్చర్యమేసింది .అందరు వచ్చారు .ఇంట్లో  గాడి పోయ్యి లేదు వంట వండిన తీరు లేదు .అంతా పంక్తుల్లో కూర్చున్నారు .గోవింద నామ స్మరణ చేస్తూ ,అందరి తో చేయిస్తూ అన్దరి ముందు పళ్ళెం బోర్లిస్తున్నాడు వరుసగా .అపుడు ప్రతి వాడి ముందు అన్ని భోజన పదార్ధాలతో ఉన్న విస్తరి కని పించింది .సుష్టుగా  అంతా భోజనం చేసి కృతజ్ఞత తెలిపి వెళ్లారు ‘’.అన్నయ్య జీవితం వడ్డించిన విస్తరి ‘’అయినదని తమ్ముడు తెలుసు కొన్నాడు .తానూ అలా కావాలని ఆలోచించాడు

          తమ్ముడి భార్య తోడి కోడలి దగ్గర విషయం అంతా సేకరించి భర్తకు చెప్పి పొరుగూరికి వెళ్లి సాధించ మని బోధించింది .అతను అలానే వెళ్లాడు .అన్నకు జరిగి నట్లుగా నే అతని అన్నం మూటలో పళ్ళెం కని పించింది .అందులో భోజన పదార్ధాలు సర్వం ఉన్నాయి అన్నయ్య వాటిని ఇక్కడే తిని తప్పు చేశాడని భావించి తిన కుండా ,ఆకలి తో ఇంటికి చేరాడు .మర్నాడు వూరి వారందర్నీ భోజనానికి పిలిచి పళ్ళానికిపూజ చేసి ఒక్కొక్కరి పళ్ళెం ముందు పళ్ళాన్ని బోర్లించి తిరగేస్తున్నాడు .అందరి తో గోవింద స్మరణ చేయిస్తున్నాడు .కాని పళ్ళెం నుంచి భోజన పదార్ధాలున్న విస్తళ్ళు రాలేదు .హతాశు డై పోయాడు .  .అయితే ఇద్దరు మంగలి వాళ్ళు మాత్రం పళ్ళెం నుంచి  వచ్చారు .ప్రతి వాడిని పట్టు కొని వద్దన్నా విన కుండా ఆడా మగా తేడా లేకుండా బుర్రలు గొరిగి వదులుతున్నారు .పారి పోయేవీలు లేని పరిస్తితి లో వాళ్ళున్నారు .కనుక ఒకే పనిని ఒకే విధానం లో ఇద్దరు చేసినా ఫలితాలు ఒకే రకం గా ఉండవని అర్ధం అవుతోంది .మనం చేసిన మంచీ ,చెడు మన ఉన్నతికి, అధోగతికి కారణాలవుతాయి అని మర్చి పోకూడదు .అదృష్ట వంతుల్ని చెరిచే వారు ,దురదృష్ట వంతుల్ని బాగు చేసే వారు లేరు

                ఇంకో కధ తెలుసు కొందాం .ఒక పేదయువకుడు దేవుడు గుడి లో పూజారి పెట్టిన ప్రసాదాలు తింటూ గుడి అరుగు మీద రాత్రుళ్ళు నిద్ర పోతూ కాల క్షేపం చేస్తున్నాడు .ఒక రోజు రాత్రి అలానే నిద్ర పోతుంటే ధన లక్ష్మి కలలో కన్పించి ‘’నీ దగ్గిరి కి వస్తాను ‘’అన్నది .అతడికి విరక్తి ఎక్కువ .ఏమీ సమాధానం చెప్ప లేదు .మళ్ళీ కని పించి వస్తాను అంది .దానికి అతడు ‘’తల్లీ ! వస్తానంటున్నావు .మంచిదే .ఎప్పుడు వెళ్లి పోతావో కూడా చెప్పు ‘’అన్నాడు అప్పుడు లక్ష్మీ దేవి ‘’నీ భార్య ఒక రోజు తెల్ల వారు ఝామున తల విర బోసుకొని ,పని వాళ్ళు లేరు ,చేసే వాళ్ళు లేరు బాధ్యత లేదు అని తిట్టు కుంటూ మేడమెట్లు దిగే రోజున నేను వెళ్లి పోతాను ‘’అని చెప్పింది .మెలకువ వచ్చి ,నవ్వు కుంటూ లేచాడు యువకుడు .కాల కృత్యాలు కూడా తీర్చు కొ కుండా నడిచి వెళ్లి పోతున్నాడు .తిన్నగా రాజు గారి అంతఃపురం చేరి ,కావలి వారెవరు లేక పోయే సరికి రాణీ గారి తల్పం మీద అప్పుడే నిద్ర లేచి కూర్చున్న మహా రాణిని చూశాడు .అమాంతం ఆమె ను కౌగలించు కొని  గట్టిగా పట్టు కొన్నాడు .ఆమె పెనుగు లాడుతూ అరుస్తోంది .రాజు గారు పరిగెత్తు కొచ్చి వాడిని నరక టానికి కత్తి పైకెత్తాడు .ఇంతలో రాణి  పడుకున్న మంచం మీంచి కాల సర్పం కింద పడింది .దాన్ని రాజు చంపి ,తన రాణిని రక్షించి నందుకు యువకుడి పై జాలి కలిగి కనక ఆసనం పై వాడిని కూర్చో బెట్టి కనకాభి షేకం చేశాడు రానీ తో సహా .అతని పై కృతజ్ఞతా భావం కలిగింది .మంచి అమ్మాయిని వెదికించి పెళ్లి జరి పించాడు .అన్ని భోగాలు వారికి రాజు సమ కూర్చాడు .కాని యువకుడు తనకున్న రెండు అంగ వస్త్రాలను ,చెంబు ను భోషాణం లో భద్రం గా దాచు కొన్నాడు .కంత కాలం గడిచింది

                        ఒక రోజు అతని భార్య తల విరబోసు కొని మేడ మెట్లు దిగుతూ తనకు కావలసిన వస్తువుల జాబితా అందించింది .తనకు ఈ ఐశ్వర్యం నుంచి విముక్తి లభించే రోజు దగ్గర పడింది అని యువ కుడు తెలుసు కొన్నాడు .నగలను ధనాన్ని మూటల్లో కట్టించి ,పల్లకి ఎక్కించి పుట్టిన ఇంటికి వెళ్లి హాయిగా ఉండ మన్నాడు .ఎందుకో అడగ వద్దు అని శాశించాడు .రాజు గారి భటుడు  వేట రమ్మని  రాజాహ్వానం గా తెలియ జేశాడు .రాజు ,ఈ యువకుడు చాలా సేపు వేటాడి అడవిలో ఒక చెట్టు కింద అలసట చెంది నిద్రించారు .చెట్టు మీద ఉన్న కొంగ రాజు గారిమెడ మీద రెట్ట వేసింది .దాన్ని తొలగించే విధి తనది అని భావించి ,రాజు మొలలో ఉన్న చుర కత్తి తీసి తుడవ బోయాడు .ఇంత లో రాజుకు మెలకువ వచ్చి ,మెడ మీద కత్తి ఉండటం గమనించి తన్ను చంప బోతున్నాడని భావించాడు .యువకుడు ఏదో చెప్ప బోయాడు .విని పించు కొ లేదు .విచారణ జరిగింది .రాజే ప్రత్యక్ష సాక్షి కనుక తీర్పు వెంటనే చెప్పారు శిరచ్చేదం  అని తీర్పు .రాణి  గారు జాలి పడి  అతన్ని విడి ఛి పెట్ట మనికోరారు .అప్పుడు అతను తన భోషాణం లో ఉన్న మూడు వస్తువులను తనకు తెచ్చి ఇప్పించమని కోరి తన కధ అంతా వివ రించాడు .అందరు యువకుని సత్ప్రవర్తన ను గ్రహించారు .కనుక అవ్యక్త పర మాత్మ ఆదేశం మేరకే ,మంచి ,చెడు జరుగు తుంది .మానవుడి భాగ్య రేఖ దీని వెనక ఉంటుంది .అదే దైవీ శక్తి .అందుకే భాస్కర శతకం లో –

   ‘’పూనిన భాగ్య రేఖ చెడి పోయిన పిమ్మట ఎట్టి మానవుమ్దైనను –వాని నెవ్వరు ప్రియంబున బిల్వరు  పలక రెచ్చట న్ ‘’అన్న సూక్తి మర్చి పోరాదు .

        సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ .—7-5-12

         కాంప్ –అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ అమెరికా లో అహోబిలం


                                        అమెరికా డైరీ

                                                             అమెరికా లో అహోబిలం

           నిన్న శనివారం ,ఈ రోజు ఆదివారం అంటే అయిదు ఆరు తేదీలులు సరదాగా గడిచి పోయాయి .నిన్న అంటే మే అయిదవ తేది శని వారం సాయంత్రం అందరం సౌత్ కెరొలినా లో ట్రూహోమ్స్  లో ఉంటున్న రాంకీ ఉషా దంపతుల ఇంటికి అందరం కలిసి వెళ్ళాం .ఇక్కడి నుంచి పావు గంట ప్రయాణం .రాంకీ ఉషా ఇద్దరు ఉద్యోగులే .ఇక్కడికి వచ్చి నప్పటి నుండి బాగా పరిచయం అయినవాళ్ళు .మంచి వాళ్ళు .అంకుల్ ,అంటి అని మా ఇద్దర్ని ఆప్యాయం గా పిలుస్తుంటారు .ఏరి కోరి వాస్తు బాగా ఉందని వీళ్ళందరికీ దూరమైనా అక్కడ  ఇల్లు కట్టించు కొన్నాడు .మూడంతస్తుల ఇల్లు .మూడు గర జులు .విశేషం ఏమిటంటే వాళ్ళింట్లో ఈశనివారం భజన నిర్వహించారు .మామూలుగా వచ్చే సుబ్బు సత్యాలు ,రాహుల్ ,మేము డాక్టర్ సర్వేష్ కుటుంబాలు పవన్ కుటుంబం  ఇంకా వాళ్ళ కు తెలిసిన వారందరూ వచ్చారు .సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిది వరకు భజన బాగా జరిగింది విజ్జి రెండు ,శ్రీ కెత్ రెండు భజనలు బాగా పాడారు .డాక్టర్ గారి భార్య ,కొడుకు, సౌమ్య, సుబ్బు కూతురు ,ఉషా రాంకీ భార్య ఉషా ,పిల్లలు అందరు పాడారు .ఆ తారు వాత అందరికి మంచి డిన్నర్ .పూరీ ,రెండు కూరలు ,ఆవకాయ ,గులాబ్ జాం పులిహోర ,పరవాన్నం  మామిడి పండ్ల ముక్కలు ,పుచ్చ కాయ ముక్కలు ,సాంబారు పెరుగు వగైరాలతో విందు భోజనం .నేను దాన్ని ‘’భారద్వాజ విందు ‘’అన్నాను .అందరు మెచ్చారు .దంపతులిద్దరూ చాలా మర్యాదగా అందర్ని కనుక్కొంటు కోసరి వడ్డించి తిని పించారు .మంచి స్నేహ ,మర్యాద పూర్వక ఆతిధ్యం .

              నిన్న వైశాఖ శుద్ధ చతుర్దశి ‘’శ్రీ నృసింహ జయంతి ‘’.అను కోకుండా నృసింహ జయంతి భోజనం చేశాం .నిన్న చంద్రుడు భూమికి చాలా దగ్గర గా రావటం వల్ల చంద్ర ప్రకాశం మామూలు కంటే సుమారుపది హేను శాతం ఎక్కువ గా ఉంది .ఇంటికి వచ్చేటప్పుడు ఆ వైభవం చూశాం .’’వేయి పడగలు ‘’నవలలో విశ్వనాధ వెన్నెల రేయిని  సుమారు నాలుగు పేజీల్లో అత్యద్భుతం గా వర్ణించాడు .దాన్ని పూర్తిగా  బట్టీ పట్టాను .కాని ఇప్పుడేమీ జ్ఞాపకం లేదు .అంత గొప్పగా వర్ణించాడు మహాను భావుడు అ.అది జ్ఞాపకం వచ్చింది .దాని తో పాటు ఉయ్యూరు లో నరసింహ జయంతి చేసే విధానం ఒక సారి స్మృతి పధం లోకి వచ్చింది .మా మేన మామ గంగయ్య గారింట్లో నరసింహ జయంతి నాడు ఇంటిల్లి పాదీ కటిక ఉప వాసం చేసే  వారు .ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకం ,నృసింహ స్వామికి సహస్ర నామ పూజ .మామయ్య అతి శ్రద్ధ గా చేసే వాడు .మా తాతయ్య నరసింహం గారు కూడా అలానే చేసే వాడు .అంతా మడి  తో ఉండే వాళ్ళు .పూజ అయినతర్వాత అంతకు ముందు రోజున ఆహ్వానించిన వారందరికి పానకం ,వడ పప్పు మామిడి పండు ,తాటాకు విసన కర్ర, తాంబూలం లో పెట్టి ఇచ్చే వారు .వేసవి కాలం కనుక దాహానికి పానకం .,విసన కర్ర తాపోప శమనం .అప్పుడు అందరు వెళ్ళిన తరువాత వండుకొన్న పిండి ని అందరు భోజనం చేసే వారు .దాని లోకి వంకాయ పులుసు పచ్చడి ,లేక కంది పచ్చడి నంజు కొని ,పెరుగు పోసుకొని తినే వారు .అదే భోజనం .మర్నాడు ఊరిలో కొందరిని పిలిచి భోజనం పెట్టె వారు .మేము ఎలాగూ తప్పదుకదా .ఉదయం పద కొండు గంట లకే భోజనాలు .వాళ్ళందరూ నరా సింహ స్వామి ఉపాసకులు .మంగళ గిరి తరచు వెళ్లి వస్తుండే వాడు మామయ్య .అలాగే ఉయ్యూరు పుల్లేరు కాలువ చివర ఉన్న చెరుకు పల్లి శాస్త్రులు గారు అసలు పేరు లక్ష్మీ నరసింహ శాస్త్రులు గారు ముందు రోజే అందరి ఇళ్లకు వెళ్లి నరసింహ జయంతి ప్రసాదం తీసు కోవటానికి రమ్మని పిలిచే వారు .వారు వృద్ధులైతే వారబ్బాయి శ్రీ రామ మూర్తి ,భార్యా వచ్చి పిలిచే వారు .వారింటి లోను సాయంత్రం దాకా ఉపవాసం ,పూజా అభిషేకం జరిగేవి .తర్వాతా అందరికి పానకం వడ పప్పు మామిడి పండు విసన కర్ర, తాంబూలం ఇచ్చే వారు .మర్నాడు దాదాపు ఊరి లోని బ్రాహ్మణు లందరికి భోజనం .షడ్ర సోపెతం గా పెట్టె వారు .మరీ మరీ వడ్డించే వారు .నృసింహ జయంతి అంటే ఆ రెండు రోజులు ,ఆ రెండిళ్ళు మనసు లో మెదలక తప్పవు .ఆ అనుభవం ఇక్కడ రాంకీ వాళ్ళ ఇంట్లో దక్కిందని ఆనందించాం .అమెరికా లో ని మెక్సి కన్లు మే అయిదు ను గొప్ప పండుగ గా చేసు కొంన్టారు .చాలా వైభవం గా నిర్వహించు కొంటారు. బంధు మిత్రులను ఆహ్వానించుకొని విందు చేసు కొంటారట .ఈ విషయం రాంకీ భార్య ఉష తెలియ జేసింది .రాంకీ కుటుంబానికి సరస భారతి ప్రచురించిన ‘’శ్రీ హనుమ కధా నిది ‘’,’’మా అక్కయ్య కవితా సంపుటి ‘’,శృంగేరి వారి పంచాంగం ఇచ్చాం .మేమిద్దరు వచ్చి నందుకు చాలా సంబర పడ్డారు .

                           ఈ రోజు వైశాఖ పూర్ణిమ ఆది వారం .బుద్ధ పౌర్ణమి గా అన్న మా చార్య జయంతి గా జరుపు కొంటాము .ఇవాళ ఉదయం జగదీశ్ ,లక్ష్మి దంపతుల ఆహ్వానం పై మేము వాళ్ళింటికి వెళ్ళాం .శ్రీ హనుమ కధా సంపుటి ‘’వారికి ఇచ్చాను .ఈ రోజు వారింట్లో ‘’అహోబిలమఠంస్వాములు’’ తిరు మంజనం ‘’జరి పారు .ఆ పీఠానికి చెందిన ఇక్కడి స్వాములు రాత్రే వాళ్ళింటి కి వచ్చి నిద్రించి మూర్తులను తెచ్చి ఉదయం స్నానం ,సంధ్య లను మడి  తో నిర్వహించి శ్రీ కృష్ణుడి కి అభిషేకం చేశారు .నలుగురు స్వాములు వచ్చారు .వారంతా ఇక్కడ పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారే .జహోబిల జియ్యర్ మతావ లంబులు .అంటే విశిష్టాద్వైత మతావలంబులు .భగవద్రామానుజుల శిష్య పరం పర వారు .అసలు విషయం ఒకటి ఉంది . శ్రీ శంకర జయంతి నాడే శ్రీ  రామానుజ జయంతి కూడా .పంచె లను  గోచీ పోసు కొని కట్టు కొని ఊర్ధ్వ పుండ్రాలు ధరించి శుచి ,శుభ్రం లతో వారే వంట చేసి .ప్రసాదాలనూ చేశారు .ఇంత పధ్ధతి తో అమెరికా లో అహోబిల స్వాములు అంత నియమ నిష్టలతో ఈ కార్య క్రమాన్ని జరిపించటం చాలా ఆశ్చర్యం గా ఉంది . .జగదీశ్ కూడా గోచీ పోసి పట్టు బట్ట కట్టి నడుముకు అన్గోస్త్రం బిగించారు .భార్య లక్ష్మి కూడా తమిళ దేశం లో పెద్ద ముత్తైదువులు కట్టినట్లు గా పట్టు బట్ట కట్టింది .పిల్లలు సాంప్రదాయ వేష ధారణ లో ఉన్నారు ..వచ్చిన పాతిక కుటుంబాలలో ఇరవై కుటుంబాలు తెలుగు వారే .అందరు చక్క గా తెలుగు మాట్లాడుతున్నారు .ఆనందం వేసింది ఆడ పిల్లలు  కూడా కీర్తనలను శ్రావ్యం గా పాడి ముగ్ధుల్ని చేశారు .విష్ణు సహస్ర నామ పారాయణం సామూహికం గా స్త్రీలు చేశారు .స్వాములు లోపల పూజ చేశారు .తెర అడ్డం గా ఉంచారు .ఆ తర్వాత శ్రీ కృష్ణ అష్టోత్తర పూజ చేశారు .తిరుప్పావై చది వారు .హారతి ఇచ్చి ‘’పల్లాండు పల్లాండు పలు వావిరి ‘’అన్నది చది వారు .అందరికి తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు .వెన్న ను నైవేద్యం పెట్టి ప్రసాదం గా అంద జేశారు . వారు మళ్ళీ తమ దేవుళ్ళను జాగ్రత్త గా వెండి భరిణ లలో దాచు కొని అన్నీ సర్దు కొన్న తర వాత అందరికి భోజనాలు వడ్డించారు దేవుళ్ళను తాక కుండా దగ్గర గా చూసే వీలు .ఫోటోలు తీసే సౌకర్యం కల్పించారు .అందరికి పంక్తి లో వడ్డన చేశారు ..అంటే అందరం కిందే కూర్చుని భోజనం చేశాం .అలా సాంప్ర దాయాన్ని తు .చ .తప్పకుండా పాటిస్తూ చేసింది అహోబిల మఠానికి సంబంధించిన స్వాములు .అంటే ఆహోబిలాన్ని ,అక్కడి వారికి  అర్చా ,కైంకర్య .,అభిషేక పూజా వైభవాన్ని ఇక్కడ నార్హ్ కరోలినా లో సంప్రదాయ బద్ధం గా కన్నుల పండువు గా చేసి తరింప జేశారు .జగదీశ్ దంపతులు చాలా భక్తీ శ్రద్ధల తో నిర్వ హించారు .ఆడ వాళ్ళు అందరికి వడ్డించారు .చక్ర పొంగలి ,పులిహోర రెండు రకాలు కూరలు , బీన్స్ కూర ,దోస కాయ పచ్చడి ,అన్ని రకాల పండ్ల ముక్కలు ,అన్నం కీరుపాయసం  సాంబారు ,పెరుగన్నం ,వడియాలు పొంగలి లల తో మంచి భోజనం పెట్టారు .అందరు అది మహా ప్రసాదం గా భావించి కళ్ళకద్దు కొని తిన్నారు .అందరి లోను ఒక పవిత్ర లోకం లో విహరించిన అను భూతి పొందారు. దాదాపు నలభై మంది విందు లో పాల్గొన్నారు .అందరికి మర్యాద పూర్వకం గా ,గౌరవ పురస్సరం గా లక్ష్మి దంపతులు ఆదరించారు .వీరిద్దరిని  మేము వచ్చి నప్పటి నుంచి తరచూ కలుస్తూనే ఉన్నాం .నేను కూడా పంచె ను గోచీ పోసికట్టి తెల్ల చొక్కా వేసుకొని వెళ్లాను .చాలా మంది కొత్త వాళ్ళు ఇక్కడ పరిచయం అయారు .అందరు ఇంత కలుపు గోలు తనం గా  ఆప్యాయం గా  కలిసి మాట్లాడుకోవటం భోజనాలు చేయటం గొప్ప అను భూతినిచ్చింది .దేశం కాని దేశం లో భాషా భేదాలను విడిచి సోదర భావం తో అందరు చేరటం అభిలష నీయ విషయం .పీఠం వారు నెలాఖరుకు ఇంకో చోట ఇంకో రాష్ట్రం లో కార్య క్రమం నిర్వ హిస్తారాట.ఇలా అమెరికా అంతా పర్య టించి ప్రజల వద్దకు తమ ఇష్ట దైవాన్ని తీసుకొని వచ్చి తరింప జేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు .అందుకే అహోబిలం వారు చేస్తున్న ఈ కార్య క్రమం ‘’అహో !ఓహో !’’అన్నట్లుంది .వచ్చిన ముత్తైదువు లందరికి జాకెట్ పళ్ళు చేతి నిండా ఇచ్చి పంపారు .మా ఇద్దరికీ నమస్కారం చేయాలని భావించి కుర్చీల్లో కూర్చో బెట్టి లక్ష్మి ,జగదీశ్ దంపతులు నమస్కరించి అక్షింతలు వ్వేయిన్చుకొన్నారు .పిల్లలతో కూడా  చేయించి మాతో గ్రూప్ ఫోటో తీయిన్చుకొన్నారు మమ్మల్ని అమ్మా నాన్న ల్లా గా గౌరవించటం వారి సంస్కారం .. .

                   ఇంటికి వస్తుంటే దారి లో ఒక పొలం లో ‘’పిక్ యువర్ స్త్రా బెర్రీస్’’అనే బోర్డు ఉంది .మేమందరం ఆ పొలం లో దిగి ఆ తాజా పండిన పళ్ళను కోసుకొని డబ్బు ఇచ్చి తెచ్చు కొన్నాం .పిల్లలు ముఖ్యం గా పీయుష్ పండిన పండ్లను కోయటం లో దిట్ట అని పించాడు .నాకు చెప్పి, పండిన వాటినీ కోయించాడు .మొత్తం మీద వీకెండ్ బాగా గడిచింది .,రాంకీ ఇంట్లోను ,జగదీశ్ వాళ్ళ ఇంట్లోవిందు లతో  అహోబిల  సందర్శన తో నూ.

                     మీ —గబ్బిట.దుర్గా ప్రసాద్ —6-5-12

                      కాంప్ –అమెరికా  

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

సత్య కధా సుధ—1

   సత్య కధా సుధ—1

       ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను  ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న ఏమి చేస్తుంటాడు?ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళే రాజు దగ్గ్గరకు రావాలి .చెప్ప లేక పోతే శిరచ్చేదమే .అదీ చాటింపు .దేశం లోని పండితులు జ్ఞానులు ,భక్తులు ,సన్యాసులు అందరు విన్నారు .కానీ శిక్షను  ను చూసి ఎవరు సాహసించి వెళ్ళ లేక పోయారు .

             చివరికి ఒక సన్యాసి మాత్రం అన్నిటికీ తెగించి రాజు దగ్గరకు వచ్చాడు .తాను ప్రశ్నలకు సమాధానం చెబుతానని ,శిక్ష విషయం కూడా తెలుసు నని విన్న వించాడు రాజుతో .సరే నన్నాడు రాజు .దైవ విషయం పై చర్చ కనుక ఒక దీపారాధన తెప్పించమని ,నైవేద్యానికి ఒక గ్లాసు పాలు కావాలని కోరాడు .అలానే ఏర్పాటు చేశారు .సమాధానం చెప్పమని రాజు తొందర పెడుతున్నాడు .అప్పుడు సన్యాసి రాజుతో ‘’నువ్వు అడిగే వాడివి నేను చెప్పే వాడిని కనుక నేను ఉన్నతాసనం మీద కూర్చో వాలి ,నువ్వు శిష్యుడైనందు వల్ల కింద కూర్చోవాలి అన్నాడు .ఇది ఉపదేశ నియమం ‘’అని చెప్పాడు  సన్యాసి .రాజు అంగీకరించి అలానే చేశాడు .సింహాసనం మీద కూర్చొని రాజును ప్రశ్నించ మని అడిగాడు సన్యాసి .రాజు మొదటి ప్రశ్న ‘’దేవుడున్నాడా “’?అని అడిగాడు .సన్యాసి పాల గ్లాసు ను చూపించి ‘’ఈ పాలలో వెన్న ఉందా?’’అని ఎదురు ప్రశ్న వేశాడు .ఉందని రాజు సమాధానం చెప్పాడు .చూపించమన్నాడు సన్యాసి .పాలను తోడేసి చిలికితే కాని వెన్న రాదు అని రాజు సమాధానం చెప్పాడు .అప్పుడు సన్యాసి ‘’భగవంతుని గురించి నిరంతర చింతన ఉన్న వాళ్ళ కే ఆయన కని పిస్తాడు ‘’అని సమాధానం సంతృప్తిగా చెప్పాడు .

           రాజు ‘’దేవుడు ఎటు చూస్తాడు ?’’అని రెండో ప్రశ్న వేశాడు .సన్యాసి సమాధానం చెప్ప కుండా ‘’ఈ దీపం ఎటు చూస్తోంది ?’’అని ప్రశ్నించాడు .అన్ని వైపులకూ చూస్తోందని రాజు సమాధానం .వెంటనే సన్యాసి ‘’దీపం లాగానే దేవుడూ అన్ని దిక్కులకు చూస్తాడు ‘’అని సమాధానం చెప్పాడు .తృప్తి చెందిన రాజు మూడో ప్రశ్న ‘’దేవుడు ఏం చేస్తుంటాడు?అని అడిగాడు . సన్యాసి ‘’రాజా !నువ్వు ప్రభువువు.నువ్వు ఇప్పుడు కింద కూర్చున్నావు .నేను సాధారణ సన్యాసిని .సింహాసనం మీద కూర్చున్నాను .అలాగే భాగ వంతుడు కింది వాణ్ణి పైకి పై వాణ్ని కిందా కు మారుస్తుంటాడు ‘’అని సమాధాన మిచ్చాడు .రాజు పరమానందాన్ని పొందాడు  .అప్పటి నుంచి ఆ రాజు భగవంతుని పై అనన్య భక్తిని కలిగి ధన్యుడు అయాడు  .

          జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు ‘’సుఖావ బోదార్ధం ఆఖ్యాయికాఖ్యానం ‘’అన్నారు .అంటేగహన మైన వేదాంత విషయాలను బోధించ టానికి ,తేలికగా అర్ధం ఆవ టానికి కధలు అవసరం అని చెప్పారు .

             దైవీ శక్తి అనంతం .అర్ధం చేసుకోవటం మనకు మించిన పని .ఈ విషయాన్నే ఒక సంస్కృత మహా కవి అందమైన శ్లోకం లో చెప్పాడు .

         ‘’అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే –సుర తరు వర శాఖా లేఖినీ పత్రముర్వీ –

         లిఖితి యది గృహీత్వా ,శారదా సర్వ కాలం –తదపి తవ గుణా నా మీశ పారం నయాతి ‘’

     భావం –కాటుక పర్వతాన్ని తెచ్చి ,సముద్రం లో వేసి సిరా తొట్టె గా మార్చి, కల్ప వృక్ష శాఖను కలంగా తీసుకొని ,భూమి నంతా రాయ టానికి  వాడు కొని ఆ సరస్వతీ దేవి సర్వ కాలాల్లో ను రాస్తున్నా, భగ వంతుని గుణాలు తరగటం లేదట .అంటే ఆమె తరం కాలేదు అని అర్ధం .ఇదీ దైవీ గుణ విభూతి .ఎంత చెప్పినా తరగని గని .

   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-12.

            కాంప్-అమెరికా

Posted in రచనలు | Tagged | 4 Comments

అన్నమాచార్య జయంతి


                                అన్నమాచార్య జయంతి

       క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి  1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర  గా వస్తోంది . ఎల్లుండి ఆరవ తేది ఆదివారమే అన్నమయ్య  588 వ జయంతి .అన్నమయ్య గా అందరి మనస్సు లను ఆకర్షించిన వాడు .అన్న మయ్య పదాలతో ,సంకీర్తనల తో ఆ పరమ పాదుడుడైన శ్రీ వెంకటేశ్వర  కళ్యాణ వైభవాన్ని కనులారా చూసి ,మనసారా పాడి ఆయనకే పారవశ్యాన్ని కలిగించిన భక్త కవి .ముప్ఫై రెండు వేళ సంకీర్తనలను రచించినా  ,కాల గర్భం లో అవి చేరి ఇప్పటికి పద్నాలుగు వేలు మాత్రమే దక్కాయి, నిలిచాయి .తాళ్ళ పాక నుండి బయల్దేరి తిరుమల చేరి స్వామి వారి భక్తుడై నాడు .తలి దండ్రులు ఇక్కడ ఉన్నాడని తెలుసు కొని ఇంటికి తీసుకొని వెళ్లి వివాహం చేశారు .వైవాహిక జీవితం ఆయన భగవద్భక్తికి ఏమీ ఆటంకం కల్గించ లేదు .పైగా దోహద పడి శృంగార కీర్తనలు రాయటానికి మార్గం సుగమం అయింది .రాసిన వన్నీ శ్రీ వెంకటేశ్వర పాదాలకు అర్పించిన పుష్పాలే  అని భావించాడు అన్న మయ్య .ఇతర దేవతల పైన రాసినా అందరి లో ఆ కలియుగ వైకుంఠ వాసుడి నే దర్శించాడు .

                 భక్తీ తో పదకవితా వర్షమే కురిపించాడు అన్నమయ్య .తనతో ఆ శ్రీనివాసుడు మాట్లాడినట్లు ,పాట పాడి నట్లు ,ఆడినట్లు పరవశించి పదాలు కూర్చాడు .స్వీయ అనుభవం లో రాసినవి కనుక పరమ పవిత్రం గా భావ స్పోరకం గా నిలిచాయి .పదాలలో తన లోని లోపాలను ఎత్తిచూపు కున్నాడు .అంటే తనను తాను ప్రక్షాళనం చేసు కొన్నాడు అన్న మాట.  పుఠం పెడితేనే బంగారం స్వచ్చమైనది గామారదు .అలా పరమ భాగవతోత్త ముడు గా మారాడు .స్వామికీ తనకు అభేద్యం లా వ్యవహరించాడు . తానే శ్రీనివాసునిగా ,ఆయనే తానుగా భావించి లీన మై తరించిన కవి వరేణ్యుడు అన్న మయ్య .ఆ దేవ దేవుడే తన సర్వస్వం గా భావించి ,ఆ లీలా విభూతి ని వేనోళ్ళ ఆదిశేషుని లా పొగడి ధన్యమైన వాడు .తనకు మిత్రుడు, బంధువు ,మంత్రి ,మార్గ దర్శి .భవ సాగరాన్ని దాటే నావా అన్నీ ఆ బాలాజీ ఏ.ఆయనే తనకు శరణాగత రక్షకుడని తలచాడు తలపోశాడు పదాల్లో .అడుగడుగునా ఆ స్వామి పరమ విభూతిని గానం చేసి తరించాడు

                        అన్నమయ్య రాసిన పదాలను పదాలని ,సంకీర్తనలని అంటారు .అందు లో భక్తిని రంగారించినవీ ,శృంగారాన్ని ఆర బోసినవీ రెండు రకాలు .భక్తీ సంకీర్తనలలో భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక భావ ఉన్నతిని చాటి చెప్పాడు .భక్తీ ,ఇహజీవితం పై విరక్తీ రెండిటి ఆవ సరాన్ని పదాల్లో నిక్షిప్తం చేశాడు .’’భక్తీ కొలది వాడే పరమాత్ముడు ‘’అని పాడాడు .ఎంత భక్తీ కి అంతటి ఫలం .ఎన్నో భావాలకు ,లోనైనాడు .దారి తెలియక తిరిగానని చెప్పు కొన్నాడు .ఎప్పుడు జ్ఞానోదయం కలిగి జ్ఞాన భాస్కర ప్రకాశాన్ని పొందు తానో నని ఆవేదన చెందాడు .సర్వ సంగ పరిత్యాగం చేయాలని అనుకొంటే ఈ బంధనాలేమిటి ,ఈ ఐహిక వాంచలు ఏమిటి  ,ఈ సంసారఝాన్జ్హాటం ఏమిటి అని వితర్కించు కొన్నాడు .’’కలకాలము నిట్టే కాపురపు బతుకాయే’’అని మధన పడ్డాడు .తిరుమల లో స్వామి వారికి జరిగే నిత్యోత్సవ ,వారోత్సవ ,పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమయ్యకు గొప్ప అవకాశం కల్పించాయి .వాటిని ప్రాతి పదిక గా తీసుకొని స్వామి మహాద్వైభావాన్ని కన్ను లారా దర్శించి పాడి మనకు ఆ ఆనంద భాగ్యాన్ని కల్పించాడు .భౌతికా నందం తో పాటు మానసికా నందం కల్గించాడు .ఆలయ ఉత్స వాలు తన భావ పరం పరాకు చిహ్నాలుగా వాడు కొన్నాడు .ప్రతిదీ పరవశించి రాశాడు .ఆ అనుభూతి ని మనకూ కల్పించాడు .’’అలర చంచల మైన ‘’అన్న పదం లో డోలోత్సవం వర్ణింప బడింది .ఆ రచనా ,సంగీతం వింటే ఉయ్యాలా లూగు తున్నట్లే ఉంటుంది .అది స్వామి వారి ఉయ్యాల కాదు మనమే ఊగుతున్న భావం .అది మానసిక దోలాన్దోలనమే అని స్పురిస్తుంది .

          అన్నమా చార్య శృంగార కీర్తనలు భగవంతుని పై ప్రేమ ,భక్తీ ,భగవద్రతి  కోరుకోవటం తో పరి పుష్టమైనాయి .అందులో తన తరఫునా ,ఇతర భక్తుల తరఫునా ఆ భావనా పరం పర ను పంచాడు .అనుభవైక వేద్యం చేశాడు .రక్తి లోని ఉత్క్రుష్టత మనకు కన్పిస్తుంది .’’అలరులు కురియగా ఆడే నదే ‘’అన్న కీర్త న లో అలివేలు మంగమ్మ సౌందర్యో పాసన దర్శనం కన్పిస్తుంది .’’పలుకు తేనెల తల్లి ‘’లో అమ్మ తనకు ఇచ్చిన లాలన ,ప్రేమ ,వాత్సల్య ప్రోత్సాహాలు కన్పిస్తాయి .సర్వ సమర్పణ భావం జ్యోతక మవుతుంది .

                 సంకీర్త న లలో పల్లవి అను పల్లవి నాలుగు చరణాలు సాధారణం గా ఉంటాయి .అందులో ఉత్కృష్ట సాహిత్య సుగంధం  వ్యాపించి గుబాళిస్తుంది  .చిన్న తిరుమలా చార్యులు అన్నమయ్యను ‘’పద కవితా పితామహుడు ‘’అన్నాడు .అన్నమయ్యకు ముందే ఇతర భాషల్లో పదాలున్నాయి .శ్రీ పాద రాయ స్వామి ,ఆయన ముందు తరం వారు కన్నడం లో పదాలు రచించారు .ఆ ప్రభావం అన్నమయ్య పై పడింది .అందుకే పద కవితను తన భక్తీ భావ ప్రకటనకు ఎన్ను కొని ,కూర్చి ‘’ తెలుగు పద కవితా రచన కు ఆద్యుడు ‘’అని పించు కొన్నాడు .నిజం గా ఎన్నో ప్రతి బంధకాలు నియమాలు ఉన్న పదాలను  రాయటం చాలా కష్ట మైన పనే .దాన్నే ఇష్టం గా ,నల్లేరు మీద బండి లా

కదం తొక్కించి తెనుగు మాగాణం లో పదాల పంటను పుష్కలం గా పండించాడు. అందులో కవిత్వాన్ని పాటను పొందు పరచి విశిష్టత ను చేకూర్చాడు . .సెహభాష్ అని పించుకొన్నాడు .అనితర సాధ్యం గా రచించి పద కవితా పితా మహుడనే బిరుదు ను సార్ధకం చేసు కొన్నాడు .మనకు పున్నేపు వెలుగు ను అందించాడు .అచ్చ తెనుగును అర్ధ వంతం గా ప్రయోగించి ,మాటల సృష్టి కర్తా అయాడు .ఆయన పోనిపోకడ లేదు .పలు భంగుల పద కవితను కదను తోక్కిమ్చాడు .

   అన్నమయ్య సంగీత జ్ఞానం గురించి మనకు తెలిసింది చాలా తక్కువే .ఆయన సాహిత్యాన్ని ఏదో విధం గా కాపాడు కొన్నా ,ఆయన సంగీతాన్ని  కాపాడు కొ లేక పోయిన దురదృష్ట వంతులం.ఆయన సంగీతానికి వ్రాత పూర్వక ఆధారాలేమీ లేవని విజ్ఞులు చెబుతున్నారు .తర తరాలుగా సాంప్రదాయ బద్ధం గా నిలిచి నదే మనం ఇప్పుడు పాడు కొంటున్నది .సాల్వ నరసింహుడు పదాలను రాగి రేకుల మీద చెక్కించిన వాటిల్లో రాగం గురించి ప్రస్తావన ఉండి .కాని తాళం సంగతి అది ఏ సంగీత స్వభావానికి చెందిది అన్న విషయాలు లేవు అని దాని పై పరిశోధన చేసిన వారు చెప్పుతున్నారు .దాస కుటుంబ సాహిత్యం లాగా అన్నమయ్య సంగీతం నిక్షిప్తం చేయ బడక పోవటం విచారకరం అంటారు వాళ్ళు .అయితే అన్నమయ్య సంగీత సర్వస్వాన్ని ,సారస్వత సర్వస్వాన్ని మధిస్తే అన్నమయ్య కు  అన్నీ తెలుసు ననే నిర్ధారణ కు వచ్చారు. పదాలు భగవారాధనకే అని ,దానికి సంగీతం అను సంధానం అని అన్నాడు అన్నమయ్య .ఆయన పదాల్లో సంగీతం కంటే సాహిత్యం విప రీతం గా ఆకర్షిస్తున్దంటారు విశ్లేషకులు ..ఆయనవి వంద రాగాలున్నాయట ..అందులో సౌరాష్ట్ర గుర్జరి ,అబలి ,అమర సింధు అనే రాగాలు చాలా అరుదైనవి .ఇప్పుడు అవి వాడకం లో లేవట .ముఖారి ,శంకరాభరణం ,దేవ గాంధారి ,ఆయన తర్వాతా చాలా మార్పులకు లోనయ్యాయట .

అన్నమయ్య పదాలను  రేడియో ద్వారా బహుళ వ్యాప్తి కల్గించిన వారు స్వర్గీయ మల్లిక్ .ఆ తరువాతే మిగిలిన వారు .మల్లిక్ తో పాటు వారందరికి  వినయాంజలి .

              ఇలా వైశాఖ పౌర్ణమి నాడు అన్నమయ్య జయంతి ,బుద్ధ జయంతి లను జరుపు కోవటం తెలుగు వారి అదృష్టం . ఈ రెండిటి పై రాసే భాగ్యం కలగటం నా అదృష్టం .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-12.

             కాంప్—అమెరికా .
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?

    వైశాఖ పౌర్ణమి

              ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక జయంతి అని ,ఆ తరువాత వచ్చే శ్రావణ పౌర్ణమి ని జంధ్యాల పూర్ణమి లేక రాఖీ పౌర్ణమి గా జరుపుకొంటాం .వైశాఖ పౌర్ణమి ని బుద్ధ పూర్ణిమ గా భావిస్తారు .అన్నమయ్య జయంతి కూడా ఈ రోజే కావటం యాదృచ్చికం .ఇది ఎల్లుండి అంటే మే ఆరవ తేది ఆదివారం .

              శాక్యముని గా, ఆసియా  జ్యోతి గా, అహింసా మూర్తి గా, కరుణా సింధు గా ,ప్రేమ నిలయునిగా ,విశ్వ జ్యోతి గా పూజింపబడే ,ఆరాధింప బడే గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు ,జ్ఞానోదయాన్ని పొందిన రోజు ,మహానిర్యాణం చెందిన రోజు వైశాఖ పౌర్ణమి అవటం చాలా గొప్పగా ఉంది .అందుకనే బౌద్ధ మతావలంబులకు వైశాఖ పౌర్ణమి పరమ పవిత్ర   మైనది .ఈ రోజు విశిష్టతను తెలుసు కొందాం .శుద్ధోదన మహారాజు కుమారు డైన సిద్ధార్ధుడు ప్రాపంచిక సుఖాన్ని రోసి ,మనసు ను దిటవు పరచుకొని ,భార్యా ,పిల్లవాడిని రాజ్యాన్ని వదలి ఆత్మా జ్ఞాన సముపార్జనకు బయల్దేరాడు .దాదాపు ఎనిమిదేళ్ళు శరీరాన్ని అతి కష్టాల పాలు చేసి కొని శారీరకం గా బాగా బలహీనుడై పోయాడు .నాలుగు ఏళ్ళు ‘’సమాన ‘’స్తితి లో అంటే నడకే తప్ప ,ఆహారం ఏమీ తీసుకో క పోవటం  కటిక ఉపవాసం తో గడి పాడు .అప్పుడు బీహారు రాష్ట్రం లో గయకు దగ్గర ప్రవహించే ‘’నిరంజన నది ‘’దగ్గరకు తనతో బాటు వస్తున్నా అయిదుగురు యాత్రికు ల తో పాటు చేరు కొన్నాడు .చాలా బలహీన  పడి,శల్యా వసిస్తుడై, ప్రాణాలు గాలిలో కలిసి పోయే స్థితి  లో ఉన్నాడు.అ నది లో ఎప్పుడూ మోకాలు లోతు నీరు సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది .ఇప్పుడు ఆ నది సరస్వతి మొదలైన  కొన్ని నదుల  లానే  అంత రించి పోయింది .కని పించదు . ఆ నది ని దాటే ప్రయత్నం చేశాడు సిద్ధార్ధుడు .బలహీనుడై పోవటం వల్ల అడుగు కూడా ముందుకు వెయ్య లేక పోయాడు .అప్పుడు అనుకో కుండా ఒక ఎండు చెట్టు కొమ్మ కొట్టుకు వస్తు, కని పించింది .దాన్ని పట్టు కొని కొన్ని గంటలు  నీటి లో ,ఆ ప్రవాహ ఉద్ధృతి లో ఉండిపోయాడు .కాళ్ళు తడ బడుతున్నాయి .మానసిక పరిశోధన చేయాలను కొన్న తనకు ఈ పరీక్ష ఏమిటి ?అను కొన్నాడు .తన ప్రయత్నం లో ఏదో లోపం ఉందని పించింది .ఇది తెలియగానే అనుకోకుండా కొంత  కొత్త శక్తి శరీరం లో చేరి నట్లని పించింది .ఆ శక్తి తో నిరంజన నదిని దాటాడు .అలసటగా ఉన్నందున అక్కడ ఉన్న బోధి వృక్షం కింద కూర్చుండిపోయాడు .తనకు జ్ఞానోదయం కలిగే వరకు అక్కడి నుంచి కదలను అని ఒక వేళ కలుగక పోతే మరణమే శరణ్యం అని ప్రతిజ్ఞా చేశాడు .

                      శరీరం లోని సర్వ శక్తుల్ని కేంద్రీకరిస్తేనే సాధానా ఫలం లభిస్తుందని తెలుసు కొన్నాడు .+అది పొందటానికి ఒక్క క్షణం చాలు .లేక పోతే యుగాలైనా  సరి పోవు .దీన్నే సామన అనే సాధన గా భావిస్తారు .అంతే –అది వైశాఖ పౌర్ణమి రోజు  .పూర్ణ చంద్రుడు ఆకాశం లో వెన్నెల కురి పిస్తున్నాడు .ఆ క్షణం లో గౌతమునికి అకస్మాత్తు గా జ్ఞానోదయం అయింది .వింత కాంతి శరీరం అంతా ఆవహించింది .ముఖం వెలుగులు చిమ్మింది .కొన్ని గంటలు ఆ నిశ్చేతన స్థితి లో గడి పాడు .తరువాత లేచి నిల బడ్డాడు .తనతో ఉన్న తోటి ప్రయాణీకులతో ‘’భోజనం చేద్దాం ‘’అన్నాడు మొదటి సారిగా నోరు విప్పి .వాళ్ళు ఆశ్చర్య పోయారు .గౌతమునికి ఏదో అయిందని భావించారు .ఆహారం కోసం తహతహ లాడుతున్నా డేమో నని భ్రమ పడ్డారు .వారి భావాన్ని గ్రహించిన తధాగత బుద్ధుడు ‘’మీరు పోర  బడ్డారు .నేనన్నది ఉపవాసానికి సంబంధించింది కాదు .ఎరుక ఫలితం ,జ్ఞానోదయ విశేషం .దాన్ని స్వీకరిద్దాం అని నా ఉద్దేశ్యం ‘.ఈ వైశాఖ పౌర్ణమి రోజున వెన్నెల కురుస్తుండగా నాలో ‘’జ్ఞాన పూర్ణ చంద్రోదయం ‘’అయింది . నాలో వచ్చిన మార్పు ను గమనించండి .’’అని వివరించాడు .వారికేమీ అర్ధం కాక ,ఆయన ప్రాణానికి ఆయన్ను వదిలేసి, తమ దారి తాము చూసుకోవటానికి వెళ్లి పోయారు .కొన్నేళ్ళ తర్వాత బుద్ధుడు వారిని వెతుక్కొంటూ సారనాద్ చేరి వారిని కలుసు కొని తన ధర్మాలను వివరించి జ్ఞానోదయం కల్గించి   శిష్యులుగా  స్వీకరించాడు .2600 సంవత్సరాలు అయినా   ఇంకా ఆ మహాను భావుడైన బుద్ధుని భగవానుని గా ప్రపంచం అంతా కోలుస్తూనే ఉంది .ప్రపంచ శాంతికి ఆయన బోధన లే  శరణ్యం గా భావిస్తోంది .  

                                                      బుద్ధుడు అంటే ఎవరు ?

   జాగృతి ,ఎరుక .లేక జ్ఞానోదయం ను పొందిన వాడిని బుద్ధుడు అంటారు .అజ్ఞానం అనే నిద్ర వదిలించుకొని జ్ఞానం అనే ప్రకాశాన్ని పొంది ,సకల వస్తు జాలం యొక్క నిజ స్వరూపం తెలిసిన వాడే బుద్ధుడు .దోషరహితుడైన వాడు ,మానసిక నిషేదాలకు అతీతుడు బుద్ధుడు .గౌతమ బుద్ధుని కంటే ముందు చాలా మంది బుద్ధులున్నారు .భవిష్యత్ లోను ఉంటారు .బుద్ధునికి తెలియనిది ఏదీ ఉండదు .భూత ,భవిష్యత్ ,వర్త మానాలను ఒకే సారి చూడ గల ప్రజ్ఞ అతనికి ఉంటుంది .పరిమితి లేని భూత దయ ,కారుణ్యం ,ప్రేమా ఉన్నవాడు బుద్ధుడు .పక్ష పాతం లేకుండా అందర్ని హృదయానికి ఆప్యాయం గా హత్తు కొనే వాడు బుద్ధుడు .

      బుద్ధుడు జీవులను ఉద్ధరించే కార్యక్రమాలను నిర్వహిస్తాడు .బుద్ధుని ప్రభావం వల్ల క్రూర జంతువులూ కూడా తమ క్రూర స్వభావాన్ని వదిలి సాధువులు గా మారి పోతాయి .బుద్ధుడు ఆధ్యాత్మిక గురువు గా ఉండి విశ్వ జనుల మానసిక పరి పక్వత ను పెంపొందిస్తాడు .ఆచార్య నాగార్జునుడు చెప్పి నట్లు బుద్ధుని సాయం  పొందని జీవి లేనే లేదు. .బుద్ధుని దయా ,సానుభూతి ,అనుకంప ,ప్రేమ ,కరుణ లు మాటల , చేతల పరిధి ని దాటి ఉంటాయి .బుద్ధుని జ్ఞానం ,పరిపూర్ణత ,శక్తి వర్ణనా తీతం .మనం ఒక వస్తువు ను ఎంత స్పష్టం గా కళ్ళతో తో చూడ గలమో ,బుద్ధుడు అయిన వాడు  ఈ విశ్వాన్ని అంతటిని, అంత స్పష్టం గా చూడ గలడు.ఇతరులకు ఏది మంచిదో ఆయనకు పూర్తిగా తెలుసు .దానినే అప్పటి కప్పుడు ఆయన చేస్తాడు .దాని కోసం ముందస్తు ప్రణాళిక ఆయనకు ఉండదు .సూర్యుడికి వేడి నివ్వటం ,ప్రకాశాన్నివ్వడం అన్న ధర్మం ఎంత సహజమో ,బుద్ధునికి ప్రేమ ,కారుణ్యం,దయా, సహాయం అంత సహజాతాలు .పరోప కారమే బుద్ధుని శ్వాస.

                                           గౌతమ బుద్ధుని బోధనలు

       మనసుకు శిక్షణ నివ్వటానికి బాహ్య నియమాల కంటే అంత రంగిక నియమాలకే విలువనివ్వాలి ,వాటి పైనే ఆధార పడాలి అన్నాడు బుద్ధ భగ వానుడు .పని చేయటానికి పరిస్థితులు అనుకూలించాలి అని తాత్సారం చేయరాదంటాడు .మనం మనకు వ్యతి రేకం గా ఉన్న పరిస్తితులను కూడా అనుకూలం గా మార్చుకొనే సమర్ధత ఉన్న వాళ్ళం అని గ్రహించాలి .పరిస్థితులను మార్చాలనే ప్రయత్నం లో మునిగి పొతే ,ధర్మా చరన  అసాధ్యమవుతుంది అన్నాడు శాక్యముని .ఆ ప్రయత్నం లో ధ్యానం పై మనసు నిలవదని హెచ్చ రించాడు .సమయమూ వృధా అయి కోరికలకు అంతు లేకుండా పోతుంది .ఈ క్షణమే మనకు అనుకూలం ,పవిత్ర మైనది అన్న భావన తో పని చేయాలి .వచ్చిన ,చేతి లో ఉన్న అవకాశాన్ని దుర్విని యోగం చేసు కోరాదు.భౌతిక సంపాదనే ధ్యేయం కాదు .ధనం చేరితే సమస్యలూ పెరుగు తాయి .జీవిత పరమార్ధం నిర్వాణమే .ధర్మా చరణ వల్లనే ఇది సాధ్యం .మనసు అదుపు లో ఉంటె ,అన్నీ మన వశం అవుతాయి అని స్పష్టం గా చెప్పాడు భగవానుడు .

             ధర్మం అంటే పరి పూర్ణత .బుద్ధ బోధనలు అనుసరిస్తే స్వీయ రక్షణ ఏర్పడుతుంది .ధర్మా  చరణ అంటే ఉత్కృష్ట మాన వ జీవనమే .భౌతికాభి వృద్ధి కాదు .అంత రంగ పరి పూర్ణత సాధించటమే .మానశిక శాంతి ,ఆనందం పొందటమే .పూర్వకాలం లో బుద్ధులందరూ అతి నిరాడంబర సామాన్య జీవితాన్నే గడి పారు .వ్యతిరేక పరిస్థితుల్లో జీవించారు .అయితే బుద్ధ బోధనలను ధర్మాన్ని పాటించి సుఖ ,శాంతులను పొందారు .గౌతమ బుద్ధుని బోధలను అనుసరించితే బాహ్యా ,ఆంతరంగిక శాంతి సౌఖ్యం లభిస్తాయి .ఆదర్శ జీవన విధానం వల్ల ఇవి సాధ్యమవుతాయి .

                     ఒక సారి బుద్ధుడు ‘’కల్మా నగరం ‘’లో విహరిస్తుంటే ,ప్రజలు ఆయన్ను కలిసి ‘’చాలా మంది గురువులు చాలా విషయాలు చెబుతున్నారు .అవి పరస్పర విరుద్ధం గా ఉన్నాయి .ఒకదానికొకటి పొంతన గా లేవు .మేము దేన్నీ పాటించాలో పాలు పోవటం లేదు .దయ చేసి మార్గ దర్శకం చేయండి ‘’అని వేడు కొన్నారు .దానికి బుద్ధ భగ  వానుడు ప్రశాంత చిత్తం తో పది సూత్రాలు చెప్పాడు .ఒకటి –చాలా సార్లు చెప్పారని ,రెండు –గ్రంధాల్లో ఉన్నాయని ,మూడు –గురువు చెప్పాడని ,నాలుగు –చుట్టూ ఉన్న వారు చేస్తున్నారని ,అయిదు –అందులో అలౌకిక శక్తులున్నాయని ,ఆరు –మీ నమ్మకానికి సరిగ్గా ఉందని ,ఏడు –ఆలోచనకు సరైనదిగా కని పించిందని ,ఎనిమిది –సంఘం లో గౌరవ నీయ వ్యక్తులు బోధించారని ,తొమ్మిది –గురువు అదే సత్యం అని గట్టిగా పడే పడే చెప్పాడని ,పది –దాన్ని సమర్ధించ టానికి లేక ఎదురు తిరగటానికి అని –నమ్మ వద్దు .మీ అనుభవానికి ,ఆలోచనకు ,వివేకానికి ,నీకు ,సమాజం లో అందరికి ఉప యోగా పడుతుందని అనుకొంటే నే నమ్మి ఏదైనా ఆచరించు ‘’అని అతి స్పష్టం గా తధాగతుడు మార్గ  నిర్దేశం చేశాడు .

