భారతీయ విజ్ఞాన సర్వస్వమే మహా భారతం

–ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరాకతను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస మహా భారతం .మానవుని భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవిత మంతా అందులో ప్రతిబింబించింది .నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతిలను వ్యక్తం చేసేది సాహిత్యం కధ లో ఉదాత్తత ,అద్ఫ్హ్యత్మిక విషయ ప్రాధాన్యం వల్ల భారతం విశిష్ట మయింది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్య సత్యాలకు ,ధర్మ ధర్మాలకు దైవ రాక్షస భావాలకు జరిగే సంఘర్షానే దీని లోని ఇతివృత్తం. అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాదించ బడింది .అందుకే ,వేదతుల్య మయింది .పంచమ వేద మయింది .వేదం లో శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ  ప్రాధాన్యం కలది .అసలు భారత కధను ఆధారం  గా చేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని విధి ప్రభావాన్ని లోకులకు తెలియ జేయటమే సత్యాన్ని ధర్మాన్ని లోకం లో ప్రతిస్తిన్చా తమే భారతం ఆశయం .
వేదసారం వుండటం, ధర్మం ,నీతి సులభం గా వివరించటంవల్ల bhqaratam స్మ్రుతి గ్రంధం అయింది .పురాణ లక్షణాలన్ని పూర్తిగా వుండటం చేత పురాణం అయింది .ఉపనిషత్తుల సారం వుండటం తో వేదాంత గ్రంధం అని పించుకుంది .రాసిం వాడు ”వ్యాసో నారాయణో హరిహి ”అని పిలువబడే విష్ణు అంశానికి చెందినా భగవాన్ వ్యాసుడు .ఆయన మహర్షి విజ్ఞాన వేత్త్స అవటం తో ఉదాత్తత కల్గింది .మహాభారత కాలం నాటికీ ఆర్య అనార్య సమ్మేళనం జరిగింది .అనేక వ్యవహారాలు కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ప్రాపంచిక విషయలపాయి అక్సక్తి పెరిగి ఆముష్మిక భావం తగ్గింది .దానితో సంఘం లో న్యాయం ,ధర్మం తగ్గాయి అధర్మ పరిణామమే భారత యుద్ధం .సంఘాన్ని వేదమాత సూత్రాలకు అనుసంధించి ,ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలముందు న్చాలని వ్యాసుని సంకల్పం .భారత కధ 24000 శ్లోకాలే తన ఆశయం నెరవేర్చా టానికి లక్ష శ్లోకాలతో విస్తుతం చేయాల్సి వచ్చ్చింది .ఇందులో కొందరు మధ్యలో కొంత చేర్చి వుండ వచ్చ్చు కూడా .అందుకే సంహిత అయింది .

భారత ఆంధ్రీకరణం కూడా లోక హితం కోసమే.రాజరాజు కాలం నాటికీ మతకల్లోలం ఎక్కువ గా వుండేది .చార్వాక మతం పెరిగింది .నిరీస్వారవడం పెరిగి .ఐకమత్యం దెబ్బ తిన్నది .అప్పుడు కుమరిల భట్టు పూర్వ మీమాంస రాసి ప్రచారం తెచ్చ్చాడు .మళ్లి యజ్న యాగాలకు మళ్లి ప్రభావం కలిగింది .అర్యమతనికి ఆదరణ కల్గింది అప్పుడే రాజ రాజు నన్నయను భర తన్ద్రీకరణకు ప్రేరే పించాడు కనుక ఇక్కడ కూడా లోక సంగ్ర్హనేచచ్చ కారణ మయింది
