— విరాట పర్వం లోని కీచక వధ వ్రుత్తంతంలో తిక్కన అద్భుత కవితా శిల్పాన్ని చూపాడు అతని కామా వృత్తికి అనుగుణంగా వనం లోని పక్షుల విహారాన్ని అతి సుకుమారం గా పోషించాడు .అతను కాముకుడు కానుక ప్రకృతి అంత కాముక వ్రుత్తి లో వున్నట్లు కన్పించింది .అతని లోని భావాలూ ఉద్రేక పరచటానికి ప్రకృతి బాగా తోడ్పడింది. అందుకే ”తనువు లింద్రియములు .మనము ద్రుతియు దన వశంబు గాక తల్లడ పడి సింహ బలుడు విషమ బణు బారి బారే ”అన్నాడు తిక్కన .ఇట్లా రోజంతా కామా ఉద్రేకం తో దహింప బడ్డాడు .సైరంధ్రి చేసిన సంకేతం కూడా గ్రహించ లేక పోయాడు .ముధత్వం ఆవహించి బుర్ర పనిచెయ్య లేదు .అనుమానం అనేది మనసులో రాలేదు అహంకారం ఒళ్ళంతా ఆవహించింది వివేకం కోల్పోయాడు .కాముకునికి లజ్జ ,భయలుండవు కదా .ఇలా ఒక కామంధుని మనో ప్రవృత్తిని మనముందు నిలబెట్టాడు తిక్కన మహా కవి .వివసుడాయి నృత్య మందిరం చేరాడు
దీనికి పూర్తిగా విరుద్ధం గా భీముడు రంగ ప్రవేశం చేసాడు .”గమకము వీక వేరొక వికారము పుట్టక సంగారోత్శావో —ద్యమ రాభసతి రేకముల్ బయల్పడుటిన్చుక లేక రోష సం –భ్రమ మొక యింత యైన బర భావ నిరుప్యమూ గాక ద్రౌపదీ —రమణుడు వోయి విక్రమ దురంధరతం దగ నాట్య శాలకున్ ”దీని భావం తెలుసుకుందాం .జాగ్రత్తగా అన్ని వైపులు పరికిస్తూ తన తన బహు బల దర్పాన్ని ప్రదర్శిస్తూ ,మదించిన భద్ర గజం ఆంటే ఏనుగు లాగా ప్రవేశించాడు భీముడు .ఇక్కడ కీచక ,భీముల ప్రవర్తన లో వైరుధ్యం స్పష్టం గా చూపిస్తాడు మహా కవి మదందుడై అనుమానం లేకుండా
అహంకారమే ఆయుధం గా కీచకుడు ప్రవేశించాడు నిర్వికారం గా గంభీర్యం తో ఆత్మ నిగ్రహం కోల్పోకుండా తన బహ బాల దర్పమే ఆయుధం గా భీముడు ప్రవేశించాడు అనుమానం లేకుండా కీచకుడు ప్రవేశిస్తే ,పరిసరాల్ని పరికిస్తూ భీముడు ప్రవేశించాడు ఇదే కవి ప్రతిభ .పాండవ రహస్యం బట్ట బయ లావు తుందేమో నని భీముడి భయం ,అనుమానం .ఇలా పాత్ర పోషణలో తిక్కన అసామాన్య శిల్పం ప్రదర్శించాడు .
రతి అనేది ఒక శృంగార భావం రెండు వైపులా ఉంటేనే శృంగారం గా మార్పు చెందుతుంది ఇప్పుడిక్కడ ఇది one వే traffic అందుకే భీభాచ్చ్చమయింది .వీరరసనికి ఉత్షాహం కావాలి అందుకే కీచక వధ తర్వాత్ భీముడిని ”మన వారిలోన నొక్కని నైన బిల్వక వుత్శాహంబు తో చేసిన సాహసాన్ని ”ప్రసంసించింది వుత్శాహాన్ని వీరం గా మార్చింది ఆమె .కీచకుణ్ణి అతిభీకరం గా చంపాడు భీముడు పేరు సార్ధకం చేసుకున్నాడు ద్రౌపది పరాభవాన్ని స్వయం గా చూసాడు కానుక రౌద్రం విజ్రుమ్భించింది .తన భార్య పట్ల కామంతో ప్రవర్తించి నందుకు వాడి కళ్ళను ,అతిగా వాగినందుకు ముఖాన్ని పతివ్రతను వెంటాడి జుట్టు పట్టుకున్నందుకు కాళ్ళు .చేతుల్ని యింక ఎందుకు పనికి రాని స్థితిలో,ఇతరులు చూడటానికి భయం గొలిపే టట్లు రూపం చెడె టట్లు శరీరం లోకి తోసి కుక్కి కీచక దేహాన్ని ఒక మాంసపు ముద్దగా చేసాడు గండర గండడు అయిన భీమ సేనుడు .ఇది ఆధునిక కాలం లో కీచకులు గా ప్రవర్తించె వారందరికి రాక్షస సందేసమే మే ఇది .” తి క్కనా నీకు మొక్కనా నా ఋణం తీర్చుకోనా”
దుర్గా ప్రసాద్
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D