                ‘’నా బోధలు వేదాంతం కాదు .అవి నా సూటి అనుభవ ఫలితాలు .అవి సాధనకు మార్గం కానీ ఆరాధనకు మార్గం కాదు .నేను చెప్పిందంతా నది దాటే కర్ర పుల్ల అంటే తెడ్డు లాంటిదే .ఒడ్డుకు చేరిన తరువాత ఆ తేడ్డును భుజాన వేసు కొని  మోసుకొని తిరిగితే, వెర్రి వెంగళప్ప అంటారు .శిష్యుడు బంధువు అయిన ఆనంద తో ‘’ఆనందా !నా మీద గౌరవం తో ,ప్రేమ ,అనురాగాలతో ధర్మాన్ని పాటించ వద్దు .అలా చేస్తే నిన్ను నేను శిష్యునిగా భావించను .ఆ ధర్మాన్ని నువ్వు నీ అనుభవం తో జోడించి అనుసరిస్తే సత్యాన్నితెలుసు కొ గలుగు తావు .  .అప్పుడే నువ్వు నాకు నిజమైన శిష్యుడివి అని పించు కొంటావు ‘’అని అతి విష్పస్తం గా ధర్మా చరణ విధానాన్ని విశ్లేషించి చెప్పాడు భగవాన్ బుద్ధుడు .

                   అశాంతి, హింస ,దౌర్జన్యం ,అజ్ఞానం ,అవివేకం ,మానసిక దౌర్బల్యం పెచ్చు మీరి అశాంతి తో అలమటిస్తున్న నేటి  సకల మానవాళి కి బుద్ధుని బోధలు రక్షా కవచాలు .బుద్ధ పౌర్ణమి అని పిలువ బడే ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆ అహింసా మూర్తి ని ఒక సారి జ్ఞాపకం చేసుకొనే ప్రయత్నం చేశాను .ఓం శాన్థిహ్ .

                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —4-5-12

                           కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 3 Comments

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )

     ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను తెలియ జేశారు .వివిధ కోణాల్లో విశ్లేషించి నిగ్గూ తేల్చారు ..విషయం ఒక్కటే అయినా ఎవరి చూపు వారిది .అస్త్ర సన్యాసం చేసిన కధకుల్ని మళ్ళీ ప్రోత్స హించి ,తానూ రాస్తూ చాలా మందిని మళ్ళీ లైన్ లో నిల బెట్టారు శ్రీ వేదగిరి రాంబాబు .కధా సరిత్సాగరం లో ఆయన ఒక ఉద్ధృత తరంగం .కధా రచయితలను సంఘటిత పరిచారు. కధా సదస్సు లను నిర్వ హించి ప్రేరణ కల్గించారు . వందేళ్ళ తెలుగు కధా పండుగ కోసం ,రెండేళ్ళ నుంచే అన్ని ప్రాంతాలలో కధా సదస్సులను నిర్వ హించి చైతన్యం తెస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాం బాబు గారికి ఇదే పని .తాను నిద్ర పోలేదు .కధకుల్ని , చదువరు లను  నిద్ర పోనీయ లేదు .కధే ఊపిరిగా జీవిస్తున్నారు .మాధ్యమాలు కూడా మంచి ఊతం ఇచ్చాయి .చట్రం లో బిగించినా విస్తృత పరచటానికి దోహదం చేశాయి .పెద్ద కధ నుంచి ,చిన్న కధ ,పేజీ కధ ,కాలం కధ ,కార్డు కధ ల పరిణామం మనం  అందరం చూశాం .గొలుసు కదల విన్యాసం చూశాం .నేల విడిచి సాము చేసిన కధలేవీ మిగల్లేదు .తాత్కాలికోద్రేకం నిలబడదు.  .శాశ్వత విలువలున్న కధలు వేలాదిగా రాక పోయినా పదుల సంఖ్య లో నైనా వచ్చి ఆణిముత్యాలని పించు కొన్నాయి .రేడియో ,దూర దర్శనులు తెలుగు కధకు వెన్ను దన్ను గా నిల బడ్డాయి .మంచి కధలను విని పించినాయి . బుల్లి తెరకు ఎక్కించాయి .. .ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆ రెండు మాధ్యమాలకు తెలుగు కధా ప్రియులు జేజేలు పలుకు తున్నారు .ఉత్తమ కధలకు పత్రికలూ గొప్ప పురస్కారాలను అంద జేస్తున్నాయి .ప్రత్యెక కధా సంచికలనూ ప్రచురించటం విశేషం .మూస కధలు మూల పడుతున్నాయి .కధా ,కదన బలం ఉన్నవి హృదయాలను చేరుతున్నాయి .మువ్వన్నె కధలు రెక్కలు తోడుక్కున్తున్నాయి .ఇది శుభ పరిణామమే అయితే ఇంకా విస్తృత పరిధి లో కధలు రావాలి .

                    ఇప్పటికీ కధకు ,కధానిక కు తేడా ఏమిటో సంతృప్త కరం గా నిర్వచింప బడ లేడు .’’ముడి వజ్రం కధ ,సాన బెడితే కధానిక ‘’అన్నది అందరికి నచ్చింది .రెండు పేర్ల తోనూ పిలుస్తున్నాం .ఇబ్బందేమీ లేదు  కని  పించదు.అమెరికా .యూరప్ దేశాలకుమేధోవలస ఎక్కు వై పోయింది .తొలి తరం వారికి తెలుగు భాషా సాహిత్య సాంప్రదాయాలతో పరిచయాలు ఇంకా ఉన్నాయి .రెండో తరం వారిలో బాగా తగ్గు ముఖం పడితే తర్వాతి తరాలకు ఆ వాసనే తెలీటం లేడు .ఇది ఒక పెద్ద సమస్య గా వారే బాగా బాధ పడుతున్నారు .వీటిని ఆధారం చేసుకొని ఇప్పుడు కధలు రావాల్సిన అవసరం ఉంది .కార్పోరేట్ సంస్థలు దివాలా తీస్తున్నాయి .వీటి ప్రభావం జన జీవితం మీద ఎలా ఉందొ కొన్ని కధలు వచ్చినా వైవిధ్యం గా రావాలి .సైన్స్ ,సాంకేతికత తెచ్చిన మార్పులను కవన శర్మ ,వంటి వారు కొద్దిగా రాసినా ఇంకా అనుభవ పూర్వక  కధా స్రవంతి రావాలి .అంత రిక్ష పరిశోధన ,,గ్రీన్ హౌస్ విషవాయువులు ,తెచ్చే ఇబ్బందులు  ,ఇప్పుడు కధల్లో జీవం పోసుకోవాలి .ఇది తక్షణ కర్తవ్యమే .అత్యాధునిక ‘’గూగుల్ ఎర్త్ ‘’ల ప్రయోజనం ఎంతో ,వాటి చేటు ఏమిటో దేశాల అంతరంగిక భద్రత కు అవి ఎలా పెను సవాళ్లు గా మారుతున్నాయో ఆలోచింప జేసే కధలు రావాలి .రాయమని ప్రోత్స హించాలి కూడా .మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం కల ల ప్రయోజనం, అవి భవిష్యత్ తరాలకిచ్చే సందేశం ,గురించి విస్తృత మైన కధా రచన జర గాలి .అమ్మ కానికి ఇక ఉన్న భూములన్నీ అయి పోయాయి .మిగిలింది నదులు ,సముద్రాలే .ఈ ప్రమాద ఘంటిక లను కధల్లో మోగించాలి యువ రచయిత లంతా .

                 గీసుకొని కూర్చున్న వలయాలను దాటి చూపు ఊర్ధ్వం గా, ఉన్నతం గ  సాగే బావాల వ్యాప్తి రావాలి ..ఏది రాసినా మానవీయ కోణాలను మరిచి పోరాదు  .ఆర్ద్రత శిఖరా రోహణం చేయాలి .మేధ కు  పదును పెట్టినా ,గుండెను హత్తు కోవాలి .అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ ,మూలాలను జ్ఞప్తికి తెస్తూ భావ పరిధి ని పెంచే కధలు రారావాలి .పదేళ్ళ కోసారి కధా మూల్యాంకనం జరగాలి .మనం పోతున్న దారి ఎటో సమీక్షించు కోవాలి .ఉత్తమ సంస్కారాన్ని బోదించి  ,ఇరుకు గదుల భావ ఆవరణాలు దాటి విశాల హృదయ గవాక్షాలు తెరిచి సంస్కారాన్ని అందించాలి కధకులు .ఇది బాధ్య త గా వారంతా భావించాలి .అప్పుడే కధలు సీమాంతర ప్రస్తానం చేసి ధ్రువ తారలు గా నిలిచి పోతాయి .సమాజ జీవన చిత్రణ చేస్తూ సమకాలీనం నుండి ,సార్వ కాలీనం వరకు భవిష్యత్ కధా ప్రస్తానం సాగాలి ‘’.సంస్కృతి జీవన విధానమే .పరి పూర్ణత కోసం చేసే ప్రయత్నమే సంస్కృతి .’’ అన్నాడు పండితుడు ఆర్నోల్డ్ .’’ఈశ్వరుని పిత్రుత్వాన్ని ,మానవుల సోదరాత్వాన్ని ,ఉత్తమ సాహిత్యం ప్రబోధించాలి ‘’అన్న టాల్స్టాయ్ తాత మాటలు ముత్యాల మూటలే.దీన్ని మరచి పోకుండా కధా రచన సాగితే అవి సార్వ కాలీనం గా నిలుస్తాయి .

            వాస్తవ చిత్రణ మంచిదే .కాని ఆదర్శ ప్రకాశం ఉండాలి .మళ్ళీ తెలుగు కధ ఒక వెలుగు వెలగాలి .రాసి కంటే వాసి కి ప్రాధాన్యమివ్వాలి .మన కధకుల కధా రచన’’ శత ధార ‘’.వారు తలచు కుంటే విశ్వ కధా వీధి లో తెలుగు కధ వెన్నెల వెలుగులు నింపి జగజ్జేగీయ మానం గా నిల బడుతుంది .శిల్పం అనల్పం గా ఉంటె కధకు స్థాయి వస్తుంది .’’the greatest writer is not who does the best ,but who sujjests the most ‘’అన్న ఫ్రెంచ్ రచయిత అభిప్రాయం అందరు గుర్తించాలి ‘’.మంటి నుండి మింటికి  ప్రయాణించే మానవుడిని ఉద్ధరించ గల ఉత్తమ శక్తి  సాహిత్యానికే ఉంది ‘’. ‘’time past ,and time future are perhaps present in time present ‘’అన్నాడు ప్రముఖ ఆంగ్ల కవి ,రచయిత ,విమర్శకుడు  ఇలియట్ .’’ప్రాత కొత్తల కౌగిలింతల ప్రసవ మగు బంగారు కాంతులు ‘’రావాలని దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి ఆశయం మనందరిది .తెలుగు కధ ‘’శతమానం భవతి దాటింది .సహస్ర మానం లో అడుగు పెట్టింది’’.అభ్యుదయ మగు గాక .శుభం భూయాత్ .

సమాప్తం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —3-5-12

            కాంప్-అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య మొర్మరాలు

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯
                                                                                                                                                                                                   ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి  పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం  మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత . 
               గల్ఫ్ దేశాల ఆకర్షణ లో పడి ,సర్వం కోల్పోయిన దిగువ తరగతి ప్రజలు ఎందరో .దీనికి ఏ ప్రాంతమూ ,మినహాయింపు కాదు .మబ్బు లో నీరు చూసి ముంత ఒలక బోసుకొన్న వైనం .అప్పు చేసి ,దళారీలను నమ్మి ,అక్కడికి చేరి నీచం గా బతుకుతూ ,వీసాలు లేక తిరిగి రాలేని ,రోడ్లపై అడుక్కొంటూ అలమటించే వాళ్ల కధలు చాలానే వచ్చాయి .”ఎడారి లో కడ చూపు ”కధ ను బృందావన రావు రాసిన మంచి కధ .
హైదరాబాద్ పాత బస్తీ లో అల్లర్లలో కకా విక లైన జీవితాల దర్పణం ,అన్నదమ్ముల్లా ఉండాల్సిన మతాల మధ్య స్వార్ధం కోసం రగుల్తున్న చిచ్చు చూస్తూనే ఉన్నాం .కానిమానవత్వం పరిమళిస్తే ”శత్రు మైత్రి ”సాధ్యం అని రాసిన ముది గొండ శివ  కౌముది కధ కు జోహార్లు .రాజకీయ సామాజిక రుగ్మత-స్వార్ధం .దీనికి మందు లేదు .కాని మనసుంటే మార్గం ఉండక పోదు .నేత పని వారల మూగ బాధలను చిత్రించిన కధలూ చాలా వచ్చాయి .ఈ ”పోష్ కల్చర్ ”లో ఆడమగ,విద్యార్ధుల ,ఉద్యోగుల విశృంఖలత్వాన్ని ఎండ గట్టె కధలూ వెలిశాయి .మానవ సహజత్వాన్ని,మనిషి నిజాన్ని పట్టు కోని ఎస్వీ కృష్ణ ”వ్యసనం ”,”ఇంధనం ”,కనువిప్పు ”,కధలను మలిచాడు .ఆత్మాభిమానాన్ని గొప్ప వరం గాచూపించాడు .తలిదండ్రులు తొక్కిన మార్గం లో పిల్లలూ నడిస్తే అది మంచి అయితే మంచిదే.చెడు అయితే మాత్రం ప్రమాదం .అలాంటి కధే ”పుత్ర దేవోభవ ”.ఎంత సంపాదించినా తృప్తి ఉండదు .ఇంకా కావాలనే తపన .అప్పుడు ,ఇప్పుడు ,ఎప్పుడు ఇదే పరిస్థితి .తనలో తృప్తి ని చూసు కో లేని వాళ్ళు ,ఎక్కడా తృప్తి చెందరని  ,పొందలేరని రమణ కుమార్ రాసిన కధలు బోధిస్తాయి .ఆత్మ తృప్తి ,నిజాయితీ ,మంచితనం ,మమ కారం అన్నీ విలువైనవే .అవి బోధించే కధలన్నీ మంచి కి బాటలు వేసేవే .
సున్నిత మానవ హృదయ స్పందనలను అల్లం రాజయ్య ,ఉప్పల నరసింహం ,రఘూత్తమా రెడ్డి ఉత్తమ కధలుగా రాశారు .వీటిల్లో ఆర్ద్రత అంతర్వాహిని గా ప్రవహించటం విశేషం .జీవన విలువలను డబ్బు తో నిర్ణయించటం బాధా కారం .స్త్రీల జీవన సంఘర్షణ లను సత్యవతి, యశోదా రెడ్డి చూపించి ,స్త్రీ తనను తాను గౌరవించు కొంటె ,అందరి జీవితాలు వెలుగుతాయి అని బోధించారు కధల్లో .శ్రమ జీవుల కు వ్యతి రేకం గా నడిచే రాజకీయాలను గొల్లల సంఘటిత శక్తినీ తెల్పే కధలు వచ్చి వారిని చైతన్య పరిచాయి .ఎక్కువ జీతాలకు ,సౌఖ్యాలకు ఆశ పడి కార్పోరేట్ ఉద్యోగాలకు పోతే తనను తాను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పే కధలను సత్యవతి రచించారు .ఈ జీవితాలలో స్నేహానికి ప్రాధాన్యత లేక పోవటం ,ఒంటరి గా మిగిలి పోవటం ,లను గొప్పగా చూపించారు .ప్రపంచీకరణం లో నలిగి పోతున్న మనుషుల కధలన్నీ పెద్దింటి అశోక్ కుమార్ ,రాశారు .మనిషి అంత రంగం లో రాక్షసుడు ఎప్పుడూ ఉంటాడు .వాడు లేస్తే ప్రమాదం .తాత్కాలికం గా లేచినా నిద్ర బుచ్చితేనే తనకూ ,సంఘానికి మేలు .పాల కొడేటి కధల్లో అద్దె గర్భ ధారణ సమస్యను చక్కగా వివరించాడు .కుటుంబం ,వైవాహిక జీవితాలను పునరుద్దరించు కోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు .”నగ్న సత్యాలను ఏకరువు పెడితే అది డాక్యు మెన్ట రి అవుతుంది . దాన్ని కళాను గుణం గా రాస్తే మంచి కధ అని పించు కొంటుంది ”అన్నాడు ప్రఖ్యాత కధకుడు బుచ్చి బాబు ..digniti  of  labour  ,నేత్రదానం అవసరం ,తల్లి పిల్లల సెంటి మెంట్ ను హైటెక్ యుగం లో మనం మర్చి పోతున్న సంప్రదాయాలను,పండుగలను యెన్.ఎస్.యెన్.మూర్తి తన కధల్లో గుది గుచ్చారు .వంగూరి చిట్టెన్ రాజు ,అమెరికా లోని ఆంధ్రులు ,అక్కడ తెలుగు వాళ్ళ జీవనామ్శాలను చిత్రించే కధలు విరివిగా రాశారు .నిడదవోలు మాలతి పత్రికా నిర్వహణను అమెరికా నుండి చేస్తున్నారు .సామాజిక అంశాలతో తమిరిస జానకి వీరాజి ,కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ .శిలా వీర్రాజు ,బులుసు జి,ప్రకాష్, సులోచన కధలకు పదును పెడుతూనే ఉన్నారు .పోతుకూచి సాంబశివరావు తోమ్భాయ్యో పడి లో కూడా నిత్య్త్సాహం గా కధా రచన చేసి మార్గ దర్శకులు గా ఉన్నారు .మంజుశ్రీ పోతుకూచి ఆ తరానికి ,ఈ తరానికి గొప్ప వారదులే .కదాసేతువు ను నిర్మించారు .నిరంతరం గా లోపలా బయటా జరిగే సంఘర్షణ లను అనిసెట్టి శ్రీధర్ అద్భుత శైలి లో కధా రూపం చేశాడు. ఓల్గా వంటి అగ్ని కణాలు తమ భాష లో స్త్రీ పట్ల మొగ్గు చూపే ,ఆమె వెన్నంటి ఉండే కధలెన్నో రాశారు .బలహీన వరాల కోసం ,అంతే అలహీనం గా ఇల్లు కట్టే కాంట్రాక్టర్ ,కోళ్ల ఫాం లో కోళ్ళకు స్వేచ్చ లేనట్లు ,తనింట్లో తనకూ స్వేచ్చ లేని లీల” స్పృహ” కధ లో ఆలోచన రేకెత్తిస్తుంది .సం .వే.రమేష్ రాసిన ”ప్రళయ కావేరి కధలు” ,ఆ ప్రాంత జనాల సామాజికామ్శాలే  ప్రతీకలే .ఎందరో ఇలాంటి కధకులున్నారు .జనం కోసం జీవించే వాళ్ళు .
.          సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-02 -05 -12 .
కాంప్ —అమెరికా 
Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –8

                              వందేళ్ళ తెలుగు కధ –8

               పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా భావం వస్తుంది .అనీ  దామ్పత్యమే అయితే ,గట్టి బంధం అనీ సుంకోజీ దేవేందరా చారి కధ ‘’తను –నేను ‘’లో తెలియ జేశారు. టీనేజి లో కాలు జారితే ఎంత ప్రమాదమో ఒక పెద్దాయన చెబితే విని ,ఆకర్షణకు లోను కాకుండా తన జీవితాన్ని కాపాడు కొని ,ఇతరులను ఆ ప్రమాదం నుండి బయట పడేస్తుంది సుందరి మాచి రాజు కామేశ్వర రావు రాసిన కధ ‘’ఆ అమ్మాయి ‘’. లో.మంచి చేసిన వారు ఎంత చిన్న వారైనా గౌరవించాలి ,అభినందించాలి .ఇది సామాజికం గా మన బాధ్యత .అని చెప్పే కధ వరలక్ష్మీ మురళీ కృష్ణ రాసిన ‘’నమ్మకం ‘’.భార్యా భర్తలు అంటే ,పరస్పర నమ్మకం ,గౌరవం కలిగి ఉండటం .భార్య మంచి సలహా చెబితే ఆచరించాలి కాని జెండర్ భేదానికి తావు ఈయ రాదు .ఆమె  చదువు కున్నదీ, ఉద్యోగినీ అయితే ఆమె మాటకు విలువ ఎక్కువే .తమ స్వంత ఊరిని అమెరికా లో సంపాదించిన డబ్బుతో బాగు చేసిన దంపతుల కధ రామా చంద్ర మౌళి రాసిన ‘’గుగులోత్ రమణి ‘’.’’ఊరంతా ఒక కుటుంబం .ఒక అవిభాజ్య వ్యవస్థ .నైతిక విలువలకు కట్టు బడి ,ప్రేమ వాత్సల్యాలతో బంధింప బడ్డ ఒక మానవ సమాజం ‘’అన్న రమణి మాటలు శిరో దార్యమే .అదీ మనం కోరుకొనే సామాజిక స్పృహ .రావలసిన మార్పు ఆలోచనలో ,ఆచరణలో .సాహితీ సేవ చేస్తూ ,అయిన వాళ్ళ తో అనుబంధాలు ,ఆత్మీయతలు పంచు కోవాలని రఘు నందన్ రాసిన ‘’ఇంకా ఉంది జీవితం ‘’కధ తెలియ జేస్తుంది .

         లారీ డ్రైవర్ ఇంటిని వదిలి ,ఎన్నో రోజులు బయటి ఊళ్లలో ఉండాల్సి వస్తుంది .చీకటి తప్పు చేస్తాడు .ఎయిడ్స్ వచ్చి ,కుటుంబానికి దూరమై పోతాడు .మానవ బలహీనత కు అద్దం పట్టిన ఈ కధ ‘’ఈ పాపం ఎవరిది’’ ?నిజం ను ,బ్రిటీష వాళ్ళను మించి దాష్టీకం చేస్తూ ,పోలవరం డాం వల్ల ముంపుకు గురి అవుతున్న జన ఘోష వినని బది రాన్ధక ప్రభుత్వాన్ని ఏది రించ టానికి నిర్వాసితులు ‘’పోటెత్తిన జన సంద్రం ‘’లా గర్జించే సంఘటనే నరసింహా రావు కధ.ఉద్యమ కారుడు కాల క్రమం లో పెట్టుబడి దారు అవటం లోకం లో జరుగుతున్నా తీరే ‘’ఏళ్ళ లన్నీ తుడిచే సీ ‘’కధ .ఇలా సామాజిక స్పృహ ,కర్తవ్యం ,నిబద్ధతా బోధించే కధలే ఇవన్నీ .కావలసినవి అన్నవస్త్రాలు కాని అణ్వాయుధాలు కాదు అని స్పృహ కల్గించే కధలు ఈ మధ్య చాలా వచ్చాయి .సామాజిక స్పృహ ,న్యాయం ప్రజలకు కూడా ఉండాలి .లేక పొతే కాకుల్ని కొట్టి గద్ద లకు పెడతారు .భర్తకు నయం కాని వ్యాధి .చూసే పిల్లలు లేరు .అయినా ఆమె అతన్ని కంటికి రెప్ప లా చూడాలని నిర్ణయించు కొంది .అతను చేసిన తప్పు తెలియ జెప్పి ,క్షమించింది .ఇలాంటి అవగాహన్ ఉండాలని చెప్పిన కధ లు బానే వచ్చాయి .ఏదో చూసి చూడనట్లుగా పోవటం నాక గా బతకటం అందరికి చేత నయ్యె పని కాదు .కాని దాని వల్ల అతను పొందింది నష్టమే .మంచి వాళ్లకు కాలం కాదు ఆపద సమయం లో గ్రామాలను దత్తత తీసుకొని ,ఏదో సాయం చేస్తున్నట్లు నటించే వారినీ ,దళారీలను నిలదీసి ఆహార సామగ్రి కోసం ఎలుగెత్తిన జన ఘోష విని పిస్తాడు జ్వాలా ముఖి ‘’పంజరం యెగిరి పోయింది ‘’కధ లో .ఇది 1977 దివి ఉప్పెన నాటి కధ .

          ప్రజా చైతన్యం రోజు రోజుకూ పెరిగి పోతోంది .సెజ్ ల పేర పేద వారి  భూముల్ని లాక్కొని ,ఏదో చిత్తం వచ్చి నంత వాళ్ళ మొహాన కొట్టి ,బలవంతం గా తీసుకొనే పరిస్తితి పోయింది .భూమికి భూమి కావాలని పట్టు బడుతున్నారు బాధితులు .సాధించు కొంటున్నారు కూడా .ఐకమత్యమే వారికి సాధనం గా ఉంది .భూముల్ని నిల బెట్టు కోవాలంటే ,సునామీలను ,తుఫాన్లను ఎదుర్కొనే దాని కన్నా బలం గా నిలబడాలని .లేకుంటే మట్టి రేణువు కూడా మిగలదు అన్న సత్యాన్ని కాట్రగడ్డ దయానంద్ ‘’మనిషి –మట్టి ‘’కధలో చూపించారు మనుషులు సంఘటితం కాక పోతే కూలి పోవటం ఖాయం .చేసిన అప్పులు తీర్చ లేక రైతు పడే వ్యధ ,కూలి పోయే కుల వృత్తుల గురించి ,’’కంచి మేకలు ‘’కధ లో సిరం శెట్టి కాంతా రావు వర్ణించారు .విత్తనాల మాయా జాలం ,దళారీ మోసాలు ,రైతులకు ,కుల వృత్తులు చేసుకొనే వారికి ఉన్న సంబంధాలను అవి మ్రుగ్యమావు తున్న తీరు ను ప్రసంశాత్మకం గా రాశారు .అక్షర చిత్రీకరణమే చేశారు .ఇవన్నీ మాన వీయ కోణాలను ఆవిష్కరించిన కధలే .’’వ్యవసాయం అంటే రైతు నిరంతరం ప్రక్రుతి తో చేసే సంభాషణ ‘’అన్నాడు ఉదయమిత్ర అనే కధకుడు తను రాసిన ‘’గుప్పెడు మట్టి ‘’కధ లో .ఎట్టి పోతల పధకాలలో ‘’వాన్పిక్ ‘’సమస్య వస్తుంది .కళకళ లాడే పొలాలు కాలుష్యపు మేఘాలై ,రోగాల నిలయాలై ,జన జీవితం ఆస్తవ్యస్త మై పోతుంది .అనే సామాజికామ్శాన్ని జి.వి.క్రిష్నయ్య ‘’పాలరేవు వంతెన ‘’కధ లో తెలియ జెప్పాడు .వెయ్యి  గొడ్లు తిన్న రాబందు  కూడా ఒక్క గాలి వాన కు కూలి పోతుందనే సామాజిక సత్యాన్ని తెలియ జేశాడు .

