మరికొన్ని ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం -2


నమస్తే  గోపాల కృష్ణ  గారు

ముళ్ళపూడి జ్ఞాపకాలు ఇంకా తొలుస్తూనే వున్నాయి .
2008 డిసెంబర్ లో బాపు రమణలను మద్రాస్ లో వారింట్లో చూసినపుడు వారిద్దరూ మా ఇంటి పేరు తెలుసుకొని గబ్బిట వెంకట రావు గారు మీకు బంధువు లేనా  అని అడిగారు మాకు వున్న,తెలిసిన ఒకే ఒక్క జ్ఞాతి ఆయన అని చెప్పాను .ఆయనభార్య చెల్లెల్ని వుయ్యూరు లో వుండే మా మేనమామ గుండు గంగయ్య గారి పెద్దబ్బాయి పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేసారని వుయ్యూరు వచ్చినపుడల్లా మాయింటికి వచ్చేవారని ,ఆ పెళ్ళికి అగిరిపల్లి లో మేము మొదటిసారిగా చూసామని చెప్పాను.
వెంకట రావు గారు తమ రామాంజనేయ యుద్ధం సినిమా కు రాసారని గొప్ప కవి అని పద్యం ఆయనంత బాగా ఎవరు రాయలేరని మెచ్చారు .ఆయనతో మళ్లి ఒక సినిమాకు రాయిన్చాలను కుంటున్నామని చెప్పారు రావు గారు చని పోయి రెండేళ్ళయిందని చెప్పా తమకు తెలియదని,ఆశ్చర్య పోయరిద్దరూ .అవతలి వాడి ప్రతిభను గుర్తించే సహృదయం వారిద్దరిది ఆ మర్నాడు మద్రాస్ లో వున్న రావు గారి అబ్బాయిని చూడటానికి వెళ్తున్నామని చెబితే ఆ కుటుంబానికి తమ సంతాపం, సానుభూతి తెలియజేయమని చెప్పిన సంస్కారం వారిది
.బాపు గారు ,వారి భార్య అతి నిరాడంబరం గా వుండటం ఆశ్చర్యం కల్గించింది .నేత చీరెతో ఆమె,గళ్ళ లుంగి పొట్టి చొక్కాతో ఆయన .అంతా పేరు ప్రతిష్ట వున్న అంతటి సామాన్య జీవనం .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో ,నడవడికలో చూపుతున్న మార్గదర్శి గా అనిపించారు .
ఇక రమణ గారు తెల్లని బట్టలు ,తెల్ల జుట్టు ,భార్య సాదా  సీదా ఆకూ పచ్చ నేత చీర తో పార్వతి పరమేశ్వరులు అనిపించారు ఆమె నండూరి రామ మోహన రావు గారి చెల్లెలే.అరుగొలను వారిది . కారణ  జనములు అనిపించారు ఆ జంట జంటలు.
మా ఆవిడా మురిసి పోయింది వాళ్ళను చూసి ,వాళ్ళ ఆప్యాయతలు , పలకరింపులు ,మర్యాదలకు  ముగ్ధులం అయ్యాం.
మైనేనీ  గారి గురించి మాట   వచ్చినపుడల్లా ఇద్దరు  ఎంతో పొంగిపోయారు. ఎన్నో  పుస్తకాలూ  అరుదయినవి  సేకరించి  అమెరికా నుండి  ఆయన  పంపుతారని, ఆయన  స్నేహం మరువలేనిదని  అన్నారు  .గోపాలకృష్ణగారు  కూడా  బాపు గారు ఎన్నో  విలువయిన  పైంతింగ్స్  తనకు  పంపించారని  అమెరికాలో   మే ము వున్నప్పుడు  నాకు   ఫోన్
లో చెప్పేవారు.  అంతటి జిగినిదోస్తి వారిముగ్గురిది.
నాలుగు   ఏళ్ళ  క్రితం  ఆంధ్రజ్యోతి  దిన   పత్రిక లో  బాపు రమణల   ”sirinomu’ లోని   భాగాలను ధనుర్మాసం  సందర్భంగా  రోజు     వేస్తుంటే  చదివి  అద్భుతం   అనిపించి ఒక కార్డు  రాసాను.  అందులో వుయ్యుర్లో  మాకు  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం   వుందని , ధనుర్మాసంలో  రోజు  నేను  ఆలయంలో తెల్ల వారు  ఝామున  అయిదు  గంటలకే  వెళ్లి  తిరుప్పావై  రోజు  చదువుతానని ,నేను వంస పారంపర్య ధర్మ కర్తనని    భోగినాడు  కళ్యాణం   కుడా  చేస్తామని,   హనుమ్మజ్జయంతి  కి కుడా శ్రీ  సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం    చేస్తమని, హనుమద్  వ్రతం  కూడా  చేస్తామని  కోతపోకదాలతో   సిరినోము  వుందని, రసభరితంగా ఉందని రాసాను.   ఆ  విషయం మర్చిపోయాను.
వారం తర్వాత  200 రూపాయల విలువకలిగిన  ఆ పుస్తకాన్ని  registerd post లో నాకు  అందేటట్లు పంపారు.  ఆశ్చర్యపోయాను.  వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను.  మరునాడు ఉదయం ఆ పుస్తకాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచి రోజు అందులోని విశేషాలను తెలియ చేసే వాడిని.  కళ్యాణం  అయింతర్వాత  వారిద్దరికీ  స్వామి  వారి ఫోటోలు  ,ప్రసాదం, కళ్యాణ   అక్షింతల్  పోస్ట్లో  లో పంపాను .
ఇది అనుకోని సంఘటన.   అంతటి భక్తీ ప్రపత్తులు వారికి ఉన్నాయని తెలియ్స చేయటానికి ఇది రాసాను.   ఇది మద్రాస్లో వారిని కలిసినపుడు గుర్తు చేస్తే ముసి ముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు అది వారి మనస్తత్వం.
— క్రౌంచ  మిధునం  విడిపోయినపుడు  వాల్మీకి   శోకం   శ్లోకంగా,   అది ఆది  కావ్యం   ఆరంభం అయింది .  అలాగే  ఉంది ఇప్పటి  స్థితి.
చిన్నపిల్లలను  శ్రీరామ రక్ష అని  తెలుగు వారు దీవిస్తారు.  తెలుగు తరం కొత్త హాస్యానికి ‘శ్రీ రమణ రక్ష’ అని అనిపిస్తుంది.
ఇందులో  రెండు   విశేషాలు ఉండటం  గమనించి    వుంటారు.  ఒకటి ముళ్ళపూడి  వెంకట రమణ  రక్ష  అని,  ముళ్ళపూడి తర్వాత  ఆ రకo హాస్యాన్ని వండి  పండించిన ఆ  వారసత్వాన్ని   తీసుకుని  ముందుకు సాగుతున్న శ్రీ రమణ అని అర్ధం.
అప్పు (నీరు), ఆకాశం ఉన్నతవరకు ముళ్ళపూడి వెంకట రమణ చిరంజీవే.

