చంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్ర బాబు ,
గత రెండు దశాబ్దాల కాలమ్ లో ఆంద్ర ప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్య మంత్రులలో గొప్ప ఆలోచన విజన్ ,అంకిత భావం ,పట్టుదల అవగాహన ,కార్య శూరత ,ప్రజల్ని సేవలో పాల్గోనేట్లు చేసే నేర్పు ,పార్టీ మీద ప్రభుత్వం లో గట్టి పట్టు ,వ్యూహ రచన ,గెలిపించుకొనే తపనా ప్రకృతి వైఫల్యాలు వస్తే ,ఒక్క క్షణం కూడా వ్యర్ధం కాకుండా ,ప్రజల దగ్గరకు చేరి ,వారి బాధలు స్వయం గా విచారించి ,అధికారులకు తగిన శూచనలు ఇస్తూ ,ప్రభుత్వ యంత్రాంగాన్ని చిత్త శుద్ధి తో పని చేయించే చాక చక్యం ,అధికారులలో నిబద్ధత తీసుకొని రావటం లో పడిన ఆరాటం జన్మభూమికి ఏదో సేవ చేయాలనే భావం కల్గించటం లో చూపిన చొరవ ,వీటిని మించి ఆధునిక యుగం లో ప్రపంచ దేశాలకు దీటుగా మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకంటే ముందుంచే ముందు చూపు ,,పారిశ్రామీకరణ తోనే అన్నీ సాధ్యం అనుకొన్న ఆలోచన నార చంద్ర బాబు నాయుడిని అందరి కంటే ముందు ఉంచింది .ఆయన సమీపం లోకి రా గలిగిన ముఖ్యమంత్రి లేదు అనిపించా గాలి గాడు .దేశం మొత్తం మీద పూర్వపు ముఖ్యమంత్రుల్లో ఇలా పేర్కొనదగిన వాళ్ళల్లో ,మహారాష్ట్ర లో చావాన్లు ,గుజరాత్ లో దేశాయ్ ,రాజస్థాన్ లో సుఖాడియ ,తమిళనాట అన్నాదురై ,రామచంద్రన్ ముదలైన వారు .అప్పటి పరిస్థితులు వేరు .చంద్ర బాబు నాటి పరిస్థితులు వేరు
పార్టీ ఒక స్త్రీ మూలం గా భ్రస్టు పట్టి పోతుంటే చూస్తూ ఊరుకోలేక అందర్నీ సంప్రదించి ,కలుపు కొని మామకు చెక్ పెట్టి అధికారం పొందిన వాడు బాబు .మామ వున్నప్పుడు కూడా తేరా వెనుక కధ నడిపించి తెలుగు దేశం పార్టీ ని బలోపేతం చేశాడు .కీలక నిర్ణయాలు బాబువే రామారావు వోట్ కాచెర్ మాత్రమే .పార్టీ లో ఏమి జరుగుతోందో ప్రభుత్వం ఎలా నడుస్తోందో నన్న అవగాహన అన్నగారికి తక్కువే .కనుక ప్రతి ఊళ్ళోనూ బాబుకు ,పార్టీ కి నమ్మక మైన వ్యక్తులు వున్నారు .వాళ్ళతో మంచి సంబంధాలు నేరిపాడు ..ప్రభుత్వం లో మంత్రి వర్గం లో పనిచేసినా దానికి మించిన అంతర్జాతీయ అవగాహన ఏర్పడింది కుర్రాడు కనుక .ప్రజలకు ఏమి కావాలో తెలిసింది .స్లోగన్లు ఎప్పుడు వోట్లు రాల్చవు అని అర్ధం చేసు కొన్నాడు .పకడ్బందీ వ్యూహం ,ఎత్తుగడ ,ప్రజా విశ్వాసం చూరగొనే పధకాలు కావాలి ,వుండాలి అప్పుడే పార్టీ అధికారం లోకి వస్తుందని తెలుసుకున్నాడు .మామ డొల్ల తనం ముందే అర్ధమయింది .పార్టీ లో ఆయన పట్టు క్రమంగా తగ్గింది లక్ష్మి పార్వతి ఉదంతం అందర్నీ ఆశ్చర్య పరచిజాగ్రుత పరచింది .ఇదే అదను అనుకోని మామకు ,కొత్త అత్తకు ముకు తాడు వేశాడు .పార్టీ అండగా నిల్చింది .పార్టీని రాష్ట్రాన్ని తగిన సమయం లో కాపాడి నిలబెట్టాడు .ఇంత సాహసం ,చొరవ లేక పోతే తెలుగుదేశం పార్టి పార్వతి పార్టి లాగా కాల గర్భం లో కలిసి పోయేదే .పార్టీకి ప్రాణ భిక్ష పెట్టి కాపాడిన ఘనత బాబుదే .పాపం ఈ వ్యవహారం లో వెన్ను పోతూ దారుడనీ ,మామ మరణానికి కారకుదనీ అప్పటినించి ఇప్పటి దాకా ప్రత్యర్ధులు దుమ్మెత్తి పోస్తూనే వున్నారు .పార్టీని సంక్షోభం లోంచి రక్షించాడని చెప్పక పోవటం బాధ గానే వుంటుంది.
