భ కా రా ఆంటే భమిడి పాటి కామేశ్వర రావు గారు హాస్య బ్రహ్మ బిరుదాంకితులు .వారి హాస్యం కోనసీమ కొబ్బరి కాయంత రుచి ఆ నీటికి జవం ,జీవం స్వచ్చ్హత ఉన్నట్లే వారి హాస్యానికి అవే లక్షణాలు అబ్బాయి మాటల చర్నకోలుతో ఒళ్ళు ఝల్లని పిస్తారు .హెచ్చ్చారిస్తారు .ఏడిపిస్తారు .అస్తిత్వాన్ని తెలియ జేస్తారు .moliar నాటకాలను తెలుగు లో మంచి దినుసుతో వండి వడ్డించారు .తిన్న కొద్దీ రుచి .శబ్దం లో హాస్యం సృష్టించిన ఘనాపాటి .మేస్టారి చేస్తూ వర్షికోత్చావా సభల్లో మాట్లడుతూ వాటి కోసం హాస్య నాటికలు రాసి ప్రదర్శింప జేస్తూ రావు గారు సృష్టించిన హాస్యం బస్తీ మే సవాల్
పరీక్షలు ఎలా ప్రారంభ మయినాయో ఒక చోట చెప్పుతున్నారు చూడండి ”కృష్ణుడి చేత క్షేమమం గా చూడబడ్డ pareekhittu మహారాజు పరీక్షల్ని సృష్టించాడు .అంతకు పూర్వమే చండ మార్కుల వారు ”మార్కుల ”విషయం కనిపెట్టారు .ఇదో వ్యంగ్య వైభవం .ముసి ముసి గా నవ్వు కున్నం కదా ?ఆయనే ఇంకో చోట ”అసలు దేశం లో బలం వుంటే కానీ ఉపదేశం లో బలం ఉండదని చమత్కరిస్తారు .తెలుగు లో ఎన్నో పదాలు వచ్చ్చి చేరాయని చెబుతూ ”తెలుగు యొక్క మెత్త దనం వల్లే ఇన్ని న్ని భాషల పదాలు బానాళ్ళ ,హృదయం నాటేలా తెలుగులో గుచ్చ్చుకు పోయాయి .తెలుగు శరీరం వాటిని నిల్చి ఉండనిస్తే అవి సేలలు వేసి ప్రాణం తీస్తాయి కొందరు బయటికి లాగి పారేస్తే వెంటనే ప్రనంపోకడ అనికొందరు అంటారని తెలుగు తనం తగ్గి పోతోందని హాస్యం మిళాయించి వాయించారు ప్రస్తుతం గొప్ప తెలుగు వాళ్ళ పట్ల పనికి మాలినది ల వున్న భాష తెలుగు అని ఆవేదన చెందారు
భమిడి పాటి వారి hasyam ””” దసరుపకం ”అనే చిత్ర మయిన రచనలో అనేక వంపులు సొంపులు పోయింది .పుస్తక విమర్శ ఎలా చేస్తారో ,వ్యక్తిగత ద్వేషం ఎలా చొచ్చ్చుకు పోతుందో అసలు చదవకున్దంర్ విమర్శలు ఎలా రాస్తారో ఇందులో చాల అద్భుతం గా చూపారు అందరు చదివి తీరాల్సిన రచన .అందులో మహా అద్భుతమయిన కొస మెరుపు ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది చూద్దాం రండి
గోపి నాధం రసరాట్టు గారికి ఒక వుత్తరం రాస్తాడు ఆయన గోపీనాధం రచనను సమీక్షిస్తూ ”పాండిత్యం లో లోతుకి కధ లోని నీటుకి వూర్జే సరిపోయింది .మొదలు ఎలా వుందో చివర అంతె .”అని రాసి పడేస్తాడు .గోపి నాదం మళ్లి రాస్తూ అది తన రచన కాదని ,తనది తన జేబులోనే వుందని ,చాకలికి వెళ్లిందని ,వచ్చ్చేసిందని దాన్నే పంపిస్తున్నానని మళ్లి తీరిగ్గా సమీక్షించ మని కోరాడు .రసరాట్టు తెలివిగా ”మరొకరికి పంపాల్సింది నీకు పంపాను అని ప్రారంభించి ”ఈ కవి సుప్రసిద్ధ పండిత పుత్రుడు .వున్న తప్పులు కుర్ర తప్పులు కనుక క్షమించ వచ్చ్చు .పాండిత్యం లో వుండే లోటు కూడా క్రమం గా అదే సర్దుకుంటుంది ”అని పూర్వపు సమీక్షంకు దిద్దు బాటు చేస్తాడు గోపి నాదం దీనికి సమాధానం గా ”ఆ రచన నాది కాదు సలాం .మా నాన్న గారిది ”అనిరాసి పంపాడు రసరాట్టు తెలివిగా ”రచన మిక్కిలి వుత్క్రుస్టం ఫక్తు చేవ గుంజు .మారుమూల పదాల కాణాచి నవీన విగ్జ్ఞానం కూడా వుంది .పూచి నాది ”అని భక్తీ నటిస్తూ రాసి పంపించాడు
