విశ్వ నాధ ను గురించి శ్రీ శ్రీ
మాటలాడే వెన్నెముక ,–పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయ భట్టు –ఈ నాటి కవి సామ్రాట్టు
గోదావరి పలకరింత –కృష్ణా నది పులక రింత
కొండవీటి పొగమబ్బు —తెలుగు వాళ్ల గోల్డు నిబ్బు
అకారాది క్షకారాంతం –ఆసేతు మిహికావంతం
అతడు తెలుగు వాళ్ల ఆస్తి –అనవరతం తెలుగు నాటి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
”సత్యానికి”నా ఉపద ..
ఆ –స్థాన కవులు
——————-
అవాచ్యం అయితే కొట్టండి చెప్పు దెబ్బ
ఆది ఆంద్ర ఆస్థాన కవి మటుకు చెళ్ళ పిళ్ళ
శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ద్వితీయుడు
పురాణేతి హాసాల రచనకు అద్వితీయుడు
సంస్కృత బోధిని కాశీ కృష్ణా చార్యుడు
కవి కాక పోతేనేం గాని అయినాడు మూడు
వేయిపడగల విశ్వనాధ సత్యనారాయణ
అందరికీ మిన్న అయినా నాలుగో ఆయన
శరధి ఘోష డాక్టరు దాశరధి ఇప్పుడు
\ ఆంద్ర దేశానికి ఆస్థాన కవి ”పంచముడు ;”
రచన —–శ్రీ విరించి
మహా గాయకుడు మహావాది వెంకటప్పయ్య శాస్త్రీ ————--రచన కరుణ శ్రీ
”బోణీ మచేసెను తెల్గు నాట రసమున్ పొంగారు బంగారు ,నీ
బాణీ ,తేట తెలుంగు పాటలకు ,మేల్ బంగారు ,నిద్దా జరీ
వోనీ వేయుట నేర్పే ,నీ సరిగామల్ ”వోకల్ ”కళా కన్యకున్
వాణీ సుందరి మేజు వాణి యోనరిమ్పం బోలు నీ నాల్క పై .”
”కమ్మని కాంత మెట్టి రసిక ప్రవరుల్ తలలూచి మెచ్చ గా
నమ్మోనరించు ,నీ మధుర నాద మికన్ వినలేము మేము ,స్వ
ర్గంమున నమ్మహేంద్ర సముఖంమున ,ముప్పది కోట్ల దేవతల్
సమ్మద మంద నింక కోన సాగును లే ,భావ దీయ గానముల్ ”.
”మధుర గాయక ”కుంతి కుమారి ”లేక
నీడు కచ్చేరియ లేదు నేటి వరకు
నీవు లేవన్న రాదు కుంతీ కుమారి
మెడ దిగి వత్త మన్న ఆ ”మెట్లు” లేవు .
ఈ పద్య మధువును సేకరించి నిక్షిప్త పరచి మీ కోసం అందించాను .
తని వార గ్రోలి ఆనందాను భూతిని పొందండి .
మీ ———–దుర్గా ప్రసాద్
01 -06 -11

