బండ్ మీద బొంద పెట్టారు
— ట్యాంక్ బండ్ బొంద పెట్టారు
మహామహుల విగ్రహాల్ని
ఆగ్రహం నిగ్రహం లో లేకుంటే అంత మహా స్మసానమే
కూల్చింది విగ్రహాల్ని కాదు జాతి పరువు ప్రతిస్టల్ని
మన సంస్కారాన్ని ,సంస్కృతిని
జాతి గౌరవం సాగర్ లో కలిసిన వేళ
ఆ నీళ్ళఅంత అయింది మన జాతి ,,నీతి
మహాను భావులు వాళ్ళకేమి లోపం కాదు
మనకే చుట్టుకుంటుంది ఆ పాపం అదే అవుతుంది శాపం
విచక్షణ లేని జాతికి వినాసనమే మిగుల్తుంది
దుర్యోధన రాజ్యం లో నోరు మెదపని కురు పెద్దల లాగా వుంటే
మిగిలేది ఆత్మ వినాసనమే ,రోదనమే ,సంక్షోభమే
ఎవరు కుల్చారన్నది కాదు ఎందుకు ఎందుకిల ప్రవర్తించారని
వారంతా మన జాతి జీవన సర్వస్వం ,మన తండ్రి,తాత ,అమ్మా అక్క చెల్లి సోదరులు కదా
మన వాళ్ళను మనమే తగల పెట్టు కునే వార సత్వమామనది .
సంయమనం పాటిద్దాం గోరి కట్టిన పరువును బయటకు తీసి తలెత్తుకు తిరుగుదాం
ప్రపంచం మనకేసిచూసి సిగ్గుతో తలవంచు కుంది
కూల్చటం లో చేసిన తప్పును నిర్మించి ఒప్పిద్దాం
హుస్సేన్ సాగర్ మురికి లోకి జారిన పరువుని పైకి తెద్దాం
వాటిని కాపాడుకోలేదని ఫై నున్న రామారావు కీ ఏమి చెప్పాలి ?
|
ఈ కళా ప్రాంగణం భవిష్యత్ రాష్ట్ర వికాస వైభవాలకు ఐక్యతకు అవగాహనకు ప్రగతికి దివ్య సజీవ సంకేత క్షేత్రం కావలి!
యన్. టి. రామారావు. 1-11 -1986
తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం ప్రారంభోత్సవ సందర్భంగా
|

