ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3

 ముదిమిలోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు —3
                                                                డిగ్రీ చదువు 
                   గుంటూరు ఏ.సి .కాలేజి లో రావు గారు బి.ఏ. లో చేరారు .అప్పుడే బాపిరాజు గారు కూడా మీజాన్ వదిలిగుంటూరు   చేరుకున్నారు .మళ్ళీ గురుశిష్య సంబంధం గట్టి పడింది .అప్పుడే విజయంవాడ లో ఆకాశవాణి కేంద్రం మొదలైంది .బాపిరాజు దానికి సలహాదారు అయారు .గుంటూరు లో ”కళా పీఠం ”ఏర్పరచి ,చిత్రలేఖనం లో బాపిరాజు శిక్షణ ఇచ్చే వారు .యువకులైన వెంకటేశ్వర రావు వంటి వారి సాయం తో గొప్ప చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు .ఆ సమయం లో బి.ఎస్ .కృష్ణ ”కాంగ్రెస్ ”పత్రిక నడిపే వారు .”ఆంధ్రా రిపబ్లిక్ ”పత్రిక కూడా వస్తుండేది .రాజ్యం సిన్హా మద్రాస్ నుంచి ”మాతృభూమి ”మాస పత్రికను నడిపే వారు .ఆమె ముదునూరు కాంగ్రెస్ నాయకులు అన్నే  అంజయ్య గారి అన్న కుమార్తె .శాంతినికేతన్ విద్యార్ధిని .ఆమె భర్త విజయకుమార్ సిన్హా ” The Times of India ” లో ఎడిటింగ్ సెక్షన్ లో పని చేసే వారు .ఆయన విప్లవ వీరుడు ,అకలంక దేశభక్తుడు అయిన షహీద్ భగత్ సింగ్ అనుచరుడు .భగత్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తరువాత సిన్హా గారిని మైనర్ అయినందు వల్ల  అండమాన్ దీవులకు పంపిందిప్రభుత్వం  .ఆయన అక్కడ జైలర్లకు ఒక విద్యాలయం ఏర్పాటు చేసి ,దేశ స్వాతంత్ర్యం అవసరాన్ని జాతీయ , పోరాటచరిత్ర  మున్నగు విషయాలను ప్రభావం చేస్తూ ప్రసంగించే వారు .తన అండమాన్ జీవితాన్ని గురించి ”,The Andamaan’s –The Indian Bastille ”. అనే గ్రంధం రాశారు .ఫ్రెంచ్ విప్లవం లో bastille జైలు కు వున్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే .సిన్హా జీవితం రావు గారిపై మంచి ప్రభావాన్ని చూపింది .  .
                    ఎకనామిక్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడ బాచ్ కు ,గుంటూరు బాచ్ కు పోటీ తీవ్రం గా వుంది .యెన్.టి .రామా రావు విజయవా డబాచ్   తరఫున వైస్ ప్రెసిడెంట్ గా పోటి చేశాడు .రావు గారిని తన పానెల్ ఎన్నికయేట్లు సహాయం చేయమని అడిగారు .గుంటూరు మిత్రులు అడ్డుకున్నారు .ఇద్దరికీ రాజీ మార్గంగా అందరితో మాట్లాడి రామా రావు ను వైస్ ప్రెసిడెంట్ గా ,కార్యవర్గం గుంటూరు వారికి ఇచ్చేట్లు రావు గారు ఒప్పందం కుదిర్చి ఘర్షణ నివారించారు .అందరు హాపీ .కాలేజి గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొన్నారు .పబ్లిక్ ఫైనాన్స్ డెమోక్రసీ చదివి ,దేశాన్ని ఆర్ధికం గా అభివృద్ధి చేసే విషయాలు తెలుసుకున్నారు .నెలకోసారి ”చర్చా సమావేశాలు ”జరిపే వారు .చర్చ రోజున రావు గారు ఖద్దర్ పైజమా ,చొక్కా ధరించే వారు .వారు అది ధరిస్తే ఆనాడు చర్చ ఉన్నట్లే లెక్క .రామా రావు ,జగ్గయ్య ,వల్లభ జోశ్యుల శివ రాం కాలేజీ లో నాటకాలు దర్శకత్వం చేస్తూ ఆడే వారు .రావు గారు కాలేజి మాగజైనును ఎడిటర్ గా వుండి నడి పెవారు .డిగ్రీ పూర్తి అవగానే ఉద్యోగాల వేట లో పడ్డారు .దేనిలోనూ ఎక్కువ కాలమ్ పని చేయ లేదు .
