అనుమాన శిష్యుడు అనే శంక లెంక
మొన్న బాపు రమణలకు డబ్బా బాగా కొట్టారు అని మిమ్మల్ని అంటున్నారు గురువు గారు అన్నాడు నా శిష్యుడు .
ఆ మాట అన్న వాడు తెలుగు చదివి వుండదు .పాపం కాన్వెంట్ చదువుల వాడు అయి వుంటాడు తెలుగు పుస్తకం
అసలు చూసాడో లేదో అన్నాను
.ఢంకా బాగానే బజాయిస్తున్నారు అంత గోప్పెమిటో చెప్పచ్చుగా అన్నాడు మళ్లి
సరే విను అన్నాను .
బాపు తీసిన సీత కళ్యాణం సినిమా లండన్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ లో అధ్యయనం కోసం ఉంచారని నీకు తెలియదు దానికి
రమణే మాటకారి అని నీకు అస్సలు తెలియదు .తెలుసుకో నాయన అన్నాను
.రమణ గారి ముందు హాస్యం లేదా అంత కు ముందు అంతా శూన్యమేనా సన్నాయి నొక్కులు నొక్కాడు మళ్ళి నా శిష్యుడు
.ప్రతి దానికి కాలం సమయం,సమాజం, ఆధారం రా బాబు అన్నాను .మనకు హాస్య రచయితలూ తక్కువే .ఆధునిక కాలంలో మరీని అన్నా.
వీరేశలింగం గారు ,చిలకమర్తి పానుగంటి హాస్య రచనలు చేసారు. మొదటి ఇద్దరు ప్రహసనాలు రాసారు
చిలకమర్తి రాసిన గణపతి నవల హాస్యమే,.అయితె అందులో కొంత మొరటు హాస్యంవుండి మరీ చెవులు పిండి నవ్వించి నట్లుంటుంది
పానుగంటిసాక్షి వ్యాసాలు సమాజం మీద గొప్ప చురకలే,మరకలే .హాస్యం దేప్పిపోడుపులతో సూటి పోటి మాటలతో కర్కశంగా వుంటుంది .
తర్వాత గురజాడ కన్యాశుల్కం చెప్పు కోవాలి సమాజం లోని దురాచారాన్ని హాస్యం ,వ్యంగ్యం పూత పూసి మందుగా ఇచ్చారాయన
సంఘ సంస్కరణం అందులో అంతర్భుతం
.నాటి సమాజంలోని మనుష్యుల బలహీనతల్ని ఆవిష్కరించిన నాటకం అది అంతా గొప్ప నాటకం మళ్లి రాలేదని చెప్పుకుంటాం.
ఆ తర్వాత వేదం వెంకట రాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకం ఇందులో రాజకీయానికి హాస్యం అనుపానం తురక భాషలో
అస్తవ్యస్తం గా మాట్లాడటం ,చాకలి వాని .కులసంబంధమయిన భాషా నవ్వును తెప్పిస్తాయి
తర్వాత మొక్కపాటి వారి బారిష్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం లో వున్న చిక్కులు ,ఈ దేశం లోని అలవాట్లు ,అక్కడ
ఇమడలేక పోయిన పరిస్తితులు హాస్యానికి మూలాలు తప్పుల తడక తో చిప్పిల్లిన హాస్యం అది .అతని ప్రవర్తనమీద కలిగే ige
సాను భూతి లోంచి వచ్చిన నవ్వు అది.
ఆ తర్వాత ఎవరు లే రా అన్నాడు లెంక శంకతో
భమిడి పాటి కామేశ్వరరావు గారు ,మునిమాణిక్యం నరసింహారావు గారిని వదిలితే చరిత్ర క్షమించ దు రా అన్నాను
భమిడి పాటి కామేశ్వరరావు గారు మేస్టారు గారు కనుక లోక పరిశీలన పరిశోధనతో అన్ని కోణాల్లో హాస్యం పండించారు .ఆయనలో ఆలోచన పాలు ఎక్కువ
.ఒడిదుడుకులను,సుక్ష్మంగా పరిశీలించి,హాస్యం వండి వడ్డించారు .హాస్యబ్రహ్మ బిరుదు వారికీ వచ్చింది. నౌకరు పాత్రను ఆయన నడిపినంత
పకడ్బందిగా ఎవరు నడపలేదు. ఆయన పాత్ర లన్ని జీవితం లోనుంచి వచ్చినవే .ఆయనకు భాషా ఒక ప్రవాహం పదాలు అచ్చంగా అలాగా
ఉంటేనే బాగుంతయన్నంత గొప్పగా రాసారు .సమాజం మీద చెణుకులు.,మోలిఅర్ ప్రభావం ఆయన నాటికల్లో బాగా కన్పీస్తున్ది .ముద్ర రాక్షసం
నాటకాన్ని అచ్చ తెనుగు నాటకం గా మలిచి ,అంతా seriousness లోను సరదాగా నవ్వించారు .
