అంతర్జాతీయ మహిళా దినోత్శావానికి వందేళ్ళు .
అయినా మహిళా లఫై అనాదరం పెరిగిందే కానీ తగ్గలేదు .వారికి రావల్సిన
భాగ స్వామ్యం ఇవ్వటానికి పురుష పుంగవులు తాత్స్చారం చేస్తూనే వున్నారు .వారికీ పదవులు వచ్చినా బ్యాక్ డ్రైవింగ్
చేస్తుండటం సిగ్గు చేటు వారు సమర్దులే ఏ పనినయిన నిర్వ హించ గల సామర్ధ్యం మహిళలకు వుంది. మన సంకుచిత
భావాలూ వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నాయి
శ్రీ చిలకమర్తి వారు ప్రసన్న యాదవ నాటకం లో చెప్పిన పద్యం హృద్యం
శిరో ధార్యం అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు కూడా ”
చాడువన్నేర్తురు పుఉరుషుల్ఆంటళ్ళూ బలే నే సాస్రంబుల్ పతిని మెమ్పించుచో……… ;
నదమన్నేర్తురు సత్రుసేనల ధనుర్ వ్యపారముల్ నేర్పుచో నుదితో త్చాహ ము
తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిస్టించుచో . ముదితల్ నేర్వర గా రాణి విద్య గలదే ముద్దార నేర్పించినన్ ,”
ఆంటే ఆడ వాళ్ళు పురుషుల లాగా చక్కగా చదవగలరు ,శత్రువుల్ని చేల్చి చెందాడ గలరు ,ప్రపంచాన్ని పరి పాలించ
తగిన సామర్ధ్య వున్న వాళ్ళు ప్రోత్చ హిస్తే మహిళలు చేయ లేని పని ఏది లేదు అని చిలక మర్తి చెప్పారు
స్త్రీ పురుష సమానత్వం గురించి ఇంకా మాట్లాడు కున్తున్నామంటే మనం ఇంకా ఏ దశ లో ఉన్నామో ఆలోచించాలి
జీవన సమరం ఆటు పోటు ఇంకా ఎదుర్కొంటోంది బతుకు బండి యీడ్వటం కష్టం గానే వుంది .సమాజము ఇంకా
చిన్న చూపే చూస్తోంది అన్నిటికి ఆడది కావాలి కానీ ఆమెకు గౌరవం ఇవ్వటం లో వెనక బడి వున్నాం
చదువుల్లో ముందున్నారు ,అన్ని పోటీల్లో నెగ్గు కోస్తున్నారు క్రీడల్లో కీర్తి తెస్తున్నారు అత్యున్నత పదవి కూడా పొందుతున్నారు
కానీ ఇంకా అభద్రతా భావంలో నే వుండటం శోచనీయం. వేధింపు లెక్కు వాయినాయి ,వేదనలు పెరిగాయి ,చట్టాల వలన
భయం లేదు చట్ట సభల్లో వాణి వినిపించుకోరు.గ్రామీణ స్త్రీantలు వున్నత విద్య లో దూసుకు పోవాలి వారికి ఇచ్చిన
సౌకర్యాలను వినియోగించు కోవాలి ఉపాధి విద్యలలో రానించాలి స్వయం ఉపాధి పధకాలను సార్ధక చేసుకోవాలి
వికృతమయిన పోకడలున్న సమాజం మనది దారి తప్పటానికి అవకాశాలెక్కువ సంయమనం వహిస్తూ వివేకం తో
ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి పాకుడు రాళ్ళ మీద నడవ రాదు .
ఈనాటి సమాజంలో మహిళా ఉనికి కాపాడు కోవాలంటే ఆత్మ స్థైర్యంమ్ ,ధైర్యం తప్పని సరి .సాహసం లేక పొతే అడుగు
ముందుకు వెయ లేరు .సేవా భావం వారికి పుట్టుక తోనే వుంటుంది దాన్ని మరింత సార్ధకం చేసుకోవాలి సమస్యలను
చూసి బెదిరి పోకుండా పోరాటం తో విజయం సాధించాలి వంట ఇంటికి మాత్రమే పరిమితం కారాదు
.దేశ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలి తెలుగు లో మాట్లాడి ,పిల్లలకు తెలుగు నేర్పించాలి
తల్లి మొదటి గురువు అన్నది మర్చిపోరాదు .సంఘటిత మహిళా శక్తి దేనినయిన సాధిస్తుంది అని తెలుసు కోవాలి
.తానూ విద్యనేర్చి తన కుటుంబానికి విద్య నందించాలి విద్య లేని తల్లి ఇవాల్టి సమాజం లో నిలదొక్కుకోవటం కష్టం
.మహిళా ఆంటే శ్రమైక జీవన సౌందర్యం ఆత్మా విశ్వాసమే మహిళకు పెట్టని ఆభరణం.
అందుకే వో మహిళా మేలుకో ,ఏలుకో ,తల ఎత్తుకొని జీవించు తలపోగరు వాళ్ళ తలలు వంచు రుద్రమ దేవి ఝాన్సీరాణి
,శారద మాత ,మదర్ తెరెసా దుర్గాబాయి నీకు స్ఫూర్తి
వందనం అభివందనం అభినందన చందనం దుర్గా ప్రసాద్ ,


మహిళాస్థితిని బాగా చెప్పారు దుర్గాప్రసాద్ గారు. మీకు నా కృతజ్ఞతలు.
LikeLike