             దళారీల కోరల్లో మచ్యకారులూ నలిగి పోతున్నారు .రైతుల దగ్గర నుంచి కావలసిన వన్నీ తెచ్చు కొనే వారు .ఇప్పుడు ఆ సంబంధాలన్నీ తెగి పోయాయి .ఎక్కడో ఉన్న గుజరాత్ కు వెళ్లి బాగా సంపాదించు కొని వస్తాడని కొడుకుని పంపితే అక్కడ అతను ఉన్న బోటు పాకిస్తాన్ వాళ్ళ తుపాకి గుళ్ళకు గురైంది .ఉన్నాడో ,పోయాడో తెలీని స్తితి .దీన్ని అద్భుతం గా వర్ణించాడు గురుపాక శివ రావు ‘’కోర్లయ్య’’కధ లో .ఇందులో మచ్యకారుల దీన గాధ కళ్ళకు కడుతుంది .కరువు కోరల్లో చిక్కిన జంతువులూ తిరగ బడుతాయి’’ .స్పెషల్ గ్రాస్ జోన్లు ‘’వద్దు అంటాయి .సరదా గా శాంతి కుమార్ రాసిన కధ ‘’కరువు ‘’లో వ్యంగ్యం ఇదే .’’కరువు గల దేశాన పరువు కే కరువు –పరువు గల దేశాన కరువు కే కరువు ‘’

          ఇక మద్యం సెలఎరుల్లా పారిస్తున్న బెల్ట్ షాపు కధలెన్నో చెప్పలేం ఎన్ని జీవ నదుల కైనా ఆన కట్టలు కట్ట వచ్చు .కాని పారుతున్న మద్యపు నదికి అదే మన అన్న రామా రసో గారి ‘’వరుణ వాహిని ‘’కి మాత్రం ఎవ్వడూ ఆనకట్ట కట్ట లేదు .కనీసం మట్టి కట్ట కూడా కట్టలేం .ఎన్నికలలో ధన ప్రవాహం ,మద్యం జోరు జంట పాయలు గా ప్రవహించి ఓటట్లను ముంచి ఎత్తేస్తాయ్ .విలువలన్నీ డ్రైనేజి పాలవుతాయి .ప్రభుత్వం తన చేతి లో ఉన్న అత్యంత సమర్ధం గా నిర్వహింప బడు తున్న రవాణా సంస్థను ప్రైవేటు పరం చేయాలనే నక్క జిత్తులు చేస్తుంది .దివాలా కూడా తీయిస్తుంది .ప్రైవేట్ రవాణా బస్సులు లేని మంత్రి లేడు .పెట్రోలు సబ్సిడీ కోసం కోటాను కోట్లు అప్పు తెస్తుంది .ఆ సబ్సిడీ విదేశీ కంపెనీల పరమౌతుంది .ఆ సంస్థ లో పని చేసే ఉద్యోగస్తుల ఉద్యోగాలు దిన దిన గండం .కొత్త ఉద్యోగాలు హుళక్కి .దీన్నంతటినీ ఒక విష వలయం గా మార్చింది ప్రభుత్వం . కావాలనే ఇలా చేస్తోంది .సామాన్య వ్యాపారాలను కూడా మల్టీ  చైన్ షాపుల వాళ్ళే చేస్తూ వీరి నడ్డి విరగ గోడుతున్నారు .చిరు వ్యాపారులు చేతులు ఎత్తేస్తున్నారు . .తన షాపును  మల్టీ వాడికి అమ్మి ,అందు లోనే ఉద్యోగం చేసే వాడి కర్మ కాలిన కధే ‘’ఆరోహణ లో ఆవ రోహరణం ‘’.దీన్ని శీలా సుభద్రా దేవి మంచి కధనం తో కొత్త సామాజికామ్శాన్ని చక్కగా చిత్రీకరించింది .

   సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —1-5-12

   కాంప్-  అమెరికా

 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రతిమ- ప్రతీక

 

స్టేట్ లీడర్ పత్రికలో 15 – 4 – 2012 ప్రచురించిన వ్యాసం ప్రతిమ  – ప్రతీక  

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7

  వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7

         కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని తట్టే కధలు అవి .గాంభీర్యాన్ని సంత రించు కొంటాయి .వీరికి మార్కెట్ విలువ బాగా తెలుసు .విదేశాలలో ఉద్యోగాలు దాదాపు వీరివే .కనుక తాపీగా జీవితం సాగి పోతుంది .కధల్లో విలువలను ఆశిస్తారు .మానవ సంబంధాలను కాపాడు కొంటారు .అభ్యుదయం వైపుకు నడక సాగిస్తారు .ఆ తరహా కధలే రాస్తారు .ఇక్కడ ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది .పోలా ప్రగడ ,పెద్ది భోట్ల ,విహారి ,సి.రా .అన బడే సింగ రాజు రామ చంద్ర మూర్తి ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ ,బి.వి.ఎస్.రామా రావు ,జానకీ జాని అని పిలువ బడే సామ వేదం జానకి రామ శాస్త్రి ,భ.రా.గో.జరుక్ శాస్త్రి అయిన జలసూత్రం రుక్మిణీ నాద శాస్త్రి ,మాలతీ చందూర్ ,శంకర మంచి సత్యం ,సోమంచి రామం ,దొండ పాటి దేవదాస్ ,మొదలైన వారంతా జీవితపు విలువలకు అద్దం పట్టే కధా ముత్యాలను అందించారు .మనసుకు ఊరట కల్గిస్తూ ,హాస్య ,వ్యంగ్యాలను సమ  పాళంగా మేళ విస్తు  కధా రచన చేశారు .ప్రగతి ఫలాలను ,ప్రభుత్వం ఇచ్చే తీరును వివ రించారు .స్త్రీ సమస్యలకు సాంత్వన కల్గించారు .గోదావరి ,అమరా వతీ కధల్లో మనిషి లోని సత్తాను ,అతను ఎదగ గల ఎత్తుల్ని ,దిగ జారే లోతుల్ని ,చీకటి లోనూ మిణుకు మిణుకు మంటున్న ఆశా జ్యోతి ని గోదావరి సోగసుల్ని ,కృష్ణమ్మా అంద చందాలను సామాజిక  న్యాయాలను ,అంతఃకరణ లను  ,వైరుధ్యాలను  కాసేపయినా  అన్నీ మరచి ఆనందాన్ని అనుభవింప జేస్తాయి .

                       ఇక ఉత్త రాంధ్ర కు వస్తే ముప్ఫై ఏళ్ళ క్రితమే పోరాటం సాహిత్య స్థాయి పొందింది .గిరిజనుడే కధా నాయకుడైనాడు .వి .ర .సం. ప్రభావం ఎక్కువ .ఇక్కడి ప్రజల జీవన పోరాటాని ఆర్నాద్ ,రామానుజం లు కధలుగా మలిచారు .అయితే రచయితలూ నిర్బంధాలకు గురై నారు .ఇక్కడ రాచరికం చాయలు కమ్ము కున్నాయి .వాటిపై పతంజలి స్పందన కలిగించే కధలు రాశాడు .గత వైభవాన్ని తలచు కొని మురిసి పోయే వారి కధలూ వచ్చాయి .చిద్రమైన పల్లె బతుకుల్ని పంతుల జోగా రావు ,రాసి గుండెల్ని పిండాడు .1985 వరకు ఇక్కడి కధలన్నీ విప్లవానికి పెద్ద పీట వేశాయి .తరువాత వచ్చింది గిరిజనాభి వృద్ధి పధకం .అందులో వారికి చేరేది స్వల్పం .మధ్య మింగేది అనల్పం .రగిలిన గిరిజనులు సామూహక శక్తి తో పోరాటం చేశారు .ఈ కదలని గౌరు నాయుడు అద్భ్తం గా చిత్రించాడు .ఆధునిక వ్యవసాయం ,నకిలీ విత్తనాలు ,పరుగు మందులు రైతుల్ని ముంచే శాయి .పేరుకే ప్రాజెక్టులు కాని నిలిచే నీరే లేదు .ఈ విషయాలపై బమ్మిడి జగదీశ్వర రావు ,గౌరు నాయుడు ,’’గతుకులు ‘’,’’తిరుగుడు గుమ్మి ‘’కధల్లో చక్కగా ప్రతి ఫలింప జేశారు .ఇక్కడి నదులైన నాగావళి ,వంశధార ,జన్జ్హావతి పేరా కధా సంకలనాలు వచ్చాయి .ఆ జన జీవితాన్ని కళ్ళకు కట్టించాయి .పని చేయని పరిశ్రమలు ,సమ్మెలూ ,వృత్తుల సంక్షోభం పై మంచి కధలే వచ్చాయి .ఆది వాసి జీవితాల్లో నాగరకత తెచ్చిన మార్పుల్ని వాళ్ళ సంస్కృతి పొందు తున్న పరి ణామాలు పై ‘’సుక్కి’’ ‘’,గోరపిట్ట ‘’కధల్లో జగదీశ్ చిత్రించాడు .అటవీ సంపదను అందించే  ఇక్కడి భూమి పుత్రులజీవితం లో వచ్చిన మార్పులను ,వాటికి కారణాలను అన్వేషిస్తూ కాళీ పట్నం రామా రావు ,’’అన్నేమ్మ నాయురాలు ‘’అన్న కధను అత్యద్భుతం గా చిత్రించారు .సృజనాత్మక కధ కు ఉత్త రాంధ్ర ప్రాముఖ్యం పొందింది .కమల కుమారి ,కూర్మనాద్ ల కధలు చైతన్యానికీ ,సామాజికంశాలకు ప్రాధాన్యత నిచ్చాయి.

               ఇంతటి సామాజిక స్పృహ తో ,సంఘర్షణ లతో అన్ని ప్రాంతాల నుండి కధలు వచ్చి చేరు తున్నాయి .వీటన్నిటికీ అతీతం గా గత రెండు దశాబ్దాలలో ఒక గొప్ప కధ వచ్చింది .అదే శ్రీ రమణ రచించిన ‘’మిధునం ‘’.ముసలి దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని ఎగతాళి లోని సోగసుల్ని గుండె లోతుల్లో నిండి ఉక్కిరి బిక్కిరి చేసిన అనురాగాన్ని ప్రేమ, ఆత్మీయతల్ని స్వతంత్ర జీవ నాన్ని భార్యా భర్తలకు ఒకరి పై ఒకరికి ఉండాల్సిన అనురాగాన్ని అద్భుతం గా ఆవిష్కరించిన కధ మిధునం .మనో ధైర్యాన్ని గుండె దిటవు ను , ,సమస్యలను అధిగమించటం లో చూపే నేర్పును ,ప్రక్రుతి ఓడి లో జీవించే సోబగును ఈ కధ అద్దం పట్టింది .కధా మాణిక్యం గా విమర్శకులు మెచ్చిన అచ్చ తెలుగు కధ ఇది .శ్రీ బాపు ఈ కధను స్వహస్తాలతో రాస్తే ముద్రణ భాగ్యం పొందిన అరుదైన మా మంచి తెలుగు కధ .మంచి కధకు నిర్వచన మైన కధ .కధా శిల్పానికి మచ్చు .చుక్కల్లో చంద్రుడు లాంటి తెలుగు కధ .ఏ ఇజం లేదు మానవిజమే తప్ప.ఈ కధ రాసి శ్రీ రమణ కధా శ్రీ రమణుడు అయ్యాడు . .ధన్యత చెంది ఆంద్ర చదువరులను ధన్యం చేశాడు .

                  గ్లోబలైజేషన్ పరిణామాలను చిత్రించే కధలూ కొ కొల్లలు గా నే వచ్చాయి . ఆర్ధిక సంబంధాలు తప్ప దంపతుల్లో మమతాను రాగాలు కరువై పోతున్నాయి .’’భవ బంధాలు ‘’కధ లో పేగు సంబంధానికి దూర మై పోతున్న వృద్ధాశ్రమ జీవుల  దయనీయ గాధ కని పిస్తుంది .పిల్లలు వారికి నచ్చిన వారిని చేసుకొనే పరిస్తితి ,భాగస్వామిని ఎన్ను కొనే ఛాయిస్ ,స్థిర  జీవితాన్ని పొందే హక్కు ఉందని భమిడి పాటి జగన్నాధ రావు ‘’మంటల్లో జాబిల్లి ‘’కధ రాశారు .కోస్టల్ కారిడార్ ,హైటెక్ రోడ్లు వల్లధ్వంస మైన పేద నడిమి రైతుల కుటుంబాల కధలను ఖదీర్ బాబు రాస్తే ,గోదావరి తీరం లో ఏమీ చేయ టానికి ఏమీ లేక బతుకీడుస్తున్న బక్క జీవుల గురించి పతంజలి శాస్త్రి రాశాడు . పుస్తకం చదివే అలవాటు లేని వాడు జీవితాన్ని ఏమి అర్ధం చేసుకొంటాడు .అన్న ప్రశ్న వేశారు  తన కధలో చోర గుడి జాన్సన్.బంధనాలు బలహీన మైనా ,తెగితే తప్ప కొత్త ముడి పడదని జాన్సన్ విశ్వాసం .ఆపదలో ఉన్న వారిని ఆదు కోవ టానికి పెద్ద వాళ్ళ మైన మనకు సందేహం,బిడియం ,ఎవరేమను కొంటారో నన్నభయం .పసి హృదయాలకు సాయం చేయాలన్న ఆరాటం ఎక్కువ .అది చూసి సిగ్గు పడుతుంది తల్లి .మల్లీశ్వరి రాసిన ‘’శిశు వాదం ‘’ కధలో . ఎదుగు తున్న పిల్లలు తలిదండ్రుల సంరక్షణ లో ఉండటం అదృష్టం అని కేసిరాజు ఫణి ప్రసాద్ ‘’నిన్నటి వెన్నెల ‘’కధలో చెప్పారు .

   సశేషం —మీ –గబ్బిట durgaa  ప్రసాద్ —-30-04-12.

                క్యాంపు-అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ—ఆశోపహతుల పాలిటి హరి విల్లు -2

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ—carrington cares- ఆశోపహతులు హరి విల్లు

              అమెరికా డైరీ—

ఆశోపహతుల పాలిటి హరి విల్లు –     carrington cares

అమెరికా వచ్చి మూడు వారాలైంది .ఇప్పటి వరకు వారానికి మూడు భోజనాలు ,ఆరు భజనల తో తీరికే లేక పోయింది .అయితే నిన్న అంటే 29 వ తేదీ శని వారం   ఒక దివ్య క్షేత్రాన్ని సందర్శించి అద్భుత అనుభూతి ని పొందాం .అదే ‘’–caarrington cares  ‘’అనే వృద్ధాశ్రమం .అక్కడ సుమారు యాభై మంది అతి వ్రుద్దులున్నారు .వారందరూ వీల్ చైర్ కు పరిమిత మైనవారే .నడవ లేని , కోర్చో లేని , ,గట్టిగా చూడ లేని , ,వినికిడి లేని వారు అందులో చాలా మంది .వారెవరికీ నా అనే వాళ్ళు ఉండి ఉండరు .పని చేసే శక్తి లేని వారు .ఎవరైనా సాయం చేస్తే నే వారు ఏదైనా తిన గలరు .కంప్యుటర్ పని కూడా  ఎవరో సాయం చేస్తే చూడ గలరు .కళ్ళు ఉన్నా  కని పించని వారు ,చెవులున్నా విని పించని వారు కాళ్ళు ఉన్నా  నడవ లేని శక్తి హీనులు .దాదాపు అందరి పరిస్థితీ అదే .ఒకామె అచ్చం గా ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ‘’స్టీఫెన్ హాక్ ‘’లా గా అన్నీ చైర్ లోనే .పాపం మెడ మాత్రం ఆమెకు తెలీకుండా అటూ ఇటు తిరుగు తూ వుంటుంది ..ఇలాంటి ఆశోపహతులు దైవోప హతుల కోసం caarrington  అనే చోట  చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజా సహకారం తో నిర్వహిస్తున్న శరణాలయం ఇది .స్తానిక వాలంటీర్ ల సాయం తో వృద్ధుల సేవ చేస్తున్నారు .వారికి ఏ  కొరతా లేకుండా అన్నీ తామే అయి బాధ్యత గా’ నిర్వహిస్తున్నారు .నాకు యేమని పించిందంటే మానవత్వం కొలువై ఉన్న  దేవాలయం అని పించింది .

‘’ cares ‘’అనే దానికి పూర్తి వివరణ caring and remembering every one special .నిజంగా అంత విధి నిర్వహణ తో వారందరికి అన్నీ తామే అయి వాలంటీర్లు సేవ చేస్తున్నారు .చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య వుంది ఈ ఆశ్రమం .కళ్ళకు ఆనందాన్నిచ్చే రక రకాల రంగుల పూలు .లోపల సకల ఆధునిక  సదు పాయాలతో గదులు .ఆధునిక సౌకర్యాలన్నీ అందు బాటు లో ఉంచారు .మంచి పుస్తకాలున్న గ్రంధాలయం .ఒక పది మంది కూచుని హాయిగా చూసే అవకాశం తో టి.వి..రేడియో .పరి శుభ్రమైన  పరిసరాలు .అర్జెంట్ గా ఏ బాధ వచ్చినా చూసే డాక్టర్లు .అందుబాటు లో అన్ని మందులు .వంట గది .అందులో పని చేసే వంట వాళ్ళు .ప్రత్యెక లాండ్రీ .అపరిశుభ్రత కు తావే లేని ప్రదేశం .కాళ్ళకు కట్లతో, చేతికి పుళ్ళ తో ,అన్ని రకాల అవకరాలతో మనకు మొదట చూడంగానే ‘’అయ్యో ‘’అని పించే సన్నివేశం  .కాని వారందరి ముఖం లో చిరు నవ్వు ,కళ్ళల్లో ఆశా జ్యోతి ,గుండె దిటవు ,మనో ధైర్యం ,జీవించ గలుగు తున్నామనే ధైర్యం ,సమాజం తమకు చేస్తున్న సేవల పట్ల కృతజ్ఞతా భావం వారందరి లో ప్రస్ఫుటం గా కన పడింది .మరణించే  దాకా ఆరోగ్యం గా జీవింప జేయాలన్న సత్సంకల్పం నిర్వాహకుల్లో ఉంది .అంకిత భావం తో సేవా భావం తో మానవ సేవే మాధవ సేవ అనే పవిత్ర ఆశయం తో ,ఇది మనం చేయాలన్న కనీస విధి అన్న ధ్యేయం తో అక్కడి వాలంటీర్లు ఆ వృద్ధ నారాయణులకు చేస్తున్న సేవ చూస్తుంటే వారికి చేతు  లెత్తి నమస్కరించ బుద్ధేస్తుంది.ఒక పవిత్ర దేవాలయం లో ఉన్నట్లని పిస్తుంది అలాంటి గొప్ప అనుభూతి ని కల్పించిన దాని నిర్వాహకుల్లో ఒక రైన వాలంటీర్ ప్రెసిడెంట్ – steve linden man , రెండవ వారైనactivitydirector –robin dieker  కు ఎన్ని ప్రశంసా వాక్యాలు చెప్పినా తక్కువే .అందర్నీ కంటికి రెప్ప లాగా చూసుకొంటున్న వారి దైవీక్రుత మానవ సేవకు ధన్య వాదాలు ,కృతజ్ఞతలు .వారం లో వారికి రోజు వారీ ఇచ్చే మెను అంటే భోజన వివరాలు బోర్డ్ మీద కని పిస్తుంది .

ఈ సంస్థ ను లాభ నష్టాలు తో సంబంధం లేకుండా నిర్వ హించటం ఒక విశేషం .వాలంటీర్ లను దగ్గర లో ఉన్న కమ్యునిటీ నుంచే తీసుకోవటం మరో ముందడుగు .వాలంటీర్స్ అందరు కుర్ర వాళ్ళే .యువతీ యువకులే .వారందరి ధ్యేయం ఈ వృద్ధ దేవతలకు అన్ని రకాల సేవలు అందించటమే .ఈ సంస్థ ను 1994 లో ప్రారంభించి అందరి మన్ననలను అందు కొంటూ సక్రమం గా నిర్వ హిస్తున్నారు .అక్కడ బోర్డ్ మీద వాలంటీర్ అంటే ఏమిటో ,రెసిడెంట్ అంటే ఏమిటో సేవ అంటే ఏమిటో ఖచ్చిత మైన వివ రాలున్నాయి .సేవకు లెవ్వరు ఆ ఆవరణ లో పొగ తాగటం నిషేధం .అవసరానికంటే ఎక్కువ పదార్ధాలు అందజేస్తే ఇంకా వద్దు .సమృద్ధిగా ఉన్నాయని బోర్డ్ పెట్టటం ఇక్కడ ప్రత్యేకం గా కన్పించింది .ఇలాంటి సేవా కేంద్రాలు ఇక్కడ ఎన్నో ఉండ వచ్చు .అయితే ఇంత సమగ్రం గా ఉన్న సేవా కేంద్రాన్ని ,ఇంతటి సంతృప్తి తో ఆశ్రమ వాసులు ఉండటాన్ని చూడటం ఇదే మొదలు నాకు .అందుకే ఈ స్పందన .

అలాంటి పవిత్ర దివ్య క్షేత్రం లో నిన్న మధ్యాహ్నం కాలు పెట్టాం .ఇక్కడి సత్య సాయి సెంటర్ వారు చిన్న పిల్లల తో ఒక ఆంగ్ల నాటికను తయారు చేసి ఆ వృద్ధుల ముందు ప్రదర్శించే అవకాశం తీసు కొన్నారు .పిల్లలు దాదాపు నెల రోజుల నుదీ బాగా ప్రాక్టిస్ చేసి తయారై వచ్చారు .వారి వెంట తలిదండ్రులు కూడా .గీత అనే అమ్మాయి దీనికి దర్శకత్వం వహించింది .మధ్యాహ్నం రెండున్నరకు ప్రార్ధన తో ప్రారంభ మైంది .వృద్ధుల్ని ,ఆసక్తి .ఓపికా ఉన్న వారిని ఒక ముప్ఫై మందిని ముందే వీల్ చైర్ లలో వాలంటీర్లు తీసుకొని వచ్చి కూర్చో బెట్టారు .వారందరిలో ఏదో వింత ఆశ గోచరించింది .పిల్లలు బాగా నే నటించారు .ఆ నాటిక సారాంశం మాటలు చెప్పటం కాదు చేతల్లో మంచి చేయాలి సాయ పడాలి అన్న నీతి .మా మనవడు శ్రీ కెత్  క్రిస్తియన్   ఫాదర్ వేషం వేశాడు .పిల్లలందరూ మన సాంప్రదాయ దుస్తులే ధరించారు .అన్ని భాషల పిల్లలు ఉన్నారు .కొందరు భక్తీ గీతాలు పాడారు .దాదాపు ఒక గంట వారందరికి వినోదం కలిగించారు. ఆ వృద్ధుల కళ్ళల్లో ఆనందం తాండ వించింది .మాటలతో చెప్ప లేని వారు పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టు కొన్నారు .కొందరు షేక్ హాండ్ ఇచ్చారు .కృతజ్ఞతలను కొందరు చక్కగా వ్యక్తీక రించారు .ఇంత మంది  పువ్వుల్లాంటి ,నవ్వుల్లాంటి ,దేవుడి ప్రతి రూపాల్లాంటి ,పవిత్ర హ్రుదయాల్లాంటి చిన్నారు లను చూసి వారందరూ చలించి పోయారు .ఆనంద బాష్పాలు రాల్చారు .మాట పెగలని వాళ్ళు పెదిమలు కదిలించి భావ వ్యక్తీకరణ చేశారు .ఇందరు పిల్ల దేవతల మధ్య హాయిగా ,ఆనందం గా మనస్సు పరవశం చెందేట్లు గడిపాము అన్న భావం వారందరి లో స్పష్టం గా  దర్శించ గలిగాం .వారికి ఎంత సంతృప్తి కలిగిందో ,మాకూ అంతే తృప్తి కల్గింది వారందరికీ మనో రంజనం కలుగ జేసి నందుకు .మా లాంటి వారితో ఆ వృద్ధ నారాయణులు కర స్పర్శ చేసి అభి నందించారు .మేమందరం వారి మధ్య గడి పి నందుకు ధన్య వాదాలు చెప్పారు .మాతో ఫోటో లు తీయించు కొన్నారు .మరుగున పడిన భావా లన్నీ  ఒక్క సారి బహిర్గతమై నాయి మాకూ ,వారికీ . మనసు నిండా నవ్వారు ,కాళ్ళ నిండా చూశారు ,మాలా చేయ లేని వారు గుండె నిండా సంతోషాన్ని నింపు కొన్నారు .వారెవరికి మృత్యు భయం లేనట్లని పించింది .ప్రశాంతం గా దైవ సన్నిధి కి చేరుతాము అన్న ధీమా వ్యక్త మయింది .నిరుడు కూడా ఇలానే సాయి సెంటర్ వారు వచ్చి వినోదాన్ని పంచి వెళ్లారట .దాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు ఒకరిద్దరు .దీన్ని సక్రమంగా నిర్వ హించటం లో సాయి సెంటర్ నిర్వాహకులు సుబ్బరాజ్ ,సత్య ,పవన్ డాక్టర్ సర్వేష్ వగైరా ల కృషి ప్రశంస నీయం.ఈ విధం గా వారానికి ఒకసారో రెండు సార్లో వివిధ సంస్థల వాళ్ళు ఇక్కడికి వచ్చి వారికి మనోల్లాసం కల్గిస్తారట.

ఆశ్రమ నిర్వహణ అంటే ఇలా సేవా ,అంకిత భావాలతో నిర్వహించాలని ఆదర్శం గా చూపిన caarrington cares వారికి మరో మాటు ధన్య వాదాలు అంద జేస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-04-12

క్యాంపు-అమెరికా

 

Posted in అమెరికా లో | Tagged | 4 Comments

రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ

              రాలిన కధా గంధం
  కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం అంటే 2002 మార్చ్ లో భారతీయ సాహిత్య పరిషత్ వారు విజయ వాడ సత్యనారాయణ పురం లోని శిశు విద్యా మందిరం లో  రెండు రోజుల పాటు తెలుగు కధ పై సదస్సు నిర్వహించారు .ఆ సభకు పోలా ప్రగడ వారు ,కసిరెడ్డిగారు ,వంటి దిద్గంతులు వచ్చారు .అప్పుడే ముగ్గురు వ్యక్తులతో నాకు పరిచయం అయింది .ఒకరు గంధం శర్మ గారు రెండో వారు కస్తూరి మురళీ కృష్ణ గారు మూడో వారు సాగి కమలా కార శర్మ గారు .సాగి వారి పరిచయం ”మూసీ ”మాస పత్రిక తో బల పది కొన సాగుతూనే ఉంది .కస్తూరి వారు అప్పుడప్పుడు కస్తూరి పరిమళాలను చల్లుతూ మెరుపు లా మెరిసి వెళ్లి పోయే వారు .ఇటీవలే అంటే మార్చ్ నెలలో ఆయనతో బంధం ”సన్ ఫ్లవర్ వార పత్రిక ”సందర్భం గా బలపడింది .ఆయన చల్ల పల్లి రమ్మని నన్ను పిలవటం నేను వెళ్ళటం ,రచనలు పంపమని కోరటం ,నేను పంపటం అమెరికా వచ్చే లోపే జరిగి పోయాయి .అప్పుడప్పుడు ఫోన్ లో పలక రిస్తూ మెయిల్ రాస్తూ ఉన్నారు .

