వీక్షకులు
- 1,107,543 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆరణ్యకాలు
అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు
అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు ఏకాంత వాసం లో దీర్ఘ తపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి, వ్రతాలు ,ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లుజ్ఞానకాండకు సంబంధినవి .వేద మంత్ర భాగాలను సంహితాలని, వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోని కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని, వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్లు లేక వేదాంగాలని అంటారు. ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం, కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం, మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం సామవేదానికి తలవకారఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ 4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని అంటారు తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని ‘కథాకాని ‘’అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది 2వది మహాయజ్ఞ నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు. కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు13 శ్రవణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది.ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు. ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. … Continue reading

