ఉగాది విశేషాలు

ఉగాది విశేషాలు

రాబోయే సంవత్షరం పేరు ఖర నామ సంవత్షరం .ప్రభావ నుంచి ఇరవై ఒకటో సంవత్షరం .రాజు చంద్రుడు మంత్రి ,సైన్యాధిపతి గురుడు .సస్యాధిపతి,నీరసాధిపతిరవి .  ధాన్యాధిపతి శుక్రుడు .అర్ఘ్యాధిపతి ,మేఘాధిపతి  బుధుడు .రసాధిపతి కుజుడు. తొమ్మిది గ్రహాలలో ఆరుగురు సుభులు ముగ్గురు పాపులు కనుక మంచి ఎక్కువ జరుగుతుంది .రాజకీయం గా మార్పులు ఎక్కువ .కేంద్రం మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాసం వుంది .ఆర్ధిక చిక్కులు ఎక్కువ .పలక పక్షం లో వర్గ పోరు వుంటుంది .నిధులు విడుదల ఆలస్యం .వర్షాలు బాగా పడతాయి .వరదలు ముంపులు మాములే.పంటలు బాగా పండుతాయి .ధరలు ఎక్కువే .అంతుబట్టని రోగాలు జనాన్ని పీడిస్తాయి తుఫానులూ ఎక్కువే .ప్రమాదాలు జాస్తి .బంగారం వెండి ధరలు మండుతాయి .08 -o5 -11vaisakha  సుద్ధ షష్టి ఆదివారం గురుడు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు మేష రాసి లో ప్రవేసిస్తాడు అప్పుడు గంగానది పుష్కరాలు ప్రారంభం ఇరవయ్యో తేదీతో పూర్తీ .జూలై పది నుంచి శుక్ర మౌధ్యామి సెప్టెంబర్ ఇరవై తో పూర్తీ 20012  జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి .జూన్ పదిహేనవ తేది డిసెంబర్ పడవ తేదీలలో చంద్ర గ్రహణం

ఈ సంవత్షరం మిధున ,సింహ ,ధను ,మకర రాసుల వారికి బాగా వుంటుంది .మేష వృషభ ,కర్కాటక ,వృశ్చిక రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కన్య, ల వారికి అంతగా బాగుండదు .కుంభ రాసి వారికి సామాన్యం గా వుంటుంది వచ్చే జనవరి లోసిమ్హరసిలో కుజ స్తంభాన దేశానికీ కీడు భూకంపాలు వస్తాయి
ఇప్పుడు ఉగాది అంతే ఏమిటో తెలుసుకుందాము .వుగా అంతే నక్షత్ర గమనం ప్రారంభమయిన రోజు అంతే సృష్టి ప్రారంభమైన రోజు .సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద వుంటాడు .చంద్ర గమనం కూడా అదే రోజు అశ్విని నక్షత్రం తో ప్రారంభం అవుతుంది .ఈ రెండు కలిసిన రోజే యుగ దినం ప్రారంభం అవుతుంది .యుగం అంతే జంట కాలం భగవంతుని చేతనం కదా .సంవత్షరం వల్లనే సప్త తంతు యజ్ఞం జరుగు తుంది .సూర్య మండలం అనే వినేల్క ఆకాశం నుంచి ఉచ్చారణ లాగా వ్యక్తం చేసే పరా ప్రకృతి ఆవు .సూర్యుడు దాని పొదుగు .సంవత్షరం లోని నాలుగు భాగాలూ దాని స్థానాలు .ఘర్మం అంతే ఎండ వేడి దాని క్షీరం .సంవత్షరం దాని దూడ మేఘాలే వర్షించే ధేనువులు ఆంటే ఆవులు 368  అంగిరసులు అనే dhenuvulu గుంపులై సంవత్షరం అనే దూడ కోసం పాలు ఇస్తాయి ఆంటే ఎండ రూపం లో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయి అని మహా భారతం లో వుంది .సంవత్షరం వయసు గల దూడను బష్కం అంటారుఆంటే సత్యాన్ని సూర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది . .ఈరలర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది అని భావం .అందుకే ఉగాది మహత్తర మయిన రోజు .
ఉగాది నాడు ఏమి చెయ్యాలి ?తలంటి కొత్త బట్టలు మామూలే .ఉగాది పచ్చడి తినాలి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు చెరుకు ముక్కలు మిరియం పొడి పటికబెల్లం సైంధవ లవణం ఆంటే రాక్ సాల్ట్ వెండి గిన్నెలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి తినాలి ఇందులోని ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు వగరు తీపి ఆరోగ్యానికే కాక జీవితంలోని కష్టాలు ,సుఖాలు మొదలయినవి ఉంటాయి జాగ్రత్తగా నడచు కోవాలని అర్ధం .వసంత ఋతువు ప్రరంభామయే రోజు కోయిల పాటలతో మత్తెక్కించి కొసరు రోజు సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు అది వింటే శత్రు సంహారం  జరుగుతుందని ,చెడ్డ కలలు రావని,గంగా స్నానం చేసినంత ఫలితం  అని గోదానం తో సమాన మని ఆయుర్వృద్ధి కలుగుతుందని సుభకరమని మంచి సంతానము లభిస్తుందని మంచి పనులు చేయటానికి సాధనం అనిపెద్దలు చెప్పారు ఆదాయం యెంత వ్యయం యెంత పూజ్యం యెంత అవమానం  యెంత తెలుస్తుంది ప్రమాదాలను హెచ్చరిస్తుంది తప్పుడు మార్గం లోకి జార కుండా కాపాడ్తుంది భవిష్యత్తు పై ఆస కల్గిస్తుంది నిరాశ తాత్కాలికమే నని సూచిస్తుంది కష్టాలను ఎదుర్కోవటానికి ఏమి చెయ్యాలో పంచాంగం చెబుతుంది .
ఈవిదం గా శుభాశుభాలకు చిహ్నమే మన ఉగాది పర్వదినం తెలుగు సంవత్చరాది .ఆంధ్రులకు గొప్ప పండగ .శ్రీ ఖర నామ సంవత్షరం శుభకరం శ్రీకరం   సంతోషకరం సౌభాగ్యకరం కావాలనిఆశిస్తూ శుభాకాంక్షలతో సెలవు
మీ దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.