                 మేము 2002 జూన్ లో అమెరికా వచ్చాం .మళ్ళీ డిసెంబర్ లో ఇండియా చేరాం .ఆ వెంటనే గంధం వెంకా స్వామి శర్మ గారు ఫోన్ చేసి తాను తన కధలను కొన్ని ఒక సంకలనం గా తెస్తున్నానని ,దాని ది.టి.పీ.కాపీ పంపుతున్నానని ,నేను దానికి ముందు మాట రాయాలని అతి త్వర లో పంపిస్తే సంతోషం అనీ చెప్పారు .దాన్ని అందుకొని వెంటనే చదవటం ప్రారంభించాను .ప్రతి వాక్యం ,ప్రతి మాటా శ్రద్ధ గా చదివాను .ఆ రచన లో నాకు మళ్ళీ మధురాంతకం రాజా రాం దర్శన మిచ్చారు .ఆనంద బాష్పాలే రాలాయి .అద్భుత మైన కధలు .ఇది వరకు పత్రికల్లో కొన్ని  చదివినా జ్ఞాపకం లేవు .కొత్త లోకం లో విహరించి నట్లుంది .అప్పటి దాకా ఆయన కధకులు అన్న మాట పెద్ద గా తెలీదు నాకు .వెంటనే దాదాపు ఎనిమిది పేజీల స్పందన రాసి వెంటనే పంపాను .ఆనాడ పడ్డారు .అందిందని ,చాలా బాగుందని మెచ్చారు .అలా మళ్ళీ వారితో పరిచయం ఎనిమిది నెలల తర్వాత ధృఢ పడింది .తరచు ఫోన్లో మాట్లాడుకొనే వాళ్ళం .ఒక్కో సారి అర గంట కు పైనే మాట్లాడే వారు .అంతటి సహృదయత వారికి నాపై ఉండేది ఇంతకీ వారి కధా సంకలనం పేరు ”అమృత హస్తాలు ”.కధా కదన చాతుర్యం కన్నులు చెమర్చే సన్ని వేషాలు అర్ధ వంత మైన సంభాషణలు ,మాన వత్వాన్ని తట్టి లేపిన కధా సముచ్చయం అది నేను పెట్టిన పేరు ”కధా గంధం ”.అలా క్రమంగా హృదయాలు కలిశాయి .వారి శ్రీ మతి గారితోనూ మంచి పరిచయం ఏర్పడింది .ఆమె కూడా వారికి ప్రాణ స్పందనం గా ఉండే వారు .అమృత హస్తాల ఆవిష్కరణ సభకు ఆహ్వానిస్తే వెళ్లాను .అప్పుడే వారి తమ్ముడు యాజ్న వల్క్య శర్మ గారితో పరిచయమయింది గాఢ తా పెరిగింది .”నాయనమ్మ కధలు ”ప్రచురించి పంపారు .అందులోను వారు మానవత్వపు మహోన్నతత్వాన్ని ఆవిష్కరించారు .సేవా భావం మనిషి ని దేవుణ్ణి చేస్తుందని రాసిన కధలు .ఆయన కధలన్నీ జీవితం లోంచి పుట్టినవే .అనుభవ సారాలే .దాని మీదా నేను నా భావాలను రాశాను .ఆనందించారు .”రుక్మిణీ పరిణయం ”కావ్యాన్ని పునర్ముద్రించి పంపారు .దానిపై విపుల మైన వ్యాఖ్యానం రాశాను .పొంగి పోయారు అది తాను ఆరవతరం వాడిగా మాతా మహుల ఋణం తీర్చుకొన్న విధానం .ఉయ్యూరు సాహితీ మండలికి ఆహ్వానించి వారి కధా సరళి గురంచి మాట్లాడించి భార్యా భర్తలకు ఉడతా భక్తీ గా . సన్మానం చేశాను .ఇంకా మా మధ్య దూరం కరిగి పోయింది .కృష్ణా జిల్లా రచయితల సభ లన్నిటి లోను మేము కలుస్తూనే ఉండే వారం .స్నేహ సౌరభాలను వెద జల్లు తూనే ఉండే వారు ..
మూడేళ్ళ క్రితం వారి శ్రీ మతి మరణ వార్త ను గద్గద కంఠం తో ఫోన్లో తెలియ జేశారు .ఎదిచేశారు .శూన్యమే తన జీవితం అన్నారు .వారిని నేను ఒడార్చాల్సి వచ్చింది .అపర కర్మ కు వెళ్లి వచ్చాను .వారి రేడియో కధల విశేషాలన్నీ పూసా గుచ్చి నట్లు చెబుతూ ఉండే వారు .సరస భారతి ఏర్పడి న దగ్గర్నుంచి వారు తరచుగా కార్యక్రమాలకు వచ్చే వారు .కవి సమ్మేళనం లో పాల్గొనే వారు .మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆశీర్వ దించే వారు .
             వారి సలహాతో నాలుగేళ్ల క్రితం విశ్వనాధ మీద పెద్ద కార్యక్రమం నిర్వహించాము .డాక్టర్ మడకా సత్యనారాయణ ..వేయి పడగలు నవలపై బెల్లంకొండ శివకుమారి ఏక వీర పై డాక్టర్ గుమ్మా సాంబశివ రావు కల్ప వ్రుఖం పై చాలా విలువైన ప్రసంగాలు చేశారు . రెండేళ్ళ క్రితం ”పురాణాలు నేటి కాలానికి అవసరమా “‘అన్న విషయం పై సభ జరపమని సలహా నిచ్చి ఆయన ,మడక వారు శివ కుమారి యాజ్న  వల్క్య శర్మ గారు 
, యడవల్లి మనోరమ వచ్చి మరో లోకానికి తీసుకు వెళ్ళే మరపు రాని ప్రసంగాలు చేశారు .మనోరమ మా పపై పిన్ని మేన కోడలని అప్పుడే తెలిసింది .శర్మ గారు తన దగ్గరున్న పుస్తకాలు నాకు పంపటం నేను నా దగ్గరున్నవి వారికి పంపటం జరిగేది .వారు నా రచనలను చదివి మీలో ఇంతటి రచయిత ఉన్నాడా అని ఆశ్చర్య పోయే వారు .వారు నాకు కావ్య కాంత గణ పతి గారి జీవిత చరిత్ర ను పంపారు .ఆయన నంటే వారికి ఆరాధ్యం .నేను దువ్వూరి వెంకట రమణయ్య గారి స్వీయ చరిత్ర పంపాను .చదివి ఎంతో పొంగి పోయారు .గుంటూరులో మా అబ్బాయి రమణ వివాహం అయితే వచ్చి మాకు బట్టలు పెట్టి ఆశీర్వ దించిన పెద్దలు శర్మ గారు .తమ్ముడు యాజ్న వల్క్య శర్మను ,రమాదేవిని ఆమె భర్తను మడక సత్య నారాయణ గారిని కూడా తమతో పాటు వచ్చేట్లు చేసిన స్నేహ బంధం వారిది .
డిసెంబర్ లో విజయ వాడ సత్యనారాయణ పురం లో మల్లాది వెంకటేశ్వర్ల్ కుమార్తె వివాహం జరిగితే మేము వస్తున్నట్లు తెలిసి మమ్మల్ని చూడ టానికి శ్రమ పది వచ్చిన మరపు రాని మనీషి .ఎందుకు శ్రమ పడ్డారు మేమే వచ్చే వాళ్ళం కదా అంటే ”మీరిద్దరూ నాకు ఆది దంపతుల్లా కని పిస్తారు .మిమ్మల్ని చూడ కుండా ఉండలేను ”అన్నారు .కళ్ళు చెమర్చాయి మాకు .శ్రీ నందన నామ సంవత్సర ఉగాది సందర్భం గామార్చి ౧౮ న కవి సమ్మేళనం  జరిపితే  రాలేక కవిత రాసి పంపారు .అది ఇప్పుడు ”ఆదిత్య హృదయం ”లో ప్రచురింప బడింది .సాధారణం గా వారు కవిత ను ఒక వ్యాసం లాగా రాస్తారు .నేను దాన్ని కవిత్వీకరించి అచ్చుకు పంపి ,ఒక కాపీ వారికి పంపుతూ ఉండే వాణ్ని .”ఎంత బాగా వచ్చిందండీ కవిత ”అని మ్రురిసి పోయారు .కిన్దత్దాది కవి సమ్మేళనాన్ని ”మా అక్కయ్య ”శీర్షిక పై నిర్వహించాం .వారు వారి అక్కయ్య పై చాలా ఆరాధనా భావం తో రాసి పంపారు .దాన్ని కవిత్వ రూపం లోకి తెచ్చి అచ్చు వేషం .చదివి ఆనంద బాష్పాలే రాల్చారు .అంతటి సహృదయ స్పందన వారిది .ఎప్పుడూ నవ్వు ముఖమే .ఎప్పుడూ చతురోక్తులే .ఎప్పుడు తన అనుభవాల తేగల పాతరను తవ్వి పోయతమే .తన కుటుంబం లోని మహా వ్యక్తులను ఆరాధనా భావం తో సంస్మరించాతమే .సభల్లో కలిసి నప్పుడల్లా నేను తెసిన ఫోటో లను వారికి పంపటం అలవాటు అందుకొని కృతజ్ఞత చెప్పటం వారి రివాజు .సరస సల్లాపాలకు వారు పెట్టింది పేరు .దాదాపు ఎనభై ఎనిమిదేళ్ళ వయసు లోను నిరంతరం చెరగని చిరు నవ్వు తో ప్రత్యక్ష మయ్యే వారు .వారి 85 వ పుట్టిన రోజూ పాడుగాను వారి సోదరులు ,వారి కుటుంబం విజయవాడ రామ కోటి లో ఘనం గా నిర్వహించారు .నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్లి వచ్చాను .”రస భారతి లో వారు సభ్యులు .నెల నేలా విజయ వాడ లో నిర్వహించే కార్య క్రమాలకు క్రమం తప్ప కుండా హాజరవుతారు .డాక్టర్ గుమ్మా సాంబశివ రావు గారంటే అమిత వాత్సల్యం ”అని ముద్దు గాగుమ్మా”అని పిలిచే వారు .
యాజ్న వల్క్య మహర్షి అంటే వీర పూజే .కుతుమ్బ్కమ్ లో అందరి తోనూ మంచి సంబంధాలున్నాయి ధర్మ వారపు సుబ్రహ్మణ్యం ఆయనకు దగ్గర బంధువే .విజయ వాడ రేడియో స్టేషన్ ఉంచి వారి కధలు చాలా ప్రసారం అయాయి వారికి బాగా నచ్చిన కధ ”గురివింద”.సుమారు సంవత్సరం క్రితం వారి ”అమృత హస్తాలు”పై పరిశోధన చేసిన అతను ఆ పుస్తకాన్ని ఆవిషకరణ సభను విజయ వాడ హోటల్ యిలా పురం లో జరిపి శర్మ గారిని సత్కరిచాడు .నేనూవేల్లాను .ఎండ్లూరి సుధాకర్ ,ఆదిత్య ప్రసాద్ గుత్తి కొండా గుమ్మా వంటి ముఖ్యులు పాల్గొన్నారు .శర్మ గారు అంటే అందరికీ పూజ్య భావం .అందరికి పెద్దన్న .పెద నాన్న .తాతయ్య మిత్రుడు హితుడు స్నేహితుడు అభిమాని హితైషి .
మేము అమెరికా బయల్దేరా టానికి నాలుగు రోజుల ముందుగా ఫోన్ చేశారు బాగా మాట్లాడు కొన్నాం .మేము అమెరికా వెళ్తున్న సంగతి విని ”క్షేమంగా వెళ్లి లాభం గా రండి ”అని పెద్ద మనసు తో ఆశీర్వ దించారు .ఉయ్యూరు నుండి బయల్దేరే ముందు రోజూ నేనుఫోన్ చేసి వారితో మాట్లాడాను మళ్ళీ ఆనందం గా ఆశీర్వదిస్తూ అమెరికా నుంచి ఫోన్ చేస్తుండండి అని కోరారు తపకుండా అన్నాను .కాని చెయ్య లేక పోయాను .ఇప్పుడు బాధ గా ఉంది .ఇప్పుడే మా అబ్బాయి ఉయ్యూరు నుంచి మెయిల్ రాస్తూ అందులో శర్మ గారి మరణ వార్త రాశాడు .21  వ తేదీ న చని పోయి నట్లు వాళ్ల అబ్బాయి ఉయ్యూరు కు మన ఇంటికి ఫోన్ చేశారట .ఇది వారికి అశ్రు తర్పణం .
స్నేహితుడు హితుడు బాంధవుడు ఆత్మీయుడు ,ఆత్మ బంధువు సాహిత్య శీలి మానవతా హృదయ విపంచి ,ఆదర్శ గృహస్తు ,నిత్య సాహిత్య అనుసరనీయుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారి మరణం సాహిత్య లోకానికి మాన వీయ విలువలకు తీరని వెలితి .వారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ  భగ వంతుడిని ప్రార్ధిస్తూ  వారి కుటుంబానికి ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -04 -12 .
క్యాంపు-అమెరికా
గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6

 వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6
      శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక మైపోతున్నాయి .బహుజన హితాయ ,బహుజన సుఖాయ అన్నది మాటల్లోనే తప్ప చేతల్లో కని పించటం లేదు .  మనిషి స్వేచ్ఛ క్రమేపీ కుంచించుకు పోతుంది .మనిషి ఒంటరి వాడై పోతున్నాడు . అన్నిటా వైఫల్యం ,వైవిధ్యం బాధిస్తుంది .ప్రేమ తగ్గి ప్రతీకారం పెరిగి విశృంఖలత వీర విహారం చేస్తుంది .సామాజిక న్యాయం గగన కుసుమం అవుతుంది .దేశం మనకేమిచ్చింది అన్న ప్రశ్న లే ఎక్కువ అవుతాయి .అంతర్యుద్ధాలు ,అంతర సంఘర్షణలు పెరిగి దిక్కు తోచని పరిస్తితి ఏర్పడుతుంది .మార్గం తెలీదు ,గమ్యం అర్ధం కాదు .నిత్యం జీవిక కోసం పోరాడే స్థితి .ఇలా సామాజికాంశాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి .ఇందు లోంచి బయట పడటం అసాధ్యం అనే భావం బలీయం అవుతుంది .ఇప్పుడే సాహిత్య కారుడి అవసరం మరీ ఎక్కువ అవుతుంది .మనిషి ని చైతన్య పరచి ,జడత్వం వదిలించి ,మార్గ నిర్దేశం చెయ్యాలి .ధైర్యాన్ని అందించాలి .ఈ పరిస్థితిల్లో మన తెలుగు కధకులు తమ ధర్మాన్ని బాగానే నిర్వహించి సమాజ హితైషు లని పించు కొన్నారు . సమస్యల మూలాలను తడి మారు . అస్తిత్వపు విలువలను గుర్తు చేశారు .ఆరాటం నుంచి పోరాటం వైపు నడిపించారు .జీవితానికి ,బలపడ టానికి తగిన బలాన్ని కలం తో అందించారు ..

 

           సమాజం లో ఆబల ఉద్యోగం చేస్తున్నా అబలే అని పించు కొన్నది .ఆమె శ్రమకు విలువ నివ్వటం లేదు .ఆర్ధికం గా అణగార్చటం పెరిగింది .లైంగిక వేధింపు లేక్కువైనాయి .వీటన్నిటిని అచ్యుత వల్లి ,భార్గవీ రావు లు ‘’ముత్యాల చెరువు’’,పందిరి’’,’’ పురిటి నెప్పులు’’  కధల్లో చిత్రించారు ..దళిత  స్త్రీ ల దీన గాధలే ఇవన్నీ .అవిద్యను ,ఆర్ధిక అసమానతలను పోగొట్టి ,జన జీవన స్రవంతి లోకి తెచ్చే మార్గాలను వివరించారు .ఎవరు ఎవరికి ఎంత చెప్పినా ,మానవ మనస్తత్వం డోలాయ మానం గానే ఉండి ముందుకు కదల లేని స్థితే .సమాజానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే రచనలూ వచ్చాయి .

              జానపద కళాకారుల జీవన స్థితి చాలా దయనీయం గా ఉంది .సభలూ సమా వేశాల్లో వాళ్ళ ను వాడు కోవటమే తప్ప వారికి చేసింది చాలా తక్కువ .హస్తకళల ,చేనేత కార్మికుల పరిస్తితీ అంతే .ఆకలి చావులు ,అర కోర జీతాలు అడుగంటి పోతున్న నైపుణ్యం ,గిరిజనుల శ్రమను దోచుకొనే దళారీలు –ఇవన్నీ కధల్లో బాగా చోటు చేసుకొన్నాయి .స్త్రీ జీవితం లోని సున్నితాంశాలను జయప్రభ ,కొండే పూడి నిర్మల ,రజని కధలు గా మలిచారు .పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేశారు .దళితులు పడే బాధల్ని వారి పట్ల లోపిస్తున్న మాన వీయ దృక్పధాన్ని ఎండ్లూరి సుధాకర్ ,రాములు చిత్రించారు .బడుగు జీవుల కధలే రాసి న ఐతా చంద్రయ్య  మూలాలను విస్మరించ రాదనీ పదే పదే గుర్తు చేశారు .కాలువ మల్లయ్య గారి వందలాది కధలు చైతన్య స్పోరకాలైనాయి .మాండలీకం మకుట ధారణా చేసింది .తరువాత మాండలీకాన్ని అవసర మై నంత వరకే ఉపయోగించాల ని అర్ధం చేసుకొన్నారు .తమ జాతి చరిత్రను గుర్తు చేసే కధలను ఖదీర్ బాబు ,’’దర్గా మిట్ట ‘కధల్లో రాసి మళ్ళీ కధను చెప్పే పధ్ధతి లోకి మళ్ళించాడు .ఇందులో జీవిత విశ్లేషణ అమోఘం .కధా బలం ఉంది. .సజీవ చిత్రణ ఉంది . .అలాగే రాయల సీమ కరువు ,దుర్భర జీవితాలు ,ఫాక్షనిజం లను కేతు విశ్వనాధ రెడ్డి ,నామిని సుబ్రహ్మణ్యం నాయుడు చిరస్మరణీయ మైన కధలను రాశారు .సింగమ నేని నారాయణ రాయల సీమ జన జీవన చిత్రాలను కధల్లో బలం గా చూపారు .

          గ్రామాలలో జీవనం కష్టమై ,బతుకు బండి లాగటం కష్టం గా ఉంది .పట్నాలకు వలస ఎక్కువైంది .దీని వాళ్ళ బాంధవ్యాలు ,బంధాలు తెగి ప తున్నాయి .సంక్షోభం ,భయంకర పిశాచం గా తరుము తోంది .భూమి బంధం ,పేగు సబంధం సడలి పోతున్నాయి .గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి .వీటన్నిటిని హృదయాలను కదిలించే  కధలు వచ్చాయి .సామాజిక స్పృహ వీర విహారం చేసిన చేసిన కధలే .ఎక్కువగారాయలసీమ నుంచి వచ్చిన కధలివి .రైతుల జీవిత పు లోతులను కదలించే కధలుగా రాశారు .రైతుల అంత రంగాన్ని ఆవిష్కరించిన కధలు .మధురాంతకం నరేంద్ర ,శాంతి నారాయణ ,దాదా హయత్ ,ఈ దీన  గాధలకు అద్భుత కధా రూపం ఇచ్చారు .చిత్తూరు మాండలికం వీరికి అధికార భాష అవటం గొప్ప మార్పు .చాలా వైవిధ్యం ఉన్న కధలు .అన్ని పార్శ్వాలు ,కోణాలను ఎదుట నిలి పిన కధా స్రవంతి .కళ్ళు చమరుస్తాయి .హృదయం బరువెక్కు తుంది .సమాజం లో మంగలి అవసరం లేని వారు లేరు .కాని వారి జీవితాలను గురించి చెప్పే వారే లేక పోయారు .ఆ కొరత తీర్చారు రాయల సీమ కధకులు గోపాల కృష్ణా ,సాగర్ లు. ఆ ప్రాంతపు జీవ భాష ను కధల్లో పదిలం గా పొదిగారు .యెనలేని గౌరవం కల్గించారు .ఇంత గొప్ప పని తెలంగాణా లో జరగటం లేదని విశ్లేషకుల భావన .తెలంగాణా మూలాలను వెతికి పట్టు కొని ,అక్కడి ప్రజలు గురి అవుతున్న వివక్షత పై కధలు తక్కువ గానే వచ్చాయి .వర్త మాన తెలంగాణా జీవితం ఇంకా పూర్తి   గా ఆవిష్కరింప బడ లేదని వారి భావన .

        సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-04-12

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆదిత్య హృదయం – పద్య వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభ – ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5
 తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు బాటు వేరు వేరు గా ఉంటాయి .రవాణా సౌకర్యాలలో తేడా ,అడవుల విస్తీర్ణం ,భూమిని సాగు లోకి తెచ్చు కొనే సౌలభ్యం ,వాణిజ్య పంటల జోరు ,భూగర్భ జలాల విని యోగం ,వర్ష పాఠం ,ఈ ప్రాంతాల అభి వృద్ధికి ,వెనుక బడి పోవటానికి కారణాలవుతున్నాయి .తరతరాల దొరల పెత్తనం ,ఎదిరించే ధైర్యం లేక పోవటం ,ప్రజలను మరీ అంధకారం లోకి నెట్టాయి .ప్రజాస్వామ్యం వచ్చి అరవైయేళ్ళు దాటినా ఇంకా బానిస బతుకులే .ముఖ్యమంత్రి ఎవరైనా తన ప్రాంతానికే అభివృద్ధి .మిగిలిన జనం తన వాళ్ళు కాదు అనుకోవటం ,,పరిశ్రమ లన్ని ఒకే చోట చేరటం ,అధికారాలన్నీ గుత్తగా ఒకే కుటుంబాలకు పరిమిత మవటం ,ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా వర్షపు నీటిని నిలువ చేసే వనర్లను ఏర్పరచుకో లేక పోవటం ,విద్యుచ్చక్తి సరిగ్గా అందక పోవటం ,చీకటి బతుకులు ,చిద్ర మైపోయిన చేతి వృత్తులు ,ఆరుగాలాలు కష్టించి ,పండించిన పంటకు  రైతుకు గిట్టు బాటు ధర లేక పోవటం ,వల్ల జనం లో నిరాశా ,నిస్పృహా .అందుకని ప్రాంతాలు ఏవైనా తీరు మాత్రం ఒక్కటి గానే ఉంది .వీటికి తోడు ఎన్నికల రాజ కీయాలు .ముఠా తత్త్వం ,హింస ,దౌర్జన్యం ,ప్రాణాలకు విలువ లేక పోవటం నిత్యం చూస్తూ ఉన్న విషయమే .పరిపాలన లో అవినీతి ,రక్షణ నిచ్చే వారిలోనూ నిర్లక్ష్య ధోరణి ,  ,న్యాయాన్నికాపాడే చోట్ల కూడా సామాన్యుడికి ఎదు రీతే .
బలం గల వాడిదే రాజ్యం .ఇవీ దాదాపు 25 ఏళ్ళు గా మన రాష్ట్ర పరిస్థితి .అతివృష్టి ,అనావృష్టి ,నాణ్యత లేని నిర్మాణాలు ,ప్రజల జీవితాలతో చేలగాటమాడు తున్నాయి .వీటికి మించి నక్సలైట్ల దాడులు ,మిలిటెంట్ల భీభాత్సాలు తో నిత్యం అభద్రతా భావం అలముకొన్న జీవితాలు .విద్య విషయానికి వస్తే కార్పోరెట్ల కళకళ .ప్రభుత్వ విద్యాలయాల విల విల ,వెల వెలా .పోటీ  పరీక్షల్లో అగచాట్లు .చిన్న తరగతి చదువుకే వేలాది రూపాయల ఖర్చు .సరైన సౌకర్యాలు లేని ప్రభుత్వ విద్యాలయాలు .సిబ్బంది కరవు .ఆర్ధిక స్థితి కారణం అంటూ ఉపాధ్యాయ ,అధ్యాపకుల నియామకానికి ఏళ్ళూ ,పూళ్ళూ.గిరిజన ఆవాసాల పై నిర్లక్ష్యం .సెజ్ ల పేరిట పంట పొలాలకు ఎసరు .గంగ పుత్రులపై దాష్టీకం .ఇంతకు మించి మేధో వలసలు .అమెరికా పై అందరి చూపు .అదే లక్ష్యం గా మారటం .ఆంద్ర దేశం లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారంతా దాదాపు ప్రవాస భారతీయులు గా మారి పోవటం .ముసలి తలిదండ్రులను విస్మరించటం .ఏడాదికో ,రెండేళ్ళ కో ఒక సారి చుట్టపు చూపుగా వచ్చి పోవటం అనేక సమస్యలకు కారణాలవుతున్నాయి .భార్యా భర్త లిద్దరూ ఉద్యోగం చేయటం ,ఉద్యోగ భద్రత లేక పోవటం పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం ,వారి పై ప్రేమ కరువవటం ,.అనుబంధాలు ,ఆత్మీయతలు కనిపించక పోవటం హమేషా దర్శనం ఇస్తున్న విషయాలు .ఇవన్నీ ఇప్పుడు సామాజికామ్శాలే .
                బాల కార్మికులు ,రేషన్ కార్డుల అక్రమ బట్వాడా రేషన్ సారిగా ఇవ్వక పోవటం ,గృహ నిర్మాణ విషయం లో శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు .ఇలాంటి సమస్యల సుడి గుండం లో పడి ఆంద్ర ప్రజానీకం  అలమటించి పోతోంది .రాష్ట్రం విడి పోతుందో ,కలిసి ఉంటుందో తెలీని నిత్య అనిశ్చిత స్థితి .ఎన్నికలలో ధన ప్రవాహం, వాగ్దానాల వెల్లువ .పోటీ చేసే వారి సంఖ్య మరీ పెరిగి పోవటం ,ఓట్లు ఉన్నాయో లేవో చివరిదాకా తెలీని వింత స్థితి .ఉందని వెళ్తే లేదని తెలిసి నీరసం తో ఇంటి ముఖం పట్టటం .వీటన్నిటి పైనా సామాన్యుడు సణుగు తూనే  ఉన్నాడు , గొణుగు తూనే ఉన్నాడు .ఆశ్రిత పక్ష పాతం ,అయిన వారికి అందలాలు .మోసే జనం జావ కారి పోవటం .ఓర్పు హద్దు దాటి పోయింది .నిరసన గళం విప్పుతున్నారు .పిడికిళ్ళు బిగిస్తున్నారు .మేధావులూ వెన్ను తడుతున్నారు .ఇన్ని సమస్యల నుంచి తప్పించు కోవటం అసాధ్యం .దీనికి తోడూ ఉపకులాల చిచ్చు .విడదీసే వారే కాని కలిపే వారు లేక పోవటం బాధే .
              ఇవన్నీ చూసి చూసి విసుగెత్తి చదువు కొన్న వారు తమకు తెలిసిన భాషలో ,తమరు నేర్చిన మాండలికం లో
తమ వారికి అర్ధం అయేట్లు  రాస్తున్నారు .బోధిస్తున్నారు .చైతన్యం తెప్పిస్తున్నారు .దుర్భర జీవితాల నుంచి బయట పడ టానికి దారి చూపిస్తున్నారు .రచయితలుగా తమ కర్తవ్యాన్ని సంపూర్తి గా నెర వేరుస్తున్నారు .వ్రుత్తి చేసుకొనే వారి గొంతుకలు విచ్చు కొన్నాయ్ .తమ పరిభాషలో అద్భుతం గా రాస్తున్నారు ..చైతన్యం తెస్తున్నారు .ఈ పాతిక సంవత్స రాలలో అన్ని ప్రక్రియల్లోను వైవిధ్యం బాగా చోటు చేసుకొన్నది .ముఖ్యం గా బలం గ చెప్పేది ,చెప్పగలిగేది కధ కనుక దాని వాసీ ,రాసీ పెరిగింది .కధా ప్రాచుర్యం నాణ్యతా పెరిగాయి .దాని అవసరమూ అలానే పెరిగింది .కధ ఒక ఆయుధమే అయింది వారి చేతి లో .ఇలాంటి సామాజికాంశాలను ,అద్భుత కధా కదన రీతి లో ఆవిష్కరించారు మన కధకులు .మరుగున పడిన మాటలను పదునైన ఆయుధాలుగా మార్చు కొన్నారు .తమ మాండలిక సంపదను అందరికి పంచుతున్నారు .దీనితో గొప్ప చైతన్య స్పృహ వచ్చింది .ఆశించిన ఫలితం కని పించింది .స్వంత గొంతుక హెచ్చింది .అన్ని బంధనాలను తెంచుకొని ధైర్యం గా ముందు అడుగు వేస్తున్నారు .ప్రాంతీయ వారీ సమస్యలను చిత్రించి తీర్చి దిద్దు తున్నారు .పెద్దగా సాహిత్యాధ్యయనం లేక పోయినా మంచి కధలు ,అవసర మైన కధలు ,కదిలించే కధలు వస్తున్న కాలమ్ ఇది .ఆ విశేషాలేమిటో తరువాత తెలుసు కొందాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -04 -12 .
                         కాంప్-అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –30 ఆనాటి మాటా మంతీ