మళ్లి గోపీనాధం ”అయ్యా /ఆ రచన ఒక బియ్యే గారిదిట ”అని చల్లగా బయట పెట్టాడు .వెంటనే ఈయన సమాధానం గా ”ఇంగ్లీషులో చదూకున్నదన్త పొట్టి గ్రాఫు దింపాడు సరుకు దిగుమతి ఎక్కడ్నించో చెప్ప లేదు రచనంత యింగ్లీషు కంపే .భాష మాత్రం ఆంధ్రన్గ్లద్రవిడవంగా దప్పళం ”అని తేల్చేసి lite తీస్కోమని రాసి పారేసాడు గోపీనాధ సమాధానంగా ”ఆ రచన ఘంట రావు దిట ఆయన మొన్న మీ ఎన్నికల్లో మీకు పని చెసాట్ట కదా/ అని రాసాడు రసరాట్టు నాలిక కరచుకొని ”ఈ రచనలో రసం ఆవకాయ వుఉట లాగా వూరి పోవటమే కాదు ,సముద్రపు పోటు లాగా ఉబ్బి మీద పడుతుంది మాట మధురం శైలి మనోహరం ”అని ములగ కొమ్మ ఎక్కించాడు .అవకాశా వాదాని కి పరా kasta .ఈ సారి గోపి నాదం ”యిది కేతయ్య గారి రచనట మీ యిద్దరికీ పడదట kaqda ? ”అని ముక్తాయింపు ఇస్తాడు .దీనికి దీటుగా రసరాట్టు ”యిదంతా daridragottu రచన ఇంత దారిద్ర రచన భూమి పయి కానీ అంగారక గ్రహం పయి కానీ లేదు .బుద్ధి గల వదేవడుచదవాడు ఇందులో అర్ధంవ్యర్ధం భావం అభావం .రసం నీరసం .స్య స్య కొయ్య ధార నార .నుడికారం సుడిలో పడింది కారకం మారకం అయింది ఇది ఎవరయినా చదివితే పెద్ద వొట్టు ”అని కేతయ్య పై తన పగ తీర్చుకున్నాడు ఎవరు రాసారో వారి గురించి పొగడ్తో ,తెగడ్తో తప్ప అసలు రచన చదివి సమీక్ష చేసే సహృదయత లేని విమర్శక రంధ్రన్వేషకుడు రస రాట్టు .
మళ్లి గోపీనాధం ”ఇది శ్రీనాధుడి రచనట నాన్న గారు చెప్పారు ”అని చావు కబురు చల్లగా చెప్పాడు రాతలో రసరాట్టు తక్కువ తినలేదు ”ఈ రచనలో రస స్ఫూర్తి పద సౌష్టవం ,భావ విశేషం గుర్రపు నడక భాష మేళనం వుంది ”అని నెత్తి కెత్తు కున్నాడు .ఇదంతా వూసర వెల్లి రంగులు మార్చి నట్లు వుంది కదూ ?పట్టు వదలని గోపి నధఆ మఖరి అస్త్రం గా ”మీ పేర నేనూ రచన పుష్కరం కిందట మీరు రాసిందే నట అది మీ రచనల్లో చాల గోప్పదట నాన్న గారు స్వహస్తాలతో రాసి దాచి ఉంచు కున్నారట .నేనూ మీకు పంపింది అదేనేమో ”అని దిమ్మ తిరిగేట్లు రాసాడు పట్టు వదలని రస రట్టు ”నేనూ అసలు వూల్లొ లేను నీకు రాసిన జాబులన్నీ మా అమ్మాయి రాసినవే ఆ విమర్శా లన్ని మీ నాన్న గారివే విమర్శా నమునా ఎలవుండలో రాసి అట్టే పెట్టు కున్న మీ నాన్న గారి కాగితాలే అవి ,.పొరపాటన నీ మొదటి వుత్తరం లోనే ఇక్కడికి వచ్చ్చాయి నా రచన నిరుడే కుమ్భాయ్య గికి మీ నాన్న ఇచ్చ్చారు .అయిందేదో అయింది ఇంతకీ నీకు పెళ్లి అయిందా ?”అని ముగిస్తాడు .తగిన వరుడు తన కూతురికి దొరికడన్నా సంబరం తో అతని కంటే ఘనుడు ఆ చంట మల్లన్న సామెత రుజువు చేసే భ కా రా మేస్టారి రచన యెంత సృజనాత్మకం గా వుందో చూసారా /?
ఉత్తరాలతో ఆడుకున్నారు మాటలతో బాదారు వినోదాన్ని ఉల్లాసాన్ని పంచారు ఇద్దరి హృదయాల్లోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుత హాస్య సృష్టి చేసిన హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కమేస్వారారో మేస్టారు .సిద్ధాన్నం గా హాస్యం వండి వడ్డించారు గడుసు దనం చమత్కారం ఈ ”దసరుపకం ”లో దశ రుపాలయి మనిషి లోని dasavataralni ఆవిష్కరించారు hatsoff మేస్టారు మీ హాస్యపు జడి వానలో తడిసి ముప్పందమయిన మీ శిష్యుడు