— నమస్సులతో …………….       మీ ………….

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు. Bookmark the permalink.

1 Response to మరికొన్ని ముళ్ళపూడి విశేషాలు ముళ్ళపూడి , బాపు దర్శనం గోపాల కృష్ణ గారి సౌజన్యం -2

  1. చాలా చక్కగా మీ అనుభూతులు అనుభవాలు మాతో పంచుకున్నారు.మీరు చెప్పే విధానం సరళంగా,పక్కవారితో మాట్లాడుతున్నట్టుగా ఉంది.అలాంటి సహజశైలి ఇవ్వాళ చాలా అవసరం.
    అయితే అక్కడక్కడా అక్షరదోషాలు కాస్త ఇబ్బందిపెడుతున్నాయి.

    రాయిన్చాలను…ప్రతిష్ట….పైంతింగ్స్…కారణ జనములు…………జిగినిదోస్తి……… వంస పారంపర్య…. కుడా… శ్రీ సువర్చలాన్జనేయ …. చేస్తమని, ఇలాంటివి.బరహా వాడండి.తరచూ రాస్తూ మాకు మీ జ్ఞానం పంచండి.

    అన్నట్టు పుచ్చకాయ వ్యాసం బాగుంది కానీ ఇంకా ఆచరణలోకి తేలేదు….నేను 🙂

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.