 ఊసుల్లో ఉయ్యూరు –30

               ఆనాటి మాటా మంతీ

       మేము హిందూపురం లో ఉండగా ఒక పాట చరణం ఎప్పుడు పాడే వాళ్ళం .దాని అర్ధం మాకు తెలీదు .హిందూ పురానికి దగ్గర లో పెనుగొండ ,మడక శిర ఉండేవి .ఆ మూడిటి మీదే ఆచరణం ‘’మడక శిరా  ,పెనూగొండ హిందూ పురములో ‘’అనేదే నాకు గుర్తున్నది . ఎందుకు పాడే  వాళ్ళోకూడా తెలీదు .ఉయ్యూరు వచ్చి న తరువాత ఉయ్యురుకు దగ్గర ఉన్న గ్రామాల మీద ఒక పాటపాడే వాళ్ళం .అదీ ఎందుకో తెలీదు ‘’తాడంకి ,మంటాడ తగలడ్డ గురజాడ ,చెప్పుదెబ్బల మారి సాయిపురము ‘’అంతే .ఇంకా ఉయ్యూరు చుట్టూ పక్క గ్రామాల మీద చాలా విషయాలు మా మాటల్లో సరదాకి, విషయానికి, వివరణ కు దొర్లేవి .ఉయ్యూరు కు దగ్గర్లో గరిక పర్రు ఉంది.మా ఇంట్లో ఎవరి కైనా ఏదైనా కనపడక పోతే ‘’గరిక పర్రు వెళ్లి సోది అడుగు ‘’అనటం అలవాటు .మేమే కాదు చాలా మంది అలా అనే వారు .ఆ ఊళ్ళో సోది చెప్పే వారెవరైనా ఉన్నారేమో ?లేక పొతే రాదా మాట .అక్కడ ఒక విశ్వ బ్రాహ్మిన్ ఉండే వాడు .నల్లగా లావుగా తెల్ల పంచె తెల్ల చొక్కా తో నుదిటి మీద రూపాయి కాసంత యెర్రని కుంకుమ బొట్టు తో .ఆయన దగ్గరకు ప్రశ్న అడగ టానికి వెళ్ళే వాళ్ళు .నా స్నేహితుడు పెద్ది భోట్ల ఆది నారాయణకు గురువు .శలవుల్లో ఇతను అక్కడికి వెళ్లి గురు సేవ చేసే వాడు .అలాగే తొట్ల వల్లూరు లో ఒక కమ్మాయన ప్రశ్న బాగా చెప్పే వారని ప్రతీతి .మా గేదెలు తప్పించుకు పోయినా ,ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పోయినా ఆయన్ని ప్రశ్న అడిగించే వాళ్ళం .దీనికీ మాకు ఆది నారాయనే శరణ్యం .ఆయన చెబితే ఖచ్చితం గా జరిగేది .సందేహం లేదు .కనుక ఏదైనా ఇంట్లో కనిపించక పోయినా ‘’వల్లూరు వెళ్లి ప్రశ్న అడుగు ‘’అనటం ఒక అల వాటు అయింది .ఎవరైనా తిక్క తిక్క గా మాట్లాడితే ‘’కుమ్మ మూరు వెళ్ళిరా .ఎందుకైనా మంచిది ‘’అనే వాళ్ళం .ఆవూల్లో పిచ్చ వాళ్ళు ఉండే వారని విన్నాం .అలాగే పిచ్చి నయం చేసే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలీదు .

            పాలు ఇవ్వని గొడ్లు ఉంటె ,లేక పని చేయని ఎడ్లు ఉంటె పాలేళ్ళ కు ఒక ఊత పదం ఎప్పుడూ నోటికి వచ్చేది ‘’నిన్ను కంకి పాడు సంతకు తోలా ‘’అని వాటిని తిట్టే వారు .ఉయ్యురుకు పది కిలో మీటర్ల దూరం లో కంకిపాడు లో వారానికి ఒకసారి సోమ వారం పశువుల సంత జరిగేది అందుకని అది వాడుకయింది .ఒక వేళ మరీ పనికి రాని గొడ్డు అయితే ‘’నువ్వు కంకిపాడుకు కూడా పనికి రావు గుడ్ల వల్లేరు సంతే నీకు గతి ‘’అనే వారు .అక్కడ కోతకు గొడ్లనుబాగా కొనే వారు .గుడివాడ దగ్గర  ఉందిగుడ్ల వల్లేరు .పెద్ద సంత .

    మా దగ్గర లో సాయి పురం లో బ్రాహ్మణులు  మంచి వ్యవసాయం చేసే వాళ్ళు .కండ పుష్టి ,తిండి పుష్టి ఉన్న వాళ్ళు .అందుకని ఇళ్ళల్లో పిల్లలు కొంచెం ఎక్కువ గా ఆ పూట తింటే ‘’ఎరోయ్ !సాయి పురం వ్యవ హారం లా ఉందే ?’’అని ఆట పట్టించే వారు .మాలో మేమే అలా అనుకొనే వాళ్ళం . మా ఊళ్ళో పోలీసు స్టేషన్ వెనకాల ఒక ఆవిడ వ్యభిచారం చేసేదని అనుకొనే వారు .అందుకని ఎవరైనా డీలా పడ్డ మొహం తో మొహం వేలాడ దీసు కొని  ఉంటె ‘’ఏరా రాత్రి పోలీస్ స్టేషన్ వెనక్కి వేల్లోచ్చావా ‘’/అని గేలి చేసే వారు .ఇది పెద్ద అయితే కాని మాకు అర్ధం అవ్వలేదు .అలాగే కనక వల్లి అతను ఒక కుర్రాడు తెల్లటి గ్లాస్కో పంచె లుంగీ ,తెల్ల చొక్కా గుండీలు లేకుండా  కాటూరు రోడ్డు లో పాకలు వేసి వ్యభి చారం చేసే వాళ్ళను తెచ్చి వ్యాపారం చేసే వాడు అని చెప్పు కొనే వారు .కుర్ర కారు ఎవరైనా ఏమీ తోచటం లేదు అని అంటే ‘’హాయిగా కాటూరు రోడ్డు కు వెళ్ళు ‘’అని ఉచిత సలహా ఇచ్చేవారు. ఇదీ ఆ తర్వాతా ఎప్పుడో కాని మా బల్బు వెలగ లేదు .ఆ కుర్రాడు ఉన్నదంతా వాళ్లకు అర్పణం చేసి నెట్టి మీద గుడ్డ వేసుకోన్నాడని చెప్పు కొనే వారు .

          మా ఇంట్లో కూరలోనో ,పులుసు లోనో ఉప్పు ఎక్కు వైతే మా నాన్న ‘’ఇవాళ కూర బందరు వెళ్లి నట్లుందే ‘’అనే వారు .అంటే బందర్లో సంద్రం ఉందని ,అందులో ఉప్పు ఎక్కువని అంత  ఉప్పు ఇందులో చేరిందని అర్ధం .కారం ఎక్కువైతే ‘’గుంటూరు సీమ వాళ్లెవరు ఇవాళ మనింటికి రాలేదే ‘’అనే వారు .గుంటూరు కారానికి ప్రసిద్ధి అని అందరికి తెలుసు కదా . మా రెండో అక్కయ్య అత్తగారి ఊరు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం .అత్తగారి పేరు కాంతమ్మ గారు .చిట్టెమ్మ గారు అనీ అనే వాళ్ళం .ఆవిడ బాగా వంట చేసేది కాఫీ బాగా కాచేది ఫిల్టర్ కాఫీ మాద్రాస్ లో  ఇచ్చినట్లు ఇత్తడి గ్లాసు ,వెడల్పు కప్పు లో కాఫీ ఇచ్చేది .ఆవిడ చారు ,పులుసు పెడితే పంచదార ,బెల్లం బాగా ఎక్కువ వేసేది .అది వేలూరి వారికి అల వాటు .మా ఇంట్లో మా అమ్మ లేక మామ్మ  చేసిన చారు పులుసు లో కొంచెం బెల్లం ఎక్కు వినా ‘’ఇవాళ చారు చిరివాడ వెళ్ళింది ‘’అని సోడ్డు వేసే వాడు నాన్న .

            చిన్న ప్పుడు అందరం గోచీలు పెట్టు కొనే స్నానం చేసే వాళ్ళం .యువకులు లంగోటి కట్టు కొనే వారు .కుర్రాడు ఎవరైనా కొంచెం పొగరు మోతు గా కని పిస్తే ‘’లంగోటి కట్టే వయస్సు కదా ఆ మాత్రం హడా విడి చేస్తాడు లే ‘’అనే వాళ్ళు పెద్ద వాళ్ళు ముసి ముసి నవ్వులతో .పైలా పచ్చీస్ గా ఉంటె పూల రంగడని.మరీ ఫాషన్ గా ఉంటె దసరా  బుల్లోడుఅనటం మామూలే .మా చిన్న తనం లో స్తుడ్ బెకర్ అనే మోటారు కార్లున్దేవి .చాలా వెడల్పుగా పొడుగ్గా ఉండేవి .ఎవరైనా కొంచెం లావు గా ఉంటె వాణ్ని స్తుడ్ బెకర్ అని గేలి చేసే వాళ్ళం .మరీ సన్న గా ఉంటె పూచిక పుల్ల అనేవాళ్ళం .

             పెసర పచ్చడి  తింటే బాగా విరేచనం అవుతుంది .అందుకని దాన్ని ‘’సందడి పచ్చడి ‘’అనే వాళ్ళం .ఎవరైనా పొడుగ్గా  ఉంటె ములక్కాడ పర్సనాలిటి అనీ గడ కర్ర అనీ ,వాసం బొంగు అనీ ఆటం ఆనాడు సాధారణం .కొంచెం లావుగా ఉంటె ‘ పిప్పళ్ళబస్తా ‘’అనే వారు .ఎవరైనా జనం తో కలవక పొతే ‘’ఒంటికాయి సొంటి కొమ్ము ‘’అనడం మామూలు .ఆ రోజుల్లో లెట్రిన్ సౌకర్యం లేదు .అందుకని మరుగు ఎక్కడ ఉంటె అక్కడ కాల కృత్యాలు తీర్చుకొనే వాళ్ళు .మా ఇంటి వెనుక ఖాళీ ప్రదేశాన్ని ‘’చామలి ‘’అనే వారు .దాన్నిండా ఈత పొదలు తాడి పొదలు ముళ్ళ పొదలు వుండేవి. అక్కడికే అందరు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు .దాన్ని చెంబట్టుకు వెళ్లటం ,బైలికి వెళ్లటం అనే వారు .కొంచెం ఇంగ్లీష ఫాశాన్లు అలవాటైన తరువాత ‘’లండన్  కు వెళ్లాడు ‘’అనటం ఫాషన్ అయి పోయింది . అలాగే ఆ మూడు రోజుల్ని ‘’ఫ్రెంచ్ లీవు ‘’అనటం . పని ఎగ గొడితే కూడా ఇలానే పిల్చే వారు .

       +మా ఊళ్ళో సన్నాయి బాండ్ మేళాలు మంచివే ఉన్నాయి .అందులో బాగా వాయించే వాళ్ళు వాయించని వారూ ఉండేవారు .బాగా వాయించే వారిని ‘’వీరాస్వామి మేళం ‘’అని చెప్పు కొనే వారు .బాగా లేక పోతే ‘’జగన్నాధం డప్పు ‘’అని ఈస డించె వారు .అతను డోలు వాయిస్తే ‘’తుప్పు తుప్పు’’ శబ్దమే వచ్చేది .దేవాలయాల్లో దేవుడి ఊరేగింపు కు నూనె దివిటీలు వెలిగించే వారు .అందుకని ఎవరైనా బాగా అభివృద్ధి సాధిస్తే ‘’ఆబ్బో !వాడు దివిటీ గా వెలిగి పోతున్నాడు ‘’అనటం ఉండేది .మార్కులు తక్కువగా బొటాబొటి గా వస్తే ‘’అత్తెసరు మార్కులు ‘’అనే వారు .నాకు ఇంటర్ మొదటి ఏడు లో వచ్చిన మార్కుల్ని చూసి సరిగ్గా మా నాన్న ఇదే మాట అనటం నాకు ఇంకా గుర్తు .దానిమీద నాకు పంతం పెరిగి రెండో సంవత్సరం ట్యూషన్ చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోన్నాను .

    కొందరికి కొన్ని ఊత పదాలున్దేవి .చింతా ఆంజనేయులు గారు అనే సెకండరి గ్రేడ్ టీచర్ కు ‘’ఆమడగా ‘’అనే ఊత పదం వెంట వెంటనే వచ్చేది .దాని అర్ధం ఏమిటో ఆయనకు తెలుసేమో కాని మాకు బోధ పడేది కాదు .కొందరు మాస్టర్లకు వాళ్ళ ప్రవర్తన బట్టి పేర్లుండేవి అవి ఎవరు ఎందుకు పెట్టారో తెలీదు .అలా తర తరాలుగా నిలిచి పోయాయి .అత్తరు బుడ్డి ,దసరా బుల్లోడు , అంబర్బీడీ, టర్బన్ , షాన్ డో మొదలైనవి .మా ఆది నారాయణకు ‘’బిత్తర ‘’ఊత పదం .మా నాన్న  వాడు ఏదైనా పని సాధించుకు వస్తే ‘’ఎలా చేశావురా ?’’అని అడిగితే ‘’ఏంలేదు మాస్టారూ వాడికి బిత్తర వేశాను’’ .అనే వాడు .అంటే ఏదో టోకరా చేశాడని అర్ధం .అలానే ‘’అంచాత నే చెప్పేదేమిటంటే ‘’అనేది కూడా  అతను రావు గోపాల రావు కంటే ముందే వాడాడు .’’అసలు చెప్పొచ్చేదేంటంటే ‘’అనేది చాలా మంది వాడే వారు మా ఏం ఎల్ సి కొల్లూరి కోటేశ్వర రావు అయిదు నిమిషాలకో సారి ‘’ఏది ఏమయి నప్పటికి కూడా ;;’’అనే వాడు .నేను నా మిత్రులు నవ్వు కొనే వాళ్ళం .

           సాంప్రదాయ బ్రాహ్మణా కుటుంబాలలో తద్దినాలు తప్పని సరి .దానికి భోక్తలను పిలవటం వుంది తద్దిన బ్రాహ్మ నార్తానికి ఆ రోజుల్లో వైదిక నామం ‘’దర్భ పోటు’’.కనుక ఎక్కడైనా భోక్తకు వెడితే ఇవాళ డి.పి.ఎక్కడా అని అడిగే వారు అంటే దర్భ పోటు అని అర్ధం .అదే మనకు డిన్నర్ పార్టీ అయింది .అదే అశ్లీలార్ధం లో దుప్పి భోజనం గా గేలి చేయటానికి అనే వారు .అంటే భోజ నానికి పిలిచినా వారింట్లో కడు పు నిండా తిండి పెట్ట లేదని భావం .

తాంబూలం వేసుకొని నోరు పండితే ‘’అబ్బో ! నోరు సమర్త ఆడిందే  ‘’అని నవ్వటం బాగా ఉండేది .అలాగే పైలా పచ్చేసు గా ఉందే వాణ్ని ‘’వాడికేం శోభనం పెళ్లి కొడుకు ‘’అనటం రివాజు ఇప్పుడూ ఉంది.మాస్టారు బెత్తం తో కొట్టటం ఆ రోజుల్లో సర్వ సాధారణం .దాన్ని కవిత్వీకరించి ‘’పేకా వారి అమ్మాయి తో పెళ్లి ‘’అనే వారు .అంటే పేక బెత్తం తో వీపు వాయింపు అని అర్ధం .

     మా ఇంటికి కొలచల ఆయన ఒకాయన పెద్ద వయసు వాడు యాభై పై వాడు వీపు మీద పాత మాసిన పంచ లో పనికి రాని కాగితాలు కట్టలు కట్టలుగా వకీళ్ళ దగ్గర గుమాస్తాల కవిలె కట్టల్లా కట్టు కొని వచ్చే వాడు .ఎప్పుడో మా నాన్న శిష్యుడు. ఆయన పేరు జ్ఞాపకం లేదు ‘’కొలచల పిచ్చాడు ‘’అనే వాళ్ళం .ఎప్పుడూ తనలో తాను మాట్లాడు కొనే వాడు .తన దిన క్రుత్యాలన్ని యధా విధిగా  చేసు కొనే వాడు .నెలకో రెండు నెలల కొ  మా ఇంటికి వచ్చే వాడు .మా వీధి వసారా లో మకాం .అరుగు లో సగం ఆయన మూటలు .ఎలా మోసే వాడో వీపు మీద. మా ఇంట్లోనే భోజనం కాఫీ నిద్ర .ఇంకెవ్వరు రానిచ్చే వారు కాదు .ఒక వారమో పది రోజులో ఉండివెళ్లి పోయే వాడు .మా నాన్న అంటే మహా గౌరవం .మా కాలం లోను అలానే వచ్చే వాడు .ఎవరైనా వీపు మీద పనికి రాని వస్తువులు మోసుకేల్తుంటే ‘’ఏమిటా కొలచల పిచ్చాడిమూటలూ నువ్వూ ‘’అనే వారు .

       జుట్టు పొట్టిగా కట్టిరించుకొంటే ‘’పనస కాయ కొట్టుడు ‘’అనే వాళ్ళు .ఎవరికైనా వత్తాసు  పలికితే ‘’చెక్క భజన ‘’అనేవారు .ఇప్పుడూ ఉందీ మాట.పిల్లలు అల్లరి చేస్తుంటే ‘’సంత గోల ‘’అని చేపల మార్కెట్ అని అన టం మామూలే .సంగీతం లో రాగాలు పాడుతూ ఉంటె ‘’జిలేబి చుట్టలు ‘’అనే వాళ్ళు .ఏదైనా ప్రమాదం వస్తే ‘’పుట్టి మునిగింది ‘’అనే వారు .తలకు నూనె రాసుకోమన టానికి తైల సంస్కారం అనే వారు .ఇలా ఎన్నని చెప్పను ?బహుశా ఇవి అందరికి పరిచయం ఆయె ఉంటాయి .ఆ కాలం లో అందరి ఊళ్ళల్లో విన్న మాటలే అయి ఉంటాయి నాకు గుర్తు వచ్చి ఒక సారి ఏకరువు పెట్టాను అంతే .

     మీ –గబ్బిట దుర్గ ప్రసాద్ –26-04-12

 క్యాంపు –అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4

        శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల వంటి మాటలతో ఆచంట జానకీ రాం కధనం చేశారు .హృదయ మార్దవానికివి తీపి గుర్తులు గా మిగిలి పోయాయి .ఇల్లిన్దిల సరస్వతీ దేవి ,తురగా జానకీ రాణి, వాకాటి పాండు రంగా రావు ,గంధం యాజ్న వల్క్య  శర్మ, గంధం  వేంకాస్వామి శర్మా కుటుంబం లోని ఆత్మీయతలను ,వ్యక్తికి సమాజం పట్ల ఉండాల్సిన బాధ్యతలను ,నైతిక ధర్మాన్ని తెలియ జెప్పే కధలను రాసి చిరస్మరణీయం చేశారు .వ్యంగ్య వైభవం తో పఠాభి కధలు కధలు గిల్లుతూ బుజ్జగించాయి ,మన చేత కాని తనాన్ని బయట పెట్టాయి .వసుంధర కధలు జీవన విలువలను తెలియ జెప్పాయి .అలవోకగా కధలు ఎలా రాయ వచ్చో నేర్పాయి .అన్నిటా,తన స్పర్శలేకుండా కే.ఆర్.కే.మోహన్ హాస్యపు పంట పండించారు .తెలుగు వారి ఆవకాయ ఘాటును రుచి చూపించారు . సినీ నటి, గాయక, దర్శకురాలు భానుమతి  అత్తగారికీ కోడలికి మధ్య వైరుధ్యం ఉన్నట్లు కన్పిస్తున్నా ,ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమాను రాగాలను వివిధ కధల్లో వివరించారు .పసందైన విందూ చేశారు .చలం చూపించిన విశృంఖలత కు ముని మాణిక్యం గారు కులపాలికా ప్రణయం  తో అడ్డు కట్ట వేశారు .’’స్నానం స్నానాల దొడ్లోనే చేయాలి .మైదా నా ల్లో కాదు ‘’అని కొ.కు.చలానికి చురక అంటించింది అందుకే .సమాజం లోని అన్నిటికీ స్థానం ఉండాలి .హాస్యం ఒక దర్శనం కావాలి అన్న భావన తో  గుండె బరువు ,టెన్షన్ లను తగ్గించి ఆరోగ్యం అందించారు తమ అనేకానేక కధల్లో  భమిడి పాటి రామ గోపాలం  అనే భరాగో..అనుపానాన్ని బట్టి హాస్య తత్త్వం బోధించారు .

              ఇలా సాగుతున్న కధా ప్రస్తానం లో ఒక విలక్షణ మైన గొంతు తో ,పదునైన కలం తో అందర్ని ఆకర్షించి ,ముందుకు దూసుకు పోయాడు గొల్ల పూడి మారుతీ రావు .మనసు లోని సున్నితపు పొరలను తాకే అతి సున్నిత మైన మాటలతో రాయ గలవారు మారుతీ రావు .మనసుకు సూటిగా తాకే టట్లు, రాసి మెప్పించాడు .కధల్లో ‘’బిట్వీన్ ది లైన్స్  ‘’ కు మంచి ప్రాముఖ్యతనిచ్చాడు.ప్రతి కధ లో కొత్తదనం ,కొత్త ధోరణి ఉండే మార్గం ఎంచు కొన్నాడు .సరి కొత్త ప్రయోగాలు చేశాడు .మానవుల మనస్సులో మనం చూడని  కోణాలను,అందం గా ,సరళం గా సరసం గా ఆవిష్కరించారు .అచ్చ్చమైన తెలుగు దనానికి , , అపురూప మైన  కధా రచనకు ,ప్రతినిధులు ఆయన కధలు .’’పాలు విరిగి పోయాయి ‘’కధ లో బేల అయిన ఒక ఆడ పిల్ల అంత రంగాన్ని వివిధ కోణాల్లో అద్భుతం గా ఆవిష్కరించాడు .షాజహాన్ తన భార్య స్మృతి చిహ్నం  గా తాజమహల్ ను కట్టితే ,ఆగ్రా లోని గుర్రబ్బండీ తోలే నందలాల్  తాను అపురూపం గా ప్రేమించి న తన భార్య కు చని పోయిన తరువాత ఆమె గుర్తుగా ఒక ‘’తులసి కోట’’కట్టు కొన్నాడు .అదే అతని జ్ఞాపకాల్లో అమరత్వం .మారుతీ రావు ఆ తాజ మహల్ కంటే ,ఈ తులసి కోటే గొప్ప ప్రేమ చిహ్నం అని భావిస్తాడు .ప్రేమకు ,ఆరాధనకు దానం ,దర్పం అక్కర లేదని ,చెప్పిన కళ్ళు చెమరించె కధ .మాన వత్వం పరిమళించిన కధ ‘’తాజ్మహల్’’అందం అంత రంగానికి ఉండాలి. అప్పుడే నిండుదనం .లోని అందం లుప్త మైతే జీవితం పై విరక్తి కలిగి తప్పటడుగులు వేయిస్తుందని తెలియ జెప్పిన కధ ‘’అందమైన జీవితం. ‘’ఊహలని సాహిత్యానికి అనువదించటం మాత్రం అలవరచు కొన్న గొంగళి పురుగు ‘’దశ లో మారుతీ రావు’’ పరకీయ ‘’కధ రాశాడు .ఇందులో సుజాత అనే మహిళ విపత్కర పరిస్థితులను తనకు అనుకూలం గా మార్చుకొని ,బుద్ధి కుశలత తో పోరాట పటిమ ము చూపి,సంసార జీవితం గడుపుతూ ,ఆదర్శం గా నిలుస్తుంది .పరోపకార మిదం శరీరం అన్న భావాన్ని ‘’నేను ‘’కధ లో  ఒక మామిడి కొమ్మ తన అమ్మ అయిన చెట్టు గురించి స్వాగతం గా చెప్పిస్తాడు.చదివి హాట్సాఫ్ అనాల్సిందే .మారుతీ రావు సంభాషణలు వేద వాక్యాలు గా ఉంటాయి .వాటిని మార్చలేం .మారిస్తే ,ఆ అర్ధం ,భావం గాంభీర్యం రావు .ఇవ్వటం లో ఉన్న ఆనందాన్ని చక్కగా వివరిస్తాడు .ప్రతి పాత్ర లో నిండుదనం ,పరి పూర్ణత ,ప్రయోజనం ఉన్న మంచి కధలు రాసి మారుతీ రావు వన్నె కెక్కాడు .కాలం విసిరే సవాళ్ళ ను ఎదుర్కొని నిలిచినా పాత్రలవి .సజీవం గా సాక్షాత్కరిస్తాయి .కళారాధన అంటే స్వీయ ఆత్మ సందర్శనమే అన్న సూక్తి మారుతీ రావు చక్కగా ఉపయోగించు కొన్నాడు .Each man,poet ,philosopher ,or writer inhales much before exhales ‘’అన్న పట్టు తెలిసిన వాడు గొల్లపూడి .అందుకే గొప్ప రచయిత గా పేరు పొందాడు .Beatifully photograaphing a thing ‘’అన్నది రచయిత లక్షణం అన్నారు .అప్పుడే ఉత్తమ రచన వస్తుంది .దాదాపు 1975 వరకు రాసిన కధ కధకులు అందరు ,కవులు ,పండితులు ,విమర్శకులు ,పాతది చదివి జీర్ణించు కొని ,కొత్త దారి తొక్కిన వారే .ఆ తర్వాత తరం వచ్చే సరికి కాలం తో పాటు చాలా మార్పులు వచ్చాయి .అధ్యయనం తగ్గింది .పరిశీలనా తగ్గి నట్లు కన్పించింది .ఇక్కడి నుంచి తెలుగు కధ చాలా మలుపులు తిరిగింది .ఆ వివరాలు తర్వాత తెలియ జేస్తాను .

 సశేషం —-మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్ —26-04-12.