                                                ఉద్యోగ పర్వం 
                   గుంటూరు జిల్లా అమరావతి లో 1950 లో సోషల్ టీచర్ గా చేరారు అందరికంటే చిన్న ఆయనే.1950 ఆగస్ట్ 10 న తండ్రి గారు ముదునూరు లో ”జీవ ప్రాయశ్చిత్తం ”చేసుకొని స్వచ్చంద మరణం పొందారు .ఇక్కడ దీని గురించి వివరిస్తాను .మరణం ఆసన్నం అయింది తెలియగానే వెద పండితుల్ని పిలిపించి ”జీవ ప్రాయస్చ్ట్టం ”చేసు కోవటం విజ్ఞులకు అలవాటు గా వుండేది .దాదాపు ఆరు గంటలు వేదోచ్చారనతో జరుగు తుంది .అలా చేస్తే తెలిసి చేసినవి,తెలియక చేసినవి పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం .అంతే కాదు ఆ కార్య క్రమం అయి పోగానే యజమాని అనాయాసం గా మరణిస్తాడు .వీరి తండ్రి గారు కూడా ఆ రకం గాప్రాయశ్చిత్తం   చేసుకొని తీర్ధం తీసుకున్న వెంటనే మరణించారు .అదీ ”జీవ ప్రాయశ్చిత్తం ”మహాత్మ్యం .రావు గారి అన్న గారు శేషగిరి రావు కుటుంబ బాధ్యత స్వీకరించారు .”శాంతి నిలయం ”అనే ప్రైవేటు స్కూల్ నడపటం ప్రారంభించారు .
                   అమరావతి హై స్కూల్ లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావు గారికి సహ ఉపాధ్యాడు .ఆయన హిందీ పండిట్ .పాతశాలకు వచ్చే పత్రికలను విద్యార్ధులు చదివే ఏర్పాటు రావు గారు చేశారు .వీరి ప్రోత్చాహం చూసి చుట్టూ పరకాల గ్రామాల విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ,పాథశాల గ్రంధాలయాన్ని ఉపయోగించుకొనే వారు .రావు గార్తో [పరిసర గ్రామాలలో గ్రంధాలయాలను రావు గారితో స్థాపింప జేశే వారు .శిష్యులతో కలిసి గ్రంధాలయం   ఉద్యమాన్ని హరికధలు ,బుర్ర కధల ద్వారా వ్యాపింప జేశారు .విద్యార్ధుల విజ్ఞానాభి వృద్ధి కి ”విజ్ఞాన యాత్ర ”లకు తీసుకొని వెళ్ళేవారు .ఇటువంటివి ఆకాలాల్లో   ఏ స్కూల్ లోను జరిగేవి కావు .రావు గారి ముందు చూపు వల్లనే ఇక్కడ సాధ్యమైంది .”అమర జ్యోతి ”అనే పాథశాల పత్రిక ను కరుణశ్రీ తో కలిపి నిర్వహించారు . కరుణశ్రీ కి   మసూచి సోకితే ,నిర్భయం గా ఆయనకు సేవ చేసి నయం ఆయె దాకా కని పెట్టి వున్న మంచి మిత్రుడు రావు గారు .A friend in need is a friend indeed ”అన్నది అక్షరాల పాటించి చూపిన నిజమైన స్నేహితుడు రావు గారు .
