సౌందర నందం

సౌందర నందం

సుందరి నందుల కధను సౌందర నందం కావ్యం గా మలిచి సుందర సురుచిర పరిమళాలను ఆంధ్ర లోకానికి అందించిన ఘనత శ్రీ పింగళి లక్ష్మి కాంతం శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు ద్వయానికి దక్కింది .ఇద్దరు కృష్ణా జిల్లా వాసులే కావటం చారిత్రాత్మక సంఘటనే .

రామాయణం లోని సుందర కాండ అంతా సుందరమయం అయినట్లే సౌందరనందం కూడా సర్వాంగ సర్వ మోహన సుందర బంధురం గా వెలసింది .అదొక రసవత్కావ్యం గా వాసికెక్కింది .మందార మకరందం లాంటి పదాలకు కర్పూరపు సౌరభం అబ్బినట్లు న్న కావ్యం .ఆధునిక కాలం లో ఇంతటి రసమయ కావ్యం రాలేదని అభిజ్నుల భావన. ఆ కావ్య పథనం మనసుకు వసంతోదయమే .
బుద్ధ భగవానుని దివ్య బోధల ప్రభావం యెంత గాదం గా హృదయాలకు హత్తుకొని ప్రేమైక జీవులు గా మెలగిన వారి జీవితం లో వున్నత భావ సిఖరారోహనం యెంత గొప్పగా జరిగిందో తెలియ జెప్పిన మృదు మధుర కావ్యం .
లేత తమల పాకు లాంటి పింగళి ఘాటు పొగాకు వంటి కాటూరి కలిస్తే ఏదో కిక్కు ఇచ్చే కారా కిల్లి కాకుండా మానసిక పరిపక్వతను ముగ్ధ మనోహర శైలీ విన్యాసాన్ని రంగరించి ఫస్ట్  నైట్ కిల్లి ల తయారు చేసి ఆహా ఏమి మధురం అద్భుతం అనిపించారు .పరవశత్వం కలిగించే విన్నాణపు సొగసు ,సోయగం తో మెత్తని పూల సెజ్జ పై పరున్న అనుభూతి కల్గించారు .లక్ష్మి kantude వేంకటేశ్వరుడు అవటం వారి జంటకు ఒక పవిత్రత కలిగి ఆకర్షణీయ మైంది .జాతీయోద్యమ స్ఫూర్తి ,అస్పృస్యత విముక్తి గాధం గా మనస్సులో నింపుకున్న ఆ జంట అధునాతన భావాలకు ఆలవాలం .చమత్కారం ,ధిషణ ,భావ దీప్తి ప్రాచీన అర్వాచీన కవిత్వాల పై పట్టు ప్రపంచ సాహిత్య మధనం వారి చిత్తాలను రసార్ద్రం గా మార్చి rasapushkarini లాంటి కావ్యాన్ని అందించారు
”ఆత్మాశ్రయమైన కవిత్వం కంటే విలక్షణ మైన శైలిని కవితలో వ్యక్తీకరించటం భావాన్ని ఉద్వేగాన్ని కవిత్వం లో చొప్పించటం కంటే వర్ణించే అంశం మీద భావ సబలత తో కూడినపా ఆపారవస్యాన్ని ప్రదర్శించటం అంతగా వస్తువు లేని దాన్ని ఎన్నుకొని అందులోని విషాద ,గంభీర భావాలకు ప్రాధాన్యత కల్గించటం దాని వల్ల పాఠకుల సానుభూతితో కూడిన సమ స్పందన కల్గిన్చేట్లు రచించటం ,సాహిత్య భావ పోషణకు ప్రధాన్యాన్నివ్వటం ,పద్య రూపానికి ప్రజా దరణ పొందే రీతి కల్పించటం ,అన్ని మానసిక స్థితులకు అవకాశాలు కల్పించటం ,స్వేచ్చగా స్వీయ అభిమానం కల రంగాలలో కవిత్వం రాయటం ,లఘు కావ్యం గా తీర్చి దిద్దటం sani ని వేసాన్ని బట్టి చెప్పదలచు కున్న దాన్ని వ్యంగ్యం గా చెప్పటం ,చదివిన పాఠకుడికి వర్ణించిన అంశానికి సంబంధించిన వాస్తవ అంశాలు భావన రామణీయకం గా స్ఫురించి ఒక కళాత్మక అనుభ సిద్ధి ఏర్పడటం సౌందర నందం ప్రత్యేకత ”అన్నారు డాక్టర్ జి.వి సుబ్రహ్మణ్యం గారు  .

విషాద ,గంభీర భావాలూ స్వల్పంగా కన్పించి ఆలోచనలో ముంచటం సానుభూతితో కూడిన ఉద్వేగాన్ని కలిగించి aristotle చెప్పిన catharsis సృష్టించిన కావ్యం గా దీన్ని దేని విమర్శకులు పేర్కొన్నారు .నవ్య సాంప్రదాయ కవులైన పింగళి ,కాటూరి జంట అభినవ కావ్యను భూతిని తమ ఖండ కావ్యం ద్వారా సాధించారు .అందుకే సాహిత్య చరిత్ర లో ”సౌందరనందం ”ను విషాద గంభీర కవిత గా గుర్తిస్తారని ఈ జంటను విషాద గంభీర కవులు అని జి/వి .అంటారు .మహాకావ్యాన్ని మినీ కావ్యం లో దర్శింప జేసిన ఘనత వీరిద్దరిది .ప్రయోగం లో parinatilo పద్య సరళిలో పరి పూర్ణ కావ్య దర్సనం చేయించిన ఘనత వీరిది అన్న సుబ్రహ్మణ్యం గారి మాట అక్షర సత్యం .ధర్మ వీరాన్ని రసం గా ప్రతిష్టించారు రాసోవై సహా అని స్పూర్తిని పొందిన కవులు వీరు .
ఆ జంటకు పూసిన పూవే సౌన్డరానంద నందివర్ధనం నిండుగా వొత్తుగా మెత్తగా తెల్లగా స్వచ్చంగా స్ఫటిక సదృశం గా రామణీయకం గా మానసిక ఒత్తిడులకు మందుగా వెలసిన సాహితీ చింతామణి సౌందరనందం పంచదార కన్నా కలకండ పానకంరుచికరం ఆరోగ్య కరం ద్రాక్షా పానకం సరేసరి ఈ రెంటికి తేనే కలిపితే మధురం అతి మధురం ,మధురాతిమధురం మరి దానికి సుగంధం కలిస్తే మరువ లేని మహదానందం ,బ్రహ్మానందం అదే సౌందరనందం .
గబ్బిట దుర్గా ప్రసాద్
30 – 07 –  98  నా వుయ్యూరు సాహితీ మండలి లో నేను చేసిన ప్రసంగం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.