               క్యాంపు—అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

నవ్వుల పందిరి – కాట్రగడ్డ వెంకటరావు – పరిచయం

నవ్వుల పందిరి డౌన్లోడ్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ శంకర స్మరణం

  శ్రీ శంకర స్మరణం 
               వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో  విద్యలు నేర్చి,గురువులకే గురువై జగద్గురువులై దేశమంతా కాలి నడక తో పర్య టించి ఆధ్యాత్మ భావ వాహినిని ప్రవ హింప జేశారు . ఎదురైన అన్యమత వాదనలను తన వాదనా పటిమతో ఎదుర్కొని వారిని తన మార్గం లోకి మార్చుకొన్న ఘనులాయన .వైదిక ధర్మ పునరుద్ధరణకు వారు చేసిన సేవ మాటలతో వర్ణించ లేనిది .అద్వైత భావం బీజ రూపం లో ఉన్నదాన్ని వట వృక్షం గా పెంపొందించిన మహాను భావులు .ఇతర దేశాల సరిహద్దు లలో ఉన్న హిందూ మతావ లంబులను అక్కడే పీఠాలు ఏర్పరచి వారిలో వైదిక ,ధర్మ సంస్కారం కలిగించి ,నిలిపిన మహోన్నత వ్యక్తీ .శంకరులే లేకుంటే .ఆ ప్రాంతాల వారందరూ ప్రక్క దేశాల మతాను యాయులై ఈ దేశ భావ జాలాన్నే మరిచి పోయి ఉండే వారు .అలాంటి ప్రదేశాలైన బదరీ నాద్  .కేదార్ నాద్,ప్రాంతాలనుభారతీయ సజీవ జీవన స్రవంతి లోకి మళ్లించిన దార్శనికులు .
జ్ఞానులకు మాత్రమే అందు బాటు లో ఉన్న ప్రస్టాన త్రయం అన బడే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత లకు సామాన్యులకు అర్ధ మయే  రీతి లో విపుల మైన వ్యాఖ్యానం రాసి అందు బాటు లోకి తెచ్చిన యోగి వరేన్యులు .మరి ఇంకా దిగువ తరగతి సంగతేమిటి ? వారినీ ద్రుష్టి లో ఉంచుకొని సకల దేవతల పైనా స్తోత్రాలను రచించి ,భక్తి భావం తో ఆడుతూ పాడుతూ పాడు కొనే సులభ శైలి లో ,లయతో, శబ్ద సౌందర్యం తో ,అర్ధ గౌరవం తో రాసి వారికి అందు బాటు లోకి తెచ్చారు .అర్ధం కాక పోయినా ఆ స్తోత్రాలను వింటే చాలు నోటికి వచ్చేంత సులభం గా ఉంటాయి .బహుశా సంస్కృత భాష ను ఇంత గొప్పగా ప్రజల దగ్గరకు తెచ్చిన ,భాషా సేవ చేసిన చరితార్ధుడు ఇంకెవరు లేరని పిస్తుంది .వైరాగ్యం పొందాలనే వారికి వివేక చూడామణి ,వంటి వాటిని రచించి సన్యాసాశ్రమ ధర్మాలను బహు చక్కగా వర్ణించి  ,అందులోని కట్టు బాట్లను ప్రవర్తనా నియ మావళిని బోధించిన సద్గురువు శ్రీ శంకరులు .నిర్గుణ ఉపాసకులే కాక సద్గుణ ఉపాసకులకు కూడా మార్గ దర్శ కత్వం వహించిన జన హితైషి ఆది శంకరులు .అందుకే ఆధ్యాత్మిక జ్యోతి అని పించు కొన్నారు .నిర్యాణం చెంది శతాబ్దాలు గడిచినా ఇంకా మన అందరి ముందు నిలిచి జ్ఞాన జ్యోతి ని ప్రకాశింప జేస్తున్నారు .శంకరాద్వైతం తో జాతిని ,ప్రపంచాన్ని చైతన్య వంతం చేస్తున్నారు .అన్ని మతాల వారి భావనలను వ్యవస్తీక్రుతం చేసి ప్రధాన స్రవంతి  లో నడిచే వీలు కల్పించారు అందుకే ష న్మత    స్థాపనా చార్య అని పించుకొన్నారు .శారదా దేవినే మెప్పించి కాశ్మీరు లోని మహోన్నత శారదా పీఠాన్ని అధిహోరించిన అపర శారదా వతారం .
భగవత్పాదులు రచించిన ”శివా నంద లహరి ”,”సౌందర్య లహరి ”శవ శివా ల అలౌకిక శక్తిని ఆవిష్కరించిన ఉత్తమోత్తమ రచనలు .అద్వైతామృత వర్షం తో సకల జనాలను పులకరింప జేసిన రచనలవి .వాటిల్లోని పరమ గంభీర మైన భావనలను చదివి ,విని స్మరించి తరించాల్సిందే.ఇప్పటికీ చాగంటి కోటేశ్వర రావు గారి లాంటి వారు వాటి లోతుల్ని తరచి ఆస్తిక జనాలకు అంద జేస్తున్నా రంటే ఎంత గొప్ప జ్ఞాన నిధి ని వాటిలో ఆచార్యుల వారు ప్రక్షిప్తం చేశారో ఆశ్చర్యమేస్తుంది .శ్రీ శంకరులు లలితా సహస్ర నామాలకు భాష్యం వివరణ రాయాలని భావించారట .శిష్యుడిని ఆ గ్రంధం తీసుకొని రమ్మని, చెప్పటానికి ఉపక్రమించి కూర్చున్నారట .శిష్యుడు తెచ్చాడు .తీరా చూస్తె అది లలితా సహస్రం కాదు విష్ణు సహస్రం .పూనుకున్నారు కనుక విష్ణు సహస్ర నామాలకే భాష్యం రాశారు .అదే మనకు దక్కింది .లలితా సహస్ర నామాలకు అమ్మ అను మతి నివ్వవ లేదేమో .రాయ లేక పోయారు .
ఇప్పుడు సౌందర్య లహరి గురించి కొన్ని విషయాలు తెలుసు కొందాం .ఒక సారి శంకరా చార్యుల వారు కైలాసం వెళ్లి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను దర్శించారట .స్వామి వారి భక్తీ శ్రద్ధ లకు సంతోషించి, పరమేశ్వరుడు అయిదు స్పటిక లింగాలను వారికి ప్రదానం చేశారట .మాత పార్వతీ దేవి వంద శ్లోకాలతో ఉన్న ఒక మంత్ర గ్రంధాన్ని ఆయనకు బహూకరించింది .ఆ రెండిటినీ తీసుకొని సెలవు పొంది భూ లోకానికి తిరిగి వస్తున్న తరుణం లో వాకిట్లో ఉన్న నందీశ్వరుడు ఆ గ్రంధాన్ని లాగ బోయాడు .అలాంటి ఉత్తమ గ్రంధం కైలాసం నుండి భూలోకం చేరటం నందికి నచ్చలేదట .అందుకని ఆ పని చేశాడట .అలా లాక్కో బోతున్నప్పుడు అందులోని 59 శ్లోకాల భాగం నందీశ్వరుడికి చిక్కిందట.మిగిలిన 41 శ్లోకాలున్న భాగమే శ్రీ శంకరాచార్యుల వారికి దక్కిందట .శంకరులు చింతిస్తూ ఉంటె శార్వాణి .”నంది లాక్కొన్న శ్లోకాల గురించి చింతించ వద్దు. ఆ యాభై తొమ్మిది శ్లోకాలను నువ్వే రచించు ”అన్న వాణి విన్పించింది .అంతే ఆయన లోని కవితా గంగ ఉత్తుంగ భావ తరంగాలతో ప్రవహిన్చిందట .నిమిషాల మీద ఆ యాభై తొమ్మిది శ్లోకాలు అలవోకగా  శంకరుల నోటి నుండి అపూర్వం గా నభూతో గా వెలువడ్డాయట .కనుకనే సౌందర్య లహరి లో లలితా పరమ భట్టారిక ఇచ్చిన 41 శ్లోకాలలో మంత్రాను ష్టానానికి సంబంధించిన కఠిన నియమాలతో ఉన్న మంత్ర ,కుండలినీ యోగాలు ,శ్రీ విద్యో పాసనా ఉన్నాయి . గురుముఖతహా నేర్చుకొని నియమ నిష్టలతో అనుష్టించాల్సినవే ఇవన్నీ .ఏ మాత్రం తప్పు జరిగినా బెడిసి కొడుతుందని విశ్వ సిస్తారు .కనుక సౌందర్య లహరి లో మొదటి 41 శ్లోకాలు అమ్మ వారిచ్చినవి తరువాతి 59 శ్లోకాలు శ్రీ శంకర కృతం .ఏవైనా అమ్మ  వారి వర ప్రసాదమే  సౌందర్య లహరి .
సౌందర్య లహరి శ్లోకాలన్నీ చిక్కని పడ బంధం తో ఉంటాయి .ఏ పదాన్ని మార్చలేం .ఒక  వేళ  సాహసం చేసి పెట్టినా రస స్ఫూర్తి కల్గించదు .అది భగవద్దత్తం .
శ్రీ శంకరులకు పరమేశ్వరుడు అనుగ్రహించిన పంచ లింగాలలో ఒకటి కంచిలోని యోగ లింగం –చంద్ర మౌలీశ్వరుని గా పూజింప బడుతున్నాడు .రెండవది కేదార నాద్ లోని ముక్తి లింగం ,మూడోది నేపాల్ దేశం లోని వర లింగం ,నాల్గవది చిదంబరం లోని మోక్ష లింగం ,అయిదవది శృంగేరి లోని భోగలింగం గా చెబుతారు ,
శ్రీ శంకర జయంతి నాడు శ్రీ శంకరుల అద్వైతామృతాన్ని ,గ్రోలుతూ ,స్తోత్ర మకరందాన్ని ఆస్వాదిస్తూ ,జ్ఞాన జ్యోతి వైపు అడుగులు వేద్దాం .ఆ మహాను భావుడిని ఒక సారి సంస్మరించుకొనే మహద్భాగ్యం నాకు కల్గినందుకు ఆనందం గా  ఉంది
”  నారాయణ సమారంభాం -శంకరాచార్య మధ్యమాం -అస్మదాచార్య పర్యన్తాం -వందే గురు పరంపరాం ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -04 -12 .
      కాంప్-అమెరికా 

Posted in రచనలు | Tagged | 2 Comments

వందేళ్ళ తెలుగు కధ -౩

  వందేళ్ళ తెలుగు కధ -౩

         ‘’గ్రామీణ జీవన విధానం శిధిల మై పోతున్న తీరును పులికంటి కృష్ణా రెడ్డి కధలు గా రాసి ‘’మరపు రాని ఊరు ‘’ను చేశారు .మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రతి బిమ్బించే కధ ‘’ఊర బావి ‘’ కొలకలూరి ఇనాక్ రాశారు .వారికి మనో ధైర్యం కల్పించారు .మహిళ సంసారం లో పడే యాతనను వసుంధర ‘’మచ్చలు ‘’లాంటి కధల్లో చూపారు.ప్రత్యక్ష దైవ స్వరూపుల్లా భావించే వైద్యుల డొల్ల తనాన్ని బీనా దేవి ‘’ఫస్ట్ కేస్’’లాంటి కధల్లో అద్దం పట్టారు .ముప్పాళ  రంగ నాయకమ్మ ఒక ఫైర్ బ్రాండ్.భర్త తో పాటు భార్యకూ సమాన స్థాయి ఉండాలని తన కధల్లో తెలియ జెప్పారు .శివ రాజు సుబ్బ లక్ష్మి కూడా దంపతుల మధ్య స్నేహ సేతువు ఉండాలని ఆరాట పడింది .నారీ జన అంత రంగ భేరి మోగించింది .అదే ధోరణి లో అబ్బూరి చాయా దేవి కధలూ ఉన్నాయి .తెలంగాణా లోని వర్గ చైతన్యాన్ని వట్టి కోట ఆళ్వారు స్వామి ,కాళోజి ,సురమౌళి, కదల ద్వారా కలిగించారు .అంపశయ్య నవీన్ ,మలయశ్రీ ,కొద్ది గానే కధలు రాశారు .అప్పటికి ఇంకా మాండలికం ఊపు అందు కోలేదు.తెలంగాణా ఉద్యమం ఉద్ధృతం గా జరిగినా ,ఆ నేపధ్యం లో కధలు రాక పోవటం ఆశ్చర్యమే .భూస్వాముల దౌర్జన్యం ,మధ్య తరగతి చేత కాని తనం ,కింది వర్గాల నిస్సహాయ స్థితి పై కధలు ఆలస్యం గా వచ్చాయి .’’ బద్లా ‘’అనే కధా సంకలనం 1972-73 లో వెలువడటం తో కింది తరగతి ప్రజలకు ఆత్మ విశ్వాసం కలిగి ,తిరగ బడటం ప్రారంభించారు .

               సంఘానికి ,మనిషి కి ఉన్న అనుబంధాన్ని ,సామాజిక సంక్షోభాన్ని చిత్రించే ఉత్తరాంధ్ర కధకుల్లో పురిపండా,ఉప్పల,భ.రా.గో.,అల్లం ,బలివాడ పేర్కొన దగిన  వారు .ఎంత చేసినా తీరు మారని జీవిత విషాదాలను వీరు అద్భుతం గా చిత్రించారు .బడుగు జీవులు సాహిత్యం లో స్థానం పొందారు .కధా విషయం వారి చుట్టూ తిరిగి పెద్ద పీట వేసింది .ఈ కధా ప్రవాహం ఇలా కోన సాగుతూ ఉంటె ,సమాజం కోసం ,వ్యక్తుల కోసం త్యాగం భూమిక గా కధలు వచ్చాయి .అమరేంద్ర రాసిన ‘’జీవన జ్యోతి ‘’కధ లో కృష్ణ తాను పుట్టింది తన కోసం కాదని అనుభవ పరి పాకం తో హృదయం పరిపక్వం అవటం కోసం జీవిస్తూ ,జీవన పధం లో నిత్య యాత్రికుడు గా మిగిలి పోతాడు .మణి అనే  అన్ధురాలికి కళ్ళు తెప్పించ టానికి స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకొంటాడు .ఆ స్నేహితుడి మరణం ఇతన్ని జైలు పాలు చేస్తుంది .విడుదల అయిన తర్వాతా ,మణి,ఆ డాక్టరు వివాహం చేసుకొన్నట్లు తెలిసింది .వారికి పిల్లాడు కూడా పుట్టాడని అర్ధమైంది .వాడు బజార్లో ఆడు కొంటుంటే  ,ప్రమాదం నుంచి తప్పించి మణి కి అప్ప గిస్తాడు .ఆమెను చెల్లెలు గా భావిస్తాడు .ఆమె పాలిటి జీవన జ్యోతి అయాడు కృష్ణ .అప్పటికే కధ కొంత మార్గాన్ని మార్చు కొన్నది .సందట్లో సడేమియా లా శృంగార కధలూ విజ్రుమ్భించాయి .కృష్ణా పత్రిక లాంటి వాటిల్లోనూ అవి చోటు చేసు కొన్నాయి .1964

కృష్ణా పత్రిక రజతోత్సవ సంచిక లో ‘’ఆధునికాంధ్ర సాహిత్యం లో ఏదో వేడి సాతాలింపు సెనగలు మాత్రమే పని చేసి ,ఉద్రేకాలతో ప్రజల్ని గిలిగింతలు పెట్టి మత్తు లో పడేస్తూ  ఉన్నాయి .,మంచి ప్రమాణాలు ,సంఘ ఆరోగ్యానికి ,క్షేమానికి ,శుభ పరిణామాలకు పనికి వచ్చే రచనలు చేయాలి ,నిర్మాణా త్మకత  ఉండాలి ‘’అని ప్రఖ్యాత రచయిత్రి శ్రీ మతి ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ గారు ఆవేదన వెలి బుచ్చారు .

                   జంతు జీవితం పట్ల కూడా సానుభూతి ఉండాలని విశ్వనాధ సత్య నారాయణ గారు ‘’మాక్లీ దుర్గం లో కుక్క ‘’కధ రాశారు .ఆర్ధిక రంగం కుదేలైతే వచ్చే పరిణామాలను మా మంచి కధకులు శతావ దాని వేలూరి శివ రామ శాస్త్రి గారు ‘’డిప్రెషన్ చెంబు ‘’కధలో చిత్రీకరించారు .డిగ్రీ కంటే హృదయానికి ప్రాధాన్యత నిచ్చారు .’’గన్నేరు పూలు ‘’,’’ఒక్కటే చీర’’కధల్లో సామాజిక దృక్పధం వుంది .వితంతువుల అణగారిన ఆశలను ,దరిద్రం చేసే వికటాట్ట హాసాన్ని ,పేదల నిస్సహాయతను ,ధైర్యం తో కుటుంబాన్ని కాపాడిన మహిళను కళ్ళకు కట్టించారు .నిమ్న జాతుల వెతల్ని చింతా దీక్షితులు గారు ఆనాడే రాశారు .మనుష్యుల మధ్య ఆప్యాయతా ,అనురాగం ,ప్రేమ ,కారుణ్యం వర్ధిల్లి నప్పుడే సమ సమాజం సాధ్యం అని పోలి కేకలు లేకుండా ఆర్ద్రం గా కధల్లో ఆవిష్కరించారు మల్లాది రామ కృష్ణ శాస్త్రి .కధనానికి ఆయువు పట్లు శాస్త్రి గారి కధలు .ఆ నుడికారం ,సోంపు ,తెలుగు పదాల పోహళింపు అనితర సాధ్యం .కృష్ణా తీరాన మల్లాది వారు వీర విహారం చేస్తుంటే గౌతమీ తీరాన శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంఘ సంస్కరణ తో ,వ్యావహారిక భాషా పరి పుష్టం గా కధలు రాసి తెలుగు గుబాళింపు తెచ్చారు .ఈ శాస్త్రులు ఇద్దరు తెలుగు కధా ఆకాశం లో సూర్య చంద్రులై కాంతులు ప్రసరించారు .వేడినీ ,వెన్నెలను కుమ్మరించారు .శ్రీ శ్రీ ,ఆరుద్ర కధలు జనం నాడిని పట్టు కొన్నాయి .అవసర మైన చోట్ల నాడిని  కదిలించాయి .నరస రాజు కధలు సరస సల్లాపం చేశాయి .కర్తవ్య బోధనా చేసి ,సామాజిక మార్పునూ చూపాయి .చలం కలం పదును తో స్త్రీ సమస్యలను చర్చిస్తే ,తెన్నేటి హేమ లత కూడా గొంతు కలిపి తన ప్రతిభను చాటు కొంది .స్త్రీ వ్యక్తిత్వాన్ని సుసంపన్నం చేసే గొప్ప ప్రయత్నం చేశారు వీరిద్దరూ .కప్పగంతుల మల్లికార్జున రావు ,ఆర్.ఎస్.కే .మూర్తి ,పాలంకి రామ చంద్ర మూర్తి ,కోపూరి పుష్పా దేవి ,భమిడిపాటి కామేశ్వర రావు ,  ,ప్రోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి ,పోరంకి  దక్షిణా మూర్తి , , మొదలైన కధకులు వివిధ సామాజిక అంశాలను తమ కధల్లో ప్రతిబింబింప జేశారు .కావన శర్మ ఆధునిక శాస్త్ర సాకేతికాశాలను   వాటి ప్రభావాన్ని  కధల్లో ఆవిష్కరించారు .,

   సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-04-12క్యాంపు

  కాంప్—అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లోఉయ్యూరు- 29 పార్ధి గారి పార్లమెంట్

ఊసుల్లోఉయ్యూరు- 29

పార్ధి గారి పార్లమెంట్

మా ఉయ్యూరు లో సూరి పార్ధివ విశ్వ నాద శాస్త్రి అంటే ఎవరికీ తెలీదు ఒట్టు.కాని ‘’ పార్థిమాస్టారు ‘’అంటే అందరికీ తెలుసు . ఇది నిజం . ఆయన నా కంటే సుమారు పదిహేను ఏళ్ళు పెద్ద. ఏమయ్యా అని పిలిచుకొనే స్వతంత్రం మాది . చామన చాయగా వెడల్పు ముఖం తో తెల్లని లుంగీ ,అర చేతుల చొక్కా , చేతిలో వెదురు బెత్తం తో ఎప్పుడు కని పిస్తాడు . కాలేజి కి వెళ్ళే సందు మలుపు లో ఇల్లు . అటు వైపు కోట గోడ , ఇటు పార్ది గారిల్లు . ఇంటికి బయట ఉత్తరం వైపు విశాల మైన అరుగు , దక్షిణం వైపు చిన్న అరుగు . ఆ చిన్న అరుగు మీదే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షం .ఈ రెండు అరుగుల మధ్య ఇంట్లోకి సింహ ద్వారం . నుదుట చిన్న కుంకుమ బొట్టు .వెడల్పైన నోరు , గబా గబా గా మాట్లాడే తీరు . నెమ్మది స్వభావం . చాలా శాంత చిత్తం . తండ్రి గారు వెంకటప్పయ్య తల్లి అన్న పూర్ణమ్మ గారు . పార్ధిఆనాటి ఇంటర్ చదివినా ఇంగ్లీష లో మంచి దిట్ట . చక్కని శైలిలో డ్రాఫ్ట్ లు  ,అర్జీలు,వ్యాసాలూ  రాయగల వాడు . మంచి ఇంగ్లీష మాట్లాడుతాడు , రాస్తాడు . మాకు ఆదర్శం .ఎవరికే పని కావాల్సినా చేసి పెట్టె వాడు .ఎక్కడో కొంత కాలం ఉద్యోగం చేశాడేమో కాని , నాకు తెలిసి నంత వరకు ఎక్కడా పని చేయ లేదు . ఆస్తి పరులే .పార్ధి వాకిట్లో ఉత్తరాలు వేయటానికి  గోడకు పోస్టల్ డబ్బా గోడకు ఉండేది .

                పార్ది గారు  ప్రైవేట్లు చెప్పే వాదు .ఓనమాలు నేర్పటం దగ్గర్నుంచి ,అన్ని క్లాసుల వారికీ చెప్పే వారు .హై స్కూల్ లో పదవ తరగతి చదివే విద్యార్ధులకు  ఏడు ఎనిమిది తొమ్మిది వారికి ట్యూషన్ చెప్పే వాడు .ఆయన దగ్గర చదవని వారు దాదాపు తక్కువే .మేము హై స్కూల్ లో టీచర్స్ గా ఉన్నా ,ఆయన దగ్గరే ఎక్కువ మంది చదివే వారు .అందరి తో ను కలుపు గోలు తనం గా మాట్లాడే వాడు .ఊళ్ళో ప్రతి వారు ఆయనకు తెలుసు .అందర్నీ ఏదో వరుస పేరుతొ పలకరించటం పార్ది ప్రత్యేకత .అందరికీ తలలో నాలుక గా ఉండే వాడు .అంటే కాదు ఊళ్ళో ఏ ఆఫీసు లో ఎవరు ఉద్యోగం లో కి కొత్తగా వచ్చినా బదిలీ అయి వెళ్లి పోయినా అందరి పేర్లు ఆయనకు జ్ఞాపకం .అలాగే జిల్లా అధికారుల పేరులో ఆయనకు బాగా గుర్తు .మాకు చెబుతుంటే నోరు  వెళ్ళబెట్టె వాళ్ళం .

                 ఆ రోజుల్లో ఎనిమిదో తరగతి కి ప్రైవేట్ గా రాసే వీలుండేది .పాస్ అయితే సర్టిఫికేట్ ఇచ్చే వారు .దాన్ని ఆధారం గా మిడిల్ స్కూల్ లో ఉద్యోగం చేయటానికి ట్రైనింగ్ పొందే వారు .పార్ది ఇలాంటి వారికి ఎందరికో చదువు చెప్పి పాస్ చేయించారు .మా పెద్దక్కయ్య లోపాముద్ర ,దేవుల పల్లి లక్ష్మి పిన్ని వగైరా లంతా పార్థి గారిదగ్గర చదివి ఉతీర్ణు లైన వాళ్ళే .అంతే కాదుఆయన మెట్రిక్ వాళ్లకు కూడా ట్యూషన్లు చెప్పి ,పరీక్షకు కట్టించే వాడు .దీనికి తోడు హిందీ కూడా బాగా వచ్చిన వాడు .అందుకని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వ హించే ప్రాధమిక నుంచి రాష్ట్ర భాష వరకు పరీక్షలకు తర్ఫీదు ఇచ్చి పరీక్ష రాయించే వాడు.ఆయన దగ్గర చదివిన వారెవరు తప్పటం నేను విని ఉండ లేదు .మా పెద్దక్కయ ఆయన వద్ద చదివి రాష్ట్ర భాష పాస్ అయింది .ఇంత మందికి ఇన్ని విద్యలు నేర్పాడు పార్ది మాస్టారు .మాస్టారి  లోపలి హాల్ చాలా విశాల మైంది .దానికి దక్షిణాన ఖాళీ .అందుకని చాలా మంది పిల్లలు చదివే ఆవ కాశం ఉండేది .ఎప్పుడూ చేతి లో బెత్తం తో అందర్నీ కాపలా కాస్తూ ఎవరికి ఏది వచ్చిందో .రాలేదో తెలుసు కొంటూ పర్య వేక్షణ చేసే వాడు .ఆయన ఆరోగ్యం అంత మంచిది కాదు ఉబ్బసం తో బాధ పడే వాడు .ఎప్పుడూ డాక్టర్లు ,మందులు .అయినా ఎక్కడా అశ్రద్ధ ఉండేది కాదు .మహా ఓపిక మనిషి .

                    పార్ది తమ్ముడు భాస్కర శాస్త్రి మా తమ్ముడు కృష్ణ మోహన్ సహాధ్యాయి .వాడిని మేము ‘’మామా ‘’అని పిలిస్తే వాడూ మమ్మల్ని ‘’మామా ‘’అని పిలిచే వాడు . పార్ధి దగ్గర మా మేనల్లుడు అశోక చదివాడు చిన్న క్లాస్ నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు .మా అక్కయ్య ,బావలు ఉద్యోగ రీత్యా ఎక్కడో బీహారు లో ఉంటె వీడు మా ఇంట్లో ఉండి దువు కొన్నాడు .అలానే మా చిన్న మేనల్లుడు శాస్త్రి కూడా కొంత కాలం పార్ది శిష్యుడే .మామేనమామ  గారి పిల్లలంతా ఆయన వద్ద చదివిన వారే .ఆ రోజుల్లో ఇలా ప్రైవేట్లు చెప్పే వారి లో కటకటాల మేష్టారు అని పిలువ బడే బ్రహ్మాజీ రావు సీతం రాజు కోటేశ్వర రావు గారు .మా గురువులు వేమూరి శివ రామ క్రిష్నయ్య గారు ముఖ్యులు .అందరి వద్దా పిల్లలు బానే ఉండే వారు .అప్పుడు ట్యూషన్ ఫీజు -ఎన్నో క్లాస్ చదివితే నెలకు  అన్ని రూపాయలే . .అంతకంటే ఎక్కువ ఉండేది కాదు .అంటే ఒకటో క్లాస్ వాడికి నెలకు ఒక్క రూపాయి, పదో క్లాస్ వాడికి నెలకు పది రూపాయలు .అదే ఆధారం కాదు కనుక పార్ది గారికి ఇబ్బంది ఉండేది కాదు .ఎవర్నీ పీడించే వాడు కాదు .అందరు అభిమానం గా డబ్బు అంద జేసే వారు .కొంత మంది ధాన్యం అంటే వడ్లు కూడా ఇచ్చేవారు .చాలా కాలానికి కానీ పార్ధి  గారి పెళ్ళికాలేదు అనారోగ్య రీత్యా .ఆ తర్వాతా అబ్బాయి ,అమ్మాయి కలిగారు .ఇదీ పార్ది గారి ఒక పార్శ్వం .

