మా పెద్దక్కయ్య
నిత్యం కష్టాల కడలి దాటుతూ బాధల మున్నీటిలో మునుగుతూ
వేదనల సుది గుండాలను మొక్కవోని ధైర్యం తో ఎదురీది
”అనాఘ్రాత పుష్పం వంటి కధలు ,కవితలు అల్లి
బాగుందని ‘బాల పత్రిక ‘మెచ్చ్చిన సాహితీ మూర్తి
హిందీని ఆపోసన బట్టిన వేద్యురాలు
నాన్నకు ఆప్యాయపు ”చెల్లాయ్”
మా అందరికి మామంచి అక్కాయ్
అస్తిమితత్వపు అంచు పై అను నిత్యం వుంటున్నా
మద్రాస్ లో కుటుంబానికి కొండంత అండగా నిలిచి
దేశం కానీ దేశం లో భాష కానీ భాషనూ జీర్ణించుకొని
అపసవ్యాలను తెలివి వివేకం సమర్ధత తో సవ్యం గా మార్చి
ఒంటరి పోరాటం తోఅలు కుపెరుగని శ్రమ చేస్తూ నడి సంద్రపు కుటుంబ నావను
ధైర్యం తో ఒడ్డుకు చేర్చిన స్థిర చిత్తురాలు నిత్య చైతన్య శీలి స్వయం సిద్ధమా అక్క
బావ గారి ఇంటికి దీపం ఆ మహా ఇల్లాలు
ఎవ్వరికీ ఏ లోపం రాకుండా మమతాను రాగల తో పాటు
ఆర్దికాన్నీ హార్దికాన్నీ పంచిన ఆర్ధిక వేత్త
మమతాను రాగాలకు సత్య ధర్మాలకు నిలయం
కించిత్ కోపం వున్నా భూదేవి అంతా సహనం వుండేది
అన్ని అందరికి అమర్చి తాను అనుభవించింది కొద్ది కాలమే
రెండేళ్ళ క్రితం మమ్మల్ని వీడి వెళ్లి పోయింది
ఆనాటి అగస్త్య సతి లోపాముద్రకు సాటి
మా కుటుంబం పై వేసిన అనురాగ ముద్ర
మా పెద్దక్కయ్య లోపాముద్ర
చిన్నక్కయ్య
వయసులో మాకు పెద్ద తేడా లేదు
హితురాలిగా స్నేహితు రాలుగా వుంటుంది
జీవితం కాచి వాడ పోసిన అనుభవం
నవ్వు ముఖం ఆమెకు సహజ ఆభరణం
బంధుత్వం లో అందర్నీ ఆదరించి పెంచి పెద్ద చేసిన పెద్దరికం ఆమెది
నాన్న అమ్మ ల పై అతి ప్రేమ తమ్ముడి పై అతి పరమ వాత్చాల్యం
కొడుకుల్ని కూతుర్ని తీర్చి దిద్దిన దొడ్డ ఇల్లాలు
ఎన్నో సార్లు అమెరికా చుట్టి వచ్చ్చిన జంట మా బావ అక్క
బావ తో నిత్యం పజిల్ చిక్కు ముడులు విప్పే నేర్పు అక్కయ్యది
మా ఇంటిల్లి పాదికి బజ్జక్క మా బుజ్జక్క
మా చిన్నక్కయ్య దుర్గమ్మ
నిజం గా నిత్యం మా ముందుండే ఆ బెజవాడ కనక దుర్గమ్మ
—


mee sodarimanulapai raasina kavita touching gaa undi sir…
LikeLike