తిక్కన కాలం లో జైనం పెర్గివుంది .సోమనాధుని వల్ల వీర శైవం విజ్రుమ్భించింది మతకలహాలు పెరిగాయి .శైవ వైష్ణవాల వల్ల కొత్త సమస్యలు ఏర్పడ్డాయి కవుల మధ్య పోట్లాటలు పెరిగాయి ఈ క్లిష్ట పరిస్థితిలో తిక్కన మహా కవి రంగ ప్రవేశం చేసాడు .మార్గదర్శి అయాడు .సంఘ సంస్కరణకు పూనుకున్నాడు .బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ అంశాలుగా వారు చేసే సృష్టి స్థితి ,లయలు పరబ్రహ్మ లీలలు గా తెలియ జెప్పాడు .హరిహర మూర్తిని ఇష్ట దైవం గా భావించి శివ కేశవులు అభిన్నులు అని వివరించాడు .తిక్కన తర్వాత నాచన సోముడు ,కేతన ఇదే మార్గం అనుసరించారు .తరువాత వచ్చ్చిన్ asaiva వైష్ణవ కవులు పరదుషణ తగ్గించి సహనం చూపారు .అద్వైతాన్ని బోధించి జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చాటారు .ఏకమాత సూత్రాన్ని అల్లారు అద్వైతానికి పట్టాభిషేకం చేసారు /.ప్రజల తెలుగు అయిన జానూ తెనుగుకు పట్టాభిషేకం చేసారు .ఎర్రన కూడా ఇదే మార్గం లో నడిచాడు పంచమవేదం అక్నబడే ధర్మ శాస్త్రం అని పిలువబడే భారతాన్ని రుషివంటి నన్నయ .తిక్కన ఎర్రన అనే కవిత్రయం లభించటం ఆంధ్రుల అదృష్టం .
”ఘోర సంసార విజ్రుమ్భాణము బాపి ”అని నన్నయ అంటె ”జన్మాంతర ద్కాముల్ తొలగు నట్లు జేసి సుఖాత్ము జేయవే అని ”తిక్కన వ్యాసున్ని ప్రార్ధించారు .”భారతామృతాన్ని కర్ణపుటంబుల నారా గ్రోలి ఆంధ్రావళి మొదమున్బోరయునట్లుగా జేటు ”అని తిక్కన వ్రాసాడు ఇక్కడ అమృత సదం పర బ్రహ్మాన్ని సూచించేదే .భారతమ్రుతం అంతే పరబ్రహ్మకు భారతానికి భేదం లేదని చెప్పటమే .భారతం వింటే ఆనందం లభిస్తుంది ఆనందం ఇచ్చ్చే వాడు కూడా పరబ్రహ్మమే కదా .విద్య వల్లనే నీతి శ్రేయస్సు ,పరబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుందని కవి బ్రహ్మ తెలియ జేశాడు .యజ్ఞం చేసి సోమయాజి అయాడు భారతం చదివి యోగి అయాడు అందుకే గొప్ప సంయమనం కల్గింది ఆయనకు మనకు కల్గించాడు .ఇంతగా లోక హితం కోరిన కవి తర్వాతి కాలం లో లేడు అందుకే తిక్కన భారతంవ్యాస భారతం కంటే గొప్పది అని పేరు వచ్చ్చింది సంస్కృతం లో వాల్మీకి రామాయణాన్ని మించింది లెదూ తెలుగు భారతాన్ని మించింది కనిపించదు .లోక కళ్యాణం కోసం చేసిన రచన కానుక అది ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వం అయింది .ఆంధ్రుల జాతీయ సర్వస్వం తెలుగు భారతం .డాంటే రాసిన divine కామెడీ italiyanlaku హోమేర్ రాసిన iliad grrkulaku మిల్టన్ రాసిన paradise లాస్ట్ ఆంగ్లేయులకు వారి వారి జాతీయ జీవిత సర్వస్వాలు అందరు భావిస్తారు .వుత్క్రుస్తమయిన సారస్వతాన్ని నిర్మించి స్వార్ధ రహితులయి విజ్ఞాన వ్యాప్తి చేసి లోక హితం చేసిన మహా మహులే నిజమయిన జాతీయ నాయకులని అందరి విశ్వాసం
అలాంటి సారస్వత మూర్తులకు వందనం అభివందనం                                                                          బుధజన విధేయుడు     మీ   దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.