                      సాయంకాలం అయిదు ఆయె సరికి అందరం మా విధి నిర్వహణ అయి పోయి పార్ది గారి అరుగుల మీద చేరే వాళ్ళం .అదే ‘’పార్ది గారి పార్ల మెంట్ ‘.చిన్న అరుగు మీద చివర ఇంటి తలుపుకు దగ్గర గా చేతిలో బెత్తం  పక్కన ఇండియన్ ఎక్ష్ప్రెస్  పేపరు తో  పార్థి కూర్చుండే  వాడు .నేను ,ముత్తయ్య మాస్టారు ,వెంట్ర ప్రగడ సాంబయ్య ,ఊర సుబ్బారావు వెంట్రప్రగడ వెంకటేశ్వర్లు ,దస్తా వేజులు రాయటం లో సిద్ధ హస్తుడు  కొలచల వెంకట రామయ్య గారు ,కొలచల చల పతి ,ఎల్ ఐసి ఏజెంట శ్రీహరి రావు ,ఇంకో గబా గబా మాట్లాడే అజేంట్ ,కే.సి.పి.లో అకౌంట్ ఆఫీసర్ భాస్కర రావు . మండా వీర భద్ర రావు మొదలైన వారంతా చేరే వాళ్ళం .ఒక గంట కాల క్షేపం .దేశం లో ,విదేశాలలో జరిగిన జరుగుతున్నా విషయాలన్నీ చర్చించే వాళ్ళం .ఆ ఉదయం నుండీ సాయంత్రం వరకు ఊళ్ళో జరిగిన ప్రతి విషయం పార్ధికి తెలిసి పోయేది క్షణాల్లో .ఎలా వివ రాలు సంపాదించే వాడో మాకు  అంతు చిక్కేది కాదు .మాకందరికీ అవి ఒక్కొక్కటి పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .కొలచల వెంకట్రామయ్య గారు నత్తి తో మాట్లాడే వాడు .మా నాన్న కు క్లాస్ మేట్.మోకాళ్ళకు పైనే ఉండే నేత పంచె గోచీ పోసుకొని కట్టుకొని ,పైన తువ్వాలతో ఆయన ఎక్కడైనా ప్రత్యక్షం .నాకు తెలిసి నంత వరకు ఆయన ఎప్పుడూ చొక్కా తొడగ లేదు .రిజిస్త్రార్ ఆఫీసుకు వెళ్ళినా, కలెక్టర్ని కలిసినా అదే వేష ధారణా .మా కళ్ళకు ‘’మా వూరి గాంధి ‘’లా కని పించే వాడు .ముసలి తనం లో చేతి లో కర్ర ఊతం గా ఉండేది .చదవటానికి ,రాయ టానికి తప్ప కాళ్ళ జోడు అవసరం ఉండేది కాదు .ప్రపంచ రాజకీయాలన్నీ  కరతలా మలకాలే . .జెనరల్ స్మత్స్ నుంచి  బ్రిటీష వాళ్ళు వివిధ దేశాల్లో చేసి’’న రాజకీయం గురించి ,స్వాతంత్ర పోరాటాల గురించి నేటి రాజ కీయం వరకు ఏకరువు  పెట్టె వాడు .ముత్తయ్య మేష్టారు’’ నైన్తీన్ ఫార్టీ ’’అంటూ ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళే వారు .నేను మాత్రం ఆ రోజు ఉదయం పేపర్లన్నీ స్కూల్ లోనో ఇంట్లోనో లైబ్రరి లోనో చదివి విశేషాలన్నీ తెలియ జేసే వాడిని .అందరు ఆసక్తి గా వినే వారు .సాంబయ్య గారిది ఒక ప్రత్యేకత .నేను చెప్పిన దాన్ని కాసేపు అయినతర్వాత మాకే మాకు తెలియ నట్లు చెప్పే  వాడు .నవ్వు కొనే వాళ్ళం .అన్ని రాజకీయాలు మాట్లాడు కొనే వాళ్ళం .నేను ఏదైనా  పార్థి గారి అరుగు మీద తెలిసిన సంగతి ని మా ఇంట్లో చెబితే మా నాన్న ‘’ఏరా!ఇది  పార్ధిగారి పార్లమెంట్ న్యూసా ?’’అని హేళన గా నవ్వే వాడు .అంటే కొంత విశ్వాస నీయత ఆ విషయాలలో ఉండేది కాదని ఆయన అభి ప్రాయం .ఇలా సాయంత్రం ఆరు గంటల దాకా కాల క్షేపం చేసి నేను ఉయ్యూరు సెంటర్ కు వెళ్లి కాసేపు నుంచొని అక్కడి మిత్రులతో కాలక్షేపం చేసి కేశవ హోటల్లో ఆరగా ఆరగా అర కాఫీలు తాగుతూ  కాంతా రావు ,ఆంజనేయ శాస్త్రి ,పిచ్చిబాబు ,రామ కృష్ణా రావు గారు ,నేను కొంత సేపు గడిపి ఇళ్ళ దగ్గర మా’’ దుకాణం’’కోసం అంటే ప్రైవేటు ట్యూషన్ల కోసం వచ్చేసే వాళ్ళం .

                    రాత్రిళ్ళు’’ దుకాణం ‘’ అయి పిల్లల్ని ఇళ్లకు పంపేసి,భోజనాలు చేసి మళ్ళీ పార్ది గారి పార్ల మెంట్ కు చేరే వాళ్ళం .ఈ సమయం లో ఎక్కువగా చల పతి, నేను ,పార్థి,సాంబయ్య, శ్రీహరి రావు, భాస్కర రావు వంటి ఒక అరడజన్ మంది  మాత్రమే ఉండే వాళ్ళం .ఎన్నో విషయాలు మాట్లాడు కొనే వాళ్ళం .అందులో ముఖ్యం రాజ కీయాలు .గుండు శ్రీ రామ చంద్ర మూర్తి కూడా వచ్చే వాడు అతను నాకు మేన మామ వరుస .హిస్టరీ లో ఏం .ఏ పాసై  లెక్చరర్ గా పని చేసే వాడు .ఆర ఎస్.ఎస్. జనసన్ఘ్ కార్య కర్త .మాకూ అప్పుడు వాటితో బానే పరిచయం ఉండేది . అసెంబ్లి ,,పార్లమెంట్ లకు ఎన్నికలు జరిగాయి అంటే మేమంతా ఎన్నికల ఫలితాల కోసం పార్ధి గారింటి పక్కనే ఉన్న మా స్నేహితుడు సూరి నరసింహం ఇంట్లో ఉన్న రేడియో వార్తలను వినే వాళ్ళం .ఒక్కో సారి తెల్ల వారు ఝాము  వరకూ లేటెస్ట వార్తలను వింటూ  కాంగ్రెస్ ఓడి పోతుంటే కేరింతలు కొడుతూ ,రామం ,వీర భద్ర రావు లు ఇప్పించే  టీలు తాగుతూ  సందడి చేసే వాళ్ళం .ఒక సారి ఢిల్లీ పార్లమెంటు సీట్లు అన్నీ జనసన్ఘ్ కు వస్తే మామ రామం చేసిన హడా విడి అంతా ఇంతా కాదు. స్వీట్లు తెచ్చి అందరికి పంచాడు .పార్ది గారు మాత్రం సమయ పాలన చేసే వాడు .రాత్రి  పది దాటితే ఇంట్లోకి వెళ్లి పోయే వాడు .మళ్ళీ ఉదయమే దర్శనం .అలా మా ‘’పార్ధి  గారి పార్ల మెంట్ ‘’మాకు ఎన్నో విషయాలను తెలియ బరచేది .జెనెరల్ నాలెడ్జి ని అందించింది .రాజ కీయ అవగాహన పెంచింది .మాట్లాడే తీరు ,అభిప్రాయ ప్రకటన చేసే విధానం ,అవతల వాడు చెప్పే దాన్ని ఓపిగ్గా వినే ఓర్పు, అవసర మైతే మాటకు మాట అంటించే నేర్పు, హాస్యం, రిపార్టీ, ,మనసును గాయ పరచ కుండా మాట్లాడటం వ్యంగ్య వైభవం అన్నీ నాకు అలవాటు అయాయి అంటే అది ‘’పార్ది గారి పార్ల మెంట్ ‘’కారణం అని నిస్సందేహం గా  చెప్పగలను .నా వంటి వారికి అదో విద్యా శాల .ఎవ్వరం హద్దు దాటే వాళ్ళం కాదు .ఆవేశ ,కావేశాలతో మాట్లాడుకొన్నా అక్కడితోసరి .మళ్ళీ మర్నాడు మామూలుగానే పలకరించుకొనే సంస్కారం అబ్బింది .దీనికి ఉదాహరణే మా ‘’పార్ది మేష్టారు ‘’. ఊళ్ళో చదువు కొనే వారందరికి ఆయన ఇల్లు ఒక విద్యా లయం  అయితే ,మా బోటి కాలక్షేపం రాయుళ్లకు రాజ కీయ వేదిక  అయింది ఆయన వీధి అరుగు .

             మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-04-12

            క్యాంపు –అమెరికా  

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ–2

     వందేళ్ళ తెలుగు కధ–2
 రచయిత  తన అవగాహన మేరకు ఆలోచించి ,ఆలోచిస్తూ రచనలు చేస్తాడు .చదివే వారు కూడా ఆలోచిస్తూ చదివి ,చదివిన తర్వాత కూడా ఆలోచిస్తారు .రచయిత రచనను నైతిక ఆయుధం గా భావిస్తాడు .సృష్టించే శక్తి పెరిగిన  కొద్దీ ,వ్యక్తీ రచయిత అయినట్లే ,చదివే శక్తి పెరిగిన కొద్దీ చదువరే . విమర్శకుడు అవుతాడు .ఇదే రచయితకు చదువరికి ఉన్న సంబంధం అన్నారు ప్రఖ్యాత కధకులు మధురాంతకం రాజా రాం .సమకాలీన సమస్యను సార్వ కాలీనం చేయటమే గొప్ప రచయిత చేసే పని .అవే క్లాసిక్స్ గా మారుతాయి అన్నారు పోలా ప్రగడ వారు .సంఘర్షణ  లేని జీవితం ఉండదు .సమస్య లేని రోజూ ఉండదు .మనిషికి ,సమాజానికి మధ్య సమన్వయము సాధించాలి .ఆ పనిని కధకుడే  చేయ గలడు . మనిషి చరిత్ర అంతా కధే .జీవన ,జీవిత ప్రవాహం లో సమాంతరం గా కధా స్రవంతి ఉండాలి అంటారు శ్రీ విరించి .సమాజం ,సాహిత్యం పరస్పర ఆశ్రయాలు .రచయిత వ్యక్తిత్వాన్ని బట్టి ,సమాజం పై వేసే ముద్ర ,తెచ్చే స్పందన ఉంటాయి .రచన లో తెలుగుదనం ఉత్తి పడాలి .ఇలాంటి స్పృహ తో వచ్చిన కధలన్నీ ,అర్ధ శతాబ్దం ముందు కాలమ్ లో తెలుగు కధా వీధి లో ప్రకాశించాయి .
స్వాతంత్రం వచ్చి న కొత్త ,రాష్ట్రం ఏర్పడిన ఆనందం ,అంతకు ముందు స్వంత  రాష్ట్రం కోసం ఆరాటం ,పోరాటం  ,భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ,మళ్ళీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ ,ఇవన్నీ మన కధల్లో ప్రతి బిమ్బించాయి .ప్రముఖ కధా రచయిత ముని పల్లె రాజు గారి ”వీర కుంకుమ ”కధ ,తెలుగు వారిలో ఆశా దీపాలు వెలిగించింది .భవ్యమైన ,దివ్యమైన రాష్ట్రం వస్తుందని ఆశ పెంచింది .ప్రఖ్యాత కధా రచయిత పాల గుమ్మి పద్మ రాజు గారి ”గాలివాన ”కధ అంతర్జాతీయమైంది .రాయల సీమ లోని పల్లె పట్టుల్లో ఉన్న ముగ్ధత్వాన్ని ,ఆ మనుషుల భావ జాలాన్ని జమదగ్ని ”మరపు రాని కధ ‘గా రాశారు .కృష్ణా జిల్లాలో నీరు పుష్కలం గా లభిస్తుంది .రాయల సీమ లో నీటి చుక్క గగన కుసుమం ..కనుక అక్కడి వాడు ఇక్కడికి వస్తే పొందే ఆనందం ,ఆ ఆనందం తో కృష్ణ లోకి దూకటం ,మునిగి పోవటం కనులను చెమర్చే విధం గా పెద్ది భొట్ల సుబ్బ రామయ్య గారి కధ ”నీళ్ళు ” కన్నీళ్ళే తెప్పిస్తాయి .భార్యా భర్తల మధ్య ఉండాల్సిన అనురాగం ,భర్త అమాయకుడైతే భార్య ఇంటిని ఎలా తీర్చి దిద్దు కొనేది ముని మాణిక్యం గారి కాంతం కధలు  అయస్కాంతం గా ఆకర్షించాయి .ఆడ దాని కన్నీరు అనర్ధం అని ”అలరాస పుట్టిళ్ళు ” కధ లో శ్రీ మతి కళ్యాణ సుందరీ జగన్నాద్
అద్భుతం గా చూపించారు .ఆలు మగల మధ్య ఉండాల్సిన అనుకూలత పై కొమ్మూరి వేణుగోపాల రావు రాస్తే ,మగ వాడి పైశాచిక హస్తాలలో చిక్కు కొని కూడా ,గర్వం గా నవ్వే ,అబల గురించి ,పురాణం సూర్య ప్రకాశ రావు రాశారు .అప్పటికి ఇంకా కులాంతర ,మతాంతర   వివాహాలు కొత్తవే .వాటి సానుకూల,ప్రతి కూలత పై కొనకళ్ళ ”సంప్రదాయం ”కధ రాశారు .స్త్రీ విద్యా ,వితంతు వివాహాలు సాధారణ మై పోయాయి .స్త్రీ తన కాళ్ళ పై తాను నిలబడాలి అన్న ఆలోచన బలీయమై పోయింది .ఆర్ధిక స్థితి గతులు అధ్వాన్న మై పోవటం తో ,కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేక ఆడ పిల్లల తలిదండ్రులు వాపోతున్నారు .వీరి వేదనలను శ్రీమతి పరిమళా సోమేశ్వర్ ”క్రోటన్ మొక్కలు ”కధలో చిత్రీకరించారు  .మగ వాడి విచ్చలవిడి తనాన్ని క్లబ్బులు ,రేసులు ,తాగుడు ,గురించి కధలూ విచ్చల విడి గానే వచ్చాయి .అసలైన మధ్య తరగతి జీవితం గురించి వాకాటి పాండురంగా రావు ,కలువకొలను సదా నంద మంచి కధలు రాసి అభిమానం పొందారు .సామాజిక స్తితులు వెగటు పుట్టిస్తే  ,ఓర్పు నశించి ,తిరుగు బాటు వస్తుంది .ఈ నేపధ్యం లో కధా రారాజు కా.రా.మాస్టారు ”చావు ;;కధ రాసి ఒక మలుపు తిప్పారు .వారి” యజ్ఞం ” కధ సమస్యకు పరిష్కారమే .ఈ కధకు విశేష గౌరవం వచ్చింది .సినిమా గా కూడా తీశారు .భారత ప్రధానిగా పని చేసిన పీ.వి.నరసింహారావు గారు అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం పై ”మంగయ్య అదృష్టం ”కధ రాశారు అన్న సంగతి చాలా మందికి తెలియక పోవచ్చు .స్త్రీ విద్య అవసరం గురించి ,భండారు అచ్చమాంబ ”ధన త్రయోదశి ”కధ రాసి అసలు తెలుగు కధ దీనితోనే ప్రారంభమయిందా అని పించారు కూడా .
ఉప్పల లక్ష్మణ రావు ”నిద్ర లేని రాత్రి ”కధ లో తెలంగాణా సాయుధ పోరాటం గురించి రాశారు .సైనిక పటాలం చేసే వికృత చేష్టలను ప్రముఖ రచయిత మల్లాది ”మంత్ర పుష్పం ” కధ గా  చెప్పారు ”.బల్ల కట్టు ” కధ లో మాధవ పెద్ది గోఖలే రవాణా లో వచ్చిన సామాజిక మార్పులను చిత్రించారు .ఆయన జాన పద శైలి అనితర సాధ్యం అని పిస్తుంది .ఉమ్మడి కుటుంబాలలో ఉన్న పొర పోచ్చాలు ,వాటి వల్ల కుటుంబ వ్యక్తులపై పడే ప్రభావాలను త్రిపురనేని గోపీ చంద్ తన కధల్లో ప్రతిబింబింప జేశారు .తిలక్ కధల్లో స్త్రీ స్వయం నిర్ణ యాధి కారి గా కని పిస్తుంది .అటు తెలంగాణా లో మిలిటరీ చర్య పై నెల్లూరి కేశవ  స్వామి ”యుగాంతం ”కధ రాస్తే ,కాళోజి నారాయణ రావు ”లంకాపునరుద్ధారణ  ”పేరుతొ రావణ కాష్టం ,నిత్యాగ్ని హోత్రం గా సైనిక చర్యను కధ రాసి వర్ణించారు .మానవ జీవన సంఘర్షణ నేపధ్యం గా స్మైల్ ”ఖాళీ సీసాలు ”కధలు రాస్తే ,లంపెన్ ప్రోలిటారేట్ జీవితాలపై రా.వి.శాస్త్రి కధలు రాశారు .ఆడ మగ ల మధ్య మంచి సంబంధాన్ని ”సైరంధ్రి ”కధ లో కో’కు’.వివరిస్తే ,ధనిక వర్గ దాష్టీకాన్ని ,దాని ద్వారా పెరిగిన అవినీతి నేరాలు ,కళ్ళకు కట్టించారు రా.వి.శాస్త్రి .నక్సల్ బరీ పోరాటం వీరులకు వీర గంధం పూసే రచనలను వి.ర.సం.వారు బాగా చిత్రీకరించారు .సమాజం లో మార్పు వారి  వల్లే సాధ్యం అని నమ్మారు .గిరిజన పోరాట వృత్తాంతాలతో ఉత్తరాంధ్ర కధకులు కధల్లో తీర్చి దిద్దారు .వారి వెన్నంటి నిల బడ్డారు .ఉనికి ,మారుతున్న తీరులలో అభద్రతా గురించి ప్రముఖ కధకుడు చా.సో.”జంక్షన్ లో బడ్డి ”కధ రాశారు.
సశేషం
        మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ —24 -04 -12
                   క్యాంపు -అమెరికా 
Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

                కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2009  మే లో నిర్వహింప బడినవందేళ్ళ తెలుగు కధ సదస్సులో నాకు ఇచ్చిన  ఈ విషయం పై నేను రాసి సమర్పించిన వ్యాసం ఇది .దాదాపు మూడేళ్ళ తరువాత మీకోసం వెలుగు చూస్తోంది .

          కధ అనేది చెప్పటం ,వినటం తో ప్రారంభ మైంది .తర్వాత రాయటం ,చదవటం గా మారింది .మళ్ళీ రాయటం ,వినటం ,రాయటం చూడటం దాకా మాధ్యమాల  వల్ల పరిణామం చెందింది .వినటం లో ఉన్న హాయి ని చదవటం ద్వారా పొందేట్లు చేయటం మంచి కధా రచయిత దృక్పధం .వందేళ్ళ క్రితం వక్ర మార్గం లో పడిన జీవితాన్ని ఒక సారి పరిశీలించు కోని,దారి మార్చుకొని ,”దిద్దు బాటు చేసుకొని మంచికి మార్గం చూపించాడు గురజాడ .మార్పు లేక పొతే జీవన యానం సాగటం కష్టం అని సారాంశం .ఆ దిద్దు బాటు అందరికీ హెచ్చరికే .కధలో ,కధనం లో వినూత్నత ఉండటం వల్ల దిద్దు బాటు కధను ఆధునిక తెలుగు కధ గా స్వీకరించారు .అలా ప్రారంభ మైన తెలుగు కధానిక నిత్య చలన శీలిగా ,ప్రవహిస్తూనే ఉంది .మధ్యలో ఎన్నో వాదాల సెలయేళ్ళు ,భావాల పరవళ్ళు ఆ ప్రధాన శ్రోతస్విని లో కలిసి నిండుదనాన్ని ,పుష్టినీ ఇచ్చాయి .

కధా రచయిత బాధ్యత కూడా పెరిగింది .తాను సమాజం నుంచి వేరు కాదని సమాజ హితమే తన ధ్యేయమని భావించాడు .వ్యష్టి ,సమష్టిల సమన్వయము అర్ధం చేసుకొన్నాడు .రచయిత సమాజానికి ఆత్మ కావాలి అన్న ప్రఖ్యాత రచయిత మాక్సిం గోర్కీ మాటలను మననం చేసుకొన్నాడు .మూధతం నుంచి సమాజ వికాసానికి సమాజాన్ని మార్చే ప్రయత్నాలు సాగించాడు .చెప్పే దాన్ని అండం గా ,ఆకర్షణీయం గా ,బలం గా చెప్పే ఒడుపు తెలుసు కొన్నాడు .ఇదే శిల్పం .దీన్ని బట్టే రచన చేసిందెవరో చెప్పే యచ్చు .డాక్యు మెంతరి లాగా కాకుండా ,మనోహరం గా చెప్పే దారి చూపించాడు .దృష్టి వైశాల్యము హృదయ వైశాల్యమూ పెంచు కొన్నాడు రచయిత ..వాస్తవికత అంతర్వాహిని గా సాగటమే కాకుండా వన్నె తెచ్చింది .ప్రపంచ సాహిత్యం లో ,ఏ ఇతర భాషా సాహిత్యానికీ తీసి పోనిది తెలుగు కధా సాహిత్యం అని నిరూపించాడు .అతి విస్తృత మైంది .అన్ని కొనాల లోని కధలు వచ్చి చేరి సుసంపన్నం అయింది .అయినా మన విమర్శకులకు ఇంకా తృప్తి కలగ లేదు .ద్రౌపది గాంధార రాగం ఆలపించి ,భీమ సేనున్ని జాగృతం చేసి నట్లు మన కధ కులు కూడా గాంధార రాగ మాల పించి,జాతిని చైతన్య వంతం చేయాలి అని ప్రఖ్యాత కధకులు రచయిత రావూరి భరద్వాజ అన్నాడు .అందుకనేనేమో సర్వేపల్లి రాధాకృష్ణ  పండితుడు ‘’కాల పరీక్ష లో నిలిచిన భావాలలో ఏవి మన అభివృద్ధి కి తోడ్పడు తాయో ,వాటినే స్వీకరించాలి .వాటి వెలుగులతో మన నడవడిని ఏర్పరచు కోవాలి అప్పుడే మనం అభ్యుదయ పధం లో ఉన్నట్లు ‘’అన్నారు .

       సృజన శీలి అయిన కధకుడు తన రచనలలో తాను తాదాత్మ్యం చెంది ,ఇతరులకూ తన్మయత్వాన్ని కల్గిస్తాడు .అప్పుడే ఉన్నత మానవుదేర్పడుతాడు .ఏదో విషయం దొరికింది కదా అని రాసేయ రాదు .’’సాహిత్యం పండ్ల గంప కాకూ డదు .నిచ్చెన మెట్లు అవాలి ‘’అన్నారు కధా శ్రీ పాదులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఈ భావన ఉంటె మహోన్నత తెలుగు కధ వస్తుందని వారి భావం .కధ జీవితాన్ని ప్రతి బిమ్బించేదే కాదు ,వ్యాఖ్యానించాలి .రంజింప చేయటంతో పాటు ,మేధస్సును కూడా కదిలించాలి అన్న కొడవటి గంటి కుటుంబ రావు మాటలు అనుసర ణీయం.అభ్యుదయం కోసం రాజ కీయ ,సామాజిక,ఆర్ధిక దృక్పధాలకు స్థానం కల్పించాలి .ఇవి పరస్పరం ఆధార మైనవి .ఒక దాని ప్రభావం మిగిలిన వాటి పై ఉంటుంది .ఆ ప్రభావం తో జనం ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి .వేధింపులు ,సాధింపులు పెరుగు తాయి .వ్యత్యాసాలు కూడా ఎక్కువ అవుతాయి .కలవటం కంటే విడి పోవటం ఎక్కువ అవుతుంది .సహజం గా ఉన్న ఓర్పు నశిస్తుంది .నిరసన ప్రారంభమై ,ఉద్యమ రూపం దాలుస్తుంది .ఆశయ సాధన కోసం తెగింపు వస్తుంది .తిరగ బడటం ,అశాంతి ,అల్లా కల్లోలం పెరిగి జన జీవనం చిద్రమౌతుంది .దాన్ని మళ్ళీ గాడి లో పెట్టటం బ్రహ్మ ప్రళయమే అవుతుంది .మానవ సంబంధాలు మారి పోతున్నాయి .పోటీలో నిలబడ టానికి ఎంతటి కైనా తెగించే సాహసం కలుగు తుంది .ప్రభుత్వాలు ,చట్టాలు మారి పోతాయి .పాలనా సౌలభ్యం అనే పేరు తో తెచ్చే మార్పులకు జనం విల విల లాడి పోతారు .

           విదేశీ వ్యామోహం ఒక వైపు ,ఉన్న భూమి ఆవిరై పోవటం మరో వైపు, కొద్ది మంది సుఖం కోసం బడుగు జీవితాలను ధ్వంసం చేయటం ,స్వేచ్ఛ హరించుకు పోవటం ,కుటుంబ కలహాలు ,అస్తిత్వ నిరూపణ ,నిరుద్యోగం ,చదివిన చదువుకు తగిన గుర్తింపు ,జీతం రాకుండా పోవటం ,భార్యా భర్తల్లో ఎవరిది పైచేయి అన్న భావం ,రక్షణ చూపని వ్యవస్థా ,కాలేజీలలో ఆగడాలు ,ఒకటా ,వందా?అంతు లేని సామాజిక అంశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జన జీవనం .పరిష్కారం కని పించని ఆరాటం ,పోరాటం .ఇవన్నీ కానీ ,ఇందులో కొన్ని కానీ ఈ వందేళ్ళ లో ఉన్న అంశాలే .సంఖ్య కాల క్రమం లో పెరుగు తోందే కాని తగ్గటంలేదు .తెలుగు కధా ప్రస్తానం లో ఈ సామాజిక అంశాలను పరిశీలించ టమే ఈ వ్యాసం ధ్యేయం .

              సశేషం ———-గబ్బిట దుర్గా ప్రసాద్.

                        క్యాంపు—అమెరికా

Posted in రచనలు | Tagged | 1 Comment

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్ -2

This slideshow requires JavaScript.

అమెరికా డైరీ సంకీర్తన షవర్ల తో పులకిస్తున్న షార్లెట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికాలో సత్య సాయి భజనలు

This slideshow requires JavaScript.

Posted in అమెరికా లో | Tagged | 1 Comment