ఇంతటి అపవాదు ను భరిస్తూ ,పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ విధానాలలో మార్పులు తెస్తూ కొత్త ఆలోచనలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రిగా అతి సమర్ధం గా పని చేసి ఏ రామ రావు ను దేవుడి గా భావించి ప్రజలు వెంట నడిచారో ఆప్రజల్ని తన పద కాలతో ఆకర్షించి తర్వాత వచ్చిన ఎన్నికలలో చంద్ర బాబు పార్టి చంద్ర బాబు ప్రభుత్వం అనిపించు కున్నాడంటే బాబు వ్యూహా శక్తి ,పాలనా సామర్ధ్యం ,పార్టీ క్రమశిక్షణ ,మిగిలిన పార్టీ లతో సఖ్యం ,అందర్నీ తనవెంట కదిలించిన చాణక్యం మరువ లేనిది negative నుంచి పూర్తి గా positive వైపు ప్రజా ద్రుష్టి ఆలోచన మార్చి ఎదురులేని సాహస వీరుడై చరిత్రలో నిలిచాడు .ఇంత దూర దృష్టి ,వ్యూహ రచన అలనాటి వి.బి .రాజు లాంటి వాళ్లలోనే చూశాం .పగ్గాలన్ని తన చేతి లో పెట్టుకొని ,మామ గారి బంధు గణాన్ని దారి లోకి తెచ్చుకొని ,
అవసరం వస్తే పదవి పారేస్తూ అక్కరలేడను కొన్నాప్పుడు కరివే పాకు లా తీసి పారేస్తూ నందుల కాలమ్ నాటి రాక్షస ,చాణక్య మంత్రులను తలపిస్తూ ముందుకు దూసుకు వెళ్ళాడు బాబు .తనే పార్టి ,పార్టీయేతాను . ..బెసిగే పని లేదు .అలావున్నాడు కనుకే పార్టి బాబు వెంట నడిచింది .బాబు పార్టీని నడిపాడు . అయితె సమర్దులయిన మంత్రుల్ని నియమించటం లో పప్పులో కాలు వేశాడు .కేండం తో మంచి సంబంధాలు నెల కోల్పాడు .బి.జే.పీ .తో జతకట్టి అందలం ఎక్కే అదృష్టం కేంద్రం లో వచ్చినా కింగ్ maker గా నే వుండి పోయాడు .అంది వచ్చిన అదృష్టాన్ని మోకాలితో అడ్డుకున్నాడు .ఇక్కడి నుంచి కధ రివర్స్ గేరు లో నడిచింది
కేంద్రం లో మంత్రి పదవులు ఇస్తానని పెద్దాయన వాజిపాయి ఆహ్వానించినా ,వద్దని తిరస్కరించటం తో కధ మారింది .కేంద్రం లో తన పార్టీ వాళ్ళు మంత్రులు గా వుంటే తన మాట వినరేమో నన్న భ్రమ ,అభద్రతా భావం చోటు చేసు కుంది .speaker పదవి కి నాయుడిని కాదని అందర్నీ ఆశ్చర్యం లో ముంచి ,బాలయోగి ని ఎన్నిక చేయటం పెద్ద పొరపాటే అయింది .రాష్ట్రం లో మంత్రులు యనమల రామ కృష్ణుడి తల తిక్క తనం వల్ల ప్రజా సంబందాలాల్ లో అతని వైఫల్యం వల్ల ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యాన్ని రెండేళ్ళు వాయిదా వేయటం వల్ల వుద్యోగ్గులు ,పెన్తిఒనెర్లు దూరం అయారు .వ్యతిరేకం గా వోట్ వేశారు .ప్రభుత్వాన్ని కుల్చేసారు .పంచె కట్టు కని కట్టు కు ఆకర్షితులయారు . ఇది చేజేతుల నాయకుడు అనుచర గణం చేసుకున్న స్వయం క్రుతాప రాదం .బి.జే.పీ .అంత రాని పార్టి అని ముద్ర వేసి ,కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి ముందస్తు ఎన్నికలు తెచ్చి అలిపిరి సంఘటన తనకు రాజ కీయ ఊపిరి తిరిగి పోస్తుందని నమ్మి పెద్దాయనను ముంచి తానూ మునిగాడు బాబు ..
