విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

“హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత ఖదోపెతంబు ,నానా రాసాభ్యుదయోల్లస్సి విరాటపర్వము” అని తిక్కన విరాట పర్వ ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్నీ ముందే చెప్పాడు. ఇందులోని కధ మన జీవితానికి చాల దగ్గర. వీర, శృంగార రస పోషణకు వీలు .అందుకే హృదయాహ్లాది అయింది .అనేక సన్నీ వేసాల్లో ,వ్యక్తుల ప్రవర్తన ,నిజ స్వరూపం ,శీలం ,స్వభావం ఇందులో బాగా వ్యక్తమవుతాయి .లౌకిక జీవితం సంపూర్ణంగా ప్రతిబింబించింది .కీచక వధ ,ఉత్తర గోగ్రహణం అభిమన్యు వివాహం దీనిలో ముఖ్య ఘట్టాలు .మొదటి దానిలో వీర, రౌద్రాలు ,రెండవ దానిలో వీర,హాస్యాలు చివరిలో లలిత శృంగారం వర్ణించాడు . .
కీచక వధను ప్రబంధం గా తిక్కన రాసాడు .అసహాయ స్థితిలోని స్త్రీకి జరిగే అవమానం ,శీల రక్షణ కై ఆమె చేసే ప్రయత్నం దాని ద్వార వివిధ పరిణామాలు లోక సామాన్యమయినవి కనుక ఇతివృత్తం సహజ ఆకర్షణ పొందింది .పరులను ఆశ్రయించటం ,రాజాశ్రయం లోని కష్టాలు పాండవుల విరాట్ నగర జీవితానికి నిలువు అద్దం పట్టాయి .విరాటుని వినోదం కోసం భీముడు మల్లుల తోనే కాక ,సింహలతోను పోరాడ వలసి రావటం దాసి కనుక రాణి సుధేష్ణ చెప్పినట్లు చేయ వలసిన దీన స్థితి లో ద్రౌపది వుండటం ,తన అభిప్రాయాన్ని కాదన్నాడని ధర్మ రాజుని విరాటరాజు పాచికలతో కొట్టి అవమానించటం ,పాండవుల మీద మనకు సానుభూతి కలుగుతుంది ,.దీనికి అంతటికి కారణం ధర్మరాజు జ్యుతం దాని ఫలితంగా పొందిన దాస్యం .అందుకే బలవంతులయిన పాండవులకు నిస్సహాయ స్థితి కల్గింది .సామాన్య మానవా జీవితం లో కనిపించే స్త్రీ లోలత కీచాకునిలో ప్రతిబింబించాయి .యుక్తాయుక్త విజ్ఞత లోపిస్తే కలిగే పరిణామం ఇదే నని మనందరికీ హెచ్చ్చారిక కామా,క్రోధాలు కీచక వృత్తంత విషయం కానుక తిక్కన దీన్ని ప్రబంధ విధానం గా నడిపి మనస్సులను ఆకర్షించాడు .ఉద్యానవన ,సూర్యోదయ అస్తమయ వర్ణనలు తరు వాత వచ్చ్చే ప్రబంధ యుగానికి తోలి మెట్లు .,మార్గదర్శకం కూడా .వీటిని ఎర్రన ,నాచనా సోమన గ్రహించారు. శ్రీనాధుడు స్వీకరించి పోషించారు .కృష్ణ దేవరాయల కాలం లో పరిపక్వ స్థితి పొందింది.
”నిరజాకరములు నిష్టమై జేసిన భవ్య తపంబు ఫలమనంగా – దివస ముఖాభినండిత చక్ర యుగ్మకంబుల యను రాగంపు బ్రోవనంగా – హరిహరబ్రహ్మ మహానుభావంబు లోక్కటిగాగా గరగిన గుటికా యనగ – నటుల వేదత్రయ లతికాచయము పెను పొంద బుట్టెడు ములకందమనగా – నఖిల జగముల కన్దేర యగుచు జనస – మాజా కరపుట హృదయ సరోజ ములకు – ముకులనంబును ,జ్రుభనం మునునోనర్చి భాను బింభము పుర్వాద్రిపై వెలింగె” అన్న ఈ పద్యంలో తిక్కన ప్రతిభ అసామాన్యము. భవ్య తపస్సు, పరంజ్యోతి స్వరూపం, విశుద్ధ ప్రేమ ఒక క్రమ పరిణామం. హరి హర బ్రహ్మైక్య జ్ఞాన మూర్తి మూడు వేదాలకు కారణమైన పరబ్రహ్మ స్వరూపం. లోకాతీతమైన అలౌకిక ఉపమానాలతో వర్ణన చేయటం వలన ఉదాత్తట కలిగింది. మనోహరంగా ఉంది. సూర్యుణ్ణి పరబ్రహ్మగా చెప్పటంలో వేద ధర్మాన్ని నిరూపించాడు తిక్కన. సూర్య భగవానుడు చైతన్య ధాత అని, జ్ఞాన ప్రదాత అని “కందేర” అనే మాటలో నిక్షిమ్ప్తం చేసాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన సూర్య దర్శనం హృదయ వికాసం కలిగిస్తుంది. ఉపమానాలు పవిత్రమైనవి అవటంతో ఉదాత కవితా తత్త్వం ఆవిష్కార మైంది. ఇలాగె సూర్యాస్తమయాన్ని కుడా భావనా చమత్కారంతో రాసాడు. సూర్యుడు పచ్చిమ దిశకు చేరగా అది సంధ్య అరుణ రంజితం అయినాడట. భర్త వస్తే భార్యకు రాగ రంజితమే కదా. ఆ పద్య వైభవం చూడండి.
” ఇనుడు తన కడకు నేతెంచిన రాగము బొండు తడి యుచిత మనగా – గెంపున మెరసి పచిమసాం – గన జన సంభావనముల గారవ మండెన్”
ఇనుడు అంతే సూర్యుడు & భర్త అని అర్ధం. రాగం అంతే ఎరుపు & అనురాగం అని భావము. అర్థ శ్లేషతో గొప్ప చమత్కార వైభవం గల పద్యం ఇది. భర్త విరహంలో ఉన్న పశ్చిమ దిశా అనే స్త్రీ కి భర్త అనే సూర్యుని సమాగమం కలిగింది అందువల్ల ఆమె లోక సంభావ నియురాలు అయింది. కులకాంత గౌరవం దక్కింది. ఈవిధంగా ప్రకృతి వర్ణనతో సహజ అలంకారం చమత్కారం చూపి హృదయానికి వికాసం కలిపిస్తాడు కవి బ్రహ్మ తిక్కన.
ఈ భావాలూ మీకు నచ్చితే వరసగా తరువాత మరి కొన్ని తిక్కన మహా కవిస్వరుని భావాలను ఆవిష్కరిస్తాను.
మీ…………..
దుర్గా ప్రసాద్
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D