మునిమాణిక్యం భార్యభార్తలలోని అనుబంధాన్ని భర్త అమాయకత్వాన్ని ,భార్య గడుసుదనాన్ని తెలివి తేటల్నిచూపిస్తూ నవ్విస్తారు నవ్వు మీద ఒక పుస్తకం కూడా రాసారు
అసలు విషయం వదిలి చాల దూరం వచ్చారు గురువుగారు అన్నాడు
ఇదంతా తెలిస్తే అసలు విహాయం తెలుస్తుంది అన్నా .
.చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో,ఎలా మాట్లాడుతారో ఇంతవరకు ఎవరు రాయలేదు ఆపన్నీ రమణగారు చేసారు .మాట్లాడే భాషకు రూపం కట్టారు
.సుత్తితో కొట్టి నట్లు కాకా ,గిలిగింతలు పెట్టె మాటలతో చురకలంటించారు .అలాంటి తెలుగు మాటల్ని ఇంతవరకు ఎవరు అంతకు ముందు రాయలేదు
.కొత్త పాత్రలూ వచ్చాయి మనిషిలోని మనిషిని ఆవిష్కరించాడు .డొల్లతనాన్ని ,డాబు దర్పాన్ని అతి సున్నితమయిన భాషలో వెటకారంగా చెప్పి
ఎవడి గురించి చెప్పారో వాడె చదివితే వాడయిన నవ్వుకొని చావాల్సిందే .పరకాయ ప్రవేశం చేస్తాడు అది అందమయిన తెలుగు జీవం వున్న తెలుగు .నభూతో
గా వున్న తెలుగు కండగల తెలుగు .భక్తిని ,హాస్యాన్ని మాధుర్యాన్ని తెలుగుకు” కానుక ”గా ఇచ్చాడు .ఆ పదబంధాలు ఇదివరకు విననివి .ఆ వర్ణనలు ఎవరు చేయనివి
.ఆ పోకడే వేరు సమీక్ష రాసిన కధ రాసిన ,పొగిడిన తెగడిన అది అపూర్వం అనుత్తరం గా వుంటుంది .ఆ impactveru .తెలుగు జనజీవితాన్ని,భారతీయ సంస్కృతిని
ఆవిష్కరించిన జంట బాపు రమణ ఆ జంట పంట రత్నాల రాసి అన్నాను
చాలు గురువుగారు సత్యం తెలిసింది అరచేతితో సూర్యుణ్ణి ఆపలేం ఆపాలనుకుంటే అవివేకం అని శంక తీరి లెంక వెళ్ళాడు
మీ దుర్గాప్రసాద్.


శ్రీ దుర్గా ప్రసాద్ గారూ,
మళ్ళీ బాపు,ముళ్ళపూడి ఇద్దరితోనూ ఒకేసారి మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా అనిపించిందండీ… మీరు రాసిన అనుమాన శిష్యుడు, ఇంకోతి రమణ… రచనలు చదివాక.
రమణగారి రచనలతో ఎంతగా మమేకం అయ్యారో చూపిస్తున్నాయి ఆరచనలు. హాస్యరచయితగా రమణ స్థానాన్ని సరైన సమయంలో స్థిరపరిచారు మీరు. హాస్యం రాసిన వాళ్ళే తక్కువ…ఆ తక్కువ వాళ్ళందరూ రచనల్లో చాలా గొప్పవాళ్ళే. ఆ గొప్పవాళ్ళలో రమణ గారు ఎందులోనూ తక్కువ కాదని, వాళ్ళందరికన్నా కూడా గొప్పవాళ్ళేనని ఢంకా బజాయించి మరీ చెప్పారు.
అదీ, అభిమానమంటే.
LikeLike