2009 ఎన్నికల్లో బంచి ఊపు మీద ఉంది తెలుగు దేశం పార్టి పంచె ఊడి పాంట్ అధికారం లోకి వస్తుందని అంతా భావించారు ,రావాలని ఆశించారు కూడా అయితె అర్ధం లేని వాగ్దానాలు ,మాట నిలకడ లేని గులాబిలాబీ తో దోస్తీ కొంప ముంచింది .ప్రజా రాజ్యం పార్టి పంచకట్టు ఆయన బుర్రలోడే నని పేపర్లు కోడై కూసిన ,మీడియా కధనాలు కుమ్మరించినా తగిన వ్యూహం లేక అధికారానికి అడుగు దూరం లో నిలిచి పోవాల్సి వచ్చింది .ప్రజలు అప్పటికే భస్మాసుర హస్తానికి గుడ్‌బై చెప్పే మూడ్ లోకి వచ్చారు .కని గులాబి మోజు కొంప ముంచింది .మొత్త లావు వాళ్లకు రాజ్యసభ ,లోక సభా
సీట్లు ఇచ్చినా వారెవరు పార్టీకి ,బాబుకు ఉపయోగ పడింది లేదు .ఒక్క రామానాయుడు తప్ప .ఇక మూడవ ఫ్రంట్ మొహం పోయి నాల్గో ఫ్రంట్ తేరా మీదకు వచ్చింది .ఎవరితో చేతులు కలపాలో తెలియయని స్థితి .అసెంబ్లీలో పాత విషయాల చర్చే తప్ప అర్ధవంత మైన చర్చలు జరపటం లో తెలుగు దేశం వైఫల్యం .అవినీతి మీద అధినాయకుడి మీద దూకుడే కాని ప్రజా పక్షం వహించటం తగ్గింది అన్నిటికి తానె అందుకోవటం సభలో అవమానాలు భరించటం అలవాటై పోయింది ఎంచేసావు తోమ్మిదేల్లాల్లో అని దెప్పి పొడుస్తుంటే సమాధానం చెప్పనీయ స్థితి సవ్యం గా సకగని సభలు .దేప్పులు చెప్పులు బూతులు వ్యక్తీ గత నిందలు ఇవన్నిటికీ ప్రభుత్వానిది యెంత బాధ్యతో ప్రతి పక్షానికి అంతే బాధ్యత అది కనుమరుగైంది .