                     1951 లో కృష్ణా జిల్లా కాటూరు హై స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరారు .ఆ ఊరిని   మాస్కో అఫ్ ఆంధ్ర అంటారు .దగ్గరలోనే వున్న స్వగ్రామం   ముదునూరు లో అన్నయ్య తో కలిసి ”వయోజన విద్యా కార్య క్రమాలు ”ప్రారంభించారు .దగ్గరలోనే వున్న బొల్లపాడు లో వయోజన విద్యా తరగతులు ఏర్పాటు చేశారు .ఇక్కడే గ్రంధాలయాన్ని స్థాపించారు .కాటూరు లో ప్రఖ్యాత కవి కాటూరి వెంకటేశ్వర రావు గారి అభ్యర్ధన పై వారింట్లోనేలోనే కాపురం వున్నారు .ఆవూరు లో వున్న’ సూరి స్కూల్ ‘లో సాయంత్ర వేళల్లో పిల్లల కార్య క్రమాలు మొదలు పెట్టారు .రాత్రి తరగతులు నిర్వహించారు .రాత్రి తొమ్మిది గంటలకు మహాకవి గురజాడ రచించిన ”దేశమును ప్రేమించుమన్నా ”అనే ప్రబోధ గీతం తో కార్య క్రమాలు ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు ”జన గణ మన ”తో పూర్తి అయేవి .పశువులకు వచ్చే అంటు వ్యాధులను గురించి slides వేసి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేసే వారు .వయోజనులకోసం ”బుర్ర కధ దళం ”,”నాటక శాఖ ”ఏర్పాటు చేశారు .వీరి సాంఘిక కలాపాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది చర్చా గోష్టులు జరిపే వారు .మోడల్ పార్లమెంట్ నిర్వహించే వారు .అందు లో సాంఘిక సమశ్యలపై ప్రత్యక్ష అనుభవం కల్గించే వారు రావు గారు .ఇవన్నీ  వారి బుద్ధి లో జన్మించిన అభ్యుదయ భావ పరంపరలే .అంత దూర దృష్టి వారిది .మళ్ళీ ఉదయం స్కూలు ,పాఠాలు యధాప్రకారమే .దానికీ ,దీనికీ వైరుధ్యం లేకుండా ,రెండిటిని సమర్ధ వంతం గా నిర్వహించటం కార్య శూరు లైన రావు గారికే సాధ్యం అని పించేవి .ఆ రోజుల్లో కరుణ శ్రీ నిర్వహించే ”శుభాషిని ‘పత్రిక లో మహిళా కార్య క్రమాలు చూసే వారు .”;;గొప్పవారి భార్యలు ”శీర్షికలో ప్రముఖులైన వారి సతీమణులు చేసిన ,చేస్తున్న ప్రజా సేవను గురించి రాసే వారు .radio లో రావు గారు ప్రముఖ రష్యా  కమ్యునిస్ట్ నేత లెనిన్ పై ప్రసంగించారు .
                      1952 -53 -లో గుంటూరు బి ,యిడి ,లో చేరారు .అప్పుడే హై స్కూల్ విద్యార్ధుల కోసం ”హై స్కూల్ గ్రామర్ రాశారు .1953 లో ముదునూరు హై   స్కూల్ లో బి.యిడి . టీచర్ గా చేరారు ”శాంతి నిలయం ”పాథ శాల” మధుకరి” వ్రాత పత్రిక రావు గారి ఆద్వర్యం లో వచ్చింది .”శేఖర్ విద్యాలయం ”,శేఖర్ గ్రంధాలయం ”ఏర్పాటు చేశారు .పత్రికా రచనలో శిక్షణ నిచ్చారు .slides తయారు చేయటం నేర్పించారు .1953 నుంచి ముదునూరు లో పిల్లల కోసం ”బాల రాజ్యం ”,యువకులకు”సాంస్కృతిక కార్య క్రమ శాఖ” ఏర్పరచారు .మహిళ ల కోసం ”మహిళా శాఖ” నిర్వహించారు .చేతి పనుల శాఖ కూడా దిగ్విజం గా చేబట్టారు .ఇంటిముందున్న విశాలమైన హాల్ లో పిల్లలకు ,పెద్దవారికి విడి విడి గా గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు .ఆదివారాల్లో జేబురుమాలలు ,దిండు గలీబులు మహిళల చేత తయారు చేయించే వారు .వీటిని హైమవతి గారు పర్య వేక్షించే వారు .’ఈ విధం గా విభిన్న మైన కార్యక్రమాలు ప్రజలందరి కోసం చేబట్టిన గొప్ప ఆలోచనా పరుడు రావు గారు .ఒక రకం గా ముదునూరు గ్రామం వారికి ఎంతో రుణ పడి వుంది .దాని అభివృద్ధి లో ప్రతి అంగుళం లోను ఆయనకు భాగస్వామ్యం వుంది.ఆయన సేవలు నిరుపమానం .లెక్కకు మిక్కిలివి .వీటికి తోడు కుట్టు పని వయోలిన్ లో శిక్షణ ఇప్పించారు 
                                                 సశేషం 
                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
http://wp.me/p1jQnd-rh

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు, రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.