అధికారం లో వుందా గా it మోజు తో మానవీయ విలువలను తెలియ జెప్పే చరిత్ర పౌర శాస్త్రం మొదలయిన వాటికి గుంత కత్తి గంట వాయించాడు బాబు .దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం .మానవీయ కోణం లో చూసే చూపు పోయింది .కంప్యూటర్ కళ్ళ తో చూసే స్థితి వచ్చింది .మనిషి విలువ తగ్గి యంత్రానికి బానిసలవటం సంస్కృతిని దెబ్బ తీసింది .ఇందు లో బాబు పాత్ర చాలా ఉంది .humaanities చదవాల్సిన అవసరం లేదని తేల్చాడు .ఇదో దెబ్బ సంస్కృతీ పరమైన దెబ్బ ;దీన్ని జేర్నించుకో లేని వారు క్రమంగా దూరమయారు .రైతులను బుజానికి ఎత్తు కొన్నది లేదు .కార్మికులు దూరం అయారు .చేనేతని వుద్ధరించింది లేదు వీటికి మించి కరెంట్ కోత కస్టాలు .పులిమీద పుట్రలా చివరి నాలు గేళ్ళలోవర్షాభావం ,కరువు ,వరుసగా మీద పడ్డాయి ఇవన్నీ పాపం బాబును తీవ్ర వ్యధకు గురి చేసాయి .ఆత్మ స్థైర్యం దెబ్బతింది ..వరుసగా తప్పులు చేశాడు .కేడర్ దూరమయింది .కొటారి పెరిగింది .పని చేసే వాళ్ల కంటే పెత్తం దార్ల జులుం ఎక్కు వైంది సమీక్షల పేరుతో కాలయాపన పెరిగింది ఎవరుంటారో ఎవరు పోతారో అనే అభద్రతా భావం పెరిగింది నిర్ణయాలు ఆలస్యమైనాయి .జరగరాని అనర్ధం జరిగి పోయింది ఏడేళ్ళు అధికారానికి దూరం అవటం భరించ లేని బాధ అయింది అందుకే దూకు దు ,ఉద్రేకం పెరిగి తన కింది వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు తానె మాట్లాడి పల్చని పోయాడు .లెఫ్ట్ ను నమ్మలేదు .నమ్మకుండా వుందా లేదు జయ ఎప్పుడు ఎవరి పక్షమో తెలీదు .ములాయం ఎవరికి గొడుగు పడతాడో అర్ధం కాదు లాలు ఎవరి లాలి పాప తింటాడో తెలియదు .పాశ్వాన్ ,ను నమ్మ లేదు .ఇదీ విచిత్ర మైన పరిస్థితి బాబుది
ఈ నేపధ్యం మహా నాడు జరిగింది .కొడుకు లోకేష్ ను లోకానికి పరిచయం చేయాలి వున్న ,డైరెక్ట్ గా చేసుకోలేడు .ఇప్పటి దాకా అందర్నీ వంశ పాలనపై తిట్టాడు కదా .ఒక బావ మరది అంటీ అంతనట్లు మీసం మేలి వేయటం వియ్యంకుడు మరీ పూసుకోక పోవటం బంధుత్వం కలుపుకున్నా మేనల్లుడు హ్యాండ్ ఇవ్వటం పైన పురందేస్వరి అధికారం లో ఉంది సన్నాయి నొక్కులు ,తోడల్లుడి పుస్తకం లో ఇంటి గుట్టు రాచ్చకీడ్వటం మండే ఎండలు ,విమర్శలు కారం రాచినట్లున్డటం మైసురా వోటమి ,అవినీతి పై గొంతు చించుకున్నా అదే రెండిట్లో గెలవటం బాబును కలవర పరిచింది .వెనక్కి తిరిగి చూసుకొనే వీలు కలిగింది కొత్త గెటప్ వుంటే తప్ప ఏది సాధ్యం కాదని తెలుసు కొన్నాడు .అందుకే చేసిన త్సప్పులకు చెంపలు వాయించు కున్నాడు మిగిలిన వారిపై కారాలు .మిరియాలు నూరి చంద్ర నిప్పులు చెరిగాడు ,విరుచుకు పడ్డాడు ..క్షమించి మళ్ళీ గద్దె మీద కూర్చో పెట్టమని కోరిక క్షమించి వదిలేద్దాం .అంత ఆలోచన వున్న వాడు మనకు దొరకడు ఆలోచించండి
పురందరేశ్వరిని రాష్ట్ర ముఖ్య మంత్రి గా కాంగ్రెస్ పార్టి చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది .లేడీ చీఫ్ మినిస్టర్ వస్తుంది ,పార్టీ విదేయురాలు అవగాహన వున్నది ,అనుభవం వున్నది ,బాబును దీకొనే శక్తి ,యుక్తి ఉంది ,బంధుత్వము కలిసి రావచ్చు ..కాని సోనియమ్మా కు కీలు బొమ్మలు కావాలి కాని ,వ్యక్తిత్వం వున్న వాళ్ళు పనికి రారు కదా .కనుక నా ఆశ అడియాశే ..చంద్ర బాబు వచ్చే దాకా ఆగండి ప్లీజ్
మీ
దుర్గా ప్రసాద్


చాలా బాగా రాసారు… మీ విశ్లేషణ బావుంది.. ఏ ఆత్మ గౌరవం కోసం తి.డి.పి ఆవిర్భవించిందో మళ్ళా అదే దుస్థితి నేడు.. కానీ ఇప్పటి ఓటర్లు ఇవన్నీ ఆలోచించే స్థితిలో ఉన్నారా అని సందేహం
LikeLike